Shruti Haasan.
-
మా జంట నాన్నకు నచ్చింది: శృతిహాసన్
నటి శృతిహాసన్‌ను చూస్తే పులి కడుపున పులిబిడ్డే పుడుతుందన్న సామెత నిజం అనిపిస్తుంది. కమలహాసన్‌కు చిత్ర పరిశ్రమలో సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. ఈ విషయంలో ఆయన వారసురాలు శృతిహాసన్ కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఈమె బాలీవుడ్లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా నటించి అప్పుడే సంచలన నటిగా ముద్రవేసుకున్నారు. ఆ తరువాత సంగీత రంగంలోకి ప్రవేశించి తన తండ్రి కథానాయకుడిగా నటించిన ఉన్నైపోల్ ఒరువన్ (తెలుగులో ఈనాడు) చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూనే సంగీతం పైనా దృష్టి సారిస్తున్నారు. ఈమె పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శృతిహాసన్‌లో గీత రచయిత, మంచి గాయని కూడా ఉన్నారు. కాగా తాజాగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఆంగ్లమ్లో ఒక పాటను రాశారు. అనంతరం ఆ పాటను తమిళంలోకి నటుడు కమలహాసన్ అనువదించి తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా దానికి నటి శృతిహాసన్ సంగీత బాణీలు కట్టి పాడి నటించారు. ఈ ఆల్బమ్‌లో ప్రస్తుత క్రేజీ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శృతిహాసన్‌తో కలిసి నటించడం విశేషం. ఇది ఒక రొమాంటిక్ ఆల్బమ్ ఆన్నది గమనార్హం. ఇటీవల విడుదల చేసిన ఈ ఆల్బమ్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఇనిమేల్ ఆల్బమ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నటి శృతిహాసన్, దర్శకుడు లోకశ్కనకరాజ్ పాల్గొన్నారు. నటి శృతిహాసన్ మాట్లాడుతూ 4 నిమిషాల్లో ఒక జంట రిలేషన్‌షిప్‌లోని భావాలను ఆవిష్కరించే ఆల్బమ్‌గా ఇనిమేల్ ఉంటుందన్నారు. రిలేషన్షిప్ అనేది ఎలా ఒక లూప్గా మారుతోంది, అందులోని అప్స్ అండ్ డౌన్స్‌ను ఈ పాట ద్వారా చెప్పదలచానన్నారు. ఈ ఆల్బమ్ చూసిన ప్రేక్షకులు తమ రిలేషన్ఫిప్లోని లోపాలను సరిదిద్దుకుంటారనే నమ్మకంతో రూపొందించినట్లు చెప్పారు. తాను చిన్నతనం నుంచే సంగీతంతో పయనిస్తున్నానని, అది తన అదృష్టం అని పేర్కొన్నారు. సినీ సంగీతం అనేది ఒక మాన్స్టర్ అని, అందులో ప్రైవేట్ ఆల్బమ్స్ అనేవి 30 శాతం అయినా ఉండాలని భావించానన్నారు. ఇనిమేల్ ఆల్బమ్‌కు ఇంత ప్రచారం రావడానికి కారణం తన తండ్రి, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అని పేర్కొన్నారు. దర్శకుడు లోకేశ్కనకరాజ్ను విక్రమ్ చిత్ర షూటింగ్ సమయంలో కెమెరాలో చూశానన్నారు. ఈయన రూపం బాగానే ఉందనిపించిందన్నారు. అలా ఆయన ఈ ఆల్బమ్‌లోకి వచ్చారన్నారు. ఎంతో మంది అభిమానులు కలిగిన దర్శకుడు ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రేమను ఒక డెల్యూషన్ అంటారని, అది పరిపూర్ణం కాకపోతే మాయగానే అసహనంగా మారుతుందని, అదే పరిపూర్ణం అయితే ఆ మూవెంట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతుందని అన్నారు. అదే డెల్యూషన్ నుంచి సొల్యూషన్ వైపునకు సాగే ప్రేమ పయనం అవుతుందన్నారు. ఈ విషయాన్నే ఇనిమేల్ ఆల్బమ్‌లో చూపించినట్లు చెప్పారు. ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో తాను నటించడం సంతోషకరమన్నారు. తమ జంట తన తండ్రి కమలహాసన్‌కు నచ్చిందని శృతిహాసన్ పేర్కొన్నారు. -
ఆయన్ను ఎవరైనా లవ్ చేస్తారు: శ్రుతిహాసన్
నటి శ్రుతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్. వీరు ఇద్దరూ ఇద్దరే. ఎవరి క్రేజ్ వారికుంది. హీరోయిన్గా శ్రుతిహాసన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే నాలుగు చిత్రాలతోనే మోస్ట్ పాపులారిటీని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సంపాదించుకున్నాడు. ఇక వీరికి లోకనాయకుడు కమలహాసన్ తోడైతే అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా వచ్చే క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు అదే జరిగింది. కమలహాసన్ రాసిన తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందించిన ఈ పాటకు శ్రుతిహాసన్ బాణీలు కట్టి, పాడడంతో పాటు, అందులో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి నటించారు. ఈ ప్రత్యేక వీడియో ఆల్బమ్‌కు 'ఇనిమేల్' అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలో విడుదల కానున్న మ్యూజికల్ వీడియో ఆల్బమ్‌కు సంబంధించిన చిన్న ప్రమోషన్ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి భారీ స్పందన వస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ విషయాన్ని పక్కన పెడితే ఇందులో దర్శకుడు లోకేష్ కనకరాజ్, శ్రుతిహాసన్ కలిసి నటించిన సన్నిహిత సన్నివేశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఈ పాట ప్రమోషన్లో భాగంగా శ్రుతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాజ్ కమల్ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు. శ్రుతిహాసన్ పేర్కొంటూ తాను ఆంగ్లంలో రాసి ఈ వీడియో ఆల్బమ్‌ను రూపొందించదలచినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తండ్రి కమల్‌హాసన్ తో కలిసి చేద్దామని చెప్పగా ఆయన తన ఆంగ్లం పాటను తమిళంలో రాసినట్లు చెప్పారు. అది ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి మంచి రొమాంటిక్ వీడియో ఆల్బమ్‌గా మారిందని చెప్పారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ఈ వీడియో ఆల్బమ్ కోసం శ్రుతిహాసన్ తనను ఎందుకు ఎంపిక చేశారో తెలియలేదన్నారు. అయితే ఆమె క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ ఆల్బమ్‌లో అనూహ్యంగా శ్రుతిహాసన్‌కు లవర్ బాయ్‌గా ఎలా నటించ గలిగారు అన్న ప్రశ్నకు లోకేష్ కనకరాజ్ కాస్త సిగ్గుపడుతూ బదులిచ్చారు.మీకు ఎక్స్ లవ్ లాంటిది జరిగిందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన బదిలించారు. దీంతో శ్రుతిహాసన్ కల్పించుకుని లోకేష్ కనకరాజ్‌ను లవ్ చేయని వారు ఉంటారా అంటూ, ఈయన్ని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రేమిస్తారు అంటూ పేర్కొన్నారు. -
టికెట్స్ ఇవ్వకపోతే గొడవ చెయ్యండి: హీరో నాని
-
మైనస్ డిగ్రీల చలి.. పైగా శారీ.. చాలా ఇబ్బందిగా ఫీలయ్యా : శృతిహాసన్
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటల సినిమా మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా..' అంటూ సాగే సాంగ్‌ను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే తాజాగా హీరోయిన్ శృతిహాసన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డీగ్రీల చలి ఉందని ఆమె తెలిపింది. ఆ పాట కోసం శారీలో ఆ వాతావరణంలో డ్యాన్స్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది భామ. అయినప్పటికీ అభిమానుల కోసం చేయాల్సిందేనని తెలిపింది. శృతిహాసన్ మాట్లాడుతూ..'నేను మంచులో చీరతో డ్యాన్స్ మరొక పాట డ్యాన్స్ చేయనవసరం లేదని అనుకున్నా. ఎందుకంటే ఆ వాతావరణంలో నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ ప్రేక్షకులకు నచ్చేలా మేము తప్పకుండా చేయాల్సిందే. మైనస్ డిగ్రీల చలిలో నటించడం నాకు ఇబ్బందిగా అనిపించింది.' అని అన్నారు. -
హీరోయిన్ శ్రుతి హాసన్‌కు ఏమైంది? ఆమె ముఖం ఇలా మారిపోయిందేంటి?
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు ఏమైంది? ఆమె ముఖం ఏంటి ఇలా అయిపోయింది? అంటూ ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. రీసెంట్గా శృతి షేర్ చేసిన ఫోటోలే ఈ అనుమానాలకు కారణం. సాధారణంగా హీరోయిన్స్ డీగ్లామర్‌గా కనిపించేందుకు వెనకాడుతుంటారు. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసేందుకు కూడా ఇష్టపడరు. అయితే శ్రుతిహాసన్ మాత్రం ఇవేం పట్టించుకోదు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫీవర్, సైనస్‌తో ఆమె బాధపడుతుందట. బ్యాడ్ డే, బ్యాడ్హెయిర్తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రుతిహాసన్ ముఖం బాగా ఉబ్బిపోయి బాగా డల్‌గా కనిపిస్తుంది. దీంతో అసలు శ్రుతిహాసన్‌కు ఏమైంది? ఇలా తయారయ్యిందేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలా షేర్ చేయడానికి చాలా గట్స్ ఉండాలంటూ మరికొందరు శ్రుతిని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
సామాజిక బాధ్యత ఫీల్ అవ్వండి!
ఈ కోవిడ్ సంక్షోభంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. కోవిడ్ బాధితులకు, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మన మంచి మాటలతో ధైర్యాన్ని నింపడం కూడా సాయమే అవుతుందంటున్నారామె. ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్డౌన్ అప్పుడు ఇంట్లోనే ఉండి వంటలు, వ్యాయామాలు, ఆన్లైన్ క్లాసులతో రోజులను గడిపాం. కానీ ఇప్పటి కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులు వేరు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఫీలై ఒకొరికొకరం సాయం చేసుకోవాల్సిన తరుణం ఇది’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సమయంలో కొంతమందికి సోషల్ మీడియా ఓ మంచి సాధనంగా ఉపయోగపడుతోంది. కోవిడ్ సహాయ సమాచారాలను తెలుసుకోగలుగుతున్నాం. అయితే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు. నా వరకు కచ్చితమైన వివరాలనే షేర్ చేయడానికే ప్రయత్నిస్తాను. నా టీమ్ గ్రౌండ్ లెవల్లో కొంత వర్క్ చేసిన తర్వాతనే నా టైమ్‌లైన్‌లో సమాచారాన్ని షేర్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ – ‘‘లాక్‌డౌన్‌కు ముందే ఓ హిందీ ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘సలార్’ చేయాల్సి ఉంది. కమిటైన మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో మరికొన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
‘సినిమాల్లోనే నటించాలా? వేరే పనులు లేవా?’
సాక్షి, చెన్నై: సినిమాల్లో నటించకపోతే పెళ్లికి సిద్ధం అవుతున్నట్లేనా అంటూ సంచన నటి శ్రుతిహాసన్ ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యూటీ పెళ్లిపై ఇటీవల చాలానే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. శ్రుతిని తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రుతి అనూహ్యంగా నటనకు దూరం అయితే ఎవరికైనా ఏమైందనే ప్రశ్న తలెత్తడం సహజమే. అంతేకాక లండన్‌కు చెందిన బాయ్‌ఫ్రెండ్ మైఖైల్తో విందులు, విహారాలకు తిరిగారు. అందుచేత పెళ్లికి లగ్నం పెట్టేసుకుంటున్నా రేమోనన్న అనుమానం రాకమానదు. వరించిన అవకాశాన్ని కాలదన్నడం.. సంఘమిత్రలో కోరి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడంతో శ్రుతి నట జీవితంపై రకరకాల ప్రచారానికి ఆస్కారం కలుగుతోంది. అయితే ఏ విషయంలోనైనా చాలా బోల్డ్‌గా వ్యవహరించే శ్రుతిహాసన్ తనపై వస్తున్న వదంతులపై కాస్త ఘాటుగానే స్పందించారు. వదంతులపై శ్రుతి ఫైర్.. వదంతులపై శుత్రి మాట్లాడుతూ.. ‘ నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దయచేసి నా వివాహాన్ని, సినిమాను కలిసి మాట్లాడకండి. వెండితెరపై మిమ్మల్ని చాలా కాలంగా చూడలేకపోతున్నామే, సినిమాలను వదిలేశారా ? అని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్లోనే నటించాలా ? నాకు వేరే పనులు లేవా? నా జీవితం సినిమాలతో పాటు పలు విషయాలతో ముడిపడి ఉంది. శ్రుతి పెళ్లికి సిద్ధం అవుతున్నారు వంటి ప్రచారాన్ని చేయకండి. నాకు సంగీత పరిజ్ఞానం ఉంది. అదే విధంగా నటన మాత్రమే కాక నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని’ ఆమె తెలిపారు. హీరోయిన్ అవుతానని ఊహించనేలేదు.. అంతేకాక హీరోయిన్ కావడంపై కూడా ఆమె స్పందించారు. ’ నిజం చెప్పాలంటే నేను హీరోయిన్ అవుతానని ఊహించనేలేదు. అవకాశం వచ్చింది చేసి చూద్దాం అని భావించాను. ఆ తర్వాత అదే దారిలో ఉన్నత స్థాయికి ఎదిగాను. ఆ స్థాయిని నిలదొక్కుకున్నాను. ఇప్పుడు మంచి కథా చిత్రాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా మనసు ఏం చెబుతుందో అదే చేస్తాను. నటనతో పాటు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు లభించిన సమయాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను’ అని శ్రుతి హాసన్ చెప్పారు. -
వారికోసం హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్
ముంబై: మహిళా దినోత్సవాన్ని హీరోయిన్ శృతిహాసన్ వినూత్నంగా జరుపుకుంటోంది. వివిధ రంగాల్లో ప్రవేశంతో మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా పేరుతెచ్చుకున్న ఈ అందాలభామ మహిళాజాతి కోసం తన మెదడుకు, గళానికి పదును పెట్టింది. తాను తీస్తున్న 'మై డే ఇన్ ద సన్' అనే సింగిల్ ఆల్బంలోని పాటను మహిళలకు అంకితం చేస్తుండట. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు మహిళల కోసం సమయాన్ని కేటాయించడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్లో ఇపుడు సింగిల్ ఆల్బంల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 8 మహిళా దినోత్వం సందర్భాన్ని పురస్కరించుకొని హీరోయిన్ శృతి కూడా రంగంలోకి దిగింది. మహిళల కోసమంటూ ఓ సరికొత్త ఆల్బంతో మన ముందుకొస్తోంది. బాలీవుడ్ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎహ్సాన్ నూరానీ, లాయ్ మెన్‌డోన్కాలతో సహకారంతో ఈ ప్రత్యేక ఆల్బంను రూపొందిస్తోంది. సమాజంలోని మహిళలందర్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పాట రాశానని శృతి తెలిపింది. మహిళలను చైతన్యపరిచేలా ఈ పాటను రచించినట్లు పేర్కొంది. ఇలాంటి పాట రాసే అదృష్టం తనకు కలగడం సంతోషంగా ఉందనీ, ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందనే అభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే బాల్యం నుంచి ఎహ్సాన్ అండ్ లాయ్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ పెరిగాననీ, వారి టాలెంట్ గురించి తనకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. ఈ పాటను మార్చి 8న విడుదల చేయనున్నామని, మరో రెండు నెలల్లో దీని వీడియోను రిలీజ్ చేయనున్నట్టు శృతి తెలిపింది.