డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్ అయింది
తొలి సెషన్‌లోపే ఆసీస్ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్ క్యాచ్ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్‌తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది.
ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్‌కప్స్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్‌తో కలిసి ఇప్పటివరకు ఆసీస్ తొమ్మిది ఐసీసీ టైటిల్స్ నెగ్గడం విశేషం.
అందులో వన్డే వరల్డ్‌కప్‌ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్‌కప్(2021), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.
✅ICC ODI World Cup
— CricTracker (@Cricketracker) June 11, 2023
✅ICC Champions Trophy
✅ICC T20 World Cup
✅ICC World Test Championship
Australia becomes the first team to win all ICC trophies 👏
Their 9th ICC title🤯 pic.twitter.com/yQLXJFFtTu
చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..!
Comments
Please login to add a commentAdd a comment