Odisha Train Accident
-
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
అది మన నిర్లక్ష్యానికి మూల్యమే!
నెల రోజుల క్రితం దిగ్భ్రాంతికి గురిచేసిన ఒరిస్సా ఘోర రైలు ప్రమాద ఘటనకు కారణాలు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకొస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాలలో అతి దారుణమైనదిగా నమోదైన ఈ ప్రమాదానికి మానవ తప్పిదం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమని రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడైనట్టు వస్తున్న వార్తలు మన భారతీయ రైల్వేలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. అనేక స్థాయుల్లో లోపాల వల్లే 293 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ ప్రమాదం జరిగినట్టు రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) ఎ.ఎం. చౌధరి తన దర్యాప్తు నివేదికలో తేల్చినట్టు తాజా సమాచారం. దాదాపు 1200 మందికి పైగా గాయపడిన ఈ ప్రమాదంపై భద్రతా కమిషనర్ దర్యాప్తు ఏం చెబుతుందా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు గత నెల 28న నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించారు. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అని నేర దర్యాప్తు చేస్తున్నందున ఈ తొలి నివేదికను బయటపెట్టడం లేదు. అయితేనేం, వివిధ మార్గాల్లో బయట కొచ్చిన ఈ నివేదికలోని అంశాలు మిగిలిన దర్యాప్తుకూ, సత్వరం చేపట్టాల్సిన చర్యలకూ స్పష్టమైన సూచికలుగా నిలిచాయి. రైల్వే సిబ్బందిని విచారించి, వాఙ్మూలాలను నమోదు చేసుకొని, అలాగే ప్రమాద స్థలం, రైల్వే ఆస్తులకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాక సీఆర్ఎస్ నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 40 పేజీల నివేదికలో అవన్నీ పేర్కొన్నారు. ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద బాహానగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో చెన్నై – కోల్‌కతా ‘కోరమాండల్ ఎక్స్‌ప్రెస్’ అప్ – లూప్ లైనులోకి ప్రవేశించి, అప్పటికే ఆ లైనులో ఉన్న ఓ గూడ్స్ రైలును గుద్దుకుంది. అలా ఆ రెండు రైళ్ళు గుద్దుకోవడంతో బోగీలు పట్టాలు తప్పి, పక్కనే మరో పట్టాలపై వెళుతున్న బెంగుళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి కొద్ది బోగీలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎస్ అండ్ టి) విభాగంలో అనేక స్థాయుల్లో లోపాలతోనే ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న నివేదిక సారాంశం అత్యంత కీలకం. ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణమేమిటనే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సీఆర్ఎస్ నివేదిక పోగొట్టిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు అంశాలను ఈ నివేదిక బయట పెట్టింది. ఒకటి – గతంలో 2018లో ఒకసారి, తాజా ప్రమాద ఘటనకు కొద్ది గంటల ముందు మరో సారి చేసిన మరమ్మతులు అరకొరగా, నిర్లక్ష్యపూరితంగా సాగాయి. ఫలితంగా సిగ్నలింగ్ వ్యవస్థ రాజీ పడ్డట్టయింది. రెండు – పదేపదే చేస్తూ వచ్చిన తప్పుల్ని ముందుగా పసిగట్టివుంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వివరంగా చెప్పాలంటే, 2018లో కేబుల్ లోపం తలెత్తింది. దాన్ని సరిచేసినా, కీలకమైన సర్క్యూట్ బోర్డ్‌పై దాన్ని మార్క్ చేయలేదు. లోపం సరిచేసేందుకు అప్పట్లో సర్క్యూట్ షిఫ్టింగ్ పని చేశారు. అందుకు ప్రామాణిక పద్ధతులేమీ పాటించనే లేదు. పైపెచ్చు టెర్మినల్స్ మీద అక్షరాలు తప్పుగా పేర్కొన్నారు. అయిదేళ్ళుగా అలక్ష్యం చేసిన ఆ లోపభూయిష్ఠమైన పని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు – తప్పుడు వైరింగ్, కేబుల్ ఫాల్ట్ వల్ల తలెత్తే సమస్యలేమిటో నిరుడు పశ్చిమ బెంగాల్లోనే చూశారు. అయినా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. అలాగే బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు సరిపడేలా ముందస్తు ఆమోదంతో సర్క్యూట్ డయా గ్రమ్ను మార్చి ఉన్నా రాంగ్ సిగ్నలింగ్ అయ్యేది కాదు. ఈ ఘోరం జరిగేది కాదు. ఎస్ అండ్ టి విభాగాన్ని వేలెత్తి చూపే ఈ లోపాలే కీలకమైన వేళ ఘోర ప్రమాదానికి కారణమై, అమాయకుల్ని బలిగొన్నాయని నివేదిక చెబుతున్న మాట. ఇక, రైల్వేలలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ విధానానికి కీలక కేంద్రస్థానం రిలే రూమ్. రైళ్ళను నియంత్రించే మెకానిజమ్‌లు, అలాగే లెవల్ క్రాసింగ్లకు సంబంధించిన సిగ్నలింగ్ సామగ్రి అయిన ‘రిలే హట్స్’ ఈ రిలే రూమ్‌లలోనే ఉంటాయి. అలాంటి రూమ్ ఏ స్థాయి వారికి, ఎలా అందుబాటులో ఉండాలనే విషయంలోనూ అనేక లోపాలున్నాయి. సీఆర్ఎస్ నివేదిక ఈ సంగతీ వెల్లడించింది. నివేదికను సమర్పణకు సరిగ్గా కొద్ది రోజుల ముందే రిలే రూమ్‌కు ఒకటికి రెండు తాళాలు వేయాలని రైల్వే నిర్ణయించడం గమనార్హం. ఎప్పుడో 2018లో జరిగిన తప్పు ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుందంటే, క్రమం తప్పకుండా చేయాల్సిన చెకింగ్లు సవ్యంగా సాగడం లేదనే! రైల్వే స్టేషన్లలో మార్పులు చేసిన సర్క్యూట్లన్నీ సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, పరీక్షించడానికి ఇకపై ప్రత్యేక బృందాన్ని నియోగించాలని సీఆర్ఎస్ సిఫార్సు చేయడం గమనార్హం. అలాగే, ప్రమాద సందర్భంలో సత్వర స్పందనకు జోనల్ రైల్వేలలో ఏర్పాట్లను సమీక్షించాలంది. కళ్ళెదుటే లోపాలు కనిపిస్తున్నాయి గనక ఇకనైనా నిద్ర మేల్కోవాలి. లోపరహిత వ్యవస్థను సృష్టించాలి. అయితే, అందుకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పన ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడింది. దీర్ఘకాలికమైన ఆ పని చేయాలంటే రాజకీయ కృత నిశ్చయం ఉండాలి. రైల్వేలో భారీగా పెట్టుబడి పెట్టాలి. పార్టీల తేడాలు లేకుండా కేంద్రంలో గద్దె మీదున్న ప్రతి ప్రభుత్వంలోనూ అవి కొరవడ్డాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సవ్యంగా నడవాలంటే బండికి నట్లు, బోల్టులు అన్నీ సక్రమంగా బిగించి ఉండడం అవసరమని ఇకనైనా గ్రహించాలి. ఎడాపెడా వందే భారత్ రైళ్ళ కన్నా ప్రస్తుతం ఇదే ఎక్కువ అవ సరం! ఒరిస్సా దుర్ఘటన, దానిపై సీఆర్ఎస్ నివేదిక ఆ సంగతే గుర్తు చేస్తున్నాయి. గుర్తుపట్టే నాథుడు లేక ఇప్పటికీ బాలాసోర్‌లో పడివున్న 80కి పైగా మృతదేహాలూ మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. -
‘బాలాసోర్’లా త్వరలో ఘోర రైలు ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల జరిగిన ఘోర రైల్వే ప్రమాదం వంటిదే ఢిల్లీ–హైదరాబాద్ రైల్వే మార్గంలో జరగబోతోందంటూ ఓ ఆగంతకుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాలాసోర్‌లో ఒక గూడ్స్ రైలు, రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొని వందల మంది చనిపోవడం, ఆ ప్రమాదం వెనుక విద్రోహ చర్య కూడా ఉండే అవకాశంపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో అదే తరహా మరో ప్రమాదం జరగబోతోందంటూ నాలుగైదు రోజుల కింద వచ్చిన లేఖతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ–హైదరాబాద్ మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థలను, ట్రాక్ పరిస్థితిని తనిఖీ చేస్తున్నారు. ప్రతి రైలును క్షుణ్నంగా తనిఖీ చేయాలని, సిబ్బంది అంతా జాగ్రత్తగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశించారు. ఇక రైల్వే పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు లేఖ ఎక్కడి నుంచి వచ్చిది, ఎవరు రాశారన్నది తేల్చేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే.. -
‘అందుకే ఒడిశా దుర్ఘటన జరిగింది’.. రైల్వే బోర్డుకు నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు 300 మందిని బలిగొన్న ఒడిశా బాలాసోర్ రైల్వే దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషన్ తన స్వతంత్ర నివేదిక సమర్పించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు సమర్పించిన తన నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగ్ ప్రధాన కారణమని వెల్లడించిన సీఆర్ఎస్ నివేదిక.. అనేక స్థాయిలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రైల్వే బోర్డుకు నివేదించింది. అలాగే.. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని.. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖార్గ్‌పూర్ డివిజన్ బ్యాంక్రనాయబాజ్ స్టేషన్ వద్ద తప్పు వైరింగ్, కేబుల్ లోపం కారణంగా జరిగిన ఘటనను నివేదికలో ప్రస్తావించింది కమిషన్. అలాగే.. లోపం సరిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డుకు సూచించింది కమిషన్. జూన్ 2వ తేదీ రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరగ్గా.. 292 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఇదీ చదవండి: దేశంలో మొదటి ప్రాంతీయ రైలు సర్వీసు.. అతి త్వరలో ప్రారంభం! -
దక్షిణమధ్య రైల్వేకు బెదిరింపు లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపులతో లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ తరహాలో వారం రోజుల్లో ప్రమాదం జరగబోతోందని లేఖలో సందేశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు గత వారం లేఖ రాగా.. దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులకు ఆ లేఖను దక్షిణమధ్య రైల్వే అందించినట్లు సమాచారం. ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ఈ ఘటన జరుగుతుందని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను వెస్ట్‌జోన్ డీసీపీ చందనా దీప్తి ధృవీకరించారు. మూడు రోజుల కిందట దక్షిణ మధ్య రైల్వే తమకు సమాచారం అందించిందని.. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ చేపటినట్లు తెలిపారు. -
ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం
భువనేశ్వర్: ఇటీవలే ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బహనాగ వద్ద మూడు రైళ్లు ఒక్కదానినొకిటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత అధికారులపై రైల్వే బోర్డు చర్యలకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్టర్ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై బోర్డు వేటు వేసింది. సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేఫ్టీ విభాగాలను చూసే ఈ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇక, వేటు పడిన వారిలో ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీ ఉన్నారు. అయితే, ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు. జేఈ ఇంటి సీల్ వేసిన సీబీఐ మరోవైపు.. ఒడిషా రైలు ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబం కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి తాళం ఉన్నది గమనించక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. ఇది కూడా చదవండి: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
ఒడిశా దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో అమీర్‌ఖాన్ అనే పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. భారతీయ రైల్వేస్‌లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరీ జేఈ అమీర్ ఖాన్ ఈ ఉదయం నుంచి ట్విటర్లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు. ఇదీ చదవండి: పోస్ట్‌మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది! -
ప్రయాణీకులకు అలర్ట్: ఆ రూట్లో 15 రైళ్లు రద్దు పూర్తి లిస్ట్ ఇదే..
సాక్షి, సికింద్రాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు నడిచే 15 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. అయితే, ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 280మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. కాగా, రైలు ప్రమాదంలో టాక్ మొత్తం దెబ్బతిన్నది. ప్రస్తుతం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రటకనలో పేర్కొంది. అలాగే, ఈ నెల 12న చెన్నై సెంట్రల్ -షాలిమార్ (12842)రైలు సర్వీసు సేవలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. అయితే, రైలు ప్రమాద ఘటన తర్వాత వందలాది మంది కార్మికులు రాత్రింభవళ్లు కష్టపడి ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడంతో దాదాపు 50 గంటల తర్వాత మళ్లీ మార్గంలో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి. రద్దయిన రైళ్ల వివరాలు.. - ఈ నెల 11న (ఆదివారం) మైసూరు- హౌరా (22818) రైలు రద్దు, - 12వ తేదీన హైదరాబాద్-షాలిమార్ (18046), - ఎర్నాకుళం-హౌరా (22878), - సంత్రగాచి-తంబ్రం(22841), - హౌరా-చెన్నై సెంట్రల్ (12839), - ఈ నెల 13న సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807), - హౌరా- ఎఎంవీటీ బెంగళూరు(22887), - షాలిమార్-చెన్నై సెంట్రల్ (22825), - షాలిమార్-హైదరాబాద్(18045), - సికింద్రాబాద్-షాలిమార్(12774), - హైదరాబాద్-షాలిమార్ (18046), - విల్లుపురం-ఖరగ్‌పూర్(22604), - ఈనెల 14వ తేదీన సర్వీసులందించే ఎస్ఎంవీటీ బెంగళూరు-హౌరా (22864), - భాగల్పూర్ -ఎస్ఎంవీటీ బెంగళూరు(12254), - షాలిమార్-సికింద్రాబాద్ (12773) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. Bulletin no. 28, SCR PR No.146 dt.11.06.2023 on "Cancellation / Restoration of Trains" @drmhyb @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/nrm4V2PqbJ — South Central Railway (@SCRailwayIndia) June 11, 2023 ఇది కూడా చదవండి: బిపర్జోయ్ తుపాను మహోగ్రరూపం -
రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు..
ఒడిశా:ఒడిశా రైలు ప్రమాద ఘటనతో మేల్కొన్న రైల్వే శాఖ రైళ్ల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు నడవడానికి కీలకంగా పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థలను రెండేసి తాళాలు వేసి రక్షించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రిలే రూమ్‌లు, రిలే హట్లు,లెవల్ క్రాసింగ్ టెలికమ్యునికేషన్ పరికరాలు, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్‌లను జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరికరాలు ఉండే వ్యవస్థకు రెండు తాళాలు వేసైనా కాపాడాలని తీర్మానించింది.ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి సిగ్నల్ వ్యవస్థలో దుండగులు చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు తాళాలు విధానం తీసుకువచ్చేవరకు ప్రస్తుతం ఉన్న ఒక తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్దే ఉంచాలని రైల్వే బోర్డు తెలిపింది. ఏ తాళాన్ని ఎవరు వేశారు? ఎవరు తీశారు? వంటి అంశాలను ఎప్పటికప్పుడు పేర్కొనే విధంగా ఓ పట్టికతో కూడిన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కాగా.. ఒడిశా రైలు ప్రమాదంలో 280 మంది మరణించారు. 12 వందలకు పైగా క్షతగాత్రులయ్యారు. ఇదీ చదవండి:ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన.. ఎందుకలా చేస్తున్నారు? -
ఒడిశా రైలు ప్రమాదం: ఆ స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు.. ఎందుకంటే..?
ఒడిశా:ఒడిశా బాలాసోర్‌లోని బహగానా స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. బహగానా స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు. ఈ కేసు సీబీఐ పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఈ స్టేషన్ వద్ద రైళ్లు ఆగబోవని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులు బహగానా స్టేషన్ లాగ్ బుక్స్‌ను స్వాధీనం చేసుకుని, స్టేషన్‌ను సీజ్ చేశారు. బహగానా స్టేషన్‌ను సీబీఐ సీజ్ చేసిందని దక్షిణ-తూర్పు రైల్వే చీఫ్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. ఈ స్టేషన్ గుండా దాదాపు 170 రైళ్లు ప్రతిరోజూ ప్రయాణిస్తాయి. ప్యాసింజర్ రైళ్లు భద్రక్- బాలాసోర్, హౌరా-భద్రక్ బఘజతిన్, ఖరగ్‌పుర్ ఖుర్ధా రైళ్లు ఇక్కడ ఒక నిమిషం పాటు నిలిచేవని ఆయన తెలిపారు. బాలాసోర్ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు.1208 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 709 మందికి రైల్వే శాఖ ఇప్పటికే పరిహారాన్ని కూడా అందించింది. ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ ట్వీట్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రక్తదాతలకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. ట్వీట్‌తో పాటు పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు) Hearty Thanks to each and every Blood brother / sister who has responded to my appeal and donated blood specifically to help the #BalasoreTrainAccident victims in Odisha! My heartfelt gratitude to you all ! 🙏@Chiranjeevi_CT pic.twitter.com/nj6PJGJyHo — Chiranjeevi Konidela (@KChiruTweets) June 9, 2023 -
ఒడిశా కోరమాండల్ ప్రమాద వీడియో వైరల్!
Balasore Train Accident Video Viral: ఒడిశా బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వీడియో ఇదేనంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఒడిశా ఛానెల్స్ కూడా ఈ వీడియోను అధికారికమేనంటూ తెరపైకి తెచ్చాయి. ప్రమాదానికి ముందు క్షణాలంటూ ఆ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మీరు ఒకవేళ సున్నిత మనస్కులు అయితే గనుక దయచేసి ఈ వీడియో చూడకండి. ఒడిశాలో జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అందులో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తున్న రైలులో.. రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్లో అదంతా రికార్డు చేస్తున్నారు. అంతలో.. ఒక్కసారిగా కల్లోల పరిస్థితి.. హాహాకారాలతో వీడియో ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్ప్రమాద వీడియో అంటూ విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఒడిశా ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ మృతదేహాల్లో ఇంకా 82 మందిని గుర్తించాల్సి ఉంది. బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని ఉపయోగించాలని నిర్ణయించారు. -
శవాలపై సొమ్ము చేస్కుంటున్నా కఠిన మనుషులు
-
సమయానికి రావాల్సిన దర్యాప్తు బృందం ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నాం!
సమయానికి రావాల్సిన దర్యాప్తు బృందం ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నాం! -
ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు కార్మికులు మృతి
ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. జాజ్‌పుర్ కియోంజర్ రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు బోగీల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంజన్ లేని గూడ్స్ రైలు పట్టాలపై నిలిపి ఉంది. ఈదురుగాలులతో వర్షం ప్రారంభం కాగానే.. ట్రాక్ పనులకు వచ్చిన కార్మికులు గూడ్స్ రైలు బోగీల కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో భారీగా వీస్తున్న గాలులకు రైలు బోగీలు కదిలాయి. దీంతో బోగీల చక్రాల కింద నలిగి నలుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి -
Odisha tragedy: 51 గంటల నాన్‌స్టాప్ ఆపరేషన్.. ఆయన వల్లే ఇదంతా!
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన తీరు.. అక్కడి దృశ్యాలను చూసిన వాళ్లెవరైనా.. అది ఎంత తీవ్రమైందో అంచనా వేసేయొచ్చు. అలాంటిది సహాయక చర్యల దగ్గరి నుంచి.. తిరిగి పట్టాలపై ఆ రూట్లో రైళ్లు పరుగులు తీయడం దాకా.. అంతా జెట్స్పీడ్తో జరిగింది. మునుపెన్నడూ లేనంతగా కేవలం 51 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. ఎలా?.. అందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా.. రైల్వే మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం, అందుకు తగ్గట్లే కొందరు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, బాలాసోర్ ఘటన వేళ.. అశ్విని వైష్ణవ్ త్వరగతిన స్పందించిన తీరు, స్వయంగా ఆపరేషన్‌ను ఆయనే దగ్గరుండి పరిశీలించడం లాంటివి ఆయన మీద ప్రతికూల విమర్శలు రాకుండా చేశాయి. ⛑️ ప్రమాదం జరిగిన గంటల్లోపే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఎం నవీన్ పట్నాయక్ కంటే ముందుగానే.. వేకువ ఝామున అక్కడికి చేరుకుని ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సహాయ, పునరావాస చర్యల వేగం ఊపందుకుంది. అశ్వినీ వైష్ణవ్ ఒకప్పుడు బాలాసోర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. అలాగే.. 1999లో ఒరిస్సా(ఇప్పటి ఒడిశా) భారీ తుఫాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవమూ ఆయనకు ఈ సందర్భంగా పనికొచ్చాయి. ⛑️ జరిగింది భారీ ప్రమాదం. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటిది ఎరిగింది లేదు. ఒకవైపు శవాల గుట్టలు.. మరోవైపు పెద్ద సంఖ్యలో బాధితులు. పకడ్బందీ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా ఈ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఆ స్థానంలో ఎవరున్నా ఇబ్బందిపడేవాళ్లేమో!. కానీ, విపత్తుల నిర్వహణపై ఆయనకున్న అవగాహన, గత అనుభవం.. బాలాసోర్ ప్రమాద వేళ సాయపడింది. అధికారులతో మాట్లాడి, సాంకేతిక సమస్యలను అధిగమించే వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారు. స్వయంగా ఆయనే దగ్గరుండి అంతా పర్యవేక్షించారు. VIDEO | Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work at the triple train accident site in Odisha’s Balasore. pic.twitter.com/U7Xno9BDpt — Press Trust of India (@PTI_News) June 4, 2023 ⛑️ 2, 300 మంది సిబ్బంది.. రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి రెండు బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు వేర్వేరుగా పర్యవేక్షించారు. ఆ సీనియర్ సెక్షన్ ఇంజనీర్లపై డివిజనల్ రైల్వే మేనేజర్, జనరల్ మేనేజర్ పర్యవేక్షణ కొనసాగింది. వారిని రైల్వే బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. #WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw takes stock of the restoration work that is underway overnight at the site where #Balasoretrainaccident took place pic.twitter.com/TkulNKv3H7 — ANI (@ANI) June 3, 2023 ⛑️ బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ హాస్పిటల్ కు, డైరెక్టర్ జనరల్ హెల్త్ ను భువనేశ్వర్ హాస్పిటల్ కు పంపించారు. ⛑️ నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు. సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, ! బాధితులకు మెరుగైన చికిత్స అందించడం, వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టడం.. ⛑️ ఇవే లక్ష్యాలుగా ఆయన ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అలా 51 గంటల్లోనే మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో రైలు సేవలను పునరుద్ధరించగలిగారు. ఈ నెల 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మెయిల్ లైన్ లో వెళుతున్న యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి 288 మంది మరణించారు. -
WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ బుధవారం ఓవల్ వేదికగా మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయాలపాన సందర్భంగా టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో కనిపించారు. ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. కాగా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తూ టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్ల నల్ల రిబ్బన్లు ధరించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని.. బీసీసీఐ కూడా ఒడిశా ప్రమాద బాధితులకు సహాయం చేసే పనిలో ఉందని పేర్కొన్నాడు. టీమిండియా, ఆసీస్ ఆటగాళ్ల చర్యను అభిమానులు స్వాగతించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలబడతామని టీమిండియా పేర్కొనడం సంతోషాన్ని ఇచ్చిందంటూ కామెంట్ చేశారు. The Indian Cricket Team will observe a moment of silence in memory of the victims of the Odisha train tragedy ahead of the start of play on Day 1 of the ICC World Test Championship final at The Oval. The team mourns the deaths and offers its deepest condolences to the families… pic.twitter.com/mS04eWz2Ym — BCCI (@BCCI) June 7, 2023 చదవండి: WTC Final Day-1: ఖవాజా డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ -
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్!
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్! -
ఒడిశా ప్రమాదం.. రైలు బండి నడిపే వారెక్కడ?
దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. ►కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ►అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. ►సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. ►కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? ►తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
ఒడిశా విషాదం:పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం ద్వారా యూజర్లు అందించిన విరాళాలకు సమాన మొత్తంలో తాను కూడా చెల్లించ నుంది. ప్రమాదంలో బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. (జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం) ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రతిజ్ఞ చేశారు. వినియోగదారులు చెల్లించిన ప్రతీ రూపాయిక మరో రూపాయి జోడించి.. ఇలా సేకరించిన నిధులను ఒడిశా ముఖ్యమంత్రి సహాయనిధి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. "విరాళం ఇచ్చిన మొత్తంపై 80జీ పన్ను మినహాయింపు పొందవచ్చు. Paytm యాప్‌లోని 'ఆర్డర్ & బుకింగ్స్' విభాగం నుండి రసీదులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తమ డొనేష్లనకుసంబంధించిన స్క్రీన్షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. (రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఇదీ చదవండి: నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం Help the victims of the Odisha train tragedy 🙏 Paytm Foundation will match your contribution ₹ to ₹. A small donation can make a big difference❤️ Donate now on Paytm App: https://t.co/av9bdffnwS — Paytm (@Paytm) June 6, 2023 కాగా జూన్ 2న జరిగిన ప్రమాదంలో దాదాపు 288 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. దాదాపు 1,100 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Contribute to Odisha Train tragedy victims through Paytm. We will match all your contributions ₹ to ₹. Thanks for your contributions 🙏🏼 https://t.co/QTQM1LhS4H — Vijay Shekhar Sharma (@vijayshekhar) June 5, 2023 -
ఒడిశా దుర్ఘటన.. శవాలా గుట్టలు చూశాక ఆకలేస్తుందా?
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దుర్ఘటన.. 278 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంకా వంద దాకా మృతదేహాల్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఎంబాంబింగ్ ద్వారా మృతదేహాల్ని ఎంతో కాలం భద్రపర్చలేమని అంటున్నారు అధికారులు. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు అయినవాళ్లు పడుతున్న ఆరాటం దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంకోపక్క ఆ మృతదేహాలు తమవాళ్లవేనంటూ నాటకాలతో పరిహారం దక్కించుకునేందుకు కొందరు చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు సైతం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకాయన భావిస్తుంటే.. మరో సిబ్బంది ఆ శవాల గుట్టలను చూశాక ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ బాలాసోర్ యాక్సిడెంట్ ఆ పరిస్థితులను వివరిస్తూ.. ‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు 300మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. వీళ్లకు స్థానికులు కొందరు సహకరించడం గమనార్హం. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలకంగా వ్యవహరించింది. దాదాపు 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయగా.. 121 మృతదేహాలను వెలికి తీశారు. విపత్తుల వేళ ఎంతో గుండె నిబ్బరం ప్రదర్శించే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో.. కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు స్వయానా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి? -
బాలాసోర్ ఘటనపై సీబీఐ ఎఫ్ఐఆర్
భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఆపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్, సిగ్నల్ రూమ్‌ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది. సిగ్నల్ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో చూడాలి. జూన్ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు. ఇదీ చదవండి: ఒడిశా ఘటన.. అయినవాళ్లు ఎక్కడ? -
నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు మద్దతు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని అందించిందన్నారు. రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, పంచదార, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించ నున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అంబులెన్స్‌లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత మందులు, చికిత్సను అందించనున్నట్టు ప్రకటించింది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్‌కు చెందిన దాతృత్వ విభాగం రిలయన్స్ ఫౌండేషన్. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. బాధితుల నష్టాన్ని పూడ్చలేం కానీ మరణించిన కుటుంబాలు ఈ విషాదం నుంచి కోలుకుని వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టుకునేలా, ముందుకు నడిచేలా చేసేందుకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ లక్ష్యంతో 10-పాయింట్ల ప్రోగ్రామ్‌ను నీతా అంబానీ ప్రకటించారు. (ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్) బాధితులకు అండగా పది పాయింట్ల ప్రోగ్రామ్ ►గాయపడిన వారి తక్షణ కోలుకోవడానికి అవసరమైన మందులు, ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి వైద్య చికిత్స. ► విషాదం నుంచి కోలుకునేందుకు మద్దతు కోసం కౌన్సెలింగ్ సేవలు. ►జియో, రిలయన్స్ రీటైల్ ద్వారా మరణించిన వారి కుటుంబంలోని సభ్యునికి ఉపాధి అవకాశాలు ►వీల్చైర్లు, ప్రొస్థెసెస్తో సహా వైకల్యాలున్న వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడం. ►కొత్త ఉపాధి అవకాశాలను కనుగొనడానికి బాధిత ప్రజలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ. ►తమ కుటుంబంలోని ఏకైక సంపాదన సభ్యుడిని కోల్పోయిన మహిళలకు మైక్రోఫైనాన్స్ , శిక్షణ అవకాశాలు. ►ప్రమాదంలో ప్రభావితమైన గ్రామీణ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఆవు, గేదె, మేక, కోడి వంటి పశువులను అందించడం. ►మరణించిన కుటుంబ సభ్యునికి జియో ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ కనెక్టివిటీ -
ఒడిశా రైలు ప్రమాదం: ఒక్కరు తప్ప అందరూ సేఫ్
సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలోని రాష్ట్ర ప్రయాణికులు ఐదుగురిలో ఒక్కరే మృతిచెందారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి మరణించినట్లు గుర్తించామని.. ఒడిశాలో నివసిస్తున్న ఆయన, పెన్షన్ కోసం వచ్చి, తిరిగి వెళ్తూ కోరమాండల్ ఎక్కినట్లు తేలిందన్నారు. అతనితోపాటు అదే బోగీలో విశాఖకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారని, వీరు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు, రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నామని.. గాయపడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందన్నారు. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 342 మంది రిజర్వ్డ్ ప్రయాణికులు సేఫ్ కటక్, బాలాసోర్‌లోని సోరూ, గోపాలపురం ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రయాణికులతో పాటు, ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఊళ్లలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుని మాట్లాడాం. అత్యవసర చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన విశాఖకు తరలించడంతో పాటు, భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రిలో కూడా చేర్చాం. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి బయల్దేరిన లేదా ఏపీలో దిగాల్సిన వారి వివరాలు సేకరించాం. ఆ రైలు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 309 మంది తెలుగువారు ఉన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 33 మంది ఉన్నారు. రెండు రైళ్లలో 342 మంది తెలుగువారు ప్రయాణిస్తున్నట్లు తేలింది. వారిలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా, 329 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ప్రయాణికుడు మాత్రం బంధువులతో ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మందిని విశాఖకు తరలించి కేజీహెచ్‌లో ముగ్గురికి, సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో ఇద్దరికి, క్యూవన్ ఆస్పత్రిలో ఇద్దరికి, అపోలోలో ఒకరికి చికిత్స చేయిస్తుండగా, మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక సాయం అందజేత కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆరి్థక సాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి అమర్నాథ్ సోమవారం అందించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఇక ఈ ప్రమాదం గురించి తెలియగానే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే.. మర్నాటి ఉదయమే నాతో పాటు ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు ఐపీఎస్‌లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మాతోపాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 108 సర్వీసులు 20, మరో 19 ప్రైవేటు అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వాహనాలను తీసుకెళ్లాం. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద ఐదు అంబులెన్స్‌లతో సేవలందించాం. ఇంకా సీఎం ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్‌లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస.. ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర స్టేషన్లలో కంట్రోల్ రూంలకు అందిన సమాచారం ద్వారా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల చార్టుల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నంబర్ల ప్రకారం వారితో మాట్లాడి ఆచూకీ తెలుసుకున్నాం. సురక్షితంగా స్వస్థలాలకు చేరేవరకు అందరినీ అప్రమత్తం చేశాం. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిసి మన చర్యలను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా గురించి చెప్పగా కేంద్ర మంత్రులు అభినందించారు. చదవండి: అమ్మానాన్న క్షమించండి! -
వాదోపవాదాల విషాదం
రైల్వే సిగ్నల్స్ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నైరుతి రైల్వే ప్రధాన అధికారి హెచ్చరించారు! అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్’, పార్లమెంటరీ స్థాయీ సంఘం అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత కేంద్ర కమిటీలు, ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు.. మంత్రులు రాజీనామాలు చేయాలని, కాదు కాదు... కింది తరగతి రైల్వే ఉద్యోగుల్ని, కార్మికుల్ని శిక్షించాలని వాదోపవాదాలకు దిగడం కూడా విషాదమే! ‘‘వందలాదిమంది ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ శతాబ్దంలోనే ఇది అతి పెద్ద ప్రమాదం.’’ – ప్రధాని నరేంద్ర మోదీ (4.6.2023) ‘‘చాలాకాలంగా భారత రైల్వేలోని సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాల గురించీ, వైఫల్యాల గురించీ, రైళ్ల రాకపోకలను తెలియజేసే గుర్తులను సూచించే సరైన పద్ధతుల గురించీ; రైలు బయలుదేరిన తరువాత, రైలు వెళ్లే దిశను మార్చవలసి వస్తే ఆ మార్పును సూచించే గుర్తును తెలిపే విధానం గురించీ స్పష్టంగా ఉంది. కానీ నిర్దిష్టమైన సిగ్నల్స్‌ను అనుసరిస్తూ లోపాల్ని తక్షణం సవరించకపోతే – రైలు దుర్ఘటనలు అనివార్యమవుతాయి...’’ అని కూడా నైరుతి రైల్వే ప్రధాన అధికారి ఈ ఏడాది ఫిబ్రవరి 9 న హెచ్చరించారు. అంతేగాదు, రైల్వే సిగ్నల్స్ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఆ ఉన్నతాధికారి హెచ్చరించారు. అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్’, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికల హెచ్చరికలను పాలకులు పెడచెవిన పెట్టడానికి కారకులెవరన్న ప్రశ్నలకూ సమాధానం లేదు! ఈ పై కారణాలను పరిశీలించినప్పుడు ఎవరిని నిందించాలి? పాలకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కమిటీలు, దఫదఫాలుగా నియమించిన సాధికార ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను, వాటి సారాంశాన్ని అధికారులు ఎందుకు పాటించడం లేదన్నది అసలు ప్రశ్న. రైలు ప్రమాద ఘటన సందర్భంగా, మహబూబ్‌నగర్ వద్ద రైలు ప్రమాదంలో 112 మంది ప్రయాణికులు చనిపోయినందుకు విలవిలలాడిన నాటి కేంద్ర రైల్వే మంత్రి, గాంధేయవాది అయిన లాల్ బహ దూర్ శాస్త్రి తన పదవికి క్షణాలలో రాజీనామా చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ప్రధాని పండిట్ నెహ్రూ ‘వద్దని’ వారించినా లాల్‌బహదూర్ రాజీనామాకే పట్టుబట్టారు! మహబూబ్‌నగర్ దుర్ఘటన తరువాత కొలది రోజులకే తమిళనాడులోని అరియలూర్ దుర్ఘటనలో 144 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలూ లాల్‌బహదూర్‌ను కుదిపేశాయి. 68,100 కిలోమీటర్ల నిడివిగల రైల్వే లైన్లతో కూడిన భారత వ్యవస్థలో గత 15 ఏళ్లలో జరిగిన ప్రధాన దుర్ఘటనలు: జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (మృతులు 148), ఉత్తర బంగా–వనాంచల్ ఎక్స్ ప్రెస్ (63 మంది), ఛాప్రా–మథుర ఎక్స్‌ప్రెస్ (63 మంది), హుబ్లీ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (25మంది), తమిళనాడు–ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (30), యూపీ సంత్‌కబీర్–గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ (25), డెహ్రాడూన్–వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ (30), పాట్నా–ఇండోర్ ఎక్స్‌ప్రెస్ (150), బికనీర్– గౌహతి ఎక్స్‌ప్రెస్ (9 మంది), హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (140). రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదుపాజ్ఞల వ్యవస్థ పకడ్బందీగా లేనందున జరుగుతున్న ఈ వరస రైలు దుర్ఘటనల నివారణకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అక్కరకు రావడం లేదు. అంటే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో కూడా లోపం ఉందని పలువురు రైల్వే అధికారుల నోట కూడా వినవస్తోంది. కానీ ఈ తీవ్ర లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు కింది తరగతి రైల్వే ఉద్యోగుల్నీ, కార్మికుల్నీ శిక్షించే మార్గాలను పాలకులు వెతకడానికి ప్రయత్నించడం సమంజసం కాదు. ఒకవైపున రైల్వేబోర్డే సిగ్నలింగ్‌లో లోపం వల్ల ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పుడు, ప్రమాద కారణాల్ని కార్మిక సిబ్బందిపైకి నెట్టడానికి ప్రయత్నించడం సరి కాదు. ఆధునిక పరిజ్ఞానం ఆకళింపులో ఉన్నా మానవుల స్వయం పరిమితుల్ని కూడా గమనించుకోవాలి. అక్కడికీ ఒక సీనియర్ రైల్వే అధికారి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు: ‘‘ఇంటర్ లాకింగ్‌లోని సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ పనిచేయడంలో సంభవించే లోపం వల్ల కూడా రైళ్లకు సూచించవలసిన లూప్‌లైన్, మెయిన్ లైన్ ఎంపికలో గందరగోళానికి అవకాశం ఉంది. అంటే సిగ్నల్ ఒకటై, స్విచ్ ఆపరేషన్ వేరైతే ఈ ప్రమాదానికి ఆస్కారం ఉంది (5.6.23). ఈ ఘోరానికి రైల్వేమంత్రి రాజీనామా పరిష్కారం కాకపోవచ్చుగాని, ఆ స్థానంలో మరొకర్ని విచారణ పేరిట తేలిగ్గా ఇరికించే అవకాశం ఉంది. ఇంతకూ మనిషి (మంత్రి కూడా మనిషే అయితే) స్వార్థం ఎలా పనిచేస్తుందో కవి ‘సినారె’కు బాగా తెలిసి నట్టుంది: ‘‘తోడుగ సాగే నీడను కూడా వాడుకుంటుంది స్వార్థం ఆపై వాణ్ణే పాచిక చేసే ఆడుకుంటుంది స్వార్థం మనిషిలోని ఆ చీకటి కోణం మార్చే వేషాలెన్నో – చిటికెడు పేరుకు నీతిని నిలువున చీల్చేస్తుంది స్వార్థం మూరెడు గద్దె కోసం జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘బాలాసోర్’ కళ్లు తెరిపిస్తుందా?
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో రైళ్లు ఢీకొన్న ఘోర ఉదంతం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తోంది. ఇప్పటికీ అనేక కుటుంబాలు తమ ఆప్తుల ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్నాయి. 187 మృత దేహాలను ఇంకా గుర్తించాల్సివుందంటున్నారు. శుక్రవారం సంజె చీకట్లు అలుముకుంటున్న వేళ హౌరా నుంచి చెన్నైకి వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించి అక్కడున్న గూడ్స్ రైలును ఢీకొట్టడం, ఆ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన బోగీల్లో ఒకటి రెండు పక్క ట్రాక్‌పై పడడం, ఆ ట్రాక్‌పై వెళ్లే బెంగళూరు– హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సైతం ప్రమాదంలో చిక్కుకోవడం ఊహకందని ఉత్పాతం. మృతుల సంఖ్య 275 వరకూ ఉండగా, 1100 మంది గాయపడ్డారు. వీరిలో కనీసం వందమంది వరకూ తీవ్ర గాయాలపాలైనవారున్నారు. విద్రోహ చర్యనో, సాంకేతిక తప్పిదమో ఇంకా నిర్ధారించాల్సే ఉన్నా ఆ దుర్ఘటన వందలాది కుటుంబాల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. అనేకులు శాశ్వత అంగవైకల్యం బారినపడ్డారు. సహాయ బృందాలు వచ్చేలోగా స్థానికులు చూపిన చొరవ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇది విద్రోహ చర్య కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. కారకులెవరో కూడా తెలిసిందంటున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కూడా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడాన్ని కొట్టిపారేయ లేమన్నది రైల్వే అధికారుల మాట. చెప్పడానికి ఇది బాగానేవున్నా... ఆ వ్యవస్థలో లోపాన్ని గుర్తించి మొన్న ఫిబ్రవరిలో నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ విషయంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలేమిటో ఉన్నతాధికారులు వెల్లడించాలి. ఆ లేఖలోని అంశాలు భీతి గొలుపుతాయి. ఆ నెల 8న బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పుడు బాలాసోర్‌లో కోరమండల్‌కు ఎదురైన లాంటి సమస్యే వచ్చింది. మెయిన్ లైన్లో పోవచ్చని వచ్చిన సిగ్నల్‌కు భిన్నంగా ట్రాక్ మారటాన్ని గమనించి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు.లేకుంటే అది కూడా పెను ప్రమాదంలో చిక్కుకునేది. మన దేశంలో అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరసగా పట్టాలెక్కుతున్నాయి. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు నడుస్తున్నాయి. కానీ మన రైల్వేల పనితీరు అంతంత మాత్రమే. రోజూ మన రైళ్లు 2 కోట్ల 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. 1950లో ఉన్న మన రైల్వే ట్రాక్‌ల నిడివి 53,596 కిలోమీటర్లయితే, ఇప్పుడది 68,100 కి.మీ.కి చేరుకుంది. అప్పట్లో మన రైల్వే ట్రాక్‌ల నిడివిలో సగం కన్నా తక్కువగా...అంటే 21,800 కి.మీ. మాత్రమే ఉన్న చైనాలో 1997 నాటికి 66,000 కిలోమీటర్లకు చేరుకోగా, ప్రస్తుతం అది 1,55,000 కి.మీ ఉందని అంచనా. అంటే మనకు రెట్టింపు అన్నమాట. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే కేటాయింపులు అయిదు రెట్ల వరకూ పెరిగిన మాట వాస్తవమే అయినా... దానికి తగినట్టు సదుపాయాలు పెరుగు తున్న దాఖలా గానీ, మెరుగైన బోగీలు తెస్తున్న తీరు గానీ కనబడటం లేదు. భద్రతా అంశాలు సరేసరి. తరచుగా రైళ్లలో ప్రయాణించేవారికి ఇవన్నీ నిత్యానుభవం. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రైల్వే శాఖ కూడా దీనికి మినహాయింపు కాదు. మొన్న జనవరి గణాంకాల ప్రకారం ఆ శాఖలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా పడి వున్నాయి. వీటిల్లో చాలా పోస్టులు భద్రత, నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే. సెంట్రల్ రైల్వేలో భద్రతకు సంబంధించిన విభాగంలో 28,650 పోస్టులుంటే అందులో సగం ఖాళీలే. కొత్త రైళ్లు వస్తున్నాయి. వాటి వేగం కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగినట్టుగా ట్రాక్‌లు ఉంటున్నాయా? సిబ్బంది పెరుగుతున్నారా? పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వేగవంతమైన రైళ్లు వచ్చాయని సంబరపడుతున్నాం గానీ...ఇప్పటికీ మన రైళ్ల సగటు వేగం గంటకు 50 కిలోమీటర్లు మించడం లేదు. దీన్ని అయిదేళ్లలో 75 కిలోమీటర్లకు పెంచుతామని 2017లో రైల్వే బోర్డు ప్రకటించింది. కానీ అది కలగా మిగిలిందని ఇటీవలే కాగ్ అక్షింతలు వేసింది. జపాన్, చైనా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లలో రైళ్ల సగటు వేగం 150 – 250 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మన రైళ్ల సగటు వేగం నాసిరకంగా ఉన్నా భద్రతాపరంగా మెరుగైన స్థితిలో ఉండలేకపోతున్నాం. రైళ్లు పెరిగినా, వాటి వేగం పుంజుకున్నా అందుకు అనుగుణంగా ట్రాక్‌లు పెరగకపోవటం వల్ల ఉన్న ట్రాక్‌లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ట్రాక్‌ల నిర్వహణ, విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల పర్యవేక్షణ వంటివి సక్రమంగా సాగటం లేదు. మరమ్మత్తుల కోసం రైళ్లను ఆపాల్సి రావటంతో ‘సూపర్ ఫాస్ట్’ భుజకీర్తులు తగిలించుకున్న రైళ్లు కూడా సకాలంలో గమ్యం చేరటం లేదు. రైళ్లను ఎక్కువగా వినియోగించేది సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పౌరులు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న కోరమండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల మృతుల్లో ఎక్కువ మంది వలస వెళ్లక తప్పని బడుగుజీవులే కావటం యాదృచ్ఛికం కాదు. బాలాసోర్ ఉదంతం మన పాలకుల కళ్లు తెరిపించాలి. ఇతర సర్కారీ కొలువుల మాటెలావున్నా భద్రతకు అగ్ర ప్రాధాన్యమిచ్చి రైల్వేల్లో కొన్నేళ్ళుగా అలా ఉంచేసిన లక్షలాది ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలి. ఆదాయం తప్ప మరేమీ పట్టని ధోరణి ఇకనైనా మారాలి. మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతకు ప్రాధాన్యం లాంటి అంశాల్లో రాజీ పనికిరాదు. -
అతను చనిపోయాడనుకున్నారు.. తండ్రి నమ్మకమే బ్రతికించింది!
కోల్కత్తా: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణీకులు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదంలో మృతదేహాలను తరలించే క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాలు ఉన్న గదిలో నుంచి ఓ వ్యక్తి ఒక్కసారిగా కదలడంతో అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. అనంతరం, అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. బెంగాల్‌కు చెందిన బిస్వజిత్ మాలిక్(24) ప్రమాదం జరిగిన రోజున కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బోగీల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలో ఎంతో కష్టపడి బయటకు వచ్చాడు. కాగా, బయటపడగానే నీరసించిపోయి ఉండటంతో పట్టాలపై కుప్పుకూలిపోయాడు. ఇదే సమయంలో అక్కడున్న సిబ్బంది మాలిక్ చనిపోయాడనుకుని మృతదేహాలను తరలిస్తున్న ట్రక్కులో అతడిని పడేశారు. అనంతరం, బాహానగలో ఉన్న హైస్కూల్‌కు అతడి బాడీని తరలించారు. అయితే, తన తండ్రి నమ్మకమే అతడిని బ్రతికించింది. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బిస్వజిత్‌కు అతని తండ్రి హేలారామ్ మాలిక్ ఫోన్ చేశాడు. కాగా, మాలిక్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు. దీంతో, బిస్వజిత్ బ్రతికే ఉన్నాడని తండ్రి మాలిక్ నిర్ధారించుకున్నాడు. అనంతరం, ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. ఆరోజు రాత్రి 230 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్లాడు. అన్ని ఆసుపత్రులు వెతికినప్పటికీ తన కొడుకు కనిపించలేదు. దీంతో, తాత్కాలిక శవాగారమైన బాహానగ హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ బిస్వజిత్‌ను గుర్తించామని, అతని కుడి చేయి కాస్త కదులుతున్నట్లుగా కనిపించిందని చెప్పాడు. అతను స్పృహలో ఉన్నాడని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. తాము వెంటనే అతనిని అంబులెన్స్‌లో బాలాసోర్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ కొన్ని ఇంజెక్షన్స్, మందులు ఇచ్చారని, ఆ తర్వాత కటక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పాడు. అక్కడి నుండి కోల్‌కత్తాలోని ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. అతని చేయి విరిగిపోయిందని, కాలికి కూడా గాయమైందని చెప్పారు. ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఒడిశా ప్రమాదం: సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం! -
Odisha Train Tragedy:ఖాళీ చేతులతో 88 మందిని రక్షించి..
ఒడిశా:ఎదో బాంబు పేలిన శబ్దం. వచ్చి చూస్తే.. ఘోర రైలు ప్రమాదం. ఎక్కడ చూసినా అరుపులు, మూలుగులు, రక్తం, చెదిరిపడిన శరీర భాగాలు అన్నీ ఒళ్లు జలదరించే దృశ్యాలే. వాటన్నింటినీ దాటుకుని దాదాపు 88 మంది ప్రాణాలను కాపాడారు ఆ ఇద్దరు యువకులు. రెస్క్యూ పరికరాలు ఏం లేకున్నా.. పడిపోయిన బోగీల్లోకి ధైర్యంగా వెళ్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బయటికి తీశారు. గ్రామస్థుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులే దీపక్ రంజన్, శుభంకర్ జెనాలు. రెస్క్యూ టీంలు రాకముందే ప్రమాదంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతా అల్లకల్లోలం.. దీపక్ రంజన బెహ్రా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. స్థానిక పిల్లలతో కలిసి మైదానంలో ఆటలాడుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. ఘోర రైలు ప్రమాదం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంతా కలిసి సహాయ చర్యలు మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటికి రెస్క్యూ బృందాలు వచ్చేవరకు అన్నీ తామే అయి చూసుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి నీళ్లు, ఆహారం పంచిపెట్టారు.'బోగీల వద్దకు మేము వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంది. చీకటిగా ఉన్న బోగీల్లోకి వెళ్లి చాలామందిని బయటికి లాగాము. బోగీల కిందపడి కొంతమంది విపరీతంగా అరుస్తున్నారు' అని చెప్పారు. కళ్లలో మెదులుతున్నాయి.. 'గాయపడ్డవారికి మొదటి గంట చాలా కీలకం. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళితే బతికే అవకాశం ఉంటుంది. మేమంతా కలిసి మా దగ్గర ఉన్న వాహనాలలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించాము. గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. రెస్క్యూ టీంలు వచ్చే సమయానికే మేము చాలా మందిని రక్షించాము' అని దీపక్ తెలిపారు. 'మేము బోగి లోపలికి వెళ్లేసరికి ఓ గర్భవతి అరుస్తూ కనిపించింది. ఆమెను మేము బయటికి తీసుకురాగలిగాము. కానీ బోగీల లోపలే ఉన్న తన ఇద్దరు కుమారులను రక్షించమని ఆవిడ అడిగిన తీరు ఇంకా కళ్లలో మొదలుతోంది. ఆ భయానక దృశ్యాలు ఇంకా మా మనసును వెంటాడుతున్నాయి.' అని శుభంకర్ చెప్పారు. ఇదీ చదవండి:ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!
కోల్కత్తా: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఒడిషా రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతో పాటుగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం మమత సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక, బాధితుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే, రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు మమత స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సీఎం మమతతో పాటుగా మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు తనతో పాటుగా వస్తున్నారని తెలిపారు. బుధవారం బాధిత కుటుంబాలను కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే రైలు ప్రమాదం గురించి మరోసారి స్పందించారు. ఈ ప్రమాదం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదన్నారు. అలాగే, గతంలో జరిగిన రైలు దుర్ఘటనలపై సీబీఐ విచారణ సందర్భాలను మమత గుర్తు చేశారు. వీటిపై ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ సత్వరమే అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టినట్ట విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
కీలక మైలు రాళ్లు, అనేక విషాదాలు:170 ఏళ్ళ రైల్వే ఘన చరిత్ర ఇది!
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు అందరికీ తెలియజేస్తున్నాయి. బ్రిటిష్ వారి పాలనలోని భారతదేశంలో 1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి సాధించింది. దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. 1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదు, భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి 1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్) పొడవు 1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరింది. దక్షిణాది నగరం మద్రాసులోనే కదిలిన మొదటి (గ్రానైట్ లోడుతో) భారత రైలు! 1953 ఏప్రిల్ 16న భారత రైల్వేల మొదటి రైలు బొంబాయి నుంచి ఠాణె మధ్య లాంఛనంగా పట్టాలపై నడవడంతో ప్రారంభోత్సవం జరిగిందని చెబుతారు. నాటి నగరం బొంబాయితో సమీపంలోని ఠాణె, కల్యాణ్ వంటి ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా కలపాలనే ఆలోచన 1843లో బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్ బొంబాయి సమీపంలోని భాండప్ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిగింది. వెంటనే రైలు మార్గాల నిర్మాణ ప్రయత్నాలు మొదలబెట్టడంతో ఈ ఆలోచన పదేళ్లకు వాస్తవ రూపం దాల్చింది. 21 మైళ్ల దూరం ఉన్న ఈ రూటు మొదటి రైలులోని 14 బోగీల్లో దాదాపు 400 మంది అతిధులు బోరీ బందర్ లో రైలెక్కి ప్రయాణించారు. తర్వాత, తూర్పు తీరంలోని బెంగాల్ లో కలకత్తా నగరం సమీపంలోని హౌరా (బెంగాలీలో హావ్‌డా) నుంచి హుగ్లీకి మొదటి ప్రయాణికుల రైలు 1954 ఆగస్ట్ 15న బయల్దేరింది. ఈ రెండు కొత్త రైల్వే స్టేషన్ల మధ్య దూరం 24 మైళ్లు. భారత ఉపఖండం తూర్పు భాగానికి మొదటి రైలు మార్గాన్ని ఈస్టిండియన్ రైల్వే సంస్థ ఇలా ప్రారంభించింది. తర్వాత దక్షిణాదిలో మొదటి రైల్వే లైను ప్రారంభించారు. 1856 జులై 1న మద్రాస్ రైల్వే కంపెనీ మద్రాసు నగరంలోని వ్యాసరపాడి జీవ నిలయం (వెయసరపాండి), వాలాజారోడ్డు మధ్య మొదటి ప్రయాణికుల రైలు నడిపింది. ఈ రైలు మార్గం దూరం 63 కి.మీ. అయితే, దేశంలో మొదటి రైలు 1853లో నాటి బొంబాయి నగరంలో బయల్దేరిందని చెబుతారు గాని అసలు రైలు అనేది రైలు మార్గంపై నడించింది మాత్రం నాటి మద్రాసు నగర ప్రాంతంలోనే. 1837లోనే నగరంలోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట్ బ్రిడ్జికి మొదటి రైలును రెడ్ హిల్ రైల్వే సంస్థ నడిపింది. కానీ ఇది ప్రయాణికుల రైలు కాదు. ప్రఖ్యాత ఈస్టిండియా కంపెనీ ఇంజినీరు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గ్రానైట్ రవాణా చేయడానికి ఈ రైలును తయారుచేశాడు. గ్రానైట్ రవాణాతో మొదలైన గూడ్సురైళ్లే భారతరైల్వేలకు తెచ్చేది 74శాతం ఆదాయం పైన వివరించినట్టు మద్రాసు నగరంలో గ్రానైట్ రాయి రవాణాతో మొదలైన భారత రైల్వేల గూడ్సు రైళ్లు 1837 నుంచీ అనూహ్య రీతిలో విస్తరించాయి. ఫలితంగా ప్రస్తుతం భారత రైల్వేల ఆదాయంలో 74 శాతం సరకు రవాణా గూడ్సు రైళ్ల వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి వస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే–చివరికి ఆటోమొబైల్ కంపెనీలు సైతం తమ వాహనాలను గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపుతున్నాయి. 2027 నాటికి ఇలాంటి రవాణాను 30శాతం పెంచాలని ఈ ఆటోమొబైల్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న భారత రైల్వేలు 2019 నుంచీ మరింత వేగంగతో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేసే ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గత ఐదేళ్లుగా పత్రికల మొదటి పేజీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది వందే భారత్ యుగమని ప్రజలు ఆనందిస్తున్న సమయంలో ఒడిశాలో శుక్రవారం జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే, భారత రైల్వేలు ఇలాంటి అనేక సవాళ్లను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాయి. ప్రతి దుర్ఘటన తర్వాతా ఎన్నో పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం నుంచి కూడా ఎంతో నేర్చుకుని భారత రైల్వేలు శరవేగంతో ముందుకు పరుగెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
మనసున్న మారాజు వీరేంద్ర సెహ్వాగ్.. ఒడిశా రైలు ప్రమాద బాధిత పిల్లలకు..!
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మైదానంలో బౌలర్ల పాలిట సింహస్వప్నమైన వీరూ.. దయాగుణం చాటే విషయంలో తోటి క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన ఈ నజఫ్ఘడ్ నవాబ్.. తాజాగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సెహ్వాగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే రాజు కాలేడు.. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకున్నప్పుడే నిజమైన రాజు అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైదానంలో బౌలర్ల పట్ల కఠినంగా ఉండే సెహ్వాగ్.. నిజ జీవితంలో ఇంతా దయాగుణం కలిగి ఉండటాన్ని చూసి జనాలు ఇతన్ని మనసున్న మహారాజు అంటూ కీర్తిస్తున్నారు. సెహ్వాగ్‌ను చూసైనా తోటి క్రీడాకారులు రైలు ప్రమాద బాధితులకు తోచిన సాయం చేయాలని సూచిస్తున్నారు. కాగా, సెహ్వాగ్ కరోనా సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న చాలా మందికి సాయం చేశాడు. ప్రతి శీతాకాలంలో ఈ మనసున్న క్రికెటర్ ఢిల్లీ వీధుల్లో చలికి వణికిపోయే వారికి దుప్పట్లు, స్వెటర్లు అందిస్తుంటాడు. ఓ వింటర్ అతను తన స్వెటర్‌ను సైతం వేలం వేసి, దాంతో వచ్చిన డబ్బును పేదల కోసం వినియోగించాడు. అంతే కాదు, ప్రమాదాలు, విపత్తుల సమయంలో కూడా సెహ్వాగ్ తక్షణమే స్పందిస్తుంటాడు. వీరూ భాయ్.. బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా గుప్త దానాలు చేశాడని అతనికి తెలిసిన వారంటుంటారు. కేవలం సంపాదన మాత్రమే తెలిసిన నేటి తరం క్రీడాకారుల్లో సెహ్వాగ్ ఓ ఆణిముత్యమని వేనోళ్లు కీర్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే, 44 ఏళ్ల సెహ్వాగ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. ఈ మధ్యలో అతను 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 17253 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 23 సెంచరీలు, వన్డేల్లో 15 సెంచరీలు సెహ్వాగ్ ఖాతాలో ఉన్నాయి. సెహ్వాగ్ పేరిట టెస్ట్‌ల్లో 3 డబుల్ సెంచరీలు, 2 ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. తన టైమ్‌లో వీరూ అరివీర భయంకరులైన బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. -మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..? -
పబ్లిసిటీ కాదు.. బాధితులకు సేవచేయడం ముఖ్యం: మంత్రి అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. తనతోపాటు ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాకు వెళ్లి.. విశాఖ, భువనేశ్వర్, ఇతర ఆసుపత్రిలో బాధితులను చేర్పించి, పరామర్శించామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. కోరమండల్లో ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది, యశ్వంత్‌పూర్ రైలులో 33 మంది ఉన్నారని పేర్కొన్నారు. రెండు రైళ్లలో ప్రయాణించిన 342 మందిలో 329 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. 12 మందికి స్వల్ప గాయాలైనట్లు గుర్తించామన్నారు. విశాఖ ఆసుపత్రిలో 9 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్లను కేంద్ర మంత్రులు అభినందిచారని చెప్పారు. అంబులెన్స్‌లు, మహాప్రస్థానం వాహనాలను ఒడిశాలోనే ఉంచామని తెలిపారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఒడిశాలోనే ఉన్నారన్నారు. రైలు ప్రమాదం ఘటనలో బాలాసోర్‌లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లా వ్యక్తి మరణించాడని, బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ‘ఏపీకి చెందిన వారి కోసం కాల్స్ రాలేదు. ఖమ్మం వ్యక్తి అంబటి రాములు విజయవాడ నుంచి వెళ్తున్నట్లు కాల్ వచ్చింది. పక్క రాష్ట్రం అయినప్పటికీ సమాచారం కోసం ఆరా తీస్తున్నాం. ఒడిశా రైలు ప్రమాదంలో 276 మంది చనిపోగా.. 187 మృతదేహాలను మార్చురీలో ఉన్నాయి. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటున్నాం. మన అంబులెన్స్‌లు, మహాప్రస్థానం వాహనాలు కావాలని కేంద్ర మంత్రులు అడిగారు. మన ప్రభుత్వం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదు. ఈ మాట కేంద్ర మంత్రులే చెప్పారు. పక్క రాష్ట్రాల వారికి కూడా సహకారం అందిస్తున్నాం. బాధితులు ఆస్పత్రుల నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితులకు సేవచేయడం ముఖ్యం.. పబ్లిసిటీ కాదు’ అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలియగానే సీఎం జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మర్నాడు ఉదయమే నేను, ముగ్గురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు ఐపీఎస్‌లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి, వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మేం అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తుండగానే అదే రోజు సాయంత్రం విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొందరు అధికారులు వచ్చి మాతో జాయిన్ అయ్యారు. వివిధ శాఖల సమన్వయంతో..: రెస్క్యూ ఆపరేషన్‌లో ఇక్కడ్నుంచి వెళ్లిన మాతో పాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురు తహశీల్దార్లు, ఒక డిప్యూటీ డీఎంహెచ్‌వో, 9 మంది డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, పోలీసు, ఆర్టీవో సిబ్బంది మాతో కలిపి పని చేశారు. ఆయా శాఖల్ని సమన్వయం చేసుకుంటూ రైలు ప్రమాద ప్రయాణికుల్ని గుర్తించగలిగాం. 108 సర్వీసులు 20.. ఇంకా 19 ప్రైవేటు అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వెహికల్స్‌ను వెంట తీసుకెళ్లాం. ఒక్కో 108 సర్వీస్‌లో నలుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద 5 అంబులెన్స్‌లతో సేవలందించాం. ఇంకా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇచ్చాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్‌లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలు చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో కంట్రోల్ రూంకు అందిన ఫోన్ల సమాచారం ద్వారా.. ఎక్కడికక్కడ రిజర్వేషన్ల ఛార్ట్‌ల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నెంబర్ల ప్రకారం వారితో మాట్లాడి వారి ఆచూకి తెలుసుకోవడం, వారు సేఫ్‌గా స్వస్థలాలకు చేరే వరకు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్రేంద్ర ప్రధాన్గార్లను కూడా కలిసి మాట్లాడాం. సీఎంగారి ఆదేశాల మేరకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపైనా చెప్పాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గురుమూర్తి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. తమిళనాడు, బీహార్.. తదితర రాష్ట్రాల్లో కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌లే ఏర్పాటు చేయగా, మన దగ్గర కంట్రోల్ రూమ్‌లతో పాటు, వివిధ జిల్లా కేంద్రాల్లో అధికారుల్ని అప్రమత్తం చేసి చేపట్టిన రెస్యూ్క ఆపరేషన్ విధానం, మన చొరవను కేంద్ర మంత్రులు అభినందించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చదవండి: ‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ -
ఒడిశా రైలు ప్రమాదం: రాత్రింబవళ్లు అక్కడే..
కొరాపుట్: బాలేశ్వర్ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్ సరి్టఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. అందుకే.. అంత వేగంగా.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదవండి: తగ్గిన జీడి.. పెరిగిన కోడి -
ఒడిశా రైలు ప్రమాదం.. 51 గంటల్లోనే ట్రాక్ రెడీ..
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలుప్రమాదం స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ట్రాక్‌ల పునరుద్ధరణ పూర్తయ్యింది. కేవలం 51 గంటల్లోనే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఒడిశా- పశ్చిమబెంగాల్ రూట్లో యధావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందేభారత్ రైలు ట్రయల్ రన్ చేపట్టారు. హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అనుమతించారు. రద్దు చేసిన అన్ని రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నారు. కాగా దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను . 275గా రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది. #WATCH | Howrah - Puri Vande Bharat Express crosses from Odisha’s Balasore where the deadly #TrainAccident took place on June 2. Indian Railways resumed train movement on the affected tracks within 51 hours of the accident. pic.twitter.com/myosAUgC4H — ANI (@ANI) June 5, 2023 -
ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇదేరీతిలో ఒక మహిళ ఎంతో ధైర్యంతో తన ముగ్గురు పిల్లలను కాపాడుకుంది. రైళ్లు ఢీకొన్న సమయంలో చాలా బోగీలు చెల్లాచెదురైపోయాయి. ఇదేవిధంగా పక్కకు ఒరిగిపోతున్న బోగీలో ఉన్న ఒక మాతృమూర్తి ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తితో తన పిల్లల ప్రాణాలను రక్షించింది. రైళ్లు ఢీకొన్న సమయంలో ప్రయాణికుల అరుపులు, కేకలు విన్న సీతాదాస్ అనే 45 ఏళ్ల మహిళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని బోగీలోని కిటికీలో నుంచి బయటకు విసిరివేసింది. ఆ రైలు పట్టాలకు ఒకవైపు పంట పొలాలు ఉన్నాయి. ఆ చిన్నారులను ఆమె ఆ పంటపొలాలలోకి విసిరివేసింది. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రమాదం జరిగిన సమయంలో ఇక తన ప్రాణాలు పోవడం ఖాయమని అనిపించిందని, అందుకే పిల్లలను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నానన్నారు. వెంటనే పిల్లలను కిటికీలో నుంచి బయటకు తోసివేశానని’ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో సీతతో పాటు ఆమె భర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విపత్కర సమయంలో అంత్యంత తెలివితేటలతో పిల్లలను కాపాడుకున్న ఆమెను అందరూ అభినందిస్తున్నారు. చదవండి: ‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’ -
ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం...
మాటలకందని విషాదం.. మనసుల్ని చిదిమేసింది.. ప్రమాదం జరిగి.. 60 గంటలు గడుస్తున్నా.. ఎవరు ఎక్కడున్నారో..? ఎలా ఉన్నారో తెలియని హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భయానక ఉత్పాతం నుంచి అదృష్టవశాత్తూ బయటపడి.. సొంతూళ్లకు తిరిగివచ్చిన వారంతా.. తమకు పునర్జన్మ లభించిందని చెబుతున్నారు. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో చిక్కుకొని ఎలాగోలా బయటపడి వచ్చేసినా.. ఇంకా ఆ రాత్రి తమ జీవితాల్లో కాళరాత్రిలా కళ్లముందే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరుగాని ఊరులో ప్రమాదపుటంచుల్లో హాహాకారాల మధ్య జీవనం గడుపుతూ ప్రతి నిమిషం భయం వెంటాడుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం మరువలేనిదని చెబుతున్నారు. విశాఖ చేరుకున్న పలువురు బాధితుల కన్నీటి కథలివీ.. సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జాలరిపేట, వాడపేటల నుంచి ఏడుగురు గత నెల 27న తీర్థయాత్రకు బయల్దేరారు. వీరు తొలుత కాశీ వెళ్లి విశ్వేశ్వరుని, అనంతరం కోల్‌కతాలోని కాళీమాతను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల రెండో తేదీన కోల్‌కతాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరిలో ఎస్–1లో ఇద్దరు, ఎస్–4 బోగీలో ఐదుగురు ఉన్నారు. వీరెక్కిన రైలు ఒడిశాలోని బహనగ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగానూ, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరు ఆదివారం ఉదయం ఓ వాహనంలో విశాఖ చేరుకున్నారు. ప్రమాద బాధితుల్లో ఒకరైన జాలరిపేటకు చెందిన ఎం.సత్యంకు బాధితుల తరఫున ప్రభుత్వం రవాణా ఖర్చుల కింద రూ.30 వేల చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం కలెక్టరేట్లో అందజేశారు. ఈ సందర్భంగా రైలు దుర్ఘటనపై సత్యం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ప్రమాదం జరిగే సమయానికి మేం ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలో పెద్ద శబ్దంతో భారీ కుదుపు. క్షణాల్లోనే బోగీలు తిరగబడ్డాయి. అంతా అరుపులు.. కేకలు. ఏం జరిగిందో తెలిసే లోగానే బోగీ అంతా రక్తసిక్తం. చాలామంది చనిపోయారు. మాపైనా చాలా మంది పడిపోయారు. నాతో ఉన్న రాజు, రమణలకు బాగా దెబ్బలు తగిలాయి. నాకు, నా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మేం బతుకుతామన్న నమ్మకం లేదు. మాతోటి ప్రయాణికుడు సీహెచ్ రాజు కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా మమ్మల్ని బతికించాడు. లేదంటే మేమంతా చనిపోయేవాళ్లం. ఆ కలకత్తా కాళీమాతే మమ్మల్ని బతికించింది.’ అని కన్నీటి పర్యంతమవుతూ సత్యం చెప్పాడు. బతికున్నానంటే నమ్మలేకపోతున్నా.. ఒక్కసారిగా కుదుపు వచ్చి పడిపోయాను. నా మీద బ్యాగులు, మనుషులు పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాను. కాసేపటి తర్వాత కళ్లు తెరిస్తే.. కొందరు నన్ను మోసుకొంటూ అంబులెన్స్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు మొత్తం చెక్ చేశారు. అప్పటి వరకు ఏం జరిగిందో.. ఎందుకు పడిపోయానో తెలీదు. పక్కనున్న వాళ్లని అడిగితే.. రైళ్లు గుద్దుకున్నాయని చెప్పారు. కళ్లముందే శవాల గుట్టలు కనిపించాయి. కొందరు తమ వాళ్లు కనిపించక.. రక్తాలతో అటు ఇటు పరుగెడుతున్నారు. నాకు నా కుటుంబం గుర్తొచ్చింది. భయంతో వణికిపోయాను. నా భర్తకి అప్పటికే దెబ్బలు తగిలున్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన్ని చూడగానే ఊపిరి వచ్చింది. ప్రభుత్వ సహకారంతో ఇక్కడి వచ్చాం. చాలా బాగా తీసుకొచ్చారు. దారిలో భోజనాలు, పళ్ల రసాలు అందిస్తూ.. జాగ్రత్తగా చూసుకుని వైద్యం అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇంత ఘోరం జరిగిందని తలచుకుంటేనే భయం, ఏడుపు వచ్చేస్తున్నాయి. బతికున్నానంటే నమ్మలేకపోతున్నాను. మళ్లీ నా పిల్లల్ని, మనవళ్లని చూస్తామని కలలో కూడా అనుకోలేదు. – భారతి, బుచ్చిరాజుపాలెం, విశాఖపట్నం షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది షాలిమార్‌లో రైలు ఎక్కాను. వైజాగ్‌లో దిగాల్సి ఉంది. నేను దివ్యాంగుల కోచ్‌లో ఉన్నాను. భారీ శబ్ధం వినిపించింది. మా బోగీ.. గూడ్స్ రైలుకు ఇటువైపున పడిపోయింది. అటు పడి ఉంటే.. ఇప్పుడు మాట్లాడేందుకు ఉండేవాడిని కాదేమో. మా బోగీలో నా పక్కన కూర్చున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. అది చూసి నాకు భయం మొదలైంది. నరకం కనిపించింది. అతి కష్టమ్మీద.. బోగీ నుంచి బయటకు వచ్చాను. ఏమి కనిపించ లేదు. చాలా మంది ఏడుపులు, కేకలు వినిపిస్తున్నాయి. నా మొబైల్లో లైట్ వేసి చూశాను. చాలా మంది రక్తంతో అటు ఇటు తిరుగుతున్నారు. బోగీలో అటు ఇటు.. ఎగిరి పడటం వల్ల.. ఒళ్లంతా నొప్పులైపోయాయి. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. మెల్లగా ట్రాక్ దాటి.. ఒక మూల కూర్చున్నాను. ఇంతలో కొందరు ఊరి వాళ్లు వచ్చి.. నన్ను అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత రోజు ఉదయం సీఎం జగన్ మన వైజాగ్ నుంచి మంత్రుల్ని పంపించారని తెలిసింది. తెలుగు వాళ్లందర్ని అక్కడికి తీసుకెళ్లి.. స్పెషల్ ట్రైన్లో వైజాగ్ పంపించారు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంది. ప్రతి గంటకు డాక్టర్లు వచ్చి.. ఎలా ఉందని అడుగుతున్నారు. నొప్పులు ఇంకా తగ్గలేదు.. రికవరీ అయ్యేందుకు కొంత టైమ్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. నా జీవితాంతం ఈ ప్రమాదం నా కళ్లముందే కనిపిస్తుంటుందేమో. వెంటనే ఆదుకొని వైజాగ్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శంకర్రావు, పాతర్లపల్లి గ్రామం, రణస్థలం, శ్రీకాకుళం ఇలాంటి ఘోరాన్ని ఎవరూ చూడకూడదు ఖరగ్‌పూర్ పెళ్లికి వెళ్లి.. కోరమండల్లో తిరిగి వస్తున్నాం. ఎస్–3 బోగీలో ఉన్నాం. సాయంత్రం చిన్నగా కునుకు తీస్తున్నాను. ఇంతలో ఒక్కసారిగా బండి జర్క్ అయినట్లు అయింది. ఫాస్ట్‌గా ట్రైన్ వెళ్తోంది కదా.. అందుకే అనుకున్నాను. ఒక్క క్షణంలో కింద పడిపోయాను. నాపైన లగేజీలు, పై బెర్త్‌లో ఉన్న ఇద్దరు పడిపోయారు. బోగీలో జనమంతా ముద్దగా పడిపోయాం. పైనున్న ఒక్కొక్కరూ లేచి ఒకరికొకరం సాయం చేసుకుని బయటపడ్డాం. అప్పటికే.. అందరికీ దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో స్పృహ కోల్పోయాను. కాసేపటికి ఎవరో నలుగురు ముఖంపై నీళ్లు చల్లితే దుకాణం వద్ద ఉన్నాను. వాళ్లు నా ప్రాణాలు కాపాడారు. ఏం జరిగిందని అడిగితే.. ఘోరం గురించి చెప్పారు. తల్లడిల్లిపోయాను. నా భార్య కోసం వెతికితే.. ఆమె క్షేమంగా ఇంకో చోట ఉందని చెప్పారు. వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్లమని చెప్పాను. దారిలో వెళ్తుంటే.. శవాలను, గాయపడిన వారిని మోసుకెళ్తున్నారు. అది చూశాక దేవుడా.. ఇలాంటి ఘోరాన్ని ఇంకెవరూ చూడకుండా కాపాడు స్వామీ అని మొక్కుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, బంధువుల సహకారంతో విశాఖ వచ్చేశాను. ఇక్కడ మంచి వైద్యం అందిస్తున్నారు. – మాధవరావు, బుచ్చిరాజుపాలెం -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా
సాక్షి అమరావతి/భువనేశ్వర్/మహారాణిపేట: ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో గాయపడి, బాలాసోర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులను సమీక్షించి, ఘటన పూర్వాపరాలపై అధికారులతో విశ్లేషించారు. లోటుపాట్లు లేకుండా సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగేలా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా చర్చించారు. స్థానికుల సహాయ, సహకారాలను మంత్రి ప్రశంసించారు. బాధితులను ఆదుకునే దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవలకు అనుకూలంగా భువనేశ్వర్‌లో 16 అంబులెన్స్‌లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసోర్‌లో 5అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. భువనేశ్వర్‌లో బాధితుల సహాయ కేంద్రం ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయన్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సహాయం కోసం 1929 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్(ఐఏఎస్) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరాలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ మెడికల్ కళాశాల, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌లు పని చేస్తున్నాయన్నారు. క్షతగాత్రులకు విశాఖలో చికిత్స రైలు ప్రమాదంలో గాయపడ్డ పలువురికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సెవెన్ హిల్స్, ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో ఇద్దరి చొప్పున, కేజీహెచ్‌లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎ.శంకరరావుకు అన్ని పరీక్షలు చేశామని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. బాధితుల కోసం కేజీహెచ్ క్యాజువాలిటీ వద్ద 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన భారతి, మాధవరావులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. కె.పూజ అనే మహిళను భువనేశ్వర్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. గురుమూర్తికి అక్కడే అంత్యక్రియలు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన సి.గురుమూర్తి ఒక్కరే మృతి చెందారు. ఆయన కుటుంబం బాలాసోర్‌లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 8333905022 (వాట్సాప్) సంప్రదించవ్చని తెలిపారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. పట్టాలపై ప్రేమ కథ! -
ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి. వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. Just 2 days back, there was a train accident in Balasore, India. Too many died and a lot more had serious injuries. A bundle of love letters and poems were found amongst the debris on the tracks. A glimpse of a lost romance. A rarity in this age. Give this post a read. pic.twitter.com/MHUq8LplyD — Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023 -
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టం..భద్రతకు భరోసా
ఒడిశా రైలు దుర్ఘటనకు ప్రధాన కారణం ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఒకే ట్రాక్‌పై ప్రయాణించే రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా కవచ్ అనే ఆధునిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒడిశా ప్రమాద ఘటనకు కవచ్ వ్యవస్థతో సంబంధం లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్(ఈఐ) వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. బాధ్యులను గుర్తించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, రైలు సేఫ్టీ కమిషనర్ త్వరలో నివేదిక అందజేస్తారని వెల్లడించారు. సిగ్నలింగ్‌లో లోపాల కారణంగానే రైలు ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ అంటే ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దాని వల్ల రైళ్లు ఎంత భద్రం? అనేది తెలుసుకుందాం.. ఏమిటీ లాకింగ్ సిస్టమ్ ► రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో ఇదొక అంతర్భాగం. నిర్దేశిత మార్గాల్లో రైళ్లు క్షేమంగా రాకపోకలు సాగించేలా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ద్వారా నియంత్రిస్తారు. ► గతంలో మెకానికల్, ఎలక్ట్రో–మెకానికల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలు ఉండేవి. వాటి ఆధునిక రూపమే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్. ► సంప్రదాయ ప్యానెల్ ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రో–మెకానికల్ ఇంటర్‌లాకింగ్‌తో పోలిస్తే ఈ అధునాతన వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ► సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులైనా సులభంగా చేసుకోవచ్చు. ► ఇది ప్రాసెసర్ ఆధారిత వ్యవస్థ అని నిపుణులు చెబుతున్నారు. విస్తృతమైన ప్రయోగ పరీక్షల తర్వాతే దీన్ని తీసుకొచ్చారు. ► ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నళ్లు, పాయింట్లు, ట్రాక్ సర్క్యూట్లు వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందుకోసం కంప్యూటర్లు, ప్రోగ్రామ్బుల్ లాజిక్ కంట్రోలర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సెన్సార్లు, ఫీడ్ బ్యాకింగ్ పరికరాలు ఉపయోగిస్తారు. ► రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రమాదాల జరగకుండా నియంత్రించడానికి వీలుంటుంది. ► ఒకే ప్రాంతంలో ఒకే పట్టాల(ట్రాక్)పై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తుంది. రైళ్లకు ట్రాక్‌లను కేటాయించే వ్యవస్థ ఇది. ► ఒక మార్గంలో ప్రయాణం పూర్తి సురక్షితం అని తేలేదాకా రైలుకు సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక రైలు ప్రమాదాలు, పరస్పరం ఢీకొనడం వంటివి చాలావరకు తగ్గిపోయాయి రైళ్ల భద్రతే లక్ష్యంగా... ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ రైళ్ల భద్రతే లక్ష్యంగా పని చేస్తుంది. రైళ్ల రాకపోకలు, సిగ్నల్స్, ట్రాక్స్‌ను నియంత్రించడానికి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఒకప్పుడు మనుషులు చేసిన పనిని ఇప్పుడు కంప్యూటర్ల సాయంతో నిర్వర్తిస్తున్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 45 శాతానికి పైగా స్టేషన్లు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. రైల్వేల ఆధునికీకరణలో భాగంగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది. 2022–23లో కొత్తగా 347 స్టేషన్లలో ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దేశంలో బ్రాడ్‌గేజ్(బీజీ) మార్గాల్లో 6,506 రైల్వే స్టేషన్లు ఉండగా, వీటిలో 6,396 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటయ్యింది. ఒడిశాలో ప్రమాదం జరిగిన బహనాగ బజార్ రైల్వేస్టేషన్‌లోనూ ఈ వ్యవస్థ ఉంది. వైఫల్యాలు ఎందుకు? ► ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ సమర్థంగా పనిచేయడమే కాదు, మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ► ఈ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే సిగ్నల్ వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతుంది. తద్వారా రైలు నడిపించే లోకో పైలట్‌కు తక్షణమే సంకేతం అందుతుంది. ► ఒకవేళ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వైఫల్యం చెందితే అందుకు బహిర్గత పరిస్థితులు, మానవ చర్యలే చాలావరకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఒడిశా ఘటనలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో నార్మల్ లైన్‌పై పాయింట్ సెట్ చేయాల్సి ఉండగా, లూప్‌లైన్‌పై చేశారని, మానవ ప్రమేయం లేకుండా ఇది జరిగేది కాదని సిగ్నలింగ్ నిపుణుడొకరు చెప్పారు. ► రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తవ్వకాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దానివల్ల అక్కడ సిగ్నలింగ్‌కు సంబంధించిన వైర్లు దెబ్బతినడం లేదా షార్ట్ సర్క్యూట్ జరగడం, ఫలితంగా రైలుకు సరైన సంకేతం ఇవ్వడంలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ వైఫల్యం చెంది ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనోళ్లు 553 మంది క్షేమం
సాక్షి, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 553 మంది క్షేమంగా ప్రమాదం నుంచి బయట పడ్డారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 485 మంది, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది వెరసి 696 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 92 మంది ప్రయాణించలేదని చెప్పారు. మిగతా వారిలో 553 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, 21 మంది స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృత్యువాత పడ్డారన్నారు. మిగతా 28 మంది ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వారి మొబైల్ నంబర్ల ఆధారంగా చిరునామా తెలుసుకోవడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖలో 309, రాజమండ్రిలో 31, ఏలూరులో 9, విజయవాడలో 135 మంది దిగాల్సిన వారు ఉన్నారన్నారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి 33, రాజమండ్రి నుంచి ముగ్గురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి 41, బాపట్ల, తెనాలి నుంచి ఎనిమిది, గుంటూరు నుంచి ఇద్దరు, ఒంగోలు నుంచి 11 మంది, నెల్లూరు నుంచి ముగ్గురు, తిరుపతి నుంచి 107 మంది ఎక్కారని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరిని విశాఖ కేజీహెచ్, ఇద్దరిని సెవెన్‌హిల్స్, ఒకరిని ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని, నలుగురిని ఒడిశా నుంచి ఏపీకి తీసుకొస్తున్నారని చెప్పారు. మిగతా వారు వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. రాష్ట్రం నుంచి 50 అంబులెన్సులను కటక్, భువనేశ్వర్‌లకు పంపించామన్నారు. ఇంకా తమ వారి ఆచూకీ తెలియ లేదని కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు. రైళ్ల ప్రమాదం నుంచి బయటపడి వాహనాల్లో విశాఖ చేరుకున్న ఏడుగురికి రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరఫున రూ.30 వేల చెక్కును బాధితుడు ఎం.సత్యంకు మంత్రి అందజేశారు. రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశంతో ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన బృందం ఘటన స్థలం నుంచి.. విశాఖ నుంచి తాను, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఒడిశాలోని బహనాగబజార్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను స్వస్థలాలకు పంపించేందుకు భాద్రాక్ స్టేషన్ నుంచి చెన్నైకు ఆదివారం ప్రత్యేక రైలు(13863) నడిపారు. చెన్నై–హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైనందున.. ఈ నెల 5న దానికి ప్రత్యామ్నాయంగా చెన్నై సెంట్రల్ నుంచి బహనాగబజార్‌కు ప్రత్యేక రైలు(02842)ను అదే షెడ్యుల్‌లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో చెన్నై సెంట్రల్–హౌరా(12840) రైలును ఆదివారం కూడా రద్దు చేశారు. సికింద్రాబాద్–గౌహతి ఎక్స్‌ప్రెస్(12513)ను ఖరగ్‌పూర్, టాటానగర్, రూర్కేలా, జార్సుగూడ స్టేషన్ల మీదుగా మళ్లించి నడుపుతున్నారు. -
తీవ్రంగా చలించిపోయా: బైడెన్
వాషింగ్టన్: ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్‌లో సుమారు 300 మందిని బలి తీసుకున్న రైలు ప్రమాద విషాద వార్త విని తీవ్రంగా చలించిపోయానని బైడెన్ పేర్కొన్నారు. ‘భారత్‌లో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన రైలు ప్రమాద విషాద వార్త విని నేను, నా భార్య జిల్ బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, క్షతగాత్రుల గురించి ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక మూలాల్లో ఉన్న విలువలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది’అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాసోర్ ఘటనపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని కిషిదా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సిగ్నల్ రాంగ్ రూట్
భువనేశ్వర్: ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొని 275 మంది ప్రాణాలు బలైపోయిన తర్వాత మన దేశంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మూడు నెలల ముందే సిగ్నల్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ ఒకటి మీడియాకి చిక్కింది. సిగ్నల్ వ్యవస్థలో లోపాలు వెంటనే సవరించకపోతే భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఖాయమంటూ ఆ చీఫ్ మేనేజర్ రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతూ ఫిబ్రవరి 9న లేఖ రాశారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగుళూరు నుంచి న్యూఢిల్లీకి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారీ ప్రమాదానికి గురై ఉండాల్సిందని డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ముప్పు తప్పిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో మెయిన్ లైన్ ద్వారా వెళ్లవచ్చునని డ్రైవర్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా సిగ్నల్ వచ్చినప్పుడు పట్టాల దగ్గర ఉండే పాయింట్ మారాలి. రైలుని ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కి మళ్లించడాన్ని పాయింట్ అంటారు. అయితే సిగ్నల్, పాయింట్ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దీనిని గమనించిన డ్రైవర్ సరైన సమయంలో రైలుని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థని సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఇదని ఆయన ఆ లేఖలో వివరించారు. సిగ్నలింగ్ సాంకేతిక వ్యవస్థపై సమగ్రమైన విచారణ జరపడమే కాకుండా, స్టేషన్ మాస్టర్లు, ట్రాఫిక్ ఆఫీసర్లు, ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్లపై దీనిపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. సిగ్నల్ వ్యవస్థని నిరంతరం పర్యవేక్షిస్తూ వెనువెంటనే లోపాలు సరిదిద్దుకోకపోతే ఘోరమైన ప్రమాదాలు చూస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. -
ఒడిశా రైళ్ల ప్రమాదంపై... సీబీఐ విచారణ
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి. రైలును ట్రాక్‌ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్‌లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్‌ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది. విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే... పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్‌కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు. టికెట్ లేని వారికీ పరిహారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్‌పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు. ప్రమాదంపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు. -
రైలు ప్రమాదంలో ఏపీ బాధితులకు పరిహారం
సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన బాధితులందరికీ పరిహారం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆదివారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను, విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణించి ఉంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి ఇది అదనం అని స్పష్టం చేశారు. బాలాసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మరణించారని, ఇది తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరూ ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారికి మంచి వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతి
భువనేశ్వర్: ప్రమాదానికి గురైన కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్‌రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో రైలులోని బోగీలు గాల్లో ఎగిరి పక్క ట్రాక్‌పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టడంతో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఈ ఘోర ప్రమాదంలో 275 మంది అసువులు బాసారు. మరో వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా ఘటన మానవ తప్పిదమా? లేక మరేదైనా అన్న కోణంలో జరిగిందా అనే దానిపై సీబీఐ విచారించనుంది. అయితే సిగ్నల్ మారడం వెనక కుట్ర అందని అధికారులు అనుమానిస్తున్నారు. కోరమాండల్‌ను కావాలనే లూప్లైన్లోకి మార్చారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బహనాగ స్టేషన్ మేనేజర్‌ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో ఎవరో మార్పులు చేశారని రైల్వే మంత్రి ఇంతకుముందే పేర్కొన్నారు. ఎలక్టానిక్ సిగ్నల్ పాయింట్లో మార్పులు జరిగాయని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 275 మంది మృత్యువాతపడ్డారు. rj ఈ ప్రమాదం అనంతరం బాలాసోర్‌లోని రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు పునరుద్ధరించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపిందని మంత్రి వెల్లడించారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన -
ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన
ఒడిశా రైలు దుర్ఘటన పట్ల అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి పిల్లలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఓ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. ‘ఒడిశా రైలు ప్రమాదం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోవాలని నిర్ణయించాం. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యాన్ని, మృతుల పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత’ అని గౌతమ్ అదానీ ట్విటర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్2న జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 280 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं। हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा। पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है। — Gautam Adani (@gautam_adani) June 4, 2023 -
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి అమర్నాథ్ భేటీ
భువనేశ్వర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద ప్రాంతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆదివారం కటక్‌లో మంత్రి అమర్నాథ్ సమావేశమయ్యారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కాల్ సెంటర్లు నిర్వహణ ద్వారా బాధితులను త్వరగా గుర్తించి సహాయం అందించామని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాకు ఒక కాల్ సెంటర్ నిర్వహణను రైల్వే మంత్రి అభినందించారు. చదవండి: ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది? అంతకుముందు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. . కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందినవారు 342 ప్రయాణిస్తున్నారని వారిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు మరోవైపు ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్లో మార్పులు చేసిన వారిని కూడా గుర్తించామని వెల్లడించారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయన్నారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడమే కారణమని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనిపై గతంలో కాగ్ విడుదల చేసిన రైల్వే ఆడిట్ రిపోర్ట్ తెరపైకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ఆడిట్ రిపోర్టును గత ఏడాది సెప్టెంబర్‌లోనే పార్లమెంట్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది. రైల్వే ట్రాక్‌లలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోటుపాట్లను సవరించే అంశంపై విస్తుపోయే అంశాలను కాగ్ నివేదికలో పేర్కొంది. విస్తుపోయే నిజాలు.. 2017-21 మధ్య మొత్తం 1,127 రైలు ప్రమాదాల్లో 289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణకు సంబంధించినవేనని కాగ్ నివేదిక పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, ప్రమాద ప్రదేశాల తనిఖీలు 30- 100 శాతం తగ్గాయి. 2017 నుంచి 2021 మార్చి వరకు 422 రైలు ప్రమాదాలు ఇంజనీరింగ్ సమస్యల కారణంగా జరిగాయి. అందులో 275 ప్రమాద ఘటనలు ఆపరేటింగ్ విభాగంలో లోపాల కారణంగా జరిగాయి. ట్రాక్‌లపై పాయింట్లను తప్పుగా గుర్తించారు. ప్రధానంగా 171 ప్రమాద కేసులు నిర్వహణ లోపాల కారణంగా జరిగాయి. 156 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు విస్తుపోయే విషయాలను కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వేగంగా రైలు నడపడం కూడా ప్రమాద ఘటనలకు ప్రధాన కారణం అని నివేదిక వెల్లడించింది. నిధుల తగ్గింపు.. 63 శాతం ప్రమాద ఘటనల్లో నిర్ణీత గడువులోగా విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 49 శాతం కేసుల్లో ఆ నివేదికలను ఆమోదించడంలోనే ఆలస్యం జరిగింది. 2017-18 నుంచి ఐదేళ్లలో దాదాపు రూ. ఒక లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను అందుకున్న రైల్వే శాఖ.. వ్యయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిదులు సరైన మోతాదుల్లో కేటాయించలేదు.. అంతేకాకుండా కేటాయించిన దానిలో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక వెల్లడించింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణను సకాలంలో చేయాలని కాగ్ తెలిపింది. మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. ఇలా అయితేనే రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:లూప్ లైన్లో ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా -
ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం మహా విషాదంగా మారింది. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. తాజాగా ప్రమాదం బారినపడిన విశాఖకు చెందిన ప్రత్యక్ష సాక్షి.. తమ ఘోర అనుభవాన్ని పంచుకున్నాడు. ఒడిశా దుర్ఘటన సమయంలో అసలేం జరిగిందో తమకు ఏం అర్థం కావడం లేదని అంటున్నాడు ప్రమాదంలో గాయపడిన లోకేష్. ఒకేసారి భారీగా శబ్ధం రావడంతో భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నాడు. చీకటి పడుతూండగా ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చిందని బోగీలు పల్టీలు కొట్టాయని చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు 40 నిమిషాల పాటు ట్రైన్ లోనే ఉండిపోయామని తెలిపారు. అద్దాలను పగలగొట్టుకుని బయటికి వచ్చామని, స్థానికులు సకాలంలో స్పందించడంతో చాలామంది బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలములో చుట్టూ కారు చీకటి ఉందని, ట్రైన్ ప్రమాదం ఏ నది మీదో జరిగికుంటే మొత్తం ప్రయాణికులు అందరూ చనిపోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా ముందే ఎంతో మంది చనిపోయారు, క్షతగాత్రులయ్యారు. ప్రమాదంలో నా ఇద్దరు పిల్లలు చనిపోయారు అనుకున్నాను. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి నా కుటుంబం బయటపడింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్లో నాకు, నా భార్యకు మెరుగైన వైద్యం అందుతుంది. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ముఖ్యమంత్రికి మేమందరం రుణపడి ఉంటాం’ అని తెలిపాడు. చదవండి: ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్ రైలు ఎక్కిన 30 మంది.. -
ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి పేర్కొన్నారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తుందని చైర్పర్సన్ వివరించారు. ఎల్ఐసీ పాలసీల క్లయిమ్‌దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. -
ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: జయవర్మ సిన్హా
ఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన కీలక విషయాలు వెల్లడించారు రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా. సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బహనాగ స్టేషన్ వద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదు. ఈ ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ గంటకు 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రెండు రైళ్లు నిర్ధేశిత వేగంతోనే వెళ్తున్నాయి. #WATCH | The goods train did not get derailed. Since the goods train was carrying iron ores, the maximum damage of the impact was on Coromandel Express. This is the reason for a huge number of deaths and injuries. The derailed bogies of Coromandel Express came on the down line,… pic.twitter.com/DnjheT8NSn — ANI (@ANI) June 4, 2023 కోరమండల్ రైలు లూప్ లైన్లోకి వెళ్లింది. బహనాగ స్టేషన్ వద్ద రెండు లూప్లైన్లు, రెండు మెయిన్ లైన్స్ ఉన్నాయి. లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ఐరన్ ఓర్ ఉంది. గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టింది. దీంతో, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, సిగ్నలింగ్ సమస్యల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే.. -
దేశంలో రైలు ప్రమాదం ఎక్కడ జరిగిన ఆ ప్రభావం కాజీపేట జంక్షన్పైనే...
కాజీపేట రూరల్: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. దేశంలో ఎక్కడైనా రైల్వే వ్యవస్థకు ఆటంకాలు, ప్రమాదాలు జరిగితే ఆ ప్రభావం కాజీపేట జంక్షన్‌పై పడుతుంది. చాలారైళ్లు కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ప్రతి రోజూ 200 వరకు రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఎలా జరిగింది.. ఎంతమంది చనిపోయారు, అందులో తెలంగాణ వారు ఎవరైనా.. ఉన్నారా.. ఉమ్మడి జిల్లావాసులు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన పలు రైలు దుర్ఘటనలను జనాలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కాపలాలేని రైల్వేగేట్లు కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో రైల్వేశాఖ కాపలా లేని రైల్వేగేట్లను ఎత్తివేసింది. కాజీపేట–ఆలేరు, వరంగల్ రూట్లో, హసన్‌పర్తి రూట్లో రైల్వే లెవెల్‌క్రాసింగ్ గేట్లు సుమారు 30 వరకు ఉన్నాయి. ఈ గేట్ల వద్ద గేట్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశంతో 160 కేఎంపీహెచ్ స్పీడ్‌తో ఈ రైలు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే గేట్ల స్థానంలో ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించి అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేయగా అధికారులు ప్రతిపాదనల పనిలో నిమగ్నమయ్యారు. టార్గెట్, ఎకనామీ పేరుతో రైల్వే ఉన్నతాధికారులు వర్క్ టార్గెట్, ఎకనామీ, రైల్వే యూనిట్ల ఎత్తివేత, రైళ్ల నిర్వాహణ లోపం, ప్రైవేటీకరణ పేరుతో సిబ్బందిని కుదిస్తూ, తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. పెంచిన రైళ్లకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయడంలో రైల్వే విఫలమవుతోందని అంటున్నారు. ఎల్‌హెచ్‌బీ బోగీలు డేంజర్ ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వేశాఖ ప్రవేశపెట్టి నడిపిస్తోంది. ఈ కోచ్‌లు చాలా తేలికపాటిగా ఉంటాయని, ట్రాక్‌పై త్వరగా వేగం అందుకుంటాయని రైల్వే నాయకులు అంటున్నారు. ఏమైన రైలు ప్రమాదాలు జరిగితే బోగీలు చల్లా చెదురైతాయని చెబుతున్నారు. గతంలో రైలు బోగీలు మందపు ఐరన్‌తో తయారు చేసేవని, ట్రాక్‌పై కావాలి్సన వేగంతో వెళ్లేవని, ప్రమాదాలు జరిగినప్పుడు బోగీల ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అంటున్నారు. కోరమండల్ ఘటనలో ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉండడం వల్లే తీవ్రత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు వరంగల్, కాజీపేట జంక్షన్ మీదుగా షాలిమార్–హైదరాబాద్ (18045) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–షాలిమార్ (18046) ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటి ంచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కోరమండ ల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను విజయవాడ అవతల రూట్లోను ంచి దారి మళ్లించి నడిపిస్తున్నట్లు వారు తెలిపారు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో జరిగిన రైలు దుర్ఘటనలు 1954 సెప్టెంబర్ 27న జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ వాగులో నిజాముదీ్దన్ (దక్షిణ్) ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోగా 300మంది మృత్యువాత పడ్డారు. 1983లో రాళ్లపేట–ఆసిఫాబాద్ మధ్య తమిళనాడు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 640 మంది చనిపోయారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఘటన స్థలికి చేరుకున్నారు. ► 1986లో మంచిర్యాల–రవీంద్రఖని మధ్య బ్రిడ్జి వంతెన తెగడంతో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ బోగీలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 300మంది ప్రయాణికులు మరణించారు. ► వరంగల్ రైల్వేస్టేషన్లో 2003 జూలై 2న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ బ్రేక్‌లు ఫెయిల్యూర్ అయి షాండ్హంప్లోకి దూసుకెళ్లగా కంట్రో ల్ కాక అండర్ బ్రిడ్జి కింద చేపల మార్కెట్‌పై బోగీలు పడ్డాయి. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. 110మంది గాయపడ్డారు. ► 2008 జూలై 31న అర్ధరాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ తాళ్లపూసపలి్ల–కేసముద్రం మధ్య అగ్నిప్రమాదానికి గురై 21మంది మరణించారు. ► 2010లో జమ్మికుంట రైల్వేగేట్‌లో స్కూల్ బస్సును భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో విద్యార్థి మృతిచెందాడు. ► 2006లో ఘన్పూర్– నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య వాగు వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే పెట్రోల్మెన్లు సూర్య, చంద్రంలు అప్రమత్తంగా వ్యవహరించి నిలిపి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. -
ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఒడిశాలో త్రీవ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో దాదాపు 240 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఏపీలోకి శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి(60) కూడా ఈ ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒడిషా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తిగా గుర్తించాం. ఏపీలో పెన్షన్ తీసుకుని వెళ్తుండగా గురుమూర్తి మృతిచెందాడు. బాలాసోర్‌లో గురుమూర్తి నివాసం ఉంటున్నారు. గురుమూర్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, బాధితులకు కూడా పరిహారం అందిస్తున్నామన్నారు. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణీకులను 695 మందిని గుర్తించాం. 553 మంది సురక్షితంగా ఉన్నారు. కోరమండల్ రైలులో 480 మంది, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ప్రయాణించారు. 22 మంది గాయపడ్డారు. 92 మంది రైలు ప్రయాణం చేయలేదు. ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. విశాఖ ఆసుపత్రిలో ఐదుగురికి చికిత్స అందిస్తున్నాం. స్వల్ప గాయాలైన 11 మందికి చికిత్స అందించి పంపించాము అని తెలిపారు. ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే.. -
గురుమూర్తి కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కాగా, బాలాసోర్ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతిచెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలుస్తూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: AP: రైలులో ప్రయాణించిన వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే.. -
బాధ్యులను గుర్తించాం.. ప్రమాదానికి కారణం అదే: అశ్వినీ వైష్ణవ్
బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే దాదాపు 288కి చేరింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రాక్ పునరుద్ధణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా పాడైపోయిన ట్రాక్ పనులను పునరుద్దరిస్తున్నాము. బుధవారం ఉదయానికి మిగతా పనులను పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారు. రిపోర్టు అందాల్సి ఉంది. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒకదానిపైన మరొకటి ఎక్కిన బోగీలను ఇప్పటికే కష్టపడి తొలగించారు. వీలైనంత తొందరగా ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు నిరంతరాయంగా వందలాది మంది కార్మికులు, నిపుణులు శ్రమిస్తున్నారు అని స్పష్టం చేశారు. #WATCH | The commissioner of railway safety has investigated the matter and let the investigation report come but we have identified the cause of the incident and the people responsible for it... It happened due to a change in electronic interlocking. Right now our focus is on… pic.twitter.com/UaOVXTeOKZ — ANI (@ANI) June 4, 2023 ఇది కూడా చదవండి: అలా జరిగితే ప్రమాదం తప్పేదా? -
ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్ రైలు ఎక్కిన 30 మంది..
‘చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. రక్తపు మడుగులా తయారై భయానకంగా మారిన ప్రమాద స్థలిని చూస్తే గుండె బరువెక్కుతోంది. ఈ ఘోర ప్రమాదం సంభవించిన రైల్లో తామూ ప్రయాణించామన్న విషయం తలుచుకుంటేనే భయమేస్తోంది. అప్పటి వరకూ తమతో కలిసి ప్రయాణం చేసిన వారు మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేస్తోంది.’ అంటూ యశ్వంతపూర్– హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈ రైలులో సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కగా.. అందులో ఆరుగురు మాత్రమే ప్రమాదం సంభవించినప్పుడు రైలులో ఉన్నారు. వారు కూడా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలు రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేశారు. ఒంగోలు టౌన్: ఒడిషాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్‌బజార్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విన్న ఒంగోలు వాసులు ఉలిక్కిపడ్డారు. గురువారం ఒంగోలు మీదుగా హౌరా వెళ్లిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒంగోలులో 12 మంది, చీరాలలో మరో 18 మంది ఎక్కారు. జనరల్ బోగిలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారన్నది తెలియదు. వీరిలో ఏడుగురు ప్రయాణికులు వైజాగ్‌లో, 12 మంది విజయనగరంలో, ముగ్గురు పలాసలో దిగిపోయారు. అలాగే ఒకరు విజయవాడ, మరొకరు మచిలీపట్నంలో దిగినట్లు సమాచారం. వీరు కాకుండా చీరాల పట్టణానికి చెందిన ఆరుగురు వస్త్ర వ్యాపారులు రైలులోనే ప్రయాణించారు. ఈ రైలులో ప్రయాణించిన వారితో సాక్షి మాట్లాడింది. యశ్వంత్‌పూర్ రైలు ప్రమాదానికి గురైనట్లు తెలిసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ్ముడు గంటా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రైలులో ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు. ఆయన జరుగుమల్లి మండలం కామేపల్లిలో వ్యవసాయం చేస్తుంటారు. కూతురు వినితకు ఏపీఎస్సీ మెయిన్ పరీక్షలు జరుగుతుండడంతో భార్య విజయలక్షి్మతో కలిసి వైజాగ్ వెళ్లారు. తాను ప్రయాణం చేసిన యశ్వంత్‌పూర్ రైలు ప్రమాదానికి గురి కావడం కలిచివేసిందని ఆయన అన్నారు. కామేపల్లికి చెందిన తక్కెళ్లపాటి పద్మ అనే మహిళ వైజాగ్‌లో నివాసముంటున్న కూతురు, అల్లుడు వద్ద ఉంటున్నారు. ఇటీవల ఆమె జరుగుమల్లి మండలం కాÐమేపల్లి వచ్చారు. నాలుగు రోజులు ఉండి ఆమె కూతురు వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమెకు రైలు రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. సాయంత్రం 7.46 గంటలకు రావాల్సిన రైలు 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11.30కి వచ్చింది. దీంతో అలసిపోయిన ఆమె రైలు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం యశ్వంత్‌పూర్ రైలు పట్టాలు తప్పిందని, వందల మంది అశువులుబాశారని తెలిసి గుండెల్లో రాయి పడ్డట్టయిందన్నారు పద్మ. టీవీలో యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతోందని వాపోయారు. అప్పటి వరకు తమతో కలసి ప్రయాణించిన వారిలో చాలా మంది మృత్యువాత పడడం జీరి్ణంచుకోలేకపోతున్నామన్నారు. నాగులప్పలపాడు మండలం టి.అగ్రహారానికి చెందిన జాగర్లమూడి వెంకటేశ్వర్లు వైజాగ్‌లో ఓ వివాహానికి హాజరయ్యేందుకు భార్య అమ్మనితో కలిసి యశ్వంతపూర్ రైలులో బయలుదేరి వెళ్లారు. ఒడిషాలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలిసి ఖిన్నుడయ్యారు. స్వగ్రామం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారని, అయితే తాము సురక్షితంగా ఉన్నామని తెలియజేశామని చెప్పారు. నిర్మానుష్యంగా ఒంగోలు రైల్వేస్టేషన్... ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఒంగోలు మీద నుంచి హౌరా వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. ప్రయాణికులు వారి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు ఒంగోలు నుంచి సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఢిల్లీ, ఒడిషా, పశి్చమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, జమ్ము కశీ్మర్‌తో పాటుగా మొత్తం పది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు సౌకర్యం ఉంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు చూసినా ప్రయాణికులతో రద్దీగా కనిపించే ఒంగోలు రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా కనిపించింది. ఇదిలా ఉండగా షాలీమార్ నుంచి చెన్నై బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలుకు చెందిన ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి దాకా రైల్వే పోలీసులకుగానీ, రైల్వే అధికారులకుగానీ ఎలాంటి సమాచారం లేదు. ఒంగోలులో కోరమాండల్ రైలుకు స్టాపింగ్ లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒంగోలు రైల్వేస్టేషన్‌తో పాటు గిద్దలూరు, యర్రగొండపాలెం, ఇంకా పలు రైల్వేస్టేషన్లలో అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. -
AP: మీ వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే..
సాక్షి, అమరావతి: ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పద్దుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు. కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం 8333905022 నంబర్ వాట్సాప్‌కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్‌లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా.. -
Odisha Train Accident: బాంబు పేలిన శబ్దం వచ్చింది
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ఘోర ప్రమాదం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఓ కుదుపు కుదిపేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రాకపోకలు చేసేవారు ఇక్కడి నుంచి ఎక్కువే కావడంతో పలువురు దిగ్బ్రమ చెందారు. శనివారం తెల్లవారేసరికి మృతుల సంఖ్య తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. ఈ ఘోర కలితో కదిలిపోయారు. కోరమాండల్‌కు రాజమహేంద్రవరం స్టేషన్లో హాల్టు ఉంది. ఇక్కడి నుంచే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు భువనేశ్వర్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూంటారు. ఈ రైలులో వెళ్లిన తమ వారెవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, సురక్షితంగా ఉన్నారో లేదోననే ఆందోళన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పడింది. తమ బంధువులకు ఫోన్లు చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. సురక్షితంగా ఉన్నారన్న సమాచారంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను బాధితుల బంధువులెవరూ ఆశ్రయించలేదు. తూర్పు గోదావరి కలెక్టర్ కె.మాధవీలత ఇచ్చిన సమాచారం ప్రకారం.. కోరమండల్లో రాజమహేంద్రవరం వచ్చేందుకు రిజర్వేషన్ చేయించుకున్న వారు : 31 సురక్షితంగా ఉన్న వారు : 24 ఫోన్లు పని చేయక ఆచూకీ తెలియాల్సిన వారు : 7 యశ్వంత్‌పూర్ – హౌరా రైలులో వెళ్తున్న వారు : 3 (అందరూ సురక్షితం) ఉమ్మడి ‘తూర్పు’ వాసులు సేఫ్ ► తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. రాజమహేంద్రవరానికి బాధితుడు మురళీకృష్ణ విశాఖపట్నం చేరుకున్నారు. మరో ఇద్దరు ప్రయాణికులు అనూప్‌కుమార్, అనామికా కుమారి కూడా రాజమహేంద్రవరం వచ్చేశారు. ► రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన దంపతులు హరిబాబు, అన్నపూర్ణ బంధువుల ఇంట శుభకార్యానికి భువనేశ్వర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారిద్దరూ అక్కడ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అక్కడకు రాకముందే ఈ రైలు ప్రమాదానికి గురవడంతో వారు మరో మార్గంలో రాజమహేంద్రవరం బయలుదేరారు. ► కొవ్వూరుకు చెందిన పాలెంపాటి అప్పారావుకు ఈ రైలు ప్రమాదంతో సంబంధం లేదు. అతడు కోరమండల్ ఎక్కేలోపే ప్రమాదం జరిగిపోయింది. దీంతో అతను వేరే రైలులో రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు చేరుకున్నాడు. ► కాకినాడకు చెందిన మరో వ్యక్తి కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. రాజమహేంద్రవరానికి రిజర్వేషన్ చేయించుకుని మొబైల్ నంబర్ పని చేయక ఆచూకీ తెలియని ప్రయాణికులు రాజవర్ధన్, ఆరాధ్య కుమారి, డి.ఇందిరా కుమారి, డి.లోకేష్, బి.పంజా, సుశాంత్, అభిషిక్త్ రైళ్ల రద్దుతో రద్దీ ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు శనివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ రద్దు చేశారు. దీంతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు ఏ రైలు వస్తే అందులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. దీంతో రెండు గంటల పాటు రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు పూర్తి స్థాయిలో టిక్కెట్ డబ్బులు వాపసు ఇచ్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్టేషన్ మేనేజర్ గంగాప్రసాద్, సీటీఐ చంద్రమౌళి పర్యవేక్షించారు. సమగ్ర దర్యాప్తు జరపాలి ఈ రైలు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషనుకు శనివారం చేరుకున్న ఆయన అధికారులతో మాట్లాడారు. ఇక్కడి నుంచి ఎంతమంది కోరమాండల్ రైలుకు రిజర్వేషన్ చేసుకున్నారు, ఎంతమంది వివరాలు తెలిశాయి, ఆచూకీ తెలియని వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో స్టేషన్ మేనేజర్ ఎం.గంగాప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. రైల్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న దశలో ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యా లేక మానవ తప్పిదమా అనేది రైల్వే శాఖ సమగ్ర దర్యాప్తులో తేలుతుందన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో కూడా 98667 35454తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశానని చెప్పారు. కార్యక్రమంలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ మౌళీచంద్ర, డిప్యూటీ టికెట్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ ఆకుల, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, సిటీ యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హెల్ప్‌డెస్క్/కంట్రోల్ రూములు రైలు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో జిల్లా వాసులు ఎవరైనా ఉంటే ఈ నంబర్లలో సంప్రదించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు, వలంటీర్ల ద్వారా ఆయా జిల్లాలకు చెందిన వారి సమాచారం సేకరించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను కలెక్టర్లు ఆదేశించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్: 0883 – 2420541, 2420543 సామర్లకోట రైల్వే స్టేషన్: 73826 29990 తూర్పు గోదావరి కలెక్టరేట్: 89779 35609 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్: 08856 – 293104, 293198 కాకినాడ జిల్లా కలెక్టరేట్: 1800–425–3077 కాకినాడ జిల్లా పోలీస్ కంట్రోల్ రూము: 94906 18506, 94949 33233 రద్దయిన రైళ్లు విజయవాడ – రాజమహేంద్రవరం – విజయవాడ (07459/07460) రాజమహేంద్రవరం – విశాఖపట్నం – రాజమహేంద్రవరం (07466/07467) కాకినాడ – విశాఖపట్నం – కాకినాడ (17267/17268) కాకినాడ – విజయవాడ – కాకినాడ (17258/17257) గుంటూరు – విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239/17240) విశాఖపట్నం – విజయవాడ –విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701/22702) బాంబు పేలిన శబ్దం వచ్చింది మాది బిహార్. రాజోలు కామాక్షి కంపెనీలో పనిచేస్తున్నాను. ఇక్కడకు వచ్చేందుకు షాలిమార్‌లో కోరమండల్ ఎక్కాను. చీకటి పడుతూండగా ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చింది. బోగీ పల్టీలు కొట్టింది. ఏం జరిగిందోనని భయపడ్డాను. బయటకు వచ్చి చూస్తే రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీలు చూసి టెన్షన్ పడ్డాను. తెగి పడిన కాళ్లు, చేతులు, మొండెం భాగాలను చూస్తే కడుపు తరుక్కుపోయింది. – రాజేష్‌రామ్, రైలు ప్రమాద బాధితుడు దేవుడే కాపాడాడు నా కుమార్తెను తీసుకుని బెంగాల్‌లోని అసన్సోల్ వెళ్లాను. షాలిమార్ నుంచి రాజమహేంద్రవరం తిరిగి వచ్చేందుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. పెద్దగా శబ్దం రావడంతో ఏమైందోనని ఆందోళన కలిగింది. బోగీలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. ఇంక బతకమేమో అనుకున్నాం. దేవుడే కాపాడాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాం. మరో ట్రైన్ ఎక్కి రాజమహేంద్రవరం పయనమయ్యా. – యానాపు మురళీకృష్ణ -
Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..
బాలాసోర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో ఎన్నో కన్నీటి కథలు మనసుని పట్టి కుదిపేస్తున్నాయి. ఎప్పటికైనా తనకి తలకొరివి పెడతాడని అనుకున్న కొడుకు శవాన్నే చేతులతో మోయాల్సి రావడం ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. బీహార్‌లో మధువనికి చెందిన లాల్జీ సాగై చెన్నైలో గార్డుగా పని చేస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు సుందర్, ఇందర్లను కూడా చెన్నైకి తీసుకువెళితే కుటుంబం హాయిగా బతికేయవచ్చునని అనుకున్న ఆ తండ్రి వారిని తీసుకువెళ్లడానికి సొంతూరుకి వచ్చాడు. అక్కడ్నుంచి కోల్‌కతాకి వచ్చి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు ప్రమాదంలో తండ్రి లాల్జీ , చిన్న కుమారుడు ఇందర్ ప్రాణాలతో మిగిలితే కొడుకు సుందర్, బావమరిది దిలీప్ మృత్యు ఒడికి చేరుకున్నారు. ‘‘కళ్ల ముందే నా కొడుకు గాయాలతో పడిపోయాడు. నా చేతుల్తో మోసుకుంటూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తెచ్చాను. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. విధి మా కుటుంబం మీద పగ పట్టింది’’ అంటూ పుత్ర శోకంతో కన్నీరుమున్నరవుతున్నాడు. మొబైల్ ఫ్లాష్ వెలుగులోనే.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కలున్న స్థానికులు అందరికంటే ముందుగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిమ్మ చీకట్లో బోగిల్లోకి వెళ్లడానికి వారు తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లలోనే సహాయ కార్యక్రమాలు సాగించారు. తమ చేతులతోనే బోగీ అద్దాలు పగులగొట్టి లోపలకి వెళ్లి క్షతగాత్రుల్ని బయటకి తీసినట్టు పూర్ణ చంద్ర మాలిక్ అనే రైతు చెప్పాడు. ‘‘బాధితుల రోదనలు వింటూ ఉంటే మనసు కదిలిపోయింది. వారిని కాపాడడం కోసం నా చేతుల్తో బోగీ అద్దాలు పగుల గొట్టా. లోపల భయంకరమైన దృశ్యం కనిపించింది. కొంతమందికి కాళ్లు, చేతులు తెగిపడి ఉన్నాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాసేపు అందరం షాక్‌కి లోనయ్యాం. వెంటనే తేరుకొని మాకు చేతనైన సాయం చేశాం. 30 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం’’ పూర్ణ చంద్ర మాలిక్ వివరించారు. రైలు స్పీడ్‌ను వీడియో తీస్తుండగా.. కోల్‌కతా నుంచి కటక్ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన మాణికల్ తివారీ అనే ఒక వ్యాపారి రైల్లో వీడియో తీస్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైలు ఎంత స్పీడ్‌గా వెళుతోందో తన కుటుంబ సభ్యులకు చూపించాలన్న ఉత్సాహంతో అతను కిటికీ దగ్గర కూర్చొని వీడియో తియ్యడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా బోగి చిమ్మచీకటిగా మారిపోయి పొగతో నిండిపోయింది. ఆయన చేతులు రక్తమోడడం మొదలైంది. ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు. బోగి అంతా పొగతో నిండిపోవడంతో అతను ఎలాగో బయటకి వెళ్లాడు. పట్టాలపై శవాల్ని చూసిన తర్వాత కానీ అతనికి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అర్థం కాలేదు. ‘‘అంతా సెకండ్లలో జరిగిపోయింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడ్డాను. నా ఎదురుగా యువజంటలో భర్త మరణించాడు. భార్య మిగిలి ఉంది. ఈ రోజు ఒక బ్లాక్ ఫ్రైడే’’ అని తివారీ చెప్పారు. మందుల కోసం డబ్బులు పంపిస్తానని తిరిగిరాని లోకాలకు.. అనారోగ్యంతో ఉన్న తండ్రికి మందుల ఖర్చులకి డబ్బులు పంపిస్తానని చెప్పి బయల్దేరిన ఆ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బీహార్‌కు చెందిన రాజా పటేల్ (26) అనే యువకుడు ఇతర వలస కూలీలతో కలిసి కేరళ వెళ్లడానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రైలు ప్రమాదంలో కొడుకు మరణించాడని తెలిసిన తండ్రి భోలన్ కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబానికి పటేల్ సంపాదనే జీవవనాధారం. వెన్నుముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న తండ్రి భోలన్ ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో నెల తిరిగేసరికల్లా కొడుకు పంపే డబ్బుల కోసమే వారు ఎదురు చూస్తుంటారని పొరుగింట్లో ఉన్న అవినాశ్ పాండే చెప్పాడు. నిద్రలోనే మృత్యుఒడిలోకి.. బాలాసోర్: పెను ప్రమాదం పలు సెకన్లలోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యకాలంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అంటే కొద్దిసేపట్లోనే అంతా ముగిసిందని, ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు నిద్ర మత్తులో ఉంటడంతో అసలేం జరుగుతుందో తెల్సుకునేలోపే అంతా జరిగిపోయిందని, తప్పించుకునే అవధికూడా లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పట్టాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు విపత్తు స్పందన దళ సభ్యులు శతథా శ్రమిస్తున్నారు. వీరికి స్థానికులు అండగా నిలిచి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే మానవత్వంతో ఎంతో మంది స్థానికులు వయోబేధంతో సంబంధం లేకుండా ఆస్పత్రులకు తరలివచ్చి రక్తదానానికి సిద్ధపడ్డారు. వీరికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేగంపై తప్ప భద్రతపై దృష్టి లేదు ‘రైల్వే వ్యవస్థ విస్తరించే కొద్దీ అవసరమైన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగాలి. కానీ ప్రస్తుతం రైల్వేలో దాదాపు రెండున్నర లక్షల ఖాళీలున్నాయి. రైళ్లను వేగంగా నడిపేలా విదేశాలతో పోటీ పడుతున్న రైల్వే, అక్కడి వ్యవస్థ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు పరుగెత్తాలన్నప్పుడు దిగువ సిమెంటు కాంక్రీట్ ట్రాక్ ఉండాలి, కానీ మన వద్ద నేరుగా నేలపైనే కంకర పరిచి ఏర్పాటు చేస్తున్నారు. అంత వేగాన్ని ఇది తట్టుకోలేదు. వేగం కంటే భద్రత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి’ – శంకరరావు, సీనియర్ రైల్వే కార్మిక నేత ఊహాగానాలొద్దు.. ‘‘రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అవి ఎలా జరిగాయనే ఊహాగానాల జోలికి వెళ్లొద్దు. ప్రమాదానికి అసలు కారణాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ తేలుస్తారు. అందుకు తగ్గ అర్హతలున్న వారే ఆ పోస్టులో ఉంటారు. ప్రమాదాలకు అసలు కారణాలు తేలాకగాని కారణాలను విశ్లేషించలేం. ఆ ప్రమాదం నేపథ్యంలో ఆ అధికారి బృందం కొన్ని సిఫారసులు చేస్తుంది. వాటికి తగ్గ చర్యలు తీసుకోవాలి’’ - స్టాన్లీబాబు, మాజీ జీఎం. ఇది కూడా చదవండి: అదే జరిగితే ప్రమాదం తప్పేదా? -
పెద్దకర్మకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.. ముగ్గురు సోదరులు మృత్యువాత
బాలాసోర్: ఒడిశా రైలుప్రమాద ఘటనలో పలు హృదయవిదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సంబంధిత కథనాలు జాతీయ మీడియాలో కనిపించాయి. అందులో ఒడిశాకు చెందిన రమేశ్ జెన అనే వ్యక్తి విషాదగాథ కూడా ఉంది. బాలేశ్వర్‌కు చెందిన ఒకావిడకు రమేశ్, సురేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిలో పెద్దవాడైన రమేశ్ చాలా సంవత్సరాల క్రితమే చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. ఇటీవల రమేశ్ తల్లి కాలంచేశారు. దీంతో గత నాలుగు రోజుల క్రితం ఆయన సొంతూరు బాలేశ్వర్‌కు వచ్చారు. పెద్దకర్మ తదితర కార్యక్రమాలు చూసుకుని తిరిగి చెన్నైకి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోనే రమేశ్ ప్రయాణించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అన్న మృతిపై తమ్ముడు సురేశ్ మాట్లాడారు. ‘ తల్లిమరణంతో దాదాపు 14 సంవత్సాల తర్వాత అన్నయ్య ఇంటికొచ్చారు. కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాక స్వయంగా నేనే అన్నను రైల్వేస్టేషన్లో దిగబెట్టారు. రైలు ఎక్కుతా నువ్వు వెళ్లిపో అని చెబితే సరేనన్నా. అన్నయ్యను చూడటం అదే చివరిసారి అవుతుందని కలలో కూడా అనుకోలేదు. రాత్రిపూట రైలు ప్రమాదం వార్త తెల్సి వెంటనే అన్నకు ఫోన్‌చేశా. ఫోన్ లిఫ్ట్‌చేయలేదు. కొద్దిసేపయ్యాక ఎవరో ఆ మొబైల్ నుంచి ఫోన్‌చేసి ప్రమాదంలో మీ అన్నయ్య చనిపోయాడని చెప్పారు. మరణవార్త విని హుతాశుడినయ్యా. పరుగున ఘటనాస్థలికి వెళ్లా. మొత్తం వెతికినా లాభంలేకుండా పోయింది. చివరకు బాలేశ్వర్ జిల్లా ఆస్పత్రిలో విగతజీవిలా పడి ఉన్న అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయా’ అని తమ్ముడు వాపోయాడు. ముగ్గురు సోదరులు మృత్యువాత బారుయిపూర్: బాలాసోర్ ప్రమాద ఘటన పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన ముగ్గురు సోదరుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ముగ్గురూ బతుకుదెరువు కోసం తమిళనాడుకు వెళ్తూ మృత్యువాతపడ్డారు. చరనిఖలి గ్రామానికి చెందిన హరన్ గయెన్(40), నిషికాంత్ గయెన్(35), దిబాకర్ గయెన్(32)లు ఏటా తమిళనాడుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ముగ్గురూ ఇటీవలే సొంతూరుకు వచ్చి, తిరిగి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై వెళ్తూ ప్రమాదంలో అసువులు బాశారు. ఈ వార్తతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు హతాశులయ్యారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన హరన్‌కు ఒక కొడుకు, ఇద్దరు పెళ్లయిన కూతుళ్లున్నారు. భార్య అనాజిత మానసిక సమస్యతో బాధపడుతోంది. నిషికాంత్‌కు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మైనర్లే. దిబాకర్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: అందుకే ఈ ప్రమాదం.. కోరమండల్ ప్రమాదం వేళ తెరపైకి కొత్త వాదన -
హెలీప్యాడ్ లేకపోవడంతో పొలంలోనే దిగిన ప్రధాని హెలీకాఫ్టర్
కొరాపుట్: అత్యంత విషాదకర ఘటనలో దేశంలో ప్రముఖులు ప్రోటోకాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా పరామర్శలతో ముందుకు కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హెలీకాఫ్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలీపాడ్ తయారు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి పొలంలోనే ప్రధాని దిగారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోయినా చిన్న టెంట్లోనే సమీక్ష చేశారు. ఘటనపై రైల్వేమంత్రి అశ్వీని శ్రీవైష్ణవ్‌తో మాత్రమే ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి నవీన్ లేకపోవడం విశేషం. అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయ చర్యల సమయంగా ప్రకటించారు. -
ఆపద సమయం.. ఆదుకునే హృదయం
కొరాపుట్/రాయగడ/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, భద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమవంతు సాయం అందించేందుకు ముందుకు కదిలారు. భద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్పత్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వెయ్యి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు.. రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవాసమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, రాయగడకు చెందిన ఒడిశా సత్యసాయి సేవాసమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరకవలస సునీల్‌కుమార్ మహంతి వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70మంది సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తీసుకు వచ్చిన ట్రాక్టర్లపై క్షతగాత్రులు, మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంత లేకపోవడంతో తామే స్వపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందిరి మన్ననలు పొందారు. ఎమ్మెల్యే బాహిణీపతి గొప్ప మనసు.. ప్రమాదం జరిగిన వెంటనే జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గొప్ప మనసు చాటుకున్నారు. రాత్రి ఘటన జరిగిన సమయంలో భువనేశ్వర్ ఉన్న ఆయన.. సమాచారం తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలతో బాలేశ్వర్ వెళ్లారు. తనతో వచ్చిన కార్యకర్తలతో కలిసి క్షతగాత్రులకు సేవలు అందజేశారు. సమీప ఆస్పత్రులకు వెళ్లి రోగులను పరామర్శించారు. తన సొంత ఖర్చులతో అవసరమైన నిత్యవసరాలు, ఆహారం అందజేసి, అందరి మన్ననలు పొందారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు.. బాలేశ్వర్ సమీపంలోని బహనాగ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెన్న తెలియజేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు వెయ్యి మందికి పైగా గాయాలైన వారిని, సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందజేసేందుకు ఎస్సీబీ, బారిపద మెడికల్ కేంద్రాలకు తరలించామన్నారు. మృతిచెందిన వారికి సంబంధించిన బాధిత కుటుంబాలు వచ్చి సరైన ఆధారాలను చూపిస్తే మృతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొంతమంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించడం జరిగిందని వివరించారు. గుర్తించని మృతదేహాలను భద్రపరిచి, 72 గంటల వ్యవధిలో ఎటువంటి ఆచూకీ తెలియకపోతే నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. -
వేడెక్కిన రాజకీయం
కొరాపుట్/భువనేశ్వర్/రాయగడ: బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఊహించని సంకటంగా మారింది. రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ ఒడిశాకు చెందిన రాజ్యసభ ఎంపీ. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ఐఏఎస్ అధికారిగా ఒడిశా కేడర్‌లో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందా రు. ఎన్డీఏ–2 అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విన్ అనేక సంస్కరణ లు చేపట్టడంతో దేశవ్యాప్తంగా బీజేపికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. రైల్వేశాఖ మీద దశాబ్దాలు గా బెంగాల్, బీహార్ ఆధిపత్య జోరుకు కల్లెం పడింది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లక్ష్యంగా మారారు. ఈ క్రమంలో దుర్ఘటన జరడం, రైల్వేశాఖ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన వెంట రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రప్పించుకున్నారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతం బాలేశ్వర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి ప్రతాప్ షడంగి నేతృత్వం వహించడం కూడా విపక్షాలకు మరో అవకాశంగా మారింది. ఈరైలు బెంగాల్–తమిళనాడు మధ్య రాకపోకలు సాగిస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ తో సరిగ్గా పడదు. వారిద్దరూ కూడా పరిస్థితి గమనించి బీజేపీని ఇరుకున పెట్టేందుకు ముందుకు దిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి తన రాష్ట్రం నుంచి మంత్రుల బృందం పంపించడం, అప్పటికే పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయలు దేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రులకు వెంటనే నష్ట పరిహారం అందజేయ డం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా రంగంలో దిగి ఒడిశా బయలుదేరారు. మరోవైపు, విశ్రాంత రైల్వే ఉన్నతాధికారులు తమ ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. -
ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్..
నిన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ కుగ్రామం.. ఊహకందని విషాదంతో అపఖ్యాతి మూట గట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో రక్తాక్షరాలతో వందలాది మంది క్షతగాత్రుల హాహాకారాలకు వేదికై ంది. ఎటుచూసినా గుట్టులుగా పడి ఉన్న మృతదేహాలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తెగిపడిన అవయవాలు.. నిస్సహాయుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. భీతావహంగా కనిపించింది. – భువనేశ్వర్/కొరాపుట్/రాయగడ బహనాగా బజార్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలంలో భయానక దృశ్యాలు హృదయాన్ని కలచి వేశాయి. దుర్మరణం పాలైన వారి మృతదేహాలు ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్నాయి. బంధు, మిత్ర వర్గాలు కోల్పోయిన ఆత్మీయులను గుర్తించేందుకు వీలైన సదుపాయాలను కల్పించడంలో రైల్వేశాఖ పూర్తిగా విఫలమైన అమానుష దృశ్యాలు తారసపడ్డాయి. శుక్రవారం రాత్రి సుమారు 7గంటలకు ప్రమాదం సంభవించగా.. శనివారం సాయంత్రం వరకు ఘటనా స్థలంలో మృతదేహాలను సురక్షితంగా పదిల పరచలేకపోవడం దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మృతదేహం సకాలంలో పదిల పరచకుంటే బాధిత కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. గుర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధితులకు సకల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని మోదీ మొదలుకొని అన్ని స్థాయిల మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటించినా.. హామీలు నీటిమీద రాతలుగా తారసపడ్డాయి. ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు(హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఘటనా స్థలం బహనాగ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ సదుపాయం వాస్తవంగా తారస పడకపోవడం విచారకరం. స్వచ్ఛంద సేవలు అమూల్యం.. ఘటనా స్థలం పరిసరాల్లో స్థానికులు, సంస్థలు ఇతరేతర వర్గాలు బాధిత వర్గాలకు అందజేసిన వాస్తవ సహాయ సహకారాలు అమూల్యం. తాగునీరు, ఆహారం ఏర్పాట్లు నిరవధికంగా అందించి, ఆదుకున్నారు. బాలాసోర్, భద్రక్, కటక్ 3 జిల్లాల్లో పలు ఆస్పత్రుల్లో చేరిన బాధితులకు ఇదే తరహా సేవలతో ఆపత్కాలంలో బంధువులుగా ప్రత్యక్షమయ్యారు. ఆచూకీ లేని లగేజీ.. ఘటనా స్థలంలో ప్రయాణికుల బ్యాగులు ఇతరేతర లగేజీ చిందరవందరగా పడి ఉంది. బాధితుల ఆచూకీ తెలుసుకోవడంలో అయిన వారు వర్ణనాతీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దుర్మరణం పాలైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కటక్ ఎస్సీబీలో 193మంది భర్తీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో గాయపడిన 193మందిని కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరిలో 9మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఆస్పత్రి అత్యవసర అధికారి డాక్టర్ భువనానంద మహరణ తెలిపారు. చికిత్స కోసం భర్తీ అయిన వారిలో ముగ్గురు 18 ఏళ్ల లోపు యువకులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. దుర్ఘటన నేపథ్యంలో అత్యవసర వైద్య, చికిత్స సేవల కోసం ఆస్పత్రి నేత్ర చికిత్స వార్డు పైఅంతస్తులో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నా మిత్రుడు ఏమయ్యాడో? రైలు దుర్ఘటనలో అనేక విషాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రులలో కోలుకుంటున్న వారు నెమ్మదిగా వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రస్తుతం భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సునీల్‌రామ్.. బీహార్‌కు చెందిన తన మిత్రుడు మనూ మహతో(25)తో కలిసి హౌరాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కా రు. వీరిద్దరూ చైన్నె వెళ్లాల్సి ఉంది. కానీ ఈ దుర్ఘట న జరగడంతో విడిపోయారు. ప్రస్తుతం సునీల్ భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనతో కలిసి ప్రయాణం చేసి తప్పిపోయిన మిత్రుడు ఆచూకీ కోసం ఆందరినీ అభ్యర్థిస్తున్నాడు. – సునీల్‌రామ్, మోతుబరి, బీహార్ స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ కొనియాడారు. శనివారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని సలహాదారుడు 5టీ కార్తికేయ పాండ్యన్‌తో కలిసి సందర్శించారు. అప్పటికే చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లిన సీఎం క్షతగాత్రులను పరామర్శించారు. స్థానికులు సకాలంలో ఆదుకోకపోతే తాము బతికి ఉండేవాళ్లం కాదని పలువురు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్పత్రి రోదనలతో మిన్నంటడంతో సీఎం కాసేపు మౌనం వహించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఘటన ప్రాంతంలో స్థానికులు అందించిన సాయం మరువలేనిదని కొనియాడారు. దారి మళ్లిన రైళ్లు.. రాయగడ: బహనాగలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం కోస్తారైల్వే పలు రైళ్లను దారి మచినట్లు ప్రకటించింది. భువనేశ్వర్, బాలేశ్వర్ మీదుగా ప్రయాణించాల్సి పలు రైళ్లు.. విశాఖపట్నం నుంచి విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్, సంబల్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు. ► బెంగలూర్–అగర్తల హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(12503) టిట్లాఘడ్, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది. ► సిలిఘాట్–తంబారం(15630) రైలు రౌర్కెలా, టాట్లాఘడ్, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► పాట్నా–ఎర్నాకులం(62644) రైలు అంగూ ల్, విశాఖపట్నం మీదుగా చేరుకుంటుంది. ► దాఘా నుంచి విశాఖపట్నం(22873) చేరాల్సిన రైలు సంబల్పూర్, అనుగూల్ మీదుగా ప్రయానిస్తుంది. ► బెంగళూర్–గౌహతి(12509) ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం, టిట్లాఘడ్, టాటానగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► సికింద్రబాద్–హౌరా(12704) రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. ► గుణుపూర్–విశాఖపట్నం(08521) పాసింజర్ రైలు 3గంటలు ఆలస్యంగా విశాఖపట్నం చేరుకుంటుంది. సీఎం నవీన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్తో తమిళనాడుకు చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రమంత్రి ఎస్ఎస్ శివకుమార్‌తో కలిసి శనివారం రాత్రి భువనేశ్వర్‌లో నవీన్ నివాస్‌లో సంప్రదింపులు చేశారు. రైల్వే దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 5టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యన్ ప్రమాద వివరాలు ఉదయనిధికి వివరించారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, మంత్రులు, అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. చైన్నె నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి, క్షతగాత్రుల బంధువులు ఒడిశా చేరుకునే చర్యలు తీసుకున్నారు. ప్రమాద తీవ్రత పెరగడంతో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని నవీన్ వద్దకు పంపి.. సానుభూతి ప్రకగించారు. ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. రైలు ప్రమాదంలో గాయపడి భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ శనివారం పరామర్శించారు. వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలని సూచించారు. మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శ.. బహనగా రైలు ప్రమాద ఘటనలో గాయపడి బాలేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శించారు. క్షతగాత్రులకు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను సంబంధిత అధికారులు పంపిణీచేస్తున్నారు. ఇందులో భాగంగా సొరొ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.50 వేలు చొప్పున అందిస్తున్నారు. రాజకీయాలకు సమయం కాదు: మమతా బెనర్జీ అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయక చర్యల సమయంగా ప్రకటించారు. మృతులలో 60శాతం మంది బెంగాలీలు ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున్న పరిహారాన్ని బెంగాల్ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. పరామర్శించిన కేంద్రమంత్రులు.. ఘటనా స్థలాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్, కేంద్ర విద్య, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. వీరివురూ ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఇరువురూ కలిసి భద్రక్, బాలాసోర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి, తెలుసుకున్నారు. సత్వర చికిత్స అందించాలని సూచించారు. వారితో పాటు కేంద్ర మాజీమంత్రి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి ఉన్నారు. -
రైళ్ల ప్రమాదం: కర్ణాటకకు చెందిన 110 మంది ప్రయాణికులు సురక్షితం
బనశంకరి: ఒడిశాలోని బాలసోర్ జిల్లా బహనాగ వద్ద శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర రైళ్ల ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 110 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో కర్ణాటక నుంచి వెళ్లిన రైలు సైతం దెబ్బతినగా అందులో కన్నడిగులు ఎవరూ చనిపోలేదని అదనపు డీజీపీ ఎన్.శశికుమార్ తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్లిన 23 బోగీలు కలిగిన రైల్లో మూడుబోగీలు మాత్రమే దెబ్బతినగా, ఇందులో కర్ణాటకకు చెందినవారు లేరని సమాచారం. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. రైల్వే అధికారులను సంప్రదిస్తున్నామని, నాలుగుచోట్ల హెల్ప్ లైన్లను ప్రారంభించామని, రాష్ట్ర ప్రయాణికులు మృతి చెందినట్లు, గాయపడినట్లు సమాచారం లేదన్నారు. కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఉన్న బోగీలకు ఎలాంటి ఇబ్బందిలేదని తెలిపారు. ఘటనాస్థలానికి రాష్ట్రం నుంచి పోలీసు అధికారులను పంపించామని తెలిపారు. నాలుగు హెల్ప్ లైన్లను ప్రారంభించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మరణాల గురించి అవాస్తవాలను ప్రచారం చేయరాదని కోరారు. మృతుల్లో ఎక్కువ మంది ఈశాన్య భారతానికి చెందిరవారున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదానికి గురైన హౌరా రైలు బెంగళూరులోని బైయప్పనహళ్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రమాదస్థలిలో అప్పుడే పడిపోయిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి నుంచి ఒడిశాకు వెళ్లే రైళ్లను నిలిపివేశామని శశికుమార్ తెలిపారు. ఇద్దరు మృతి? ఇప్పటివరకు రైలు దుర్ఘటనలో బెంగళూరు నగరానికి చెందిన ఇద్దరు మృతిచెందారని తెలిసింది. వీరు ఏ రైలులో ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. చిక్కమగళూరుకు చెందిన 110 మంది ప్రయాణికులు హౌరా రైలులో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. వీరు జార్ఖండ్ పర్యటనకు వెళుతున్నారు, అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది. హెల్ప్లైన్లు ప్రారంభం ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో బాధితుల బంధువులకు సమాచారం అందించడానికి రైల్వేశాఖ సహాయవాణి ప్రారంభించింది. బెంగళూరు–080–22356409, 09606005129, 8861203980 బంగారుపేటే–081 53255253, కుప్పం– 843 1403419, నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. బాధితులు సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. కాగా బెంగళూరు నుంచి ఒడిశా మీదుగా వెళ్లాల్సిన మూడు రైళ్లను రద్దుచేశారు. 12551 నంబరు ఎస్‌వీఎంబీ–కేవైక్యూ, 12864 నంబరు ఎస్‌వీఎంబీ– హెచ్డబ్ల్యూహెచ్ నంబరు 12253 ఎస్‌వీఎంబీ–బీజీపి రైలు సర్వీసులు బంద్ అయ్యాయి. ఒడిశా సర్కారుతో మాట్లాడాం: సీఎం శివాజీనగర: తాము ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉన్నామని, కర్ణాటక ప్రయాణికుల గురించి సమాచారం కోరామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సీఎం, ఇంత పెద్దస్థాయిలో ప్రమాదం ఏనాడు జరగలేదు. కర్ణాటక వారి గురించి ఇప్పటికీ సమాచారం అందలేదు. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్లారు, వారు ఎలా ఉన్నారనేది తెలియడం లేదు కేంద్ర రైల్వే శాఖ, ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. యశ్వంతపుర రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. కర్ణాటక వారికి ఏ విధమైన హాని జరిగిందనే విషయంపై సమాచారం తెలియదు అని చెప్పారు. రైలు ప్రమాద స్థలంలో కన్నడిగుల సహాయ కార్యక్రమాల కోసం మంత్రి సంతోష్ లాడ్‌ను అక్కడకు పంపించినట్లు తెలిపారు. -
అత్యంతఘోర రైలు ప్రమాదాలు..: మృత్యు శకటాలు
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. మన దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో పడిపోయిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతి పెద్దది. ఈ ప్రమాదంలో 800 మందికిపైగా మరణించారు. అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. మన దేశ చరిత్రలో... 1. పాసింజర్ రైలు రాష్ట్రం : బీహార్ తేదీ : జూన్ 6, 1981 మృతుల సంఖ్య : 800 దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. 1981 సంవత్సరం జూన్ 6న బీహార్‌లోని మన్సి నుంచి సహస్రకు వెళుతున్న పాసింజర్ రైలు భాగమతి నది వంతెనపై నుంచి వెళుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా మరణించారు. భయానకమైన తుఫాన్ బీహార్‌ను వణికిస్తున్న సమయంలో రైలులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. నదిలో శవాలు కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు. 2 కాళింది–పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : ఆగస్టు 20, 1995 మృతుల సంఖ్య : 350కి పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్గాయ్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో నిలిచింది. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. 3. అవధ్ ఎక్స్‌ప్రెస్–బ్రహ్మపుత్ర మెయిల్ రాష్ట్రం : పశ్చిమ బెంగాల్ తేదీ : ఆగస్టు 2, 1999 మృతుల సంఖ్య : 300 పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్ ఎక్స్‌ప్రెస్, గైసాల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది 4. ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : నవంబర్ 20, 2017 మృతుల సంఖ్య : 150 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు. 5. డెల్టా ప్యాసింజర్ రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ తేదీ : అక్టోబర్ 29, 2005 మృతుల సంఖ్య : 120 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు. ప్రపంచ చరిత్రలో.. మాటలకందని మహా విషాదాలన్నో ప్రపంచ రైల్వే చరిత్రలో కన్నీటిని మిగిల్చాయి. 2004లో వచ్చిన సునామీ రాకాసి అలలు ఒక రైలునే ఏకంగా సముద్రంలో కలిపేయడం అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 1700 మంది జలసమాధి అయ్యారు. క్వీన్ ఆఫ్ ది సీ : శ్రీలంక ఏడాది: 2004 మృతులు: 1700 ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2004లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకలో జరిగింది. ది క్వీన్ ఆఫ్ సీ రైలు శ్రీలంక టెల్వాట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం అలలు ముంచేసి రైలు బోగీలను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మిషెల్: ఫ్రాన్స్ ఏడాది : 1917 మృతులు: 700 ఫ్రాన్స్ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం 1917లో జరిగింది. సెయింట్ మిషెల్–డి–మౌరినె ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఫ్రాన్స్‌లోని ఈ రైలు సెయింట్ మిషెల్ దగ్గర పట్టాలు తప్పింది. సియారా : రుమేనియా ఏడాది : 1917 మృతులు : 600 ఒకే ఏడాది ఫ్రాన్స్, రుమేనియాలో ఒకే విధంగా రైలు ప్రమాదాలు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న రుమేనియాలో రైలు సియారా రైల్వే స్టేషన్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పింది. అప్పుడు రైల్లో ఎక్కువగా సైనికులు, జర్మనీ శరణార్థులు ఉన్నారు. 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌడలాజర ట్రైన్ : మెక్సికో ఏడాది : 1915 మృతులు : 600 మెక్సికోలో 2015 జనవరిలో గౌడలాజర రైలు మితి మీరిన వేగంతో వెళుతుండగా పట్టాలు తప్పింది. కొలిమా నుంచి గౌడలాజర వెళుతుండగా రైలు బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన రైలు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 600 మంది మరణించారు. ఉఫా : రష్యా ఏడాది : 1989 మృతులు : 575 రష్యాలోని ఉఫా నుంచి ఆషా మధ్య రెండు పాసింజర్ రైళ్లు పక్క పక్క నుంచి వెళుతుండగా గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బోగీలకు అంటుకోవడంతో 575 మంది ప్రాణాలు కోల్పోయారు. -
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, అమరావతి /విశాఖపట్నం/కొరాపుట్ / సాక్షి నెట్వర్క్: ఒడిశా రాష్ట్రంలో సంభవించిన ఘోర రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పాలుపంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిశా సరిహద్దుల్లో ఉండే మన రాష్ట్రంలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. 108 అంబులెన్స్‌లు 20, ఇతర అంబులెన్స్‌లు 25, మహాప్రస్థానం వాహనాలు 15 కలిపి 60 వాహనాలు ఘటన స్థలానికి తరలించారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. రైలులో ప్రయాణించిన మన రాష్ట్ర ప్రయాణికుల వివరాల ఆధారంగా కో ఆర్డినేట్ చేసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లాల డీఎంహెచ్ఒలను ఆదేశించారు. అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు: మంత్రి అమర్నాథ్ రైలు ప్రమాద బాధితులకు అత్యవసర సాయం అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు వినియెగించుకోవాలని సీఎం ఆదేశించారని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా రైలులో ప్రయాణించి, ఫోన్‌కి స్పందించకపోతే వారిని గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖరగ్‌పూర్ నుంచి చాలా మంది తెలుగు వారు ఇదే రైలులో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. ఒక క్షతగాత్రుడి అభ్యర్థన మేరకు విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. కటక్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక అధికారుల బృందం, ప్రభావిత ప్రాంతంలోని ప్రతి ఆస్పత్రిలో ఆంధ్రా అధికారులు సేవల్లో ఉంటారని తెలియజేశారు. సహాయక చర్యలు ముమ్మరం: మంత్రి రజిని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 20 అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ అంబులెన్సులు, 21 మహాప్రస్థానం వాహనాలను పంపామన్నారు. ఈ వాహనాలను సమన్వయం చేసుకునేందుకు వైద్యం, రవాణా, పోలీసుశాఖల నుంచి ముగ్గురు అధికారులను నియమించామని చెప్పారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం కేజీహెచ్, విజయనగరం జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ఒడిశాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వైద్య సేవలు అందించాలని చెప్పామని తెలిపారు. కాగా, రైలు ప్రమాదంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 0891–2590100, 0891 2590102, 9154405292 (వాట్సాప్ నంబర్) తాడేపల్లిలోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101, 8333905022 (వాట్సప్) -
ప్రమాద బాధితులకు పూర్తి సహాయ సహకారాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ) : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధితులకు పూర్తి సహాయ, సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనపై శనివారం ఆయన విశాఖ జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ త్రివిక్రమ్ వర్మలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంఘటనలో రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులు, చనిపోయిన వారు, ప్రమాదానికి గురైన వారిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు, చనిపోయిన వారిని వారి బంధువులకు అప్పగించేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల బృందం ఒడిశాలోని ఘటనా స్థలికి చేరుకుందని తెలిపారు. మంత్రి బొత్స ఇంకా ఏం చెప్పారంటే.. 482 మంది ఏపీ ప్రయాణికులు ► రైల్వే సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన కోరమండల్ రైలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 482 మంది ఉన్నారు. 309 మంది విశాఖలో దిగవలసి ఉండింది. అయితే వీరిలో 57 మంది ప్రయాణం చేయలేదు. మిగతా వారిలో 165 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. 11 మంది గాయపడ్డారు. 76 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. ► రాజమండ్రిలో దిగవలసిన 31 మందిలో 22 మంది సురక్షితంగా ఉన్నారు. మిగతా తొమ్మిది మంది సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడలో 137 మంది దిగవలసి ఉండగా, 80 మంది సురక్షితంగా ఉన్నారు. ఏడుగురు గాయపడ్డారు. 22 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏలూరులో దిగాల్సిన ఐదుగురిలో ముగ్గురు ప్రయాణం చేయలేదు. మిగతా ఇద్దరు స్వల్వంగా గాయపడ్డారు. ► యశ్వంతపూర్ రైలులో 89 మంది ఆంధ్రప్రదేశ్‌లో దిగవలసిన వారు వున్నారు. ఆదివారం ఉదయానికి పూర్తి సమాచారం అందుతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాం. బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులను అలర్ట్ చేశాం. ► ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా రైలు సంఘటన స్థలానికి 108 వాహనాలు 25, ప్రైవేట్ అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వాహనాలను పంపించాం. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇతర శాఖల అధికారుల సహాయం కూడా తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారెవరూ చనిపోయినట్లు సమాచారం లేదు. ► కటక్, భువనేశ్వర్‌లో రెండు చోట్ల రెండు మెడికల్ టీములను ఏర్పాటు చేశాం. సంఘటన స్థలం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రయాణికుల బంధువులు వాట్సాప్ ద్వారా ప్రయాణికుల ఫొటోలు, వివరాలు ఆయా కలెక్టరేట్లలోని కంట్రోల్ రూమ్‌లకు తెలియజేయాలి. -
మనం సైతం.. వేగంగా వివరాల సేకరణ
సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన అన్ని వివరాలు ఆరా తీశారు. చాలా మంది మృతి చెందారని, మృతుల సంఖ్య పెరుగుతూ ఉందని, క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగా ఉందని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరించారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్ఎం.. ఇతర అధికారుల ద్వారా సమాచారం తెప్పిస్తున్నామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక బృందం ప్రమాదం జరిగిన బాలాసోర్ ప్రాంతానికి వెళ్లింది. మంత్రి గుడివాడ అమర్నాథ్తోపాటు సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్, విశాఖలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఆనంద్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్‌లతో కూడిన బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంది. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. రైల్వే అధికారుల నుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరా తీయడానికి, ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పని చేయాలని సీఎం ఆదేశించారు. ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించగా, వారు ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. వేగంగా వివరాల సేకరణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమాండల్, యశ్వంతపూర్ రైళ్లల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉంచిన ఆస్పత్రుల నుంచి ఫొటోల సేకరణ చేపట్టారు. ఈ డేటా ఆధారంగా ప్రమాదంలో ఎవరైనా రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ఉన్నారా? అన్నదానిపై ముమ్మరంగా విచారిస్తున్నారు. అంబులెన్స్‌లు సిద్ధం చేయడంతోపాటు, క్షతగాత్రులకు వైద్యసేలు అందించే అంశంపై అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. సీఎం ఆదేశాల మేరకు విశాఖ నుంచి మంత్రి బొత్స సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు రైళ్లల్లో ప్రయాణిస్తున్న రాష్ట్రానికి చెందిన వారి వివరాలను కొంత వరకు సేకరించి, వారి క్షేమ సమాచారాలను తెసుకునే ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచారు. సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎక్కువ మంది మృతి చెందడం, భారీ సంఖ్యలో క్షతగ్రాతులు కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా.. అన్నదానిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. -
ఒడిశా రైలు దుర్ఘటన.. క్షతగాత్రులను తీసుకెళ్తున్న బస్సుకు ప్రమాదం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటన గాయపడిన వారిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పశ్చిమబెంగాల్లోని మేదినీపూర్‌లో శనివారం వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు ఒడిశా రైలుప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి చిన్న గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో మేదినీపూర్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే.. -
ఒడిశా రైలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది?
ఒడిశా:ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే.. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలిపే 'రైల్ ట్రాఫిక్ ఛార్ట్' ను రైల్వే ట్రాఫిక్ అధికారులు విడుదల చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ చిత్రంలో పేర్కొన్న విధంగా మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో 'అప్ మెయిన్'గా చూపే రైల్ మార్గంలో షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. దానికి కుడి వైపున ఉన్న 'డౌన్ మెయిన్'లో బెంగళూరు-హవ్డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. 'అప్ మెయిన్'లో వెళ్లే కోరమండల్ క్రాసింగ్ పాయింట్ ఉండటంతో పొరపాటున కామన్ లూప్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది. దీంతో కోరమండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డౌన్ మెయిన్ లైన్లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతున్న బెంగళూరు-హవ్డా ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. అయితే.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి:Odisha Train Accident: ఓ వైపు రైలు ప్రమాదం.. మరోవైపు.. బస్సు ఛార్జీల పెంపు..! -
దేవుడా! ఈ మృతదేహాల్లో నా కొడుకు ఉండకూడదు.. ఓ తండ్రి ఆవేదన ఇది
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం. తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే ఘటన ఇది. ఈ ప్రమాదం కారణంగా ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో సుమారు 288 మంది మరణించగా, 900 మంది గాయాలపాలై ఎక్కడెక్కడో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓ పాఠశాల ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాలు పడి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు బతికే ఉన్నాడో లేడో తెలీక ఆ మృతదేహాల్లో వెతుకుతూ.. దేవుడా ఇందులో నా కొడుకు ఉండకూడదూ అని లోపల అనుకుంటూ వెతుక్కుంటూ కనిపించాడు. కుప్పల్లా మృతదేహాలు.. ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ ఘటనలే వినిపిస్తున్నాయి. ఓ తండ్రి పడే బాధకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ తండ్రి తన కొడుకు అక్కడ పడిఉన్న మృతదేహాల్లో ఉన్నాడేమో అని వెతుకుతున్నాడు. తీరా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి..ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడగ్గా.. నా కొడుకు. ఇదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. బతికే ఉన్నాడో లేడో తెలీదు. బతికే ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది, తనకు ఏమైందో తెలియడం లేదు. ఒకవేళ చనిపోయాడేమో అని ఇక్కడ వెతుక్కుంటున్నాను. కానీ దొరకడంలేదు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా ..శుక్రవారం సాయంత్రం సుమారు రాత్రి 7 గంటలకు జరిగిన విధ్వంసకర సంఘటనలో, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద 12841 షాలిమార్-కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. బాలాసోర్ రైలు ప్రమాదంపై సంయుక్త తనిఖీ నివేదిక ప్రకారం, ప్రమాదానికి ప్రాథమిక కారణం సిగ్నల్ వైఫల్యంగా అధికారులు గుర్తించారు. This is heartbreaking 💔 A father looking for his son among the dead. 😔#OdishaTrainAccident pic.twitter.com/eZZDAO94BR — Ketofol☀️ (@aka911_) June 3, 2023 -
ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే..
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన ఏపీ వాసుల్లో 267 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. 113 మంది ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు పేర్కొన్నారు. 82 మంది రైలులో ప్రయాణించలేదని తెలిపారు. మరోవైపు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించిన ఏపీ వారిలో 49 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. 28 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండగా .. 10 మంది ట్రైన్లో ప్రయాణించలేదని చెప్పారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్ కీలక ప్రెస్‌మీట్ రెండు రైళ్లలో ఏపీకి చెందిన వారి ప్రయాణికుల వివరాలు ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 250 మందిని ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు P/13671 భద్రక్ స్టేషన్ నుంచి బయల్దేరి చెన్నైకు చేరుకోనుందని పేర్కొన్నారు. ఈ రైలు ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ రానుంది.అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని అధికారులు చెప్పారు ఈ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు బరంపురంలో, 41 మంది విశాఖపట్నంలో, ఒకరు రాజమహేంద్రవరంలో, ఇద్దరు తాడేపల్లి గూడెంలో, 133 మంది చెన్నైలో దిగుతారు. ఈ రైలు ఆదివారం చెన్నై చేరుకుంటుంది. కాగా ఒడిశాలోని బాలాసోర్ శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 280 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులైనట్లు అధికారులు పేర్కొన్నారు. -
Odisha Train Accident: ఇటు రైలు ప్రమాదం.. అటు.. బస్సు ఛార్జీల పెంపు..!
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైళ్ల భీకర ప్రమాదంతో పూరీకి వెళ్లే మార్గంలో అటు బంగాల్ నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బస్సుల ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్సు యజమానులు ఛార్జీలను ఒక్కసారిగా మూడొంతులకు పెంచేశారని ప్రయాణికులు వాపోతున్నారు. 'జగన్నాథ్ స్నాన్ యాత్ర' రేపు జరగనుంది. భక్తులు పూరీకి పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో రైళ్ల రాకపోకలను సౌత్-ఈస్ట్రన్ రైల్వే నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు బస్సు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకుని బస్సు ఛార్జీలను యజమానులు అమాంతం పెంచేశారని ప్రయాణికులు తెలిపారు. భద్రక్, కటక్, పూరీ మీదుగా వెళ్లే బస్సు ఛార్జీ సాధారణంగా రూ.400, 600, 800 ఉండేది. కానీ ప్రస్తుతం రూ.1200 నుంచి 1500 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ఏజెంట్లు రూ.2000 నుంచి 2500 వరకు అడుగుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో.. -
ఒడిశా రైలు ప్రమాదంపై ఖర్గే కీలక ట్వీట్
న్యూఢిల్లీ: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గాయపడినవారికి, మృతుల కుటుంబాలకు చేయూతనివ్వడానికి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. బాలాసోర్ రైలు ప్రమాద సంఘటన జరిగిన వెంటనే స్పందించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రమాద బాధితులకు అన్నివిధాలా సహాయపడాలని అన్ని పార్టీలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. ఖర్గే లేఖలో ఏమని రాశారంటే... మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. మా పార్టీ శ్రేణులు, ఇతర పార్టీల వారు, అందరూ ముందుకు వచ్చి క్షతగాత్రులకు సహాయపడి, మృతుల కుటుంబాలకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రిని, కేంద్ర రైల్వే మంత్రిని చాలా ప్రశ్నలు అడగాలి. ఇటువంటి సంఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయో వారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అధినేత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2013-14 వరకు రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మల్లిఖార్జున్ ఖర్గే బాలాసోర్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. At this moment of grave national tragedy on account of the terrible train disaster in Odisha, I have instructed the entire Congress party organisation to extend all possible and needed help. 1/3 pic.twitter.com/TGK8NavywB — Mallikarjun Kharge (@kharge) June 3, 2023 -
'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో కన్నీటి గాథలెన్నో..
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అయినవారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆ మృతదేహాల ముందే విలపిస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నవారికి ఈ ఘటనను ఎలా తెలపాలో తెలియని దయనీయ స్థితిలో మరెందరో ఉన్నారు. తన చేతులతోనే కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లానని చెప్తూ ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. సుగాలి చెన్నైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో సుగాలి పెద్ద కుమారుడు సుందర్‌తో పాటు బామ్మర్ధి దిలీప్ కూడా మరణించాడు. తన చిన్న కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 'మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలుదేరాము. డబుల్ డ్యూటీ చేస్తేనే నెలకు 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాది లేక నా కుమారులను కూడా ఏదైనా ఉద్యోగం చేపించాలని చెన్నైకి తీసుకువస్తున్నాను. కానీ మృత్యువు ప్రమాదం రూపంలో ఎదురైంది. నా కొడుకు మృతదేహాన్ని నా చేతులతోనే మోయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో బాధితులు కుప్పలుగా పడి ఉన్నారు.' అని సుగాలి కన్నీటి పర్యంతమయ్యారు. ఇదీ చదవండి:Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు.. తపసి సర్ధార్(22) హౌరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో వ్యవసాయ కూలీగా ఏడు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్న 11 మంది సభ్యుల్లో ఒకరు. ' అంతా గందరగోళం. అరుపులు, ఏడుపులు వినిపించాయి. నా తలకు ముఖంపై గాయాలయ్యాయి. ఇంకా నాలుగు గంటలైతే మా స్టాప్ వచ్చేది. అమ్మను కలిసేవాడిని.' అని విలపించాడు. గోపాల్ మిర్దా(40), అతని భార్య అంజు దేవి జార్ఖండ్ గడ్డా జిల్లాకు చెందినవారు. బెంగళూరులోని నర్సరీలో రెండు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్నారు. ' నా కొడుకుని మా అమ్మే చూసుకుంటుంది. ఇటీవల ఆవిడ ఆరోగ్యం బాగుండట్లేదు. అందుకే ఇంటికి వెళ్లి వారిని చూసుకుందామనుకున్నాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తలకు గాయాలయ్యాయి.' అని దుఖంతో చెప్పారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:Odisha Train Accident: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?.. -
రైల్వే నా బిడ్డలాంటిది.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని సూచించారు. రైల్వే తన బిడ్డలాంటిదని, దానిలోని లోటుపాట్లను సరిదిద్ధేందుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు రైల్వేశాఖ ప్రకటించిందని, బెంగాల్‌కు చెందిన వారికి తమ ప్రభుత్వం రూ 5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణచర్యలు పూర్తయ్యే వరకు రైల్వేకు, ఒడిశా ప్రభుత్వానికి పూర్తి సహాకారం అందిస్తామని వెల్లడించారు. అయితే కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో యాంటీ కొలిజిన్ డివైజ్(anti-collusion device) లేదని.. దీనిని అమర్చినట్లయితే.. ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. చదవండి: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ ‘నేను చూసిన వాటిలో 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన ఇది. ఇలాంటి కేసుల్ని రైల్వే సేఫ్టీ కమిషన్‌కు అప్పగించాలి. వారు విచారణ జరిపి నివేదిక ఇస్తారు. నేను రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో యాంటీ కొలిజిన్ డివైజ్‌ను తీసుకొచ్చాను. ఇది ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో రైళ్లను నిర్ణిత దూరంలోనే ఆపేందుకు ఉపయోగపడుతుంది. కోరమాండల్ రైలులో అలాంటి పరికరం లేదు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా ఈ సంఘటనను నివారించవచ్చు’ అని పేర్కొన్నారు. కాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎదుటే మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వంలో చేరారు. 1999లో అటల్ బిహార్ వాజ్‌పేయ్ కేబినెట్లో మొదటిసారి రైల్వేమంత్రిగా పనిచేశారు. 2000లో తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో పశ్చిమబెంగాల్‌కు అనేక కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకొచ్చారు. 2009 మేలో యూపీఏ-2 ప్రభుత్వంలో మరోసారి రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు సీఎంగా ఎన్నికవ్వడంతో 2013లో కేంద్ర మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. కాగా శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో మూడు రైళ్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే. షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. కొన్ని బోగీలు గాల్లోకి లేచి పట్టాలపై పడ్డాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మృతి చెందగా.. 900 మంది గాయపడ్డారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే #WATCH | West Bengal CM Mamata Banerjee reaches Odisha's #Balasore where a collision between three trains left 261 dead pic.twitter.com/2q4KSNksum — ANI (@ANI) June 3, 2023 -
రైలు ప్రమాదం.. కమెడియన్ అనుచిత ట్వీట్.. ఆ వెంటనే డిలీట్!
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి ఒకే చోట ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురవడంతో 260కి పైగా మంది మృత్యువాత పడగా వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భయానక రైలు ప్రమాదం దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ అనుచిత ట్వీట్ చేశాడు. కమెడియన్‌పై మండిపాటు సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వందల కుటుంబాలు ట్రైన్ యాక్సిడెంట్లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు. వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్ సదరు ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు 'ఇంతకు ముందు చేసిన ట్వీట్‌పై క్షమాపణలు కోరుతున్నాను. ఒట్టేసి చెప్తున్నా.. ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాను.. ఏ వార్తలూ చూడలేదు. అందుకే తప్పు జరిగింది. మరోసారి క్షమాపణలు చెప్తున్నా' అని ట్వీట్ చేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ 'మీ నిజాయితీని మెచ్చుకుంటున్నా. మిమ్మల్ని ట్రోల్ చేయాలనుకోలేదు. కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ.. 'థాంక్యూ.. గత కొన్ని గంటలుగా నేను న్యూస్ ఫాలో అవడం లేదు. కేవలం నా పనిపైనే ఫోకస్ చేశాను. నన్ను అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు. Terribly sorry about the previous tweet. I had no idea about the tragedy on the news. Promise. I’ve been writing a script since midnight and have been cut off from all forms of news. Very sorry, once again. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 Thank you. I have generally not been following the news for a while on account of trying to focus my energies on work. This was definitely a faux pas. Thank you for alerting me about it. Much appreciated. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 A quote tweet I shared of a buster Keaton silent movie gif about trains in films . Doesn’t matter now. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 చదవండి: విషమంగా పంచ్ ప్రసాదం ఆరోగ్యం ఒడిశా రైలు ప్రమాదం: ఈ పాపం ఎవరిది? -
Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదికను నిపుణుల బృందం రైల్వే శాఖకు అందించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ఈ నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించకపోవడంతో ప్రమాదం జరిగిందని తేలింది. మొదట సిగ్నల్ ఇచ్చినా ఆ తరువాత దానిని ఆపేశారని, దీంతో కోరమండల్ రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మెయిన్‌లైన్ బదులు లూప్లైన్లోకి వెళ్లడంతో.. లూప్లైన్లో ఉన్న గూడ్స్‌ను రైలును కోరమాండల్ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణుల బృందం తేల్చింది. దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడగా.. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది. కాగా శుక్రవారం ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన పెను విషాదానికి కారణమైన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ముగిసిన సహాయక చర్యలు : రైల్వే శాఖ ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రమాదం జరిగిన బాలాసోర్ మార్గంలో కవచ్ వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. దాని వల్లే ప్రమాదం తీవ్రత అధికంగా మారిందని పేర్కొన్నారు. ఆ రూట్లో కవచ్ సిస్టమ్ లేదు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని తెలిపారు. కాగా రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను భారత రైల్వేశాఖ డెవలప్ చేస్తోంది. కవచ్ అనేది ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీనిని మూడు భారతీయ సంస్థలతో కలిసి రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సమయానికి బ్రేక్ వేయడంలో డ్రైవర్ ఫెయిల్ అయితే కవచ్ సిస్టమర్ రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. Drone footage of #TrainAccident #CoromandelExpress pic.twitter.com/XCSnJJ0Tcg — Rail Vandi (@rail_vandi) June 3, 2023 Scary Visuals of Balasore Train Accident.. ☺️☺️ . .#TrainAccident #CoromandelExpress #CoromandelExpressAccident #BalasoreTrainAccident #tupaki #Odisha @tupakinews_ pic.twitter.com/mnfCCTqdhA — Tupaki (@tupakinews_) June 3, 2023