ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని బరిలోకి దిగారు. లెజండరీ కోచ్, ముంబై మాజీ ఆటగాడు వాసు పరంజపే అలియాస్ వాసుదేవ్ పరంజపే మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో బ్లాక్ ఆర్మ్ బాండ్స్‌తో బరిలోకి దిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. వాసు పరంజపే గత సోమవారం గుండెపోటుతో మరణించారు. వాసు క్రికెటర్‌గా అంతగా రాణించకపోయినా.. కోచ్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లను ఆయన తీర్చిదిద్దారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ , రాహుల్ ద్రవిడ్ , సచిన్ టెండుల్కర్, యువ్‌రాజ్ సింగ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లు ఆయన శిష్యరికంలోనే రాటుదేలారు.
The Indian Cricket Team is sporting black armbands today to honour the demise of Shri Vasudev Paranjape.#TeamIndia pic.twitter.com/9pEd2ZB8ol
— BCCI (@BCCI) September 2, 2021
ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 47 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి(50) మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్లంతా చేతులెత్తేశారు. రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17), పుజారా(4), జడేజా(10) దారుణంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ పేసర్లు వోక్స్, రాబిన్సన్ తలో రెండు వికెట్లు, ఆండర్సన్ ఓ వికెట్ పడగొట్టి టీమిండియాను దారుణంగా దెబ్బ కొట్టారు.
చదవండి: ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లి.. సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment