Railway Board Jaya Varma Sinha Comments On Odisha Train Accident - Sakshi
Sakshi News home page

లూప్‌ లైన్‌లో ఐరన్‌ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్‌ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా

Jun 4 2023 1:38 PM | Updated on Jun 4 2023 2:43 PM

Railway Board Jaya Varma Sinha Comments Over Odisha Train Accident - Sakshi

ఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన కీలక విషయాలు వెల్లడించారు రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా. సిగ్నలింగ్‌ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బహనాగ స్టేషన్‌ వద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. 

కాగా, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి ఓవర్‌ స్పీడ్‌ కారణం కాదు. ఈ ప్రమాద సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రెండు రైళ్లు నిర్ధేశిత వేగంతోనే వెళ్తున్నాయి. 

కోరమండల్‌ రైలు లూప్‌ లైన్‌లోకి వెళ్లింది. బహనాగ స్టేషన్‌ వద్ద రెండు లూప్‌లైన్లు, రెండు మెయిన్‌ లైన్స్‌ ఉన్నాయి. లూప్‌ లైన్‌లో ఉన్న గూడ్స్‌ రైలులో భారీగా ఐరన్‌ ఓర్‌ ఉంది. గూడ్స్‌ రైలును కోరమండల్‌ రైలు ఢీకొట్టింది. దీంతో, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, సిగ్నలింగ్‌ సమస్యల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్‌.. పరిహారం వివరాలు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement