Muslim community
-
వక్ఫ్ బోర్డు కమిటీ రద్దు దుర్మార్గం: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే చంద్రబాబు సర్కార్‌లో కనిపిస్తోందని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.‘‘నిధులు లేవంటూ వైఎస్ జగన్‌పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. ఎమ్మెల్యేలు, ముత్తవలీలు, స్థానికసంస్థలు.. ఇలా అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయి. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేశారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు నాలుగు పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది.. మరి కమిటీని ఎలా రద్దు చేస్తారు..?’’ అంటూ ప్రశ్నించారు.‘‘కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా..?. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి.. కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి..?..2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాకా చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు.. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది.. దాన్ని ముస్లింలంతా అంతా వ్యతిరేకిస్తున్నారువైఎస్ జగన్ ఆదేశాలతో పార్లమెంటులో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి.. అందుకే వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం’’ అని అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్‌కు ముస్లిం పెద్దల కృతజ్ఞతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు శుక్రవారం కలిశారు. పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించటంపై వైఎస్‌జగన్‌కు ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ మద్దతు ఉంటుందని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దిన్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీ హజ్ కమిటీ మాజీ ఛైర్మన్ గౌస్ లాజం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మునీర్ బాషా, ఇబాదుల్లా, ముషాహిద్ బేగ్ తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం. ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు? అంజుమ్ కిడ్నాప్‌నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు. బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్‌మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి. హంతకులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది. -
భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు
టెహ్రాన్/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్‌లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘గాజా యుద్ధ ముగింపునకు అత్యుత్తమ మార్గమిదే!’
వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది.. .. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే.. మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. -
ముస్లిం కోటా చుట్టూ రాజకీయాలు
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ముస్లింల కోటా అంశం తెరపైకి వస్తూ... గతం తాలూకు గాయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ముస్లింలు వెనుకబడిపోయారన్న అంశం కోటా కోరడానికి ప్రాతిపదిక. వీరు వెనుకబడిపోయారన్న కారణంతోనే 1906లో ‘ఆలిండియా ముస్లిం లీగ్’ ఏర్పడింది. అలాగే ముస్లింలకు వేరుగా ఓటరు జాబితా (1909), ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేకంగా 25 శాతం కోటా (1926)లు అందుబాటులోకి వచ్చేందుకూ ఇదే కారణం. వీటివల్ల అష్రాఫ్‌ల వంటి ఉన్నతవర్గాలతో ‘ముస్లిం సమాజం’ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. లాభపడింది కూడా ఈ సమాజమే. అనవసరమైన చేర్పులతో కాంగ్రెస్ పార్టీ ; దళిత మూలాలున్న ముస్లింలను ఎస్సీ కోటాలో చేర్చడాన్ని వ్యతిరేకించిన బీజేపీ... రెండూ ముస్లింల వెనుకబాటుకు కారణమయ్యాయి.ముస్లింలకు కోటా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ కొట్లాటకు దిగుతూండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కొట్లాటల మూలం మాత్రం బ్రిటిష్ పాలకుల కళ్లముందు జరిగిన దేశ విభజన గాయాలే అని మేధో వర్గంలోనూ అటు ఏకాభిప్రాయం, ఇటు భిన్నాభిప్రాయమూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ముస్లింల కోటా అంశం తెరపైకి వస్తూ... గతం తాలూకూ గాయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. తద్వారా రాజకీయం మొత్తం హిందూ–ముస్లిం, మెజార్టీ–మైనార్టీ, సెక్యులర్–కమ్యూనల్, ఇస్లామోఫోబియా అన్న అంశాలకే పరిమితమవుతూ ఉంటుంది. ఈ భావజాలం కాస్తా కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయం వంటి విస్తృతాంశాలపై జరగాల్సిన చర్చను కట్టడి చేసేందుకు ఒక వర్గానికి చక్కగా ఉపయోగపడుతోంది.వలస పాలన ముగింపు దశలో ప్రభుత్వ పాలన వ్యూహాలు, అంతులేని మత ఘర్షణలు, మత పునరుజ్జీవన యత్నాల ఫలితంగానే దేశంలో హిందు, ముస్లిం సమాజాలన్న భావన పుట్టుకొచ్చింది. ఈ వర్గాల్లోని ఉన్నత వర్గాలు ‘ద్విజులు’, ‘అష్రాఫ్’లు ఈ భావజాలాన్ని పెంచి పోషించారు. ఈ కారణంగా మతం ఆధారంగా కొనసాగిన రాజకీయాలు... మతానికి వ్యతిరేకంగా నడిచిన ఉద్యమాలతో వైరం పెంచుకున్నాయి. గతంలో పాల్బ్రాస్ చెప్పినట్లు ‘ముస్లింలు వెనుకబడిపోయారన్న భ్రమ’ పునాదులు 1882 నాటి హంటర్ కమిషన్ నాటి నుంచే కనిపిస్తుంది.అప్పట్లో కేవలం బెంగాల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముస్లిం సమాజం మొత్తం వివక్షకు గురైనట్లు చిత్రీకరించారు. ఉదాహరణకు 1881 – 1921 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లోని ముస్లింల శాతం 34.8 నుంచి 47.2కు వెళ్లింది. అయితే ఈ మధ్యకాలంలోనే దేశంలో ముస్లింల జనాభా కూడా 19 శాతం (1881) నుంచి 23 శాతానికి (1921) పెరిగింది. మతానికీ, సామాజిక స్థాయికీ మధ్య సంబంధం ఉందన్న దృష్టికోణం నుంచి ఈ సమాచారాన్ని పరిశీలిస్తే వలసపాలకుల ప్రాపకంతో వచ్చిన లబ్ధిని ముస్లింలలోని ఉన్నత వర్గాలైన అష్రఫీలు అందుకున్నట్లు స్పష్టమవుతుంది. సాంస్కృతిక అంశాలను పెట్టుబడిగా పెట్టి వీరు సాధారణ ముస్లింలను పక్కకు తోసి ఈ లాభాలు పొందారు.ముస్లింలు వెనుకబడిపోయారన్న భ్రమే 1906లో ‘ఆలిండియా ముస్లిం లీగ్’ ఏర్పాటుకు కారణమైంది. అలాగే ముస్లింలకు వేరుగా ఓటరు జాబితా (1909), ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేకంగా 25 శాతం కోటా (1926)లు అందుబాటులోకి వచ్చేందుకూ ఇదే కారణం. వీటి వల్ల అష్రాఫ్‌ల వంటి ఉన్నతవర్గాలతో కూడిన ‘ముస్లిం సమాజం’ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. లాభపడింది కూడా ఈ సమాజమే. ‘ముస్లింలు ముప్పును ఎదుర్కొంటున్నారు’... ‘ముస్లింల మెప్పు పొందే ప్రయత్నాల’న్న భావజాలం కూడా ఈ అష్రాఫ్‌ల వంటి ఉన్నత వర్గాలు సమాజంలోకి చొప్పించినవే.భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా తొలినాళ్ల నుంచి వలసపాలకుల ‘ముస్లిం ఫస్ట్’ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగువ తరగతి ముస్లింలతో ‘మోమిన్ కాన్ఫరెన్స్’ను స్థాపించిన అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. 1930ల్లో ఏర్పడ్డ మోమిన్ కాన్ఫరెన్స్ ముస్లిం లీగ్‌ను అష్రాఫ్ ముస్లిం కూటమిగా వ్యవహరించేది. అలాగే మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ‘టూ నేషన్ థియరీ’ని తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. 1939లో దేశంలోని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనీ, దిగువ తరగతి ముస్లింలకు వేరుగా జాబితా, ప్రాతినిధ్యం కల్పించాలనీ మోమిన్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేసింది.పన్నులు కట్టే, విద్యార్హతలు, ఆస్తులుండే వారికి మాత్రమే ఓటుహక్కు ఉండేది అప్పట్లో. వీరు ముస్లిం లీగ్‌కు ప్రాతినిధ్యం వహించేవారు. ముస్లిం ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసేవారు. అయితే 1946 ఎన్నికల్లో ముస్లింలీగ్ విజయం సాధించడంతో దేశ విభజన అడ్డుకునేందుకు మోమిన్ కాన్ఫరెన్స్ ప్రయత్నాలు సరిపోలేదు. స్థూలంగా చూస్తే ముస్లిం అష్రాఫ్‌లు జిన్నా దేశ విభజన పిలుపునకు ఊ కొట్టారనీ, దిగువస్థాయి ముస్లింలు వ్యతిరేకించడంతోపాటు గాంధీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పని చేశారనీ అర్థమవుతుంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ముస్లిం లీగ్ భాగమైపోయింది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి వారితో కలిసి ముస్లింలను జనజీవన స్రవంతిలోకి చేర్చేందుకు ఇది అవసరమన్న మిష చూపింది. కాలక్రమంలో ఈ అష్రాఫ్ నేతలు కాంగ్రెస్‌లో ముస్లిం వ్యవహారాలపై వ్యాఖ్యాతలుగా మారారు. ఈ క్రమంలోనే దిగువ జాతి ముస్లింల అభివృద్ధి నలిగిపోయింది.స్వాతంత్య్రం తరువాత రెండుసార్లు (1955, 1979) ఏర్పాటైన వెనుకబడిన వర్గాల కమిషన్లు (కాకా కేల్కర్, మండల్ కమిషన్లు) కూడా ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా పరిగణించలేదు. మండల్ కమిషన్ నివేదిక 82 కులాల ముస్లింలు సామాజికంగా వెనుకబడి ఉన్నారని చెప్పడంతో... మతాలకు అతీతంగా అణచివేతకు గురైన కులాల అంశంపై విస్తృత చర్చకు మార్గం ఏర్పడింది. అలీ అన్వర్ నేతృత్వంలోని ‘పస్మాందా ఉద్యమం’ ముస్లిం కోటాను వ్యతిరేకిస్తూనే దళిత, ఆదివాసీల వంటి సామాజిక వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న కులాలకు న్యాయం చేయాలనీ, ఇది మతాలకు అతీతంగా జరగాలనీ డిమాండ్ చేస్తూ వచ్చింది.1990 తొలి నాళ్లలో భారతీయ ముస్లింలలో 85 శాతం వరకూ ఉన్న దిగువ తరగతి ముస్లింలకు వేర్వేరు రాష్ట్రాల్లోని ఓబీసీ కోటాల్లో రిజర్వేషన్లు లభించేవి. అయితే కాంగ్రెస్‌లోని అష్రాఫ్ ముస్లింలు పస్మాంద వర్గాలకు లభిస్తున్న చిన్నపాటి సౌకర్యాలను కూడా పట్టాలు తప్పించే ప్రయత్నం చేసేవారు. ముస్లిం కోటాను డిమాండ్ చేయడం, ఓబీసీ వర్గాల్లో మతం ప్రస్తావన తేవడం ద్వారా ఇది జరిగేది. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం కోటా ప్రస్తావన, కేంద్ర ఓబీసీ కోటాలో మైనార్టీల్లోని వెనుకబడిన వర్గాల వారికి 4.5 శాతం సబ్‌కోటా ఏర్పాటు వంటివన్నీ పస్మాందా వర్గాలకు లభిస్తున్న సౌకర్యాలను తప్పించే ప్రయత్నాలకు నిదర్శానాలు. దళితుల కంటే ముస్లింలు వెనుకబడి పోయారన్న తప్పుడు అంచనాకు సచార్‌కమిటీ వచ్చిందంటారు. నిజానికి దీన్ని అష్రాఫ్ వర్గాలు ముందుకు తెచ్చాయి.ముస్లిం కోటాపై కాంగ్రెస్ వైఖరిని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ చెబుతున్నా... దాన్ని అష్రాఫ్ వర్గం మెప్పుకు మాత్రమే కాంగ్రెస్ ప్రయత్నించిందన్నట్లుగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని తప్పులు చేసిందని రాహుల్ గాంధీ పరోక్షంగా ఒప్పుకున్నప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తారా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. హంటర్ నుంచి సచార్ వరకూ ఏర్పాటైన కమిషన్ల నివేదికలను అధ్యయనం చేసి ముస్లింల వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందా? అనవసరమైన చేర్పులతో కాంగ్రెస్ పార్టీ ముస్లింల వెనుకబాటు తనానికి కారణమైతే; బీజేపీ... ముస్లింలు, క్రిస్టియన్లు, దళిత మూలాలున్న ముస్లింలను ఎస్సీ కోటాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా ముస్లింల వెనుకబాటు తనానికి కారణమైందని చెప్పాలి. – వ్యాసకర్త అజీమ్ ప్రేమ్‌జీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)విశ్లేషణ: ఖాలిద్ అనీస్ అన్సారీ -
Lok sabha elections 2024: ఫేక్ రాజకీయం!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను వారికి తిరిగిస్తామని ప్రకటించారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లనే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా మారి్ఫంగ్ చేసిన వీడియో తాజాగా దేశవ్యాప్తంగా వైరలవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర నష్టం చేయగల ఈ పరిణామాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో సంబంధముందంటూ అసోంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక ఈ నకిలీ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా షేర్ చేసిందంటూ పీసీసీ చీఫ్ అయిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏకంగా సమన్లు జారీ చేశారు! సోమవారం హైదరాబాద్ వచ్చి మరీ రేవంత్, పీసీసీ సోషల్ మీడియా ఇన్చార్జి, మరికొందరు కాంగ్రెస్ నేతలకు నోటీసులిచ్చారు! అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారన్నది రేవంత్‌పై ఆరోపణ. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్న ఈ పరిణామంతో డీప్ ఫేక్ ముప్పు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది...దేశం ఇప్పుడు సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత సమాచారాన్ని ఎంత వేగంగా ప్రచారం చేస్తోందో అంతే వేగంగా దేశాన్ని ప్రమాదంలోనూ పడేస్తోంది. ముఖ్యంగా కృత్రిమ మేధతో పుట్టుకొచి్చన వికృత శిశువు ‘డీప్ ఫేక్’ ఎన్నికల్లో పెద్ద అస్త్రంగా మారిపోయింది. పారీ్టలు ఫేక్ వీడియోలతో తమ ప్రత్యర్థులపై దు్రష్పచారం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు విపరీతంగా కలకలం రేపడమే గాక ఓటర్లపైనా బాగా ప్రభావం చూపాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఫేక్ వీడియోల జోరు మామూలుగా లేదు! పలు పార్టీలు తమ చేతికి మట్టి అంటకుండా డీప్ ఫేక్‌లను వీలైనంతగా వాడుకుంటున్నాయి. చౌక బేరండీప్ ఫేక్‌లను రూపొందించడానికి అవసరమైన కృత్రిమ మేధ సాధనాలు కారుచౌకగా అందుబాటులో ఉన్నాయి. కొన్నయితే ఉచితం కూడా! దాంతో పారీ్టలన్నీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎడాపెడా డీప్ ఫేక్‌లను తయారు చేసి వదులుతున్నట్టు వాటి నిర్వాహకులే చెబుతున్నారు. టీవీ వార్తలు మొదలుకుని ఫేస్బుక్, వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫాంల దాకా నకిలీ వార్తల రూపకల్పన, ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇవి ఒకసారి జనంలోకి వెళ్లాక ఏం చేసినా నష్ట నివారణ కష్టమే.ఏఐ వాడకం..బీజేపీతోనే మొదలు... » ప్రచారంలో సాంకేతికతను వాడకంలో అధికార బీజేపీ ఎంతో ముందంజలో ఉంది. » ఆ పార్టీ 2012లోనే మోదీ త్రీడీ హాలోగ్రామ్‌ను వాడింది! దీని ద్వారా ఒకేసారి అనేక ప్రదేశాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు. » ఈ వ్యూహాన్ని 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా అమలు చేశారు. » ప్రచారం కోసం డీప్‌ఫేక్‌లను వాడిన తొలి నేతగా ఢిల్లీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు మనోజ్ తివారీ నిలిచారు. 2020లో ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ హిందీ, హర్యాణ్వీ, ఇంగ్లిష్ భాషల్లో ఓటర్లనుద్దేశించి మూడు వీడియోల్లో ప్రసంగించారు. వీటిలో హిందీ వీడియో మాత్రమే అసలుది. మిగతా రెండూ డీప్ ఫేక్‌లు. కానీ ఏ మాత్రమూ గుర్తించలేనంత పకడ్బందీగా తివారీ గొంతు, పెదవుల కదలిక తదితరాలను మార్చారు! గతి తప్పుతున్న వ్యూహం అధికారికంగా, బహిరంగంగా జరిగే డీప్ ఫేక్ వ్యవహారాన్ని మించి ప్రత్యర్థులపై బురదజల్లేలా ‘అనైతిక ప్రచారం’ జోరుగా సాగుతోంది. వాట్సాప్‌లో అంతర్జాతీయ నంబర్లు, ఇన్స్టా్రగాంలో బర్నర్ హ్యాండిల్స్ తదితరాల ద్వారా ఇలాంటి కంటెంట్ ప్రజలను చేరుతోంది. రాజకీయ ప్రత్యర్థుల వీడియోలు, ఆడియోలకు అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌ను జోడిస్తూ డీప్ ఫేక్‌లు హోరెత్తిస్తున్నాయి. పలు సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారీతో పాటు దాన్ని వైరల్ చేసే బాధ్యతనూ తీసుకుంటున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా నిర్మాణ కారి్మకుల ఫోన్ నంబర్ల సాయంతో డీప్ ఫేక్‌లను విచ్చలవిడిగా వైరల్ చేశారు. అభ్యర్థులు అవినీతిపరులని చూపేందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నట్టు, డబ్బు పంచుతున్నట్టు వీడియోలు, ఆడియోలు రూపొందించి ప్రచారం చేశారు. ప్రత్యర్థులపైనే గాక సొంత పారీ్టలోనూ శత్రువులపైనా కొందరు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారు!చట్టాలకావల మన దేశంలో డీప్ ఫేక్ ఎన్నికల సమగ్రతకే ముప్పుగా మారుతోంది. ప్రస్తుత చట్టాలేవీ డీప్ ఫేక్ను స్పష్టంగా నిర్వచించడం లేదు. వ్యక్తిగత కేసుల్లో ఐటీ చట్టంతో కలిపి, పరువు నష్టం, నకిలీ వార్తలు, వ్యక్తి ప్రతిష్టకు భంగం, ప్రైవసీ ఉల్లంఘన వంటి చట్టాలను వాడుతూ పోలీసులు నెట్టుకొస్తున్నారు. నిరాశపరిచిన మ్యూనిచ్ ఒప్పందం డీప్ ఫేక్‌లను నియంత్రించాలంటూ గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు కృత్రిమ మేధ సాధనాలను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ప్రముఖ టెక్ కంపెనీలు మ్యూనిచ్ సదస్సులో ఒప్పందానికి వచి్చనా ఆచరణలో పెద్దగా జరిగిందేమీ లేదు. గతేడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటిదే జరిగింది. కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న వీడియో క్లిప్ పోలింగ్‌కు ముందు రోజు తెగ వైరలైంది. దాన్ని లక్షలాది మంది చూశారు. ఇదీ కృత్రిమ మేధ సాయంతో రూపొందిన డీప్ ఫేక్ వీడియోనే.నోట్ దీజ్ పాయింట్స్» భారత్‌లో జనాభాలో సగానికి పైగా, అంటే ఏకంగా 76 కోట్ల పై చిలుకు ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. » కనుక ఆన్లైన్ ప్రచారం శరవేగంగా ప్రజలను చేరుతోంది. » రీల్స్, షార్ట్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క క్లిక్, ఒక్క స్వైప్‌తో ఓటరు అభిప్రాయాన్ని మార్చొచ్చు. కనీసం ప్రభావితం చేయొచ్చు. » పార్టీ అభిమానులు పెద్దగా పట్టించుకోకున్నా తటస్థ ఓటర్లను ఇలాంటి ప్రచారం ప్రభావితం చేయగలదు. » ఈ అంశాన్ని తమ అభిమాన పార్టీలకు సానుకూలంగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. » అందుకే కృత్రిమ మేధతో పుట్టుకొచ్చే ‘మానిప్యులేటెడ్ కంటెంట్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అనేక రెట్లు పెరగనుందని అంచనా. తప్పుడు ప్రచారంతో ఒక్క ఓటర్ మనసు మార్చినా అది స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు గొడ్డలిపెట్టే. ఈ తప్పుడు ప్రచార సరళి మీద ఈసీ దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతున్న డీప్‌ఫేక్‌లను నియంత్రించాల్సిన అవసరముంది. నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి– కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎస్‌వై ఖురేషీ–సాక్షి, నేషనల్ డెస్క్ -
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
-
PM Narendra Modi: కశ్మీర్ భారత్‌లో లేదా?
నవడా/జల్పాయ్గురి/జబల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్ విధానాలను పోలి ఉందని విమర్శించారు. అది మేనిఫెస్టో కాదు, బుజ్జగింపు పత్రం అని ధ్వజమెత్తారు. ఆదివారం బిహార్‌లోని నవడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారి పారి్థవ దేహాలు త్రివర్ణ పతాకాలతో స్వస్థలాలకు చేరుకున్నాయి. రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్‌లో గతంలో ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలి. అది దేశంలో అంతర్భాగం కాదా?’’ అని ప్రశ్నించారు. రన్‌వేపై మా గ్రోత్ ఇంజన్ సిద్ధం దేశాన్ని రెండు విభజించాలన్నదే కాంగ్రెస్ ఆలోచనా విధానమని మోదీ ఆక్షేపించారు. ‘‘ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పెద్దలు బహిష్కరించారు. హాజరైన పార్టీ నేతలను బహిష్కరించారు. శ్రీరామనవమి రాబోతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన పాపాలను మర్చిపోవద్దు’’ అని ప్రజలకు సూచించారు. తమ పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమేనని, తమ గ్రోత్ ఇంజన్ రన్‌వేపై సిద్ధంగా ఉందని, ఇక టేకాఫ్ తీసుకుంటుందని అన్నారు. బెంగాల్‌లోని జల్పాయ్గురిలో ఎన్నికల మెగా ర్యాలీలో, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. పశి్చమ బెంగాల్లో అవినీతికి, హింసాకాండకు ఉచిత లైసెన్స్ ఇవ్వాలని అధికార టీఎంసీ కోరుకుంటోందని మండిపడ్డారు. -
‘భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధివిధాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఏఏ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడితున్నాయి. మరోవైపు.. ఈ చట్టం అమలుతో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడతారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీఏఏ చట్టంపై ముస్లింల ఆందోళనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ముస్లింలు సీఏఏతో ఆందోళ చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది ‘భారతీయ ముస్లింలు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సీఏఏ చట్టంలో 18 కోట్లమంది ముస్లింలను ఇబ్బంది పెట్టే ఎటువంటి నిబంధన లేదు. ముస్లింలు తమ పౌరసత్వ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోని హిందూవులతో సమానమైన హక్కులు ఉంటాయి. సీఏఏ కింద ముస్లింలు పౌరసత్వాన్ని రుజువు చేయటానికి ఎటువంటి పత్రాలు సమర్పించాలిన అవసరం లేదు. ఇస్లాం మతం శాంతియుతమైంది. మతప్రాతిపదికగా ద్వేషం, హింసను బోధించదు. ఈ చట్టం కరుణ చూపే.. ఇస్లాం మతాన్ని హింస పేరుతో మసకబారనివ్వకుండా కాపాడుతుంది’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కొన్ని ఇస్లాం దేశాలలో మైనారిటీల వేధింపుల కారణంగా.. ఇస్లాం పేరు మసకబారిందని తెలిపింది. ఇక.. సీఏఏ చట్టం ముస్లింకు వ్యతిరేకమని కొంతమంది ఆందోళన చెందటం అన్యాయమని పేర్కొంది. ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన సీఏఏ చట్టంలో లేదని హామీ ఇస్తున్నట్లు చెప్పింది. మరోవైపు.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖార్గే, ఎంపీ రాహుల్ గాంధీ.. సీఏఏ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలు తమ పౌరసత్వాన్ని కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మండిపడ్డారు. చదవండి: ‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత -
ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది. రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాక్షాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
కుల గణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను పెంచారు
ముజఫర్‌పూర్: బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను ఉద్దేశపూ ర్వకంగానే ఎక్కువ చేసి చూపించిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. మొత్తమ్మీద వెనుకబడిన కులాల వారికి మొండిచేయి చూపిందని చెప్పారు. ముజఫర్‌పూర్ జిల్లా పటాహిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ముస్లింల పట్ల అనుసరిస్తున్న బుజ్జగింపు వైఖరి ఫలితంగా నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తప్పవని నితీశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటువంటి రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కోరారు. ‘నితీశ్ కుమార్ ప్రధాని పీఠంపై ఆశలు వదులుకోవాలి. అది ఎన్నటికీ జరగ దు. ఇండియా కూటమికి కనీసం ఆయన కన్వీనర్ అయినా కాలేకపో యారు. బిహార్‌లో గూండారాజ్యాన్ని తిరిగి రావడానికి ఆయనే బాధ్యుడు’అని ఆరోపించారు. గతంలో కులగణనకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఓబీసీలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పుడు అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతానంటోందని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో అధికారం పంచుకుంటున్న జేడీయూ, ఆర్జేడీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నాయంటూ అమిత్ షా, ఈ కూటమి ఏకైక ఎజెండా ప్రధాని మోదీని వ్యతిరేకించడమేనన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఈ కూటమి పార్టీలు వ్యతిరేకించాయని కూడా మంత్రి చెప్పారు. కేంద్ర కేబినెట్లో 27 మంది మంత్రులు, అంటే 35 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారేనన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఓబీసీల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు. -
కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్
జమ్మూ: భారత దేశంలోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించినవారే. అందుకు కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్లే ఉదాహరణ అని అన్నారు DPAP చైర్మన్ గులాం నబీ ఆజాద్. ఈ సందర్బంగా రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు. ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) అధినేత మాట్లాడుతూ.. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ దేశంలో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనంటారు.. ఇక్కడ ఎవ్వరూ బయట నుంచి వచ్చినవారు లేరు.ఇస్లాం మతం 1500 ఏళ్ల క్రితమే ఉంది. హిందూ మతం చాలా పురాతనమైంది. ఈ దేశంలో బయట నుండి వచ్చిన ముస్లింలు 10-20 శతం మాత్రమే ఉంటారు. వారిలో కొంతమంది ముఘల్ సైన్యంలో పనిచేశారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారే. దీనికి ఉదాహరణ కశ్మీర్‌లోనే చూడవచ్చు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరు? అందరూ కశ్మీరీ పండిట్లే. వారంతా ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనాని అన్నారు. హిందువుల ఆచారం ప్రకారం వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అస్తికలను నీటిలో కలుపుతుంటారు. మేము ఆ నీటిని తాగుతాం. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని అన్నారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం భరతమాత ఒడిలో కలిసిపోతుంది. హిందువులైనా ముస్లింలైనా అందరం భూమిలో కలిసిపోవాల్సిందే. అందులో తేడా ఏమీ ఉండదని అన్నారు. హిందూ ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు. అలాంటి వారు నా దృష్టిలో బలహీనులని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు ఎవరికి వెయ్యాలో చెప్పినందుకు ఉద్యోగం ఊడింది -
మనుగడకు మరపు మంచిదే!
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే... మతం పేరుతో రెచ్చగొట్టేవారు, లేదా ఒక మతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని వాదించేవారు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన చెడును కప్పిపెట్టేందుకు, లేదా ఇంకో మతంలోని చెడును ఎత్తిచూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఫలితం శూన్యం. కొన్ని తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నంలో చరిత్ర పుస్తకాలను తిరగరాయడం, లేదంటే ఎక్కువ చేసి చూపడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఊహించుకున్న తప్పులను మళ్లీ మళ్లీ తవ్వుకోవాలనుకునేవారు... మునుపటి తరాల తాలూకు కక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. గతంలోని కొన్ని గుర్తుంచుకోవడం, కొన్నింటిని వదిలేయడం ద్వారా మాత్రమే దేశాల నిర్మాణం జరుగుతుంది. హరియాణాలోని మేవాత్, నూహ్‌లో జరుగుతున్న ఘర్షణలు చూస్తూంటే... పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్ గుర్తుకొస్తారు. 1950లలో ఖైరాన్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ముస్లిం కుటుంబాలను మేవాత్లోకి రానివ్వమని సూచనప్రాయంగా చెప్పిన వారిని ఉద్దేశిస్తూ చేసిన హెచ్చరిక అది. దేశ విభజన నేపథ్యంలో ఈ కుటుంబాలు పాక్‌కు వెళ్లాయి. 1950ల మధ్య కాలానికి చాలామంది మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చేశారు. వేలమంది మేవాతీ ముస్లిం కుటుంబాలకు తమ సొంత ఆస్తులు మళ్లీ దక్కేలా ఖైరాన్ చర్యలు తీసు కున్నారు. ‘‘గతం తాలూకు శత్రుత్వాన్ని మరచిపోండి. మీ బాధలపై ఆధారపడి బతక్కండి’’ అని విభజన కారణంగా చెలరేగిన విద్వేష బాధితులైన సిక్కులు, హిందువులకు ఖైరాన్ పదే పదే చెప్పేవారు. కొన్ని గుర్తుంచుకోవడం, కొన్నింటిని వదిలేయడం ద్వారా మాత్రమే దేశాల నిర్మాణం జరుగుతుంది. గతాన్ని గుర్తుంచుకోలేని వారు ఆధారం లేనివారవుతారు. బానిస బతుకులు బతికినవారు కూడా ఉజ్వల భవిష్యత్తును కాంక్షించే సందర్భంలో తమ మూలాలను తరచిచూస్తారు. లేదంటే మూలాలను కల్పించుకుంటారు. అదే సమ యంలో గతాన్ని ఏమాత్రం మరచిపోనివారు లేదా ఊహించుకున్న తప్పులను మళ్లీ మళ్లీ తవ్వుకోవాలనుకునేవారు... మునుపటి తరాల తాలూకూ కక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. మన పాత తరాలు నిర్దిష్ట సామాజిక కూర్పుల్లో బతికాయి. ఈ కూర్పులు సాధారణంగా చాలా చిన్నస్థాయిలో ఉండేవి. ముఖాముఖి పరిచయాలు, ఒకరంటే ఇంకొకరికి నమ్మకం వంటివి ఈ కూర్పు తాలూకూ లక్షణాలు. చాలా ప్రాథమిక గుర్తింపుల ఆధారంగా ఈ నిర్మాణం జరిగింది. ఈ కూర్పులో లేనివారితో వ్యవహారం ప్రమాద కరమన్నది వారి అవగాహన. రూపురేఖల్లేని ఆధునికత ఆస్తిత్వంలోకి రావడంతో ఈ అవగాహనలన్నీ మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడేందుకు చాలా సులువైన మార్గం ముఖాముఖి మాటలు, వ్యవహారాలే. ఇలాంటి బంధాలు, తద్వారా ఏర్పడ్డ సామాజిక వర్గాలు సహజంగానే చిన్న సమూహా లుగానే ఉంటాయి. ఇతరులపై వీరి ప్రభావమూ పెద్దగా కనిపించదు. అయితే జాతి, రాష్ట్రమన్న భావనలు ఆవిర్భవించిన తరువాత, ఆధు నిక సమాజం తన మునుపటి దానికంటే విస్తృత స్థాయికి చేరేందుకు అవకాశం కల్పించిన ప్రాథమిక బంధాల విలువ తగ్గిపోయింది. ఆధునిక ప్రపంచ చరిత్ర మొత్తం గతకాలపు అస్తిత్వాలను అణచి పెట్టడం, రూపురేఖల్లేని వ్యవస్థల నిర్మాణమనే చెప్పాలి. ఈ వ్యవస్థలే వ్యక్తులు తమ ప్రాథమిక అస్తిత్వాల బంధాలను తెంచుకుని స్వేచ్ఛగా ఉండేందుకు వీలు కల్పించాయి. అలాగే పాతకాలపు సామాజిక కట్టు బాట్లు మనుషులను తమ బానిసలుగా చేసుకోకుండా నిలువరించాయి. ఈ వ్యవస్థలన్నింటికీ ఆధారం ‘నేషన్ స్టేట్’. (క్లుప్తత కోసం ప్రభుత్వం అనుకుందాం.) పాతకాలపు సామాజిక ఏర్పాట్లకు కాకుండా ప్రభుత్వ వ్యవస్థకు లొంగిన వ్యక్తులు నేషన్ స్టేట్‌లో ప్రాథ మిక భాగస్వాములు. బల ప్రయోగంతో నేషన్ స్టేట్‌ను ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇది మనదన్న భావన కల్పించడం బలం వల్ల సాధ్యం కాదు. సహజసిద్ధంగా మనుషుల అంతరాంతరాళాల నుంచి పుట్టుకు రావాల్సిన ఫీలింగ్ అది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, నేషన్ స్టేట్‌కు, వ్యక్తికి మధ్య బంధం బలపడటంలో వ్యక్తులు కనుమ రుగు అవుతారన్న భయముంటుంది. ఈ భయంతోనే చాలామంది ఉదార వాదులు కూడా అందరి మంచిని పణంగా పెట్టి మరీ పాత కాలపు సామాజిక కూర్పులవైపు మొగ్గు చూపుతూంటారు. పాతకాలపు సామాజిక ఏర్పాట్లలో శక్తిమంతమైనది మతం అన్నది మరచిపోరాదు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వ్యవస్థీకృతమైన మతం ఉపయోగపడుతుంది. ఒక పరమార్థం, ఒక నమ్మకాన్ని కూడా ప్రజలకు ఇచ్చే మతం ఎప్పుడూ ప్రభుత్వం తదితర వ్యవస్థలకు గట్టి పోటీ దారు. భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థలకు సవాళ్లు రాజకీయపరమైన ఇస్లాంతో ముడిపడి ఉన్నాయి. ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో దేశంలోని ఇస్లామిస్టులు స్వయం పాలన పొందాలంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగానే మతం ఆధారంగా దేశాల నిర్మాణం జరగాలని కాంక్షించారు. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అసలు చదవనే లేదని గర్వంగా చెప్పుకొనే మౌలానా మొహమ్మద్ అలీ ‘ద కామ్రేడ్’ వార్తా పత్రికలో ఒక కథనం రాస్తూ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. అయితే ఇది దేశ విభజనకు దారితీసే స్థాయిలో ముస్లింలలో వేర్పాటువాదాన్ని సృష్టిస్తుందని ఆయన ఊహించలేకపోయారు. వాస్తవం ఏమిటంటే, భారత్‌లో ఇష్టమైన మతాన్ని ఆచరించే స్వేచ్ఛపై ఎప్పుడూ నియంత్రణ లేదు. విభజన ఘర్షణల తరువాత కూడా రాజ్యాంగ మండలి చర్చల్లో మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దేశం అందరిదీ కాబట్టి మత స్వేచ్ఛ కూడా దానంతట అదే వచ్చినట్లేనని అనుకున్నారు. మత ప్రచారమన్న విషయానికి వస్తే మండలి సభ్యులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మతంలో మతమార్పిడన్న భావన లేదనీ, మత ప్రచారానికి అనుమతిస్తే హిందూమతం అంతమైపోతుందనీ వాదించారు. దీనిపై ఇతర సభ్యులు పాకిస్తాన్ ఏర్పాటును ఉదాహరణగా చూపుతూ, ఇండియాలో ముస్లింలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వంపై ఉన్న అపోహలను తొలగించాలంటే మత ప్రచార హక్కును కల్పించవచ్చునని అభి ప్రాయపడ్డారు. చివరకు ఇదే కార్యాచరణకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం, మతం పేరుతో రెచ్చ గొట్టేవారు లేదా ఒక మతానికి చెందినవారికి అన్యాయం జరుగుతోందని వాదించేవారు మాత్రమే కనిపిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన చెడును కప్పి పెట్టేందుకు లేదా ఇంకో మతంలోని చెడును ఎత్తి చూపేందుకు ప్రయ త్నాలు జరిగాయి. కొన్ని తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నంలో చరిత్ర పుస్తకాలను తిరగరాయడం లేదా ఎక్కువ చేసి చూపడం వల్ల ఒరిగిందేమీ లేదు. ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకుంటే... వాస్తవాలను మరు గున బెట్టి లేదా అబద్ధాలు చెప్పడం ద్వారా వారిని మార్చలేము. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యూరప్ చరిత్రను అర్థం చేసుకుని భారతదేశం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. దేశంలోని వైవిధ్యతపై విపరీతమైన నిబద్ధత కలిగి ఉండటం గురించి ముందుగా అర్థం చేసు కోవడం మంచిది. వైవిధ్యత మనకు మాత్రమే సొంతమని అనుకుంటూ ఉంటాం. కానీ చరిత్ర మొత్తమ్మీద ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ వైవిధ్యత ఉందన్నది మరచిపోతూంటాం. మనకు ఇది నమ్మబుద్ధి కాకపోవచ్చు. కానీ యూరప్‌లో చాలా శతాబ్దాలపాటు తమ మతగ్రంథాలను సొంతంగా చదివే స్వేచ్ఛ ఉండాలా, వద్దా? అన్న విషయంపైనే గొడవలు జరిగేవి. మతగురువులు మత గ్రంథాలపై ఇచ్చే వివరణ సరిపోతుందన్నది ఒక వర్గం వాదన. ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకోవడం, సమాజ స్థాయి విస్తరించడంతో యూరోపియన్లు ఇలాంటి గొడవల నుంచి దూరం జరిగేందుకు కొన్ని దారులు వెతుక్కున్నారు. మరి యుగాల కాలం కొనసాగిన పగలేమ య్యాయి? ఒక వర్గం మరోదానిపై చేసిన చారిత్రక తప్పిదాల మాటే మిటి? ఆధునిక దేశం ఒకటి ఏర్పడిన తరువాత వాటన్నింటిని పట్టించుకోలేదు లేదా మరచిపోయారు. ఇలా అన్ని తెలిసి కూడా వాటిని మరచిపోవడం లేకపోతే ఇరు వర్గాలకు అనువైన మార్గంలో ముందుకు పోయేందుకు మరో దారి లేనేలేదు! ఎం. రాజీవ్ లోచన్ వ్యాసకర్త చరిత్రకారులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ వ్యవహరించదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదన్నారు. అయితే మీడియాలో, పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని, అది చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఆయన ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి పాలకుడిగా, సీఎం స్థాయిలో తాను ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మీ రే ఉంటే ఏం చేసేవారో ఆలోచించి సలహాలు ఇ వ్వాలని కోరారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రి, తల్లి అయినా ఎందుకు భేద భావాలు చూపుతారని, మ హిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనందరం స్పష్టం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. అపార్థాలకు తావివ్వరాదు భారత్ చాలా విభిన్నమైనది. ఇక్కడ అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న ప లు కులాలు, వర్గాలకూ పలు రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులున్నాయి. ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. అప్పుడే అపార్థాలకు తావుండదు. మార్పులు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్రం.. అందరూ కలిసి, మతాలకు చెందిన సంస్థలు, వారి పర్సనల్ లా బోర్డ్స్‌తో మమేకమై ముందుకు సాగాలి. ఇలా కాకుండా వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న భారత్‌లో తగదు. ముస్లింలకు సీఎం అండగా ఉంటానన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీతో పౌరస్మృతి విషయంలో ముస్లిం మైనార్టీలకు భరోసా లభించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని చెప్పారు. మూడు గంటల పాటు సీఎంతో సమావేశమై చర్చించామని తెలిపారు. యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మత పెద్దలు సీఎంకు వివరించారన్నారు. ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగేలా ఉంటే పార్లమెంట్లో యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రూఫుల్లా, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ఇసాక్ బాషా పాల్గొన్నారు. -
ఫ్రాన్స్ అల్లర్లు - అభివృద్ధి చెందిన దేశానికి ఎందుకీ గతి పట్టింది?
పారిస్: జూన్ 27న ఒక ముస్లిం యువకుడిని స్థానిక ట్రాఫిక్ పోలీసులు కాల్చి చంపిన తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అభివృద్ధికి చెందిన ఫ్రాన్స్ లాంటి దేశం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు కుదేలైపోవడమే ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తుంది. అసలు ఫ్రాన్స్‌లో ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణమేంటి? అసలేం జరిగిందంటే.. జూన్ 27న 17 ఏళ్ల నాహేల్ మెరెజోక్ ను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న కారణంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని కాల్చి చంపడంతో వివాదానికి తెరలేచింది. పోలీసుల విచారణలో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పైగా నేర చరిత్ర కూడా ఉందని తేలింది. ఆ ప్రకారం చూస్తే నేరస్తులు ఎవరైనా తమ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వారిని కాల్చవచ్చని 2017లో అమల్లోకి వచ్చిన ఒక ఫ్రాన్స్ చట్టం చెబుతోంది. టెర్రరిస్టులపై వారు ఇదే చట్టాన్ని అమలు చేస్తుంటారు. అదే చట్టాన్ని నాహేల్ పై కూడా ప్రయోగించినట్లు సమర్ధించుకుంటున్నారు పోలీసులు. వలసదారుల విషయంలో వారు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు.. కాబట్టి అన్నీ తెలిసే వారు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ప్రధాన కారణమిదే.. ఫ్రాన్స్ దేశ జనాభా మొత్తం 67 మిలియన్లయితే అందులో వలసదారుల జనాభా సుమారు 4.5 మిలియన్లు ఉంటుంది. ఆతిధ్య దేశం కనికరిస్తే స్థానికంగా జీవనం కొనసాగించడానికి మాత్రమే అన్నట్టుగా మొదలైన వలసదారుల ప్రయాణం హక్కులు, సమానత్వం అంటూ రెక్కలు విచ్చుకుంటూ సాగింది. France Bizarre forms of Riot, cars flying out of the car park This hasn't even been filmed in the movies. pic.twitter.com/XGkliojCOf — Dialogue works (@Dialogue_NRA) July 2, 2023 ఫ్రెంచి విప్లవం ప్రభావం.. 1789లో ఉవ్వెత్తున ఎగిసిన ఫ్రెంచి విప్లవం వలసదారుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం పేరిట జరిగిన ఆ ఉద్యమం వలసదారులపై పెను ప్రభావం చూపింది. హక్కుల కోసం పోరాడాలన్న సంకల్పాన్ని వారిలో పుట్టించింది. వారెందుకలా.. వీరెందుకిలా.. ప్రపంచంలో ఎక్కడైనా వలదారులు దేశాలు బయలు వెళ్ళడానికి మూడే ప్రధాన కారణాలను చూడవచ్చు. యుద్ధం, రాజకీయ సంక్షోభం, కటిక దారిద్య్రం. ఈ నేపథ్యంతో వచ్చిన వారిని ఆతిధ్య దేశాలు మొదటిగా సానుభూతితో స్వాగతిస్తుంటాయి. అలాగే చౌకగా పనివారు దొరుకుతారన్న ఆర్ధిక ప్రయోజనంతో కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. #French nationalists in the streets of Lyon are ready to fight protesters “Blue, white, red, the France to the French! they chant#FranceRiots pic.twitter.com/88V2O7JCXu — CtrlAltDelete (@TakingoutTrash7) July 3, 2023 అక్కడ మొదలైంది.. ఇక్కడే ఒకటి కొంటే ఒకటి ఉచితమన్న ఫార్ములా అమల్లోకి వస్తుంటుంది. మొదట్లో మెతకగా ఎంట్రీ ఇచ్చిన వలసదారులు కొన్నాళ్ళకో.. కొన్నేళ్ళకో.. మాక్కూడా పౌరసత్వం కావాలని, సమాన హక్కులు కల్పించమని కోరుతూ ఉంటారు. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. కానీ వారు అలా అంగీకరిస్తే స్థానికంగా ఉంటున్నవారికి కొత్త సమస్యలు తీసుకొచ్చినట్టేనని వెనకడుగు వేస్తూ ఉంటారు. పెరిగిన మైనారిటీ జనాభా.. మత విభేదాలు సృష్టించినంతగా జాతి విభేదాలు హింసను ప్రేరేపించకపోవచ్చని నమ్మే ఫ్రాన్స్ దేశం వలసదారులు అక్కడి నియమాలను పాటించాలని, చట్టాలను గౌరవించి ఆచార వ్యవహారాలను పాటించి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుతూ వచ్చింది. అందుకు అంగీకరించిన నేపథ్యంలోనే ఫ్రాన్స్‌లో కేథలిక్ జనాభా తర్వాత ముస్లిం జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. అత్యుత్తమ పౌరులు.. 1960ల్లో ఉత్తర ఆఫ్రికా నుండి వలస వచ్చిన ముస్లిం జనాభా ఆనాడు ఫ్రాన్స్ కట్టుబాట్లకు లోబడి చక్కగా ఒదిగిపోయారు. కానీ తర్వాతి తరం వలసదారుల్లో ఈ క్రమశిక్షణ తగ్గుతూ వచ్చింది. ఇది మా సొంత దేశం కాదన్న ధోరణి మొదటి తరంలో ఉన్నంతగా తర్వాతి తరాల్లో లేదు. వలసదారులమన్న భావన కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే మేము వలసదారులమన్న ఆలోచన కూడా అత్యధికులు మర్చిపోయారు. 👉It’s getting so much more obvious that these riots are all orcheststrsted WATCH: Rioters have burned down the largest library in France. The Alcazar library in Marseille included an archive of one million historically significant archives.#FranceRiots #France #FranceOnFire pic.twitter.com/hko8no7yuC — Censored American NO MORE (@NotADirtyDem) July 5, 2023 పెరుగుతోన్న విపరీతవాదం.. ఇక ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న మరో పెనుభూతం ఇస్లాం రాజకీయవాదం.. తాజాగా ఫ్రాన్స్ దేశాన్ని ఇబ్బంది పెట్టిన ఈ సమస్యతో ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తూ దొరికిందే అవకాశంగా విపరీతవాదం పేట్రేగిపోతోంది. పెరుగుపోతున్న ఈ హింస కారణంగానే ఫ్రాన్స్ దేశం కొన్ని కఠిన నియమాలను, చట్టాలను అమలు చేస్తూ వచ్చింది. తలపాగా నిషేధం, చార్లీ హెబ్డో కార్టూన్లు నిషేధం ఈ కోవలో చేసినవే. ఫ్రాన్స్ దేశం వారు తమ చట్టాలను కఠినంగా అమలు చేయబట్టే జూన్ 27న నాంటెర్రే సంఘటన కూడా చోటు చేసుకుంది. దానిని అనుసరిస్తూనే దేశవ్యాప్తంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. This is France, July 2023, slowly becoming a third world country #France #FranceHasFallen #FranceRiots pic.twitter.com/ouxGzttxRY — FRANCE RIOTS (@FranceRiots) July 7, 2023 ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ.. -
అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
ముస్లిం రేసేవాషన్లు తొలగించటం అమిత్ షా తరం కాదు
-
ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ మాసం శుభాకాంక్షలు
-
రంజాన్ నెల ప్రారంభం.. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో.. నెల రోజులపాటు నియమ నిష్టలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తోందని చెప్పారు. ‘కఠిన ఉపవాస దీక్ష (రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దాన ధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్. ఈ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
CM Jagan: ఇది మన ప్రభుత్వం.. గుర్తుపెట్టుకోండి
సాక్షి, గుంటూరు: ముస్లింలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని.. అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. ముస్లిం సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాదు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తామని తెలిపారాయన. సోమవారం తాడేపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ‘‘ఇది మనందరి ప్రభుత్వం అనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే.. దేవుడి దయతో ప్రతి ఇంటికీ, గడపకూ మంచి చేస్తున్నామని, ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో తమ సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు వాళ్లు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు.. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను తెలియజేశారు. ఈ అంశాలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం జగన్ అధికారులను అదేశించారు. అలాగే.. విజయవాడలోనూ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేయగా.. అందుకు అవసరమైన భూమి కేటాయించాలని అక్కడికక్కడే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో.. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని నిర్ణయించారాయన. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటు ఉండాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి.. ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచేందుకు సైతం సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే.. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా.. ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలియజేశారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. -
వనపర్తి ఆవాజ్.. ఖమర్ రహమాన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆమె అతి పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన సామాన్యురాలు. తల్లి అనారోగ్యం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆరో తరగతి చదువుతుండగానే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కుటుంబ భారంతో అనేక సమస్యలు ఎదుర్కొంది. అయితే చిన్నప్పట్నుంచే అభ్యుదయ భావాలు కలిగిన ఆమె ఎలాగైనా తనను తాను నిరూపించుకోవడంతో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు. సమాజంలో కట్టుబాట్లను దాటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. భర్త సహకారంతో పదో తరగతి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గజ్జె కట్టి, పాట పాడుతూ దేశమంతా తిరిగారు. అంతేకాదు స్వయం ఉపాధి చూపడం ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జాతీయ స్థాయిలోనూ పేరు సంపాదించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆవాజ్ వనపర్తి పేరిట కమ్యూనిటీ రేడియోను స్థాపించి అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌కు చెందిన ఖమర్ రహమాన్‌పై మహిళాదినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. 150 గ్రామాలకు ఆవాజ్ వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వనితా జ్యోతి సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ఖమర్ రహమాన్ కమ్యూనిటీ రేడియో ప్రాధాన్యత గురించి తెలుసుకుని.. తానూ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారు. అనేకసార్లు ప్రయత్నించిన తర్వాత నాలుగేళ్లకు అనుమతి లభించింది. వీజేఎంఎస్ ఆవాజ్ 90.4 ఎఫ్ఎం రేడియో (ఆవాజ్ వనపర్తి) ఏర్పాటయ్యింది. 2018లో ప్రసారాలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం ఆవాజ్ వనపర్తి రేడియో కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఎకరా స్థలం కూడా కేటాయించింది. ఇందులో నుంచే బ్రాడ్ కాస్టింగ్ నడుస్తోంది. భవన నిర్మాణం పురోగతిలో ఉంది. ఇది పూర్తయితే రికార్డింగ్, బ్రాడ్‌కాస్టింగ్ ఒక్కచోట నుంచే జరుగుతుంది. ప్రస్తుతం వనపర్తి నుంచి 35 కిలోమీటర్ల మేర 150 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఆవాజ్ వనపర్తి 90.4 ఎఫ్ఎం పేరుతో వెబ్ రేడియో కూడా అందుబాటులోకి తేగా.. దీనికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలు ఉండడం విశేషం. రైతులు, మహిళల సమస్యలు పరిష్కారంపై నిపుణులతో కార్యక్రమాలు, జాతీయ నేతలు, మహానుభావుల జీవిత చరిత్ర, చారిత్రక ప్రాధాన్యం గల అనేక అంశాలతోపాటు ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు, పద్యనాటకాలు, మిమిక్రీ, చిన్నపిల్లల కార్యక్రమాలు, యూనిసెఫ్ ప్రోగ్రామ్‌లు ప్రసారంతో ఇది బహుళ ప్రజాదరణ పొందుతోంది. ఇలా మొదలు.. నిరక్షరాస్యత, పేదరికం, వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు జిల్లాలో ప్రభుత్వం 1989లో అక్షర కిరణం పేరిట పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మహిళా అక్షరాస్యతను పెంపొందించడం.. పొదుపు అలవాటు చేసుకునేలా స్వయం సహాయక బృందాల (ఎస్ఎస్జీ) ఏర్పాటు కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఆయా కార్యక్రమాలకు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. పాటలు రాయడం, పాడడంతో పాటు గజ్జె కట్టి ఆడటంలోనూ ప్రావీణ్యమున్న ఖమర్ రహమాన్‌కు వెంటనే అవకాశం వచ్చింది. అంతే ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు. గజ్జె కట్టి, పాటపాడుతూ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కల్చరల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఖమర్ రహమాన్.. చిన్నమ్మ థామస్ సఖీ కేంద్రాల నిర్వహణ చేపట్టి సమాజంలో అణచివేత, వేధింపులకు గురవుతున్న ఎందరో మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సారా నిషేధం కోసం లక్ష సంతకాలు సేకరించి గవర్నర్‌కు సమర్పించి గుర్తింపు తెచ్చుకున్నారు. భూకంప బాధితులకు విరాళాల సేకరణతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం (వీజేఎంఎస్) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతులకు కంప్యూటర్, టైలరింగ్, మగ్గం వర్క్స్, సర్ఫ్, అగర్బత్తీల తయారీ తదితరాల్లో శిక్షణ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోకు నాతో పాటు మొత్తం 614 మంది దరఖాస్తు చేశారు. ఇందులో నాకే అవకాశం అభించింది. సాంకేతికతను ఉపయోగించి సమాజానికి మరిం త మేలు చేయాలనే సంకల్పంతో దీన్ని స్థాపించా. ప్రస్తుతం ఈ రేడియోలో 18 మంది మహిళలు పని చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డులు వచ్చినా..డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్) నుంచి మూడు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. త్వరలో ప్రతి గ్రామానికి 2 రేడియోల చొప్పున అందజేసి.. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. – ఖమర్ రహమాన్, ఆవాజ్ వనపర్తి రేడియో ఫౌండర్ -
ఏపీ నుంచే నేరుగా హజ్ యాత్ర
సాక్షి, అమరావతి: హజ్ (మక్కా) యాత్రకు వెళ్లే రాష్ట్రానికి చెందిన ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా విజయవాడ నుంచి ప్రత్యేక విమాన సౌకర్యం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా హజ్ యాత్రికుల కోసం విజయవాడలో ఇమిగ్రేషన్‌కు కేంద్ర విమానయాన శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఏపీకి చెందిన హజ్ యాత్రికులు ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి వెళ్లేవారు. ఈ ఏడాది నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచే నేరుగా వెళ్లొచ్చు. ఈ అవకాశాన్ని రాష్ట్రానికి చెందిన ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలి’ అని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో జరిగిన కమిటీ సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. యాత్ర ఏర్పాట్లపై రూపొందించిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సమావేశం నిర్ణయాలను సభ్యులతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని రీతిలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన బియ్యం కార్డుదారులకు రూ.60 వేలు, రూ. 3 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తోఫా ఇస్తోంది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇవ్వడంలేదు. తొలిసారి 70 ఏళ్ల పైబడిన వారు (1953 ఏప్రిల్ 30కి ముందు జన్మించిన వారు) దరఖాస్తు చేసుకుంటే లాటరీతో సంబంధం లేకుండా నేరుగా యాత్రకు ఎంపిక చేస్తారు. 70 ఏళ్లు పైబడిన వారు ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లొచ్చు. అదే విధంగా ఒంటరిగా ఉండే 45 ఏళ్ల పైబడిన మహిళలు కనీసం నలుగురు (2023 ఏప్రిల్ 30 నాటికి 45 ఏళ్లు నిండి ఉండాలి) కలిసి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఎంపిక చేస్తారు. ఒక వేళ ఇద్దరు మహిళలే దరఖాస్తు చేస్తే, కమిటీ ద్వారా మరో ఇద్దరు మహిళలను కలిపి పంపిస్తారు. ఈసారి 12 ఏళ్ల లోపు చిన్నారులకు సౌదీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. యాత్రకు వెళ్లే వారి కోసం హజ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా హజ్ సొసైటీల ద్వారా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. యాత్రికుల కోసం జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేకంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. వారిని సాగనంపేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు సైతం గన్నవరంలోని ఓల్డ్ ఎయిర్‌పోర్టు, విజయవాడలోని మదరసాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి సహాయార్ధం వలంటీర్లను సైతం నియమిస్తున్నారు. ప్రయాణానికి 48 గంటల ముందు రిపోర్టు చేసే యాత్రికులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మక్కాలో కూడా ఏపీ నుంచి వెళ్లే యాత్రికులకు ఏపీ ప్రభుత్వం తరపున ఒకే ప్రాంగణంలో వసతి, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ తెలిపారు. కమిటీ సమావేశంలో సభ్యులైన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సయ్యద్ వలియుల్లా హుస్సేన్, çమహమ్మద్ ఇమ్రాన్, షేక్ గులాబ్జాన్, షేక్ అతువుల్హా తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేయండిలా.. హజ్ యాత్రకు వెళ్లే వారు http:hajcommittee.gov.in ద్వారా లేదా స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో మార్చి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు–2, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు–4, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ లేదా క్యాన్సిల్డ్ బ్యాంక్ చెక్ సమర్పించాలి ► ఉచితంగా దరఖాస్తు చేసేందుకు జిల్లా హజ్ సొసైటీల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ► దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు అవసరమైన పత్రాలు, అడ్వాన్స్ ఫీజు రసీదు, మెడికల్ సర్టిఫికెట్లను డ్రా తర్వాత ఏపీ హజ్ కమిటీ కార్యాలయంలో అందజేయాలి -
ముస్లింలకు అండగా నిలబడతా..
ఖమ్మం మయూరిసెంటర్: కొందరికి పదవులు రాలేదనో, రావనో లేక ఇతర కారణాలో తెలియదు కానీ.. ఖమ్మంలో బీజేపీని పుట్టించాలని చూస్తున్నా రని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని షాదీఖానాలో సోమవారం ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ‘మత తత్వ పార్టీలకు ఖమ్మం వేదిక కాదని గుర్తుపెట్టుకోండి.. తస్మాత్ జాగ్రత్త’ అని సూచించారు. ప్రభుత్వంలో ఇద్దరు ముస్లింలు మంత్రులుగా ఉంటే అందులో ఒకరు మహమూద్ అలీ, రెండో వ్యక్తి అజయ్‌ఖాన్ అని పేర్కొన్నారు. తనకు ఆత్మీయు లైన ముస్లిం మైనార్టీలతో మొదటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పువ్వాడ తెలిపారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పటి మాదిరిగానే భవిష్యత్‌లోనూ ముస్లింలకు అండగా నిలబడతానని వెల్లడించారు. మతతత్వ శక్తులపట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉంటూ బీఆర్ఎస్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో ఎక్కువ శాతం మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ను నమ్ముతున్నారన్నారు. సెక్యులరిజాన్ని కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని నమ్మిన ముస్లిం మైనారిటీలు ఈ పార్టీని వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. ఖమ్మంలో ఇంత అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అందడానికి తనకు వ్యక్తిగతంగా సాధ్యం కాలేదని, ప్రభుత్వం వల్లే ఇంత చేయగలిగామని తెలిపారు. వేలాది మంది కార్యకర్తలు ఉండగా, అందరికీ పదవులు ఇవ్వలేమని.. పది, పదిహేను మందికే ఇవ్వగలమన్నారు. చాలామందికి పదవులు రాకపోయినా బాధ్యతతో వ్యవహరిస్తుండగా... కొందరికి పదవులు వచ్చినా కడుపునొప్పి ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. -
Minority Welfare Day: ముస్లింల ప్రాతినిధ్యం పెరగాలి
స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలైనా దేశంలో అనేక వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారు. అందుకే జస్టిస్ సచార్ నివేదిక వారిలో చాలా ఆశలు రేపింది. మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగ్గా లేవని నివేదిక తేల్చింది. అనేక వర్గాలు సామాజికంగా, రాజకీయంగా దూసుకుపోతుంటే ముస్లింలు మాత్రం ఈ పరుగు పందెంలో బాగా వెనుకబడ్డారు. పైగా అభద్రతా భావం పెరిగింది. ముస్లిం సమాజంలో పేదరికం కూడా ఎక్కువే. పల్లెటూళ్లలో సెంటు భూమికూడా లేనివారిలో ఎక్కువ మంది ముస్లింలే. దీంతో వారు రోజువారీ కూలీలుగా బతుకుతున్నారు. ఊళ్ళలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో చాలా మంది దగ్గరలోని నగరాలు, పట్టణాలవైపు వలస బాట పట్టారు. రోడ్ల పక్కన కాయలు, పండ్లు అమ్ముకోవటం, రిపేరింగ్ లాంటి పనులతో సరిపెట్టుకుంటున్నారు. దేశ జనాభాలో ముస్లింల శాతం 14.9 అయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ల శాతం 4.9కి మించిలేదు. కేంద్ర సర్వీసుల్లో మరీ తక్కువ (3.2 శాతం). సచార్ కమిటీ నివేదిక తర్వాత ఏర్పడిన అనేక కమిటీలు కూడా దేశంలోని ముస్లింల స్థితిగతులపై పెదవి విరిచాయి. ముస్లిం సమాజం ఇప్పటికీ గుర్తింపు సమస్య లోనే కొట్టుమిట్టాడుతోంది. ముస్లిం సమాజంపై ఇప్పటికీ మిగతా సామాజిక వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరగడంతో నిజాలపై అపోహల ఆధిపత్యం ఎక్కువైంది. దీంతో ముస్లింల సమ స్యలు ఇనుమడిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యాచార నిరోధక చట్టం ఉన్నట్లుగానే, ముస్లిముల కోసం కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. సబ్‌ప్లాన్ అమలు చేయాలి. మైనారిటీ తెలంగాణలో ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న వాగ్దానాన్ని కాగితాలకే పరిమితం చెయ్యకుండా ఆచరణలో పెట్టాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతానన్న హామీని గురించి కేసీఆర్‌ను నిలదీయాలి. ముస్లిం సముదాయం కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుల సాధనకు రాజ్యాంగ బద్ధంగానే పోరాడాలి. పాలక పక్షాలు చురుగ్గా స్పందించేలా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక వాదులు, వామపక్షీయులు, బహుజన శక్తులతో కలిసి మైనారిటీలను పట్టించుకోని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. మతపరమైన అంశాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముస్లిం సమాజాన్ని నడిపించే బలమైన నాయకత్వం నేటి అవసరం. (క్లిక్ చేయండి: ఆలోచనాపరుల జాగరూకతే దేశానికి రక్ష) - ఎమ్డీ ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్ట్ (నవంబర్ 11న జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం) -
ఆంజనేయాలయం కోసం భూదానం చేసిన ముస్లిం
షాజహాన్‌పూర్(యూపీ): ఆంజనేయ ఆలయ నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి భూదానం చేసి మతసామరస్యాన్ని చాటాడు. ఢిల్లీ–లక్నో 24వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు కచియానా ఖేరి గ్రామంలో హనుమాన్ ఆలయం అడ్డంకిగా మారింది. విషయం తెలుసుకున్న స్థానికుడు బాబూ అలీ తన 0.65 హెక్టార్ల భూమిలో కొత్త ఆలయం నిర్మించుకోండంటూ భూమిని దానం చేశాడు. దీంతో రోడ్డపై ఆలయాన్ని పడగొట్టి అలీకి చెందిన స్థలంలో పునర్నిర్మించనున్నారని అదనపు జిల్లా మేజిస్ట్రేట్(పరిపాలన) రామ్‌సేవక్ ద్వివేది బుధవారం చెప్పారు. ఈ మేరకు భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిందని తిల్హార్ డెప్యూటీ జిల్లా మహిళా మేజిస్ట్రేట్ రాశీ కృష్ణ వెల్లడించారు. హిందూ – ముస్లిం ఐక్యతను అలీ మరోసారి చాటిచెప్పారని రాశీ పొగిడారు. ఇదీ చదవండి: మా లక్ష్మణరేఖ తెలుసు -
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శునకాలకున్న గౌరవం కూడా ముస్లింలకు లేదని అన్నారు. ముస్లింలను బూచిగ చూపెట్టి ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేదన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు నన్ను బీజేపీ బీ-టీమ్‌గా పిలిచిన మమతా బెనర్జీ ఇప్పుడు ఆర్ఆర్ఎస్, మోదీలను పొగుడుతున్నారని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చదవండి: (ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ!) -
టీటీడీకి ముస్లిం దంపతుల రూ.1.02 కోట్లు విరాళం
తిరుమల: చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు. శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేశారు. ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు చేపట్టారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనానికి 12 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 24 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 67,276 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.71 కోట్లు వేశారు. -
సల్మాన్ రష్డీ దాడిపై మౌనం వీడిన ఇరాన్
టెహ్రాన్: బుకర్ ప్రైజ్ రచయిత, భారత సంతతికి చెందిన సల్మాన్ రష్డీ దాడిపై ఇరాన్ మౌనం వీడింది. దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందంటూ దాడి జరిగినప్పటికీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే దాడి విషయంలో తమను నిందిచడంపై ఇరాన్ తీవ్ర అసహనం వెల్లగక్కింది. ఈ దాడి విషయంలో నిందించాల్సింది.. సల్మాన్ రష్డీ, ఆయన మద్దతుదారులనేనని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది.. తన రచనలో ఒక మతానికి వ్యతిరేకంగా రష్దీ చేసిన అవమానాలను ఎంత మాత్రం సమర్థించదు అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ కన్నాని తెలిపారు. ఇస్లామిక్ పవిత్రతలను అవమానించడం ద్వారా ఆయన కోట్ల మంది ఉన్న ఇస్లాం సమాజం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దాడికి ఆయన్ని, ఆయన అనుచరులను తప్ప ఎవరినీ నిందించలేం. అంతేగానీ.. ఈ దాడి విషయంలో అసలు ఇరాన్‌ను నిందించే హక్కు ఎవరికీ లేదు. అది మాకు సంబంధంలేని విషయం అని నాజర్ కన్నాని తెలిపారు. ‘నిందితుడిని పొగుడుతూ వెలువడ్డ కథనాలు, సోషల్ మీడియా సంబురాల’ గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురుకాగా.. ఆ కథనాలు ప్రధానంగా ప్రచురితం అయ్యింది మాజీ అధ్యక్షుడు అయతొల్లా రుహోల్లాహ్కు చెందిన పత్రికల్లోనే అని, ఇక సోషల్ మీడియాలో ప్రజాభిప్రాయాలను తప్పుబట్టడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. సల్మాన్ రష్డీపై దాడికి పాల్పడ్డ నిందితుడు హాది మతార్ గురించి మీడియాలో చూడడమే తప్ప.. అతని గురించి తమకెలాంటి సమాచారం లేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. 1998లో పబ్లిష్ అయిన ది సాటానిక్ వెర్సెస్.. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండడం, ఆ నిషేధిత నవలపై ఆగ్రహం వెల్లగక్కిన అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ఆ భయంతో దాదాపు చాలా ఏళ్లు సల్మాన్ రష్డీ అజ్ఞాతవాసంలోనే ఉండిపోయారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయనపై నిందితుడు హాదీ మతార్.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కిమ్‌తో దోస్తీకి పుతిన్ తహతహ -
ఆ నవల జోలికి వెళ్తే.. అందరికీ ఇదే గతి!
బుకర్‌ప్రైజ్ విన్నర్, భారత సంతతికి చెందిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడి ఘటనను ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. 75 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్నైట్స్ చిల్డ్రన్(1981) ద్వారా బుకర్ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా(ముంబైలో పుట్టారు కాబట్టి) ఘనత దక్కించుకున్నారు. అందుకే పలు దేశాల నేతలు, అధినేతలతో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఇరాన్లో పండుగ వాతావరణం నెలకొనడం విశేషం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో మాజీ అధినేత అయతోల్లా రుహోల్లా ఖోమెయినీ(దివంగత) ఫొటోలు.. బ్యానర్లు, ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఒకప్పుడు తన నవల(నిషేధిత)తో ఇస్లాంను అవహేళన చేసినందుకు సరైన శిక్ష పడిందంటూ అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం ఇస్లాంను అవమానించాడన్న ఆరోపణపైనే ఆయనపై దాడిని కొందరు ఇరానీయన్లు సమర్థించడం గమనార్హం. ► ఇక అదే గడ్డపై మరోరకమైన వాతావరణమూ కనిపిస్తోంది కూడా. ఇప్పటికే న్యూక్లియర్ ఒప్పందాల విషయంలో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై గుర్రుగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని ఆధారంగా చేసుకుని మరిన్ని ఆంక్షలు విధించొచ్చన్న ఆందోళన ఇరాన్లో నెలకొంది. ► సల్మాన్ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్ అనే వ్యక్తిగా నిర్ధారించారు. అతను ఉద్దేశం ఏంటన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ► 1988లో సల్మాన్ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు. ► ముంబైలో పుట్టిన సల్మాన్ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్’నవల ద్వారా ఊహించని రేంజ్లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు. ► సల్మాన్ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్ ఆంటోన్ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి. ► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన. ► మిడ్నైట్ చిల్డ్రన్కు బుక్ ప్రైజ్ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్కు నామినేట్ అయ్యారు. ► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ గౌరవం ఇచ్చింది. ► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. ► పాక్ ప్రపంచంలో పాతికకు పైగా దేశాలు.. ఇస్లాంను కించపరిచేలా ఉందంటూ ఈ నవలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. సల్మాన్ రష్డీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అందులో కొన్ని బ్యాన్ చేశాయి కూడా. భారత్ కూడా నవల పబ్లిష్ అయిన నెల రోజుల తర్వాత నిషేధించింది. ఎవరైనా ఆ నవలను దగ్గర ఉంచుకున్నా సరే అప్పట్లో కఠినంగా శిక్షించేవి ఇస్లాం దేశాలు. ► ముంబైలో 1989 ఫిబ్రవరిలో రష్డీకి వ్యతిరేకంగా మొదలైన ర్యాలీ కాస్త అల్లర్ల మలుపు తీసుకుంది. ఏకంగా 12 మంది మృతి చెందారు. ► ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయిన ఏడాది తర్వాత.. అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ► 80వ దశకం నుంచి ఇరాన్ ఆయనను చంపి తీరుతామని ప్రకటలు చేస్తూ వచ్చాయి. అంతేకాదు ఒకానొక టైంలో.. ఆయనపై ప్రకటించిన రివార్డు 3 మిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. ► 1989లో ఇరాన్ యూకేతో ది సాటానిక్ వెర్సెస్ నవల విషయంలో దౌత్యపరమైన సంబంధం నడిపింది. ► ఇప్పుడు సల్మాన్ రష్డీపై దాడి గురించి చూశారు కదా. అయితే గతంలోనూ ఈ నవలతో సంబంధం ఉన్నవాళ్లపైనా దాడులు జరిగాయి. ► ది సాటానిక్ వెర్సెస్ జపనీస్ వెర్సన్‌లో రష్డీకి సాయం చేసిన హితోషి ఇగరషి అనే ట్రాన్స్‌లేటర్.. 1991, జులై 13న ఘోరంగా కత్తిపోట్లకు గురై హత్య గావించబడ్డాడు. ► ఇగరషి కంటే పదిరోజుల ముందుగా జరిగిన ఓ దాడిలో.. రష్డీకి ది సాటానిక్ వెర్సెస్ విషయంలో ఇటాలియన్ ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన ఎట్టోరే క్యాప్రివోలో.. మిలన్(ఇటలీ)లోని తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇతనూ కత్తి పోట్లకే గురికావడం గమనార్హం. ► ది సాటానిక్ వెర్సెస్ నార్వేరియన్ పబ్లిషర్ విలియం నైగార్డ్ను ఓస్లోలో అక్టోబర్ 11, 1993లో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ► టర్కీస్ ట్రాన్స్‌లేటర్ అజిజ్ నాసిన్‌ను లక్ష్యంగా చేసుకుని.. జులై 2, 1993లో ఓ గుంపు దాడి చేసింది. శుక్రవారం ప్రార్థనల తర్వాత మడిమక్ హోటల్‌కు నిప్పటించడంతో.. 37 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చాలామంది కళాకారులు కావడం విశేషం. ► అగష్టు 12, 2022.. శుక్రవారం వెస్ట్రన్ న్యూయార్క్‌లో ఉపన్యాసం కోసం సిద్ధమైన వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై.. వెనుక నుంచి ఓ దుండగుడు కంఠంలో విచక్షణంగా పొడిచి దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి.. సర్జరీలు చేశారు. ఆయన ప్రధాన అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, ఒక కంటికి చూపును సైతం కోల్పోవచ్చని వైద్యులు చెప్తున్నారు. ► కొంతకాలం దాకా ఆయనకు భారీ భద్రతే ఉండేది. అయితే ఆ భద్రతా సిబ్బందితోనూ తనకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆయన విజ్ఞప్తి చేయడంతో.. కొంత వెనక్కి తీసుకున్నారు. ► చావు బెదిరింపులకు భయపడి.. ఇంతకాలం భయం భయంగా గడిపాను. ఇప్పుడు సాధారణంగా మారిందనే నమ్ముతున్నా.. దాడికి కొన్నివారాల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ రష్టీ చేసిన వ్యాఖ్యలు. ► ఇరాన్ మీడియా ఇండో-బ్రిటీష్ సంతతికి చెందిన సల్మాన్ రష్డీపై దాడిని హైలైట్ చేస్తూ.. సానుకూల కథనాలు ప్రసారం చేసుకుంది. ముఖ్యంగా అయతోల్ల స్థాపించిన ‘కేహన్’.. దాడికి పాల్పడిన దుండగుడిని ఆకాశానికి ఎత్తేసింది. ► ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సల్మాన్ రష్డీ.. ఒకేఒక్క నవల(ది సాటానిక్ వెర్సెస్)తో తన జీవితానికి భయంభయంగా గడిపారు. అదీ 30 ఏళ్లకు పైనే. ► ప్రాథమిక విచారణలో హాది మతార్ సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ.. షియా ఎక్స్‌ట్రీమిజం, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్(IRGC)సానుభూతి పరుడిగా ఉంది. ► అయితే హాది మతార్‌కు.. ఐఆర్‌జీసీకి నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ► 2020లో హత్యకు గురైన ఐఆర్జీసీ కమాండర్ ఖాసీం సోలెమని.. ఫొటోలు మాత్రం హాది మతార్ మొబైల్లో ఉన్నాయి. ► స్టేజీ మీదకు దూకి మరీ హాది మతార్ దాడికి పాల్పడ్డాడు. సల్మాన్ రష్డీని ఇంటర్వ్యూ చేయాలనుకున్న హెన్రీ రెస్సీ సైతం ఈ దాడిలో గాయపడ్డారు. ► ఒంటరిగానే అతను ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నా.. లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు. ► హదీ మాతర్ ప్రస్తుతం న్యూజెర్సీ.. ఫెయిర్వ్యూవ్లో ఉంటున్నాడు. అతను ఏ దేశ పౌరుడు, క్రిమినల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇదీ చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి -
త్యాగ నిరతికి చిహ్నం బక్రీద్
ఎన్నో త్యాగాలు.. ఎన్నోబలి దానాలు... ఒక మానవ మాత్రుని సహనానికి పరాకాష్ట అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకొని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వవ్వక్తిత్వం.. ఎన్నో ఉలిదెబ్బల తరువాత శిల శిల్పంగా మారుతుంది. కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవ జీవితానికీ వర్తిస్తుంది. సయ్యిదినా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఆయన ఎన్నోపరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, మిథ్యాదైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్ళముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే మంటల్లో పడవేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కాని, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశంనుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి అణుమాత్రమైనా చోటులేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరక ముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్షకాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. బాబును సంప్రదించారు. ’దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండినాన్నా! దైవచిత్తమైతే నన్నుమీరు సహనవంతునిగా చూస్తారు. ’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ వినడానికి సృష్టిలోని అణువణువూ అవాక్కయి పోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించి పోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దేవుని ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనకు వారు మానసికం గా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారి పట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గ పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. ఇదీ నేటి త్యాగోత్సవానికి(ఈదుల్ అజ్ హా/ బక్రీద్ సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కని ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతోకొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికిస్తున్న సందేశం ఇదే. (నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ముస్లిం మైనారిటీలకు అండగా సీఎం వైఎస్ జగన్
కలికిరి: రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లవేళలా అండగా ఉన్నారని లోక్‌సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో మంగళవారం జరిగిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గం మహల్‌కు చెందిన డాక్టర్ ఇక్బాల్ అహ్మద్‌ఖాన్‌కు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించడం సీఎం జగన్ ఘనత అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు ఒక్క రాష్ట్రస్థాయి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు ముస్లిం మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకుగా పరిగణించి వాడుకుని వదిలేశారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో హిజాబ్ సమస్య, మసీదుల్లో మైకుల నిషేధం, ముస్లింలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలు గమనిస్తున్నామన్నారు. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉండటంతో ముస్లింలకు సముచిత స్థానం, భద్రత ఉంటున్నాయని చెప్పారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రాకి వస్తున్న పరిస్థితి ఉందన్నారు. రాబోయే రోజుల్లో మూడు పార్టీలు ప్రజల ముందుకు వచ్చి తప్పుదోవ పట్టిస్తాయని, వారి అసత్యాలను నమ్మకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయనకోరారు. -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
కళ్యాణదుర్గం/ అనంతపురం శ్రీకంఠం సర్కిల్: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సేవాభావం, సోదర భావంతో మెలగాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా జీవించేలా అల్లా ఆశీర్వదించాలని ప్రార్థించారు. ముస్లింల జీవితాల్లో రంజాన్ పండుగ వెలుగులు నింపాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ ఆకాంక్షించారు. -
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2022 -
27న విజయవాడలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీన సీఎం వైఎస్ జగన్ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. 27న సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?
ద్వేషాన్ని, వివక్షను స్వయంగా అనుభవించడం వేరు; బయటి నుంచి దాన్ని తెలుసుకోవడం వేరు. భారత్‌లో ఒక ముస్లింగా ఉండటం అనేది ఎలా ఉంటుందో స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. నిరుపేదలూ, నిరక్షరాస్యులైన ముస్లింలు కూడా ఈరోజు ద్వేషాగ్ని బారిన పడుతున్నారు. అయినా మనలో చాలా మందిమి ఇంకా ముస్లింలను ఈ దేశంలో బుజ్జగిస్తున్నారని భావిస్తుండటమే దారుణం. మన దేశంలో ప్రతి రంగంలోనూ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాతో పోలిస్తే కింది స్థాయిలోనే ఉందన్నదే నిజం. ఆర్థిక, సామాజిక అంశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకంటే ముస్లింల పరిస్థితే ఘోరంగా ఉందని సచార్ కమిటీ దశాబ్దిన్నర కాలం క్రితమే తేల్చి చెప్పింది. నిజాలు ఇలా ఉండగా... ఇంత ద్వేషపూరిత వాతావరణాన్ని ఇన్నేళ్లుగా, నిరవధికంగా దేశీయ ముస్లింలు భరిస్తూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మంచివారు లేచి నిలబడి చెడుకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పుడే సమాజంలో దుష్టత్వం సంభవిస్తుంది. ఈ వారం నేను ఒక ప్రశ్న సంధించాలని అనుకుంటున్నాను. మీరు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించినట్లయితే, మన దేశంలో ఇవాళ జరుగుతున్న అత్యంత విషాదకరమైన, కలవరపెట్టేటటువంటి పరివర్తనలను మీరు అర్థం చేసుకోవడంలో నా ప్రశ్న మీకు సహాయపడుతుంది. ఈరోజు మన భారతదేశంలో ఒక ముస్లింగా ఉండటం అంటే ఎలా ఉంటుందో నన్ను కాస్త వివరించనివ్వండి. అలాగని నేను సంపన్నులను, ప్రభావశీలురను లేదా బాగా చదువుకున్న ముస్లింల గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకించి తమకు అందుతున్నదానితో బతకడం తప్ప మరేమీ చేయలేని నిరుపేద, నిరక్షరాస్యులైన ముస్లింల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ముస్లింలలో వీరి జనాభానే అధికంగా ఉంటోంది. వీరిలో ఒకరిగా ఉన్నట్లయితే మనకు ఏమనిపిస్తుంది అనేదే నా ప్రశ్న. అనుభవిస్తేనే బాధ తెలుస్తుంది! ద్వేషాన్ని, వివక్షను స్వయంగా అనుభవించడం వేరు; బయటినుంచి దాన్ని తెలుసుకోవడం వేరు. భారత్‌లో ఒక ముస్లింగా ఉండటం అనేది ఎలా ఉంటుందో స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. కొన్ని నెలలుగా తమను ఊచకోత కోయాలనీ, ముస్లిం జాతినే లేకుండా చేయాలనీ చేస్తున్న పిలుపులను వాళ్లు వింటూ వచ్చారు. అల్లర్లకు తామే కారణమని ఆరోపణలకు గురయ్యారు. వారి ఇళ్లను కూల్చి వేశారు. ఈ చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిని బాధితులు చూస్తుండగానే క్షేమంగా పంపేశారు. ప్రధాని ఆవాస్ యోజన లబ్ధిదారులైన వితంతువులు కూడా బాధితులయ్యారు. పాకిస్తానీ పాటలను విన్నందుకు వారి మైనర్ పిల్లలను నిర్బంధించారు. హిందూ పూజారులం అని చెప్పుకున్న పురుషులు ముస్లింల మహిళలపై అత్యాచారం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఏ రకంగానూ సమగ్రమైన జాబితా కాదు ఇది, ఈ కథనాన్ని రాయడం ప్రారంభించినప్పుడు నా దృష్టికి వచ్చిన అనేక ఘటనలకు సంబంధించిన వివరాల సేకరణ మాత్రమే! మరింత లోతుగా పరిశోధిస్తే ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడే అవకాశం ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి అనుభవాలు మీకు ఎదురై ఉండి ఉంటే మీరు ఏ అనుభూతి పొంది ఉంటారు అన్నదే. వివక్షా, బుజ్జగింపా... ఏది సత్యం? నిజంగా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇంత ఘోరంగా ముస్లింల పట్ల వ్యవహరిస్తున్నప్పటికీ మనలో చాలామందిమి ఇంకా ముస్లింలను ఈ దేశంలో బుజ్జగిస్తున్నారని భావిస్తుండటమే! మనం వాస్తవాలను మాత్రమే తెలుసుకున్నట్లయితే, మన దేశంలో ప్రతి రంగంలోనూ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాతో పోలిస్తే కింది స్థాయిలోనే ఉందన్నదే నిజం. 2006 సంవత్సరంలోకి వెళ్లి చూసినట్లయితే, ఆర్థిక, సామాజిక అంశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకంటే ముస్లింల పరిస్థితే ఘోరంగా ఉందని సచార్ కమిటీ తేల్చి చెప్పింది. ఈ ఒక్క వాస్తవమే మనదేశంలో ముస్లింల అసలైన స్థితిగతులను తేటతెల్లం చేస్తోంది. నేను ఆకార్ పటేల్ రాసిన ‘అవర్ హిందూ రాష్ట్ర’ పుస్తకంపై ఆధారపడి ఈ విషయాలు చెబుతున్నాను. దేశ జనాభాలో ముస్లింలు 15 శాతంగా ఉన్నారు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 4.9 శాతం మాత్రమే. పారామిలిటరీ సర్వీసులో 4.6 శాతం మంది ముస్లింలు ఉండగా, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 3.2 శాతం మాత్రమే. ఇక సైన్యం విషయానికి వస్తే 1 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం అయితే పార్లమెంటులో 74 సీట్లు ముస్లింలకే ఉండాలి. కానీ 27 మంది ముస్లింలు మాత్రమే ప్రస్తుత పార్లమెంటులో ఉన్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేడంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 15 రాష్ట్రాల్లోని మంత్రివర్గాల్లో ఒక్క ముస్లిం మంత్రీ లేరు. 10 రాష్ట్రాల్లో ఒకే ఒక్క ముస్లిం మంత్రి ఉన్నారు. అది కూడా మైనారిటీ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి మాత్రమే వీరికి దక్కుతోంది. అందులోనూ అన్యాయమే... 2014లో గానీ, 2019లో గానీ భారతీయ జనతా పార్టీ తరçఫున ఒక్క ముస్లిం కూడా లోక్‌సభ ఎంపీగా లేరు. 1998 నుంచి గుజరాత్ రాష్ట్రం తరపున లోక్‌సభకు గానీ, విధాన సభకు గానీ ఒక్క ముస్లింను కూడా బీజేపీ పోటీలో నిలబెట్టలేదని ఆకార్ పటేల్ తన పుస్తకంలో రాశారు. అంటే గుజరాత్ జనాభాలో 9 శాతం మంది ముస్లింలు ఉన్నా, గత 24 సంవత్సరాలుగా ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ అటు ఎంపీ స్థానానికి గానీ, ఇటు ఎంఎల్ఏ సీటుకు గానీ పోటీలో నిలపలేదు. ఇలాంటి పచ్చి నిజాలను నేను ఇంకా ఇంకా చెప్పగలను గానీ చెప్పను. నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. మన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)లో ఒక్క ముస్లింను కూడా నియమించినట్లుగా నేనయితే వినలేదు. ఈ పరిస్థితుల్లో ‘రా’ సంస్థ ఒక ముస్లిం ఉద్యోగిని కలిగి ఉంటేనే మనం ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అయితే, ఈ వాస్తవాలన్నీ కూడా మనకు బోధపర్చని విషయం ఒకటుంది. ఇంత ద్వేషపూరిత వాతావరణాన్ని ఇన్నేళ్లుగా, నిరవధికంగా భరిస్తూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఈ విషయం నిజంగానే తెలీదు. ఎందుకంటే ఇదంతా మన అనుభవంలోకి రాలేదు కదా! రాజకీయనేతలు నన్ను చెదపురుగు అని పిలుస్తారనీ, బాబర్ సంతానం అని నన్ను వర్గీకరిస్తారనీ, పదేపదే నన్ను పాకిస్తాన్ వెళ్లిపొమ్మంటారనీ నేనయితే ఊహించలేను. కానీ ప్రతిరోజూ మన ముస్లిం సోదరులూ, సోదరీమణులూ ఈ అనుభవాలనే ఎదుర్కొంటున్నారు. మౌనమునిత్వం ఇంకా ఎన్నాళ్లు? మతద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారి మాటలూ, చేతలకూ వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుతూ గత వారమే 13 ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తరం రాశారు. ప్రధాని అలా మాట్లాడతారో లేదో నాకయితే తెలీదు. వాస్తవానికి చాలా కాలంగా ప్రధాని మోదీ ఇలాంటి విద్వేష వాతావరణాన్ని రెచ్చగొట్టే వారి వ్యవహారానికి సంబంధించి మౌనం పాటిస్తున్నారని మాత్రం తెలుసు. కారణాలు ఏవయినా కావచ్చు... అత్యంత క్షుద్ర స్వరాలు మాట్లాడటాన్ని అనుమతిస్తూ వాటి ప్రభావం గురించి ప్రధాని పట్టించుకోకుండా ఉదాసీనతను పాటిస్తున్నారు. విజ్ఞానం అనేది తరచుగా వాట్సాప్ మీమ్స్ స్థాయికి కుదించుకుపోతున్న ఈ రోజుల్లో మనందరికీ ఒక విషయం వర్తిస్తుంది. మంచివారు లేచి నిలబడి చెడుకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పుడే సమాజంలో దుష్టత్వం సంభవిస్తుంది. ఈ వాస్తవాన్ని మరింత గంభీరంగా మీరు వర్ణించాలనుకుంటుంటే... జాన్ డానీ చెప్పిన సూక్తిని నన్ను చెప్పనివ్వండి. ‘‘ఏ మనిషీ ఒంటరి ద్వీపంలో లేడు. ముస్లింల జీవితాలపై ఈ రోజు మోగుతున్న మృత్యుఘంట రేపు మీ మీదకు కూడా మళ్లవచ్చు.’’ కరణ్ థాపర్,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్!
కర్ణాటకలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్ పేర్కొన్నాడు. హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. హిజాబ్ తీర్పు ఎఫెక్ట్! హిజాబ్ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. -
అస్సాంని మరో కశ్మీర్‌గా మార్చకండి!...కీలక వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం
Ten Years Back Muslims Are Not Minority: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అస్సాం జనాభాలో 35 శాతం ముస్లింలు ఉన్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఇకపై వారిని మైనారిటీలుగా పరిగణించలేరని కూడా స్పష్టం చేశారు. 1990లో కాశ్మీరీ హిందువుల వలసలను గురించి కూడా ప్రస్తావించాడు. అంతేగాదు బాలీవుడ్ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'లో చూపిన విధంగా అస్సాం మారుతుందేమో అని ఇతర వర్గాల్లో రేకెత్తుతున్న భయాలను తొలగించడం రాష్ట్రంలోని ముస్లింల కర్తవ్యం అని చెప్పారు. అస్సాం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, “ఈ రోజు ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, సమాన అవకాశాలు, అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దానిని నిర్ధారించడం వారి కర్తవ్యం. గిరిజనుల హక్కులు పరిరక్షించబడతాయని వారి భూములు ఆక్రమించబడవు అని భరోసా ఇచ్చారు. ఆరో షెడ్యూల్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదు. బోరా, కలిత (అస్సామీ ఇంటిపేర్లు) ఈ భూమిలో స్థిరపడకపోతే ఇస్లాం, రెహమాన్ (ముస్లిం ఇంటిపేర్లు) కూడా ఆ భూముల్లో స్థిరపడవు. అధికారం బాధ్యతతో వస్తుంది. అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నందున ఇక్కడ మైనారిటీలను రక్షించడం వారి కర్తవ్యం" అని ముఖ్యమంత్రి అన్నారు. అస్సామీ ప్రజలు భయాందోళనలో ఉన్నారు, సంస్కృతి, నాగరికత రక్షింపబడతుందో లేదో అనే భయంతో ఉన్నారని చెప్పారు . సామరస్యం అంటే టూ-వే ట్రాఫిక్ అని చెప్పారు. ముస్లింలు శంకరి సంస్కృతి, సత్త్రియ సంస్కృతి రక్షణ గురించి మాట్లాడనివ్వండి.. అప్పుడే సామరస్యం ఉంటుందని నొక్కి చెప్పారు. పదేళ్ల క్రితం ముస్లీంలు మైనారిటీలు కాదు కానీ ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారని తెలిపారు. ఇతర వర్గాల్లో మెదులుతున్న భయాల్ని ముస్లీంలు పోగొట్టాలి. ఇక్కడ మరో కశ్మీర్ పునరావృతం కాదని మాకు భరోసా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. (చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్) -
కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!
భాగపట్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదేళ్ల పదవీ కాలం చివరి దశకు చేరడంతో ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారం కోసం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేస్తున్న ప్రయత్నాలు అంత తేలిగ్గా సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ విసురుతోంది. దానికితోడు ఇటీవలి రైతు ఉద్యమాలకు కేంద్రమైన పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, రాజకీయ పార్టీల ఎత్తులు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల వైభవాన్ని నిలుపుకోవాలన్న ఆ పార్టీ ఆశలను కులాల సమీకరణతో చిత్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఉర్రూతలూగుతోంది. జాట్లు, ముస్లింలు, రైతులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కులాలు, వర్గాల వారీగా ఓట్లు కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్ఎల్డీతో పొత్తు కుదుర్చుకొని జాట్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడంలో ఎస్పీ సఫలమైంది. జాట్లలో చీలిక తెచ్చి కూటమి వ్యూహాలను బద్ధలు కొట్టే ప్రణాళికలతో బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ముస్లిం–జాట్ల సోదరబంధం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరీ తాత, మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్‌సింగ్ ‘కిసాన్ నేత’గా కీర్తి గడించారు. ఆయన హయాం నుంచే ముస్లింలు జాట్లతో సత్సంసంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పీ– బీఎస్పీ పుట్టుకకు ముం దు పశ్చిమ యూపీ ముస్లింలు చరణం సింగ్ ఎవరికి మద్దతు ఇస్తే వారినే బలపరిచే వారు. అజిత్ సింగ్ కూడా వారిని కలుపుకుంటూ రాజకీయాలు సాగించారు. అయితే జాట్–ముస్లింల బంధాన్ని 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు దెబ్బ తీశాయి. అల్లర్ల అనంతరం రెండు వర్గాల మధ్య చీలక ఏర్పడి ముస్లింలు ఆర్ఎల్డీకి దూరమయ్యారు. ఈ కారణంగా ఆర్ఎల్డీ 2014, 2019 ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేదు. ‘మా రెండు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బ తీయడానికి జరిగిన కుట్ర అది. చిన్న ఘటనను ఆధారం చేసుకుని సాగిన హింసాకాండను ఏ రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకు వాడుకున్నదో అందరికీ తెలుసు’ అని భాగపట్లో ఎస్పీ తరపున చురుకుగా ప్రచారం చేస్తున్న రసూల్ అలీ ఖాన్ అన్నారు. ఇప్పటికీ అదే అల్లర్లను బూచీగా చూపి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నది అలీఖాన్ ఆరోపణ. జాట్–ముస్లిం–రైతులు కలిస్తే కనీసంగా 50 స్థానాలు గెలువచ్చన్న అంచనాతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీకి ఎస్పీ 33 సీట్లు కేటాయించింది. ఇందులో ఆర్ఎల్డీ 5 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. మిగతా స్థానాల్లో ఎస్పీ పోటీలో నిలవగా ఇందులో 8 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. అయితే సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. ముఖ్యంగా సర్ధన, హస్తినాపూర్ సీట్లను ఎస్పీకి అప్పగించడంపై ఆర్ఎల్డీ జాట్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముజఫర్‌నగర్ జిల్లాలోని 6 స్థానాలకు గానూ 4 స్థానాల్లో ముజఫర్‌నగర్ సదర్, మీరాపూర్, ఖటోలీ, పుర్కాజీ స్థానాల్లో ఆర్ఎల్డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలను బరిలోకి దింపింది. దీంతో ఆర్ఎల్డీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకు జాట్లు ఎటువైపు? పశ్చిమ యూపీలో పార్టీల గెలుపోటముల పాత్ర కీలకమైనది. గడచిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో జాట్లు మద్దతు ఇవ్వడంతో బీజేపీ సునాయసంగా విజయాలు దక్కించుకుంది. అయితే, రైతు ఉద్యమం నేపథ్యంలో జాట్లు బీజేపీకి వ్యతిరేకమయ్యారని,అది తమకు లాభిస్తుందని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విశ్వాసంతో ఉంది. ఎస్పీకి ఓట్ల బదిలీ అంత సులభం కాదని దాద్రి, భాగ్‌పట్, మీరట్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల పరిశీలనలో వెల్లడైంది. ఎస్పీ అధికారంలోకి వస్తే జయంత్ సింగ్ చౌధురి పాత్ర నామమాత్రమే అవుతుందంటూ బీజేపీ కేడర్ జాట్లకు నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే గుర్తు చేస్తోంది.‘జయంత్ చౌధురి పార్టీ పోటీ చేసే స్థానాల్లో మా మద్దతు ఉంటుంది. కానీ,అఖిలేశ్ పై మాకు పూర్తి నమ్మకం లేదు’ అని దాద్రి ప్రాంతానికి చెందిన రైతు కిషన్‌సింగ్ చౌదరి అన్నారు. ఆ ఎత్తుగడ.. రెండువైపులా పదునున్న కత్తి! ముస్లిం ఓట్లు కీలకమైన ముజఫర్‌నగర్ డివిజన్ లో ఎస్పీ ఒక్క ముస్లింను కూడా బరిలోకి దింపలేదు. ముస్లిం ఓట్లు ఎటూ తమకే దక్కుతాయన్న అంచనాతో హిందూ ఓట్ల చీలిక కోసం ఈ వ్యూ హం పన్నింది. ఇది సీట్లు ఆశించిన ముస్లిం నేతల అసంతృప్తికి కారణమైంది. మరోవైపు ఇదే అదునుగా మాయావతి ఏకంగా 17 మంది ముస్లింలను బరిలోకి దించింది. దాంతో బీజేపీని ఎదుర్కొనేందుకు గంపగుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలనుకున్న ముస్లింల మధ్య అయోమయం నెలకొంది. ‘మేము ఈ ఎన్నికలలో ఎస్పీకి మద్దతు ఇ వ్వాలనే భావించాం. కానీ ఎస్పీ మా మనోభావాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మాకింకా స్పష్టత రాలేదు’ ముజఫర్‌నగర్ వాసి ఫరీద్ అన్నారు. ఇతరులను దువ్వేద్దాం! ఇక పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతంగా ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు ఇవ్వని బీజేపీ 76 స్థానాల్లో 66 స్థానాలనుగెలిచింది. కేవలం తనకున్న హిందుత్వ బలం, సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ ప్రస్తుతం జాట్ల చీలికపై దృష్టి పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ జ్ఞాపకార్థం ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్ అటు రైతు నేతలు, ఇటు జాట్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎస్పీ–ఆర్ఎల్డీ పొత్తుల నేపథ్యంలో జాట్ వర్గం గంపగుత్తగా అఖిలేశ్ అండ్ కో వైపునకు వెళ్లకుండా జాట్ నేతలతో కేంద్ర హోమంత్రి అమిత్ షా జనవరి 26న కీలక సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌సింగ్ వర్మ ఇంట్లో 200 మంది పశ్చిమ యూపీకి చెందిన జాట్ నేతలతో నిర్వహించిన భేటీకి హాజరైన అమిత్ షా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్ఎల్డీ పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, అవసరమైతే ఎన్నికల తరువాత పొత్తుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ప్లాన్–బి కింద బీజేపీ పశ్చిమ యూపీలో అధికంగా ఉండే షైనీలు, పాల్లు, కశ్యప్‌లు, ప్రజాపతిల ఓట్లను అభివృధ్ధి మంత్రంతో ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ‘జాట్లు మాత్రమే కాదు. ఇంకా మావి చాలా కులాలు ఉన్నాయి. మేను కూడా గెలుపోటములు నిర్ణయించగలము’అని భాగ్‌పట్ మార్కెట్లో టీ దుకాణం నడుపుతున్న శంకర్ లాల్ అన్నారు. -
మిలటరీ బేస్ వద్ద తిరుగుబాటు జరిగిందంటూ వదంతులు!!
Africa: ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశ రాజధాని దగ్గరలోని మిలటరీ బేస్ వద్ద ఆదివారం భారీ కాల్పులు జరిగాయి. దీంతో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ తిరుగుబాటు జరిగిందన్న పుకార్లు వ్యాపించాయి. ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ముస్లిం తిరుగుబాట్లను ప్రభుత్వం సరిగా అణిచివేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఆర్మీ తిరుగుబాటు ఏమీ జరగలేదని, అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేను ఎవరూ నిర్భంధించలేదని రక్షణ మంత్రి సింపురె ప్రకటించారు. సైనికుల్లో అభిప్రాయభేదాలు ముదిరి కాల్పులు జరుపుకున్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆర్మీలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆందోళన చేస్తున్న సైనికులు మీడియాకు ఫోన్ చేశారు. తమకు సరైన పనిచేసే పరిస్థితులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశంలో మిలటరీ, ఇంటెలిజెన్స్‌ల్లో వంశపారంపర్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆందోళనలు పెరుగుతున్న సందర్భంగా ఇటీవలే దేశ ప్రధానిని అధ్యక్షుడు తొలగించారు. (చదవండి: భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత! -
తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సలీమా రాష్ట్రంలోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా రికార్డులకెక్కారు. కేంద్రం మంగళవారం విడుదల చేసిన నాన్ కేడర్ ఐపీఎస్‌ల పదోన్నతి జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన లాల్ బహదూర్, యాకూబీ దంపతుల కూతురు సలీమా. తండ్రి ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు. సలీమా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు. 2007లో గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్ పొందిన ఆమె అంబర్‌పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అదనపు కమిషనర్(అడ్మిన్)గా పనిచేసి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్నారు. కుటుంబమంతా విద్యావంతులే.. సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు. ఒక సోదరి జరీనా ఇటీవల ఏపీలో గ్రూప్–1 పరీక్ష రాసి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే ఆమె కూడా ప్రభుత్వ సర్వీసుకు ఎంపికవుతారు. మరో చెల్లెలు మున్నీ ఖైరతాబాద్ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిం హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో డాక్టర్‌గా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. -
వక్ఫ్ భూములు ఉఫ్..తొలుత లీజుకు ఇచ్చి.. ఆపై కబ్జా
వితరణ శీలురైన కొందరు ముస్లిం సంపన్నులు తమ స్థిరాస్థిలో కొంత భాగాన్ని, లేదా మొత్తం ఆస్తిని ‘అల్లా’ పేరున రాశారు. ఈ ప్రక్రియను ఇస్లాం సంప్రదాయంలో వక్ఫ్ చేయడం అంటారు. ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తిని తిరిగి తీసుకోవడం కుదరదు. అమ్మడమూ కుదరదు. దాత సంతతికి చెందిన వారికి కూడా దాని మీద ఎలాంటి హక్కులు వుండవు. ఇలాంటి భూముల్ని గత సర్కారు పెద్దలు అయిన వారికి యథేచ్ఛగా కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆసూర్ ఖానాకు చెందిన రెవెన్యూ సర్వే నంబరు 287–1లో 11.34 ఎకరాలు, సర్వే నంబరు 287–5లో 2.6 ఎకరాలు.. మొత్తం 13.94 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ భూమి విలువ రూ.130 కోట్ల పైమాటే. ఈ అక్రమాన్ని అధికారికంగా సక్రమం చేయాలని గత టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్వే నంబర్ 201, 202, 203లో ఖాజీ (ముస్లింల వివాహాలు చేసే గురువు) సర్వీసు కోసం కేటాయించిన మాన్యం భూమి 39.16 ఎకరాలు టీడీపీ దన్నుతో ఏడుగురు బినామీలు చేజిక్కించుకున్నారు. విజయవాడ భవానీపురంలో కోట్లాది రూపాయల విలువైన దర్గా మాన్యం 40 ఎకరాల భూమిని మార్బుల్ స్టోన్ వ్యాపారులకు నామమాత్రపు లీజుకు ఇచ్చేశారు. కొండపల్లి శాంతినగర్ సర్వే నంబర్ 212ఎ, 212బిలో 18.30 ఎకరాలు, 293/1లో 18 సెంట్లు, ఇబ్రహీంపట్నంలో సర్వే నంబర్ 240లో 26 ఎకరాల ఖాజీ మాన్యం ఆక్రమణల పాలైంది. ఆ భూముల్లో భారీ భవంతులు నిర్మించారు. ఇలా వెయ్యి కాదు.. పది వేలు కాదు.. ఏకంగా 31,584 ఎకరాల వక్ఫ్ (ధార్మిక దానం ఇచ్చినవి) భూములు అక్రమార్కుల వశమయ్యాయి. దీంతో దాతల లక్ష్యం, ఔదార్యం నీరుగారిపోతోంది. అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. బాబు జమానాలో అక్రమాలకు ఊతం ► చంద్రబాబు పాలించిన రోజుల్లో వక్ఫ్ భూముల్లో అక్రమాలకు ఊతమిచ్చారని ముస్లిం సమాజం ఆవేదన చెందుతోంది. విశాఖపట్నంలో హజ్రత్ ఇషాక్ రహనతుల్లాలై దర్గాకు చెందిన 3,500 ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టింది చంద్రబాబే. ► వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి గత ప్రభుత్వం అధికారిక ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడంతో న్యాయపరమైన వివాదాలు రేగాయి. నిరర్థక ఆస్తుల పేరుతో టీడీపీ అనుయాయులకు, బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ► కాజా భూముల వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. 2018 నవంబర్ 13న అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో వారికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని నిరర్థక ఆస్తిగా చూపిస్తూ తీర్మానం చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమణల చెర నుంచి విడిపించడం మానేసి, అన్యాక్రాంతం పేరుతో అయినకాడికి తెగనమ్మి సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దలు ఆడిన ఆటలో పావులుగా మారిన ముగ్గురు సీఈవోలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ వేటుకు గురయ్యారు. ► కాజా భూముల వ్యవహారంలో ఫైల్ నంబర్ ఎస్ /19/జిఎన్టీ/2018 లేఖ ద్వారా 2017 డిసెంబర్ 3న సచివాలయానికి అనుకూల తీర్మానం చేసి పంపగానే సీఈవో ఎండీ సుభానీని 2018 జనవరిలో అక్కడి నుండి బదిలీ చేశారు. మరో సీఈవోను నియమించుకుని అనుకూల పనులు చేయించుకున్న గత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను కూడా బదిలీ చేసింది. 2018 ఫిబ్రవరిలో షేక్ అహ్మద్‌ను కొత్త సీఈవోగా నియమించారు. వాటికే వక్ఫ్ ఆస్తుల వినియోగం ► స్థిరాస్తుల్ని పరిరక్షిస్తూ ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమాలకు, ముస్లిం సమాజంలోని నిరుపేదల సంక్షేమానికి ఆ భూములను వినియోగించాలనేది వక్ఫ్ లక్ష్యం. మసీదు, ఆషూర్ ఖానా, దర్గా, ముషాఫిర్ ఖానా, ఖాజీ, అంజుమన్, మొహర్రం నిర్వహణ వ్యయం కోసం ఈ భూములు ఉపయోగపడాలన్నది దాతల మహోన్నత ఆశయం. ► ఈ రకంగా మన దేశంలో దాదాపు 3 లక్షల ముస్లిం ధార్మిక సంస్థలు తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంస్థలు వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేయడం విశేషం. చట్టాన్ని ఆసరా చేసుకుని అక్రమాలు ► వాస్తవానికి వక్ఫ్ చట్టం–1995 (సెంట్రల్ యాక్ట్) ప్రకారం వక్ఫ్ ఆస్తుల క్రయ విక్రయాలు, అన్యాక్రాంతం, అసలు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వినియోగం కుదరదు. కానీ అదే చట్టంలోని సెక్షన్–97ను ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వం అనేక ప్రాంతాల్లోని వాటిని నిరర్థక ఆస్తులుగా చూపి చేతులు మారేలా వెసులుబాటు కల్పించడంతో న్యాయ వివాదాలు రేగాయి. ► వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం తగదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు సైతం అనేక తీర్పులు చెప్పినప్పటికీ ఆ ఆస్తులను కాపాడేందుకు గత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. రానురాను ముస్లిం సమాజపు నిస్సహాయత, గతంలో వక్ఫ్ బోర్డు బాధ్యుల అవినీతి తదితర కారణాలతో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కాజా వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2018లో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీకి అప్పటి వక్ఫ్ సీఈవో ఇచ్చిన నివేదిక ముందు లీజు.. ఆపై కైంకర్యం.. ► దాతలు ఇచ్చిన విలువైన భూములను ధర్మకర్తల(ముతవల్లీ)కు, ఖాజాలు తదితర ముస్లిం సమాజానికి చెందిన వారి బతుకుదెరువు కోసం కేవలం 11 నెలల లీజుకు ఇస్తారు. అయితే అక్రమార్కులు వక్ఫ్ బోర్డులో ఉన్న వెసులుబాటును సాకుగా తీసుకుని మూడేళ్లపాటు లీజు ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నారు. ► తొలుత ముస్లింలతోనే ఆక్రమణ చేయించి, ఆపై బయటి వ్యక్తుల చేతిలోకి ఆ ఆస్తి వెళ్లేలా చక్రం తిప్పారు. ఇంకో విధంగా.. లీజు పేరుతో ముందుగా విలువైన భూములను ఆక్రమించి ఆపై కైంకర్యం చేసేసుకున్నారు. ► ఎవరైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే చట్టంలో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకుని న్యాయ పరమైన వివాదాలు సృష్టిస్తూ ఏళ్ల తరబడి ఆస్తులను అనుభవిస్తున్నారు. కృష్ణా జిల్లా నిడమానూరులో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2019లో అప్పటి కలెక్టర్ ఇంతియాజ్ వక్ఫ్ సీఈవోకు ఇచ్చిన నివేదిక వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 502 వక్ఫ్ సంస్థలకు చెందిన 65,783 ఎకరాల్లో గతంలో 31,584 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుల పరి«ధిలోని ఆస్తుల రక్షణకు, ముస్లింలకు కొత్త శ్మశానాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వక్ఫ్ ఆస్తుల వివాదాలపై తక్షణ చర్యలు తీసుకునేలా ఏపీలో త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. – అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ముస్లిం దాతల స్ఫూర్తి నిలపాలి ముస్లిం సమాజం కోసం విలువైన భూములను త్యాగం చేసిన దాతల స్ఫూర్తిని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల పరరిక్షణ కోసం లీజు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. వీటిపై క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, అన్యాక్రాంతమైన వాటిని పరక్షించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల చెర నుంచి వాటిని కాపాడాలి. ముస్లిం సమాజానికి ఆ ఆస్తులు ఉపయోగపడేలా చట్టపరమైన చర్యలు త్వరగా తీసుకోవాలి. – మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ -
కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు
సాక్షి, బాన్సువాడ: గంగాజమునా తెహజీబ్ తెలంగాణది. పాలునీళ్లలా కలిసిపోయే సంస్కృతి ఈ ప్రాంతం సొంతం. అది మరోసారి రుజువయ్యిందీ పెళ్లితో. దత్తత తీసుకున్న హిందూ యువతికి.. హిందూ సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి కన్యాదానం చేశారీ ముస్లిం దంపతులు. బాన్సువాడలో ఆదివారం జరిగిన ఈ వివాహంలో మరో విశేషం కూడా ఉంది. అది కులాంతరం కావడం. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం బాన్సువాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఇర్ఫానా బాను, పదేళ్లకిందట జిల్లాలోని తాడ్వాయి గురుకుల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఓ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చందన అనే బాలికను ఆమె బంధువులు గురుకులంలో చేర్పించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న ఇర్ఫానాబాను, అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నా.. చందనను దత్తత తీసుకున్నారు. గురుకులంలో చదువుతున్న చందనను సెలవుల్లో తన ఇంటికే తీసుకెళ్లేవారు. ఆమె ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో డీఎంఎల్టీ (ల్యాబ్ టెక్నీషియన్) కోర్సు చేయించారు. అది కూడా పూర్తి కావడంతో.. పెళ్లి విషయాన్ని ఇతర టీచర్లతో పంచుకున్నారు. చదవండి: ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు అలా ఓ టీచర్ నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వెంకట్రాంరెడ్డితో సంబంధం కుదిర్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న పెళ్లి కాబట్టి.. ఇర్ఫానాబాను భర్త షేక్ అహ్మద్‌తో కలిసి వరుడి కాళ్లు కడిగారు. అన్ని లాంఛనాలతో ఘనంగా పెండ్లి చేశారు. కట్నం, ఇతర పెట్టిపోతలకు ఇర్ఫానా బానుతో పాటు గురుకులంలోని కొందరు టీచర్లు సహకారం అందించారు. అలాగే వివాహం, భోజన ఖర్చులకు పట్టణానికి చెందిన సాయిబాబా గుప్త స్వచ్ఛంద సాయం చేశారు. ఇర్ఫానాబాను ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు విచ్చేసి ఆశీర్వదించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాతబాలకృష్ణ, కౌన్సిలర్ నార్ల నందకిషోర్, మహ్మద్ ఎజాస్తో ఇతరులు తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. నాకు మూడో బిడ్డ చందన చందనను ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు దత్తత తీసుకున్నాను. డీఎంఎల్‌టి వరకు చదివించి పెళ్ళి చేస్తున్నాను. మా సిబ్బంది, ఇతర పెద్దల సహకారంతోనే నేడు పెళ్ళి జరుగుతోంది. మానవత్వానికి మతం అడ్డుకాదు. నాకు ఇద్దరు కూతుర్లు. చందన నా మూడో కూతురు. – ఇర్ఫానాబాను, ప్రిన్సిపాల్, గురుకులం, బోర్లం -
సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం -
ముస్లింలకూ లబ్ధి చేకూర్చండి
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు తరహాలో పేద ముస్లిం కుటుంబాలకు కూడా నగదు బదిలీ లబ్ధి చేకూర్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ‘తెలంగాణలో ముస్లిం‘లు అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం మొత్తం మీద 8.8 లక్షల ముస్లిం కుటుంబాలు ఉండగా, అందులో రెండు శాతం మంది అత్యంత దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో కనీసం ఒక శాతం కుటుంబాలకైనా దళిత బంధు తరహా పథకం వర్తింపజేయాలని కోరారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందిస్తే రూ.900 కోట్లు దాటదని, బడ్జెట్లో సైతం 0.8 శాతం మించదని చెప్పారు. ఒకే విడతగా సాధ్యం కాని పక్షంలో రెండు విడతలుగా నగదు బదిలీ చేయవచ్చని సూచించారు. అసెంబ్లీలో సీఎంను కోరతాం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పథకం చర్చకు వచ్చినప్పుడు పేద ముస్లిం వర్గాలకు కూడా ఆర్థిక చేయూత అమలు కోసం సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని అసదుద్దీన్ చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాలతో పాటు ముస్లిం కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై సుధీర్ కమిషన్ సమర్పించిన నివేదిక సైతం దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారని పేర్కొందని గుర్తుచేశారు. ముస్లిం వర్గాలు అక్షరాస్యతలో సైతం వెనుకబడ్డారని, పై తరగతులకు వెళ్తున్న కొద్దీ డ్రాప్ అవుట్ శాతం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం మించి ముస్లింలు లేరని, భూములు కలిగిన వారు 9 శాతం మాత్రమే ఉన్నారని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్చా వేదికలో ముస్లిం ఆర్థిక సామాజిక స్థితిగతుల విచారణ కమిషన్ చైర్మన్ జి.సుధీర్, ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ తదితరులు పాల్కొన్నారు. -
యూపీలో పోటీ చేసి వాటా సాధిస్తాం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముస్లిం వాటాను సాధించడమే లక్ష్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ముస్లింలకు నామమాత్రపు ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకోవడం లేదన్నారు. ‘రాష్ట్ర రాజకీయాల్లో మా వంతు కావాలని అడుగుతున్నాం. దానిని మేం పొందుతాం’ అని చెప్పారు. ఏఐఎంఐఎం మతాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన స్పందిస్తూ..‘ఇది నిజం కాదు. మతాన్ని రాజకీయ లాభం కోసం నేనెన్నడూ వాడలేదు. వాడను. అలా చేసినట్లయితే, ఎన్నికల సంఘం, ఎన్నికల నియామావళి ఉన్నాయి కదా..’ అని తెలిపారు. ‘రాజకీయాల్లో మా వాటా కోరుతుండటం వారికి సమస్యగా మారింది. మేం ఎప్పుడూ భయపడుతూ బానిసల్లాగా ఉండాలని వారనుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
Eid al-Adha: మనోవాంఛల త్యాగోత్సవం బక్రీద్
హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం... ప్రపంచ విశ్వాసుల పర్వదినం బక్రీద్. జిల్ హజ్ మాసం పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియారూపంలో దైవధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అని ఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ అందరి విశ్వాసం ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. పరోపకారమే పండుగ సందేశం ఈ పర్వదినం మనకిచ్చే సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ మనకిచ్చే సందేశం. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహ పర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థయిర్యాలు కనబరిచారో ఇతరులు కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఖుర్బానీలు ఇచ్చుకోవడం, నమాజులు చేయడం, ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరించడం ఒక్కటే కాదు... మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ త్యాగాలను స్మరించుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాట వలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్థిద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు. విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2021 -
గోవుకు ముస్లింల అంతిమ సంస్కారాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలో ఓ గోమాతకు ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండల కో–ఆప్షన్ సభ్యుడు షాహెద్‌పాషా ఆరేళ్ల క్రితం దేవుడి పేరుతో ఓ ఆవును వదిలి పెట్టారు. ఆ గోవు ఆదివారం మరణించింది. ఈ విషయం తెలిసిన షాహెద్‌పాషా కుటుంబ సభ్యులు ముస్లిం యువకులతో కలిసి గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు. -
బిహార్ : తొలిసారి డీఎస్పీగా ముస్లిం యువతి
పట్నా: బిహార్ రాష్ట్రం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనుకబడి ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, కొన్ని ముస్లిం కుటుంబాలలో మహిళల విద్యపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్1 సర్వీస్‌లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తానా అనే యువతి చరిత్రను సృష్టించింది. ఆమె తాజాగా, ప్రకటించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికైంది. అయితే, బిహార్ రాష్ట్రంలో, ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్‌ను సాధించిన తొలి యువతి కూడా రజియానే. దీంతో ఇప్పుడిమే వార్తల్లో నిలిచింది. కాగా, రజియాతో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. రజియా తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అన్సారీకి 7 గురు సంతానం. వీరిలో రజియా అందరికన్నావయసులో చిన్నది. ఆమెకు ఒక అన్నయ్య .. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్‌ను జోధ్‌పూర్‌లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైన ప్రభుత్వ సర్వీస్ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్‌ను ప్రారంభించింది. ఉద్యోగం చేస్తునే మిగతా సమయంలో ప్రిపరేషన్ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మానాన్న గారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయను కలను, నా ఆశయాన్ని పూర్తిచేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాలలో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికే తాను, కోవిడ్ బారిన పడి కోలుకున్నానని చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. చదవండి: Shocking: స్టోర్‌లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ.. -
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్: డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగపై రూయత్ హిలాల్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు. -
ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, కేంద్ర పాలకులు మాత్రం హేట్‌బ్యాంకుగా చూస్తున్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఆరోపించారు. ‘ఇది మారాలి.. మీరు మార్చాలి. రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్ధం. మనం చేయి చేయి కలిపితే మళ్లీ రాజన్న సంక్షేమ పాలన సాధ్యమని నేను గట్టిగా నమ్ముతున్నాను’అని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం నేతలతో సోమవారం లోటస్‌పాండ్‌లో షర్మిల సమావేశమయ్యారు. ‘నేను వైఎస్సార్ కూతురిని. మీ అందరి కూతురిని. వైఎస్సార్‌కు ముస్లింలు అంటే ప్రత్యేకమైన అభిమానం. 4 శాతం రిజర్వేషన్లతో ముస్లింలు అనేక ఉద్యోగాలు సాధించుకున్నారు. ప్రీ మెట్రిక్, పోస్టుమెట్రి క్ స్కాలర్షిప్ ఇచ్చారు’అని వివరించారు. వక్ఫ్‌బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వాటిని వైఎస్సార్ వెనక్కి తెచ్చారని షర్మిల పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, డ్రైనేజీ సమస్య లేకుండా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రగతిలో ముస్లింల పాత్రను మరవలేమని, వారులేని తెలంగాణ సమాజాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ముస్లింల బతుకులేమైనా మారాయా అని పశ్నించారు. -
ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్ షర్మిల
-
‘అపోహలు ఉంటే పాకిస్తాన్లో వ్యాక్సిన్ వేయించుకోండి’
మీరట్: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దమవుతున్న తరుణంలో పలు ముస్లిం సంస్థల ఆందోళనల నేపధ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌లో పంది కొవ్వు ఉందనే దానిపై కొన్ని ముస్లిం సంస్థలు చేస్తున్న ఆందోళనలపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. భారత దేశాన్ని విశ్వసించకపోతే, ఆందోళలను చేసే వారు పాకిస్తాన్‌కు వెళ్ళవచ్చని అన్నారు. త్వరితగతిన టీకాను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచ దేశాలన్నీ భారతను అభినందిస్తుంటే, భారత్‌లోనే నివసించే ముస్లిం సంస్థలు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం విచారకరమని సోమ్ పేర్కొన్నారు. భారత్‌లో తయారయ్యే వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు ప్రపంచ దేశాలన్నీ సన్నద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంకా ఎవరికైనా వ్యాక్సిన్‌పై అపోహలుంటే వారు పాక్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ను వేయించుకోచ్చని సలహా ఇచ్చారు. కాగా, భారత్‌లో తయారయ్యే వ్యాక్సిన్‌లో పంది కొవ్వు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. -
అప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని
‘లెడ్ బై’ భారతీయ ఇస్లాం మహిళల సాధికారత కోసం ఏర్పాటైన వేదిక. సంప్రదాయాల ముసుగు మాటున అణగారిపోతున్న మహిళల మేధకు పదును పెట్టి సాధికారత దిశగా అడుగులు వేయిస్తోంది డాక్టర్ రుహా షాబాద్. ముప్పై ఏళ్ల రుహా షాబాద్ పుట్టింది మనదేశంలోనే. పెరిగింది మాత్రం సౌదీ అరేబియాలో. మహిళలకు శిక్షణనివ్వడానికి, అభివృద్ధి వైపు నడిపించడానికి గత ఏడాది ‘లెడ్ బై’ సంస్థను స్థాపించిందామె. ఆలోచించాల్సిన విషయం జీవితంలో తాను అనుకున్నది సాధించిన మహిళ డాక్టర్ రుహ. కొన్నేళ్లపాటు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రజావైద్య విభాగంలో పని చేయాలనే ఉద్దేశంతో క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్, నీతి ఆయోగ్‌లో పని చేసింది. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది. ఆమెలో రేకెత్తిన ఆలోచనలకు కార్యరూపమే లెడ్‌బై సంస్థ. తనలో ఈ ఆలోచనలు రూపుదిద్దుకోవడానికి దారి తీసిన అనేక సంఘటనలను గుర్తు చేసుకున్నారామె. ‘‘చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని. కోట్లాది ముస్లిం కుటుంబాలు ఉండగా, ఒక్క ముస్లిం మహిళ కూడా నాకు చదువులో, ఉద్యోగంలో తారసపడలేదెందుకని, వారంతా ఏం చేస్తున్నారు... అని కూడా అనిపించేది. అలాగే డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేను గమనించిన విషయం ఒకటుంది. నా దగ్గరకు వైద్యం కోసం వచ్చిన ముస్లిం యువతుల్లో చాలా మందికి చిన్న వయసులోనే ఎంతోమంది పిల్లలుండేవాళ్లు. ఇది తప్పని కానీ, ఒప్పని కానీ చెప్పలేను. ఇది ఆలోచించాల్సిన విషయం అని మాత్రం అనిపించింది. మహిళలకు ఆలోచించే అవకాశం కల్పించాలి. వారి ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగిన వేదిక కల్పించాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచనలకు హార్వర్డ్‌లో ఉన్నప్పుడు ఒక రూపు వచ్చింది. లెడ్‌బై సంస్థను స్థాపించాను. మహిళలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించడంతోపాటు వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోదిగొల్పడానికి వర్క్ షాపులు నిర్వహిస్తున్నాను. అడ్వైజరీ ఫ్రేమ్‌వర్క్‌తోపాటు పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాను. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన 24 మందితో నాలుగు నెలల తొలి విడత కోర్సు పూర్తయింది. కోవిడ్ కారణంగా సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోనే పూర్తి చేయాల్సి వచ్చింది. భారతీయ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ లెడ్‌బై సంస్థను ఆన్లైన్లో సంప్రదించవచ్చు. ఇండియాలో ఇలాంటి ప్రయత్నం ఇంతకు మునుపు జరగలేదు, ఇదే తొలి ప్రయత్నం’’ అని చెప్పింది డాక్టర్ రుహా షాదాబ్. -
నన్ను కొనే మనిషి ఇంకా పుట్టలేదు: ఒవైసీ
కోల్‌కతా: ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ హైదరాబాద్ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ ఎంఐఎంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండి పడ్డారు. డబ్బుతో అసద్‌ని కొనే మనిషి ఇంకా పుట్టలేదని స్పష్టం చేశారు. అంతేకాక ముస్లిం ఓట్లు మమత జాగిరు, ఆస్తులు కాదని మండిపడ్డారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘డబ్బుతో నన్ను కొనే మనిషి ఇంతవరకు పుట్టలేదు. ఆమె(మమతా బెనర్జీ) ఆరోపణలు అవాస్తవాలు. ఆమె ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆమె పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారు. బిహార్ ఓటర్లును, మాకు ఓటు వేసిన ప్రజలను ఆమె అవమానించారు. గతంలో పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఓటు కట్టర్లు అని ఆరోపిస్తే.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు పెట్టుకొండి. ముస్లిం ఓట్లు ఏమైనా మీ జాగీరా’ అంటూ ఒవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. (చదవండి: మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) "ఇప్పటివరకు మీరు మీకు విధేయులైన మీర్ జాఫర్స్, సాదిక్లతో మాత్రమే వ్యవహరించారు. తమ గురించి ఆలోచించే, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు. బిహార్‌లోని మా ఓటర్లను మీరు అవమానించారు. ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు'' అని తృణమూల్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. వచ్చే ఏడాది బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో కూడా ఎంఐంఎం పోటీ చేయాలని భావిస్తోన్నట్లు సమాచారం. -
రోజుకు 15 గంటల పని.. లైంగిక వేధింపులు
సాక్షి, ఛార్మినార్: ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది అమాయక ముస్లిం మహిళలు ఏజెంట్ల చేతుల్లో మోసానికి గురవుతున్నారు. పాతబస్తీలోని మురికివాడలకు చెందిన కొంత మంది మహిళా ముస్లింలు జీవనోపాధి కోసం దుబాయ్ తదితర అరబ్బు దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ల వలలో చిక్కుకుని పడరాని పాట్లు పడుతున్నారు. అమాయక మహిళలకు ఏజెంట్లు వారికి మాయమాటలు చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపుతున్నారు. అక్కడ వారు నరకయాతన పడుతున్నారు. తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు వస్తామంటూ వేడుకుంటున్నారు. చదవండి: మోజు తీరగానే ఫోన్లో తలాక్.. శాలిబండ, కిషన్‌బాగ్, బేగంపేట్లకు చెందిన 8 మంది బాధితుల కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ సహకారంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు రాతపూర్వకంగా వినతి పత్రం పంపించారు. ఎనిమిది మంది మహిళలను దుబాయ్‌కు పంపించిన ఏజెంట్ షఫీని టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతోందంటే... ► ఏజెంట్స్ ఇక్కడ చెప్పేదొకటి...అక్కడికి తీసుకెళ్లిన తర్వాత చేసేదొకటి. ► మంచి ఉద్యోగం..సరిపడా జీతం అని చెప్పే ఇక్కడి ఏజెంట్లు..అక్కడికి వెళ్లిన అనంతరం యుఏఈలోని కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు అప్పజెబుతున్నారు. ► దీంతో అమాయక ముస్లింలు తమకు సంబంధం లేని పనులు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► మూడు నెలల విజిటింగ్ వీసాపై వీరిని దుబాయ్‌కు తరలిస్తున్న ఏజెంట్లు అనంతరం కనుమరుగవుతున్నారు. ► దుబాయ్‌లో రిక్రూట్ చేసుకుంటున్న ఏజెన్సీలు అక్కడి డబ్బున్న ఇళ్లల్లో పాచిపని చేయడానికి వీరిని అప్పజెబుతున్నారు. ► వీరిపై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ► ఇంటి యజమానులు వీరిపై కనికరం లేకుండా అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారని బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. వారు పెట్టే నరక యాతనను భరించ లేక తిరిగి నగరానికి రావడానికి సిద్ధపడుతున్నారు. ► ఈ విషయాన్ని సంబందిత ఏజెంట్లకు తెలియజేస్తే...లక్షల్లో డబ్బులు చెల్లించాలంటూ మొండికే స్తున్నారు. అసలేం జరిగిందంటే.. ► కిషన్‌బాగ్‌కు చెందిన యాస్మిన్ బేగం, అమ్రీన్ బేగం, శాలిబండకు చెందిన రహీమాబేగం, బేగంపేట్‌కు చెందిన కనీజ్ ఫాతిమా, నజియాబేగంలతో పాటు మెహెరున్సీసా బేగం, అస్మా బేగం, జరీనా బేగం అనే 8 మంది ముస్లిం మహిళలు షఫీ అనే ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లారు. ► పాతబస్తీ మిశ్రీగంజ్‌కు చెందిన షఫీ అనే ఏజెంట్ వీరికి డబ్బు ఆశ చూపి మాయమాటలు చెప్పి సెపె్టంబర్–అక్టోబర్ మాసాల్లో దుబయ్‌కు తీసుకెళ్లాడు. ► మూడు నెలల విజిటింగ్ వీసాపై తరలించిన షఫీ అక్కడి లేబర్ రిక్రూట్మెంట్ అల్ సఫీర్ అనే రిక్రూట్ సంస్థకు అప్పగించాడు. ► అక్కడి రిక్రూట్ సంస్థ వీరిని ఒక్కొక్కరిని రూ.2 లక్షలకు అరబ్ కుటుంబాలకు అప్పగించింది. అక్కడి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి. ► రోజుకు 15 గంటలు పని చేయించుకునే వారు కొందరైతే..శారీక వేధింపులకు గురిచేసే వారు కొందరు. ► దీంతో విసిగి పోయిన బాధితురాళ్లు ఇక్కడి నగరంలోని తమ కుటుంబ సభ్యులకు వాట్స్ యాప్ కాల్స్ ద్వారా బోరుమన్నారు. అక్కడ తమ వారు పడుతున్న బాధలను భరించలేని ఇక్కడి వారి కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ సహకారంతో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసారు. ► సాధ్యమైనంత వెంటనే తమ వారిని భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఆ నేతల వ్యాఖ్యలు అవివేకం..
సాక్షి, కృష్ణా జిల్లా: నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనలో టీడీపీ రాజకీయం చేయడం మానుకోవాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదం పాడులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గత నెల 3న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరిగిన నెల రోజుల్లో సలాం కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారా ? ఇదే నా ఆయనకు ముస్లింల పై ఉన్న చిత్తశుద్ధి’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. (చదవండి: రాజకీయం చేసేందుకేనా అసెంబ్లీ..?) సలాం కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని, బాధ్యులపై కేసులు కూడా పోలీసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గుంటూరు పోలీస్‌స్టేషన్ ఘటన, నారా హమారా టీడీపీ హమారా సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టారు. అప్పుడు టీడీపీ నేతలకు ముస్లింలు గుర్తులేదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను చంద్రబాబు వాడుకుంటున్నారని సయ్యద్ నూరుద్దీన్ దుయ్యబట్టారు.(చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక) -
బాబుపై భగ్గుమన్న ముస్లింలు
సాక్షి, కదిరి/హిందూపురం: ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వయసు, హోదా, అనుభవాన్ని మరచి అసెంబ్లీలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను అసభ్య పదజాలంతో దూషించడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమన్నారు. రాజకీయాల్లో తానొక అపరమేధావినంటూ గొప్పలు చెప్పుకునే నేత చేసిన ఈ వ్యాఖ్యలు అందరూ అసహ్యించుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. ముస్లింలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కదిరిలోని అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో చేశారు. అధికారం కోల్పోయాక చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ముందు నుంచీ ముస్లింలపై చిన్నచూపే చంద్రబాబుకు ముందు నుంచీ ముస్లిం మైనార్టీలంటే చిన్నచూపని నాయకులు మండిపడ్డారు. తన మంత్రివర్గంలో నాలుగున్నరేళ్లు ముస్లింలకు స్థానం కల్పించకుండా, చివర్లో కొన్ని నెలలు ముస్లింలకు చోటిచ్చాడని గుర్తు చేశారు. గెలవగలిగే అసెంబ్లీ స్థానాలను ఏనాడూ ముస్లింలకు కేటాయించలేదన్నారు. హఫీజ్ఖాన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పకపోతే స్థానిక ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తామని హెచ్చరించారు. చదవండి: (ఏమనాలి వీణ్ణి .. ఇంగిత జ్ఞానం ఉందా?) వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాం ముస్లిం మైనార్టీలకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆ కుటుంబానికి ముస్లింలు ఎప్పుడూ రుణపడి ఉంటారని వారు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ముస్లింల పక్షపాతిగా ఉన్నారని, ముస్లింలకు టికెట్ ఇవ్వడమే కాకుండా వారందరినీ గెలిపించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బాహవుద్దీన్, మైనార్టీ నాయకులు వేముల ఫయాజ్, జిలాన్, ఖలీల్, అన్సర్, నౌషాద్, ఫారూక్, ఎహసాన్, వలి, సాదిక్, అమీర్, ఖలందర్, నాసీర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి చట్టసభలో మైనార్టీ ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని హిందూపురం ముస్లిం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మైనార్టీ నాయకులు మాజీ ముతవల్లి కలీం, ఇర్షాద్ అహ్మద్, ఇందాద్, కట్ల బాషా మాట్లాడుతూ చంద్రబాబుకు మైనార్టీ, ఎస్సీ, బీసీ కులాలంటే గిట్టదని, ఇప్పటికే పలుమార్లు ఆయా సామాజిక వర్గాల వారిని దూషించడం, బెదిరించడం చేశారన్నారు. తన సొంత సామాజికవర్గం తప్ప మిగిలిన కులాల గురించి ఆయనకు పట్టదన్నారు. మైనార్టీలు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న 23 సీట్లు కాస్తా నాలుగుకు పడిపోయేలా చేస్తామన్నారు. మీలా వెన్నుపోటు రాజకీయాలు తెలియవు బాబూ.. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలు మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మీలా వెన్నుపోటు రాజకీయాలు చేయడం మైనార్టీలకు తెలియదని, తమకు మంచి చేసిన వారిపట్ల కృతజ్ఞతాభావంతో ఉండటమే తెలుసని అన్నారు. గత ఎన్నికలప్పుడు ‘బాబు హమారా’ అనే సభలోనే బాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. మైనార్టీ యువకులపై పోలీసులతో దాడులు చేయించి, దేశద్రోహం కేసులు పెట్టించిన విషయాన్ని తాము మరువలేదన్నారు. ముస్లింలు ఓటు వేయకుండానే హిందూపురంలో టీడీపీ వారు గెలిచారా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద బైఠాయింపు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూపురంలోని ముస్లింలు చంద్రబాబు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ఉపక్రమిస్తుండగా సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ కరీం తమ సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. దీంతో ముస్లిం నాయకులు అంబేడ్కర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ ముస్లిం నాయకులు సీపీసీ సాదిక్, ఆసీఫుల్లా, జబీవుల్లా, రోషన్అలి, మస్తాన్, సలీముల్లా, ఇలియాజ్, షఫీ, రహమత్, బాబు, అల్తాఫ్, నజీర్, అబ్దుల్లా, షాజహాన్, రియాజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు టిక్కెట్ ఇచ్చే ప్రశ్నే లేదు
సాక్షి,కర్ణాటక: కర్ణాటక బీజేపీ నేత, గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు లోక్‌సభ టికెట్ ఇచ్చేప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వాలేదు. ఎవరికైనా ఇస్తాం..కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్ ఇవ్వమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో బెళగావి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖసహాయ మంత్రి సురేష్ అంగడీ కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. త్వరలో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బెళగావి ఎంపీ టికెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు కేటాయించే ప్రసక్తిలేదని ఆయన తేల్చి చెప్పారు. బెళగావి హిందూత్వనికి కేంద్రమని ఈ నేపథ్యంలో హిందువేతరులకు, ముఖ్యంగా కురుబ, లింగాయత్, వక్కలింగా, బ్రాహ్మణ కులాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ముస్లింలకు టికెట్ ఇచ్చే ప్రశ్న లేదని ఆయన తెగేసి చెప్పారు. గతంలోనూ ఈశ్వరప్ప ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మైనార్టీలకు సంక్షేమ నజరానా
సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా రూ.3,428 కోట్ల మేర లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే మైనార్టీలకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయూత అందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నేరుగా నగదు బదిలీ... అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, వైఎస్సార్ ఆసరా, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2,585 కోట్లు ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ పథకాల ద్వారా కూడా ఆదుకుంటోంది. త్వరలో ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలు, మరికొన్ని పథకాల ద్వారా రూ.843 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. తద్వారా 17 నెలల వ్యవధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనారిటీలకు రూ.3,428 కోట్ల మేర లబ్ధి కలగనుంది. మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజనం రాష్ట్రంలోని 900 మదర్సాలలో చదువుతున్న 33 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. మదర్సాలకు కూడా అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు అమలవుతున్నాయి. వక్ఫ్ ఆస్తులపై రీ సర్వేలు వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేసి ఆస్తులు కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో విడత సర్వే ద్వారా ఇప్పటికే దాదాపుగా ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ప్రత్యేకించి సర్వే కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రీ సర్వే జరుగుతోంది. హజ్ యాత్రికులకు సాయం పెంపు హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, అంతకు మించి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. ఇటీవలే వారికి బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించింది. మరోవైపు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచిన మొత్తం త్వరలోనే అమలులోకి రానుంది. టీడీపీ పాలనలో.... టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు అందించిన సాయం వేళ్ల మీద లెక్కించవచ్చు. మొత్తం 5 ఏళ్లలో కలిపి ఇచ్చింది కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే. ఇవి అప్పటి ప్రభుత్వ లెక్కలు కాగా సాయం లబ్ధిదారుల చేతికందేలోపు జన్మభూమి కమిటీలు, దళారులు కాజేసింది పోగా లబ్ధిదారులకు అందింది చాలా స్వల్పమే. ఒక కుటుంబంలో మూడు పథకాలు.. ‘నా భర్తకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సాయం అందుతోంది. నా మనవరాలికి జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 అందాయి. గతంలో మాకు ఎప్పుడూ ఇలా సాయం అందలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా’ - షేక్ హసన్బీ, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా. చదివిస్తూ డబ్బులివ్వడం గొప్ప పని... ‘చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చదువులకు డబ్బులు ఇవ్వడం గొప్ప పని. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు. ప్రభుత్వం 1వ తరగతి నుంచే పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు, బట్టలు, చెప్పులు కూడా సమకూరుస్తోంది. మూడో తరగతి చదువుతున్న నా కూతురు పేరుతో అమ్మ ఒడి డబ్బులు అందాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా మా అప్పులను కూడా ప్రభుత్వం తీరుస్తోంది’ - ఎస్కే సబియా, వన్‌టౌన్, విజయవాడ చెప్పినట్లుగా సాయం చేస్తున్నారు.. ‘వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 అందాయి. వైఎస్సార్ ఆసరా తొలి విడత సాయాన్ని సెప్టెంబరులో అందించారు. నాలుగు విడతల్లో మొత్తం రుణం తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? చెప్పినట్లు సాయం చేసిన ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరే’ - షేక్ కరీమున్నీసా, వన్‌టౌన్, విజయవాడ -
బైడెన్ వైపే ముస్లింలు..
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో 69 శాతం ముస్లిం ఓటర్లు బైడెన్‌కి ఓటు వేయగా, కేవలం 17 శాతం మంది మాత్రమే డొనాల్డ్‌కు ఓటు వేసినట్లు అమెరికాలోని ముస్లిం సివిల్ లిబర్టీస్ సంస్థ ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ రిలేషన్స్(సీఏఐఆర్) బుధవారం విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాల్లో పేర్కొంది. నమోదు చేసుకున్న 844 ముస్లిం ఓటర్ల కుటుంబాల్లో 84 శాతం మంది అత్యధికంగా ఓట్లు వేసినట్లు సీఏఐఆర్ సంస్థ తెలిపింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 13 శాతం ముస్లిం ఓట్లను మాత్రమే దక్కించుకున్న ట్రంప్, ఈ ఎన్నికల్లో మరో నాలుగు శాతం ఓట్లను అదనంగా సాధించగలిగారు. ఊహలకు భిన్నంగా.. ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మీడియా అంచనాలకు భిన్నంగా వస్తుండడంతో, మీడియా సహనం పాటించాలని భావిస్తున్నారు. ముందస్తు ఓటింగ్ వల్ల కౌంటింగ్ ప్రక్రియ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎటువంటి అభిప్రాయాలకూ రావద్దని మీడియా సంస్థలు తెలిపాయి. ఫలితాలన్నీ అసందిగ్ధంగా ఉన్నాయని, ఎవరు గెలుస్తారో ఇప్పటికిప్పుడే చెప్పలేమని సీబీఎస్ న్యూస్ ఎనలిస్ట్ జాన్డికర్సన్ అన్నారు. సంవత్సరానికి పైగా ప్రచారంలో తలమునకలైన జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా ఫలితాలను ఊహించలేకపోవడం గమనార్హం. (చదవండి: బైడెన్‌కే ‘లిటిల్ ఇండియా’ ఓట్లు) జాత్యహంకారమున్నా అట్లాంటా: అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకారాన్ని సమర్థిస్తూ నల్లజాతి ప్రజలను తరచూ తిట్టిపోసే మర్జోరీ టేలర్ గ్రీన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ఆమె నార్త్‌వెస్ట్ జార్జియా స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్త అయిన టేలర్ గ్రీన్ కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే ట్రంప్ దృష్టిలో పడ్డారు. ఆమెను ట్రంప్ ‘ఫ్యూచర్ రిపబ్లికన్ స్టార్’అని వర్ణించడం గమనార్హం. ఆమె జాత్యహంకారాన్ని సమర్థిస్తూ ఆన్లైన్లో వీడియోలు విడుదల చేస్తుంటారు. నల్లజాతి, హిస్పానిక్ ప్రజలను దూషిస్తుంటారు. వారు ముఠాలు కడుతుంటారని, మాదక ద్రవ్యాల బానిసలని విమర్శిస్తుంటారు. -
హే రామ్.. తుఝే సలామ్
సాక్షి, గుంటూరు: ‘రామ్ రహీమ్ ఏక్ హై’ అని శతాబ్దాల క్రితమే గళమెత్తాడు భక్త కబీర్దాస్. అదే భావంతో.. అదే బాటలో పయనిస్తూ.. హిందూ బంధువుల ఆధ్యాత్మిక చింతనకు ధ్వజాలు ఎత్తుతున్నారు ఈ ముసల్మాన్లు. గుంటూరు జిల్లా మాచవరం మండలం తురక పాలెం గ్రామంలోని ముస్లిం శిల్పకారులు ధ్వజస్తంభాలు చెక్కడంలో నేర్పరులు. తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. వంద కుటుంబాలకు ఇదే వృత్తి ► సుమారు వందేళ్ల క్రితం తురక పాలెం గ్రామానికి చెందిన కరీమ్ సాహెబ్ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. ► తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. ► కరీమ్ సాహెబ్ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ► ప్రస్తుతం గ్రామంలో వందకు పైగా కుటుంబాలు శిల్పాలతో కూడిన ధ్వజస్తంభాలు చెక్కుతున్నాయి. బండల్ని తొలిచి.. ► తురకపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లోని క్వారీల్లో పెద్ద పెద్ద బండలను తొలిచి ధ్వజస్తంభం ఆకృతులుగా మలుస్తారు. ► ఒక్కొక్క ధ్వజస్తంభం 20 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ► ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. ► ధ్వజస్తంభాన్ని చెక్కడం, లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజ స్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ► ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. ► ఒక్కో స్తంభం చెక్కడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. 30 ఏళ్లుగా ఇదే వృత్తి 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఈ వృత్తిని ఎంతో ప్రేమతో కొనసాగిస్తున్నాం. ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. – షేక్ అల్లాబక్షు, శిల్పకారుడు మా కళను గుర్తిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు మా కళను గుర్తించి ధ్వజస్తంభం ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. – షేక్ పెంటుసా, శిల్పకారుడు -
వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోంది: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ముస్లిం శ్మశాన వాటికలను కబ్జాల నుంచి పరిరక్షించాలన్న పటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. ముస్లిం శ్మశాన వాటికల ఆక్రమణలపై నివేదికను వక్ఫ్ బోర్డు కోర్టుకు సమర్పించింది. దీనిపై స్పందించిన హైకోర్టు శ్మశానాల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. అలాగే కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్టు చూస్తోందని పేర్కొంది. ఈ విషయంలో వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. (రాజస్తాన్ ఎడారిలా.. తెలంగాణ) వక్ఫ్ బోర్డు చైర్మన్ మైనార్టీల కోసం పని చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణకు బాధ్యతా యుతంగా ఉండాలని హితవు పలికింది. అయితే సిబ్బంది కొరత వల్ల, కరోనా వేళ మరింత ఇబ్బందిగా ఉందని వక్ఫ్ బోర్డు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారు కదా అని హైకోర్టు బదులిచ్చింది. సర్వే నెంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని వక్ఫ్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. (ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై హైకోర్టు విచారణ) -
త్యాగం, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని(ఆగస్టు 01) పురస్కరించుకొని ముస్లిం సోదరసోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. (చదవండి : ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా) Greeting to my Muslim brothers & sisters on the occasion of Eid al-Adha. May this auspicious day further the spirit of compassion, devotion & faith amongst all of us.#EidAlAdha — YS Jagan Mohan Reddy (@ysjagan) July 31, 2020 గవర్నర్ బక్రీద్ శుభాకాంక్షలు ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బక్రిద్ (ఇద్-ఉల్-జుహా) పవిత్ర దినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం మరియు పేదల పట్ల కరుణను సూచిస్తుంది. ఇతరుల పట్ల సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు దానధర్మాలు, సద్భావనలతో ఆచరిస్తారు’అని గవర్నర్ పేర్కొన్నారు. -
మసీదుల్లోనే బక్రీద్ ప్రార్థనలు
సాక్షి హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు పలు నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మత గురువులకు ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు ఒకటో తేదీన (శనివారం) ముస్లింలు బక్రీద్ (ఈదుల్ అజ్హా) పండుగను జరుపుకోనున్న విషయం విదితమే. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈద్గాలు, మైదానాల్లో సామూహిక ప్రార్థనలు చేసుకోరాదని స్పష్టం చేసింది. మసీదుల్లో కేవలం 50 మందికి మాత్రమే ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రార్థనల సమయంలో కచ్చి తంగా భౌతిక దూరం పాటించాలని సూచించింది. కాగా, మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులలో కేవలం 10 మందితోనే ప్రార్థనలు జరుగుతాయని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహ్మద్ ఖాసిం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఆగస్టు 1న బక్రీద్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నెలవంక కనిపించలేదని, దీంతో ఆగస్టు 1న బక్రీద్ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఖుబ్బుల్ పాషా ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇస్లామీ కేలండర్ ప్రకారం గురువారం నుంచి జిల్‌హజ్ నెల ప్రారంభమవుతోందని, ఇదే నెల పదో తేదీన ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారన్నారు. -
ఇళ్లలోనే రంజాన్ వేడుకలు..
సాక్షి, అనంతపురం: జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ముస్లింలు రంజాన్‌ను జరుపుకున్నారు. మసీదుల్లో ఐదు మంది చొప్పున మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే అనంతపురం, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి తదితర పట్టణాల్లో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అంతా సుభిక్షంగా ఉండాలని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించాలని వారు ఆకాంక్షించారు. కర్నూలు: జిల్లాలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా వైరస్ కట్టడి కి అందరు కలిసి కట్టుగా కృషి చేయ్యాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి: కాకినాడలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్ల వద్దే కుటుంబసభ్యులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించుకున్నారు. వైఎస్సార్ జిల్లా: రంజాన్ సందర్భంగా కమలాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి. జడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ దగ్గరయిన ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి నవాజ్ ఈద్ ప్రార్థనలు చేసి ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. -
ఈద్ ముబారక్
సాక్షి, హైదరాబాద్, అమరావతి: రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల్లో సుఖసంతోషాలను నింపుతుందని పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రంజాన్‌ను ఇళ్లలోనే జరుపుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. -
కరుణకు, దాతృత్వానికి ప్రతీక.. రంజాన్
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ► రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు పాటించారన్నారు. ఈ విపత్కర కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. ► నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుకన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. ► మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది కూడా రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. Greetings to all on the joyous occasion of #EidUlFitr. May the Almighty shower his mercy upon us and bless us with good health and happiness. Pray, feast and rejoice at home, surrounded by your loved ones. #EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2020 -
అలాంటి వారిని ఉపేక్షించొద్దన్నారు: అంజాద్ బాషా
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాల ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాల్సి రావడం బాధాకరం. శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలూ ఇదే సమయంలో జరుపుకోవాల్సి వచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమై ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దలను సీఎం కోరారని’ ఆయన వెల్లడించారు. (ఏపీ ప్రభుత్వ బాటలో కేంద్ర ప్రభుత్వం) మత పెద్దలు ఈ విషయాన్ని సీఎం మాటగా ప్రతి సోదరుడికి తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కరోనా సమయంలో మనకున్న ఒకే ఒక్క ఆయుధం భౌతిక దురమేనని సీఎం చెప్పారని.. ఈ నియమాన్ని పాటిస్తూ అందరూ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు. ఫేక్ మెసేజ్ ద్వారా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు సీఎం దృష్టికి తీసుకువచ్చారని.. అటువంటి వారిని ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ డీజీపీకి ఆదేశాలిచ్చారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. -
ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి : సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని అన్నారు. కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కరోనా కారణంగా ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగలను ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు రంజాన్ సమయంలో కూడా ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించి ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని చెప్పారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘కర్నూలు జిల్లాలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయి. అందరు కరోనా నివారణకు సహకరిస్తున్నారు. మీరు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. కానీ కొన్ని చానళ్లు, పత్రికలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. నకిలీ వీడియోలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నాయి. కర్నూలు ఎమ్మెల్యేపై కూడా లేని పోని ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై మీరు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ముస్లిం మత పెద్దలు కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. అటువంటి ప్రచారం చేసేవారిపై నివేదిక పంపాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. -
అసలు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారా..?
సాక్షి, వైఎస్సార్ కడప : దేశం, సమాజం బాగుండాలంటే మే3 వరకు లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. మంగళవారం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. సామాజిక దూరంతోనే కరోనా నివారణ సాధ్యమతుందన్నారు. ముస్లిం సోదరుల వల్లే కరోనా పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. ‘అసలు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నారా..? కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు తెలుసా’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చుని బాబు రాజకీయాలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిజాముద్దీన్‌కు విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ముందే ఎలా తెలుస్తుందని, ముందే తెలిస్తే ముస్లిం సోదరులు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’ ) కరోనా వ్యాప్తిని ఒక మతానికి, కులానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చంద్రబాబును నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారని, ఒక మతానికి అపాదించడం భావ్యం కాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పారన్నారు. మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని, పాజిటివ్ వచ్చిన వారిపై జాలి చూపాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా ముస్లిం సోదరులపై దుష్ప్రచారం చేశారని, ఆ వీడియోలు నకిలీవి అని జాతీయ మీడియా తేల్చిందని అన్నారు. వారికి రాష్ట్ర ప్రజల తరవున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముస్లింలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలకు కట్టుబడి తక్షణమే ఆయన వారికి క్షమాపణ కోరారని మంత్రి గుర్తు చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని ఖండించారు. (బంగారం నెక్ట్స్ టార్గెట్ ఇదేనా..?) ముస్లింలపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని, బాబు ముస్లింల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ముస్లింలకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం వాస్తవమా కదా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయాల్సిన సమయం ఇదేనా అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.100 అసత్యపు వార్తలను ఎల్లో మీడియా ప్రసారం చేస్తే నిజం అవుతాయా అని మండిపడ్డారు. భారతీయులమంతా ఒక తాటి పైకి వచ్చి కరోనాపై యుద్ధం చేయాల్సిన సమయమిదని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా రైతులు నష్ట పోకూడదని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చులు పెట్టొద్దని మంత్రి అంజాద్ బాషా హెచ్చరించారు. (లాక్డౌన్ ఉల్లంఘన: 5600 కేసులు నమోదు ) -
అందుకే ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం..
సాక్షి, అనంతపురం: సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. శనివారం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన మైనార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన విభజిస్తున్నారని.. తమ పౌరసత్వానికే ముప్పు ఉందని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అందుకే కేంద్రం తెచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తున్నామని’ ఆయన తెలిపారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించింది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని.. ఏపీ లోని అన్ని జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని వివరించారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని అంజాద్ బాషా పేర్కొన్నారు. -
మైనార్టీలకు సర్కార్ అండ..
సాక్షి, అనంతపురం: మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
వాళ్లలో భయాన్ని పోగొట్టండి : మాయావతి
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలపై ముస్లిం సమాజంలో నెలకొన్న భయాన్ని, ఆందోళనను తొలగించాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టాలపై వారికి అవగాహన కల్పించి పూర్తిగా సంతృప్తిపరచాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆందోళనల ముసుగులో రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నిస్తున్న పార్టీల పట్ల ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముస్లింలు అణచివేతకు, రాజకీయ దోపిడీకి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న హింసపై స్పందిస్తూ.. శాంతియుత ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని మాయావతి వ్యాఖ్యానించారు. చదవండి : వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి -
మైనారిటీలు మారారు.. గుర్తించారా?
కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఢిల్లీలోని ధార్యాగంజ్‌లో కారు తగులబడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో లాగా భారతీయ ముస్లింలలో కలుగుతున్న గణనీయ మార్పును ప్రతిబింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లింలు పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఢిల్లీలోని జామా మసీదులో గుమికూడిన ముస్లింలు తాము మొదట భారతీయులం అని ప్రకటించడం ద్వారా, మెజారిటీ వర్గంలో ఉన్నందున మన రిపబ్లిక్ పునాదిని మార్చివేయగలమని అనుకుంటున్న వారి భావనను పూర్తిగా తోసిపుచ్చేశారు. అదేసమయంలో భారత రిపబ్లిక్ తన సెలబ్రిటీ రచయిత–కార్యకర్త అయిన అరుంధతీరాయ్‌కు ఎంతగానో రుణపడి ఉంది. ఆమె ఒంటిచేత్తోనే భారతదేశాన్ని మావోయిస్టు సాయుధ తిరుగుబాటుదారుల నుంచి కాపాడారు. మన మావోయిస్టులు ‘తుపాకులు ధరించిన గాంధేయవాదులు’ (‘గాంధియన్స్ విత్ గన్స్’) అని వర్ణించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె చేసింది సర్వకాలాల్లోనూ అతి గొప్పగా కోట్ చేయదగిన ఉల్లేఖన. అణిచివేతకు గురవుతున్నవారిగా మావోయిస్టుల మీద అంతవరకు ఉన్న కాస్తంత సానుభూతిని కూడా రాయ్ వ్యాఖ్య సమాధి చేసేసింది. ఏకకాలంలో మీరు గాంధేయవాదిగా, మావోయిస్టుగా ఉండలేరు. బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద కూర్చుని నేను ఈ వ్యాసం రాస్తూ, జామా మసీదుకు చెందిన 17వ శతాబ్ది నాటి మెట్లమీదుగా వేలాది ముస్లింలు నడుచుకుంటూ పోయిన ఘటనను ఆమె ఎలా వర్ణించి ఉంటారు అని నేను ఆశ్చర్యపోయాను. వీళ్లు ముస్లింలు. ముస్లింలలాగా దుస్తులు ధరించినవారు. ప్రజలు ధరించే దుస్తులు వారి ఉద్దేశాలను తెలుపుతాయని ప్రధానమంత్రి ఇప్పుడే సూచిం చినందున దీన్ని మనం నొక్కి చెబుతున్నాం. ఈ ముస్లింలు మువ్వన్నెల జెండా, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్తరువులను ధరించి వచ్చారు. కొంతమంది గాంధీ బొమ్మలను పట్టుకున్నారు. వీటితోపాటు జనగణమన, హిందూస్తాన్ జిందాబాద్‌లను వల్లిస్తూ పోయారు. భారత రిపబ్లిక్కి చెందిన అతి పెద్ద మైనారిటీ (ప్రతి ఏడుమంది భారతీయులలో ఒకరు) తమ పవిత్ర మసీదు మెట్లు దిగుతూ తాము ముందుగా భారతీయులమని, భారత రాజ్యాంగంపై, జెండాపై, జాతీయ గీతంపై తమకు విశ్వాసముందని, జనాభా పరమైన మెజారిటీ కారణంగా రిపబ్లిక్ పునాదినే మార్చివేయవచ్చనే భావనను వ్యతిరేకిస్తున్నామని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? భారతీయ దేశభక్తికి తామే వారసులమంటూ దేశంలోని మెజారిటీ జనాభా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన ప్రకటనను ముస్లింలు తొలిసారిగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దేశంలో నివసించడానికే ఇక్కడున్నాం అంటూ వారు నినదించారు. వీళ్లతో ఇక ఎవరూ పోరాడలేరు. ఎలాంటి సమర్థనా లేకుండా వీరిపై ఎవరూ ఇక తుపాకులు గురిపెట్టి కాల్చలేరు. మన దేశం మారింది. లేక ‘మన దేశం ఇప్పుడు మారిపోతోంది మిత్రులారా’ అనే వాక్యాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు మధ్య పౌరులకు శరణార్థులకు మధ్య ఉన్న సూక్ష్మభేదాన్ని వివరించడం ద్వారా మీరు వారికి ఇక నచ్చచెప్పలేరు. ఇప్పటికే 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశారు. రెండు లక్ష్యాలను సాధించడానికి మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఒకటి, జాతీయ పౌర పట్టికలో దొరికిపోయే బెంగాలీ హిందువులను పునస్సమీక్షించి కాపాడటం, అదే సమయంలో బెంగాలీ ముస్లింలను బహిష్కరించడం. రెండు, రాష్ట్రంలోనూ దీన్నే పునరావృతం చేస్తామని హామీ ఇచ్చి పశ్చిమబెంగాల్ లోని బెంగాలీ హిందువులను ఆకట్టుకోవడం. అస్సాంలో మంటలు రేకెత్తించడానికి, పశ్చిమబెంగాల్లో మంటలు చల్లార్చడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఇప్పుడు ఢిల్లీలో మంటలు రేపారు. టోపీలు, బుర్ఖాలు, హిజబ్, ఆకుపచ్చ రంగు అనేవి ముస్లింలను గుర్తు చేసే అత్యంత స్పష్టమైన మూస గుర్తులు. అలాగే వారి మతపరమైన ప్రార్థనలు కూడా. ఒక స్నేహితుడికి పోలీసు లాఠీలకు మధ్యలో దూరి అతగాడిని కాపాడి దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టి నాకర్షించిన ఇద్దరు యువతుల ఫోటోను ఫేస్ బుక్‌లో చూసినప్పుడు, ఆ యువతులు జాతీయవాదం లేక లౌకికవాదం పట్ల ఎలాంటి నిబద్ధత లేని, సంప్రదాయ ఇస్లాం మతంతో మాత్రమే ప్రభావితమయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఏకే 47లు, ఆర్డీఎక్స్లు ధరించిన ముజాహిదీన్, లష్కర్, అల్ ఖాయిదా, ఐసిస్ వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహిం చిన అనేకమంది ఆగ్రహోదగ్రులైన ముస్లింలకు చెందిన బలమైన సంకేతాలను కూడా మనం చూడవచ్చు. ఈ తరహా ముస్లింలతో సులభంగా పోరాడి ఓడించవచ్చు. కానీ భారతీయ ముస్లింలు నిజంగా నిరాశా నిస్పృహలకు గురై ఉగ్రవాదాన్ని చేపట్టి ఉంటే ఏమయ్యేది? సిమీ నుంచి ఇండియన్ ముజాహిదీన్ల వరకు అతి చిన్న ఉగ్ర బృందాలు దీన్ని నిర్ధారించాయి కూడా. అత్యంత ఉదారవాదిగా పేరొందిన నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం 2009 ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టులతో నిండిన సభలో మాట్లాడుతూ, ఇదేవిషయాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలకు ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపించే వారెవరైనా సరే, భారతీయ ముస్లింలలో ఒక శాతం (ఇప్పుడు వారి సంఖ్య 20 కోట్లు) మందైనా భారత్‌లో తమకు ఇక భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని ఉంటే దేశాన్ని పాలించడం ఎవరికైనా కష్టమయ్యేదని సింగ్ ఆ సభలో చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏలిన దశాబ్దంలో ఇదీ పరిస్థితి. భారతీయ ముస్లింలు అపమార్గం పట్టకుండా దేశం వారిపట్ల ఔదార్యాన్ని ప్రదర్శించింది. కొంతమంది యువ ముస్లింలు ఉగ్రవాద బాట పట్టారు. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం లాగే నాడు యూపీఏ ప్రభుత్వం కూడా వారిపట్ల కఠినంగానే వ్యవహరించింది. ఈ వాస్తవాలపై అనేక భాష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ నిర్ధారణ మాత్రం ఒకటే. ఒక పక్షం మాత్రం ముస్లింలకు క్షమాపణ చెబుతూనే వారు జాతి వ్యతిరేకులుగా మారకుండా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకునేది. మరో పక్షం మాత్రం ఇప్పుడు కంటికి కన్ను సమాధానం అంటూ రెచ్చిపోతోంది. అలాగే మెజారిటీ వర్గం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేయాలని కోరుకుంటోంది. అటు రాజకీయపక్షం ఇటు మెజారిటీ వర్గం ఇద్దరూ ముస్లింలను అనుమాన దృష్టితో చూడటంపై ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక భారతీయ ముస్లింల గురించిన ప్రతికూల దృక్పథం ఏదంటే వారి మతాధిపతులే. జామా మసీదు బుఖారీలు, మదానీలు, కమాండో కామిక్ చానల్స్‌లో కనబడుతూ ఫత్వాలు జారీ చేస్తూ బవిరిగడ్డాలతో కనిపించే ముస్లిం మతగురువులను మెజారిటీ వర్గ ప్రజలు ప్రతికూల భావంతో చూస్తున్నారు. ముస్లింల పట్ల ఈ ప్రతికూల భావనలలో చాలావాటిని నేడు సవాలు చేస్తున్నారు. జనగణమన, జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీ బొమ్మలు, హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు.. ఇలా ముస్లింలను పట్టిచ్చే సంప్రదాయ సంకేతాలు మారుతున్నాయి కానీ దుస్తులు మాత్రమే మారలేదు. నాగరికతల మధ్య ఘర్షణ సూత్రం వెలుగులో భారతీయ ముస్లింలను అంచనా వేసేవారు ఘోరతప్పిదం చేస్తున్నట్లే లెక్క. 1947లో భారత్‌లోని మెజారిటీ ముస్లింలు జిన్నాతోపాటు నడిచి తమ కొత్త దేశం పాక్ వెళ్లిపోయారు. కానీ జిన్నా తర్వాత గత 72 ఏళ్లలో వారు తమ దేశాధినేతగా ముస్లింను ఎన్నటికీ విశ్వసించలేదు. వారు ఎల్లవేళలా ముస్లిమేతర నేతనే విశ్వసిస్తూ వచ్చారు. దీనర్థమేమిటి? కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో సంకేతాలు వెలువరించినట్లుగా భారతీయ ముస్లిం లలో గణనీయ మార్పును ప్రతి బింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లిం పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఇప్పుడు మనం సుప్రసిద్ధ ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన అమర వాక్యాలను ఈ భయానకమైన కాలంలో తరచుగా ఉల్లేఖిస్తున్నాం. ఆ కవితా పాదాల అర్థం ఏమిటి? ‘‘ఈ నేలపై ప్రతి ఒక్కరూ తమవంతు రక్తం ధారపోశారు. భారత్‌పై ఓ ఒక్కరూ తమ ప్రత్యేక హక్కును ప్రకటించలేరు’’. జాతిలో కలుగుతున్న ఈ మార్పును చూసి రహత్ ఇందూరి తప్పకుండా చిరునవ్వులు చిందిస్తుంటారు మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మైనార్టీలకు అండగా ఉంటాం: అంజాద్ బాషా
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన నిలుస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింను డిప్యూటీ సీఎం చేశారన్నారు. గత ఎన్నికల్లో అయిదుగురు ముస్లింలకు టికెట్ ఇచ్చారని, హిందూపురంలో ఇక్బాల్ ఒడినా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, హమారా సమావేశాల్లో మైనార్టీలపై దేశ ద్రోహం కేసు పెడితే సీఎం జగన్ వాటిని ఎత్తివేశారని గుర్తుచేశారు. అలాగే హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు రూ.60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. మౌజమ్‌లకు మార్చి 1 నుంచి రూ. 15 వేల గౌరవ వేతనం ఇ్వబోతున్నామని, వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్నార్సీపై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ముస్లింలకు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏ అన్యాయం జరిగినా తాము వ్యతిరేకిస్తామని, పోరాటంలో ముందుంటామని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభ, లోక్‌సభలోనూ పోరాడుతామన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరుకుంటారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. ముస్లిం సోదరుల ఆందోళనలు సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఏ ఒక్క ముస్లిం, మైనార్టీలకు ఇబ్బంది కలిగినా తాము ముందుంటామన్నారు. గతంలో వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గుర్తు చేశారు. ఈ బిల్లు ఏపీ రాష్ట్రానికి వర్తించదని, వైఎస్సార్ సీపీ మైనార్టీలకు అండగా ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. -
ముస్లిం ఓట్ల్ల ప్రాబల్యానికి గ్రహణం
భారతదేశాన్ని ఎవరు పాలించాలి.. ఎవరు పాలించకూడదు అని తేల్చే శక్తి గతంలో ముస్లింలకే ఉండేది. బీజేపీ అధికారం కోల్పోయిన ప్రతిసారీ ముస్లిం ఓటింగ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేది. బీజేపీ అనేక సందర్భాల్లో ముస్లింలను చేరడానికి ప్రయత్నించింది. మైనారిటీల పట్ల వాజ్‌పేయి సానుకూలత ప్రదర్శించినా ఫలితం లేకుండా పోయింది. 2014లో నరేంద్రమోదీ, అమిత్ షాలు ఈ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిపడేశారు. ముస్లిం ఓటర్ల సహాయాన్ని పొందకుండానే వారు సంపూర్ణ మెజారిటీని సాధించారు. ముస్లిం ఓటు తన శక్తిని కోల్పోయింది. ఫలితంగా పాలనావ్యవస్థలో ముస్లిలకు చోటు కరువైంది. అయితే దేశ జనాభాలో ఆరింట ఒకవంతు ప్రజలను వేరుచేసి, విడదీసిన ఏ దేశం, ఏ సమాజం కూడా భద్రతతో ఉండగలనని భావించకూడదు.భారతీయ జనతా పార్టీ ఒక విషయంలో నిత్యం మధనపడుతూనే ఉండేది. అదేమిటంటే, భారతదేశంలో తమకు దక్కాల్సిన రాజకీయ ప్రాముఖ్యతను దేశీయ ముస్లింలు దూరం చేస్తున్నారన్నదే బీజేపీ బాధ. గతంలో ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు నా మాజీ సహోద్యోగి, బీజేపీలో కీలక మేధావి అయిన బల్బీర్ పుంజ్తో నేను చేసిన సంభాషణల్లో పదే పదే ఇదే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ’భారతదేశాన్ని ఎవరు పాలించాలి.. ఎవరు పాలించకూడదు అని తేల్చే శక్తి ముస్లింలకే ఉంది’ అని పుంజ్ తరచుగా చెప్పేవారు. మా మధ్య ఈ సంభాషణ 1999లో చోటు చేసుకుంది. లోక్‌సభలో రెండోసారి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినప్పుడు ఇది జరిగింది. లౌకికపార్టీలన్నీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఐక్యమైన ఫలితమది. 1996లో కూడా వాజ్‌పేయి తొలి ఎన్డీఏ ప్రభుత్వం 13 రోజుల్లోనే కుప్పగూలిపోయిందన్నది తెలిసిందే. రెండోధఫా ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ముగిసిపోయింది. బీజేపీ అధికారం కోల్పోయిన ప్రతిసారీ ముస్లిం ఓటింగ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకునేది. లౌకిక వాద విలువలకే ముస్లింలు ప్రాధాన్యత నిచ్చేవారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అప్పట్లో కాంగ్రెస్‌కి, బీజేపీకి మధ్య సీట్ల వ్యత్యాసం 145– 138గా ఉండేది. బీజేపీ అనేక సందర్భాల్లో ముస్లింలను చేరడానికి ప్రయత్నిం చింది. మైనారిటీలకు అత్యంత స్నేహపూరితమైన ముఖంగా వాజ్‌పేయి బీజేపీ తరపున నిలబడేవారు. మరోవైపున అడ్వాణీ సైతం ముస్లిం–లెఫ్ట్ పేరిట ముస్లిం మేధావులను పెంచి పోషించారు. జిన్నాను ప్రశంసించడానికి ముస్లిం పండుగల్లో పాల్గొనడం, ఏపీజే అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి భవన్‌కి ఎంపిక చేయడం వరకు ముస్లిం ఓటు దుర్గాన్ని బద్దలు చేసేందుకు వాజ్‌పేయి, అడ్వాణీ ప్రయత్నిం చారు. కానీ ఆ సంప్రదాయం లేని బీజేపీ విఫలమైంది. బీజేపీ దీన్నే భారత్‌ను ఎవరు పాలించాలి అనే అంశాన్ని తేల్చిపడేసే ముస్లిం వీటోగా పేర్కొంటూ వచ్చింది. బీజేపీ అధికారం దేశవ్యాప్తంగా పతనమైన యూపీఏ దశాబ్దంలో బీజేపీ వైఖరి మరింత పెరిగింది. తర్వాత 2014లో నరేంద్రమోదీ, అమిత్ షాలు ముందుకొచ్చారు. ఈ సమీకరణాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసిపడేశారు. భారతీయ ముస్లిం ఓటర్ల సహాయాన్ని పెద్దగా పొందకుండానే వారు సంపూర్ణ మెజారిటీని సాధించారు. భారత రాజకీయాల్లో కొత్త ముద్ర ఏర్పడింది. ముస్లింలను, క్రైస్తవులను వదిలిపెట్టి 80 శాతం ఓటర్లతో కూడిన యుద్ధరంగంలోనే పోరాడాల్సి ఉందని ఇప్పుడు తాము గ్రహించామని పలువురు బీజేపీ నేతలు భావించసాగారు. ఈ వాస్తవాన్ని ఒకసారి వీరు అంగీకరించాక పార్టీ ముందున్న సవాల్ సులువైనదిగా మారింది. ‘హిందూ ఓటులో 50 శాతాన్ని కొల్లగొడితే చాలు.. మనం సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని ఏలగలం’. ఈ వాస్తవాన్ని వారు 2019లో కూడా నిరూపించారు. భారత రాజకీయాల్లో అసాధారణమైన పరివర్తన ఏదైనా ఉందా అంటే, 20 కోట్లమందితో కూడిన అతిపెద్ద ముస్లిం జనాభా ఓట్లకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత కూడా లేకుండా పోవడమే. విశ్వసనీయమైన ప్రతి ఎగ్జిట్ పోల్ చేసిన జనాభాపరమైన విశ్లేషణ దీన్నే వ్యక్తపరుస్తూ వచ్చింది. ఇదే బీజేపీ సెక్యులర్ ప్రత్యర్థులకు షాక్ కలిగించింది. అదే సమయంలో ముస్లింలను కూడా సమాధానాల కోసం అన్వేషించేలా చేసింది. ఈ 20 కోట్లమంది ముస్లింల హృదయాలను మీరు తరిచి చూసినట్లయితే నా ఓటు తన శక్తిని కోల్పోయింది అనే చిత్రణే మీకు కనబడుతుంది. కావచ్చు కానీ అధికార చట్రంలో నాకు చెందాల్సిన సరైన స్థానం కూడా తనకు దూరం కావలసిందేనా అనే వేదన మిగిలింది. ఆరో ఏడు పాలన సాగిస్తున్న మోదీ మంత్రివర్గంలో ఒక్క ముక్తర్ అబ్బాస్ నఖ్వి మాత్రమే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్నారు. ఈయన ఒక్కరే కేంద్రంలో ముస్లిం మంత్రిగా ఉంటున్నారు. పైగా దేశ చరిత్రలో ఇప్పుడు ఒక ఆసాధారణమైన మలుపులో మనమున్నాం. కీలక రాజ్యాంగ పదవులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, సాయుధ బలగాల సేనాధిపతులు, భద్రత, నిఘా సంస్థల అధిపతులు, ఎలెక్షన్ కమిషన్, న్యాయవ్యవస్థ విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లింకూడా కనిపించని వాతావరణంలో మనం ఉంటున్నాం.పైగా దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా ముస్లిం ముఖ్యమంత్రి నేడు కనిపించరు. ఇక ముస్లిం వ్యక్తే ముఖ్యమంత్రిగా పాలించే జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ఒక రాష్ట్రంగా కూడా లేదు. కీలక మంత్రిత్వ శాఖల్లో ఒక్క కార్యదర్శి పదవిలోనూ ముస్లిం కనబడరు. మరింత లోతుగా వెళ్లి చూస్తే.. 2015–17 మధ్యకాలంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నసీమ్ జైదీ ఒక రాజ్యాంగ పదవిని అధిష్టించిన చివరి ముస్లింగా చరిత్రకెక్కారు. హమీద్ అన్సారీ ఉన్నారనుకోండి. భారత్‌లోని 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నజ్మా హెప్తుల్లా, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే ఇద్దరు ముస్లింలు మాత్రమే గవర్నర్లుగా ఉన్నారు. నేటి భారత్‌లో ఇది ఎక్కడ ముగుస్తుందో చెప్పలేం. బీజేపీ సబ్ కా సాత్, సబ్కా వికాస్‌పై జరుగుతున్న వాదనలు మనకు తెలుసు. తర్వాత దేశంలో ప్రధానంగా ఎలాంటి మత కల్లోలాలు లేవు. మోదీ ప్రభుత్వంలో ఐఏఎస్ తదితర విభాగాల్లో ముస్లిం అభ్యర్థుల సంఖ్య కనీసంగా మాత్రమే పెరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే మైనారిటీ స్కాలర్షిప్లు ప్రస్తుతం కాస్త పెరిగాయి. నిజమైన సమానత్వాన్ని ప్రబోధిస్తున్న దేశంలో 15 శాతం జనాభాకు తనదైన స్థానం దక్కాల్సి ఉంది. అధికారం, పాలన విషయంలో ఇది మరీ వర్తిస్తుంది. 2014 తర్వాత బీజేపీ నుంచి దీనికి వచ్చే సమాధానం ఒక్కటే. ‘మమ్మల్ని శత్రువులుగా భావిస్తూ మాకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మీరు చెబుతుంటారు తర్వాత అధికారంలో భాగం కావాలంటారు. ఎలా సాధ్యం?’ రాజ్యాంగపరమైన సమానత్వాన్ని ఇది ప్రశ్నిస్తోంది. మీకు ఓటుంది, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అవకాశాలున్నాయి. కానీ అధికారంలో వాటాకోసం మీ వోటింగ్ ఎంపికలపై మీరు పునరాలోచించుకోవాల్సి ఉందేమో మరి. దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లింల జనాభా చెల్లాచెదురుగా ఉంటున్నారు. లోక్‌సభలో 27 మంది ముస్లింలు మాత్రమే ఉంటున్న వాస్తవం దీన్ని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయిల్ వంటి జాత్యహంకార రిపబ్లిక్లో అతిపెద్ద మైనారిటీగా ఉంటున్న ముస్లింలకు ఇతర అవకాశాలున్నప్పటికీ, పాలనా యంత్రాగంలో చోటు లేదంటే అర్థం చేసుకోవచ్చు కానీ హిందూ రిపబ్లిక్ కాని భారత్‌లో ముస్లింల పరిస్థితి ఇలాగే ఉండటమే పెద్ద విషాదం. ప్రపంచంలో 40 శాతం పైగా ముస్లింలు భారతీయ ఉపఖండంలోనే జీవిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంనుంచి కొన్ని వందల సంఖ్యకు మించి ముస్లింలు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరలేదు. ఇక భారతీయ ముస్లింలలో ఐసిస్‌లో చేరినవారి సంఖ్య వందకు మించలేదు. ఇదెలా సాధ్యం? అంటే భారత్, పాక్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లింలలో జాతీయవాదం వేళ్లూనుకుని ఉంది. వారికి సొంత జాతీయగీతం, క్రికెట్ టీమ్ ఉంది. గెలిపించడానికి, ఓడించడానికి రాజకీయనేతలు కూడా ఉన్నారు. ఇస్లాం రాజ్యం అనే ఊహ మన ముస్లింలను ఆకర్షించలేదు. పైగా ఉపఖండంలోని ముస్లింలు మతానికి మాత్రమే కాకుండా భాష, జాతి, సంస్కృతి, రాజకీయ సిద్ధాంతం వంటి ఇతర అంశాల ప్రభావానికి కూడా గురై ఉంటున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన అతి గొప్ప శక్తి ఇదే. 2014 తర్వాత ముస్లిం మైనారిటీ ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని భారత్ ఏమాత్రం కోరుకోవడం లేదు. వారి మౌనం అర్ధాంగీకారం కాదు. భారతీయ ముస్లింలు మధ్యతరగతిగా పరివర్తన చెందారు. వీరిలోంచి విద్యావంతులైన, వృత్తినైపుణ్యం కలిగిన కులీనవర్గం ఆవిర్బవించింది. వారసత్వ పార్టీ, వామపక్ష–ఉర్దూ కులీన వర్గాలకు చెందిన పాత వ్యవస్థను వారిప్పుడు అనుసరించడం లేదు. ఓటింగ్ ప్రాధాన్యతల రీత్యా ముస్లింలను శిక్షించడం వల్ల ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నట్లు సంతోషం కలిగించవచ్చు. కానీ అది స్వీయ ఓటమికే దారి తీస్తుంది. దేశ జనాభాలో ఆరింట ఒకవంతు ప్రజలను వేరుచేసిన ఏ దేశం, ఏ సమాజం కూడా భద్రతతో ఉండగలనని భావించకూడదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta