Odisha Train Accident Track Restoration Works Completed Within 51 Hours, Details Inside - Sakshi
Sakshi News home page

ఒడిశా రైలు ప్రమాదం.. 51 గంటల్లోనే ట్రాక్‌ రెడీ.. వందే భారత్‌ పరుగులు

Published Mon, Jun 5 2023 10:57 AM | Last Updated on Mon, Jun 5 2023 12:37 PM

Odisha Train Accident Track Restore Works Completed - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలుప్రమాదం స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ట్రాక్‌ల పునరుద్ధరణ పూర్తయ్యింది. కేవలం 51 గంటల్లోనే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఒడిశా- పశ్చిమబెంగాల్‌ రూట్‌లో యధావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాక్‌ పునరుద్ధరణ తర్వాత వందేభారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ చేపట్టారు. హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అనుమతించారు. రద్దు చేసిన అన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేస్తున్నారు.

కాగా దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను . 275గా రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement