Odisha Train Accident: Check Out Helpline Numbers For Telugu Passengers - Sakshi
Sakshi News home page

ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్‌ లైన్లు ఇవే

Published Sat, Jun 3 2023 3:08 PM | Last Updated on Sat, Jun 3 2023 3:40 PM

Odisha Rail Accident: Helpline Numbers For Telugu Passengers - Sakshi

సాక్షి, విజయవాడ: రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమండల్‌ రైలులో ఏపీకి చెందినవారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల ఫోటోలను సేకరిస్తున్నారు. డేటా ఆధారంగా రాష్టానికి చెందిన ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. ప్రమాద స్థలంలో వైద్య సేవలు, అంబులెన్స్‌లు సిద్ధం చేశారు.

ఒడిశాకు ఏపీ అధికారుల బృందం
రైలు ప్రమాదంలో 179 మంతి తెలుగువారు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్‌ వివరాల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం అధికారుల బృందం ఓడిశా చేరుకుందన్నారు.  విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 కాంటాక్ట్‌లోకి వచ్చారని తెలిపారు.

ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో హెల్స్‌లైన్‌ ఏర్పాటు: 0866 2575833 చేశామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు.

కోరమండల్‌ రైలులో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందని కలెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. వీరిలో 23 మందిని కాంటాక్స్‌ చేశాం.. వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.. మిగిలిన 16 మందిని కాంటాక్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్‌ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

కోరమండల్‌ రైలులో తెలుగు ప్రయాణికుల వివరాలు
►కోరమండల్‌ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు
►విశాఖపట్నం వరకు 110, రాజమండ్రి వరకు26 మంది
►తాడేపల్లి గూడెం ఒకరు, విజయవాడ వరకు 39 మంది

►ఏలూరులో దిగాల్సిన ఇద్దరు సురక్షితం. చంద్‌పాల్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీకర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యారు

►చీరాల నుంచి హౌరా వెళ్లాల్సిన ఆరుగురు ప్రయాణికులు సేఫ్‌. ఆరుగురిలో ఇద్దరిని సంప్రదించిన పోలీసులు

► తాడేపల్లిగూడెం రావాల్సిన ఇద్దరు ప్రయాణికులు సేఫ్‌. ఉమామహేశ్రరావు, రంజిత్‌ గాయాలతో బయటపడ్డారు.

కాకినాడ వాసుల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌
ఒడిశాలోని బాలాసోర్ సమీపములో  జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.  

►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -9490618506

►పోలీస్ కంట్రోల్ రూమ్ -9494933233

తూర్పుగోదావరి జిల్లా...

►ఒడిశా బాలాసోర్‌లో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంతపూర్  రైళ్లలో రాజమండ్రికి రావాల్సిన ప్రయాణికులు..

► మొత్తం ప్రయాణికులు 31 మంది

►వీరిలో రాజమండ్రి వాసులు-5

►కాకినాడకు చెందినవారు-1

►కొవ్వూరుకు చెందినవారు-1, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు-- 12, చత్తీస్‌గఢ్‌కు చెందిన వారు-2, కోల్‌కతా-1

►వీరిలో 22  సురక్షితంగా ఉన్నారు.

కృష్ణాజిల్లా
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జాషువా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్స్
►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -8332983792
►పోలీస్ కంట్రోల్ రూమ్ -9491068906
ఎస్బీ ఎస్ఐ - 9618336684

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement