వారికోసం హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ | Shruti Haasan comes up with song for Women's Day | Sakshi
Sakshi News home page

వారికోసం హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్

Published Thu, Mar 3 2016 4:26 PM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

వారికోసం హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ - Sakshi

వారికోసం హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్

ముంబై: మహిళా దినోత్సవాన్ని హీరోయిన్ శృతిహాసన్  వినూత్నంగా జరుపుకుంటోంది. వివిధ రంగాల్లో ప్రవేశంతో మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా పేరుతెచ్చుకున్న ఈ అందాలభామ మహిళాజాతి కోసం తన మెదడుకు, గళానికి పదును పెట్టింది. తాను తీస్తున్న 'మై డే ఇన్ ద సన్' అనే సింగిల్ ఆల్బంలోని పాటను మహిళలకు అంకితం చేస్తుండట. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు మహిళల కోసం సమయాన్ని కేటాయించడం ఆసక్తికరంగా మారింది.  

బాలీవుడ్‌లో ఇపుడు  సింగిల్ ఆల్బంల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే  మార్చి 8  మహిళా దినోత్వం సందర్భాన్ని పురస్కరించుకొని హీరోయిన్ శృతి కూడా రంగంలోకి  దిగింది. మహిళల కోసమంటూ ఓ సరికొత్త ఆల్బంతో మన ముందుకొస్తోంది. బాలీవుడ్ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో  సహకారంతో ఈ ప్రత్యేక ఆల్బంను రూపొందిస్తోంది.

సమాజంలోని మహిళలందర్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పాట రాశానని శృతి తెలిపింది. మహిళలను చైతన్యపరిచేలా ఈ పాటను రచించినట్లు పేర్కొంది. ఇలాంటి పాట రాసే అదృష్టం తనకు కలగడం  సంతోషంగా ఉందనీ, ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందనే అభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే బాల్యం నుంచి ఎహ్సాన్ అండ్ లాయ్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ పెరిగాననీ, వారి టాలెంట్ గురించి తనకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. ఈ పాటను మార్చి 8న విడుదల చేయనున్నామని,  మరో రెండు నెలల్లో దీని వీడియోను రిలీజ్ చేయనున్నట్టు శృతి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement