మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటల సినిమా మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా..' అంటూ సాగే సాంగ్‌ను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే తాజాగా హీరోయిన్ శృతిహాసన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డీగ్రీల చలి ఉందని ఆమె తెలిపింది. ఆ పాట కోసం శారీలో ఆ వాతావరణంలో డ్యాన్స్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది భామ. అయినప్పటికీ అభిమానుల కోసం చేయాల్సిందేనని తెలిపింది.
శృతిహాసన్ మాట్లాడుతూ..'నేను మంచులో చీరతో డ్యాన్స్ మరొక పాట డ్యాన్స్ చేయనవసరం లేదని అనుకున్నా. ఎందుకంటే ఆ వాతావరణంలో నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ ప్రేక్షకులకు నచ్చేలా మేము తప్పకుండా చేయాల్సిందే. మైనస్ డిగ్రీల చలిలో నటించడం నాకు ఇబ్బందిగా అనిపించింది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment