Border-Gavaskar Trophy 2023: India Vs Australia 4th Test Day 1 Live Score Updates In Telugu - Sakshi
Sakshi News home page

IND VS AUS 4th Test: సెంచరీతో చెలరేగిన ఖవాజా.. తొలి రోజు ఆసీస్‌దే

Published Thu, Mar 9 2023 9:10 AM | Last Updated on Thu, Mar 9 2023 4:42 PM

BGT 2023 IND VS AUS 4th Test Day 1 Updates And Highlights - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. తొలి రోజు ఆటలో టీమిండియాపై ఆసీస్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా(104 నాటౌట్‌) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాయి.  ఇక భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్‌ తలా వికెట్‌ సాధించారు.

170 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హ్యాండ్స్‌కాంబ్‌.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు,

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
టీమిండియా ఎట్టకేలకు మూడో వికెట్‌ సాధించింది. 38 పరుగులు చేసిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను రవీంద్ర జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. క్రీజులోకి హ్యాండ్స్‌ కాంబ్‌ వచ్చాడు. 64 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు: 152/3

టీ బ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 149/2 (62)

60 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 145-2

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన ఖ్వాజా
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడిన ఉస్మాన్‌ ఖ్వాజా 146 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. షమీ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును అందుకున్నాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 128/2గా ఉంది. ఖ్వాజా (56)తో పాటు స్టీవ్‌ స్మిత్‌ (26) క్రీజ్‌లో ఉన్నాడు.   

100 దాటిన ఆసీస్‌ స్కోర్‌.. లంచ్‌ తర్వాత టీమిండియాకు లభించని ఫలితం
లంచ్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, ఆతర్వాత మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ఈ క్రమంలో ఆ జట్టు 42వ ఓవర్‌లో 100 పరుగుల మార్కు దాటింది. ఉస్మాన్‌ ఖ్వాజా (47) హాఫ్‌ సెంచరీ దిశగా సాగుతుండగా, స్టీవ్‌ స్మిత్‌ 12 పరుగుల బ్యాటింగ్‌ కొనసాగిస్తుతున్నాడు. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 105/2గా ఉంది.  

లంచ్‌ సమయానికి ఆసీస్‌ స్కోర్‌ 75/2, అశ్విన్‌, షమీకి తలో వికెట్‌
తొలి రోజు లంచ్‌ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ట్రివిస్‌ హెడ్‌ (32), లబూషేన్‌ (3) ఔట్‌ కాగా, ఉస్మాన్‌ ఖ్వాజా (27), స్టీవ్‌ స్మిత్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. హెడ్‌ను అశ్విన్‌, లబూషేన్‌ను షమీ ఔట్‌ చేశారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. లబూషేన్‌ (3) ఔట్‌
జట్టు స్కోర్‌ 72 పరుగుల వద్ద ఉ‍ండగా ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో లబూషేన్‌ (3) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఉస్మాన్‌ ఖ్వాజా (26), స్టీవ్‌ స్మిత్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. హెడ్‌ (32) ఔట్‌
16వ ఓవర్‌ మూడో బంతికి ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి ట్రవిస్‌ హెడ్‌ (32) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 62/1. ఉస్మాన్‌ ఖ్వాజా (18), లబూషేన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

7 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 24/0, శ్రీకర్‌ భరత్‌ చెత్త వికెట్‌కీపింగ్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 24/0గా ఉంది. శ్రీకర్‌ భరత్‌ చెత్త వికెట్‌కీపింగ్‌ కారణంగా ట్రవిస్‌ హెడ్‌కు లైఫ్‌ లభించింది. ఉమేశ్‌ బౌలింగ్‌లో హెడ్‌ అందిం‍చిన సునాయాసమైన క్యాచ్‌ను భరత్‌ నేలపాలు చేశాడు. అంతకుముందు ఆ తర్వాత కూడా భరత్‌ వికెట్‌ వెనకాల చాలా తప్పిదాలు చేసి అనసవర పరుగులిచ్చాడు. ఇషాన్‌ కిషన్‌ను కాదని భరత్‌ను వరుసగా నాలుగో టెస్ట్‌లో కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. 

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా ఇవాల్టి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఒక్క మార్పు చేయగా.. ఆసీస్‌ మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించింది. సిరాజ్‌ స్థానంలో షమీ జట్టులో చేరాడు. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. 

75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు స్టేడియంకు విచ్చేశారు. ఇరువురు దేశ ప్రధానులు ప్రత్యేక వాహనంలో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్‌కు ముందు మోదీ, అల్బనీస్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. అనంతరం మోదీ, అల్బనీస్‌ కలిసి కాసేపు కామెంట్రీ చెప్పే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement