![Molestation Case Rangareddy Court Sentenced Death Penality To Man - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/9/Hanging.jpg.webp?itok=7OXtHtkl)
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడిన మృగాడికి ఉరిశిక్ష విధించింది. వివరాలు.. దినేశ్ కుమార్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశాడు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కోర్టు మంగళవారం నిందితుడు దినేశ్ కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది.
2017లో చోటు చేసుకున్న ఈ దారుణంలో నిందితుడు దినేశ్ కుమార్ ఆరేళ్ల చిన్నారిని లేబర్ క్యాంప్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ పాపను హత్య చేశాడు. సంచలన సృష్టించిన ఈ కేసును సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడికి ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు సమర్పించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు దినేశ్ కుమార్‌ను దోషిగా తేల్చి.. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment