Coromandel Express
-
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
ఒడిశా కోరమాండల్ ప్రమాద వీడియో వైరల్!
Balasore Train Accident Video Viral: ఒడిశా బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వీడియో ఇదేనంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఒడిశా ఛానెల్స్ కూడా ఈ వీడియోను అధికారికమేనంటూ తెరపైకి తెచ్చాయి. ప్రమాదానికి ముందు క్షణాలంటూ ఆ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మీరు ఒకవేళ సున్నిత మనస్కులు అయితే గనుక దయచేసి ఈ వీడియో చూడకండి. ఒడిశాలో జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదానికి ముందు వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది. అందులో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్తున్న రైలులో.. రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ప్రయాణికులు ప్రశాంతంగా కొందరు పడుకోగా.. మరికొందరు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరో తన మొబైల్లో అదంతా రికార్డు చేస్తున్నారు. అంతలో.. ఒక్కసారిగా కల్లోల పరిస్థితి.. హాహాకారాలతో వీడియో ఆగిపోయింది. ఈ వీడియోనే కోరమాండల్ప్రమాద వీడియో అంటూ విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైల్వేశాఖ, ఒడిశా అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఒడిశా ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ మృతదేహాల్లో ఇంకా 82 మందిని గుర్తించాల్సి ఉంది. బాడీలు పాడైపోయే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు తలమునకలయ్యారు. డీఎన్ఏ టెస్టులు సహా చివరి ఆప్షన్‌గా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని ఉపయోగించాలని నిర్ణయించారు. -
బహనాగా బజార్ దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
భువనేశ్వర్: రాష్ట్రంలో సంభవించిన ట్రిపుల్ రైలు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం వెల్లడించింది. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుకు మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు సీబీఐకి చెందిన 10మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి ఒడిశాకు చేరుకుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. రైల్వేశాఖ అభ్యర్థన మేరకు, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు వర్గం సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీఎస్)లో నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిందన్నారు. సీఆర్ఎస్ విచారణ.. రైలు దుర్ఘటనలో ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) దర్యాప్తు చేపట్టడం నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవల బహనాఘా బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన ట్రిపుల్ రైలు దుర్ఘటనలో మృతులు సంభవించిన ఘటనపై సీఆర్ఎస్ విచారణ కోసం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా సందర్శించిన అనుబంధ అధికార, సిబ్బంది వర్గాలతో ముఖాముఖి సంప్రదించింది. ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే భద్రతా కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్.. కొంతమంది వ్యక్తుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ సంఘటనగా ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్రాయ్ మీడియాతో అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు కారణంగా రైలుప్రమాదం సంభవించిందని.. అయితే ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన చైన్నెకి వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్(ఎల్పీ), అసిస్టెంట్ లోకోపైలట్ వివరణ ప్రకారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఈ ఘటనకు వీరివురు ప్రత్యక్ష సాక్షులు. ఈ పరిస్థితుల దృష్ట్యా సిగ్నలింగ్ వ్యవస్థలో ‘ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‘ ఉండవచ్చని డీఆర్ఎం సందేహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు ఆదివారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు, పరిసరాలు, నిర్వహణ ఇతరేతర అనుబంధ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వేబోర్డు తదుపరి విచారణ, దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఘటనలో 21 కోచ్‌లు ఢీకొని పట్టాలు తప్పడంతో 288 మృతులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సమ్మతించిన రాష్ట్రప్రభుత్వం రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం సమ్మతి తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన సమ్మతి లేఖ జారీ చేశారు. ఈనెల 2న బహనాగా బజార్లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం తర ఫున అదనపు చీఫ్ సెసీ(హోమ్) డీకే సింగ్ సమ్మతి తెలిపారు. ఈ ప్రమాదం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని 2 కోచ్‌లను కూడా ప్రభావితం చేసింది. గుర్తించాల్సినవి.. 83 బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. మృతుల జాబితా విస్తృత ధ్రువీకరణ, అనుబంధ వర్గాల సమాచారం, ఘటనా స్థలం ఇతరేతర రంగాల్లో 2రౌండ్ల కూబింగ్ నిర్వహించిన అనంతరం 288మరణాలను నిర్థారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. 205 మృతదేహాలను గుర్తించి బంధు వర్గాలకు అప్పగించగా, మరో 83 ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. భువనేశ్వర్‌లో 110, బాలాసోర్‌లో 94, భద్రక్‌లో 1 గుర్తించిన వాటిలో ఉన్నాయి. పలు ప్రాంతాలకు మృత దేహాలను ప్రభుత్వ ఖర్చులతో తరలించారు. అయితే గుర్తించని మృతదేహాల్లో పలు సందర్భాల్లో వివాదం తలెత్తుతోంది. ఒక్కో మృతదేహం కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. వివాదం నుంచి బయట పడేందుకు సందిగ్ధ 83 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల నుంచి సహాయ, సహకారాలు అభ్యర్థించారు. రాష్ట్ర మృతులు 39.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో రాష్ట్రం నుంచి 39మంది ప్రయాణికులు మృతిచెందారు. వీరిలో బాలాసోర్ జిల్లా నుంచి 14, మయూర్భంజ్ 9, భద్రక్ 8, కటక్ 3, జాజ్‌పూర్ 2, ఖుర్దా 2, కెంజొహర్ జిల్లా నుంచి ఒకరు మృతి చెందినట్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటన మేరకు మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు చేశారు. ఒక్కో మృతుని కుటంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పరిహారం పొందడం ఇలా.. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది. వాస్తవ బాధిత, పీడిత వర్గాలు ఈ పరిహారం లబ్ధిదారులు. పరిహారం పొందేందుకు దశలవారీ క్రమ విధానం ఇలా ఉంది. మృతులు, గాయపడిన వారు, గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన వెబ్సైట్ల లింక్‌లను రైల్వేశాఖ విడుదల చేసింది. మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులు, చికిత్స పొందుతున్న, గాయపడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను కూడా ఈ సైట్లో పేర్కొంటాయి. రైల్వేశాఖ మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తంలో రూ.50వేల నగదు, రూ.9.5 లక్షల చెక్కు అందిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేస్తారు. మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల బంధువులు, ఆత్మీయులు సులువుగా గుర్తించేందుకు పలు రకాల సన్నాహాలు చేశారు. ఈ చర్యలు అంతంత మాత్రంగా ఫలప్రదమయ్యాయి. ఇదిలా ఉండగా మృతదేహాల కోసం పలువురు ముందుకు రావడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను దీర్ఘకాలం తాజాగా ఉంచేందుకు శక్తివంతమైన కంటైనర్లు వంటి సాంకేతిక సదుపాయాలతో మృతుల వివరాలు ప్రదర్శన వంటి సన్నాహాలు చేపట్టారు. వీటిపై వివాదం తలెత్తడంతో మృతులు, బంధువర్గాల డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ప్రాంగణంలో డీఎన్ఏ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. 10మంది వ్యక్తులు డీఎన్ఏ పరీక్షలకు ముందుకు వచ్చారు. వీరిలో 5మంది పరీక్షలు పూర్తి చేసినట్లు అనుబంధ వర్గాలు తెలిపాయి. సచివాలయ సేవాసంఘం.. బాధితుల సహాయార్థం రాష్ట్ర సచివాలయ సేవాసంఘం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సేవాసంఘం సభ్యుల బృందం ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో సీఎస్ ప్రదీప్ జెనాతో భేటీ అయ్యారు. బాధితులకు సాయం.. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఒడిశా వెటర్నరీ సర్వీసెస్ అసోసియేషన్ రూ.20 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనాకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వెబ్‌పోర్టల్ వివరాలు: ► ఘోర ప్రమాదంలో మరణించిన వ్యక్తుల చిత్రాలను https://srcodisha.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. ► వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, గాయపడిన ప్రయాణికుల పేర్లను తెలుసుకునేందుకు https://www.bmc.gov.in ► కటక్ ఎస్సీబీ మెడికల్ కశాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోల వివరాలు ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ► https://www.bmc.gov.in/train&accident/ download/Un&identified&person&under&treatment&atSCB&Cuttack.pdf ► ప్రభావిత వర్గలు ప్రటకించిన నష్టపరిహారం పొందేందుకు క్రమ పద్ధతిలో అనుబంధ వర్గాలను సంప్రదించాల్సి ఉంది. ► తొలుత మృతదేహం భద్రపరిచిన ఆస్పత్రిని సంప్రదించాలి. ఈ మేరకు రైల్వేశాఖ జారీ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలి. ► బాధితులతో తమ సంబంధాన్ని ధ్రువీకరించే పత్రాలు దాఖలు చేయాలి. ► అభ్యర్థన మేరకు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన మేరకు ధ్రువీకరించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తారు. ► ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ► తదుపరి పరిహారం పొందేందుకు డిశ్చార్జ్ సర్టిఫికెట్తో పాటు అవసరమైన దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. ► మృతుల రక్త సంబంధీకులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. వివాహిత జంట(దంపతులు) విషయంలో భర్త లేదా భార్యకు మాత్రమే పరిహారం ముడుతుంది. రైల్వే సిబ్బంది ప్రస్తావన లేదు: సీబీఐ 288 మంది మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లోతుగా పరిశీలించినట్లు మంగళవారం తెలిపింది. ఎఫ్ఐఆర్ దాఖలు సమయానికి నిర్దిష్ట రైల్వే ఉద్యోగుల నేరం నిర్థారించలేదు. తదుపరి దర్యాప్తు సమయంలో ఈ అంశం నిర్థారిస్తామని పేర్కొంది. కటక్ ఓపీఎస్ ఎస్డీఆర్పీఓ రంజిత్ నాయక్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీబీలో ఎల్ఈడీ ప్రదర్శన కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్ఈడీ టీవీ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్, సమాచార కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని బాధితుల బంధు వర్గాలు ముందుకు వచ్చేందుకు వీలుగా ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న వారి ఫొటోలను ఎల్ఈడీ టీవీలో ప్రదర్శిస్తున్నారు. బాధితుల వివరాలతో సమగ్ర జాబితా ఈ ప్రదర్శనలో లభ్యమవుతోంది. -
వందేభారత్ పరుగులు.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ల నుంచి వాంగ్మూలం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మార్గంలో ప్రభావితమైన రైలు రవాణా సేవలు పునః ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అనుబంధ యంత్రాంగాలు అవిశ్రాంతంగా కృషి చేసి స్వల్ప వ్యవధిలో సహాయక, పునరుద్ధరణ చర్యలు పూర్తి చేయడం సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయి. ఈ ప్రమాదం పట్ల నిష్పక్షపాత విచారణకు రైల్వేశాఖ నిర్ణయించింది. మరోవైపు నిబంధనల మేరకు ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రత కమిషనర్(సీఆర్ఎస్) బహనాగా ప్రమాద ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. మూడు రోజుల తర్వాత రైల్వే భద్రత కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్ కారణాన్ని తెలుసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తులో భాగంగా పరిశీలించారు. రైల్వేస్టేషన్ సిగ్నల్, కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. స్వతంత్ర విచారణ నివేదిక ఆధారంగా చట్టబద్ధమైన దర్యాప్తు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఘటనపై రైల్వేశాఖ సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం.. బహనాగా రైలు ప్రమాదం కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా కోల్‌కతాకు వెళ్లాలనుకునే ప్రజలకు ఒడిశా ఉచిత బస్సు సేవలను అందిస్తోంది. పూరీ నుంచి 20 బస్సులు, భువనేశ్వర్ నుంచి 23, కటక్ నుంచి 16 బస్సులు ఆదివారం రాత్రి 11.30 గంటలకు కోల్‌కతాకు బయలుదేరాయి. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆరోగ్యశాఖ మృతదేహంతో బంధువులను రవాణా చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ సన్నాహాల కోసం 58 అంబులెన్స్, డీబీసీ వాహనాలను మొహరించారు. అలాగే బహనాగా రైలు దుర్ఘటన ప్రభావంతో పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్‌కతాకు ప్రయాణించే ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్ఆర్టీసీ) కొన్ని మార్గాల్లో బస్సు సేవలను రద్దు చేసింది. రైల్వేమంత్రి ఉత్సాహం.. ప్రమాదంతో బహనాగా బజార్ స్టేషన్లో చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు కోచ్‌లను పూర్తిగా తొలగించి, పట్టాలను పునర్నిర్మించారు. రైళ్ల రవాణాకు పటిష్టత నిర్థారించిన మేరకు రాకపోకలకు అనుమతించారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం విశేషం. రైలు ప్రమాదం జరిగిన 51గంటల అనంతరం ప్రభావిత మార్గంలో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఘోరమైన దుర్ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి.. అమాంతంగా రంగంలోకి దిగారు. పట్టాల పునర్నిర్మాణం, పటిష్టతతో తొలుత నడిచిన గూడ్స్ రైలు సిబ్బందికి చేయి ఊపుతూ, సురక్షితమైన ప్రయాణం కోసం ఘటనా స్థలంలో ప్రార్థించారు. వైజాగ్ ఓడరేవు నుంచి రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గుతో కూడిన గూడ్స్‌రైలు ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలుత పట్టాలెక్కి పరుగులు తీసింది. ఆచూకీ తెలియని మృతదేహాల తరలింపు అగమ్య గోచరంగా పరిణమిస్తోంది. ఈ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. శక్తివంతమైన సాంకేతిక కంటైనర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. ఈ మేరకు పారాదీప్ పోర్టు వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆరోగ్యసేవా కేంద్రాల్లో కూడ మృతదేహాలు దీర్ఘకాలం తాజాగా ఉంచే సౌకర్యాలు అందుబాటులో లేనందున ఈ పరిస్థితి తలెత్తింది. పారాదీప్ నుంచి 5శక్తివంతమైన కంటైనర్లను తీసుకు వచ్చి, స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో తాత్కాలికంగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో కంటైనర్‌లో 40 నుంచి 50 వరకు మృతదేహాలను భద్ర పరిచేందుకు వీలఅవుతుంది. వీటిలో 2నెలల వరకు మృతదేహాలు తాజాగా ఉంటాయని భావిస్తున్నారు. 2 దశాబ్దాల విపత్తు నిర్వహణ అనుభవంతో రాష్ట్రప్రభుత్వం మరో మైలురాయిని ఆవిష్కరించే దిశలో అడుగులు వేయడం ప్రధానంగా చెప్పవచ్చు. రాత్రికి రాత్రి స్థానికులు గాడాంధకార చీకటిలో సెల్ఫోన్ల కాంతిలో బాధితులను హుటాహుటిన రక్షించేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన తొలి సహాయక బృందంగా నిలవడం దీనికి తార్కాణం. సత్వర చికిత్స కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా యువత ముందుకు రావడం మానవీయతకు అద్దం పట్టింది. వీరి సత్వర సహాయక చర్యలే సమారు 1,200మంది గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను రక్షించగలదని పరిశ్రమల శాఖ కార్యదర్శి హేమంత్ శర్మ ప్రశంసించారు. గుర్తింపే పెను సవాల్..! కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన తదనంతర కార్యాచరణ పెను సవాల్‌గా మారింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులు 1, 2 రోజల్లో పూర్తిస్థాయిలో పూర్తికావడం ఖాయం. అయితే సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వేవర్గాలు చేస్తున్న ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయి. బాధితులు, మృతుల సంఖ్య ఖరారు చేయడంలో అటు రైల్వే, ఇటు రాష్ట్రప్రభుత్వం అనుక్షణం మార్పుచేర్పులు చేస్తునే ఉంది. గుట్టలుగా పడి ఉన్న మృతదేహాల్లో సజీవంగా ఉన్న బాధిత యువకుడిని అతని తండ్రి గుర్తించాడనే వార్త దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మరోవైపు మృతులను గుర్తించడంలో బంధువర్గాలు తల్లడిల్లుతున్నారు. ఒకే మృతదేహానికి ఇద్దరు, ముగ్గురు బంధువులు తమదిగా పేర్కొంటూ ముందుకు వస్తున్న విచారకర పరిస్థితులు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇటువంటి సందిగ్ధత తలెత్తిన పరిస్థితుల్లో ఆచూకీ లభించని మృతదేహాలుగా పరిగణించి యంత్రాంగం ఊగిసలాడిస్తోంది. మృతదేహాలను అయిన వారికి అప్పగించడంలో అత్యంత జాగరూకత ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం అనివార్యమయ్యే అవకాశం ఉంటుందని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్‌అమృత కులంగా తెలిపారు. ఇప్పటి వరకు 170 మృతదేహాలను గుర్తించగా, దాదాపు 50కి పైగా ఆచూకీ తేలనవిగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా స్పష్టం చేశారు. నిర్ణీత ప్రక్రియ అనంతరం గమ్యస్థానానికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వ ఖర్చులతో పలు ప్రాంతాల్లో గమ్యస్థానం వరకు బంధువర్గాలతో మృతదేహాలను వాహనాలు ఇతరేతర అనుకూల రవాణా మాధ్యమాల్లో ఉచితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరణ ధ్రువీకరణ పత్రాలు త్వరలో కుటుంబాలకు ఎలక్ట్రానిక్ లేదా పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు వివరించారు. వందేభారత్ పరుగులు.. గూడ్సు రైలు రవాణాతో పునరుద్ధరణ పటిష్టత ఖరారు కావడంతో ప్రయాణికుల రైళ్ల రవాణాకు అనుమతించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో కూడిన పూరీ ఎక్స్‌ప్రెస్(12837)ను తొలుత నడిపించారు. పునరుద్ధరించిన ట్రాక్‌లపై సోమవారం ఉదయం 9.30 గంటలకు హౌరా–పూరీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్‌ను సురక్షితంగా దాటింది. ఘటనా స్థలంలో మొదటి సెమీ హైస్పీడ్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా హాజరై, చేతులుపుతూ లోకోపైలట్లను ఉత్సాహ పరిచారని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు రవాణా పునరుద్ధరించారు. 28 రైళ్లు ఇప్పటికే అప్ అండ్ డౌన్ లైన్లను దాటాయి. నియంత్రిత వేగంతో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సోమవారం 2 ప్రయాణికుల రైలుసేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. వీటిలో పూరీ–పాట్నా(18449) బైద్యనాథం ఎక్స్‌ప్రెస్, ఖుర్దారోడ్–ఖరగ్‌పూర్(18022) ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. -
పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, చైన్నె: చైన్నె నుంచి షాలిమర్ వైపుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రెండురోజుల అనంతరం పట్టాలెక్కింది. ఈ రైలు మంగళవారం షాలిమర్‌కు చేరుకోనుంది. వివరాలు.. ఒడిశా బాలసోర్ వద్ద శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన్న దుర్గటనతో చైన్నె నుంచి అనేక రైళ్ల సేవలు రద్దు చేశారు. ఈ ప్రమాదంలో తమిళులు పెద్దసంఖ్యలో చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తమిళులు ఎవరూ మరణించలేదు. స్వల్పగాయాలతో బయట పడ్డ వాళ్లే అధికం. అందరూ సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించడంతో మళ్లీ రైళ్ల సేవలపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో చైన్నె నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపుగా వెళ్లే పలు రైళ్లు సేవలను సోమవారం పునరుద్ధరించారు. అలాగే రెండురోజులుగా పూర్తిగా నిలుపుదల చేసిన చైన్నె – షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ ప్రారంభించారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలు దేరే సమాచారాన్ని మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించారు. దీంతో ఈ రైలు సోమవారం ఉదయం చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10.45 గంటలకు బయలు దేరింది. ఈ రైలు విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం మీదుగా బాలాసోర్ వైపుగా కోలకతాలోని షాలిమర్‌కు మంగళవారం ఉదయం చేరుకోనుంది. -
Odisha Train Accident: ఆ దుర్ఘటనలో కీలకంగా ఆ లోకోపైలట్ చివరి మాటలు
ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతోనే గూడ్స్ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాతే లూప్లైన్లోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ చేయలేదని లోకోపైలట్ గుణనిధి మొహంతి చెప్పారు. మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్ మొహంతి కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్ జంప్ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా. అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్విస్టెగేషన్(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం. #WATCH | Safety is the top priority for Railways. We are making sure that the evidence does not get tampered & that any witness does not get affected. The driver of the train who sustained serious injuries said that the train moved forward only after it received a 'Green' signal.… pic.twitter.com/6zER9dRAUl — ANI (@ANI) June 4, 2023 (చదవండి: -
‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భయానక రైలు ప్రమాదం అందరిలోనూ దడ పుట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యుముఖాన్ని చూసి, ప్రాణాలతో బతికి బట్టకట్టారు. అలాగే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఈ ఘటనను మరువలేకపోతున్నామని చెబుతున్నారు. బాలేశ్వర్‌కు చెందిన జితేంద్ర నాయక్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో తనకు ఎదురైన అనుభూతిని మీడియాకు తెలిపారు. జితేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఆ సమయంలో కోరమాండల్‌లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాను. ఆ బోగీలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో బోగీ రద్దీగా మారింది. బోగీలో నేను కింద కూర్చున్నాను. రైలు ముందుకు కదిలిన కొద్దసేపటికే రైలులో వైబ్రేషన్ మొదలయ్యింది. ట్రైన్ అటుఇటు కదులుతున్నట్లు అనిపించింది. కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. దాని తరువాత ఏమయ్యిందో తెలియలేదు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’ రైలు అంతా పొగమయంగా మారిపోయింది. కళ్లు నులుముకుని చూసే సరికి, కొందరు చేతులు తెగి పడినవారు, కాళ్లను కోల్పోయినవారు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయినవారు కనిపించారు. నేను రైలులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చాను . అప్పుడు నాకు కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఆ సమయంలో నన్ను ఎవరూ కాపాడలేదు. నేనే అతి కష్టం మీద శిధిలాల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో చాలామంది క్షతగాత్రులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. నేను ప్రయాణించిన జనరల్ బోగీలోని ప్రయాణికులెవరూ బతికివుండే అవకాశం లేదు. భగవంతుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. -
చురుగ్గా.. పునరుద్ధరణ
భువనేశ్వర్: బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపునకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ నేపథ్యంలో సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించింది. మృతులు, క్షతగాత్రులకు పరిహారం చెల్లింపు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. లెక్క తేలింది.. రైల్వేశాఖ సమాచారం ఆధారంగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య శనివారం రాత్రి 288గా ప్రకటించారు. దుర్ఘటనకు గురైన చిట్టచివరి బోగీ పునరుద్ధరించిన తర్వాత లెక్కించిన మేరకు తుది వివరాలను దాఖలు చేసినట్లు రైల్వేశాఖ పేర్కొంది. అయితే ఆదివారం ఉదయం వరకు అంచెలంచెలుగా అందిన మృతదేహాలను ఒకటికి రెండు సార్లు లెక్కించడంతో మృతుల సంఖ్య 261గా ప్రకటించాం. రైల్వేశాఖ మృతుల సంఖ్య 288గా పేర్కొనడంతో రాష్ట్రప్రభుత్వం ఇదే సంఖ్యను ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో ఒక్కో మృతదేహం రెండుసార్లు చొప్పన లెక్కించడంతో గణాంకాల్లో గందరగోళం చోటు చేసుకుందని వివరించారు. ఆస్పత్రులకు మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన మేరకు లెక్కించడంతో తాజా మృతుల సంఖ్య 275గా తేలిందన్నారు. జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా ఈ సంఖ్యని ధ్రువీకరించారని తెలిపారు. ఇక మృతుల సంఖ్యలో తేడాలు చోటు చేసుకునే అవకాశం లేదన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయి.. మృతదేహాలు, బాధితుల గుర్తింపు ముగిసినందున ఇకపై వ్యత్యాసం ఉండదని వివరించారు. అలాగే ఆదివారం సాయంత్రానికి 78 మృతదేహాలను బంధువులకు అప్పగించడం పూర్తయ్యిందని సీఎస్ వెల్లడించారు. మరో 10 మృతదేహాల గుర్తించామని, అప్పగింత ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ లెక్కన సమగ్రంగా 88 మృతదేహాలను గుర్తించగా.. 17 మృతదేహాలు బాలాసోర్‌కు, మిగిలిన వాటిని భువనేశ్వర్‌లోని మార్చరీకి తరలించినట్లు ప్రకటించారు. రాయగడ: బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి బీజేడీ జిల్లా శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని గాంధీపార్క్ వద్ద శనినవారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రి జగన్నాథ సరక, బీజేడీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ దాస్, ఎస్డీసీ చైర్పర్సన్ అనసూయ మాఝి తదితరులు పాల్గొన్నారను. ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. యువ, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధిత ప్రయాణీకుల పూర్తి వివారలను అందుబాటులోకి తెచ్చారు. పలు వెబ్సైట్లలో వీటిని అప్లోడ్ చేశారు. వివరాలతో బాధితుల ఫొటోల్ని జోడించడం విశేషం. ఈ వివరాల వినియోగం పట్ల ప్రత్యేక ఆంక్షలు విధించారు. srcodisha.nic.in, bmc. gov.in అలాగే osdma.org వెబ్సైట్లో ఫొటోలు, ప్రాథమిక వివరాలు పొందుపరిచారు. ఆంక్షలు.. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు బంధువర్గాలు గుర్తించేందుకు మాత్రమే పరిమితం. ప్రమాదంలో తీవ్రత దృష్ట్యా పోస్ట్ చేసిన చిత్రాలు కలవర పరుస్తున్నాయి. పిల్లలు ఈ చిత్రాలను చూడకుండా నివారించాలని ఆంక్షలు జారీ చేశారు. ఈ సమాచారం వినియోగంలో వీక్షకులు విచక్షణతో సద్వినియోగ పరచుకోవాలి. రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్(ఎస్ఆర్సి) ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీడియా/వ్యక్తిగతం/సంస్థలు మొదలైనవి వెబ్సైట్లో ఈ చిత్రాల ప్రచురణ తదితర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. బీఎంసీ హెల్ప్‌లైన్ నంబర్–1929 ఈ దిగువ ప్రాంతాల ప్రవేశ ద్వారాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ● కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి. ● భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బరముండా బస్‌స్టాండ్, విమానాశ్రయం. కంట్రోల్ రూమ్ భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్(బీఎంసీ) కార్యాలయం ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువర్గాలు ఆస్పత్రి లేదా మార్చురీకి వెళ్లేందుకు సహాయ సహకారాలు అందజేయడంలో ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. ఈ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. ప్రత్యేక రైలు.. 12841 అప్ షాలీమార్–చైన్నె కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో మధ్యాహ్నం 1 గంటకు భద్రక్ నుంచి చైన్నెకి ప్రత్యేక రైలు బయల్దేరింది. ఇది కటక్, భువనేశ్వర్ ఖుర్దారోడ్ మీదుగా నడుస్తుంది. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, బంధువులు ఈ రైలు సేవను పొందవచ్చని రైల్వేమంత్రి వైష్ణవ్ తెలిపారు. ఘటనా స్థలం పునరుద్ధరణ పనుల్లో 1000మంది సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, 7 పొక్లెయినర్లు, 2 యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, 4 రైల్వే, రోడ్ క్రేన్లు పునరుద్ధరణ పనుల్లో వినియోగిస్తున్నట్లు వివరించారు. భద్రంగా తరలింపు.. దుర్ఘటనలో దుర్మరణం పాలైన మృతదేహాలను గౌరవ ప్రదంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎస్ ప్రదీప్ జెనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి పలు చోట్ల అందుబాటులో ఉన్న శవాగారాలకు తరలించడంలో అందుబాటులో ఉన్న మాధ్యమాలను పరిశీలించిన మేరకు అంబులెన్సుల్లో తరలించడం శ్రేయోదాయకంగా భావిస్తున్నామన్నారు. ట్రక్కులు లేదా ప్రత్యేక రైలు ద్వారా తరలించేందుకు సైతం యోచిస్తున్నామని ప్రకటించారు. రైలులో రవాణాకు కేబినెట్ కార్యదర్శి అనుమతి లభించిందని, అయితే గౌరవప్రదంగా ఉండదని భావించి అంబులెన్సుల్లో తరలించామన్నారు. ఒక్కో అంబులెన్స్‌లో 2చొప్పున 85 వాహనాల్లో భువనేశ్వర్‌కు చేరవేశామని వివరించారు. రూ.3.22 కోట్ల పరిహారం చెల్లింపు బాధితులు, కుటుంబాలకు ముందుగా ప్రకటించిన పరిహారం వెంటనే అందేలా చర్యలు చేపడుతున్నామని రైల్వేమంత్రి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాల బాధితులకు రూ.50వేలు చొప్పున చెల్లింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రైల్వేశాఖ 285 కేసుల్లో రూ.3.22 కోట్లు చెల్లించింది. ఇందులో 11 మరణాలు, 50 తీవ్రమైన గాయాలు, 224 సాధారణ గాయాల బాధితులు ఉన్నారు. సొరో, ఖరగ్‌పూర్, బాలాసోర్, ఖంటపడా, భద్రక్, కటక్, భువనేశ్వర్ తదితర 7 ప్రాంతాల్లో చెల్లింపులకు ప్రత్యేక కేంద్రాలు పని చేస్తున్నాయి. మృతులకు రూ.5 లక్షలు: సీఎం దుర్ఘటనలో దుర్మరణం పాలైన రాష్ట్రానికి చెందిన వారి కుటుంబీకులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. వీటిని వీలయినంత త్వరలో బాధిత కుటుంబాలకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పంపిణీ చేసేందుకు యోచిస్తున్నారు. ప్రధానితో మాటామంతీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడి, తాజా పరిస్థితులు రైలు ప్రమాద బాధితుల చికిత్స గురించి వివరించారు. గాయపడిన ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు వివిధ ఆస్పత్రుల్లో అన్ని చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. వైద్యులు, వైద్య విద్యార్థులు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు తమవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు వైద్యులు, విద్యార్థులు, సామాన్యులు ముందుకు వస్తున్నారని ప్రధానికి వివరించారు. కొరాపుట్: బాలేశ్వర్ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. అందుకే.. అంత వేగంగా.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. 76బస్సుల్లో 3,800మంది.. దుర్ఘటన కారణంగా రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పూరీ, భువనేశ్వర్, కటక్ నుంచి కోల్‌కతాకు ఉచిత బస్సు సేవలను ప్రకటించారు. మొత్తం ఖర్చు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భరించనున్నారు. అలాగే బాలేశ్వర్ మార్గంలో సాధారణ రైలు సేవలను పునరుద్ధరించే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుంది. ప్రమాదంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సహాయం చేసేందుకు కటక్ నుంచి చండీఖోల్, భద్రక్, బాలాసోర్ వరకు ఉచిత బస్సు సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 76బస్సుల్లో సుమారు 3,800మంది ప్రభావిత ప్రయాణికులను కటక్ రైల్వేస్టేషన్ నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించారు. నేటి నుంచి సీఆర్ఎస్ విచారణ.. బహనాగా బజార్ స్టేషన్ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంపై రైల్వే భద్రత(ఆగ్నేయ సర్కిల్) కమిషనర్ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఖరగ్‌పూర్‌లోని సౌత్ ఇనిస్టిట్యూట్‌లో కమిషనర్ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు శాఖాపరమైన విచారణ జరుపుతారని రైల్వేవర్గాలు ఆదివారం తెలిపాయి. షాలీమార్–చైన్నె సెంట్రల్ కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్, ఎస్ఎంవీటీ బెంగళూర్–హౌరా(12864) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి సోమవారం ఉదయం 9 గంటలకు విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైలు వినియోగదారులు, స్థానిక ప్రజా, ఇతర సంస్థలు ప్రమాదానికి సంబంధించిన ఏదైనా సమాచారానికి సంబంధించి కమిషన్ ముందు ప్రవేశ పెట్టవచ్చని సూచించారు. ఈ దుర్ఘటనలో 275మంది ప్రయాణికులు మరణించగా, 1,175 మంది గాయపడ్డారు. ఎస్సీబీని సందర్శించిన కేంద్రమంత్రులు.. రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల చికిత్స, యోగక్షేమాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సీనియర్ వైద్యులు, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సరైన చికిత్స అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రతి ప్రాణాన్ని రక్షించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ గాయపడిన వారికి చికిత్స చేయడంలో సహాయ పడేందుకు ఢిల్లీలోని మూడు ప్రీమియర్ ఆస్పత్రుల నుంచి వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలు, మందులు తెప్పించామని తెలిపారు. 100మందికి పైగా రోగులకు క్రిటికల్ కేర్ అవసరమని గుర్తించామన్నారు. అంతకుముందు ఆయన భువనేశ్వర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల నిర్వహణ వ్యవస్థను పరిశీలించారు. -
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతి
భువనేశ్వర్: ప్రమాదానికి గురైన కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్‌రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో రైలులోని బోగీలు గాల్లో ఎగిరి పక్క ట్రాక్‌పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టడంతో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఈ ఘోర ప్రమాదంలో 275 మంది అసువులు బాసారు. మరో వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: జయవర్మ సిన్హా
ఢిల్లీ: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన కీలక విషయాలు వెల్లడించారు రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా. సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బహనాగ స్టేషన్ వద్ద ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదు. ఈ ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ గంటకు 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రెండు రైళ్లు నిర్ధేశిత వేగంతోనే వెళ్తున్నాయి. #WATCH | The goods train did not get derailed. Since the goods train was carrying iron ores, the maximum damage of the impact was on Coromandel Express. This is the reason for a huge number of deaths and injuries. The derailed bogies of Coromandel Express came on the down line,… pic.twitter.com/DnjheT8NSn — ANI (@ANI) June 4, 2023 కోరమండల్ రైలు లూప్ లైన్లోకి వెళ్లింది. బహనాగ స్టేషన్ వద్ద రెండు లూప్లైన్లు, రెండు మెయిన్ లైన్స్ ఉన్నాయి. లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ఐరన్ ఓర్ ఉంది. గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టింది. దీంతో, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, సిగ్నలింగ్ సమస్యల వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్.. పరిహారం వివరాలు ఇవే.. -
హమ్మయ్యా.. అందరూ సేఫ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం మహా విషాదంగా మారింది. దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఇంతటి ఘోర ప్రమాదానికి గురైన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా మన జిల్లాను దాటుకునే వెళ్తుంటాయి. ప్రమా దం జరిగిన వెంటనే మన జిల్లావాసులు ఏమైనా చిక్కుకున్నారా.. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారా.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ రేకెత్తాయి. ఘటన అనంతరం అంతా టీవీలకే అతుక్కుపోయా రు. స్వల్పంగా నష్టం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల నుంచే స్థానిక జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎవరైనా సంప్రదించేలా చర్యలు చేపట్టింది. ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల వివరాలన్నీ దాదాపుగా ఖరారుకావడంతో పాటు ఈ రెండు రైళ్లలోనూ హాల్ట్ స్టేషన్ల వారీగా ఎక్కిన వారు, దిగిన వారి పేర్లతో సహా వివరాలను ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు విడుదల చేశారు. శనివారం సాయంత్రానికి వెలువడ్డ వివరాల మేరకు జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. హాల్ట్ లేకపోవడంతో.. స్థానిక జిల్లా నుంచి అటు తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వివిధ వ్యాపార సంబంధాల క్రమంలో జిల్లా నుంచి ఎంతో మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే షాలీమార్ నుంచి చైన్నె వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు జిల్లా మొత్తం మీద హాల్ట్ లేదు. దీంతో జిల్లా వాసులు ఈ ఎక్స్‌ప్రెస్ ఎక్కే అవకాశమే లేదు. దీంతో చాలా పెద్ద ఊరటే అని చెప్పాలి. అయినప్పటికీ బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రం శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్డులో మధ్యాహ్నం 2 గంటలకు, పలాస స్టేషన్లలో మధ్యాహ్నం 3 గంటలకు ఆగి ఒడిశా మీదుగా వెళ్లింది. జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణికులు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో ఈ రైలెక్కారని అధికారులు వివరాలను ప్రకటించారు. పలాస స్టేషన్లో ఎక్కిన గురుమూర్తికి మృత్యువు వెంటాడింది. ఎల్లమ్మ అనే మహిళకు రెండు చేతులు విరిగిపోయాయి, మరో మహిళ గాయపడింది. ఆ రైలులో కేవలం చివరిలో ఉండే బోగీలు ప్రమాదానికి గురికావడంతో ముగ్గరు మాత్రమే ప్రమాదానికి గురయ్యారు. మరోవైపు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకలకు మన జిల్లావాసులు పెద్దగా ప్రాధాన్యమివ్వరు. గత ప్రయాణికుల రికార్డులను బట్టి చూస్తే..అర్ధరాత్రి వేళల్లో గమ్యం చేరుతున్న రైళ్లకు జిల్లా వాసులు పెద్దగా ప్రాధాన్యతిచ్చే సందర్భాలు తక్కువనే చెప్పాలి. దీంతో శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన ప్రయాణికులు కూడా మార్గమధ్యలో అంటే పలాస, బరంపురం తదితర స్టేషన్లలోనే దిగిఉంటారని తెలుస్తోంది. ఏమీ లేదనుకున్నా జిల్లాకి చెందిన వారిలో ఒక్కరికి మృత్యువు వెంటాడగా.... ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బయటపడి.. పోలాకి: మండలంలోని కొత్తరేవు గ్రామానికి చెందిన తయి అను(35) అనే మహిళ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుండగా ప్రమాదంలో గాయాలపాలైంది. రైల్వేసిబ్బంది ఆమెను బాలేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అను క్షేమంగానే వున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కుటుంబసభ్యులు సైతం అమెకు అందుబాటులోకి వచ్చినట్లు కొత్తరేవు వీఆర్వో శంకర్ తెలిపారు. లాభాం వాసులకు తప్పిన ప్రమాదం బూర్జ: మండలంలోని లాభాం గ్రామానికి చెందిన మెట్ట చంద్రమౌళి కొంతకాలంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో స్టేషన్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్య లీలావతి, ఇద్దరు పిల్లలు తేజ, సాల్విలతో కలిసి వేసవి సెలవులో నేపథ్యంలో హౌరా వెళ్లేందు కు ప్లాన్ చేశారు. వీరితో కలిసి మరికొందరు కూడా వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు టికెట్ సైతం రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో స్నేహితులు రాకపోవడం, శ్రీకాకుళం జిల్లాలో బంధువుల వివాహం ఉండటంతో చంద్రమౌళి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రేణిగుంటలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి శుక్రవారం ఆమదాలవలస రైల్వేస్టేషన్లో దిగిపోయారు. ఇంతలో రైలు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. పలు రైళ్ల రద్దు ఆమదాలవలస : ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం కారణంగా శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ మీదుగా నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రైలు నంబర్లు 22504, 2644, 12508 దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి ఈ రైళ్లలో ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు విజయనగరం రైల్వేస్టేషన్లో రైలు ఎక్కాలని సూచించారు. 12839, 12863, 12703 నంబర్ల గల రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రైళ్ల రద్దుతో ఆమ దాలవలస బస్టాపులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఘటనా స్థలికి జిల్లా అధికారులు శ్రీకాకుళం పాతబస్టాండ్/కాశీబుగ్గ: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహానగర్ వద్ద ప్రమాదానికి గురైన ప్రాంతానికి జిల్లా యంత్రాంగం చేరుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, మెడికల్ బృందాలకు, సహాయక బృందాలకు పలు సూచనలు జారీ చేశారు. ఇన్చార్జి కలెక్టర్‌తో పాటు సమగ్ర శిక్ష ఏపీసీ జయప్రకాష్, పోలీస్ ఇన్స్పెక్టర్ సీహెచ్ ఈశ్వర ప్రసాద్, తహసీల్దారు ఎస్.గణపతిరావు, డాక్టర్ సుధీర్, డాక్డర్ భగవాన్‌దాస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఆఫీసర్ ఎం.అనిల్ కుమార్, 13 మంది రెవెన్యూ బృందం వెళ్లింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 08942 240557, 08942– 286213 / 286245 నంబర్లను సంప్రదించి సమాచారం తెలియజేయవచ్చు. డీఆర్ఓ మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సంతబొమ్మాళి: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో సంతబొమ్మాళి మండలం మత్స్యలేశ జగన్నాథపురం గ్రామానికి చెందిన వలస మత్స్యకారుడు చోడిపిల్లి గురుమూర్తి (65) మృతి చెందారు. బాలాసోర్ సమీపంలో సముద్రంలో చేపల వేట సాగిస్తూ వలస మత్స్యకారుడిగా కుటుంబంతో జీవిస్తున్నాడు. వృద్ధాప్య పింఛన్ అందుకోవడానికి మే 29వ తేదీన స్వగ్రామమైన మత్స్యలేశ జగన్నాథపురం గ్రామానికి వచ్చాడు, ఒకటో తేదీన పింఛన్ అందుకుని బాలాసోర్ వెళ్లడానికి పలాస రైల్వే స్టేషన్లో శుక్రవారం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. కొద్ది గంటల్లో రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన కారాడ ఎల్లమ్మ బాలాసోర్ రైలు ప్రమాదంలో రెండు చేతులు విరిగిపోయి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె బతుకు తెరువు కోసం బాలాసోర్ వెళ్లడానికి పలాస రైల్వే స్టేషన్లో యశ్వంత్‌పూర్ రైలు ఎక్కింది. -
ఒడిశా రైలు ప్రమాదం: శ్రీకాకుళం వాసి మృతి
శ్రీకాకుళం: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తి మృతిచెందారు. మండలంలోని జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి(60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. అతనికి ఒడిసాలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జూట్ కార్మికుడిగా పనిచేసే గురుమూర్తి.. బాలాసోర్‌లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారి సంఖ్య 288కి చేరింది. మరొకవైపు వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్సు రైలును వెనుక నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పి, పక్కనున్న ట్రాక్‌పైకి దొర్లాయి. ఆ సమయంలో ఆ ట్రాక్ మీదుగా యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. అవి యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే గూడ్సును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడమే ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ హౌరాలోని షాలీమార్ స్టేషన్ నుంచి చెన్నై వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. అలాగే నాలుగు రాష్ట్రాల మీదుగా అంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల గుండా ప్రయాణిస్తుంది. కోరమండల్ తీరం అనేది భారత్‌కు ఆగ్నేయ తీరం. కోరమండల్ తీరం వెంబడి నడుస్తున్నందునే ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ పేరు వచ్చింది. ఈ రైలులో ప్రయాణించేవారు కోరమండల్ తీరంలోని సుందర దృశ్యాలను తిలకించవచ్చు. ఈ మార్గంలో దట్టమైన అడవులతో పాటు పలు చారిత్మాక, సాంస్కృతిక స్థలాలు కూడా దర్శనమిస్తాయి. కోరమండల్ తీరం సుమారు 22,800 చదరపు కిలోమీటర్ల మేరకు వ్యాప్తిచెందింది. ఇది సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉంది. కోరమండల్ తీరం వ్యవసాయానికి కూడా ఎంతో పేరుగాంచింది. ఈ ప్రాంతంలో వరితో పాటు వివిధ రకాల పప్పు ధాన్యాలు కూడా పండుతాయి. చెరకు పంట కూడా పండుతుంది. అలాగే చేపల పెంపకం, షిప్పింగ్ లాంటి పరిశ్రమలకు నెలవుగా ఉంది. -
రైలు ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురయ్యా: శ్రీకర్ బాబు
-
కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. -
హెలీప్యాడ్ లేకపోవడంతో పొలంలోనే దిగిన ప్రధాని హెలీకాఫ్టర్
కొరాపుట్: అత్యంత విషాదకర ఘటనలో దేశంలో ప్రముఖులు ప్రోటోకాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా పరామర్శలతో ముందుకు కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హెలీకాఫ్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హెలీపాడ్ తయారు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి పొలంలోనే ప్రధాని దిగారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోయినా చిన్న టెంట్లోనే సమీక్ష చేశారు. ఘటనపై రైల్వేమంత్రి అశ్వీని శ్రీవైష్ణవ్‌తో మాత్రమే ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి నవీన్ లేకపోవడం విశేషం. అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయ చర్యల సమయంగా ప్రకటించారు. -
ఆపద సమయం.. ఆదుకునే హృదయం
కొరాపుట్/రాయగడ/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, భద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమవంతు సాయం అందించేందుకు ముందుకు కదిలారు. భద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్పత్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వెయ్యి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు.. రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవాసమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, రాయగడకు చెందిన ఒడిశా సత్యసాయి సేవాసమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరకవలస సునీల్‌కుమార్ మహంతి వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70మంది సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తీసుకు వచ్చిన ట్రాక్టర్లపై క్షతగాత్రులు, మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంత లేకపోవడంతో తామే స్వపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందిరి మన్ననలు పొందారు. ఎమ్మెల్యే బాహిణీపతి గొప్ప మనసు.. ప్రమాదం జరిగిన వెంటనే జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గొప్ప మనసు చాటుకున్నారు. రాత్రి ఘటన జరిగిన సమయంలో భువనేశ్వర్ ఉన్న ఆయన.. సమాచారం తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలతో బాలేశ్వర్ వెళ్లారు. తనతో వచ్చిన కార్యకర్తలతో కలిసి క్షతగాత్రులకు సేవలు అందజేశారు. సమీప ఆస్పత్రులకు వెళ్లి రోగులను పరామర్శించారు. తన సొంత ఖర్చులతో అవసరమైన నిత్యవసరాలు, ఆహారం అందజేసి, అందరి మన్ననలు పొందారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు.. బాలేశ్వర్ సమీపంలోని బహనాగ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెన్న తెలియజేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు వెయ్యి మందికి పైగా గాయాలైన వారిని, సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందజేసేందుకు ఎస్సీబీ, బారిపద మెడికల్ కేంద్రాలకు తరలించామన్నారు. మృతిచెందిన వారికి సంబంధించిన బాధిత కుటుంబాలు వచ్చి సరైన ఆధారాలను చూపిస్తే మృతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొంతమంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించడం జరిగిందని వివరించారు. గుర్తించని మృతదేహాలను భద్రపరిచి, 72 గంటల వ్యవధిలో ఎటువంటి ఆచూకీ తెలియకపోతే నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. -
వేడెక్కిన రాజకీయం
కొరాపుట్/భువనేశ్వర్/రాయగడ: బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఊహించని సంకటంగా మారింది. రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ ఒడిశాకు చెందిన రాజ్యసభ ఎంపీ. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ఐఏఎస్ అధికారిగా ఒడిశా కేడర్‌లో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందా రు. ఎన్డీఏ–2 అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విన్ అనేక సంస్కరణ లు చేపట్టడంతో దేశవ్యాప్తంగా బీజేపికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. రైల్వేశాఖ మీద దశాబ్దాలు గా బెంగాల్, బీహార్ ఆధిపత్య జోరుకు కల్లెం పడింది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లక్ష్యంగా మారారు. ఈ క్రమంలో దుర్ఘటన జరడం, రైల్వేశాఖ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన వెంట రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రప్పించుకున్నారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతం బాలేశ్వర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి ప్రతాప్ షడంగి నేతృత్వం వహించడం కూడా విపక్షాలకు మరో అవకాశంగా మారింది. ఈరైలు బెంగాల్–తమిళనాడు మధ్య రాకపోకలు సాగిస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ తో సరిగ్గా పడదు. వారిద్దరూ కూడా పరిస్థితి గమనించి బీజేపీని ఇరుకున పెట్టేందుకు ముందుకు దిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి తన రాష్ట్రం నుంచి మంత్రుల బృందం పంపించడం, అప్పటికే పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయలు దేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రులకు వెంటనే నష్ట పరిహారం అందజేయ డం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా రంగంలో దిగి ఒడిశా బయలుదేరారు. మరోవైపు, విశ్రాంత రైల్వే ఉన్నతాధికారులు తమ ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. -
ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్..
నిన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ కుగ్రామం.. ఊహకందని విషాదంతో అపఖ్యాతి మూట గట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో రక్తాక్షరాలతో వందలాది మంది క్షతగాత్రుల హాహాకారాలకు వేదికై ంది. ఎటుచూసినా గుట్టులుగా పడి ఉన్న మృతదేహాలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తెగిపడిన అవయవాలు.. నిస్సహాయుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్ రైల్వేస్టేషన్.. భీతావహంగా కనిపించింది. – భువనేశ్వర్/కొరాపుట్/రాయగడ బహనాగా బజార్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలంలో భయానక దృశ్యాలు హృదయాన్ని కలచి వేశాయి. దుర్మరణం పాలైన వారి మృతదేహాలు ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్నాయి. బంధు, మిత్ర వర్గాలు కోల్పోయిన ఆత్మీయులను గుర్తించేందుకు వీలైన సదుపాయాలను కల్పించడంలో రైల్వేశాఖ పూర్తిగా విఫలమైన అమానుష దృశ్యాలు తారసపడ్డాయి. శుక్రవారం రాత్రి సుమారు 7గంటలకు ప్రమాదం సంభవించగా.. శనివారం సాయంత్రం వరకు ఘటనా స్థలంలో మృతదేహాలను సురక్షితంగా పదిల పరచలేకపోవడం దీనికి తార్కాణంగా చెప్పవచ్చు. మృతదేహం సకాలంలో పదిల పరచకుంటే బాధిత కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. గుర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధితులకు సకల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని మోదీ మొదలుకొని అన్ని స్థాయిల మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటించినా.. హామీలు నీటిమీద రాతలుగా తారసపడ్డాయి. ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు(హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఘటనా స్థలం బహనాగ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఈ సదుపాయం వాస్తవంగా తారస పడకపోవడం విచారకరం. స్వచ్ఛంద సేవలు అమూల్యం.. ఘటనా స్థలం పరిసరాల్లో స్థానికులు, సంస్థలు ఇతరేతర వర్గాలు బాధిత వర్గాలకు అందజేసిన వాస్తవ సహాయ సహకారాలు అమూల్యం. తాగునీరు, ఆహారం ఏర్పాట్లు నిరవధికంగా అందించి, ఆదుకున్నారు. బాలాసోర్, భద్రక్, కటక్ 3 జిల్లాల్లో పలు ఆస్పత్రుల్లో చేరిన బాధితులకు ఇదే తరహా సేవలతో ఆపత్కాలంలో బంధువులుగా ప్రత్యక్షమయ్యారు. ఆచూకీ లేని లగేజీ.. ఘటనా స్థలంలో ప్రయాణికుల బ్యాగులు ఇతరేతర లగేజీ చిందరవందరగా పడి ఉంది. బాధితుల ఆచూకీ తెలుసుకోవడంలో అయిన వారు వర్ణనాతీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దుర్మరణం పాలైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కటక్ ఎస్సీబీలో 193మంది భర్తీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో గాయపడిన 193మందిని కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరిలో 9మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఆస్పత్రి అత్యవసర అధికారి డాక్టర్ భువనానంద మహరణ తెలిపారు. చికిత్స కోసం భర్తీ అయిన వారిలో ముగ్గురు 18 ఏళ్ల లోపు యువకులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. దుర్ఘటన నేపథ్యంలో అత్యవసర వైద్య, చికిత్స సేవల కోసం ఆస్పత్రి నేత్ర చికిత్స వార్డు పైఅంతస్తులో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నా మిత్రుడు ఏమయ్యాడో? రైలు దుర్ఘటనలో అనేక విషాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రులలో కోలుకుంటున్న వారు నెమ్మదిగా వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రస్తుతం భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సునీల్‌రామ్.. బీహార్‌కు చెందిన తన మిత్రుడు మనూ మహతో(25)తో కలిసి హౌరాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కా రు. వీరిద్దరూ చైన్నె వెళ్లాల్సి ఉంది. కానీ ఈ దుర్ఘట న జరగడంతో విడిపోయారు. ప్రస్తుతం సునీల్ భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనతో కలిసి ప్రయాణం చేసి తప్పిపోయిన మిత్రుడు ఆచూకీ కోసం ఆందరినీ అభ్యర్థిస్తున్నాడు. – సునీల్‌రామ్, మోతుబరి, బీహార్ స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ కొనియాడారు. శనివారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని సలహాదారుడు 5టీ కార్తికేయ పాండ్యన్‌తో కలిసి సందర్శించారు. అప్పటికే చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలేశ్వర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లిన సీఎం క్షతగాత్రులను పరామర్శించారు. స్థానికులు సకాలంలో ఆదుకోకపోతే తాము బతికి ఉండేవాళ్లం కాదని పలువురు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్పత్రి రోదనలతో మిన్నంటడంతో సీఎం కాసేపు మౌనం వహించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఘటన ప్రాంతంలో స్థానికులు అందించిన సాయం మరువలేనిదని కొనియాడారు. దారి మళ్లిన రైళ్లు.. రాయగడ: బహనాగలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం కోస్తారైల్వే పలు రైళ్లను దారి మచినట్లు ప్రకటించింది. భువనేశ్వర్, బాలేశ్వర్ మీదుగా ప్రయాణించాల్సి పలు రైళ్లు.. విశాఖపట్నం నుంచి విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్, సంబల్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు. ► బెంగలూర్–అగర్తల హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(12503) టిట్లాఘడ్, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది. ► సిలిఘాట్–తంబారం(15630) రైలు రౌర్కెలా, టాట్లాఘడ్, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► పాట్నా–ఎర్నాకులం(62644) రైలు అంగూ ల్, విశాఖపట్నం మీదుగా చేరుకుంటుంది. ► దాఘా నుంచి విశాఖపట్నం(22873) చేరాల్సిన రైలు సంబల్పూర్, అనుగూల్ మీదుగా ప్రయానిస్తుంది. ► బెంగళూర్–గౌహతి(12509) ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం, టిట్లాఘడ్, టాటానగర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ► సికింద్రబాద్–హౌరా(12704) రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. ► గుణుపూర్–విశాఖపట్నం(08521) పాసింజర్ రైలు 3గంటలు ఆలస్యంగా విశాఖపట్నం చేరుకుంటుంది. సీఎం నవీన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్తో తమిళనాడుకు చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రమంత్రి ఎస్ఎస్ శివకుమార్‌తో కలిసి శనివారం రాత్రి భువనేశ్వర్‌లో నవీన్ నివాస్‌లో సంప్రదింపులు చేశారు. రైల్వే దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 5టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యన్ ప్రమాద వివరాలు ఉదయనిధికి వివరించారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, మంత్రులు, అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. చైన్నె నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి, క్షతగాత్రుల బంధువులు ఒడిశా చేరుకునే చర్యలు తీసుకున్నారు. ప్రమాద తీవ్రత పెరగడంతో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని నవీన్ వద్దకు పంపి.. సానుభూతి ప్రకగించారు. ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. రైలు ప్రమాదంలో గాయపడి భద్రక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ శనివారం పరామర్శించారు. వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలని సూచించారు. మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శ.. బహనగా రైలు ప్రమాద ఘటనలో గాయపడి బాలేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ప్రమీల మల్లిక్ పరామర్శించారు. క్షతగాత్రులకు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను సంబంధిత అధికారులు పంపిణీచేస్తున్నారు. ఇందులో భాగంగా సొరొ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.50 వేలు చొప్పున అందిస్తున్నారు. రాజకీయాలకు సమయం కాదు: మమతా బెనర్జీ అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయక చర్యల సమయంగా ప్రకటించారు. మృతులలో 60శాతం మంది బెంగాలీలు ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున్న పరిహారాన్ని బెంగాల్ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు. పరామర్శించిన కేంద్రమంత్రులు.. ఘటనా స్థలాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్, కేంద్ర విద్య, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. వీరివురూ ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఇరువురూ కలిసి భద్రక్, బాలాసోర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి, తెలుసుకున్నారు. సత్వర చికిత్స అందించాలని సూచించారు. వారితో పాటు కేంద్ర మాజీమంత్రి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి ఉన్నారు. -
రైళ్ల ప్రమాదం: కర్ణాటకకు చెందిన 110 మంది ప్రయాణికులు సురక్షితం
బనశంకరి: ఒడిశాలోని బాలసోర్ జిల్లా బహనాగ వద్ద శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర రైళ్ల ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 110 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంలో కర్ణాటక నుంచి వెళ్లిన రైలు సైతం దెబ్బతినగా అందులో కన్నడిగులు ఎవరూ చనిపోలేదని అదనపు డీజీపీ ఎన్.శశికుమార్ తెలిపారు. రాష్ట్రం నుంచి వెళ్లిన 23 బోగీలు కలిగిన రైల్లో మూడుబోగీలు మాత్రమే దెబ్బతినగా, ఇందులో కర్ణాటకకు చెందినవారు లేరని సమాచారం. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. రైల్వే అధికారులను సంప్రదిస్తున్నామని, నాలుగుచోట్ల హెల్ప్ లైన్లను ప్రారంభించామని, రాష్ట్ర ప్రయాణికులు మృతి చెందినట్లు, గాయపడినట్లు సమాచారం లేదన్నారు. కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఉన్న బోగీలకు ఎలాంటి ఇబ్బందిలేదని తెలిపారు. ఘటనాస్థలానికి రాష్ట్రం నుంచి పోలీసు అధికారులను పంపించామని తెలిపారు. నాలుగు హెల్ప్ లైన్లను ప్రారంభించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మరణాల గురించి అవాస్తవాలను ప్రచారం చేయరాదని కోరారు. మృతుల్లో ఎక్కువ మంది ఈశాన్య భారతానికి చెందిరవారున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదానికి గురైన హౌరా రైలు బెంగళూరులోని బైయప్పనహళ్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రమాదస్థలిలో అప్పుడే పడిపోయిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి నుంచి ఒడిశాకు వెళ్లే రైళ్లను నిలిపివేశామని శశికుమార్ తెలిపారు. ఇద్దరు మృతి? ఇప్పటివరకు రైలు దుర్ఘటనలో బెంగళూరు నగరానికి చెందిన ఇద్దరు మృతిచెందారని తెలిసింది. వీరు ఏ రైలులో ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. చిక్కమగళూరుకు చెందిన 110 మంది ప్రయాణికులు హౌరా రైలులో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. వీరు జార్ఖండ్ పర్యటనకు వెళుతున్నారు, అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది. హెల్ప్లైన్లు ప్రారంభం ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో బాధితుల బంధువులకు సమాచారం అందించడానికి రైల్వేశాఖ సహాయవాణి ప్రారంభించింది. బెంగళూరు–080–22356409, 09606005129, 8861203980 బంగారుపేటే–081 53255253, కుప్పం– 843 1403419, నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. బాధితులు సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. కాగా బెంగళూరు నుంచి ఒడిశా మీదుగా వెళ్లాల్సిన మూడు రైళ్లను రద్దుచేశారు. 12551 నంబరు ఎస్‌వీఎంబీ–కేవైక్యూ, 12864 నంబరు ఎస్‌వీఎంబీ– హెచ్డబ్ల్యూహెచ్ నంబరు 12253 ఎస్‌వీఎంబీ–బీజీపి రైలు సర్వీసులు బంద్ అయ్యాయి. ఒడిశా సర్కారుతో మాట్లాడాం: సీఎం శివాజీనగర: తాము ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉన్నామని, కర్ణాటక ప్రయాణికుల గురించి సమాచారం కోరామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సీఎం, ఇంత పెద్దస్థాయిలో ప్రమాదం ఏనాడు జరగలేదు. కర్ణాటక వారి గురించి ఇప్పటికీ సమాచారం అందలేదు. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్లారు, వారు ఎలా ఉన్నారనేది తెలియడం లేదు కేంద్ర రైల్వే శాఖ, ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. యశ్వంతపుర రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. కర్ణాటక వారికి ఏ విధమైన హాని జరిగిందనే విషయంపై సమాచారం తెలియదు అని చెప్పారు. రైలు ప్రమాద స్థలంలో కన్నడిగుల సహాయ కార్యక్రమాల కోసం మంత్రి సంతోష్ లాడ్‌ను అక్కడకు పంపించినట్లు తెలిపారు. -
అత్యంతఘోర రైలు ప్రమాదాలు..: మృత్యు శకటాలు
ఒడిశా రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కోరమాండల్, హౌరా రైళ్ల ప్రమాద దృశ్యాలు భారతీయుల హృదయాలను కలచివేస్తున్నాయి. మన దేశంలో 1981లో బిహార్‌లో భాగమతి నదిలో పడిపోయిన రైలు ప్రమాదం ఇప్పటి వరకు అతి పెద్దది. ఈ ప్రమాదంలో 800 మందికిపైగా మరణించారు. అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇప్పటికీ మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. మన దేశ చరిత్రలో... 1. పాసింజర్ రైలు రాష్ట్రం : బీహార్ తేదీ : జూన్ 6, 1981 మృతుల సంఖ్య : 800 దేశంలో అతి పెద్దదే కాకుండా ప్రపంచంలో రెండో అతి పెద్ద రైలు ప్రమాదం ఇది. 1981 సంవత్సరం జూన్ 6న బీహార్‌లోని మన్సి నుంచి సహస్రకు వెళుతున్న పాసింజర్ రైలు భాగమతి నది వంతెనపై నుంచి వెళుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా మరణించారు. భయానకమైన తుఫాన్ బీహార్‌ను వణికిస్తున్న సమయంలో రైలులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. నదిలో శవాలు కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య 2 వేల వరకు ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. నాలుగు పెళ్లి బృందాలు రైల్లో ఎక్కతే ఒక్కరి ప్రాణం కూడా మిగల్లేదు. 2 కాళింది–పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : ఆగస్టు 20, 1995 మృతుల సంఖ్య : 350కి పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రెండు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995 సంవత్సరం ఆగస్టు 20 తెల్లవారుజమాను 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్ నుంచి లక్నోకి వెళుతున్న ఈ రైలు నీల్గాయ్ సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో నిలిచింది. పూరీ నుంచి వస్తున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళిందిని ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. 3. అవధ్ ఎక్స్‌ప్రెస్–బ్రహ్మపుత్ర మెయిల్ రాష్ట్రం : పశ్చిమ బెంగాల్ తేదీ : ఆగస్టు 2, 1999 మృతుల సంఖ్య : 300 పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ఉండే గైసాల్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి వస్తున్న అస్సాం అవద్ ఎక్స్‌ప్రెస్, గైసాల్ రైల్వే స్టేషన్లో ఉన్న బ్రహ్మపుత్ర మెయిల్‌ని ఢీకొట్టడంతో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతో ఒకే లైన్లోకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది 4. ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ రాష్ట్రం : ఉత్తరప్రదేశ్ తేదీ : నవంబర్ 20, 2017 మృతుల సంఖ్య : 150 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బీహార్‌లో పట్నా వరకు వెళుతున్న ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 150 మందికిపైగా మరణించారు. 5. డెల్టా ప్యాసింజర్ రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ తేదీ : అక్టోబర్ 29, 2005 మృతుల సంఖ్య : 120 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద సంభవించిన భారీ వరదలకు పట్టాలు కొట్టుకుపోవడంతో డెల్టా పాసింజర్ పట్టాలు తప్పింది. రైలులో 15 బోగీలు నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 120 మంది వరకు జలసమాధి అయ్యారు. ప్రపంచ చరిత్రలో.. మాటలకందని మహా విషాదాలన్నో ప్రపంచ రైల్వే చరిత్రలో కన్నీటిని మిగిల్చాయి. 2004లో వచ్చిన సునామీ రాకాసి అలలు ఒక రైలునే ఏకంగా సముద్రంలో కలిపేయడం అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 1700 మంది జలసమాధి అయ్యారు. క్వీన్ ఆఫ్ ది సీ : శ్రీలంక ఏడాది: 2004 మృతులు: 1700 ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2004లో సునామీ వచ్చినప్పుడు శ్రీలంకలో జరిగింది. ది క్వీన్ ఆఫ్ సీ రైలు శ్రీలంక టెల్వాట్ట మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో సముద్రం అలలు ముంచేసి రైలు బోగీలను సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ మిషెల్: ఫ్రాన్స్ ఏడాది : 1917 మృతులు: 700 ఫ్రాన్స్ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం 1917లో జరిగింది. సెయింట్ మిషెల్–డి–మౌరినె ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఫ్రాన్స్‌లోని ఈ రైలు సెయింట్ మిషెల్ దగ్గర పట్టాలు తప్పింది. సియారా : రుమేనియా ఏడాది : 1917 మృతులు : 600 ఒకే ఏడాది ఫ్రాన్స్, రుమేనియాలో ఒకే విధంగా రైలు ప్రమాదాలు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతి వేగంగా వస్తున్న రుమేనియాలో రైలు సియారా రైల్వే స్టేషన్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పింది. అప్పుడు రైల్లో ఎక్కువగా సైనికులు, జర్మనీ శరణార్థులు ఉన్నారు. 800 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌడలాజర ట్రైన్ : మెక్సికో ఏడాది : 1915 మృతులు : 600 మెక్సికోలో 2015 జనవరిలో గౌడలాజర రైలు మితి మీరిన వేగంతో వెళుతుండగా పట్టాలు తప్పింది. కొలిమా నుంచి గౌడలాజర వెళుతుండగా రైలు బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన రైలు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 600 మంది మరణించారు. ఉఫా : రష్యా ఏడాది : 1989 మృతులు : 575 రష్యాలోని ఉఫా నుంచి ఆషా మధ్య రెండు పాసింజర్ రైళ్లు పక్క పక్క నుంచి వెళుతుండగా గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బోగీలకు అంటుకోవడంతో 575 మంది ప్రాణాలు కోల్పోయారు. -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
సిగ్నల్ లోపం వల్లే...!
సిగ్నల్ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. ‘‘కోరమండల్ మొదటి మెయిన్ లైన్లోంచి లూప్ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే... ► సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది. ► ఈ స్టేషన్ వద్ద రెండు మెయిన్ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్ లైన్లున్నాయి. ► పాసింజర్ హాల్ట్ స్టేషన్ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్ లైన్లకు తరలిస్తారు. ► శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్ ముందుగా స్టేషన్ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్లైన్కు మళ్లించారు. ► కోరమండల్ వెళ్లాల్సిన మెయిన్ లైన్‌పై అప్పటికి రెడ్ సిగ్నల్ ఉంది. స్టేషన్ సిబ్బంది 17ఏ స్విచ్ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్ లూప్లైన్లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది. ► గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి. ► అదే సమయంలో ఆ లైన్లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలపై కోరమండల్ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ► హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది. ► సూపర్ ఫాస్ట్ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. ► ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్‌లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
ఒడిశా రైలు దుర్ఘటన.. క్షతగాత్రులను తీసుకెళ్తున్న బస్సుకు ప్రమాదం
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటన గాయపడిన వారిని తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పశ్చిమబెంగాల్లోని మేదినీపూర్‌లో శనివారం వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు ఒడిశా రైలుప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి చిన్న గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో మేదినీపూర్ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అయితే రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి తమ ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ ఒడిశా నుంచి చెన్నై బయలుదేరిన ప్రత్యేక రైలు.. బాధితుల వివరాలివే.. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత..
సరిగ్గా 14 ఏళ్ల తర్వాత... కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. 14 ఏళ్ల క్రితం కూడా ఇదే ఓడిశాలోని జాజ్ పూర్ వద్ద ఈ రైలు మొదటిసారి పట్టాలు తప్పింది. ఆసక్తికరమైన మరో సంగతేంటంటే ఆరోజు కూడా శుక్రవారమే. సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోనే, శుక్రవారం రోజునే ప్రమాదానికి గురికావడం యాదృచ్చికం. 2009, ఫిబ్రవరి 13, శుక్రవారం రోజున... ఒడిశాలోని జాజ్ పూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా అత్యంత వేగంగా వెళ్తోన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరోజు ఆ ప్రమాదంలో స్లీపర్ క్లాస్ కు చెందిన 13 భోగీలు పట్టాలు తప్పగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు, 161 మంది గాయపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత అదే శుక్రవారం రోజున కోరమండల్ ఎక్స్ ప్రెస్ మళ్ళీ ప్రమాదానికి గురికావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. కానీ ఇప్పుడు బాలాసోర్‌లో జరిగిన ఈ ప్రమాదం అంతకంటే తీవ్రమైనది. రైలు ప్రమాదం తదనంతర పరిణామాలు మరింత విషాదకరంగా ఉన్నాయి.సంఘటనా స్థలంలో ఎటు చూసినా మృతదేహాల వద్ద రోదిస్తున్న బాధితులతో హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదాల్లో బాలాసోర్ సంఘటన కూడా ఒకటిగా మిగిలిపోతుంది. మృతుల సంఖ్య ఇప్పటికింకా ఒక కొలిక్కి రాలేదు. గాయపడినవారి సంఖ్య తగ్గుతుంటే.. మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: సహాయక చర్యల్లో అందరూ పాల్గొనండి -
ఒడిశా రైలు దుర్ఘటన .. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
రైల్వే నా బిడ్డలాంటిది.. రాజకీయాలకు ఇది సమయం కాదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని సూచించారు. రైల్వే తన బిడ్డలాంటిదని, దానిలోని లోటుపాట్లను సరిదిద్ధేందుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు రైల్వేశాఖ ప్రకటించిందని, బెంగాల్‌కు చెందిన వారికి తమ ప్రభుత్వం రూ 5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణచర్యలు పూర్తయ్యే వరకు రైల్వేకు, ఒడిశా ప్రభుత్వానికి పూర్తి సహాకారం అందిస్తామని వెల్లడించారు. అయితే కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో యాంటీ కొలిజిన్ డివైజ్(anti-collusion device) లేదని.. దీనిని అమర్చినట్లయితే.. ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. చదవండి: Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ ‘నేను చూసిన వాటిలో 21వ శతాబ్దపు అతిపెద్ద ఘటన ఇది. ఇలాంటి కేసుల్ని రైల్వే సేఫ్టీ కమిషన్‌కు అప్పగించాలి. వారు విచారణ జరిపి నివేదిక ఇస్తారు. నేను రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో యాంటీ కొలిజిన్ డివైజ్‌ను తీసుకొచ్చాను. ఇది ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో రైళ్లను నిర్ణిత దూరంలోనే ఆపేందుకు ఉపయోగపడుతుంది. కోరమాండల్ రైలులో అలాంటి పరికరం లేదు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా ఈ సంఘటనను నివారించవచ్చు’ అని పేర్కొన్నారు. కాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎదుటే మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వంలో చేరారు. 1999లో అటల్ బిహార్ వాజ్‌పేయ్ కేబినెట్లో మొదటిసారి రైల్వేమంత్రిగా పనిచేశారు. 2000లో తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో పశ్చిమబెంగాల్‌కు అనేక కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకొచ్చారు. 2009 మేలో యూపీఏ-2 ప్రభుత్వంలో మరోసారి రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు సీఎంగా ఎన్నికవ్వడంతో 2013లో కేంద్ర మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. కాగా శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో మూడు రైళ్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే. షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. కొన్ని బోగీలు గాల్లోకి లేచి పట్టాలపై పడ్డాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280 మందికి పైగా మృతి చెందగా.. 900 మంది గాయపడ్డారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే #WATCH | West Bengal CM Mamata Banerjee reaches Odisha's #Balasore where a collision between three trains left 261 dead pic.twitter.com/2q4KSNksum — ANI (@ANI) June 3, 2023 -
ఒడిశా రైలు ప్రమాదం: తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఇవే
సాక్షి, విజయవాడ: రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమండల్ రైలులో ఏపీకి చెందినవారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల ఫోటోలను సేకరిస్తున్నారు. డేటా ఆధారంగా రాష్టానికి చెందిన ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. ప్రమాద స్థలంలో వైద్య సేవలు, అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. ఒడిశాకు ఏపీ అధికారుల బృందం రైలు ప్రమాదంలో 179 మంతి తెలుగువారు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం అధికారుల బృందం ఓడిశా చేరుకుందన్నారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 కాంటాక్ట్‌లోకి వచ్చారని తెలిపారు. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో హెల్స్‌లైన్ ఏర్పాటు: 0866 2575833 చేశామని పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు. కోరమండల్ రైలులో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వీరిలో 23 మందిని కాంటాక్స్ చేశాం.. వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.. మిగిలిన 16 మందిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్ నెంబర్ల కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కోరమండల్ రైలులో తెలుగు ప్రయాణికుల వివరాలు ►కోరమండల్ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ►విశాఖపట్నం వరకు 110, రాజమండ్రి వరకు26 మంది ►తాడేపల్లి గూడెం ఒకరు, విజయవాడ వరకు 39 మంది ►ఏలూరులో దిగాల్సిన ఇద్దరు సురక్షితం. చంద్‌పాల్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీకర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యారు ►చీరాల నుంచి హౌరా వెళ్లాల్సిన ఆరుగురు ప్రయాణికులు సేఫ్. ఆరుగురిలో ఇద్దరిని సంప్రదించిన పోలీసులు ► తాడేపల్లిగూడెం రావాల్సిన ఇద్దరు ప్రయాణికులు సేఫ్. ఉమామహేశ్రరావు, రంజిత్ గాయాలతో బయటపడ్డారు. కాకినాడ వాసుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఒడిశాలోని బాలాసోర్ సమీపములో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -9490618506 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9494933233 తూర్పుగోదావరి జిల్లా... ►ఒడిశా బాలాసోర్‌లో ప్రమాదానికి గురైన కోరమండల్, యశ్వంతపూర్ రైళ్లలో రాజమండ్రికి రావాల్సిన ప్రయాణికులు.. ► మొత్తం ప్రయాణికులు 31 మంది ►వీరిలో రాజమండ్రి వాసులు-5 ►కాకినాడకు చెందినవారు-1 ►కొవ్వూరుకు చెందినవారు-1, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు-- 12, చత్తీస్‌గఢ్‌కు చెందిన వారు-2, కోల్‌కతా-1 ►వీరిలో 22 సురక్షితంగా ఉన్నారు. కృష్ణాజిల్లా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకొని ఉంటే, వారి సహాయార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జాషువా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్స్ ►పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -8332983792 ►పోలీస్ కంట్రోల్ రూమ్ -9491068906 ఎస్బీ ఎస్ఐ - 9618336684 -
ఒడిశా రైలు ప్రమాదంతో అప్రమత్తమైన నెల్లూరు యంత్రాంగం
-
ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తి చెప్పిన సంచలన విషయాలు
-
ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 270 పైగా మృత్యువాత పడగా.. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పెను ప్రమాదంపై భారత క్రికెటర్ విరాట్ కోహ్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని విరాట్ ట్వీట్ చేశాడు. చదవండి: WTC Final 2023: 50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీసీను భయపెడుతున్న చెత్త రికార్డు Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured. — Virat Kohli (@imVkohli) June 3, 2023 -
ఓవైపు మృత్యు ఘోష.. మరోవైపు మానవత్వం
భువనేశ్వర్: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద ఘటనతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పెను విషాదం అలుముకుంటున్న వేళ.. ఊహించని పరిణామాలు హ్యాట్సాఫ్ అనిపిస్తున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే పదుల సంఖ్యలో స్థానికులు స్వచ్ఛందంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఆ దగ్గర్లోనే నేనున్నా. స్థానికులం కొందరు గుంపుగా ఇక్కడికి వచ్చాం. సహాయక సిబ్బందితో చేయి కలిపాం. దాదాపు 300 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం అని గణేష్ అనే యువకుడు చెప్తున్నాడు. అదీగాక చీకట్లో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడగా.. గ్యాస్ టార్చ్‌లు, ఎలక్ట్రిక్ కట్టర్లతోసహాయక సిబ్బంది రాత్రంతా శ్రమించింది. వాళ్లకు స్థానికుల్లో కొందరు యువకులు సహయపడడం గమనార్హం. #WATCH | Odisha CM Naveen Patnaik says, "...extremely tragic train accident...I have to thank the local teams, local people & others who have worked overnight to save people from the wreckage...Railway safety should always be given the first preference...The people have been… pic.twitter.com/PtyESk4ZuB — ANI (@ANI) June 3, 2023 ఒడిషా ప్రజలు.. ప్రత్యేకించి యువత ఆస్పత్రులకు రక్తదానం కోసం క్యూ కడుతున్నాయి. ఎన్జీవోలు, పలువురు సామాజిక కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపునకు యువత అనూహ్యంగా స్పందించింది. భువనేశ్వర్‌తో పాటు బాలేశ్వర్, భద్రక్, మయూర్భంజ్, కటక్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కోసం రక్తం ఇవ్వడానికి బారులు తీరారు. రక్తదానానికి ముందుకు రావాలంటూ పిలుపుతో లొకేషన్లను షేర్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టేందుకు కృషి చేసిన స్థానిక సహాయక బృందాలతో పాటు స్థానికులకూ సీఎం నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. #BalasoreTrainAccident | "I was nearby when this accident happened, we rescued around 200-300 people," says Ganesh, a local #OdishaTrainAccident pic.twitter.com/d8PkJNEPRY — ANI (@ANI) June 3, 2023 మరోవైపు 200 ఆంబులెన్స్‌లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లో బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన స్థలం వద్ద మోహరించింది ఒడిశా ప్రభుత్వం. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా 1,200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కోల్‌కతాతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి ప్రత్యేక దళాలు అక్కడికి చేరుతున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తరపున హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారు. ఒక్కరోజు సంతాప దినం ప్రకటించారాయన. అలాగే ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపాలని నిర్ణయించారు. We're going there to enquire for details. Tamil Nadu CM has spoken to Odisha CM. I will update you after reaching the spot. Hospital facilities are also ready for Tamilians in Tamil Nadu who got affected by Train accident: Tamil Nadu Min Udhayanidhi Stalin#BalasoreTrainAccident pic.twitter.com/ppj781skQn — ANI (@ANI) June 3, 2023 మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రమాద ఘటనపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారాయన. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాన్ని బాలాసోర్‌కు పంపించాలని నిర్ణయించారు. -
కోరమాండల్ ప్రమాదం.. హెల్ప్‌లైన్ నెంబర్లు, రద్దైన రైళ్ల వివరాలు ఇవే
మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రద్దయిన రైళ్లు ఇవే... ఈ రూట్లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే సికింద్రాబాద్-షాలిమార్‌ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్(ఈస్ట్ కోస్ట్), హౌరా-సికింద్రాబాద్(ఫలక్నామా ఎక్స్‌ప్రెస్), హౌరా-తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. అలాగే.. 12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023) -
గూడ్స్ రైలును ఢీకొన్న హౌరా–చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్
ఊహించని ప్రమాదం ప్రయాణికుల ఉసురు తీసింది. పట్టాలపై పరుగులు తీయాల్సిన రైలు.. ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీని నుంచి తేరుకొనే లోపే ఘటనకు గురైన రైలునే ఎదురుగా వస్తున్న మరో ట్రైను బలంగా ఢీకొంది. పదుల సంఖ్యలో మృతులు, క్షతగాత్రుల హాహాకారాలతో సాయం సంధ్య వేళ.. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. బాధితులు పశి్చమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. భువనేశ్వర్: తూర్పుకోస్తా రైల్వే బాలాసోర్–బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్(12841) ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొంది. ఘటనలో 12 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితులంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగలూర్–హౌరా ఎస్ఎంవీటీ(12864) ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాల్లో దాదాపు 350మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 50మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేవర్గాల సమాచారం. వీరిలో పలువురు క్షతగాత్రులను సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 20మంది ఇంటర్న్, 24మంది ఇతర వైద్యులు బాలాసోర్ మెడికల్ కళాశాల, పరిసర ప్రాంతాల్లో ఆస్పత్రులు, బాలాసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రి నుంచి వైద్య, చికిత్స బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాలాసోర్ మెడికల్ కళాశాలలో 10మంది ప్రయాణికులకు చికిత్స చేస్తున్నారు. బాలాసోర్, సమీప పట్టణాల నుంచి 50కి పైగా అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. జాతీయ విపత్తు స్పందన దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదం నేపథ్యంలో సత్వర సమాచారం అందజేసేందుకు ఈస్టుకోస్టు రైల్వే పరిధిలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలానికి నేడు సీఎం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద స్థలంలో స్థితిగతులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం ఉదయం బాలాసోర్ జిల్లాలోని బహనాగా ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు స్థానిక స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలియజేశారు. ప్రధాని మోదీ సంతాపం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించబడుతుందని ప్రకటించారు. మృతులకు పరిహారం.. రైల్వేశాఖ మంత్రి అశి్వన్ వైష్ణవ్ రైలు ప్రమాదంలో బాధితులకు పరిహారం ప్రకటించారు. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు పరిహారంగా ప్రకటించారు. కంట్రోల్ రూమ్‌లు.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో అనేక కంపార్ట్మెంట్లు పట్టాలు తప్పి పల్టీ కొట్టాయి. కనీసం 5 కంపార్ట్మెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కంపార్ట్మెంట్లలో ప్రయాణిస్తున్న సుమారు 350మందికి పైగా ప్రయాణికులు ప్రభావితమయ్యారు. బాధితుల బంధు వర్గాలకు తాజా సమాచారం అందజేయానికి సత్వర సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాలాసోర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలో మరో కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రయాణికుల సమాచారం కోసం ప్రజలు బాలాసోర్ కంట్రోల్ రూమ్‌లో 67822 62286 లేదా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయంలో 0674–2534177 నంబర్‌ను సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ ఏర్పాటు విజయనగరం టౌన్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో బాధితుల సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్లను రైల్వేశాఖ ఏర్పాటుచేసింది. విజయనగరంలో 08922–221202, 221206 నంబర్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. శ్రీకాకుళంలో 08942–286213, 286245 నంబర్ల ద్వారా ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కోరమండల్ రైలు బరంపురం తరువాత నేరుగా విశాఖలో ఆగుతుంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఉండకపోవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. -
Odisha Train Tragedy: ప్రమాదానికి కారణమైన వారిని క్షమించం: ప్రధాని మోదీ
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బోగీల నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ సైతం పాల్గొంటోంది. భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్భంజ్, కటక్‌లోని ఆస్పత్రల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో బెంగాలీవాసులే ఎక్కువ మంది ఉన్నారనేది ఒక అంచనా. ఇక మృతుల్లో, గాయపడిన వాళ్లలో తెలుగువాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం: ప్రధాని మోదీ రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం.. ప్రమాదానికి కారకులపై చర్యలు తప్పవని ప్రధాని అన్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని, సహాయక చర్యలను ప్రధాని పరిశీలించారు. మోదీకి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాద వివరాలు వెల్లడించారు. అనంతరం రైలు ప్రమాదంలో గాయపడిన వారిని కటక్ ఆసుపత్రిలో ప్రధాని పరామర్శించారు. విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రత్యేక రైలు 🚆💥బాలాసోర్ నుంచి విశాఖ మీదుగా చెన్నైకు ప్రత్యేక రైలు బయలుదేరింది. 210 మందితో విశాఖకు స్టేషన్‌కు చేరుకుంది. విశాఖ రైల్వే స్టేషన్లో 10 ప్రయాణికులు దిగారు. ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ, భూకంపం వచ్చిందని అనుకున్నామని, ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడిపోయారని చెప్పారు. కళ్ళ ముందే చాలామంది చనిపోయారన్నారు. 🚆💥బాలాసోర్‌లోని ఫకీర్ ఆసుపత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. అక్కడ రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు 🚆💥ఒడిశా రైలు ప్రమాద స్థలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని, సహాయక చర్యలను పరిశీలించారు. మోదీకి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాద వివరాలు వెల్లడించారు. అనంతరం రైలు ప్రమాదంలో గాయపడిన వారిని కటక్ ఆసుపత్రిలో ప్రధాని పరామర్శించారు. Here's how exactly it unfolded #Train #TrainAccident #CoromandelExpress pic.twitter.com/YBwedC2Hs6 — Rajendra B. Aklekar (@rajtoday) June 3, 2023 🚆💥 రైలు ప్రమాదానికి సిగ్నల్స్ ఫెయిల్యూరే కారణమని ప్రాథమిక దర్యాప్తులో రైల్వే శాఖ తేల్చింది. మెయిన్‌లైన్‌పైనే కోరమండల్‌కు సిగ్నల్ ఉందని, లూప్లైన్లో ఆగిఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టినట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. వారంతా సురక్షితం.. 🚆💥 ఒడిశాలో రైళ్ల ప్రమాద ఘటన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సాక్షి మీడియాకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో హెల్ప్ లైన్(0866 2575833) ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని కోరారు. రైల్వే అధికారులిచ్చిన సమాచారం మేరకు రెండు రైళ్లలో 42 మంది విజయవాడలో దిగవలసిన ప్రయాణీకులను గుర్తించామని,కోరమాండల్ ట్రైన్ లో 39 మంది విజయవాడలో దిగాల్సి ఉందన్నారు. 39 మందిలో 23 మందిని కాంటాక్ట్ చేశాం ..వారంతా సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 16 మందిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. యశ్వంత్ పూర్ ట్రైన్ లో ముగ్గురు ప్రయాణీకులు విజయవాడలో దిగాల్సి ఉంది. వారి ఫోన్ నెంబర్లు కోసం ప్రయత్నిస్తున్నాం. కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఢిల్లీరావు తెలిపారు. 🚆💥 ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోదీ. #BalasoreTrainAccident | PM Narendra Modi is leaving for Odisha where he will review the situation in the wake of the train mishap: PMO pic.twitter.com/GtkLt4vcre — ANI (@ANI) June 3, 2023 🚆💥 రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని పరిశీలించనున్నారు. కటక్ ఆసుపత్రిలో క్షతగాత్రులను మోదీ పరామర్శించనున్నారు. 🚆💥 మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైలు ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చని మమత అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు. క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 🚆💥ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి ఒడిశా బాహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక ఈ ఘోర ప్రమాదంపై పలువురు ప్రపంచ అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ - వెన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్, యూఎస్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సాబా కోరోసి .. తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదం నుంచి ఉపశమనం కోసం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ఆయా దేశాలు ప్రకటించాయి కూడా. 🚆💥 రైలు ప్రమాద ఘటనా స్థలానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కటక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నట్లు సమాచారం. 🚆💥 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ ప్రజలే ఉన్నట్లు అంచనా. 🚆💥 బాలాసోర్ మృతుల సంఖ్య 238కి చేరిందని తెలుస్తోంది. 600 మందికి పైగా గాయాలు అయినట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రకటించారు. 238 people have died and more than 600 are injured, says Amitabh Sharma, Railways Spokesperson on #BalasoreTrainAccident — ANI (@ANI) June 3, 2023 🚆💥 ప్రమాదంపై కేంద్రం సమీక్ష ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన.. పెను విషాదానికి కారణమైంది. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో.. రైలు ప్రమాదం, సహాయక చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. 🚆💥 ఘోర ప్రమాదం తాలుకా ఏరియల్ దృశ్యాలు #WATCH | Aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/8rf5E6qbQV — ANI (@ANI) June 3, 2023 🚆💥 ఇరవై నిమిషాల్లోనే అంతా.. మూడు రైళ్లూ ఇరవై నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురయ్యాయని రైల్వే శాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. స్టేషన్ మాషస్టర్కు తెలిసేలోపు ఈ ప్రమాదాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే.. ఏ రైలు ముందు వచ్చింది.. ఏది దేనిని ఢీ కొట్టిందనే విషయంలో అయోమయం నెలకొంది. ఈ విషయంపై రైల్వే శాఖలోని అధికారులు తలో మాట చెబుతూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఆగి ఉన్న గూడ్స్ రైలుపైకి కోరమాండల్ దూసుకెళ్లినట్లు దృశ్యాలు, పక్క ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్‌ను బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ. గూడ్స్‌ను ఢీ కొట్టడంతోనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై ఉంటుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. #TrainAccident 7NDRF, 5 ODRAF &24Fire Service Units, local police, volunteers are working tirelessly in search and rescue. — Pradeep Jena IAS (@PradeepJenaIAS) June 3, 2023 🚆💥 ఒడిశా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకు తగ్గట్లే విశాఖ సరిహద్దుల్లోని ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయి. అలాగే.. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని ఓ బృందాన్ని ఘటనా స్థలానికి పంపేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. #BalasoreTrainAccident | The train accident in Odisha is unfortunate. We are talking to the railway officials and collecting the details of the victims from Andhra Pradesh. My deepest condolences to the bereaved families. I pray to God to give them peace of mind: Andhra Pradesh… pic.twitter.com/0O4sU7G7Os — ANI (@ANI) June 3, 2023 🚆💥 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన అక్కడి అధికారులతో ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. #WATCH | Odisha CM Naveen Patnaik takes stock of the situation at the accident site in Balasore #BalasoreTrainAccident pic.twitter.com/PajWdqzkP4 — ANI (@ANI) June 3, 2023 🚆💥 కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకోవడంతో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ సమయంలో ఆయన వెంట ఒడిశాకు చెందిన కేంద్ర శాఖమంత్రి (సహాయక) ప్రతాప్ చంద్ర సారంగి కూడా ఉన్నారు. ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ‘‘ రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం. ప్రస్తుతం సహాయక చర్యల మీదే ఫోకస్ పెట్టాం. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. దర్యాప్తునకు హైలెవల్ కమిటీని నియమించాం. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం’’ అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. #WATCH | Railways Minister Ashwini Vaishnaw takes stock of the situation at the accident site in Balasore where search and rescue operation is underway#BalasoreTrainAccident pic.twitter.com/CTOSoDiqAd — ANI (@ANI) June 3, 2023 🚆💥 ఇప్పటివరకు 233 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ పీకే జెనా ప్రటించారు. మరో 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల్లోనే మరో 600 నుంచి 700 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. 250 ఆంబులెన్స్‌లు, 65 బస్సులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారాయన. #WATCH | Train accident in Balasore, Odisha | "So far around 900 passengers have been injured & are being treated in various hospitals in Balasore, Mayurbhanj, Bhadrak, Jajpur & Cuttack districts. So far, 233 dead bodies have been recovered. The search & rescue operation is going… pic.twitter.com/dqRTzNde6a — ANI (@ANI) June 3, 2023 🚆💥 ఒక ప్యాసింజర్ రైలు.. అప్పటికే బోల్తా పడిన మరో రైలును ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. 🚆💥 ఒడిశా పెను ప్రమాదం.. ఈ మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద ప్రమాదం. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఒక గూడ్స్ రైలు.. ఈ మృత్యు ఘోషకు కారణం అయ్యాయి. 🚆💥 బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తు చేపట్టింది. #WATCH | "Our 6 teams are working here since last night. Our dog squad, and medical team are also engaged in the rescue operation," says Jacob Kispotta, Senior Commandant, NDRF#BalasoreTrainAccident pic.twitter.com/Sjuep3ZLeq — ANI (@ANI) June 3, 2023 #WATCH | Odisha | Search and rescue operation underway for #BalasoreTrainAccident that claimed 233 lives so far. As per State's Chief Secretary Pradeep Jena, one severely damaged compartment still remains and NDRF, ODRAF & Fire Service are working to cut through it to try to… pic.twitter.com/BQZSm0JQ4z — ANI (@ANI) June 3, 2023 ఇదీ చదవండి: ఒడిశా ప్రమాదానికి కారణం అదేనా? -
Train Accident: లూప్లైన్లోకి మళ్లించినందుకే?
సాక్షి, విశాఖపట్నం: ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే... రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. అసలు జరిగిందేమిటి? అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్ వద్ద.. మధ్యలో ఉన్న లూప్లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో స్టాప్ లేనప్పుడు రైలుకు మెయిన్ లైన్లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
మూడు రైళ్లు...మహా విషాదం!
భువనేశ్వర్/బాలాసోర్/హౌరా/సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దారుణంలో కనీసం వంద మందికిపైగా దుర్మరణం పాలైనట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 350 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వందలాది మంది బోగీల్లో చిక్కుబడి ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కన్పిస్తోంది. సహాయక చర్యలకు పెను చీకటి అడ్డంకిగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఏం జరిగింది...? రాత్రి ఏడింటి ప్రాంతంలో బెంగుళూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 ఎక్స్‌ప్రెస్ బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని తాలూకు బోగీలను ఢీకొని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పిందని, దాని బోగీలు మరో ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌పైకి దూసుకెళ్లాయని అంటున్నారు. కానీ వాస్తవానికి తొలుత ప్రమాదానికి గురైంది కోరమండల్ ఎక్స్ప్రెసేనన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం. దానికి పొరపాటున లూప్ లైన్లోకి సిగ్నల్ ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై నిలిచి ఉన్న గూడ్స్‌ను శరవేగంగా ఢీకొట్టిందన్నది వారు చెబుతున్నారు. ‘‘ప్రమాద ధాటికి కనీసం ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు బోగీలు గూడ్స్ బోగీల్లోకి దూసుకెళ్లాయి. దాంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి పరుగులు తీశారు. మరికొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఆ ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పింది’’ అని వారంటున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు సరైన సమాచరం ఇవ్వకపోవడం, దాంతో సైట్లు, వార్తా సంస్థలు ఒక్కోటీ ఒకోలా రిపోర్టు చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. హుటాహుటిన సహాయ చర్యలు ప్రమాద సమాచారం తెలియగా>నే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. చీకటి వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెప్పారు. 132 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. మిగతా వారిని సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా రంగంలోకి దిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదంపై పరిస్థితిని తాను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రాగచ్చిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించనున్నట్లు c. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రూ.10 లక్షల పరిహారం.. ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కు టుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. మాటలకందని విషాదం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ‘‘ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు దేవుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేలా అందరూ సహకరించాలని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు. రద్దయిన రైళ్లు ఇవే... 12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023). -
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, 207 మంది మృతి
ఒడిశా: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 బోగీలు బోల్తా పడ్డాయి. 207 మంది మృతి చెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద ఘటన చోటుచేసుకుంది. మరో ట్రాక్ మీద పడి ఉన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. సారో, గోపాల్పూర్, ఖంటపాడ పీహెచ్‌సిలకు బాధితులను తరలిస్తున్నారు. సహాయక సిబ్బంది బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనాస్థలిలో 50 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 044-2535 4771, 67822 62286 Terrible Train accident in odisha India, with multiple dead bodies can be seen #TrainAccident #CoromandelExpress #Odisha pic.twitter.com/NsJ04P3hlT — Rizwan 💙 (@Rizwan88826075) June 2, 2023 Coromandel Express derails near Bahanaga station in Odisha's Balasore after collision with a goods train Rescue operations continue @RailMinIndia #TrainAccident pic.twitter.com/9w24Qvpt9f — Nazaket Rather (@RatherNazaket) June 2, 2023 -
టికెట్ కొనకుంటే రైలులో నుంచి తోసేస్తారా?
భువనేశ్వర్: విశాఖపట్నానికి చెందిన పి.కృష్ణ 15 ఏళ్ల బాలుడు. ఒడిశాలోని కటక్ లో ఉంటోన్న బంధువుల దగ్గరికి వెళ్లేందుకు శనివారం ఒంటరిగా విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే కోరమండల్ ఎక్స్ ప్రెస్ (చెన్నై- హౌరా) రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. దాంతో పరుగున వెళ్లి ఒక బోగీలో ఎక్కేశాడు. దురదృష్టవశాత్తూ అది రిజర్వ్డ్ (ఎస్10) బోగీ.. పైగా తాను టికెట్ కూడా కొనలేదు. కొద్ది దూరం వెళ్లాక టీటీఈ ప్రత్యక్షమయ్యాడు. టికెట్ చూపించమని గదమాయిచాడు. భయంతో వణికిపోయిన బాలుడు.. టికెట్ కొనలేదని చెప్పాడు. అంతే.. టీటీఈకి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపంలో విచక్షణ కోల్పోయి.. వేగంగా కదులుతున్న రైలులో నుంచి కృష్ణను కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ బాలుడు ప్రస్తుతం భువనేశ్వర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రాక్ పక్కన గాయాలతో పడిఉన్న కృష్ణను జీఆర్ పీ పోలీసులు గుర్తించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఉంటోన్న బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, రైలులో నుంచి తోసేసిన టీటీఈపై శాఖా పరమైన విచారణ జరుపుతామని రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. టికెట్ లేని ప్రయాణం నేరమే. అందుకు చట్టప్రకారం జరిమానా విధించడమో లేదా రైల్వే పోలీసులకు అప్పగించడమో చేయాలి. కాని ఇలా కదులుతున్న రైలులో నుంచి తోసివేయడం ఘోరనేరం కాదంటారా! -
‘కోరమాండల్’ హాల్ట్ కొనసాగింపు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంలో హాల్టును కొనసాగిస్తూ గురువారం ఉత్తర్వులు వచ్చాయి. ట్రయల్ రన్ ప్రాతిపదికన ఈ రైలుకు తొలుత ఆరు నెలలపాటు హాల్టు ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆరు నెలల అనంతరం రైలు ఎక్కే, దిగే ప్రయాణీకులు, టికెట్లపై వచ్చే ఆదాయం తదితర కోణాలలో సమీక్షించుకొని రైలు హాల్టు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనేది నిర్ణయిస్తామని హాల్టు కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో గత నెల 28 నుంచి గూడెంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హాల్టును ఎత్తేశారు. ఈ రైలు ప్రారంభమయ్యాక అదనపు హాల్టు ఒక్క తాడేపల్లిగూడెంకు మాత్రమే ఇవ్వటం విశేషం. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు చొరవే దీనికి కారణం. హాల్టు రద్దు కాకుండా చూసుకోవాలని అప్పట్లో బాపిరాజు ఇక్కడి ప్రయాణీకులకు, వ్యాపార సంఘాలకు చెప్పారు. ఈ రైలులో ప్రయాణించటానికి 500 కిలోమీటర్ల కనీస పరిమితి ఉంది. ఇక్కడ నుంచి అటు చెన్నైకి, ఇటు బరంపురం ఆపై స్టేషన్లకు మాత్రమే టికెట్ ఇస్తా రు. ఈ రైలు నడిచే మార్గంలో 500 కిలో మీటర్ల కనీసం దూరం మినహాయింపును ఒక్క రాజమండ్రి స్టేషన్ కే ఇచ్చారు. అక్కడి నుంచి ఈ రైలు హాల్టున్న ఏ స్టేషన్‌కైనా టికెట్ ఇస్తారు. అలాంటి మినహాయింపునే గూడెంకు ఇవ్వాలని ప్రయాణికులు, పలు స్వ చ్ఛంద సంఘాలు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించాయి. వాటిని రై ల్వే శాఖ పరిగణనలోకి తీసుకోలేదు. ఆరు నెలలు కావటంతో కోరమాండల్ హాల్టును రద్దు చే స్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రయాణికులు నిరాశపడ్డారు. ఈ రైలు హాల్టును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గూడెం రైల్వే స్టేషన్లో హాల్టు ఇచ్చిన స్వర్ణజయంతి హాల్టును గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి. అన్ని రైళ్ల హాల్టుల గడవు పొడిగింపు తాడేపల్లిగూడెం స్టేషన్లో హాల్టు ఇచ్చిన నాందేడ్- విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్(18509-18510)కు సెప్టెంబరు 30 వరకు, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్ప్‌ప్రెస్ (12863-12864) హాల్టును ఆగస్టు 7 వరకు, అమరావతి ఎక్స్‌ప్రెస్ (18047-18048) హాల్టును ఆగస్టు 13 వరకు, గరీబ్ రథ్(12739-12740) హాల్టును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఈ రైళ్లకు గూడెంలో హాల్టు నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపైనే ఉంది. సంత్రాగచ్చి, కాకినాడ టౌన్-లోకమాన్యతిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్‌లకు గూడెంలో హాల్టులను రెగ్యులరైజ్ చేశారు,