నటి శృతిహాసన్‌ను చూస్తే పులి కడుపున పులిబిడ్డే పుడుతుందన్న సామెత నిజం అనిపిస్తుంది. కమలహాసన్‌కు చిత్ర పరిశ్రమలో సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. ఈ విషయంలో ఆయన వారసురాలు శృతిహాసన్ కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఈమె బాలీవుడ్‌లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా నటించి అప్పుడే సంచలన నటిగా ముద్రవేసుకున్నారు. ఆ తరువాత సంగీత రంగంలోకి ప్రవేశించి తన తండ్రి కథానాయకుడిగా నటించిన ఉన్నైపోల్ ఒరువన్ (తెలుగులో ఈనాడు) చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యారు.
ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూనే సంగీతం పైనా దృష్టి సారిస్తున్నారు. ఈమె పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శృతిహాసన్‌లో గీత రచయిత, మంచి గాయని కూడా ఉన్నారు. కాగా తాజాగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఆంగ్లమ్‌లో ఒక పాటను రాశారు. అనంతరం ఆ పాటను తమిళంలోకి నటుడు కమలహాసన్ అనువదించి తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా దానికి నటి శృతిహాసన్ సంగీత బాణీలు కట్టి పాడి నటించారు. ఈ ఆల్బమ్‌లో ప్రస్తుత క్రేజీ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శృతిహాసన్‌తో కలిసి నటించడం విశేషం.
ఇది ఒక రొమాంటిక్ ఆల్బమ్ ఆన్నది గమనార్హం. ఇటీవల విడుదల చేసిన ఈ ఆల్బమ్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఇనిమేల్ ఆల్బమ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక మాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నటి శృతిహాసన్, దర్శకుడు లోకశ్‌కనకరాజ్ పాల్గొన్నారు. నటి శృతిహాసన్ మాట్లాడుతూ 4 నిమిషాల్లో ఒక జంట రిలేషన్‌షిప్‌లోని భావాలను ఆవిష్కరించే ఆల్బమ్‌గా ఇనిమేల్ ఉంటుందన్నారు. రిలేషన్‌షిప్ అనేది ఎలా ఒక లూప్‌గా మారుతోంది, అందులోని అప్స్ అండ్ డౌన్స్‌ను ఈ పాట ద్వారా చెప్పదలచానన్నారు.
ఈ ఆల్బమ్ చూసిన ప్రేక్షకులు తమ రిలేషన్‌ఫిప్‌లోని లోపాలను సరిదిద్దుకుంటారనే నమ్మకంతో రూపొందించినట్లు చెప్పారు. తాను చిన్నతనం నుంచే సంగీతంతో పయనిస్తున్నానని, అది తన అదృష్టం అని పేర్కొన్నారు. సినీ సంగీతం అనేది ఒక మాన్‌స్టర్ అని, అందులో ప్రైవేట్ ఆల్బమ్స్ అనేవి 30 శాతం అయినా ఉండాలని భావించానన్నారు. ఇనిమేల్ ఆల్బమ్‌కు ఇంత ప్రచారం రావడానికి కారణం తన తండ్రి, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అని పేర్కొన్నారు.
దర్శకుడు లోకేశ్‌కనకరాజ్‌ను విక్రమ్ చిత్ర షూటింగ్ సమయంలో కెమెరాలో చూశానన్నారు. ఈయన రూపం బాగానే ఉందనిపించిందన్నారు. అలా ఆయన ఈ ఆల్బమ్‌లోకి వచ్చారన్నారు. ఎంతో మంది అభిమానులు కలిగిన దర్శకుడు ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రేమను ఒక డెల్యూషన్ అంటారని, అది పరిపూర్ణం కాకపోతే మాయగానే అసహనంగా మారుతుందని, అదే పరిపూర్ణం అయితే ఆ మూవెంట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతుందని అన్నారు. అదే డెల్యూషన్ నుంచి సొల్యూషన్ వైపునకు సాగే ప్రేమ పయనం అవుతుందన్నారు. ఈ విషయాన్నే ఇనిమేల్ ఆల్బమ్‌లో చూపించినట్లు చెప్పారు. ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో తాను నటించడం సంతోషకరమన్నారు. తమ జంట తన తండ్రి కమలహాసన్‌కు నచ్చిందని శృతిహాసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment