Legal advice
-
కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా?
నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి. ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
ఒరిజినల్ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?
మేము 15 సంవత్సరాల క్రితం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటు కొన్నాము. ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నాము. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మా ఒరిజినల్ దస్తావేజులు పోయాయి. మేము రెవెన్యూ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ కాపీలను తీసుకున్నాము. ఆ కాపీల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కొనుక్కునే వారికి చెప్పగా వారు వెనుకడుగు వేస్తున్నారు. కొందరేమో ‘కాగితాల పని మేము చూసుకుంటాము కానీ పాతిక లక్షలు తక్కువ ఇస్తాం..’ అంటున్నారు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి పరిష్కారం చూపగలరు. – విజయ్ వర్ధన్, వరంగల్ఇంటి రిజిస్ట్రేషన్ / పూర్వ ఒరిజినల్ పత్రాలు లేనప్పుడు కొనేవారు కొంత సంకోచించడం సమంజసమే. ఒరిజినల్ దస్తావేజులని ప్రైవేటు వ్యక్తుల దగ్గర తాకట్టుపెట్టి తర్వాత అదే ఆస్తిని మరొకరికి అమ్మడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ తాకట్టు ఈ.సీ లో కూడా కనపడదు కాబట్టి కొనుక్కునేవారు అమాయకంగా మోసపోతూ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం అయిపోయింది. టైటిల్ డీడ్ డిపాజిట్ చేస్తే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి అనే నిబంధన లేకపోవడం ఇందుకు కారణం. ఒరిజినల్ దస్తావేజులు లేని కారణం చూపించి మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకు మాత్రమే కొంటాము అని చాలామంది అంటారు. ఒరిజినల్ పత్రాలు లేనంత మాత్రాన ఆ స్థలం కానీ, ఇల్లు కానీ మీది కాకుండా పోదు, మీకు మీ ఆస్తిని అమ్మే హక్కు లేకుండా పోదు! మీరు తక్షణమే మీ ఇంటి పత్రాలు పోయాయి అని పోలీసులకి ఫిర్యాదు ఇవ్వండి. అదేవిధంగా మీరు ఒక లాయర్ ద్వారా పేపర్ ప్రకటన కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రకటన కాపీలను మరలా పోలీసు వారికి అందించాలి. పోలీసు వారు ‘ఫలానా వారి దస్తావేజులు పోయాయి, తిరిగి వెతికినా దొరకడం లేదు’ అని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ (నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్) జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్‌ను తీసుకొని మీరు రెవెన్యూ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే మీకు డూప్లికేట్ కాపీలు ఇస్తారు. అలా పొందిన పత్రాలు ఒరిజినల్ దస్తావేజులతో సమానం. మీరు వివరించిన పరిస్థితులలో అమ్మే వారికి –కొనేవారికి కూడా ఇది సురక్షితమైన పరిష్కారం.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!) -
మిమ్మల్ని ఒత్తిడి చేసే అధికారం వారికి లేదు..!
మేము ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాము. ఓనర్లతో మేం రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఆ అపార్ట్మెంటు నుంచి మమ్మల్ని ఖాళీ చేయించేందుకు వీలు లేదు. కానీ ఓనర్ మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు. అలా ఎలా చేస్తాం అని అగ్రిమెంట్ విషయం గుర్తు చేస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్లి తన పరపతితో మాపై ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వారు కూడా మమ్ములను సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి, సలహా ఇవ్వగలరు. – బి.నారాయణ, హైదరాబాద్సాధారణ ΄పౌరులకసలు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా పోలీసు వారిని సంప్రదించాలి అని అనిపిస్తుంది. అది కుటుంబ సమస్య, భూమి తగాదా, అద్దె ఇల్లు ఖాళీ చేయక΄ోవటం వంటి ఏ సమస్య అయినా ముందుగా పోలీసు వారి దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే మీ సమస్య సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా ఏదైనా నేరం అంటే క్రిమినల్ చట్టం కింద జరిగిందా అని పోలీసువారు చూడాలి. సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలాసార్లు స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ సివిల్ కేసులలో కూడా పోలీసుల తరచు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. సివిల్ కేసులలో పోలీసుల జోక్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో నెల నెలా నమోదవుతున్న వందలాది కేసులే అందుకు నిదర్శనం. సివిల్ కేసులకు క్రిమినల్ రంగు పులిమి కేసులు పెట్టడం కూడా కొత్తేమీ కాదు. అలాంటి కేసులను కోర్టులు తిరస్కరించాయి! పోలీసు వారు సివిల్ కేసులను ‘సెటిల్మెంట్ చేసుకోండి’ అని ఒత్తిడి చేయడానికి వారికి ఎటువంటి అధికారమూ లేదు. అలాగని మీరు పోలీసు వారితో వాగ్వాదానికి దిగవలసిన అవసరం లేదు. మీ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. మీకు పోలీసుల నుంచి అటువంటి ఒత్తిడి వస్తోందని అంటున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం లభించకపోతే హైకోర్టులో కేసు వేయవచ్చు. పూర్వాపరాలు విచారించిన తర్వాత హైకోర్టు మీకు రక్షణ కలిగిస్తుంది. మీకు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి అగ్రిమెంట్‌ను అతిక్రమించేందుకు వీలు లేకుండా రక్షణ పొందవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (న్యాయయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు )(చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు..!
నేను ఇటీవలే హైదరాబాద్ శివార్లలో కొంతకాలం కొన్నాను. కొనేముందు అమ్మకందార్లు మాకు హద్దురాళ్ళు కూడా చూపించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా హద్దుల ప్రకారం ఫెన్సింగ్ వేసుకుందాము అని వెళ్ళగా, మాకు భూమి అమ్మినవారు – మాకు దక్షిణాన ఉన్నవారు కూడా మా భూమి హద్దులు అవి కాదు అని, దాదాపు 10 గుంటల భూమి నష్టపోయేలా హద్దులు చూపిస్తున్నారు. అది మాత్రం కాదు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. కోర్టుకు వెళ్తే కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ మా భూమిలో మేము ఏమీ చేసుకోలేము అంటున్నారు. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపగలరు.– జి. రామ్మోహన్, కందుకూరుభూమిని కొనేటప్పుడు హద్దులు సరిగా చూసుకుని, వీలైతే హద్దురాళ్ళు పాతుకుని, పక్కన ఉన్న భూమి యజమానులను కూడా సంప్రదించి కొంటే, ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఏదేమైనా, మీరు ప్రభుత్వానికి సరైన స్టాంప్ డ్యూటీ కట్టి, చట్టప్రకారం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఏదైనా ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి, ‘ఎఫ్–లైన్’ అప్లికేషన్/దరఖాస్తు చెయ్యండి. ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే 45 రోజుల లోగా రెవిన్యూ అధికారులు మీ భూమిని సర్వేచేసి, హద్దులు చూపిస్తారు. అలా చేయని పక్షంలో, పైఅధికార్లకు, ఆర్.డీ.ఓ కి ఫిర్యాదు/దరఖాస్తు పత్రం ఇవ్వండి. అప్పటికీ చేయకపోతే మీరు సర్వే కోసం హై కోర్టును ఆశ్రయించవచ్చు. సర్వే అనంతరం కూడా ఏమైనా సమస్య వుంటే, సివిల్ కోర్టులో వ్యాజ్యం ద్వారా మీ భూమిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఆర్డరు పొందవచ్చు.సివిల్ కోర్టులో కేసులు ఆలస్యం అవుతాయి అనేమాట కొంతవరకూ నిజమే. కానీ త్వరితగతిన మీ కేసు పరిష్కరించటానికి చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కేసు నడిచినంతవరకు మీ భూమిలో మీరు ఏమీ చేసుకోలేరు అన్నది అవాస్తవం. హద్దుల సమస్య ఉన్నంత భూమి వరకు మీ పక్కవారు రానివ్వరు. మిగతా భూమిలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. పూర్తిగా కేసు పరిష్కారం అయ్యేలోపు మధ్యంతర ఉత్తర్వులు పొంది, మీ హక్కుని మీరు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అని కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు కాబట్టి జాగ్రత్త! చట్టపరమైన చర్యలలో మాత్రమే పరిష్కారాలు పొందాలి. అప్పుడే శాశ్వత పరిష్కారాలు అందుతాయి. అలా కాదని అనుకుంటే ముందు ముందు సమస్యలు మరింత జటిలం కావచ్చు!– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిన్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు పెట్టొచ్చా..!
ప్రశ్న: మేము లోన్ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వద్దనుంచి నిర్మాణదశలోనే ఫ్లాట్ కొన్నాము. ఒప్పందం ప్రకారం పది నెలల లోగా ఫ్లాటు మాకు పూర్తి చేసి ఇవ్వాలి. కానీ సంవత్సరం అయినా ఇంకా పూర్తి చేయలేదు. లోను నెలవారీ వాయిదాలు కట్టడం కూడా మొదలైంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? పరిష్కారం చెప్పగలరు. – టి.ఆర్. రాజేశ్వరి, హైదరాబాద్సర్వసాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థ వారు, మీరు రాసుకునే ఒప్పంద పత్రం అంటే అగ్రిమెంట్లో సమయానికి ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి, మీకు అందజేయక΄ోతే అందుకుగాను తాత్కాలిక పరిహారం/ఉపశమనం ఏం చేస్తారో రాసుకుంటారు. కొన్ని సందర్భాలలో ఫ్లాట్ అప్పగించేంతవరకు అద్దె ఇవ్వటం లేదా మీ తరఫున నెలవారీ లోను డబ్బులు సదరు కంపెనీ వారే కట్టేలా ఒప్పందాలు కూడా రాసుకుంటారు. మీ ఒప్పందపత్రంలో కూడా అటువంటి కండిషన్ ఏమైనా ఉందేమో చూసుకోండి.ఏది ఏమైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మీరు సదరు రియల్ ఎస్టేట్ సంస్థపై వినియోగదారుల రక్షణ చట్టం కింద కేసు వేయవచ్చు. మీకు జరిగిన ప్రతి నష్టాన్ని లెక్కగట్టి దానికి తోడు మీకు కలిగిన మానసిక క్షోభకి కూడా అదనంగా పరిహారం కోరవచ్చు, పొందవచ్చు. అదనంగా... ఒకవేళ మీరు కొన్న ఫ్లాట్ ్ర΄ాజెక్టు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) లో రిజిస్టర్ అయి ఉంటే అదనంగా రెరాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ అగ్రిమెంటు, ఆస్తి కొనుగోలు పత్రాలు తీసుకొని దగ్గర్లోని లాయర్ని కలవండి. మొదటగా ఒక నోటీసు పంపి, అప్పటికీ కూడా మీకు పరిష్కారం దొరకకపోతే, పైన తెలిపిన విధంగా దావా వేసి న్యాయం పొందవచ్చు. వినియోగదారుల చట్టం ప్రకారం మీ కేసు మీరు కూడా వాదించుకోవచ్చు లేదా మీ తరఫున మరెవరినైనా ‘ఆథరైజ్డ్ పర్సన్’గా నియమించుకోవచ్చు. 50 లక్షల దావా వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో, 50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు రాష్ట్ర ఫోరంలో అలాగే రెండు కోట్ల పైన విలువ గల దావాకి జాతీయ వినియోగదారుల ఫోరంలో మీ ఫిర్యాదును నమోదు చేయాల్సి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (చదవండి: జాబ్‌కి అప్లై చేసిన 48 ఏళ్లకు కాల్ లెటర్..ఐతే..!) -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్ -
బిల్‌గేట్స్‌పై ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై లైంగిక-రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణల మీద మైక్రోసాఫ్ట్ బోర్డు దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసింది కూడా!. ఈ తరుణంలో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రముఖ న్యాయ విచారణ సంస్థ ‘అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీ’ని మైక్రోసాఫ్ట్ నియమించుకుంది. ఈ సంస్థ బిల్‌గేట్స్ వచ్చిన ఆరోపణలపై బోర్డు తయారు చేసిన నివేదికను సమీక్షిస్తుంది. ఆ తర్వాతే బోర్డు రూపొందించిన నివేదికను బహిర్గతం చేస్తుంది. అంటే.. బిల్‌గేట్స్ లైంగిక వేధింపుల విషయంలో బోర్డు దర్యాప్తు ఏం తేల్చిందన్న విషయం వేసవి దాకా బయటికి రాదన్నమాట!. ఒక్క బిల్‌గేట్స్ విషయంలోనే మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువురు ప్రముఖుల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాల్ని సమీక్షించాలని షేర్ హోల్డర్స్.. బోర్డును కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్‌ను నియమించుకుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా డీల్ చేయబోతుందన్న విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది. పనిలో పనిగా ఉద్యోగుల ఆందోళనలను, పరిష్కారాలపైనా అరెంట్ దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి 2020 మార్చి నెలలో ఆయన దిగిపోయాడు. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్’ మీద ఫోకస్ చేయడమే అని ఆయన ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2007 సమయంలో సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు రాగా.. ఈమేరకు బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల తర్వాత మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగులు కొందరు, బిల్‌గేట్స్ సన్నిహితులు సైతం ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కొసమెరుపు. చదవండి: ‘బిల్‌గేట్స్ పచ్చి తాగుబోతు, యువతులతో నగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో..’ సంబంధిత కథనాలు: గేట్స్ వెకిలి మెయిల్స్.. వద్దని వారించిన మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్! -
ఇక పోస్టాఫీసుల్లో న్యాయసేవల సమాచారం..
సాక్షి,విశాఖపట్నం : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు పోస్టాఫీసుల్లో న్యాయసేవలకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని అందించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవదానం హరిహరనాథ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం కోసం దరఖాస్తులను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు పోస్ట్మ్యాన్లకు న్యాయ సహాయం కోసం అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్.సోమశేఖరరావు, అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ పాల్గొన్నారు. చదవండి: Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి -
న్యాయ సలహాలు విస్తృతంగా అందించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాఘవరావు లీగల్ (కడప అర్బన్) : ప్రజలకు లీగల్ లిటరసీ సంస్థ ద్వారా ఎక్కువ మందికి న్యాయ సలహాలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఎస్.రాఘరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి 2011-12, 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు ఆడిట్ రిపోర్టును కమిటీ ఆమోదించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు మాసాలలో జిల్లాలో నిర్వహించిన లోక్‌అదాలత్, కేసుల పరిష్కారం, లిటరసీ క్యాంపుల నిర్వహణ, లీగల్ సర్వీసుల ద్వారా ఎంత మందికి న్యాయ సలహాలు అందించడం జరిగిందనే అంశాలపై సమీక్షించారు. లోక్ అదాలత్ ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాజంపేట పరిధిలో భూ సేకరణకు సంబంధించి ఎక్కువ వివాదాలు, రాజంపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నమోదవుతున్నందున రెవెన్యూ అధికారులతో సమన్వయ పరుచుకుని పరిష్కారానికి కృషి చేయాల్సి ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో లీగ్-ఎయిడ్-క్లినిక్‌ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ టి.రఘురాం, జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అన్వర్‌బాషా, జీపీ పి.సుబ్రమణ్యం, జె.ప్రభాకర్, అదనపుఎస్పీ (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘సూపర్’ వైద్య సీట్లపై సర్కారు దృష్టి
⇒ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదన ⇒ విభజన చట్టంలో స్పష్టత లేక అయోమయం ⇒ అన్ని సీట్లను స్థానికులతోనే భర్తీ చేసే యోచన ⇒ న్యాయ సలహా తీసుకోవాలని సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ర్ట ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడమో లేక రాష్ర్టంలో ఉన్న సీట్లను ఇక్కడి వారితోనే భర్తీ చేయాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుండటం దీనికి కారణం. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ సహా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 198 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. వీటిలో 110 సీట్లు తెలంగాణలో, 65 సీట్లు ఏపీలో ఉన్నాయి. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ప్రభుత్వ వాదన ప్రకారం తెలంగాణలో 110 సీట్లుంటే.. రాష్ట్ర విద్యార్థులకు దక్కేవి 48 సీట్లు మాత్రమే. 65 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఏపీకి మాత్రం 96 సీట్లు దక్కుతున్నాయి. మిగిలిన 54 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటున్నాయి. తెలంగాణలోని సీట్లన్నీ ఇక్కడి విద్యార్థులకే దక్కాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ 15 శాతం ఓపెన్ కేటగిరీని వదిలేసినా 100 సీట్లయినా దక్కాల్సిందేనని వాదిస్తున్నాయి. ఉదాహరణకు నిమ్స్‌లో బ్రాడ్ స్పెషాలిటీలో 28 సీట్లుంటే అందులో ఏపీకి 16, తెలంగాణకు 7 సీట్లు దక్కుతున్నాయి. ఓపెన్ కేటగిరీలో మాత్రం ఐదు సీట్లున్నాయి. నిమ్స్ పీజీ సూపర్ స్పెషాలిటీలో 50 సీట్లుంటే అందులో ఏపీకి 30, తెలంగాణకు 12 సీట్లు మాత్రమే దక్కుతాయి. ఆ రెండు సెక్షన్లు పరస్పర విరుద్ధం విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం వచ్చే పదేళ్ల వరకు ఉన్నత విద్యలోని పాత కోటా సీట్లను గతంలో ఉన్నట్లే భర్తీ చేయాలి. అయితే సెక్షన్ 97 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సీట్లు ఉండాలని పేర్కొన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. విభజన చట్టంలో గందరగోళం ఉన్నప్పటికీ సెక్షన్ 97 ప్రకారం తెలంగాణలోని సీట్లను తెలంగాణవారితోనే భర్తీ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ‘తెలంగాణలోని ఉన్నత విద్యలో రాష్ట్రస్థాయి సీట్లకు అయ్యే ఖర్చు, ఫ్యాకల్టీ, విద్యార్థుల ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది. ఏపీ ఒక్క పైసా కేటాయించలేదు. ఆ రాష్ట్ర విద్యార్థులు మాత్రం 64 శాతం సీట్లు పొందుతున్నార’ని జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ అంటున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామన్నారు. కాగా, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని, ఆ తర్వాతే తగిన చర్యలు చేపడతామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
న్యాయ సలహా కేంద్రాలకు కొత్త హంగులు
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్: గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో న్యాయ సలహాలు అందించడానికి ఏర్పాటు చేసిన న్యాయ సలహా కేంద్రాలు కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. న్యాయ సలహాల కోసం కోర్టుల వద్దకు వెళ్లనవసరం లేకుండా ప్రజల వద్దకు న్యాయ సలహాలు అందించడం ఈ కేంద్రాల లక్ష్యం. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉండి ప్రజలకు చట్టపరమైన విషయాలలో ఉచితంగా సలహాలను అందిస్తారు. న్యాయ సలహాల కేంద్రాల పేర్లను న్యాయ పరిరక్షణ, అభివృద్ధి కేంద్రాలుగా వ్యవహరిస్తూ ప్రతి కేంద్రం వద్ద నూతనంగా బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కాకుండా ఇతర రోజులలో సలహాలు కోరే ప్రజల సౌకర్యార్థం అన్ని కేంద్రాల వద్ద ఆయా పంచాయతీల సహకారంతో ఒక ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చే స్తున్నారు. సలహాలను కోరేవారు దాఖలు చేసే పత్రాలను ఈ పెటె ్టలో వేస్తే న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి పరిశీలించి తగు న్యాయ సహాయం అందిస్తారు. అలాగే న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, తదితర ఫోన్ నెంబర్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు.