
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటన గాయపడిన వారిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పశ్చిమబెంగాల్‌లోని మేదినీపూర్‌లో శనివారం వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు ఒడిశా రైలుప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి చిన్న గాయలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో మేదినీపూర్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది.
మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్
ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే..