
ఇంగ్లండ్ విలవిల
భారత్ తో జరుగుతున్న నాల్గో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది.
ముంబై:భారత్ తో జరుగుతున్న నాల్గో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ విలవిల్లాడుతోంది. ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభింన ఇంగ్లండ్.. టీ విరామానికి మూడు కీలక వికెట్లను చేజార్చుకుని 49 పరుగులు సాధించింది. దాంతో విరాట్ సేన మ్యాచ్పై పట్టుబిగించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సేపటికే గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో జెన్నింగ్స్ను కోల్పోయింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 1 పరుగు కాగా, జెన్నింగ్స్ డకౌట్ గా అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి జెన్నింగ్స్ ఎల్బీగా అవుటయ్యాడు.ఆ తరువాత అలెస్టర్ కుక్(18), మొయిన్ అలీ(0) వికెట్లను ఇంగ్లండ్ స్వల్ప వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లు జడేజా ఖాతాలో పడ్డాయి.
అంతకుముందు భారత్ తన ఇన్నింగ్స్ లో 631 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. విరాట్ కోహ్లి(235) డబుల్ సెంచరీ సాధించగా, జయంత్ యాదవ్(104)పరుగులను సాధించాడు. అంతకముందు మురళీ విజయ్(136) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మరో ఆటగాడు చటేశ్వర పూజారా(47) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు.