సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు శుక్రవారం కలిశారు. పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించటంపై వైఎస్‌జగన్‌కు ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ మద్దతు ఉంటుందని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దిన్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీ హజ్ కమిటీ మాజీ ఛైర్మన్ గౌస్ లాజం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మునీర్ బాషా, ఇబాదుల్లా, ముషాహిద్ బేగ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment