
కొచ్చి: దళిత విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి కేరళ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసు నిర్భయ ఘటన తరహాలో ఉందంటూ ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అసోం రాష్ట్రానికి చెందిన మహ్మద్ అమీరుల్ ఇస్లాం(22) కేరళకు బతుకు దెరువు నిమిత్తం వెళ్లాడు.
2016 ఏప్రిల్ 28న పెరంబువర్‌కు చెందిన దళిత న్యాయ శాస్త్ర విద్యార్థిని(30) తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇస్లాం ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎన్.అనిల్ కుమార్.. ఇస్లాంకు మరణ శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 2012లో ఢిల్లీలో జరిగిన దారుణ నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోందని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.