ప్రశ్న: మేము లోన్ ద్వారా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వద్దనుంచి నిర్మాణదశలోనే ఫ్లాట్ కొన్నాము. ఒప్పందం ప్రకారం పది నెలల లోగా ఫ్లాటు మాకు పూర్తి చేసి ఇవ్వాలి. కానీ సంవత్సరం అయినా ఇంకా పూర్తి చేయలేదు. లోను నెలవారీ వాయిదాలు కట్టడం కూడా మొదలైంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? పరిష్కారం చెప్పగలరు.
– టి.ఆర్. రాజేశ్వరి, హైదరాబాద్
సర్వసాధారణంగా రియల్ ఎస్టేట్ సంస్థ వారు, మీరు రాసుకునే ఒప్పంద పత్రం అంటే అగ్రిమెంట్‌లో సమయానికి ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి, మీకు అందజేయక΄ోతే అందుకుగాను తాత్కాలిక పరిహారం/ఉపశమనం ఏం చేస్తారో రాసుకుంటారు. కొన్ని సందర్భాలలో ఫ్లాట్ అప్పగించేంతవరకు అద్దె ఇవ్వటం లేదా మీ తరఫున నెలవారీ లోను డబ్బులు సదరు కంపెనీ వారే కట్టేలా ఒప్పందాలు కూడా రాసుకుంటారు. మీ ఒప్పందపత్రంలో కూడా అటువంటి కండిషన్ ఏమైనా ఉందేమో చూసుకోండి.
ఏది ఏమైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మీరు సదరు రియల్ ఎస్టేట్ సంస్థపై వినియోగదారుల రక్షణ చట్టం కింద కేసు వేయవచ్చు. మీకు జరిగిన ప్రతి నష్టాన్ని లెక్కగట్టి దానికి తోడు మీకు కలిగిన మానసిక క్షోభకి కూడా అదనంగా పరిహారం కోరవచ్చు, పొందవచ్చు. అదనంగా... ఒకవేళ మీరు కొన్న ఫ్లాట్ ్ర΄ాజెక్టు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) లో రిజిస్టర్ అయి ఉంటే అదనంగా రెరాకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ అగ్రిమెంటు, ఆస్తి కొనుగోలు పత్రాలు తీసుకొని దగ్గర్లోని లాయర్‌ని కలవండి.
మొదటగా ఒక నోటీసు పంపి, అప్పటికీ కూడా మీకు పరిష్కారం దొరకకపోతే, పైన తెలిపిన విధంగా దావా వేసి న్యాయం పొందవచ్చు. వినియోగదారుల చట్టం ప్రకారం మీ కేసు మీరు కూడా వాదించుకోవచ్చు లేదా మీ తరఫున మరెవరినైనా ‘ఆథరైజ్డ్ పర్సన్’గా నియమించుకోవచ్చు. 50 లక్షల దావా వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో, 50 లక్షల నుంచి రెండు కోట్ల వరకు రాష్ట్ర ఫోరంలో అలాగే రెండు కోట్ల పైన విలువ గల దావాకి జాతీయ వినియోగదారుల ఫోరంలో మీ ఫిర్యాదును నమోదు చేయాల్సి ఉంటుంది.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(చదవండి: జాబ్‌కి అప్లై చేసిన 48 ఏళ్లకు కాల్ లెటర్..ఐతే..!)
Comments
Please login to add a commentAdd a comment