Properties
-
రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
అన్ని అంశాలను ఇక్కడ విచారించలేం
న్యూఢిల్లీ: స్థిరాస్తుల కూల్చివేత విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారంటూ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై తాము విచారణ చేపట్టలేమని, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. అన్ని అంశాలనూ తాము ఇక్కడ విచారించలేమని స్పష్టంచేసింది. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఆస్తులను కూల్చడానికి వీల్లేదని, కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు 2024 నవంబర్ 13న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికారులు తగిన సమయం ఇవ్వకుండానే ఆస్తులు కూల్చేశారని ఆరోపిస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు వెళ్లాలని -
మైండ్‌స్పేస్ చేతికి సస్టెయిన్ ప్రాపర్టీస్
న్యూఢిల్లీ: మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సస్టెయిన్ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి సంస్థ విలువను రూ. 2,038 కోట్లుగా లెక్కగట్టి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈక్విటీ వాటా కోసం రూ.613 కోట్లు చెల్లించనుండగా, రూ.1,400 కోట్ల రుణభారం మైండ్‌స్పేస్ రీట్‌కు బదిలీ అవుతుంది. ప్రతిగా సస్టెయిన్ ప్రాపర్టీస్ షేర్హోల్డర్లకు మైండ్‌స్పేస్ రీట్‌లో యూనిట్లు లభిస్తాయి. ఒక్కో యూ నిట్‌కు రూ. 379.08 రేటు చొప్పున 1,61,68,090 యూనిట్లను సస్టెయిన్ ప్రాపర్టీస్ షేర్హోల్డర్లకు జారీ చేసే ప్రతిపాదనకు మైండ్‌స్పేస్ రీట్ బోర్డు ఆమోదముద్ర వేసింది. మార్చి ఆఖరు నాటికి డీల్ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో సస్టెయిన్ ప్రాపర్టీస్‌కి హైదరాబాద్‌లో కామర్జ్వన్ రాయ్‌దుర్గ్ పేరిట ఉన్న 18.2 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్.. మైండ్‌స్పేస్ రీట్ చేతికి దక్కుతుంది. యూనిట్హోల్డర్లకు మరింత విలువ చేకూర్చేలా ఈ డీల్ ఒక మైలురాయిగా ఉంటుందని మైండ్‌స్పేస్ రీట్ సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. ఆదాయాలు, కంపెనీ పోర్ట్‌ఫోలియోలు మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కే రహేజా కార్పొరేషన్ గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ 2020 ఆగస్టులో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
TG: మెడికల్ కాలేజీలపై ‘ఈడీ’ కొరడా.. భారీగా ఆస్తులు అటాచ్
సాక్షి,హైదరాబాద్:పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్,చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది.కాలేజీలకు చెందిన రూ.5.34కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.9.71కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తులు ఈడీ అటాచ్లోకి వెళ్లాయి. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది.వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్స్టేషేన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు,మధ్యవర్తులతో కలిసి పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు గుర్తించారు. సాదారణ సీట్లకంటే మూడు రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ ప్రాథమికంగా తేల్చింది. -
సర్కారు వారి పాట!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఇళ్లలో మిగిలిపోయినవి, అసంపూర్తిగా ఉన్నవి, ఓపెన్ ప్లాట్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత తొమ్మిది ప్రాజెక్టులను ఎంపిక చేసింది. గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ప్లాట్లకు ధరలను ఖరారు చేసిన నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలోనే ఈ తొమ్మిది ప్రాంతాల్లోని ఆస్తులను వేలం వేయనున్నారు. ఇందులో ఒక బీహెచ్‌కే నుంచి 3 బీహెచ్‌కే వరకు ఉన్న 760 ఫ్లాట్లు... 200 గజాల నుంచి 2,200 గజాల వరకు ఉన్న 179 ప్లాట్లు.. అసంపూర్తిగా ఉన్న 5 నుంచి 9 అంతస్తుల 6 టవర్లు (ఇళ్ల సముదాయాలు) ఉన్నాయి. అన్నింటినీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా (యథాతథ స్థితిలో) విక్రయించనున్నారు. తర్వాత మిగతా ప్రాజెక్టుల్లోని ఆస్తులను వేలం వేస్తారు. ఈ ఆస్తులు ఎక్కడెక్కడ? ⇒ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పూర్తయినవి, కొన్ని అసంపూర్తివి ఉన్నాయి. బండ్లగూడలో 129 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెమీ ఫినిష్డ్ స్థాయిలో ఆగిపోయినవి. ఇక ఇప్పటికిప్పుడు గృహప్రవేశం చేసుకునేలా పంతొమ్మిది 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, పదకొండు 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ మోడల్ ఫ్లాట్లు కావడంతో వెల్ ఫర్నిష్డ్ కావడం విశేషం. వీటికి కనీస ధర చదరపు అడుగుకు రూ.3 వేలుగా నిర్ణయించారు. 3 బీహెచ్‌కే ఫ్లాట్ల ధర రూ.37.23 లక్షల నుంచి రూ.48.51 లక్షల వరకు పలికే అవకాశం ఉంది. ఇదే తరహాలో మిగతా కేటగిరీల ఫ్లాట్ల ధరలు కూడా ఉంటాయి. ⇒ పోచారంలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 255, 2 బీహెచ్‌కే ఫ్లాట్లు 340, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు 6 ఉన్నాయి. బండ్లగూడ కంటే వీటి ధరలు కొంత తక్కువగా ఖరారు చేశారు. ⇒ కొన్ని ఐదు అంతస్తులు, కొన్ని 9 అంతస్తులతో అసంపూర్తిగా ఉన్న 6 టవర్లను కూడా అమ్మకానికి ఉంచారు. వీటిల్లో ఫ్లాట్లను విడివిడిగా కాకుండా.. మొత్తం భవనాలను గంపగుత్తగా వేలం వేయనున్నారు. ⇒ ఇక చందానగర్‌లో మూడు భారీ టవర్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన మూడు భారీ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇవి 2 వేల గజాల నుంచి 2,200 చదరపు గజాల వరకు విస్తీర్ణంతో ఉన్నాయి. వీటికి కనీస ధరను గజం రూ.40 వేలుగా నిర్ణయించారు. ⇒ 200 గజాల నుంచి 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. నగర శివార్లలోని బహదూర్‌పల్లిలో 69, తొర్రూరులో 514, భూత్పూరు సమీపంలోని పోతులమడుగులో 111, మహబూబ్‌నగర్ పట్టణంలో 45 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం చేశారు. అప్పట్లో రూ.1,940 కోట్లు.. ఈసారి రూ.850 కోట్లు! రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2022–23లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో స్వగృహ ఫ్లాట్లను వేలం వేసింది. అప్పట్లో ప్రభుత్వానికి రూ.1,940 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి తొలి దఫా వేలం ద్వారా రూ.850 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులలో మిగిలిన ఫ్లాట్లన్నింటినీ వేలంలో ఉంచారు. ఇంతకాలం ఆ ఇళ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. ఇప్పుడు అన్నీ అమ్ముడైతే ఈ భారం తగ్గుతుంది. ఇక గతంలో స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధం చేసిన స్థలాలనూ ఇప్పుడు వేలానికి పెడుతున్నారు. అవి అమ్ముడైతే ఆ ప్రాజెక్టులు కూడా ముగిసిపోయినట్టే. -
రియల్టీ బూమ్.. రూ. 35,000 కోట్ల ప్రాపర్టీల విక్రయం
న్యూఢిల్లీ: వర్షాలు, నియంత్రణ సంస్థల నుంచి పూర్తిగా అనుమతులు రాకపోవడం తదితర అంశాల కారణంగా 2024–25 రెండో త్రైమాసికంలో కాస్త ప్రతికూల ప్రభావం పడినా లిస్టెడ్ రియల్టీ దిగ్గజాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. 26 సంస్థలు ఏకంగా రూ. 35,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించాయి.గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధికంగా రూ. 5,198 కోట్ల బుకింగ్స్ నమోదు చేసింది. నియంత్రణ సంస్థలకు సమర్పించిన వివరాల ప్రకారం 26 దిగ్గజ సంస్థలు రూ. 34,985 కోట్ల ప్రాపర్టీలు విక్రయించాయి. అత్యధికంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ప్రీ–సేల్స్ నమోదయ్యాయి. లోధా బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగించే ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 4,290 కోట్ల బుకింగ్స్ సాధించింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్లు, బెంగళూరు కంపెనీలు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 4,023 కోట్లు, సిగ్నేచర్ గ్లోబల్ రూ. 2,780 కోట్ల ప్రాజెక్టులు విక్రయించాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చాలా మటుకు రియల్టీ కంపెనీలు రూ. 500 – రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో కొన్ని సంస్థల విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా అగ్రస్థానంలో ఉన్న డీఎల్ఎఫ్ తొలి త్రైమాసికంలో రూ. 6,404 కోట్ల ప్రీ–సేల్స్ సాధించగా కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించకపోవడంతో రెండో త్రైమాసికంలో రూ. 692 కోట్లు మాత్రమే నమోదు చేసింది. -
ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఇండియా, రవికిరణ్ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్ ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.ఇదీ చదవండి: మొబైల్ తయారీ రంగంలో వేగంగా విస్తరణమంగళం ఆగ్రో ప్రొడక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్ ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్ ఇండస్ట్రీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్ ఇండస్ట్రీస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(రెడీమ్ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం. -
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి...
-
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్ -
హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు!
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రా కూడా భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. చెరువులు, నాలాలకు సమీపంలో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్ఓసీ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు ఇంటి నంబరు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణపై పురపాలకశాఖ కసరత్తు చేస్తోంది. ఇది అమలులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారుల భరోసాకే... దొడ్డిదారిలో అనుమతులు తీసుకొని.. చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణాలను హైడ్రా కూల్చుతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ, జలాశయాలను కాపాడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. కానీ.. హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది. ఏ ప్రాజెక్ట్ సరైనదో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. దీంతో గృహ కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు భరోసా కలిగించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. గతంలో రెరా తీసుకొచ్చిందీ ఇలాగే.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ (రెరా) కంటే ముందు డెవలపర్లు నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలతో ముందుగానే విక్రయించేవారు. తీరా న్యాయపరమైన చిక్కులతో సంబంధిత ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు కాకపోవడంతో కస్టమర్లు రోడ్డున పడేవారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం రెరాను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భద్రత, పారదర్శకత, నిర్మాణంలో నాణ్యత పెరిగాయి. నిర్మాణ అనుమతులతోపాటు రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులలో కొనుగోళ్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు భవన నిర్మాణాలకు ఎలాగైతే రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఎని్వరాన్‌మెంట్ వంటి పలు శాఖల ఎన్ఓసీ తప్పనిసరో...అలాగే హైడ్రా అనుమతి కూడా కావాల్సిందే. కేవైసీ లాగే కేవైఎల్ చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా కూల్చివేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. వరదలు, నీటికొరత, భూగర్భ జలాల తగ్గుదల వంటి ఇబ్బందులు తలెత్తవు. భావితరాలకు సమృద్ధిగా జల వనరులు, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంక్‌లు, బీమా సంస్థలు ఎలాగైతే ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) నిర్థారించిన తర్వాతే సేవలు అందిస్తాయో.. అచ్చం అలాగే గృహ కొనుగోలుదారులు ‘నో యువర్ లొకాలిటీ’(కేవైఎల్) ఆయా ప్రాంతం గురించి తెలుసుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న గందరగోళానికి హైడ్రా ఎన్ఓసీ చక్కని పరిష్కారం. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం కస్టమర్లలో తొలగిపోతుంది. రియల్టీ రంగంపై విశ్వాసం పెరిగి, మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ సింగిల్ విండో తీసుకురావాలి ఇప్పటికే పలు విభాగాల నుంచి ఎన్ఓసీలు తీసుకురావాలంటే 6–9 నెలల సమయం పడుతుంది. కొత్తగా హైడ్రా ఎన్ఓసీ అంటే ఏడాది సమయం పడుతుంది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగదు. అందుకే సింగిల్‌విండో ద్వారా అన్ని విభాగాల ఎన్ఓసీలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. – పోశం నర్సిరెడ్డి, ఐరా రియాల్టీ ఎండీ -
నేనే మంత్రి.. నాదే పెత్తనం!
రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారం అండతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెచ్చిపోతున్నారు. నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూక్.. ఈ జిల్లాలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మదర్సాలను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారిపై ఆస్తుల కబ్జా ఆరోపణలూ వస్తున్నాయి. వీరి చర్యలను సొంత పార్టీలోని ఓ మంత్రి, ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా మంత్రి, ఆయన కుమారుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెప్పినట్లు చేయని ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలు కర్నూలు పాతబస్తీ గడ్డా వీధిలో ‘అంజుమన్ ఈ షంషియా మదర్సా’కు 60 ఏళ్లకు పైగా ఉన్న కమిటీని మంత్రి తొలగించి, అన్ని నిబంధనలను ఉల్లంఘించి తన వారిని నియమించుకోవడం మైనార్టీల్లో కలకలం రేపింది. కర్నూలు తొలి మునిసిపల్ చైర్మన్ సలాం ఖాన్ ఈ మదర్సాకు ఆస్తులు రాసిచ్చారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులే చైర్మన్‌గా దానిని నడిపిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కమిటీని గౌరవించేవారు. ఈ కమిటీ కాలపరిమితి ఫిబ్రవరితో ముగిసింది. వక్ఫ్ బోర్డు సభ్యులే కమిటీని రెన్యువల్ చేయాల్సి ఉంది. అప్పట్లో వక్ఫ్ బోర్డు లేనందున, రెన్యువల్ జరగలేదు. ఇప్పటికీ, బోర్డు ఏర్పడలేదు. కమిటీ రెన్యువల్, కొత్త కమిటీని నియమించే అధికారం బోర్డు సీఈవోకు లేదు. అయినా మంత్రి ఆదేశాలతో ఈ నెల 8న ఐదుగురితో కొత్తగా కమిటీని నియమిస్తూ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సిఫార్సు చేయడం, అదే రోజు సీఈవో నియామకం ఉత్తర్వులు జారీ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. కొత్త అధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్ స్థానికుడు కాదు. నిబంధనల మేరకు స్థానికేతరుడికి కమిటీలో చోటే కల్పించకూడదు. కానీ ఏకంగా అధ్యక్షుడినే చేశారు. కూటమి ప్రభుత్వంలో మరో మంత్రి, టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఈ మదరసా విషయంలో జోక్యం చేసుకోవద్దని కొరినా, మంత్రి లెక్క చేయలేదని సమాచారం. ఈ మదరసాకు రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, భూముల అద్దె, ఆదాయంపై పెత్తనం కోసమే కమిటీని మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సలాంఖాన్ వారసులు కోర్టులో సవాల్ చేసినట్లు సమాచారం. జీఏడీ, ఆర్థికశాఖను కాదని కార్పొరేషన్ ఉద్యోగి ప్రభుత్వంలో విలీనం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా ఫరీ్వన్ను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేయడమూ విమర్శలకు దారితీసింది. సాధారణంగా కార్పొరేషన్ ఉద్యోగిని ప్రభుత్వంలో విలీనం చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే జీఏడీ, ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలి. కానీ జీఏడీ, ఆర్థికశాఖను బైపాస్ చేసి ప్రభుత్వం మంగళవారం జీవో 110 జారీ చేసింది. కార్పొరేషన్లో సరిపడినంత సిబ్బంది లేనందున ఆమెను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేసేందుకు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ ఇచ్చేందుకు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరాకరించింది. అయినప్పటికీ మంత్రి ఫరూక్ ఒత్తిడితో ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయిన సబియాను గెజిటెడ్ ర్యాంకులో నియమించడమూ నిబంధనలకు విరుద్ధమే. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన స్థలం కబ్జా! నంద్యాలలో పద్మావతి నగర్ అత్యంత విలువైన ప్రాంతం. ఇక్కడ ఫరూక్ మేనత్తకు సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 ఎకరాల స్థలం ఉంది. ఆమె వారసులు ఖతీఫ్ ఖాజా హుస్సేన్, నూర్ అహ్మద్ అందులో 28 సెంట్లు రామిశెట్టి వెంకటన్నకు, 30 సెంట్లు నిమ్మకాయల బాలనారాయణకు విక్రయించారు. ఇక్కడ సెంటు కోటి రూపాయల పైనే ఉంది. ఈ లెక్కన ఈ స్థలం విలువ రూ.58 కోట్లు చేస్తుంది. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700ఏలో మంత్రి ఫరూక్ స్థలం ఉంది. దీంతో పక్కనే బంధువులు విక్రయించిన ఆస్తిని కబ్జా చేసేందుకు యతి్నంచారు. ఈ స్థలంపై ఇరువర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. అయితే ఎక్కడా ఫరూక్ తన ఆస్తి అని నిరూపించుకోలేకపోయారు. దీంతో తమ స్థలానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) నిర్ధారించాలని వెంకటన్న, బాలనారాయణ మునిసిపల్ అధికారులను కోరగా.. ఆర్వో వెంకటకృష్ణ, ఆర్ఐ గులాం హుస్సేన్ ఆ స్థలానికి రూ.55,980 ట్యాక్స్ నిర్ధారించారు. దీనిపై మంత్రి పీఏ అనిల్ ఈ నెల 20న మునిసిపల్ ఆఫీసుకు వెళ్లి వారితో ఎలా ట్యాక్స్ తీసుకుంటారంటూ బూతులతో విరుచుకుపడ్డారు. అదే రోజు ఆర్వో, ఆర్ఐని అధికారులు సస్పెండ్ చేశారు. మంత్రి అధికార బలంతోనే వారిని సస్పెండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కమిటీ తొలగింపు పై హైకోర్టులో కేసు వేశాం మా తాత సలాంఖాన్ కర్నూలు మునిసిపాలిటీ తొలి చైర్మన్. ఆయన మదరసా ఏర్పాటు చేశారు. దానికి మా పూరీ్వకులు ఆస్తులు ఇచ్చారు. తరాలుగా ఆస్తులను కాపాడుతున్నాం. ఒక్క రూపాయి మేం వాడుకోం. మదర్సాకు 60 ఏళ్లకుపైగా మా కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులే ఉండాలి. అధ్యక్షుడు నచ్చిన వారిని సభ్యులుగా నియమించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఒత్తిళ్లతో కమిటీని మార్చారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. – అల్తాఫ్‌ఖాన్, మాజీ అధ్యక్షులు, షంషియా మదర్సాఆ స్థలం మా పెద్దల నుంచి వచ్చింది నంద్యాల సర్వే నంబర్ 700ఏ7బీ, 709ఏ9లో 4.16 ఎకరాల భూమిని మేము కబ్జా చేయలేదు. ఆ స్థలం మా పెద్దల నుంచి సంక్రమించింది. ఎన్ఎండీ ఫరూక్ మేనత్త సారంబి వారసులు వారి వాటా ఆస్తిని వెంకటన్న, బాలనారాయణకు విక్రయించారు. ఆ సమయంలో హద్దులు మార్చి 2010లో రిజిస్టర్ చేయించారు.ఆ డాక్యుమెంట్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మొదట హద్దులు సవరించాలని.. ఆ పరిధి కోర్టుది కాదని తెలియజేస్తూ కోర్టు కేసును తిరస్కరించింది. ఇదే స్థలానికి చెందిన మరో కేసు సారంబి వారసులు, జైనబ్బి వారసుల మధ్య నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టులో నడుస్తోంది. – మంత్రి ఫరూక్ సోదరుడు ఎన్ఎండీ ఖుద్దూస్, కుమారుడు ఫిరోజ్ రూ.14 కోట్ల విలువైన పనులు నిలిపివేతనంద్యాలలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పీఎంజేకే) ద్వారా హాస్టల్, స్కూలు భవనాలతో పాటు 6 మేజర్ పనులు రూ.14 కోట్లతో జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఈ పనులు నిలిపివేయించారు. మంత్రితో మాట్లాడిన తర్వాతే తిరిగి మొదలెట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. షాదీఖానా కమిటీని రాజీనామా చేయించిన వైనం ఫరూక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నంద్యాలలో ఎన్టీఆర్ షాదీఖానా కమిటీని కూడా బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ పదవీ కాలం జూన్ 27తో ముగుస్తుందని చెప్పినప్పటికీ, జూన్ 20నే సభ్యులతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ షాదీఖానాను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రూ.కోటి నిధులతో ఆధునికీకరించారు. ఇప్పుడు తమ అస్మదీయులతో కమిటీ నియమించి షాదీఖానాను గుప్పిట్లో పెట్టుకోనున్నారు. -
కోట్ల ఆస్తిని అమ్మకానికి పెట్టిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ, నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 6న వెండితెరపైకి రానుంది. కంగనా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త బీ టౌన్లో వైరల్‌గా మారింది. ముంబయిలోని తన ఇంటిని అమ్మకాని పెట్టారని టాక్ వినిపిస్తోంది. అందులోనే కంగనా నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం కూడా ఉంది. బాంద్రాలో దాదాపు 3,042 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రెండు అంతస్తుల భవనం అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటి ధరను రూ. 40 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కంగనా అధికారికంగా వెల్లడించలేదు.అయితే గతంలో సెప్టెంబర్ 2020లో గ్రేటర్ ముంబయి అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత కంగనా కేసు దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు స్టే విధించింది. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కావాలనే నన్ను టార్గెట్ చేశారని కంగనా ఆరోపించింది. అప్పట్లో రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఆ తర్వాత మే 2023లో కంగనాపై అభియోగాలను బీఎంసీ ఉపసంహరించుకుంది. -
పిల్లలకు బహుమతిగా ఇచ్చినా తిరిగి తీసుకోవచ్చు...
పిల్లలు ఎదిగేంతవరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డాక ఇంకా ఈ బరువు బాధ్యతలు ఎందుకు... ప్రశాంతంగా వారి వద్ద గడిపేద్దాంలే అని ఉన్న ఆస్తులను వారికే పంచేస్తారు.కానీ, ఆస్తులను పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తులను తీసుకొని, ఇంటినుంచి గెంటేస్తే.. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో తరచూ వృద్ధులకు సంబంధించి వచ్చిన వార్తల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటోంది. వృద్ధుల ఆస్తులకు సంబంధించి రక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయో... తెలుసుకుందాం.మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలోని జెండా బజారుకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఉన్న మూడెకరాల భూమిని కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని కూలగొట్టి తల్లికి గూడు లేకుండా చేశారు. ఆస్తి పంచుకునే ముందు కొడుకులు నెలకు ఒకరి చొప్పున అమ్మను సాకుతామని ఒప్పందం చేసుకున్నారు. తీరా ఆస్తి పంచిన తర్వాత అసలు అమ్మ విషయాన్నే గాలికి వదిలేశారు. దాంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారిలో దయగల తల్లి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని, ఎవరో ఒకళ్ల ఇంటి అరుగులపై తలదాచుకోవలసి వస్తోందా వృద్ధురాలు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్, ఆస్తిని తీసుకుని తల్లిని వదిలేసిన కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని ΄ోషించాలని, లేదంటే ఆమె పంచి ఇచ్చిన యావదాస్తిని తిరిగి తల్లికి చెందేటట్లుగా చేస్తామని వారిని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007లోని (సీనియర్ సిటిజన్స్ యాక్ట్) సెక్షన్ 23(1) తల్లిదండ్రుల ఆస్తిని రక్షిస్తుంది. మోసాన్ని నిరోధించి, ్రపాథమిక సౌకర్యాలను కోల్పోకుండా పరి రక్షిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా ఈ హక్కులపై సీనియర్ సిటిజన్స్‌కు అవగాహన అంతంత మాత్రమే. సీనియర్లు తమ ఆస్తిని పంచి ఇచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్ ద్వారా ఆస్తి బదిలీని రద్దు చేసుకునే ఆవకాశంఉంది. ఆస్తిని తిరిగి ΄పోందవచ్చు... తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచించే వయోవృద్ధులైన తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ డీడ్‌లో ఒక ఎక్స్‌ప్రెస్ షరతును చేర్చవచ్చు. ఆస్తిని బహుమతిగా తీసుకున్న పిల్లలు ఈ షరతును ఉల్లంఘిస్తే, ఆ బహుమతి చెల్లుబాటు కానిదిగా ప్రకటించి, తల్లిదండ్రులు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. తల్లిదండ్రులు ప్రేమ, ఆ΄్యాయతతో లేదా సేవలకు బదులుగా పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని సూచించవచ్చు. అయితే, అస్పష్టతకు తావు లేకుండా ఎక్స్‌ప్రెస్ షరతును చేర్చడం ఉత్తమం అని పేర్కొన్నాయి. ఇంటినుంచి తరిమివేయవచ్చుసీనియర్ సిటిజన్ల ఆస్తుల నుంచి పిల్లలు లేదా ఆస్తి తీసుకున్న బంధువులను తొలగించడానికి సుప్రీం కోర్టుతో సహా కోర్టులు అనుమతించాయి. చట్టబద్ధమైన వారసులమనే కారణంతో తల్లిదండ్రులను వేధిస్తే ఇంటినుంచి బయటకు పంపివేయవచ్చని కూడా ఆదేశించింది. ముఖ్యమైన గమనికలు⇒ ఆస్తిలో ఆర్థిక పెట్టుబడులు, కాపీరైట్లు, పేటెంట్లు, ఆభరణాలు, కళాఖండాలు మొదలైనవి ఉండచ్చు. ∙ఆస్తుల వివరాలతో΄ాటు బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, ఎమ్‌ఎఫ్‌లు, షేర్లు, ఎఫ్డీలు, బీమా పాలసీలు, లోన్లు.. మొదలైన వాటి జాబితా కోసం న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదింపు అవసరం. అందుకని వారి వివరాలను తీసుకోండి. వారసత్వం, ఆస్తుల ప్రణాళికలో కీలకమైన భాగం వీలునామాను రూపోందించడం. దాని చెల్లుబాటును నిర్ధారించడానికి కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి... ఆస్తులకు సంబంధించిన వివరాలు, కంపైల్ చేయాల్సిన సమాచారంలో ఇద్దరు సాక్షులను, ఒక ఎగ్జిక్యూటార్ని నియమించుకోవాలి. ⇒వీలునామాలో మీ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వారి పేర్లను విధిగా నమోదు చేయాలి. లేకుంటే తర్వాత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. అవగాహన అవసరంవృద్ధుల రక్షణ చట్టం గురించి అవగాహన మన దేశంలో చాలా మందికి లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులు కూడా తమ సమస్యను చట్టం దృష్టికి తేవాలి. ఆస్తులు లేక΄ోయినా వృద్ధ తల్లిదండ్రులు మెయింటనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.– ఎ.పి.సురేష్, సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్ -
బ్యాంక్‌కు బురిడీ.. గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రెడీ
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియన్ బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయడానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 409 కోట్లు రుణం తీసుకున్న గంటా అండ్ కో ఎగ్గొట్టింది.తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేస్తామని పత్రిక ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. లోన్‌కు టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా మరో 8 మంది హామీదారులు ఉండగా, రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని టీడీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్‌లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
విజయవాడ: రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ పెద్ద చీడపురుగని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జనసేన స్థాపించిన పదేళ్లలో ఆయన సుమారు రూ.15 వందల కోట్ల నుంచి రూ.రెండు వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఆయన వెల్లడించారు. 2014లో కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఇటీవల కాలంలో పవన్ ఏ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించకపోయినా.. రూ.వందల కోట్ల లాభాలు రాకపోయినా జనసేన పార్టీ పెట్టాకే పవన్‌కు రూ.వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని నడపలేక తీసేశారుగానీ.. జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్.మాలాంటి వాళ్లందర్నీ రాజకీయంగా, ఆరి్థకంగా బలిపశువులు చేసి ఆయన మాత్రం అన్ని రకాలుగా బాగుపడ్డారు. కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, బీసీలను మార్పుకోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుణ్ణి, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని మాలాంటి వాళ్లను పవన్ బలి పశువులని చేసి ఆయన మాత్రం బాగా ఆరి్థకంగా బలపడ్డారు.ఈ సమావేశంలో పవన్ ఆక్రమాస్తులు.. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వాటి వివరాలను పోతిన మహేష్ వెల్లడించారు. అవి..మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామి అయినా నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద రూ.100 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆధార్ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. రెండు రిజి్రస్టేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరుకాగా.. మరొక రెండు రిజి్రస్టేషన్లకు నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి. నవీన్‌కుమార్ హాజరయ్యారు. డాక్యుమెంట్ నెంబర్లు : 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014.రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో పవన్ ఫామ్‌హౌస్ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్లో చూపించారు. కానీ, అది 45–50 ఎకరాల్లో ఉంది. పాతది 14 ఎకరాలైతే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు.2019 ఎన్నికల్లో పవన్‌కు ఎన్ఆర్ఐలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు రూ.125 కోట్ల విరాళాలిచ్చారు. వాటిని వసూలుచేసింది పీవీ రావు, ఆర్ఆర్ రామ్మోహన్, చింతల పార్థసారధి, ముత్తంశెట్టి కృష్ణారావు. అందులో 90శాతం నగదు రూపంలో, పది శాతం డీడీల రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందునే వాళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి.పవన్ నిజస్వరూపం తెలియాలంటే 2018–2024 వరకు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్ తప్ప పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి.పవన్ హైదరాబాదులో కొనుగోలు చేసిన 4,200 గజాల విలువ రూ.50 కోట్లుగా చూపించారు. దానిని 2021–2024 మధ్యే కొనుగోలు చేశారు. నిజానికి.. దాని విలువ సుమారు 125 కోట్లుగా ఉంది. మిగిలిన రూ.75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.పవన్ బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ల కింద రూ.28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ, బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో రూ.28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా?సినీ పరిశ్రమలోను, బయట పవన్ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. వీరితోపాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తంగేళ్ల సుమన్ వీరంతా కూడా ఆయన బినామీలే.ఇక పవన్ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్ మీద స్వా«దీనం చేసుకున్నారు. వాటినింకా రిజి్రస్టేషన్ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్సుల కింద తీసుకున్నట్లు చూపించి ఆపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నారు. అలాగే, హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనుక నాలుగు నెలలు కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది.టీ టైమ్ తంగెళ్ల శ్రీనివాస్‌కు 2,500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్ తన బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునేందుకు ఈ దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు.పవన్ తన పిల్లల పేర్లు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దుచేశానని చెప్పారుగానీ ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తానివి రద్దుచేసి ఏ ఆస్తి కొన్నారో చెప్పాలి.జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజి్రస్టేషన్ చేయించడంలేదు?ప్యాకేజ్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకే పవన్ విరాళాల ముసుగులో అమెరికా వెళ్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ యత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.పవన్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్ పవన్‌తో ఏడు సినిమాలు తీస్తానని చెప్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి?పవన్ ప్రధాన బినామి టీజీ విశ్వప్రసాద్‌పై సీబీఐ విచారణ చేయాలి. ఈడీ, సీఐడీలు కేసులు నమోదు చేయాలి. రేణుదేశాయ్‌కు ప్రతినెలా రూ.10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లి ఇస్తున్నారు.ప్యాకేజీకి అదనంగా పవన్‌కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 కోట్లు పవన్ వసూలుచేశారు. -
అధికారంలో ఉన్నా, లేకున్నా ఆస్తుల పెంపులో చంద్రబాబు తగ్గేదేలే !
-
35 ఏళ్లుగా అద్దె కుప్పమే
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజలు 35 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబును వారి సొంత మనిషిలా ఆదరిస్తూ, ఆయన్ని గెలిపిస్తున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఆ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ అదేదో అద్దె ఇంటిలానో, తనకు పట్టని ప్రాంతంలాగానో వ్యవహరిస్తున్నారు తప్పితే, ఆ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలని, అక్కడ తనకంటూ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎప్పుడూ భావించలేదు. చంద్రబాబునాయుడు 1983 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆ నియోజకవర్గాన్ని ఓ ఓట్ల యంత్రంగానే చూసి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినప్పటికీ, అక్కడి ప్రజలు మాత్రం చంద్రబాబును ఆదరిస్తూనే వచ్చారు. అయినా చంద్రబాబు ఆ ప్రాంతంపై శీతకన్నే వేశారు. ఆ ప్రాంతం తనను ఆదరిస్తున్నందుకు గుర్తుగా అయినా ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. 1984లో టీడీపీలో చేరగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో స్థలం కొని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఆయన సొంతిల్లు కట్టుకోలేదు. తాను రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకొన్న అమరావతిలోనూ కట్టుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉండగానే హైదరాబాద్‌లోనే మరో అత్యాధునిక భవంతిని నిర్మించుకున్నారు. అటు సొంత నియోజకవర్గం కుప్పంని, ఇటు ఆయన రోజూ చెప్పే అమరావతి పైనా ఆయనకు ఓట్ల యావే తప్ప వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన సొంతింటితోపాటు ఆస్థిపాస్తులు చాలావరకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రజలకూ తొలిసారి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయి. దీంతో కుప్పం ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. దీంతోపాటు సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదా అని అందరూ ఎండగట్టడం ప్రారంభించారు. దీంతో 2022లో అక్కడ స్థలాన్ని కొని, ఇల్లు కడుతున్నట్లు చంద్రబాబు హడావుడి చేశారు. అక్కడ తాను ఇల్లు కట్టుకుంటున్నట్లు శుక్రవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనూ పేర్కొన్నారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలో వ్యవసాయేతర భూమి 95.23 సెంట్లు ఉందని, దాని విలువ రూ.77.33 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అక్కడే ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభమై సంవత్సరంన్నర అవుతోంది. సాధారణంగా ఒక సొంతింటి నిర్మాణం కొన్ని నెలల్లో పూర్తవుతుంది. కానీ, చంద్రబాబు ఇంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి చేస్తారో లేదో కూడా తెలియదు. భారీగా పెరిగిన ఆస్తులు అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు, కేసులు ఉన్న చంద్రబాబు.. అధికారంలో లేకున్నా ఆదాయానికి లోటు లేదన్న విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల విలువలు చెబుతున్నాయి. తనపై ఉన్న కేసులు, తన ఆస్థిపాస్తుల వివరాలను అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం గత ఐదేళ్లలో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తుల విలువ 40 శాతం పెరిగింది. 2014లో రూ.176 కోట్లున్న వారి ఆస్తుల విలువ 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.700 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం వారిద్దరి ఆస్తుల విలువ రూ.936.58 కోట్లుగా అఫిడవిట్లో తెలిపారు. రూ.121.41 కోట్ల చరాస్తులు, రూ.815.17 కోట్ల స్థిరాస్తులు చూపించారు. భువనేశ్వరికి హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్ల విలువే రూ.763 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆమెకు రూ.1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు తన కొడుకు లోకేశ్‌తో ఉమ్మడిగా ఉన్న ఇంటి ప్రస్తుత విలువ రూ.70.20 కోట్లుగా చూపించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుంది. నారావారిపల్లె శేషాపురంలో ఉన్న ఇల్లు విలువ రూ.43.66 లక్షలుగా చూపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది కూడా సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. తన చేతిలో రూ.11,560 నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 2,45,378, ఒక అంబాసిడర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు. 24 క్రిమినల్ కేసులు.. అందులో 8 అవినీతి కేసులే తాను 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. ఆయన అరెస్టయి జైల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అందులో ఒకటి. ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిçస్టలరీలు, బ్రాండ్లకు అక్రమంగా అనుమతులివ్వడం, రాజధాని ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కాంట్రాక్టు జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో తెలిపారు. -
గంటా శ్రీనివాస్ బంధువుల ఆస్తులు వేలం
-
సానియా ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే...
-
దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?
ముంబయి: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) జనవరి 5న వేలం వేయనుంది. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వికుల ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమితో సహా నాలుగు ఆస్తులు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాపర్టీల ధర రూ. 19.2 లక్షలు. ఇందులో చిన్న ప్లాట్‌ను రూ. 15,440 రిజర్వ్ ధరగా ఉంచారు. అంతకుముందు 2017, 2020లో దావూద్ ఇబ్రహీంకు చెందిన 17 ఆస్తులను SAFEMA వేలం వేసింది. "దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీకి చెందిన నాలుగు ఆస్తులను జనవరి 5న వేలం వేస్తున్నాం. ఈ ఆస్తులు మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో వ్యవసాయ భూమి రూపంలో ఉన్నాయి. జనవరి 5న మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 గంటల మధ్య వేలం ప్రక్రియ జరగనుంది" అని SAFEMA ఓ ప్రకటనలో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం, ఆయన కుటుంబ సభ్యులపై స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో ఈ ఆస్తులు అటాచ్ చేశారు. 2017లో వేలం వేసిన దావూద్ ఆస్తులు రూ.11 కోట్లు పలికాయి. 2020లో, వేలంలో దావూద్ ఆస్తులు రూ. 22.79 లక్షలు పలికాయి. ఇదీ చదవండి: Lok Sabha Election: తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ? -
సినిమాలు, రాజకీయాలు.. విజయ్‌కాంత్ ఆస్తులు ఎన్ని కోట్లంటే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్(71) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: విజయ్‌కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!) అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్‌కాంత్ గురించి సినీ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కాంత్ తన సుదీర్ఘ కెరీర్లో ఎంత సంపాదించారు? ఆయనకున్న ఆస్తుల విలువ ఎంత? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన 1991 చిత్రం కెప్టెన్ ప్రభాకరన్‌లో సాహసోపేతమైన పోలీసు అధికారి పాత్రలో మెప్పించారు. అప్పటి నుంచి అభిమానులు ఆయనను 'కెప్టెన్' అని ముద్దుగా పిలుచుకున్నారు. 2016లో విజయకాంత్ ఉలుందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.7.6 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. నగదు, బ్యాంకుల్లో ఉన్న వివరాలతో పాటు ఆయన వివరాలు సమర్పించారు. అతని భార్య ప్రేమలతతో పాటు.. అతనిపై ఆధారపడిన వారి ఆస్తులు కూడా కలిపి మొత్తం ఆస్తులు రూ. రూ.14.79 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. (ఇది చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) అంతే కాకుండా వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు విలువ రూ. రూ. 19.37 కోట్ల ఆస్తులు ఆయన పేరుమీద ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య ప్రేమలత విజయ్‌కాంత్ పేరుపై రూ. 17.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. దీని ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అన్ని రకాల అప్పులు మొత్తం రూ. 14.72 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో మొత్త స్థిర, చరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.53 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా 2016లో ప్రకటించిన ఆస్తుల విలువ కాగా.. ఎన్నికల సమయంలో ఈ వివరాలు విజయ్‌కాంత్ సమర్పించారు. -
ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! ముందే చేయించుకుంటే ఆఫర్..
దేశ రాజధాని నగరం ఢిల్లీ దేశంలోని అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. స్థానికులకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మందికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి అని ప్రకటించింది. ముందే చేయించుకుంటే రాయితీ ఎంసీడీ పరిధిలోని ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుల పూర్తి, కచ్చితమైన సమాచారం లభిస్తుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. మేరకు అన్ని ప్రాపర్టీలకు జియోట్యాగింగ్ తప్పినిసరి అని వాటి యజమానులకు స్పష్టం చేసింది. అంతేకాకుండా 2024 జనవరి 31 లోపు జియోట్యాగింగ్ చేయించుకున్న వారికి ఆస్తిపన్నుపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రాపర్టీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్ద ప్రకటన చేసే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరినీ సంప్రదించుకుండా, యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. -
ఖరీదైన భవనం కొనుగోలు చేసిన సీఈఓ.. ధర ఎంతంటే..?
భారత్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1,446 కోట్లు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని హైడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబెర్కాన్వే హౌస్‌ను పూనావాలా కొనుగోలు చేశారు. ఈ భవనం 1920 నాటిది. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్‌కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి అదర్ పూనావాలా దీన్ని కొనుగోలు చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. లండన్‌లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. లండన్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డుల్లో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్‌కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్‌కు చెందిన ఓ కీలక పదవిలోని వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్హౌజ్గా వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ లండన్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాఅజిజ్కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు(రూ.2100 కోట్లు)కు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్’గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పునావాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హనోవర్లాడ్జ్ (రూ.1180 కోట్లు) నిలిచింది. -
రూ.538 కోట్ల విలువైన జెట్‌ఎయిర్‌వేస్ ఆస్తులు సీజ్
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబాయ్ సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్లు, ఇతర ఆస్తులను ఈడీ ఈ మేరకు సీజ్ చేసింది. దాదాపు 26 సంవత్సరాలుగా పూర్తి వాణిజ్య సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నగదు కొరత కారణంగా ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. 2019లో గోయల్ ఎయిర్‌లైన్ చైర్‌పర్సన్‌గా వైదొలిగిన తర్వాత జెట్ ఎయిర్వేస్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ని దాఖలు చేసింది. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో ఈడీ నరేష్ గోయల్‌ను అరెస్టు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో నేరష్ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఈడీ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల ఆస్తులపై ఈ ఏడాది జులైలోనే ఈడీ దాడులు జరిపింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021 జూలై 29న ఈ కేసును మోసంగా ప్రకటించబడిందని కూడా సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
అప్పు చేసి.. ఆస్తి అమ్మి..
ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు. ... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్ఎస్ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు. - గౌటే దేవేందర్ -
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే?
బాలీవుడ్లో బిగ్‌బీ పేరు తెచ్చుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. 1970లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దాదాపు ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా సినీరంగంలో కొనసాగుతున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఆయన పూర్తిపేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్ కాగా.. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో గుర్తింపు పొందారు. అమితాబ్ బచ్చన్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్ 11, 1942లో జన్మించారు. తాజాగా 81వ వసంతంలోకి ఆయన అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్‌బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!) అయితే ఆయన కేవలం రూ.500 జీతంతో మొదట తన కెరీర్‌ను ప్రారంభించారు. 40 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తోన్న అమితాబ్‌కు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.3,600 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో నటించడానికి రూ.5 నుంచి 10 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారు. కేవలం వ్యాపార ప్రకటనలకైతే దాదాపు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పలు స్టార్టప్ వ్యాపారాల్లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. సినిమాలు, ప్రకటనల ద్వారా ఏడాది దాదాపు రూ.60 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముంబైలో ఖరీదైన నివాసం అమితాబ్ బచ్చన్‌కు ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జుహు ప్రాంతంలోని జల్సా అనే బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ నివాసం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇదే కాకుండా ఆయన నగరంలో మరో మూడు బంగ్లాలు ఉన్నాయి. వీటి విలువ సైతం కోట్ల రూపాయల్లో ఉంటుంది. (ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్) అంతే కాకుండా ఆయన గ్యారేజీ ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు ఉన్నాయి. లెక్సస్, రోల్స్ రాయిస్, బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌తో పాటు దాదాపు 10కి పైగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. ఆయనకు రూ.260 కోట్లు విలువచేసే ప్రత్యేకమైన జెట్ విమానం కూడా ఉంది. కాగా.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898ఏడీ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో గణపత్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..
ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం.. కొనే ముందు డాక్యుమెంట్లు.. స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు. అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్ డీడ్. ఈ రెండింటినీ టైటిల్ డీడ్స్ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్ అయి ఉండాలి. లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్‌ను కొనుక్కోవడానికి ముందు ఓనర్ ఎవరు? ఆ ఓనర్‌కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం. సబ్ రిజిస్ట్రార్ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. మ్యుటేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్ పత్రంలో ఉండాలి. ఫ్లాట్ అయితే జాయింటు డెవలప్మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్ ఉన్న వాళ్లు అమ్మాలి. బిల్డింగ్ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది. సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్వోసీ. అలాగే విద్యుత్ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి. ఒరిజినల్ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం. అలాట్మెంట్ లెటర్. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు. మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు. మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్షిప్ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు. సబ్–రిజిస్ట్రార్ నుండి ఒరిజినల్ ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్ వేల్యుయేషన్ సర్టిఫికెట్ చూసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్‌లో టెంపుల్ టౌన్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్‌లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్‌లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్‌తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్‌లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
మ్యుటేషన్ పంచాయితీ..! సమస్య ఏంటి..?
కరీంనగర్: ఇది పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న దుస్థితి. ఆస్తులు తమవే అయినా.. పేర్లు మారకపోవడం.. యజమానులు మరణించడం.. వెరిసి ఏంచేయాలో తెలియక వారసులు సతమతమవుతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అసలేం జరిగింది? ఒకప్పుడు గ్రామాల్లో ఆస్తుల బదిలీ రెండు రకాలుగా జరిగేది. మొదటిది వారసుల పేరు మీదికి.. రెండోది ఇంటిని కొన్న వారి పేర మ్యుటేట్ అయ్యేవి. ఇందుకు సంబంధించిన ‘ఇ–పంచాయత్’ వెబ్సైట్లో మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఇందుకోసం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండేవి. అందులో మొదటిది విరాసత్, రెండోది కోర్టు డిక్రీ. ఇందులో ఇంటి యజమానులు తమ ఆస్తులను విరాసత్ దరఖాస్తు ద్వారా వారసులకు ఇచ్చేవారు. రెండు కొనుగోలు చేసుకున్న వారు కోర్టు డిక్రీ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఈ దరఖాస్తులను గ్రామ పంచాయతీ సెక్రటరీ విచారణ జరిపిన తర్వాత ఆస్తి మ్యుటేట్ అయ్యేది. గతంలో ఎడిట్ ఆప్షన్ ఉండేది. దీంతో ఏమైనా తప్పులు ఉన్నా దాన్ని అక్కడే పరిష్కరించుకునేవారు. ఇది చాలా వేగవంతమైన ప్రక్రియ తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యేది. ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్, బీపాస్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. గ్రాపపంచాయతీ ఆస్తుల రిజిస్ట్రేషన్లు అన్నీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. దీంతో ‘ఇ–పంచాయత్’ వెబ్సైట్లో విరాసత్, కోర్టు డిక్రీ ఆప్షన్లు మాయమయ్యాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు బదిలీ కాక అలాగే మిగిలిపోతున్నాయి. సమస్య ఏంటి? నాలుగు జిల్లాల్లోని గ్రామాల్లో వేలాది ఇండ్లకు సరైన ధ్రువపత్రాలు లేవు. దశాబ్దాల తరబడి వారసత్వంగా ఇండ్లు చేతులు మారుతున్నాయి. వాటికి ఇంటి నెంబర్లు ఉంటాయి. ఏటా ఇంటి పన్నులు కడుతారు. కానీ.. ఆ ఇల్లు కొన్నట్లు, కట్టినట్లు ఎలాంటి పత్రాలు లేవు. వాస్తవానికి గ్రామపంచాయతీల ఆవిర్భవానికి ముందు నుంచే ఆ ఇళ్లు మనుగడలో ఉన్నాయి. ఇలాంటి ఇళ్ల పరిస్థితుల్లో ప్రధానమైన చిక్కులు తలెత్తుతున్నాయి. అడ్డంకులివే.. ► ఇంటి యజమానులు లేకుంటే ఆ ఇళ్లు వారసుల పేరిట బదిలీ కావడం లేదు. యజమాని బతికుంటే విరాసత్ సజావుగా సాగుతున్నాయి. ► ఇంటి నెంబరు, ఇంటి పన్నులు కట్టిన కాగితాలు తప్ప ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేని ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ► ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లు.. అంతకుముందు సరైన డాక్యుమెంట్లు లేని ఇండ్లను చాలామందే కొనుగోలు చేశారు. వీటిలో చాలామటుకు మ్యుటేషన్ కాలేదు. టీఎస్ బీపాస్‌తో ఆస్తులు మ్యుటేషన్ కాకపోవడంతో ఆఫీసర్లు పక్కన పెడుతున్నారు. ► గతంలో రేకుల ఇల్లు/ పెంకుటిల్లును కూల్చి, గ్రామంలో కొత్తగా జీ 2 నిర్మించుకున్నా సరే ఆన్లైన్లో ఇంకా పాత రేకుల ఇల్లు/ పెంకుటిల్లుగానే చూపెడుతోంది. ‘ఎడిట్’ ఆప్షన్ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న యజమానులు, పన్నులు రాక పంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇబ్బందులివీ.. ► కుటుంబ అవసరాలకు ఇంటిని విక్రయించాలనుకుంటున్న వారికి పేరుమార్పిడి నిబంధన ఇబ్బందికరంగా మారింది. ► పెళ్లీళ్లు, అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ► ఆస్తులు అమ్మాలనుకుంటున్న వారు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ► వృద్ధులు, నిరక్షరాస్యులు ఏంతెలియక సతమతమవుతున్నారు. ఇంకొన్నిచోట్ల ఇదే అదనుగా కొందరు ఇదిచేస్తాం.. అదిచేస్తామంటూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ► గతంలో ఇంటిని కొన్నాక.. ఇప్పుడు మ్యుటేషన్ కాకపోవడంతో కొనుగోలుదారుడు, విక్రయదా రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పేరు మారని ఆస్తులు మాకేందుకంటూ నిలదీస్తున్నారు. -
గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన్ని తలపిస్తున్న షారుక్ సౌధం!
సినీ తారల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఆదాయం కోట్లలోనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. స్టార్ హీరోల విషయాకొనికొస్తే ఏకంగా వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటి వారి లైఫ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ తారలకైతే ఇండియాతో పాటు విదేశాల్లోనూ లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆస్తులు కొనుగోలు చేశారు. అలా కోట్ల విలువైన అత్యంత లగ్జరీ విల్లా కలిగిన స్టార్ హీరో గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. (ఇది చదవండి: మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్! ) ప్రస్తుతం జవాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన హీరో షారుక్ ఖాన్. బాలీవుడ్ బాద్షాగా పేరుపొందిన ఆయనకు ఇప్పటికే ముంబయిలో ఉన్న హోమ్ మన్నత్ గురించి అందరికీ తెలిసిందే. అతన్ని చూసేందుకు అభిమానులు సైతం ఇంటి బయట కనిపిస్తుంటారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీంతో ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుబాయ్ విల్లా 'జన్నత్' గురించి మీకు తెలుసా? 'స్వర్గానికి ఏ మాత్రం తీసిపోని దుబాయ్ ఇంటి గురించి తెలుసుకుందాం. షారూఖ్ ఖాన్ దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అతనికి అక్కడ కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. రూ.100 కోట్ల విలువైన అందమైన పామ్ జుమేరాలో అతనికి లగ్జరీ విల్లా ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం నఖీల్ 2007లో ఈ గ్రాండ్ విల్లాను షారూఖ్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. దీనికి ఇంటీరియర్‌ను షారుక్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దుబాయ్‌లోని అతని ఇంటిని 'జన్నత్' అని పిలుస్తారు. అంటే స్వర్గం అని అర్థం. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? 63 ఏళ్లంటే నమ్ముతారా?) జన్నత్ ప్రత్యేకతలు.. షారూఖ్ ఖాన్ 'జన్నత్' విల్లా ప్రత్యేకతలు తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఇందులో ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. 'జన్నత్' విల్లా దాదాపు 14 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో 6 బెడ్రూమ్లు ఉన్నాయి. బీచ్-వ్యూగా ఉండే ఇందులో రెండు రిమోట్ కంట్రోల్ గ్యారేజీలు. ఒక ప్రైవేట్ పూల్ కూడా ఉన్నాయి. ఈ ఆస్తి గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. ది దుబాయ్ స్కైలైన్ వ్యూ అని.. ఈ ప్లేస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా షారుక్ తరచుగా దుబాయ్‌కు వెళ్తాడు.. అందుకే నగరంలో ఇల్లు ఉండటం మంచిదని ఆమె అన్నారు. విల్లా గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ..' ఫ్లోర్, వాల్ కవరింగ్‌లను ముందే డిజైన్ చేశారు. అయితే పిల్లల గదిని వారి అభిరుచుల ఆధారంగా డిజైన్ చేశాను. ఆర్యన్ ఖాన్, సుహానా, అబ్రామ్ ఖాన్ కూడా విల్లాలో వారి ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ గదిలో పెద్ద టీవీ. అబ్రామ్ ఖాన్ ఎక్కువ సమయం బీచ్‌లో గడుపుతాడు. సుహానా ఖాన్ పూల్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.' అని వెల్లడించింది. అలాగే ముంబయి, దుబాయ్‌తో పాటు లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, అలీబేగ్లలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ వచ్చే నెల 7న రిలీజ్ కానుంది. -
నోటరీ ‘క్రమబద్ధీకరణ’పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరించడంపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని నోటరీ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలువురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇలాంటి భూములను క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని తక్కు వ మొత్తంలో భూమి కొన్న పేదలకు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయన్నారు. 125 చదరపు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానా ఆదాయం కోల్పోతుందని చెప్పారు. నోటరీ భూ విక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి జూలై 26న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 84 కొట్టివేయాలని ‘ది భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్’పిల్లో కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ సడలింపు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించే వారికి మార్గం సుగమం చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. -
ఆమె ఒక స్టార్ హీరోయిన్.. వామ్మో ఇన్ని కోట్ల ఆస్తులా?
సినీ ఇండస్ట్రీలో తారల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్స్‌గా ఎదిగినా వారికైతే కోట్లలో పారితోషికాలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాలే కాకుండా ఇంకా ప్రకటనల్లో నటిస్తూ కోట్లలోనే గడిస్తూ ఉంటారు. అది సినీ ఇండస్ట్రీలోని స్టార్ ముద్ర వేసుకున్న నటీనటుల రేంజ్. సాధారణంగా హీరోయిన్ల కంటే.. హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే పారితోషికం విషయానికి వచ్చేసరికి కాస్తా తక్కువే. అయితే కేవలం వాటితోనే కాకుండా బిజినెస్‌లోనూ కోట్లు గడించేవారు ఉన్నారు. అలాంటి వారిలో ముందువరుసలో వినిపించే పేరు ఆలియా భట్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదాయం హీరోలకు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అసలు ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!) రూ.560 కోట్ల ఆస్తులు బాలీవుడ్ భామ హీరోయిన్ మాత్రమే కాదు. మంచి బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు దాదాపు రూ.150 కోట్ల రూపాయల విలువైన 'యాడ్-ఎ-మామా' అనే ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉంది. ఈ బిజినెస్ ద్వారా అలియా భట్ విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. గతేడాది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 560 కోట్ల విలువతో భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్గా నిలిచింది. ఆలియా భట్ ఆస్తులు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ విలాసవంతమైన మూడు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌లో ఒకటి ఉండగా.. ముంబైలోని జుహు, బాంద్రాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతానికి అలియా సోదరి షాహీన్ జుహూ ఇంట్లో ఉంటోంది. అలియా మొదటిసారి ఇంటిని ఇండియాలో కాకుండా లండన్‌లోనే కొనుగోలు చేసిందట. గతంలో లండన్‌లో సొంతిల్లు ఉండాలనేది తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా భట్ లండన్ ఇంటి విలువ రూ.25 కోట్ కాగా.. అది కోవెంట్ గార్డెన్లో ఉంది. 2020లో అలియా భట్ బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. వాస్తు పాలి హిల్స్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ.40 కోట్లు కాగా.. అదే బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఏడో అంతస్తులో రణబీర్ కపూర్‌కు కూడా ఓ ఇల్లు ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు రూ. 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌తో పాటు అలియా భట్‌కు ఇంకా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద ప్రస్తుతం 3 ఆడి కార్లు ఉన్నాయి. (ఇది చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) రూ.150 కోట్ల బిజినెస్ అలియా భట్ తాన సొంతంగా 'యాడ్-ఎ-మామా' పేరుతో దుస్తుల బ్రాండ్ 2020లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 150 కోట్లకు చేరుకుంది. ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అలియా భట్ కంపెనీని రూ. 300-350 కోట్లకు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అంతే కాకుండా అలియా భట్ ఒక ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె 2019లో ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ పేరుతో దీన్ని లాంఛ్ చేసింది. ప్రొడక్షన్ హౌస్ పేరుతో ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో 38 కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసింది బాలీవుడ్ భామ. ఒకవైపు నటనతో పాటు.. మరోవైపు బిజినెస్‌లోనూ సక్సెస్ సాధిస్తూ కోట్లు గడిస్తున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఆలియా భట్ కొనసాగుతోంది. ఈ రేంజ్లో సంపాదిస్తున్న ఇప్పటి స్టార్ హీరోయిన్లు నయనతార, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, సమంత కూడా ఆలియాకు పోటీనిచ్చే స్థాయిలో లేరని తెలుస్తోంది. -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
అడవి చింత.. చారెడంత!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అరే.. చింతగింజలు ఏమిటి ఇంత భారీ సైజులో కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇవి చింతగింజలు కాదు.. అచ్చం వాటిని పోలినట్లు ఉండే అడవిచింత గింజలు! మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో పెరిగే ఓ భారీ తీగ జాతి మొక్క నుంచి వీటిని సేకరిస్తారు. ఈ మొక్క కాండం చాలా పొడవుగా ఉంటుంది. దీని కాయలు సుమారు 4–5 అడుగుల వరకు పెరుగుతాయి. అచ్చం చింతకాయలను పోలి ఉండటంతో వీటిని ఆయా రాష్ట్రాల సరిహద్దులో ఉండే తెలుగువారు అడవిచింత గింజలుగా పిలుస్తున్నారు. ఈ గింజలను కరీంనగర్‌లోని పలు కూడళ్ల వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజనులు ఒక్కోటి సుమారు రూ. 30 వరకు విక్రయిస్తున్నారు. ఈ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని... పచ్చకామెర్లు, పంటినొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే గుణం వీటికి ఉందని చెబుతున్నారు. ఈ చింతగింజల నుంచి తీసిన నూనెను ఏదైనా గానుగ నూనెతో కలిపి కీళ్లనొప్పులకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. దట్టమైన అడవిలోనే పెరుగుతాయి ఈ అడవిచింత సీసాల్పనేసి కుటుంబపు మొక్క. దీని శాస్త్రీయ నామం ఎంటాడా పరిసేత. అధిక వర్షపాతంగల దట్టమైన అడవుల్లో పెరిగే ఔషధ మొక్క. ఈ తీగజాతి నుంచి గుత్తులు గుత్తులుగా చింతపండు ఆకారంలో వచ్చే పొడవైన కాయల నుంచి గింజలను గిరిజనులు సేకరిస్తారు. తెలంగాణలో ఇలాంటి తీగజాతులు ఎక్కడాలేవు. ఏపీలోని తలకోన, శేషాచలం అడవులు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు వాటికి అనుకూలం. – డాక్టర్ నరసింహమూర్తి, శాతవాహన యూనివర్సిటీ -
రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే
టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ (53) ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. 1,500కి పైగా సినిమాల్లోని పాటలకి పని చేసిన ఆయన.. తర్వాత పలు డాన్స్ రియాలిటీ షోలతో మెరిశారు. కరోనా సమయంలో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. ఆ తర్వాత రాకేశ్ మాస్టరే సొంతంగా పలు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని పలు వీడియోలు అందులో పోస్ట్‌చేసే వారు. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కడ ఆయన మామగారు పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. (ఇదీ చదవండి: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్) '1996లో కొంత మంది యువకులను గ్రూప్‌గా తయారు చేసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రాకేశ్ మాస్టర్ వచ్చాడు. నాది విజయవాడు.. శేఖర్ మాస్టర్ మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. దీంతో శేఖర్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. శేఖర్‌కు కూడా డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో నేనే అతన్ని రాకేశ్ మాస్టర్ వద్దకు చేర్చాను. ఇలా వారిద్దరూ సినీ పరిశ్రమలో పేరుపొందారు. ఆ రోజుల్లోనే వారి కష్టంతో వచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చేవారు.. దానిని నేనే దాచి హైదరాబాద్‌లోని బోరుబండలో ఇళ్లు కొన్నాను. అందులోనే కొద్దిరోజులు అందరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత నేను విజయవాడ వెళ్లిపోయాను. ఈ మధ్య ఎస్ఆర్కే పేరుతో రాకేశ్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు. దాని నుంచి మంచి ఆదాయం వస్తుంది. కొద్దిరోజుల క్రితం నా వద్దకు ఒక ఖాళీ అగ్రిమెంట్ పేపర్‌తో రాకేశ్ మాస్టర్ వచ్చి ఇలా అన్నాడు. 'మామయ్య నువ్వు చనిపోతే నీ కుంటుంబాన్ని నేను కాపాడుతా... ఒకవేళ నేనే ముందు చనిపోతే నీవు అన్యాయం అయిపోతావ్ కాబట్టి ఈ అగ్రిమెంట్ పేపర్ తీసుకో .. నేను చనిపోయిన తర్వాత ఈ ఖాళీ పేపర్లో నీకు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు.' (ఇదీ చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?) కొడుకు మాదిరి చూసుకున్న వాడే నేడు లేడు.. ఈ ఆస్తులు తనకెందుకు అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్‌ను శేఖర్,సత్య మాస్టర్ ముందే ఆ పెద్దాయన చింపేశాడు. తను కష్టపడి సంపాధించిన ఆస్తి రాకేశ్ మాస్టర్ బిడ్డలకే చెందుతుందని ఆయన తెలిపాడు. ఆయన శిష్యులుగా పిల్లల బాధ్యతను తీసుకుంటామని శేఖర్,సత్య మాస్టర్లు ప్రకటించారు. -
‘ప్రధాని మోదీ నా కుమారుడు.. ఆయనకు నా ఆస్తి రాసిస్తా’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమ్మ ఇటీవలే చనిపోయారు. ఆమెకు చేయాల్సిన అన్ని ఖర్మక్రతువులను మోదీ దగ్గరుండి చేయించారు. ఇప్పుడేమో మరో అమ్మ తెరపైకి వచ్చింది. ఇదేంటి అనుకుంటున్నారా? అసలు కథేంటంటే.. మంగీబాయికి వయసు 100 ఏళ్లు. ఆమెకు 14 మంది పిల్లలు ఉండగా.. మోదీని తన 15వ కొడుకుగా భావిస్తున్నానని చెప్పింది. ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తనవంటి వారి కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. మోదీకి మాత్రమే ఓటేస్తానని ఆమె వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపురా గ్రామానికి చెందిన ఆ వృద్ధురాలు మంగీబాయి తన్వర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ప్రధాని మోదీ దేశానికి చాలా చేస్తున్నారని, తన కోసం కూడా చాలా చేశారని అన్నారు. అయన తనలాంటి వృద్ధులకు ఆహారం, వసతి వంటివి కల్పించారని చెప్పారు. 'మోదీ నాకు ఇల్లు ఇచ్చారు.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.. వితంతు పింఛన్ ఇస్తున్నారు, ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగాను.. అందుకే నా కొడుకు. అవకాశం దొరికితే స్వయంగా ప్రధానిని కలవాలనుకుంటున్నాను’’ అని మంగీబాయి చెప్పింది. తన పేరున ఉన్న 25 బిగాస్ (15 ఎకరాల) భూమిని ప్రధానికి రాసిస్తానని 100 ఏళ్ల బామ్మ చెప్పడం సంచలనంగా మారింది. మంగళవారం మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటించనున్న సందర్భంగా ఈ వీడియో వైరల్‌గా మారడం గమనార్హం. చదవండి: మహారాష్ట్ర వేదికగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ కౌంటర్ -
25 శాతం వృద్ధిపై శ్రీరామ్ ప్రాపర్టీస్ కన్ను
న్యూఢిల్లీ: శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల విక్రయాల (బుకింగ్‌లు) పరంగా 25 శాతం వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.మురళి ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇళ్ల విక్రయ బుకింగ్‌ల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,846 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. 2021–22లో విక్రయాల ఆదాయం రూ.1,482 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైనట్టు మురళి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఖ్యా పరంగా 20 శాతం, విలువ పరంగా 25 శాతం వృద్ధిని సాధించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. 2021–22లో ఈ సంస్థ 3.8 మిలియన్ చదరపు అడుగుల మేర విక్రయాలు చేయగా, 2022–23లో 4.02 మిలియన్ చదరపు అడుగుల అమ్మకాలను సాధించింది. పెరుగుతున్న ఇళ్ల డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు మురళి తెలిపారు. ‘‘మార్కెట్ ఎంతో అనుకూలంగా ఉంది. మధ్యస్థ, అందుబాటు ధరల ఇళ్లకు మించి డిమాండ్ నెలకొంది. పలు అంశాల కారణంగా వచ్చే 3–5 ఏళ్లపాటు డిమాండ్ కొసాగుతుందని అంచనా’’అని మురళి వివరించారు. ఇతర రంగాల్లో స్థిరమైన వృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్‌లోనూ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ ప్రాపర్టీస్ 2021 డిసెంబర్లో స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అవయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.68 కోట్లకు చేరుకుంది. -
పాపం ఓ తండ్రి గాధ : ఆస్తి రాయించుకున్న కొడుకు ఇంటి నుంచి గెంటేశాడు
మదనపల్లె : తనకున్న యావదాస్తిని కొడుకు పేరుతో రాసి ఇస్తే.. కనికరం లేకుండా తనను ఇంటి నుంచి గెంటేశాడని, వృద్ధాప్యంలో పోషణకు తనకు మెయింటెన్స్ ఇప్పించాల్సిందిగా ఓ తండ్రి సబ్ కలెక్టరేట్లో సీనియర్ సిటిజన్స్ కోర్టులో కేసు వేశాడు. ఇందులోభాగంగా సోమవారం ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ కేసును విచారించారు. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ అండేవారిపల్లెకు చెందిన అండేకృష్ణమూర్తి (85)కు ఒక కుమారుడు అండే వెంకటనాగేశ్వరం, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అండే కృష్ణమూర్తి పెద్ద భూస్వామిగా గ్రామంలో పేరు ఉండటమే కాకుండా మదనపల్లె పట్టణంలో కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటన్నంటినీ ఆయన తన నలుగురు కూతుళ్లను కాదని, ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న కొడుకు అండే వెంకటనాగేశ్వరం పేరుతో రాసి ఇచ్చాడు. ఆస్తి మొత్తం తన పేరు మీదకు బదలాయింపు జరిగాక వెంకటనాగేశ్వరం తండ్రిని పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటకు పంపేశాడు. దీంతో ఆయన దిక్కుతోచని స్థితిలో భార్యతో కలిసి రెండో కుమార్తె వద్ద ఆశ్రయం పొందాడు. యావదాస్తిని కొడుకు పేరు మీద రాసి, వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న దిగులుతో ఏడాదిన్నర క్రితం అండే కృష్ణమూర్తి భార్య చనిపోయింది. కుమార్తె వద్ద ఉంటున్న కృష్ణమూర్తికి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండటంతో తన వైద్యఖర్చులకు ప్రతినెలా కుమారుడి నుంచి రూ.10,000 మెయింటెన్స్ ఇప్పించాల్సిందిగా సీనియర్ సిటిజన్స్ కోర్టులో కేసు వేశాడు. దీనిపై ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ ఇప్పటికే రెండుసార్లు విచారించి అండే వెంకటనాగేశ్వరంను హాజరుకావాల్సిందిగా కోరినప్పటికీ విచారణకు రాలేదు. దీంతో అతడికి ఫైనల్ నోటీసు పంపుతున్నామని, విచారణకు హాజరుకాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ తెలిపారు. -
మోదీకి 1500 కోట్ల విలువ చేసే ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన అంబానీ
-
సచిన్ ఆస్తుల విలువ ఎంతంటే..?
-
అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్ కొన్న ఏకైక హీరోయిన్ కేఆర్ విజయ.. ఇప్పుడెలా ఉందంటే!
సీనియర్ నటి కేఆర్ విజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె దేవత పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందారు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు లెజెండ్స్‌తో పాటు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల సరసన నటించి మెప్పించారు. స్టార్ నటిగా కొనసాగుతున్న క్రమంలోనే ఓ బడా వ్యాపావేత్తనుపెళ్లి చేసుకున్న ఆమె బాగా సెటిలైపోయారు. చదవండి: అప్పుడు విష్ణుకు సన్నిహితంగా.. ఇప్పుడు మనోజ్ అనుచరుడిగా.. అసలు ఎవరీ సారథి? భర్త చనిపోవడంతో కూతురితో కలిసి చెన్నైలో నివసిస్తున్న కేఆర్ విజయ గతంలో ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. తాజాగా ఆమె పాత వీడియో మరోసారి వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కాగా పెళ్లి అనంతరం ఓ మహారాణిలా లైఫ్ లీడ్ చేసిన ఆమె వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారట. అప్పట్లోనే ఆమెకు సొంతంగా హెలికాప్టర్ ఉండేదని, దానిని ఆమె భర్తే నడిపేవారని చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు ఇలా ఎక్కడ సినిమా షూటింగ్స్ ఉన్నా సొంత హెలికాప్టర్లోనే ప్రయాణించేవారట. చదవండి: స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం అప్పట్లో ఏ హీరో కూడా సొంత హెలికాప్టర్ లేకపోవడం గమనార్హం. ఆమె భర్తకు వివిధ రకాలు బిజినెస్ ఉండేవని, ఈ క్రమంలో మద్రాస్ సమీపంలో ఏకంగా 67 ఎకరాలు తోట కోనుగోలు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఆమె రాజభవనం లాంటి లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారట. దీనిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదని అప్పట్లో విజయ రాజా వైభోగం గురించి ఇండస్ట్రీలో అంతా చర్చించుకునేవారట. ఇంటిలో స్విమ్మింగ్ పూల్తో పాటు.. అన్ని రకాల వసతులు ఉండేవట. ఆమె ఇంటిలోని లగ్జరీ వసతులు చూసి అప్పట్లోని స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారట. ఇక తన భర్త మరణాంతరం బిజినెస్ వ్యవహారాలను కొంతకాలం పాటు ఆమె చూసుకున్నారట. ప్రస్తుతం వ్యాపారాలను తన కూతురు చూసుకుంటున్నట్లు కేఆర్ విజయ తెలిపారు. -
రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ,ఎండీ ముఖేశ్ అంబానీ గురించి తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం అంబానీ భారీ నికర విలువతో, విలాసవంతమైన జీవనశైలి, విలాసవంతమైన ఇళ్ళు, లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. రూ. 15 వేల కోట్ల ఇంద్రభవనం యాంటిలియా నుంచి 2 వేల కోట్ల లావిష్ హోటల్ దాకా అంబానీ ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ చర్చనీయాంశాలే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన కొన్నిఆస్తులను చూద్దాం: అంబానీ నివాసముండే ఆంటిలియా గురించి ముందుగా చెప్పాలి. ముఖేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ రాజభవనం లాంటి ఆంటిలియాలోనే ఉంటారు. పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు ఇప్పటికే పెళ్ళిళ్లు చేసిన సంగతి తెలిసిందే. అంబానీ 15 వేల కోట్ల రూపాయల విలువైన తన 27అంతస్తుల నివాసం యాంటిలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగై లగ్జరీ కార్లు, ఆభరణాల కలెక్షన్ వారికి పెద్ద లెక్కే కాదు. యాంటిలియా ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం యాంటిలియా. 60 ప్లోర్లతో 27 అంతస్తుల భవనం యాంటిలియా విలువ రూ. 15,000 కోట్లు. ఈ ఇంటి పైఅంతస్తులో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ, ఇంకా గుడి, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటివి ఉన్నాయి. యాంటిలియాకు మారడానికి ముందు, ముఖేశ్ అంబానీ కుటుంబం, అనిల్ అంబానీ కఫ్ పరేడ్‌లోని సీ విండ్ అపార్ట్మెంట్లో నివసించేవారు. 17 అంతస్తుల భవనాన్ని దక్షిణ ముంబైలో రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ కొనుగోలు చేశారు. యూకేలోని స్టోక్ పార్క్ లండన్‌లోని 900 ఏళ్ల పురాతన హోటల్, స్టోన్ పార్క్‌కు కూడా ముఖేశ్ అంబానీ సొంతం. అల్ట్రా-రిచ్ ఫెసిలిటీస్‌తో ఉండే ఈహోటల్ కొనుగోలు విలువ 2020 నాటికి రూ. 529 కోట్లు. 1760లో సైనికుడు జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్లో 49 విలాసవంతమైన గదులు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు స్టోన్ పార్క్‌లో 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. న్యూయార్క్‌లోని లావిష్ హోటల్ దీంతోపాటు హాలీవుడ్ ప్రముఖులు బస చేసే, న్యూయార్క్‌లోని కొలంబస్ సర్కిల్లోని పాపులర్ హోటల్లో అంబానీ 248 సూట్లతో ఉన్న ఒక ఇంటిని 2022లో 98.15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారట. పామ్ జుమేరియా ఇల్లు లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. దుబాయ్‌లోని పామ్ జుమేరియా ఇల్లు. అంబానీకి రూ. 639 కోట్ల విలువైన, బీచ్-ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా బార్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స్పెషల్ ఎట్రాక్షన్స్. అనేది అరచేతి ఆకారంలో ఉండే జుమేరియా కృత్రిమ ద్వీపం పోష్ కాలనీలు, అతి విలాసవంతమైన నివాస ఆస్తులకు ప్రసిద్ధి. -
శత్రు ఆస్తుల విక్రయంతో రూ.3,400 కోట్లు
న్యూఢిల్లీ: శత్రువుల ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) అమ్మకంతో కేంద్రం రూ.3,407 కోట్లు ఆర్జించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం వంటి చరాస్తులేనని అధికారులు తెలిపారు. దేశ విభజన సమయంలో, 1962, 1965 నాటి యుద్ధాల తర్వాత భారత్ నుంచి పాకిస్తాన్, చైనాకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారి ఆస్తులను శత్రువుల ఆస్తులంటారు. పాక్ జాతీయులకు చెందిన 12,485, చైనా పౌరులకు చెందిన 126 ఆస్తులను తాజాగా విక్రయించారు. -
అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్ నేత సంచలన సలహా
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్ట్‌తో అదానీ గ్రూపు చైర్మన్ గౌతం విలవిల్లాడుతుండగా బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ వివాదంపై సోషల్‌మీడియా ద్వారా స్పందించిన ఆయన ప్రధాని మోదీకి ఒక సలహా కూడా ఇచ్చారు. (షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో) అదానీగ్రూపు - హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుబ్రమణియన్ స్వామి గురువారం ట్విటర్లో స్పందించారు. అదానీ & కో మొత్తం వాణిజ్య ఆస్తులను జాతీయం చేయాలని, ఆపై ఆ ఆస్తులను విక్రయించాలంటూ ప్రధాని మోదీకి సలహా ఇచ్చారు. అంతేకాదు అదానీని హోప్‌లెస్‌గా భావించిన మోదీ ప్రభుత్వం నెమ్మదిగా అదానీని డిస్ ఓన్ చేసుకుంటోందనీ, ఎలా వచ్చిన వాళ్లు అలానే పోతారు అంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. I believe Modi Govt is slowly disowning Adani as a hopeless case. Easy come easy goes — Subramanian Swamy (@Swamy39) February 2, 2023 My advice to Modi: Nationalise the entire commercial properties of Adani & Co for “ negative” payment and later auction the properties. — Subramanian Swamy (@Swamy39) February 2, 2023 -
అమ్మకానికి ట్విట్టర్ ఆస్తులు
-
శ్రీరామ్ చేతికి సువిలాస్ రియల్టీస్
న్యూఢిల్లీ: సుమారు రూ. 400 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సువిలాస్ రియల్టీస్ సంస్థను సొంతం చేసుకున్నట్లు రియల్టీ రంగ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ పేర్కొంది. పూర్తి అనుబంధ సంస్థ శ్రీప్రాప్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా 100 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. సువిలాస్ ప్రస్తుతం 0.65 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. బెంగళూరులోని జలహళ్లిలో శ్రీరామ్ సువిలాస్ పామ్స్ బ్రాండుతో 6.9 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టింది. శ్రీరామ్ ప్రాపర్టీస్‌తో కుదుర్చుకున్న అభివృద్ధి నిర్వహణా కాంట్రాక్టు ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రస్తుత ప్రమోటర్లు తొలి దశలోనే మానిటైజ్‌కు తెరతీసింది. ఈ ప్రాంతానికున్న అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టును కొనుగోలు చేసింది. కాగా.. మరోపక్క సువిలాస్కే చెందిన మరో ప్రాజెక్టు శ్రీరామ్ సువిలాస్ గార్డెన్ ఆఫ్ జాయ్‌ను సైతం విడిగా చేజిక్కించుకున్నట్లు శ్రీరామ్ ప్రాపర్టీస్ వెల్లడించింది. 152 యూనిట్లతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుకు 0.2 మిలియన్ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్నట్లు తెలియజేసింది. -
ఏపీ, తెలంగాణలోని బీఎస్ఎన్ఎల్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ఐదు రాష్ట్రాల పరిధిలో తనకున్న ఖరీదైన 13 ప్రాపర్టీలను ఎంఎస్టీసీ సహకారంతో డిసెంబర్ 5న వేలం వేయనుంది. ఈ ఆస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ మొత్తం 14 ప్రాపర్టీలను వేలానికి గుర్తించగా, వీటి విలువ రూ.20,160 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, కొండపల్లి, తెలంగాణలోని పటాన్చెరులో ఉన్న ఆస్తులు కూడా వేలానికి రానున్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ నేటికీ కొనసాగుతుండటంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకిళ్ల మధ్యన ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాలలో గృహ కొనుగోళ్లకు కొనుగోలుదారులకు ఆసక్తిని కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది. మారిన ప్రాధామ్యాలు. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, అపై పడక గదుల గృహాలలో అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగాయి. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకం కానున్నాయని అంచనా వేసింది. -
ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్ 90 శాతం పుంజుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు. చదవండి: టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్ -
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్‌లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్‌గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్‌పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్‌లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్‌లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
రూ. 60,000 కోట్ల మోసం.. ఆ సంస్థ ఆస్తి లావాదేవీలతో జాగ్రత్త: సెబీ వార్నింగ్
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తుల లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రజలను హెచ్చరించింది. ఆయా ఆస్తుల విక్రయానికి ఎవరికీ అనుమతులు లేవని స్పష్టం చేసింది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో పీఏసీఎల్ (పెర్ల్ గ్రూప్) ప్రజల నుంచి నిధులు సమీకరించిన సంగతి తెలిసిందే. సెబీ గణాంకాల ప్రకారం గడిచిన 18 ఏళ్లలో సమిష్టి పెట్టుబడుల స్కీముల (సీఐఎస్) ద్వారా పీఏసీఎల్ మోసపూరితంగా రూ. 60,000 కోట్లు సమీకరించింది. వీటిని ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వాలన్న ఆదేశాలను పాటించనందుకు గాను కంపెనీ, దాని తొమ్మిది మంది ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు 2015లో సెబీ ఆదేశాలు ఇచ్చింది. ప్రాపర్టీల విక్రయం, రిఫండుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2016లో సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే దశలవారీగా రిఫండు ప్రక్రియ ప్రారంభించింది. అయితే, కర్ణాటకలోని పీఏసీఎల్ ఆస్తులను విక్రయించేందుకు హర్విందర్ సింగ్ భంగూ అనే వ్యక్తికి కమిటీ నోడల్ అధికారి అనుమతులు ఇచ్చారంటూ నకిలీ లేఖ ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో కమిటీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ స్టాక్ ఎక్స్చేంజీకి మార్గదర్శకాలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సోషల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎస్ఎస్ఈ) మార్గదర్శకాలను నోటిఫై చేసింది. తద్వారా నిధుల సమీకరణలో సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అదనపు అవకాశాలు ఏర్పడనున్నాయి. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్, టెక్నికల్ గ్రూప్ చేసిన సిఫారసుల ఆధారంగా సెబీ మార్గదర్శకాలను రూపొందించింది. దేశీయంగా ఎస్ఎస్ఈ అనేది కొత్త ప్రతిపాదనకాగా.. ప్రయివేట్, నాన్‌ప్రాఫిట్ రంగాలకు భారీగా నిధులు లభించేందుకు వీలుంటుంది. ఎస్ఎస్ఈ ఆలోచనను 2019–20 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి వెల్లడించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఎస్ఎస్ఈ.. ప్రస్తుత స్టాక్ ఎక్స్చేంజీల నుంచి ప్రత్యేక విభాగంగా ఏర్పాటుకానుంది. ఇందుకు సెబీ నోటిఫికేషన్స్‌ను జారీ చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయ్యేందుకు నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్(ఎన్‌పీవోలు)సహా సామాజిక లక్ష్యాలుగల సంస్థలకు అవకాశముంటుంది. సెబీ ధృవీకరించిన 16 రకాల బోర్డు కార్యకలాపాలలో భాగమైన సంస్థలకు ఎక్సే్ఛంజీలో పార్టిసిపేట్ చేసేందుకు అనుమతిస్తారు. పేదరిక నిర్మూలన, ఆరోగ్య పరిరక్షణకు ప్రోత్సాహం, విద్యకు మద్దతు, ఉపాధి కల్పన, పోషకాహారం, సమానత్వానికి ప్రాధాన్యం వంటి కార్యకలాపాలను సెబీ లిస్ట్ చేసింది. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
రాయల్ ట్వింకిల్, సిట్రస్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. రాయల్ ట్వింకిల్ స్టార్ క్లబ్ ప్రయివేట్ లిమిటెడ్, సిట్రస్ చెక్ ఇన్స్ లిమిటెడ్‌కు చెందిన 39 ఆస్తుల(ప్రాపర్టీలు)ను జులై 15న వేలం వేయనుంది. ఇందుకు రూ. 66.51 కోట్లను రిజర్వ్ ధరగా నిర్ణయించింది. అక్రమంగా వేల కోట్ల నిధులను సమీకరించిన ఈ కంపెనీల నుంచి సొమ్మును రికవర్ చేసేందుకు వేలాన్ని చేపడుతోంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకూ వేలాన్ని నిర్వహించనున్నట్లు సెబీ నోటీసులో తెలియజేసింది. వేలంలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, డామన్, దాద్రా నగర్ హవేలీలలోగల ఆఫీస్ కార్యాలయాలు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు, భూములు, భవనాలు తదితర ఆస్తులను విక్రయించనుంది. 2019 నవంబర్ నుంచి 2022 మార్చి మధ్యలో 266 ప్రాపర్టీలను రూ. 1,297 కోట్ల రిజర్వ్ ధరలో వేలం వేసింది. సిట్రస్ చెక్ ఇన్స్ ద్వారా కలెక్టివ్ పెట్టుబడి పథకాల(సీఐఎస్)ను చేపట్టిన రాయల్ ట్వింకిల్ డైరెక్టర్లు, సిట్రస్ చెక్ ఇన్స్‌కు సెబీ 2018 డిసెంబర్లో రూ. 50 లక్షల జరిమానా విధించింది. కాగా.. 2019 డిసెంబర్లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలమేరకు ఆరు నెలల్లో 114 ప్రాపర్టీల విక్రయానికి సెబీ చర్యలు చేపట్టింది. టైమ్‌షేర్ హాలిడే పథకాలపేరిట రూ. 2,656 కోట్లకుపైగా అక్రమంగా సమీకరించడంతో 2015 ఆగస్ట్‌లో రాయల్ ట్వింకిల్, దాని నలుగురు డైరెక్టర్లపై సెబీ నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. -
బిక్కచచ్చిపోతున్న బిలియనీర్లు
-
ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూలు 9,10 కింద జాబితాలో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల మొత్తం ఆస్తుల విలువ 1,42,601 కోట్ల రూపాయలు. చట్టబద్దంగా జరగాల్సిన ఈ ఆస్తుల విభజన ఇప్పటి వరకు జరగనందున దాని దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడింది. ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలు కింద పేర్కొన్న సంస్థల విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజించాలని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. ఈ ఆస్తులలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ఎలాంటి అభ్యతరం తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ 68గాను కేవలం 33 సంస్థల విభజనకు మాత్రమే అంగీకరించింది. పెండింగ్‌లో ఉన్న అన్ని ఆస్తుల విభజనకు సమగ్రమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా కేసుల వారీగా మాత్రమే పరిష్కరించాలని తెలంగాణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: (మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?) విభజన చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న 112 శిక్షణా సంస్థల విభజనకు సెక్షన్ 75 కింద ఎలాంటి విధివిధానాలను నిర్దేశించనందున సమస్య ఏర్పడినట్లు మంత్రి చెప్పారు. ఈ సంస్థలను జనాభా ప్రాతిపదికన విభజించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా భౌగోళిక విభజన ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ కోరుతున్నట్లు నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి వీలుగా హోం మంత్రిత్వ శాఖ పలుదఫాలుగా సూచనలను జారీ చేస్తోంది. అయితే ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం, ఆమోదం కుదిరినప్పుడు మాత్రమే ఆస్తుల విభజనపై నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుందని మంత్రి చెప్పారు. -
రియల్టీపై వర్క్‌ఫ్రం హోం ఎఫెక్ట్.. వీటికి పెరిగిన డిమాండ్
హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి వృద్ధి చోదకాలుగా మారాయి. 2021 మాదిరిగానే ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాలలోనే ఎక్కువ స్థాయిలో జరుగుతాయని హౌసింగ్.కామ్ అంచనా వేసింది. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్‌లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా అభిప్రాయపడ్డారు. ద్వితీయ శ్రేణి పట్టణాలలో డిమాండ్.. కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లు ఇంకా కొనసాగుతుండటంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకిళ్ల మధ్యన ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. గతేడాది కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాలలో గృహ కొనుగోళ్లకు కొనుగోలుదారులకు ఆసక్తిని కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది. అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. మారిన అభిరుచులు ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని హౌసింగ్.కామ్ కన్జూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. చదవండి: ఇళ్ల రిజిస్ట్రేషన్లలో రికార్డ్! డిసెంబరులో రూ.2,340 కోట్లు -
పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. ♦ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. ♦ పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. ♦ రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. ♦ స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. ♦ స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. -
భారత్ ప్రభుత్వంపై దావా... వెనక్కి తగ్గిన కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: భారత్ ప్రభుత్వంపై దావాల కొనసాగింపు విషయంలో కెయిర్న్ ఎనర్జీ వెనక్కు తగ్గుతుంది. ఇందుకు సంబంధించి న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎయిర్ ఇండియాపై తాను వేసిన ఒక దావాపై స్టేను కోరుతూ స్వయంగా ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాతో కలిసి ఈ మేరకు న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రెట్రాస్పెక్టివ్ పన్ను రద్దుపై భారత్ నిర్ణయం, ఈ నిర్ణయం అమలుకు విధివిధానాల అమలు తత్సంబంధ అంశాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున దావాపై విచారణపై స్టే ఇవ్వాలని రెండు సంస్థలూ న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. వివరాలు ఇవీ... కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.7,900 కోట్లు. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.2 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ నిర్ణయించింది. అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాపై సైతం ఒక దావాను మేలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా జూలైలో ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం గత నెల్లో నిర్ణయం తీసుకుంది. రెట్రో పన్ను రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. దీనితోపాటు మొత్తం రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు, రిఫండ్స్‌కు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పలు కంపెనీలు ప్రారంభించాయి. రెట్రాస్పెక్టివ్ పన్ను అంటే.. గత 50 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చదవండి: సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే -
క్లాస్ బిజినెస్‌కు కేరాఫ్ ఈ కింగ్
Happy Birthday Akkineni Nagarjuna: ‘మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.’.. నటుడు తెలుగు వెండితెర తొలి సొగ్గాడు శోభన్ బాబు తర్వాతి తరాల తారల కోసం ఇచ్చిన సందేశం ఇది. ఇలాంటివేం ఫాలో కాకుండా.. సోకులకు పోయి డౌన్‌ఫాల్ అయినవాళ్లు సినీ పరిశ్రమలో చాలామందే ఉన్నారు. అయితే ఆ సోగ్గాడి మాటలను ఒంటబట్టించుకుని ఈ సొగ్గాడే చిన్ని నాయన ఒక్క వెండితెరనే కాదు బుల్లితెర, స్టూడియో ఓనర్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ టీమ్స్ కో ఓనర్‌గా అనేక రంగాలకు విస్తరించి క్లాస్ బిజినెస్‌కు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారారు. ముందే పసిగట్టారు టాలీవుడ్లో ‘మన్మథుడు’ అనే పదానికి పర్యాయ పదంగా ఉన్న అక్కినేని నాగార్జున.. ఆరు పదుల వయసులోనూ ఆ ట్యాగ్ లైన్‌కు జస్టిఫికేషన్ చేస్తున్నారాయన. సినిమాలతోనే కాదు.. బుల్లెతెర మీదకు ఎర్లీ ఎంట్రీ ఇచ్చింది కూడా ఆయనే. అప్‌కమింగ్ స్టేజీలో ఉన్నప్పుడే మాటీవీలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మా టీవీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. పెట్టుబడులతోనే కాదు బుల్లితెరపైనా నాగ్ తన హోస్టింగ్‌తో ఆడియొన్స్పై మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. అప్పుడెప్పుడో యువ సీరియల్‌తో నిర్మాతగా బుల్లితెరపై అడుగుపెట్టిన నాగ్.. ఆపై మీలో ఎవరు కోటీశ్వరుడు?తో స్మాల్‌స్క్రీన్‌పై విశ్వరూపమే ప్రదర్వించారు. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోల టీఆర్పీ రేటింగ్‌లు చాలూ.. నాగ్ క్రేజ్ ఏంటో మచ్చుకు చెప్పుకోవడానికి. అదే ఆయన బలం. అందుకే ఎండార్స్మెంట్స్ ట్రాజెడీ కింగ్, రొమాంటిక్ హోరోగా అక్కినేని హీరోలకు ఇమేజ్‌ని పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఫలితంగా మహిళల్లో నాగ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇది గమనించే తెలివిగా నాగ్‌ను ఎండోర్స్మెంట్ వెపన్‌గా వాడుకుంటున్నాయి పలు కంపెనీలు. నాగ్‌ను యాడ్ల ద్వారా చూపించి.. వాళ్లను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఆ కోవలోనే కళ్యాణ్ జువెల్లర్స్, సౌతిండియా షాపింగ్‌మాల్, ఘడీ డిటర్జెంట్‌తో పాటు స్పోటిఫై లాంటి ఎనర్జిటిక్ యాడ్లతో మెప్పించారు. టీవీ స్పేస్‌లో నాగ్ ఉన్నాడంటే.. ఆ రిచ్‌నెస్ వేరేలా ఉంటుంది. డిటర్జెంట్ పౌడర్ నుంచి నగల యాడ్స్ దాకా.. మహిళలు బేస్డ్గా ఉండే ఉత్పత్తుల్లో చాలావాటికి ఎండోర్స్మెంట్ చేశారు. యాడ్ల కోసం రాసే స్క్రిప్ట్ ను డైరెక్షన్‌తో సంబంధం లేకుండా మరింత డ్రమటిక్‌గా మార్చడం , ఎమోషన్స్‌తో ప్రజెంట్ చేయడం నాగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ వయసులోనూ ఆయన ఎండోర్స్మెంట్ కింగ్‌గా రాణిస్తున్నాడు. మూవీస్ ప్లస్ స్పోర్ట్స్ సినిమాలు, ఆటలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దీన్ని పసిగట్టిన వెండితెర హీరోల్లో నాగార్జున అగ్రస్థానంలో ఉంటారు. ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు అనేక జట్లకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. 2013 నుంచి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ‘ముంబై మాస్టర్స్’కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో కలిసి, మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి మహీ రేసింగ్ టీం ఇండియాకు, ఇంకోవైపు ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్లో కేరళ బ్లాస్టర్ ఎఫ్సీకి సహ యాజమానిగా ఉన్నాడు నాగ్. రియల్ బిజినెస్‌మ్యాన్ అక్కినేని నాగార్జున గతంలో రెండుసార్లు ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రొడక్షన్ కంపెనీ అన్నపూర్ణ స్టూడియోస్కి నాగార్జున అక్కినేని కో-ఓనర్. ఈ స్టూడియో అనుబంధంగా ఇంటర్నేషనల్‌స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అంతేనా భార్య అమల అక్కినేనితో కలిసి బ్లూక్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఎన్జీవోను నడిపిస్తున్న నాగ్.. ఎయిడ్స్ అవేర్నెస్ ప్రచార కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ఓవైపు హీరోగా సినిమా కెరీర్ మరోవైపు ఎండోర్స్మెంట్లు, వ్యాపారాలతోనూ బిజినెస్ ‘కింగ్’ అనే ట్యాగ్ లైన్‌కు వందకు వంద శాతం న్యాయం చేస్తున్నారాయన. హీరోల్లో నాగ్ మొదటి నుంచి డిఫరెంట్ రూట్లోనే ప్రయత్నాలు చేస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగ్‌కు ఉన్న పాషన్ అండ్ ఎనర్జీ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే ఆయనకి ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చిపెట్టింది. సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా నిలిపింది. చదవండి: కక క్లాస్.. మమ మాస్ -
తన ఆస్తుల వివరాలు వెల్లడించిన సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు ఇది. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తనదైన యాంకరింగ్, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు తన మాయతో మెజీషియన్‌గా కూడా మెప్పిస్తున్నాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే సుధీర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సుధీర్ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. చదవండి: తన ఫస్ట్‌లవ్‌ను పరిచయం చేసిన వర్మ పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న అతడు ఇటీవల ‘సాఫ్ట్వేర్ సుధీర్’తో హీరోగా మారాడు. ఇటూ యాంకర్‌గా, కామెడియన్‌గానే కాకుండా అటూ సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా సుధీర్ పుల్ బిజీగా మారాడు. ఇలా ఖాళీ సమయమే దొరకనంతగా కష్టపడుతున్న సుధీర్ సంపాదన ఎంత ఉంటుందనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కామెడీ షోలో సుధీర్ తన ఆస్తులపై నోరు విప్పాడు. ఇక అతడి ఆస్తుల వివరాలు విని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. కాగా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన సుధీర్ ఆశ్రమం లేక రైల్వే స్టేషన్లోనే పడుకునేవాడినని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కుటుంబంతో సుధీర్ చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా! అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన సుధీర్‌కు ఇప్పుడు హైదరాబాద్‌లో రెండు సొంతిళ్లు ఉన్నాయట. అంతేకాదు పలు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నానని ఈ షోలో అతడు వెల్లడించాడు. దీంతో సిటీలో ఒక ఇళ్లు కొనడమే కష్టం అలాంటిది సుధీర్ రెండు ఇల్లులు కొన్నాడంటే బాగానే సంపాదిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతడి ఎదుగుదల చూసి ఫ్యాన్స్ సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా’ అంటూ పోకిరిలోని మహేశ్ డైలాంగ్ను సుధీర్‌కు ఆపాదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్ -
కశ్మీర్లో ఇద్దరే ఆస్తులు కొన్నారు? ఎందుకలా?
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ఏమీ మారలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉన్న అధికరణాలను రద్దు చేసిన అనంతరం ఆస్తుల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం ఇద్దరంటే ఇద్దరు ఆస్తులు కొనుగోలు చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు 370 అధికరణను రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా 5 ఆగస్టు 2019లో ఏర్పాటుచేశారు. రద్దుకు ముందు కశ్మీర్ ప్రాంతంలో ఇతర ప్రాంతీయులు ఆస్తుల కొనుగోళ్లపై నిషేధం అమల్లో ఉండేది. అధికరణాల రద్దు అనంతరం ఇతర ప్రాంతాలవారు పెద్ద ఎత్తున వచ్చి ఆస్తులు కొనుగోలు చేస్తారని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం ఆశించిన మేర జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయలేదు. ఆస్తుల కొనుగోళ్ల చట్టాలలో మార్పులు చేయడంతో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లడ్డాఖ్లో దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలు, ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి కశ్మీర్ అభివృద్ధి బాట పడుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు రాలేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. అధికరణ 370 రద్దును కశ్మీర్ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీకి చెందిన పార్టీ నాయకులు కూడా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం భావించినట్టు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మారలేదు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎవరూ ఆస్తుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. పారిశ్రామికవేత్తలు కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపడం లేదు. ఉగ్రవాదుల దాడుల భయం ఇంకా కొనసాగుతోంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వంటివి ఉండడంతో ప్రస్తుతం కశ్మీర్‌పై ఎవరూ దృష్టి సారించలేదు. -
రాదనుకున్న సొమ్ము రాబట్టారు..
గచ్చిబౌలి: చోరీకి గురైన సొత్తును బాధితులకు అప్పగించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 176 కేసుల్లో కోటిన్నర విలువైన కిలో బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి, రూ.30.67 లక్షల నగదు, 90 వాహనాలు బాధి తులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్య క్రమంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చోరీ జరిగిన సొమ్మును బాధితులకు అప్పగించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. చోరీ జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, క్లూస్ సేకరించి నిందితులను రిమాండ్ చేసి చార్జిషీట్ వేయడం వరకే ఆగిపోతున్నట్లు చెప్పారు. సొమ్ము గురించి అంతగా పట్టించు కోకపోవడంతో న్యాయపరంగా సొత్తు తీసుకోవట్లేదని తెలిపారు. చోరీ అయిన సొత్తును త్వరితగతిన ఇప్పించాలనే ఉద్దేశంతో కొద్ది నెలలుగా కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సొత్తును అప్పగించేందుకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, డీసీపీలు, సీసీఆర్బీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళాను నిరంతరం నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శంషాబాద్ జోన్ పోలీసులు 101 కేసుల్లో సొత్తు రికవరీ చేశారని తెలిపారు. -
అలక్ష్యంతో వచ్చిపడ్డ అవమానం!
సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడైనా పెద్ద చిక్కే. ఆ సంగతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చింది. బ్రిటన్‌కు చెందిన చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీతో కొన్నేళ్ళుగా సాగుతున్న పన్నుల వివాదంలో గురువారం భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఆ సంస్థకు వీలు కల్పిస్తూ, న్యాయప్రక్రియ పూర్తయింది. ప్యారిస్‌లో ఆ సంస్థ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న భారత ప్రభుత్వ ఆస్తుల విలువ దాదాపు 2 కోట్ల యూరోలు. ఇదే కాదు... అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్రకారం మన ప్రభుత్వం వెనక్కి కట్టాల్సిన 170 కోట్ల డాలర్ల సొమ్ము కోసం ఆ సంస్థ ఇప్పటికే వేర్వేరు దేశాల్లో కూడా కేసు వేసింది. అక్కడ కూడా స్వాధీనం చేసుకొనేందుకు భారత ప్రభుత్వ ఆస్తులను గుర్తిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలే కాదు, చివరకు అక్కడి ఎయిర్ ఇండియా విమానం సహా భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొని, విక్రయి స్తామని కెయిర్న్ గతంలోనే బెదిరించింది. ఇప్పుడు ఆ పనే చేయడానికి సిద్ధమవుతోంది. దిగ్భ్రాంతి కరమైన ఈ వార్త ఒక రకంగా ప్రభుత్వానికి పరువు తక్కువగా మారింది. ఈ వివాదానికి మూలమైన భారత్‌లో కెయిర్న్ కథ చాలా ఏళ్ళ క్రితం మొదలైంది. 1994లోనే ఆ సంస్థ మన దేశంలో చమురు, సహజవాయు రంగంలో పెట్టుబడులు పెట్టింది. 2004 జనవరిలో రాజస్థాన్‌లోని బర్మేర్ దగ్గర చమురు బావులున్నట్టు ఆ సంస్థ అన్వేషణలో తేలింది. అక్కడ పని మొదలుపెట్టింది. సరిగ్గా మూడేళ్ళకు కెయిర్న్ ఇండియా సంస్థ మన స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అటుపైన నాలుగేళ్ళకు షేర్లలో అధిక భాగాన్ని గనుల తవ్వక దిగ్గజమైన వేదాంత సంస్థకు అమ్మేసింది. ఇలా ఉండగా, 2012లో మన కేంద్ర ఆర్థిక శాఖ వెనుకటి తేదీ నుంచి వర్తిస్తూ పన్ను వేసేలా చట్టంలో సవరణ తెచ్చింది. దాని ప్రకారం కెయిర్న్‌పై వెనకటి తేదీ 2006 నుంచే వర్తించేలా పన్ను భారం పడింది. 2006–07లో ఆ సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్’ షేర్లను ‘కెయిర్న్ ఇండియా’కు బదలాయించింది. తద్వారా ఆ బ్రిటన్ సంస్థకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినందువల్ల, దానిపై రూ. 24.5 వేల కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలని అధికారులు ఆదేశించారు. అది వివాదమైంది. విషయం కోర్టుల దాకా వెళ్ళింది. బ్రిటన్ – భారత్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద అది చెల్లదంటూ 2015 మార్చిలో కెయిర్న్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఇది పెట్టుబడులకు సంబంధిం చిన వివాదమే తప్ప, కేవలం పన్ను వ్యవహారం కాదంటూ హేగ్‌లోని అంతర్జాతీయ మధ్వవర్తిత్వ కోర్టు స్పష్టం చేసింది. అలా 2020 డిసెంబర్లో కెయిర్న్‌కు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వివాదం వల్ల భారత ప్రభుత్వం ఆపిన డబ్బులన్నీ లెక్క కట్టి, ప్రభుత్వమే ఆ సంస్థకు 120 కోట్ల డాలర్ల అసలు, 50 కోట్ల డాలర్ల వడ్డీ – మొత్తం 170 కోట్ల డాలర్లు చెల్లించాలని కోర్టు పేర్కొంది. దానితో అసంతృప్తికి లోనైన భారత ప్రభుత్వం దానిపై అప్పీలు చేసుకుంది. మరోపక్క కెయిర్న్ సంస్థ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా, సింగపూర్, జపాన్ సహా పలుచోట్ల కేసు వేసింది. తద్వారా విమానాలు, నౌకలు, బ్యాంకు ఖాతాలతో సహా ఆ దేశాల్లో మన దేశానికి ఉన్న వాణిజ్యపరమైన ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొనే వీలు కలిగింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే రంగంలోకి దిగి, సర్దుబాటు, దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సిన మన సర్కారు ఆ పని చేయలేదు. ప్రభుత్వ వర్గాలు మొద్దునిద్ర పోవ డంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికీ ‘తగిన చర్యలన్నీ తీసుకుంటాం’, ‘న్యాయపోరాటానికి దిగుతాం’ లాంటి మాటలనే ప్రభుత్వ వర్గాలు వల్లె వేస్తున్నాయి. కానీ, వాద నకు వకీలుకు తగినంత సమాచారం ఇవ్వరంటూ సొంత అధికారుల నుంచి గతంలోనే ప్రభుత్వం విమర్శల పాలైంది. ఇప్పుడిక అంతర్జాతీయ ఉత్తర్వులు అమలుకు వీలున్న అనేక ప్రాంతాల్లో ఆస్తులు కాపాడుకొనేందుకు ప్రభుత్వం ఎంత సమర్థంగా పోరాటం చేయగలదన్నది ప్రశ్న. మరోపక్క కెయిర్న్ చూపిన ఈ బాట ఇప్పుడు పలు విదేశీ సంస్థలకు అవకాశం కానుంది. ఇప్పటికే మరో విదేశీ సంస్థ దేవాస్ మల్టీమీడియా కూడా న్యూయార్క్‌లోని ఎయిరిండియా ఆస్తులపై కన్నేసి, ఇదే దోవలో వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో అనుబంధ సంస్థ యాంత్రిక్స్ కార్పొ రేషన్‌కూ, దేవాస్కూ మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2012లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు దానికీ భారీగానే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే ముందే ఆలోచించాలి తప్ప, కుదుర్చుకున్నాక చటుక్కున బయటకు రావడం అంత సులభం కాదని ఆలస్యంగానైనా ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రాజీ మార్గం వెతకాలి. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ద్వారా భారత్ నుంచి రావాల్సిన మొత్తాన్ని భారత్‌లోనే పెట్టుబడిగా పెడతామని ఆ మధ్య కెయిర్న్ చేసిన ప్రతిపాదననూ పరిశీలించవచ్చు. తక్షణమే సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే, ఒకపక్క ఆస్తులతో పాటు అంతర్జాతీయంగా ప్రభుత్వం పరువూ పోతుంది. చట్టబద్ధమైన ఒప్పందాలను గౌరవించరనే అపఖ్యాతే మిగులుతుంది. అంతర్జాతీయ పెట్టుబడులు వెనుకపట్టు పట్టే ప్రమాదం ఉంది. గెలవని యుద్ధాలు చేయడం కన్నా... చేసిన తప్పు నుంచి తక్కువ మూల్యంతో బయట పడడమే ఒక్కోసారి విజ్ఞత. -
హీరోయిన్ కాజల్ ఆస్తుల విలువ ఎంతంటే...
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఫుల్ బిజీగా మారింది. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కాగా ప్లాన్ చేస్తుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది.లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్ తెరపై మెరిసిన కాజల్ నేటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. దక్షిణాదిన దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన కాజల్.. యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది. మోడల్‌గా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ తొలుత క్యూను హో గయానా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం లో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం మూవీలో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తెలుగులో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర చిత్రం కాజల్ కెరీర్‌ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో తొలి చిత్రం లక్ష్మి కళ్యాణం మూవీతోనే 23 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది కాజల్. ఇటీవలె మంచు విష్ణతో చేసిన మోసగాళ్లు చిత్రానికి గాను అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్ల వరకు తీసుకుంటుందట. ప్రస్తుతం ముంబైలో ఓ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్న కాజల్ తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించిందట. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్ల వరకు ఆస్తులను కూడగట్టిందని సమాచారం. అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నా తనవంతు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది ఈ పంచదార బొమ్మ. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో నటిస్తుంది. వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చదవండి : డబ్బులిచ్చి మరీ హెయిర్ స్టయిలింగ్ చేసేదాన్ని: కాజల్ కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’! -
సుత్తితో మోది..పొలంలో కాల్చేసి..
నేరేడుచర్ల: పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని వదినను మరిది, అతని కుమారుడు కలసి సుత్తితో మోది చంపారు. ఆ తరువాత మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లి పొలం వద్ద కాల్చేశారు. శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడుచర్ల ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. రామాపురానికి చెందిన రేఖ బాయమ్మ (51), పిచ్చయ్య.. భార్యాభర్తలు. 2004లో పిచ్చయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బాయమ్మతోపాటు ఆమె మరిది సైదులు, మరో ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరు జైలు జీవితం అనుభవించారు. అప్పటి నుంచి, ఆ హత్యతో తమకు సంబంధం లేకున్నా.. కేసులో ఇరికించారని సైదులు, అతని కుమారుడు ఉపేందర్ బాయమ్మపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రలో ఉన్న బాయమ్మ తలపై సుత్తితో కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ట్రాక్టర్లో బట్టువాని కుంట సమీపం లోని తమ పొలం వద్దకు తీసుకెళ్లి కాల్చివేశారు. ఆదివారం ఉదయం సైదులుతోపాటు అతని కుమారుడు ఉపేందర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆస్తిని కాజేసేందుకే..: సైదులు తమ పొలంలో పంట పండించుకొని కౌలు కూడా ఇవ్వడం లేదని, ఆస్తిని కాజేసేందుకే తన తల్లిని దారుణంగా హత్య చేశారని బాయమ్మ కూతురు కవిత నేరేడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా కౌలు విషయంలో ఘర్షణ జరుగుతుండటంతో తన తల్లి భయంతో రాత్రి పూట ఇతరుల ఇళ్లలో పడుకుంటోందని, తమ తల్లిని నమ్మించి అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించింది. సైదులు, ఉపేందర్‌తో పాటు సైదులు భార్య ఎల్లమ్మ, చిన్న కుమారుడు హేమంత్పై కూడా తనకు అనుమానం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా బాయమ్మ చిన్న కుమార్తె శైలజను ఆమె భర్త మూడేళ్ల క్రితం హత్య చేశాడు. 2004లో బాయమ్మ భర్త హత్యకు గురయ్యాడు. ఇప్పుడు బాయమ్మను హత్య చేశారు. కాగా, ప్రస్తుత హత్యకు పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
ఎస్బీఐ మెగా ఆఫర్: మార్కెట్ రేటు కంటే తక్కువకే
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ ధరకే కొత్త ఆస్తిలను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తోంది. ఈ మేరకు మార్చి 5 న మెగా ఇ- వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. రుణ ఎగవేతదారుల తనఖా ఆస్తులను విక్రయించడానికి ఈ-వేలం నిర్వహిస్తుంది. తద్వారా బకాయిలను తిరిగి పొందనుంది. ఈ వేలంలో నివాస, వాణిజ్య ఆస్తులు భూమి, వాహనాలు, యంత్రాలు, తదితరాలను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని ఎస్బీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులలో సంబంధిత వివరాలను అందించినట్టు తెలిపింది. (రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్!) వేలంలోని ఆస్తి వివరాలను ఎలా పొందాలి? దీనికి సంబంధించి కొన్ని లింక్‌లను అందుబాటులో ఉంచింది. అలాగే ఆయా బ్రాంచ్‌లలో సంబంధింత సమాచారాన్ని అందించేందుకు ఒక ఉద్యోగి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటారు. తద్వా వేలం వేయనున్న ప్రాపర్టీ వివరాలు, వేలం ప్రక్రియ, వివరాలను కొనుగోలుదారులు తెలుసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంది. ఇ-వేలంలో పాల్గొనేందుకు అర్హత దీనికి బిడ్డర్లు కొన్ని ఫార్మాలిటీలను ముందుగానే పూర్తి చేయాలి. నోటీసులో పేర్కొన్న విధంగా నిర్దిష్ట ఆస్తి కొనుగోలుకు నిర్దేశిత సొమ్మును చెల్లించాలి. కేవైసీ పత్రాలు సంబంధిత శాఖకు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకాన్ని ఇవ్వాలి. ఇందుకు బిడ్డర్లు ఇ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అధీకృత ఏజెన్సీని సంప్రదించవచ్చు. ఈఎండీ డిపాజిట్ , కేవైసీ పత్రాలు అందించిన అనంతరం లాగిన్ ఐడీ, పాస్వర్డ్ బిడ్డర్ల ఇమెయిల్ పంపిస్తారు. దీంతో వేలం నిబంధనల ప్రకారం ఇ-వేలంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. Bid for the best! Here’s your chance to buy cheaper Residential & Commercial Properties, Land, Plant & Machinery, Vehicles and many more. Attend SBI Mega E-Auction and place your best bid. Know more: https://t.co/vqhLcagoFF #Auction #MegaEAuction #Properties #DreamHome #Land pic.twitter.com/80CNZueg6k — State Bank of India (@TheOfficialSBI) March 1, 2021 -
డబ్బున్నోళ్లకు కోపం వస్తే అంతే!
వాషింగ్టన్ : బాగా డబ్బున్న వాళ్లకు కోపం వస్తే అంతే సంగతులు. ముందూ వెనక ఆలోచించకుండా అనుకున్నది చేస్తారు. మన ఎలాన్ మస్క్ అదే చేశారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన ఆస్తి విలువ ‘ఫోర్బ్స్’ కథనం ప్రకారం 153.5 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు కోటీ పదమూడు లక్షల కోట్ల రూపాయలు. స్వయంగా ఇంజనీరు చదువుకున్న ఎలాన్ మస్క్ టెస్లా కార్ల తయారీ కంపెనీ పెట్టి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగి ‘స్పేస్ ఎక్స్’ పేరిట రోదసి కంపెనీని కూడా ఏర్పాటు చేసి బాగా సంపాదించారు. చంద్రుడు, అంగారక గ్రహాన్ని చుట్టి వచ్చేందుకు ఆయన దగ్గర అడ్వాన్స్‌గా పలువురు కుబేరులు టిక్కెట్లు కూడా తీసుకున్నారు. ఇంతకు ఎలాన్ మస్క్‌కు ఎందుకు కోపం వచ్చిందంటే....అమెరికాలో భీకరంగా విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయడం కోసం కాలిఫోర్నియా రాష్ట్రంలో పలుసార్లు లాక్డౌన్లు విధిస్తుండడంతో ఆయన తట్టుకోలేక పోతున్నారు. దాంతో గుండెల్లో రగిలిపోయి కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ( కిమ్.. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారిలా.. ) అందుకని కాలిఫోర్నియాలోని తన ఏడు సుందనమైన భవనాలను 2020లో అమ్మేస్తానని గత మే నెలలోనే శపథం చేశారు. అన్నట్లుగా అప్పట్లోనే బెల్ ఏర్ ప్రాంతంలోని రెండు భవనాలను విక్రయించగా, సొమేరా రోడ్డులోని మరో మూడు భవనాలను డిసెంబర్ 21, డిసెంబర్ 22 తేదీల్లో 40.9 మిలియన్ డాలర్లకు అంటే, దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు విక్రయించారు. వాటిని ఓ బిల్డరు, మరో డిజైనర్ కొనుగోలు చేసినట్లు తెల్సింది. మరో రెండు అమ్మకానికి పెట్టిన భవనాలను అమ్మారా లేదా ? తెలియడం లేదు. కాలిఫోర్నియాలో కూడా ఆయనకు పారిశ్రామిక కేంద్రాలు ఉండడం వల్ల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు ఉండడానికి వీలుగా అమ్మకుండా ఉంచుకునే అవకాశం ఉందని కొందరంటుండగా, ‘మంచయినా, చెడయిన మాట నిలబెట్టుకునే మనిషి మా ఎలాన్ మస్క్’ అని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ
సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్‌కు ఒక మంచి గిఫ్ట్‌గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌తోపాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
మాఫియా డాన్ దావూద్ ఆస్తులు వేలం
సాక్షి, ముంబై: పరారీలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను అధికారులు మంగళవారం వేలం వేశారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజి మానిప్యులేటర్స్ చట్టం(ఎస్ఎఎఫ్ఈఎంఇ) కింద ఆరు ఆస్తులకు వేలం నిర్వహించారు. ఈ ఆస్తులను దాదాపు రూ.23 లక్షలకు వేలం వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వేలానికి అద్భుతమైన స్పందన వచ్చిందని రత్నగిరిలోని ఆరు ఆస్తులు విజయవంతంగా అమ్ముడయ్యాయని ఉన్నతాధికారి ఆర్.ఎన్.డిసౌజా వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్, సీల్డ్ టెండర్ ద్వారా ముంబైలో నిర్వహించిన వేలంలో న్యాయవాది శ్రీవాస్తవతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది భూపేంద్ర భరద్వాజ్‌లు వాటిని దక్కించుకున్నారు. డిసౌజా ప్రకారం మిలిగిన ఆస్తులు రిజర్వ్ ధరకే అమ్ముడుకాగా, బ్లాక్‌లోని రెండు ఆస్తులలు రిజర్వ్ ధరల కంటే చాలా ఎక్కువ రూ .1.89 లక్షలు (రూ. 5.35 లక్షలకు అమ్ముడయ్యాయి), రూ .4.30 లక్షలు (రూ. 11.20 లక్షలకు అమ్ముడయ్యాయి). అయితే దావూద్ మాజీ సహాయకుడు ఇక్బాల్ మెమన్ అలియాస్ ఇక్బాల్ మిర్చికి చెందిన ముంబైలోని శాంటాక్రూజ్ వెస్ట్‌లోని మిల్టన్ అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాట్లను వేలానికి ఉంచినా ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఈమొత్తంలో 25 శాతం వారంలోపు, మరో 25 శాతం నెలలోపు, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి మూడు నెలల్లో జమ చేయాలని డిసౌజా వివరించారు. పూర్తిగా చెల్లించిన తరువాత కొనుగోలుదారుడికి ప్రాపర్టీ సొంతం అవుతుందని డిసౌజా స్పష్టం చేశారు. 2019, ఏప్రిల్‌లో దావూద్ సోదరి హసీనా పార్కర్‌కు చెందిన నాగ్‌పాడాలోని గోర్డాన్ హాల్ అపార్ట్మెంట్లో 600 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ .1.80 కోట్లకు వేలం వేసింది. (2014 లో హసీనా మరణించడంతో దీన్ని ఆమె సోదరుడు ఇక్బాల్ కస్కర్ దీన్ని ఆక్రమించారు. అయితే ఇక్బాల్‌ను 2017 లో థానే పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలులో ఉన్నాడు). 2018 లో దక్షిణ ముంబైలోని అమీనా మాన్షన్‌లో ఉన్న దావూద్ మరో మరొక ఆస్తిని రూ .79.50 లక్షల రిజర్వు ధరకంటే ఎక్కువగా రూ.3.51 కోట్లకు సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్ కొనుగోలు చేసింది. 2017, నవంబర్‌లో, దక్షిణ ముంబైలోని ఆరు ఫ్లాట్లను, షబ్నం గెస్ట్ హౌస్ , రౌనాక్ ఆఫ్రోజ్ రెస్టారెంట్‌ను వేలం ద్వారా మొత్తం 11.50 కోట్లకు సేఫ్మా విక్రయించింది. రత్నగిరి జిల్లా, ఖేద్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని ముంబేక్ గ్రామంలో వేలం నిర్వహించిన ఈ ఆస్తుల్లో చిన్న నిర్మాణాలు, ప్లాట్ల రూపంలో భూమి ఉంది. సీజ్ చేసిన ఈ మొత్తం 13 ఆస్తులను ఈ ఏడాది ఆరంభంలోనే సేఫ్మా కింద వేలం నిర్వహించాలని సంబంధిత అధికారులు భావించారు. కానీ కోవిడ్-19 మహమ్మారి,లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. -
నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంక్(పీఎన్బీ)ను మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీకి చెందిన రూ.1,400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ, ఐటీ జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే ఆస్తులను జప్తు చేసే ముందు నీరవ్ మోడీకి అప్పీలు చేయడానికి 30 రోజుల సమయం ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లో ఉంటున్నారు. భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోడీని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి: బెదిరిస్తున్న నీరవ్ మోదీ -
తిరుమల వెంకన్నకు మేం సేవకులమే: వైవీ సుబ్బారెడ్డి
-
అందరి దృష్టి ఆస్తులపైనే..
-
ఇప్పుడు కథంతా మారుతీరావు ఆస్తుల చుట్టూనే!
అతనో సాధారణ కిరోసిన్ వ్యాపారిగా మిర్యాలగూడ పట్టణవాసులకు సుపరిచితుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ అవతారమెత్తి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగెత్తాడు. పరువు హత్య అభియోగంతో అదే తరహాలో అథఃపాతాళానికీ పడిపోయాడు. చివరకు తన మరణశాసనాన్ని తానే లిఖించుకుని మరోమారు సంచలనంగా మారాడు.. అతనే తిరునగరు మారుతీరావు. ఆత్మహత్య ఉదంతం కూడా అతని ఆస్తుల చుట్టే తిరుగుతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, మిర్యాలగూడ : అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి... చివరికి ఆత్మహత్యతో ప్రస్తానం ముగిసింది. సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తిరునగరు మారుతిరావు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. మారుతీరావు కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్‌ని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లుగా మారుతీరావు అభియోగాలు ఎదదుర్కొని ఎ1 నిందితుడిగా ఏడు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మారుతిరావు తన ఆస్తులను చక్కబెట్టుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. చదవండి: డ్రైవర్ని ఆ షాప్ వద్ద కారు ఆపమన్న మారుతీరావు అందరి దృష్టి ఆస్తులపైనే.. మారుతిరావు కూతురు అమృత మీడియాతో మాట్లాడిన సమయంలో బినామీలు ఉన్నారని, ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్పడంతో అందరి దృష్టి అతడి ఆస్తి విషయంపైకి మళ్లింది. 25 ఏళ్ల క్రితం సాధారణ కిరోసిన్ వ్యాపారిగా పాత స్కూటర్‌పై తిరిగిన మారుతిరావు అనతి కాలంలోనే కోట్లాదిపతిగా మారాడు. అటు బిల్డర్ అవతారం ఎత్తి అద్దంకి – నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న శరణ్య గ్రీన్హోమ్స్లో సుమారు వంద నివాసాలు నిర్మించి విక్రయించాడు. దాంతో పాటు అక్కడే ఉన్న అపార్ట్మెంట్లు, ఈదులగూడలో రెండంతస్తుల షాపింగ్ మాల్స్ నిర్మించి విక్రయించినట్లు సమాచారం. అదే విధంగా పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌కు అతి సమీపంలో నటరాజ్ థియేటర్ స్థలంలో అతి పెద్ద మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉండగా అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉండేది. దాంతో పాటు అద్దంకి – నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో చింతపల్లి రోడ్డు సమీపంలో ఒకటి, ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో ఖాళీ స్థలాలు ఉన్నట్లు సమాచారం. తాళ్లగడ్డ సమీపంలో ఒక వెంచర్, దామరచర్ల మండలంలో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా సుమారుగా రూ.200 కోట్లకుపైగా ఆస్తులు సంపాధించిన మారుతీరావు చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని ముగించాడు. చదవండి: 'అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ' బినామీలు సర్దుకున్నారా? బిల్డర్‌గా, రియల్టర్‌గా కొనసాగిన మారుతీరావు తనతో పాటు కొంతమందిని బినామీలుగా వాడుకున్నట్లు సమాచారం. బినామీలుగా ఆయన వద్ద గతంలో పని చేసిన వారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు వారి కుటుంబసభ్యుల పేరున కూడా భూములు కొనుగోలు చేసి వారికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించినట్లు సమాచారం. వారి వద్ద నుంచి అవసరం వచ్చిన సమయంలో తిరిగి ఆయన పేరు మీదకి మార్చుకునే వారని తెలిసింది. కాగా ఆయన జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కొంత మంది బినామీలు భూములను విక్రయించుకోవడంతో పాటు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆస్తులను సర్దుకున్నట్లు సమాచారం. రూ.కోట్ల విలువల గల ఆస్తులను బినామీలు చక్కబెట్టుకోవడంతో ఆయన ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉండే వారని తెలిసింది. మారుతీరావు ఆస్తుల విషయంపై పోలీసులు విచారణ చేస్తే బినామీలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు ఉన్నట్లు ప్రచారం? ఆస్తుల విషయంలో కటుంబ సభ్యులకు వివాదాలు ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఏ కోణంలో చేసుకున్నాడనే విషయంపై పోలీసులు విచారించనున్నారు. ఆయన ఆస్తుల విషయంపై వివాదాలు ఉన్నాయని, ఇటీవలనే పంపకాలు కూడా చేసుకున్నట్లు తెలిసిందని అమృత మీడియా ముందు చెప్పడంతో మరింత చర్చ జరుగుతోంది. మారుతీరావు అప్పులుంటే వడ్డీతో సహా తీర్చుతానని, రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోతే చేస్తానని శ్రవణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు తన ఆస్తుల వీలునామా కూడా రాసినట్లుగా పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. చదవండి: కూతురు రాదనే... మనస్తాపంతోనే -
'మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదు'
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తి నాకు అవసరం లేదని, భవిష్యత్తులో దానిపై ఎలాంటి న్యాయ పోరాటం చేయబోనని ఆయన కూతురు అమృత స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని ప్రణయ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక మనిషి మరో మనిషిని చంపడం మంచిది కాదన్నారు. ప్రణయ్‌ను చంపి మారుతీరావు తప్పు చేశాడని, అయినా చనిపోయిన వారిపై గౌరవంతోనే తాను శ్మాశానవాటిక వద్దకు వెళ్తే చూడనివ్వలేదని అన్నారు. (డబ్బుల కోసం అమృత డ్రామాలాడుతోంది..) ఆయన చివరి కోరిక ప్రకారం నేను అమ్మ వద్దకు వెళ్లేది లేదని, ఆమె నా వద్దకు వస్తే నా వద్దే ఉంచుకుంటానని తెలిపారు. తన బాబాయి శ్రవణ్ వలన ఆమెకు ప్రాణహానీ ఉండవచ్చని ఆరోపించారు. మారుతీరావు ఆస్తి తన పేరుపై లేదని తెలిపారు. అది బినామీల పేరుపై ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్‌ను చంపే వరకు కూడా ఆస్తి ఉమ్మడిగానే ఉందని జైలు నుంచి విడుదలైన తర్వాతే పంచుకున్నారని విన్నానని తెలిపారు. ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉన్న వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదని అన్నారు. భర్త పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని, మా అమ్మ బాధను అర్థం చేసుకోగలని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ఆ విషయంపై మా ఇంటికి వచ్చిన వారిని సీసీ కెమరాల్లో చూశానని, ఆ సమయంలో వచ్చిన వ్యక్తితో ఖరీం ఫోన్లో మాట్లాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వీలునామా గురించి నాకు తెలియదని తెలిపారు. (చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం) తండ్రి అని సంబోధించని అమృత.. అమృత మీడియాతో మాట్లాడినంత సేపు మారుతీరావు, గిరిజ, శ్రవణ్ అని మాత్రమే సంబోధించారు. కానీ తండ్రి, తల్లి, బాబాయి అనే పదాలు కూడా ఆమె నోటి నుంచి రాలేదు. కూతురు కోసమే చనిపోయాడని బయట మాటలు వినిపిస్తున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు, వారి ప్రాణాలు వారు తీసుకునే హక్కు కూడా లేదన్నారు. తండ్ని అని సంబోధించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు దాట వేస్తూ వెళ్లిపోయారు. -
హారతి కర్పూరంలా కరిగిపోయిన మఠం ఆస్తులు
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వసతి సౌకర్యాల కోసం దాతలిచ్చిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కోట్ల రూపాయల విలువైన భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. భూములను కాపాడాల్సిన హథీరాంజీ మఠం నిర్వాహకులు కొందరు డబ్బులకు ఆశపడి ఒకే సర్వే నంబర్‌లోనే భూములను పలువురికి విక్రయించడం ప్రారంభించారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలో తిరుపతి హథీరాంజీ మఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మఠం కస్టోడియన్ అర్జున్‌దాస్ మహంతుపై సస్పెన్షన్ వేటు వేసింది. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓకు మఠం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షి, తిరుపతి : హథీరాంజీ బాబా రాజస్థాన్ ప్రాంత వాసి. రెండు శతాబ్దాల క్రితం తిరుమల వచ్చిన ఆయన వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడయ్యాడు. 18వ శతాబ్దం నుంచి తిరుమలలోనే ఉంటూ శ్రీవారి సేవలో తరించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు కాకముందు హథీరాంజీ మఠం ద్వారానే స్వామివారికి కైంకర్యాలు జరిగేవి. అందుకే ఆ సమయంలో శ్రీవారి భక్తులందరూ బహుమతులు, కానుకలు, దాన ధర్మాలన్నీ హథీరాంజీ మఠానికే ఇచ్చేవారు. మఠం పేరున ఇచ్చిన భూములను అప్పట్లో రైతులకు కౌలుకు ఇచ్చేవారు. కౌలు ద్వారా వచ్చే ఆదాయంతో మఠం నిర్వాహకులు మరికొన్ని ఎకరాలను కొనుగోలు చేశారు. అలా వచ్చిన మొత్తం భూములు 2,058 ఎకరాలు ఉన్నాయి. హథీరాంజీ మఠానికి తిరుపతితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో వేల కోట్ల రుపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. హారతి కర్పూరంలో కరిగిపోయిన ఆస్తులు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నాయకులు అధికార, ధన బలాన్ని వినియోగించుకుని మఠం భూముల్లో రాత్రికి రాత్రే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. కొద్ది రోజుల తర్వాత పక్కా భవనాలు నిర్మించుకున్నారు. మఠం భూముల ఆక్రమణపై శ్రీవారి భక్తులు అనేక మంది ఉన్నతాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి మఠం భూములు కాపాడమని వేడుకుంటూనే ఉన్నారు. అక్రమార్కుల జాబితాలో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక చోటామోటా నాయకులు ముందు వరుసలో ఉన్నారు. హథీరాంజీ మఠానికి భక్తులు అప్పగించిన భూములు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయనే విషయం బయటకు పొక్కకుండా మఠం నిర్వాహకులు కొందరు తొక్కిపెడుతున్నారు. ఆక్రమణకు గురైన భూములన్నీ గతంలో బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇచ్చిన భూములే కావటం గమనార్హం. లీజుకు తీసుకున్న వారు కొందరు ఇతరులకు విక్రయిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం లీజుదారులు అమ్మడానికి వీల్లేదు. వాటిని కొనుగోలు చేసినా చెల్లదు. అందుకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మహంతి సస్పెన్షన్‌కు కారణమైన భూములివే.. హథీరాంజీ మఠం నిర్వాహకులు అర్జున్‌దాస్ మహంతి సస్పెన్షన్‌కు తిరుపతి రూరల్ మండల పరిధిలో ఉన్న భూ వివాదాలే కారణంగా తెలుస్తోంది. మఠానికి చెందిన ఆస్తులను ఎవరైనా లీజుకు ఇవ్వాలంటే తప్పనిసరిగా దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండోమెంట్ శాఖ ఉద్యోగి సమక్షంలోనే వేలం పాటలు నిర్వహించాలి. ఆ తర్వాత ఆ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టుగా మఠం ఆస్తులను లీజుకు ఇచ్చే అధికారం అర్జున్ దాస్ మహంతికి లేదు. కాని ఎక్కడా ఆ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలున్నాయి. అవిలాల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 13, 15, 17, 17/2, 3, 5లో 175 ఎకరాలకుపైగా విలువైన భూమి ఉంది. ఈ భూమి తమదేనంటూ కొచ్చి కృష్ణారావు, కొచ్చి మనోరమ, కలిమిలి సుబ్రమణ్యం, కలిమిలి చెంగల్రాయులు, వెంకటయ్య, బుగ్గమఠం, హథీరాంజీ మఠం నిర్వాహకులు తమదంటే తమదేనని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో రూ.కోట్ల విలువైన భూమిని మాజీ మంత్రి, మాజీ ఎంపీ అనుచరులు ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. మరో పక్క టీడీపీ నేతలు డూప్లికేట్ పత్రాలు సృష్టించి, విచ్చలవిడిగా ఆక్రమించుకుంటూ రాత్రికిరాత్రే తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్నారు. అదేవిధంగా తిరుపతి నడిబొడ్డులోని రైతుబజారు వెనుక వైపు ఎకరం మఠం భూమి, ఎయిర్‌బైపాస్ రహదారిపై ఉన్న 9 ఎకరాల మఠం భూమిని చంద్రబాబు అత్యంత సన్నిహితుడు ఆక్రమించి ఏకంగా అతిపెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. ఇటీవల తిరుపతిలో అత్యంత విలువ చేసే 53 ఎకరాల మఠం భూమిని ధారాదత్తం చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటి వెనుక మఠం నిర్వాహకుల పాత్ర ఉందనే అనుమానాలున్నాయి. హథీరాంజీ మఠానికి సంబంధించిన 459.42 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా వి క్రయించినట్లు అర్జున్‌దాస్ మహంతిపై ప్రధాన ఆరోపణ ఉంది. అర్జున్ దాస్ నేపథ్యం అర్జున్ దాసు మహంతి మంగళవారం వరకు మఠం నిర్వాహకుడిగా పనిచేశారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన మిశ్రా అర్జున్ దాస్ మహంతికి బంధువు. కర్ణాటక ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకొంటున్న మఠం పరిపాలనాధికారి మిశ్ర ఇక్కడ కూడా జీతం తీసుకొంటుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి పింఛన్ తీసుకుంటూ మరో సంస్థ నుంచి జీతం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అంతేగాకుండా ఇటీవల తిరుపతి కేంద్రంగా హథీరాంజీ సంస్కృతి పరిరక్షణ సంస్థాన్ పేరిటి రెండు ట్రస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీటికి మిశ్రానే నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. హథీరాంజీ మఠానికి దాతలు ఇస్తున్న నిధులను ఈ ట్రస్టులకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అర్జున్‌దాస్ మహంతు గదికి తాళం తిరుమల: తిరుమల హథీరాంజీ మఠంలోని అర్జున్‌దాస్ మొహంతు గదికి దేవాదాయ శాఖ అధికారు లు తాళం వేశారు. బుధవా రం సాయంత్రం తిరుమలకు చేరుకున్న హథీరాంజీ మఠం ఇన్చార్జి, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి మఠాన్ని పరిశీలించారు. తిరుమలలో మఠానికి సంబంధించిన ఆస్తులు, ఇతర రికార్డులను పరిశీలించామని, అర్జున్‌దాస్ మహంతు అందుబాటులో లేకపోవడంతో గదికి తాళం వేశామని తెలిపారు. ఆయన రాగానే రికార్డులను పరిశీలిస్తామని చెప్పారు. మహంతుపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి, నిజ నిర్ధారణ చేస్తామని చెప్పారు. -
ఆస్తులు...అంతస్తులు
