
భువనేశ్వర్: నగరంలో మద్యం మత్తులో ఓ యువతి వీరంగం చేసింది. స్థానిక చంద్రశేఖర్ పూర్ ప్రాంతం మద్యం దుకాణం ముందు ఈ సన్నివేశం తారస పడింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రయత్నంలో పోలీసులు, ఆస్పత్రి సిబ్బందిని మద్యం మత్తులో ఉన్న మహిళ ముప్పు తిప్పలు పెట్టింది. పోలీసులు, ఇతరులపై దాడి చేసింది. మొత్తం మీద ఏదోలా ఆమెని సాధారణ స్థితికి తీసుకుని వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టారు. మత్తు వీడిన తర్వాత ఆమెను కస్టడీ నుంచి విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment