లీగల్
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రి
మీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.
అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.
స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
ఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్
Comments
Please login to add a commentAdd a comment