కోహ్లి సెంచరీ మిస్ | virat kohli misses ton in fourth test against south africa | Sakshi
Sakshi News home page

కోహ్లి సెంచరీ మిస్

Dec 6 2015 10:10 AM | Updated on Sep 3 2017 1:36 PM

కోహ్లి సెంచరీ మిస్

కోహ్లి సెంచరీ మిస్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(88; 165 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(88; 165 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 190/4 ఓవర్ నైట్ స్కోరుతో  నాల్గో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఆదిలోనే విరాట్ వికెట్ ను నష్టపోయింది. జట్టు స్కోరు 211 పరుగుల వద్ద ఉండగా విరాట్ ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా 88.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 213 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

 

అజింక్యా రహానే(69), సాహా(1) క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, అబాట్, తాహీర్ లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా ఓవరాల్ గా 426 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement