మనకు ఏదైనా రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. అది నిజమో..! కాదా? అనేది కచ్చితంగా చెప్పలేకపోయినా..కొన్ని రకాలు సంఘటనలు ఎదురైన వెంటనే ఠక్కున ఈ సామెత గుర్తొస్తుంది. దగ్గర వరకు వచ్చి చేజారిందనుకున్న టైంలో కథ ముగిశాక మన చెంతకు చేరితే ఆ బాధ, ఫీలింగ్ వేరేలెవెల్. అసలు ఇదేం అదృష్టం రా బాబు అనిపిస్తుంటుంది. అలాంటి ఘటన లండన్ చెందిన ఒక మహిళకు ఎదురయ్యింది. ఎప్పుడో జాబ్‌కి అప్లై చేస్తే..ఏకంగా 48 ఏళ్ల తర్వాత కాల్ లెటర్ వస్తే ఎలా ఉంటుందో చెప్పండి..
అప్పటికీ బాధితురాలి వయసు కూడా దాటిపోతుంది కదా..!. సరిగ్గా ఈ మహిళకు కూడా అలానే జరిగింది. ఆమె పేరు టిజీ హాడ్సన్. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. ఆమె మాజీ స్టంట్ విమెన్. ఆమె జనవరి 1976లో మోటార్‌సైకిల్ స్టంట్ రైడర్ జాబ్‌కి అప్లై చేసింది. ఆ జాబ్ కోసం హాడ్సన్ స్వయంగా తన చేతులతో టైప్ చేసి పోస్ట్ చేసింది. అయితే రిప్లై కోసం కళ్ల కాయలు కాచేలా ఎదురుచూసింది. ప్రతి రోజు ఆశగా కాల్ లెటర్ వస్తుందనుకుని ఆశగా చూసి నిరాశపడేది. ఇక చివరికి ఆమె ఆఫ్రికాకు వెళ్లి స్నేక్ హ్యాండ్లర్, గుర్రాలను మచ్చిక చేసుకునే నైపుణ్యరాలిగా రాణించింది.
ఆ తర్వాతన విమానాలు నడపడం వంటివి నేర్చుకుని ఫైలట్ ట్రైనర్‌గా కొన్నాళ్లు వృత్తిని కొనసాగించింది. అయితే తనకు మాత్రం మోటార్‌సైకిల్‌పై స్టంట్ రైడర్‌గా ఉండటం అంటే ఎంతో ఇష్టమని, అందుకోసం తాను మహిళననే విషయం కూడా వెల్లడించలేదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే తాను మహిళనని తెలిస్తే ఇంటర్వ్యూకి పిలవరేమోనని సంకోచించానంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఆమె సందేహానికి తగ్గట్టు ఆ కాల్ లెటర్ చాలా ఆలస్యంగా వచ్చి ఆమెకు కలను ఆవిరి చేసింది.
“స్టెయిన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆ ఆ ఇంటర్వ్యూ లెటర్ టిజీ హాడ్సన్ చెంతకు చేరి ఆమెను షాక్‌కు గురి చేసింది. అంతేగాదు తాను ఆ జాబ్ కోసం అప్లై చేసినప్పుడే మోటర్‌సైకిల్ స్టంట్ రైడర్‌గా ఎన్ని ఎముకలు విరిగినా పట్టించుకోనాని కూడా ఆ లేఖలో రాసుకొచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ కాల్ లెటర్ ఇప్పటికీ చెంతకు చేరడం బాధ అనిపించినా..ఎముకలు విరగొట్టుకోకూడదనే ఉద్ధేశ్యంతో దేవుడు ఆమెను మరో వృత్తిన ఎంచుకునేలా చేశాడేమో కదూ..!. ఒక రకంగా ఇది దురదృష్టం లాంటి అదృష్టం కదూ..!
(చదవండి: 'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!)
Comments
Please login to add a commentAdd a comment