
సాక్షి,విశాఖపట్నం : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు పోస్టాఫీసుల్లో న్యాయసేవలకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని అందించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవదానం హరిహరనాథ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం కోసం దరఖాస్తులను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు పోస్ట్‌మ్యాన్‌లకు న్యాయ సహాయం కోసం అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్.సోమశేఖరరావు, అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ పాల్గొన్నారు.