
సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా సాధారణం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ ఏదో ఒకటి వింటూనే ఉంటాం. విడాకులు తీసుకోవడం ఏమో గానీ వాళ‍్ల పిల్లలు చాలా బాధని అనుభవిస్తుంటారు. అలాంటి అనుభవాన్ని ఇన్నాళ్లకు హీరోయిన్ శ్రుతి హాసన్ బయటపెట్టింది. తన జీవితాన్ని మార్చేసిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కమల్ తొలి భార్య సారికకు పుట్టిన కూతుళ్లలో శ్రుతి హాసన్ పెద్దది. 1988లో కమల్-సారిక పెళ్లి జరగ్గా.. 2004లో విడిపోయారు. దీంతో తల్లితో పాటు కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ ముంబై వెళ్లిపోయారు. ఆ విషయాల్నే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ పంచుకుంది.
'నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా జీవితంలో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం నన్ను చాలా బాధపెట్టింది. వాళ్లిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారి మారిపోయింది'
(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ)
'చెన్నై నుంచి ముంబై వచ్చేశాం. అప్పటివరకు బెంజ్ కార్లలో తిరిగిన నేను లోకల్ ట్రైన్ లో తిరిగాను. అలా రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాన్నతో ఉంటున్నాను. విదేశాల్లో సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
మ్యూజిక్ కంపోజర్, సింగర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రుతి హాసన్.. 'అనగఅనగా ఓ ధీరుడు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. హిట్స్, ఫ్లాప్స్ ఈమె చాలానే ఉన్నాయి. రీసెంట్ టైంలో మాత్రం మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ప్రస్తుతం రజనీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలోని 'కూలీ' మూవీ చేస్తోంది.
(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్)