
న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.
2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.
అక్రమంగా రవాణా చేసి..
ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.
చివరి కోరికను అడగ్గా..
మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment