చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం
సమయం 18:55.. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్(56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్(32 బంతుల్లో 53; 5 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఫలితంగా ఆసీస్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకుని సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.
విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, క్రిస్ గేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(4/39) రాణించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పోలార్డ్(31 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు జంపా(1/20), స్టార్క్(1/33), కమిన్స్(1/37) సహకరించారు.
వార్నర్ దూకుడు.. ఆస్ట్రేలియా 122/1
సమయం: 18:38.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూకుడు కనబరుస్తున్నాడు. అతనికి తోడుగా ఉన్న మిచెల్ మార్ష్ కూడా బ్యాట్ ఝలిపిస్తుండడంతో ఆసీస్ లక్ష్యంత వైపు వేగంగా అడుగులు వేస్తుంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. వార్నర్ 68, మిచెల్ మార్ష్ 47 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 158.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
సమయం 17:44.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 3.3వ ఓవర్లో ఆకీల్ హొసేన్ బౌలింగ్ ఆరోన్ ఫించ్(11 బంతుల్లో 9; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఆసీస్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో వార్నర్(11 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మిచెల్ మార్ష్ ఉన్నారు.
చెలరేగిన హేజిల్‌వుడ్.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన విండీస్
సమయం 17:15.. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(4/39) రాణించడంతో విండీస్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆఖరి రెండు బంతులను రసెల్(7 బంతుల్లో 18; ఫోర్, సిక్సర్లు) భారీ సిక్సర్లుగా మలచడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో పోలార్డ్(31 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు జంపా(1/20), స్టార్క్(1/33), కమిన్స్(1/37) సహకరించారు.
ఐదో వికెట్ కోల్పోయిన విండీస్.. హెట్‌మైర్(27) ఔట్
సమయం 16:37.. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. హేజిల్‌వుడ్ వేసిన 13వ ఓవర్‌లో మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో విండీస్ 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పోలార్డ్(9), బ్రేవో(1) ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్.. ఎవిన్ లూయిస్(29) ఔట్
సమయం 16:18.. విండీస్ హార్డ్ హిట్టర్ ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు)ను ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో లూయిస్ పెవిలియన్ బాట పట్టాడు. 10 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 74/4. క్రీజ్లో హెట్‌మైర్(19), పోలార్డ్(1) ఉన్నారు.
ఆసీస్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోతున్న విండీస్ బ్యాటర్లు
సమయం 15:52.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస పెట్టి వికెట్లు తీస్తూ విండీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. 3వ ఓవర్ రెండో బంతికి కమిన్స్ బౌలింగ్‌లో క్రిస్ గేల్(9 బంతుల్లో 15; 2 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి పూరన్(4), మూడో బంతికి రోస్టన్ ఛేజ్(0)లను హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో విండీస్ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 4 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 37/3. క్రీజ్‌లో ఎవిన్ లూయిస్(14), హెట్‌మైర్(1) ఉన్నారు.
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా శనివారం(నవంబర్ 6) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం, 3 పరాజయాలతో సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది.
ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 16 మ్యాచ్‌లు జరగ్గా.. ఆసీస్ 6, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రపంచకప్ టోర్నీల్లో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా ఆసీస్ 2, వెస్టిండీస్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, హేడెన్ వాల్ష్
Comments
Please login to add a commentAdd a comment