death sentence
-
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు
న్యూఢిల్లీ: నాలుగు ఏళ్ల చిన్నారి మృతి కేసులో భాగంగా ఓ భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష అమలైంది. గత నెల 15వ తేదీన శిక్షను ఖరారు చేసినప్పటికీ, ఆ విషయాన్ని తాజాగా విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టు తెలిపింది. యూపీకి చెందిన షెహజాదీ ఖాన్ అనే మహిళ.. గత కొంతకాలంగా అబుదాబిలో ఉంటోంది. 33 ఏళ్ల షెషజాదీ ఖాన్.. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద నాలుగేళ్ల క్రితం అబుదాబి వెళ్లింది.2022లో ఆగస్టులో తన కొడుకును చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. షెహజాదీ కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022, డిసెంబర్ 7 వ తేదీన వ్యాక్సినేషన్ కు తీసుకెళ్లింది నాలుగేళ్ల బుడతడికి. అయితే అది కాస్తా విషాదాంతమైంది. ఆ బాబు చనిపోవడంతో కేసు షెహజాదీ పడింది. తన కుమారుడు మరణానికి ఆమె కారణమంటూ కేసు ఫైల్ చేశాడు. ఇలా కొంతకాలం కోర్టులో చుట్టూ తిరగ్గా ఆమెకు మరణశిక్ష ఖరారైంది. ఆమెకు మరణశిక్ష ఖాయమైందన్న తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఆ క్రమంలోనే ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం ఆమె మరణశిక్ష అమలు కావడంతో ఆ విషయాన్ని విదేశాంగ శాఖ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.అక్రమంగా రవాణా చేసి.. ఆమె టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంది షెహజాదీ. అయితే ఆమెను అక్కడికి తీసుకెళ్లేముందు అది టూరిస్టు వీసా అనే సంగతిని ఫైజ్, నాడియా దంపతులు ఆమెకు చెప్పలేదు. అలా వెళ్లి ఇరుక్కుపోయింది ఆమె.ఆమెను అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే వారి నాలుగేళ్ల కొడుకును షెహజాదీ చూసుకుంటోంది. కానీ ఆ బాబు ఆమె చేతుల మీదుగానే చనిపోవడంతో మరొక కేసు షెహజాదీకి చుట్టుకుంది. యూఏఈ చట్టాలు కఠినంగా అమలు చేయడంతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది అక్కడ కోర్టు.చివరి కోరికను అడగ్గా..మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమటని అడగ్గా.. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలిపింది. తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది. అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు. -
కేరళ నర్సుకు మరణశిక్ష..భారత ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ:యెమెన్‌లో కేరళ నర్సు నిమిషప్రియ(36)కు మరణశిక్ష విధించిన అంశంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరకు చెందిన నర్సు నిమిష ప్రియ నిందితురాలిగా ఉన్నారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే నిమిష మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజులలోపు అమలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిమిష మరణశిక్ష రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన శ్రమంతా అధ్యక్షుడి నిర్ణయంతో వృథా అయింది.ఈ ఏడాది మొదట్లోనే యెమెన్ వెళ్లిన నిమిష తల్లి అప్పటినుంచి ఇదే పని మీద అక్కడే ఉంటున్నారు. ఇక నిమిషను శిక్ష నుంచి కాపాడే శక్తి ఆమె చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు, గిరిజన నేతల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే నిమిష మరణశిక్ష నుంచి బయటపడుతుంది.నిమిషప్రియ 2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో యెమెన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమెను ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు నిమిష అప్పీల్‌ను తిరస్కరించింది. తాజాగా అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.ఇదీ చదండి: క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవితఖైదు -
బాలికపై హత్యాచారం కేసులో... 61 రోజుల్లోనే మరణశిక్ష
కోల్‌కతా: ఈ ఏడాది అక్టోబర్‌లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి హత్యకు పాల్పడిన 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్‌లోని కోర్టు మరణ శిక్ష విధించింది. నేరం చోటుచేసుకున్న నాటి నుంచి కేవలం 61 రోజుల్లోనే విచారణ పూర్తవడం రికార్డు సృష్టించింది. దక్షిణ 24 పరగణాల జిల్లా జయ్‌నగర్‌లో అక్టోబర్ 4న ట్యూషన్ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్ సర్దార్ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చంపేశాడు. అప్పటికే ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. దాంతో బాలిక హత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంతో నిందితుడిని కేవలం రెండున్నర గంటల్లోనే అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బారుయిపూర్ పోక్సో కోర్టులో అక్టోబర్ 30న చార్జిషీట్ వేశారు. కోర్టు విచారణ నవంబర్ 4న మొదలై 26న పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులను విచారించారు. దోషి ముస్తాకిన్ సర్దార్కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్ సుబ్రతా చటర్జీ తీర్పు వెలువరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, న్యాయాధికారుల కృషిని ప్రశంసించారు. -
మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పధ్నాలుగు సంవత్సరాల క్రితంనాటి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి మారే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దోషికి హైకోర్టు విధించిన మరణశిక్షను నిలుపుదలచేసింది. 2010లో ఏడేళ్ల పిల్లాడిని కిడ్నాప్‌చేసి చంపిన కేసులో సుఖ్జీందర్ సింగ్‌కు పంజాబ్, హరియాణా హైకోర్టు ఈఏడాది ఆగస్ట్‌లో మరణశిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ దోషి తరఫున లాయర్ హర్వీందర్ సింగ్ మాన్ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన శిక్ష తగ్గింపు నివేదికను బెంచ్ పరీశీలించింది. హత్య జరిగిన కాలంలో 23ఏళ్ల వయసులో నిందితుడు విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆ రిపోర్ట్‌లో ఉంది. ‘ఎంతో మారిపోయిన ఇతను ఇకపై సమాజానికి ఏరకంగానూ హానికరం కాదు. 37 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇతనిలో సత్ప్రవర్తన వచ్చింది. ఏకంగా మరణశిక్ష విధించేముందు హైకోర్టు ఇతని మానసిక స్థితిపై తుది అవగాహనకు రాలేదు. రిహాబిటేషన్ సెంటర్‌కు పంపే అవకాశం ఇవ్వలేదు’ అని నివేదిక పేర్కొంది. ‘కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడిని చంపాడు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం పెల్లుబికిందన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కిడ్నాపర్‌కు పిల్లాడి తండ్రి డబ్బిచ్చినా చంపాడని హైకోర్టు మరణశిక్ష వేసింది’ అని నివేదిక వివరించింది. దీంతో కేసు విచారణను 16 వారాలు వాయిదావేసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ప్రొబేషన్ అధికారి నివేదిక ఇచ్చేలా చూడాలని పంజాబ్ సర్కార్‌ను ఆదేశించింది. అమృత్సర్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా గడిపిన సమయంలో ఇతని మానసిక పరిస్థితి, తోటి ఖైదీలతో ప్రవర్తన గురించి నివేదించాలని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దోషి మానసిక స్థితిని టెస్ట్‌లు చేసి ధృవీకరించాలని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ను కోర్టు కోరింది. -
ఉరిశిక్ష పడ్డ దోషి మానసిక స్థితి చెప్పండి..
సాక్షి, అమరావతి: నెల్లూరు నగరంలో జరిగిన తల్లీ, కుమార్తె జంట హత్యల కేసులో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న దోషి షేక్ ఇంతియాజ్ మానసిక పరిస్థితి, జైలులో అతని వ్యవహారశైలి, ప్రవర్తన, అతని కుటుంబ నేపథ్యం, సామాజిక–ఆర్థిక నేపథ్యం, నేర చరిత్ర, విద్య, ఆదాయ వనరులు తదితర వివరాలను సమర్పించాలని హైకోర్టు శుక్రవారం జిల్లా కలెక్టర్, డీఎస్పీ, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా ఈ కేసులో తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టంచేస్తూ విచారణను సెప్టెంబరు 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.డబ్బు కోసం హత్యలు..వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరస్పాండెంట్ ఎ. దినకర్‌రెడ్డి హరనాథపురంలో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంటీరియర్ పనుల బాధ్యతలను షేక్ ఇంతియాజ్‌కు అప్పగించారు. 2013, ఫిబ్రవరి 12న పనుల విషయంపై మాట్లాడే నిమిత్తం ఇంతియాజ్ దినకర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ ఇంటిని కొల్లగొట్టేందుకు ముందస్తు పథకంతో ఇంతియాజ్ తన వెంట మరో ఇద్దరిని తీసుకొచ్చాడు. ముగ్గురూ కలిసి దినకర్‌రెడ్డి సతీమణి శకుంతల, ఎంబీబీఎస్ చదువుతున్న వారి కుమార్తె భారవిలను వారి ఇంట్లోనే హతమార్చారు. అదే సమయంలో ఇంటికొచ్చిన దినకర్‌రెడ్డిపై ఇంతియాజ్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. బంగారు నగలు, డబ్బుతో పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.ఏడేళ్ల తరువాత ఉరిశిక్ష..సుదీర్ఘ విచారణ జరిపిన నెల్లూరు 8వ అదనపు సెషన్స్ కోర్టు కమ్ మహిళలపై అఘాయిత్యాల ప్రత్యేక న్యాయస్థానం 2020 ఫిబ్రవరి 6న ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెషన్స్ కోర్టు 2020లో హైకోర్టుకు లేఖ రాసింది. దీంతో ఈ లేఖను రెఫర్డ్ ట్రయల్‌గా పరిగణించిన హైకోర్టు దానికి నెంబర్ కేటాయించింది. ఇదే సమయంలో ఉరిశిక్షను సవాలు చేస్తూ ఇంతియాజ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు విచారణ జరుపుతూ వచ్చింది. తాజాగా.. శుక్రవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ తరఫు న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, 2022లో సుప్రీంకోర్టు మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉరిశిక్ష విధించే ముందు శిక్ష తీవ్రత తగ్గించేందుకు అవకాశమున్న పరిస్థితులను కింది కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పిందని చెబుతూ సుప్రీం’ తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. వీరారెడ్డి వాదనతో ఏకీభవించి ఇంతియాజ్ వయస్సు, మానసిక స్థితి, జైల్లో అతని ప్రవర్తన, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబరు 6కి వాయిదా వేసింది. -
15 మందికి మరణశిక్ష: కేరళ కోర్టు సంచలన తీర్పు
తిరువనంతపురం: కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. 2021లో కేరళ బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో ఆ రాష్ట్ర సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మావెలిక్కర జిల్లా అదనపు జడ్జి జస్టిస్ వీజీ శ్రీదేవి ఈ శిక్షను ఖరారు చేశారు. కేరళలో 2021 డిసెంబర్లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను పీఎఫ్ఐ కార్యకర్తలు హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్దారించింది. బాధితుని ఇంటి సభ్యుల ముందే కిరాతకంగా దాడి చేసినట్లు రుజవైంది. ఈ కేసులో 15 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను న్యాయస్థానం దోషులుగా తేల్చి, మరణశిక్షను ఖరారు చేసింది. ఆ రోజు ఏం జరిగిందంటే..? డిసెంబర్ 19, 2021.. ఆ రోజు ఆదివారం.. ఉదయం 6.15గంటలు కేరళ ఆరోగ్యశాఖలో పని చేసి రిటైరయిన వినోదిని అలప్పుళలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. ఒకరు రంజిత్ శ్రీనివాస్, రెండో వాడు అభిజిత్. రంజిత్ శ్రీనివాస్ మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. మనిషి సాఫ్ట్ అయినా.. మంచి ప్రసంగాలిస్తాడు, అందరితో కలివిడిగా ఉంటాడు. కేరళ బీజేపీలో OBC మోర్చాకు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. రంజిత్ శ్రీనివాస్‌కు పెళ్లయింది, ఇద్దరు అమ్మాయిలు. భార్య పేరు లిశా. పెద్దమ్మాయి భాగ్య, చిన్నమ్మాయి హృద్య. సాధారణంగా తెల్లవారుజామునే వాకింగ్‌కు వెళ్లడం రంజిత్‌కు అలవాటు. ఆదివారాలు మాత్రం ఇంటిపట్టునే ఉంటాడు. ఇక పిల్లల్లో భాగ్య ఉదయాన్నే ట్యూషన్‌కు వెళ్తుంది. మరోసారి డిసెంబర్ 19, ఆదివారం విషయానికొద్దాం. ఆ రోజు ఉదయం 6.15గంటల సమయం. ఆదివారం కాబట్టి ఇంట్లోనే ఉండిపోయాడు రంజిత్. వంట గదిలో వినోదిని, లిశా పని చేసుకుంటున్నారు. శబరి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొచ్చిన అభిజిత్ శనివారం రోజే రాత్రి ఇంటికి వచ్చి గాఢ నిద్రలో ఉన్నాడు. పెద్దమ్మాయి భాగ్య మాత్రం గేటు తీసి ట్యూషన్‌కు వెళ్లింది. ఇంకా గేటు కూడా మూయలేదు.. ఈ లోగా ఓ గుంపు దూసుకొచ్చింది. ఓ బలమైన సుత్తితో రంజిత్ తలపై దాడి చేశాడు ఓ దుండగుడు. తల దిమ్మతిరిగేలా కొట్టిన దెబ్బకు రంజిత్ కింద పడిపోగానే మిగతా వారు దాడికి దిగారు. వినోదిని, లిశా ఆపేందుకు ప్రయత్నించినా.. చంపుతామని కత్తులతో బెదిరించారు. ఈ లోగా అభిజిత్ వచ్చేసరికి మిగిలింది శూన్యం. అప్పటి రక్తపు మడుగులో ఉన్న రంజిత్ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు నిషేధిత పీఎఫ్ఐ కార్యకర్తలుగా గుర్తించారు. అత్యంత కిరాతకంగా హత్య ఈ కేసులో హంతకుల ఉద్దేశ్యం కేవలం చంపడం మాత్రమే కాదని పోలీసు అధికారులు నిర్దారించారు. తలపై సుత్తితో కొట్టినప్పుడే సగం ప్రాణం పోయింది. అయినా దుండగులు చాలా సేపు కత్తులతో దాడి చేస్తూనే ఉన్నారు. రంజిత్ రెండు కాళ్లను నరికేసినా వాళ్ల కోపం తగ్గలేదు. "మా అన్నను అంబులెన్స్‌లో ఎక్కించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది, పరిస్థితి అత్యంత భయానకంగా ఉండడం, రక్తపు మడుగు కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. మా పక్కింటి కుర్రాడు ఒకరు సాయం చేయడంతో అతి కష్టమ్మీద అంబులెన్స్‌లోకి చేర్చాం. అలప్పుళ మెడికల్ కాలేజీకి చేరేసరికి ఏం మిగలలేదు." - అభిజిత్, రంజిత్ సోదరుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, బెంగళూరు ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ -
ప్రపంచంలో తొలిసారి ఇలాంటి మరణశిక్ష
అతనో కాంట్రాక్ట్ కిల్లర్. ఓ వ్యక్తి ఇచ్చిన సుపారీతో.. అతని భార్యను హత్య చేశాడు. ఆపై సుపారీ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యవర్తి జీవితఖైదుతో జైల్లోనే చచ్చాడు. హత్యలో సహకరించిన వ్యక్తికి మరణశిక్ష అమలయ్యింది. కానీ, ఇతగాడికి మరణశిక్ష పడి దశాబ్దాలు గడుస్తున్నా.. అది అమలు కావడంలో జాప్యం అవుతూ వస్తోంది. చివరికి.. పోయినేడు ఏడాది శిక్షను అమలు చేయాలని చూస్తే అది విఫలం అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి.. ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌నుNitrogen Hypoxia Execution ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. అమెరికా సంయుక్తం రాష్ట్రం అలబామాలో ఈ శిక్ష గురువారం అమలు కాబోతోంది. ఘోరంగా.. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన కెన్నెత్ యూజీన్ స్మిత్(58) చివరికి నిరాశే ఎదురైంది. బుధవారం యూఎస్ సుప్రీం కోర్టు సైతం శిక్ష అమలు నిలుపుదలకు నిరాకరించింది. అలబామా కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది. కేసు ఏంటంటే.. 1988లో కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆయన ఆ విషయం భార్యకు తెలియడం.. ఆమె నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. అలాగే.. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆయన ఆమెను అడ్డు తొలగించుకునే పని చేశాడు. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున ఇస్తూ.. ఆ పని అప్పగించాడు బెల్లీ. ఇంట్లోనే మార్చి 18వ తేదీన ఆమెను దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు. ఇది దొపిడీ దొంగల పనేనని నమ్మించే యత్నం చేశారు. వారం తర్వాత.. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఛార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన కుటుంబ సభ్యుల ముందు ఆయన నిజం ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా.. 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్(ప్రాణాంతక) ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. కానీ, స్మిత్ విషయంలోనే ఆ శిక్ష జాప్యం అవుతూ వస్తోంది. కిందటి ఏడాది.. నవంబర్ 17వ తేదీన స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపేశారు అధికారులు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ కెయ్ ఇవెయ్ ఆదేశించారు. చివరకు.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది. ఐరాసతో సహా అభ్యంతరాలు.. అయితే.. ఈ తరహా మరణశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలి ప్రయత్నం విఫలమయ్యాక.. స్మిత్ శారీరక మానసిక స్థితి స్థితి ఘోరంగా దెబ్బతిందని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. స్మిత్ కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా శిక్షను అమలుచేయడానికి వీల్లేదని.. ఆయన అనుభవించిన శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని క్షమాభిక్ష కోరారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు సైతం ఇది అత్యంత మానవీయమైన చర్యగా పేర్కొంటూ వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం సైతం ఈ శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతూ వస్తోంది. అయితే ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం(నేర, అసాధారణ శిక్షల నుంచి రక్షణ) శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్ తరఫు లాయర్లు. ఈలోపు బుధవారం.. యూఎస్ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోగా.. మిగతా మెజార్టీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు. ఎలా ఉంటుందంటే.. నైట్రోజన్ హైపోక్సియా అంటే.. నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే.. ఆక్సిజన్ అందక నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో.. అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారన్నమాట. అదీ చట్టబద్ధంగా!. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం 12గం. నుంచి.. ఆ మరుసటి రోజు ఉదయం 6గం. లోపు ఈ శిక్షను అమలు చేస్తారు). ఇప్పటిదాకా అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే.. ఆ ఇంజెక్షన్లలో ఉపయోగించే మందు దొరకడం కష్టతరం అవుతుండడంతో(ఐరోపా దేశాలు వాటిని నిషేధించాయి).. ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలబామాతో పాటు మిసిసిప్పీ, ఓక్లహోమా నైట్రోజన్ గ్యాస్‌తో చంపడం లాంటి శిక్షలను పరిశీలనలోకి తెచ్చుకున్నాయి. :::సాక్షి వెబ్‌డెస్క్ -
నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట
దోహా: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల కుటుంబాలకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం అందినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. భారత అప్పీల్‌ను కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తూ ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడినట్లు వీరిపై ఖతార్ ఆరోపణలు మోపింది. చదవండి: కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 30న ఎనిమిది మంది అధికారులను అరెస్ట్ చేశారు. గత అక్టోబర్ నెలలో దేశ న్యాయస్థానం వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగరణించింది. ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి నవంబర్ 9న వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరణ శిక్ష పడిన వారిలో..కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేగ్లు ఉన్నారు. సంబంధిత వార్త: అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు -
ఆ 8 మందికి మరణశిక్షపై భారత్ అప్పీల్
న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అప్పీల్ చేశామని భారత్ గురువారం వెల్లడించింది. సంబంధిత అంశాలను ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వివరించారు. ‘ మంగళవారమే ఆ ఎనిమిది మందితో సంప్రతింపుల జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారులతో మనవాళ్లు మాట్లాడారు. వారికి న్యాయ, దౌత్యపరమైన పూర్తి రక్షణ కలి్పంచేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని బాగ్చీ అన్నారు. వీరికి మరణశిక్ష ఖరారుచేస్తూ ఖతర్ కోర్టు అక్టోబర్ 26వ తేదీన తీర్పు ఇవ్వగానే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. వారికి విముక్తి కలి్పంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన దౌత్య మార్గాలను అన్వేíÙస్తోంది. ‘అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వీరిపై ఖతర్ మరణశిక్ష మోపింది. ఈ తీర్పు వివరాలు అత్యంత గోప్యమైనవి. వీటిని కేవలం న్యాయబృందంతోనే భారత్ పంచుకుంటోంది. తదుపరి చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అప్పీల్ కూడా చేశాం. బాధితుల కుటుంబాలతో మాట్లాడాం. ఇటీవలే వారి కుటుంబసభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు’’ అని బాగ్చీ చెప్పారు. అసలు వీరు ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడ్డారనే వివరాలను ఇంతవరకు ఖతర్ న్యాయస్థానం బహిరంగంగా వెల్లడించలేదు. కేసులోని సున్నితత్వం దృష్ట్యా ఈ అంశంపై భారత్ తరఫున ఉన్నతాధికారులూ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ‘కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఎవరూ ఈ అంశాన్ని సంచలనాల కోసం లేనిపోని రాద్దాంతాలు, వక్రభాష్యాలతో నింపేయకండి’ అని బాగ్చీ విజ్ఞప్తిచేశారు. మార్చి 25వ తేదీన మాజీ అధికారులపై కేసు నమోదుచేసి ఖతార్ చట్టాల కింద అరెస్ట్‌చేశారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. దళ సభ్యులకు ఇన్స్ట్రక్టర్లుగా పనిచేశారని మాజీ సైన్యాధికారులు గుర్తుచేసుకున్నారు. వీరి అరెస్ట్ తర్వాత మే నెలలో దోహాలోని అల్ దహ్రా గ్లోబల్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. అందులో పనిచేసే సిబ్బందిని, ముఖ్యంగా భారతీయులను స్వదేశానికి పంపించేసింది. -
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు: జైశంకర్
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి తెలియజేశా. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో వారి కుటుంబాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా జైశంకర్ పేర్కొన్నారు. Met this morning with the families of the 8 Indians detained in Qatar. Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families. Underlined that Government will continue to make all efforts to secure their release.… — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023 కాగా గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిత్రం జరిగిన బాలుడి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మందసాగర్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది, కాగా 2020 అక్టోబర్18న మహబూబాబాద్‌కు చెందిన కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డిని మందసాగర్ డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కేసముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అదే రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇది జరిగిన మూడురోజుల అనంతరం తాళ్లపూసపల్లి సమీపంలో ఉన్న ధానమయ్య గుట్టలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ ఘటన ఉదంతం కలకలం రేపింది. అప్పటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి శనిగపురంకు చెందిన పంక్చర్ షాప్ నిర్వహుకుడు మంద సాగర్ నిందితుడిగా తేల్చారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. మళ్లీ దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్‌ను చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన సాగర్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.. మూడేళ్లుగా సాగిన విచారణలో తాజాగా ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. చదవండి: హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఇద్దరు మృతి -
నొప్పి లేకుండా మరణ శిక్షలేమున్నాయ్?
ఢిల్లీ: మరణశిక్షపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి లేకుండా శిక్షించే విధానాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరడుగట్టిన నేరస్తులైనప్పటికీ.. మరణం గౌరవప్రదంగా ఉండాలని, ఇది ఎంతో ముఖ్యమైన అంశమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉరి శిక్ష విధానం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో దేశంలోని పలు లా యూనివర్సిటీలను భాగం చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తొలుత వచ్చేవారానికి ఈ అంశంపై పరిశీలనను వాయిదా వేసింది కోర్టు. అయితే.. అటార్నీ జనరల్ విజ్ఞప్తితో మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
ఆ ప్రేమోన్మాది మరణశిక్ష టీవీల్లో లైవ్ ప్రసారం!
ప్రేమ, పెళ్లికి నిరాకరించడంతో ప్రేమోన్మాదులు.. పాశవికంగా దాడులకు పాల్పడుతున్నట్లు ఘటనలు చూస్తుంటాం. కానీ, చట్ట ప్రకారం కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. యువతుల జీవితాలను చిదిమేయాలని ప్రయత్నించే వాళ్లకు గుణపాఠం చెప్పాలని, భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్ కోర్టు ఒకటి నిర్ణయించుకుంది. ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్ అడెల్.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాడనే కోపంలోనే అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూన్ నెలలోనే ఈ ఘటన జరగ్గా. జూన్ 28వ తేదీన అతనికి మరణశిక్ష విధించింది మాన్సోరా కోర్టు. అయితే.. అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది. పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.. కనీసం అతని ఉరి ఏర్పాట్లనైనా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ లేఖలో కోర్టు పేర్కొంది. ఆ దుర్మార్గుడు ఆమెను అతికిరాతకంగా చంపాడు. అందుకే దేశం మొత్తం అతని శిక్షను చూడాలి. ఈ శిక్ష ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవాళ్లు వణికిపోవాలి. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. చట్టసభ అందుకు అనుమతించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. తీర్పు కిందటి నెలనే ఇచ్చినప్పటికీ.. జులై 24న తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ అలం చేతిలో ఉంది. అయితే న్యాయపరంగా పోరాడేందుకు అడెల్కు ఇంకా అవకాశం ఉంది. రెండు నెలల పాటు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హక్కు ఉందని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఇప్పటికే శిక్ష విధించి నెలరోజులు పూర్తైంది. ఇంకా నెలరోజులే మిగిలి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయెరా అష్రాఫ్ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఘోరాతి ఘోరంగా చంపిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో.. ఇలాగే ఓ శిక్షను ప్రజలు చూసేలా ప్రసారం చేశారు అక్క్డడి అధికారులు. 1998లో రాజధాని కైరోలో ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితులను.. ఉరి తీసే కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు అక్కడి టీవీ ఛానెళ్లలో. The killing of Egyptian student Nayera Ashraf has been met with condemnation and ignited a debate about violence against women. The suspect is a man who reportedly harassed her for months before the killing. Read more: https://t.co/nLFZHE2vqC pic.twitter.com/RXraAtTpH0 — Al Jazeera English (@AJEnglish) June 23, 2022 -
కిమ్ దుశ్చర్య.. ఆ వెబ్ సిరీస్ చూసినందుకు మరణశిక్ష!
ఎవరు ఎలా పోయినా సరే.. దేశ కఠిన చట్టాలను తన పౌరులు గౌరవించాలన్నది ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశం. అదే దాయాది దక్షిణ కొరియా విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే కర్కశంగా వ్యవహరిస్తుంటాడు. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి జరగ్గా.. దుశ్చర్యకు పాల్పడ్డాడు కిమ్. దక్షిణ కొరియా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ను చూశాడనే నెపంతో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించాడు కిమ్ జోంగ్ ఉన్. ఆ వెంటనే శిక్షను అమలు చేస్తూ ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపింది సైన్యం. చైనా సర్వర్ల నుంచి సిరీస్‌ను డౌన్లోడ్ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్ పెన్‌డ్రైవ్‌లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్ముకున్నాడని ప్రభుత్వం ఆరోపించింది. ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు. సిరీస్ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించాడు కిమ్. నార్త్ కొరియా చట్టాల ప్రకారం.. వీళ్లంతా బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో శిక్షాకాలం పాటు కూలీ పనులు చేయాల్సి ఉంటుంది. ‘‘స్క్విడ్ గేమ్ అనేది వినోదం పంచేది కాదు. పెట్టుబడిదారి అయిన దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ప్రతిబింబించే షో. డబ్బు కోసం మనిషి ఉవ్విళ్లూరడం, ప్రాణాల్ని పణంగా పెట్టడం.. ఉత్తర కొరియా సంప్రదాయానికి విరుద్ధమైన అంశాలు. అందుకే మొగ్గలోనే ఈ వ్యవహారాన్ని తుంచేస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం తరపు నుంచి ఓ స్టేట్మెంట్ స్థానికంగా ఓ పత్రికలోనూ ప్రచురితమైంది. ఉత్తర కొరియాలో క్యాపిటలిస్ట్ దేశాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్ని వీక్షించినా, వాటి కాపీలు కలిగి ఉన్నా, ఇతరులకు పంపిణీ చేసినా నార్త్ కొరియాలో కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్‌లో అమెరికా, దక్షిణ కొరియాను ప్రముఖంగా చేర్చింది కిమ్ ప్రభుత్వం. అలా చేస్తే తమ దేశ గౌరవాన్ని దిగజార్చినట్లు, కల్చర్‌ను కించపరిచినట్లు భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. చదవండి: కిమ్ కొత్త ఎత్తు! కల్చరల్ వార్ ఎందుకంటే.. -
2013 పట్నా పేలుళ్ల కేసు: నలుగురికి ఉరిశిక్ష
న్యూఢిల్లీ: 2013 పట్నా పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోషులకు మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పేలుళ్ల కేసులో మొత్తం 9 మందిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2013 అక్టోబర్ 13న మోదీ ర్యాలీ లక్ష్యంగా వరుస పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
పరువు హత్య కేసులో సంచలన తీర్పు: ఉరే సరి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలు అంగీకరిచకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అహం దెబ్బతినడంతో ఇరు కుటుంబాల వారూ కూడబలుక్కుని ఆ జంటను అతి కిరాతకంగా హతమార్చారు. నేరం రుజువుకావడంతో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ కేసు వివరాలు కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన స్వామికన్ను కుమారుడు మురుగేశన్ (25) బీఈ కెమికల్ ఇంజినీరింగ్ చేశాడు. దళితుడైన మురుగేశన్ అదే ప్రాంతంలో మరో సామాజిక వర్గానికి చెందిన దురైస్వామి కుమార్తె కన్నగి (22) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో 2003 మే 5వ తేదీ కడలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరిళ్లలో వారు వేర్వేరుగా గడిపేవారు. ఓ దశలో ఇరువురు ఇంటి నుంచి పారిపోయారు. మురుగేశన్ తన భార్య కన్నగిని విళుపురం జిల్లాలోని బంధువుల ఇంట్లో ఉంచి కడలూరు జిల్లాల్లోని తన బంధువుల ఇంటిలో ఉండేవాడు. మురుగేశన్ బాబాయ్ అయ్యాస్వామి సహకారంతో కన్నగి తల్లిదండ్రులు 2003 జూలై 8వ తేదీ ఇద్దరినీ ఇంటికి తెచ్చుకున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఆ తరువాత మరికొందరితో కలిసి మురుగేశన్, కన్నగిలను కుప్పందత్తం గ్రామ శ్మశానికి తీసుకెళ్లి ముక్కు, చెవుల ద్వారా విషాన్ని ప్రవేశపెట్టి హతమార్చారు. వారిద్దరి శవాలను అదే శ్మశానంలో తగులబెట్టారు. మురుగేశన్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దారుణాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో మార్మోగిపోవడంతో కేసు నమోదు చేసి ఇరుపక్షాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. జాతివిధ్వేషాలతో జరిగిన హత్యలు కావడంతో పలువురి డిమాండ్ మేరకు 2004లో ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి విరుదాచలం ఇన్స్పెక్టర్ చెల్లముత్తు, సబ్ ఇన్స్పెక్టర్ తమిళ్‌మారన్ సహా 15 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీటు దాఖలు చేసింది. మొత్తం 81 మంది సాక్షులను విచారించగా వీరిలో సెల్వరాజ్ అనే సాక్షి ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్‌రాజా ఈ కేసుపై శుక్రవారం తీర్పు చెప్పారు. కన్నగి అన్న మరుదుపాండికి ఉరిశిక్ష, తండ్రి దురైస్వామి, ఇరుపక్షాల బంధువులు రంగస్వామి, కందవేలు, జ్యోతి, వెంకటేశన్, మణి, ధనవేల్, అంజాపులి, రామదాస్, చిన్నదురై, తమిళ్‌మారన్, అప్పటి సీఐ చెల్లముత్తు, (ప్రస్తుతం విశ్రాంత డీఎస్పీ), ఎస్ఐ తమిళ్‌మారన్ (సీఐగా సస్పెన్షన్) సహా మొత్తం 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరిలో కన్నగి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 15 మంది నిందితుల్లో మురుగేశన్ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టారు. -
తల్లిని వేయించుకు తిన్న వ్యక్తికి మరణశిక్ష
ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోకల్ కోర్టు ఓ 35 ఏళ్ల వ్యక్తికి మరణ శిక్ష విధించింది. సునీల్ రామ కుచ్కోరవిను తల్లిని హత్య చేసి వేయించుకు తిన్న నేరానికి చనిపోయే వరకు ఉరి తీయాలని కొల్హాపూర్ అదనపు సెషన్స్ జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు ధృవీకరించింది. వివరాల్లోకి వెళితే.. సునీల్ రామ కుచ్కోరవి 2017 ఆగస్టులో తన తల్లిని చంపాడు. హత్య జరిగినప్పుడు ఆ పరిసరాల్లోని ఓ పిల్లవాడు రక్తపు మరకలతో ఉన్న మృతదేహాన్ని చూశాడు. దీంతో అతడు భయపడి పెద్దగా ఏడవటంతో సమీపంలో ఉన్నవారు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, అక్కడికి చేరుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ భూసాహెబ్ మాల్గుండేకు ద్రిగ్భాంతికర విషయాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం గుండె ఓ పళ్ళెంలో ఉండగా.. మరికొన్ని అవయవాలు పొయ్యి మీద ఆయిల్ పెనంలో ఉన్నాయి. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై న్యామమూర్తి స్పందిస్తూ.. ‘‘ఇది ఓ హత్య మాత్రమే కాదు.. కరుడుగట్టిన క్రూరత్వం.. మద్యానికి బానిసై తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. నిందితుడిలో కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. ఆమె అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేం. నిందితుడిని మరణించే వరకు ఉరి తీయాలి’’ అని జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ తీర్పునిచ్చారు. -
లైంగిక దాడి: యువకుడికి ఉరిశిక్ష.. మెలికపెట్టి మరో తీర్పు
సాక్షి, చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిసినా, జీవితాంతం అతడు జైల్లో ఉండే రీతిలో మెలిక పెట్టి తీర్పు ఇచ్చింది. కోయంబత్తూరు కుడిమలూరులో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక అదృశ్యం కావడం రెండేళ్ల క్రితం కలకలం రేపింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడ అదృశ్యమైందో అక్కడే ఆ బాలిక మృత దేహంగా తేలింది. ఆ బాలికపై లైంగికదాడి జరిగినట్టు విచారణలో తేలింది. ఈ కిరాతకానికి ఆ ఇంటి పక్కనే ఉన్న సంతోష్‌కుమార్(34) అనే యువకుడు పాల్పడినట్టు తేలింది. అతడ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కోయంబత్తూరు కోర్టు తొలుత కేసును విచారించి తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరి శిక్ష విధించడమే కాకుండా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ధ్రువీకరణకు హైకోర్టుకు కింది కోర్టు నుంచి పంపించారు. అదే సమయంలో సంతోష్‌కుమార్ అప్పీలు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. హైకోర్టు న్యాయమూర్తులు పీఎన్ ప్రకాష్, శివజ్ఞానం బెంచ్ విచారిస్తూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో బుధవారం తీర్పు వెలువరించింది. ఉరి రద్దు.. నిందితుడికి కింది కోర్టు ఇచ్చిన శిక్షను హైకోర్టు ధ్రువీకరించింది. పోక్సో చట్టంలో అరెస్టులను ధ్రువీకరిస్తూ, నిందితుడికి రూ. లక్ష జరిమానా విధించింది. అయితే, ఇటీవల కాలంగా కొన్ని కేసుల తీర్పుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను గుర్తు చేస్తూ, నిందితుడికి విధించిన ఉరి శిక్షను రద్దు చేశారు. ఈ శిక్షను యావజ్జీవంగా మార్చారు. యావజ్జీవ కాలం ముగిసినా, 25 సంవత్సరాల వరకు విడుదల చేసేందుకు వీలు లేదని తీర్పులో బెంచ్ స్పష్టం చేసింది. అలాగే శిక్ష తగ్గింపునకు సైతం ఆస్కారం లేదని, జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని పేర్కొంటూ తీర్పు ఇచ్చారు. కింది కోర్టు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ మొత్తాన్ని చెల్లించకుంటే, తక్షణం అందజేయాలని ఆదేశిస్తూ గడువును కోర్టు కేటాయించింది. చదవండి: అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య -
అత్యాచారం కేసులో యువకుడికి ఉరిశిక్ష రద్దు
టీ.నగర్: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో యువకుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను గురువారం హైకోర్టు రద్దు చేసింది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన అశోక్‌కుమార్ (27) గత 2017లో 13 ఏళ్ల బాలికపై హత్యాచారం చేసి అరెస్టయ్యాడు. కేసు విచారణ జరిపిన చెంగల్పట్టు ప్రత్యేక కోర్టు అశోక్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో అశోక్‌కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఉరి శిక్ష రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. చదవండి: లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?! -
భయంతో గుండెపోటు.. మృతి చెందినా వదల్లేదు
టెహ్రాన్: ఇరాన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఉరికంబం ఎక్కే క్రమంలో గుండెపోటుకు గురై ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి శిక్ష అమలు చేశారు. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. జరా ఇస్మాయిలీ అనే మహిళ భర్త అలీరెజా జమానీ, తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేది. అయితే కొన్నాళ్ల క్రితం భర్తతో విభేదాలు తలెత్తాయి. రోజూ తనను, కూతురిని అసభ్యంగా దూషిస్తూ దిగజారి ప్రవర్తించడంతో భర్తపై కోపం పెంచుకున్న ఆమె, అతడిని హతమార్చింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు జరాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించారు. అప్పటి నుంచి రజాయి షహర్ జైలులో జీవితం గడుపుతున్న ఆమెను, ఉరితీసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుకు కాసేపటి ముందే గుండెపోటుతో ఆమె మరణించింది. ఈ విషయం గురించి జరా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘16 మంది పురుషుల తర్వాత జరాను ఉరి తీసేందుకు నిశ్చయించారు. తన ముందే వారందరూ విలవిల్లాడుతూ మరణించడం ఆమె కళ్లారా చూసింది. గుండె పగిలి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ తన మృతదేహాన్ని ఉరికంబం ఎక్కించారు. జరా నిర్జీవ శరీరాన్ని వేలాడదీసి, ఆమె కాళ్ల కింది కుర్చీని తన అత్తగారు తన్నేశారు. ఇది నిజంగా దారుణం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జరా మరణ ధ్రువీకరణ పత్రంలో గుండెపోటు కారణంగానే ఆమె మరణించినట్లు పేర్కొన్నట్లు న్యాయవాది వెల్లడించారు. కాగా ఉరిశిక్షల అమలును మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉరిశిక్షలను రద్దు చేసేలా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు. చదవండి: ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో -
అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడిన మృగాడికి ఉరిశిక్ష విధించింది. వివరాలు.. దినేశ్ కుమార్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కోర్టు మంగళవారం నిందితుడు దినేశ్ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2017లో చోటు చేసుకున్న ఈ దారుణంలో నిందితుడు దినేశ్ కుమార్ ఆరేళ్ల చిన్నారిని లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ పాపను హత్య చేశాడు. సంచలన సృష్టించిన ఈ కేసును సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడికి ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు సమర్పించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దినేశ్ కుమార్‌ను దోషిగా తేల్చి.. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. చదవండి: 8 ఏళ్ల చిన్నారి గొంతు కోసి.. పళ్లు రాలగొట్టి.. -
చిన్నారిపై హత్యాచారం: సంచలన తీర్పు
లక్నో : రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో ఘజియాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం నిందితులకు మరణశిక్ష విధించింది. విచారణ అనంతరం కేవలం 29 రోజుల రికార్డు సమయంలోనే సంచలన తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం..అక్టోబర్19న ఘజియాబాద్ కవి నగర్ ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురయ్యింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక తండ్రికి సన్నిహితుడైన చందన్ అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. (కొడుకును చంపించడానికి రూ.3 లక్షల సుపారీ ) ఈ మేరకు డిసెంబర్29నే చార్జిషీట్ దాఖలు చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు. తీర్పు వెలువరించే రోజు సైతం పదిమంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాదారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ తీర్పు నిచ్చారు. కాగా ఇది ఓ సంచలన నిర్ణయమని, రికార్డు సమయంలోనే నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పురావడం ఓ మైలురాయి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉత్కర్ష్ వాట్స్ అన్నారు. (పోకిరీ చేతిలో వ్యక్తి హతం) -
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్‌కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్‌లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్‌కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్‌లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
మొన్న ఉరిశిక్ష.. నేడు యావజ్జీవం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’ సామూహిక హత్యల కేసులో ఉరిశిక్ష పడిన నేరస్తుడికి మరోశిక్ష పడింది. వివాహితతో సహజీవనం చేసి, ఆమె మైనర్ కూతురిని భయపెట్టి పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తేలడంతో యావజ్జీవ (చనిపోయే వరకు) కారాగార శిక్ష విధిస్తూ వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు (మైనర్లపై లైంగిక కేసుల విచారణ ప్రత్యేక కోర్టు) జడ్జి జయకుమార్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. కాగా, 9 మందిని హత్య చేసిన కేసులో ఇదే కోర్టు సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ అక్టోబర్ 28న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వలస కూలీగా వచ్చి.. బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ వరంగల్ శివారు లోని గోనె సంచుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రఫీకా కొంతకాలంగా భర్తకు దూరంగా ఉండటం గమనించి ఆమెకు దగ్గరయ్యాడు. తన మైనర్ కుమార్తెను లొంగదీసుకునేందుకు సంజయ్ ప్రయత్నించగా రఫీకా అతడితో గొడవ పడింది. అయినా ఆమె లేని సమయంలో కూతురిపై లైంగికదాడి చేసేవాడు. ఈ క్రమంలో మార్చి 6న రఫీకాను తీసుకొని సంజయ్ పశ్చిమ బెంగాల్ బయలుదేరాడు. ఏపీలోని తాడేపల్లిగూడెం వద్ద కదులుతున్న రైలు నుంచి రఫీకాను తోసేసి హత్య చేశాడు. మరుసటిరోజు ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆమె బంధువులు అతడిని నిలదీయడంతో వారిని అడ్డు తొలగించు కోవా లని అన్నంలో నిద్రమా త్రలు కలిపి ఆమె బంధువులు 9 మం దిని హత్య చేసి బావిలో పడే శాడు. బాలికకు పరీక్షలు నిర్వ హించగా గర్భవతి అని తేలింది. లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో సంజ య్కు యావజ్జీవ శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇతర శిక్షలు కూడా ఏకకాలంలో అమలుపర్చాలని పేర్కొంది. బాలికకు రూ.4 లక్షల పరిహారం బాధిత బాలికకు ప్రభుత్వ పునరావాస పరిహారం కింద రూ.4 లక్షలు చెల్లించాలని జడ్జి జయకుమార్ తీర్పులో వెల్లడించారు. దేశ న్యాయస్థాన చరిత్రలో పోక్సో చట్టం కింద ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని కోర్టు చెప్పడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
అమెరికాలో మరణ శిక్ష ఎలా అమలు చేస్తారంటే..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో ప్రస్తుతం దోషులకు విధిస్తున్న మరణ శిక్షలను విషపు ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా అమలు చేస్తున్నారు. సకాలంలో కావాల్సిన విషపు మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మరణ శిక్షల అమల్లో ఆలస్యం కూడా జరగుతోంది. ఈ క్రిస్మస్ నుంచి మరణ శిక్షల అమలుకు ఇతర పద్ధతులను కూడా అమల్లోకి తెస్తున్నారు. ఒకప్పుడు పలు దేశాలు అమలు చేసిన ఎలక్ట్రిక్ చేర్‌కు కట్టేసి, గ్యాస్ చాంబర్లో నిర్బంధించి, తుపాకులతో కాల్చి చంపే పద్ధతులను అమల్లోకి తెస్తున్నారు. నవంబర్ 27వ తేదీనే అమెరికా జస్టిస్ విభాగం ఈ ప్రత్యామ్నాయ పద్ధతులను తీసుకొచ్చింది. వీటిలో భారత్‌లో లాగా ఉరి శిక్ష అమలు చేయడం లేదు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే నాటికి మరణ శిక్షలు త్వరితగతిన అమలు చేయడంలో విషపు ఇంజెక్షన్ల కొరత ఏర్పడ కూడదన్న ఉద్దేశంతో అమెరికా న్యాయ విభాగం మరణ శిక్షల అమలుకు ఈ ప్రత్యామ్నాయ మరణ శిక్షలను సూచించి ఉండవచ్చు. 2020, జనవరి నాటికి అమెరికాలో మరణ శిక్షలు పడి నిర్బంధంలో ఉన్న దోషులు 2,600 మంది కాగా, గత జూలై 14వ తేదీ నుంచి దేశాధ్యక్ష ఎన్నికలు జరిగే నాటికి డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 1550కి పైగా మరణ శిక్షలను అమలు చేసింది. ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయాక బ్రాండెన్ బెర్నార్డ్ అనే 40 ఏళ్ల యువకుడికి గురువారం రాత్రి విషపు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష విధించారు. చిన్న దోపిడీకే ఆ యువకుడికి మరణ శిక్ష పడింది. కిమ్ కర్దాషియన్ సెలబ్రిటీలు నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా విజ్ఞప్తులు చేసినా లాభం లేకపోయింది. అమెరికాలో మరణ శిక్షలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో వాటిని తాను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కారణంగా ఆయన వచ్చేలోగా మరో ఐదుగురికి మరణ శిక్షలు అమలు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఇది వరకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అమెరికాలోనూ ఉరి శిక్షలు అమెరికాలో ఒకప్పుడు మరణ శిక్షలను ఉరి తీయడం ద్వారా అమలు చేసేవారు. అందులో అమానుషత్వం ఉందని భావించి 1936లో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. కెంటకీలో రెయినీ బెతియా అనే వ్యక్తిని ఉరి తీసినప్పుడు ఆయన వెన్నుపూస విరిగి నరక యాతన అనుభవించడంతో ఆ విధానం సరైనది కాదని న్యాయ నిపుణులు భావించారు. ఆ తర్వాత హఠాత్తుగా ఉరి బిగుసుకునేలా కాకుండా మెడకు తాడు కట్టి మెల్లగా వేలాడదీశేవారు. అలా నల్లజాతీయులనే ఎక్కువగా ఉరి తీశారు. 20 శతాబ్దం ఆరంబం నుంచి మరణ శిక్షల అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించడం ప్రారంభించారు. తొలి అన్వేషణలోనే ‘ఎలక్ట్రిక్ చైర్’ మరణ శిక్షను అమలు చేయడం మంచిదనిపిచ్చింది. ఈ పద్ధతిని 1890, ఆగస్టు ఆరవ తేదీన న్యూయార్క్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా హంతకుడు విలియం కెమ్లర్కు అమలు చేశారు. ఎలక్ట్రిక్ చైర్ విధానం అమానుషమంటూ కెమ్లర్ పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దేశవ్యాప్తంగా ఆ విధానాన్ని అనుసరించడమే ఉత్తమమని 20వ శాతాబ్దంతో న్యాయ నిపుణుల బృందాలు సూచించాయి. ఎలక్ట్రిక్ చేర్ వల్ల నరాలు కుంచించుకుపోయి ప్రాణం పోవడం కన్నా ముందే మెదడు పని చేయకుండా పోతుంది కనుక మరణ యాతన ఉండదనే ఉద్దేశంతో అదే మంచి పద్ధతని చాలాకాలం భావించారు. 1980వ దశకం వరకు ఈ విధానం అమెరికా అంతటా కొనసాగింది. 1990లో ఒకసారి, 1997లో ఒకసారి మరణ శిక్ష అమలు సందర్భంగా ఎలక్ట్రిక్ చైర్లు అంటుకొని దోషులు మాడిపోవడంతో ఆ విధానం వివాదాస్పదం అయింది. ఆ దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్ర చట్టాలు చేసుకునే కొన్ని ప్రత్యేకాధికారాలు కూడా ఉండడంతో వర్జీరియా రాష్ట్రం 2013 వరకు కూడా దోషులకు మరణ శిక్షలు అమలు చేసేందుకు ఎలక్ట్రిక్ చైర్ విధానాన్నే అనుసరిస్తూ వచ్చింది. 21వ శతాబ్దంలో గ్యాస్ చేంబర్లు జార్జియాలోని సుప్రీం కోర్టు జస్టిస్ కరోల్ డబ్లూ అన్స్టెయిన్ ‘ఎలక్ట్రిక్ చైర్’ ద్వారా మరణ శిక్ష అమలు చేయడం కూడా ఉరి శిక్ష విధించడం లాంటి అమానుషమేనని తీర్పునివ్వడంతో మళ్లీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించారు. 1922లో నేవడలో మొదటిసారి అమలు చేసిన గ్యాస్ చేంబర్ పద్ధతి మళ్లీ చర్చకు వచ్చింది. వెంటిలేటర్లులేని ఓ గదిలో దోషిని నిర్బంధించి నైట్రోజెన్ గ్యాస్‌ను పంపించి చంపడమే ఆ పద్ధతి. ఏ జైల్లోనూ ఈ పద్ధతిలో మరణ శిక్షను అమలు చేయడానికి సైరైన్ సదుపాయాలులేక విమర్శలు వెల్లువెత్తాయి. మరణ శిక్షను ప్రత్యక్షంగా వీక్షించిన సాక్షులు, జైల్లో ఉంటున్న ఇతర ఖైదీలు ఆ గ్యాస్ ప్రభావానికి లోనై దగ్గుతుండడం విమర్శలకు కారణం. 1924 నుంచి 1977 వరకు ఈ పద్ధతిన పలు రాష్ట్రాలు మరణ శిక్షలు అమలు చేశాయి. 22 ఏళ్ల తర్వాత ఆఖరి సారి 1999లో ఉపయోగించారు. మరోపక్క ప్రత్యామ్నాయంగా 1900 నుంచి 2010 వరకు ఫైరింగ్ స్క్వాడ్‌తో మరణశిక్షలు అమలు చేశారు. ఆ తర్వాత విషపు ఇంజెక్షన్ల ద్వారా మరణ శిక్ష అమలు చేయడం వచ్చింది. ట్రంప్ హయాంలో ఒక్క ఉరిశిక్ష తప్ప మరణ శిక్షలకు పాత పద్ధతులన్నీ మళ్లీ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. -
అతడు రాక్షసుడిలా అనిపిస్తున్నాడు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మహిళను అత్యంత పాశవికంగా హత్యచేసిన కేసులో దోషిగా ఉన్న వ్యక్తికి కిందికోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి వాదనలు పూర్తయ్యేంత వరకు మరణశిక్షను నిలుపుదల చేసేలా బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్యాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇలాంటి కేసును మేమెప్పుడూ చూడలేదు. అతడు ఓ రాక్షసుడిలా అనిపిస్తున్నాడు’’అని వ్యాఖ్యానించింది. కాగా ఓ బిల్డింగ్ కాంప్లెక్సులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్ సింగ్ అనే వ్యక్తి 2019లో ఓ మహిళను దారుణంగా హతమార్చాడు. ఆమె పొట్టను చీల్చి, అవయాలను బయటకు తీశాడు. ఆ తర్వాత వాటి స్థానంలో వస్త్రాన్ని కుక్కి, వైరుతో కుట్లు వేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికపోయాడు.(చదవండి: ‘గృహ హింస’ బాధితురాలికి ఊరట) ఈ నేపథ్యంలో మోహన్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఆధారాలు సేకరించి ట్రయల్స్ కోర్టు ఎదుట హాజరుపరచగా, అనేక పరిణామాల అనంతరం న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. రాజస్తాన్ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఆగష్టు 9న శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో దోషి తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషికి ఉరిశిక్షను నిలుపుదల చేసే విధంగా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా.. ‘‘మీ క్లైంట్ చాలా హేయమైన చర్యకు పాల్పడ్డారు. అసలెందుకు అతడు, పొట్ట చీల్చి అందులో వస్త్రాలు పెట్టినట్లు? అతడేమైనా సర్జనా?’’ అని న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది. ఇందుకు బదులుగా.. మోహన్ సింగ్‌ను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, గతంలో ఓ హత్యకేసులో దోషిగా ఉన్నందున ఈ నేరం తనపై మోపారని లూథ్రా వాదనలు వినిపించారు. మృతురాలు చివరిసారిగా అతడితో మాట్లాడిందన్న ఒకే ఒక్క కారణంతో అతడే హత్యకు పాల్పడ్డాడన్న నిర్ధారణకు సరైంది కాదని పేర్కొన్నారు. అంతేగాక, ఈ కేసులో డీఎన్ఏ ఎక్స్పర్ట్స్ ఇంతవరకు విచారణకు హాజరురాలేదని, ఘటనాస్థలంలో గల సీసీటీవీ రికార్డులను కూడా పోలీసులు ఇంతవరకు కోర్టుకు సమర్పించలేదని చెప్పారు. ఈ క్రమంలో సరైన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ, అప్పటివరకు మోహన్‌సింగ్ ఉరిశిక్షపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. -
సంజయ్‌కు ఉరిశిక్ష
-
తొమ్మిది హత్యల కేసు : సంజయ్‌కు ఉరిశిక్ష
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రల్లో సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్ న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్యను కప్పి పుచ్చుకునేందుకు మరో 9మందిని హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు వెలువడింది. కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్డులో నేరారోపణ పత్రము దాఖలు చేశారు. కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. తీర్పును వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసినందుకు పోలీసులను అభినందించారు. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్‌కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు మే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు మే 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు. తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి కోర్పుకు అప్పగించారు. దీంతో నిందితుడు సంజయ్‌కు ఉరిశిక్ష ఖరారైంది. -
విజయవాడ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
-
స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ: చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా 2019లో పెంటయ్య అనే వ్యక్తి ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, తనను హతమార్చాడు. గొల్లపూడిలోని నల్లకుంటలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పెంటయ్యను దోషిగా తేల్చి మంగళవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. (14 ఏళ్ల ఆ బాలికకు మానసిక పరిపక్వత ఉంది..) -
కరోనా అతని ఆయుష్షు పెంచింది!
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి దాదాపు 5.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ ఓ వ్యక్తి మరికొంత కాలం జీవించడానికి తోడ్పడింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓక్లహోమాలోని యూకాన్కు చెందిన డానియల్ లీ.. 1996లో గన్స్ డీలర్ విలియం ముల్లెర్, అతని భార్య నాన్సి, 8 ఏళ్ల కుమార్తె సారా పొవెల్‌ను హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు. దీంతో న్యాయస్ఙానం అతనికి మరణశిక్ష ఖరారు చేసింది. (వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న భారత సంతతి వ్యక్తి) ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం రోజున లీకి ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి లీ కుటుంబ సభ్యులు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా భయానక పరిస్థితుల్లో తాము.. అంతా దూరం ప్రయాణించలేమని లీ కుటుంబ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీంతో జిల్లా చీఫ్ జస్టిస్ ఆ మరణ శిక్షను వాయిదా వేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. ఇలా కరోనా వైరస్.. లీ మరికొంత కాలం జీవించడానికి సాయం చేసినట్టయింది. కాగా, ఫెడరల్ కోర్టు నిర్ణయించిన మరణశిక్షను వాయిదా వేయడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి.(చెప్పుల దుకాణంలో మహిళ అనుచిత ప్రవర్తన) -
లాక్డౌన్ : జూమ్ ద్వారా నిందితుడికి ఉరిశిక్ష
సింగపూర్‌లో ఒక వ్యక్తికి ఆ దేశ సుప్రీంకోర్టు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉరిశిక్ష విధించింది. కరోనా నేపథ్యంలో సింగపూర్ దేశం లాక్డౌన్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే, మలేషియాకు చెందిన 37 ఏళ్ల పునితాన్ జెనాసన్ 2011లో హెరాయిన్ డ్రగ్‌ను అక్రమంగా సరఫరా చేయడంపై అప్పట్లో అతనిపై కేసు నమోదయింది. అప్పటి నుంచి విచారణ జరుగుతున్న ఈ కేసులో ఆరోపణలు రుజువైన కారణంగా పునితాన్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. (ఏపీలో కొత్తగా 68 కరోనా కేసులు) దీనిపై సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి మాట్లాడుతూ, మా దేశంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉండంతో ఎటువంటి కేసులను కోర్టు విచారణ జరపడం లేదు. అయితే ఈ కేసు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంతో తిరిగి విచారణ ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో డైరెక్ట్ విచారణ సాధ్యం కాకపోవడంతో జూమ్ టెక్నాలజీని వాడాము. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అలాగే పునితాన్ జెనాసన్ తరపు న్యాయవాది ఎవరికి వారు జూమ్ ద్వారానే తమ వాదనలు వినిపించారు. నిందితుడికి సంబంధించిన అన్ని డ్యాక్యుమెంట్లు, ఆధారాలను జూమ్ ద్వారానే వివరించారు. ఆధారాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పునితాన్‌కు ఉరిశిక్ష విధించారంటూ' చెప్పుకొచ్చారు. (కరోనా కల్లోలం: ఒక్కరోజులో వెయ్యి మరణాలు!) దీనిపై పునితాన్ తరపు లాయర్ పీటర్ ఫెర్నాండో స్పందిస్తూ, జూమ్ ద్వారా తన క్లైంట్కు శిక్ష విధించడం సరికాదని, దీనిపై మరోసారి అప్పీల్‌కు వెళ్లునున్నట్లు చెప్పారు. సింగపూర్‌లో అక్రమ డ్రగ్ సరఫరాను ఆ దేశంలో ఎంత మాత్రం సహించరు. ఎవరైనా అలాంటి పనులు చేస్తూ పట్టుబడితే ఉరి తీయడానికి అక్కడి కోర్టులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దశాబ్ధం నుంచి చూసుకుంటే నార్కొటిక్ సరఫరా కేసులో వందల మందికి ఉరిశిక్షను ఖరారు చేశారు. వీరిలో డజనుకు పైగా విదేశీయులు ఉండడం విశేషం. సింగపూర్‌లో కరోనా వేగంగా విస్తరించడంతో ఏప్రిల్ మొదటి వారంలోనే అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్ 1 వ తేదీ వరకు కొనసాగించాలని ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయించింది. సింగపూర్ దేశంలో చిన్న తప్పులకు కూడా ఉరిశిక్షలు అమలు చేయడంలో వారి క్రూరత్వం, అమానవీయమని ఏషియా డివిజన్ హ్యూమన్ రైట్స్ డిప్యూటీ డైరెక్టర్ ఫిల్ రాబర్ట్సన్ పేర్కొన్నారు. జూమ్ వంటి రిమోట్ టెక్నాలజీని ఉపయోగించి మనిషికి మరణశిక్ష విధించడం ద్వారా ఇలాంటి శిక్షలు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. (మాస్క్ ధరించకుంటే రూ. 60,000 జరిమానా) -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
బాలికపై అత్యాచారం : ముగ్గురికి మరణశిక్ష
రాంచీ : ఆరేళ్ల బాలికపై అత్యంత కిరాతంగా అత్యాచారం జరిపి ఆపై పెట్రోల్‌తో కాల్చి హత్య చేసిన కేసులో జార్ఖండ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ మేరకు ఈ రాష్ట్రంలోని దుమ్కా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తుఫిక్ ఉల్ హుస్సేన్ మంగళవారం తీర్పును వెలువరించారు. కేసులో దోషులగా తేలిన ముగ్గురికి తలా రూ.50 వేల జరిమానా కూడా విధించారు. కాగా శిక్షపడిని ముగ్గురు దోషులూ 19 నుంచి 25 ఏళ్ల మధ్యవారు కావడం గమనార్హం. ఘటన జరిగిన 25 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్షను ఖరారు చేయడం విశేషం. మితూరాయ్, పంకజ్ మొహలీ, అశోక్ రాయ్ అనే ముగ్గురు యువకులు ఈ ఏడాది ఫిబ్రవరి 8న అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం హత్య నుంచి తప్పించుకోవాలని బాలికపై పెట్రోల్‌పోసి దారుణంగా కాల్చి హత్య చేశారు. కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు ఫోక్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. కాగా దోషుల్లో ఒకరైన పంకజ్ బాధితురాలికి సమీప బంధువు కావడం విచారం. -
వర్షిత కేసు: చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, చిత్తూరు: సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారి వర్షితపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రఫీని దోషిగా తేలుస్తూ ఉరి శిక్ష విధించింది. గతేడాది నవంబర్ 7న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిని మదనపల్లి మండలానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి ఆపై హత మార్చాడు. చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని చెప్పి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందుతుడిని లారీ క్లీనర్ రఫీగా గుర్తించారు. అయితే హత్యానంతరం రఫీ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదులో భాగంగా పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టి రఫిని పట్టుకున్నారు. రఫిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతనిపై హత్య, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇతడు గతంలోనూ పలువురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. తీర్పుపై స్పందించిన హోంమంత్రి సుచరిత: చిత్తూరు సెషన్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చిన్నారి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా.. పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎట్టకేలకు ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన నిందితుడికి పోస్కో చట్టం కింద మరణశిక్ష విధించడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆడుకుంటూనే.. పోయింది! లైంగికదాడి.. హత్య! -
నీ భార్యా, కొడుకును కాల్చేశా: దోషికి ఉరిశిక్ష!
చండీగఢ్: గురుగ్రాంలో కలకలం సృష్టించిన న్యాయమూర్తి కృష్ణకాంత్ గార్గ్ భార్య, ఆయన కొడుకు హత్య కేసులో హర్యానా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరిపై కాల్పులకు పాల్పడిన సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో దాదాపు 64 మంది సాక్షులను విచారించిన తర్వాత దోషి మహిపాల్‌కు మరణ దండన విధిస్తున్నట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సుధీర్ పర్మార్ తీర్పు వెలువరించారు. కాగా 2018 అక్టోబరులో హర్యానాలోని గురుగ్రామ్‌లో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య రీతూ, కొడుకు ధృవ్‌పై వారి సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మార్కెట్లో అందరి ముందే ఘాతుకానికి పాల్పడిన అతడు.. అనంతరం వారి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. జడ్జికి ఫోన్ చేసి.. ‘నీ భార్యా, కొడుకును కాల్చి చంపేశా’ అని చెప్పాడు. ( మహిపాల్ హంతకుడిగా మారడం వెనుక అసలు కారణం అదేనా?!) మహిపాల్ సింగ్ పెళ్లినాటి ఫొటో ఇక ఈ ఘటనలో గాయపడిన రీతూ చికిత్స పొందుతూ మరణించగా, అతని కుమారుడు ధ్రువ్ బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో ఫరీదాబాద్ వద్ద పోలీసులు మహిపాల్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనకు సెలవులు ఇవ్వకపోవడం, వేధించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మహిపాల్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల విచారణ అనంతరం మహిపాల్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇక మహిపాల్ స్వగ్రామం మహేంద్రగఢ్ కాగా.. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిపాల్ భార్య టీచర్‌గా పనిచేస్తోంది. వృత్తిపరమైన ఒత్తిళ్లతో పాటు వ్యక్తిగతంగా కూడా మహిపాల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని.. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఈ విధంగా ప్రవర్తించి ఉంటాడని అతడి సన్నిహితులు గతంలో మీడియాకు తెలిపారు. -
హాజీపూర్ కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ కేసుల్లో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడింది. నల్లగొండ లోని పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎట్ట కేలకు పోలీ సులు నేర నిరూపణ చేశారు. ఇద్దరు బాలికల కేసుల్లో ఉరిశిక్ష, మరో బాలిక కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం జడ్జి సిద్ధ వేద విద్యానాథరెడ్డి గురువారం సాయంత్రం 6.24 గంటలకు తుదితీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిం చారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యే కంగా స్పెషల్ ప్రాసి క్యూటర్‌గా చంద్రశేఖర్‌ను నియమించగా, ఆయన రాచ కొండ కమిషనరేట్ పోలీసుల తరఫున వాదించారు. శ్రీనివాస్ రెడ్డి తరఫున వాదిం చడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సహాయం అందిం చేందుకు లీగల్ సెల్ అథారిటీ ఠాగూర్‌ను న్యాయవాదిగా నియమించారు. శ్రీనివాస్‌రెడ్డికి ఎగువ కోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 27నే తుది తీర్పు వెలువడాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల తీర్పు వాయిదా పడింది. గురువారం తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలోనే ఉన్న బాలిక తండ్రి నర్సింహ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.. ‘మా కడుపు కోత తీరదు. ముద్దాయికి ఉరి శిక్ష పడటంతో న్యాయం జరిగింది. శిక్ష వేయించడంలో పోలీ సులు అన్న మాట నిలబెట్టుకున్నారు’అని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని గురు వారం రాత్రి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
ఉరి.. అందరికీ ఒకే సారి
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక హత్యాచార కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషులు తమకున్న అన్ని న్యాయపర అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువు విధించింది. వారం తర్వాత అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ బుధవారం చెప్పారు. దోషులను విడివిడిగా కాకుండా అందరికీ ఒకేసారి శిక్ష అమలుచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్రం పిటిషన్ కొట్టివేత.. నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలులో ఆలస్యాన్ని సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి తాజా ఆదేశాలిచ్చారు. న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్న కారణంగా నలుగురు దోషుల్లో ఇద్దరు ముఖేష్ సింగ్, వినయ్ శర్మలను వేరుగా ఉరితీయాలంటూ చేసిన కేంద్రం అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. తీహార్ జైలు నిబంధనలను కోర్టు తప్పుగా అర్థం చేసుకున్నదనీ, ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు యత్నిస్తున్నారంటూ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యలను కోర్టు తోసిపుచ్చింది. దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీని అప్పీల్‌గా పరిగణించరాదన్న తుషార్ వ్యాఖ్యలను జడ్జి అంగీకరించలేదు. దోషులందరి డెత్ వారెంట్లనూ ఒకేసారి అమలుచేయాలని తాను అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నారు. కేంద్రం అభ్యర్థనమేరకు ఆదివారం ప్రత్యేకంగా విచారించిన జస్టిస్ సురేష్ కుమార్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన అన్ని రక్షణలను దోషులు చివరి శ్వాస వరకు వినియోగించుకుంటారని స్పష్టం చేశారు. ముకేష్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ని దాఖలు చేసే వరకూ అంటే 186 రోజులపాటు దోషుల ఉరితీతపై ఎవ్వరికీ పట్టలేదనడంలో తనకు సందేహం లేదని జడ్జి తేల్చి చెప్పారు. -
వారంలోపే ఉరి తీయాలి!
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన దోషులను ఉరి తీసేందుకు డెత్ వారంట్ జారీ అయిన తరువాత వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ దిశగా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్ర హోం శాఖ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ‘నిర్భయ’ దోషులు రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష.. తదితర చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్షను అమలుచేయడానికి సంబంధించి.. దోషుల హక్కులను కాకుండా బాధితుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ‘క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వారం రోజుల్లో డెత్ వారంట్ జారీ చేయాలి. ఆ తరువాత వారం రోజుల్లో ఉరి శిక్షను అమలు చేయాలి. సహ దోషుల రివ్యూ, క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు ఏ స్థాయిలో ఉన్నా వాటిని పట్టించుకోకూడదు. అన్ని కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు అధికారులు దీన్ని అమలు జరిపేలా ఆదేశాలివ్వండి’ అని హోంశాఖ తన పిటిషన్లో కోరింది. దోషుల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కచ్చితమైన కాలపరిమితి విధించాలని కూడా హోంశాఖ కోరింది. క్షమాభిక్ష కోరుకునే దోషి.. సంబంధిత కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ తనకు అందిన వారం రోజుల్లోపే క్షమాభిక్ష కోరుకునే విధంగా నిబంధనలను రూపొందించాలని పేర్కొంది. ‘అత్యాచారం కేవలం ఒక వ్యక్తిపై చేసే నేరం కాదు. మానవత్వంపై జరిగిన ఘాతుకం. అది నాగరిక సమాజం క్షమించలేని దారుణం’ అని హోంశాఖ ఆ పిటిషన్లో పేర్కొంది. ‘అందువల్ల ప్రజలు, బాధితులు, వారి కుటుంబాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, దోషులను శిక్షించేందుకు ఉద్దేశించిన గత నిబంధనలను మార్చాలని.. చట్టంతో ఆడుకుని, శిక్ష అమలును వాయిదావేసే అవకాశం ఆ దారుణానికి ఒడిగట్టిన దోషులకు ఇవ్వవద్దని కోరుతున్నాం’ అని అభ్యర్థించింది. కేంద్ర హోం శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషిగా ఉన్న పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో మైనర్‌ననీ, ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆరోపిస్తూ పవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్ దాఖలు చేసిన పిటిషన్లో పరిశీలించాల్సిన అంశాలేమీ కనబడలేదని పేర్కొంది. గతంలో పవన్ దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లు హైకోర్టు, ట్రయల్ కోర్టులలో తిరస్కరణకు గురయ్యాయని గుర్తు చేసింది. వీటిపై వేసిన రివ్యూ పిటిషన్లను సైతం తిరస్కరించామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తగదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..పవన్ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నారు. పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి మార్గం సుగమమైంది. మార్గదర్శకాలు ఇవ్వాలి: నిర్భయ తండ్రి ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎన్నిసార్లు పిటిషన్లు దాఖలు చేయవచ్చో తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్భయ తండ్రి సుప్రీంకోర్టును కోరారు. నిర్ణీత సమయంలో మాత్రమే పిటిషన్లు దాఖలు చేసేలా మార్గదర్శకాలు ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. వీటివల్ల నిర్ణీత సమయంలో దోషులకు శిక్ష పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. -
సోనియా అంత మనసు లేదు
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ చేసిన సూచనపై ‘నిర్భయ’ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి సలహా ఇచ్చినందుకు జైసింగ్ సిగ్గుపడాలన్నారు.. తమకు సోనియా గాంధీ అంత పెద్ద మనసు లేదని వ్యాఖ్యానించారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే జైసింగ్ శుక్రవారం ఒక ట్వీట్ చేస్తూ... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను క్షమించినట్టుగానే ఈ కేసు దోషులను నిర్భయ తల్లిదండ్రులు క్షమించాలని సూచించారు. ఒక తల్లిగా నిర్భయ తల్లిదండ్రుల బాధను తాను అర్థం చేసుకోగలనని, కాకపోతే మరణశిక్ష మాత్రం సరికాదని ఇందిరా జైసింగ్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజీవ్ హంతకురాలు నళినీ శ్రీహరన్‌కు న్యాయస్థానం మరణ శిక్ష విధించగా.. సోనియాగాంధీ జోక్యం చేసుకుని ఆమెను క్షమించినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆమెకు పడ్డ మరణశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. ఇందిరా జైసింగ్ సూచనను తోసిపుచ్చారు. మహిళగా ఉంటూ అలాంటి సలహా ఇచ్చినందుకు ఆమె నిర్భయ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏడేళ్లుగా మేము ఈ కేసుపై పోరాడుతున్నాం. మేము రాజకీయ నాయకులము కాము. సామాన్యులము. మా హృదయాలు సోనియా గాంధీ అంత విశాలం కాదు’’ అని స్పష్టం చేశారు. ఇందిరా జైసింగ్ చేస్తున్న వ్యాఖ్యల వంటివే దేశంలో అత్యాచారాలు పెరిగిపోయేందుకు కారణమని అన్నారు. నిర్భయ తల్లి కూడా తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచారం వంటి క్రిమినల్ కేసుల్లో పడే శిక్షపై దోషులను క్షమించమని బాధితుల కుటుంబ సభ్యులు చెప్పడంతో ఏమీ మారిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘న్యాయ వ్యవస్థ పరంగా చూస్తూ బాధితురాలి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనే విషయానికి విలువ లేదు. న్యాయస్థానాలు చట్టం ప్రకారమే నడుచుకుంటాయి. పైగా సోనియాగాంధీ మాదిరిగా నిర్భయ దోషులను క్షమించాలన్న ఇందిరా జైసింగ్ సలహాను నిర్భయ తల్లిదండ్రులు తోసిపుచ్చుతున్నారు’’ అని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ తెలిపారు. అయితే రాష్ట్రపతికి పెట్టుకునే క్షమాభిక్ష పిటిషన్లలో ఇలాంటి (బాధితురాలి కుటుంబం క్షమించింది) విషయాలను ప్రస్తావించవచ్చునని మరో న్యాయవాది వికాస్ సింగ్ చెప్పారు. -
పాక్ : దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణశిక్ష
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఉన్న దైవ దూషణ చట్టానికి మరొకరు బలయ్యారు. దైవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఓ ప్రొఫెసర్‌కు శనివారం కోర్టు మరణ శిక్ష విధించింది. వివరాలు.. 2013లో ప్రొఫెసర్ జునైద్ హఫీజ్ ఖాన్ ముల్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ దైవదూషణ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణపై కేసు దాఖలైంది. అప్పటి నుంచి ప్రొఫెసర్‌ను బయట సమాజంలో ఉంటే ప్రాణాలకు ప్రమాదమంటూ నిర్భందంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయి శనివారం తీర్పు వెలువడింది. మరణ శిక్షతో పాటు 5 లక్షల పాకిస్తాన్ రూపాయలను కోర్టు జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రొఫెసర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తన క్లయింట్‌కు చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ దోషిగా తేల్చారని, తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. కాగా, పాక్‌లో దైవ దూషణ చట్టాన్ని మైనార్టీలను అణగదొక్కడానికి, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి ఉపయోగపడుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నాయి. ఇటీవల ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదికలో కూడా ఈ చట్టం, గిట్టని వారిపై ప్రయోగించే అస్త్రంగా దుర్వినియోగమవుతుందని వెల్లడించింది. ఇంతకు ముందు 2011లో ఆసియా బీబీ అనే క్రిస్టియన్ మహిళపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. అనంతరం అంతర్జాతీయ మీడియా దృష్టి సారించడంతో ఎనిమిదేళ్ల విచారణ అనంతరం ఆమెను ఈ ఏడాది జనవరిలో విడిచిపెట్టారు. విడుదల అనంతరం చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో మే నెలలొ ఆమె కెనడా వెళ్లిపోయింది. ఇది కాక, ఆసియా బీబీ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడినందుకు పంజాబ్ గవర్నర్‌ను అతని బాడీగార్డే కాల్చి చంపాడు. దైవ దూషణ చట్టం ప్రకారం అల్లా, ఇస్లాం, మత ప్రముఖులను కించపరుస్తూ మాట్లాడితే వారికి మరణశిక్ష విధింపబడుతుంది. చదవండి : (పాక్ మైనార్టీలపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక) -
సంచలన తీర్పు: నలుగురికి మరణశిక్ష
న్యూఢిల్లీ: జైపూర్ 2008 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ.. తీర్పును వెలువరించింది. దోషులు సైఫర్ రెహ్మాన్, సర్వర్ అజ్మి, మహ్మద్ సైఫ్, సల్మాన్‌లకు శిక్షను ఖరారు చేస్తూ రాజస్తాన్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కాగా జైపూర్ బాంబు పేలుళ్లల కేసులో పదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం.. నలుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
మృగాడికి మరణ దండన
భువనేశ్వర్: మూడేళ్ల చిన్ని పాపపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. కెంజొహార్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 2017 వ సంవత్సరంలో సునీల్ నాయక్ అనే నిందితుడు కెంజొహార్ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద 28 సాక్షుల వివరణను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష ఖరారు చేసినట్లు కెంజొహార్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ లోక్‌నాథ్ సాహు తెలిపారు. పై కోర్టుకు వెళ్తా.. ఈ కేసులో నన్ను ఇరికించారు. వాస్తవానికి ఈ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు. దిగువ న్యాయ స్థానం తీర్పును సవాల్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు నిందితుడు సునీల్ నాయక్ తెలిపాడు. 2017 వ సంవత్సరం జనవరి 13వ తేదీన నిందితుడు మూడేళ్ల బాలికను ఒంటరిగా తీసుకుని పోయి నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపణ. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా బలవంతపు చర్య, షాక్‌తో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మృత బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి విచారణ చేపట్టిన చంపువా స్టేషన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం విచారణ కొనసాగించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష విధించినట్లు ప్రభుత్వన్యాయవాది గణేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు. -
‘చచ్చినా అతన్ని వదలొద్దు.. శవాన్ని అయినా ఉరి తీయండి’
కరాచి : రాజద్రోహం కేసులో ఉరిశిక్ష పడిన మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహాన్నైనా ఉరితీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజద్రోహం కేసు తీర్పు వివరాలను ముగ్గురు సభ్యుల బెంచ్ గురువారం సమగ్రంగా చదివి వినిపించింది. అనారోగ్య లేక మరేదైన కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన శవాన్ని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో మూడు రోజులపాటు వేలాడదీయాలని పేర్కొంది. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2016లో దుబాయ్‌కి పారిపోయిన ముషారఫ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. (చదవండి : ముషారఫ్‌కు మరణశిక్ష) రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మంగళవారం ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకు పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించగా జస్టిస్ కరీం, జస్టిస్ నజారుల్లా అక్బర్ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ వకార్ అహ్మద్, జస్టిస్ కరీం ముషారఫ్ ఉరిశిక్షకు అనుకూలంగా ఓటు వేయగా.. జస్టిస్ నజారుల్లా వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి : ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు) -
ఈ ఏడాది లేనట్టే..!
-
నిర్భయ దోషికి మరణ శిక్షే
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఆర్.బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్‌కు మరణశిక్షను ధ్రువీకరిస్తూ తీర్పు వెలువరించింది. గత ఏడాది జులై 9న ఈ కేసులో మరో ముగ్గురు దోషులు ముఖేష్, పవన్‌గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. వారి రివ్యూ పిటిషన్లకి, అక్షయ్ పిటిషన్‌కి ఎలాంటి తేడా లేదని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. దీంతో అక్షయ్ తరపు లాయర్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికి మూడు వారాల గడువివ్వాలని కోరారు. రాజకీయపరమైన, మీడియా ఒత్తిళ్ల వల్లనే తన క్లయింట్‌ను దోషిగా తేల్చారని ఆరోపించారు. ఇక దోషులకు న్యాయ పరంగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం మాత్రం మిగిలుంది. డెత్ వారెంట్లపై విచారణ 7కి వాయిదా నిర్భయ దోషులు ఉరిశిక్షపై రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుకుంటారో లేదో వారంలోగా వారి స్పందనను తెలుసుకోవాలని ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించింది. డెత్ వారెంట్లు జారీపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్రలోనూ ‘దిశ’ తరహా చట్టం నాగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు సంబంధించి యావత్ జాతికి దిశానిర్దేశం చేసేలా తీసుకువచ్చిన దిశ చట్టంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దిశ చట్టం ఎంత శక్తిమంతమైనదో గ్రహించిన మహా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బాటలో నడవాలని యోచిస్తోంది. మహిళల అకృత్యాలపై 21 రోజుల్లోగా విచారణ జరిపి, అత్యాచారం కేసుల్లో మరణ దండన విధించాలని దిశ చట్టం చెబుతోంది. ఈ తరహాలోనే చట్టం చేయాలని భావిస్తున్నట్లు హోం మంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం శాసన మండలిలో చెప్పారు. ‘మహిళలపై అకృత్యాల విషయంలో చట్టాలను అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తరహాలో సత్వర న్యాయం కోసం ఒక కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచన ఉంది’ అని హోం మంత్రి వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాల విషయంలో విపక్షాలిచ్చిన సావధాన తీర్మానానికి హోం మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. బిహార్‌లో మరో ఘోరం ససారం: బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఓ దళిత మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించగా ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మంగళవారం రాత్రి బాధితురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడింది. నిందితులను ఆదివారమే అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. కాల్పులు జరిపిన వారికోసం గాలిస్తున్నామన్నారు. -
సంచలన తీర్పు: ముషారఫ్‌కు ఉరిశిక్ష
-
సంచలన తీర్పు: ముషారఫ్‌కు ఉరిశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్‌లోని లాహోర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేకంగా 2007 నవంబర్ 3న దేశంలో ఎమర్జెనీ విధించారు. ఈ సమయంలో దేశంలోని విపక్ష నేతలను, న్యాయమూర్తులను అక్రమంగా నిర్బందించారు. అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. కేసు విచారణ జరుగుతుండగానే దేశం విడిచి వెళ్లిపోయారు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా దిక్కరించారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. -
అఫ్జల్ గురు ‘ఉరి’రోజు ఏం జరిగింది?
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఈ రోజే ఉరి తీస్తున్నామని చెప్పడానికి విచారిస్తున్నాను’ అని తీహార్ జైలు సూపరిండెండెంట్ ఆ రోజు అఫ్జల్ గురకు చెప్పారు. ‘నాకు తెలుసు, నేనూహించినదే జరుగుతోంది. అప్నే లియేతో క్యా జియే, తూ జీ ఏ దిల్ జమానే కేలియే (మన కోసం మనం జీవిస్తే అందులో అర్థమేముంది, ఇతరుల కోసం జీవించాలి)’ అనే బాదల్ చిత్రంలోని పాటను ఆయన మెల్లగా పాడుతూ కాస్త టీ ఇమ్మని అడిగారు. అప్పటికే టీ బాయ్ వెళ్లిపోయాడు. అతని ఆఖరి కోరికను కూడా తీర్చలేక పోయామని జైలు అధికారి బాధ పడ్డారు. ‘మీరు అనుకుంటున్నట్లు నేను టెర్రరిస్టును కాను. వాంటెడ్ పర్సన్‌ను కూడా కాదు. నేను అవినీతి వ్యతిరేకిని. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చాను. ‘బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మీ ఉరి వార్త తెలిస్తే అల్లర్లు చెలరేగ వచ్చు. అల్లర్లు జరగకుండా మీ అనుచరులకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?’ తీహార్ జైలు అధికారి అఫ్జల్ గురును కోరారు. ‘మీ కళ్లలో నా పట్ల సానుభూతి కనిపిస్తోంది. ఉరికంబం వరకు మీరు నా వెంట వస్తారుగా!’ అని ఆయన అడిగారు. అందుకు అవును అన్నట్లు ఆ జైలు అధికారి తలూపారు. ‘కాస్త నొప్పి లేకుండా చూడండి’ అని అఫ్జల్ గురు కోరారు. ఆ తర్వాత ఇద్దరు మౌనంగా ఉరికంబం వరకు వెళ్లారు. అక్కడ అఫ్జల్ గురును ఉరితీసేందుకు తలారీ సిద్ధంగా ఉన్నారు. అక్కడున్న వారంతా ఉరి అమలు చేయడం ప్రశాంతంగా జరిగి పోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇసుక బ్యాగులతో నిర్వహించిన రెండు ట్రయల్స్ విఫలమయ్యాయి. ఉరి తీయాల్సిన వ్యక్తి బరువెంతో తెలుసుకుని అంతె బరువుగల ఇసుక బ్యాగ్‌తో ఉరితీసే ప్రక్రియకు ట్రయల్స్ వేస్తారు. మొదటి ట్రయల్ మూడు రోజుల ముందు జరిగింది. మొదటి ట్రయల్స్‌లోనే ఉరి తాడు తెగిపోయింది. ఉరి తాళ్లను ‘మనీలా రోప్స్’గా వ్యవహరిస్తారు. వాటిని బీహార్‌లోని బక్సర్ జైలు నుంచి తెప్పిస్తారు. అఫ్టల్ గురుకు ఉరి శిక్ష ఖరారైన 2005లోనే ఆ తాడును తెప్పించడంతో అది చీకిపోయి తెగిపోయింది. మళ్లీ వెంటనే బక్సర్ జైలుకు ఆర్డర్ ఇవ్వడంతో వారు రెండు రోజుల్లో ఉరి తాడును పేనించి 860 రూపాయలకు సరఫరా చేశారు. ఆ తాడుతో కూడా ఒక ట్రయల్ విఫలమైంది. రెండో ట్రయల్ సక్సెస్ అయింది. అనుమతి కోసం తలారి జైలు అధికారి వైపు చూస్తున్నారు. ఆయన తలూపగానే తలారి తన పని ముగించారు. రెండు గంటల అనంతరం వైద్యులు వచ్చి అఫ్జల్ గురు మరణించినట్లు ధ్రువీకరించారు. 30 ఏళ్ల క్రితం కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మఖ్బూల్ భట్‌ను సమాధి చేసిన చోటనే ముస్లిం సంప్రదాయం ప్రకారం అఫ్టల్ గురు భౌతిక కాయాన్ని ఖననం చేశారు. 2013, ఫిబ్రవరి 9వ తేదీన ఆయన్ని ఉరితీయగా, పదవ తేదీన ఆయన కుటుంబ సభ్యులకు పోస్టల్ ద్వారా సమాచారాన్ని అందించారు. అది 11వ తేదీన వారికి చేరింది. అఫ్జల్ గురు తీహార్ జైల్లో ఉన్న ఐదేళ్లపాటు రోజు ఐదుసార్లకు తగ్గకుండా ప్రార్థనలు చేయడంతోపాటు మిగతా సమయాల్లో ఎప్పుడూ గీతా, ఖురాన్, వేదాలు చదువుతూ కనిపించేవాడని జైలు అధికారులు తెలిపారు. జైలు అధికారులు సునీల్ గుప్తా, సునేత్ర చౌదరి ‘బ్లాక్ వారంట్’ పేరిట ప్రచురించిన పుస్తకంలోని అంశాలు ఇవి. వారం రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకం ‘అమెజాన్ ఆన్లైన్’లో 299 రూపాయలకు అందుబాటులో ఉంది. -
కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!
గువాహటి : ప్రేమించిన యువతిని హత్యచేసిన ఓ యువకుడికి గువాహటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సహకరించిన అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ గత బుధవారం తీర్పునిచ్చింది. హత్యకు గురైన యువతి 2015లో ఇంటర్ స్టేట్ ఫస్ట్ విద్యార్థి కావడం గమనార్హం. చార్జిషీట్ ప్రకారం.. శ్వేత అగర్వాల్, గోవింద్ సింఘాల్ ప్రేమించుకున్నారు. 2017, డిసెంబర్ 4న యువతి గోవింద్ ఇంటికి వెళ్లారు. అయితే, పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం మొదలైంది. దీంతో గోవింద్ శ్వేత తలను గోడకేసి బాదాడు. తలకు బలమైన గాయమవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లి, సోదరి సాయంతో గోవింద్ శ్వేతపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి అందరినీ నమ్మించే యత్నం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత హత్యకు గురైనట్టు తేల్చారు. ఆ ముగ్గురిపై మర్డర్ కేసు నమోదు చేశారు. కోర్టు వారిని దోషులుగా తేల్చింది. రెండేళ్ల అనంతరం గోవింద్‌కు మరణ శిక్ష, అతని తల్లి, సోదరికి జీవిత ఖైదు విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోరు తీర్పునిచ్చింది. -
ఉరి.. సరి కాదు
ద హేగ్: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విజయం. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్ పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 21నే కోర్టు రిజర్వ్‌లో ఉంచి బుధవారం వెలువరించింది. ఇండియా తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ‘నిర్బంధంలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు న్యాయపరమైన సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘జాధవ్ కేసులో భారత విధానం సరైనదేనని ఈ చరిత్రాత్మక తీర్పు స్పష్టం చేస్తోంది. జాధవ్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయించి భారత్‌కు తీసుకొచ్చేందుకు మేం మా పనిని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.. జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించగా, ఆ శిక్ష అమలును నిలిపివేయాలంటూ భారత్ ఐసీజేను ఆశ్రయించడం తెలిసిందే. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోకి జాధవ్ ఇరాన్ నుంచి ప్రవేశించారనీ, 2016 మార్చి 3న ఆయనను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయనీ, జాధవ్ గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేది పాక్ వాదన. అయితే ఈ అంశంలో భారత్ వాదన మరోలా ఉంది. నౌకాదళం నుంచి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం జాధవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా, పాక్ అక్కడి నుంచి ఆయనను అపహరించి బలూచిస్తాన్‌కు తీసుకొచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. సైనిక కోర్టులో రహస్య విచారణ జరిపిన అనంతరం 2017 ఏప్రిల్‌లో పాక్ ఆయనకు మరణ శిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది మే నెలలో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తుది తీర్పు చెప్పే వరకు జాధవ్‌కు శిక్ష అమలును నిలిపివేయాలని అప్పట్లో ఐసీజే మధ్యంతర తీర్పు చెప్పింది. తర్వాత 2017 డిసెంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి పాక్ అనుమతి ఇచ్చింది. భారత్‌కు భారీ విజయం: బీజేపీ నేతలు జాధవ్ కేసులో ఐసీజేలో భారత్‌కు భారీ విజయం లభించిందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఐసీజే తీర్పు భారత్‌కు లభించిన భారీ విజయం’ అని రాజ్‌నాథ్ అన్నారు. జాధవ్ కుటుంబ సభ్యలకు త్వరలోనే తగిన పరిహారం దక్కుతుందని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తీర్పు తమకు లభించిన విజయమని పాక్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ ‘అలా అనుకోవడం మీ తప్పు కాదు. ఎందుకంటే తీర్పును ఇంగ్లీష్‌లో చెప్పారు కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు ఐసీజే తీర్పును స్వాగతించారు. మూడేళ్ల నాలుగు నెలలుగా... ► 2016, మార్చి 3: కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు. ► మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్. ► మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన. ► మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్. ► 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు. ► మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్. ► మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే. ► మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్. ► మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే. ► జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి. ► నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్. ► డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి. ► 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే. ► ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే. ► జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు. సిగ్గరి.. మంచివాడు కులభూషణ్‌పై అనెవాది గ్రామస్థుల భావన మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు. కుల్‌భూషణ్ బిడియంతో ఉండేవాడనీ, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదని, తనపనేదో తాను చూసుకునే వాడని అనెవాది గ్రామస్థులు అంటున్నారు. ఏటా రెండు సార్లు స్వగ్రామానికి వచ్చేవాడనీ, రోజులో ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేవాడని వారు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకునే కుల్‌భూషణ్ పట్ల అందరికీ సదభిప్రాయమే ఉంది. కుల్‌భూషణ్ చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేవాడని ఆయన బాల్య స్నేహితుడు తులసీరామ్ పవార్ చెప్పారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ ముందుకెళ్లేవాడని ప్రశంసించారు. నౌకాదళం నుంచి కుల్‌భూషణ్ పదవీ విరమణ చేశాక ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని వారు అంటున్నారు. జాధవ్‌ను అన్యాయంగా నిర్బంధించిన పాక్, ఆయనకు ఉరి శిక్ష విధించడం ఎంత మాత్రమూ సరికాదని అనెవాది గ్రామస్థులంటున్నారు. భారత్‌కు ఒక్క రూపాయి, పాక్‌కు 20 కోట్లు ఐసీజేలో తమ వాదనలు వినిపించేందుకు భారత్ కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టగా, పాక్ ఇందుకు రూ. 20 కోట్లు వ్యయం చేసింది. ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుటున్నారని 2017 మే 15న నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సత్యం, న్యాయం నిలిచాయి: మోదీ కుల్‌భూషణ్ జాధవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పును ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. సత్యం, న్యాయం నిలిచాయని మోదీ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడి సంక్షేమం, భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని మోదీ వెల్లడించారు. ‘ఐసీజే ఈ రోజు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తాం. న్యాయం, సత్యం నిలిచాయి. వాస్తవాలను విస్తృతంగా పరిశీలించి ఈ తీర్పు చెప్పినందుకు ఐసీజేకు అభినందనలు’ అని మోదీ బుధవారం ఓ ట్వీట్లో తెలిపారు. జాధవ్‌కు తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్దోషిగా తేల్చలేదు: పాక్ ఐసీజే ఇచ్చిన తీర్పు పాక్‌కే అనుకూలంగా ఉందని ఆ దేశం అంటోంది. తాము ఇప్పుడు ఐసీజే తీర్పును అనుసరించి చట్టం ప్రకారం ముందుకెళ్తామని పాక్ వెల్లడించింది. పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘అంతర్జాతీయ సమాజంలో బాధ్యత గల సభ్యదేశంగా ఈ కేసులో తొలి నుంచీ మా వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. కోర్టు తీర్పును విన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు చట్టం ప్రకారం ముందుకెళ్తుంది. జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించాలనీ, విడుదల చేయాలని భారత్ ఐసీజేలో కోరింది. కానీ భారత వాదనను ఐసీజే పట్టించుకోకుండా, కేవలం పాక్ విధించిన మరణశిక్షను, జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని పునఃసమీక్షించాలని మాత్రమే తీర్పు చెప్పింది. వీసా లేకుండా, భారత పాస్పోర్టుతో, హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారుపేరుతో జాధవ్ పాక్‌లోకి ప్రవేశించారని మేం పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొంది. పాకిస్తాన్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ ‘పునఃసమీక్షలు పూర్తయ్యే వరకే జాధవ్‌కు మరణ శిక్ష అమలు చేయకుండా ఉండేలా పాక్‌ను ఐసీజే నివారించింది. ఈ తీర్పు పాక్‌కి అనుకూలంగా ఉంది. కేవలం జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించలేదన్న విషయంలో మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఈ తీర్పు ఉంది. మిగిలిన అన్ని అంశాలు/కోణాల్లోనూ భారత్ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. పునఃసమీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే మరణ శిక్ష అమలుకాదు’ అని పేర్కొన్నారు. ముంబైలో స్వీట్లు తినిపించుకుంటున్న జాదవ్ స్నేహితులు -
చిన్నారులపై అత్యాచారానికి ఉరిశిక్షే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న నికృష్టపు ఘటనల నేపథ్యంలో.. చిన్నారులను లైంగిక దాడులనుంచి కాపాడే చట్టం–2012 (పోక్సో)కు పలు సవరణలు చేసింది. ఇకపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీని పూర్తిగా అణచివేసేందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వారికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష విధించేలా పోక్సో చట్టంలో మార్పులు చేశామన్నారు. కఠినమైన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన మూడో విడతలో భాగంగా.. గ్రామీణప్రాంతాల్లో అనుసంధానతకోసం 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగిల్ కోడ్‌లోకి 13 కార్మిక చట్టాలు: 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు (కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు – 2019)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కార్మికులకు బీమా కవరేజీ పెరిగేందుకు అవకాశముంటుంది. 10 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈ కోడ్ వర్తిస్తుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లను సేకరించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘నియంత్రణ లేని డిపాజిట్ల పథకం రద్దు బిల్లు’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరించని డిపాజిట్ల పథకం ఆర్డినెన్స్–2019 స్థానంలో ఈ బిల్లు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లులో చట్ట విరుద్ధంగా డిపాజిట్లను పెంచినట్లయితే అటువంటి సందర్భాల్లో సదరు వ్యక్తులకు శిక్ష, తిరిగి చెల్లించేందుకు తగిన నిబంధనలున్నాయి. ఉద్యోగులకు మెరుగైన సేవా ప్రయోజనాలు చేకూర్చేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు (ఆర్పీఎఫ్) ఆర్గనైజ్డ్ గ్రూప్–ఏ హోదాను కేంద్ర కేబినెట్ కల్పించింది. -
ఆ బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటే మరణ శిక్ష!
పుకెట్: పర్యాటకులకు హెచ్చరిక! బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష విధిస్తారట. అదేంటీ? సెల్ఫీలు తీసుకుంటే తప్పేంటీ అనుకుంటున్నారా? అయితే, మీరు థాయ్‌లాండ్‌లోని పుకెట్ ఐలాండ్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న మాయ్ ఖావో బీచ్‌కు ఆనుకోని ఫూకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే ఉంది. ఇక్కడ విమానాలు ఈ బీచ్‌కు అత్యంత సమీపం నుంచి టేకాఫ్ అవుతాయి. దీంతో పర్యాటకులు తమ తలపై నుంచి వెళ్లే విమానాలతో సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఇది పర్యాటకులకు ప్రమాదకరమే కాకుండా, విమానాలకు కూడా ముప్పు కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆ ప్రాంతానికి రాకుండా కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీచ్‌ను సేఫ్టీ జోన్లోకి చేరుస్తామని ప్రకటించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారికి మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ.70 వేలు పైగా జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. -
అపర సతీసావిత్రి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్థికంగా కడుపేద అయితేనేం.. సమున్నతమైన మనసులో ఆమె ఎంతో ధనవంతురాలు. పొట్టికూటి కోసం దుబాయ్‌కి వెళ్లిన భర్త హత్య కేసులో జైలు పాలయ్యాడు. కోర్టు మరణదండన శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. తమిళనాడులో ఉన్న భార్య హృదయం తల్లడిల్లిపోయింది. అహర్నిశలు అలుపెరుగని కృషిచేసి అపర సతీ సావిత్రిలా ఉరికంబం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న భర్త ప్రాణాలను కాపాడుకుంది. మీడియా ద్వారామంగళవారం వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన అర్జున్ ఆదిముత్తు, మాలతి నిరుపేద దంపతులు. అర్జున్ దుబాయ్‌లో కూలీ పనిచేసేవాడు. దుబాయ్‌లో నివసించే కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన అబ్దుల్వాజిత్ అనే అతనిని హత్య చేసిన కేసులో ఆదిముత్తును దుబాయ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణ పూర్తికాగా అర్జున్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. భర్తకు దూరంగా తంజావూరులో అష్టకష్టాలు పడుతూ కాలం వెళ్లదీస్తున్న మాలతి ఈ సమాచారంతో హతాశురాలైంది. దుబాయ్ చట్టం ప్రకారం హతుని కుటుంబీకులు గనుక హంతకుడిని క్షమిస్తున్నట్లు ప్రకటిస్తే మరణదండన రద్దు అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న మాలతి మలప్పురంలోని ముస్లిం సంఘాలను సంప్రదించి మరణదండన నుంచి తన భర్త ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న అక్కడి ముస్లిం సంఘాలు దుబాయ్‌లోని హతుని కుటుంబీకులతో చర్చలు జరిపారు. నష్టపరిహారంగా రూ.30 లక్షలు చెల్లించేలా ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వక ఒప్పందం కుదిరింది. అయితే మాలతి కడుపేద కావడంతో తనకు అంతటి స్థోమత లేదని ముస్లిం సంఘాలతో మొరపెట్టుకుంది. దీంతో కేరళ ప్రజలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ముందుకు వచ్చి మాలతికి స్నేహహస్తాన్ని అందించారు. విరాళాలు పోగేసి సేకరించిన రూ.30 లక్షలను దుబాయ్‌లోని హతుని కుటుంబీకులకు అందజేశారు. హంతకుడికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా హతుని కుటుంబీకులు లిఖితపూర్వకంగా తమ సమ్మతాన్ని తెలియజేశారు. ఈ ఉత్తరాన్ని కోర్టులో దాఖలు చేయగా దుబాయ్ కోర్టు హంతకుడు అర్జున్‌కు విధించిన మరణదండనను రద్దు చేసి శిక్ష తగ్గించింది. అంతేగాక ఫోన్ ద్వారా భార్య మాలతితో మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించింది. తన భర్త ప్రాణాలను కాపాడేందుకు సహకరించిన కేరళ ప్రజలకు కృతజ్ఞతభావం నిండిన హృదయం, ఆనందంతో చెమర్చిన కళ్లతో ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు కేరళలోని ముస్లిం సంఘాలకు ఉత్తరం కూడా రాసింది. -
క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
ఇస్లామాబాద్ : దైవ దూషణ చేసిన క్రిస్టియన్ మహిళపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. క్రిస్టియన్ మతానికి చెందిన అసియా బీబీ ఇస్లాం మతాన్ని దూషిస్తూ తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవకు దిగేది. తమ మతంపై అసియా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధించాలని 2009లో కోర్టును ఆశ్రయించారు. అసియాకు ఉరిశిక్ష పవిత్ర ఇస్లాం మతాన్ని దూషించి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశావంటూ లాహోర్ హైకోర్టు 2010లో అసియాకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై పాకిస్తాన్ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు ఆమెకు పాపం పండిందని ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించిగా.. నిందితురాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఇదిలాఉండగా.. ఈ కేసుపై మూడు వారాల క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుందనీ, అయితే నిరసనలను అదుపు చేసేందుకు తీర్పును రిజర్వులో ఉంచారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయన మరణంతో అలజడి.. అసియాకు ఉరిశిక్ష విధించిన లాహోర్ హైకోర్టు వ్యవహారాన్ని ఖండించి, ఆమెకు మద్దతుగా నిలిచిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ 2011లో హత్యకు గురికావడంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలోనే అసియా కేసులో కోర్టు జాగ్రత్తలు చేపట్టింది. నిరసనలు చెలరేగకుండా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదేమైనా ఇస్లాం నిరసనకారుల వల్ల అసియాకు ఇబ్బందులు తప్పక పోవచ్చుననీ, జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె రక్షణ ప్రమాదంలో పడొచ్చననే భయాలు నెలకొన్నాయయి. ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. అప్పటి ప్రధాని జియావుల్ హక్ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
అత్యాచారం కేసులో నలుగురికి ఉరిశిక్ష
► ఏం జరిగింది: 2014లో కోలారు జిల్లా మాలూరు తాలూకాలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న టెన్త్ విద్యార్థినిపై నలుగురు మృగాళ్ల సామూహిక అత్యాచారం. 2018 ఆగస్టులో మాలూరు పట్టణంలో పట్టపగలే టెన్త్ బాలికపై మరో కామాంధుడు దాడి, బండరాయితో కొట్టి హత్య ► ఏం తీర్పు: దోషుల దురాగతాలను నిర్ధారించిన న్యాయస్థానాలు.. వారికి ఉరే సరి అని తీర్పునిచ్చాయి. రెండవ కేసులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లో విచారణను పూర్తి చేయడం విశేషం. కోలారు: మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన ఘటనలో నలుగురు నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ కోలారు రెండవ అదనపు సెషన్స్ న్యాయస్థానం శనివారం సంచలన తీర్పును వెలువరించింది. 2014 వ సంవత్సరం మే నెల 28వ తేదీన మాలూరు తాలూకా నటోరహళ్లి క్రాస్ వద్ద పదవ తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు చుట్టుముట్టారు. బలవంతంగా చెరువులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘాతుకంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక చనిపోయిందని భావించిన కామాంధులు వెళ్లిపోయారు. విషయం తెలిసిన మాస్తి పోలీసులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు గాలించి నిందితులు మునికృష్ణ (23 ఏళ్లు, సెక్యూరిటిగార్డు), నారాయణస్వామి (22, కూలీపని) అనిల్‌కుమార్ (20, బెంగుళూరులో బికాం విద్యార్థి) కృష్ణమూర్తి (20, ట్రాక్టర్ డ్రైవర్)లను అరెస్టు చేశారు. కోర్టులో విచారణలో కామాంధుల దురాగతం రుజువు కావడంతో కోర్టు శనివారం నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు దోషులను జిల్లా జైలుకు తరలించారు. విద్యార్థిని హత్య కేసులో... కొద్దిరోజుల క్రితం మాలూరు పట్టణంలో సంచలనం కలిగించిన పదవ తరగతి విద్యార్థిని రక్షిత అత్యాచార యత్నం, హత్య కేసులో కోలారు జిల్లా రెండవ అదనపు న్యాయస్థానం దోషికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఆగస్టు నెల 1వ తేదీన మాలూరు పట్టణంలో పదవ తరగతి విద్యార్థిని టీకల్ గ్రామానికి చెందిన సురేష్‌కుమార్ అనే యువకుడు వెంబడించి అత్యాచారయత్నం చేసి కుదరక పోవడంతో బండరాయితో తలపై మోది హత్య చేశాడు. ఈ ఘోరం పట్టణంలో కలకలం రేపింది. ప్రజాసంఘాలు భారీఎత్తున ఉద్యమాలు జరిపాయి. నిందితుడు సురేష్‌కుమార్ (23, తాపీ పని)ను మాలూరు పట్టణ పోలీసులు రెండురోజుల తరువాత అరెస్టు చేసి అత్యాచారం యత్నం, హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. చకచకా విచారణ జరిపి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. శరవేగంతో విచారణ జరిగింది. ఛార్టిషీట్ దాఖలు చేసిన 13 రోజులకే కోర్టు అతని నేరాన్ని నిర్ధారించి శనివారం మధ్యాహ్నం న్యాయమూర్తి బి ఎస్ రేఖ తీర్పును వెలువరించారు. రక్షితకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను జరిగాయి. ఘటన జరిగిన 45 రోజులకే నిందితుడికి కోర్టు శిక్ష పడడం విశేషం. -
ఇద్దరికి ఉరిశిక్ష..ఒకరికి యావజ్జీవం
-
ఇద్దరికి ఉరి.. ఒకరికి యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్ : లుంబినీపార్క్, గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలిగొన్న అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులైన వీరిద్దరినీ గత వారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, సోమవారం హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం వంటి నేరాల కింద ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే ఒక్కొక్కరికీ రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాక హత్యయత్నం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, కుట్ర కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, పేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చట్టం కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దోషులది ఆవేశపూరిత చర్య ఎంత మాత్రం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని న్యాయస్థానం స్పష్టం చేసింది. భారీగా ప్రజల ప్రాణాలు తీసి దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని తెలిపింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న లక్ష్యంతో కుట్రపూరితంగా వ్యవహరించారనేందుకు సైతం ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలను చూపగలిగిందని స్పష్టం చేసింది. దోషులు అత్యంత హేయమని చర్యలకు పాల్పడ్డారని, అందువల్ల ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా భావిస్తూ దోషులిద్దరికీ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు సంస్థ తమను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించిందన్న దోషుల వాదనకు ఆధారాలు లేవని తేల్చింది. అలాగే ఈ దోషులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్‌ను సైతం దోషిగా నిర్ధారిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్ధోషులుగా తేల్చిన షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్‌కు బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రియాజ్ బత్కల్, ఇక్బాల్ బత్కల్, అమీర్ రజాఖాన్ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిపై ఉన్న కేసును విడగొట్టి మిగిలిన వారిపై న్యాయస్థానం విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన 11 ఏళ్ల తరువాత కేసులో తీర్పు వెలువడటం విశేషం. తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అలాగే తీర్పు వెలువరించిన జడ్జి శ్రీనివాసరావు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేశారు. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని నిందితుల తరుఫు న్యాయవాది గందం గురుమూర్తి పేర్కొన్నారు. ఉరిశిక్షపై హైకోర్టు నిర్ణయం... అనీక్, ఇస్మాయిల్ చౌదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసేంత వరకు ఉరిశిక్ష అమలుకు అవకాశమే లేదు. ఉరిశిక్ష తీర్పు వెలువరించిన జడ్జి తానిచ్చిన తీర్పుతో పాటు ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను హైకోర్టుకు పంపుతారు. ఉరిశిక్ష వ్యవహారాల్లో తన ముందుకు వచ్చిన కేసులపై హైకోర్టు విచారణ జరుపుతుంది. దీనిని రెఫర్ ట్రయిల్ అంటారు. అలాగే కింది కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. రెఫర్ ట్రయిల్‌తో పాటు దోషులు దాఖలు చేసే అప్పీళ్లపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జరుపుతుంది. తెలిసి చేయలేదు.. రోబోల్లా పనిచేశారు... శిక్ష ఖరారుకు ముందు అనీక్, ఇస్మాయిల్ చౌదరిల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వీరిద్దరూ తెలిసి బాంబు పేలుళ్లకు పాల్పడలేదని, రోబోల్లా తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఈ వాదనను జడ్జి తోసిపుచ్చారు. ఈ వాదన ద్వారా దోషులు తమ నేరాన్ని అంగీకరించినట్లయిందన్నారు. దోషులిద్దరూ రోబోలైతే, వారిని ఎవరు నడిపించారో వారి వివరాలిస్తే సరిపోతుందన్నారు. అనంతరం దోషులు కూడా వ్యక్తిగతంగా తమ వాదనను కోర్టు ముందుంచారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని అనీక్ తెలిపాడు. పేలుళ్లతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నాడు. ఇస్మాయిల్ చౌదరి స్పందిస్తూ.. తనకు భార్య, బిడ్డలు ఉన్నారని, తన తల్లి కేన్సర్‌తో బాధపడుతోందని తెలిపాడు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని నివేదించాడు. గత పదేళ్లుగా జైలులో ఉన్నానని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తనపై కరుణ చూపాలని కోర్టును అభ్యర్థించాడు. వీరి వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి... అంతకు ముందు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.సురేంద్ర వాదనలు వినిపిస్తూ, దోషుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. 44 కుటుంబాలు విచ్ఛినమయ్యాయన్నారు. బాంబు పేలుళ్ల వల్ల గాయపడిన వారు ఇప్పటికీ కోలుకోలేదని, బాధను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కట్టుకథలు చెబుతున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఒకరిని హత్య చేస్తేనే న్యాయస్థానాలు ఉరిశిక్ష విధిస్తున్నాయని, 44 మందిని పొట్టనపెట్టుకున్న దోషులకూ అదే సరైన శిక్షని ఆయన విన్నవించారు. ఇదీ జరిగింది... 2007, డిసెంబర్ 25న లుంబనీ పార్క్, గోకుల్ చాట్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేల్చేందుకు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద పెట్టిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబినీ పార్క్ పేలుడులో 12 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. గోకుల్‌చాట్‌లో జరిగిన పేలుళ్లలో 32 మంది మృతి చెందగా, 47 మంది గాయాలపాలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు 1,195 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నిందితులకు సహాయ సహకారాలు అందించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్ పాత్రపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. లుంబినీపార్క్ కేసులో 98 మందిని, గోకుల్‌చాట్ కేసులో 147 మంది, దిల్సుఖ్నగర్ కేసులో 46 మందిని సాకు‡్ష్యలుగా చూపారు. -
జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష విధించింది.ఈ మేరకు చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు రూ.10వేల జరిమానతో పాటు మరణ దండన విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానం నిందితులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమిర్ రజా ఖాన్లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. -
ఉరిశిక్ష రద్దే ‘ఉరి’కి పరిష్కారం
మల్లెపల్లి లక్ష్మయ్య గురువారం ‘సాక్షి’ ఎడిట్ పేజీలోని తన కాలమ్ (ఉరిశిక్ష నేరానికా, నేరస్తు డికా?)లో ‘జస్టిస్ కృష్ణ య్యర్ సుప్రీంకోర్టు బెంచ్‌లో సభ్యుడుగా ఉండగా తన పరిశీలనకు వచ్చిన మూడు కేసులను విచారించి దోషులకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదు శిక్షలుగా మార్చారు’ అని రాశారు. అందుకాయన ఉదహరించిన మూడు కేసుల సందర్భమేమో కాని భూమయ్య, కిష్టాగౌడ్‌లకు విధించిన ఉరిశిక్షలను మాత్రం ఆయన రద్దు చేయలేకపోయారు. వాస్త వానికి వారిద్దరికీ ఉరిశిక్ష అమలు అప్పటికి రెండు సార్లు ఆగిపోయింది. మొదటిసారి 1974 డిసెంబ ర్లో ఏపీసీఎల్సీ కృషి వల్ల సీపీఐ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌గుప్తా, కాంగ్రెస్ నాయ కుడు ఎస్.జైపాల్‌రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అనుకూలంగా స్పందించడంతో ఆగిపోయింది. రెండోసారి 1975 మే 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెకేషన్ బెంచ్గా ఉన్న జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ గంగాధరరావు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినట్టుగా భూమయ్య, కిష్టాగౌడ్కు తెలియజేయలేదనే సాంకేతిక కారణంతో అర్ధరాత్రి ఉరి శిక్షను ఆపివేస్తూ ఉత్తర్వులు పంపారు. ముగ్గురు యువన్యాయవాదులు సి.వెంకటకృష్ణ, కె.ఎన్.చారి, కె.వెంకట్‌రెడ్డి, కేజీ కణ్ణబీరన్ పనుపున సెలవుల్లో తమ ఇళ్లలోనే ఉన్న జడ్జీల నుంచి ఈ ఉత్తర్వులు పొందగలిగారు. అప్పుడు ‘భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు’ అనే ఒకే ఎజెండాపై ఏపీసీఎల్సీ కార్యదర్శి పత్తిపాటి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా కమిటీ ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టింది. జైపాల్‌రెడ్డి మొదలు ఏబీ వాజపేయి, జయప్రకాశ్ నారాయణ్ దాకా ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. అంతర్జాతీయంగా జా పా సార్త్, సైమన్ డీ బావ్రా, తారిక్ అలీ (ఫ్రాన్స్), నోమ్ చామ్స్కీ(అమెరికా) సహా 300 మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. అంతర్జాతీయ పత్రికల్లో దీనిపై రాశారు. లండన్, పారిస్ వంటి నగరాల్లో భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు జరి గాయి. తర్వాత నెలన్నర దాటకముందే 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అప్పటికి భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దుకు జార్జి ఫెర్నాండెజ్ ఢిల్లీ బోట్ క్లబ్బు ముందు ఓ పెద్ద ర్యాలీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో ప్రాథమిక హక్కు లనన్నీ రద్దు చేస్తూ ఎమర్జెన్సీ విధించడంతో ఫెర్నాం డెజ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ఇద్దరి ఉరిశిక్ష రద్దు పోరాటంలో ఉన్న కాంగ్రెసేతర నాయకులు, ఉద్యమ కారులందరూ జైళ్లపాలయ్యారు. బయట మిగిలిన కణ్ణబీరన్, సుప్రీంకోర్టు న్యాయవాది గార్గ్ తదిత రులు ఈ ఉరిశిక్షల రద్దుకు మళ్లీ ప్రయత్నించారు. ఆ పిటిషన్ జస్టిస్ కృష్ణయ్యర్ ముందుకే వచ్చింది. తన కన్నా ముందు సుప్రీంకోర్టు ధ్రువీకరించి, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించాక తానేమీ చేయలేనని, తాను మరోసారి రాష్ట్రపతి విశాల హృదయానికే ఈ అంశాన్ని వదిలివేస్తున్నానని జస్టిస్ అయ్యర్ పేర్కొ న్నారు. ఫలితంగా, 1975 డిసెంబర్ 1న భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష అమలు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యమైంది. రాజ్యసభ సభ్యుడు భూపేశ్‌గుప్తా నవంబర్ 30న రాష్ట్రపతిని కలిసి మరునాడు ఉదయం భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షను ఆపవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా డిసెంబర్ 1న ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’లో చిన్న వార్త వచ్చింది. కాని, వారిద్దరినీ అప్ప టికే ఉరితీసిన విషయం జైల్లో ఉన్న రాజకీయ డిటెన్యూలెవరికీ తెలియదు. రాజ్యాంగం నుంచి ఉరి శిక్షను తొలగిస్తే తప్ప ఇంత అమానుషమైన రాజ్య హత్యలను ఆపడం సాధ్యం కాదనడానికి మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించాను. అరుదైన నేరాల్లో అరుదైన నేరానికే ఉరిశిక్ష వేయాలని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగు తున్నదనడానికి భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షల అమలే తిరుగులేని దాఖలా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరణ శిక్షలు పడిన 11 మంది కమ్యూనిస్టు విప్లవకారుల ఉరి ఆపడానికి కమ్యూ నిస్టు పార్టీ అభ్యర్థన మేరకు లండన్ నుంచి బారిస్టర్ ప్రిట్, సుప్రీంకోర్టు నుంచి డానియల్ లతీఫీ వంటి ప్రసిద్ధ న్యాయవాదులు హైదరాబాద్ వచ్చారు. వారి వాదనల కన్నా తన మత విశ్వాసాల వల్ల పాప భీతితో నిజాం నవాబు ఈ మరణ శిక్షలను ఆమో దించే సంతకం చేయలేదు. అలాగే గోడకు నిలబెట్టి తుపాకీతో కాల్చివేసే పద్ధతి ఉన్న జారిస్టు రష్యాలో ఏదో నేరానికి మరణ శిక్ష పడిన డాస్టోవ్‌స్కీ రచయిత అనే విషయం తెలిసి, జార్ స్వయంగా మరణ శిక్ష అమలును ఆపివేశాడు. కానీ రెండు సార్లు ఉరికంబం దాకా వెళ్లి మరణవేదననంతా అనుభవించి తిరిగి వచ్చిన భూమయ్య, కిష్టాగౌడ్‌లు భారత రాజ్య చట్ట బద్ధ హత్య నుంచి బయటపడలేకపోయారు. వరవరరావు వ్యాసకర్త, విరసం సంస్థాపక సభ్యులు -
ఉరిశిక్ష నేరానికా, నేరస్తుడికా?
రెండు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదంతో చిన్నపిల్లలపై అత్యాచారాలు మరణదండన పరిధిలోకి వచ్చాయి. పసిమొగ్గలపై అత్యాచారాలు మన గుండెల్ని రగిల్చివేస్తున్నాయి. కానీ ఈ ఉరిశిక్షలతో ఈ ఘోరాలన్నింటికీ చరమగీతం పాడగలమా? అనేది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న. శిక్షలు నేరాలను నివారించాలేగాని నేరస్తుడిని నిర్మూలించకూడదు. ఉరిశిక్ష విధిస్తారన్న భయం ఉంటే నేరం చేయరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారన్న భయం కారణంగా హత్యలు ఆగిపోవడం లేదు. పైగా ఒక వ్యక్తి జీవించే హక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి అసలు ఉండకూడదు. భారతదేశంలో మరణ శిక్షలను బీఆర్ అంబేడ్కర్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిం చారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఇంకా చెప్పా లంటే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ఉరిశిక్షలు విధించినప్పటి నుంచి మరణశిక్షపై మన చట్టసభల్లో అనేక చర్చలు జరిగాయి. అనేక వాదనలూ వచ్చాయి. 7 దశాబ్దాల కాలంలో మన పాలకుల్లో పెద్దగా మార్పు రానప్పటికీ ఇతర సమాజాల్లో ఉరి శిక్షలపై ఎంతో విలువైన పరిణతి కనిపిస్తోంది. ప్రపం చవ్యాప్తంగా 136 దేశాల్లో ఉరిశిక్ష రద్దుచేశారు. దుర దృష్టవశాత్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరా జిల్లుతోన్న మన దేశంలో మాత్రం ఉరిశిక్షలు విధించే నేరాల జాబితాలో సరికొత్తవి జోడిస్తూ పోతున్నారు. దాని పర్యవసానమే మొన్న చిన్నారులపై అత్యాచా రాలకు మరణశిక్ష విధించడానికి వీలు కల్పించే బిల్లుకు లోక్‌సభతో ఆమోదముద్ర వేయించుకో వడం. ఈ వ్యాసం మొత్తం ఉరిశిక్షలను గురించే చర్చి స్తుంది తప్ప నేరాన్ని గురించి కాదు. ఎందుకంటే కుల, మత, ప్రాంత, లింగ, వర్గ వివక్షలతో నిండిన మన దేశంలో నేరం వేరు. శిక్ష వేరు. ఉరిశిక్షపై మళ్లీ చర్చ జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల పసి మొగ్గని చిదిమేసిన సామూహిక అత్యాచార, హత్యా ఘటన మన దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ‘కుడిచేయి ఏదో ఎడమచేయి ఏదో తేడాయే తెలియని నా కూతురికి హిందువెవరో, ముస్లింలెవ్వరో ఎలా తెలుస్తుంది? వాళ్లు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇంకెవరినైనా ఎంచుకోవా ల్సింది’ అని కఠువా ఘటనలో బలైన ఎనిమిదేళ్ల బాలిక తండ్రి అన్న మాటలివి. ‘మీ కూతురుకు హిందూ, ముస్లింలంటే ఎవరో తెలుసా?’ అని అడి గిన ప్రశ్నకి ఆ చిన్నారి తండ్రి ఇచ్చిన సమాధానమిది. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ పదిహేడేళ్ల అమ్మా యిపై చేసిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా రాజకీయాల్లోకి కుప్పలుతెప్పలుగా వచ్చిప డుతోన్న నేరస్తులనూ, నిరాఘాటంగా విరాజిల్లు తోన్న నేరప్రవృత్తినీ చెప్పకనే చెప్పింది. ఫిర్యాదు చేసిన మరునాడే బా«ధితురాలి తండ్రి లాకప్ డెత్ ఈ దేశంలో పేద, అణగారిన వర్గాలకు దొరుకుతున్న న్యాయం ఎలాంటిదో నిరూపించింది. ఈ రెండు ఘటనలూ దేశంలో మరోసారి ఉరిశిక్షల అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ప్రధానంగా అత్యంత కిరాతకంగా పసిమొగ్గను ఛిద్రం చేసిన కఠువా ఘటన మైనర్ల అత్యాచార కేసుల్లో మరణ దండన విధించాలన్న డిమాండ్‌ని ముందుకు తెచ్చింది. రెండు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదంతో చిన్నపిల్లలపై అత్యాచా రాలు మరణదండన పరిధిలోకి వచ్చాయి. పసిమొగ్గ లపై అత్యాచారాలు మన గుండెల్ని రగిల్చివేస్తు న్నాయి. సామాజిక సంక్షోభానికివి అద్దం పడుతు న్నాయి. కానీ ఈ ఉరిశిక్షలతో ఈ ఘోరాలన్నింటికీ చరమగీతం పాడగలమా? అనేది ప్రశ్న. ఉరిశిక్షలపై చర్చించిన సందర్భాలు... 1947 నుంచి 1949 వరకు జరిగిన రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా తెరపైకి వచ్చిన ఉరిశిక్షలపై రాజ్యాంగ రచనా కమిటీ ఛైర్మన్ బి.ఆర్. అంబేడ్కర్, ‘ఉరిశిక్షల రద్దుకే నా ఓటు’ అని స్పష్టంగా పేర్కొ న్నారు. అహింసను బోధించి ఆచరించే ఈ దేశ సంస్కృతికి మరణశిక్షల రద్దు సరిగ్గా సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వేళ కింది కోర్టులు ఉరిశిక్షలు విధిస్తే పై కోర్టుకు వెళ్లే వీలు ఉంటుంది కదా అన్న వాదనను సైతం తిరస్కరిస్తూ అంబేడ్కర్ పైవిధంగా స్పందించారు. అంతకు ముందు అంటే 1931లో భగత్‌సింగ్, రాజ్గురుల ఉరితీత సంద ర్భంగా ఉరిశిక్షల రద్దు మన దేశంలో తొలిసారిగా చర్చనీయాంశం అయింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిహార్ నుంచి ఎంపికైన బాబూ గయా ప్రసాద్ ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ను సవరించి ఉరిశిక్ష రద్దు చేయాలని ప్రయత్నించి విఫలమ య్యారు. తీర్మానం వీగిపోగా 1931 మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ను ఉరితీశారు. ఏడాది తర్వాత కరాచీలో మరణశిక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీర్మానం చేసింది. రాజ్యంగ రచన సంద ర్భంగా జరిగిన చర్చలో అంబేడ్కర్ మరణశిక్షపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. 1952–54 మధ్య కాలంలో లోక్‌సభలో మరణశిక్ష రద్దు ప్రస్తావనకు వచ్చింది. సెక్షన్ 302 ఐపీసీ సవరణకు కాంగ్రెస్ సభ్యులు ఎంఏ కాజ్మీ బిల్లు ప్రతిపాదించిన సంద ర్భంగా ఇది చర్చనీయాంశం అయింది. 1956లో లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు ముకుంద్‌లాల్ అగ ర్వాల్ మరణశిక్ష రద్దుకు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగాక అది వీగిపోయింది. 1958లో పృథ్వీ రాజ్ కపూర్ రాజ్యసభలో మరణ శిక్ష రద్దు కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు. చర్చ జరిగాక బిల్లును ఉపసం హరించారు. 1961లో ఇదే తరహా బిల్లును రాజ్యస భలో సావిత్రీ దేవి నికమ్ ప్రవేశపెట్టగా, చర్చ జరి గాక దాన్ని సభ తిరస్కరించింది. 1962లో లోక్ సభలో రఘునాథ్ సింగ్ ప్రవేశపెట్టిన మరణశిక్ష రద్దు బిల్లు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ వివరాలను లా కమిషన్ పరిశీలనకు పంపిస్తా మని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాకే బిల్లును ఉప సంహరించారు. ‘హత్య ఎవరు చేసినా హత్యే. అది వ్యక్తులు చేసినా, రాజ్యం చేసినా. ఇంకా చెప్పాలంటే చట్టబద్ధంగా మనిషిని చంపితే అది హత్య కాకుండా పోదు’ అనేదే ఈ బిల్లులపై జరిగిన చర్చల్లో మరణ శిక్షను వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయం. పరిస్థితుల ప్రభావంతోనే నేరాలు వ్యక్తి చేసే నేరం చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధా రపడి ఉంటుంది. ఆయా సామాజిక పరిస్థితులపైనా, విలువలపైనా ఆధారపడి ఉంటుంది. అది సామా జికమైన వ్యక్తిగత అంశం. కానీ రాజ్యం తన ప్రజల రక్షణకు కొన్ని నియమాలను రూపొందించుకున్న రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయా లకూ, భావావేశాలకూ తావుండకూడదు. ప్రతీకారా నికి చోటుండకూడదు. కానీ ఉరిశిక్షలో న్యాయం ప్రతీ కారంలా కనిపిస్తుంది. ఒక వర్గంపై, మన దేశంలో నైతే ఒక మతంపై, ఒక కులంపై లేదా ఒక జెండర్‌పై ఇంకా చెప్పాలంటే అసమానతలకు తావున్న చోటల్లా ఈ ప్రతీకారం బుసలు కొడుతుంది. నిజానికి అదే ప్రతీకారేచ్ఛ అత్యాచారాలకూ కారణమౌతోంది. అదే ప్రతీకారం ఉరిశిక్షలకూ కారణమవుతోంది. ఇది అత్యంత సంక్లిష్టంగా తోస్తోంది. రాజ్యం చేయాల్సిన పని తన ప్రజలను కాపాడుకోవడం. కానీ తన ప్రజ లను తానే చంపుకోవడం న్యాయంగా మారకూడదు. పంటికి పన్ను, కంటికి కన్ను అన్నట్టు మనిషిని చంపి నట్టు రుజువైతే మిమ్మల్ని కూడా చంపే హక్కు రాజ్యానికుంది అని చెప్పడమంటేనే రాజ్యం కక్షసా ధింపునకు దిగడం అని అర్థం. మానవ మనుగడకు ప్రతిబంధకంగా తయారయ్యే ఉరిశిక్ష మధ్యయుగాల నాటి ఆటవిక లక్షణం తప్ప మరొకటి కాదన్నది ఇప్ప టికే అనేకమంది తేల్చి చెప్పారు. ఫలితంగా, అనేక ప్రజాస్వామ్య దేశాల్లో మరణ శిక్షను రద్దు చేశారు. నేరాలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు నేరాలు జరు గుతున్నాయి? అనే విషయాలు చర్చించుకున్నాం. నేరం చేసే వ్యక్తిపై సమాజం ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే శిక్షలు ఎవరికి అన్నదే ప్రశ్న. మరణశిక్షలు అమలైన వారిపై అధ్యయనం చేయగా, వారిలో 76 శాతం దళితులు, ఆదివాసీలే ఉన్నారని తేలింది. 2015లో లా కమిషన్ సారథ్యంలో హైదరా బాద్‌కు చెందిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఉరిశిక్షలు పడిన 373 కేసులను పరిశీలించారు. వారిలో మూడొంతుల మంది దళితులేనని స్పష్ట మయింది. మరణ దండన పడుతున్నవారిలో 93.5 శాతం మంది అత్యంత పేదలూ, దళితులూ, ఆది వాసీలూ, మైనారిటీలేనని ఈ సర్వే తేల్చి చెప్పింది. భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎ.పి. షా మరణశిక్ష రద్దుచేయాలనే ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఎదుట ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరి గింది. మన దేశంలో రాష్ట్రపతి ఒక్కరే ఉరిశిక్షలు పడిన వారికి క్షమాభిక్ష పెట్టగలరు. తమకు అందిన క్షమాభిక్ష దరఖాస్తులు అన్నింటినీ తిరస్కరించిన రాష్ట్రపతులు శంకర్‌దయాళ్ శర్మ, ఆర్.వెంకట్రా మన్, ప్రణబ్. తనకొచ్చిన అన్ని క్షమాభిక్ష దరఖాస్తు లకూ మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించినవారు కె.ఆర్.నారాయణన్, ప్రతిభాపా టిల్. ఏపీజే అబ్దుల్ కలామ్ ఏకంగా, మరణ దండ నను రద్దు చేయాలని భావించారు. 2012 జూలై 25 నుంచి ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్న 27 నెలల కాలంలో మొత్తం 23 క్షమాభిక్ష కోరుతూ అభ్యర్థనలు వస్తే అందులో 22 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలు స్తోంది. అలాగే శంకర్ దయాళ్ శర్మ సైతం మొత్తం 14 క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు. ఆర్. వెంక ట్రామన్ 33 అభ్యర్థనలను జైల్‌సింగ్ 20 క్షమాభిక్షల పిటిషన్లు తిరస్కరించారు. ఎందుకు మరణశిక్షను వ్యతిరేకించాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొప్ప తీర్పులిచ్చిన వీఆర్ కృష్ణయ్యర్ మరణ శిక్షలను మొదటి నుంచీ వ్యతిరేకించారు. 1957–59 మధ్య కేరళ ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. జస్టిస్ అయ్యర్ జడ్జి అయ్యాక తన ఆలోచనలను ఆచరణలో చేసి చూపించారు. సుప్రీంకోర్టు బెంచ్‌ల సభ్యుడిగా ఉండగా తన పరి శీలనకు వచ్చిన మూడు కేసులను విచారించి, దోషు లకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదు శిక్షలుగా మార్చారు. శిక్షలు నేరాలను నివారిం చాలేగాని నేరస్తుడిని నిర్మూలించకూడదు. ఉరిశిక్ష విధిస్తారన్న భయం ఉంటే నేరం చేయరనే అభి ప్రాయం చాలా మందిలో ఉంది. కానీ మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారన్న భయం కారణంగా హత్యలు ఆగిపోవడం లేదు. హత్య చేసినందుకు దోషిని ఉరి తీస్తే పోయేది మరో ప్రాణమే. మనిషిని వ్యక్తి చంపినా, రాజ్యం చంపినా అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఒక వ్యక్తి జీవించే హక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి ఉండ కూడదు. మల్లెపల్లి లక్ష్మయ్య , వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
మానవ మృగానికి మరణ దండన
జైపూర్: ఏడు నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పింటూ(19) అనే యువకుడికి రాజస్తాన్‌లోని అళ్వార్ జిల్లా కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో ఈ ఏడాది మే 9న ఏడు నెలల వయసున్న బాలికను పింటూ రేప్ చేశాడు. దీంతో పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టుచేశారు. కేసును విచారించిన ప్రత్యేక జడ్జి జగేంద్ర అగర్వాల్.. పింటూను జూలై 18న దోషిగా నిర్ధారించారు. అనంతరం ఐపీసీ 363, 336ఏ, 376ఏబీ, పోక్సో చట్టం కింద దోషికి శనివారం మరణశిక్ష విధించారు. 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడే నేరస్తులకు మరణదండన విధించేలా నేరచట్టాన్ని సవరిస్తూ రాజస్తాన్ సర్కారు ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక రాజస్తాన్‌లో తొలిసారి సెక్షన్ 376ఏబీ కింద దోషికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. -
చెన్నై టెక్కీకి మరణశిక్ష ; సమర్ధించిన హైకోర్టు
చెన్నై : మైనర్‌పై అత్యాచారానికి, హత్యకు పాల్పడ్డ ఓ టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్‌కు మరణ శిక్ష సరైనదే అంటూ మంగళవారం తీర్పు వెలువరించింది. చెన్నై సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న దశ్వంత్.. గతేడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశగా చూపి ఇంటికి పిలిచి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన లోకల్ కోర్టు దశ్వంత్‌కు మరణశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు లోకల్ కోర్టు తీర్పును సమర్ధించింది. తల్లిని చంపిన కేసు కూడా.. లోకల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతునప్పుడు.. గతేడాది డిసెంబర్లో దశ్వంత్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతడు తన తల్లి సరళ చంపి ఆమె ఆభరణాలతో ముంబై పారిపోయాడు. చివరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నై తరలించారు. ఇంకా సరళ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. -
‘నిర్భయ’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
దేశం నడిబొడ్డున అర్ధరాత్రి పారామెడికల్ విద్యార్థిని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపిన దోషుల భవితవ్యం నేడు తేలనుంది. మరణ శిక్ష రద్దు కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీం తీర్పు కోసం దేశం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున పిటిషన్ దాఖలైంది. మరో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్(31) కూడా దాఖలు చేయనున్నట్లు అతని తరపు న్యాయవాది తెలిపాడు. కాగా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్‌ల ఆధర్వ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరికొద్ది గంటల్లోనే తీర్పు వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది. మరణ శిక్షనే అమలు చేయాలని తీర్పిస్తుందా? లేదా? జీవిత ఖైదుగా మారుస్తుందా? అన్న చర్చ మొదలైంది. కాగా, 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి కన్నుమూసింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. -
సంచలనం: 46 రోజుల్లోనే కోర్టు తీర్పు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును వెలువరించింది. తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సాగర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మే 21 తేదిన తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను నలబైఏళ్ల వ్యక్తి పక్కనున్న గుడి సమీపంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన పోలీసులు మే 25న పూర్తి వివరాలను కోర్టును సమర్పించారు. మొత్తం ఇరవైమంది సాక్షులను విచారించిన కోర్టు ఘటన జరిగిన 46 రోజుల్లోనే తీర్పును వెలువరించడం విశేషం. లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ (పోస్కో) చట్టం, ఐపీసీ సెక్షన్ 376(అత్యాచారం), సెక్షన్ 366(అపహరణ) సెక్షన్ల పై విచారణ చేపట్టి శిక్ష విధించినట్లు అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సుధాన్ష్ సక్సేనా తీర్పులో పేర్కొన్నారు. -
రేపిస్టులకు వణుకు.. సంచలన తీర్పు
మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించే వార్త. మధ్యప్రదేశ్‌లో ఓ రేప్ కేసు దోషికి కోర్టు మరణ శిక్ష విధించింది. కేవలం 46 రోజుల్లోనే కేసులో నిందితుడికి శిక్ష పడటం గమనార్హం. భోపాల్ : 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలంటూ గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఏప్రిల్ 21న చట్టం రూపం దాల్చింది. ఇదిలా ఉంటే రెహిల్ జిల్లా ఖమారియా గ్రామంలో ఓ ఆలయంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మే 21న పటేల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడిని దోషిగా తేల్చిన సాగర్ జిల్లా కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అంతేకాదు త్వరగతిన శిక్షను అమలు చేయాలని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దోషికి ఉరిశిక్ష పడడం ఇదే తొలిసారి. కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందని, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. హోమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టాలన్నారు. కొడుకులా చూసుకున్నాం, కానీ... -
మీకు పెంకా తెలుసా?
కొన్ని రోజుల క్రితం వరకు మీకే కాదు.. ఆమె యజమాని ఇవాన్‌కు తప్పిస్తే.. పెంకా అంటే ఎవరికీ తెలియదు.. ఆవులు, గేదెలు అంటే.. అలా పక్కనున్న పొలాల్లో, తోటల్లో గడ్డి మేయడం కోసం వెళ్లడం మామూలే.. పెంకా కూడా అలాగే వెళ్లింది.. అలా వెళ్లినందుకు పెంకాకు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష!! ► పెంకా ఓ ఆవు.. బల్గేరియాలోని సరిహద్దు గ్రామం కొపిలోట్సీలో ఉంటుంది.. ఓ 20 రోజుల క్రితం గడ్డి మేస్తూ.. మేస్తూ.. అలా కొంచెం దూరం వెళ్లింది.. తోడేళ్లు వెంటపడ్డాయి.. పరిగెడుతూ.. పరిగెడుతూ అనుకోకుండా సరిహద్దును దాటింది.. సెర్బియాలోకి వెళ్లిపోయింది.. పెంకా కనిపించకపోయేసరికి ఆమె యజమాని ఇవాన్, అతని కుమారులు అన్ని చోట్లా వెతికారు. సరిహద్దు భద్రత అధికారులకు విషయం తెలియజేశారు. ► కొన్ని రోజుల క్రితం.. పెంకా సెర్బియాలోని బోసిల్గ్రాడ్ గ్రామంలో ఉందని తెలిసింది.. ఇవాన్ ఆనందానికి అవధుల్లేవు.. వెంటనే బయల్దేరాడు.. బోసిల్గ్రాడ్ చేరుకున్నాడు.. దారితప్పి వచ్చిన పెంకాను అక్కడివాళ్లు బాగానే చూసుకున్నారు. పెంకా ఆరోగ్యంగానే ఉందని.. ఇంటికి తీసుకెళ్లొచ్చని సెర్బియా పశు వైద్యుడు కూడా ధ్రువీకరించడంతో దాన్ని పట్టుకుని.. ఇవాన్ తిరుగు ప్రయాణమయ్యాడు. ► పేపర్స్ ఏవి.. ప్రశ్నించాడు బల్గేరియాలోని సరిహద్దు భద్రతాధికారి.. పేపర్స్ ఏమిటి అన్నాడు ఇవాన్. పెంకా దారి తప్పిన విషయం చెప్పాడు.. యూరోపియన్ యూనియన్ రూల్స్ గురించి తెలియవా అంటూ çహూంకరించాడా అధికారి. బల్గేరియా ఈయూ సభ్య దేశం.. సెర్బియా కాదు.. సరైన ధ్రువపత్రాలు లేకుండా.. ఈయూ సభ్యదేశంలోని వారు వేరే దేశానికి వెళ్లడం.. తగు పత్రాలు లేకుండా తిరిగి దేశంలోకి రావడం నిషేధం.. వాళ్ల లెక్క ప్రకారం పెంకా అక్రమంగా సరిహద్దు దాటింది.. ఇప్పుడు కూడా సరైన పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దు దాటి రావాలని చూస్తోంది. అక్కడి చట్టాల ప్రకారం ఆ అపరాధానికి శిక్ష.. మరణమే.. ► మరికొన్ని రోజులే.. ఇవాన్‌కు చెప్పాడు అతడి గ్రామంలోని పశువైద్యుడు. నేను చేయగలిగింది ఏమీ లేదు.. చట్టాలు అలాగున్నాయని అన్నాడు.. పెంకా అక్రమంగా సరిహద్దు దాటడమొక్కటే కాదు.. సెర్బియా నుంచి ఏమైనా రోగాలను మోసుకొచ్చిందేమోనన్న అనుమానం కూడా అధికారులకు ఉంది. అలాగని పరీక్షలు చేయలేదు. సెర్బియా వైద్యుడు పరీక్ష చేసి ఇచ్చిన పత్రాన్నీ నమ్మలేదు.పెంకాకు మరణ శిక్ష విధించడంపై తొలుత అక్కడి సోషల్‌మీడియాలో గగ్గోలు రేగింది. తర్వాత తర్వాత అది ఈయూ అంతా వ్యాపించింది. పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది.. ఏమిటి హద్దు.. ఏమిటి సరిహద్దు అన్నది పశువులకు ఎలా తెలుస్తుంది? చట్టాలు కఠినమే.. కానీ కామన్సెన్స్ అన్నది కూడా ఒకటుండాలిగా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. పెంకాను రక్షించాలంటూ సంతకాల ఉద్యమమూ ఉధృతమైంది. ఏం జరగనుందో అన్న ఉత్కంఠ అంతటా పెరిగింది. ► మీకో విషయం తెలుసా? పెంకా.. గర్భవతి.. రెండు, మూడువారాల్లో మరో బుల్లి పెంకాకు జన్మనివ్వనుంది.. మరి.. పెంకా బతుకుతుందా? మరో బుల్లి పెంకాకు బతుకునిస్తుందా? -
మరణశిక్షలతో నేరాలు ఆగుతాయా?
కఠిన చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా జరగకపోతే లేదా అమల్లో తీవ్ర జాప్యం జరిగితే వాటి వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అనుమతిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ నేపథ్యంలో క్రూరమైన నేరాలు జరగకుండా ఉరిశిక్షలు ఏ మేరకు హెచ్చరికలుగా నిలుస్తాయన్నది చర్చనీయాంశమవుతోంది. ఐరాసతో సహా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మరణశిక్షలు అమానవీయమని వీటిని రద్దు చేయాలని గట్టిగా డిమాండ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిశిక్షల అమలు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలోని న్యాయస్థానాల్లో కేసుల విచారణ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల నిందితులు తీవ్ర నేరాలకు పాల్పడకుండా మరణశిక్షలు నియంత్రణగా ఉపయోగపడడం లేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. 2017 ఆఖరు నాటికి భారత్‌లో 371 మంది మరణశిక్ష పడిన ఖైదీలున్నారు. వారిలో... 1991లో శిక్ష పడిన ఖైదీ కూడా ఉన్నాడు. అంటే అతడిది 27 ఏళ్ల నిరీక్షణ. 2017లో దేశవ్యాప్తంగా వివిధస్థాయిల్లోని న్యాయస్థానాలు 109 మందికి ఉరిశిక్ష విధించాయి. 2016లో ఈ సంఖ్య 149గా ఉంది. అయితే గత పధ్నాలుగేళ్లలో కేవలం నలుగురికి మాత్రమే ఈ శిక్షను అమలుచేశారు. వీరిలోనూ ముగ్గురికి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడినందుకు, ఒకరికి మాత్రమే మైనర్‌పై లైంగికదాడి, హత్యకు పాల్పడినందుకు మరణశిక్ష విధించారు. ఉరిశిక్ష పడిన 127 మంది ఖైదీల కేసుల విచారణకు అయిదేళ్లకు పైగా, 54 మందికి పదేళ్లకు పైగా, మిగతా వారికి అయిదేళ్ల వరకు సమయం పడుతోంది. ఉరిశిక్ష రద్దుకు ఖైదీలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి తిరస్కరణకు గురవడానికి మధ్యకాలంలో 10 నుంచి 16 ఏళ్ల శిక్షను వారు అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసులో పడిన ఉరిశిక్షను సమీక్షించాలంటూ నలుగురిలో ఇద్దరు ఖైదీలు పెట్టుకున్న పిటీషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకటన వాయిదా వేసింది. ఉరిశిక్షలనేవి నేరస్థులను అంతమొందిస్తాయే తప్ప నేరాన్ని కాదంటూ ఈ ఖైదీల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఎవరు జీవించాలి, ఎవరు మరణించాలి అన్న విషయాన్ని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయంటూ ప్రశ్నించారు. గత 14 ఏళ్లలో ఉరి అమలు 4 కేసుల్లోనే... 1993 నాటి ముంబై వరుస బాంబుపేలుళ్ల కేసులో 2015 జులై 30న యాకుబ్ మెమన్‌కు నాగ్‌పూర్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు పార్లమెంట్‌పై దాడి చేసులో మహ్మద్ అఫ్జల్ గురుకు 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్ జైలులో శిక్ష పూర్తిచేశారు. 2008లో ముంబైపై పాక్ ముష్కరులు ఉగ్రదాడి జరిపిన కేసులో సజీవంగా పట్టుకున్న అజ్మల్ అమీర్ కసబ్‌ను 2012 నవంబర్ 21న పుణెలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. టీనేజీ అమ్మాయి అత్యాచారం,హత్య కేసులో 2004 ఆగస్టు 14న పశ్చిమబెంగాల్ లోని అలీపూర్ జైలులో ధనుంజయ్ ఛటర్జీ (42)కి మరణశిక్ష అమలుచేశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అబద్ధం నిజం
కథాసారం పదిహేనేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక విందు గురించి ఆలోచిస్తున్నాడు ముసలి బ్యాంకర్. ఆ విందులో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. అంశం మరణశిక్ష మీదకు మళ్లింది. అతిథుల్లోని చాలామంది పండితులు, పాత్రికేయులు మరణశిక్షను నీతిబాహ్యమైనదిగా నిరసించారు. దానికి బదులుగా యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయాలన్నారు. ‘నేను మీతో ఏకీభవించను,’ అన్నాడు బ్యాంకర్. ‘నేను మరణశిక్షనుగానీ యావజ్జీవాన్నిగానీ అనుభవించనప్పటికీ, నా ఉద్దేశంలో మరణదండనే నీతివంతమైనదీ మానవీయమైనదీ కూడా. అది ఒకేసారి చంపేస్తుంది, యావజ్జీవం దశలవారీగా ప్రాణం తీస్తుంది. ఏది మానవీయం?’ ‘రెండూ సమానంగా నీతిబాహ్యమైనవే’ అన్నాడు ఒక అతిథి. ‘వాటి లక్ష్యం ఒకటే, ప్రాణాన్ని తీయడం. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, అది ఇవ్వలేని జీవితాన్ని తీసుకునే హక్కు దానికి లేదు’. అతిథుల్లో ఒక పాతికేళ్ల న్యాయవాది కూడా ఉన్నాడు. అతడి స్పందన ఏమిటా అని అడిగినప్పుడు, ‘రెండూ కూడా సమానంగా అధర్మమైనవే. కానీ అవకాశం ఉంటే గనుక నేను యావజ్జీవాన్నే ఎంచుకుంటాను. చనిపోవడం కన్నా ఏదో విధంగా బతికివుండటం నయం కదా’ అన్నాడు. బ్యాంకర్‌కు అసహనం పెరిగింది. టేబుల్ మీద గుద్దుతూ, ‘అది అబద్ధం. ఐదేళ్లు కూడా నువ్వు జైల్లో ఉండలేవని ఇరవై లక్షల పందెం’ అన్నాడు. ‘మీరు సీరియస్‌గానే అంటున్నారంటే, ఐదు కాదు పదిహేనేళ్లుంటాను’ బదులిచ్చాడు లాయర్. ‘పదిహేనా! సరే!’ అరిచాడు బ్యాంకర్. ‘నా పందెం ఇరవై లక్షలు’. ‘ఒప్పుకుంటున్నా. మీ పందెం ఇరవై లక్షలు, నా పందెం నా స్వతంత్రం’. అట్లా ఈ అర్థం లేని పందెం అమలులోకొచ్చింది. భోజనం సమయంలో న్యాయవాదితో, ‘ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నాకు ఇరవై లక్షలతో పోయిందేమీ లేదు, నువ్వు అనవసరంగా నీ జీవితంలోని విలువైన నాలుగైదేళ్లను కోల్పోతావు’ అని హెచ్చరించాడు. ‘మూడు నాలుగు అని ఎందుకంటున్నానంటే నువ్వు అంతకంటే ఎక్కువకాలం ఉండలేవు. తప్పనిసరైతే సరే, కానీ ఐచ్ఛిక శిక్షను భరించలేవు. ఎప్పుడంటే అప్పుడే స్వేచ్ఛను పొందగలనన్న స్పృహ నీ ఖైదుకాలాన్ని విషతుల్యం చేస్తుంది’. అప్పటి పందెం గురించి బ్యాంకర్ తలపోస్తూ ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ‘ఆ పందెం నేను ఎందుకు కాసినట్టు? దానివల్ల జరిగే మేలేమిటి? ఆ లాయర్ తన జీవితంలో పదిహేనేళ్లు కోల్పోతాడు, నేను నా ఇరవై లక్షలు తగలేస్తాను. దీనివల్ల యావజ్జీవం మరణదండనకన్నా మెరుగనో, హీనమనో ఏమైనా తేలుతుందా? డబ్బు కొవ్వున్నవాడి చపలచిత్తం నాదైతే, డబ్బు మీది దురాశ ఆ లాయర్‌ది’. ఆ విందు తర్వాత న్యాయవాదిని బ్యాంకర్ పెరటింటిలో ఖైదు చేయాలని నిశ్చయించారు. అతడు తన ఖైదుకాలంలో గడప దాటి బయటకు రాకూడదు, మనుషులను చూడకూడదు, వారి గొంతు వినకూడదు, ఉత్తరాలు స్వీకరించకూడదు, వార్తాపత్రికలు తెప్పించుకోకూడదు. సంగీత వాద్యం ఉంచుకోవచ్చు, పుస్తకాలు చదవొచ్చు, లేఖలు రాయొచ్చు, మద్యం, పొగ తాగొచ్చు. వీటిల్లో ఏది కావాలన్నా ప్రత్యేకంగా నిర్మించిన గది కిటికీ గుండా చిన్న నోట్ పంపొచ్చు. అన్ని సూక్ష్మ వివరాలతో సహా ఒప్పందం రాయబడింది. నవంబర్ 14, 1870 పన్నెండు గంటల నుంచి నవంబర్ 14, 1885 పన్నెండింటిదాకా సరిగ్గా పదిహేనేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లోవుంటుంది. దీన్ని కనీసం రెండు నిమిషాల ముందు ఉల్లంఘించినా బ్యాంకర్ ఇరవై లక్షలు చెల్లించనక్కర్లేదు. అతడు పంపిన చిన్న నోట్సుల ఆధారంగా తెలిసింది ఏమంటే, మొదటి సంవత్సరపు ఖైదులో లాయర్ తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. ఆ గదిలోంచి రాత్రీ పగలని లేకుండా పియానో శబ్దాలు వినబడేవి. అతడు మద్యాన్నీ పొగనూ నిరాకరించాడు. ‘మద్యం కోరికలను రగిలిస్తుంది. ఖైదీకి ముఖ్య శత్రువులు కోరికలు’ అని రాశాడు. గదిలోని వాతావరణాన్ని పాడు చేస్తుందని పొగ కూడా తాగలేదు. మలుపులున్న ప్రేమ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ వంటి చౌకబారు పుస్తకాలను తెప్పించుకున్నాడు. రెండో ఏడాదిలో పియానో శబ్దాలు అసలు వినబడలేదు. క్లాసిక్ రచనలు మాత్రమే కోరుకున్నాడు. మళ్లీ ఐదో ఏడాదిలో ఆ గదిలోంచి సంగీతం వినబడింది. మద్యం కూడా కావాలని కోరాడు. ఆ సంవత్సరమంతా అతడు తినడం, తాగడం, తన మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. తరచూ ఆవలించేవాడు. తనలో తాను కోపంగా మాట్లాడుకునేవాడు. చాలాసేపు ఏదో రాసుకునేవాడు, దాన్ని మళ్లీ తెల్లారి మొత్తం చించేసేవాడు. చాలాసార్లు ఏడ్చేవాడు. ఆరో సంవత్సర ద్వితీయార్థంలో భాషాశాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర ఉత్సాహంగా చదివాడు. ఎంత ఆబగా చదివాడంటే అతడు కావాల్సిన పుస్తకాలను తెప్పించడానికి బ్యాంకర్‌కు సమయం చాలేది కాదు. నాలుగేళ్ల కాలంలో ఆరువందల ఉద్గ్రంథాలను కొనాల్సివచ్చింది. ఆ తీవ్రోత్సాహంలో ఉన్నప్పుడే లాయర్ నుంచి బ్యాంకర్‌కు ఓ లేఖ వచ్చింది. ‘నా ప్రియమైన జైలర్, నేను ఈ వాక్యాలను ఆరు భాషల్లో రాస్తున్నాను. వాటిని నిపుణులకు చూపించండి. అందులో గనక ఒక్క తప్పూ లేకపోతే దయచేసి పెరట్లో ఒకసారి తుపాకీని కాల్పించండి. ఆ శబ్దం వల్ల నా ప్రయత్నం విఫలం కాలేదని తెలుస్తుంది. భిన్న దేశాల్లోని భిన్న తరాల మేధావులు భిన్న భాషల్లో మాట్లాడినప్పటికీ వాళ్లందరిలోనూ వెలిగే జ్యోతి ఒక్కటే. వాళ్లందరినీ అర్థం చేసుకోగలిన నా పరమానందాన్ని ఏమని వర్ణించను!’ అతడి కోరిక నెరవేరింది. బ్యాంకర్ ఆదేశం మీద రెండుసార్లు పెరట్లో తుపాకీ పేలింది. పదో ఏడాది తర్వాత లాయర్ తన టేబుల్ మీద నిశ్చలంగా కూర్చుని న్యూ టెస్టమెంట్ చదివాడు. నాలుగేళ్లలో ఆరు వందల పాండిత్య గ్రంథాల్ని చదివినవాడు ఈ సన్నటి, తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని సుమారు ఏడాదికాలం చదవడం బ్యాంకర్‌ను ఆశ్చర్యగొలిపింది. తర్వాత లాయర్ మత చరిత్రలు, వేదాంతం కోరుకున్నాడు. చివరి రెండేళ్లు లెక్కాపత్రం లేకుండా చదివాడు. ప్రకృతి శాస్త్రాలు, బైరన్, షేక్స్పియర్, ఒకసారి రసాయన శాస్త్రం కోరేవాడు, మరోసారి వైద్యశాస్త్రం, నవల, తత్వశాస్త్రం మీద సిద్ధాంత గ్రంథం... సముద్ర ప్రయాణంలో ప్రమాదానికి గురైన నౌకలోనివాడు దొరికిన చెక్కనల్లా పట్టుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఒక్కో పుస్తకం చదివాడు. .... ఇక రేపు పన్నెండు గంటలైతే పందెం పూర్తవుతుంది. ‘నేను అతడికి ఇరవై లక్షలు చెల్లించాల్సి వుంటుంది’ అని గుర్తుచేసుకున్నాడు బ్యాంకర్. ‘చెల్లిస్తే గనక నేను దివాళా తీసినట్టే’. పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్ దగ్గర లక్షలు మూలిగాయి. కానీ ఇప్పుడు ఆస్తులకంటే అప్పులు అధికం. స్టాకు మార్కెట్లతో ఆడిన జూదం, జాగ్రత్తపడలేనితనం అతన్ని నిండా ముంచాయి. అతడి పూర్వపు ఆత్మవిశ్వాసం పోయింది. ‘శాపం లాంటి పందెం’ అనుకున్నాడు. ‘అతడెందుకు చావలేదు? మహా అయితే అతడికి నలబై ఏళ్లు. నా చివరి రూపాయి కూడా తీసుకుని వెళ్లిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, జూదం ఆడతాడు. నేనేమో బిచ్చగాడిలా దీనంగా నిలబడితే అతడు ‘నేనేమైనా మీకు సాయం చేయగలనా’ అని అడుగుతాడు. ఇది నేను భరించలేను. దీన్ని తప్పించుకోవాలంటే అతడు చావడం ఒకటే మార్గం’. గడియారం మూడు కొట్టింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా అతడు ఇనప్పెట్టెలోంచి ఆ పదిహేనేళ్ల పాటు తెరవని గది తాళంచెవి తీసుకున్నాడు. పెరడంతా చీకటిగావుంది. వర్షం కురుస్తోంది. వాచ్‌మన్ వానకు ఎక్కడో పడుకున్నట్టున్నాడు. పిలిస్తే బదులు రాలేదు. ‘నేను అనుకున్న పని ధైర్యంగా చేయగలిగితే అనుమానం వాచ్‌మన్ మీదికి పోతుంది’ అనుకున్నాడు. బందీ ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూశాడు. క్యాండిల్ వెలుగుతోంది. బందీ టేబుల్ ముందు కూర్చున్నాడు. కిటికీ మీద చిన్నగా తట్టాడు. బందీ కదలలేదు. బ్యాంకర్ జాగ్రత్తగా తాళం మీది సీల్ చించి, చెవితో తాళం తీశాడు. తుప్పు పట్టిన తాళం చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపలినుంచి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఊహించాడు. కానీ పదిహేనేళ్ల బందీఖానా లాయర్‌ను కదలకుండా కూర్చోవడం నేర్పింది. బ్యాంకర్ లోపలికి పోదామని నిశ్చయించుకున్నాడు. ఒక అస్థిపంజరంలాంటి శరీరం కూర్చునివుంది. పొడవైన వెంట్రుకలు. అవీ తెల్లబడుతున్నాయి. పసుపు పచ్చటి ముఖం. నలబై ఏళ్లవాడంటే ఎవరూ నమ్మరు. టేబుల్ మీద ఏదో రాసిన కాగితం ఉంది. ‘లక్షలు వస్తాయని కలగంటున్నట్టున్నాడు, మంచం మీదకు తోసి దిండుతో అదిమానంటే ఈ సగంప్రాణి పూర్తిగా చస్తుంది’ అనుకున్నాడు బ్యాంకర్. ‘ముందైతే ఏం రాశాడో చదువుదాం’. ‘రేపు అర్ధరాత్రి పన్నెండుకు నా స్వతంత్రం నాకు వెనక్కి వస్తుంది. కానీ ఈ గదిని వదిలి, సూర్యుణ్ని చూడటానికి ముందు కొన్ని మాటలు పంచుకోవాలి. నా స్వతంత్రాన్నీ, నా జీవితాన్నీ, నా ఆరోగ్యాన్నీ, మీ పుస్తకాలు ప్రపంచ భాగ్యాలని వర్ణించేవన్నింటినీ నా ఆత్మసాక్షిగా అసహ్యించుకుంటున్నాను. ఎండమావి లాగా ప్రతిదీ శూన్యంగా, మి«థ్యగా కనబడుతోంది. అందం, తెలివితేటలు ఎన్నివున్నా మృత్యువు తప్పదు. మేధావుల అమరత్వం కూడా నశించిపోయేదే. మీరు తప్పుదోవలో పయనిస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, వికారాన్ని అందంగా భావిస్తున్నారు. మీరు దేనికోసమైతే జీవిస్తున్నారో దాని పట్ల నాకున్న తిరస్కారాన్ని తెలియజేసేందుకు నేను ఒకప్పుడు స్వర్గసమానంగా భావించిన ఇరవై లక్షలను వదులుకుంటాను. సరిగ్గా రేపు ఐదు నిమిషాల ముందు గదిలోంచి వెళ్లిపోయి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను’. చదవగానే బ్యాంకర్ అతడి తలను ముద్దాడి, ఏడుస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. జీవితంలో ఏనాడూ తన పట్ల తనకు ఇంత అసహ్యం కలగలేదు. తెల్లారి, ఆ మనిషి గది కిటికీ ఎక్కి వచ్చి, గేట్లోంచి అదృశ్యమయ్యాడని పరుగెత్తుతూ వచ్చి చెప్పాడు వాచ్‌మన్. బ్యాంకర్ ఆ విషయాన్ని ధృవపరుచుకుని, అనవసరమైన పుకార్లు రాకుండా, ఇరవై లక్షలపై తన హక్కును వదులుకుంటున్నట్టుగా లాయర్ రాసిన కాగితాన్ని ఇనప్పెట్టెలో భద్రపరిచాడు. (ఆంటన్ చెహోవ్ (1860–1904) రష్యన్ కథ ‘ద బెట్’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో చెహోవ్ ఒకరు.) -
ఉరిశిక్ష రద్దుపై పిటిషన్.. కీలక పరిణామాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉరి శిక్ష రద్దును చేసి.. ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించించి. దీనికి స్పందించిన కేంద్రం మంగళవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని పరిశీలనకు స్వీకరించిన తదుపరి విచారణను వాయిదా వేసింది. కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొన్న వివరాలు -
ఉరి వల్ల రేప్‌లు ఆగుతాయా?
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. పోర్న్ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్ వెబ్సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు. (చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?) -
గొంతు కోసి.. శవాల్ని ముక్కలు చేసి..
బీజింగ్ : తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టించడానికి. చైనాకు చెందిన సీరియల్ కిల్లర్ గావో చింగ్‌యాంగ్ విషయంలోనూ అదే జరిగింది. నేరాలు చేసి మారువేషాల్లో తిరిగే గావోతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా నేర ప్రవృత్తి కలవారే. ఒక హత్య కేసులో అరెస్టయిన గావో రక్తసంబంధీకుడి డీఎన్ఏ ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టించింది. దీంతో 28 ఏళ్లుగా పోలీసులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. అత్యంత పాశవికంగా 11 మంది మహిళలను హత్య చేసిన ఈ సీరియల్ కిల్లర్‌కు బేయిన్ సిటీ కోర్టు మరణశిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడిన గావోకు మరణశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టు పేర్కొంది. సమాజానికి హానికారకంగా తయారైన ఇటువంటి వ్యక్తికి మళ్లీ అప్పీలుకు వెళ్లే అర్హత కూడా లేదంటూ వ్యాఖ్యానించింది. చైనా రిప్పర్.. గావో చైనా జాక్ ద రిప్పర్‌గా పేరొందిన గావో చింగ్‌యాంగ్‌కు మహిళలంటే ద్వేషం. ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలను వెంబండించి, వారి గొంతు కోసేవాడు. తర్వాత శవాలను ముక్కలు ముక్కలు చేసి రాక్షసానందం పొందేవాడు. 1988- 2002 మధ్య కాలంలో 11 మంది మహిళలను ఇదేరీతిలో హత్య చేశాడు. బాధితుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులకు చిక్కకుండా గావో సుమారు మూడు దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగాడు. అతని కోసం గాలించి విసుగు చెందిన పోలీసులు.. అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల యువాన్ల రివార్డు కూడా ప్రకటించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఇక వైట్ చాపెల్ మర్డరర్‌గా ప్రసిద్ధి చెందిన లండన్‌కు చెందిన జాక్ రిప్పర్ సీరియల్ కిల్లర్. ఇతడిపై ఐదుగురు మహిళలను హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపితం కాలేదు. -
మానవ మృగానికి నాలుగుసార్లు మరణదండన
లాహోర్, పాకిస్తాన్ : ఏడేళ్ల బాలికని పైశాచికంగా హింసించి, హత్య చేసి, చెత్త బుట్టలో పడేసిన కేసులో నిందితుడు ఇమ్రాన్ అలీకి శనివారం ఉరి శిక్ష పడింది. లాహోర్ కేంద్ర కారాగారంలో కేసును విచారించిన యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి అన్నెంపున్నెం ఎరుగని పసిపాపపై అమానుషానికి ఒడిగట్టినందుకు నాలుగు సార్లు మరణ దండనతో పాటు జీవిత ఖైదు, రూ. 32 లక్షల జరిమానా విధించారు. హత్యానంతరం బాలిక దేహాన్ని చెత్తకుప్పలో పడేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల ఫైన్ వేశారు. ఇమ్రాన్‌పై కిడ్నాపింగ్, రేప్, హత్య, టెర్రరిజం సంబంధిత కార్యకలాపాల్లో సంబంధం తదితర ఆరోపణలు ఉన్నట్లు పాకిస్తాన్ జాతీయ పత్రిక డాన్ ప్రచురించింది. నిందితుడు చేసిన నేరాలను కోర్టులో ఒప్పుకున్నట్లు న్యాయవాది తెలిపారు. కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు దోషికి 15 రోజులు సమయం ఉంటుందని వివరించారు. ఏడేళ్ల జైనాబ్ అమీన్‌ను ఇమ్రాన్ అలీ జనవరి 4న కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి క్రూరాతి క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటనతో పాకిస్తాన్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. చిన్నారులను కూడా కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకెక్కారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణను సైతం వేగవంతంగా ముగించింది. -
భార్యకు ఫోన్లో కూతుళ్ల ఆర్తనాదాలు వినిపిస్తూ హత్య..
హంట్స్‌విల్లే: తన ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన వ్యక్తికి అమెరికాలో మరణ శిక్ష అమలుచేశారు. 2001 నాటి ఈ కేసులో దోషిగా తేలిన డాలస్‌కు చెందిన అకౌంటెంట్ జాన్ డేవిడ్ బాటాగ్లియా(62)కు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న బాటాగ్లియా ఓసారి తన కూతుళ్లు ఫేత్(9), లిబర్టీ(6) వద్దకు వచ్చి వారిని కాల్చి చంపాడు. ఆ సమయంలో భోజనం చేయడానికి వారి తల్లి మేరీ జేన్ పియర్లీ బయటికి వెళ్లింది. పియర్లీకి ఫోన్ చేసి మరీ కూతుళ్ల ఆర్తనాదాలను వినిపిస్తూ బాటాగ్లియా వారిని హత్య చేశాడు. అవతలి వైపు పియర్లీ నిస్సహాయంగా ఫోన్లో.. చంపొద్దంటూ ఫేత్ తన తండ్రిని వేడుకుంటున్న మాటలను విన్నా ఏం చేయలేకపోయింది. బాటాగ్లియా(62) మానసిక స్థితి సరిగా లేదని మరణశిక్షకు అనర్హుడని, అతని తరఫు లాయర్లు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో టెక్సాస్‌లో తాజాగా శిక్షను అమలుపరిచారు. ఇది ఈ ఏడాది అమెరికాలో అమలుచేసిన మూడో మరణశిక్ష కావడం గమనార్హం. అన్నీ టెక్సాస్‌లోనే జరిగాయి. -
పిల్లల జోలికెళ్తే మరణ శిక్షే!
నైనిటాల్ : చిన్నారులపై దాష్టీకాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. ఈ మేరకు గట్టి చట్టాలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు కేంద్రానికి పలుమార్లు సూచించింది. కానీ, శిక్షా స్మృతిలోని లోపాటు.. మానవ హక్కుల సంఘం అభ్యంతరాలతో అది కార్య రూపం దాల్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ హైకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిన్నారులపై మృగవాంఛ తీర్చుకునే వారికి మరణ శిక్ష తప్ప మరొక ప్రస్తావన ఉండకూడదని అభిప్రాయపడింది. ‘‘పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోతున్నాయ్. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి మరణ శిక్షే సరి. అందుకోసం అవసరమైన చట్టాలు చెయ్యండి అని జస్టిస్ రాజీవ్ శర్మ, అలోక్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది. 2016లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆ కేసులో దిగువ న్యాయస్థానం అతనికి మరణ శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శుక్రవారం దీనిపై హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టగా.. పై వ్యాఖ్యలు చేసింది. కాగా, జాతీయ నేర పరిశోధన రికార్డులను ప్రస్తావించిన బెంచ్.. భారత్‌లో ఇలాంటి నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయని చెప్పింది. 2014లో 489, 2015లో 635, 2016లో 676 కేసులు నమోదు అయ్యాయని పేర్కొంటూ ఈ అంశ తీవ్రతను తెలియజేసింది. -
జాధవ్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది..
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని పాకిస్తాన్ గురువారం స్పష్టం చేసింది. తల్లి, భార్యను జాధవ్ కలసిన తర్వాత మరణశిక్షను అమలు చేయనున్నారని, జాధవ్‌తో వారికిదే చివరి సమావేశమని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. ‘మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదు. ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది’ అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ చెప్పారు. ‘ఇస్లామిక్ సంప్రదాయాలు, మానవతా దృక్పథంతోనే జాధవ్ భార్య, తల్లికి పాక్ వీసాలిచ్చింది’ అని చెప్పారు. -
కేరళలో ‘నిర్భయ’ ఘటన..దోషికి ఉరిశిక్ష
కొచ్చి: దళిత విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి కేరళ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసు నిర్భయ ఘటన తరహాలో ఉందంటూ ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అసోం రాష్ట్రానికి చెందిన మహ్మద్ అమీరుల్ ఇస్లాం(22) కేరళకు బతుకు దెరువు నిమిత్తం వెళ్లాడు. 2016 ఏప్రిల్ 28న పెరంబువర్‌కు చెందిన దళిత న్యాయ శాస్త్ర విద్యార్థిని(30) తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇస్లాం ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎన్.అనిల్ కుమార్.. ఇస్లాంకు మరణ శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 2012లో ఢిల్లీలో జరిగిన దారుణ నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోందని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: కూతురు తక్కువ కులస్తుడిని పెళ్లాడిందనే కోపంతో అల్లుడిని చంపిన కేసులో మామసహా ఆరుగురు బంధువులకు తమిళనాడు కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంటూ తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అలమేలు నటరాజన్ మంగళవారం తీర్పు చెప్పారు. తిరుప్పూరు జిల్లా ఉడుమలై దగ్గర్లోని కుమరలింగంకు చెందిన వేలుస్వామి కొడుకు శంకర్(22) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దిండుగల్లు జిల్లా పళనికి చెందిన చిన్నస్వామి కుమార్తె కౌసల్య (20)ను శంకర్ ప్రేమించాడు. వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో కౌసల్య తల్లిదండ్రులు వీరి ప్రేమను వ్యతిరేకించారు. పెద్దలను కాదని శంకర్, కౌసల్య పెళ్లిచేసుకున్నారు. గతేడాది మార్చి 13న వీరిద్దరూ ఉడుమలై బస్‌స్టేషన్‌కు నడిచి వెళ్తుండగా కొందరు మారణాయుధాలతో దాడిచేశారు.శంకర్ మరణించగా, తీవ్ర గాయాలపాలైన కౌసల్య ఆసుపత్రిలో కోలుకుంది. కౌసల్య తల్లి అన్నలక్ష్మి, మరో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించారు. -
నరరూప రాక్షసులకు ఉరిశిక్ష
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వరుస అత్యాచారాలు. ఆపై హత్యల కేసులో దోషులైన వ్యాపారవేత్త మొనీందర్సింగ్, అతని సహాయకుడు సురేందర్ కోలీలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో పనిమనిషి అంజలిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారని, అందువల్ల కఠినాతికఠినమైన శిక్షకు వారు అర్హులని న్యాయమూర్తి పీకే తివారి తీర్పు సందర్భంగా శుక్రవారం వ్యాఖ్యానించారు. సురేందర్ కోలీ బాధితురాలిని ఇంటిలోకి ఈడ్చుకొచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయేలా చేశాడని, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతటితో ఆగకుండా ఆమె మాంసం తిన్నాడని, అందువల్ల చట్టం ప్రకారం మరణశిక్ష విధించడం తప్ప అంతకుమించిన శిక్ష లేదన్నారు. తుదిశ్వాస విడిచేదాకా ఉరి తీయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిరువురినీ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సూచించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ (302 (హత్య), సెక్షన్ 201 (సాక్ష్యాలను చెరిపివేయడం)కింద వీరిరువురినీ న్యాయస్థానం గురువారం దోషులుగా నిర్ధారించడం తెలిసిందే. పసికూనల అపహరణ, లైంగిక వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత నోయిడాలోని పాంధేర్ నివాసంలో హత్య చేయడం కేసుల్లో వీరిరువురు ప్రధాన నిందితులు. పాంధేర్పై సీబీఐ...అభియోగపత్రం దాఖలు చేయకపోయినప్పటికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 319వ సెక్షన్ కింద నిందితుడికి సమన్లు జారీచేసి విచారణ జరిపింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2006, అక్టోబర్, 12వ తేదీన పనిమనిషి ఇంటికి రాలేదు. దీంతో ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అదే ఏడాది డిసెంబర్, 26వ తేదీన పోలీసులు కోలీని అరెస్టు చేశారు. ఆ ఇంటి వెనుకభాగంలో కొన్ని పుర్రెలు పోలీసులకు లభించాయి. అందులో ఒక పుర్రె ... అంజలి తల్లి, సోదరుడి డీఎన్ఏలతో సరిపోలింది. దీంతో ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారం లభించింది. ఇదే వారు దోషులని రుజువు చేసేందుకు తోడ్పడింది. కుటుంబసభ్యులు బాధితురాలి దుస్తులను గుర్తించారు. మరో ఎనిమిది కేసుల్లో కోలీ దోషిగా తేలాడు. మొత్తం 19 కేసులు నమోదు కాగా అందులో 16 కేసుల్లో వీరు నిందితులు. అందులో పది కేసులకు సంబంధించి కోర్టు ఓ నిర్ణయానికొచ్చింది. -
కోప్రాది గ్యాంగ్ రేప్: నిందితులకు ఉరి శిక్ష
సాక్షి, ముంబై : కోప్రాది గ్యాంగ్‌రేప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు అహ్మద్‌నగర్ జిల్లా సెషన్సు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా గత ఏడాది సంచలనం సృష్టించిన కోప్రాది గ్యాంగ్‌రేప్, హత్య కేసులో జితేంద్ర బాబూలాల్ షిండే, సంతోష్ గోర్కా బవాల్, నితిన్ గోపీనాథ్ భలూమే నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారించేందుకు 2016 డిసెంబర్ 20న స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర్లలోని అహ్మద్ నగర్ జిల్లా కోప్రాదిలో 2016 జులై 13న 15 ఏళ్ల మైనర్ బాలికను ముగ్గురు దుండుగులు గ్యాంగ్‌రేప్ చేసి, ఆపై హత్య చేశారు. రక్తమోడుతున్న బాలిక మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని ఒక చెట్టు దగ్గర ప్రజలు గుర్తించారు. బాధిత బాలిక మారాఠా వర్గానికి చెందినది. కేసు తీర్పు వెలువడ్డాక.. నిందితుల తరపు న్యాయవాది బాలాసాహెబ్ ఖోప్డే.. నేరం చేసినా ఇంతటి తీవ్రమైన శిక్ష విధించడం భావ్యం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున కేసు వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాత్రం తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదైన కేసుల్లో ఒకటని.. నిందితులకు ఉరి శిక్షే సరైన శిక్ష అని అన్నారు. -
మధ్యప్రదేశ్‌లో చిన్నారులపై రేప్‌కు మరణశిక్షే!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12 ఏళ్లు అంతకన్నా తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టం రూపకల్పనకు అంగీకరించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఆదివారం నాడిక్కడ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి జయంత్ మీడియాకు తెలిపారు. తాజా బిల్లులో భాగంగా మహిళల్ని వేధించే దోషులకు శిక్షల్ని కఠినతరం చేశామనీ, వారికి రూ.లక్ష మేర జరిమానా కూడా విధిస్తామని వెల్లడించారు. -
‘మరణ’యాతన తగ్గించలేమా?
ఉరి ద్వారా మరణశిక్ష అమలు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ శిక్ష పడిన ఖైదీలు ప్రశాంతంగా మరణించాలే తప్ప బాధతో కాదని, ఒక మనిషిగా మరణంలోనూ గౌరవం పొందాల్సి ఉన్నందున ఈ విధానానికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఉరిశిక్ష ద్వారా ఖైదీలను అంతమొందించే పద్ధతిని ఎందుకు నిలుపుదల చేయకూడదంటూ శుక్రవారం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో పరిస్థితి ఏంటి.. దాని పూర్వాపరాలపై కథనం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అమెరికాలో ఐదు రకాల పద్ధతులు... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాణాంతక ఇంజెక్షన్, విద్యుత్‌షాక్, గ్యాస్ ఛాంబర్, ఫైరింగ్ స్క్వాడ్, ఉరిశిక్షల ద్వారా మరణశిక్షలను అమలు చేస్తున్నారు. టెన్నెస్సీలో ఎలక్ట్రిక్ చైర్‌ను ఉపయోగిస్తుండగా, 35 రాష్ట్రాల్లో ఈ శిక్ష పడిన వారికి ఇంజెక్షన్ విధానాన్ని పాటిస్తున్నారు. 1977లో ఒక్లొహామాలో తొలిసారిగా ఈ ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా న్యూయార్క్ విద్యుత్ షాక్ విధానాన్ని ప్రవేశపెట్టి 1890లో మొదటిసారి అమలుచేసింది. నెవాడా 1920లలోనే గ్యాస్‌ఛాంబర్ ద్వారా మరణశిక్షను అమలుచేసింది. సంఖ్యపై కొరవడిన స్పష్టత... దేశానికి స్వాతంత్య్రం లభించాక ఇప్పటివరకు ఎంత మందికి ఉరిశిక్ష విధించారన్న సంఖ్యపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 52 మందిని ఉరితీసినట్లు చెబుతున్నా, తమ పరిశోధనలో దానికంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఈ శిక్షలు అమలయ్యాయని తేలిందని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ సంస్థ చెబుతోంది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ తన పరిశోధనలో భాగంగా 755 మందిని ఉరితీశారంటూ పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఏసీహెచ్ఆర్ గణాంకాల ప్రకారం 1995లో అత్యధికంగా 13 మంది, 1996, 97లలో ఒక్కొక్కరు చొప్పున, 1998లో ముగ్గురు, 2004లో «ఒకరు, 2012లో ముంబై ఉగ్రదాడిలో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్, 2013లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అçఫ్జల్గురు, 2015లో ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్లను ఉరితీశారు. ప్రపంచవ్యాప్తంగా... వివిధ దేశాల్లో ఉరి, ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పు లు, తుపాకీతో తల వెనక కాల్చడం, తల నరకడం, ప్రాణాంతక ఇంజెక్షన్, రాళ్లతో కొట్టి చంపడం, గ్యాస్ ఛాంబర్, విద్యుత్‌షాక్, ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు పడేయడం వంటి 9 పద్ధతులను అను సరిస్తున్నారు. అఫ్గానిస్తాన్ మొదలుకుని బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మలేసియా, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, యూఎస్ఏ లాంటి దాదాపు 60 దేశాల్లో ఉరిశిక్షకు చట్టబద్ధత ఉంది. మిలిటరీ కోర్టుల్లో శిక్ష పడ్డవారికి ఫైరింగ్ స్క్వాడ్లతో కాల్పులను అఫ్గానిస్తాన్, బహ్రెయిన్, క్యూబా, కువైట్, యూఏఈ, యూ ఎస్ఏ, వియత్నాం వంటి 28 దేశాలు, తుపాకీతో కాల్చిచంపే శిక్షలను 20 దేశాలు అమలుచేస్తున్నా యి. ఇండోనేసియా, ఇరాన్, మౌరిటానియా, నైజీరి యా, పాకిస్తాన్, సౌదీ ఆరేబియా, సూడాన్, యూఏఈ, యెమన్లలో రాళ్లతో కొట్టి మరణశిక్షను పాటిస్తున్నాయి. వ్యభిచారం, స్వలింగసంపర్క సం బంధాలు, అత్యాచారాలు వంటి కేసుల్లోనే దీనిని అమలు చేస్తున్నారు. ఇరాన్, సౌదీఅరేబియా, యెమన్‌లో తల నరకడం, చైనా, గ్వాటామాలా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, వియత్నాంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో మరణ శిక్షను పాటిస్తున్నారు. మరణశిక్ష రద్దుచేసిన దేశాలు.. అన్ని రకాల నేరాలకు కలుపుకుని మరణశిక్షను రద్దుచేసిన మొత్తం 104 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, భూటాన్, కెనడా, కొలంబియా, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఇటలీ, మెక్సికో, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పనామా, ఫిలిప్పిన్స్, పోలండ్, పోర్చుగల్, రొమోనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ వంటివి ఉన్నాయి. సాధారణ నేరాలకు ఈ శిక్షను బ్రెజిల్, చిలీ, కజకిస్తాన్, ఇజ్రాయెల్, పెరూ, ఎల్‌సాల్వడార్, గునియా రద్దుచేశాయి. -
ఉరి శిక్ష వద్దు.. కొత్తది చెప్పండి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : మరణదండనను అమలు పర్చేందుకు కొత్త మార్గాలను వెతకాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మెడకు తాడు వేసి ఉరి తీయడం క్రూరమైన పద్దతని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణంలో శాంతి ఉండాలని శతాబ్దాలుగా చెబుతున్నా.. అది మాటలకే పరిమితమైందని పేర్కొంది. ఈ విషయంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సాయం తీసుకున్న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉరి శిక్షకు ప్రత్యామ్నాయాన్ని సూచించాలని సదరు నోటీసుల్లో కోర్టు పేర్కొంది. ఉరి శిక్ష అమలులో దోషి తీవ్రమైన బాధను అనుభవిస్తారని ఈ సందర్భంగా చెప్పింది. 30 ఏళ్ల క్రితం తామే(సుప్రీం కోర్టు) ఉరి శిక్షను అమలు చేయాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. నిరంతరం మార్పుకు చోటిచ్చే భారతీయ రాజ్యాంగంలో మరణ దండనను ఉరి శిక్ష ద్వారా అమలు చేయడం సబబు కాదని పేర్కొంది. -
సీరియల్ రేపిస్ట్‌కు మరణశిక్ష
ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్ రేపిస్ట్‌తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. పింకీ సర్కార్ హత్య కేసులో వీరికి శిక్ష ఖరారు చేసింది. సోమవారం ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి పవన్ కుమార్ త్రిపాఠి నేరస్తులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఆరు కేసుల్లో ఇప్పటికే వీరికి శిక్ష పడింది. మరో 9 కేసులు కోర్టు విచారణల్లో ఉన్నాయి. 2006లో ఓ మహిళ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అక్టోబర్ 5వ తేదీన నోయిడాలోని నిథారి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వ్యాపార వేత్త మొహిందర్ సింగ్ త్రిపాఠి పనిమనిషి సురేందర్ కోలి లోపలికి పిలిచాడు. అనంతరం యజమానితో కలిసి ఆమెపై అత్యాచారం చేయటంతోపాటు తలనరికి ఇంటి వెనుక పడేశారు. ఇదే విధంగా పలువురు చిన్నారులు, మహిళలపై దారుణాలు జరిపారు. మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహిందర్ సింగ్ ఇంట్లో సోదాలు జరపగా 16మందికి సంబంధించిన ఎముకలు, కపాలాలు కనిపించాయి. ఇందులో ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ దారుణం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా అదే సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. ఈ మేరకు వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. -
ఫేస్బుక్లో పోస్టు చేశాడని.. మరణదండన!
లాహోర్: ఫేస్బుక్లో దైవదూషణ చేస్తూ పోస్టులు పెట్టాడన్న కారణంతో ఓ వ్యక్తికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఏకంగా మరణదండన విధించింది. సోషల్ మీడియాలో దైవదూషణ ఆరోపణలతో ఓ వ్యక్తికి మరణదండన విధించడం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో దైవదూషణ చేసేవారిపై నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కఠినమైన తీర్పు వెలువడటం గమనార్హం. మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్యలు, సహచరులను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 30 ఏళ్ల తైమూర్ రజా అనే వ్యక్తికి బహవాల్పూర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు మరణదండన విధించింది. పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌కు 500 కిలోమీటర్ల దూరంలో బలవాల్పూర్ ఉంది. సోషల్ మీడియాలో దైవదూషణ ఆరోపణలతో ఓ వ్యక్తికి మరణదండన విధించడవం ఇదే తొలిసారి అని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ షఫిక్ ఖురేషి తెలిపారు. దైవదూషణ కేసును ఉగ్రవాద నిరోధక కోర్టు విచారించడం కూడా అరుదైన విషయం కావడం గమనార్హం. దైవదూషణ, విద్వేష ప్రసంగాలతో ఉగ్రవాద అభియోగాలకు కూడా పాల్పడ్డాడని అతనిపై ఆరోపణలు మోపారని, అందుకే ఉగ్రవాద నిరోధక కోర్టు అతన్ని విచారించిందని ఖురేషి వివరించారు. ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌లో దైవదూషణ అనేది చాలా సున్నితమైన అంశం. దేశంలో ఎవరైనా మహమ్మద్ ప్రవక్తను దూషిస్తే మరణ దండన విధిస్తారు. ఇప్పటికే డజన్లకొద్ది ప్రజలు దైవదూషణ ఆరోపణలపై మరణదండన ఎదుర్కొని.. అమలు కోసం ఎదురుచూస్తున్నారు. దైవదూషణ ఆరోపణలు సైతం పాక్‌లో అలర్లు, హింసకు దారితీసి పలువురి ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్నాయి. ఇక దైవదూషణ ఆరోపణలతో మరణదండన ఎదుర్కొంటున్న తమూర్ రజా షియా వర్గానికి చెందిన వాడు. సున్నీ ఇస్లాం సంప్రదాయాన్ని కచ్చితంగా పాటించే డీయోబనీ తెగకు వ్యతిరేకంగా అతను విద్వేష ప్రసంగాలు చేసినట్టు కోర్టులో అభియోగాలు మోపారు. పాక్‌లో సున్నీ, షియాల మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా ఉన్నాయి. ఈ రెండు తెగల మధ్య విద్వేషాగ్నిని రగిల్చడానికి సున్నీ ఉగ్రవాద గ్రూపులైన లష్కరే-ఏ-జాంఘ్వీ వంటివి నిత్యం ప్రయత్నిస్తూ హింసకు కారణమవుతున్నాయి. -
‘రేపిస్టులకు నరాలు కోసేయాలి’
న్యూఢిల్లీ: రేపిస్టులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) అధ్యక్షురాలు స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. గురుగ్రామ్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన యువతిపై కదిలే కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూడడంతో ఆమె స్పందించారు. ‘దేశంలో ప్రతి నిమిషానికి ఒక రేప్ జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రేపిస్టుకి మరణశిక్ష విధించడం ద్వారా జాతికి భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలి. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి, రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయడమే సముచితమ’ని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. కాగా, హర్యానాలోని రొహతక్ జిల్లాలో శనివారం రాత్రి 23 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం రేపింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అత్యాచారం.. హత్య: ముగ్గురికి మరణశిక్ష
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చిన కేసులో ముగ్గురు దోషులకు పుణె శివాజీనగర్ కోర్టు మరణశిక్ష విధించింది. నయనా పూజారి (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులేనని స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ సోమవారమే తేల్చారు. మంగళవారం నాడు వారు ముగ్గురికీ ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, ఒకే రకమైన ఉద్దేశంతో నేరపూరిత కుట్రకు పాల్పడి ఆస్తులు దుర్వినియోగం చేయడం లాంటి నేరాలు నిరూపితమయ్యాయి. హత్య చేయాలన్న ఉద్దేశంతో అపహరించడం, దోపిడీ చేసే సమయంలో గాయపర్చడం, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం అనే ఆరోపణలు మాత్రం ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యం చూపించకపోవడంతో నిరూపితం కాలేదు. ఖరాడి ప్రాంతంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసే నయనా పూజారి 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి రావడానికి వేచి చూస్తుండగా కిడ్నాప్ అయింది. రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖేడ్ తహసీల్‌లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బయటపడింది. బాధితురాలిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక కారులో ఆమెపై అత్యాచారం చేశారని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. ఆమె వద్ద ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు దొంగిలించారని, తర్వాత పీక పిసికి చంపేసి అడవిలో పారేశారని అన్నారు. నయనా పూజారి ఘటన తర్వాతే ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేసే మహిళలకు భద్రత కరువైన అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
మరణ శిక్షా.. జీవిత ఖైదా?
సాక్షాత్తు దేశ రాజధానిలోనే కదులుతున్న బస్సులో అత్యంత ఘోరంగా.. పాశవికంగా సామూహిక అత్యాచారం చేసిన కేసులో నిందితులకు ఐదేళ్ల తర్వాత శిక్ష ఖరారు కానుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఎట్టకేలకు తీర్పు రానుంది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్ష విధించాలా, లేదా జీవిత ఖైదుతో సరిపెట్టాలా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది. వాస్తవానికి ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు వెలువడేందుకు ఇన్నాళ్ల సమయం పట్టింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. దాంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు. 16-18 ఏళ్ల మధ్య వయసున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లు గానే భావించాలని చెప్పారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సు ఎక్కగా, అతడిని చితక్కొట్టి ఆమెపై ఆరుగురు కలిసి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తన తుది తీర్పును శుక్రవారం వెల్లడించబోతోంది. న్యాయమూర్తులిద్దరూ వాళ్ల అప్పీలును తిరస్కరిస్తే, ఇక వారికి ఉరిశిక్ష దాదాపు ఖరారవుతుంది. అయితే అప్పటికీ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు అవకాశం ఉంటుంది, లేదా రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయొచ్చు. -
శాన్వీ ఆత్మకు శాంతి!
చిన్నారితోపాటు నానమ్మ హత్యకేసు తీర్పుపై స్వగ్రామంలో హర్షం రఘునందన్‌కు ఉరి ‘అకలిగొన్నవారి మొఖం చూడలేకపోయేది సత్యవతి. గ్రామంలో ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసేది. మా గ్రామంలో అలాంటివారు ఇంకా పుట్టరు కూడా. బంగారం లాంటి కాపురం.. సత్యవతి మృతితోనే నాశనం అయింది. చిట్టిపొట్టి చిన్నారి శాన్విని కూడా పొట్టనపెట్టుకున్నాడు. అందుకే ఆ రఘు ఇప్పుడు శిక్ష అనుభవించాడు’ ఈ మాటలు ఇప్పుడు కుడుములకుంటలో వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా : శాన్వి ఆత్మకు శాంతి లభించింది.. ఆమె నాన్నమ్మకు కూడా! అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని.. నేరస్తులు తప్పించుకోలేరని హంతకుడు రఘునందన్‌కు విధించిన మరణశిక్షతో తేలింది. అమెరికాలో 2012లో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ వెన్న సత్యవతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సత్యవతి స్వగ్రామం అయిన హనుమంతునిపాడు మండలం కుడుముల కుంట వాస్తవ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నాభిన్నం అయిన కుటుంబం.. సత్యవతి భర్త వెన్నా కొండారెడ్డి చాలా కాలం గ్రామంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడంలేదు. వచ్చిన రోజు అన్నం వండుకొని.. కూరలను కనిగిరి నుంచి తెచ్చుకుని మళ్లీ కనపడకుండా వెళ్లిపోతారు. ఇద్దరు కుమారులు అమెరికా లోనే ఉన్నారు. కుమార్తె సుజాత గుంటూరులో ఉంటోంది. సత్యవతి లోకం విడిచాక ఇక్కడి ఇంటిలో దీపం వెలిగించేవారు లేకుండా పోయారు. ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. అందరి తలలో నాల్కలా ఉన్న సత్యవతి మరణాన్ని గ్రామస్తులు ఇప్పటికీ మరచిపోలేదు. వారి నిమ్మ తోటలు, ఆస్తిపాస్తులు అన్నీ నాశనం అయ్యాయి. నిందితునికి సరైన శిక్ష పడిందని అంతా అంటున్నారు. సత్యవతి ఇంటిలో దీపం పెట్టేవారే లేరు: చిన్నారి శాన్విని చూసుకోనేందుకు కుమారుడు ప్రసాదు రెడ్డి వద్దకు సత్యవతి వెళ్లింది. ఫోను చేసి గ్రామంలో అందరి కష్ట సుఖాలను తెలుసుకొనేది. ఆమె మరణంతో ఇంటిలో దీపం వెలిగించే వారు లేకుండా పోయారు. కొండారెడ్డి..కుమారులు, కుమార్తె వద్ద కాలం కడుపుతున్నాడు. – సానికొమ్ము వెంకటసుబ్బమ్మ ఎప్పుడో ఉరి శిక్ష వేసి ఉండాల్సింది: డబ్బుకు ఆశపడి చిన్నారి శాన్విని, నానామ్మ వెన్నా సత్యవతిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకుడు రఘునందన్‌కు వెంటనే ఉరివేసి ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మరణ శిక్షను విధించి మంచి పని చేసింది. – వీరాచారి -
శాన్వి హంతకుడికి మరణ శిక్ష
2012లో అమెరికాలో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ దారుణ హత్య ► గత తీర్పును సమర్థించిన పెన్సిల్వేనియా హైకోర్టు న్యూయార్క్: అమెరికాలో సంచలనం సృష్టించిన పెన్సిల్వేనియా జంట హత్యల కేసులో భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అమెరికా కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2012లో పెన్సిల్వేనియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది నెలల చిన్నారి శాన్వి వెన్నా, ఆమె నానమ్మ సత్యవతి వెన్నా(61) తమ అపార్ట్మెంట్లోనే హత్యకు గురయ్యారు. విలాసాలకు అలవాటుపడిన రఘునందన్ ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారించిన జ్యూరి 2012 అక్టోబర్‌లో అతడిని దోషిగా తేల్చింది. 2015లో రఘునందన్‌కు కింది కోర్టు మరణశిక్షను విధించింది. దీనిని శుక్రవారం పెన్సిల్వేనియా హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది. 2012లో ఒక అపార్ట్మెంట్లో వృద్ధురాలు హత్యకు గురైందని, పది నెలల చిన్నారి అపహరణకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలో ఒక నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చిన్నారి ప్రాణాలతో దక్కాలంటే 50 వేల డాలర్లు ఇవ్వాలని రాసి ఉంది. ఆ నోట్లో చిన్నారి తల్లిదండ్రుల ముద్దు పేర్లను రాయడం.. అవి వారి సన్నిహితులైన కొద్ది మందికే తెలియడంతో ఆ దిశగా పోలీసులు ఆరా తీశారు. చిన్నారి శాన్వి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తే అయిన రఘునందన్‌ను అనుమానితునిగా గుర్తించి ప్రశ్నించారు. దీంతో తానే హత్యలు చేసినట్టు అంగీకరించాడు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని, తాను కావాలని హత్యలు చేయలేదని విచారణ సందర్భంగా రఘునందన్ చెప్పాడు. -
కుల్‌భూషణ్ జడ్జిమెంట్ కాపీలో ఏముంది?
