
వరకట్న నిషేధ చట్టం అందరికీ వర్తిస్తుంది
నాకు పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అవుతోంది. మేము ముస్లిమ్స్. పెళ్లి సమయంలో నా భర్త తరపు వాళ్లు కోరిన మొత్తాన్ని ఇచ్చాము. మేమిద్దరమూ ఉద్యోగులమే... నెలకు చెరొక లక్ష జీతం. ఇప్పుడు మేము విడిపోవాలని అనుకుంటున్నాం. అయితే నేను కేసుపెడితే కట్నం ఇచ్చినందుకు మమ్మల్ని కూడా జైల్లో పెడతారు అని నా భర్త బెదిరిస్తున్నాడు. వరకట్న నిషేధ చట్టం ముస్లింలకు వర్తించదు అని అంటున్నాడు. అది నిజమేనా? దయచేసి వివరణ ఇవ్వండి. –షేక్ కవిత, తిరుపతి
వరకట్న నిషేధ చట్టం అన్ని మతాల వారికి వర్తిస్తుంది. కొందరు ‘మెహర్’ను విడాకులతో పొరబడుతుంటారు. వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం ఇచ్చినా తీసుకున్నా రెండు నేరాలే. కానీ, కట్నం ఇచ్చినవారు ఒత్తిడికి లోనై ఇస్తారు కాబట్టి, కట్నం ఇచ్చిన వారికి శిక్షపడే ప్రమాదం తక్కువే. అలా కట్నం ఇచ్చిన వారందరినీ శిక్షిస్తూ పోతే వరకట్న నిషేధ చట్టం ఉద్దేశ్యానికే అర్థం లేకుండా పోతుంది. మీ విషయంలో మీ భర్త కూడా ఒప్పుకుంటే సామరస్యంగా విడిపోయి ఎవరి జీవితం వారు చూసుకోండి. పిల్లలు ఉంటే, మీ భర్త కూడా పిల్లల మెయింటెటెన్స్ పంచుకోవాల్సి వస్తుంది.
చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?
ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?
-శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు సందేహాల నివృత్తికోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు.