ఆ రోడ్డు.. 20 గ్రామాల సమస్య! | Marlapadu To Ongolu Road Problem Incident In Andhra Pradesh Prakasham Tanguturu | Sakshi
Sakshi News home page

ఆ రోడ్డు.. 20 గ్రామాల సమస్య!

Published Fri, Sep 13 2024 2:01 PM | Last Updated on Fri, Sep 13 2024 2:01 PM

Marlapadu To Ongolu Road Problem Incident In Andhra Pradesh Prakasham Tanguturu

గుంతలమయంగా మర్లపాడు నుంచి ఒంగోలు కొండల మధ్య 2 కిలోమీటర్ల రహదారి

నరకప్రాయంగా ప్రయాణం

తారురోడ్డు నిర్మిస్తే దూరంతో పాటు తగ్గనున్న ప్రయాణ సమయం

అధ్వాంగా ఉన్న మర్లపాడు–ఒంగోలు కొండల మధ్య మట్టిరోడ్డు

టంగుటూరు: ఓ 2 కిలోమీటర్ల రహదారి 20 గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మర్లపాడు గ్రామంలో బస్టాండ్‌ నుంచి కొండల మీదుగా ఒంగోలుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్‌ పరిధిలోని మట్టిరోడ్డులో రాళ్లు పైకి లేచి గుంతలమయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి.

అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే పూర్తిగా బురద నీళ్లతో నిండి అధ్వారంగా తయారవుతోంది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనచోదకులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుంచే స్కూల్‌ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ప్రయాణం సాగిస్తుంటాయి. అంతేకాకుండా మర్రిపూడి జువ్విగుంట, కొండపి, తంగెళ్ల, జాళ్లపాలెం దూరప్రాంతాల ప్రజలు తక్కువ సమయంలో ఒంగోలు వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు ఇలా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ 2 కిలోమీటర్ల రోడ్డును తారురోడ్డుగా మారితే ఒంగోలుకు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సురక్షితంగా దూరం తగ్గడంతో పాటు తక్కువ సమయం పడుతుందని ప్రయాణిలకంటున్నారు. అధికారులు రోడ్డుపై దృష్టి సారించి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ఇవి చదవండి: ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌ : పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement