అబ్దుల్ ఖాదర్ ముల్లా ఉరిశిక్ష నిలిపివేత
ఢాకా: ‘మీర్‌పూర్ కసాయి’గా పేరుమోసిన జమాతే ఇస్లామీ నేత అబ్దుల్ ఖాదర్ ముల్లాకు విధించిన ఉరిశిక్షను బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు నిలిపివేసింది. 1971 నాటి యుద్ధనేరాలపై అతనికి కోర్టు మరణ శిక్ష విధించింది. ఖాదర్ 1971లో అమానవీయ చర్యలు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేక ట్రిబ్యునల్ అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ముజామ్మెల్ హుస్సేన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. తనపై మోపిన అన్ని అభియోగాల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఖాదర్ ముల్లా దాఖలు చేసుకున్న అప్పీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చివరి క్షణంలో సుప్రీంకోర్టు అతని ఉరిశిక్షను నిలిపివేసింది.