
భువనేశ్వర్: ఒడిశాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసు బ్యారక్ లోపల మహిళా (యువతి) కానిస్టేబుల్ మృతి అనుమానాస్పదంగా మారింది. మృతురాలిని యశోద దాస్‌గా గుర్తించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. రెముణా పోలీస్ ఠాణా పరిధిలోని మందొర్‌పూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ యశోద బాలాసోర్ విధులు నిర్వహిస్తోంది. అయితే, బాలాసోర్ జిల్లా పోలీసు బ్యారక్ లోపలి ప్రాంగణంలో మంగళవారం యశోద వేలాడుతూ ఉండటాన్ని తోటి కానిస్టేబుళ్లు గమనించారు. వారు ఆమెను రక్షించడానికి సమయం వృధా చేయకుండా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు.
ఈ సందర్బంగా మృతురాలి సోదరుడు టుటు దాస్ మాట్లాడుతూ ...‘పోలీసులు ఆమె ఫోన్, చాట్ వివరాలను పరిశీలించాలని అభ్యర్థించాడు. తన సోదరితో సంబంధం ఉన్న వారి కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భోరుమన్నాడు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. బాలాసోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని, ప్రారంభ పరిశోధనల ప్రకారం ఈ విషాదం వెనుక వ్యక్తిగత కారణాన్ని సూచిస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు.