black ribbons
-
WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ బుధవారం ఓవల్ వేదికగా మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయాలపాన సందర్భంగా టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో కనిపించారు. ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. కాగా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తూ టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్ల నల్ల రిబ్బన్లు ధరించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని.. బీసీసీఐ కూడా ఒడిశా ప్రమాద బాధితులకు సహాయం చేసే పనిలో ఉందని పేర్కొన్నాడు. టీమిండియా, ఆసీస్ ఆటగాళ్ల చర్యను అభిమానులు స్వాగతించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడతామని టీమిండియా పేర్కొనడం సంతోషాన్ని ఇచ్చిందంటూ కామెంట్ చేశారు. The Indian Cricket Team will observe a moment of silence in memory of the victims of the Odisha train tragedy ahead of the start of play on Day 1 of the ICC World Test Championship final at The Oval. The team mourns the deaths and offers its deepest condolences to the families… pic.twitter.com/mS04eWz2Ym — BCCI (@BCCI) June 7, 2023 చదవండి: WTC Final Day-1: ఖవాజా డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ -
అందుకే మనోళ్లు 'బ్లాక్ రిబ్బన్స్'తో బరిలోకి దిగారు..
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని బరిలోకి దిగారు. లెజండరీ కోచ్, ముంబై మాజీ ఆటగాడు వాసు పరంజపే అలియాస్ వాసుదేవ్ పరంజపే మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో బ్లాక్ ఆర్మ్ బాండ్స్‌తో బరిలోకి దిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. వాసు పరంజపే గత సోమవారం గుండెపోటుతో మరణించారు. వాసు క్రికెటర్‌గా అంతగా రాణించకపోయినా.. కోచ్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లను ఆయన తీర్చిదిద్దారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ , రాహుల్ ద్రవిడ్ , సచిన్ టెండుల్కర్, యువ్‌రాజ్ సింగ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ క్రికెటర్లు ఆయన శిష్యరికంలోనే రాటుదేలారు. The Indian Cricket Team is sporting black armbands today to honour the demise of Shri Vasudev Paranjape.#TeamIndia pic.twitter.com/9pEd2ZB8ol — BCCI (@BCCI) September 2, 2021 ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 47 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి(50) మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్మెన్లంతా చేతులెత్తేశారు. రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17), పుజారా(4), జడేజా(10) దారుణంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ పేసర్లు వోక్స్, రాబిన్సన్ తలో రెండు వికెట్లు, ఆండర్సన్ ఓ వికెట్ పడగొట్టి టీమిండియాను దారుణంగా దెబ్బ కొట్టారు. చదవండి: ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లి.. సచిన్ రికార్డు బద్దలు -
మరో భారీ ఉద్యమానికి ముద్రగడ సై
-
మరో భారీ ఉద్యమానికి ముద్రగడ సై
కాపు రిజర్వేషన్ల కోసం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి రోడ్డెక్కుతున్నారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, తుని ఘటన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు మంత్రుల బృందం వచ్చి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని ముద్రగడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాంతో.. కాపులకు చంద్రబాబు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అక్టోబర్ 14వ తేదీనే ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంత ఇంట్లో ఆయన ఈ విషయం తెలిపారు. ఆగస్టులోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే తాను పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర ప్రారంభించి, అంతర్వేదిలో ముగిస్తానని చెప్పారు. నల్ల రిబ్బన్లు ధరించి ఈ పాదయాత్ర చేస్తానన్నారు. ఇంతకుముందు ఆయన తుని సమీపంలో కాపు ఐక్య గర్జన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ప్రభుత్వం బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించింది. అణిచివేతకు సర్కారు రె'ఢీ' ముద్రగడ పాదయాత్రను అణిచివేసేందుకు రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ క్యానన్లు సిద్ధం చేశారు, ఇతర రాష్ట్రాల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రప్పించి మోహరించారు. అయితే ప్రభుత్వ చర్యలను అధిగమించి మరీ పాదయాత్రను విజయవంతం చేయాలని కాపు జేఏసీ భారీ ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగించి తీరుతామని జేఏసీ స్పష్టం చేసింది.