
రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష
బ్యాంకాక్: థాయిలాండ్లో ఓ రైల్వే ఉద్యోగికి ఉరి శిక్ష పడింది. ఆ దేశంలో సంచలనం సృష్టించిన ఓ మైనర్ బాలిక రేప్, హత్య కేసులో గతంలోనే కింది స్థాయి కోర్టు ఉరి శిక్ష విధించగా ఆ తీర్పునే సమర్థిస్తూ పైస్థాయి కోర్టు మరోసారి దానిని స్పష్టం చేసింది. దీంతో అతడిని త్వరలో ఉరి తీయనున్నారు. వాంచాయి సాయింఖావో అనే బ్యాంకాక్కు చెందిన 23 ఏళ్ల రైల్వే ఉద్యోగి స్లీపర్ కోచ్లో విధులు నిర్వర్తిస్తుండేవాడు.
గత ఏడాది జూలై 5న అదే రైలులో 13 ఏళ్ల బాలిక తన బెర్త్పై నిద్రిస్తుండగా గత ఏడాది జూలై 5న లైంగిక దాడి జరిపాడు. అనంతరం ఆ బాలికను రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటన దేశంలో పెను సంచలనం సృష్టించగా కేసును ది హువా హిన్ ప్రావిన్సియల్ కోర్టు విచారించి ఉరి శిక్షను ఖరారు చేసింది. దీంతో అతడు పై స్థాయి కోర్టును ఆశ్రయించినా కోర్టు కింది స్థాయి కోర్టునే సమర్థించింది.