కొరాపుట్/భువనేశ్వర్/రాయగడ: బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఊహించని సంకటంగా మారింది. రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ ఒడిశాకు చెందిన రాజ్యసభ ఎంపీ. రాజస్థాన్‌కు చెందిన ఆయన.. ఐఏఎస్ అధికారిగా ఒడిశా కేడర్‌లో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందా రు. ఎన్‌డీఏ–2 అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్విన్ అనేక సంస్కరణ లు చేపట్టడంతో దేశవ్యాప్తంగా బీజేపికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి.
రైల్వేశాఖ మీద దశాబ్దాలు గా బెంగాల్, బీహార్ ఆధిపత్య జోరుకు కల్లెం పడింది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లక్ష్యంగా మారారు. ఈ క్రమంలో దుర్ఘటన జరడం, రైల్వేశాఖ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన వెంట రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రప్పించుకున్నారు.
మరోవైపు ఘటన జరిగిన ప్రాంతం బాలేశ్వర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి ప్రతాప్ షడంగి నేతృత్వం వహించడం కూడా విపక్షాలకు మరో అవకాశంగా మారింది. ఈరైలు బెంగాల్–తమిళనాడు మధ్య రాకపోకలు సాగిస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ తో సరిగ్గా పడదు. వారిద్దరూ కూడా పరిస్థితి గమనించి బీజేపీని ఇరుకున పెట్టేందుకు ముందుకు దిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి తన రాష్ట్రం నుంచి మంత్రుల బృందం పంపించడం, అప్పటికే పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయలు దేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కేంద్రం క్షతగాత్రులకు వెంటనే నష్ట పరిహారం అందజేయ డం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోదీ సైతం స్వయంగా రంగంలో దిగి ఒడిశా బయలుదేరారు. మరోవైపు, విశ్రాంత రైల్వే ఉన్నతాధికారులు తమ ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment