fourth test
-
‘ఇప్పటికే ఎక్కువైంది’
ఆ్రస్టేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దాంతో ఇక కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ‘వైట్‌వాష్’కు గురవడం... తాజాగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో 1–2తో వెనుకంజలో ఉండటంపై గంభీర్ కోచింగ్ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లు జట్టు కోచ్‌గా ఆటగాళ్లు సహజ శైలిలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఇప్పటికే ఎక్కువైంది... ఇక చాలు’ అని ఆటగాళ్లకు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. సిడ్నీ: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగే స్థితిలో నిలిచిన టీమిండియా... చివర్లో చేతులెత్తేసి ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఆటగాళ్ల పేర్లు తీసుకోకపోయినా... ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ధోరణిలో గంభీర్ ప్లేయర్లకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకపోవడమే జట్టుకు శ్రేయస్కరమని మాజీ ఆటగాళ్లు హితబోధ చేస్తుండగా... ధోనీ, విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావని పలువురు గుర్తు చేస్తున్నారు. వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను దాదాపు కోల్పోయిన భారత జట్టు... ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా చూడాలి. ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ 2–2తో ‘డ్రా’ అయినా... గత సిరీస్‌లో విజేతగా నిలిచినందుకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ భారత్ వద్దే ఉంటుంది. వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్... ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో జరిగిన తొలి టెస్టు (పెర్త్)లో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోయినా... తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు. రెండో టెస్టు నుంచి రోహిత్, గిల్ తుది జట్టులోకి రావడంతో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుందనుకుంటే... నానాటికి దిగజారింది. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో భారత జట్టు రెండింట ఓడి ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మెల్బోర్న్ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో నిలిచి ఆ తర్వాత పేలవ ఆటతీరుతో ఓటమిని కోరి కొని తెచ్చుకుంది. స్టార్ బ్యాటర్ కోహ్లి మరోసారి తన బలహీనత కొనసాగిస్తూ ఆఫ్‌స్టంప్ అవతలి బంతిని వెంటాడి అవుట్ కాగా... రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ కూడా షాట్ సెలెక్షన్ లోపంతోనే వెనుదిరగగా... ఈ సిరీస్‌లో ఇటు సారథిగా, అటు బ్యాటర్‌గా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు సహజశైలిలో ఆడమని ప్రోత్సహించిన గంభీర్... జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టారీతిన షాట్లు ఆడి అవుట్ కావడంపై పలువురు ఆటగాళ్లపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి అంతా సవ్యంగా లేదని... ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి. పుజారా కోసం పట్టుబట్టినా... గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఈసారి కూడా జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినా... సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు అంగీకరించలేదు. జట్టులో స్థిరత్వం తీసుకురాగల పుజారా వంటి ప్లేయర్ అవసరమని గంభీర్ చెప్పినా... సెలెక్షన్ కమిటీ పెడచెవిన పెట్టింది. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ పుజారాను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మనే టీమ్‌కు భారంగా పరిణమించాడనేది కాదనలేని సత్యం. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా... ‘హిట్‌మ్యాన్’ తన సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా... ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం కఠినమైన నిర్ణయాలు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యువ ఆటగాళ్లు నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని... ఇలాంటి సంధి దశలో పరిస్థితులను చక్కదిద్దాలంటే అనుభవమే ముఖ్యమని ఓ సీనియర్ ఆటగాడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పింక్ బాల్ టెస్టులో ఆకాశ్‌దీప్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టుకు ఎంపిక చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
పడగొట్టి... పట్టు వదిలేసి!
తొలి ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియాకు 105 పరుగుల ఆధిక్యం... ఆ తర్వాత భారత పదునైన పేస్ బౌలింగ్ ముందు రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్ తడబడింది... 11 పరుగుల వ్యవధిలో భారత్ 4 వికెట్లు తీయడంతో స్కోరు 91/6కు చేరింది... ఇక్కడే టీమిండియా కాస్త పట్టు విడిచింది... దాంతో స్కోరు 173/9 వరకు వెళ్లింది... ఇక్కడా ఆట ముగిస్తే రోహిత్ బృందం పని సులువయ్యేది... కానీ చివరి వికెట్‌కు కంగారూలు మళ్లీ పోరాడారు... దాంతో ఆ్రస్టేలియా స్కోరు 228/9కు... ఆధిక్యం కాస్తా 333కు చేరిపోయింది... మ్యాచ్ చివరి రోజు ఆసీస్ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసినా దాదాపు అసాధ్యమైన లక్ష్యం ఇది... నాలుగేళ్ల క్రితం బ్రిస్బేన్‌లో చెలరేగిన తరహాలో భారత్ దూకుడుగా ఆడి విజయం వైపు వెళుతుందా... లేక తలవంచుతుందా... లేక పోరాడి టెస్టును ‘డ్రా’గా ముగిస్తుందా అనేది చివరి రోజు ఆటలో ఆసక్తికరం. ఆదివారం ఆటలో బుమ్రా, సిరాజ్‌లు భారత్‌కు విజయావకాశాలు సృష్టించగా... లబుషేన్, కమిన్స్, లయన్ ఆసీస్‌కు ఆపద్భాంధవులుగా నిలిచారు.మెల్బోర్న్: అనూహ్య మలుపులతో సాగుతున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నాలుగో టెస్టు మ్యాచ్ చివరి ఘట్టానికి చేరింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. లబుషేన్ (139 బంతుల్లో 70; 3 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (90 బంతుల్లో 41; 4 ఫోర్లు), నాథన్ లయన్ (54 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం క్రీజ్‌లో లయన్‌తో పాటు స్కాట్ బోలండ్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. వీరిద్దరు ఇప్పటికే చివరి వికెట్‌కు ఏకంగా 18.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 55 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/9తో తమ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 21 బంతులు ఆడి 11 పరుగులు చేసి 369 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (189 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 333 పరుగులు ముందంజలో ఉంది. కీలక భాగస్వామ్యాలు... ఆసీస్ ఓపెనర్లు కొన్‌స్టాస్ (18 బంతుల్లో 8; 1 ఫోర్), ఖ్వాజా (65 బంతుల్లో 21; 2 ఫోర్లు) చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో తనపై దూకుడు ప్రదర్శించిన కొన్‌స్టాస్‌ను ఈసారి అద్భుత బంతితో పడగొట్టి బుమ్రా సంబరాలు చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ బౌలింగ్‌తో 122 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సిరాజ్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శనతో ఆసీస్ పని పట్టాడు. ఖ్వాజాను పదునైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేసి జోరు ప్రదర్శించిన సిరాజ్... లంచ్ విరామం తర్వాత స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 13; 1 ఫోర్)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఆదివారం తన 31వ పుట్టిన రోజు జరుపుకున్న ట్రావిస్ హెడ్‌కు కలిసి రాలేదు. బుమ్రా పన్నిన ఉచ్చులో పడిన హెడ్ (2 బంతుల్లో 1) స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్లో మిచెల్ మార్ష్(4 బంతుల్లో 0)ను కూడా అవుట్ చేసిన బుమ్రా, తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతికి అలెక్స్ కేరీ (7 బంతుల్లో 2) పని పట్టాడు. దాంతో ఆ్రస్టేలియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది.ఇలాంటి స్థితిలో లబుషేన్, కమిన్స్ కలిసి జట్టును ఆదుకున్నారు. 19.1 ఓవర్ల పాటు వీరిద్దరు భారత బౌలర్లను నిలువరించగలిగారు. లబుషేన్ తనదైన శైలిలో పట్టుదల కనబరుస్తూ 105 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, తొలి ఇన్నింగ్స్‌లాగే కమిన్స్ మళ్లీ బ్యాటింగ్‌లో ప్రభావం చూపించాడు. ఎట్టకేలకు మూడో సెషన్లో లబుషేన్‌ను అవుట్ చేసి సిరాజ్ 57 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. స్టార్క్ (13 బంతుల్లో 5) రనౌట్ కాగా, కమిన్స్ వికెట్ జడేజా ఖాతాలో చేరింది. ఈ దశలో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ లయన్, బోలండ్ టీమిండియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అప్పటికే బాగా అలసిపోయిన భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో చివరి వికెట్ దక్కకుండానే రోజు ముగిసింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: కొన్‌స్టాస్ (బి) బుమ్రా 8; ఖ్వాజా (బి) సిరాజ్ 21; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 70; స్మిత్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; హెడ్ (సి) నితీశ్ (బి) బుమ్రా 1; మార్ష్(సి) పంత్ (బి) బుమ్రా 0; కేరీ (బి) బుమ్రా 2; కమిన్స్ (సి) రోహిత్ (బి) జడేజా 41; స్టార్క్ (రనౌట్) 5; లయన్ (బ్యాటింగ్) 41; బోలండ్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (82 ఓవర్లలో 9 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–20, 2–43, 3–80, 4–85, 5–85, 6–91, 7–148, 8–156, 9–173. బౌలింగ్: బుమ్రా 24–7–56–4, ఆకాశ్‌దీప్ 17–4–53–0, సిరాజ్ 22–4–66–3, జడేజా 14–2–33–1, నితీశ్ రెడ్డి 1–0–4–0, సుందర్ 4–0–7–0. బుమ్రా ‘ద గ్రేట్’ 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కెరీర్ ఆరంభంలో టి20, వన్డే స్పెషలిస్ట్ బౌలర్‌గానే చూశారు. ఈ రెండు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగిన రెండేళ్ల తర్వాత గానీ అతను తొలి టెస్టు ఆడలేదు. కానీ ఇప్పుడు టెస్టుల్లో బుమ్రా ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అతని పదునైన బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే ఉండటంలేదు. తన భిన్నమైన బౌలింగ్ శైలి అదనపు ప్రయోజనం కల్పిస్తుండగా... అసాధారణ బౌలింగ్ ప్రదర్శనలు అతని ఖాతాలో చేరాయి. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా... జట్టు ఏదైనా బుమ్రాను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బుమ్రా స్పెల్‌ను దాటితే చాలనుకుంటున్నారు. తాజా సిరీస్‌లో ఇది మరింత బాగా కనిపించింది. ఇప్పటికే అతను కేవలం 13.24 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసి 200 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా ఎందరితో సాధ్యం కాని అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. » 200 వికెట్లు తీసిన 85 మంది బౌలర్లలో 20కంటే తక్కువ సగటుతో ఈ మైలురాయిని చేరిన ఏకైక బౌలర్ బుమ్రానే. అతను కేవలం 19.56 సగటుతో ఈ వికెట్లు తీశాడు. బుమ్రా తన 44వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. » అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా (8484) నాలుగో స్థానంలో ఉన్నాడు. వఖార్ యూనిస్ (7725), స్టెయిన్ (7848), రబడ (8154) అతనికంటే తక్కువ బంతులు వేశారు. » బుమ్రా తీసిన 202 వికెట్లలో 142 వికెట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో రావడం విదేశీ గడ్డపై అతని విలువ ఏమిటో అర్థమవుతుంది. » భారత్ గెలిచిన 20 టెస్టుల్లో బుమ్రా భాగంగా ఉండగా... ఈ టెస్టుల్లో 110 వికెట్లతో అతని బౌలింగ్ సగటు కేవలం 14.4 కావడం అతని ప్రభావాన్ని చూపిస్తోంది. -
నితీశ్ రెడ్డి ‘వైల్డ్ ఫైర్’
దేశం తరఫున ఆడుతూ కెరీర్లో తొలి సెంచరీ అంటే ఎలా ఉండాలి...జీవితకాలం ఇలాంటి క్షణాల కోసమే శ్రమించే కష్టాన్ని మరచిపోయేలా ఉండాలి...ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో కలలు గనే చోట సాధించినట్లుగా ఉండాలి... అన్నీ అనుకూలించినప్పుడు కాదు...జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ తానేంటో చూపించాలి...అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ, శరీరానికి తగిలే దెబ్బలను తట్టుకుంటూ, వేలాది మంది తనకు జేజేలు పలికేలా శతకం బాదాలి...వీటన్నింటికీ ఒక్కటే సమాధానం! మన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కొట్టినట్లుగా సెంచరీ ఉండాలి. మెల్బోర్న్ టెస్టులో భారీ ఆధిక్యంపై కన్నేసి విజయంపై గురి పెట్టిన ఆస్ట్రేలియాను మన నితీశ్, వాషింగ్టన్ సుందర్ సమర్థంగా అడ్డుకున్నారు. శతక భాగస్వామ్యంతో జట్టును గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ముందుగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఆపై ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. నితీశ్ అద్భుత బ్యాటింగ్‌కు సుందర్ సమన్వయం తోడవడంతో కంగారూలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వీరిద్దరు కలిసి 47.3 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరు బ్యాటర్ల పోరు తర్వాత ప్రస్తుతానికి భారత్ ఓటమి ప్రమాదంనుంచి దాదాపుగా తప్పించుకున్నట్లే. మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ను భారత యువ ఆటగాళ్లు ఆసక్తికరంగా మార్చారు. ఒక దశలో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోయి ఓటమికి బాటలు వేసుకునేటట్లు కనిపించిన టీమిండియా కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. మ్యాచ్ మూడో రోజు వెలుతురులేమితో ఆటను నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా...వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50; 1 ఫోర్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నితీశ్‌తో పాటు సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 164/5తో ఆట కొనసాగించిన భారత్ శనివారం 70 ఓవర్లు ఆడి మరో 194 పరుగులు జోడించింది. ప్రస్తుతానికి ఆసీస్‌కు ఆధిక్యం ఉన్నా...నాలుగో రోజు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేసి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరం. మిగిలిన సమయం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కావడం అంత సులువు కాదు. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియవచ్చు. భారీ భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉన్న స్థితినుంచి రిషభ్ పంత్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17) మూడో రోజు ఆటను కొనసాగించారు. వీరిద్దరు మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టును రక్షించాల్సి ఉన్నా...ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా పంత్ చెత్త షాట్‌తో తన వికెట్ సమర్పించుకోగా, జడేజా ఎల్బీగా దొరికిపోయాడు. 30 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. జడేజా అవుటయ్యాక సుందర్ బ్యాటింగ్‌కు రాగా, మరో ఎండ్‌లో నితీశ్ 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. మరో మూడు వికెట్లు తీసి భారత్ ఆట ముగించవచ్చని భావించిన ఆసీస్‌కు ఇక్కడే అసలు ప్రతిఘటన ఎదురైంది. నితీశ్, సుందర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మెల్లగా స్కోరును పెంచుతూ పోయారు. లంచ్ సమయానికి స్కోరు 244/7 వద్ద నిలిచింది. రెండో సెషన్లో పూర్తిగా వీరిద్దరిదే హవా సాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా 24 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. మూడో సెషన్లో కూడా వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆసీస్ తొలి 15 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఎట్టకేలకు 127 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం తర్వాత సుందర్‌ను అవుట్ చేసి లయన్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు పరుగులకే బుమ్రా (0) కూడా వెనుదిరిగాడు. అయితే మరో 15 బంతుల పాటు చివరి వికెట్ చేజార్చుకోకుండా భారత్ మూడో రోజును ముగించింది. స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 474; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 36; ఆకాశ్‌దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (సి) లయన్ (బి) బోలండ్ 28; జడేజా (ఎల్బీ) (బి) లయన్ 17; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి)లయన్ 50; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159, 6–191, 7–221, 8–348, 9–350. బౌలింగ్: స్టార్క్ 25–2–86–0, కమిన్స్ 27–6–86–3, బోలండ్ 27–7–57–3, లయన్ 27–4–88–2, మార్ష్ 7–1–28–0, హెడ్ 3–0–11–0. సుందర్ సంయమనం...దాదాపు నాలుగేళ్ల క్రితం వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 161/5తో కష్టాల్లో ఉన్న స్థితిలో అతను బ్యాటింగ్‌కు దిగి జట్టును గట్టెక్కించాడు. అతను చేసిన 62 పరుగులు ఆ తర్వాత భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మరోసారి అతను అలాంటి పాత్రనే పోషించాడు. ఈ టెస్టు కోసం ప్రధాన బ్యాటర్ గిల్‌ను పక్కన పెట్టి ఆల్‌రౌండర్ సుందర్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తప్పుడు నిర్ణయం జట్టు ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అన్నారు. అయితే సుందర్ తన బ్యాటింగ్‌తో వారి అనుమానాలను పటాపంచలు చేశాడు. ముఖ్యంగా ఏ రెగ్యులర్ బ్యాటర్‌కు తగ్గని రీతిలో అద్భుతమైన డిఫెన్స్‌తో జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సుందర్ పట్టుదల, ఓపికతో అండగా నిలవడం వల్లే మరో వైపు నితీశ్ సెంచరీ సాధ్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఆడిన సుందర్ ఏకంగా 162 బంతులు ఎదుర్కొన్నాడు. కమిన్స్ ఓవర్లో అతను కొట్టిన సింగిల్‌తో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంనుంచి తప్పించుకుంది. తాను ఎదుర్కొన్న 103వ బంతికి గానీ సుందర్ ఏకైక ఫోర్ కొట్టలేదు. టీ విరామం తర్వాత 146 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. మళ్లీ ఆ్రస్టేలియాను నిలువరించడంలో సఫలమైన తర్వాత చివరకు లయన్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. బ్రిస్బేన్ విజయం తర్వాత తన కుక్క పిల్లకు అక్కడి మైదానం ‘గాబా’ పేరును సుందర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి ప్రదర్శన తర్వాత రెండో కుక్క పిల్ల ఏమైనా ఉంటే ‘ఎంసీజీ’ అంటాడేమో!ఇక తగ్గేదేలే...పెర్త్ టెస్టులో 73/6 నుంచి జట్టును 150 వరకు అతనే తీసుకెళ్లాడు...అడిలైడ్‌లో 87/5, 105/5 వద్ద ఉన్నప్పుడు 42, 42తో రెండు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మెల్బోర్న్లో 191/6 నుంచి స్కోరును 300 దాటించాడు...ఈ సిరీస్‌లో తొలి రోజునుంచి తనదైన ముద్ర వేసిన నితీశ్ కుమార్ రెడ్డి 284 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్టుకు ముందు అతని ప్రదర్శన చూస్తే ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎంసీజీలో అతను ఆ లోటును తీర్చుకున్నాడు. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు, బంగ్లాదేశ్‌తో టి20లో 34 బంతుల్లో 74 పరుగుల ఆటతో తానేంటో చూపించినా...నితీశ్‌ను టెస్టు ఆటగాడిగా ఎవరూ చూడలేదు. 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 674 పరుగులు, బౌలింగ్‌లో 56 వికెట్ల అతని రికార్డు ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి అర్హతగా మారుతుందని, తుది జట్టులో స్థానం దక్కుతుందని ఊహించలేదు. మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని నితీశ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు డకౌట్లు బ్యాటింగ్‌పై కూడా సందేహాలు రేపాయి. కానీ టీమ్ మేనేజ్మెంట్ నితీశ్‌పై నమ్మకముంచింది. అతడిని తమ ట్రంప్ కార్డ్‌గా వాడి అద్భుత ఫలితాలు సాధించింది. ఇప్పుడు సెంచరీతో నితీశ్ తన స్థాయిని ప్రదర్శించాడు. అతను ఎనిమిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చే సమయానికి భారత్ మరో 283 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలోనూ ఎలాంటి తడబాటు లేకుండా అతను స్వేచ్ఛగా ఆడిన తీరు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. షాట్ల ఎంపిక మాత్రమే కాదు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఎంతో అనుభవం ఉన్నవాడిలా చూపించింది. ముఖ్యంగా క్రీజ్‌లో పట్టుదలగా నిలబడిన తీరు, పోరాటతత్వం ఈ 21 ఏళ్లు కుర్రాడిని మరో మెట్టు ఎక్కించాయి. స్టార్క్ బౌలింగ్‌తో ఆఫ్ డ్రైవ్ బౌండరీతో 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అతను ‘పుష్ప’లా తగ్గేదేలే అంటూ సంకేతం చూపించాడు. ఆ తర్వాత పరిస్థితికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నాడు. 85 స్కోరు వద్దనుంచి 97కు చేరేందుకు 48 బంతులు తీసుకున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సెంచరీ తర్వాత బ్యాట్‌ను మైదానంలో జెండా తరహాలో పాతి ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా తన రాకను నితీశ్ ఘనంగా చూపించాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో సెంచరీ బాది ఆ్రస్టేలియా గడ్డపై అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వారిలో మూడో స్థానంలో అతను నిలవడం విశేషం. కమిన్స్‌తో తలపడి... నిలబడి...నితీశ్ ఇన్నింగ్స్‌లో చూడచక్కటి షాట్లు ఎన్నో ఉన్నాయి. అతని పది ఫోర్లు కూడా ఎంతో నియంత్రణతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి సాధికారతతో వచ్చాయి. ఆరంభంలో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్స్, ఆ తర్వాతి బౌండరీలో చక్కటి ఫుట్‌వర్క్ కనిపించింది. అయితే సెంచరీని అందుకునే క్రమంలో అతను కొన్ని కఠిన క్షణాలను కూడా దాటాడు! ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ , తన సన్‌రైజర్స్ సారథి కమిన్స్ బౌలింగ్‌ను అతను ఎదుర్కొన్న తీరు శనివారం ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఎన్ని ప్రమాదకరమైన బంతులు వచ్చినా... నితీశ్ తలవంచి కాడి పడేయలేదు. వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ అతనిలోని మొండితనాన్ని చూపించింది. ముఖ్యంగా బౌన్సర్‌గా వచ్చిన మూడో బంతిని ఆడలేకపోయిన నితీశ్ అదృష్టవశాత్తూ చివరి క్షణంలో దానినుంచి తప్పించుకోగలిగాడు. ఆఖరి బంతి కూడా దాదాపు ఇదే తరహాలో అతడిని వెంటాడింది. మరికొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్‌లోనే బంతి మోచేయి కింది భాగంలో బలంగా తగలడంతో అతను విలవిల్లాడుతూ బ్యాట్ వదిలేశాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ కుర్రాడు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయి తానేంటో చూపించాడు. ఆ మూడు బంతులు!లయన్ వేసిన ఇన్నింగ్స్ 112వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి నితీశ్ మరో ఎండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతని స్కోరు 97. అదే ఓవర్ తర్వాత ఐదు బంతులు ఆడిన సుందర్ చివరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి మరో రెండు పరుగులు తీసిన అతను 99 వద్ద నిలిచాడు. అయితే మరుసటి ఓవర్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది. తొలి మూడు బంతులు ఎదుర్కొన్న బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. కమిన్స్ బంతులను అతను ఆడగలడా అని అన్ని వైపులనుంచి సందేహం. మైదానంలో ఫ్యాన్స్ కూడా మునివేళ్లపై నిలిచారు. ఎలాగో అతను ఆ గండాన్ని దాటాడు. ఆఖరి బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినప్పుడు ఎంసీజీ మొత్తం ఊగిపోవడం విశేషం! అయితే బోలండ్ తర్వాతి ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ ఆన్డ్రైవ్గా ఆడటంతో నితీశ్ శతకం పూర్తయింది. అభిమానుల ఉత్సాహంతో ‘జి’ దద్దరిల్లగా...ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆ సమయంలో కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ...‘ఈ భావోద్వేగ క్షణం గురించి ఏం చెప్పినా తక్కువే. అక్కడ ఏడుస్తోంది నితీశ్ తండ్రి మాత్రమే కాదు. మైదానంలో ఉన్న సగటు భారత అభిమానులకు కూడా అదే భావన వచ్చి ఉంటుంది. నా కళ్లల్లో కూడా కన్నీళ్లు తిరిగాయంటే ఆశ్చర్యపోవద్దు’ అని వ్యాఖ్యానించాడు. 5 ఎనిమిది లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నితీశ్ ఐదోవాడు. భారత ఆటగాళ్లలో అతనే మొదటివాడు. 8 ఈ సిరీస్‌లో నితీశ్ సిక్సర్ల సంఖ్య. గతంలో ఆ్రస్టేలియా గడ్డపై ఒక సిరీస్‌లో మైకేల్ వాన్ (8; ఇంగ్లండ్), క్రిస్ గేల్ (8;వెస్టిండీస్) మాత్రమే ఎనిమిది సిక్స్‌లు బాదారు.‘విశాఖపట్నం యువకుడు నితీశ్ కుమార్‌రెడ్డికి నా అభినందనలు. అండర్–16 స్థాయిలో, రంజీ ట్రోఫీలో ఎన్నో విజయాలతో అతను సత్తా చాటాడు. ఇలాంటి ఘనతలు మున్ముందు మరిన్ని సాధించాలని, భారత జట్టులో సభ్యుడిగా దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ –నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి నా అభినందనలు. జట్టు కష్టాల్లో ఉండి ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పరిస్థితి చక్కదిద్దడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఎన్నో ఘనతల్లో ఇది మొదటిది కావాలి. మైదానంలో అతని విజయాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి -
గెలుపు పంచ్ ఎవరిదో?
ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమైంది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో కంగారూలను కట్టిపడేసేందుకు టీమిండియా అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంది.ఈ ఏడాదిని విజయంతో ముగించడం... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని చేజిక్కించుకోవడం... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మార్గం సుగమం చేసుకోవడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రోహిత్ బృందం మైదానంలో అడుగు పెట్టనుంది. గత రెండు పర్యటనల్లో మెల్బోర్న్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా ఈ మైదానంలో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేయగా... భారత జోరుకు అడ్డుకట్ట వేయాలని కంగారూలు కృతనిశ్చయంతో ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం రసవత్తర పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి! మెల్బోర్న్: గత రెండు ‘బాక్సింగ్ డే’ టెస్టుల్లోనూ ఆ్రస్టేలియాను చిత్తు చేసిన భారత జట్టు... ముచ్చటగా మూడోసారి కంగారూలను మట్టికరిపించేందుకు రెడీ అయింది. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఆ్రస్టేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న ఈ పోరుకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు తరలి రానుండగా... అశేష జనసందోహం ముందు ఆసీస్‌పై ఆధిపత్యం కనబర్చేందుకు రోహిత్ బృందం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగగా ... ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని చేజిక్కించుకుంటుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్... అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు (డే–నైట్)లో పరాజయం చవిచూసింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించగా... చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమ ఉజ్జీగా ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే... ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ టీమిండియాకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత జట్టు మెల్బోర్న్లో శక్తియుక్తులన్నీ ధారపోయడానికి సిద్ధమైంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న రోహిత్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనేది ఆసక్తికరంగా మారింది. పేస్‌కు సహకరించే మెల్బోర్న్ పిచ్‌పై రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా... లేక మిడిలార్డర్లోనే కొనసాగుతాడా చూడాలి!మరోవైపు అరంగేట్ర సిరీస్‌లోనే తీవ్రంగా తడబడ్డ ఓపెనర్ మెక్‌స్వీనీని తప్పించిన ఆ్రస్టేలియా... టీనేజర్ స్యామ్ కొంటాస్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్ జట్టులోకి రానున్నాడు. రోహిత్ రాణించేనా! ‘జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమే’ అని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేసినా... ‘హిట్‌మ్యాన్’ మిడిలార్డర్లో బరిలోకి దిగడం వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. వికెట్లు పడుతున్న దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ కనీసం ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో టెస్టులోనూ అతడు మిడిలార్డర్లోనే దిగే సూచనలున్నా... మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గత పదేళ్లుగా మెల్బోర్న్ స్టేడియంలో పరాజయం లేకుండా సాగుతున్న టీమిండియా... అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌పై భారీ అంచనాలు ఉండగా... యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. కోహ్లికి మెల్బోర్న్లో మంచి రికార్డు ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లి... ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పదే పదే ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతికి వికెట్ సమర్పించుకోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో దీనిపై దృష్టి పెట్టిన విరాట్... ‘ఫోర్త్ స్టంప్’ లోపాన్ని అధిగమించేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. మిడిలార్డర్లో పంత్ మంచి టచ్‌లో ఉండగా... పేస్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉండటం ఖాయమే. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావచ్చు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఒంటి చేత్తో బౌలింగ్ భారాన్ని మోస్తున్న ఏస్ పేసర్ బుమ్రా మరోసారి కీలకం కానున్నాడు. బుమ్రాతో కలిసి సిరాజ్, ఆకాశ్‌దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, జడేజా, నితీశ్ రెడ్డి/సుందర్, ఆకాశ్‌దీప్, బుమ్రా, సిరాజ్. ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, సామ్ కొంటాస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలండ్.హెడ్ ఆట కట్టిస్తేనే...సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టు కూడా కొన్ని సమస్యలతో సతమతమవుతోంది. వార్నర్ రిటైరయ్యాక సరైన ప్రత్యామ్నాయం లభించక ఇబ్బంది పడుతున్న ఆసీస్... ఈ సిరీస్ తొలి మూడు టెస్టులకు మెక్‌స్వీనీని ప్రయతి్నంచింది. అతడు విఫలమవ్వడంతో మరో యువ ఆటగాడు కొంటాస్ ను ఎంపిక చేసింది.లబుషేన్లో నిలకడ లోపించగా... గత మ్యాచ్‌లో సెంచరీతో స్టీవ్ స్మిత్ ఫామ్‌లోకి వచ్చాడు. వీళ్లంతా ఒకెత్తు అయితే... భారత్ పాలిట కొరకరాని కొయ్య మాత్రం ట్రవిస్ హెడ్ అనే చెప్పాలి. ఇటీవల టీమిండియాపై హెడ్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మరోసారి అతడి నుంచి రోహిత్ జట్టుకు ప్రమాదం పొంచి ఉంది. బోలండ్కు సొంత మైదానమైన ఎంసీజీలో అతడికి ఘనమైన రికార్డు ఉంది. మరోవైపు స్టార్క్, కమిన్స్ బౌలింగ్‌లో ఏమరపాటుగా ఉంటే జరిగే నష్టం ఏంటో ఈ పాటికే టీమిండియాకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఎంసీజీ టెస్టులో మళ్లీ గెలవాలంటే టీమిండియా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.పిచ్, వాతావరణంమెల్బోర్న్ పిచ్ పేస్‌కు అనుకూలం. వికెట్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని క్యూరేటర్ వెల్లడించాడు. తొలి రోజుఎండ అధికంగా ఉండనుంది. రెండో రోజు చిరు జల్లులు కురవొచ్చు. వర్షం వల్ల ఆటకు పెద్దగా ఆటంకం కలగకపోవచ్చు.4 భారత్ ఆ్రస్టేలియా మధ్య మెల్బోర్న్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 4 టెస్టుల్లో గెలిచింది. ఆ్రస్టేలియా 8 టెస్టుల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.6 బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే (44 టెస్టుల్లో) భారత్ తరఫున వేగంగా 200 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. అశ్విన్ 37 టెస్టుల్లో ఈ మైలురాయి దాటాడు.6 గత ఆరేళ్ల కాలంలో మెల్బోర్న్ మైదానంలో ఆరు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. -
హెడ్‌కు ఫిట్నెస్ పరీక్ష!
మెల్బోర్న్: భారత్‌తో నాలుగో టెస్టుకు ముందుఆ్రస్టేలియాకు ఆందోళన పెంచే విషయమిది! సిరీస్‌లో చెలరేగిపోతున్న ట్రావిస్ హెడ్ ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆడటంపై కొంత సందిగ్ధత కనిపిస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్‌కు ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్‌కు ముందు రోజు హెడ్‌కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే టీమ్‌ను ప్రకటిస్తారు. ఈ సిరీస్‌లో హెడ్ వరుసగా 11, 89, 140, 152, 17 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ సమయంలోనే హెడ్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్‌కు కూడా దిగలేదు. సోమవారం ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్న అతను...మంగళవారం మాత్రం కాసేపే సాధన చేశాడు. హెడ్ స్థానం ఇంకా ఖాయం లేదని అంగీకరించిన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్... బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది లేకపోతే కచ్చితంగా బరిలోకి దిగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆసీస్ తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. మెక్‌స్వీనీ స్థానంలో స్యామ్ కొంటాస్ అరంగేట్రం చేయనుండగా... హాజల్‌వుడ్‌కు బదులుగా బోలండ్ జట్టులోకి వస్తాడు. -
India vs England 4th Test Day 4: కుర్రాళ్లు కొట్టేశారు
కింగ్ కోహ్లి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ గాయంతో తర్వాత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వైఫల్యంతో శ్రేయస్ అయ్యర్‌ను తీసేశారు. ఇక ప్రధాన బ్యాటింగ్ దళానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పెద్ద దిక్కు. రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్... వీళ్లంతా పూర్తిగా కొత్తవాళ్లు! ఈ సిరీస్‌తోనే అరంగేట్రం చేశారు. 11 మందిలో నలుగురు కొత్తవాళ్లతో... మిగతా అనుభవం లేనివారితో... సంప్రదాయ మ్యాచ్‌లాడి ఇంగ్లండ్‌లాంటి ‘బజ్‌బాల్’ దూకుడు జట్టును ఓడించడం ఆషామాషీ కానేకాదు. కానీ కుర్రాళ్లతో నిండిన టీమిండియా ఆడి గెలిచింది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తర్వాత టీమిండియా భవిష్యత్తుకు కొండంత విశ్వాసాన్ని ఈ సిరీస్ ఇచి్చంది. రాంచీ: ఐదు టెస్టుల సిరీస్‌ను ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3–1తో కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌ల్లాగే నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగో టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్, కెపె్టన్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (124 బంతుల్లో 52 నాటౌట్; 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్ ధ్రువ్ జురెల్ (77 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు) టెస్టు విజయానికి అవసరమైన పరుగుల్ని అజేయంగా చేసి పెట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా, రూట్, హార్ట్లీలకు చెరో వికెట్ దక్కింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలకమైన పరుగులు చేసిన కొత్త వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రోహిత్, గిల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ఈ టెస్టుతో పాటు సిరీస్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉండగా... ఓవర్‌నైట్ స్కోరు 40/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ ఒడిదొడుకుల్లేకుండా నడిపించారు. కుదురుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 37; 5 ఫోర్లు)ను జట్టు స్కోరు 84 పరుగుల వద్ద రూట్ బోల్తా కొట్టించాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక మరో ఓపెనర్ రోహిత్‌ను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. 99/2 వద్ద ఓపెనర్లే అవుటయ్యారు. ఇక్కడిదాకా టీమిండియా మంచి స్థితిలోనే ఉంది. అయితే బషీర్ స్పిన్నేయడంతో రజత్ పటిదార్ (0), జడేజా (4), సర్ఫరాజ్ (0)లు బ్యాట్లెత్తారు. అప్పుడు భారత్ స్కోరు 120/5. సగం వికెట్లను కోల్పోయింది. ఇక మిగిలిన సగంలో జురెల్ తప్ప అంతా స్పెషలిస్టు బౌలర్లే! లక్ష్యమింకా 72 పరుగుల దూరంలో ఉంది. ఇలాంటి గడ్డు స్థితిలో శుబ్‌మన్, జురెల్ మొండి పోరాటం చేశారు. ఇంగ్లండ్ సారథి స్టోక్స్ వరుసబెట్టి స్పిన్ త్రయం బషీర్, హార్ట్లీ, రూట్‌లతోనే బౌలింగ్ వేయించాడు. అయినా ప్రత్యర్థి జట్టుకు పట్టుబిగించే అవకాశమివ్వకుండా... మరో వికెట్ పడకుండా గిల్–జురెల్ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలో శుబ్‌మన్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... టీ విరామానికి ముందే భారత్ విజయతీరాలకు చేరుకుంది. ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో టెస్టుతోపాటు సిరీస్ కూడా మన జట్టు వశమైంది. ► వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 3–1తో ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ 64.58 శాతంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (75) అగ్రస్థానంలో, ఆ్రస్టేలియా (55) మూడోస్థానంలో ఉన్నాయి. ► ఈ టెస్టూ నాలుగో రోజుల్లో ముగియడం... ధర్మశాలలో ఆఖరి టెస్టు (మార్చి 7 నుంచి)కు 9 రోజుల విరామం ఉండటంతో ఇంగ్లండ్ జట్టు సభ్యులు రెండు వేర్వేరు చోట్ల విశ్రాంతి తీసుకోనున్నారు. కొన్నాళ్లు చండీగఢ్, ఆ తర్వాత బెంగళూరుల్లో స్టోక్స్ బృందం సేద తీరుతుంది. మూడో టెస్టుకు ముందూ ఇలాంటి గ్యాపే ఉండటంతో ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో విశ్రాంతి తీసుకొని వచి్చంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 145; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 55; యశస్వి (సి) అండర్సన్ (బి) రూట్ 37; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 52; రజత్ పటిదార్ (సి) పోప్ (బి) బషీర్ 0; జడేజా (సి) బెయిర్‌స్టో (బి) బషీర్ 4; సర్ఫరాజ్ (సి) పోప్ (బి) బషీర్ 0; ధ్రువ్ జురెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–84, 2–99, 3–100, 4–120, 5–120. బౌలింగ్: జో రూట్ 7–0–26–1, హార్ట్లీ 25–2–70–1, బషీర్ 26–4–79–3, అండర్సన్ 3–1–12–0. 17: స్వదేశంలో భారత్‌కిది వరుసగా 17వ టెస్టు సిరీస్ విజయం. చివరిసారి టీమిండియా సొంతగడ్డపై 2012లో ఇంగ్లండ్ చేతిలోనే ఓడిపోయింది. -
తిరుగులేని టీమిండియా.. 11 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్రయాత్ర
స్వదేశంలో టీమిండియా విజయపరంపర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకు అప్రతిహతంగా సాగుతుంది. ప్రపంచంలో ఏ జట్టు స్వదేశంలో వరుసగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. భారత్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (1976-1986), న్యూజిలాండ్ (2017-2021) జట్లు స్వదేశంలో 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి. స్వదేశంలో టీమిండియా సాధించిన 17 సిరీస్ (వరుసగా) విజయాలు.. ఆస్ట్రేలియాపై 4-0 వెస్టిండీస్‌పై 2-0 సౌతాఫ్రికాపై 3-0 న్యూజిలాండ్‌పై 2-0 ఇంగ్లండ్‌పై 4-0 బంగ్లాదేశ్‌పై 1-0 ఆస్ట్రేలియాపై 2-1 శ్రీలంకపై 1-0 ఆఫ్ఘనిస్తాన్పై 1-0 వెస్టిండీస్‌పై 2-0 సౌతాఫ్రికాపై 3-0 బంగ్లాదేశ్‌పై 2-0 ఇంగ్లండ్‌పై 3-1 న్యూజిలాండ్‌పై 1-0 శ్రీలంకపై 2-0 ఆస్ట్రేలియాపై 2-1 ఇంగ్లండ్‌పై 3-1 (మరో మ్యాచ్ మిగిలి ఉంది) ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో (192) భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్ జురెల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 (రూట్ 122 నాటౌట్, జడేజా 4/67) భారత్ తొలి ఇన్నింగ్స్ 307 (దృవ్ జురెల్ 90, షోయబ్ బషీర్ 5/119) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145 (జాక్ క్రాలే 60, అశ్విన్ 5/51) భారత్ రెండో ఇన్నింగ్స్ 192/5 (రోహిత్ శర్మ 55, షోయబ్ బషీర్ 3/79) 5 వికెట్ల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: దృవ్ జురెల్ -
IND VS ENG 4th Test: సీనియర్లు లేకపోయినా ఇరగదీసిన యంగ్ ఇండియా
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్ జురెల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. సీనియర్లు కోహ్లి, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, లేకపోయినా అద్భుతంగా రాణించడం విశేషం. కెప్టెన్ రోహిత్, అశ్విన్, జడేజా మినహా ఈ జట్టులో అందరూ పాతిక లోపు టెస్ట్‌లు ఆడినవారే ఉన్నారు. ఈ జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపించినా, యువ ఆటగాళ్లు ఏమాత్రం తగ్గలేదు. యశస్వి (73, 37), గిల్ (38, 52 నాటౌట్), జురెల్ (90, 39 నాటౌట్), ఆకాశ్‌దీప్ (తొలి ఇన్నింగ్స్‌లో 3/83), కుల్దీప్ (సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4/22) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సర్ఫరాజ్ (14, 0), పాటిదార్ (17, 0) నిరాశపర్చినప్పటికీ.. ఆ లోటును మిగతా కుర్రకారు భర్తీ చేసింది. ఈ మ్యాచ్‌లో జురెల్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు అతని జీవితాన్నే మార్చేశాయి. ఈ ప్రదర్శనలతో అతను టీమిండియా పెర్మనెంట్ టెస్ట్ వికెట్‌కీపర్‌గా మారే అవకాశం ఉంది. అంతిమంగా క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకు దక్కుతుంది. అతను యువ ఆటగాళ్లను అద్భుతంగా వాడుకుని సత్ఫలితాలు రాబట్టాడు. వ్యక్తిగతంగానూ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో (2) నిరాశపర్చినప్పటికీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన అర్దసెంచరీతో (55) రాణించాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. తొలి టెస్ట్ నుంచి సీనియర్ల గైర్హాజరీ ఇబ్బంది పెట్టినప్పటికీ అతను కుర్రాళ్లను అద్భుతంగా వాడుకుని మరపురాని విజయాలు సాధించాడు. రోహిత్‌కు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్ (1/83, 5/51), జడేజా (4//67, 1/56) అండగా నిలిచారు. వీరిద్దరు జట్టు విజయంలో తమవంతుపాత్ర పోషించారు. స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్ 353 & 145 భారత్ 307 & 192/5 5 వికెట్ల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: దృవ్ జురెల్ -
సొంతమా... సమమా!
అటో...ఇటో... కాదు! స్పిన్ ఎటు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. దీంతో రాంచీ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. మూడో రోజు ఆటలో 13 వికెట్లు రాలితే... ఇందులో 12 స్పిన్ వలలోనే చిక్కాయి. ఈ నేపథ్యంలో భారత్ ముందు ఊరించే 192 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ... ఇంకా 152 పరుగుల దూరం స్పిన్ టర్న్ దృష్ట్యా భారత్‌కు అంత సులభం కాదు. భారత బ్యాటర్లు స్పిన్‌కు నిలబడితే సిరీస్ 3–1తో మన సొంతమవుతుంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు 10 వికెట్లు తీస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది. రాంచీ: మూడో రోజు పూర్తిగా స్పిన్ మలుపు తీసుకున్న నాలుగో టెస్టులో భారత్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన టీమిండియా... ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్‌ను 150 పరుగుల్లోపే కూల్చేసింది. ఈ మ్యాచ్ గెలిచేందుకు, సిరీస్ చేజిక్కించుకొనేందుకు 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ (24 బ్యాటింగ్), యశస్వి (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ 152 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట సాగిందిలా... ఓవర్‌నైట్ స్కోరు 219/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 103.2 ఓవర్లలో 307 పరుగుల వద్ద ఆలౌటైంది. ధ్రువ్ జురెల్ (149 బంతుల్లో 90; 6 ఫోర్లు, 4 సిక్స్) అద్భుతమైన పోరాటం చేశాడు. ఓవర్‌నైట్ సహచరుడు కుల్దీప్ (131 బంతుల్లో 28; 2 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన జురెల్ తొలి అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే జురెల్ సెల్యూట్ చేసి మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తన నాన్నకు ఈ అర్ధ సెంచరీ అంకితమిచ్చాడు. 253 స్కోరు వద్ద కుల్దీప్ అవుటైనా... అప్పు డే జట్టు ఆలౌట్ కాలేదు. ఆకాశ్‌దీప్ (9)తో తొమ్మి దో వికెట్‌కు 40 పరుగులు జతచేసి జట్టు స్కోరు 300 దాటాకే జురెల్ అవుటయ్యాడు. మూడో రోజు భారత్ 88 పరుగులు చేస్తే అందులో 68 పరుగులు జురెలే సాధించి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ కూలిందిలా... తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ లంచ్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే తొలి ఓవర్ నుంచే కెపె్టన్ రోహిత్ ఇంగ్లండ్ మెడకు అశ్విన్‌తో స్పిన్ ఉచ్చు బిగించాడు. ఇది ఐదో ఓవర్ నుంచి ఫలితాల్ని ఇవ్వడంతో ఇంగ్లండ్ కుదేలైంది. ఐదో ఓవర్లో అశ్విన్ ఓపెనర్ డకెట్ (15), పోప్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ క్రాలీ (91 బంతుల్లో 60; 7 ఫోర్లు) అశ్విన్, జడేజా, కుల్దీప్ల స్పిన్ త్రయానికి కాసేపు ఎదురునిలిచాడు. కానీ ఈ లోపే రూట్ (11)ను అశ్విన్, అర్ధ శతకం తర్వాత క్రాలీ, స్టోక్స్ (4) వికెట్లను కుల్దీప్ పడేశాడు. జడేజా కూడా బెయిర్ స్టో (30)ను అవుట్ చేయడం ద్వారా 120/6 స్కోరు వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ బలగమంతా పెవిలియన్‌లో కూర్చుంది. మిగిలిన టెయిలెండర్లలో హార్ట్లీ (7), రాబిన్సన్ (0)లను కుల్దీప్ వెనక్కి పంపగా, అండర్సన్ (0)ను అవుట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌కు 145 పరుగుల వద్ద తెరదించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు భారత స్పిన్నర్లకే (అశ్విన్ 5/51; కుల్దీప్ 4/22; జడేజా 1/56) దక్కడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 60; డకెట్ 15; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 11; బెయిర్స్టోక్ (సి) పటిదార్ (బి) జడేజా 30; స్టోక్స్ (బి) కుల్దీప్ 4; ఫోక్స్ (సి అండ్ బి) అశ్విన్ 17; హార్ట్లీ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 7; రాబిన్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; బషీర్ (నాటౌట్) 1; అండర్సన్ (సి) జురెల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (53.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–19, 2–19, 3–65, 4–110, 5–120, 6–120, 7–133, 8–133, 9–145, 10–145. బౌలింగ్: అశ్విన్ 15.5–0–51–5, జడేజా 20–5–56–1, సిరాజ్ 3–0–16–0, కుల్దీప్ 15–2–22–4. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బ్యాటింగ్) 24; యశస్వి (బ్యాటింగ్) 16; మొత్తం (8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 40. బౌలింగ్: రూట్ 4–0–17–0, హార్ట్లీ 3–0–22–0, బషీర్ 1–0–1–0. -
IND VS ENG 4th Test: కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్
రాంచీ టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తొలుత భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం కుంబ్లే పేరిట ఉండిన అత్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును (భారత్ తరఫున) సమం చేశాడు. కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్ కేవలం 99 టెస్ట్‌ల్లోనే ఈ ఘనతను (35 ఐదు వికెట్ల ఘనతలు) సమం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్ దిగ్గజం మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్ తర్వాతి స్థానంలో రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్‌ల్లో 36 సార్లు) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్‌లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అశ్విన్ ఐదేయడంతో (5/51) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలి భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అశ్విన్‌తో పాటు కుల్దీప్ (4/22) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసి లక్ష్యానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అరుదైన మైలురాయిని అధిగమించిన రోహిత్ శర్మ
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4000 టెస్ట్ పరుగుల మార్కును తాకిన హిట్‌మ్యాన్.. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్‌కు ముందు సచిన్ (15921), ద్రవిడ్ (13265), గవాస్కర్ (10122), కోహ్లి (8848), లక్ష్మణ్ (8781), సెహ్వాగ్ (8503), గంగూలీ (7212), పుజారా (7195), వెంగ్సార్కర్ (6868), అజారుద్దీన్ (6215), గుండప్ప విశ్వనాథ్ (6080), కపిల్ దేవ్ (5248), రహానే (5077), ధోని (4876), మొహిందర్ అమర్నాథ్ (4378), గంభీర్ (4154) భారత్ తరఫున టెస్ట్‌ల్లో 4000 పరుగుల మైలురాయిని దాటారు. అత్యంత వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. ఈ మైలురాయిని వీరేంద్ర సెహ్వాగ్ అందరి కంటే వేగంగా చేరుకున్నాడు. వీరూ కేవలం 79 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకగా.. హిట్‌మ్యాన్‌కు 100 ఇన్నింగ్స్‌లు పట్టాయి. టెస్ట్ క్రికెట్లోకి ఆలస్యంగా అడుగుపెట్టన రోహిత్.. ఈ ఫార్మాట్లో 58 మ్యాచ్‌లు ఆడి 11 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 44.99 సగటున 4004 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని (262 మ్యాచ్‌ల్లో 10709) దాటిన రోహిత్.. టీ20ల్లో 4000 పరుగుల మార్కుకు 26 పరుగుల దూరంలో (151 మ్యాచ్‌ల్లో 3974 పరుగులు) ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు దాదాపుగా ఖరారైంది. మరో 152 పరుగులు చేస్తే భారత్ విజయఢంకా మోగిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఐదేసిన అశ్విన్.. టీమిండియాను ఊరిస్తున్న విజయం
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరో 152 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. And just like Ravichandran Ashwin started the innings,he ends it with a wicket as he gets yet another 5 wicket haul which gets him equal to the most with Anil Kumble(35th) ❤️🔥 a MODERN DAY LEGEND !!! #INDvENG • #Ashwin • #INDvsENG pic.twitter.com/iUWkXuKRQr— ishaan (@ixxcric) February 25, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. Two Wickets in the Over for Ravichandran Ashwin. pic.twitter.com/7bDGwD1L2x— CricketGully (@thecricketgully) February 25, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. MOST WICKETS IN TESTS IN INDIA...!!!!- One & only Ravichandran Ashwin. 🫡🇮🇳pic.twitter.com/R9ov9nk8za— Johns. (@CricCrazyJohns) February 25, 2024 -
IND VS ENG 4th Test: ఇంగ్లండ్‌ను మడతపెట్టిన అశ్విన్
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. యాష్ (5/51).. ఇంగ్లండ్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే మడతపెట్టాడు. అశ్విన్‌కు కుల్దీప్ యాదవ్ (4/22) తోడవ్వడంతో ఇంగ్లండ్ కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ కలుపుకుని ఇంగ్లండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఆకాశ్ దెబ్బ కొట్టినా... ఇంగ్లండ్ 'రూట్' మారింది
అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ పేస్‌కు... అశ్విన్, జడేజా స్పిన్‌కు... లంచ్ లోపే ఇంగ్లండ్ కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది . దాంతో టీ విరామం వరకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెర పడుతుందేమోననే సందేహం కలిగింది... కానీ అలా జరగలేదు. అనుభవజ్ఞుడైన జో రూట్ తన అసలు సిసలు ఆటతీరును ప్రదర్శించాడు... ఈ సిరీస్‌లో తమ జట్టు దూకుడైన ‘బజ్‌బాల్’ వ్యూహానికి భిన్నంగా ‘రూట్’ మార్చాడు... సంయమనంతో ఆడుతూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు... సహచరుడు ఫోక్స్ సహాయంతో రెండో సెషన్లో భారత బౌలర్లను కాచుకున్నాడు ...ఆ తర్వాత ఫోక్స్ వెనుదిరిగినా... రాబిన్సన్ అండగా నిలబడటంతో... రూట్ పట్టుదలతో ఆడుతూ వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్ స్కోరును 300 దాటించాడు. రాంచీ: సిరీస్ గెలిచేందుకు భారత్... సమం చేసేందుకు ఇంగ్లండ్... ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మొదలైన నాలుగో టెస్టు తొలిరోజు ఆట ఆసక్తికరంగా సాగింది. కొత్త పేసర్ ఆకాశ్ దీప్ (3/70) నిప్పులు చెరిగే బౌలింగ్ భారత్‌ను మురిపిస్తే... సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ శతకం ఇంగ్లండ్‌ను కుప్పకూలకుండా కాపాడింది. దీంతో పూర్తిగా ఎవరి పైచేయి లేకుండా తొలిరోజు ఆట సమఉజ్జీగా ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలీ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో బెన్ ఫోక్స్ (126 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. స్పిన్నర్లు జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ‘టాప్’లేపిన ఆకాశ్ ఈ సిరీస్‌లో భారత్ తరఫున నాలుగో ఆటగాడిగా అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి క్రాలీని ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ అది నోబాల్ కావడంతో ఆకాశ్ దీప్‌కు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత క్రాలీ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో క్రాలీ చెలరేగిపోయాడు. వరుసగా 4,4,4,6తో అదరగొట్టాడు. సాఫీగా సాగిపోతున్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆకాశ్ దీప్ దెబ్బ కొట్టాడు. పదో ఓవర్లో ఆకాశ్ రెండో బంతికి ఓపెనర్ డకెట్ (11)ను, నాలుగో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ (0)లను అవుట్ చేసి భారత శిబిరాన్ని సంబరంలో ముంచాడు. ఇదే జోరుతో తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 12వ) ఓపెనర్ క్రాలీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. 47/0తో ఉన్న ఇంగ్లండ్ ఆకాశ్ దెబ్బకు 57/3 స్కోరు వద్ద టాపార్డర్‌ను కోల్పోయింది. ఈ దశలో జో రూట్‌కు జతయిన బెయిర్‌స్టో (35 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. దీంతో వన్డేను తలపించేలా 20వ ఓవర్లోనే ఇంగ్లండ్ స్కోరు 100కు చేరింది. రెండో సెషన్ ఆరంభంలో బెయిర్‌స్టోను అశ్విన్ ఎల్బీగా పంపాడు. అంపైర్ తోసిపుచ్చినా... రివ్యూకు వెళ్లడంతో బెయిర్‌స్టో వికెట్ దక్కింది. కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (3)ను జడేజా వికెట్ల ముందు దొరక బుచ్చుకున్నాడు. అక్కడే 112/5 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది. అడ్డుకుని... ఆదుకున్నాడు ఒక్క సెషన్లోనే 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వెటరన్ బ్యాటర్ రూట్ అంతా తానై నడిపించాడు. బెన్ ఫోక్స్ అండతో రెండో సెషన్లో పరుగులు పేర్చాడు... వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో 108 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ సెషనంతా భారత సీమర్లు, స్పిన్నర్లు ఎంతగా కష్టపడినా రూట్, ఫోక్స్ జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. రెండో సెషన్లో 86 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఒక్క వికెట్‌ను సమర్పించుకోలేదు. ఆఖరి సెషన్లో ఎట్టకేలకు సిరాజ్ పేస్ పదును పెంచడంతో ఫోక్స్ ఆట ముగిసింది. ఆరో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హార్ట్లీ (13)ని సిరాజే అవుట్ చేయగా... రాబిన్సన్ (60 బంతుల్లో 31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో రూట్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇంకో వికెట్ చిక్కేదే కానీ... మూడో సెషన్లో అప్పటికే భారత జట్టు 3 రివ్యూలు అయిపోవడంతో రాబిన్సన్ బతికిపోయాడు. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో రాబిన్సన్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను అంపైర్ ధర్మసేన తిరస్కరించాడు. టీవీ రీప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. కానీ భారత జట్టుకు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాబిన్సన్ బతికిపోయాడు. ఇంత కష్టంలో అంత స్కోరు... ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో రూట్ అత్యధిక స్కోరు 29! కానీ ఈ మ్యాచ్ తన అనుభవాన్నంతా రంగరించి క్లాసిక్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో 57/3తో కష్టాల్లో పడిన ఇంగ్లండ్ లంచ్ విరామానికే 112/5 స్కోరు వద్ద సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇంకా రెండు సెషన్ల ఆటలో ఏ జట్టయినా ఆలౌట్ అయినా అవుతుంది. లేదంటే... కిందామీదా పడినా 200 నుంచి 240 పరుగులు చేయడానికి కష్టపడుతుంది. కానీ ఇన్నింగ్స్‌ను నడిపించిన రూట్ ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టు స్కోరును ఒక్కరోజులోనే 300 పైచిలుకు చేర్చడం అతని అసాధారణ పోరాటానికి నిదర్శనం! 100 ఇంగ్లండ్ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. గతంలో షేన్ వార్న్, డెన్నిస్ లిల్లీ, ట్రంబెల్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్ (ఆ్రస్టేలియా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), కొట్నీ వాల్‡్ష (వెస్టిండీస్) ఇంగ్లండ్‌పై 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. 8 అరంగేట్రం టెస్టులో నోబాల్‌పై తొలి వికెట్ తీసి దానిని దక్కించుకోలేకపోయిన ఎనిమిదో బౌలర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ (శ్రీలంక), మైకేల్ బీర్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), మార్క్ వుడ్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బిన్నీ (భారత్), టామ్ కరన్ (ఇంగ్లండ్), నసీమ్ షా (పాకిస్తాన్) కూడా ఉన్నారు. 313 టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 313 ప్లేయర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో ప్రస్తుత సిరీస్‌లోనే భారత్ నుంచి నలుగురు (రజత్ పటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్) అరంగేట్రం చేయడం విశేషం. 10 భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా జో రూట్ గుర్తింపు పొందాడు. రూట్ భారత్‌పై 10 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ (9– ఆ్రస్టేలియా), గ్యారీ సోబర్స్ (8–వెస్టిండీస్), వివియన్ రిచర్డ్స్ (8–వెస్టిండీస్), రికీ పాంటింగ్ (8–రికీ పాంటింగ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 31 టెస్టుల్లో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన అలిస్టర్ కుక్ (33) రికార్డును రూట్ సమం చేస్తాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) ఆకాశ్ దీప్ 42; డకెట్ (సి) జురెల్ (బి) ఆకాశ్ దీప్ 11; ఒలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 106; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 38; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 3; ఫోక్స్ (సి) జడేజా (బి) సిరాజ్ 47; హార్ట్లీ (బి) సిరాజ్ 13; రాబిన్సన్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 302. వికెట్ల పతనం: 1–47, 2–47, 3–57, 4–109, 5–112, 6–225, 7–245. బౌలింగ్: సిరాజ్ 13–3–60–2, ఆకాశ్‌దీప్ 17–0–70–3, జడేజా 27–7–55–1, అశ్విన్ 22–1–83–1, కుల్దీప్ 10–3–21–0, యశస్వి 1–0–6–0. -
IND VS ENG 4th Test: జో రూట్ ఖాతాలో మరో రికార్డు
రాంచీ టెస్ట్‌లో సెంచరీతో (106 నాటౌట్) కదంతొక్కిన జో రూట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 19000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. రూట్ 19000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 444 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం 444 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని విరాట్ కోహ్లి అందరికంటే వేగంగా చేరుకున్నాడు. కోహ్లి 399 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ల్యాండ్‌మార్క్‌ను రీచ్ అయ్యాడు.కోహ్లి తర్వాత సచిన్ టెండూల్కర్ (432), బ్రియాన్ లారా (433) అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న వారిలో ఉన్నారు. రాంచీ టెస్ట్‌లో సెంచరీతో రూట్ చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 31వ సెంచరీ, ఓవరాల్‌గా (అన్ని ఫార్మాట్లలో) 47 సెంచరీ పూర్తి చేసుకున్న రూట్.. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. తాజా సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND VS ENG 4th Test Day 1: మెరిసిన ఆకాశ్‌దీప్.. సెంచరీతో కదంతొక్కిన రూట్
రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో పర్యాటక ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. జో రూట్ కెరీర్లో 31వ టెస్ట్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి రోజు హైలైట్స్.. టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాశ్‌దీప్ అద్బుతమైన ఇన్ స్వింగర్‌తో జాక్ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆ బంతిని ఆకాశ్ క్రీజ్ దాటి సంధించడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆకాశ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. టెస్ట్ క్రికెట్లో ఓ ప్రత్యర్థిపై 1000 పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఇంగ్లండ్‌పై 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రూట్ చేసిన సెంచరీ టెస్ట్‌ల్లో అతనికి 31వది. అన్ని ఫార్మాట్లలో కలిపితే 47వది. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో (అన్ని ఫార్మాట్లలో) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్ (31), కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు. -
IND VS ENG 4th Test: రోహిత్ శర్మ సరసన చేరిన రూట్
రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుత భారత పర్యటనలో పేలవ ప్రదర్శనలతో ముప్పేట దాడిన ఎదుర్కొన్న రూట్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీని రూట్ జట్టు కష్ట సమయం ఉన్నప్పుడు సాధించాడు. తాజా సెంచరీతో రూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో రూట్‌కు ఇది 31 సెంచరీ. అన్ని ఫార్మాట్లలో ఇది 47 శతకం. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు. తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగు చేసుకున్నాడు. ఫాబ్ ఫోర్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ (31) మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్, కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND VS ENG 4th Test: చరిత్ర సృష్టించిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (91) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ (90) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్ జట్టు కష్టాల్లో (47/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి అర్దసెంచరీ సాధించాడు. ప్రస్తుతం అతను 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. కెరీర్లో 139వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రూట్.. 30 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సాయంతో 11560 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉంది. కుక్ తన 161 మ్యాచ్‌ల కెరీర్లో 33 సెంచరీలు, 57 అర్దసెంచరీల సాయంతో 12472 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3) ఔట్ కాగా.. రూట్ (67), బెన్ ఫోక్స్ (28) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
సిరీస్ లక్ష్యంగా...
ఐదుటెస్టుల సిరీస్‌లో భారత్ మూడో టెస్టుతో పైచేయి సాధించింది. ఇప్పుడు రాంచీలో సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ బృందానికి ఇప్పుడు యువ ఆటగాళ్లే బలంగా మారారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ అవకాశాల్ని బాగా అందిపుచ్చుకున్నారు. ఇపుడు ఇదే బలగంతో ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను ఇక్కడే ముగించాలని టీమిండియా ఆశిస్తోంది. రాంచీ: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా రెండు, మూడు టెస్టుల్లో గెలిచింది. రెండో టెస్టులో బుమ్రా పేస్, మూడో టెస్టులో జడేజా స్పిన్ కీలక భూమిక పోషిస్తే... ఈ రెండు టెస్టుల్లోనూ యువ సంచలనం యశస్వి డబుల్ సెంచరీలు కామన్‌గా కలిసొచ్చాయి. రోహిత్, గిల్‌లతో టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డరే అనుభవలేమితో ఉంది. రజత్ పటిదార్‌కు రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశమిచ్చి నా ఏమాత్రం మెప్పించలేకపోయాడు. గత మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరూపించుకున్నాడు. జడేజా శతకం మిడిలార్డర్‌ను నిలబెట్టింది. బుమ్రా లేని పేస్ బౌలింగ్‌కు తొలిసారిగా సిరాజ్ పెద్దదిక్కయ్యాడు. ఇన్నాళ్లు షమీ, బుమ్రాలతో బంతిని పంచుకునే అతను రాంచీలో ప్రధాన పేసర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. స్పిన్ వికెట్ కాబట్టి ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లు బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది. గురువారం నెట్స్‌లో ఆకాశ్‌దీప్ గంటల తరబడి శ్రమించాడు. ఒకవేళ సిరాజ్‌కు జోడీగా అతన్ని పరిశీలించవచ్చు. సమం కోసం ఇంగ్లండ్ సమరం ప్రస్తుత భారత్‌తో పోలిస్తే స్టోక్స్, రూట్, డకెట్, క్రాలీ, పోప్, అండర్సన్‌లతో కూడిన ఇంగ్లండే అనుభవజు్ఞలతో మేటిగా ఉంది. అయినాసరే సిరీస్ లో భారత కుర్రాళ్ల జోరుకు కళ్లెం వేయలేక డీలా పడుతోంది. రాజ్‌కోట్‌లో అయితే మొదటి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన స్టోక్స్ సేన రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి చేతులెత్తేసింది. రూట్, ఒలీ పోప్, బెయిర్‌స్టోల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. చాన్నాళ్ల తర్వాత కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ వేసేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. గతేడాది యాషెస్ సిరీస్ మధ్యలోనే మోకాలి గాయం వల్ల స్టోక్స్ పూర్తిగా బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. గత జూన్ నుంచి బౌలింగ్‌కే దిగలేదు. ఇప్పుడు మాత్రం బంతిపట్టే యోచనలో పడ్డాడు. వరుస మ్యాచ్‌ల ఓటమిలతో ఇంగ్లండ్ తుది జట్టులో మార్పులు చేసింది. లెగ్ స్పిన్నర్ రేహన్ అహ్మద్ స్థానంలో ఆఫ్‌స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను హార్ట్లీకి జోడీగా బరిలోకి దించుతోంది. మార్క్ వుడ్‌ను తప్పించి రాబిన్సన్ను తుది జట్టులోకి తీసుకున్నారు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, శుబ్‌మన్ గిల్, పటిదార్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, జడేజా, అశ్విన్, సిరాజ్, కుల్దీప్, ముకేశ్/ఆకాశ్‌దీప్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, ఒలీ పోప్, జో రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, హార్ట్లీ, బషీర్, రాబిన్సన్, అండర్సన్. -
IND VS ENG 4th Test: పాటిదారా.. పడిక్కలా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్‌కు అర్హత కోల్పోయాడు. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్‌లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్‌కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్‌దత్ పడిక్కల్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్మెంట్ జట్టు పీక్కుంటుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్‌ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్‌కు పాటిదార్‌పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, పాటిదార్‌తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్‌దీప్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్‌లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. నాలుగో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్ -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ రెండు భారీ మైలురాళ్లపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ మరో 23 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 4000 పరుగుల మార్కును చేరుకుంటాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో ఏడు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ 57 టెస్ట్‌ల్లో 45.2 సగటున 3978 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఖాతాలో 11 టెస్ట్ శతకాలు, 16 అర్దశతకాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో రోహిత్ 470 మ్యాచ్‌లు ఆడి 593 సిక్సర్లు బాదాడు. కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో (మూడు మ్యాచ్‌ల అనంతరం) కొనసాగుతుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో, రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా వరుస విజయాలు సాధించింది. ఈ సిరీస్‌కు సంబంధించి రోహిత్ స్కోర్ల విషయానికొస్తే.. హిట్‌మ్యాన్ 6 ఇన్నింగ్స్‌లు ఆడి 40 సగటున సెంచరీ సాయంతో 240 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్ సహచర ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. యశస్వి ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 109 సగటున రెండు డబుల్ సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 545 పరుగులు చేశాడు. -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ..?
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. సిరాజ్‌కు జతగా బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులో ఉంటాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ముకేశ్ కుమార్ కంటే ఆకాశ్‌దీపే బెటర్ అని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఆకాశ్ దీప్ మెరుగైన ప్రదర్శన చేయడమే అభిమానుల ఛాయిస్‌కు కారణంగా తెలుస్తుంది. ఆకాశ్ దీప్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున, దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అద్భుతంగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశ్‌దీప్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో ఆకాశ్ ఆడిన 30 మ్యాచ్‌ల్లోనే 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత రంజీ సీజన్లోనూ ఆకాశ్ అదరగొట్టాడు. ఇటీవల బీహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆకాశ్ 10 వికెట్ల ప్రదర్శనతో విజృంభించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. దీనికి ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లోనూ ఆకాశ్ సత్తా చాటాడు. ఆ సిరీస్‌లో ఆకాశ్ 16.75 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలకు తోడు ముకేశ్‌తో పోలిస్తే ఆకాశ్ వేగవంతమైన బౌలర్ కావడంతో అతనికే అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ సైతం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ముకేశ్ కుమార్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక నాలుగో టెస్ట్ రేసులో వెనుకపడ్డాడు. ముకేశ్ విశాఖ టెస్ట్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడంతో మేనేజ్మెంట్కు సెకెండ్ ఛాయిస్‌గా మారాడు. పై పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆకాశ్ దీప్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖయమనే అనిపిస్తుంది. ఆకాశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇది తొలిసారి కాదు. తాజా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్లు విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లేకపోయినా టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుండగా.. ఐదో టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్‌మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్‌కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్‌పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్‌ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లు అయిపోయాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
కేఎల్ రాహుల్ అవుట్
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా గత రెండు టెస్టులు ఆడని రాహుల్ కోలుకున్నాడని... ఈనెల 23 నుంచి జరిగే రాంచీ టెస్టులో ఆడతాడని వార్తలు వచ్చాయి. అయితే అతను పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో మరో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కోలుకుంటేనే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. మరోవైపు పని భారం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు... అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. రాజ్‌కోట్ టెస్టు ఆడని ముకేశ్ నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్.. స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు..!
టీమిండియాకు గుడ్ న్యూస్. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న నాలుగో టెస్ట్‌కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. గాయం కారణంగా గత రెండు టెస్ట్‌లకు (రెండు, మూడు) దూరంగా ఉన్న రాహుల్ ప్రస్తుతం ఎన్సీఏలో ఉంటూ పూర్తి ఫిట్నెస్ సాధించాడని తెలుస్తుంది. మోకాళ్ల సమస్యతో బాధపడుతున్న రాహుల్ వైద్యుల పర్యవేక్షణలో ఉండి పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు రాహుల్ అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా ప్రస్తావించాడు. రాహుల్ ఫిట్‌నెస్‌పై అప్డేట్ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించి అందుబాటులోకి వస్తే గత రెండు మ్యాచ్‌ల్లో అతనికి ప్రత్యామ్నాయంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న రజత్ పాటిదార్‌పై వేటు పడే అవకాశం ఉంది. పాటిదార్ గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయి ప్రభావం చూపించలేకపోయాడు. విశాఖ టెస్ట్‌లో (32, 9) కాస్త పర్వాలేదనిపించిన పాటిదార్.. రాజ్‌కోట్ టెస్ట్‌లో (5, 0) పూర్తిగా తేలిపోయాడు. కాగా, రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మూడో టెస్ట్‌కు ముందు అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్దత పడిక్కల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు, మూడు టెస్ట్‌లను గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. నిన్న ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన విశాఖ టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో గెలవగా.. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గట్టెక్కింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు జరుగుతుంది. -
ఆసీస్‌దే ‘యాషెస్’ సిరీస్
మాంచెస్టర్: నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్‌లో సజీవంగా ఉండాలని ఆశించిన ఇంగ్లండ్ జట్టుపై వరుణ దేవుడు కరుణించలేదు. ఎడతెరిపిలేని వాన కారణంగా ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టులో ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 214/5తో మరో 61 పరుగులు వెనుకంజలో నిలిచింది. ఐదో రోజు త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్ చేసి విజయంపై ఇంగ్లండ్ కన్నేసింది. కానీ వర్షం కారణంగా ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుత ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ్రస్టేలియా 2–1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో ఇంగ్లండ్ నెగ్గినా సిరీస్ 2–2తో సమంగా ముగుస్తుంది. అయితే క్రితంసారి యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా గెలుపొందడంతో ఈసారీ ఆ జట్టు వద్దే యాషెస్ సిరీస్ ట్రోఫీ ఉంటుంది. -
లబుషేన్ సెంచరీ.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్‌నైట్ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడిన మార్నస్ లబుషేన్ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ మార్ష్ (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్’ను నిలబెట్టుకుంటుంది. -
పట్టు బిగించిన ఇంగ్లండ్
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో విజయంపై ఇంగ్లండ్ గురి పెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సరికి ఆ్రస్టేలియా ఇన్నింగ్స్ ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియా ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. వార్నర్ (28), ఖ్వాజా (18), స్మిత్ (17), హెడ్ (1) పెవిలియన్ చేరగా...లబుషేన్ (44 నాటౌట్), మార్ష్ (1 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 384/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (61), బెన్ స్టోక్స్ (51) అర్ధ సెంచరీలు సాధించగా...జానీ బెయిర్‌స్టో (81 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. హాజల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టగా, గ్రీన్, స్టార్క్ చెరో 2 వికెట్లు తీశారు. 99 వద్ద నాటౌట్‌గా ముగించిన ఏడో బ్యాటర్‌గా బెయిర్‌స్టో నిలిచాడు. -
ఇంగ్లండ్ దూకుడు
మాంచెస్టర్: ఆ్రస్టేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు అదరగొట్టింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 384 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 67 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్ జాక్ క్రాలీ (182 బంతుల్లో 189; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆసీస్ బౌలర్ల భరతంపట్టి త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. మొయిన్ అలీ (82 బంతుల్లో 54; 7 ఫోర్లు), జో రూట్ (95 బంతుల్లో 84; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (14 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 299/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 18 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయి 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లు... బ్రాడ్ 2 వికెట్లు తీశారు. -
Ashes Series: నాలుగో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం
మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్‌లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లను బరిలోకి దించుతుంది. మూడో టెస్ట్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్‌కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్‌వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
సిరీస్ మనదే.. చివరి టెస్ట్ ‘డ్రా’.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా
ఆఖరి రోజు ఏ మలుపూ లేదు. ఆలౌట్ చేయడం మన బౌలర్ల వల్ల కాలేదు. బ్యాటర్ల జోరులో ఏ మార్పూ లేదు. చివరకు ఎలాంటి డ్రామా లేకుండా నాలుగో టెస్టు ‘డ్రా’ అయింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓ పది పరుగులు చేసుంటే ఇంకో ఈ టెస్ట్‌లో ఐదో సెంచరీ అయ్యేది. ఐదు రోజుల పాటు రోజుకో సెంచరీ చొప్పున ఈ మ్యాచ్‌కు అపూర్వ ఘనత దక్కేది. మరోవైపు క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్ట్‌లో శ్రీలంక ఓడిపోవడంతో ఈ మ్యాచ్ తుది ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించింది. అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్‌ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు కూడా బ్యాటర్స్ హవానే కొనసాగింది. దీంతో భారత బౌలర్లు శక్తికి మించి శ్రమించినా రెండు వికెట్లే పడగొట్టగలిగారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 78.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లబుషేన్ (213 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... స్పిన్‌తో భారత్‌కు సిరీస్ విజయాన్నిచ్చిన బౌలింగ్ ద్వయం అశ్విన్–రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. హెడ్ సెంచరీ మిస్... ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 3/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే ఓపెనర్ కునెమన్ (6) వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 14 పరుగుల వద్ద అతని వికెట్‌ను అశ్విన్ పడగొట్టగానే భారత శిబిరం సంబరపడింది. ఇక మ్యాజిక్ షురూ అనుకుంటే... అక్కడి పిచ్ ‘అంతలేదు’ అన్నట్లుగా బ్యాటర్లకే సహకరించింది. దీంతో హెడ్, వన్‌డౌన్ బ్యాటర్ లబుషేన్ నింపాదిగా ఆడుకున్నారు. రిస్క్ తీసుకోకుండా ‘డ్రా’ కోసమే వాళ్లిద్దరు క్రీజుకు అతుక్కుపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత చెమటోడ్చినా తొలి సెషన్లో మరో వికెటే దొరకలేదు. 73/1 స్కోరు వద్ద లంచ్ విరామానికికెళ్లారు. అనంతరం రెండో సెషన్లో హెడ్ 112 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... మరికాసేపటి ఆసీస్ స్కోరు 100 పరుగులు దాటింది. హెడ్ అడపాదడపా బౌండరీలతో పరుగులు సాధించడంతో ఐదో రోజు కూడా సెంచరీ ఖాయమనిపించింది. కానీ హెడ్ అహ్మదాబాద్ టెస్టుకు ఆ అరుదైన అవకాశం ఇవ్వకుండా 90 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. లబుషేన్ 150 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, 158/2 వద్ద రెండో సెషన్ ముగిసింది. ‘డ్రా’ దిశగా సాగడంతో మూడో సెషన్లో 11 ఓవర్ల ఆటే ఆడారు. సిరీస్‌లో జరిగిన మూడు టెస్టుల్లోనూ 30 పైచిలుకు వికెట్లు మూడు రోజుల్లోనే రాలితే... ఆఖరి టెస్టు ఐదు రోజులు జరిగినా బౌలర్లు 22 వికెట్లను మించి పడగొట్టలేకపోయారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480; భారత్ తొలి ఇన్నింగ్స్: 571; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: కునెమన్ (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్ 6; హెడ్ (బి) అక్షర్ పటేల్ 90; లబుషేన్ (నాటౌట్) 63; స్టీవ్ స్మిత్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (78.1 ఓవర్లలో 2 వికెట్లకు డిక్లేర్డ్) 175. వికెట్ల పతనం: 1–14, 2–153. బౌలింగ్: అశ్విన్ 24–9–58–1, రవీంద్ర జడేజా 20–7–34–0, షమీ 8–1–19–0, అక్షర్ పటేల్ 19–8–36–1, ఉమేశ్ యాదవ్ 5–0–21–0, గిల్ 1.1–0–1–0, పుజారా 1–0–1–0. మరో మ్యాచ్ మిగిలుంది... అదే ఫైనల్! భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ అయితే ముగిసింది. కానీ ఇరుజట్ల మధ్య మరో ‘టెస్టు’ మిగిలుంది! అదేనండి... డబ్ల్యూటీసీ ఫైనల్. ఇక్కడ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చినట్లే ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్ ఎవరో కూడా తేలుతుంది. ఈ ఏడాది జూన్‌లో 7 నుంచి 11 వరకు లండన్‌లోని ది ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 16 సొంతగడ్డపై భారత జట్టుకిది వరుసగా 16వ టెస్ట్ సిరీస్ విజయం. 1 మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టి20) కనీసం 10 చొప్పున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి ఘనత. 50 భారత్ తరఫున తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు. కెరీర్లో 12 టెస్టులు ఆడిన అక్షర్ 2,205 బంతుల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా (2,465 బంతులు) పేరిట ఉన్న రికార్డును అక్షర్ సవరించాడు. 2 టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 37 సిరీస్‌లలో 10 సార్లు ఈ పురస్కారం గెల్చుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (62 సిరీస్‌లలో 11 సార్లు) అగ్రస్థానంలో ఉండగా... జాక్వస్ కలిస్ (61 సిరీస్‌లలో 9 సార్లు) మూడో స్థానానికి పడిపోయాడు. -
BGT 2023: గత నాలుగు సిరీస్‌ల్లో ఆసీస్‌కు ఇదే గతి..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్ పేలవ డ్రాగా ముగిసింది. ఆట ఆఖరి రోజు వికెట్ల వర్షం కురిసి, మ్యాచ్ భారత్‌వైపు మొగ్గు చూపుతుందని అంతా ఊహించినప్పటికీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చి నిరుత్సాహపరిచింది. మ్యాచ్ లాస్ట్ సెషన్ వరకు ఆసీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోగా.. భారత బౌలర్లు జీవం లేని పిచ్‌పై బౌలింగ్ చేసి అలిసి సొలసి నీరసించారు. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (90) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్ (63) అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ కాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలు చేయగా.. భారత తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (128), విరాట్ కోహ్లి (186) శతకాలతో అలరించారు. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, ఇక్కడ ఓ ఆసక్తికర విశేషమేమింటంటే.. భారత్ గత నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఇదే మార్జిన్‌తో కైవసం చేసుకుంటూ వచ్చింది. 2017లో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్‌కు మట్టికరిపించిన భారత్.. ఆతర్వాత 2018-19 సిరీస్‌లో, 2020-21 సిరీస్‌లో, తాజాగా BGT-2023లో ఆసీస్‌ను అదే 2-1 తేడాతో ఓడించి, ఆసక్తికర గణాంకాలను నమోదు చేసింది. ఈ అసక్తికర విషయాలతో పాటు భారత్ ఓ చెత్త రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో గడిచిన 10 ఏళ్లలో టీమిండియా తొలిసారి వరుసగా రెండు టెస్ట్‌ల్లో విజయం లేకుండా (తొలి రెండు టెస్ట్‌లో భారత్ విజయం, మూడో టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం, నాలుగో టెస్ట్ డ్రా) సిరీస్‌ను ముగించింది. -
IND VS AUS 4th Test Day 4: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
91 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్‌ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపలేదని ఆసీస్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్ హెడ్‌కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్‌పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 మంది ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది ఆసీస్ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. 186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 మ్యాచ్‌ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్‌లో భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది. -
IND VS AUS 4th Test: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు (టెస్ట్‌ల్లో) పడగొట్టిన విదేశీ బౌలర్‌గా ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డెరెక్ అండర్వుడ్ (16 టెస్ట్‌ల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కేఎస్ భరత్ (44) వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం లియోన్ ఖాతాలో 55 వికెట్లు (11 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. భారతగడ్డపై లియోన్ ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనతను, ఓ సారి 10 వికెట్లు ఫీట్‌ను సాధించాడు. లియోన్, అండర్వుడ్ తర్వాత భారత గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రిచీ బెనాడ్ (52), కోట్నీ వాల్ష్ (43), ముత్తయ్య మురళీథరన్ (40) మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు. భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా.. ప్రస్తుత భారత పర్యటనలో చెలరేగిపోతున్న నాథన్ లియోన్.. పలు ఆసక్తికర రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ రికార్డుతో పాటు భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా భారత్‌పై 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లియోన్.. 9 సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు 2 సార్లు 10 వికెట్ల ఘనత సాధించి 115 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారతపై ఏ స్పిన్నర్ ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. అలాగే భారత్‌పై అత్యధిక ఫైఫర్లు సాధించిన బౌలర్‌గాను లియోన్ రికార్డు నెలకొల్పాడు. భారత్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్‌కు ముందు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (139) మాత్రమే ఉన్నాడు. BGT-2023లో భీకర ఫామ్‌లో ఉన్న లియోన్.. 4 టెస్ట్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా లియోన్ ఖాతాలో 480 వికెట్లు (119 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. ఇందులో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత, 4 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (685), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (576), మెక్‌గ్రాత్ (563), వాల్ష్ (519) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (169), అక్షర్ పటేల్ (57) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. -
ఖాజా శతక జోరు
తొలి మూడు టెస్టులకు భిన్నంగా చివరి నాలుగో టెస్టు మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన జట్టు మొదటి రోజే ఆలౌట్ కాకపోవడం విశేషమైతే... ఒక బ్యాటర్ తొలి రోజే సెంచరీ సాధించడం మరో విశేషం. స్పిన్ పిచ్‌లపై చేతులెత్తేసిన బ్యాటర్లను చూసిన ఈ టెస్టు సిరీస్‌లో తొలిసారి బౌలర్లు కష్టపడ్డారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆఖరి టెస్టు పరుగుల మజా అందించనుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా అజేయ సెంచరీతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలిరోజును సంతృప్తికరంగా ముగించింది. అహ్మదాబాద్: తొలిరోజు ఆలౌట్. మూడో రోజుకల్లా ముగింపు! ఆ్రస్టేలియా ఆడినా... భారత్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసినా... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఇది షరామామూలే! కానీ ఆఖరి టెస్టు అలా మొదలవలేదు. మొతెరా వికెట్ బ్యాటర్లకు అవకాశమిచ్చింది. ఆలౌట్ కాదుకదా... కనీసం సగం వికెట్లు (5) అయినా ఆతిథ్య భారత బౌలర్లు పడగొట్టలేకపోయారు. ఇదే మరో నాలుగు రోజులు కొనసాగితే ఈ టెస్టు ఐదు రోజుల పాటు జరగడం ఖాయం! నాలుగో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. భారత పేసర్ షమీ 2 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు అశి్వన్, జడేజాలకు చెరో వికెట్ దక్కింది. ఆట నిలిచే సమయానికి ఖాజాతో పాటు కామెరాన్ గ్రీన్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ల శుభారంభం ఆ్రస్టేలియా ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 32; 7 ఫోర్లు), ఖాజా బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై యథేచ్చగా బ్యాటింగ్ చేశారు. అనుభవజ్ఞులైన పేసర్లలో షమీ రివర్స్ స్వింగ్‌తో వైవిధ్యం కనబరిస్తే... ఉమేశ్ యాదవ్ నిరాశపరిచాడు. ఇతని బౌలింగ్‌లో హెడ్ వన్డేను తలపించే ఆట ఆడాడు. హెడ్ కొట్టిన 7 ఫోర్లలో అరడజను ఉమేశ్ బౌలింగ్‌లోనే బాదాడు. అయితే అంతకు ముందు ఉమేశ్ బౌలింగ్‌లోనే హెడ్ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ భరత్ సులువైన క్యాచ్ వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. తొలి వికెట్‌కు 61 పరుగులు జతయ్యాక హెడ్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఓపెనింగ్ జోడీకి ముగింపు పలికాడు. తర్వాత లబుషేన్ (3)ను చక్కని డెలివరీతో షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ స్మిత్ క్రీజులోకి రాగా... 75/2 స్కోరు వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లారు. అనంతరం రెండో సెషనైతే బౌలర్లకు ఏమాత్రం కలిసి రాలేదు. ఖాజా, స్మిత్ ఆతిథ్య బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆట కొన సాగించారు. ఖాజా అజేయ శతకం మూడో వికెట్‌కు ఖాజా–స్మిత్ జోడీ అజేయంగా సాగడంతో వికెట్ పడకుండానే 149/2 స్కోరువద్ద రెండో సెషన్ ముగిసింది. వికెట్లు టపటపా రాలిన ఈ సిరీస్‌లో ఒక్క వికెట్ అయినా పడకుండా సెషన్ ముగియడం ఇదే తొలిసారి! అయితే ఆఖరి సెషన్ మొదలవగానే స్మిత్ (38; 3 ఫోర్లు) వికెట్‌ను జడేజా పడగొట్టడంతో 79 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హ్యాండ్స్కాంబ్ (17)ను షమీ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కామెరాన్ గ్రీన్ చూడచక్కని బౌండరీలతో స్కోరు బోర్డును పరుగుపెట్టించాడు. అతని అండతో ఖాజా టెస్టుల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి 9 ఓవర్లలో ఆసీస్ వేగంగా పరుగులు సాధించడంతో 54 పరుగులు వచ్చాయి. వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. మైదానంలో ప్రధానమంత్రులు తొలి రోజు ఆటలో భారత్, ఆ్రస్టేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్ ‘75 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రూ క్రికెట్’ అంటూ ప్రధాన ఆకర్షణగా మారారు. టెస్టు ఆరంభానికి ముందు వీరిద్దరు ప్రత్యేక వాహనంలో మైదానమంతా కలియతిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం ఇరు ప్రధానులు తమ జట్ల కెప్టెన్లకు ప్రత్యేక ‘క్యాప్’లను అందించగా, వేదికపై నలుగురూ చేతులు కలిపి నిలబడిన దృశ్యం హైలైట్‌గా నిలిచింది. తమ జట్ల ఆటగాళ్లతో కలిసి వీరిద్దరు జాతీయ గీతాలాపన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ను ప్రారంభించిన అనంతరం మాజీ క్రికెటర్లు గావస్కర్, లక్ష్మణ్ తదితరులతో మోదీ సంభాషించారు. ప్రెసిడెంట్స్ బాక్స్‌నుంచి ప్రధానులిద్దరూ కొద్ది సేపు టెస్టు మ్యాచ్ తొలి సెషన్‌ను వీక్షించగా...బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా జ్ఞాపికలు అందజేశారు. మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. అయితే కఠినమైన భద్రతా నిబంధనల కారణంగా తొలి రోజు ఆశించిన స్థాయిలో రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరు కాలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 32; ఉస్మాన్ ఖాజా బ్యాటింగ్ 104; లబుషేన్ (బి) షమీ 3; స్మిత్ (బి) జడేజా 38; హ్యాండ్స్కాంబ్ (బి) షమీ 17; గ్రీన్ బ్యాటింగ్ 49; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–151, 4–170. బౌలింగ్: షమీ 17–2–65–2, ఉమేశ్ 15–2–58–0, అశ్విన్ 25–8–57–1, జడేజా 20–2–49–1, అక్షర్ 12–4–14–0, అయ్యర్ 1–0–2–0. -
ఇరగదీసిన లంక బ్యాటర్లు.. టీమిండియా కొంపముంచుతారా ఏందీ..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొన్న విషయం విధితమే. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ ఆసక్తికర పరిస్థితుల నడుమ కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, టీమిండియా అభిమానులకు భయం పుట్టిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రోజు ఆటలో శ్రీలంక బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో భారత అభిమానుల్లో కలవరం మొదలైంది. ఒకవేళ లంక ఆటగాళ్లు ఇదే జోరును కొనసాగించి రెండో టెస్ట్‌ల్లో గెలిస్తే టీమిండియా ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయని కొందరు అభిమానులు బెంగపెట్టుకున్నారు. ఆసీస్‌పై నాలుగో టెస్ట్‌లో టీమిండియా గెలిస్తే ఈ సమస్య ఉండదు కాబట్టి, అహ్మదాబాద్ టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. -
IND VS AUS 4th Test: సెంచరీతో చెలరేగిన ఖవాజా.. తొలి రోజు ఆసీస్‌దే
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. తొలి రోజు ఆటలో టీమిండియాపై ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(104 నాటౌట్) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాయి. ఇక భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్ తలా వికెట్ సాధించారు. 170 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హ్యాండ్స్కాంబ్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు, మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ టీమిండియా ఎట్టకేలకు మూడో వికెట్ సాధించింది. 38 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి హ్యాండ్స్ కాంబ్ వచ్చాడు. 64 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు: 152/3 టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 149/2 (62) 60 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 145-2 హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఖ్వాజా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడిన ఉస్మాన్ ఖ్వాజా 146 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షమీ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును అందుకున్నాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 128/2గా ఉంది. ఖ్వాజా (56)తో పాటు స్టీవ్ స్మిత్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 100 దాటిన ఆసీస్ స్కోర్.. లంచ్ తర్వాత టీమిండియాకు లభించని ఫలితం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ఈ క్రమంలో ఆ జట్టు 42వ ఓవర్లో 100 పరుగుల మార్కు దాటింది. ఉస్మాన్ ఖ్వాజా (47) హాఫ్ సెంచరీ దిశగా సాగుతుండగా, స్టీవ్ స్మిత్ 12 పరుగుల బ్యాటింగ్ కొనసాగిస్తుతున్నాడు. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 105/2గా ఉంది. లంచ్ సమయానికి ఆసీస్ స్కోర్ 75/2, అశ్విన్, షమీకి తలో వికెట్ తొలి రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ట్రివిస్ హెడ్ (32), లబూషేన్ (3) ఔట్ కాగా, ఉస్మాన్ ఖ్వాజా (27), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. హెడ్‌ను అశ్విన్, లబూషేన్‌ను షమీ ఔట్ చేశారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. లబూషేన్ (3) ఔట్ జట్టు స్కోర్ 72 పరుగుల వద్ద ఉండగా ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో లబూషేన్ (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (26), స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ (32) ఔట్ 16వ ఓవర్ మూడో బంతికి ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (32) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 62/1. ఉస్మాన్ ఖ్వాజా (18), లబూషేన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 24/0, శ్రీకర్ భరత్ చెత్త వికెట్‌కీపింగ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 24/0గా ఉంది. శ్రీకర్ భరత్ చెత్త వికెట్‌కీపింగ్ కారణంగా ట్రవిస్ హెడ్‌కు లైఫ్ లభించింది. ఉమేశ్ బౌలింగ్‌లో హెడ్ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను భరత్ నేలపాలు చేశాడు. అంతకుముందు ఆ తర్వాత కూడా భరత్ వికెట్ వెనకాల చాలా తప్పిదాలు చేసి అనసవర పరుగులిచ్చాడు. ఇషాన్ కిషన్‌ను కాదని భరత్‌ను వరుసగా నాలుగో టెస్ట్‌లో కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాల్టి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేయగా.. ఆసీస్ మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించింది. సిరాజ్ స్థానంలో షమీ జట్టులో చేరాడు. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. 75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంకు విచ్చేశారు. ఇరువురు దేశ ప్రధానులు ప్రత్యేక వాహనంలో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్‌కు ముందు మోదీ, అల్బనీస్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. అనంతరం మోదీ, అల్బనీస్ కలిసి కాసేపు కామెంట్రీ చెప్పే అవకాశం ఉంది. -
చివరి పంచ్ ఎవరిదో!
బోర్డర్–గావస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో భారత జట్టు ఆటను చూస్తే 4–0 ఖాయమనిపించింది. అయితే ఒక్కసారిగా పుంజుకున్న ఆ్రస్టేలియా మూడో టెస్టు గెలవడంతో పాటు చివరి మ్యాచ్‌ను కూడా ఆసక్తికరంగా మార్చేసింది. అన్ని రంగాల్లో ప్రత్యర్థికంటే పైచేయిగానే కనిపిస్తున్నా నాలుగో టెస్టులో రోహిత్ సేన విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. గత మ్యాచ్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో స్మిత్ బృందం సానుకూల దృక్పథంతో పోరుకు సై అంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో సిరీస్‌కు ఆసక్తికర ముగింపు ఖాయం. ఇరు దేశాల ప్రధానమంత్రులు హాజరు కానుండటం కూడా తొలి రోజు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. అహ్మదాబాద్: టెస్టు క్రికెట్లో అత్యంత హోరాహోరీ సమరాల్లో ఒకటైన భారత్, ఆ్రస్టేలియా పోరు చివరి అంకానికి చేరింది. సిరీస్‌లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ గెలిచి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉండగా... గత కొన్నేళ్లలో ఏ పర్యాటక జట్టుకూ సాధ్యంకాని రీతిలో సిరీస్‌లో రెండు టెస్టులు నెగ్గిన ఘనతను సొంతం చేసుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఇండోర్ టెస్టు అనుభవం దృష్ట్యా టీమిండియా పూర్తిగా స్పిన్ పిచ్ వైపు మొగ్గు చూపకపోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. భరత్ చోటు పదిలం! ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు చూస్తే భారత బ్యాటర్లకు బాగానే పరీక్ష పెట్టింది. రోహిత్ మినహా మరెవరూ సెంచరీ సాధించలేకపోగా, పుజారా ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. కోహ్లి అయితే అది కూడా లేదు. బౌలర్ల చలవతో రెండు టెస్టుల్లోనూ భారత్ విజయాన్ని అందుకోగలిగింది. ఇంకా చెప్పాలంటే అక్షర్ పటేల్ చేసిన రెండు అర్ధసెంచరీలు, జడేజా హాఫ్ సెంచరీ జట్టును ఆదుకున్నాయి. లోయర్ ఆర్డర్ భాగస్వామ్యం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్లంతా ఈ మ్యాచ్‌లోనైనా తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాలా కాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న కోహ్లి తన సత్తా చాటేందుకు ఇదే సరైన అవకాశం. గిల్ కూడా తనకు దక్కిన అవకాశాన్ని వాడుకోవాల్సి ఉంది. మరోవైపు వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్‌ను తప్పించి ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. అయితే మీడియా సమావేశంలో రోహిత్ చెప్పినదాన్ని బట్టి చూస్తే భరత్ కొనసాగడం ఖాయం. భరత్ బ్యాటింగ్ సంతృప్తికరంగా లేకపోయినా... బ్యాటింగ్‌లో సమష్టి వైఫల్యం కనిపిస్తున్నప్పుడు ఒక్క భరత్‌నే నిందించడంలో అర్థం లేదనే కారణంతో పాటు కీపర్‌గా మెరుగైన నైపుణ్యం ఉండటం భరత్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో జట్టులో ఒక మార్పు చోటు చేసుకోవచ్చు. గత టెస్టులో విశ్రాంతి తీసుకున్న షమీ నేరుగా రానుండగా... అతని కోసం సిరాజ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఉమేశ్ ఇండోర్ టెస్టులో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మైదానంలో ఆడిన రెండు టెస్టుల్లోనే 20 వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌పై అందరి దృష్టీ నిలిచింది. ఈ మైదానం అతనికి సొంత గ్రౌండ్ కూడా కావడం విశేషం. మార్పుల్లేకుండా... గెలిచిన జట్టులో మార్పులు చేయకూడదనేది సహజ సూత్రం. అరుదైన విజయం సాధించిన ఆస్ట్రేలియా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. స్పిన్‌కు మరీ అనుకూలించే పిచ్ కాకపోయినా ముగ్గురు స్పిన్నర్లు లయన్, మర్ఫి, కునెమన్లను కంగారూ టీమ్ మేనేజ్మెంట్ నమ్ముకుంది. అదనపు బ్యాటర్ కోసం ప్రధాన పేసర్ స్టార్క్‌ను పక్కన పెట్టే ప్రతిపాదన వచ్చినా... మరీ ఒక్క పేసర్ కూడా లేకుండా ఆడటం జట్టును లోపంగా మారవచ్చు. స్టార్క్‌తో పాటు గ్రీన్‌లాంటి మీడియం పేస్ ఆల్‌రౌండర్ ఉండటంతో రెండో రెగ్యులర్ పేసర్ అవసరం లేదు. బ్యాటింగ్‌లోనైతే ఆసీస్ నిశ్చింతగా ఉంది. 1–8 స్థానాల వరకు ఎలాంటి మార్పు అవసరం లేకుండా ఆ జట్టు బ్యాటింగ్ బృందం నిలదొక్కుకుంది. ఉస్మాన్ ఖాజా ఈ సిరీస్‌లో అందరికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చగా... హెడ్, హ్యాండ్స్కాంబ్ రాణించారు. ఎన్నో అంచనాలతో భారత్‌లో అడుగు పెట్టిన లబుషేన్ ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. 2017 తరహాలో అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించకపోయినా స్మిత్ అందరికంటే కీలకం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అతని నాయకత్వం కారణంగానే ఆసీస్ గత మ్యాచ్ గెలిచింది. ఈ సారి అతను టీమ్‌ను ఎలా నడపిస్తాడనేది ఆసక్తికరం. ఆ ఇద్దరు అతిథులుగా... భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కలిసి నాలుగో టెస్టు తొలి రోజు ఆటను మైదానంలో వీక్షించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి సెషన్ సమయంలోనే వీరిద్దరు అక్కడ ఉంటారు. మరోవైపు ఈ మ్యాచ్ ప్రేక్షకుల హాజరులో కూడా కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఒకరోజు ఆటకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 91,112 ప్రస్తుతం రికార్డుగా ఉంది (2013 మెల్బోర్న్లో యాషెస్ టెస్టు). అయితే ఇప్పటి వరకు టికెట్ల అమ్మకాలను బట్టి చూస్తే మోదీ స్టేడియంలో కొత్త రికార్డు నమోదు కావచ్చు. పిచ్, వాతావరణం గత మూడు టెస్టులతో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలమైన పిచ్. స్పిన్ ప్రభావం ఉన్నా... మరీ మొదటి రోజునుంచే టర్న్ కాకపోవచ్చు. భారత్‌లో చాలా మైదానాల తరహాలో ఆట సాగుతున్నకొద్దీ నెమ్మదిస్తుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసుకోవడం సురక్షితం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి, శ్రేయస్, జడేజా, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, ఉమేశ్ యాదవ్. ఆ్రస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఖాజా, లబుషేన్, హ్యాండ్స్కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫి, నాథన్ లయన్, కునెమన్. -
ఇషాన్ కిషన్ వద్దు.. కేఎస్ భరత్‌ను పక్కకు పెట్టొద్దు, కోహ్లి, పుజారా ఏం చేశారని..?
BGT 2023 IND VS AUS 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతున్నదానిపై మేనేజ్మెంట్ ఇప్పటికే కొన్ని సంకేతాలు వదిలింది. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుందని, సిరాజ్ స్థానంలో షమీ, వికెట్‌కీపర్ కేఎస్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడే పరోక్షంగా క్లూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్‌కు ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. నాలుగో టెస్ట్‌లో భరత్‌ను పక్కకు పెట్టొదని జట్టు మేనేజ్మెంట్కు సూచించాడు. ఇషాన్ కిషన్ ప్రస్తావన తేకుండా భరత్‌ను తుది జట్టులో కొనసాగించాలని కోరాడు. బ్యాట్‌తో రాణించలేదన్న కారణంగా భరత్‌ను పక్కకు పెట్టడం సహేతుకం కాదని, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, పుజారా, శ్రేయస్ అయ్యర్ ఫెయిలైన చోట భరత్ బ్యాట్‌తో రాణించాలని ఆశించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. Do you agree with Aakash Chopra?#CricTracker #AakashChopra #INDvAUS pic.twitter.com/aiFlSw6u0M — CricTracker (@Cricketracker) March 8, 2023 ఢిల్లీ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. బ్యాట్‌తో ప్రతి ఇన్నింగ్స్‌లో రాణించడలేదని భరత్‌ను బెంచ్‌కు పరమితం చేస్తే, ఇంతకు మించిన అపహాస్యం ఇంకోటి ఉండదని అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే భరత్ వికెట్ల వెనక ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడని, బ్యాట్‌తో ప్రూవ్ చేసుకునేందుకు అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే మెరుగవుతాడని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగు మ్యాచ్‌ల BGT 2023లో ఇప్పటివరకు జరిగిన 3 టెస్ట్‌ల్లో భారత్ 2 (తొలి రెండు), ఆసీస్ ఒక మ్యాచ్ (మూడో టెస్ట్) గెలుపొందిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్‌ల్లో గెలిచి జోరుమీదుండిన భారత్.. అనూహ్యంగా మూడో టెస్ట్‌లో ఓటమిపాలై చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్‌లో నాథన్ లయోన్ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన భారత్.. మూడో టెస్ట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్‌లో లయోన్ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (197) పరిమితమైన ఆసీస్.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు భారత్.. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132 తేడాతో, రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్ అనంతరం భారత్, ఆసీస్‌లు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది. -
IND VS AUS 4th Test: చారిత్రక రికార్డుపై కన్నేసిన టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తు కూడా ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ సేన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని ఓ చారిత్రక రికార్డుపై కూడా కన్నేసింది. 2013 నుంచి స్వదేశంలో వరుసగా 15 టెస్ట్ సిరీస్‌లు గెలిచిన భారత్.. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో విజయం సాధించినా లేక కనీసం డ్రా చేసుకున్నా, సొంతగడ్డపై వరుసగా 16వ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్ ఏ ఇతర జట్టు కూడా స్వదేశంలో వరుసగా ఇన్ని టెస్ట్ సిరీస్‌లు గెలిచింది లేదు. ఈ విషయంలో ఏ జట్టు కూడా కనీసం టీమిండియా దరిదాపుల్లో లేదు. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై రెండుసార్లు వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది కానీ, టీమిండియా తరహాలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచింది లేదు. ఈ జాబితాలో స్వదేశంలో 8 వరస సిరీస్ విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉంది. గత పదేళ్లలో భారత్ స్వదేశంలో 45 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. 36 మ్యాచ్‌ల్లో గెలుపొంది, కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, BGT-2023లో తొలి రెండు టెస్ట్‌ల్లో గెలుపొంది, 4 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేలా కనిపించిన రోహిత్ సేన అనూహ్యంగా మూడో టెస్ట్‌లో ఆసీస్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్‌లో నాథన్ లయోన్ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన భారత్.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్‌లో లయోన్ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (197) పరిమితమైన ఆసీస్.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు భారత్.. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132 తేడాతో, రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్ అనంతరం భారత్, ఆసీస్‌లు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది. -
షమీ వచ్చేస్తున్నాడు, నంబర్ వన్ బౌలర్‌పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన టీమిండియా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడేజా, అశ్విన్, ఉమేశ్ యాదవ్ ప్రదర్శనలు మినహా, టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి రెండు టెస్ట్‌ల్లో ఓ మోస్తరుగా రాణించిన మహ్మద్ షమీని ఉమేశ్ యాదవ్‌కు ఓ అవకాశం ఇవ్వడం కోసం మూడో టెస్ట్‌లో బెంచ్‌కు పరిమితం చేసింది మేనేజ్మెంట్. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉమేశ్ బంతితో పాటు బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపించి, నాలుగో టెస్ట్‌లో చోటు పక్కా చేసుకున్నాడు. మూడో టెస్ట్‌లో ఓటమి నేపథ్యంలో పోస్ట్‌మార్టం చేసుకుంటున్న టీమిండియా.. నాలుగో టెస్ట్‌లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా షమీని తిరిగి ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకురావాలని భావిస్తున్న మేనేజ్మెంట్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించని మహ్మద్ సిరాజ్‌పై వేటు వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే మూడు టెస్ట్‌ల్లో ఏ మాత్రం ఆకట్లుకోని వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్‌ను తప్పించి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం కల్పించాలని ద్రవిడ్ అండ్ కో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా రెండు మార్పులతో నాలుగో టెస్ట్ బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరో 5 రోజుల్లో (మార్చి 9) అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్ట్‌లో భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఐదు రోజుల్లో గాయాల పరంగా ఎలాంటి కంప్లైంట్స్ రాకపోతే, ఈ రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగో టెస్ట్ సమయానికంతా సిద్ధంగా ఉంటాడని ఆసీస్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా తెలిపింది. మూడో టెస్ట్‌లో వేలి గాయంతో ఇబ్బంది పడిన స్టార్క్ స్థానంలో కమిన్స్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ ఒక్క మార్పు మినహాయించి మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన జట్టునే ఆసీస్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. -
BGT 2023: ఆసీస్‌తో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత-ఆస్ట్రేలియా జట్లు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు పూర్తి కాగా రెండిటిలో టీమిండియానే గెలుపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి కొనసాగుతోంది. గతంలో మొదటి రెండు టెస్ట్‌లకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు ఇవాళ (ఫిబ్రవరి 19) మూడు, నాలుగు టెస్ట్‌లతో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టునే యధాతథంగా కొనసాగించారు. మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు జరుగనుండగా.. నాలుగో మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరుగనుంది. ఆసీస్‌తో మూడు, నాలుగు టెస్ట్‌లకు టీమిండియా.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ -
Aus Vs SA: ‘మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసింది’
Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్‌నుంచి టిమ్ పెయిన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్ ప్రైస్’లో గుర్తు చేసుకున్న పెయిన్... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు. ‘సిరీస్ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్‌పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్ చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్ చెప్పాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్‌లు దొరికేశారు కదా..! -
Ashes 4th Test: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ అద్భుత పోరాటం
యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు తృటిలో మరో ఓటమి నుంచి తప్పించుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఆఖరి రోజు తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు చివరి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. ఆఖర్లో స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్), జేమ్స్ అండర్సన్ (6 బంతుల్లో 0 నాటౌట్)లు వికెట్ కాపాడుకుని జట్టును వైట్‌వాష్ గండం నుంచి గట్టెక్కించారు. ఆసీస్ నిర్ధేశించిన 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ నష్టపోకుండా 30 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనను మరోసారి కొనసాగించింది. టాపార్డర్ మరోసారి దారుణంగా విఫలమైంది. ఓపెనర్ హసీబ్ హమీద్ (9) మరోసారి విఫలమవగా.. డేవిడ్ మలాన్ (4), జో రూట్ (24) వెంటవెంటనే నిష్క్రమించారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బెన్ స్టోక్స్ (123 బంతుల్లో 60), బెయిర్ స్టో (105 బంతుల్లో 41)లు ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. అయితే, మూడో సెషన్లో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ చేతులెత్తేసింది. బెయిర్ స్టో, జాక్ లీచ్ (34 బంతుల్లో 26)లు కాసేపు పోరాడాడు. 270 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోవడంతో అసలు టెన్షన్ మొదలైంది. చివరి రోజు ఆటలో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలుంది. ఆసీస్ గెలుపుకు ఒక వికెట్ కావాలి. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు తమ అనుభవాన్నంతా రంగరించి ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్‌కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఉస్మాన్ ఖ్వాజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, 5 టెస్ట్‌ల సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. స్కోర్ వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 416-8 డిక్లేర్డ్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 294 ఆలౌట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 265-6 డిక్లేర్డ్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 270-9 చదవండి: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
AUS Vs ENG 4th Test: స్టువర్ట్ బ్రాడ్ రికార్డు.. ఆసీస్ 126/3
యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటకు వరుణుడు ఆటంకంగా నిలిచాడు. దీంతో తొలి రోజు కేవలం 46.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వరుస అంతరాయాల నడుమ సాగిన ఈ ఇన్నింగ్స్‌లో లంచ్ విరామం తర్వాత 51 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(30) బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత జట్టు స్కోర్ 111 పరుగుల వద్ద ఉండగా మార్కస్ హ్యారిస్(38)ను ఆండర్సన్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే 117 పరుగుల వద్ద లబూషేన్(28)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు. ఈ సమయంలో వరుణుడు మళ్లీ అడ్డుపడడంతో అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపి వేశారు. క్రీజ్‌లో స్మిత్(6), ఖ్వాజా(4) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ వార్నర్‌ను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో వార్నర్‌ను అత్యధిక సార్లు(13) ఔట్ చేసిన బౌలర్‌గా తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. బ్రాడ్ తర్వాత వార్నర్‌ను అత్యధికంగా అశ్విన్, అండర్సన్‌లు పదేసి సార్లు ఔట్ చేశారు. చదవండి: శార్ధూల్ ఠాకూర్ పేరు ముందు "ఆ ట్యాగ్" వెనుక రహస్యమిదే..! -
సిరీస్ వేటలో టీమిండియా విజయబావుటా
ఇక భారత్ తాడో పేడో తేల్చుకోవాల్సిన పనిలేదు. ఒత్తిడిలో బరిలోకి దిగాల్సిన అవసరం పడదు. ఇంకో మ్యాచ్ మిగిలున్నా... ఈ సిరీస్ ఎక్కడికీ పోదు. ఆఖరి టెస్టు డ్రా చేసుకుంటే చాలు! ఐదు టెస్టుల సిరీస్ కోహ్లి సేనకే ఖాయమవుతుంది. ఈ బాటలోనే టీమిండియా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో విజయబావుటా ఎగరేసింది. ఈ వేదికపై 50 ఏళ్ల తర్వాత భారత టెస్టు నెగ్గడం విశేషం. బుమ్రా పదునెక్కిన పేస్, జడేజా స్పిన్ మ్యాజిక్, శార్దుల్ కీలక వికెట్లు, ఉమేశ్ ఫినిషింగ్ స్పెల్ ఇంగ్లండ్‌పై భారత్‌కు ఘనవిజయాన్ని కట్టబెట్టింది. లండన్: ఇంగ్లండ్ ముందున్నది కష్టసాధ్యమైన లక్ష్యమే! అయితే సోమవారం ఉదయం 100 పరుగుల దాకా వికెట్ కోల్పోని ఇంగ్లండ్... మరో 110 పరుగులు చేసేసరికే అనూహ్యంగా అలౌటైంది. భారత బౌలర్లు సమష్టిగా శ్రమించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో... పట్టుసడలని ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. దీంతో నాలుగో టెస్టులో భారత్ 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. భారత సీమర్ బుమ్రా (22–9–27–2) అసాధారణ ప్రదర్శన చేశాడు. ఇతనికి స్పిన్నర్ జడేజా (2/50) జత కలిశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ పరుగు చేసేందుకు నాలుగు ఓవర్లు (65, 66, 67, 68) ఆడింది. కానీ... ఈ లోపే మూడు వికెట్ల (పోప్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ)ను కోల్పోయింది. చివరకు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 92.2 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు బర్న్స్ (50; 5 ఫోర్లు), హమీద్ (63; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్‌కు 2 వికెట్లు దక్కాయి. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. చివరిసారి 1971లో ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై టెస్టులో గెలిచిన భారత్ ఆ తర్వాత ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు ఆడి ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మూడింటిలో ఓడింది. ఎట్టకేలకు 50 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో భారత్ మళ్లీ విజయం రుచి చూసింది. ఈనెల 10 నుంచి మాంచెస్టర్‌లో చివరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. శార్దుల్ ఇచి్చన బ్రేక్‌తో... కఠినమైన 368 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బర్న్స్, హమీద్ సానుకూల ఆరంభమిచ్చారు. ఓవర్‌నైట్ స్కోరు 77/0తో ఆటకొనసాగించిన ఇంగ్లండ్ నింపాదిగా ఆడుతూ మూడంకెల స్కోరుకు చేరువైంది. శార్దుల్ వేసిన 41వ ఓవర్లో బర్న్స్ ఫిఫ్టీ (124 బంతుల్లో; 5 ఫోర్లు) పూర్తి చేసుకున్నాడు. జట్టు వంద పరుగులకు చేరింది. అంతలోనే బర్న్స్ వికెట్ కూడా పడింది. ఇవన్నీ మూడు బంతుల వ్యవధిలోనే జరిగిపోయాయి. తర్వాత జాగ్రత్తగా ఆడుతున్న హమీద్ అర్ధశతకం (123 బంతుల్లో 6 ఫోర్లు) సాధించాడు. అయితే లంచ్‌కుముందే మలాన్ (5) రనౌటయ్యాడు. విరామం తర్వాత అనూహ్యంగా జడేజా ... హమీద్‌ను బోల్తా కొట్టిస్తే, బుమ్రా తన రివర్స్ స్వింగ్‌తో ఒలీ పోప్ (2), బెయిర్‌స్టో (0)లను పడేశాడు. జడేజా కూడా పోటీ పడి మొయిన్ అలీ (0)ని డకౌట్ చేయడంతో ఇంగ్లండ్ 141/2 నుంచి 147/6 స్కోరుతో పతనం అంచులకు పడిపోయింది. ఈ సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెపె్టన్ రూట్ (36; 3 ఫోర్లు) ‘డ్రా’తో అయినా జట్టును కాపాడాలనుకున్నా శార్దుల్ ఆ అవకాశం ఇవ్వలేదు. టెయిలెండర్లు వోక్స్ (18), ఒవర్టన్ (10), అండర్సన్ (2)లను ఉమేశ్ కొత్త బంతితో బోల్తాకొట్టించడంతో ఇంగ్లండ్ పతనం పరిపూర్ణమైంది. 35 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఒకే సిరీస్‌లో రెండు టెస్టులు గెలిచింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: 466; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) పంత్ (బి) శార్దుల్ 50; హమీద్ (బి) జడేజా 63; మలాన్ (రనౌట్) 5; రూట్ (బి) శార్దుల్ 36; ఒలీ పోప్ (బి) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) బుమ్రా 0; మొయిన్ అలీ (సి) సబ్–సూర్యకుమార్ (బి) జడేజా 0; వోక్స్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 18; ఒవర్టన్ (బి) ఉమేశ్ 10; రాబిన్సన్ (నాటౌట్) 10; అండర్సన్ (సి) పంత్ (బి) ఉమేశ్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (92.2 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–100, 2–120, 3–141, 4–146, 5–146, 6–147, 7–182, 8–193, 9–202, 10–210. బౌలింగ్: ఉమేశ్ 18.2–2–60–3, బుమ్రా 22–9–27–2, జడేజా 30–11–50–2, సిరాజ్ 14–0–44–0, శార్దుల్ 8–1–22–2. తక్కువ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన భారత పేస్ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. బుమ్రా ఈ మైలురాయిని 24 టెస్టుల్లో అందుకున్నాడు. కపిల్ దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీశాడు. ఇర్ఫాన్ పఠాన్ (28 టెస్టుల్లో) మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (35 సార్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. తొలి మూడు స్థానాల్లో సచిన్ (76), కోహ్లి (57), గంగూలీ (37) ఉన్నారు. -
Ind Vs Eng: విజయానికి 291 పరుగుల దూరం.. పది పడాలి!
ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. లండన్: తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్ మళ్లీ మెరిశాడు 270/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతయ్యాక... జడేజా (17; 3 ఫోర్లు), రహానే (0)లను తన వరుస ఓవర్లలో వోక్స్ అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ కోహ్లి (44; 7 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఒవర్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత స్కోరు 312/6 కాగా... ఆధిక్యం 213 పరుగులు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న యువ ప్లేయర్లు రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ భారత్‌ను సురక్షిత స్థితిలో ఉంచే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ మొదట ఆచితూచిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. లంచ్ విరామానికి భారత్ స్కోరు 329/6గా ఉంది. లంచ్ తర్వాత శార్దుల్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడినంత ధాటిగా కాకపోయినా... ఇక్కడ కూడా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి పంత్ కూడా తోడవ్వడంతో భారత్ ఆధిక్యం 300 పరుగులు చేరుకుంది. ఈ క్రమంలో శార్దుల్ 65 బంతుల్లో మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. çఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా శార్దుల్ ఘనతకెక్కాడు. అనంతరం పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బుమ్రా (24; 4 ఫోర్లు) నిలబడటంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లి (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) (బి) వోక్స్ 17; రహానే (ఎల్బీ) (బి) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దుల్ ఠాకూర్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ యాదవ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (148.2 ఓవర్లలో ఆలౌట్) 466. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237, 4–296, 5–296, 6–312, 7–412, 8–414, 9–450, 10–466. బౌలింగ్: అండర్సన్ 33–10–79–1, రాబిన్సన్ 32–7–105–2, వోక్స్ 32–8–83–3, ఒవర్టన్ 18.2–3–58–1, మొయిన్ అలీ 26–0–118–2, రూట్ 7–1–16–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 77. బౌలింగ్: ఉమేశ్ 6–2–13–0, బుమ్రా 7–3–11–0, జడేజా 13–4–28–0, సిరాజ్ 6–0–24–0. -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు: ఇప్పటికైతే మొగ్గు మనవైపే!
లండన్: నాలుగో టెస్టులో తొలిసారి భారత్ ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, 1 సిక్స్) నిలబడి శతకంతో కదంతొక్కితే... చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెపె్టన్ విరాట్ కోహ్లి (22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లి, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరుకుంటుంది. రోహిత్ అదుర్స్... ఓవర్‌నైట్ స్కోరు 43/0తో శనివారం ఆటను కొనసాగించిన భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ నిలకడగా ఆడారు. బంతి కూడా పాతబడటంతో మన ఓపెనర్లను ఇంగ్లండ్ పేసర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే అండర్సన్ ఇంగ్లండ్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. అర్ధ సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్... అండర్సన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మొదట అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూకు వెళ్లిన ఇంగ్లండ్ వికెట్ సాధించుకుంది. ఈ దశలో క్రీజులోకి వచి్చన పుజారాతో కలిసి రోహిత్ భారత ఇన్నింగ్స్‌ను నిల బెట్టాడు. ముఖ్యంగా రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన రోహిత్ 204 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో విదేశీ గడ్డపై రోహిత్‌కిదే తొలి సెంచరీ కాగా... ఓవరాల్‌గా టెస్టుల్లో అతడికిది ఎనిమిదో శతకం. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ టెస్టుల్లో 3000 పరుగులను పూర్తి చేశాడు. మరో పక్క పుజారా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. అయితే కొత్త బంతిని తీసుకున్న రూట్... రాబిన్సన్ను బౌలింగ్‌కు పిలిచాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న రాబిన్సన్... 81వ ఓవర్లో రోహిత్, పుజారాలను అవుట్ చేసి ఇంగ్లండ్‌కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. దాంతో భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగింది. కానీ కోహ్లి, జడేజా సంయమనంతో ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వెలుతురు మందగించడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) క్రిస్ వోక్స్ (బి) రాబిన్సన్ 127; కేఎల్ రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) జేమ్స్ అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 22; జడేజా (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (92 ఓవర్లలో 3 వికెట్లకు) 270. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237. బౌలింగ్: జేమ్స్ అండర్సన్ 23–8–49–1, రాబిన్సన్ 21–4–67–2, క్రిస్ వోక్స్ 19–5–43–0, ఒవర్టన్ 10–0–38–0, మొయిన్ అలీ 15–0–63–0, జో రూట్ 4–1–7–0. -
అరుదైన ఫీట్.. దిగ్గజాల సరసన హిట్ మ్యాన్
ఓవల్: టీమిండియా డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఫీట్‌ను సాధించి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ (56 బంతుల్లో 20 బ్యాటింగ్; 2 ఫోర్లు).. అంతర్జాతీయ క్రికెట్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్(24,208), విరాట్ కోహ్లీ(22,999), సౌరవ్ గంగూలీ(18,575), ఎంఎస్ ధోనీ(17,266), వీరేంద్ర సెహ్వాగ్(17,253), మహమ్మద్ అజారుద్దీన్(15,593) రోహిత్(15,009) కన్నా ముందున్నారు. ఓవరాల్‌గా 15వేల మైలురాయి దాటిన జాబితాలో రోహిత్ 39వ స్థానంలో నిలిచాడు. 227 వన్డేల్లో 9,205 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. 43 టెస్ట్‌ల్లో 2935, 111 టీ20ల్లో 2864 రన్స్ చేశాడు. ఈ ఫీట్‌తో రోహిత్ మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగవంతంగా 15 వేల క్లబ్లో చేరిన ఐదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో కోహ్లీ(333 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉండగా.. సచిన్(356), ద్రవిడ్(368), సెహ్వాగ్(371) రోహిత్(397) కన్నా ముందున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు బౌలింగ్‌లో చెలరేగిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లో మొదట్లో తడబడినా ఆతర్వాత నిలదొక్కుకుంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(20), కేఎల్ రాహుల్(41 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఉన్నారు. చదవండి: ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు -
ఇంగ్లండ్‌దే ఆధిక్యం
లండన్: నాలుగో టెస్టులో మన పేస్ పైచేయి సాధిస్తుందనుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పట్టుదలే నిలిచింది. తొలి సెషన్ మొదట్లో ఉమేశ్ యాదవ్ (3/76) కసిదీరా బౌలింగ్ చేసి... ఇంగ్లండ్‌నూ తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయొచ్చనే ధీమా కలిగించాడు. కానీ ఒలీ పోప్ (81; 6 ఫోర్లు), క్రిస్ వోక్స్ (50; 11 ఫోర్లు) అర్ధసెంచరీలు టీమిండియా ఆశలపై నీళ్లుచల్లాయి. దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరికొచ్చేసరికి అనూహ్యంగా 99 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. మన వశమవుతుందనుకున్న ఆధిక్యం పరాధీనమైంది. ఓవర్‌నైట్ స్కోరు 53/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. ఇంకా 56 పరుగులు వెనుకబడే ఉంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5; హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మలాన్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 31; రూట్ (బి) ఉమేశ్ 21; ఒవర్టన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 1; పోప్ (బి) శార్దుల్ 81; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 37; మొయిన్ అలీ (సి) రోహిత్ (బి) జడేజా 35; వోక్స్ (రనౌట్) 50; రాబిన్సన్ (బి) జడేజా 5; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (84 ఓవర్లలో ఆలౌట్ ) 290. వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52, 4–53, 5–62, 6–151, 7–222, 8–250, 9–255, 10–290. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 19–2–76–3, బుమ్రా 21–6–67–2, శార్దుల్ 15–2–54–1, సిరాజ్ 12–4–42–1, జడేజా 17–1–36–2. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 20; రాహుల్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (16 ఓవర్లలో) 43/0. -
శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సెహ్వాగ్ రికార్డు సహా మరో రికార్డు బద్దలు
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని(31 బంతులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(32 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో నిలిచాడు. Shardul counter-attacks England in style and races to his 50 with a pull over square leg for 6. Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Shardul pic.twitter.com/pzGbUPnUI8 — Sony Sports (@SonySportsIndia) September 2, 2021 ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ దాన్ని అధిగమించాడు. 1986లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బోథమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక, 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ తన సుడిగాలి ఇన్నంగ్స్తో గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. రాబిన్సన్ వేసిన 60వ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్లో రెండో అర్థశతకం పూర్తి చేశాడు. శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) మినహా మరెవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం టీమిండియా బౌలర్లు కూడా చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి ఎదురీదుతోంది. బుమ్రా(2/15), ఉమేశ్(1/15) ఇంగ్లండ్ టపార్డర్ పతనాన్ని శాసించారు. చదవండి: అవిష్క సూపర్ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం -
ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..?
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 42 ఓవర్ బౌల్ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు రక్తపు గాయాలతో కనిపించాడు. రెండు మోకాళ్ల వద్ద ప్యాంట్ రక్తంతో తడిసిపోయింది. అయినప్పటికీ ఆండర్సన్ మైదానాన్ని వీడకుండా, తన కోటా ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ సన్నివేశం టీవీల్లో స్పష్టంగా కనిపించడంతో సోషల్‌మీడియాలో వ్యాప్తంగా ఆండర్సన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆట పట్ల ఈ వెటరన్ క్రికెటర్‌కు ఉన్న అంకితభావానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..? అంటూ మరికొందరు కొనియాడుతున్నారు. కాగా, ఈ గాయలు ఎప్పుడు తగిలాయన్నది టీవీల్లో కనబడలేదు. బహుళా ఫీల్డింగ్ చేసేటప్పుడు అతను ఈ గాయాల బారిన పడి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 191 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి(50), శార్దూల్ ఠాకూర్(57) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఆఖర్లో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా రివర్స్ కౌంటరిచ్చింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా చెలరేగిపోవడంతో ఇంగ్లీష్ జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డాడు. టీ విరామానికి ముందు ఇంగ్లండ్ స్కోర్ 11/2. చదవండి: అందుకే మనోళ్లు 'బ్లాక్ రిబ్బన్స్'తో బరిలోకి దిగారు.. -
అందుకే మనోళ్లు 'బ్లాక్ రిబ్బన్స్'తో బరిలోకి దిగారు..
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని బరిలోకి దిగారు. లెజండరీ కోచ్, ముంబై మాజీ ఆటగాడు వాసు పరంజపే అలియాస్ వాసుదేవ్ పరంజపే మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో బ్లాక్ ఆర్మ్ బాండ్స్‌తో బరిలోకి దిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. వాసు పరంజపే గత సోమవారం గుండెపోటుతో మరణించారు. వాసు క్రికెటర్‌గా అంతగా రాణించకపోయినా.. కోచ్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లను ఆయన తీర్చిదిద్దారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ , రాహుల్ ద్రవిడ్ , సచిన్ టెండుల్కర్, యువ్‌రాజ్ సింగ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లు ఆయన శిష్యరికంలోనే రాటుదేలారు. The Indian Cricket Team is sporting black armbands today to honour the demise of Shri Vasudev Paranjape.#TeamIndia pic.twitter.com/9pEd2ZB8ol — BCCI (@BCCI) September 2, 2021 ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 47 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి(50) మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్మెన్లంతా చేతులెత్తేశారు. రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17), పుజారా(4), జడేజా(10) దారుణంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ పేసర్లు వోక్స్, రాబిన్సన్ తలో రెండు వికెట్లు, ఆండర్సన్ ఓ వికెట్ పడగొట్టి టీమిండియాను దారుణంగా దెబ్బ కొట్టారు. చదవండి: ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లి.. సచిన్ రికార్డు బద్దలు -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లి.. సచిన్ రికార్డు బద్దలు
ఓవల్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన రన్ మెషీన్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 23,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్.. 522 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకోగా, కోహ్లి 440 మ్యాచ్‌ల్లో 490 ఇన్నింగ్స్‌లలో 55.28 సగటుతో ఈ మైలరాయిని క్రాస్ చేశాడు. ఇందులో 70 శతకాలు, 116 అర్ధ శతకాలు బాదాడు. ఇక ఫీట్‌ను పూర్తి చేయడానికి ఆసీస్ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్‌కు 544 ఇన్నింగ్స్ అవసరం కాగా, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ 551 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. వీరి తర్వాత శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(568 ఇన్నింగ్స్), ద వాల్ రాహుల్ ద్రవిడ్(576), శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే(645) వరుసగా ఈ మార్కును క్రాస్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 54 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17), పుజారా(4) పెవిలియన్ బాట పట్టగా విరాట్ కోహ్లి(18), రవీంద్ర జడేజా(2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్లు క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, ఆండర్సన్ తలో వికెట్ పడగొట్టి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు. అంతకుముందు ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, సామ్ కర్రన్ల స్థానంలో ఓలీ పోప్, క్రిస్ వోక్స్ బరిలోకి దిగగా, టీమిండియా ప్లేయర్స్ ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీల స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. చదవండి: 'స్టన్నింగ్ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు' -
తొలి రోజు ముగిసిన ఆట..ఇంగ్లండ్ 53/3
తొలి రోజు ముగిసిన ఆట..ఇంగ్లండ్ 53/3 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 191 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లదాటికి తక్కువ పరుగులకే భారత్ కుప్పకూలిపోయింది. చివర్లో శార్ధూల్ ఠాకూర్ మెరుపులతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 57 పరుగులను శార్థూల్ ఠాకూర్ నమోదు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్, శార్థూల్ మినహా ఇతర ప్లేయర్లు రాణించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులను నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. తరువాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ జట్టు కు ఆదిలోనే భారత్ పేసర్ బుమ్రా భారీ దెబ్బ కొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్లను బుమ్రా డకౌట్ చేశాడు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, డేవిడ్ మలన్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నిలకడగా రాణిస్తున్న సమయంలో జో రూట్ భారత బౌలర్ ఉమేష్ యాదవ్ చేతికి చిక్కాడు. ఉమేష్ బౌలింగ్‌లో రూట్ 21 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలన్ 26, ఓవర్టన్ 1 ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది. బుమ్రా విజృంభణ..6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్లు బర్న్స్(0), హమీద్(0)లను డకౌట్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 191 ఆలౌట్ రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బెయిర్‌స్టో క్యాచ్ పట్టడంతో ఉమేశ్ యాదవ్(10) పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు 191 పరుగుల వద్ద తెరపడింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో అలరించిన టీమిండియా పేసు గుర్రం బుమ్రా.. ఈ మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే సున్నా పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 190 పరుగల వద్దనే తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. క్రీజ్‌లోకి సిరాజ్ వచ్చాడు శార్దూల్(57) సుడిగాలి ఇన్నింగ్స్ సమాప్తం.. టీమిండియా స్కోర్ 190/8 టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు క్రిస్ వోక్స్ తెరదించాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శార్దూల్.. 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో సుడిగాలి ఇన్నింగ్స్‌ను ఆడాడు. 61 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 190/8. క్రీజ్‌లో ఉమేశ్(10), బుమ్రా ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన శార్దూల్.. 31 బంతుల్లోనే అర్ధ శతకం మహ్మద షమీ స్థానంలో జట్లులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టపార్డర్ బ్యాట్స్మెన్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ చోట బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి మరో ఎండ్‌లో ఉమేశ్ యాదవ్(9) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. ఫలితంగా టీమిండియా 60 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఏడో వికెట్ డౌన్.. పంత్(9) ఔట్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రిషబ్ పంత్(9).. మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 127 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్(4)కు తోడుగా క్రీజ్‌లోకి ఉమేశ్ యాదవ్ వచ్చాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రహానే(14) ఔట్ ఇంగ్లీష్ గడ్డపై టీమిండియా బ్యాట్స్మెన్ల వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా మూడంకెల స్కోర్ సాధంచింది లేదు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ రహానే విషయానికొస్తే.. వరుస వైఫల్యాలతో జట్టులో చోటునే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఇవాల్టి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔటై మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఓవర్టన్ బౌలింగ్‌లో థర్డ్ స్లిప్‌లో మొయిన్ అలీ క్యాచ్ అందుకోవడంతో రహానే(14) పెవిలియన్ బాటపట్టాడు. 50 ఓవర్ల తర్వాత టీమిండియా 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్(3), శార్దూల్ ఠాకూర్(2) ఉన్నారు. టీమిండియాకు బిగ్ షాక్.. కోహ్లి(50) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. హాఫ్ సెంచరీ చేసి సూపర్ టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్ కోహ్లి(50)ని అద్బుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 105 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. రహానే(5)కి జతగా క్రీజ్‌లోకి రిషబ్ పంత్ వచ్చాడు. కోహ్లి మళ్లీ ఫిఫ్టి కొట్టాడు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత వరుస ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలు సాధించాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి.. ఈ ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న కోహ్లి 84 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో ఫిఫ్టి కొట్టాడు. 40 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. కోహ్లి, రహానే(5) క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న కోహ్లి(45), రహానే(5).. టీమిండియా స్కోర్ 100/4 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో తొలిసారి 30 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. కెప్టెన్ కోహ్లి(45; 7 ఫోర్లు) ఫామ్‌ను దొరకబుచ్చుకున్నట్లు కనిపించగా.. రహానే(5) ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో టీమిండియా 39 ఓవర్లో 100 పరుగుల మార్కును చేరుకుంది. 69 పరుగుల వద్ద నాలుగో వికెట్ డౌన్.. జడేజా(10) ఔట్ నాలుగో టెస్ట్‌లోనూ లీడ్స్ టెస్ట్ ఫలితమే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. భారత బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఏదో ఉద్దరిస్తాడని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి పంపిన జడేజా 10 పరుగులకే చేతులెత్తేశాడు. వోక్స్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో రూట్ క్యాచ్ అందుకోవడంతో జడేజా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో టీమిండియా 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్‌లో కోహ్లి(23; 4 ఫోర్లు), రహానే ఉన్నారు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. పుజారా(4) ఔట్ లీడ్స్ టెస్ట్‌లో సీన్ మరోసారి పునరావృతం అవుతోందా అంటే అవుననే చెప్పాలి. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిందో అలానే ఈ టెస్ట్‌లోనూ తొలి సెషన్లోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి టీమిండియా మ్యాచ్‌పై పట్టు చేజార్చుకుంటుంది. 28 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్.. మరో 11 పరుగులు మాత్రమే జోడించి మూడో వికెట్‌ను కోల్పోయింది. 4 పరుగుల స్కోర్ వద్ద పుజారా ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి మరోసారి నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో కెప్టెన్ కోహ్లి(5), జడేజా ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(17) ఔట్ ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా తొలి సెషన్లోనే రెండో వికెట్ కోల్పోయింది. 3 బౌండరీలు బాది జోరు మీదున్నట్లు కనిపించిన కేఎల్ రాహుల్(17; 3 ఫోర్లు)ను రాబిన్సన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి వికెట్ కోల్పోయాక ఐదు ఓవర్లు ఆడి ఒక్క పరుగు కూడా చేయని భారత్.. అదే స్కోర్ వద్ద(28) రెండో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో పుజారా, కోహ్లి ఉన్నారు. టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. రోహిత్(11) ఔట్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్.. తాను వేసిన తొలి ఓవర్లోనే టీమిండియాకు భారీ షాకిచ్చాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతిని సంధించి రోహిత్ శర్మ(11; ఫోర్)ను బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్ బెయిర్‌స్టో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. 9 ఓవర్ల అనంతరం టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(17), పుజారా(0) ఉన్నారు. ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగాయి. టీమిండియాలో ఇషాంత్, మహ్మద్ షమీల స్థానంలో శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగగా, ఇంగ్లండ్ జట్టులో జోస్ బట్లర్, సామ్ కర్రన్ల స్థానాలను ఓలీ పోప్, క్రిస్ వోక్స్ భర్తీ చేయనున్నారు. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది
లండన్: విజయోత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అలర్ట్ చేశాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటై ఆ తర్వాత ఊహించని రీతిలో చెలరేగి, సిరీస్ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడకపోతే.. కోహ్లి సేన దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుందని, దీంతో సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఘోర పరాజయాల అనంతరం ఎలా పుంజుకోవాలో టీమిండియాకు బాగా తెలుసని, దీనికి చరిత్రే సాక్షమని తెలిపాడు. ఇక లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో 78 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా కీలకమైన నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..? -
ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు.. బట్లర్ సహా మరో బౌలర్ ఔట్
ఓవల్: టీమిండియాతో నాలుగో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాల(తన భార్య రెండో బిడ్డను జన్మనివ్వనున్నందున) చేత ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకోనుండగా, ఫాస్ట్ బౌలర్ సకీబ్ మహమూద్‌పై వేటు పడింది. బట్లర్ స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేయనుండగా, సకీబ్ ప్లేస్‌లో క్రిస్ వోక్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో మార్పులపై కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ.. నాలుగో టెస్ట్‌లో వికెట్‌కీపింగ్ బాధ్యతలను జానీ బెయిర్‌స్టో నిర్వహిస్తాడని, దీని వల్ల అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. కీపింగ్ బాధ్యతలకు బెయిర్‌స్టో ఓకే చెబితే.. ఓలీ పోప్ లేదా డానియల్ లారెన్స్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది. నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్ (కీపర్), రోరీ బర్న్స్, సామ్ కర్రన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: IPL 2021: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్ -
సూర్య ప్రతాపం.. భారత్ విజయం
అహ్మదాబాద్: పొట్టి ఫార్మాట్లో నంబర్‌వన్ ఇంగ్లండ్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేదించే ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ 16 ఓవర్లు ముగిసే సరికి 140/4 స్కోరుతో పోరాటంలో నిలిచింది. 24 బంతుల్లో మరో 46 పరుగులు కావాలి. స్టోక్స్ ధనాధన్‌గా సాగుతుండగా... మోర్గాన్ అండగా ఉన్నాడు. ఈ దశలో 17వ ఓవర్ వేసిన శార్దుల్ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. టాప్ మళ్లీ ఫ్లాప్ ఆట మొదలైన తొలి బంతినే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్‌గా బాదేశాడు. కానీ నాలుగో ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ (12; 1 ఫోర్, 1 సిక్స్) ఔటయ్యాడు. రాహుల్ (14) స్టోక్స్ బౌలింగ్‌లో ఆర్చర్ చేతికి చిక్కగా, కోహ్లి (1) రషీద్ గూగ్లీకి స్టంపౌటయ్యాడు. సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు మొదలుపెట్టిన సూర్యకుమార్ బంతుల్ని పదే పదే బౌండరీలకు, సిక్సర్లకు తరలించాడు. ఈ క్రమంలో కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాయ్, స్టోక్స్ లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎప్పట్లాగే జేసన్ రాయ్ ధాటిగా నడిపించాడు. కానీ బట్లర్ (9), మలాన్ (14) నిష్క్రమణతో ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో బెయిర్ స్టో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ నాలుగో వికెట్‌కు చకచకా 65 పరుగులు జోడించడం భారత శిబిరాన్ని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే 17వ ఓవర్లో వరుస బంతుల్లో స్టోక్స్, మోర్గాన్ (4)లు ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సివుండగా శార్దుల్ 14 పరుగులు ఇవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు : భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అండ్ (బి) ఆర్చర్ 12; రాహుల్ (సి) ఆర్చర్ (బి) స్టోక్స్ 14; సూర్య (సి) మలాన్ (బి) కరన్ 57; కోహ్లి (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 1; పంత్ (బి) ఆర్చర్ 30; శ్రేయస్ (సి) మలాన్ (బి) ఆర్చర్ 37; పాండ్యా (సి) స్టోక్స్ (బి) వుడ్ 11; శార్దుల్ నాటౌట్ 10; సుందర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 4; భువీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–21, 2–63, 3–70, 4–110, 5–144, 6–170, 7–174, 8–179. బౌలింగ్: రషీద్ 4–1–39–1, ఆర్చర్ 4–0–33–4, వుడ్ 4–1–25–1, జోర్డాన్ 4–0–41–0, స్టోక్స్ 3–0–26–1, కరన్ 1–0–16–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్య(బి) పాండ్యా 40; బట్లర్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 9; మలాన్ (బి) చహర్ 14; బెయిర్‌స్టో (సి) సుందర్ (బి) చహర్ 25; స్టోక్స్ (సి) సూర్య (బి) శార్దుల్ 46; మోర్గాన్ (సి) సుందర్ (బి) శార్దుల్ 4; కరన్ (బి) పాండ్యా 3; జోర్డాన్ (సి) పాండ్యా (బి) శార్దుల్ 12; ఆర్చర్ నాటౌట్ 18; రషీద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–15, 2–60, 3–66, 4–131, 5–140, 6–140, 7–153, 8–177. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–30–1, పాండ్యా 4–0–16–2, శార్దుల్ 4–0–42–3, సుందర్ 4–0–52–0, చహర్ 4–0–35–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీమిండియా నిలిచేనా!
టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించడం... భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడు టి20ల్లో ఇదే దృశ్యం కనిపించడం చూస్తే టాస్ ఎంత కీలకంగా మారిందో అర్థమవుతుంది. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టాస్‌తో సంబంధం లేకుండా దేనికైనా సిద్ధంగా ఉండాలని భారత టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించి కోహ్లి జట్టు సిరీస్ ను ఎలా కాపాడుకుంటుందనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌లో కొంత తడబడుతున్న భారత జట్టు సిరీస్ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. రెండో మ్యాచ్‌లో సునాయాస విజయం తర్వాత మరో సారి పేస్ బౌలింగ్‌కు తలవంచి గత మ్యాచ్‌లో ఓడిన జట్టు తర్వాతి పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇప్పటికే 2–1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం చేసుకుంటుంది. రాహుల్‌కు చాన్స్ ఉందా! భారత తుది జట్టుకు సంబంధించి చర్చ రేపుతున్న ఒకే ఒక్క అంశం కేఎల్ రాహుల్ ఫామ్. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతను 1, 0, 0 స్కోర్లకే అవుటయ్యాడు. అయితే గత మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతడికి మద్దతుగా నిలిచారు. వారి మాటలను బట్టి చూస్తే రాహుల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. కానీ కోహ్లి సాధారణంగా చేసే వ్యాఖ్యలకు భిన్నంగా మ్యాచ్ రోజు వ్యూహాలు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా రాహుల్‌ను ఆడిస్తారని చెప్పలేం. అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా రాకుండా గత పోరులో పక్కన పెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను రాహుల్ స్థానంలో తీసుకొని ఇషాన్ కిషన్‌తోనే ఓపెనింగ్ చేయించాలనే ప్రత్యామ్నాయం భారత్ ముందుంది. కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం కాగా, రోహిత్ కూడా చెలరేగితే తిరుగుండదు. కిషన్, పంత్, అయ్యర్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్ కూడా లయ అందుకుంటే జట్టు విజయావకాశాలు మెరుగుపడతాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్, సుందర్ పొదుపు పాటిస్తుండగా... చహల్ మాత్రమే తీవ్రంగా నిరాశపరుస్తున్నా డు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చహల్‌పై ఎదురుదాడి చేసి ఫలితం రాబట్టారు. శార్దుల్‌కు బదులుగా దీపక్ చహర్‌ను ఆడించాలని కూడా జట్టు భావిస్తోంది. బలమైన బ్యాటింగ్... గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ పదును చూపించింది. రాయ్, మలాన్ విఫలమైనా... బట్లర్ ప్రదర్శించిన దూకుడుతో జట్టుకు సునాయాస విజయం దక్కింది. ఐపీఎల్ అనుభవంతో, ముఖ్యంగా స్పిన్‌ను అతను సమర్థంగా ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు అదనపు బలంగా మారింది. టెస్టుల్లో ఘోరంగా విఫలమైన బెయిర్‌స్టో కూడా టి20ల్లో రాణిస్తున్నాడు. ఆపై మోర్గాన్, స్టోక్స్ కూడా ధాటిగా ఆడగల సమర్థులు కాబట్టి వారిని నిలువరించడం భారత్‌కు అంత సులువు కాదు. అన్నింటికి మంచి మార్క్ వుడ్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీస్తున్నాడు. ఆర్చర్ కూడా అంతే వేగంతో అతనికి సహకారం అందించాడు. వీరిద్దరు మరోసారి చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. స్పిన్నర్ రషీద్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోవడంలో భారత్ విఫలమవుతోంది. అన్ని రంగాల్లో ఒకింత మనకంటే మెరుగ్గానే కనిపిస్తున్న ఇంగ్లండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. కోహ్లి ర్యాంక్ 5 ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి మరోసారి టాప్–5లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించడంతో కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానంలో నిలిచాడు. టాప్–10లో భారత్ నుంచి కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ (4వ) ఉన్నాడు. -
పంతానికొక్కడు...
146 పరుగులకు 6 వికెట్లు... చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో భారత్ స్కోరు ఇది. ఇంగ్లండ్ స్కోరు 205ను అలవోకగా దాటుతుందనుకుంటే మన టాప్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఇక ప్రత్యర్థికి ఆధిక్యం అందించడం ఖాయమనుకున్న స్థితిలో ఒకే ఒక్కడు మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడిన రిషభ్ పంత్ అద్భుత సెంచరీతో జట్టును ముందంజలో నిలిపాడు. అతనితోపాటు వాషింగ్టన్ సుందర్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో రెండో రోజు ముగిసేసరికి టీమిండియాకు పట్టు చిక్కింది. అండర్సన్, స్టోక్స్ తీవ్రంగా శ్రమించినా... చివరి సెషన్లోనే భారత్ ఏకంగా 141 పరుగులు సాధించడంతో రూట్ సేన కుదేలైంది. అహ్మదాబాద్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే దిశగా భారత్ మరో అడుగు వేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో మూడో సెంచరీ నమోదు చేయగా, వాషింగ్టన్ సుందర్ (117 బంతుల్లో 60 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. కోహ్లి డకౌట్... ఓవర్‌నైట్ స్కోరు 24/1తో ఆట కొనసాగించిన భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రాకుండా నిరోధించిన ఇంగ్లండ్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి ఫలితం సాధించారు. తొలి సెషన్లో 25.2 ఓవర్లు ఆడి 56 పరుగులు మాత్రమే చేసిన భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ముందుగా పుజారా (17)ను లీచ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా... స్టోక్స్ బౌలింగ్‌లో అనూహ్యంగా లేచిన షార్ట్ బంతిని ఆడబోయి కోహ్లి (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. స్వదేశంలో కొంత కాలంగా వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న రహానే (27; 4 ఫోర్లు) దూకుడు ప్రదర్శించబోయాడు. అయితే అండర్సన్ చక్కటి బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో అతని ఆట ముగిసింది. లంచ్ తర్వాత స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోవడంతో అర్ధ సెంచరీ చేజారింది. రోహిత్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అశ్విన్ (13) ఈసారి చెప్పుకోదగ్గ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయి సమయానికి భారత్ ఇంగ్లండ్ స్కోరుకంటే 59 పరుగులు వెనుకబడి ఉంది. గిల్‌క్రిస్ట్‌ను గుర్తు చేసేలా... రిషభ్ పంత్ బ్యాటింగ్ గురించి, టెస్టు జట్టులో అతనికి స్థానం గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇన్నింగ్స్‌తో అవన్నీ పటాపంచలైపోయినట్లే! అనవసరపు దూకుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆడి వికెట్ పారేసుకుంటాడులాంటి విమర్శలు ఇక చెల్లకపోవచ్చు. ఎడమచేతివాటం, ఒక విధ్వంసక వికెట్ కీపర్ భారత్‌కు ఉంటే బాగుంటుందని చాలా కాలంగా కోరుకున్న అభిమానులకు పంత్ రూపంలో అలాంటివాడు దొరికినట్లే! తన అద్భుత బ్యాటింగ్‌తో పంత్ అన్నింటికీ సమాధానం ఇచ్చేశాడు. సరిగ్గా తొలి సెషన్ ముగిసిన తర్వాత పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. అటువైపు రోహిత్ ఉండటంతో అతను మెల్లగా క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకే ప్రయత్నించాడు. అయితే రోహిత్, అశ్విన్ అవుటయ్యాక ఒక్కసారి పంత్ జట్టును రక్షించే బాధ్యత తీసుకున్నాడు. ముందుగా ఇంగ్లండ్ స్కోరును చేరడమే లక్ష్యంగా అతని బ్యాటింగ్ సాగింది. 82 బం తుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత అతను వరుస బౌండరీలతో మరింత చెలరేగిపో యాడు. మరోవైపు సుందర్ నుంచి పంత్‌కు చక్కటి సహకారం లభించింది. అండర్సన్ బౌలింగ్‌లో ఆహా అనిపించే షాట్‌తో 90ల్లోకి చేరిన పంత్ ... రూట్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే అండర్సన్ బౌలింగ్‌లో షార్ట్ మిడ్ వికెట్లో రూట్‌కే క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయి ఇంగ్లండ్ ఆశలు కరిగిపోయాయి. . స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 205; భారత్ తొలి ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అండర్సన్ 0; రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్ 49; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్ 17; విరాట్ కోహ్లి (సి) ఫోక్స్ (బి) స్టోక్స్ 0; అజింక్య రహానే (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 27; రిషభ్ పంత్ (సి) రూట్ (బి) అండర్సన్ 101; అశ్విన్ (సి) పోప్ (బి) లీచ్ 13; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 60; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (94 ఓవర్లలో 7 వికెట్లకు) 294. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–41, 4–80, 5–121, 6–146, 7–259. బౌలింగ్: అండర్సన్ 20–11–40–3; స్టోక్స్ 22–6–73–2; లీచ్ 23–5–66–2; బెస్ 15–1–56–0; రూట్ 14–1–46–0. ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పాలనేది జట్టు ప్రణాళిక. నా మనసులో ఆ సమయంలో అదొక్క ఆలోచనే ఉంది. అయితే పిచ్‌ను పరిశీలించిన తర్వాత నేను కొన్ని షాట్లు ఆడగలనని అనిపించింది. కొన్నిసార్లు మంచి బంతులను, బౌలర్‌ను కూడా గౌరవించాలి. అప్పుడు సింగిల్‌తో సరిపెట్టాలి. చెత్త బంతి పడినప్పుడు చెలరేగిపోవాలి. బంతిని చూడటం, ఆపై బాదడమే నా బలం. ముందుగా 206 పరుగులు చేసి ఆపై సాధ్యమైనంత ఆధిక్యం సాధించాలని భావించాం. ప్రతీది జట్టు వ్యూహం ప్రకారమే సాగింది. రివర్స్ స్వీప్‌లాంటి షాట్లు ఆడేటప్పుడు ముందే దానిని అంచనా వేయగలిగాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా సాగుతున్నప్పుడు ఇలాంటి షాట్లు వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో స్వేచ్ఛగా ఆడేందుకు నాకు అవకాశమిస్తున్నారు. అయితే నేను కూడా పరిస్థితులను బట్టి ఆడతాను. నా ఆటతో ప్రేక్షకులకు వినోదం అందిస్తే అంతకంటే సంతోషం ఉంటుందా. –రిషభ్ పంత్ నాకు తెలిసి ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్ ఎప్పుడో సిద్ధమయ్యాడు. అందుకు కావాల్సిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు. జట్టుకు ఏం కావాలో అది చేసి చూపిస్తున్నాడు. పంత్‌కు సొంతశైలి ఉంది. ఇన్నింగ్స్ ఎలా సాగించాలో మేనేజ్మెంట్ సూచనలు ఇవ్వడం సహజమే కానీ అతను తన తరహాలో ఆడినా మంచిదే. జట్టు పని పూర్తి చేస్తున్నాడు కదా. అది అన్నింటికంటే ముఖ్యం. ప్రతీ టీమ్‌లో భిన్నమైన ఆటగాళ్లు ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఆడేవాళ్లు ఉంటే దూకుడుగా ఆడి సాహసాలు చేసే పంత్‌లాంటి వాళ్లూ ఉంటారు. అతను తన బాధ్యత ఎలా నెరవేర్చినా మాకు సమస్య లేదు. గంట వ్యవధిలోనే మ్యాచ్ స్థితి మార్చేయగల పంత్ ఈ క్రమంలో తొందరగా అవుటైనా ఎవరూ విమర్శించవద్దు. అన్నట్లు... అతను కొంచెం మెంటల్. కాదంటారా! –పంత్ గురించి రోహిత్ శర్మ వ్యాఖ్య -
నాలుగో టెస్టు: ‘స్టోక్స్ నన్ను తిట్టాడు’
112 పరుగులతో పోలిస్తే 205 పరుగులు మెరుగైన స్కోరే కదా! ఇంగ్లండ్ జట్టు కూడా ఇదే తరహాలో సంతృప్తి చెందినట్లుంది. తీవ్ర విమర్శలు వచ్చిన గత పిచ్‌తో పోలిస్తే ఈసారి ఎలాంటి అనూహ్య టర్న్ కానీ బౌన్స్ కానీ లేవు. స్పిన్నర్లు కూడా మరీ ప్రమాదకరంగా ఏమీ కనిపించలేదు. అయినా సరే ఇంగ్లండ్‌కు పరుగులు చేయడం సాధ్యం కాలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు వచ్చి మంచి అవకాశాన్ని ఆ జట్టు వృథా చేసుకుంది. బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపించిన పిచ్‌పై రోజు మొత్తం కూడా నిలబడలేకపోయింది. ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత మొదటిసారి 200 పరుగులు దాటినా... భారత్‌కు సవాల్ విసిరేందుకు ఏమాత్రం సరిపోని స్కోరిది. అక్షర్ పటేల్, అశ్విన్ కలిసి ఏడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టగా, సిరాజ్ రెండు కీలక వికెట్లు తీశాడు. రెండో రోజు నిలబడి టీమిండియా భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ చేతిలోకి వచ్చేసినట్లే. అహ్మదాబాద్: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ వైఫల్యం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. లారెన్స్ (46 ; 8 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అక్షర్ పటేల్‌కు 4, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ తొలి ఓవర్లోనే గిల్ (0) వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ (8 బ్యాటింగ్), పుజారా (15 బ్యాటింగ్) నిలబడటంతో ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 24 పరుగులకు చేరింది. రూట్ విఫలం... గత రెండు టెస్టుల్లాగే ఈసారి కూడా ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్‌ను బౌలింగ్‌కు దించి భారత్ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిం చింది. దానిని నిలబెట్టుకుంటూ ఈ ఓవర్ వేసిన అక్షర్ రెండో బంతికే సిబ్లీ (2)ని బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లోనూ క్రాలీ (9)ని అవుట్ చేసిన అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జో రూట్ (5)ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అక్షర్, అశ్విన్ రూట్ కనీసం రివ్యూ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. స్కోరు 30/3కి చేరిన ఈ దశలో స్టోక్స్, బెయిర్‌స్టో (28; 6 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన స్టోక్స్ ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. స్టోక్స్ క్రీజ్‌లో ఉండటంతో వెంటనే అశ్విన్‌తో బౌలింగ్ చేయించిన ఎత్తుగడ ఈసారి పని చేయలేదు. అతని తొలి ఓవర్లోనే స్టోక్స్ సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అశ్విన్ ఓవర్లోనే అతని ఎల్బీ కోసం భారత్ చేసిన అప్పీల్ రివ్యూలో కూడా తిరస్కరణకు గురైంది. టపటపా... లంచ్ విరామం తర్వాత కొద్ది సేపటికే సిరాజ్ కీలక వికెట్‌తో ఇంగ్లండ్‌ను మరింత ఇబ్బందుల్లో పడేశాడు. 146.4 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ వేసిన బంతి నేరుగా బెయిర్‌స్టో ప్యాడ్లను తాకడంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బెయిర్‌స్టో రివ్యూ కోరినా లాభం లేకపోయింది. మరో ఎండ్‌లో స్టోక్స్ పట్టుదలగా తన బ్యాటింగ్ కొనసాగించాడు. సుందర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన అతను, అక్షర్ ఓవర్లో రివర్స్ స్వీప్‌తో 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సుందర్ వేసిన ఒక చక్కటి బంతికి స్టోక్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. చివరి సెషన్ లో లారెన్స్, పోప్ (87 బంతుల్లో 29; 2 ఫోర్లు) కలిసి కొద్దిసేపు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే అశ్విన్ నాలుగు పరుగుల వ్యవధిలో పోప్, ఫోక్స్ (1)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. అప్పటి వరకు ఓపిగ్గా ఆడిన లారెన్స్ కూడా అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ కాగా, మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. ‘స్టోక్స్ నన్ను తిట్టాడు’ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మధ్యలో స్టోక్స్, కోహ్లి మధ్య కాస్త వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన సమయంలో సిరాజ్‌ను స్టోక్స్ ఏదో అన్నాడు. అయితే దీనికి జవాబివ్వకుండా సిరాజ్ నేరుగా విషయాన్ని తన కెప్టెన్‌కు చెప్పాడు. దాంతో సహచరుడికి అండగా కోహ్లి వెళ్లి స్టోక్స్‌తో గట్టిగా వాదించడం కనిపించింది. అంపైర్ వీరేందర్ శర్మ మధ్యలో జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఆట ముగిశాక మాట్లాడిన సిరాజ్... స్టోక్స్ తనను తిట్టడం వల్లే ఇదంతా జరిగిందని వెల్లడించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) సిరాజ్ (బి) అక్షర్ 9; సిబ్లీ (బి) అక్షర్ 2; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) సిరాజ్ 28; రూట్ (ఎల్బీ) (బి) సిరాజ్ 5; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 55; పోప్ (సి) గిల్ (బి) అశ్విన్ 29; లారెన్స్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 46; ఫోక్స్ (సి) రహానే (బి) అశ్విన్ 1; బెస్ (ఎల్బీ) (బి) అక్షర్ 3; లీచ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 7; అండర్సన్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (75.5 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–10, 2–15, 3–30, 4–78, 5–121, 6–166, 7–170, 8–188, 9–189, 10–205. బౌలింగ్: ఇషాంత్ శర్మ 9–2–23–0; సిరాజ్ 14–2–45–2; అక్షర్ పటేల్ 26–7–68–4; అశ్విన్ 19.5–4–47–3; సుందర్ 7–1–14–1. భారత్ తొలి ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) అండర్సన్ 0; రోహిత్ (బ్యాటింగ్) 8; పుజారా (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 24. వికెట్ల పతనం:1–0. బౌలింగ్: అండర్సన్ 5–5–0–1, స్టోక్స్ 2–1–4–0, లీచ్ 4–0–16–0, బెస్ 1–0–4–0. -
జోరుగా కోహ్లి, రోహిత్, రహానే ప్రాక్టీస్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు తమ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఆదివారం స్వల్పంగా ప్రాక్టీస్ చేసిన టీమిండియా ఆటగాళ్లు సోమవారం కూడా కఠోర సాధన చేశారు. టాప్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్య రహానే సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో తమ బ్యాట్లకు పదును పెట్టారు. ఈ ముగ్గురు పేస్, స్పిన్ బౌలింగ్‌లో అన్ని రకాల షాట్లను ఆడుతున్న వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించిన హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్లకు పలు సూచనలిచ్చారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా విరామం లేకుండా బౌలింగ్ చేయగా... కోచ్ ఆర్.శ్రీధర్ నేతృత్వంలో ఆటగాళ్లు స్లిప్ ఫీల్డింగ్‌పై దృష్టి పెడుతూ సాధనలో పాల్గొన్నారు. మళ్లీ స్పిన్ పిచ్! మూడో టెస్టు పిచ్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. ఈనెల 4 నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం మరోసారి స్పిన్ పిచ్‌నే సిద్ధం చేసి ఇంగ్లండ్ పని పట్టాలని కోరుకుంటోంది. బోర్డు సూచనలకు అనుగుణంగా చివరి టెస్టుకు కూడా స్పిన్ పిచ్‌నే అందుబాటులో ఉంచవచ్చు. ‘మారేది బంతి రంగు మాత్రమే, పిచ్ కాదు. అయినా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లేందుకు అవసరమైన కీలక టెస్టు ఇది. ఈ అవకాశాన్ని భారత్ ఎందుకు చేజార్చుకోవాలి. బ్యాటింగ్‌కు అనుకూలంగా తయారు చేసి ఇంగ్లండ్ కోలుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి’ అని బోర్డు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U — BCCI (@BCCI) March 1, 2021 -
ఆసక్తికర ఘట్టానికి టెస్టు సిరీస్
ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన టెస్టు సిరీస్‌లో అంతిమ ఫలితం కోసం ఆఖరి రోజు వరకు ఆగాల్సి రావడంకంటే మించిన ఆసక్తికర ముగింపు ఏముంటుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితంనాటి ఓటమి జ్ఞాపకాలను మరిచేలా ఈసారైనా సొంతగడ్డపై సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న ఆసీస్ నాలుగో టెస్టులో 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచి సవాల్ విసిరింది. చివరి రోజు అందుబాటులో ఉన్న 98 ఓవర్లలో టీమిండియా 324 పరుగులు సాధించాల్సి ఉంది. దూకుడైన ఆటతో రహానే బృందం దీనిని అందుకునేందుకు ప్రయత్నిస్తుందా లేక ట్రోఫీ నిలబెట్టుకునే అవకాశం ఉండటంతో ‘డ్రా’వైపు మొగ్గు చూపుతుందా చూడాలి. బ్రిస్బేన్‌లో గత రికార్డులు చూస్తే ఇది అసాధ్యంగానే కనిపిస్తున్నా... మన జట్టుకు రికార్డులు తిరగరాయడం కొత్తేమీ కాదు. అయితే అన్నింటికి మించి ఆఖరి రోజు వర్షం కీలకంగా మారనుంది. ఎన్ని ఓవర్ల ఆట సాధ్యం అవుతుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. బ్రిస్బేన్: వరుసగా రెండో పర్యటనలోనూ భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించగలదా... లేక సిరీస్‌ను సమంగా ముగించి ట్రోఫీని నిలబెట్టుకోగలదా అనేది నేడు తేలనుంది. చివరి టెస్టులో ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (4 బ్యాటింగ్), గిల్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 1.5 ఓవర్ల తర్వాతే వాన రావడంతో ఆటను నిలిపివేయగా... వాన తగ్గే అవకాశం కనిపించకపోవడంతో నాలుగో రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు. రెండు సార్లు వర్షం అడ్డంకి కలిగించడంతో సోమవారం 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (74 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, వార్నర్ (75 బంతుల్లో 48; 6 ఫోర్లు) రాణించాడు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/73)తో చెలరేగాడు. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు 4 వికెట్లు దక్కాయి. శుభారంభం సాధ్యమైనంత వేగంగా బ్యాటింగ్ చేసి భారత్ ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచాలనే ప్రణాళికతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు చాలా వరకు సఫలమైంది. 3.87 రన్‌రేట్‌తో ఆసీస్ పరుగులు సాధించింది. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో విఫలమైన తర్వాత ఎట్టకేలకు వార్నర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చగా, మార్కస్ హారిస్ (82 బంతుల్లో 38; 8 ఫోర్లు) కూడా అండగా నిలిచాడు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించడంతో ఒక దశలో భారత్ అటాకింగ్ ఫీల్డింగ్‌ను మార్చేసి ఆత్మరక్షణలో పడింది. అయితే 89 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత శార్దుల్ షార్ట్ బంతితో హారిస్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా... తర్వాతి ఓవర్లో సుందర్ బౌలింగ్‌లో వార్నర్ ఎల్బీగా దొరికిపోయాడు. ఆసీస్ ఓపెనర్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు లబ్‌షేన్ (22 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా... సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. స్లిప్‌లో రోహిత్ చక్కటి క్యాచ్‌కు లబ్‌షేన్ వెనుదిరగ్గా, మరో చక్కటి బంతికి వేడ్ (0) పెవిలియన్ చేరాడు. 123/4 వద్ద ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలుతున్నట్లు అనిపించింది. కీలక భాగస్వామ్యం టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ ఆసీస్‌ను మరోసారి ఆదుకున్నాడు. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడిన స్మిత్ ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. కామెరాన్ గ్రీన్ (90 బంతుల్లో 37; 3 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు స్మిత్ 73 పరుగులు జత చేశాడు. ఇలాంటి స్థితిలో మరోసారి సిరాజ్ తన విలువను ప్రదర్శించాడు. అతను వేసిన పదునైన బంతిని ఆడలేక స్మిత్ స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. బంతి తన గ్లవ్‌కు తాకిన సమయంలో బ్యాట్ ఆ చేతిలో లేదనే సందేహంతో స్మిత్ రివ్యూ కోరగా, ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ తర్వాత గ్రీన్‌ను శార్దుల్ అవుట్ చేశాడు. అయితే కెప్టెన్ పైన్ (37 బంతుల్లో 27; 3 ఫోర్లు), కమిన్స్ (51 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చివర్లో కొన్ని పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా సంతృప్తికర స్కోరును సాధించగలిగింది. సిరాజ్ రెండు క్యాచ్‌లు మిస్ నాలుగో రోజు కూడా ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. సుందర్ బౌలింగ్‌లో 42 పరుగుల వద్ద స్మిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను సరిగా అంచనా వేయలేక సిరాజ్ వదిలేశాడు. అతను తన స్కోరుకు మరో 13 పరుగులు జోడించాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌లోనే గ్రీన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కూడా సిరాజ్ అందుకోలేకపోయాడు. ఈ సమయంలో 14 పరుగుల వద్ద ఉన్న గ్రీన్ మరో 23 పరుగులు సాధించాడు. వాన... వాన... ప్రఖ్యాత ‘అక్యువెదర్’ వెబ్సైట్ సహా ఆస్ట్రేలియాలోని వివిధ వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం మంగళవారం కూడా బ్రిస్బేన్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో కనీసం గంట పాటు వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారనుంది. సోమవారం రాత్రి కూడా వాన కురుస్తున్న కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. ఇదే జరిగితే 98 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చు. సమయం వృథా అవుతున్నకొద్దీ ఆసీస్ విజయావకాశాలు తగ్గుతున్నట్లే. భారత్ మాత్రం మిగిలిన ఓవర్లలో గట్టిగా నిలబడి ‘డ్రా’ చేసుకున్నా సరిపోతుంది. వర్షం కారణంగా చివరి టెస్టులో రెండో రోజు, నాలుగో రోజు అంతరాయం కలగవచ్చని నిపుణులు వేసిన అంచనా కూడా నిజమైంది కాబట్టి ఇది కూడా తప్పకపోవచ్చు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 369 భారత్ తొలి ఇన్నింగ్స్: 336 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: హారిస్ (సి) రిషభ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 38; డేవిడ్ వార్నర్ (ఎల్బీ) (బి) వాషింగ్టన్ సుందర్ 48; లబ్‌షేన్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 25; స్టీవ్ స్మిత్ (సి) రహానే (బి) సిరాజ్ 55; వేడ్ (సి) రిషభ్ పంత్ (బి) సిరాజ్ 0; గ్రీన్ (సి) రోహిత్ శర్మ (బి) శార్దుల్ ఠాకూర్ 37; టిమ్ పైన్ (సి) రిషభ్ పంత్ (బి) శార్దుల్ ఠాకూర్ 27; కమిన్స్ (నాటౌట్) 28; స్టార్క్ (సి) నవదీప్ సైనీ (బి) సిరాజ్ 1; నాథన్ లయన్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) శార్దుల్ ఠాకూర్ 13; హాజల్‌వుడ్ (సి) శార్దుల్ ఠాకూర్ (బి) సిరాజ్ 9; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75.5 ఓవర్లలో ఆలౌట్) 294. వికెట్ల పతనం: 1–89, 2–91, 3–123, 4–123, 5–196, 6–227, 7–242, 8–247, 9–274, 10–294. బౌలింగ్: సిరాజ్ 19.5–5–73–5, నటరాజన్ 14–4–41–0, వాషింగ్టన్ సుందర్ 18–1– 80–1, శార్దుల్ ఠాకూర్ 19–2–61–4, నవదీప్ సైనీ 5–1–32–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 4; గిల్ (బ్యాటింగ్) 0; మొత్తం (1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 4. బౌలింగ్: స్టార్క్ 1–0–4–0, హాజల్‌వుడ్ 0.5–0–0–0. -
బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం: బీసీసీఐ
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది. ‘చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్లోనే పంపిస్తే మంచిది. వీలుంటే మ్యాచ్ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్‌కూ అనుమతించమని వెల్లడించింది. -
ఆసీస్‌దే యాషెస్
మాంచెస్టర్: క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్‌మన్ ప్రతిఘటించినా యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ మ్యాచ్‌లో 383 పరుగుల భారీ లక్ష్యానికి గాను ఓవర్‌నైట్ స్కోరు 18/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ ఏమీ అంత తేలిగ్గా తలొంచలేదు. ప్రత్యర్థి పేసర్ల ధాటిని తట్టుకుంటూ ఆ జట్టు గట్టి పోరాటమే చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ జాన్ డెన్లీ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), జేసన్ రాయ్ (67 బంతుల్లో 31) ఓవర్లను కరిగిస్తూ వచ్చారు. కానీ, రాయ్, మూడో టెస్టు హీరో బెన్ స్టోక్స్ (1)లను ఔట్ చేసిన కమిన్స్ (4/43) ఆసీస్‌కు పట్టు చిక్కేలా చేశాడు. తర్వాత డెన్లీ, బెయిర్ స్టో (61 బంతుల్లో 25), బట్లర్ (111 బంతుల్లో 34) జట్టును గట్టెక్కించేందుకు యత్నించారు. టీ విరామం తర్వాత బట్లర్, ఆర్చర్ (1) వెనుదిరిగినా లోయరార్డర్లో ఓవర్టన్ (105 బంతుల్లో 21), లీచ్ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు. ఈ దశలో మ్యాచ్ ‘డ్రా’ అయ్యేలా కనిపించింది. లీచ్‌ను పార్ట్‌టైమర్ లబషేన్, ఓవర్టన్ను హాజల్‌వుడ్ పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను గెలిపించారు. డబుల్ సెంచరీతో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆ జట్టే గెల్చుకోవడంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా గణాంకాలు 2–2తో సమం అవుతాయి. తద్వారా ట్రోఫీ కంగారూల వద్దనే ఉంటుంది. -
ఇంగ్లండ్ ఇక కష్టమే..!
మాంచెస్టర్: కళ్లెదుట 383 పరుగుల భారీ లక్ష్యం... నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్... భీకరంగా బంతులేస్తున్న ప్రత్యర్థి పేసర్లు... ప్రస్తుతం స్కోరు 18/2..! కమిన్స్ (2/8) నిప్పులు చెరగడంతో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ బర్న్స్ (0)తో పాటు కీలకమైన కెప్టెన్ జో రూట్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. చేతిలో ఉన్న 8 వికెట్లతో ఇంకా 365 పరుగులు చేయాల్సి ఉంది. ఇదీ యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పరిస్థితి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 186/6 వద్ద డిక్లేర్ చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బంతుల్లో 82; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వేడ్ (76 బంతుల్లో 34; 2 ఫోర్లు) సహకరించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కమిన్స్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడు, నాలుగు బంతులకు బర్న్స్, రూట్లను బలిగొన్నాడు. అత్యద్భుతం అనదగ్గ బంతితో రూట్ వికెట్లను అతడు గిరాటేసిన వైనం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 200/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 301 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (3/80) ధాటికి స్టోక్స్ (26), బెయిర్ స్టో (17) త్వరగానే ఔటయ్యారు. బట్లర్ (65 బంతుల్లో 41; 7 ఫోర్లు) పోరాటంతో ఫాలో ఆన్ తప్పించాడు. 196 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా 44 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ స్థితిలో స్మిత్ మళ్లీ అడ్డుగోడలా నిలిచాడు. సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరును పెంచుకుంటూ పోయాడు. వేడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. -
ఇంగ్లండ్ ఎదురీత: ప్రస్తుతం 200/5
మాంచెస్టర్: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరును అందుకునేందుకు ఇంగ్లండ్ ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మరో 297 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 23/1తో శుక్ర వారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి 200/5తో నిలిచింది. నైట్ వాచ్‌మన్ ఓవర్టన్ (5) త్వరగానే ఔట్ కాగా, ఓపెనర్ రోరీ బర్న్స్ (81; 9 ఫోర్లు), కెప్టెన్ జో రూట్ (71; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. పూర్తి సాధికారికంగా ఆడలేకపోయినప్పటికీ ప్రత్య ర్థిది పైచేయి కాకూడదన్నట్లు నిలిచిన వీరు మూడో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. అయితే, వీరిద్దరితో పాటు బట్లర్ (23)ను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసిన హాజల్‌వుడ్ (4/48) గట్టి దెబ్బకొట్టాడు. ప్రసుత్తం స్టోక్స్ (7 బ్యాటింగ్), బెయిర్‌స్టో (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 98 పరుగులు చేయాలి. -
స్మిత్ సూపర్ డబుల్
మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను తక్కువ స్కోరుకే ఔట్ చేయడం ఇక ఇంగ్లండ్ బౌలర్ల తరం కాదేమో? ఔను మరి...! ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం లొంగని విధంగా ఆడుతున్నాడతను. తనంతట తాను వికెట్ ఇస్తే అదే గొప్పని వారు భావించేలా భీకర ఫామ్‌తో పరుగులు చేస్తున్నాడు. స్మిత్ అద్భుత ఆటతో డబుల్ సెంచరీ బాదడంతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 170/3తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్... స్మిత్‌కు తోడు కెప్టెన్ టిమ్ పైన్ (127 బంతుల్లో 58; 8 ఫోర్లు), లోయరార్డర్లో మిచెల్ స్టార్క్ (58 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు అందుకుంది. అంతకుముందు హెడ్ (19), వేడ్ (16) త్వరగానే వెనుదిరిగినా స్మిత్... పైన్‌తో ఆరో వికెట్‌కు 145 పరుగులు; 8వ వికెట్‌కు స్టార్క్‌తో కలిసి 51 పరుగులు జోడించి జట్టును నిలిపాడు. ఈ క్రమంలో 160 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 118 పరుగుల వద్ద స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడంతో అతడికి లైఫ్ లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో మూడో ద్విశతకం (310 బంతుల్లో) సాధించాడు. అనంతరం సైతం సాధికారికంగా కనిపించిన అతడు... పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు యత్నించి ఔటయ్యాడు. చివర్లో స్టార్క్, లయన్ (26 బంతుల్లో 26; 4 ఫోర్లు) జోడీ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా స్టార్క్ బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. 49 బంతుల్లోనే వీరు 59 పరుగులు జోడించారు. ఆసీస్ చివరి 10 ఓవర్లలో 80పైగా పరుగులు చేయడం విశేషం. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ రోజు ముగిసేసరికి ఓపెనర్ డెన్లీ (4) వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. -
గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!
సిడ్నీ: నాలుగేళ్ల క్రితం ధోని అనూహ్య రిటైర్మెంట్తో సిడ్నీలో జరిగిన చివరి టెస్టుతోనే కోహ్లి కెప్టెన్‌గా బాధ్యత చేపట్టాడు. ఆ సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్ కోహ్లి నాయకత్వంలో వరుస విజయాలు సాధించి నంబర్‌వన్‌గా ఎదిగింది. ఇప్పుడు ‘టాప్’ హోదాలో మరోసారి అదే మైదానానికి వచ్చిన కోహ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడం ఎంతో కష్టమని, ఇప్పుడు గనక దానిని సాధిస్తే అది చాలా పెద్ద ఘనత అవుతుందని వ్యాఖ్యానించాడు. ‘నేను వరుసగా మూడో సారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాను. ఇక్కడ సిరీస్ గెలుపు ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. నా నాయకత్వంలో ఇక్కడి నుంచి భారత జట్టు కొత్త ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు నంబర్‌వన్‌గా మళ్లీ వచ్చాం. దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాం. అందుకే సిరీస్ గెలిస్తే దానిని నేను మాత్రమే కాకుండా జట్టంతా గొప్ప ఘనతగా భావిస్తుంది’ అని కోహ్లి అన్నాడు. తన దృష్టిలో గత రికార్డులకు ఎలాంటి విలువ లేదని, తాను చరిత్రను పట్టించుకోనని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లలో ఎప్పుడైనా గెలవాలనే కసి ఉండాలన్నాడు. ‘మనకు ఏదైనా లక్ష్యం మాత్రమే ఉంటే ఒకటి రెండు మ్యాచ్‌ల తర్వాత అది ముగిసిపోతుంది. కానీ ఎప్పుడైనా గెలవాలనే కసి ఉంటే మాత్రం అది ఆగిపోదు. మెల్బోర్న్ టెస్టులో గెలిచిన క్షణాన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారితో సహా ప్రతీ ఒక్కరు తమ భావోద్వేగాలు ప్రదర్శించారు. అందరిలోనూ ఒక రకమైన కసి అక్కడ కనిపించింది. నిజాయతీగా చెప్పాలంటే గతంలో ఏం జరిగిందనేది అనవసరం. నేను వర్తమానంపైనే దృష్టి పెట్టి పని చేస్తా’ అని కోహ్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్ విజయంతో తాను ఏదో నిరూపించుకోవాలని భావించడం లేదన్న భారత కెప్టెన్... కొత్త సంవత్సరాన్ని గెలుపుతో ప్రారంభిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. అశ్విన్ గాయం కొత్తది కాదు! వరుసగా రెండు విదేశీ పర్యటనల్లోనూ ప్రధాన స్పిన్నర్ అశ్విన్ ఒకే తరహా గాయంతో బాధపడుతున్నాడని, దీనికి పరిష్కారం చూడాల్సి ఉందని కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘ఇంగ్లండ్‌లో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అశ్విన్‌కు ఒకే తరహా గాయం ఉండటం దురదృష్టకరం. దీనికి చికిత్స తీసుకోవడంపై అతను దృష్టి పెట్టాడు. ఫిజియో, ట్రైనర్ కూడా అందుకు సహకరిస్తున్నారు. టెస్టు క్రికెట్లో అతను ఎంత కీలకమో తెలుసు కాబట్టి 100 శాతం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. సరైన సమయంలో కోలుకోలేకపోతున్నందుకు అశ్విన్ కూడా బాధపడుతున్నాడు’ అని కోహ్లి చెప్పాడు. మరోవైపు ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి బౌలింగ్‌పై కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. నిజానికి అశ్విన్ గైర్హాజరులో ఆఫ్ స్పిన్ లోటు కనిపించడం లేదని, విహారి పార్ట్‌టైమర్‌గానే ఆ పని చేస్తున్నాడని కోహ్లి చెప్పాడు. అతనికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తమకు మంచి ప్రత్యామ్నాయంగా మారాడని కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
సిరీస్ కోల్పోతామనే బెంగ లేదు!
సిడ్నీ: నాలుగో టెస్టులో భారత్ గెలిచినా లేదా ‘డ్రా’ చేసుకున్నా ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్ విజయమవుతుంది. స్వదేశంలో టీమిండియాకు సిరీస్ కోల్పోయిన మొదటి ఆసీస్ కెప్టెన్‌గా టిమ్ పైన్ ఖాతాలో చెత్త రికార్డు చేరుతుంది. అయితే తాను దాని గురించి అతిగా ఆలోచించడం లేదని, జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టినట్లు పైన్ చెబుతున్నాడు. ‘మా ఆటను మెరుగుపర్చుకొని సాధ్యమైనంత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం. మేం కూడా ప్రతీ టెస్టు గెలవాలని కోరుకుంటాం. కానీ అది సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఎదుర్కొంటున్నాం. సిరీస్ కోల్పోవడం గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. మా ఆటను బాగుపర్చడం, భారత్‌కు గట్టి పోటీనివ్వడమే ప్రస్తుతం నా లక్ష్యం’ అని పైన్ పేర్కొన్నాడు. -
సిడ్నీలో మోగాలి విజయ ఢంకా
గెలిస్తే నయా చరిత్ర... ‘డ్రా’ చేసుకున్నా రికార్డులకెక్కే ఘనత... ఓడిపోకుండా ఉండటం ఒక్కటే కావాల్సింది! అనే స్థితిలో టీమిండియా సిడ్నీ టెస్టు బరిలో దిగబోతోంది. ‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ విజయం’ అనే చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు మరొక్క అడుగు దూరంలోనే ఉంది భారత్. ఏమరుపాటు లేకుండా... పొరపాటు పడకుండా దీనిని సాకారం చేస్తే కోహ్లి సేన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. అశేష అభిమానులందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ మన జట్టు నెగ్గాలని ఆశిద్దాం! సిడ్నీ: చరిత్ర సృష్టించేందుకు తహతహలాడుతున్న టీమిండియా... దానిని అడ్డుకుని పరువు కాపాడుకునే యత్నాల్లో ఉన్న ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ఇక్కడి సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లో చివరి టెస్టు జరుగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2–1తో ముందంజలో ఉంది. దీనిలోనూ గెలిస్తే తిరుగులేని ఆధిక్యం (3–1)తో ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్‌ను వశం చేసుకుంటుంది. ‘డ్రా’ అయినా గణాంకాల్లో తేడా తప్ప మన ఘనతేంతగ్గదు. అయితే, సొంతగడ్డపై ప్రత్యర్థికి ఇందుకు అవకాశం ఇవ్వకూడదని కంగారూలు భావిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. మార్పులు తప్పలే! కీలకమైన టెస్టుకు బ్యాటింగ్ బలంగా ఉండాలని భారత్ భావిస్తోంది. స్వదేశానికి వచ్చేసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్థానంలో పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కాకుండా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఆడించనుండటమే దీనికి నిదర్శనం. దీంతో కర్ణాటక సహచరుడు మయాంక్ అగర్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి ఆరో స్థానంలో వస్తాడు. గాయపడిన పేసర్ ఇషాంత్ శర్మ బదులుగా ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ల పేర్లను చేర్చింది. పిచ్ పరిస్థితిని బట్టి స్పిన్నర్ కుల్దీప్ వైపే మొగ్గుచూపొచ్చని తెలుస్తోంది. 13 మందిలో ఉన్నా, ఇంకా ఫిట్నెస్ సంతరించుకోని ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను బెంచ్‌కే పరిమితం చేయనున్నారు. ఇద్దరు పేసర్లు (బుమ్రా, షమీ), ఇద్దరు స్పిన్నర్లు (జడేజా, కుల్దీప్) వ్యూహంతో టీమిండియా బరిలో దిగనున్నట్లు కనిపిస్తోంది.ఎప్పటిలానే బ్యాటింగ్‌లో పుజారా, కోహ్లి, రహానే బాధ్యత మోయాల్సి ఉంటుంది. ఓపెనర్లు రాహుల్, మయాంక్‌తో పాటు విహారి, వికెట్ కీపర్ రిషభ్ పంత్ మంచి స్కోర్లు చేస్తే జట్టు భారీ స్కోరుకు బాటలు పడతాయి. అయితే, కొంతకాలంగా ప్రత్యర్థులకు కంగారు పుట్టిస్తున్న పేస్ త్రయంలో ఇషాంత్ దూరం కావడం లోటే. బుమ్రా, షమీ చక్కటి లయలో ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అనూహ్యంగా కుల్దీప్ తేలిపోతే మాత్రం దీని ప్రభావం కనిపిస్తుంది. ముగ్గురు పేసర్లు తప్పనిసరి అనుకుంటే ఉమేశ్‌ను ఆడిస్తారు. పెర్త్‌లోనే ఆకట్టుకోలేని అతడు సిడ్నీలో ఏం చేస్తాడో చూడాలి. ఆసీసూ... అదే తీరుగా! ఆతిథ్య ఆస్ట్రేలియా సైతం మార్పులు తప్పని పరిస్థితుల్లో ఉంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ ఆరోన్ ఫించ్‌పై వేటు వేసి... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్‌కోంబ్‌ను తీసుకోనుంది. పేస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్‡్ష స్థానంలో స్పిన్నర్ లబషేన్‌ను దింపుతోంది. మార్కస్ హారిస్‌కు తోడుగా ఉస్మాన్ ఖాజా ఓపెనింగ్‌కు వస్తాడు. అయితే, జట్టును బ్యాటింగ్ వైఫల్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. షాన్ మార్‡్ష, ట్రావిస్ హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఖాజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. కెప్టెన్ టిమ్ పైన్, లోయరార్డర్లో స్టార్క్, కమిన్స్ కాస్తోకూస్తో పరుగులు చేస్తుండటంతో జట్టు పోరాడగలుగుతోంది. బౌలింగ్‌లో కమిన్స్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. ప్రధాన పేసర్లు మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్ నుంచి ఇంతవరకు మంచి ప్రదర్శన రాలేదు. పెర్త్‌లో ప్రతాపం చూపిన స్పిన్నర్ లయన్ మెల్బోర్న్లో లయ తప్పాడు. అతడిని భారత అరంగేట్ర ఓపెనర్ మయాంక్ ఆటాడుకున్నాడు. ఏమాత్రం అనుకూలత ఉన్నా చెలరేగే లయన్‌పై సిడ్నీలో ఓ కన్నేసి ఉంచాల్సిందే. లబషేన్ బ్యాటింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుందని ఆసీస్ ఆశిస్తోంది. మూడు రకాలుగా స్పందించే పిచ్ ఎదురవనుంది. తొలి రోజు పేసర్లకు... తర్వాత బ్యాట్స్‌మెన్‌కు... మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలించ వచ్చని తెలుస్తోంది. సిడ్నీలో ప్రస్తుతం వేడి వాతావరణం ఉంది. టెస్టు నాలుగు, ఐదో రోజు వర్ష సూచనలున్నాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. పిచ్, వాతావరణం ఉదయం 5 గంటల నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం తుది జట్లు (అంచనా) భారత్: రాహుల్, మయాంక్, పుజారా, కోహ్లి (కెప్టెన్), రహానే, విహారి, పంత్, జడేజా, కుల్దీప్/ఉమేశ్, బుమ్రా, షమీ. ఆస్ట్రేలియా: ఖాజా, హారిస్, షాన్ మార్ష్, హెడ్, హ్యాండ్స్కోంబ్, పైన్ (కెప్టెన్), లయన్, లబషేన్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్. ►11 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు సిడ్నీ మైదానంలో 11 టెస్టులు జరిగాయి. ఇందులో భారత్ ఒక విజయం (1978లో) సాధించగా... ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో ఐదు ‘డ్రా’గా ముగిశాయి. ఇది ‘పింక్’ టెస్టు... భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ టెస్టు మూడో రోజు మైదానం గులాబీ (పింక్) మయం కానుంది. ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ స్మారకార్థం 2009 నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. జేన్ 2008లో రొమ్ము క్యాన్సర్‌తో కన్నుమూశారు. అంతకుముందే 2005లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో భార్యాభర్తలు... ‘గ్లెన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తర్వాత మూడేళ్లకు జేన్ చనిపోయారు. దీంతో ఏటా జనవరిలో సిడ్నీ ఆతిథ్యమిచ్చే టెస్టును ‘పింక్ టెస్టు’గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యాచ్ మూడో రోజును ‘జేన్ మెక్‌గ్రాత్ డే’గా పేర్కొంటారు. ప్రేక్షకులు గులాబీ దుస్తులతో మైదానానికి వస్తారు. పింక్ స్టంప్‌లను ఏర్పాటు చేస్తారు. మహిళల స్టాండ్‌ను ‘జేన్ మెక్‌గ్రాత్ స్టాండ్’గా పిలుస్తారు. ఆటగాళ్లు మెక్‌గ్రాత్‌కు గులాబీ రంగు టోపీలను అందజేస్తారు. -
సౌతాంప్టన్ టెస్ట్‌లో భారత్ ఓటమి
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 184 పరుగులకు భారత్ ఆలౌటైంది. దీంతో సీరిస్‌ను ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంది. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి, రహానే జోడి కలిసి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో మొయిన్ అలీ కోహ్లి(58)ని ఔట్ చేసి గట్టి దెబ్బకొట్టాడు. దీంతో నాలుగో వికెట్ నమోదైన 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్ మనవైపు వచ్చిందనుకునే తరుణంలో మొయిన్ అలీ కోహ్లి వికెట్‌తో దెబ్బతీశాడు. విరాట్ వెనుదిరగడంలో భారత పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు ఎవరు నిలదోక్కుకోలేకపోయ్యారు. కీలక దశలో హాఫ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే (51)గా వెనుదిరిగాడు. కాసేపు దాటిగా ఆడిన రిషబ్ పంత్ (18) కూడా నిలువలేకపోయ్యాడు. చివర్లో అశ్విన్ (25) కాసేపు పోరాడాడు. ఓపెనర్లు రాహుల్(0), ధావన్ (17)లు నిరాశ పరిచారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీతో ఆకట్టుకున్న పుజారా(5) ఈ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ నాలుగు వికెట్లతో భారత పతానాన్ని శాసించాడు. ఈ నెల లార్డ్స్ మైదానంలో చివరి టెస్ట్ జరగనుంది. -
246 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
-
పటిష్టస్థితిలో దక్షిణాఫ్రికా
జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేశారు. ఆమ్లా (16), డివిలియర్స్ (6) త్వరగానే పెవిలియన్ చేరగా... మార్క్రమ్ (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం ఎల్గర్ (39 బ్యాటింగ్; 6 ఫోర్లు), కెప్టెన్ డు ప్లెసిస్ (34 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం 401 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 110/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా చివరకు 221 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమిన్స్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ జోడీ విడిపోయాకా ఆసీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫిలాండర్, రబడ, మహరాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. -
దక్షిణాఫ్రికా బౌలర్ల జోరు
జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం చాటుతోంది. రెండో రోజు మొదట బవుమా (95 నాటౌట్, 13 ఫోర్లు) వీరోచిత పోరాటంతో భారీ స్కోరు చేసిన సఫారీ జట్టు అనంతరం బౌలింగ్‌లోనూ చెలరేగింది. దీంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 313/6తో శనివారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగుల వద్ద ఆలౌటైంది. సహచరులు ఔటవ్వడంతో బవుమా 5 పరుగుల తేడాతో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. కేశవ్ మహరాజ్ (45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డికాక్ (39; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లు పడగొట్టగా, లయన్ 3, సేయర్స్ 2 వికెట్లు తీశారు. ఆ ముగ్గురు చేసింది పన్నెండే... అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఫిలాండర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. దీంతో ఆసీస్ 96 పరుగులకే కీలకమైన 6 వికెట్లను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఖాజా (53; 9 ఫోర్లు) ఒక్కడే కుదురుగా ఆడాడు. ఫిలాండర్ 3, రబడ, మోర్కెల్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో సస్పెన్షన్‌కు గురైన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ స్థానంలో ఈ టెస్టులో బరిలోకి దిగిన హ్యాండ్స్కోంబ్ (0), రెన్షా (8), బర్న్స్ (4) విఫలమయ్యారు. ఈ ముగ్గురు కలిసి కేవలం 12 పరుగులే చేశారు. -
‘డ్రా’ దిశగా నాలుగో టెస్టు
మెల్బోర్న్: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి రెండు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్న సమయంలో వర్షం అడ్డుపడటంతో ఆట నిలిచిపోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మరో 61 పరుగులు వెనుకబడి ఉంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 491 వద్దే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. -
పట్టుబిగించిన ఇంగ్లండ్
మాంచెస్టర్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట నిలిచే సమయానికి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. మొయిన్ అలీ (67 బ్యాటింగ్), బ్రాడ్ (0) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఓవరాల్‌గా 360 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 220/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 226 పరుగుల వద్ద ఆలౌటైంది. -
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా
ధర్మశాల: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో నెగ్గిన టీమిండియాను అభినందిస్తూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్డేడియంలో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో అజింక్య రహానే నేతృత్వంలోని భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ భారత్ వశమైంది. ఈ సందర్భంగా బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు రూ.25 లక్షల రివార్డు, ఇతరత్రా సిబ్బంది ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు అందజేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో ఓటమి పాలై తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో విజయాన్ని సాధించి సిరీస్ ను సమయం చేసింది టీమిండియా. రాంచీ టెస్టులో ఆసీస్ పోరాటం చేయడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ధర్మశాలలో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు సగర్వంగా ముద్దాడింది. ఆసీస్ పై స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ విజయంతో 2016-17 సీజన్ ను నెంబర్ వన్ గా ముగించింది టీమిండియా. ఈ విజయానికి గుర్తుగా టీమిండియాలో ఉత్సాహం నింపేందుకు ఆటగాళ్లతో పాటు కోచ్, సిబ్బందికి బీసీసీఐ వారికి భారీ నజరానా ప్రకటించింది. -
టీమిండియా నాల్గోసారి..
ధర్మశాల:ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ టెస్టు మ్యాచ్‌లో భారత్ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పూర్తిగా విఫలమైన భారత జట్టు..ఆసీస్ కు దాసోహమై ఓటమి చెందింది. కాగా, ఆ తరువాత సమష్టిగా రాణించి స్వదేశంలో తమకు తిరుగులేదనిపించిన భారత్ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే ఒక సిరీస్ తొలి టెస్టులో ఓటమి పాలై ఆ తరువాత సిరీస్ ను సొంతం చేసుకోవడం భారత జట్టు క్రికెట్ చరిత్రలో ఇది నాల్గోసారి మాత్రమే. అంతకుముందు 1972-73 సీజన్లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో, ఆ తరువాత 2000-01లో ఆస్టేలియాతో జరిగిన సిరీస్‌లో, 2015లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో భారత్ కు ఇదే అనుభవం ఎదురైంది. ఆయా టెస్టు సిరీస్‌ల్లో భారత్ తొలి టెస్టులో ఓటమి పాలైన కూడా ఆపై సిరీస్‌లను కైవసం చేసుకుంది. మ్యాచ్ కు సంబంధించి కొన్ని విశేషాలు.. చటేశ్వర పుజారా స్వదేశీ టెస్టుల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. అతని కెరీర్ లో స్వదేశంలో 50 ఇన్నింగ్స్ లు ఆడిన పుజారా మొదటిసారి డకౌట్ గా నిష్క్రమించాడు. విదేశాల్లో ఆడిన 31 ఇన్నింగ్స్ ల్లో పుజారా రెండుసార్లు డకౌట్ గా అవుటయ్యాడు. ముగ్గురు భారత బౌలర్లు స్వదేశంలో జరిగిన ఒక టెస్టు మ్యాచ్ ఒకే ఇన్నింగ్స్ లో మూడు అంతకుంటే ఎక్కువ వికెట్లను సాధించడం 2000వ నుంచి చూస్తే రెండోసారి మాత్రమే. అంతకుముందు న్యూజిలాండ్ తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ బౌలర్లు ఈ ఫీట్ ను సాధించారు. ఈ సిరీస్ లో ఉమేశ్ యాదవ్ సాధించిన వికెట్లు 17. దాంతో ఒక సిరీస్ లో అత్యధిక వ్యక్తిగత వికెట్లను ఉమేశ్ సాధించాడు. అంతకుముందు అతని బెస్ట్(14 వికెట్లు)ను తాజాగా అధిగమించాడు. ఈ సిరీస్ లో డేవిడ్ వార్నర్ యావరేజ్ 24.12. ఇది అతని మూడో అత్యల్ప యావరేజ్. -
టీమిండియాదే సిరీస్.
-
టీమిండియాదే సిరీస్
ధర్మశాల: ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ కు ముందు భారత్ క్రికెట్ జట్టులో ఒకే ఒక్క ఆందోళన ఉంది. ఇక్కడ ధర్మశాలలో జరిగిన అరంగేట్రపు వన్డే, ట్వంటీ 20ల్లో భారత జట్టు ఓడి పోవడం భారత్ ను తీవ్రంగా కలవరపెట్టింది. ఇది సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఆ పాత రికార్డు సెంటిమెంట్ భారత్ జట్టును ఆలోచనలో్ పడేసింది. అయితే ఆ రికార్డుకు ఘనంగా ఫుల్ స్టాప్ పెట్టింది భారత్. చివరిదైన నాల్గో టెస్టులో ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా అందుకు చరమగీతం పాడింది. తద్వారా బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని భారత్ 2-1తో కైవశం చేసుకుంది. మరొకవైపు గతంలో ఈ సిరీస్ లో ఆసీస్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది భారత్. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) నాల్గో టెస్టులో ఆసీస్ విసిరిన 106 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. 19/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. తొలి సెషన్ ఆదిలో భారత్ వరుసగా మురళీ విజయ్(8), చటేశ్వర పూజరా(0)ల వికెట్లను కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్, కెప్టెన్ అజింక్యా రహానేలు మిగతా పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగులు పెట్టించడంతో భారత్ జట్టు 25.0 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. రాహుల్(52 నాటౌట్;76 బంతుల్లో9 ఫోర్లు), రహానే(38 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ తొలి సెషన్‌లోపే గెలుపును సొంతం చేసుకుంది. రహానే జోరు.. భారత జట్టు విజయలక్ష్యాన్ని అందుకునే క్రమంలో తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడింది. తొలుత మురళీ విజయ్ వికెట్ ను కోల్పోయిన భారత్.. ఆ వెంటనే పుజరా వికెట్ ను చేజార్చుకుంది. అనవసరపు పరుగు కోసం యత్నించిన పుజరాను మ్యాక్స్ వెల్ అద్భుతమైన రీతిలో రనౌట్ చేశాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన రహానే తనశైలికి భిన్నంగా బ్యాట్ ఝుళిపించాడు. వచ్చీ రావడంతోనే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దాంతో ఈ రోజు విజయానికి కావాల్సిన 87 పరుగులను భారత్ జట్టు 18.0 ఓవర్ల లోపే సాధించి విజయబావుటా ఎగురవేసింది. ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 137 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 332 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 106/2 -
టీమిండియాకు స్వల్ప లక్ష్యం
ధర్మశాల: భారత్ తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఈ రోజు ఆటలో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ముందు మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచకల్గింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో మ్యాక్స్ వెల్(45) మినహా ఎవరూ రాణించలేదు. రెన్ షా(8), డేవిడ్ వార్నర్(6),స్టీవ్ స్మిత్(17), హ్యాండ్ స్కాంబ్(18), షాన్ మార్ష్(1), కమిన్స్ (12), ఓకీఫ్(0),లయన్(0)లు తీవ్రంగా నిరాశపరిచారు.ఈ రోజు ఆటలో భాగంగా రెండు, మూడు సెషన్లలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఆసీస్ ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసి పైచేయి సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ను భారత్ బౌలర్లు చావు దెబ్బ కొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఆసీస్ కు షాకిచ్చారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ లు తలో మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ కు వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని ఆసీస్ అడ్డుకోవడం కష్టమే. పరుగు వ్యవధిలో మూడు వికెట్లు.. ఆసీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 97 పరుగులకు ఐదు వికెట్లును, 106 పరుగులకు ఆరు వికెట్లను చేజార్చుకుని తీవ్ర ఇబ్బందుల్లో పడింది.ఇక్కడ కమిన్స్ -వేడ్‌లు కాస్త భారత్ బౌలింగ్ ను నిలువరించడంతో వికెట్ల పతనం ఆగింది. అయితే 121 పరుగుల వద్ద కమిన్స్ ఏడో వికెట్ గా అవుటైన తరువాత ఆసీస్ మరొకసారి తడబడింది. ఇక్కడ పరుగు వ్యవధిలో ఆసీస్ మూడు వికెట్లను నష్టపోవడంతో ఇక తేరుకోలేకపోయింది. అంతకుముందు 248/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆదిలో నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా (63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, వృద్ధిమాన్ సాహా(31;102 బంతుల్లో 2ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న జడేజా-సాహాలు జోడి స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 96 విలువైన భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత జడేజా అవుటయ్యాడు.ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతని లోపలికి ఆడిన జడేజా బౌల్డ్ అయ్యాడు. ఆపై భువనేశ్వర్ కుమార్, సాహా, కల్దీప్ యాదవ్‌లు కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో భారత్ కు 32 పరుగుల స్పల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 137 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 332 ఆలౌట్ -
తొలి సెషన్లోనే భారత్ ఆలౌట్
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 332 పరుగుల వద్ద ఆలౌటైంది. 248/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు ఆదిలో నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా (63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా, వృద్ధిమాన్ సాహా(31;102 బంతుల్లో 2ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి 96 విలువైన భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును భారత్ అధిగమించింది. కాగా ఏడో వికెట్ గా జడేజా పెవిలియన్ చేరిన తరువాత స్వల్ప విరామాల్లో మిగతా వికెట్లను కోల్పోయిన భారత్ లంచ్ లోపే ఇన్నింగ్స్ ను ముగించింది. ఈ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఆచితూచి ఆడింది. ఆసీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న జడేజా-సాహాలు జోడి స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు.అయితే ఆ తరువాత ఎంతోసేపో జడేజా క్రీజ్‌లో నిలవలేదు. ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బంతని లోపలికి ఆడిన జడేజా బౌల్డ్ అయ్యాడు. ఆపై భువనేశ్వర్ కుమార్, సాహా, కల్దీప్ యాదవ్‌లు కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ 32 పరుగుల ఆధిక్యంలో్ ఉంది. -
మనోళ్లు కూడా ఆసీస్ బాటలోనే..!
ధర్మశాల: చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను మూడొందల పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు.. తన తొలి ఇన్నింగ్స్ లో కూడా అపసోపాలు పడుతోంది. ఆసీస్ బాటలోనే పయనిస్తూ వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటలో తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి ఎదురీదుతోంది. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండా ఆదివారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మురళీ విజయ్(11) తొలి వికెట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు.ఆసీస్ పేసర్ హజల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరుణంలో రాహుల్ కు జత కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ (60)హాఫ్ సెంచరీ సాధించాడు.వీరిద్దరూ 87 పరుగులు జోడించిన తరువాత రాహుల్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో కెప్టెన్ అజింక్యా రహానే-పుజారాల జంట మరమ్మత్తులు చేపట్టింది. ఆసీస్ బౌలింగ్ ను ఆచితూచి ఆడుతూ స్కోరును 150 పరుగులు దాటించారు. ఆ సమయంలో హాఫ్ సెంచరీ సాధించిన పుజారా(57) మూడో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత కరుణ్ నాయర్(5) వెంటనే పెవిలియన్ చేరడంతో భారత జట్టు 167 పరుగులకే నాల్గో వికెట్‌ను కో్ల్పోయింది. ఆ తరుణంలో రహానే తో జత కలిసిన అశ్విన్ సమయోచితంగా ఆడాడు. వీరిద్దరూ 49 పరుగులు జోడించిన తరువాత రహానే(46) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో స్మిత్ క్యాచ్ ఇచ్చిన రహానే పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో అశ్విన్ (30) కూడా అవుట్ కావడంతో భారత జట్టు 221 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే వృద్దిమాన్ సాహా(10 బ్యాటింగ్;43 బంతుల్లో 1 ఫోర్ ),జడేజా(16బ్యాటింగ్; 23 బంతుల్లో 2 సిక్సర్లు)లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. భారత జట్టు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ నాలుగు వికెట్లు సాధించగా,హజల్ వుడ్, కమిన్స్‌లకు తలో వికెట్ దక్కింది. -
రెండో వికెట్ కోల్పోయిన భారత్
ధర్మశాల: ఆస్ట్రేలియాతో్ ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ జట్టు రెండో వికెట్ ను కోల్పోయింది. భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్(60;124 బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత రెండో వికెట్ గా అవుటయ్యాడు.ఆసీస్ బౌలర్ కమిన్స్ వేసిన బంతిని ఆడటంలో విఫలమైన రాహుల్ క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన బౌన్సర్‌ను హుక్ చేయబోయి వార్నర్ కు దొరికిపోయాడు. దాంతో 108 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ ను నష్టపోయింది.అంతకుముందు మురళీ విజయ్(11) తొలి వికెట్ గా అవుటయ్యాడు. హజల్ వుడ్ బౌలింగ్ లో కీపర్ వేడ్ కు క్యాచ్ ఇచ్చి విజయ్ పెవిలియన్ బాట పట్టాడు. -
నా కల నెరవేరింది: కుల్దీప్ యాదవ్
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా కొత్త కుర్రాడు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు. కుల్దీప్తో పాటు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, అశ్విన్, జడేజా, భువనేశ్వర్ తలో వికెట్ తీయడంలో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అరంగేట్ర కుర్రాడు కుల్దీప్ మీడియాతో మాట్లాడాడు. ' నేడు నా కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉన్నాను. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొలుత చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. బంతి అందుకుని తొలి ఓవర్ వేశాక టెన్షన్ కాస్త తగ్గింది' అని టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ చెప్పుకొచ్చాడు. 'బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉంది. బంతి అంతగా టర్న్ కావడం లేదు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం కలిసొచ్చింది. హ్యాండ్ స్కాంబ్ కోసం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. పిచ్ నుంచి స్పిన్నర్లకు కాస్త తోడ్పాడు అందుతుంది' అని అరంగేట్ర ప్లేయర్ కుల్దీప్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఆసీస్-భారత్ జట్లకు ఈ టెస్ట్ విజయం కీలకం. అలాంటి మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న కుల్దీప్.. టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు వికెట్ల వేటలో వెనకంజ వేయగా కీలక వికెట్లతో రాణించాడు. డేవిడ్ వార్నర్(56), హ్యాండ్ స్కాంబ్(8), గ్లెన్ మ్యాక్స్‌వెల్(8), కమిన్స్(21) ల వికెట్లు తనఖాతాలో వేసుకుని భారీ స్కోరు చేయకుండా ఆసీస్ ను నిలువరించాడు. -
ఆసీస్‌ను మొదటి రోజే కూల్చేశారు
-
ఆసీస్‌ను చుట్టేశారు..
ధర్మశాల: ఆసీస్ తో చివరిటెస్టును గెలిచి సిరీస్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ ను మొదటి రోజే కూల్చేసి శుభారంభం చేసింది. ఈ టెస్టు మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ విశేషంగా రాణించి నాలుగు వికెట్లు సాధించాడు. ఆసీస్ కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. అతనికి సాయంగా ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా, భువనేశ్వర్ కుమార్‌లు లు తలో వికెట్ తీశారు. డేవిడ్ వార్నర్(56), కెప్టెన్ స్టీవ్ స్మిత్(111),మాథ్యూ వేడ్(65)లు మాత్రమే రాణించడంతో ఆసీస్ 88.3 ఓవర్లలో 300 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి సెషన్ లో ఆసీస్ జోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి సెషన్ లో అత్యంత దూకుడు ఆడింది. ఆసీస్ ఓపెనర్ రెన్ షా(1)ను ఉమేశ్ యాదవ్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి చక్కటి ఆరంభాన్నిచ్చినా ఆ తరువాత డేవిడ్ వార్నర్-స్టీవ్ స్మిత్‌ల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. వీరు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆసీస్ ను పటిష్ట స్థితిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే స్మిత్, వార్నర్‌లు హాఫ్ సెంచరీలు సాధించారు. తొలుత స్మిత్ 67 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై వార్నర్ 72 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. దాంతో లంచ్ సమయానికి వికెట్ మాత్రమే కోల్పోయిన ఆసీస్ 131 పరుగులు చేసింది. కుల్దీప్ మ్యాజిక్.. తొలి సెషన్లో ఆసీస్ జోరు కొనసాగడంతో భారత్ వెనుకబడింది. అయితే రెండో సెషన్ లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మ్యాజిక్ ను చూపించాడు. అత్యంత తక్కువ ఎత్తులో బంతుల్ని సంధిస్తూ ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ప్రత్యేకంగా రెండో సెషన్ లో ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోతే అందులో కుల్దీప్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో టీ విరామానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లను కోల్పోయి 208 పరుగులు చేసింది. ఈ రోజు మూడో సెషన్లో మరో వికెట్‌ను సాధించిన కుల్దీప్.. ఓవరాల్‌గా నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. వేడ్ పోరాటం చివరి సెషన్ లో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఒంటరి పోరు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆసీస్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టాడు.125 బంతులను ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 57 పరుగులు చేశాడు. అతనికి జతగా కమిన్స్(21;40 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 37 పరుగులు జోడించిన తరువాత కమిన్స్ అవుటయ్యాడు. ఆపై ఓకీఫ్(8) ఎనిమిదో వికెట్ గా అవుటవ్వగా, వేడ్ తొమ్మిదో వికెట్ గా అవుటయ్యాడు.లియాన్(13) చివరి వికెట్ గా పెవిలియన్ చేరడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 0/0తో ఉంది. క్రీజ్ లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు ఉన్నారు. -
స్టీవ్ స్మిత్ మరో రికార్డు
ధర్మశాల: భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న స్టీవ్ స్మిత్..తాజాగా మరో రికార్డును కూడా నమోదు చేశాడు. భారత్ లో ఒక సిరీస్ లో మూడు సెంచరీలు సాధించిన రెండో పర్యాటక కెప్టెన్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు అలెస్టర్ కుక్ ఈ ఘనతను సాధించాడు. 2012-13 సీజన్ లో భారత్ లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించిన కుక్ మూడు శతకాలను సాధించిన తొలి కెప్టెన్ గా ఉన్నాడు. భారత్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్(111) శతకం నమోదు చేశాడు. దాంతో ఈ సిరీస్ లో మూడు శతకాలను స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించిన స్మిత్.. ఆ తరువాత మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం చేశాడు.రాంచీలో జరిగిన మూడో టెస్టులో స్మిత్ 178 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది భారత్ లో ఆసీస్ కెప్టెన్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుగా నమోదైంది. -
స్టీవ్ స్మిత్.. మళ్లీ ఆరేశాడు
ధర్మశాల: భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన స్మిత్.. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా శతకం నమోదు చేశాడు. 150 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ మార్కును చేరాడు. ఒకవైపు ఆసీస్ వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం అత్యంత నిలకడగా ఆడుతూ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచిన ఆసీస్ ఆదిలోనే రెన్ షా(1) వికెట్ ను కోల్పోయింది. ఆ క్రమంలో డేవిడ్ వార్నర్ కు జతకలిసిన స్మిత్ వన్డే తరహాలో దూకుడును ప్రదర్శించాడు. 67 బంతుల్లోనే ఆరు ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు. మరొకవైపు వార్నర్ కూడా స్మిత్ కు చక్కటి సహకారం అందివ్వడంతో ఆసీస్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఈ క్రమంలోనే వార్నర్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడి 134 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత వార్నర్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై షాన్ మార్ష్(4), హ్యాండ్సాంబ్(8), మ్యాక్స్ వెల్(8)లు పెవిలియన్ చేరారు. భారత జట్టులోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ రాణించడంతో ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరొకవైపు ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. -
అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు..
ధర్మశాల: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఒక వైపు భారత ప్రధాన స్పిన్నర్లే వికెట్ల వేటలో వెనుబడితే, కుల్దీప్ మాత్రం తన మ్యాజిక్ ను ప్రదర్శిస్తూ ఆసీస్‌కు షాకిస్తున్నాడు. ఇప్పటికే మూడు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఆసీస్ ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. ప్రధానంగా ఆసీస్ తన జోరును కొనసాగిస్తున్న సమయంలో భారత్ మంచి బ్రేకిచ్చాడు కుల్దీప్. తన టెస్టు కెరీర్ తొలి వికెట్ గా డేవిడ్ వార్నర్(56)ను అవుట్ చేసిన కుల్దీప్.. ఆ తరువాత కాసేపటికి మరో టాపార్డర్ ఆటగాడు హ్యాండ్సాంబ్(8)ని బోల్తా కొట్టించాడు. కుల్దీప్ అత్యంత తక్కువ ఎత్తులో సంధించిన బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైన హ్యాండ్సాంబ్ బౌల్డ్ అయ్యాడు. ఆపై కొద్ది వ్యవధిలోనే మ్యాక్స్ వెల్ (1) ను బౌల్డ్ చేశాడు. దాంతో 178 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ ను కోల్పోయింది. అంతకుముందు షాన్ మార్ష్(4)ను ఉమేశ్ యాదవ్ మూడో వికెట్ గా అవుట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆసీస్ దూకుడు
ధర్మశాల: భారత్ తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడును కొనసాగిస్తోంది. తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసిన ఆసీస్ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాల్గో బంతికి ఓపెనర్ రెన్ షా(1)ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత డేవిడ్ వార్నర్ కు జత కలిసిన కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా స్మిత్ మాత్రం తన జోరును కొనసాగించాడు. 67 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్ ను మరోసారి చాటుకున్నాడు. ఆ తరువాత కాసేపటికి డేవిడ్ వార్నర్ కూడా అర్ధ శతకం చేశాడు. 72 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే వీరు 100 కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. మరొకవైపు తద్వారా ఈ సీజన్ లో భారత్ గడ్డపై తొలి పది ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. తొలి పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ చేసిన స్కోరు 52. ఇదే భారత్ గడ్డపై ఈ సీజన్ తొలి పది ఓవర్ల అత్యధిక స్కోరు. అంతకుముందు రాంచీలో జరిగిన టెస్టులో ఆసీస్ మొదటి పది ఓవర్లలో నమోదు చేసిన స్కోరు 50 కాగా దాన్ని ఈ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ అధిగమించింది. -
విరాట్ సేనకు కఠిన పరీక్ష
ధర్మశాల: ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ తుది దశకు వచ్చేసింది. గవాస్కర్ -బోర్డర్ ట్రోఫీలో భాగంగా శనివారం నుంచి ధర్మశాలో ఆరంభమయ్యే నాల్గో టెస్టు ఈ సిరీస్‌లో చివరిది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రేపు ఇరు జట్ల మధ్య ఉదయం గం.9.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరిదైన నాల్గో టెస్టు కీలకంగా మారింది. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ గెలిస్తే, బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక రాంచీలో ముగిసిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ను విజయం ఊరించినప్పటికీ చివరకు డ్రాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో సిరీస్ ఫలితం కోసం ధర్మశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రికార్డును సవరిస్తారా? ఇదిలా ఉంచితే, ఈ వేదికపై జరిగిన ఆరంభపు వన్డే, ట్వంటీ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి పాలైంది. ఈ వేదికకు అంతర్జాతీయ హోదా వచ్చిన తరువాత 2013లో ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం చెందింది. ఆ తరువాత 2015లో ఇక్కడ జరిగిన తొలి ట్వంటి 20లో సైతం భారత్ కు నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత్ ఆతిథ్యమిచ్చే 27వ టెస్టు వేదికైన ఈ స్టేడియంలో విరాట్ సేనకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెస్టు గెలిచి రికార్డును భారత్ సవరిస్తుందా?లేక ఓటమి పాలై పాత కథనే పునరావృతం అనే దానిపై ఆసక్తి ఏర్పడింది. మరొకవైపు ఇక్కడ సాధారణంగానే బౌన్సీ వికెట్ కు అనుకూలం కావడంతో ఆసీస్ బౌలర్లు విజృంభించే అవకాశం ఉంది. అదే సమయంలో భారత జట్టు కూడా పేస్ బౌలింగ్ లో పటిష్టంగానే ఉంది. ఈ క్రమంలోనే తుది టెస్టులోఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి తమ బలాన్ని మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇదే జరిగితే కొన్ని రోజుల క్రితం టెస్టు జట్టులో చేరిన మొహ్మద్ షమీ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు. ప్రతీకారం తీర్చుకుంటారా? ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన గవాస్కర్ -బోర్డర్ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. 2014-15 సీజన్లో స్వదేశంలో జరిగిన ట్రోఫీని ఆసీస్ 2-0తో సొంతం చేసుకుంది. మైకేల్ క్లార్క్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు తొలి రెండు టెస్టులను గెలిచి సిరీస్ ను ఎగరేసుకుపోయింది. ఆ సిరీస్ లో స్టీవ్ స్మిత్ (769) అత్యధిక పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఇప్పుడు జరుగుతున్న సిరీస్ ను భారత్ గెలుచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరొకవైపు భారత్ ను ఒత్తిడిలో నెట్టి సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఆసీస్ యోచనగా ఉంది. దాంతో మరొకసారి రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది. -
‘ఫలితం తేలే పిచ్ ఇది’!
చివరిదైన నాలుగో టెస్టులో ఫలితం తేలే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. సిరీస్ గెలుచుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి. ‘నా ఉద్దేశం ప్రకారం ఇక్కడి వికెట్‌పై ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. నిజానికి ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది. సిరీస్ ఆరంభానికి ముందు 4–0తో గెలుస్తారని భావించారు. కానీ ఇప్పుడు వారు 1–1తో నిలిచి ఒత్తిడిలో పడ్డారు’ అని హేజల్‌వుడ్ అన్నాడు. -
ధర్మశాలలో బౌన్సీ వికెట్: క్యురేటర్
ధర్మశాల: నిర్ణాయక నాలుగో టెస్టు కోసం ధర్మశాలలో బౌన్సీ వికెట్‌ను సిద్ధం చేసినట్లు పిచ్ క్యురేటర్ సునీల్ చౌహాన్ వెల్లడించాడు. ‘ఈ రోజు వరకు నాకు ఈ పిచ్ కావాలని, ఇలా వుండాలని నన్నెవరూ కోరలేదు. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులను బట్టే పిచ్‌ను తయారు చేశాను. ఇప్పుడు కూడా బౌన్సీ వికెట్‌నే రూపొందించాను. కట్, పుల్ షాట్లు ఎక్కువగా ఆడే బ్యాట్స్‌మెన్‌కు ఇది బాగా అనుకూలిస్తుంది. గతంలో టి20లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. మ్యాచ్ ఐదు రోజులు సాగడం తథ్యం’ అని అన్నాడు. మ్యాచ్‌లో ఫలితం వచ్చే పిచ్‌నే తయారు చేశానని పేసర్లకు ఈ వికెట్ సహకరిస్తుందన్నాడు. రంజీల్లో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చాడు. -
కోహ్లీ ప్రత్యామ్నాయంగా అయ్యర్!
న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్ నేపథ్యంలో ముంబై యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. గురువారం భారత జట్టు నెట్ సెషన్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చినా బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. అతని భుజానికి ఇంకా బ్యాండేజీ కనిపిస్తోంది. కొద్ది సేపు వార్మప్‌లో పాల్గొన్న అనంతరం ఫీల్డింగ్‌లో అండర్ ఆర్మ్ త్రోలు మాత్రం విసిరాడు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు. అయితే ముందు జాగ్రత్త కోసమే అతను బ్యాటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు సమచారం. నాలుగో టెస్టుకు ముందు రోజు జరిగే ప్రాక్టీస్ సమయంలో కోహ్లి గాయంపై మరింత స్పష్టత రావచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేతికి గాయమైన విషయం తెలిసిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయి గాయపడ్డాడు. రవీంద్ర జడేజా వేసిన 39 ఓవర్ తొలి బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ బౌండరీకి తరలించే యత్నం చేశాడు. అయితే ఆ బంతిని ఆపే క్రమంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టాడు. ఇక్కడ విరాట్ ఒక పరుగును సేవ్ చేసినప్పటికీ భుజానికి గాయమైంది. కోహ్లి భుజానికి స్కానింగ్ నిర్వహించి అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది. కాగా, సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి టెస్టుకు ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. కోహ్లి గాయం నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్తగా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది. ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శుక్రవారం జట్టుతో చేరతాడు. ధర్మశాలలాంటి చోటుకు చివరి నిమిషంలో చేరుకోవడం కష్టం కాబట్టి, మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావించి అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది రంజీ ట్రోఫీలో 1321 పరుగులతో టాపర్‌గా నిలిచిన అయ్యర్, ఈ సీజన్లో కూడా ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అయ్యర్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. -
షమీపై కోహ్లి మొగ్గు
రాంచీ:ఆస్ట్రేలియాతో చివరిదైన నాల్గో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ తిరిగి తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా సోమవారం తమిళనాడుతో జరిగిన తుది పోరులో బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించిన షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటుకున్నాడు. దాంతో ఆసీస్ తో జరిగే తుది టెస్టులో షమీని జట్టులో చేర్చాలని టీమిండియా కెప్టెన్ కోహ్లి భావిస్తున్నాడు. ఇప్పటికే చివరి టెస్టు మ్యాచ్ కు జట్టు ఎంపిక కావడంతో షమీని ప్రాబబుల్స్ లో చేర్చే అవకాశం ఉంది. ఆ టెస్టు మ్యాచ్ భారత్ కు కీలకం కావడంతో షమీ తుది జట్టులో ఉంటే బౌలింగ్ బలం పెరుగుతుంది. 'తుది జట్టులో షమీ ఉంటే బౌలింగ్ మరింత పటిష్టంగా ఉంటుంది. దీనిపై సెలక్టర్లకు నేనేమీ చెప్పలేదు. అతని ఎంపికకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం' అని కోహ్లి తెలిపాడు.ఒకవేళ షమీకి తుది జట్టులో ఆడే అవకాశం కల్పిస్తే మాత్రం ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ల్లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. -
మరో రికార్డుకు చేరువలో అశ్విన్
ముంబై:భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తో నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన నాల్గో మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లు తీసి అదుర్స్ అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. తద్వారా 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన రెండో భారత్ బౌలర్ గా నిలిచాడు. భారత్ నుంచి అశ్విన్ ఏడుసార్లు 10 వికెట్ల మార్కును చేరాడు. దాంతో భారత్ తరపున 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన అనిల్ కుంబ్లే తరువాత స్థానంలో అశ్విన్ నిలిచాడు. కుంబ్లే 8 సార్లు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆ రికార్డును అశ్విన్ అధిగమించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇంకా ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్, ఆపై స్వల్ప వ్యవధిలో ఆసీస్‌తో సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో అక్కడ అశ్విన్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అనిల్ కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను చేరగా, అశ్విన్ 43 మ్యాచ్‌ల్లోనే ఏడుసార్లు 10 వికెట్లను సాధించడం విశేషం. మరొకవైపు కపిల్ దేవ్ 23 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డును అశ్విన్ అధిగమించాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ ద్వారా అశ్విన్ 24వ సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు అశ్విన్ సాధించాడు. ఈ జాబితాలో భారత్ నుంచి కుంబ్లే(35సార్లు), హర్భజన్(25సార్లు)వరుస స్థానాల్లో ఉన్నారు. ఇటీవల 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇంగ్లండ్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొయిన్ అలీవికెట్ను సాధించడం ద్వారా భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఏడో బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-0తో సొంతం చేసుకుంది. చివరి, ఐదో రోజు సోమవారం.. 182/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. భారత బౌలర్ అశ్విన్ అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎంతో సేపు సాగలేదు. అశ్విన్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ తొలుత ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో (51)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ వరుస ఓవర్లలో వోక్స్, రషీద్, ఆండర్సన్లను పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. భారత్ లక్ష్యసాధనకు దిగకుండానే ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజు ఆటలో కేవలం 8.0ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లండ్ మిగతా నాలుగు వికెట్లను నష్టపోయింది. దాదాపు మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోపే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 400, భారత్ 631 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. -
వీర విరాట పర్వం కొనసాగిస్తున్న కోహ్లీ
-
కోహ్లీపై గవాస్కర్ సంచలన కామెంట్!
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విచిత్రమైన కామెంట్ చేశాడు. విరాట్ మన గ్రహానికి చెందినవాడు కాదని, ఇంకా ఎవరూ కనిపెట్టని గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కోహ్లీ ఆటతీరు ఎంతో అత్యుత్తమంగా ఉందని అసలు అతని గురించి ఎలా చెప్పాలో కూడా తనకు అర్థం కావడం లేదని దిగ్గజ ఆటగాడు గవాస్కర్ పేర్కొన్నాడు. రోజురోజుకు అతడు ఎంతో రాణిస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు. ‘వన్డే, టెస్టులు, టీ20లు, ఐపీఎల్ ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా కోహ్లీ దూసుకుపోతున్నాడు. భారత్ బ్యాటింగ్ కు అతడు వెన్నెముక లాంటివాడు. కెప్టెన్ గా అతడు ఇంకా చాలా చిన్నవాడు. రోజు ఏదో ఒక విషయాన్ని అతడు నేర్చుకోవడం మంచిది. ముంబై స్డేడియంలో చివరి రోజు 150 స్కోరు ఛేదించడం అంత ఈజీ కాదు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. -
ఇంగ్లండ్ విలవిల
ముంబై:భారత్ తో జరుగుతున్న నాల్గో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది. ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభింన ఇంగ్లండ్.. టీ విరామానికి మూడు కీలక వికెట్లను చేజార్చుకుని 49 పరుగులు సాధించింది. దాంతో విరాట్ సేన మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సేపటికే గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో జెన్నింగ్స్‌ను కోల్పోయింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 1 పరుగు కాగా, జెన్నింగ్స్ డకౌట్ గా అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి జెన్నింగ్స్ ఎల్బీగా అవుటయ్యాడు.ఆ తరువాత అలెస్టర్ కుక్(18), మొయిన్ అలీ(0) వికెట్లను ఇంగ్లండ్ స్వల్ప వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లు జడేజా ఖాతాలో పడ్డాయి. అంతకుముందు భారత్ తన ఇన్నింగ్స్ లో 631 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. విరాట్ కోహ్లి(235) డబుల్ సెంచరీ సాధించగా, జయంత్ యాదవ్(104)పరుగులను సాధించాడు. అంతకముందు మురళీ విజయ్(136) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మరో ఆటగాడు చటేశ్వర పూజారా(47) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. -
ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్
ముంబై:భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో విరాట్(235) డబుల్ సెంచరీతో మెరిశాడు. దాంతో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత్ టెస్టు కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై ఎంఎస్ ధోని సాధించిన 224 పరుగులే ఇప్పటివరకూ టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు. దీన్ని కోహ్లి అధిగమించాడు. మరొకవైపు ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన భారత తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది వెస్టిండీస్ తో ఆ దేశంలో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విరాట్.. ఆ తరువాత ఇటీవల న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్టులో కూడా డబుల్ సాధించాడు..ఇదిలా ఉండగా, ఒక ఏడాది మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడు కూడా కోహ్లినే. గతంలో ఒక క్యాలెండర్ ఇయర్ లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు. 1955లో వినోద్ మన్కడ్, 1992లో కాంబ్లి, 2003లో ద్రవిడ్ ఆ ఘనతను సాధించిన భారత ఆటగాళ్లు. కాగా, ఒక సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు, ఒక ఏడాదిలో టెస్టులో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు.ఈ సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్‌లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. ఇప్పటివరకూ ఈ ఫీట్‌ను గవాస్కర్ మాత్రమే రెండుసార్లు సాధించాడు. 1978-79 సీజన్లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేయగా,1981-82 సీజన్లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించాడు. -
భళా..టీమిండియా
ముంబై:ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు సెంచరీలతో చెలరేగిపోయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ముందుగా మురళీ విజయ్ సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో సూపర్ షో ప్రదర్శించాడు. మరో ఆటగాడు జయంత్ యాదవ్ తాను ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అదుర్స్ అనిపించాడు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 631 పరుగులు చేసింది. ఓవరాల్‌గా టీమిండియా 231 పరుగుల ఆధిక్యం సాధించి భళా అనిపించింది. 451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్‌లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ 241పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా, మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు జయంత్ యాదవ్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) శతకంతో మెరిశాడు. అయితే జయంత్ యాదవ్ ఎనిమిదో వికెట్ గా అవుటైన కాసేపటికే విరాట్(235;340 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్) తొమ్మిదో వికెట్ పెవిలియన్ చేరాడు. ఇంగ్లిష్ బౌలర్ వోక్స్ బౌలింగ్ లో అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి విరాట్ అవుటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో భువనేశ్వర్ కుమార్(9) కూడా అవుట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషిద్ నాలుగు వికెట్లు సాధించగా, అలీ, రూట్లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వోక్స్ , బాల్‌లకు చెరో వికెట్ గా దక్కింది. -
వందేళ్ల రికార్డును చేజార్చుకున్నారు..
ముంబై:భారత క్రికెట్ జట్టు ఒక రికార్డును తృటిలో చేజార్చుకుంది. ఇంగ్లండ్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఎనిమిదో వికెట్ కు 241 పరుగులను సాధించింది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్‌లు ఎనిమిదో వికెట్ కు ఈ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే మూడు పరుగుల వ్యవధిలో ఈ జోడి ఇంగ్లండ్ పై ఒక రికార్డును కోల్పోయింది. అది కూడా వందేళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ టెస్టు రికార్డు. 1908లో ఇంగ్లండ్ పై ఎనిమిదో వికెట్ కు హార్టిగన్, హిల్(ఆస్ట్రేలియా)లు నమోదు చేసిన ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం 243. ఇదే నేటికి ఇంగ్లండ్ పై ఎనిమిదో వికెట్ కు అత్యుత్తమం. ఆ రికార్డును భారత జట్టు స్వల్ప తేడాలో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో జయంత్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీ చేసి ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. మరొకవైపు అంతకముందు విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ సాధించడంతో 'రికార్డు' భాగస్వామ్యం నమోదైంది. -
జయంత్ యాదవ్ రికార్డు
ముంబై: ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టులో భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా తొలి టెస్టు సెంచరీ సాధించిన జయంత్ యాదవ్.. తొమ్మిదో వికెట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.భారత క్రికెట్ చరిత్రలో తొమ్మిది వికెట్‌గా వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇది జయంత్ యాదవ్ కు మూడో టెస్టు మ్యాచ్. విశాఖలో జరిగిన రెండో టెస్టుతో తన టెస్టు కెరీర్‌ను ఆరంభించిన జయంత్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసి నాటౌట్ గా క్రీజ్‌లో నిలిచాడు. ఆ తరువాత మొహాలీలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జయంత్(55) హాఫ్ సెంచరీ నమోదు చేయగా,రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో ఒక సిరీస్‌లో రెండొందలకు పైగా పరుగులను జయంత్ యాదవ్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ ఎనిమిది వికెట్లను జయంత్ సాధించాడు. విరాట్ డబుల్, జయంత్ యాదవ్ శతకాలతో భారత్ ఆరు వందలకు పైగా స్కోరు సాధించింది. జయంత్(104) ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. -
20 ఏళ్ల తరువాత టీమిండియా..
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ క్రికెట్ జట్టు మరో రికార్డును సవరించింది శుక్రవారం మూడో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పలు అరుదైన ఘనతలను సొంతం చేసుకోగా, నాల్గో రోజు ఆటలో మరో రికార్డులో భాగస్వామ్యం అయ్యాడు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ జయంత్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని లిఖించాడు. ఈ జోడి 161 పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించారు. తద్వారా గతంలో భారత్ తరపున మొహ్మద్ అజహరుద్దీన్-అనిల్ కుంబ్లేలు నమోదు చేసిన అత్యధిక ఎనిమిదో వికెట్ భాగస్వామ్యాన్ని సవరించారు. 1996లో కోల్ కతాలో అజహర్-కుంబ్లేలు నమోదు చేసిన 161 పరుగులకే ఇప్పటివరకూ ఎనిమిదో వికెట్‌కు భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం. ఈ రికార్డును దాదాపు 20 ఏళ్ల తరువాత టీమిండియా అధిగమించడం విశేషం. తొలి సెషన్లో వీరిద్దరూ రాణించడంతో భారత్ జట్టు ఐదు వందల పరుగుల మార్కును దాటింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 158.0 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 529 పరుగులు చేసింది. దాంతో భారత్ కు 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. -
ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్!
-
ఈ సెంచరీ వెరీ వెరీ స్పెషల్!
ముంబై: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో తాను సాధించిన శతకం ఎంతో ప్రత్యేకమైనదని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. మూడోరోజు ఆట నిలిపివేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో తాను పూర్తిగా విఫలం కావడంతో తనపై ఎంతో ఒత్తిడి పెరిగిందన్నాడు. దీంతో సరైన సమయంలో తన బ్యాట్ నుంచి పరుగులు రావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నాడు. ‘గత నాలుగు ఇన్నింగ్స్ లలో పరుగులు చేయాలని ప్రయత్నించినా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాను. ఈ టెస్టులో క్లియర్ మైండ్ సెట్ తో బ్యాటింగ్ చేశాను. ఈ టెస్టుకు ముందు వారం రోజుల విరామం రావడం కూడా కలిసొచ్చింది’ అని సెంచరీ వీరుడు విజయ్ వివరించాడు. 2002లో చివరిసారిగా వీరేంద్ర సెహ్వాగ్ ఇక్కడ టెస్టు సెంచరీ చేసిన 14 ఏళ్లకు శతకం నమోదు చేసిన ఓపెనర్ గానూ విజయ్ రికార్డు నెలకొల్పాడు. మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. -
టీమిండియాదే పైచేయి
-
టీమిండియాదే పైచేయి
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోని నిలిచింది. తొలుత ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఆ తరువాత మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి పైచేయి సాధించింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, జట్టు స్కోరు 262 పరుగుల వద్ద ఉండగా విజయ్ నిష్ర్రమించడంతో ఆపై స్వల్ప వ్యవధిలో టీమిండియా కొన్ని కీలక వికెట్లను చేజార్చుకుంది. భారత్ ఆటగాళ్లలో కరణ్ నాయర్(13),పార్థీవ్ పటేల్(15),అశ్విన్ (0)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలీ, రషిద్,రూట్లకు తలో రెండు వికెట్లు లభించగా, బాల్ కు వికెట్ దక్కింది. అంతకుముందు 146/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు ఆటలో ఇన్నింగ్స్ రెండో బంతికే పూజారా(47)ను బాల్ అవుట్ చేయడంతో భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కాగా, విరాట్ పలు కీలక భాగస్వామ్యాలను సాధించడంతో టీమిండియా తేరుకుంది. తొలి సెషన్లో భారత్ నిలకడ ఈ రోజు ఆటలో లంచ్ సమయం వరకూ భారత్ అత్యంత నిలకడగా ఆడింది. తొలి సెషన్ పూర్తియ్య సరికి రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులతో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. మురళీ విజయ్-కోహ్లిల చక్కటి సహకారంతో భారత్ దూసుకుపోయింది. . పూజారా నిష్క్రమణ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి ఎటువంటి తడబాడు లేకుండా స్కోరును పెంచుకుంటూ పోయాడు. దీనిలో భాగంగానే విజయ్ తో కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే విజయ్ శతకం సాధించాడు. రెండో సెషన్లో తడబాటు లంచ్ తరువాత భారత్ తడబాటుకు గురైంది. జట్టు స్కోరు 262 పరుగుల వద్ద విజయ్ మూడో వికెట్ గా పెవిలియన్ చేరిన తరువాత వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కరణ్ నాయర్ , పార్థీవ్ పటేల్, అశ్విన్ వికెట్లను వరుసగా నష్టపోయింది. దాంతో టీ విరామ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 348 పరుగులను చేసిన భారత్ ..నాలుగు వందల మార్కును చేరడం గగనంగా అనిపించింది. కాగా, జడేజాతో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ను సమయోచితంగా నడిపించాడు. మంచి బంతులను వదిలిపెడుతూనే, చెడ్డ బంతులను మాత్రం బౌండరీ దాటిస్తూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. మూడో సెషన్లో భారత్ జోరు మూడో సెషన్ లో భారత్ జోరు కొనసాగింది. ఈ సెషన్ ఆదిలో జడేజాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు.ఈ జోడి ఏడో వికెట్ కు 57 పరుగులు చేసిన అనంతరం జడేజా అవుటయ్యాడు. దాంతో 364 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ నష్టపోయింది. ఆ తరుణంలో విరాట్ తో కలిసిని జయంత్ యాదవ్ అత్యంత బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ రోజు ఆటలో విరాట్-జయంత్‌ల జోడి 87 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే విరాట్ తన కెరీర్లో 15వ టెస్టు సెంచరీ సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కు జతగా జయంత్ యాదవ్(30 బ్యాటింగ్; 86 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
విరాట్ @500!
-
విరాట్ @500!
ముంబై:ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.ఒక సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్‌లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. ఇప్పటివరకూ ఈ ఫీట్‌ను గవాస్కర్ మాత్రమే రెండుసార్లు సాధించాడు. 1978-79 సీజన్లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేయగా,1981-82 సీజన్లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించాడు. ఇదిలా ఉండగా, ఈ సిరీస్‌లో 500 పరుగులను సాధించే క్రమంలో విరాట్ యావరేజ్ 120.0కు పైగా ఉండటం మరో విశేషం. మరొకవైపు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ శతకంతో మెరిశాడు.187 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు.ఇది విరాట్ 15వ టెస్టు సెంచరీ అంతకుముందు ఇదే మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు. -
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ
ముంబై:ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. 113 బంతుల్లో 5 ఫోర్లతో అర్థశతకం చేశాడు. అంతకుముందు భారత ఓపెనర్ మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించాడు. కాగా, అబ్దుల్ రషిద్ వేసిన ఓవర్లో అతనికే క్యాచ్ ఇచ్చి విజయ్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. విరాట్ తో కలిసి 76 పరుగులు జత చేసిన తరువాత విజయ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది విరాట్ టెస్టు కెరీర్లో 15 హాఫ్ సెంచరీ. మూడో రోజు ఆటలో 146/1 ఓవర్ నైట్ స్కోరు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. దీనిలో భాగంగా ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ శతకం పూర్తి చేసుకోగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు చటేశ్వర పూజారా(47) హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు.ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే పూజారాను బాల్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ జట్టు 146 పరుగుల వద్దే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఈ తరుణంలో విజయ్‌కు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి సమయోచితంగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.ఈ క్రమంలోనే విజయ్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీ నమోదు చేశాడు. -
విరాట్ మరో రికార్డు!
ముంబై: పరుగుల దాహంతో చెలరేగిపోతున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు. విరాట్ సాధించిన వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్‌ల్లో 17 వ ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ మార్కును చేరాడు. ఒక క్యాలెండర్ ఇయర్ వెయ్యి పరుగులు సాధించే క్రమంలో విరాట్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 211. ఇదిలా ఉండగా ఒక ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ ముందంజలో ఉన్నాడు. 2010లో సచిన్ 1562 పరుగులను చేశాడు.ఆ తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు. 2010లో సెహ్వాగ్ 1422 పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో విశాఖలో జరిగిన రెండో టెస్టులో విరాట్ ఒక రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఓవరాల్‌గా 248 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. విశాఖ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులతో మెరవడంతో ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ ఎట్ 4,000! మరొకవైపు ఈ మ్యాచ్‌లో 41 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి.. టెస్టుల్లో నాలుగువేల పరుగుల మార్కును చేరాడు. దాంతో టెస్టుల్లో నాలుగు వేల పరుగుల సాధించిన 14వ భారత ఆటగాడిగా విరాట్ నిలిచాడు. -
శతక్కొట్టిన విజయ్
ముంబై:ఇంగ్లండ్‌తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ శతకం సాధించాడు. 231 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. 146/1 ఓవర్ నైట్ స్కోరు మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ శతకం పూర్తి చేసుకోగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు చటేశ్వర పూజారా(47) హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే పూజారాను బాల్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ జట్టు 146 పరుగుల వద్దే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఈ తరుణంలో విజయ్‌కు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి సమయోచితంగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీ నమోదు చేశాడు. దాంతో భారత్ 72.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఈ సిరీస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విజయ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
ఎదురుదాడి మొదలు
ముంబై టెస్టులో రెండో రోజు ఆటలో ఆధిక్యం భారత్, ఇంగ్లండ్ మధ్య దోబూచులాడింది. ముందుగా చేతిలో ఉన్న ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తాము ఆశించిన రీతిలో 400 పరుగుల మార్క్‌ను చేరుకోగా... ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ కూడా గట్టిగా నిలబడి జట్టుకు శుభారంభం అందించారు. తొలి సెషన్‌ను ఇంగ్లండ్, చివరి సెషన్‌ను భారత్ సొంతం చేసుకోగా, రెండో సెషన్‌ను ఇరు జట్లూ పంచుకున్నారుు. అటు బట్లర్, ఇటు విజయ్ బ్యాటింగ్ ఆటలో హైలైట్‌గా నిలవగా, ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో మరోసారి ‘ఇన్నింగ్సలో ఐదు వికెట్ల ఘనత’ను అశ్విన్ తన జేబులో వేసుకున్నాడు. తమ బ్యాటింగ్ బలగం స్థాయికి తగినట్లుగా భారత్ మూడో రోజు కూడా సత్తా చాటితే ఆట ముగిసే సరికి ఆధిక్యం మన సొంతం కావచ్చు. అప్పుడు తర్వాతి రెండు రోజుల ఆట ఆసక్తికరంగా మారిపోతుంది. ఒకవేళ మ్యాచ్ ఆరంభానికి ముందు అంచనా వేసినట్లుగా మూడో రోజు నుంచే బంతి అనూహ్యంగా తిరిగినా... ప్రత్యర్థి జట్టులో దానిని సమర్థంగా ఉపయోగించుకునే స్థాయి నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం మన జట్టుకు అనుకూలాంశం. మొత్తంగా శనివారం జరగబోయే ఆట నాలుగో టెస్టు, సిరీస్ ఫలితాన్ని తేల్చే అవకాశం ఉంది. భారత్ 146/1 రాణించిన మురళీ విజయ్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్సలో 400 ఆలౌట్ 6 వికెట్లు తీసిన అశ్విన్ ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తమ తొలి ఇన్నింగ్‌సను మెరుగైన రీతిలో ఆరంభించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన మురళీ విజయ్ (169 బంతుల్లో 70 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (102 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 107 పరుగులు జోడించారు. రాహుల్ (24) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్కోరుకు భారత్ మరో 254 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 288/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్సలో 400 పరుగులకు ఆలౌటైంది. జాస్ బట్లర్ (137 బంతుల్లో 76; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ (6/112) చెలరేగగా, రవీంద్ర జడేజాకు మిగిలిన 4 వికెట్లు దక్కాయి. అశ్విన్ మాయ... అశ్విన్ ఇన్నింగ్సలో 5 వికెట్లు పడగొట్టడం ఇది 23వ సారి. దీంతో అతను కపిల్ దేవ్ (23) రికార్డును సమం చేశాడు. కేవలం 43 టెస్టుల్లోనే అశ్విన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఎక్కువ సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లలో కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25) మాత్రమే అశ్విన్‌కంటే ముందు ఉన్నారు. ఓవరాల్‌గా సిడ్నీ బార్న్స మాత్రమే అశ్విన్ కంటే వేగంగా 27 టెస్టుల్లో రికార్డును నమోదు చేశాడు. ఈ ఒక్క ఏడాదే అశ్విన్ 7 సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో ఆడిన 26 టెస్టుల్లోనే అశ్విన్ 18 సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు తీయడం మరో విశేషం. 2016లో ఇప్పటికే 48 వికెట్లు తీసిన అశ్విన్, భారత గడ్డపై ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌గా ఎరాపల్లి ప్రసన్న (46) పేరిట 1969 నుంచి ఉన్న రికార్డును తిరగరాశాడు. చరిత్ర ఏం చెబుతోంది? ఈ సిరీస్‌లోని గత రెండు టెస్టుల్లో ఇరు జట్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే ముంబైలో టెస్టు రికార్డు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇంగ్లండ్‌కు ఈ మైదానం బాగా కలిసొచ్చింది. ఆ జట్టు వాంఖెడే స్టేడియంలో ఆడిన గత రెండు టెస్టులలోనూ గెలిచింది. వాటిలో రెండు సార్లు తొలి ఇన్నింగ్సలో 400 స్కోరు చేసింది. 2006లోనైతే సరిగ్గా 400 పరుగులే చేసింది. పోలిక న్యాయం కాదు గానీ నాడు కూడా ఆశ్చర్యకరంగా దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్‌కు ఆడిన ఓపెనర్ స్ట్రాస్ సెంచరీ చేశాడు! ఈ మైదానంలో 400 పరుగులు చేసిన తర్వాత నిశ్చింతగా ఉండవచ్చని గణాంకాలు చెబుతున్నారుు. ఈ మ్యాచ్‌కు ముందు 1975 నుంచి ఇక్కడ మొత్తం 14 టెస్టులు జరిగారుు. వీటిలో ఒక్కసారి మాత్రమే 400 పరుగులు చేసి కూడా భారత్, వెస్టిండీస్ చేతిలో ఓడింది. అది మినహా మిగిలిన 13 టెస్టులలో తొలి ఇన్నింగ్సలో 400 పరుగులు చేసిన జట్లు 6 సార్లు గెలవగా, మరో 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశారుు. ఉపఖండంలో ఆడిన మ్యాచ్‌లలో తొలి ఇన్నింగ్సలో 400 పరుగులు చేసిన తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టెస్టు ఓడిపోలేదు. అరుుతే 2000 నుంచి చూస్తే ప్రత్యర్థి 400కు పైగా చేసినా... ఇతర జట్లకంటే ఎక్కువ సార్లు (8) మ్యాచ్‌లు గెలవగలిగిన రికార్డు మాత్రం భారత్‌దే. మరి ఈ సారి ఫలితం ఎలా ఉండబోతోందో. సెషన్-1: బట్లర్ జోరు రెండో రోజు ఆరంభంలోనే ఇంగ్లండ్ వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన మూడో ఓవర్లో స్టోక్స్ (92 బంతుల్లో 31; 3 ఫోర్లు) వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. స్టోక్స్ డిఫెన్స ఆడబోగా, బంతి కీపర్‌కు తగులుతూ వెళ్లి స్లిప్‌లో కోహ్లి చేతిలో పడింది. భారత్ అప్పీల్‌ను అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ తిరస్కరించడంతో కోహ్లి రివ్యూ కోరాడు. టీవీ రీప్లేలు చూసిన అనంతరం బంతి బ్యాట్‌ను దాటే సమయంలో దిశ మళ్లిందని నిర్ధారించిన మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అయితే హాక్ ఐ లో ‘అల్ట్రా ఎడ్జ’ గుర్తించిన శబ్దాన్ని బట్టి అంపైర్ శంషుద్దీన్ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణమైంది. అదే సమయంలో బ్యాట్ కూడా నేలకు తగలడం వల్లే శబ్దం వచ్చిందని భావించిన స్టోక్స్, నిరాశగా వెనుదిరిగాడు. మరోవైపు బట్లర్ మాత్రం వేగంగా ఆడి చకచకా పరుగులు రాబట్టాడు. అయితే తక్కువ వ్యవధిలో వోక్స్ (11), రషీద్ (4)లను అవుట్ చేసి జడేజా, భారత్‌కు మరో రెండు వికెట్లు అందించాడు. అనంతరం 106 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌కు జేక్ బాల్ (60 బంతుల్లో 31; 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఎట్టకేలకు 121 ఓవర్ల తర్వాత భారత్ కొత్త బంతిని తీసుకుంది. ఓవర్లు: 31, పరుగులు: 97, వికెట్లు: 3 (ఇంగ్లండ్) సెషన్-2: రాహుల్ విఫలం లంచ్ తర్వాత కొద్దిసేపటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స ముగిసింది. తొమ్మిదో వికెట్‌కు బట్లర్‌తో కలిసి 54 పరుగులు జోడించిన బాల్‌ను అశ్విన్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అశ్విన్ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం బట్లర్... జడేజా వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే మరో భారీ షాట్ ఆడబోరుు వెనుదిరిగాడు. భారత ఓపెనర్లు విజయ్, రాహుల్ (41 బంతుల్లో 24; 4 ఫోర్లు) జాగ్రత్తగా ఇన్నింగ్స మొదలు పెట్టారు. రాహుల్ కొన్ని చక్కటి షాట్లు ఆడగా, ఫామ్‌లో వచ్చేందుకు ప్రయత్నించిన విజయ్, ఓపిగ్గా బంతులను ఎదుర్కొన్నాడు. అరుుతే మెరుగైన ఆరంభాన్ని మళ్లీ వృథా చేస్తూ రాహుల్ వికెట్ చేజార్చుకున్నాడు. అలీ బంతిని డ్రైవ్ చేయడంలో విఫలమై రాహుల్ బౌల్డయ్యాడు. రషీద్ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో విజయ్ వేగం పెంచాడు. ఓవర్లు: 5.1, పరుగులు: 15, వికెట్లు: 2 (ఇంగ్లండ్) ఓవర్లు: 22, పరుగులు: 62, వికెట్లు: 1 (భారత్) సెషన్-3: భారత్‌దే పైచేయి విరామం తర్వాత విజయ్, పుజారా ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. క్రీజ్‌లోకి పాతుకుపోయిన వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడారు. 45 పరుగుల వద్ద విజయ్ను స్టంప్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని బెయిర్‌స్టో వృథా చేశాడు. అండర్సన్ ఓవర్లో పుజారా వరుసగా రెండు బౌండరీలు బాదగా... అలీ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా ఫోర్ కొట్టి 126 బంతుల్లో విజయ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు కుక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. రాహుల్ అవుటైన తర్వాత విజయ్, పుజారా 38 ఓవర్లు మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో రెండో రోజును కోహ్లి సేన సంతృప్తికరంగా ముగించగలిగింది. రెండో రోజు బంతి చెప్పుకోదగ్గ రీతిలో స్పిన్, బౌన్స అయినా... ఇంగ్లండ్ ప్రధాన స్పిన్నర్లు అలీ, రషీద్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఓవర్లు: 30, పరుగులు: 84, వికెట్లు: 0 (భారత్) స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇఇన్నింగ్స్: కుక్ (స్టంప్డ్) పార్థివ్ (బి) జడేజా 46; జెన్నింగ్‌స (సి) పుజారా (బి) అశ్విన్ 112; రూట్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 21; అలీ (సి) నాయర్ (బి) అశ్విన్ 50; బెరుుర్‌స్టో (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 14; స్టోక్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 31; బట్లర్ (బి) జడేజా 76; వోక్స్ (సి) పార్థివ్ (బి) జడేజా 11; రషీద్ (బి) జడేజా 4; బాల్ (సి) పార్థివ్ (బి) అశ్విన్ 31; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (130.1 ఓవర్లలో ఆలౌట్) 400. వికెట్ల పతనం: 1-99; 2-136; 3-230; 4-230; 5-249; 6-297; 7-320; 8-334; 9-388; 10-400. బౌలింగ్: భువనేశ్వర్ 13-0-49-0; ఉమేశ్ 11-2-38-0; అశ్విన్ 44-4-112-6; జయంత్ 25-3-89-0; జడేజా 37.1-5-109-4. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) అలీ 24; విజయ్ (బ్యాటింగ్) 70; పుజారా (బ్యాటింగ్) 47; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (52 ఓవర్లలో వికెట్ నష్టానికి) 146. వికెట్ల పతనం: 1-39. బౌలింగ్: అండర్సన్ 8-4-22-0; వోక్స్ 5-2-15-0; అలీ 15-2-44-1; రషీద్ 13-1-49-0; బాల్ 4-2-4-0; స్టోక్స్ 4-2-4-0; రూట్ 3-1-3-0. -
దీటుగా బదులిస్తున్నవిరాట్ సేన
-
దీటుగా బదులిస్తున్నవిరాట్ సేన
ముంబై: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 52.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. మురళీ విజయ్(70 బ్యాటింగ్;169 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్లు), చటేశ్వర పూజారా(47 బ్యాటింగ్;102 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. తొలుత ఇంగ్లండ్‌ను 400 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. భారత ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్‌తో కలిసి మురళీ విజయ్ ప్రారంభించాడు.కాగా, రాహుల్(24) తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత విజయ్‌తో కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే విజయ్ 126 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్థ శతకం సాధించాడు. ఇది విజయ్ కెరీర్లో 15వ హాఫ్ సెంచరీ. అంతకుముందు 88/5 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 112 పరుగులు జత చేసింది. ఓవర్ నైట్ ఆటగాడు బెన్ స్టోక్స్(31)ను తొందరగానే పెవిలియన్ కు పంపినా, మరో ఓవర్ నైట్ ఆటగాడు జాస్ బట్లర్(76) చివరి వికెట్‌గా అవుటయ్యాడు. ప్రతీ ఆటగాడితో ఎంతో కొంత భాగస్వామ్యం నెలకొల్పతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ప్రధానంగా జాక్ బాల్(31)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే లంచ్ తరువాత బట్లర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నాల్గొందల మార్కును చేరింది. కాగా, జడేజా బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించిన బట్లర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించగా, జడేజా నాలుగు వికెట్లు తీశాడు. -
అశ్విన్ మరో ఘనత
ముంబై: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లోభాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ వికెట్‌ను సాధించడం ద్వారా భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఏడో బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు. ఈ టెస్టుకు ముందు అశ్విన్ ఖాతాలో 235 వికెట్లు ఉండగా.. ఈ మ్యాచ్‌లో రూట్, అలీ వికెట్లను తీయడం ద్వారా శ్రీనాథ్ రికార్డును అశ్విన్ సవరించాడు. కాగా,ఆ తరువాత జెన్నింగ్స్, బెయిర్ స్టోలను కూడా పెవిలియన్ కు పంపి సత్తా చాటాడు. ఇటీవల ఫాస్టెస్ 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆల్ రౌండర్ కోటాను సమర్ధవంతంగా పోషిస్తున్న అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ మెరుస్తూ టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
జెన్నింగ్స్ 'సెంచరీ' రికార్డు!
ముంబై:భారత్ తో జరుగుతున్న ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ఇక్కడ ఇప్పటివరకూ అరంగేట్రపు అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు. మరొకవైపు భారత్ లో 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు అంతకుపైన వచ్చి భారత్‌లో 50 పైగా పరుగులు సాధించిన ఇంగ్లిష్ అరంగేట్రం ఆటగాళ్లలో అలెస్టకుక్, ఓవై షా, రూట్, హమిద్లున్నారు. ఈ మ్యాచ్ లో అలెస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జెన్నింగ్స్ ఎటువంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ సాగించాడు. అటు భారత పేసర్లను, ఇటు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌కు మంచి పునాది వేశాడు. 186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఓవరాల్‌గా అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 19వ ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. కౌంటీ మ్యాచ్‌ల్లో అమోఘమైన పరుగుల రికార్డు ఉన్న జెన్నింగ్స్ సొంతం. 2016లో 1548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ గుర్తింపు పొందాడు. ఈ పరుగులు సాధించే క్రమంలో అత్యధిక సెంచరీలు(7) రికార్డు కూడా అతని పేరిటే లిఖించబడటం విశేషం. -
టీమిండియా తొలిసారి..
ముంబై: గత ఎనిమిది దశాబద్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఓ సంప్రదాయానికి ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు చరమగీతం పాడింది. ముంబై నగరంలో జరిగే టెస్టు మ్యాచ్‌ల్లో ముంబైకి చెందిన ఆటగాడు లేకుండా టీమిండియా తొలిసారి బరిలోకి దిగడం గత 83 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1933 నుంచి చూస్తే ఇక్కడ జరిగిన ఏ టెస్టులో కూడా ముంబై ఆటగాడు తుది జట్టులో లేకుండా పోరుకు సిద్ధమవ్వలేదు. తాజాగా ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ముంబై ఆటగాళ్లకి అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా ముంబైకి చెందిన శార్దూల్ ఠాకూర్ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కాగా, అతన్ని ఈ టెస్టు మ్యాచ్‌లో ఎంపిక చేయకపోవడంతో ఆనాటి నుంచి వస్తున్న సంప్రదాయానికి తెరదించినట్లైంది. ఇదిలా ఉండగా, నాల్గో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ మ్యాచ్‌ల్లో అమోఘమైన పరుగుల రికార్డు ఉన్న జెన్నింగ్స్.. 2016లో 1548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ కు అరుదైన ఘనత ఉంది. ఈ పరుగులు సాధించే క్రమంలో అత్యధిక సెంచరీలు(7) రికార్డు కూడా అతని పేరిటే లిఖించబడింది. ఇంగ్లండ్ ఓపెనర్ హషిబ్కు విశ్రాంతినివ్వడం ద్వారా అతని స్థానంలో జెన్నింగ్స్ కు అవకాశం కల్పించారు. -
పార్థీవ్కు లైన్ క్లియర్
ముంబై: మరో రెండు రోజుల్లో నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో ఆరంభం కానున్న నాల్గో టెస్టులో భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఆడేందుకు లైన్ క్లియరైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో పార్థీవ్ ను నాల్గో టెస్టులో ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు. మొహాలీలో మూడో టెస్టుకు ముందు సాహా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో అనూహ్యంగా పార్థీవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ అవకాశాన్ని పార్థీవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జట్టులో పునరాగమనం చేసిన పార్థీవ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నాల్గో టెస్టులో ఆడనున్నాడు. అతను గాయం నుంచి తిరిగి కోలుకోవడంతో జట్టులో ఎంపికయ్యాడు. నాల్గో టెస్టులో మురళీ విజయ్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఆ క్రమంలోనే పార్థీవ్ టాపార్డర్‌లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. మరొకవైపు పేసర్ ఇషాంత్ శర్మను జట్టు స్వ్కాడ్ నుంచి విడుదల చేశారు.డిసెంబర్ 9వ తేదీన ఇషాంత్ శర్మ పెళ్లి జరుగనుంది. వారణాసికి చెందిన ప్రతీమా సింగ్‌తో ఇషాంత్ శర్మ పెళ్లి జరుగనుంది. ఆ నేపథ్యంలో ఇషాంత్ కు విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. -
నాలుగో టెస్టు వర్షార్పణం
* 2-0తో సిరీస్ గెలిచిన భారత్ * చేజారిన నంబర్ వన్ ర్యాంక్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. మొదటి రోజు కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా వెస్టిండీస్ రెండు వికెట్లకు 66 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎడతెరపిలేని వర్షం కారణంగా రెండు, మూడు రోజుల ఆట రద్దవగా.. ఔట్‌ఫీల్డ్ సరిగా లేకపోవటంతో చివరి రెండు రోజుల ఆట సాధ్యపడలేదు. దీంతో టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి, మూడో టెస్టులో భారత్ గెలవగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఆఖరి టెస్టుకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరిన భారత్... ఈ మ్యాచ్ రద్దు కావడంతో కోహ్లిసేన రెండో ర్యాంక్‌కు పడిపోయింది. పాకిస్తాన్ తమ కెరీర్లో తొలిసారి అగ్రస్థానానికి చేరింది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఈ నెల 27,28 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతుంది. -
రెండో రోజూ వర్షమే..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు రెండో రోజు కూడా వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా రెండో రోజు శుక్రవారం కూడా వర్షం కారణంగా ఆట రద్దయింది. ప్రస్తుతం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో రెండు వికెట్లకు 62 పరుగులు చేసింది. -
అసద్, యూనిస్ శతకాలు
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 340/6 లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పాకిస్తాన్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అసద్ షఫీఖ్ (179 బంతుల్లో 109; 12 ఫోర్లు; 2 సిక్సర్లు), యూనిస్ ఖాన్ (144 బంతుల్లో 101 బ్యాటింగ్; 15 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 91 ఓవర్లలో ఆరు వికెట్లకు 340 పరుగులు చేసింది. క్రీజులో యూనిస్‌తో పాటు సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 17 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. నాలుగో వికెట్‌కు అసద్, యూనిస్ కలిసి 150 పరుగులు జోడించారు. ప్రస్తుతం పాక్ 12 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఫిన్, వోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొయిన్ అలీ (108) శతకం సాధించాడు. -
ఇంగ్లండ్ లక్ష్యం 382
ప్రస్తుతం 52/3 దక్షిణాఫ్రికాతో టెస్టు సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ తడబడింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. రూట్ (19 బ్యాటింగ్), టేలర్ (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ చివరి రోజు మరో 330 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 248 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హషీం ఆమ్లా (96; 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. -
ఇంగ్లండ్ 138/2
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (67 బ్యాటింగ్) రాణించడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 2 వికెట్లకు 138 పరుగులు చేసింది. కుక్‌తో పాటు రూట్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 329/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 132 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (129 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. -
కుక్, ఆమ్లా సెంచరీలు
* దక్షిణాఫ్రికా 329/5 * ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సెంచూరియన్: ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న స్టీఫెన్ క్రెయిగ్ కుక్ (115; 14 ఫోర్లు), హషీం ఆమ్లా (109; 19 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. కుక్, ఆమ్లా రెండో వికెట్‌కు 202 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 36 పరుగుల వ్యవధిలో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. బవుమా (32 బ్యాటింగ్), డి కాక్ (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సెంచరీల ‘సెంచరీ’... సెంచూరియన్ టెస్టులో ఆసక్తికర రికార్డు నమోదైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెరీర్ తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 100వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు అతను. స్టీఫెన్ తండ్రి జేమ్స్ కుక్ 1992లో తన తొలి టెస్టులో మ్యాచ్ తొలి బంతికే డకౌట్ కాగా... దాదాపు పాతికేళ్ల తర్వాత అతని కొడుకు తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం మరో విశేషం. -
అపూర్వ విజయం
ఢిల్లీ టెస్టులో భారత ఘన విజయం ఈ సిరీస్‌లో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఎన్నో విమర్శలకు కూడా ఈ టెస్టు విజయం జవాబు. కేవలం పిచ్‌ల కారణంగానే భారత జట్టు సిరీస్ గెలిచిందనే అపవాదును ఢిల్లీ టెస్టులో విజయం ద్వారా కోహ్లి సేన తుడిచి పెట్టింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా విసిరిన అనేక సవాళ్లను అధిగమించిన టీమిండియా... ఈ విజయం ద్వారా ‘క్లీన్ ఇమేజ్’ను సొంతం చేసుకోవడంతో పాటు ‘ఫ్రీడమ్ ట్రోఫీ’ని సగర్వంగా దక్కించుకుంది. సాక్షి క్రీడావిభాగం: ఢిల్లీ టెస్టు ఆరంభానికి ముందు రోజు భారత కెప్టెన్లో, డెరైక్టర్‌లో తీవ్ర అసహనం ఉంది. విదేశీ మీడియా సంగతి పక్కన బెడితే... భారత మీడియా కూడా పది ప్రశ్నల్లో ఆరు పిచ్‌ల స్వభావం గురించే అడిగింది. దీంతో ఒక దశలో పరోక్షంగా ఐసీసీని కూడా విమర్శించేలా కోహ్లిలో అసహనం పెరిగింది. నిజానికి భారత క్రికెటర్ల ప్రదర్శన గురించి ఎక్కడా చర్చ జరగలేదు. ఢిల్లీ టెస్టుకు ముందు ఎవరూ భారత బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడలేదు. వీటన్నింటికీ ఒకే ఒక్క మ్యాచ్ ద్వారా సమాధానం చెప్పినట్లయింది. అందుకే మ్యాచ్ ముగిశాక విరాట్ తనదైన శైలిలో మీడియాపై సెటైర్లు వేశాడు. ఊహించని పిచ్ భారత్‌లో ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా చివరి రెండు రోజులూ స్పిన్నర్లు తీవ్రంగా ప్రభావం చూపుతారు. అది ఇక్కడి పిచ్‌ల సహజ స్వభావం. ఢిల్లీ కూడా దీనికి అతీతం కాదు. కానీ అదేంటో ఈసారి స్వభావ విరుద్ధంగా ఢిల్లీ పిచ్ బౌలర్లను ఏడిపించింది. తొలి రెండు రోజులూ వికెట్లు పడకుండా... తర్వాతి మూడు రోజులు వికెట్లు పడే సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా ఆట సాగింది. నాగ్‌పూర్ పిచ్ విషయంలో ఐసీసీ నుంచి నోటీసు అందుకున్న బీసీసీఐకి కూడా ఇది పెద్ద ఊరట. ఈ మ్యాచ్‌కు పెద్ద మలుపు రెండో రోజు ఆట. ఆ రోజు టీ తర్వాత దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లు కోల్పోయి 121 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్ మీద భారత్‌కు పట్టు దొరికింది. ఎవరి బాధ్యత వాళ్లు... ఈ మ్యాచ్‌లో ఒకరిద్దరు మినహా భారత ఆటగాళ్లంతా తమ పాత్రను సమర్థంగా పోషించారు. మురళీ విజయ్ నిరాశపరిచినా... ధావన్ ఫర్వాలేదనిపించాడు. ఇక రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జట్టుకు వెన్నెముకలా నిలబడ్డాడు. కోహ్లి కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు కూడా సమష్టిగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీస్తే... అశ్విన్, ఉమేశ్ రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. కాస్త ఆలస్యం చేశారేమో! ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 200 మార్కు చేరడానికే ఆపసోపాలు పడుతూ సాగింది. అలాంటి స్థితిలో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. దీనికోసం నాలుగో రోజు లంచ్ విరామం వరకూ ఆడారు. దీంతో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయడానికి కేవలం ఐదు సెషన్లే అందుబాటులోకి వచ్చాయి. అయితే చివరి రెండు రోజులు స్పిన్నర్లు తీవ్ర ప్రభావం చూపుతారనేది అంచనా. కానీ పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం లభించలేదు. ఒకవేళ లక్ష్యం 300-350 ఉండి ఉంటే దక్షిణాఫ్రికా మరో విధంగా ఆడేది. సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదల చూపించేది. ఎప్పుడైతే 481 పరుగులు కనిపించాయో... అప్పుడే ఇక ‘డ్రా’ తప్ప మరో మార్గం లేదని అర్థమై... పూర్తిగా డిఫెన్స్ ఆడారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కాస్త ఆలస్యమైందేమో అనిపించింది. హైడ్రామాలా ముగింపు ఆఖరి రోజు టీ విరామం వరకు కూడా భారత్ గెలుస్తుందనే ఆశ అభిమానుల్లో లేదు. డివిలియర్స్ ఆడుతున్న తీరు చూస్తే ఇక మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనే భావనలోనే అందరూ ఉన్నారు. కానీ అనూహ్యంగా టీ విరామం తర్వాత పరిస్థితి మారింది. ఉమేశ్ యాదవ్ సంచలన బౌలింగ్‌కు, అశ్విన్ నిలకడ తోడు కావడంతో కేవలం 5.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు పడ్డాయి. ఇది ఒకరకంగా దక్షిణాఫ్రికాకు షాక్‌లాంటిదే. సొంతగడ్డపై తొలి సిరీస్ భారత కెప్టెన్ కోహ్లికి సొంతగడ్డపై ఇదే తొలి సిరీస్ విజయం. కాబట్టి ఇది తనకు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా తన సొంత నగరం ఢిల్లీలో ‘ఫ్రీడమ్ ట్రోఫీ’ని అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగులుతుంది. ఈ టెస్టుకు ముందు కోహ్లిలో అసహనానికి కారణం కూడా అదే. తన సారథ్యంలో వచ్చిన విజయాలకు ఆట పరంగా గుర్తింపు రావడం లేదనే ఆక్రోశం కూడా కనిపించింది. ఇక ఇప్పుడవన్నీ చరిత్ర. ఈ సిరీస్ ద్వారా భవిష్యత్‌లో టెస్టుల్లోనూ భారత్‌కు ఢోకా లేదనే సందేశం కోహ్లి అండ్ కో ఇచ్చారు. ఉపఖండం బయట ఎలా ఉన్నా... స్వదేశంలో మన ప్రాభవం కాపాడగలరనే నమ్మకాన్ని ఇచ్చారు. రెండో ర్యాంకుకు భారత్ దుబాయ్: దక్షిణాఫ్రికాపై సాధించిన సిరీస్విజయంతో అంతర్జాతీయ టెస్టు చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటిదాకా 100 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న కోహ్లి సేన 3-0 విజయంతో ఒక్కసారిగా 10 పాయింట్లు అదనంగా దక్కించుకుని ఆసీస్, పాక్ జట్లను వెనక్కితోసింది. దక్షిణాఫ్రికా (114) ఇప్పటికీ టాప్‌లోనే ఉన్నా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే భారత్‌కన్నా ముందుంది. ఈ విజయం ‘చెన్నై’కి అంకితం న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాపై 3-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు తమ ఘనవిజయాన్ని చెన్నై వరద బాధితులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలి వరదలకు అక్కడ వందలాది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ‘మేం సాధించిన ఈ విజయాన్ని చెన్నై వరదల్లో తీవ్రంగా నష్టపోయినవారికి అంకితమిస్తున్నాం. గత కొన్ని వారాలుగా అక్కడ చాలా బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మా జట్టులోని అశ్విన్, విజయ్ కుటుంబసభ్యులు కూడా వరదల్లో చిక్కుకున్న వారే. ఇలాంటి స్థితిలోనూ వారు మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ సిరీస్ విజయం చెన్నై ప్రజల్లో కాస్త సంతోషాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’ అని కోహ్లి తెలిపారు. పరుగులపరంగా (337) భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం బాపూ నాదకర్ణి (21) తర్వాత వరుసగా అత్యధిక మెయిడిన్లు వేసిన (17) బౌలర్ జడేజా అశ్విన్ కెరీర్లో ఇది ఐదో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. భారత్ తరఫున ఇదే అత్యధికం. సచిన్ 74 సిరీస్‌లలో, సెహ్వాగ్ 38 సిరీస్‌లలో దీనిని సాధిస్తే అశ్విన్ 12 సిరీస్‌లలో ఈ ఘనత దక్కించుకున్నాడు. కనీసం 200 పరుగులు ఎదుర్కొన్నప్పుడు అతి నెమ్మదైన భాగస్వామ్యం ఆమ్లా, డివిలియర్స్లదే (42.1 ఓవర్లలో 27 పరుగులు). వ్యక్తిగతంగా కూడా ఆమ్లా అత్యల్ప స్టైక్‌రేట్ (10.24) కొత్త రికార్డు. -
భలే భలే గెలిచారోయ్!
ఓ వైపు గోడలా నిలబడ్డ డివిలియర్స్... మరోవైపు ముంచుకొస్తున్న సాయం సమయం... ఓవర్లకు ఓవర్లు తరిగిపోతున్నాయి... వికెట్లు మాత్రం పడటం లేదు... ఎలా..? దక్షిణాఫ్రికా గోడను బద్దలు కొట్టేదెలా..? భారత్ నాలుగో టెస్టులో గెలిచేదెలా..?... చివరి టెస్టు ఐదో రోజు టీ విరామానికి వెళుతున్న సమయంలో భారత శిబిరంలో ఆందోళన ఇది. టీ విరామంలో ఏం జరిగిందోగానీ... భారత జట్టు మ్యాజిక్ చేసింది. నాలుగు సెషన్ల పాటు చెమటోడిస్తే ఐదు వికెట్లు దక్కిన పిచ్‌పై... కేవలం 27 బంతుల వ్యవధిలో ఆఖరి ఐదు వికెట్లు తీసింది. ఓ వైపు ఉమేశ్ రివర్స్ స్వింగ్... మరోవైపు అశ్విన్ నిలకడ... వెరసి సఫారీలకు షాక్. డ్రా కోసం సర్వశక్తులూ ఒడ్డిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల పట్టుదల ముందు చేతులెత్తేసింది. నాగ్‌పూర్‌లోనే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లిసేన... ఢిల్లీలో విజయంతో సిరీస్‌ను 3-0తో నెగ్గి ఫ్రీడం ట్రోఫీని సగర్వంగా అందుకుంది. నంబర్‌వన్ జట్టును కట్టిపడేసి ఐసీసీ ర్యాంక్‌ల్లో రెండో స్థానానికి ఎగబాకింది. * చివరి టెస్టులో భారత్‌కు * 337 పరుగుల విజయం * డివిలియర్స్ పోరాటం వృథా * అశ్విన్‌కు 5 వికెట్లు, రాణించిన ఉమేశ్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్ టెస్టుల్లో తమ పదును చూపించింది. సఫారీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌నుంచి ప్రతిఘటన ఎదురైనా...దానిని అధిగమించి మరో ఘన విజయాన్ని అందుకుంది. సోమవారం ఇక్కడ ముగిసిన చివరి టెస్టులో భారత్ 337 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఫలితంగా 4 టెస్టుల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. 72/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 143.1 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునే ప్రయత్నంలో ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైనా ఆ జట్టును ఓటమినుంచి కాపాడటానికి సరిపోలేదు. డివిలియర్స్ (297 బంతుల్లో 43; 6 ఫోర్లు), ఆమ్లా (244 బంతుల్లో 25; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (97 బంతుల్లో 10; 1 ఫోర్) తీవ్రంగా పోరాడారు. టీ విరామ సమయానికి 136/5 స్కోరుతో టెస్టును కాపాడుకునేటట్లు కనిపించిన సఫారీ జట్టు చివరి సెషన్లో 27 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన రహానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా... సిరీస్‌లో 31 వికెట్లు తీసిన అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు:- భారత్ తొలి ఇన్నింగ్స్: 334; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 121; భారత్ రెండో ఇన్నింగ్స్: 267/5 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) రహానే (బి) అశ్విన్ 4; బవుమా (బి) అశ్విన్ 34; ఆమ్లా (బి) జడేజా 25; డివిలియర్స్ (సి) జడేజా (బి) అశ్విన్ 43; డు ప్లెసిస్ (ఎల్బీ) (బి) జడేజా 10; డుమిని (ఎల్బీ) (బి) అశ్విన్ 0; విలాస్ (బి) ఉమేశ్ 13; అబాట్ (బి) ఉమేశ్ 0; పీడిట్ (సి) సాహా (బి) ఉమేశ్ 1; మోర్కెల్ (బి) అశ్విన్ 2; తాహిర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (143.1 ఓవర్లలో ఆలౌట్) 143. వికెట్ల పతనం: 1-5; 2-49; 3-76; 4-111; 5-112; 6-136; 7-136; 8-140; 9-143; 10-143. బౌలింగ్: ఇషాంత్ 20-12-23-0; అశ్విన్ 49.1-26-61-5; జడేజా 46-33-26-2; ఉమేశ్ 21-16-9-3; ధావన్ 3-1-9-0; విజయ్ 2-0-2-0; కోహ్లి 1-1-0-0; పుజారా 1-0-2-0. తొలి సెషన్: ఆమ్లా అవుట్ మ్యాచ్ చివరి రోజు కూడా అదే పట్టుదలతో ఆమ్లా, డివిలియర్స్ తమ పోరాటాన్ని కొనసాగించారు. పరుగులు చేయకుండా మళ్లీ డిఫెన్స్‌కే కట్టుబడ్డారు. అయితే 13వ ఓవర్లో జడేజా భారత్‌కు కావాల్సిన బ్రేక్ అందించాడు. జడేజా బంతిని అంచనా వేయడంలో ఆమ్లా విఫలమై బౌల్డయ్యాడు. అయితే ఏబీకి డు ప్లెసిస్ అండగా నిలిచి వెంటనే వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఓవర్లు: 35, పరుగులు: 22, వికెట్లు: 1 రెండో సెషన్: చెక్కుచెదరని ఏకాగ్రత సిరీస్ ఆసాంతం విఫలమైన డు ప్లెసిస్... ఆమ్లా, డివిలియర్స్‌లను తలదన్నే డిఫెన్స్ చూపించాడు. తాను ఎదుర్కొన్న 53వ బంతికి గానీ అతను మొదటి పరుగు తీయలేదు. మరో వైపు ఉమేశ్ బౌలింగ్‌లో కొన్ని బంతులు అనూహ్యంగా బౌన్స్ అయి డివిలియర్స్‌ను గాయపర్చినా అతను తొణకకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. అయితే చివరకు జడేజా బౌలింగ్‌లోనే ప్లెసిస్ వికెట్ల ముందు దొరికిపోవడంతో 35.1 ఓవర్ల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే డుమిని (0)ని కూడా అశ్విన్ ఎల్బీగా పెవిలియన్ పంపించడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. ఓవర్లు: 29, పరుగులు: 42, వికెట్లు: 2 మూడో సెషన్: ‘రివర్స్’ చేసిన ఉమేశ్ విరామం తర్వాత కనీసం 24 ఓవర్లు వేసేందుకు అవకాశం ఉన్న స్థితిలో మూడో సెషన్ మొదలైంది. డివిలియర్స్ క్రీజ్‌లో ఉండటంతో సఫారీలు మ్యాచ్ ‘డ్రా’ చేసుకోగలిగే అవకాశం కూడా కనిపించింది. అయితే ఉమేశ్ యాదవ్ తన రివర్స్ స్వింగ్‌తో మ్యాచ్ గమనాన్ని మార్చాడు. విలాస్ (13), అబాట్ (0)లను బౌల్డ్ చేశాడు. అయితే ఈ రెండు వికెట్ల మధ్య భారత్ కోరుకున్న వికెట్ లభించింది. దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్‌లో పోరాడిన డివిలియర్స్ చివరకు అశ్విన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయి లెగ్‌స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. పీడిట్ (1)ను ఉమేశ్ అవుట్ చేయగా, మోర్కెల్ (2)ను బౌల్డ్ చేసి అశ్విన్ సిరీస్‌కు అద్భుత ముగింపునిచ్చాడు. ఓవర్లు: 5.1, పరుగులు: 7, వికెట్లు: 5 -
సఫారీలను కూల్చేశారు
-
సఫారీలను కూల్చేశారు
చివరి టెస్టు.. కనీసం గెలవకపోయినా డ్రా చేయాలని సఫారీలు శతవిధాలా ప్రయత్నించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గోడ కట్టినట్లే ఆటను కొనసాగించారు. అటు హషీమ్ ఆమ్లా దగ్గర్నుంచి.. ఇటు ఏబీ డివిలియర్స్ వరకూ ఎంతో శ్రమించారు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ అత్యంత రక్షణాత్మక పద్ధతిని అవలంభించారు. ఆమ్లా 244 బంతుల్లో 25 పరుగులు, డివిలియర్స్ 297 బంతుల్లో 43 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను గట్టెక్కించే యత్నం చేశారు. కాగా, చివరకు ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఢిల్లీ:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 481 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు 143 పరుగులకే చాపచుట్టేశారు. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు మరో 71 పరుగుల మాత్రమే చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. ఈ రోజు ఆటలో టీ విరామం వరకూ మ్యాచ్ ఫలితంపై పెద్దగా అంచనాలు లేకపోయినా తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి సఫారీలకు మరో షాకిచ్చారు. దాంతో టీమిండియా 337 పరుగులతో ఘన విజయం సాధించడమే కాకుండా సిరీస్ ను 3-0 తేడాతో గెలిచింది. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు సాధించగా, ఉమేష్ యాదవ్ కు మూడు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు తీశారు. లంచ్ తరువాత అసలు కథ.. నాల్గో టెస్టు ఆఖరి రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లో దక్షిణాఫ్రికానే పైచేయి సాధించినట్లు కనబడింది. లంచ్ విరామ సమయానికి సఫారీలు మూడు వికెట్ల నష్టానకి 94 పరుగులు చేసి మెరుగ్గా కనిపించారు. అయితే ఆ తరువాత అసలు కథ ప్రారంభమైంది. లంచ్ సెషన్ అనంతరం దక్షిణాఫ్రికా వరుసగా రెండు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. తొలుత డుప్లెసిస్(10)ను నాల్గో వికెట్ గా పెవిలియన్ కు చేరగా, స్వల్ప వ్యవధిలోనే జేపీ డుమినీ(0) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. మూడో సెషన్ లో సఫారీలు టపటపా.. టీ బ్రేక్ వరకూ డివిలియర్స్-విలాస్ ల జోడి మాత్రం కుదురుగా బ్యాటింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా మళ్లీ తేరుకున్నట్లు కనిపించింది. వీరిద్దరూ చాలా వ్యూహాత్మకంగా ఆడి టీమిండియాను ప్రతిఘటించారు. కాగా, టీ విరామం అనంతరం మూడో సెషన్ లో సఫారీలు వరుస వికెట్లను కోల్పోయారు. 31 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లను నష్టపోయారు. ప్రత్యేకంగా ఉమేష్ యాదవ్ రెచ్చిపోయాడు. విలాస్, అబాట్, పీడిట్ వికెట్లను తీసి సఫారీల పతనాన్ని శాసించగా, అశ్విన్ మరో రెండు వికెట్లను తీసి విజయానికి సహకరించాడు. ఈ మ్యాచ్ లో వరుస రెండు సెంచరీలు చేసిన అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అశ్విన్ కు లభించింది. -
విజయంపై విరాట్ సేన ఆశలు!
ఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా విజయంపై ఆశలు రేకెత్తిస్తోంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా లంచ్ కు ముందు ఒక వికెట్ మాత్రమే తీసిన టీమిండియా.. ఆ తరువాత వరుసగా రెండు వికెట్లను సాధించింది. తొలుత డుప్లెసిస్(10)ను నాల్గో వికెట్ గా పెవిలియన్ కు పంపగా.. స్వల్ప వ్యవధిలోనే జేపీ డుమినీ(0) వికెట్ ను తీశారు. అంతకుముందు హషీమ్ ఆమ్లా(25) మూడో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో సఫారీలు 125.0 ఓవర్లలో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ కు మూడు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. మధ్యమధ్యలో వికెట్లను చేజార్చుకోవడం ఆ జట్టును కలవర పెడుతోంది. డివిలియర్స్ (36 బ్యాటింగ్ 265 బంతులు, 5 ఫోర్లు), విలాస్(4 బ్యాటింగ్) దక్షిణాఫ్రికాను ఓటమి నుంచి గట్టెక్కించేందుకు యత్నిస్తున్నారు. ఇంకా టీమిండియా విజయానికి ఐదు వికెట్లు అవసరం కాగా, దక్షిణాఫ్రికా గెలుపుకు 369 పరుగులు అవసరం. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకుని మ్యాచ్ ను డ్రాగా ముగించాలని భావిస్తోంది. -
ఒక సెషన్.. ఒక వికెట్
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు ఆఖరి రోజు ఆటలో ఒక సెషన్ ముగిసేసరికి టీమిండియాకు ఒక వికెట్ మాత్రమే దక్కింది.72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ విరామ సమయానికి 107.0 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 94 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో ఆమ్లా(25; 244 బంతుల్లో 3 ఫోర్లు) వికెట్ ను నష్టపోయింది. 40.0 కు పైగా ఓవర్లు క్రీజ్ లో నిలుచున్న ఆమ్లాను రవీంద్ర జడేజా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. అనంతరం ఏబీ డివిలియర్స్ కు జతకలిసిన డు ప్లెసిస్ సమన్వయంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ జోడి ఎటువంటి భారీ షాట్లకు పోకుండా టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. డివిలియర్స్(26 బ్యాటింగ్; 203 బంతుల్లో 4 ఫోర్లు), డు ప్లెసిస్(2 బ్యాటింగ్; 61 బంతులు)లు కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నారు.ఒక వైపు ఈ సిరీస్ లో మరో ఓటమి చవి చూడకూడదని దక్షిణాఫ్రికా భావిస్తుండగా .. మరోవైపు గెలుపుతో ఈ సిరీస్ కు ఘనమైన ముగింపు ఇవ్వాలని టీమిండియా యోచిస్తోంది. అంతకుముందు టీమిండియా గెలిచిన రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చుక్కలు చూపించగా.. ప్రత్యేకంగా ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు రక్షణాత్మక ధోరణిలో ఆడుతూ విరాట్ సేనను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 481 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సఫారీలు పూర్తి నియంత్రణతో ఆటను కొనసాగిస్తున్నారు. -
40కు పైగా ఓవర్లు..25 పరుగులు
ఢిల్లీ: నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు పరీక్షగా నిలిచిన హషీమ్ ఆమ్లా ఎట్టకేలకు అవుటయ్యాడు. 40.0 కు పైగా ఓవర్లు క్రీజ్ లో నిలుచున్న ఆమ్లాను రవీంద్ర జడేజా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. 244 బంతుల్లో 3 ఫోర్లు సాయంతో 25 పరుగులు చేసి అత్యంత రక్షణాత్మక పద్ధతిని అనుసరించిన ఆమ్లాను మూడో వికెట్ గా పెవిలియన్ కు పంపి టీమిండియా శిబిరంలో ఆనందం రేకెత్తించాడు. దీంతో ఆమ్లా -ఏబీ డివిలియర్స్ ల సుదీర్ఘ బంతుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ జోడి 42.1 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండటం విశేషం. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఆమ్లా వికెట్ కోల్పోవడంతో కాస్త ఆందోళనలో పడింది. ప్రస్తుతం సఫారీలు 90.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. .డివిలియర్స్(17), డు ప్లెసిస్(0) లు క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. 481 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సఫారీలు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా క్రీజ్ లో నిలవాల్సి ఉండగా, టీమిండియా విజయానికి ఇంకా ఏడు వికెట్లు అవసరం. -
నాల్గో టెస్టు:ఐదో రోజు ఆట ప్రారంభం
ఢిల్లీ:దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో చివరి రోజు ఆట ప్రారంభమైంది. 72/2 ఓవర్ నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా సోమవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. టీమిండియా నిర్దేశించిన 481 పరుగుల విజయలక్ష్యంతో ఆదివారం బ్యాటింగ్ దిగిన సఫారీలు అత్యంత రక్షణాత్మక ధోరణిని అనుసరిస్తున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా(25 బ్యాటింగ్; 229 బంతుల్లో 3 ఫోర్లు), ఏబీ డివిలియర్స్(13 బ్యాటింగ్ ; 119 బంతుల్లో 1 ఫోర్)లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా 80.0 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులతో ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పదేపదే బౌలర్లను మార్చుతూ సఫారీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నాడు. -
‘అడ్డంగా’ నిలబడ్డారు!
-
రహానే అదరహో
-
చివరి టెస్టులో ఫలితం వచ్చేనా?
ఢిల్లీ: ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నిలకడలేమితో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతోంది. టీమిండియా విసిరిన భారీ విజయలక్ష్యాన్నిచూసి భయపడ్డారో?లేక అనవసర రిస్క్ ఎందుకులే అనుకున్నారో కానీ సఫారీలు నిలకడగా ఆడుతున్నారు. దీంతో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 72.0 ఓవర్లలో సఫారీలు రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 72 పరుగులు చేశారు. నాల్గో టెస్టులో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సఫారీలు డ్రా కోసం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. సఫారీలు ఆదిలో ఎల్గర్(4) వికెట్ కోల్పోయి తడబడినట్లు కనిపించినా.. ఆ తరువాత హషీమ్ ఆమ్లా, భావుమా జోడి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో కుదుటపడింది. అయితే టీ విరామం తరువాత కొద్ది సేపటికి భావుమా(34) పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన ఆమ్లాకు ఏబీ డివిలియర్స్ జత కలిశాడు. వీరి జోడి టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. ఈ జోడిని విడగొట్టడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పదే పదే బౌలర్లను మార్చినా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమ్లా(23 బ్యాటింగ్;207బంతుల్లో 3 ఫోర్లు), డివిలియర్స్(11 బ్యాటింగ్; 91 బంతుల్లో 1 ఫోర్) సుదీర్ఘంగా క్రీజ్ లో నిలబడటంతో దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు రవి చంద్రన్ అశ్విన్ ఖాతాలోనే చేరాయి. అంతకుముందు 190/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కలు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇంకా సోమవారం ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో సిరీస్ ను ఘనంగా ముగించాలన్నటీమిండియా ఆశలకు గండి పడేలా ఉంది. దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి 409 పరుగులు అవసరం కాగా, టీమిండియా గెలుపుకు ఎనిమిది వికెట్లు అవసరం. ఈ మ్యాచ్ లో ఫలితం తేలాలాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. -
డివిలియర్స్ కాస్త భిన్నంగా..
ఢిల్లీ:టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఓటమిని అడ్డుకునేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కోల్పోయిన సఫారీలు.. ఆఖరి మ్యాచ్ లో గెలుపు కోసం ప్రయత్నించకుండా డ్రాతోనే సరిపెట్టాలని భావిస్తున్నారు. టీమిండియా నిర్దేశించిన 481 పరుగుల విజయ లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 56.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనం. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(19 బ్యాటింగ్;163 బంతుల్లో 3 ఫోర్లు) గోడలా పాతుకుపోయాడు. అంతకుముందు 113 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. మరో 50 బంతులు ఆడి 13 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. కాగా, అతనికి జతగా క్రీజ్ లో ఉన్న ఏబీ డివిలియర్స్(1 బ్యాటింగ్) తన సహజ శైలికి కాస్త భిన్నంగా ఆడుతున్నాడు. ఏ ఫార్మెట్ లో నైనా రెచ్చిపోయే డివిలియర్స్ తొలి పరుగును సాధించడానికి 33 బంతులు ఎదుర్కొన్నాడు. దీంతో దక్షిణాఫ్రికాపై మరోసారి గెలిచి సిరీస్ ను సంపూర్ణంగా ముగించాలన్నటీమిండియా ఆశలకు గండి పడేలా ఉంది. అయితే ఈరోజు ఆటతో పాటు ఇంకా సోమవారం కూడా మిగిలి ఉండటంతో టీమిండియా విజయం కోసం శాయశక్తులా పోరాడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకపక్క గెలవాలన్న కసి.. మరొపక్క డ్రా చేయాలన్నధృక్పథం ఏది పైచేయి సాధిస్తుందో అనేది తెలియాలంటే రేపటి వరకూ కచ్చితంగా ఆగాల్సిందే. -
100కు పైగా బంతులు.. 6 పరుగులు
ఢిల్లీ:టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సఫారీలు డ్రా కోసం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. నాల్గో రోజు ఆటలో భాగంగా ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన సఫారీలు ఆదిలో ఎల్గర్(4) వికెట్ కోల్పోయి తడబడినట్లు కనిపించినా.. ఆ తరువాత హషీమ్ ఆమ్లా(6 బ్యాటింగ్), భావుమా(28 బ్యాటింగ్) జోడి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో కుదుటపడింది. భావుమా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నా.. ఆమ్లా మాత్రం వికెట్లు ముందు గోడలా పాతుకుపోయాడు. 113 బంతులను ఎదుర్కొన్న ఆమ్లా కేవలం ఆరు పరుగులను మాత్రమే చేశాడు. దీంతో సఫారీలు టీ విరామానికి 39.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేశారు. అంతకుముందు 190/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కలు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. -
తొలి వికెట్ కోల్పోయిన సఫారీలు
ఢిల్లీ:టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో 481 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. డీన్ ఎల్గర్(4) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ రహానే క్యాచ్ పట్టడంతో ఎల్గర్ నిష్ర్రమించాడు. దీంతో నాల్గో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోయి ఐదు పరుగులు చేసింది. 190/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కులు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. -
రహానే అదరహో:సఫారీలకు భారీ లక్ష్యం
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో మరో శతకాన్ని నమోదు చేశాడు. రహానే(100 నాటౌట్ ;206 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సఫారీ బౌలర్లకు మరోసారి పరీక్షగా నిలిచి సెంచరీ సాధించాడు. దీంతో సఫారీలపై వరుస ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రహానే .. స్వదేశంలో వరుసగా రెండు శతకాల్ని సాధించిన గుర్తింపు పొందాడు. దీంతో పాటు రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు నమోదు చేసిన ఐదో భారత బ్యాట్స్ మెన్ గా నిలవడం మరో విశేషం. ఈరోజు ఆటలో రహానే సెంచరీ చేసిన అనంతరం టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 267/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ఓవరాల్ గా 480 పరుగుల ఆధిక్యం సాధించి.. సఫారీలకు భారీ లక్ష్యాన్నినిర్దేశించింది. 190/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఆదిలోనే విరాట్ వికెట్ ను నష్టపోయింది. జట్టు స్కోరు 211 పరుగుల వద్ద ఉండగా విరాట్ ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. విరాట్ కోహ్లి(88;165 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, అబాట్, తాహీర్ లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులు చేయగా, సఫారీలు 121 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ ముగించారు. -
కోహ్లి సెంచరీ మిస్
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(88; 165 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 190/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఆదిలోనే విరాట్ వికెట్ ను నష్టపోయింది. జట్టు స్కోరు 211 పరుగుల వద్ద ఉండగా విరాట్ ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా 88.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. అజింక్యా రహానే(69), సాహా(1) క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, అబాట్, తాహీర్ లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా ఓవరాల్ గా 426 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
టీమిండియాకు భారీ ఆధిక్యం
-
టీమిండియాకు భారీ ఆధిక్యం
-
టీమిండియాకు భారీ ఆధిక్యం
ఢిల్లీ:నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. శనివారం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా 81.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో విరాట్ సేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్ గా 403 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (83 బ్యాటింగ్) అజింక్యా రహానే(52 బ్యాటింగ్)లు మరోసారి రాణించడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టీమిండియా 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడిన సమయంలో విరాట్-రహానే జోడి ఆదుకుంది. ఈ జోడి అజేయంగా 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితికి చేర్చారు. ఈ రోజు ఆట ఆదిలో టీమిండియా ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మురళీ విజయ్(3), రోహిత్ శర్మ(0) లు పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు. ఆ తరువాత శిఖర్-పూజారాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. అయితే అటు తరువాత విరాట్ , రహానేలు దాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో తిరిగి టీమిండియా గాడిలో పడింది. ఈ క్రమంలోనే విరాట్, రహానేలు అజేయ హాఫ్ సెంచరీలు సాధించి సఫారీలకు పరీక్షగా నిలిచారు. ఇప్పటికే విరాట్ సేన భారీ ఆధిక్యంలో నిలవడంతో పాటు, ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో సఫారీలకు మరోసారి సవాల్ గా మారనుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు ఆలౌటయ్యింది. -
విరాట్-రహానేల దూకుడు
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల జోడి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడిన సమయంలో విరాట్-రహానే జోడి ఆదుకుంది. ఈ క్రమంలోనే విరాట్(72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేయగా, రహానే(40 బ్యాటింగ్) మరోసారి చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ జోడి అజేయంగా 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 72 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఇప్పటివరకూ 380 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ రోజు ఆటలో ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా.. ఆ తరువాత తేరుకుంది. శిఖర్-పూజారాల జోడి కుదురుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా నిలదొక్కుకుంది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. అయితే అటు తరువాత విరాట్ , రహానేలు కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో తిరిగి టీమిండియా గాడిలో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు ఆలౌటయ్యింది. ఇప్పటికే విరాట్ సేన భారీ ఆధిక్యంలో నిలవడంతో పాటు, ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో సఫారీలకు మరోసారి సవాల్ గా మారనుంది. -
రహానే 'ఒక్కడే'!
ఢిల్లీ: అజింక్యా రహానే..నిలకడకు మారుపేరు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో రహానే తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రహానే(127) సెంచరీతో అదరగొట్టి టీమిండియాను పటిష్టస్థితికి చేర్చాడు. దీంతో టీమిండియా ఆడిన చివరి ఏడు టెస్టు సిరీస్ ల్లో కనీసం ఒక ఇన్నింగ్స్ లో 90కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు టీమిండియా ఆడిన ఆరు టెస్టు సిరీస్ ల్లో రహానే ఏదో ఒక ఇన్నింగ్స్ లో నమోదు చేసిన వ్యక్తిగత స్కోర్లను చూస్తే శ్రీలంకపై 126, బంగ్లాదేశ్ పై 98, ఆస్ట్రేలియాపై 147, ఇంగ్లండ్ పై 103, న్యూజిలాండ్ పై 118, దక్షిణాఫ్రికాపై 96 పరుగులు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తాజా టెస్టు సిరీస్ భాగంగా చివరి టెస్టులో రహానే భారత్ లో మొదటి శతకాన్ని నెలకొల్పడమే కాకుండా.. సఫారీ బౌలర్లకు పరీక్షగా నిలిచి వారిపై తొలి సెంచరీ సాధించాడు. దీంతో ఓవరాల్ గా ఐదో టెస్టు సెంచరీని అతని ఖాతాలో వేసుకున్నాడు. 2013 లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన రహానే తనదైన శైలితో ఆడుతూ టీమిండియా విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. -
భారీ ఆధిక్యం దిశగా విరాట్ సేన
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విరాట్ సేన టీ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 329 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రోజు ఆటలో ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా.. ఆ తరువాత తేరుకుంది. శిఖర్-పూజారాల జోడి కుదురుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా నిలదొక్కుకుంది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే అటు తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లి(39 బ్యాటింగ్), అజింక్యా రహానే(22 బ్యాటింగ్) సఫారీల బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో టీమిండియా కుదురుకుంది. అంతకుముందు మురళీ విజయ్(3), రోహిత్ శర్మ(0), శిఖర్ ధవన్(21), చటేశ్వర పూజారా(28) పెవిలియన్ కు చేరారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.