కేటీఆర్ వృత్తి వ్యవసాయం 2018లో.. నగదు: రూ.1,42,594 వ్యవసాయ భూమి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో 28.75 ఎకరాలు వ్యవసాయేతర భూమి: సిరిసిల్లలో రూ.14.46లక్షల విలువైన 27,360 చదరపు గజాలు చరాస్తులు: రూ.3.63 కోట్లు స్థిరాస్తులు: రూ.95,68,045 వాహనం: రూ.26.88 లక్షల విలువైన ఇన్నోవా కారు బంగారం : వంద గ్రాములు అప్పులు: రూ.33.28లక్షలు, వ్యక్తిగతంగా కేసీఆర్ నుంచి రూ.22.97 లక్షలు రుణం తీసుకున్నారు. కేసులు : 16 భార్య చరాస్తులు: రూ.27.70లక్షలు, భార్య స్థిరాస్తులు: రూ.4.80లక్షలు 2014లో.. చరాస్తులు: రూ.2.97 కోట్లు, స్థిరాస్తులు: రూ.63.56లక్షలు అప్పులు : రూ.15 లక్షలు, నగదు : రూ.6.25లక్షలు వ్యవసాయ భూమి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో 28.75 ఎకరాలు బంగారం : వంద గ్రాములు వాహనాలు : రూ.8లక్షల విలువైన టయోటా ఇన్నోవా కారు భార్య ఆస్తులు: రూ. 2.05కోట్లు -సాక్షి, సిరిసిల్ల దాసరి మనోహర్‌రెడ్డి ఆస్తులు రూ.7.19కోట్లు 2018లో.. ఆస్తులు : దాసరి మనోహర్‌రెడ్డి పేరిట రూ.7,19,15,770, దాసరి పుష్పలత రూ.1,66,61,415 అప్పులు : మనోహర్‌రెడ్డి పేరిట రూ.1,64,62,668, పుష్పలత రూ.43,84,036 స్థిరాస్తులు : మనోహర్‌రెడ్డి రూ.9,59,94,437, పుష్పలత రూ.4,42,50,284 కేసులు : 4 2014లో.. నగదు, డిపాజిట్లు : మనోహర్‌రెడ్డి పేరిట రూ.3,96,68,104, పుష్పలత పేరిట రూ.1,17,55,011 స్థిరాస్తులు : మనోహర్‌రెడ్డి రూ.8,17,52,119, పుష్పలత రూ.3,32,000 అప్పులు : మనోహర్‌రెడ్డి రూ.1,78,65,798, పుష్పలత రూ.25,16,378 కేసులు : 2 -పెద్దపల్లిఅర్బన్ సొంతిల్లు లేని పుట్ట మధు 2018లో... బంగారం : మధు వద్ద 5 తులాలు, శైలజ వద్ద 45 తులాలు భూములు: మధు పేరిట రూ.45 లక్షల విలువైన భూములు, శైలజ పేరిట 12.32 ఎకరాలు, స్థిర, చర ఆస్తులు : బంగారం, నగదు, వాహనాలు, ఫిక్స్డ్ బాండ్లతో కలిపి మధు పేరిట రూ.7.19 లక్షలు, ఆయన భార్య పేరిట రూ.46 లక్షలు విలువ ఉన్నట్లు సమర్పించారు. మంథనిలో 531 గజాల స్థలం మధు పేరిట నుంచి శైలజకు మారింది. కేసులు : 1 2014లో ఆస్తుల వివరాలు నగదు : మధు వద్ద రూ.54 వేలు, భార్య శైలజ వద్ద రూ.30 వేలు బంగారం : మధు వద్ద 5 తులాలు, శైలజ వద్ద 45 తులాలు వాహనాలు : మధు పేరిట రూ.14 లక్షల విలువైన వాహనం, శైలజ పేరిట రూ.13లక్షల విలువైన వాహనాలు భూములు : పుట్ట మధు 3.30 ఎకరాలు, అలాగే మంథనిలో రూ.15లక్షల విలువైన 531 గజాలు, పుట్ట శైలజ పేరిట 3.23 ఎకరాలు రెండింటి విలువ రూ.12లక్షలు చరాస్తులు : పుట్ట మధు రూ.16 లక్షలు, శైలజ రూ.32లక్షలు, భూముల విలువ మధు పేరిట రూ.40 లక్షలు, శైలజ పేరిట రూ.60లక్షలు అప్పులు : మధు రూ.8.10 లక్షలు, శైలజ రూ.12.50 లక్షలు పుట్టమధుపై ఉన్న కేసులు : 6 -మంథని సోమారపు 'కోటీ'శ్వరుడు 2018 వివరాలు చరాస్తి : రూ.11.57 లక్షల ఇన్‌కంటాక్స్, తన భాగస్వామి ద్వారా 2016–17లో రూ.71.65 లక్షలు నగదు : తన వద్ద రూ.5.67 లక్షలు, భాగస్వామి వద్ద రూ.6 లక్షలు సేవింగ్స్ : తన పేరిట రూ.36 లక్షలు, తన భాగస్వామి పేరిట రూ.85.74 లక్షలు వాహనాలు : రూ.15.66 లక్షల విలువైన ఇన్నోవా. బంగారం : రూ.42 లక్షల విలువైన 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు అప్పులు : తన భాగస్వామి పేరిట రూ.25 లక్షల బ్యాంకు రుణం, తన పేరిట రూ.67.38 లక్షలు, స్థిరాస్తులు : భార్య పేరిట రూ.3.70 కోట్లు తన పేరిట రూ.1.74 కోట్లు కేసులు : 2 2014లో.. చరాస్తులు : సోమారపు సత్యనారాయణ పేరిట రూ.92.14 కోట్లు, భార్య భారతి పేరిట : 1.33 కోట్లు స్థిరాస్తులు : సోమారపు సత్యనారాయణ పేరిట రూ.15 లక్షలు, భార్య భారతి పేరిట : 4.22 కోట్లు బంగారం : 750 గ్రాములు వాహనం : హోండా సిటీ కారు -గోదావరిఖని(రామగుండం) సొంత వాహనం లేని మంత్రి ఈటల రాజేందర్ 2014లో ఆస్తులు.. మొత్తం ఆస్తి : రూ.1.44 కోట్లు అప్పులు : లేవు నగదు : రూ. 50 వేలు సేవింగ్స్ : రూ.17.98 లక్షలు భూములు : షామీర్పేట మండలం దేవరాయాంజల్, పూడూరులో రూ. 2.50 కోట్ల విలువల చేసే 12.65 ఎకరాల వ్యవసాయ భూమి, హైదబాద్‌లోని బంజారాహిల్స్‌లో, కమలాపూర్‌లో, రంగారెడ్డి జిల్లాలలో రూ. 2.37 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూములు, జీడిమెట్లలో రూ.2.50 కోట్ల విలువైన 84 వేల చదరపు గజాలు, ణిజ్య భవనాలు ఉన్నాయి. 2018లో ఆస్తులు.. స్థిరాస్తులు : రూ.12.50 కోట్లు చరాస్తులు : రూ.32,22,327 నగదు : రూ.లక్ష భూములు : షామీర్పేట మండలం దేవరాయాంజల్, పూడూరులో రూ.2.50 కోట్ల విలువల చేసే 12.65 ఎకరాల వ్యవసాయ భూములు. హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో, కమలాపూర్‌లో రూ.2.37 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూములు, జీడిమెట్లలో రూ.2.50 కోట్ల విలువైన 84 వేల చదరపు గజాల వాణిజ్య భవనాలు. కేసులు : 3 -హుజూరాబాద్ చెన్నమనేనికి విదేశాల్లో ఆస్తులు... 2018లో.. చరాస్తులు: రూ.1.17కోట్లు, స్థిరాస్తులు: రూ.5.15 కోట్లు నివాస స్థలాలు: బెర్లిన్‌లో 10 గుంటలు, వేములవాడలో రెండెకరాలు, బాచుపల్లిలో 9,635 చదరపు గజాలు. వీటి మార్కెట్ విలువ రూ.7.95కోట్లు వ్యవసాయ భూములు: మొత్తం 25.02 ఎకరాలు వ్యవసాయేతర భూమి : బోరంపేట్, నాగారం(రంగారెడ్డి జిల్లా) 237.05 చదరపు గజాలు, 1281 చదరపు గజాలు. వాహనం : ఒక ఇన్నోవా: రుణాలు: రూ.72 లక్షలు కేసులు: ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. 2014లో.. చరాస్తులు: రూ.10 లక్షలు స్థిరాస్తులు: రూ.4.07 కోట్లు వ్యవసాయ భూమి: లేదు వ్యవసాయేతర భూమి: బోరంపేట్, నాగారం(రంగారెడ్డిజిల్లా)లో 237.05 చదరపు గజాలు, 1281 చదరపు గజాలు నివాస స్థలాలు: బెర్లిన్‌లో 10 గుంటలు, వేములవాడలో రెండెకరాలు, బాచుపల్లిలో 9,635 చదరపు గజాలు. వీటి మార్కెట్ విలువ రూ.4.07 కోట్లు బ్యాంకుల్లో రుణం: రూ.63,55,754 కేసులు : 1 -సాక్షి, సిరిసిల్ల -
అభ్యర్థుల ఆస్తులు
సాక్షి, వరంగల్: ముందస్తు శాసనసభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు సెంటిమెంట్ ప్రకారం తమ ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కరోజే 30 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాటితోపాటు తమ, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న స్థిర, చర ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను అఫిడెవిట్లలో వెల్ల్లడించారు. అరూరి రమేష్ (వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి) ఆస్తుల విలువ రూ.12.98కోట్లు సతీమణి కవిత ఆస్తుల విలువ : రూ.13.72కోట్ల వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ స్థిర, చర ఆస్తుల విలువ రూ.12,98,06,820, సతీమణి పేర రూ.13,72,41,879, కుమారుడు విశాల్ పేర రూ.3,79కోట్లు, కూతురు అక్షిత పేరు మీద రూ. 2.5కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడెవిడ్లో ప్రకటించారు. రుణాలు రమేష్ పేరుమీద రూ.22,53,359, కవిత పేరు మీద రూ.1.93కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘అరూరి’ వాహనం లేదు అరూరి రమేష్ అఫిడెవిట్‌లో తెలిపిన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల్లో ఆయన పేరుతో వాహనం లేదు. ఆయన కుటుంబానికి కొడుకు విశాపేరుతో ఒక ఇన్నోవా వాహనం మాత్రమే ఉన్నట్లు చూపించారు. వినయ్‌భాస్కర్ (పశ్చిమ టీఆర్ఎస్ అభ్యర్థి) ఆస్తుల విలువ : రూ.3,29,88,117 నగదు : రూ.1.50లక్షలు బ్యాంక్ నిల్వలు.. వినయ్‌భాస్కర్ : ఎస్బీఐ వడ్డేపల్లి బ్రాంచ్ : రూ.58,443 ఐఓబీ నక్కలగుట్ట : రూ.93,378 ఎస్బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్ : 1,34,290 గ్రాయత్రి కోఆపరేటివ్ సొసైటీ : రూ.1లక్ష, రూ.5లక్షల ఎల్ఐసీ బాండ్లు, ఒక ఇన్నోవా వాహనం : విలువ రూ.6లక్షలు కేసులు.. వినయ్భాస్కర్పై కాజీపేటలో రెండు, హైదరాబాద్‌లో రెండు, రైల్వే కేసులు రెండు ఉన్నాయి. అప్పులు.. హన్మకొండ కేవీబీలో రూ.67లక్షలు ఇంటిరుణం భార్య రేవతి ఆస్తుల విలువ : రూ.74,86,880 నల్లకుంట కరూర్ వైశ్యాబ్యాంక్ : రూ.2,86,880 వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఒక వాహనం విలువ: రూ.6లక్షలు 104 తులాల బంగారం విలువ : రూ.35లక్షలు. స్థిరాస్తులు.. వడ్డేపల్లి, మడికొండ, హన్మకొండలో ఇంటిస్థలాల విలువ కూ.2కోట్లు. హకీంపేటలో రూ.1.06కోట్ల విలువైన అపార్ట్ మెంట్. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి) ఆస్తుల విలువ : రూ.24.72 కోట్లు జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన ఆస్తుల విలువ రూ.24,72,63,230 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి ముత్తిరెడ్డి పద్మలతారెడ్డి పేరిట రూ.9.46.51.670 ఆస్తులు ఉన్నట్లు అఫిడెవిట్‌లో తెలిపారు. బ్యాంకుల ద్వారా యాదగిరిరెడ్డి తీసుకున్న అప్పులు రూ.1,32,42,670, భార్య పేరిట రూ.1,79,86,690 ఉన్నట్లు అఫిడెవిట్‌లో పేర్కొన్నారు. యాదగిరెడ్డి చర ఆస్తుల విలువ : రూ.14,36,19,352 పద్మలతారెడ్డి : రూ.3,28,25,312 యాదగిరిరెడ్డి స్థిర ఆస్తులు : రూ.24,72,63,230 పద్మలతారెడ్డి :రూ.4,46,51,678 యాదగిరిరెడ్డి స్వీయ కొనుగోళ్ల ఆస్తులు :రూ.1,15,74,056 పద్మలతారెడ్డి : రూ.35,66,787 యాదగిరిరెడ్డి సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తులు : రూ.2,32,12,500 పద్మలతారెడ్డి : 1,79,87,500 యాదగిరిరెడ్డి బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం : రూ.1,32,42,670 పద్మలతారెడ్డి : రూ.1,79,86,690 సిరికొండ మధుసూదనాచారి (భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి) మధుసూదనాచారి ఆస్తుల విలువ : రూ.20,02,610 సతీమణి ఉమాదేవి ఆస్తుల విలువ : రూ.4,89,485 చేతిలో ఉన్న డబ్బు.. మధుసూదనాచారి : రూ.40 వేలు ఉమాదేవి : రూ.15 వేలు సేవింగ్, పాలసీలు, డిపాజిట్లు.. మధుసూదనాచారి : రూ.17,49,391 ఉమాదేవి : రూ.1,92,787 ఉమాదేవి పేరుపై ఉన్న వాహనం విలువ రూ.10.70 లక్షలు బంగారు నగల విలువ.. మధుసూదనాచారి : 20 గ్రాములు : రూ.60 వేలు ఉమాదేవి : 100 గ్రాములు : రూ. 3లక్షలు ఉమ్మడి వ్యవసాయ భూమి.. మధుసూదనాచారి పేరుతో 3.16 ఎకరాలు : విలువ రూ.3.74 లక్షలు ఉమాదేవి పేరుతో అర ఎకరం : విలువ రూ.2.50 లక్షలు నివాస భవనాలు.. నర్సక్కపల్లిలోని నివాస భవనం. ప్రస్తుత విలువ రూ.9 లక్షలు మధుసూదనాచారి తీసుకున్న బ్యాంకు రుణం రూ.7,49,566 చల్లా ధర్మారెడ్డి (పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి) ఆస్తుల విలువ : రూ.27కోట్లు రుణాలు రూ.3.89కోట్లు పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పేరు మీద ఉన్న స్థిర, చర ఆస్తుల విలువ రూ.27,19,69,314. ఇందులో హిందు అవిభక్త కుటుంబం ఆస్తి విలువ రూ.3,23,47,366. ధర్మారెడ్డి సతీమణి జ్యోతి పేరు మీద రూ.10,15,33,846 విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ధర్మారెడ్డి పేరు మీద బ్యాంక్ రుణాలు రూ.3,89,00,063, సతీమణి జ్యోతి పేరు మీద రూ.1,50,24,764 ఉన్నాయని తెలిపారు. గండ్ర సత్యనారాయణరావు (ఏఐఎఫ్బీ అభ్యర్థి) గండ్ర సత్యనారాయణరావు ఆస్తుల విలువ : రూ.6,11,360 సతీమణి గండ్ర పద్మ ఆస్తుల విలువ : రూ.3,83,950 చేతిలో ఉన్న నగదు.. సత్యనారాయణరావు : రూ.60 వేలు గండ్ర పద్మ : రూ. 40 వేలు చరాస్తుల విలువ.. గండ్ర సత్యనారాయణరావు :రూ.23,53,800 గండ్ర పద్మ : రూ.5,90,000 గండ్ర అనూష : రూ.1.90 లక్షలు స్థిరాస్థుల విలువ.. సత్యనారాయణరావు : రూ.1.71 కోట్లు పద్మ : రూ.1.60 కోట్లు సంపాదనతో కొన్న ఆస్తుల విలువ.. సత్యనారాయణరావు : రూ.16.69 లక్షలు గండ్ర పద్మ : రూ.36,43,500 చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి) కీర్తిరెడ్డి ఆస్తుల విలువ : రూ.12,81,372 భర్త సత్యపాల్‌రెడ్డి : రూ.33,26,391 కీర్తిరెడ్డి చేతిలో ఉన్న డబ్బు : రూ.45 వేలు సత్యపాల్‌రెడ్డి : రూ.50 వేలు బ్యాంకుల్లో నిల్వ.. కీర్తిరెడ్డి : రూ.4,54,426 సత్యపాల్‌రెడ్డి : రూ.17,38,911 సేవింగ్స్, పాలసీలు.. కీర్తిరెడ్డి : రూ.19,63,176 సత్యపాల్‌రెడ్డి : రూ.58,41,968 రుణాలు, చిట్టీలు.. కీర్తిరెడ్డి : రూ.1,32,000 సత్యపాల్‌రెడ్డి : రూ.50,62,050 వాహనాల విలువ.. కీర్తిరెడ్డి : రూ.23,490 సత్యపాల్‌రెడ్డి : రూ.10,64,809 బంగారు నగల విలువ.. కీర్తిరెడ్డి : రూ.32.06 లక్షలు సత్యపాల్‌రెడ్డి : రూ. 3,83,640 వ్యవసాయ, వ్యవసాయేతర భూములు.. కీర్తిరెడ్డి : రూ.5.38 కోట్లు(ప్రస్తుత విలువ) సత్యపాల్‌రెడ్డి : రూ. 5.56 కోట్లు(ప్రస్తుత విలువ) రుణాలు, అప్పులు.. కీర్తిరెడ్డి : రూ.97,42,457 సత్యపాల్‌రెడ్డి : రూ.3.70 కోట్లు -
ఎన్నికల్లో లబ్ధికోసం చంద్రబాబు కొత్త ఎత్తుగడ
-
వృద్ధుడి దారుణ హత్య
ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న వృద్ధుడిపై దుండగులు విరుచుకుపడ్డారు. పొత్తికడుపులోకి కత్తులు దూసి పారిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపు ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకులే హత్య చేసి ఉంటారని తల్లి ఆరోపిస్తోంది. గుంతకల్లులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గుంతకల్లు: గుంతకల్లు పట్టణం కసాపురం రోడ్డులోని రెడ్డిస్ట్రీట్‌లో నివాసముంటున్న కసి బసప్ప (68) దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ శ్రీధర్‌రావు, హతుడి భార్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కసి బసప్ప, రామలింగమ్మ దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు (ధనుంజయ్య, శివ, ఆంజనేయులు), ముగ్గురు కుమార్తెలు సంతానం. 48 ఎకరాల పొలం ఉండగా.. ముగ్గురు కుమారులకు చెరి 11 ఎకరాలు చొప్పున (మొత్తం 33 ఎకరాలు) పంచి ఇచ్చారు. మిగిలిన 15 ఎకరాల్లో ఆడపిల్లలకు చెరి ఒకటిన్నర ఎకరం చొప్పున పంచారు. మిగిలిన పదిన్నర ఎకరాలను వృద్ధ దంపతుల తమ జీవనాధారం కోసం పెట్టుకున్నారు. ఆడపిల్లలకు భూమి ఇవ్వడం కుమారులకు ససేమిరా ఇష్టం లేదు. పంపకాల సమయంలోనే తండ్రిపై దాడి కూడా చేసి ఆస్పత్రిపాలు చేశారు. భూమి అమ్ముకున్నందుకు గొడవ.. వృద్ధ దంపతులు కుటుంబ అవసరాల కోసం తమవద్ద ఉన్న పొలంలో నాలుగు ఎకరాలు అమ్ముకున్నారు. భూ మి ఎలా అమ్ముతారంటూ కుమారులు రోజూ తండ్రితో గొడవపడుతుండేవారు. ఆస్తి పంపకాల గొడవల్లోనే ఆంజనేయులును ధనుంజయ్య, శివ కొట్టి పంపారు. కుమారులపై అనుమానం ఆస్తి పంపకాల విషయమై బసప్పతో కుమారులు తరచూ గొడవపడుతుండేవారని డీఎస్పీ శ్రీధర్‌రావు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 2016లో బసప్పపై దాడి చేయగా కుమారులు శివ, ధనుంజయ్యలపై రామలింగమ్మ అప్పట్లో కసాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఆస్తి కోసం తరచూ గొడవపడుతుండటంతో కసాపురం స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ కూడా చేసినట్లు వెల్లడించారు. బసప్ప హత్యకు గురైన తర్వాత శివ, ధనుంజయ్య కనిపించకుండాపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కొడుకులే చంపారు ఆడపిల్లలకు భూమి ఇవ్వడం నా కుమారులకు ససేమిరా ఇష్టం లేదు. ఆ సమయంలోనే మా ఆయనపై దాడి కూడా చేసి ఆస్పత్రిపాలు చేశారు. మాదంపతుల ఖర్చుల నిమి త్తం 4 ఎకరాల భూమిని అమ్మితే.. ఎలా అ మ్ముతారంటూ రోజూ తండ్రి బసప్పతో కు మారులు గొడవ పడుతుండేవారు. ఆస్తి పం పకాల గొడవల్లోనే ఆంజినేయులును ధ నుం జయ్య, శివలు కొట్టి పంపారు. ఇప్పటికీ అం జినేయులు ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు. ఆడపిల్లలకు భూమి పంచడమే కాక పొలం అమ్మాడన్న కోపంతో శివ, ధ నుంజయ్యలు తండ్రిని హత్య చేశారు. ఇలాంటి దుస్థితి ఏ దంపతులకూ రాకూడదు. – కసి బసప్ప భార్య రామలింగమ్మ