jamaat e islami
-
‘ముస్లిం లా’ను మార్చడానికి కుట్రలు
జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు మౌలానా జలాలొద్దీన్ ఉమ్రీ సాక్షి, హైదరాబాద్: ముస్లిం పర్సనల్ లా రాజ్యాంగం ముస్లింలకు ఇచ్చిన హక్కని, దాన్ని మార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు మౌలానా జలాలొద్దీన్ ఉమ్రీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమ ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరి మత సంప్రదాయాలను ఆచరించే హక్కు రాజ్యాంగం ఆ ప్రజలకు కల్పించిందన్నారు. ఇస్లాం చట్టాల్లో మార్పులు, సవరణలు చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలను పాటించడం ప్రతీ ముస్లిం బాధ్యత అని చెప్పారు. ముస్లిం పర్సనల్ లాలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్, ఇతర ముస్లిం ధార్మిక సంస్థల నేతలు పాల్గొన్నారు. -
అబ్దుల్ ఖాదర్ ముల్లా ఉరిశిక్ష నిలిపివేత
ఢాకా: ‘మీర్పూర్ కసాయి’గా పేరుమోసిన జమాతే ఇస్లామీ నేత అబ్దుల్ ఖాదర్ ముల్లాకు విధించిన ఉరిశిక్షను బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు నిలిపివేసింది. 1971 నాటి యుద్ధనేరాలపై అతనికి కోర్టు మరణ శిక్ష విధించింది. ఖాదర్ 1971లో అమానవీయ చర్యలు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక ట్రిబ్యునల్ అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ముజామ్మెల్ హుస్సేన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. తనపై మోపిన అన్ని అభియోగాల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఖాదర్ ముల్లా దాఖలు చేసుకున్న అప్పీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చివరి క్షణంలో సుప్రీంకోర్టు అతని ఉరిశిక్షను నిలిపివేసింది. -
జమాతే ఇస్లామీ నేతకు మరణశిక్ష
ఢాకా: ‘మీర్పూర్ కసాయి’గా పేరుమోసిన జమాతే ఇస్లామీ నేత అబ్దుల్ ఖాదర్ ముల్లాకు బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించింది. 1971 నాటి యుద్ధనేరాలపై మంగళవారం ఈ తీర్పునిచ్చింది. 8 నెలల కిందట ప్రత్యేక ట్రిబ్యునల్ అతడికి యావజ్జీవ శిక్ష విధించగా, బంగ్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ముజామ్మెల్ హుస్సేన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. తనపై మోపిన అన్ని అభియోగాల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ ముల్లా దాఖలు చేసుకున్న అప్పీలును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా, తీర్పును వ్యతిరేకిస్తూ జమాతే ఇస్లామీ బుధ, గురువారాల్లో 48 గంటల దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.