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్ష తీర్పు కాపీని భారత ప్రభుత్వం పాక్‌ను తప్పక అడిగి తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సూచించారు. తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో ఆయనకు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుందని అన్నారు. ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మెరుగవుతున్న భారత్-పాక్ సంబంధాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ జెఠ్మలానీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వారు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. వారు మోపిన నేరం సరైనదా కాదా.. అన్నదీ తెలుసుకోవాలి. అప్పుడు దానికి ఏ శిక్ష పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు ఆయనపై తప్పుడు సాక్ష్యం ఆధారంగా నేరం మోపితే.. అప్పుడు భారత్ గట్టిగా వాదించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలంతా జాదవ్ విషయమై పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. అది సరికాదు. మన స్టాండ్ మనకు ఉంటుంది. కానీ తీర్పు కాపీ చదవకుండా అభిప్రాయం చెప్పడం ఎవరికీ సరికాదు’ అని అభిప్రాయపడ్డారు. -
పాక్ ప్రమాదకర క్రీడ
భారత గూఢచారిగా ఆరోపణకు గురైన కుల్‌భూషణ్ జాధవ్‌కు మరణశిక్షను విధిం చినట్టు పాకిస్థాన్ సైనిక వర్గాలు చేసిన ప్రకటన మనకే కాదు, ప్రపంచ దేశాలకు సైతం దిగ్భ్రాంతిని కలిగించింది. పాక్ ప్రభుత్వం ఆరోపించినట్టుగా కుల్‌భూషణ్ భారత గూఢచారే అనుకున్నా, పట్టుబడ్డ శత్రు గూఢచారులకు మరణశిక్ష విధించ డాన్ని అంతర్జాతీయ సమాజం నేడు అనాగరిక చర్యగా భావిస్తోంది. కుల్‌భూషణ్ స్వయంగా తాను భారత గూఢచార సంస్థ రా (రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) గూఢచారినని అంగీకరించారంటూ పాక్ ప్రభుత్వం అప్పట్లోనే ఒక వీడియోను బయటపెట్టింది. పాక్ మీడియా సైతం దాన్ని లెక్కలోకి తీసుకోదగ్గదిగా పరిగణించ లేదు. సహజంగానే మన విదేశాంగశాఖ అది తీవ్ర ఒత్తిడికి గురిచేసి చెప్పించిన బలవంతపు అంగీకారమని స్పష్టం చేసింది. కుల్‌భూషణ్ తమ గూఢచారి కారని రా అధికారికంగా ప్రకటించడమే కాదు, సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులు సైతం అదే చెప్పారు. కుల్‌భూషణ్‌తో మాట్లాడేందుకు పాక్‌లోని మన కాన్సలేట్ అధి కారులకు అవకాశాన్ని కల్పించాలని భారత్ పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయినా పాక్ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఇది వియన్నా అంతర్జాతీయ ఒప్పందానికే కాదు, ఇరు దేశాలూ సంతకాలు చేసిన అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒప్పందానికి కూడా విరుద్ధం. నమ్మదగిన ఆధారాలు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా, ఎప్పుడు విచారణ జరిగిందో, ఎప్పుడు శిక్ష విధించారో కూడా తెలుపకుండా మరణశిక్ష ప్రకటనను వెలువరించడం పూర్తి బాధ్యతా రాహిత్యం. ఏదిఏమైనా ఇది అంతర్జాతీయ న్యాయ స్థానానికి నివేదించాల్సిన నేరం. ఇక మరణశిక్షను అమలుచేస్తే భారత్ అంటున్నట్టు అది ‘ముందస్తు పథకం ప్రకారం చేసిన హత్యే’ అవుతుంది. ఏడాదిగా నిర్బంధంలో ఉన్న కుల్భూష ణ్‌కు అన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఒప్పందాలను తుంగలోకి తొక్కి హడావుడిగా మరణశిక్షను విధించాల్సిన అగత్యం ఏమొచ్చింది? పాక్ అధికార వ్యవస్థ స్వభావం ఎప్పుడూ అంతుబట్టనిదిగానే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న చట్టబద్ధ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాస్వామిక, న్యాయ వ్యవస్థలకు అతీత మైన అదృశ్య హస్తం తన పని తాను చేసుకు పోతూనే ఉంటుంది. ఆ అదృశ్య హస్తం సైనిక దుస్తుల్లో ఉన్నా, గూఢచార వ్యవస్థ ఐఎస్ఐ రూపం ధరించినా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దాని మాట శిరోధార్యం, దాని చేతలను సమర్థించడం పరమ పవిత్ర కర్తవ్యం. కాక పోతే, కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని పాక్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన విషయాన్ని నవాజ్ షరీఫ్ మరిచేవారేనా? సైనిక న్యాయస్థానం తీర్పును వెనకేసు కొస్తూ మాట మార్చేవారేనా? ఒక ఉన్నత స్థాయి సైనిక అధికారిని, తమ దేశపు పాస్‌పోర్ట్‌తో శత్రు దేశంలోకి గూఢచారిగా పంపే తెలివిమాలిన పని ఏ దేశమూ చేయదు. అది తెలిసీ పాక్ సైన్యం ఇరాన్ కేంద్రంగా సొంత వ్యాపారం నడుపుకుంటున్న మన నావికాదళ మాజీ కమాండర్ కుల్‌భూషణ్‌ను ఇరాన్–బెలూచిస్థాన్ సరిహద్దుల్లో పట్టుకున్నా మని 2016 మార్చి 3న ప్రకటించింది. బెలూచిస్థాన్ వేర్పాటువాదులతో కలసి విద్రోహకాండకు పాల్పడుతున్న భారత గూఢచారి అని ఆరోపించింది. పాక్ వాయవ్య ప్రాంతంలోని పాక్ తాలిబన్ మిలిటెంట్లపై చేపట్టిన రెండేళ్ల సైనిక చర్యల వైఫల్యంతో అడుగంటిన ప్రతిష్టను కాపాడుకోడానికి పాక్ సైన్యం భారత గూఢచా రిని కనిపెట్టిందని అప్పట్లో ప్రముఖ పాక్ పాత్రికేయులు కొందరు వ్యాఖ్యానిం చారు. కుల్‌భూషణ్ గూఢచారే అయినా పట్టుబడ్డ గూఢచారుల పట్ల అనుసరించా ల్సిన లిఖిత, అలిఖిత పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. నేటి ప్రపంచంలో ఇతర దేశాలలో గూఢచారులను నియమించని దేశమే లేదు. గూఢచారులు పట్టుబ డటం తరచుగా జరిగేదే. పట్టుబడ్డ గూఢచారులను అనధికారిక సంభాషణలు, బేర సారాలతో కొంత ఆలస్యంగానో లేక త్వరగానో మార్పిడి చేసుకోవడం, ఖైదీలను విడుదల చేయడం భారత్, పాక్‌ల మధ్య కూడా ఉన్న రివాజే. కానీ 2015 నుంచి భారత్‌లో పాక్ సీమాంతర ఉగ్రవాద మూకల దాడులు పెరిగాయి. 2016 జనవరిలో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై దాడికి అవి బరితెగించాయి. దీంతో పాక్‌తో స్నేహ సంబంధాల కోసం చేయిచాస్తున్న భారత వైఖరిలో మార్పు రావడం మొదలైంది. ఉగ్రవాదం పట్ల కఠినవైఖరిని అవలంబిస్తా నని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో అదే ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన యూరీ ఉగ్ర దాడి భారత్ సహనానికి పరీక్షే అయింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ‘నీరూ, నెత్తురూ కలసి ప్రవహించలేవు’ అని ప్రకటించి 1960 నాటి భారత్–పాక్ నదీ జలాల ఒప్పందానికి ఎసరు పెట్ట గలమని పాక్‌కు చురక అంటించారు. దాని కొనసాగింపుగా సెప్టెంబర్ 29న భారత సేనలు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి పాక్ ప్రతిష్టను దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల ‘ఉద్యో గాన్వేషణ’ కోసం నేపాల్ వెళ్లిన దిగువ స్థాయి రిటైర్డ్ పాక్ సైనికాధికారి ఒకరు కనిపించకుండా పోయారు. అది భారత్ పనేనని తమ సైన్యం భావిస్తోందని, అందుకు బదులుగా కుల్‌భూషణ్‌కు హడావుడిగా మరణశిక్ష విధించిందని పాక్ విశ్లేషకుల కథనం. పాక్ సైన్యం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంలో ఆశ్చర్యం లేదు. కానీ కిడ్నాపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు చేసి బేరసారాలాడే స్థితికి భారత్ దిగ జారేదైతే, సరిహద్దుల్లో దారితప్పి పాక్ భూభాగంలోకి ప్రవేశించిన సరబ్జిత్ సింగ్ 23 ఏళ్లు పాక్ జైళ్లలో నరకం చూసి మరణించేవాడే కాడు. ఏదిఏమైనా పాక్ విపరీత చర్య భారత్‌ను రెచ్చగొట్టేదని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత విష మింపజేసేదని అంతా అంగీకరిస్తున్నారు. ఎంతకైనా తెగించగల తెంపరితనానికి మారుపేరైన పాక్ సైన్యం ఉరిశిక్ష విధించినంత, గుట్టుగా, హడావుడిగా ఉరి తీయనూ గలదు. పాక్ దుశ్చర్యను సత్వరమే అంతర్జాతీయ సమాజం దృష్టికి, వేదిక లపైకి తీసుకుపోయి కుల్‌భూషణ్‌కు ప్రాణహాని కలుగకుండా చూడటం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. -
'కులభూషణ్‌ను రక్షించేందుకు ఎందాకైనా వెళ్లండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉరి శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను ఏం చేసైనా కేంద్రం రక్షించాలని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే కోరారు. కులభూషణ్‌కు ఉరిశిక్ష విధించడం దురదృష్టకరమని, అవసరమైతే కేంద్రం ఎలాంటి ముందడుగు వేసైనా జాదవ్‌ను రక్షించాలని అభ్యర్థించారు. అలా చేయడంలో తప్పులేదని చెప్పారు. ఉద్దవ్ ఠాక్రే సోమవారం ఢిల్లీకి వచ్చి ఎన్డీయే పెద్దలను కలిశారు. అయితే, ఎందుకు కలిశారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి కులభూషణ్‌కు పాకిస్థాన్ ఉరి శిక్ష విధించినట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ నిర్ణయాన్ని ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. -
మహిళకు మరణశిక్ష
ఇస్లామాబాద్: పరువు కోసం కన్నకూతుర్ని సజీవ దహనం చేసిన పాకిస్థాన్ మహిళకు కోర్టు మరణశిక్ష విధించింది. ‘పరువుహత్య’ కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన కొద్ది నెలల తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించడం గమనార్హం. తమ అభీష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుందనే కోపంతో తన కుమార్తె జీనత్ రఫీక్(18)ను ఆమె తల్లి పర్వీన్ బీబీ నిప్పటించి సజీవ దహనం చేసింది. 2016, జూన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పాకిస్థాన్ లో సంచలనం రేపింది. హసన్ ఖాన్ అనే వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. తన కుటుంబానికి తలవంపులు తెచ్చిందనే కూతుర్ని హతమార్చినట్టు కోర్టులో పర్వీన్ ఒప్పుకుంది. కొడుకు అనీస్ సహాయంతో కూతుర్ని కడతేర్చిందని పోలీసులు అనుమానించారు. ఈ కేసులో వాదనలు విన్న ఏటీసీ కోర్టు న్యాయమూర్తి ఆజామ్ చౌధురి సోమవారం తీర్పు వెలువరించారు. పర్వీన్ కు మరణశిక్ష, అనీస్ కు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. -
కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
-
కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
కరీంనగర్ : అత్యాచారం, హత్య కేసులో కరీంనగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం అనంతరం హత్య చేసిన నిందితుడి జక్కు వెంకటస్వామికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. కాటారం మండలం దామరకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటలో ఈ ఏడాది పిబ్రవరి 28న నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు అనంతరం చిన్నారి దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టు ముందు హజరు పర్చారు. కేసు విచారణ పూర్తి కావడంతో...కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి సురేష్ నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడించారు. కరీంనగర్ కోర్టులో ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. -
ఆ ముష్కరులకు ఉరే సరి!
-
లైంగికదాడి కేసులో నిందితుడికి ఉరి
⇒ కోవై మహిళా కోర్టు తీర్పు చెన్నై: మహిళా ప్రొఫెసర్ పై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు మహేష్ (30)కి కోయంబత్తూరు మహిళా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం మేరకు.. కోయంబత్తూరు జిల్లా కారమడై సమీపం ఆశిరియర్ కాలనీకి చెందిన రమ్య(24) కనుత్తుకడవులోని ప్రయివేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2014 నవంబరు 3న కళాశాలలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెను వెంబడించాడు. అనంతరం ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి రమ్య, ఆమె తల్లి మాలతిలపై దుడ్డుకర్రతో దాడి చేయడంతో వారు స్పృహ తప్పి పడిపోయారు. ఇదే అదనుగా ఇంటిలోని బంగారు నగలను దోచుకున్నాడు. స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్న రమ్యపై లైంగికదాడికి పాల్పడడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ కేసులో తిరునెల్వేలీ జిల్లా తెన్కాశీకి చెందిన మహేష్‌ను గత ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అతడి నేరం రుజువు కావడంతో కోయంబత్తూరు మహిళా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. హత్య చేసినందుకు ఉరిశిక్ష, లైంగికదాడి జరిపినందుకు యావజ్జీవ శిక్ష, అనుమతి లేకుండా వారి ఇంటిలోకి ప్రవేశించినందుకు 8 ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. -
జిగిషా హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2009లో సంచలనం సృష్టించిన జిగిషా ఘోష్ హత్య కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం శిక్షలు ఖరారు చేసింది. ఇద్దరికి మరణశిక్ష, ఒకరికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లాకు ఉరిశిక్ష.. బల్జీ మాలిక్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఐటి ఉద్యోగిని జిగిషా ఘోష్‌ను అపహరించి, హత్య చేసిన కేసులో వీరిని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్ యాదవ్ జూలై 14న దోషులుగా నిర్ధారించారు. 28 సంవత్సరాల జిగిషా ఘోష్ హెవిట్ అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేసేది. 2009 మార్చి 18 వేకువజామున నాలుగు గంటలకు వసంత్ విహార్‌లోని తన ఇంటి వద్ద కంపెనీ క్యాబ్ నుంచి దిగిన జిగిషా తర్వాత కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె వృతదేహం సూరజ్‌కుండ్‌లోని ఓ మురికి కాలువలో లభించింది. దోషులను పట్టించిన ఆయుధం దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులు జిగిషాను అపహరించి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె క్రెడిట్ కార్డులోని డబ్బు కాజేశారని, నగల్ని, రిస్ట్ వాచ్‌లను, షూస్‌ను సరోజినీ నగర్ మార్కెట్లో అమ్ముకున్నట్లు వివరించారు. జిగిషాను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం పోలీసుల చేతికి చిక్కడంతో వారు ఈ కేసును ఛేదించగలిగారు. ఈ ముగ్గురు దోషులు టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో కూడా నిందితులు కావడం గమనార్హం. సౌమ్య 2008 సెప్టెంబర్ 30న హత్యకు గురైంది. ఆఫీసు నుంచి రాత్రి వేళ కారులో తిరిగి వస్తుండగా సౌమ్య హత్యకు గురైంది. జిగిషా కేసు దర్యాప్తులో నిందితులకు సౌమ్య విశ్వనాథన్ హత్యలోనూ హస్తముందని పోలీసులు గుర్తించారు. -
'గే'లకు మరణశిక్ష విధించాలి!
దేశంలో గే సంస్కృతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని, అందుకు ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్, కీర్) కమ్యూనిటీకి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మదురైలో వెలసిన పోస్టర్లు ఆ కమ్యూనిటీకి చెందినవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఆర్లాండ్లోని ఓ నైట్ క్లబ్లో ఓ ఉన్మాది 49 మందిని ఊచకోత కోసిన మర్నాడే ఈ పోస్టర్లు వెలిశాయి. అసహజ శృంగారాన్ని ఆచరించేవారు, ప్రోత్సహించేవారు 'సాంస్కృతిక టెర్రరిస్టులు' అని, వారికి మరణ శిక్ష విధించేందుకు వీలుగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని 377వ సెక్షన్ సవరించాలని ఇండియన్ నేషనల్ లీగ్ అనే ముస్లిం పార్టీ డిమాండ్ చేసింది. ఐపీసీలోని 377వ సెక్షన్ బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది. ఈ చట్టాన్ని 1860లో తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారం మగ, ఆడ లేదా జంతువులతో ఎవరైనా అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే వారికి పదేళ్లవరకు జైలుశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దుచేయాలని భారతదేశంలోని గే ఉద్యమకారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం ఎవరిపైనా ప్రయోగించకపోయినా చట్టం కారణంగా తమపట్ల ప్రజల్లో విద్వేష భావం పెరుగుతున్నదన్నది వారి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా గే లకు మరణశిక్ష విధించాలనే డిమాండ్ తీసుకురావడం వారిలో భయాందోళనలను రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ అమెరికా కాలేజీ గోడలపై కనిపించిన ఈ పోస్టర్లను తక్షణమే తొలగించి, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని గోపీ శంకర్ అనే ఓ గే ఉద్యమకారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి పోస్టర్లపై చర్య తీసుకునేందుకు చట్టం అనుమతించదని పోలీసులు చెబుతున్నారు. గేలకు వ్యతిరేకంగా తామేమీ కొత్తగా ఈ డిమాండ్‌ను తీసుకరాలేదని, ఇది ముందునుంచి ఉన్నదేనని, పైగా తాము వేసిన పోస్టర్ 2013లో ముద్రించిందని ఇండియన్ నేషనల్ లీగ్ స్పష్టం చేసింది. గేలు గుమిగూడేచోట గే సంస్కృతికి వ్యతిరేకంగా ఐఎన్ఎల్ కరపత్రాలను పంచుతోందని, ఈ చర్య వల్ల విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని శంకర్ అంటున్నారు. -
మే 3న జమాతే చీఫ్ మరణ శిక్షపై తేలుస్తారు!
ఢాకా: జమాతే ఇస్లామీ చీఫ్ మోతుర్ రహ్మాన్ నిజామి మరణశిక్షపై మే 3న తుది నిర్ణయం వెలువడనుంది. ఈ మేరకు వేసిన పిటిషన్‌పై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు విచారణను మే 3కు వాయిదా వేసింది. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటం సమయంలో దేశ ద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో జమాతే ఇస్లామి చీఫ్ మోతుర్ రహ్మాన్‌కు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించింది. అయితే, తనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో నిజామి గతంలో పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరించబడింది. -
జర్మన్ బేకరీ పేలుడు కేసులో శిక్ష మార్పు
ముంబయి: సంచలనం సృష్టించిన జర్మన్ బేకరీ పేలుడు కేసులో కీలక దోషి మీర్జా హిమాయత్ బేగ్‌కు కాస్త ఊరట లభించింది. మీర్జాకు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు గురువారం జీవిత ఖైదుగా సవరించింది. 2010లో ముంబైలోని జర్మన్ బేకరీలో పేలుడు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి మీర్జా హిమాయత్ బేగ్‌ను అరెస్టు చేయడం, 2013లో స్థానిక కోర్టు తీర్పు వెలువరించడం జరిగిపోయాయి. ట్రయల్ కోర్టు మీర్జాకు ఉరిశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. స్పందించిన హైకోర్ట్ మీర్జాకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చింది. -
బడా బిలియనీర్‌కు ఉరిశిక్ష
టెహ్రాన్: అవినీతికి పాల్పడిన ఆరోపణల కింద ఇరాన్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్‌కు ఉరి శిక్ష విధించారు. త్వరలో ఆయనను ఉరి తీయనున్నారు. ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన కంపెనీల ద్వారా అధికమొత్తంలో అక్రమంగా చమురు అమ్మకాలకు పాల్పడినట్లు బాబక్ జంజానీ అనే ఓ బడా వ్యాపార వేత్తపై ఆరోపణలు వచ్చాయి. ఈ చమురు స్కాంలో కొన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. భారీ మొత్తంలో ఆర్థికపరమైన మోసాలకు పాల్పడినట్లు కూడా తెలిసింది. అక్రమంగా చమురును విక్రయించి ప్రభుత్వ ఖజానా కాజేసినందుకు మరో ఇద్దరికి కూడా మరణ శిక్ష విధించారు. దీంతో అతడిని పోలీసులు 2013 డిసెంబర్ నెలలో అరెస్టు చేశారు. కాగా, ఈ ఆరోపణలు మాత్రం ఆయన ఖండించారు. తాను ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని అన్నారు. ఇతడిని ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. యూఏఈ, టర్కీ, మలేషియా దేశాలకు చెందిన కంపెనీల ద్వారా 2010 నుంచి ప్రభుత్వం పేరు చెప్పి అక్రమంగా కొన్ని మిలియన్స్ బ్యారెల్స్ ఆయిల్ అక్రమాలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఎవరీ బాబక్ జంజానీ? టెహ్రాన్ లో జన్మించాడు జంజానీ. టర్కీష్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. 1999లో ఇరాన్ సెంట్రల్ బ్యాంకు ను ముందుండి నడిపించాడు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని భారీ ఆరోపణలున్నాయి ఇరాన్ క్రిమినల్ కోడ్ ప్రకారం 'భూమిని ఉపయోగించుకొని అక్రమాలకు పాల్పడటం అతి పెద్ద నేరం' ఆ నేరం జంజానీ చేసినట్లు కోర్టు ధ్రువీకరించింది. మహ్మద్ అహ్మదీనెజాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విదేశాల్లో ఆయిల్ విక్రయాలు జరిపేందుకు అవకాశం తెచ్చిపెట్టడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. దుబాయ్‌లో ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా 60 కంపెనీల ద్వారా కాస్మోటిక్స్, ఎయిర్ ట్రావెల్, బ్యాంకింగ్ వంటి సేవలు అందించాడు. -
40 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష
బాగ్దాద్: రెండేళ్ల క్రితం ఇరాక్‌లో నరమేధం సృష్టించిన కేసులో నిందితులకు మరణశిక్ష పడింది. మొత్తం 47 మందిని విచారించిన బాగ్దాద్ సెంట్రల్ క్రిమినల్ కోర్టు.. వారిలో 40 మందిని దోషులుగా పేర్కొంటూ, ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆధారాలు లేని కారణంగా మరో ఏడుగురిని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాక్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దెల్ సత్తార్ బేయర్దార్ ఈ వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. 2014 జూన్ నెలలో తిక్రిత్ నగరంలో మిలిటెంట్లు 1700 మందికి పైగా బందీలను హతమార్చిన విషయం తెలిసిందే. ఆ కేసు గురువారం నాడు బాగ్దాద్ కోర్టులో విచారణకు వచ్చింది. ఇరాక్ టెర్రరిస్ట్ వ్యతిరేక చట్టంలోని ఆర్టికల్ 4 కింద నిందితులకు ఈ శిక్ష ఖరారు చేసినట్లు అబ్దెల్ సత్తార్ వివరించారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్) జిహాదీలు ఇరాక్‌లో మొదలెట్టిన మారణహోమాల్లో తొలి రోజుల్లో జరిగిన దుర్ఘటనలు ఇవి. మాకు ఏ పాపం తెలియదు: మిలిటెంట్లు మారణహోమం సృష్టించిన నిందితులను కోర్టులో ప్రశ్నించగా.. తమకు ఏ పాపం తెలియదనే ప్రతి ఒక్కరూ చెప్పారు. అమాయక ప్రజలు, సైనికుల ఊచకోత జరిగిన సమయంలో తాము తిక్రిత్ నగరంలోనే లేమని కొందరు నిందితులు పేర్కొన్నట్లు అధికార ప్రతినిధి లేఖ ద్వారా తెలుస్తోంది. తిక్రిత్ నగరాన్ని 2015 ఏప్రిల్ లో సైనికులు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. -
13 మందికి ఉరిశిక్ష
రెండు వేర్వేరు కేసుల్లో న్యాయస్థానాల తీర్పు క్రిష్‌నగర్/నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం 13 మందికి మరణశిక్ష పడింది. బెంగాల్లో భూమి కోసం ఓ మహిళను చంపిన కేసులో టీఎంసీ నేత సహా 11 మందికి.. నాగ్‌పూర్‌లో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి చంపినందుకు ఇద్దరు యువకులకు ఉరిశిక్ష పడింది. పశ్చిమబెంగాల్లోని కృష్ణగంజ్‌లో శరణార్థుల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇక్కడ ఉంటున్న వారిని పంపించేసి స్థలాన్ని కబ్జాచేయాలని భావించిన టీఎంసీ నేత, మరో 11 మంది నవంబర్ 23, 2014న ట్రాక్టర్‌తో ఇళ్లను కూల్చేసేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో కబ్జాకు యత్నించిన వారు కాల్పులు ప్రారంభించటంతో అపర్ణ బాగ్ అనే మహిళ ఘటనాస్థలంలోనే చనిపోయింది. ఈ కేసులో అపర్ణ ఇద్దరు కూతుళ్ల సాక్ష్యం ఆధారంగా 11 మందికి నదియా జిల్లా కోర్టు జడ్జి ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు, ఓ ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపిన కేసులో ఇద్దరు యువకులకు నాగ్‌పూర్ సెషన్స్ న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. 2014 సెప్టెంబర్‌లో యుగ్ చందక్ (8) అనే బాలుడిని రాజేశ్ దవారే (21), అతని మిత్రుడు అభిలాష్ సింగ్ (25) డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడిని ముఖంపై రాయితో కొట్టి క్రూరంగా చంపేశారు. ఈ కేసును విచారించిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి.. నిందితులకు ఉరిశిక్ష విధించారు. దీంతోపాటు జీవితఖైదు, చెరో పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆధారాలు ధ్వంసం చేసినందుకు ఏడేళ్ల జైలు విధించారు. వీరికి సహకరించిన రాజేశ్ సోదరుడిని జువెనైల్ హోమ్‌కు పంపించారు. -
పాలస్తీనా కవికి సౌదీలో శిరచ్ఛేద శిక్ష
తన కవితల్లోనూ, సంభాషణల్లోనూ మతాన్ని వదిలిపెట్టమన్నాడని అష్రాఫ్‌పై ఆరోపణ. గాజా ప్రాంతానికి చెందిన పాలస్తీనా శరణార్థుల దంపతులకు పుట్టిన అష్రాఫ్ ఫయాద్, సౌదీ అరేబియా దక్షిణాది పట్నం అబాలో పెరిగాడు. ఆయన కవి, చిత్రకారుడు. వయసు 35 సంవత్సరాలు. తన కవితల్లోనూ, సంభాషణల్లోనూ మతాన్ని వదిలిపెట్టమన్నాడని అష్రాఫ్‌పై ఆరోపణలొచ్చాయి. 2014 జనవరి నుంచీ జైల్లో ఉన్నాడు. ఆయనపై ఆరోపణలేవీ రుజువు కాకుండానే కోర్టువారు నాలుగేళ్ల ఖైదు, 800 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2014 మే నెలలో ఈ శిక్ష ఖరారయింది. ఒక హోటల్లో వాదనల మధ్య తాను ఇలా మాట్లాడినట్లు ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారమని ఫయాద్ అప్పీల్ చేశాడు. దాన్ని డిస్మిస్ చేసిన కోర్టు 2015లో తిరిగి విచారణ జరిపింది. అతని తల నరికి చంపాలని కొత్త జడ్జీల ప్యానల్ తీర్పునిచ్చింది. ఈ వార్త విన్న ఫయాద్ తండ్రి గుండె ఆగి చనిపోయాడు. అంత్యక్రియలకు కూడా ఫయాద్ను అనుమతించలేదు. ఈ కవికి విధించిన శిరచ్ఛేదం శిక్షను రద్దు చేయించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్లకూ, జర్మనీ విదేశాంగ శాఖకూ ప్రపంచంలోని 350 రచయితల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై రచయితలు ఒర్హాన్ పాముక్(టర్కీ), మారియో వర్గోస్ లోసా(పెరూ) కూడా సంతకాలు చేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు కూడా ఈ శిక్షను ఖండించారు. ఇది కళాస్వేచ్ఛకూ, భావప్రకటనా స్వేచ్ఛకూ ఘోరమైన ఉల్లంఘన అన్నారు. 44 దేశాల్లోని 122 సభల్లో గురువారం ఫయాద్ కవితా సంకలనం ‘ఇన్స్ట్రక్షన్స్ వితిన్’లోని కవితల పఠనం ఉద్యమంలా సాగింది. బెర్లిన్ అంతర్జాతీయ సాహిత్య ఉద్యమ వేదిక ఈ కార్యక్రమాలు జరిపింది. ఫయాద్ అప్పీలును వచ్చేవారం సౌదీ కోర్టు పరిశీలించనుంది. సౌదీ అరేబియా వంటి నియంతృత్వ రాచరిక ప్రభుత్వానికి ఆప్తమిత్రులైన అమెరికా, బ్రిటన్, జర్మనీలు ఈ దుర్మార్గపు శిక్షను తప్పించేలా చొరవ చూపాలని సాహితీ ప్రపంచం ఎలుగెత్తి కోరుతోంది. -
సౌదీలో 47 మందికి ఉరిశిక్ష అమలు
రియాద్: ప్రముఖ మత గురువు షేక్ నిమిర్ ఆల్ నిమిర్ సహా 47 మందికి శనివారం మరణదండన అమలు చేసినట్లు సౌదీ అరేబియా హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందనే వారికి శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తూ 2003-2006 మధ్యకాలంలో ఉగ్రదాడులకు పాల్పడిన నిందితులకు ఈ శిక్ష అమలు చేశామని ప్రభుత్వం పేర్కొంది. 2015 ఏడాదిలో 158 మందికి పైగా మరణశిక్ష అమలు చేశామని ఓ అధికారి స్థానిక మీడియాతో చెప్పారు. అందులో కేవలం నవంబర్ లోనే 45 మంది విదేశీయులు సహా 63 మందికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాకు సంబంధించి మరణశిక్ష పడింది. గతంలో 1995లో అత్యధికంగా 192 మందికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. -
గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
రోహ్టక్: మానసిక వికలాంగురాలిని (28) సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన కేసులో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. దోషులకు ఒక్కొక్కరికీ 1.75 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించారు. సోమవారం హరియాణాలోని రోహ్టక్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పరారైన ఎనిమిదో నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న బాలనేరస్తుడు జువెనైల్ కోర్టును ఆశ్రయించాడు. నేపాల్‌కు చెందిన బాధితురాలు రోహ్టక్లోని తన సోదరి ఇంట్లో ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె అదృశ్యమైంది. అదే నెల 4న బహు అక్బర్పూర్ గ్రామంలో ఆమె శవమైతేలింది. ఆమెను సామూహిక అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోపల రాళ్లు ఉన్నట్టు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, తాము ఇటుకలతో ఆమె మర్మాంగాలపై దాడి చేసినట్టు విచారణలో నిందితులు చెప్పారు. మద్యంమత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించామని, ఎందుకు అలా చేశామో తెలియదని ఓ నిందితుడు చెప్పాడు. -
సైనేడ్ మల్లికకు జీవిత ఖైదు
బెంగళూరు : మహిళలను పరిచయం చేసుకుని.. ఆపై నమ్మకం ఏర్పడిన తర్వాత వారికి ఆహార పదార్థాలల్లో సైనేడ్ కలిపి ఇచ్చి... హత్య చేసి... సదరు మహిళల బంగారాన్ని దోచుకు వెళ్తున్న మల్లిక నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ కనకపుర రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. మల్లికపై పదికి పైగా హత్యకేసుల్లో నిందితురాలిగా ఉంది. 2007లో కనకపుర తాలూకాలోని కబ్బాళమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న ఎలిజెబెత్ జోసెఫ్ అనే మహిళతో మల్లిక స్నేహం చేసింది. ఆ క్రమంలో ఆమెకు సైనేడ్ కలపిన ఆహారం ఇచ్చి హత్య చేసింది. అనంతరం ఆమె నగలతో ఉడాయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సాతనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో మల్లికను అరెస్ట్ చేసి విచారించారు. ఆ తర్వాత కనపుర రెండవ అదనపు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ నేరం రుజువు కావడంతోపాటు మల్లికపై మరో రెండు హత్య కేసులు, దోపిడి కేసులో భాగస్వామి అని న్యాయమూర్తి నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ కింద 302 కింద జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో ఏడాది కఠిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
ఉరికొయ్యతో మతం పీటముడిని విప్పగలమా?
అవలోకనం ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా అనేదే నా ప్రశ్న. హిందూ, సిక్కు ఉగ్రవాదులను ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. అఫ్జల్ గురుకు ‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెంద ద’ని సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి చూడటం మనకు సాధ్యం కాదు. గత నెల మలేసియాలో మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్ర వాదం గురించి రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరు చేసి చూడాలి. రెండు, ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదం. ఇది నిజమేనా? ఈ ఏడాది కశ్మీర్‌కు వెలుపల దేశవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల చనిపోయినవారి సంఖ్య 21. గత ఏడాది అది నలుగురు కాగా, అంతకు ముందటి ఏడాది 25. అంతకంటే ముందటి ఏడాది ఒకే ఒక్కరు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. నిజాయితీతో కూడిన ఏ ప్రమాణం ప్రకారం చూసినా దేశ జనాభాలో సగం మంది పేదలు, అందులో సగం మంది నిరక్ష రాస్యులు. మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే. అయినా ఉగ్రవాదం వాతావారణ మార్పుల కంటే కూడా పెద్ద సమస్యా? భూతాపం పెరుగుదలే చెన్నై వరదలకు కారణమని ప్రధానే అంగీ కరించారు. ఈ వరదల్లో 280 మంది కంటే ఎక్కువ మందే మరణించారు. కాబట్టి ఉగ్రవాదం, అతిశయించి చూపుతున్న సమస్యని నాకు అనిపిస్తుంది. పేదరికం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత వంటి సమస్యలను ఇప్పటికే చాలా వరకు పరిష్కరించుకున్న పాశ్చాత్య దేశాలకు అది తక్షణమైన అత్యవసర సమస్య. భారతీయులలో అత్యధికులకు భిన్నంగా సౌఖ్యంగా సాగిపోతుండే వారి జీవితాలకు ఉగ్రవాదమంటే అందుకు అంతరాయాన్ని కలిగించే సంచలనం. అయితే ఈ వ్యాసాన్ని రాస్తున్నది దాని గురించి కాదు. మన ప్రధాని చెప్పిన మొదటి అంశమైన ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేయడం గురించి. ఇంతకూ దాన్ని అలా వేరుచేయడం ఎలా? కొన్ని వాస్తవాలను చూడండి.. మీరు త మిళం మాట్లాడే హిందువు అయితే, మన మాజీ ప్రధానిని హత్య చేసినందుకు మిమ్మల్ని ఉరితీయరు. 1991లో రాజీవ్ గాంధీని, మరో 14 మందిని ఆత్మాహుతి దాడిలో హతమార్చిన కేసులో మురుగన్, శంతన్, పెరారివలన్ అనే ముగ్గురికి ఉరిశిక్ష విధించారు. అయితే గత ఏడాది వారిని ఉరితీయరాదని నిర్ణయించారు. తమిళనాడు ప్రభుత్వం వారిని కాపాడటంలో చురుకైన పాత్ర పోషించింది. మీరే గనుక పంజాబీ మాట్లాడే సిక్కు అయితే, ఒక ముఖ్యమంత్రిని చంపినందుకు మిమ్మల్ని ఉరితీయరు. పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్ సింగ్‌ను, మరో 17 మందిని ఒక ఆత్మాహుతి దాడిలో హతమార్చిన బలవంత్‌సింగ్ రాజోనాను ఉరితీయలేదు. తనకు మరణశిక్ష విధించి, తన అవయవాలను దానం చేయాలని రాజోనా కోరినా ఆ పని చేయలేదు. మరో పంజాబీ మాట్లాడే సిక్కు, దేవిందర్‌పాల్ సింగ్ భుల్లార్ 1993లో ఒక కాంగ్రెస్ నేతపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అతనినీ ఉరి తీయలేదు. గుజరాతీ మాట్లాడే ఒక సింధీ హిందువైన మాయా కొద్నానికి, తోటి గుజరాతీలు 97 మందిని హత్యగావించినందుకు శిక్ష విధించారు. అయినా ఆమె జైలులో గడపాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా లభిస్తున్న బెయిళ్లతో శిక్షపడ్డ నేరస్తురాలై ఉండి కూడా ఆమె జైలు బయటనే గడుపుతున్నారు. అదే మీరు గుజారాతీ మాట్లాడే ముస్లిం అయితే, ఉగ్రవాద ఆరోపణలకు గానూ మిమ్మల్ని ఉరితీస్తారు. యాకూబ్ మెమెన్ కుటుంబానికి తెలిసివచ్చిన నిజం అదే. మెమెన్‌ను ఉరితీయరాదని కొందరు అన్నారు, నిజమే. అయితే వారు ఉరిశిక్షల రద్దును కోరేవారు. మొదట పేర్కొన్నవారితో సహా అన్ని రకాల నేరస్తుల ఉరిశిక్షలకూ వారు వ్యతిరేకులు. ముస్లిం అయిన మెమన్‌కు తోటి గుజరాతీల మద్దతు సైతం లభించలేదు. అలాగే మీరు కశ్మీరీ మాట్లాడే ముస్లింలయితే, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలకు మీకు ఉరి వేస్తారు. అఫ్జల్ గురు కుటుంబం ఆ నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి వచ్చింది. గురు కేసులో ఆధారాలు తప్పయి ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అయినా అది అతని మరణ శిక్షను అమలుకాకుండా ఆపలేకపోయింది. తమిళనాడు, పంజాబ్ శాసన సభల్లో తమ రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులను కాపాడాలని విపరీతమైన రాజకీయ ఒత్తిడి వచ్చింది. ఇక కొద్నానీ గుజరాత్ ప్రభుత్వంలో మంత్రి, ఆమె నాయకుడు స్వయంగా ముఖ్యమంత్రి (నేటి ప్రధాని నరేంద్ర మోదీ). బాధ్యతగల మంత్రి అయి ఉండి కూడా తోటి గుజరాతీలపై ఆమె సాగించిన హత్యాకాండపై ఆయన పల్లెత్తు మాట్లాడలేదు. ఇక్కడ నేను చెబుతున్నవాటిలో కొత్త విషయాలేవీ లేవు. అన్నీ బహిరంగంగా జరిగినవి, అధికారికంగా నమోదైనవే. ఇక మొదట చర్చిన్తున్న విషయానికే తిరిగి వస్తే, నా ప్రశ్న ఒక్కటే. ఉగ్రవాదాన్ని మనం మతం నుంచి వేరుచేయాలనేది నిజాయితీతో కూడిన, సబబైన కోరికేనా? అదే జరగాలని ఒక నేత కోరుకునేట్టయితే ముందుగా చేపట్టాల్సిన చర్యలేమిటి? ఎవరికైనాగానీ, ప్రత్యేకించి ప్రపంచంలోని మనమున్న ఈ ప్రాంతంలోని వారికి ఈ పని చేయడం కష్టమని నేనంటాను. ఉగ్రవాదులు హిందువులో, సిక్కులో అయితే వారిని ఉగ్రవాదులుగా చూడటం మనకు తేలికేం కాదు. వారికి శిక్షలు విధించినా, వారు కూడా ఆత్మాహుతి దాడులనే అవే ఎత్తుగడలను ప్రయోగించినా, వారి చర్యల వల్ల వారు ఎంచుకున్న లక్ష్యాలతో పాటూ అమాయక ప్రజలు కూడా బలైపోయినా అది అంతే. పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి మద్దతునిచ్చినందుకు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించారు. గురుకు ‘‘మరణ దండన విధించనిదే సమాజ సమష్టి అంతరాత్మ సంతృప్తి చెందదు’’ అని భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు పేర్కొంది. ముస్లిమేతరులను ఉరితీయడానికి కూడా మనం అలాంటి సమర్థనలను యోచించగలిగేటంత వరకు, ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరుచేసి ఆలోచించడం సాధ్యం కాదని నా అభిప్రాయం. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
'హింస సృష్టించిన ముగ్గురికి ఉరిశిక్ష'
కైరో: ఈజిప్టులో ఘర్షణలకు పాల్పడిన ముగ్గురు నిషేధిత ముస్లిం పార్టీ ముస్లిం బ్రదర్ హుడ్ సభ్యులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 25మందికి జీవిత ఖైదు విధించగా.. 21మందికి 15 ఏళ్ల జైలు, 22మందికి పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2013 ఆగస్టులో అలెగ్జాండ్రియాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, వీటి వెనుక ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని, ఆరోజు ఘర్షణలు తగ్గించేందుకు ప్రయత్నించిన బలగాలపై కూడా వారు దాడులకు ఉసిగొల్పారని స్పష్టమైనట్లు ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. దీంతోపాటు వారు ఒక పోలీసు అధికారి చంపడమే కాకుండా సైనికుడిని చంపేశారని, పలువురు భద్రతా సిబ్బందిని గాయపరిచారని కూడా కోర్టు పేర్కొంది. -
బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరికి ఉరిశిక్ష
అగర్తలా: త్రిపురలో ఓ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడింది. ఉత్తర త్రిపురలోని కమల్పూర్ అడిషనల్ సెషన్స్ జడ్జి అరిందమ్ పాల్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. గతేడాది రషీద త్రిపుర (25), జాని త్రిపుర (20) అనే గిరిజన యువకులు 12 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు. వీరిద్దరూ ఆ అమ్మాయిని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. నిందితులు నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో ఉరిశిక్షతో పాటు 20 వేల రూపాయలు చొప్పున జరిమానా విధించింది. -
'ఆ 8 మందికి ఉరిశిక్ష వేయండి'
-
రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఓ రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష పడింది. ఆ దేశంలో సంచలనం సృష్టించిన ఓ మైనర్ బాలిక రేప్, హత్య కేసులో గతంలోనే కింది స్థాయి కోర్టు ఉరి శిక్ష విధించగా ఆ తీర్పునే సమర్థిస్తూ పైస్థాయి కోర్టు మరోసారి దానిని స్పష్టం చేసింది. దీంతో అతడిని త్వరలో ఉరి తీయనున్నారు. వాంచాయి సాయింఖావో అనే బ్యాంకాక్‌కు చెందిన 23 ఏళ్ల రైల్వే ఉద్యోగి స్లీపర్ కోచ్‌లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. గత ఏడాది జూలై 5న అదే రైలులో 13 ఏళ్ల బాలిక తన బెర్త్‌పై నిద్రిస్తుండగా గత ఏడాది జూలై 5న లైంగిక దాడి జరిపాడు. అనంతరం ఆ బాలికను రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటన దేశంలో పెను సంచలనం సృష్టించగా కేసును ది హువా హిన్ ప్రావిన్సియల్ కోర్టు విచారించి ఉరి శిక్షను ఖరారు చేసింది. దీంతో అతడు పై స్థాయి కోర్టును ఆశ్రయించినా కోర్టు కింది స్థాయి కోర్టునే సమర్థించింది. -
ఆరుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష
ఇస్లామాబాద్: పాఠశాలపై దాడి చేసి అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసులకు పాకిస్థాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. పెషావర్ సైనిక పాఠశాలపై దాడిలో ఆరుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష వేసింది. ఈ కేసులో ఏడుగురు దోషులుగా తేలారని పాకిస్థాన్ మిలటరీ తమ వెబ్ సైట్ లో వెల్లడించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు విధించినట్టు తెలిపింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసినట్టు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 14న పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు సాగించిన రాక్షకకాండలో 132 చిన్నారులతో సహా 145 మంది మృతి చెందారు. 114 మంది గాయపడ్డారు. -
'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'
-
'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'
ట్విన్ టవర్స్ కూల్చివేత తరువాత అమెరికా గడ్డపై అతిపెద్ద విధ్వంసంగా భావిస్తోన్న బోస్టన్ మారథాన్ పేలుళ్ల కేసులో దోషి, 21 ఏళ్ల ద్జోఖర్ త్సర్నేవ్కు ఫెడరల్ కోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించిన జ్యూరీ.. దోషికి ప్రాణాంతక ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని అధికారులను ఆదేశించింది. 2013, ఏప్రిల్ 15న బోస్టన్ నగరంలో మారథాన్ ముగింపు వరుస వద్ద రెండు శక్తిమంతమైన ప్రెషర్ బాంబులు పేలడంతో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు మరణించగా, 264 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది కాళ్లు, చేతులు కోల్పోయారు. కర్గిజ్స్థాన్కు చెందిన ద్జోఖర్, అతని సోదరుడు కలిసి ఈ దురాగతానికి ఒడిగట్టారు. మాసాచూసెట్స్ యూనివర్సిటీ విద్యార్థులైన ఈ అన్నదమ్ములు ఇస్లామిక్ దేశాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా బోస్టన్ మారథాన్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఘటన జరిగిన మూడురోజుల తర్వాత త్సెర్నేవ్ను సజీవంగా పట్టుకున్న పోలీసులు అని సోదరుణ్ని మాత్రం కాల్చి చంపారు. రెండేళ్లకుపైగా విచారణ సాగింది. శుక్రవారం నాటి తుది తీర్పుతో బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. తమవారిని శాశ్వత వికలాంగులుగా మార్చిన దోషికి సరైన శిక్షే పడిందని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణశిక్ష
జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హతమార్చిన కేసులో నలుగురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. తబిందా గని అనే అమ్మాయి 2007 సంవత్సరంలో స్కూలు నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించి దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబసభ్యులు ఎప్పటినుంచో కోరుతున్నారు. నిందితులు సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ ఇద్దరూ లాంగాటే ప్రాంతానికి చెందినవారు. మరో ఇద్దరు మోచి జహంగీర్ అన్సారీ పశ్చిమబెంగాల్‌కు చెందినవాడు కాగా, సురేష్ కుమార్ రాజస్థాన్ నివాసి. -
ఆ తీర్పే ఫైనల్.. మీకు ఉరే సరి
ఢాకా: గతంలో తాము ఇచ్చిన తీర్పే చివరిదని, మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ కోర్టు యుద్ధ నేరాలకు పాల్పడిన దోషులకు చెప్పింది. తమకు విధించిన ఉరి శిక్షపై వారు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చివరి ప్రయత్నంగా ఇప్పుడా నేరగాళ్లు తమకు క్షమాపణ భిక్ష ప్రసాధించాల్సిందిగా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకునే పనిలో పడ్డారు. జమాతే ఈ ఇస్లామికి చెందిన యుద్ధ నేరగాడు మహమ్మద్ కమరుజ్జామన్, మరొకరిని 1971నాటి బంగ్లా విముక్తి పోరాటంలో దేశ ద్రోహ చర్యకు పాల్పడ్డారని ది వార్ క్రైమ్స్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో మరోసారి తమ నేరంపట్ల వెల్లడించిన తీర్పును సమీక్షించాలంటూ వారు కోర్టుకు వెళ్లగా ఆ తీర్చే చివరిదని స్పష్టం చేసింది. -
మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష
న్యూఢిల్లీ: భార్యా,పిల్లలను హత్య చేసిన కేసులో మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్ష ప్రసాదించమంటూ మన్ మహదూర్ అనే ఖైదీ పెట్టుకున్న అర్జీపై రాష్ట్రపతి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ గురువారం సంతకం చేశారు. అసోంలోని దిబ్రూగర్ ప్రాంతానికి చెందిన మన్ బహదూర్ దివాన్, భార్య గౌరి, కుమారులు రాజీబ్, కాజీబ్లను 2002 సెప్టెంబర్‌లో కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా మన్ మహదూర్.. గతంలో కూడా పొరుగింటి వ్యక్తిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేర చరిత్ర ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధించిన దోషులు, తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ విన్నవించుకోవడం, వాటిని పరిశీలించిన మీదట రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించడం ఆనవాయితీ. అయితే నిఠారీ వరుస హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ, 22 మందిని హత్యచేసిన యాకూబ్ మీనన్ పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ఉరి రద్దు చేయూల్సిందే!
తమిళనాడు- శ్రీలంకల మధ్య అనాదిగా సాగుతున్న విద్వేషాలు జాలర్లకు ఉరిశిక్ష ఉదంతంతో మరింతగా రాజుకున్నాయి. జాలర్ల కుటుంబాలకే పరిమితమై ఉన్న వివాదం రాష్ట్ర ప్రజానీకానికి పాకడం ద్వారా తీవ్ర ఆందోళనకు దారితీసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకకు అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన అగస్టిన్, ఎమర్సన్, విల్సన్, ప్రశాంత్, లాంగైట్ అనే ఐదు గురి జాలర్లకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు రామనాథపు రం జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. బస్సుల ధ్వంసం, దహనం, రైలుపట్టాల ధ్వంసం, రాస్తారోకో వంటి ఆందోళనలతో అట్టుడికి పోయింది. శ్రీలంక దుందుడుకు తనాన్ని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించారుు. రాష ్టవ్య్రాప్తంగా శుక్రవారం కూడా నిరసనలు పెల్లుబికారుు. రాయబార కార్యాలయ ముట్టడికి యత్నం తమిళ జాలర్ల పట్ల శ్రీలంక వైఖరిని నిరసిస్తూ తమిళాభిమాన సమాఖ్య నేతలు శుక్రవారం చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వివిధ సంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు నినాదాలు చేస్తూ రాయబార కార్యాలయం వద్దకు బయల్దేరారు. అయితే అప్పటికే బారికేడ్లతో అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మను కాళ్లతో తన్నుతూ దగ్ధం చేయగా 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఉరిశిక్షకు గురైన వారి విడుదల కోసం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కచ్చదీవులను స్వాధీనం చేసుకోవాలని, తమిళ జాలర్లపై కాల్పులు జరిపిన శ్రీలంక గస్తీదళాలను అరెస్ట్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో 13 సముద్రతీర జిల్లాల్లో పోలీసులు బందోబస్తును పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 24 గంటలు గస్తీపెట్టారు. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం, శ్రీలంక ఎయిర్‌లైన్స్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. శనివారం నగరంలో ఆందోళన చేపట్టనున్నట్లు క్రైస్తవ సంఘాలు ప్రకటించాయి. చేపల వేట బహిష్కరణ జాలర్లకు ఉరిశిక్ష పై తమిళనాడులోని వివిధ మత్స్యకార సంక్షేమ సంఘాలు అత్యవసరంగా సమావేశమయ్యూరుు. జాలర్లపై అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేసి విడుదల చేసే వరకు చేపలవేటకు వెళ్లరాదని తీర్మానించాయి. దీంతో రామేశ్వరంలోని 1500 పడవలు ఒడ్డునే మిగిలిపోగా, సుమారు 10 వేల మంది జాలర్లు నిరసన పాటించారు. అమాయకులైన తమ భర్తలను నిర్దోషులుగా విడుదల చేయకుంటే మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఉరిశిక్ష పడిన జాలర్ల భార్యలు ప్రకటించారు. దెబ్బకు దెబ్బ హెరాయిన్ కేసును అడ్డుపెట్టుకుని ఐదుగురి తమిళ జాలర్లకు ఉరిశిక్షకు నిర్ణయించారో, అదే హెరాయిన్ శ్రీలంక మెడకు చుట్టుకోనుంది. వంద మంది శ్రీలంకవాసులు హెరాయిన్ తరలిస్తుండగా తమిళనాడు పోలీసులు మూడేళ్ల క్రితం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం నిన్నటి వరకు సాధారణ క్రిమినల్ కేసుల కిందకే వచ్చింది. అయితే ఇదే నేరంపై శ్రీలంక ఉరిశిక్షకు సిద్ధం కావడంతో తమిళులు కూడా అదే శిక్ష పడుతుందని భావిస్తున్నారు. శ్రీలంక నిందితులపై నేరం రుజువైతే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష లేదా మరణశిక్ష పడేఅవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
అయిదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష విధించిన కొలంబో కోర్టు
చెన్నై: అయిదుగురు తమిళ జాలర్లకు కొలంబో కోర్టు ఉరిశిక్ష విధించింది. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ఆరోపణలపై 2011లో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో అయిదుగురికి ఇప్పుడు ఉరిశిక్ష విధించారు. వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడానికి కొంత సమయం ఉంది. ఈ అయిదుగురు జాలర్లు తమిళనాడులోని రామేశ్వరం పరిసర ప్రాంతాల గ్రామాలకు చెందినవారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష విధించడం శ్రీలంక చరిత్రలో ఇదే మొదటిసారి. కొలంబో కోర్టు తీర్పుపై తమిళ పార్టీలు, తమిళ సంఘాలు స్పందించాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. ** -
భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మరణశిక్ష
సింగపూర్: మత్తుమందును అక్రమ రవాణా చేస్తున్న కేసులో భారతీయ సంతతికి చెందిన ప్రభాకరన్ శ్రీ విజయన్‌పై నేరం రుజువు అయింది. ఈ నేపథ్యంలో అతడికి మరణశిక్ష విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. మలేషియా జాతీయుడైన ప్రభాకరన్ శ్రీ విజయన్ 2012లో తన కారులో దాదాపు 25 కేజీల మత్తుమందు మలేసియా జోహర్ బారు నుంచి అక్రమంగా తరలిస్తున్నాడు. కాగా ఉడ్‌ల్యాండ్ చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అతడి కారులో భారీగా మత్తు మందు ఉన్నట్లు గుర్తించారు. మత్తుమందును స్వాధీనం చేసుకుని... అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో దాదాపు రెండేళ్లు విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 15 కేజీల మించి ఎవరైనా మత్తుమందు అక్రమ రవాణా చేస్తే సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించే సంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. మలేసియాలో ప్రభాకరన్ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడని మీడియా తెలిపింది. -
కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే
న్యూఢిల్లీ : నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలు నిలిపివేతను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. కోలీ మరణశిక్ష అమలుపై న్యాయస్థానం ఈనెల 29వరకూ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కోలీ ఉరి శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. ప్రస్తుం కోలీ మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్నాడు. -
మరణశిక్షను జీవితఖైదుగా మార్చలేము
విచారణలో జాప్యం సాకు కారాదన్న సుప్రీం కోర్టు ఎర్రకోటపై దాడి కేసులో దోషి వినతి తిరస్కారం సమీక్ష పిటిషన్లపై పరిమిత బహిరంగ విచారణ తప్పనిసరి మరణ శిక్ష అమలుకాని వారు.. నెల రోజుల్లోగా పునఃవిచారణ కోరొచ్చు న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయ విచారణ వల్ల ఏళ్లతరబడి జైలులో ఉండాల్సి వచ్చిందన్న ప్రాతిపదిక మీద.. మరణ శిక్షను జీవిత ఖైదుకు మార్చజాలమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే.. మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీల రివ్యూ పిటిషన్లను కోర్టులు బహిరంగంగా విచారించాలని స్పష్టం చేసింది. అన్ని మరణశిక్ష కేసుల్లోనూ గరిష్టంగా 30 నిమిషాల వరకూ పరిమిత మౌఖిక విచారణకు అనుమతించాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో మంగళవారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఆరిఫ్, మెమన్ సహా ఆరుగురి పిటిషన్లు... ఎర్రకోటపై దాడి కేసులో దోషిగా నిర్ధారితుడై మరణశిక్ష ఎదుర్కొంటున్న మొహ్మద్ ఆరిఫ్.. తనపై కేసు విచారణలో సుదీర్ఘ జాప్యం జరిగిందని, తాను గత పదమూడున్నరేళ్లుగా జైలులో ఉన్నానని, కాబట్టి తనకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు ముంబైలో 1993 వరుస బాంబు దాడుల కేసులో దోషి యాకూబ్ అబ్దుల్జ్రాక్ మెమన్, మరో నలుగురు సి.ముణియప్పన్, బి.ఎ.ఉమేష్, సుందర్, సోనుసర్దార్లుపిటిషన్లు వేశారు. తమ సమీక్ష పిటిషన్లను కోర్టు బహిరంగంగా విచారించి ఉండాల్సిందని కోరారు. ఇప్పటివరకూ ఎక్కువ కేసుల్లో సమీక్ష పిటిషన్లపై న్యాయమూర్తుల చాంబర్లలో నిర్ణయాలు తీసుకునేవారు. కక్షిదారులకు అనుమతి ఉండేది కాదు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. కేసు విచారణలో జాప్యం కారణంగా సుదీర్ఘ కాలం జైలులో ఉన్నందున మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న వాదనను తిరస్కరిస్తూ ఆరిఫ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ‘సమీక్ష’పై బహిరంగ విచారణ తప్పనిసరి... అయితే.. మరణశిక్షపై సమీక్ష వినతిపై పరిమిత బహిరంగ (కోర్టు హాలులో) విచారణ చేపట్టాలనే అంశంపై ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోథా, న్యాయమూర్తులు జె.ఎస్.ఖేహర్, ఎ.కె.సిక్రి, రోహిన్టన్ ఎఫ్ నారిమన్‌లు అనుకూల నిర్ణయం వ్యక్తం చేయగా.. న్యాయమూర్తి జె.చలమేశ్వర్ వ్యతిరేకించారు. ‘మరణ శిక్ష అనేది స్వభావరీత్యా వెనక్కుతీసుకోలేనిది. ఒకసారి మరణశిక్షను అమలు చేస్తే.. దాని ఫలితంగా దోషి ప్రాణాలు తీసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత అటువంటి తీర్పు సరికాదని తెలిసినట్లయితే.. సదరు వ్యక్తి ప్రాణాన్ని తిరిగి వెనక్కు తేవడం సాధ్యం కాదుకనుక దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి.. జీవితానికి సంబంధించిన ప్రాథమిక హక్కు ముడిపడి ఉన్నపుడు.. ఏ ప్రక్రియ అయినా సరే పై రెండు అంశాలను న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, సహేతుకంగా పరిగణనలోకి తీసుకోవాలి. కనుక.. అన్ని మరణ శిక్ష కేసుల్లోనూ సమీక్ష దశలో కూడా.. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం పరిమితమైన మౌఖిక విచారణ తప్పనిసరి అని మేం భావిస్తున్నాం’ అని మెజారిటీ న్యాయమూర్తుల తీర్పును రాసిన జస్టిస్ నారీమన్ పేర్కొన్నారు. అలాగే.. ఇంకా శిక్ష అమలుకాని దోషులు తమ సమీక్ష పిటిషన్లను పునఃవిచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కూడా ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే వారు ప్రస్తుత తీర్పు వెలువడిన నెల రోజుల్లోగా తమ సమీక్ష వినతుల పునర్విచారణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ‘న్యాయమూర్తుల విచక్షణకే వదిలేయాలి’ అయితే.. మరణ శిక్ష ఎదుర్కొంటున్న దోషి చేసుకున్న సమీక్ష వినతిపై బహిరంగ విచారణ అవసరం లేదని.. దానిని న్యాయమూర్తుల విచక్షణకే విడిచిపెట్టాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. అలాగే.. మరణశిక్ష కేసులను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. అటువంటి కేసులను కనీసం ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించాలని పేర్కొంది. -
దైవదూషణకు ఉరిశిక్ష: పాక్ కోర్టు తీర్పు
లాహోర్: పాకిస్థాన్‌లోని వివాదాస్పద దైవదూషణ వ్యతిరేక చట్టం ఆధారంగా ఒక వ్యక్తికి లాహోర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. 2008లో లాహోర్‌లోని ఇస్లాంపు ప్రాంతంలో ఉన్న ఒక గోడపై దైవాన్ని నిందిస్తూ రాతలు రాశాడన్న ఆరోపణలపై జుల్ఫీకర్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను జుల్ఫీకర్ అలీ ఖండించారు. -
బూటకపు ఎన్కౌంటర్: పోలీసుకు మరణశిక్ష
దాదాపు ఏడాది క్రితం పాట్నాలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బీహార్‌కు చెందిన ఓ పోలీసు అధికారికి మరణశిక్ష విధించారు. షమ్సే ఆలమ్ అనే అధికారికి మరణశిక్ష విధించగా, కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సింగ్, మరో ఆరుగురికి మరణించే వరకు జీవిత ఖైదు విధించారు. గత వారం విచారణ పూర్తి కావడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ సిన్హా తన తీర్పును అప్పట్లో వాయిదా వేశారు. ఆ తీర్పును మంగళవారం వెలువరించారు. ఛార్జిషీటు ప్రకారం, వికాస్ రంజన్, ప్రశాంత్ సింగ్, హిమాంశు శేఖర్ అనే ముగ్గురు విద్యార్థులను 2002 డిసెంబర్ 28న ఆషియానా నగర్ ప్రాంతంలో మార్కెట్ సమీపంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారు. సమ్మేళన్ మార్కెట్లోని కొందరు దుకాణదారులపై హత్యాయత్నం చేసిన కేసులో ఆరుగురు దోషులుగా తేలారు. ఎస్టీడీ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన గొడవలో వారు ముగ్గురు విద్యార్థులను దారుణంగా కొట్టారు. దాంతో దుకాణదారులు పోలీసులను పిలిచి వారికి ఈ ముగ్గురు విద్యార్థులను అప్పగించారు. వాళ్లు దొంగలని, పలు నేరాల్లో ఉన్నారని చెప్పారు. అనంతరం పోలీసు రికార్డులలో ఆ విద్యార్థులను దోపిడీ దొంగలుగా చూపించి ఇద్దరు పోలీసులు వారిని కాల్చి చంపారు. దీనిపై విపక్షాలు గగ్గోలు పెట్టడంతో తొలుత స్థానిక పోలీసులకు అప్పగించిన ఈ కేసును తర్వాత సీఐడీకి, అనంతరం సీబీఐకి అప్పగించారు. -
సోనూ సర్దార్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో నిందితుడు సోనూ సర్దార్కు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు గురువారం జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ , జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం అతని ఉరిశిక్ష అమలుపై కేంద్ర, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమొన్, ఎర్రకోటపై దాడి కేసులో మహ్మద్ ఆరిఫ్‌లకు కోర్టు విధించిన ఉరిశిక్ష అమలుపై పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనం దగ్గర పెండింగ్‌లో ఉన్న విషయాన్ని నిందితుడి తరఫు లాయర్లు ప్రస్తావించారు. సోనూ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోనూ అప్పీల్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇదిలా ఉండగా రాయ పూర్ సెంట్రల్ జైల్ లో ఉన్న సర్దార్ క్షమాబిక్ష పిటీషన్ ను ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్రపతి తిరస్కరించారు.2004లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. -
ముగ్గురు ఉగ్రవాదులకు మరణ శిక్ష
చైనాలోని ఓ మార్కెట్లో ఉగ్రదాడులకు పాల్పడిన ముగ్గురికి మరణశిక్ష విధించారు. మరో ఐదుగురికి యావజ్జీవ జైలు శిక్ష వేశారు. హుసాన్జన్ వక్సర్, యుసుప్ ఉమర్నియాజ్, యుసుప్ అహ్మత్ అనే ముగ్గురు ఓ ఉగ్రవాద బృందానికి నేతృత్వం వహిస్తూ, ప్రమాదకర పద్ధతుల ద్వారా ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లేలా చేశారంటూ కోర్టు వారికి మరణ శిక్ష విధించింది. బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద 2013 అక్టోబర్ నెలలో వీరు దాడులకు పాల్పడ్డారు. మరో ఐదుగురికి యావజ్జీవ ఖైదు విధించారు. వీళ్లంతా కలిసి గత సంవత్సరం అక్టోబర్ నెలలో బాగా రద్దీగా ఉన్న మార్కెట్లో ఓ జీపును వేగంగా నడిపించి, ఇద్దరి మరణానికి, 40 మంది గాయపడటానికి కారణమైనట్లు సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. -
ఆ పోలీసులకు ఉరే సరి
ఉత్తరాఖండ్‌లో బూటకపు ఎన్కౌంటర్లో 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కాల్చి చంపిన 17 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించాలని సీబీఐ కోరుతోంది. వాళ్లకు విధించే శిక్ష ఈ సమాజం మొత్తానికి ఓ గుణపాఠం కావాలని వాదించింది. దీంతోపాటు బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం కూడా ఇవ్వాలని కోరింది. ఈ కేసులో మొత్తం 18 మంది పోలీసులను నిందితులుగా పేర్కొనగా, వారిలో ఏడుగురిపై హత్య, పదిమందిపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్ నేరాలు రుజువైనట్లు ఢిల్లీలోని సీబీఐ కోర్టు శుక్రవారం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. మరొకరిపై కేవలం సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు మాత్రమే రుజువైంది. ఘజియాబాద్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థి రణ్‌బీర్ సింగ్ 2009 జూలైలో డెహ్రాడూన్‌లోని మోహిని రోడ్డులో 29 బుల్లెట్ గాయాలు తగిలి మరణించి కనిపించాడు. అతడు బెదిరింపుల రాకెట్ నడుపుతున్నాడని పోలీసులు ఆరోపించారు. కానీ, అది తప్పని తేలింది. కోర్టు మొత్తం 17 మంది పోలీసులను దోషులుగా తేల్చి, సోమవారం నాడు వారికి శిక్ష విషయం తేలుస్తామని తెలిపింది. దాంతో, దోషులందరికీ ఉరిశిక్ష విధించాల్సిందేనని ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కోరారు. -
మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : ఎర్రకోటపై దాడి కేసులో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది మహ్మద్ ఆరీఫ్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2000లో డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట మీద దాడి కేసులో మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ ప్రధాన నిందితుడు. అష్ఫాక్ పాకిస్థాన్ దేశీయుడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు సాయం చేస్తున్న అంతర్జాతీయ హవాలా వ్యాపార ముఠాలో సభ్యుడు. కాగా ఎర్రకోటపై ఆరుగురు తీవ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. -
ఉల్ఫా నేత పరేశ్ బారువాకు మరణశిక్ష!
2004 అయుధాల అక్రమ రవాణా కేసులో ఉల్ఫా ఫ్యాక్షన్ నేత పరేశ్ బారువాకు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ కేసులో మరో 13 మందికి మరణశిక్ష అమలు చేయాలని హైకోర్టు డివిజన్ అనుమతితో కోర్టు ఆదేశించింది. మరణ శిక్ష విధించిన వారిలో జమాత్ చీఫ్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మోతీర్ రాహ్మన్ నిజామీ, హోంమంత్రి లుత్పోజమాన్ బాబర్ కూడా ఉన్నారు. పది ట్రక్కుల ఆయుధాలను అక్రమంగా తరలిస్తుండగా కర్నఫులి నది వద్ద చిట్టగాంగ్ యూరియ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సమీపంలో పట్టుకుని 4930 అత్యాధునిక ఆయుధాలు, 840 రాకెట్ లాంచర్లు, 300 రాకెట్లను, 27020 గ్రెనేడ్స్, 2 వేల గ్రేనేడ్ లాంచిగ్ ట్యూబ్, 6392 మ్యాగజైన్స్, 11.41 మిలియన్ల బుల్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం బంగ్లాదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈకేసులో ప్రధాన నిందితులైన బారువా, మాజీ పరిశ్రమల కార్యదర్శి నురుల్ అమిన్ లు ఇప్పటి వరకు పోలీసులకు పట్టుపడకుండా అజ్గాతంలో ఉన్నారు. -
విశ్లేషణం: అందమైన మొండివాడు!
సాటానిక్ వెర్సెస్... ఈ పేరు వింటే చాలు ఒక వర్గం ఆగ్రహోదగ్రమవుతుంది. ఈ నవల రాసినందుకు సల్మాన్ రష్దీకి మరణశిక్ష వేస్తూ ఫత్వా కూడా జారీ అయ్యింది. దాంతో రష్దీ చాలాకాలం అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. తన రచనలతో కోట్లాదిమంది పాఠకులను మెప్పించిన రష్దీ అందమైన మగువల మనసులనూ దోచుకున్నాడు. ఒకటికాదు రెండు కాదు నాలుగు వివాహాలు చేసుకున్నాడు. ఈ ప్రఖ్యాత, వివాదాస్పద రచయిత మనసేమిటో ఈ వారం తెలుసుకుందాం. బాడీలాంగ్వేజ్ ఆధారంగా వ్యక్తిత్వాన్ని విశ్లేషించేటప్పుడు ఒక్కో కదలికను విడివిడిగా తీసుకోలేం. సమయం, సందర్భం, మొత్తంగా ఆ వ్యక్తి కదలికలను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మనకు ఆ వ్యక్తి అసలైన వ్యక్తిత్వం అర్థమవుతుంది. సల్మాన్ రష్దీ మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... రష్దీ సూటిగా చూస్తూ కనిపిస్తారు. తల, శరీరం కొంచెం కుడివైపుకు వంగి ఉంటాయి. కాలుమీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఉంటాడు. నిల్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక జేబులో చేయి పెట్టుకుని, లేదా నడుముపై చేయి పెట్టుకుని ధారాళంగా మాట్లాడతాడు. మాట్లాడే సమయంలో చేతులు ఓపెన్‌గా ఉంటాయి. మాట్లాడే మాటలకు అనుగుణంగా చేతి కదలికలు ఉంటాయి. అప్పుడప్పుడూ గడ్డాన్ని నిమురుకుంటూ లేదా చూపుడువేలుతో పెదవులను తాకుతూ మాట్లాడతాడు. అప్పుడప్పుడూ చక్కగా నవ్వుతాడు. వీటన్నింటినీ సమగ్రంగా విశ్లేషించినప్పుడు... రష్దీ ఓ ఆలోచనా జీవి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కూర్చునే లేదా నిల్చునే విధానం ఆయన స్వేచ్ఛాపరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని... ఇంకా చెప్పాలంటే ఆయన మొండితనాన్ని వ్యక్తంచేస్తాయి. తనను చంపేయాలంటూ ఫత్వా జారీ చేసినా... తాను రాసిన రాతకు కట్టుబడి ఉన్నాడే తప్ప... ఆ రాతలను ఉపసంహరించుకోకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని, మొండితనాన్ని గమనించవచ్చు. మాట్లాడే మాటకు తగ్గట్టుగా ఉండే చేతి కదలికలు ఆయన నిజాయితీకి అద్దం పడతాయి. మనసులో ఉన్నదే మాట్లాడతాడనే విషయాన్ని వెల్లడిస్తాయి. అప్పుడప్పుడూ గడ్డాన్ని నిమురుకోవడం ఆయన దీర్ఘాలోచన చేస్తారని చెబుతుంది. వేళ్లతో పెదవులను తాకడానికి ఆలోచనలను దాచుకుంటున్నారనే అర్థమున్నా... రష్దీ బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని సమగ్రంగా చూసినప్పుడు అది ఆయన దీర్ఘాలోచనలో భాగమనే తెలుస్తుంది. ఇక తనపైన తానే జోక్ చేసుకోవడం, హాయిగా నవ్వడం ఆయన ఓపెన్‌గా, ఉల్లాసంగా ఉంటాడనే విషయాన్ని వ్యక్తంచేస్తాయి. విలువలే బలం... రష్దీ అందగాడనే విషయంలో ఎలాంటి సంకోచం అక్కర్లేదు. ఆయన మాటలు మరింత అందంగా ఉంటాయి. చాలా అందంగా, స్వేచ్ఛగా, ధారళంగా మాట్లాడతాడు. తాను ప్రాముఖ్యం ఇవ్వదలచుకున్న విషయాన్ని నొక్కిచెప్తాడు. దాని ప్రాముఖ్యతకు తగ్గట్టుగా చేతి కదలికలూ ఉంటాయి. రష్దీ బలం ఆయన రచనలో లేదు.. ఆయన నమ్మిన విలువల్లో ఉంది. ఆ విలువలు మతానికి, ప్రాంతానికి, దేశానికీ అతీతమైనవి. ఆ విషయం ఆయన మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఏమిటనేది జీవితం మనకు చెప్తుంది. ఒక భావాన్ని విమర్శించే అవకాశం లేనప్పుడు భావస్వేచ్ఛకు అర్థమేలేదు. పుస్తకం ప్రపంచానికి అద్దంలాంటిది. నీకు ఇష్టంలేకపోతే వదిలేయ్ లేదంటే నువ్వో పుస్తకం రచించు. ఆలోచనలు బాధాకరమై ఉన్న సమయాల్లో కార్యాచరణే సరైన మందు. నేను జీవిస్తున్న ప్రపంచం గురించి చెప్పడానికి నాకు దేవుడనే భావన అవసరంలేదు. రచన అనేది కేవలం తార్కికంగా ఆలోచించి చేసేది కాదు. పుస్తకాలు తమ రచనలను తామే ఎంచుకుంటాయి. రాసేసమయంలో నీ ఆత్మ (సెల్ఫ్)తో నువ్వు కలిసిపో, అక్షరాలు అవే దొర్లుతాయి. పవిత్రత అనే భావన ఏ సంస్కృతికీ సరికాదు. ఎందుకంటే అది.. అభివృద్ధి, మార్పులను నేరాలుగా చూస్తుంది. ... ఇవన్నీ రష్దీ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలే. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు స్వేచ్ఛ పట్ల అతనికున్న విశ్వాసం ఎంత గట్టిదో అర్థమవుతుంది. అంతేకాదు దేవుడు, దెయ్యం, మతంలాంటి వాటికన్నా మనిషి, మానవత్వమే అతను నమ్మిన విలువలనే విషయం స్పష్టమవుతుంది. ఇక నాలుగు వివాహాలంటారా... అందగాడు, అందంగా మాట్లాడగలవాడు, మనసున్నవాడు... ఇక మగువలకు నచ్చకుండా ఉంటాడా?! - విశేష్, సైకాలజిస్ట్ -
వీరప్పన్ అనుచరులకు ‘ఉరి’ భయం!
స్మగ్లర్ వీరప్పన్ అనుచరులకు ఉరిభయం పట్టుకుంది. తమ వాళ్లను ఉరి తీయడానికి కర్ణాటక చెరలో ఏర్పాట్లు జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అప్జల్ గురు ఉరితీత అనంతరం ఆ శిక్షను ఎదుర్కొంటున్న వారిలో ఆందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వేలూరు జైల్లో ఉన్న రాజీవ్ హత్య కేసు నిందితులు, కర్నాటక చెరలో ఉన్న వీరప్పన్ అనుచరుల్లో ఉరి భయం వెంటాడుతోంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురి కావడం, కోర్టుల స్టేలతో తాత్కాలికంగా ఉరికి దూరంగా ఉన్నా, ఏ క్షణంలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న భయంతో వీరు కాలం గడుపుతున్నారు. జైల్లోనే వీరప్పన్ అనుచరులు స్మగ్లర్ వీరప్పన్ హతం అయినా, అతడి అనుచరుల జీవితాలు జైళ్లల్లో మగ్గుతున్నాయి. వీరిలో జ్ఞానప్రకాష్, సైమన్, పిలవేంద్రన్, మీసై మాదయ్యన్ ఉరిశిక్ష ఎదుర్కొంటున్నారు. వీరంతా కర్నాటక బెల్గాం జైల్లో ఉన్నారు. వీరిలో మీసై మాదయ్యన్ మాత్రం సేలం జిల్లా మెట్టూరుకు చె ందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు కర్ణాటక సరిహద్దు గ్రామాలకు చెందిన తమిళులు. 1991, 1993ల్లో కర్ణాటకలో ఓ పోలీసు స్టేషన్‌పై బాంబు దాడి, పాలారులో బాంబు అమర్చి 22 మంది పోలీసులను హతమార్చిన కేసుల్లో తడా చట్టం కింద వీరు అరెస్టు అయ్యారు. వీరికి తొలుత మైసూర్ తడా కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు ఈ నలుగురు అప్పీలు చేశారు. అయితే, వీరికి యావజ్జీవం సరిపోదని, ఉరి శిక్ష విధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఖంగుతిన్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని 2004లో వీరు రాష్ట్రపతికి మొర పెట్టుకోగా, ఇటీవల అది తిరస్కరణకు గురి అయింది. ఈ విషయం బెల్గాం జైల్లో ఉన్న ఆ నలుగురికి తెలియడంతో బంధువులకు సమాచారం అందించారు. దీంతో తమ వాళ్లను ఉరి తీస్తారేమోనన్న ఆందోళన వారిలో మొదలైంది. ఉరితీత ఏర్పాట్లు జరిగినా, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాల్లోని మానవ హక్కుల సంఘాలు, తమిళాభిమాన సంఘాలు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక బ్రేక్ పడింది. మళ్లీ భయం కోర్టు తాత్కాలికంగా ఉరి శిక్షను నిలుపుదల చేసింది. అయితే, కోర్టు తాత్కాలిక గడువు కాలం ఈనెలాఖరుతో ముగియనున్నది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ ముగింపు దశకు చేరుకుం టోంది. వీరికి ఉరి శిక్షను సుప్రీం కోర్టే విధించి ఉన్న దృష్ట్యా, శిక్షలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. దీంతో ఉరి తీత గడువు సమీపిస్తున్నదన్న ఆందోళన ఆ నలుగురిలో మొదలైంది. తమ వాళ్లకు ఆ కేసులతో సంబంధంలేనప్పటికీ, వారిని ఉరి తీయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 13 తేదీలోపు ఉరి తీయొచ్చన్న సంకేతాలతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతోన్నాయి. కర్నాటక జైళ్ల శాఖ డీఐజీ వీరభద్రస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం తరచూ ఆ నలుగురికి వైద్యపరీక్షలు జరుపుతోన్నట్టు కుటుంబీకులు పేర్కొంటున్నారు. ఉరి శిక్ష అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమకు అనుమానం కలుగుతోందని ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అందియూరుకు చెందిన న్యాయవాది జూళియట్ పేర్కొంటూ, ఆ నలుగురి ఉరి శిక్ష నిలుపుదలకు తాను కోర్టులో పోరాడుతూనే ఉన్నానన్నారు. తనకు సహకారంగా రాజకీయ పార్టీలు నిలవాలని, అందరూ కలసి కట్టుగా ముందుకెళ్తే ఉరిని ఆపగలమని చెబుతున్నారు. పదోన్నతి వీరప్పన్ వేటలో తనకు పదోన్నతి కల్పించలేదంటూ ఓ అటవీ అధికారి దాఖలు చేసుకున్న పిటిషన్‌కు చెన్నై హైకోర్టు బుధవారం స్పందించింది. వీరప్పన్ వేటలో అటవీ అధికారులు, ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో వీరప్పన్‌ను హతమార్చిన అధికారులు, సిబ్బంది అందరికీ పదోన్నతులు, నజరానాలు అప్పట్లో భారీగానే దక్కాయి. అయితే, కోయంబత్తూరుకు చెందిన అటవీ శాఖ సిబ్బంది పుష్పకరన్ కు మాత్రం పదోన్నతి దక్కలేదు. దీంతో కోర్టును ఆయన ఆశ్రయించారు. ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆయనకు పదోన్నతి కల్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెన్నై హైకోర్టు ఆదేశించడం విశేషం. -
సీరియల్ సైనైడ్ కిల్లర్‌కు మరణశిక్ష
సైనైడ్ ఉపయోగించి వరుసపెట్టి హత్యలు చేస్తున్న ఓ హంతకుడికి మూడు హత్య కేసుల్లో కోర్టు మరణశిక్ష విధించింది. సైనైడ్ కిల్లర్ అని పేరున్న మోహన్ కుమార్‌పై నేరం గత మంగళవారం నిరూపితమైంది. నాలుగో అదనపు డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు శనివారం శిక్ష విధించింది. లీలావతి, అనిత, సునంద అనే ముగ్గురు మహిళలను చంపిన కేసులు అతడిపై రుజువయ్యాయని, అందుకే అతడికి మరణ శిక్ష విధిస్తున్నామని జడ్జి బీకే నాయక్ తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసని, ఈ నేరానికి మరణశిక్ష కంటే తక్కువ శిక్ష విధించడానికి అవకాశమే లేదని నాయక్ అన్నారు. అయితే.. ఏ కేసులోనూ పోస్టుమార్టం నివేదికలో సైనైడ్ వాడినట్లు రాలేదని మోహన్ కుమార్ వాదించాడు. 2009 అక్టోబర్ 21న అతడిని అరెస్టు చేయగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2011 నవంబర్ నెలలో విచారణ ప్రారంభమైంది. తర్వాత నాలుగో అదనపు డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. -
ఎనిమిది మంది విద్యార్థులకు మరణ శిక్ష
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎనిమిది మంది విద్యార్థులకు మరణ శిక్ష, మరో 13 మందికి జీవిత ఖైదు విధించారు. బంగ్లాదేశ్‌లోని ఛాత్ర లీగ్ కార్యకర్తలుగా ఉన్న వీరందరికీ పాత ఢాకాలో ఏడాదిక్రితం బిశ్వజిత్ దాస్ అనే ఓ టైలర్‌ను చంపిన కేసులో శిక్షలు పడ్డాయి. నేర తీవ్రత దృష్ట్యా ఇంత ఎక్కువ శిక్ష విధిస్తేనే న్యాయం జరుగుతుందని కోర్టు భావించినట్లు న్యాయమూర్తి నిజాముల్ హక్ వ్యాఖ్యానించారని అక్కడి మీడియా తెలిపింది. నేరం పట్టపగలు జరిగింది తప్ప చీకట్లో ఎవరికీ తెలియకుండా జరిగినది కాదని, అది చాలా దారుణమైన హత్య అని కోర్టు వ్యాఖ్యానించింది. గత సంవత్సరం ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసిన సమయంలోనే ఇది జరిగింది. బిశ్వజీత్ హత్యకేసు చాలా సున్నితమైనదని, ఇది మిగిలిన కేసుల కంటే విభిన్నమైనదని అన్నారు. ఇంతకీ మరణశిక్ష పడిన ఎనిమిది మందిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. అలాగే జీవితఖైదు పడిన 13 మందిలో 11 మంది కూడా పరారీలోనే ఉన్నారు. వీళ్లలో చాలామంది జగన్నాథ్ యూనివర్సిటీ విద్యార్థులు. బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ అనేది అవామీ లీగ్ అనుకూల విద్యార్థి విభాగం. డిసెంబర్ 9వ తేదీన బిశ్వజీత్ తన దుకాణానికి వెళ్తుండగా విద్యార్థులు అతడిని వెంబడించి తీవ్రంగా కొట్టి, పదునైన ఆయుధాలతో పొడిచి చంపారు. -
రేపిస్టుకు మరణ శిక్ష విధించిన కేరళ హైకోర్టు
కొచ్చి: అత్యాచార నిందితుడికి మరణ శిక్షను ఖరారు చేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కింది కోర్టు విదించిన అదే శిక్షను సమర్ధించింది. తమిళనాడుకు చెందిన గోవిందా చామియా అనే యువకుడు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై విచారించిన పీ.ఆర్.రామచంద్రన్ నాయర్ మరియు పి. కమల్ పాషాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ప్రకటించింది. అత్యాచార నిందితుడు చామియాకు మరణ శిక్షతో పాటు రూ.లక్ష చెల్లించాలని తెలిపింది. ట్రైన్లో రేప్‌లకు గురౌతున్న వారిని రక్షించడానికి భారత రైల్వేలు, న్యాయవాదులు, తోటి ప్రయాణికులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని పేర్కొంది. 2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 1 వ తేదీన ట్రైన్లో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతి వద్ద ఓ యువకుడు ప్రేమ ప్రస్తావన తెచ్చి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కాగా దీనికి ఆ యువతి నిరాకరించడంతో కదులుతున్న ట్రైన్ లోంచి ఆమెను తోసేసిన అనంతరం అతను కూడా దూకేశాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను రాయితో తలపై బలంగా మోది అత్యాచారం చేశాడు.ఆమె చికిత్స పొందుతూ అదే సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో కింది కోర్టు చామియాకు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును హైకోర్టు సమర్ధిస్తూ అతనికి మరణశిక్ష పబబేనని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు తోటి ప్రయాణికులు అండగా నిలవకపోవడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి సంఘటనలపై భారతీయ రైల్వేలు కూడా సరైన చర్యలు చేపట్టకపోవడాన్ని విమర్శించింది. -
అబ్దుల్ ఖాదర్ ముల్లా ఉరిశిక్ష నిలిపివేత
ఢాకా: ‘మీర్పూర్ కసాయి’గా పేరుమోసిన జమాతే ఇస్లామీ నేత అబ్దుల్ ఖాదర్ ముల్లాకు విధించిన ఉరిశిక్షను బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు నిలిపివేసింది. 1971 నాటి యుద్ధనేరాలపై అతనికి కోర్టు మరణ శిక్ష విధించింది. ఖాదర్ 1971లో అమానవీయ చర్యలు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక ట్రిబ్యునల్ అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ముజామ్మెల్ హుస్సేన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. తనపై మోపిన అన్ని అభియోగాల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఖాదర్ ముల్లా దాఖలు చేసుకున్న అప్పీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చివరి క్షణంలో సుప్రీంకోర్టు అతని ఉరిశిక్షను నిలిపివేసింది. -
మరణశిక్షల తగ్గింపుపై సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారం కేసుల్లో మరణశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలకు శిక్షను తగ్గిస్తూ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు వచ్చింది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి నోటీ సు జారీ చేసింది. పిల్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. ప్రతిభాపాటిల్ అప్పట్లో మరణశిక్షను తగ్గించిన మొత్తం 35 కేసుల్లో 5కేసులు బాలికలపై క్రూరాతిక్రూరమైన అత్యాచారాలకు సంబంధించినవని పిటిషనర్ పేర్కొన్నారు. -
152 మంది మాజీ సైనికులకు ఉరిశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్‌లో నాలుగేళ్ల కిందట సైనిక తిరుగుబాటు, 74 మంది ఊచకోత కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 152 మంది బంగ్లాదేశ్ మాజీ సైనికులకు ఉరిశిక్ష విధించింది. 34 నెలల విచారణ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మహమ్మద్ మంగళవారం ఈ తీర్పు వెలువరించారు. ఉరిశిక్ష పడినవారిలో.. తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన బంగ్లాదేశ్ రైఫిల్స్ మాజీ డిప్యూటీ అసిస్టెంట్ డెరైక్టర్ తౌహిద్ అహ్మద్‌తోపాటు పలువురు మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం 820 మాజీ సైనికులు, 26 మంది పౌరులపై విచారణ కొనసాగింది. వీరిలో కోర్టు 152 మంది తిరుగుబాటు సైనికులకు ఉరిశిక్ష విధించగా, 158 మంది మాజీ సైనికులకు జీవిత ఖైదు చేసింది. 251 మందికి 3 నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించి, 271 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని దోషుల న్యాయవాదులు తెలిపారు. వేతనాల పెంపు, ఇతర డిమాండ్లపై 2009 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో వందలమంది సైనికులు ఉన్నతాధికారులపై తిరుగుబాటు చేశారు. ఢాకాలోని సైనిక ప్రధాన కార్యాలయంలో మారణకాండ సృష్టించారు. అప్పటి బంగ్లా రైఫిల్స్ అధినేత షకీల్ అహ్మద్‌ను మట్టుబెట్టారు. -
యుద్ధనేరాల కేసులో బంగ్లా ఎంపీకి ఉరిశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ యుద్ధనేరాల కేసులో విపక్షమైన బంగ్లా నేషనల్ పార్టీ (బీఎన్పీ) ఎంపీ సలావుద్దీన్ ఖాదర్ చౌదరికి ఉరిశిక్ష విధిస్తూ బంగ్లా యుద్ధనేరాల ప్రత్యేక ట్రిబ్యునల్ మంగళవారం తీర్పునిచ్చింది. యుద్ధనేరాల కేసులో ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్పీ ఎంపీ ఒకరికి ట్రిబ్యునల్ మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. కాగా, యుద్ధనేరాల కేసులో మరణశిక్ష పడిన వారిలో చౌద రి (65) ఏడో వ్యక్తి. పాక్‌తో బంగ్లా విమోచన పోరాటం జరిగిన సమయంలో అత్యాచారం, హింస, హత్య, మానవ హననం వంటి నేరాల్లో చౌదరిని కోర్టు దోషిగా నిర్ధారించింది. తీర్పు వెలువడిన వెంటనే రాజధాని ఢాకా, చౌదరి స్వస్థలం చిట్టగాంగ్‌లో బీఎన్పీ కార్యకర్తలు హింసాత్మక నిరసనలకు దిగారు. -
మరణశిక్ష ఎవరికి?
విశ్లేషణ: అనుద్దేశపూర్వకంగానే అయినా నిర్భయ కేసు తీర్పు భావి నేరగాళ్లకు పంపే సందేశం భయానకమైనది. సాక్ష్యాలే లేకుండా సాక్షులను చంపేయాలని సూచిస్తుంది! నేడు రేపిస్టుకు విధించే ఉరిశిక్ష రేపటి రేప్ బాధితురాలికి మరణ శిక్షగా మారదా? నిర్భయ, జాగృతి, అమానత్, దామిని అంటూ ఆమెకు నివాళులర్పించాం. ఆమెపై ‘ఆ ఆరుగురు’ జరిపిన అమానుష నేరాలు- హత్య, మానభంగం, సాక్ష్యాల ధ్వంసం, కుట్ర, కిడ్నాప్, మరెన్నో. బందిపోటు దొంగతనం చేస్తూ హత్య అన్న ఆరోపణ ఒక్కటీ రుజువు కాలేదని ఢిల్లీ ప్రత్యేక కోర్టు అదనపు జడ్జి యోగేశ్ ఖన్నా నిర్భయ కేసు తీర్పులో పేర్కొన్నారు. ఆమె కేవలం అత్యాచారానికి గురై హత్యకు గురికావడం మాత్రమే జరగలేదు. ఆమెను, ఆమె మిత్రుడ్ని బస్సులో ఎక్కించుకుని, దారితప్పించి, అపహరిం చి, దోచుకున్నారు, తీవ్రంగా గాయపరచారు. ఆమెపై అతి క్రూరమైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నెత్తుటి ముద్దయి, కొన ఊపిరితో ఉన్న ఆమె రెండు వారాలకు సింగపూర్ ఆస్పత్రిలో మరణించిం ది. అరుదైన నేరాల్లోకెల్లా అరుదైన నేరానికి మరణశిక్ష విధించవచ్చని మన న్యాయవ్యవస్థ సిద్ధాంతీకరించింది. హత్యా నేరానికి మరణశిక్ష విధిం చవచ్చని భారత శిక్షాస్మృతి చెబుతోంది. ఆ అమానుష ఘటన తదుపరి చట్టంలో వచ్చిన మార్పులతో అత్యాచారానికి యావజ్జీవ కారాగార శిక్షకు అవకాశం ఏర్పడింది. మురికివాడల్లో పుట్టిన నేరం నిర్భయ నేరస్తులు ఆరుగురూ దక్షిణ ఢిల్లీలో కూలినాలి చేసుకునే ఒక మురికివాడ వాసులే. అక్షయకుమార్ సింగ్ బస్సు క్లీనర్, వినయ్‌శర్మ వ్యాయామశాల శిక్షకుడు. పవన్‌గుప్త పండ్ల వ్యాపారి. ముఖేష్‌సింగ్ నిరుద్యోగి. వారు నలుగురూ నిర్భయపైన 11 నేరాలకు పాల్పడ్డట్టు తేలింది. బస్సు డ్రైవర్ రాంసింగ్ (34) మార్చి 11న జైల్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కనుక అతనిపై విచారణ రద్దయింది. మరొక నేరస్తుడు 18 ఏళ్ల లోపు మైనర్ అని తేలింది. కాబట్టి అతడ్ని మూడేళ్లపాటూ జూవనైల్ హోంలో ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది. రాంసింగ్ తమ్ముడు ముఖేశ్ (29) రాజస్థాన్ నుంచి ఉద్యోగ ప్రయత్నంలో ఢిల్లీకి వచ్చాడు. అన్నతోనే కలిసి ఉండేవాడు. తాను కష్టపడే మనిషినని, సాదాసీదాగా బతుకుతానని ముఖేష్ తన గురించి చెప్పుకున్నాడు. మహిళలంటే తనకు గౌరవమని, తనపై ఆరోపించిన నేరాలేవీ తాను చేయలేదని న్యాయస్థానానికి విన్నవిం చాడు. వినయ్‌శర్మ (20), రాంసింగ్ ఇంటి పక్కనే ఉంటేవాడు. నేరస్తులలో అతడొక్కడే హైస్కూల్ చదువు పూర్తి చే సినవాడు. ఇక పవన్ గుప్త (19), భవన నిర్మాణ పనులు, విందుల్లో వడ్డనలు చేస్తూ బతికేవాడు. రాంసింగ్‌కు స్నేహితుడు. ఇటుకల బట్టీలో, సారా దుకాణంలో పనిచేసే అక్షయ్(28)కు పెళ్లయింది, రెండేళ్ల కొడుకున్నాడు. మరొకడు 17 ఏళ్ల మైనరు కాబట్టి వాడి పేరు చెప్పడానికి చట్టాలు ఒప్పుకోవు. చట్టం ప్రకారం వాడు చట్టంతో పోరాడే కుర్రాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడు పదకొండో ఏటనే ఇంటి నుంచి పారిపోయాడు. ఢిల్లీలో వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదని తల్లి తెలిపింది. రాంసింగ్ బస్సు క్లీనర్‌గా ఉంటూ, ఆ బస్సులోనే నిద్రపోయేవాడు. అమెరికా లాంటి దేశాల్లో ఒక్కొక్క నేరానికి విడివిడిగా దశాబ్దాల కారాగార శిక్షలను విధిస్తారు. అంటే ఒక్కోసారి నేరస్తునికి రెండు, మూడు వందల సంవత్సరాల శిక్ష పడుతుంది. కాని మన దేశంలో ఎన్ని నేరాలకు శిక్షలుపడ్డా అన్నీ ఏక కాలంలోనే అమలవుతాయి. అతి పెద్ద శిక్ష యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష. ఈ నేరం జరిగిన తీరు చేస్తే హంతకులలో మానవత్వం మచ్చుకి కూడా కానరాదు. మరణశిక్ష వద్దనే కరుణామయులు సైతం ఈ నేరగాళ్లను ఉరి తీయాలని భావించేటంతటి దారుణ నేరం ఇది, నిజమే. కానీ లోతుగా తరచి చూస్తే వారిని చంపడమే దయతలచడం అవుతుందేమోనని అనిపిస్తోంది. అంతకంటే బతికించి వారు చేసిన నేరం క్షణక్షణం గుర్తుకు వచ్చి అనుక్షణం నరకయాతన అనుభవించేట్టు చేయడమే వారికి తగిన శిక్ష కావచ్చని తోస్తోంది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడ్డా, అది హైకోర్టు, సుప్రీం కోర్టులను దాటి, రాష్ట్రపతి క్షమాభిక్షను దాటి, ఉరి కంబానికి చేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఈలోగా మరణశిక్షలను విధించడంలోని ఔచిత్యం ఏమిటనే అంశంపై చర్చ జరగాల్సి ఉంది. ఈ నలుగురిని ఉరి తీస్తే న్యాయం మీద నమ్మకం కలుగుతుందని, భయపడి అత్యాచారాలకు పాల్పడటం తగ్గిపోతుందని వాదిస్తున్నారు. ఇది ప్రజాగ్రహానికి, ప్రజాభీష్టానికి అనుగుణమైన తీర్పు అని ప్రశంసిస్తున్నారు. వారిని ఉరి తీసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? ధనంజయ్ చటర్జీ లాంటి వాళ్లు ఎందరినో ఉరి తీశారు. అయినా అత్యాచారాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయెందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మరో నలుగురిని ఉరి కంబం ఎక్కించి న్యాయం జరిగిందని చేతులు దులుపుకుందామా? ఒక రుజువైన నేరానికి శిక్షలను విధించేటప్పుడు ఆ ప్రక్రియపై భావోద్వేగాలు ప్రభావం చూపకూడదు. ఇచ్చే తీర్పు రాబోయే ఎన్నికలపై కలిగించే ప్రభావం గురించిన ఆలోచన అసలే ఉండకూడదు. నేరస్తులపై పనిచేసిన పరిసరాల, పరిస్థితుల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయశాస్త్రాలు బోధిస్తున్నాయి. నిర్భయ కేసు అందుకు మినహాయింపు కాదు. దారుణమైన నిర్భయ కేసులోని నేరస్తుల మురికివాడలు రాజధాని నగరం చూట్టూ వెలస్తున్న నేరస్తులను తయారుచేసే కార్ఖానాలు. నిర్భయ ఘటన తరువాత పెల్లుబికిన ప్రజాచైతన్యం మొత్తంగా దేశాన్నే ఆలోచింపజేసింది, చట్టాన్ని మార్చింది. తొమ్మిది నెలల్లోనే కేసు శిక్ష విధించే వరకు చేరింది. అయినా అవే నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అదే అమానుష క్రౌర్యం కాటేస్తూనే ఉంది. నిర్భయ కేసులోలాగే అలాంటి ప్రతి నేరం విషయంలోనూ కేసు రుజువై, నేరస్తులు చట్టానికి దొరికేలా పరిశోధనను పటిష్టం చేయాలనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదెందుకు? నేరస్తులను ఉరి తీయాలని పోరాడటం కన్నా అసలా నేరాన్నే ఉరి తీయాలనీ, ఆ నేర ప్రవృత్తినే పాతిపెట్టాలని ఎందుకు కోరుకోవడం లేదు, ఎందుకు కృషి చేయడం లేదు? అసలు నేరాన్ని నిరోధించడం ఎలా? ఇలాంటి నేరాలు జరిగినప్పుడు సత్వరమే నేరాన్ని రుజువుచేసి, నేరస్తులను శిక్షించడం ఎలా? అని ఆలోచించే వారు తక్కువైపోవడం శోచనీయం. మరో కోణాన్నీ చూడాలి... నిర్భయ కేసులో నలుగురు నేరస్తులకు ఉరిశిక్ష పడటానికి మూల కారణం బాధితురాలి సాక్ష్యమే. నిర్భయ కేసులో విధించిన మరణ శిక్షలు నిజానికి అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినందుకు విధించినవే. కానీ సామాన్యులకు మాత్రం రేప్ చేస్తే ఉరితీస్తారనే అర్థం అవుతుంది. ప్రత్యేకించి నగరాల మురికివాడల్లో తయారవుతున్న కొత్త రేపిస్టులకు అలాగే అర్థం అవుతుంది. కాబట్టి అనుద్దేశపూర్వకంగానే అయినా నిర్భయ కేసు తీర్పు భావి నేరగాళ్లకు పంపే సందేశం చాలా భయానకమైనది. అది భావి నేరాలను ఆపేది కాదు. సాక్ష్యాలే లేకుండా సాక్షులను చంపేయాలని సూచిస్తుంది! నిర్భయ కేసులో ప్రధానమైన సాక్షి బాధితురాలే. ఆమెను, ఆమె మిత్రుడిని నేరస్తులు అందుకే బస్సుతో తొక్కేయాలని ప్రయత్నించారీ ఘటనలో. వారి ఉద్దేశాలకు అతీతంగా వారు బతికారు. నిర్భయ మరణ వాఙ్మూలంతోపాటూ, ఆమె మిత్రుడి ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది. కాబట్టే నేరం రుజువైంది. నేరగాళ్ల హత్యా ప్రయత్నం ఫలించి ఉంటే, ఈ నేరం క్రూర స్వభావం పూర్తిగా బయటకు వచ్చేది కాదేమో. నేరస్తులను ఈ విధంగా ఉరితీస్తూ పోతే ఇక ముందు సాక్షులు బతుకుతారా? అసలు సాక్షి అయిన బాధితురాలు బతుకుతుందా? రోగికి చికిత్స చేసే డాక్టర్ రోగిని చంపకుండా రోగాన్ని తొలగించినట్టుగా... న్యాయవ్యవస్థ నేరస్తులను గాక నేరాలను తొలగించాలనేది న్యాయసూత్రం. అది విస్మరించి నేడు ఉరిశిక్షలు విధిస్తూ పోతే చివరికి అవి సాక్షులకు విధించే మరణ శిక్షలుగా మారిపోవా? అత్యాచార ఘటనల్లో అసువులు కోల్పేయే అతివల సంఖ్య విపరీతంగా పెరిగిపోదా? నేడు రేపిస్టుకు విధించే ఉరిశిక్ష వాస్తవంలో రేపటి బాధితురాలికి మరణ శిక్షగా మారదా? రేపిస్టును కోర్టు ఉరి తీస్తే, మరణ వాంగ్మూలమైనా ఇవ్వకముందే బాధితురాలికి రేపిస్టు మరణశిక్ష విధిస్తాడు. -
ప్రమాదకర ధోరణి!
నిర్భయ కేసు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి మరణశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దోషులకు మరణదండన సరైందా, కాదా అన్న చర్చ సంగతలా ఉంచి ఆ కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఒకరు ఆ తీర్పుపై నిప్పులు కక్కిన తీరు, ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు అందర్నీ దిగ్భ్రాంతిపరిచాయి. దాన్నుంచి దేశం ఇంకా తేరుకోకముందే కర్ణాటక ప్రభుత్వం సెక్రటేరియట్లో పనిచేస్తున్న సిబ్బందికి ‘డ్రెస్ కోడ్’ విధిస్తూ వెలువరించిన సర్క్యులర్ అలజడి సృష్టించింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందిగానీ... అసలు అలాంటి సర్క్యులర్ జారీచేయడం వెనకున్న ధోరణి ప్రమాదకరమైనది. నిర్భయ కేసు నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఆలోచనలకూ, ఈ సర్క్యులర్ రచయిత ఆలోచనాధోరణికి మధ్య పెద్దగా తేడా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. లైంగిక నేరాలు నానాటికీ పెరిగిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. నిర్భయ ఉదంతానికి ముందూ, ఆ తర్వాత కూడా ఎన్నో అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది మొత్తంగా మహిళలపై 2,45,000 నేరాలు జరిగాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువ. పోలీసులు శ్రద్ధపెట్టక పోవడం వల్లా, దర్యాప్తు సంవత్సరాల తరబడి సాగుతుండటంవల్లా న్యాయ స్థానాల్లో నేరనిరూపణ అవకాశాలు తగ్గిపోయి నిందితులు తేలిగ్గా తప్పించుకో గలుగుతున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖే ఆమధ్య తెలియజేసింది. ఇలాంటి లోపాల నివారణకు మార్గం సూచిస్తే ఈ దుస్థితిని సరిదిద్దినవారవుతారు. కానీ, నిర్భయ తరఫు న్యాయవాదైనా, కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ అయినా చేసింది అది కాదు. నేరం జరిగినప్పుడల్లా బాధితులనే దోషులుగా చూసే సాధారణ మనస్తత్వమే అందులో కనబడుతుంది. న్యాయవాది ఏపీ సింగ్ తన క్లయింటులకు ఉరిశిక్ష విధించడంపై తీవ్రంగా స్పందించారు. ‘నా కూతురే గనుక వివాహానికి ముందు మగ స్నేహితుడితో తిరిగితే నిలువునా తగలబెట్టేవాడిన’ని నోరుపారేసుకున్నారు. నిర్భయకు జరిగినలాంటిది తన బిడ్డకు జరగనివ్వనని, అలా వెళ్లినట్టు తెలిసిన వెంటనే తానే చంపేస్తానని చెప్పారు. దేశంలో తల్లిదండ్రులందరూ అలాగే చేయాలని కూడా ఆయన కోరారు. అంతక్రితం తీర్పు వెలువడిన రోజున కూడా ఆయన మాటల తీరు ఇలాగే ఉంది. ‘ఈ కేసులో అప్పీల్‌కు రెండు నెలలు వేచిచూస్తా... ఈ తీర్పు ప్రభావంతో అప్పటివరకూ దేశంలో ఎక్కడా అత్యాచారాలు జరగకుండా ఉంటే అసలు అప్పీలే చేయను’ అంటూ నిప్పులు కక్కారు. సమాజం అభివృద్ధి చెందుతున్నదని, మహిళలకు అన్నిరంగాల్లోనూ సమానావకాశాలు లభిస్తున్నాయని... చదువు ల్లోనూ, ఉద్యోగాల్లోనూ వారు రాణిస్తున్నారని అందరూ అనుకుంటున్నా వివక్ష కొత్త కొత్త రూపాల్లో విస్తరిస్తోంది. మహిళలకు సంబంధించి పురుషుల ఆలోచనాధోరణిలో ఉన్న వెనకబాటుతనం పెరుగుతున్నదే కానీ తగ్గటం లేదు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా దీర్ఘకాలంనుంచి తన వృత్తిలో ఉంటున్న వ్యక్తి నుంచే అలాంటి మాటలు వెలువడ్డాయంటే అది సాధారణ విషయం కాదు. ఆయన దృష్టిలో ఈ కేసులో నిర్భయే నేరస్తురాలు. ఆమె ఆరోజు ‘ఎవరితోనో’ సినిమాకు వెళ్లడంవల్లా, ఆ ఆరుగురి వ్యక్తుల కంటబడటంవల్ల వారు నేరం చేయాల్సివచ్చిందని ఆయన భావన. గెలిచితీరగలమన్న కేసు ఓడిపోవడంవల్ల కలిగిన నిరాశా నిస్పృహల్లోంచి మాట్లాడిన మాటలు కావవి... మగ దురహంకారంతో, పితృస్వామిక భావజాలం నరనరానా జీర్ణించుకోవడంవల్ల పలికిన పలుకులవి. కర్ణాటక ప్రభుత్వం గత గురువారం ఇచ్చిన సర్క్యులర్ వెనకున్న ధోరణి కూడా ఇదే. కాకపోతే, మహిళలకు మాత్రమే డ్రస్కోడ్ చెబితే వివాదం తలెత్తుతుందనుకున్నారో, ఏమోగానీ పురుషులకు కూడా డ్రస్ కోడ్ విధించారు. మహిళలు ‘రెచ్చగొట్టే తరహా’ దుస్తులు వేసుకోకూడదని చెబుతూ, అవేమిటో ఏకరువు పెట్టారు. అందులో డిజైనర్ బ్లౌజుల నుంచి రకరకాలవి ఉన్నాయి. చీర లేదా సల్వార్ కమీజ్ మాత్రమే ధరించాలని సూచించారు. పురుషులు జీన్స్, టీషర్టులు వేసుకోవడం నిషిద్ధమన్నారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడల్లా వినవచ్చే వాదనే ఇది. ఆమధ్య ఒక టీవీ చానెల్ సర్వే చేసినప్పుడు మహిళలు ధరించే దుస్తులవల్లే వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని 53 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. అయితే, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మూడు, నాలుగేళ్ల పసిపిల్ల నుంచి పెద్ద వయసువారి వరకూ అందరిపైనా ఇలాంటి నేరాలు జరిగాయి. ధరించిన దుస్తులను బట్టి నేరం జరిగిందనడానికి ఎలాంటి దాఖలా లభించలేదు. ధరించే దుస్తులనుబట్టే నేరం జరుగుతున్నదనడమంటే నేరానికి అసలు కారకులు మహిళలని చెప్పడమే కాదు... పురుషులందరూ తమను తాము అదుపుచేసుకోలేనివారని, నేరపూరిత మనస్తత్వం కలవారని చెప్పడం కూడా. ఇంతటి మతిమాలిన సర్క్యులర్‌పై సహజంగానే మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అటుతర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. అందుకు బదులుగా ‘ప్రభుత్వ ప్రతిష్టకు అనుగుణ మైన’ రీతిలో దుస్తులు ధరించాలని కొత్త సర్క్యులర్ విడుదలైంది. ఏ ఉద్యోగైనా ముందు వ్యక్తిత్వమున్న మనిషి. ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. వేసుకునే దుస్తులు కూడా అందులో ఒక భాగం. సమాజంలో ఉండే దురభిప్రాయాలను పారదోలడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా వాటిని మరింత పెంచేలా వ్యవహరిస్తున్నాయన డానికి ఇలాంటి సర్క్యులర్లు ఉదాహరణ. ప్రభుత్వాలే ఇలా వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తుంటే సుప్రీంకోర్టు న్యాయవాది అలా మాట్లాడటంలో వింతేముంది? -
నిర్భయ కేసులో ఉరిశిక్ష సరే.. మా అబ్బాయి మాటేంటి?
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి.. కోర్టు తీర్పుపై సూటి ప్రశ్నలు సంధించారు. తన భర్తకు ఉరిశిక్ష విధించే ముందు కోర్టు వారు తమ అబ్బాయి సంగతి ఏమవుతుందో ఆలోచించి ఉండాల్సిందని ఆమె అన్నారు. రెండేళ్ల వయసున్న తన కుమారుడి పరిస్థితి ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఉరిశిక్షను సవాలుచేస్తూ హైకోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అక్షయ్ తండ్రి సరయు సింగ్ చెప్పారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికీ సాకేత్ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
మాకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు
నలుగురు క్రూరులకు కోర్టు మరణ దండన విధించడం ‘నిర్భయ’ తల్లిదండ్రులకు సంతృప్తిని, పూర్తి ఉపశమనాన్ని కలిగించింది. ‘నేను ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. ఎట్టకేలకు మాకు ప్రశాంతత చేకూరింది. మా కుమార్తెకు న్యాయం జరిగింది’ అని ‘నిర్భయ’ తల్లి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తర్వాత కోర్టు ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘మాది చాలా సంక్లిష్టమైన ప్రయాణం. తీర్పు ఇప్పుడు వెలువడింది. నిజమైన అర్థంలో మాకు న్యాయం చేకూరింది. తీర్పుతో మేం సంతోషంగా ఉన్నాం. ఒకవేళ హైకోర్టులో వాళ్లు అప్పీలు చేసినా, అప్పుడు కూడా మాకు న్యాయమే జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఆమె అన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ... ‘ఇటువంటి దారుణాలు మళ్లీ జరగకుండా ఈ తీర్పు నిలువరిస్తుంది. అకృత్యాలు చేయడానికి ఇక ముందు ఎవరూ ధైర్యం చేయరని నాకు అనిపిస్తోంది. దేశంలో న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని అన్నారు. నిర్భయ పూర్వీకుల ఊరిలో సంబరాలు బల్లియా(యూపీ): ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించినట్లు తెలియటంతో నిర్భయ పూర్వీకుల స్వగ్రామంలో సంతోషం వెల్లివిరిసింది. గ్రామస్థులు దేవాలయంలో కొవ్వొత్తులు వెలిగించి నిర్భయకు నివాళులర్పించారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. ఊరంతా మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 16వ తేదీన నిర్భయపై కిరాతకుల లైంగిక దాడి అనంతరం మేదావర్ కలాన్ గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాన్ని భారీ వరదలు ముంచెత్తినా కోర్టు తీర్పు కోసం ఊరంతా వేయికళ్లతో ఎదురు చూసింది. ప్రజలు ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. తీర్పు వార్త టీవీల్లో రాగానే వాయిద్యాల శబ్దాలతో ఊరంతా మార్మోగింది. ఆమె ఆత్మకు శాంతి: నిర్భయ స్నేహితుడు న్యూఢిల్లీ: నిర్భయ తీర్పుపై ఆమె స్నేహితుడు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఆత్మకు శాం తి చేకూరిందని వ్యాఖ్యానించారు. ‘ఇది దేశం సాధించిన విజయం. కోర్టు నిర్ణయం నాకు ఆనం దం కలిగించింది. దోషులు పై కోర్టులకు వెళ్తే అక్కడ కూడా నా పోరాటం సాగిస్తా’’ అని ఆయన చెప్పారు. డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ అత్యాచారానికి గురైన సమయంలో ఆమెతోపాటు ఈయన కూడా బస్సులో ఉన్న సంగతి తెలిసిందే. మౌనం దాల్చిన మైనర్ న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం కేసులో తోటి దోషులకు మరణశిక్ష పడిందన్న విషయం తెలియగానే ఇదే కేసులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న మైనర్ మౌనం దాల్చాడు. ఏమీ మాట్లాడకుండా ముభావంగా కనిపించాడని జువైనల్ హోం (నేరారోపిత బాలల శిక్షణాలయం) సిబ్బంది చెప్పారు. ‘తీర్పు వెలువడిన గంట తర్వాత అతడికి విషయం చెప్పాం. ఈరోజు కోర్టు వారికి శిక్ష విధిస్తుందన్న సంగతి అతడికి తెలుసు. అయినా దాన్ని తెలుసుకునేందుకు ఎలాంటి ఉత్సుకత చూపలేదు. అతడికిచ్చిన ఆహారం తిని, మౌనంగా ఉండిపోయాడు’ అని వివరించారు. నేరం జరిగే సమయానికి ఇతడి వయసు 18ఏళ్లు నిండటానికి ఆరు నెలలు తక్కువగా ఉంది. దీంతో జువైనల్ జస్టిస్ బోర్డు అతడిని మైనర్‌గా భావించి, మూడేళ్లు మాత్రమే శిక్ష విధించింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న జువైనల్ హోంలో ఉన్నాడు. నిర్భయపై అత్యాచారం సమయంలో ఇతడే అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు తోటి నిందితులు పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. న్యాయం చేకూరింది: షిండే ముంబై: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు కోర్టు మరణశిక్ష విధించడాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్వాగతించారు. కోర్టు తీర్పును ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేకూరిందని శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయ దేవత ఓ కొత్త ఒరవడిని సృష్టించిందన్నారు. ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదనే విషయం రుజువైందని చెప్పారు. డిసెంబర్ 16 నాటి ఘటన అనంతరం దేశంలో నెలకొన్న వాతావరణం నేపథ్యంలో ఈ శిక్ష ఊహించిందేనని షిండే వ్యాఖ్యానించారు. ఇప్పుడు సంతోషంగా ఉందా ? మీడియాపై వినయ్‌శర్మ తల్లి ఆగ్రహం న్యూఢిల్లీ: ‘‘మమ్ముల్ని ఇలా వదిలేయండి.. మా కొడుకు తొందర్లోనే చనిపోతాడు.. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా?’’ అంటూ నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన వినయ్ శర్మ తల్లి మీడియాపై మండిపడ్డారు. వినయ్‌కి మరణదండన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పగానే ఆమె సృ్పహ కోల్పోయారు. దక్షిణ ఢిల్లీలోని ఓ చిన్న బస్తీ (రవిదాస్ క్యాంపు)లో ఈమె నివసిస్తున్నారు. కాసేపటికి తేరుకున్న వినయ్ తల్లి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు నిందితులకు శిక్షపై తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఈ క్యాంపులో ఉన్నవారంతం టీవీలకు అతుక్కుపోయారు. ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూశారు. ఉరిశిక్ష పడిన వారిలో ఒక్క అక్షయ్ తప్ప మిగతా ముగ్గురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్లు ఈ కాలనీకి చెందిన వారే. తీర్పు రాగానే కాలనీలో నిశ్శబ్దం ఆవరించింది. ‘‘ఈ నలుగురు చాలా చిన్నవాళ్లు. ఉరిశిక్ష వేయాల్సింది కాదు. మారేందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాల్సింది..’’ అని క్యాంప్ పెద్దగా వ్యవహరిస్తున్న బిహారీ లాల్ అభిప్రాయపడ్డారు. హైకోర్టుకు వెళ్తాం నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష విధించటానికి మీడియానే కారణమని.. దోషుల్లో ఇద్దరి తల్లిదండ్రులు ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని వినయ్‌శర్మ, పవన్గుప్తాల కుటుంబాలు తెలిపాయి. -
మానవ మృగాలకు మరణశాసనం
* నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు * ఒక నిస్సహాయురాలిపై ఒళ్లు గగుర్పొడిచే రీతిలో పాశవిక నేరానికి పాల్పడ్డారు * బాధితురాలిని పెట్టిన చిత్రహింసలు అసాధారణం.. ఆటవికంగా ప్రవర్తించారు * మానవులు క్షమించడానికి అర్హం కాని తీవ్రమైన మానసిక వికృతత్వాన్ని ప్రదర్శించారు * మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన హెచ్చరిక పంపాల్సిన అవసరముంది * దోషులు నలుగురినీ చనిపోయే వరకూ ఉరితీయాలని కోర్టు తీర్పు * హత్యానేరానికి మరణశిక్ష.. సామూహిక అత్యాచారానికి జీవితఖైదు న్యూఢిల్లీ: నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పుచెప్పింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20)లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. గత డిసెంబర్లో ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వీరు నేరానికి పాల్పడటం.. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది. ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా తన 20 పేజీల తీర్పులో స్పష్టంచేశారు. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆరో నిందితుడైన బాల నేరస్తుడికి కొద్ది రోజుల కిందట బాలనేరస్తుల న్యాయ బోర్డు మూడేళ్ల శిక్ష విధించటం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన బాధితురాలి కుటుంబం.. ఇదే కేసులో మిగతా నలుగురు దోషులకూ మరణశిక్ష విధించడంపై హర్షం వ్యక్తంచేసింది. ‘‘మేం ఊపిరి బిగబట్టి ఎదురుచూశాం.. ఇప్పుడు ఉపశమనం కలిగింది. దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు’’ అని బాధితురాలి తల్లి స్పందించారు. నిర్భయ కేసులో కోర్టు తీర్పు సారాంశమిదీ... ‘‘ఈ ఘటన తీవ్రత.. ఒళ్లు గగుర్పొడిచే పాశవిక, అసాధారణ ప్రవర్తనను వివరిస్తోంది. బాధితురాలిని ఆమె మరణించటానికి ముందు అమానవీయమైన చిత్రహింసలకు గురిచేయటం ఉమ్మడి అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేయటమే కాదు.. దోషుల చుట్టూ ఉన్న సమాజ రక్షణ హస్తాన్ని ఉపసంహరించాలని చెప్తోంది. దోషుల భయానక చర్య ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా స్పష్టంచేస్తోంది. దోషులు తమ కుట్రలో భాగంగా బాధితులను ప్రలోభపెట్టి బస్సులోకి ఎక్కించారు. బాధితురాలిపై కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అమానవీయమైన చిత్రహింసలకు గురిచేశారు. నిస్సహాయులైన బాధితులు నగ్నంగా ఉన్నస్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఎముకలు కొరికే చలి రాత్రిలో కదులుతున్న బస్సులో నుంచి నగ్నంగా బయటకు విసిరేశారు. వీరి నేరం వారి అసాధారణమైన మానసిక నైతిక పతనాన్ని వివరిస్తోంది. ఆమె పేగులు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితురాలిని గురిచేసిన బాధలు అసాధారణమైనవి. ఆమె అంతర్గత అవయవాలపై ఎంత క్రూరత్వం చూపారో వైద్య రికార్డుల సాక్ష్యాలను బట్టి స్పష్టమవుతోంది. పదే పదే ఇనుపచువ్వలు, చేతులు పెట్టటం వల్ల బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైందని, ముక్కలుగా తెగిపోయిందని వాస్తవాలు చూపుతున్నాయి. దోషులు అత్యంత ఆటవికంగా వారి వట్టి చేతులతో, ఇనుపచువ్వలతో ఆమె శరీరంలోపలి అవయవాలను బయటకు లాగివేశారు. ఆమెకు నయంచేయలేని గాయాలు చేశారు. తద్వా రా మానవ క్షమకు అర్హం కాని తీవ్రమైన మానసిక వికృతత్వాన్ని ప్రదర్శించారు. ఇది నిజానికి దోషుల పాశవిక ప్రవర్తనను చూపుతోంది. దోషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత, ఆమె అంతర్గత అవయవాలను బయటకు లాగివేయటంతో ఆగలేదు. బాధితులను బస్సు వెనుక తలుపు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. ఆ తలుపు తెరుచుకోకపోవటంతో బాధితులను జట్టుపట్టుకుని బస్సు ముందలి తలుపు దగ్గరకు ఈడ్చుకెళ్లి కదులుతున్న బస్సు నుంచి విసిరేశారు. కాబట్టి దోషుల చర్యకు అత్యంత తీవ్రమైన శిక్ష అవసరమని ఇది చెప్తోంది. మహిళలపై దారుణ నేరాలు అంతులేకుం డా సాగుతున్న కాలమిది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠినమైన హెచ్చరిక సందేశాన్ని పంపాల్సిన అవసరాన్ని కోర్టులు విస్మరించజాలవు. మహిళలపై ఎలాంటి నేరానికి పాల్పడ్డా సహించేది లేదని సమాజం అవగతం చేసుకున్నపుడు మాత్రమే మహిళలపై నేరాల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి నేర న్యాయ వ్యవస్థ ప్రజల మనసుల్లో, ప్రత్యేకించి మహిళల్లో విశ్వాసాన్ని నింపి తీరాలి.’’ అత్యంత అరుదైన కేసే..! తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యలు న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మృత్యు దండన విధిస్తూ తీర్పు వెలువరించిన సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా పలు వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కిందకే వస్తుందని పేర్కొన్నారు. పశువుల్లా ప్రవర్తించిన దోషుల తీరు రోమాలు నిక్కబొడుచుకునే ఈ సంఘటన తీవ్రతకు అద్దంపడుతోందన్నారు. బాధితురాలి పట్ల దోషుల అమానవీయ ప్రవర్తన అందరినీ కలచివేసిందన్నారు. దోషుల భయంకరమైన ప్రవర్తన ఈ కేసును కచ్చితంగా అరుదైన కేసుల కోవలోకి చేర్చిందన్నారు. దోషులను సమాజం ఛీదరించుకోవటం, తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం తదితర అంశాలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. దోషులు వీరే.. 1. రామ్‌సింగ్ (34) (ప్రధాన దోషి. తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు). బస్సు డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2. అక్షయ్ ఠాకూర్ (28). ఉపాధి కోసం ఢిల్లీ వచ్చాడు. 3. వినయ్ శర్మ (20). అసిస్టెంట్ జిమ్ ఇన్స్ట్రక్టర్ 4. ముకేశ్‌సింగ్ (26). రామ్‌సింగ్ సోదరుడు. దక్షిణ ఢిల్లీలో వుురికివాడలో సోదరుడితో కలిసి జీవించాడు. 5. పవన్ గుప్తా (19). పండ్ల వ్యాపారి. ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ) (సామూహిక అత్యాచారం) కింద కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది. దోషులకు తెల్ల దుస్తులు న్యూఢిల్లీ: నిర్భయ కేసులో మరణ శిక్ష పడిన నలుగురు దోషులకు తీహార్ జైలు సంప్రదా యం ప్రకారం అధికారులు తెల్ల దుస్తులు అందజేశారు. దీంతో జైల్లో ఇప్పటిదాకా విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని ఇకపై దోషులుగా గుర్తిస్తారు. పవన్ గుప్తా(19), వినయ్‌శర్మ(20)లను ఏడో నెంబరు జైల్లో ఉంచగా, ముకేష్(26), అక్షయ్ ఠాకూర్(28)లను నాలుగో నెంబరు జైల్లో ఉంచారు. -
ఇలాంటి కేసుల్లో కళ్లు మూసుకుని కూర్చోలేం: సాకేత్ కోర్టు
నిర్భయ కేసులో దోషుల నేరం సహించరానిదని, వారు అత్యంత అమానుషంగా, అకృత్యంగా నేరం చేశారని సాకేత్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక కోర్టు జడ్జి యోగేష్ ఖన్నా.. శుక్రవారం నాడు నిర్భయ కేసులో్ తీర్పు వినిపించే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులు నలుగురికీ ఐపీసీ సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన కుమార్తెకు న్యాయం చేయాలని నిర్భయ తల్లి కోర్టును కోర్టును అభ్యర్థించారు. వారు అత్యంత అమానుషంగా, అకృత్యంగా నేరం చేశారని, అందుకే దోషులందరికీ మరణదండన విధించామని యోగేష్ ఖన్నా అన్నారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని, ఇలాంటి దారుణాలపై కళ్లుమూసుకుని కూర్చోలేమని తెలిపారు. మహిళలపై రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో మౌనంగా ఉండలేమని, ఈ శిక్ష ఒక ఉదాహరణగా నిలవాలని అన్నారు. మహిళల్లో విశ్వాసం పెంచాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
నిర్భయ దోషులకు ఉరిశిక్షపై అభిప్రాయాలు చెప్పండి
మానవజాతి చరిత్రలోనే అత్యంత హీనమైన, దారుణమైన ఘాతుకానికి పాల్పడిన నలుగురు దోషులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్ష గురించి మీరేమంటారో.. అభిప్రాయాలు చెప్పండి