ఐసీసీ ఈవెంట్‌లో టీమిండియా మరోసారి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమి చూసింది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. కాగా డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ సరిపోదని, కనీసం మూడు మ్యాచ్‌ల సిరీస్‌నైనా ఆడించాలని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అయితే ఈ వాదనతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విభేదించాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో కాలం క్రితమే నిర్ణయించబడి ఉంటుంది. ఫైనల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటుందని డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలకావడానికి ముందే మీకు తెలుసు. కాబట్టి అందకు తగ్గట్టు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
మీరు ఐపీఎల్‌కు ఎలా అయితే సిద్దమవుతున్నారో ఈ మ్యాచ్‌కు కూడా అలానే ప్రిపేర్ కావాలి. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదు కాదా. ఎవరికైనా కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్లాలన్న దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు విజేతను నిర్ణయించడానికి మూడు మ్యాచ్‌లు పెట్టమని అడుగుతున్నారు. అదే అప్పుడు కూడా ఓడిపోతే ఐదు మ్యాచ్‌లు పెట్టమని అడగరని గ్యారంటీ ఎంటీ" అని సన్నీ ప్రశ్నించాడు.
చదవండి: WTC Final: కోహ్లికి ఏమైంది.. రోహిత్, ద్రవిడ్‌తో విభేదాలా? కారణం అదేనా
Comments
Please login to add a commentAdd a comment