స్థిరాస్తుల వేటలో కమల్
ప్రముఖ నటుడు కమల హాసన్ వ్యవహారిక దృక్పథంలో మార్పు వచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో సంపాదించిన
ప్రముఖ నటుడు కమల హాసన్ వ్యవహారిక దృక్పథంలో మార్పు వచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో సంపాదించిన మొత్తాన్ని సినిమాకే ఖర్చు చేసిన కమల్ తాజాగా నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నంలో పడ్డారట. ప్రస్తుతం కమల్ స్థిరాస్తులను కూడబెట్టుకునే దిశగా పయనిస్తున్నారు. కొన్ని నెలల క్రితం బెంగళూరుకు వెళ్లిన కమల్ అక్కడ ఒక సినీ థియేటర్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే ఆ థియేటర్ యజమాని కూతురు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కమల్ ఆ థియేటర్ కొనుగోలు విషయంలో వెనక్కు తగ్గారట. అయితే ప్రస్తుతం ఆయన నివసిస్తున్న చెన్నై ఆళ్వార్‌పేటలోని ఇంటిని ఆధునీకరించి అందులో డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. విశ్వరూపం చిత్ర వసూళ్లను వీటి నిర్మాణానికి ఖర్చు చేయాలనుకుంటున్నారట. ఈ చిత్ర విడుదల విషయంలో ఎదురైన సమస్యల నేపథ్యంలో కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకే కమల్ ఇప్పుడు స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.