నాలుగో టెస్టు వర్షార్పణం | Pakistan become No 1 Test team after India-West Indies 4th Test ends in draw | Sakshi
Sakshi News home page

నాలుగో టెస్టు వర్షార్పణం

Published Tue, Aug 23 2016 2:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

నాలుగో టెస్టు వర్షార్పణం

నాలుగో టెస్టు వర్షార్పణం

* 2-0తో సిరీస్ గెలిచిన భారత్    
* చేజారిన నంబర్ వన్ ర్యాంక్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. మొదటి రోజు కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా వెస్టిండీస్ రెండు వికెట్లకు 66 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎడతెరపిలేని వర్షం కారణంగా రెండు, మూడు రోజుల ఆట రద్దవగా.. ఔట్‌ఫీల్డ్ సరిగా లేకపోవటంతో చివరి రెండు రోజుల ఆట సాధ్యపడలేదు. దీంతో టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి, మూడో టెస్టులో భారత్ గెలవగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసింది. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
 
ఆఖరి టెస్టుకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరిన భారత్... ఈ మ్యాచ్ రద్దు కావడంతో కోహ్లిసేన రెండో ర్యాంక్‌కు పడిపోయింది. పాకిస్తాన్ తమ కెరీర్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరింది.
 భారత్, వెస్టిండీస్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల  టి20 సిరీస్ ఈ నెల 27,28 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement