India And Australia Players Wear Black Armbands To Pay Respect To Odisha Train Accident - Sakshi
Sakshi News home page

WTC Final 2023: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్‌ ఆటగాళ్లు?

Published Wed, Jun 7 2023 3:44 PM | Last Updated on Wed, Jun 7 2023 4:40 PM

Ind-Aus-Players Wear Black-Armbands Memory-Victims Odisha Train Accident - Sakshi

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం ఓవల్‌ వేదికగా మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయాలపాన సందర్భంగా టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో కనిపించారు.

ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. కాగా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తూ టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్ల నల్ల రిబ్బన్లు ధరించి  తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని.. బీసీసీఐ కూడా ఒడిశా ప్రమాద బాధితులకు సహాయం చేసే పనిలో ఉందని పేర్కొన్నాడు.​ టీమిండియా, ఆసీస్‌ ఆటగాళ్ల చర్యను అభిమానులు స్వాగతించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడతామని టీమిండియా పేర్కొనడం సంతోషాన్ని ఇచ్చిందంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: WTC Final Day-1: ఖవాజా డకౌట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement