raods
-
ఆ రోడ్డు.. 20 గ్రామాల సమస్య!
టంగుటూరు: ఓ 2 కిలోమీటర్ల రహదారి 20 గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మర్లపాడు గ్రామంలో బస్టాండ్ నుంచి కొండల మీదుగా ఒంగోలుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్ పరిధిలోని మట్టిరోడ్డులో రాళ్లు పైకి లేచి గుంతలమయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం సాగిస్తుంటాయి.అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే పూర్తిగా బురద నీళ్లతో నిండి అధ్వారంగా తయారవుతోంది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనచోదకులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్డు నుంచే స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ప్రయాణం సాగిస్తుంటాయి. అంతేకాకుండా మర్రిపూడి జువ్విగుంట, కొండపి, తంగెళ్ల, జాళ్లపాలెం దూరప్రాంతాల ప్రజలు తక్కువ సమయంలో ఒంగోలు వెళ్లేందుకు ఈ మార్గం ఎంతో అనువుగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు ఇలా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ 2 కిలోమీటర్ల రోడ్డును తారురోడ్డుగా మారితే ఒంగోలుకు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సురక్షితంగా దూరం తగ్గడంతో పాటు తక్కువ సమయం పడుతుందని ప్రయాణిలకంటున్నారు. అధికారులు రోడ్డుపై దృష్టి సారించి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఇవి చదవండి: ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ -
అనకాపల్లికి రూట్ క్లియర్
అనకాపల్లి : నూతన జిల్లాగా ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రంగా మారిన అనకాపల్లికి వచ్చేందుకు ట్రాఫిక్ సమస్య లేకుండా లైన్ క్లియర్ అయ్యింది. విశాఖ–విజయవాడ జాతీయ రహదారి మీదుగా శశరవేగంగా అనకాపల్లి దగ్గరకు వచ్చినప్పటికీ, బైపాస్ జంక్షన్ నుంచి పట్టణంలోకి చేరడానికి గంటల సమయం పడేది. విజయవాడ వైపు, కోల్‌కతా వైపుగా వచ్చే వాహనాలు కూడా పట్టణంలోకి వచ్చే జాతీయ రహదారికి రావాల్సి వచ్చేది. దీంతో వాహనదారులకు ఇక్కట్లు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య లేదు. పట్టణంలోకి వచ్చే వాహనాలకు మాత్రమే ప్రవేశం కల్పించారు. మిగిలిన వాహనాలు నేరుగా ఆనందపురం రహదారి చేరుకునేలా లైన్ క్లియర్ చేశారు. అటు విశాఖ, ఇటు సబ్బవరం ప్రాంతాల నుంచి అనకాపల్లి పట్టణంలోకి చేరాలంటే ఇదివరకు నరకయాతన పడాల్సి వచ్చేది. రెండురోడ్ల రహదారి ఆపై దుమ్ము ధూళితో పాటు ట్రాఫిక్ రద్దీ కారణంగా ద్విచక్ర, ఇతరత్రా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. విజయవాడ నుంచి కోల్‌కతా వైపుగా వెళ్లే వందలాది భారీ, సరకు రవాణా వాహనాల రాకపోకలతో అనకాపల్లి సుంకరమెట్ట, శంకరం వైపు గల రోడ్లు నిత్యం రద్దీగా ఉండేవి. సబ్బవరం నుంచి అనకాపల్లి, విశాఖ నుంచి అనకాపల్లి వచ్చే వాహనాలతో పాటు విజయవాడ నుంచి సబ్బవరం వైపుగా వచ్చే వాహనాలు పట్టణంలో సూర్యనారాయణస్వామి అలయం వై జంక్షన్ వద్ద ఇరుక్కుని గంటల పాటు నిత్య ట్రాఫిక్ జామ్ జరగడం పరిపాటిగా ఉండేది. జాతీయ రహదారి అభివృద్ధితో ట్రాఫిక్ మళ్లింపు అనకాపల్లి – ఆనందపురం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అత్యాధునిక టెక్నాలజీతో ఆరులైన్ల రోడ్డు అభివృద్ధి ఇటీవల పూర్తయింది. దీంతో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి పట్టణంలోకి రాకుండా నేరుగా అనకాపల్లి జంక్షన్ నుంచి శంకరం వద్ద ఏలేరు కాలువ వరకు పొలాల మధ్యలో వేసిన ఆరు లైన్ల రోడ్డుకు మళ్లించారు. కోల్‌కతా నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి పట్టణంలోకి రాకుండా ఇదే మార్గానికి మళ్లించారు. దీంతో శంకరం వద్ద నుంచి అనకాపల్లి, అనకాపల్లి బైపాస్ జంక్షన్ నుంచి పట్టణంలో వై.జంక్షన్ వరకు నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ సమస్య పూర్తిగా సమసిపోయింది. పరిసర గ్రామాలకు ఊరట గ్రామీణ వాణిజ్య కేంద్రంగా పేరొందిన అనకాపల్లి పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో జనాభా వస్తుంటారు. దీంతో పాటు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఏర్పాటవడం, వివిధ శాఖలకు చెందిన జిల్లా కేంద్రాలు కూడా పట్టణంలోనే ఉండడంతో మరింతగా జనాభా రాకపోకలు పెరిగాయి. పట్టణానికి ప్రధాన ముఖద్వారంగా ఉండే సుంకరమెట్ట రోడ్డు, శంకరం రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తూ కేవలం పట్టణంలో పనులు ఉండేవారు మాత్రమే రాకపోకలు చేసేలా ఆయా శాఖలు మార్గం సుగుమం చేశారు. దీంతో అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య సమసిపోయింది పట్టణంలోకి చేరాలంటే బైపా స్ జంక్షన్ నుంచి సూర్యనారాయణస్వామి ఆలయం వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకయాతన పడాల్సి వచ్చేది. కానీ ఇటీవల బైపాస్ వద్ద భారీ వాహనాలు నేరుగా సబ్బవరం వైపు వెళ్తున్నాయి. దీంతో పట్టణంలోకి వచ్చే వాహనాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. –కొత్తపల్లి సూర్య, వాహనదారు నేరుగా కళాశాలకు... నేను రోజూ రేబాక గ్రామం నుంచి డైట్ కళాశాలకు అనకాపల్లి మీదుగా వెళ్లేవాడిని. అనకాపల్లి–ఆనందవపురం జాతీయ రహదారి విస్తరణతో శంకరం నుంచి నేరుగా బైపాస్ జంక్షన్‌కు వెళ్ళి కళాశాలకు చేరుకుంటున్నాను. పట్టణంలో నుంచి వెళ్లేటప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండేది. ఇప్పుడు సమస్య తీరింది. –గోగాడ మోహన్, విద్యార్థి ప్రమాదాలు తగ్గాయి.. జాతీయ రహదారి అభివృద్ధితో పట్టణంలో సుంకరమెట్ట రోడ్డు ట్రాఫిక్ సమస్య 90 శాతం తగ్గింది. ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గింది. వాహనదారులు రాకపోకలు సౌకర్యవంతంగా ఉంది. బైపాస్ నుంచి శంకరం వరకు జాతీయ రహదారి చేయడంతో అటువైపుగా వాహనాలు మళ్లించాం. –టి.శ్రీను, ట్రాఫిక్ సీఐ, అనకాపల్లి -
రోడ్డు మీద నాట్లేసిన రోజా
చిత్తూరు : రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. ఈ రోజు రోజా నగరిలో ఓ పెట్రోల్ బంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నాణ్యతలో రాజీలేదు
పీఆర్ ఎస్ఈ సత్యనారాయణ డీసీ తండా రోడ్డు కథనానికి స్పందన హన్మకొండ : గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు క ల్పించాలనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభు త్వ ఉద్దేశాలకు విరుద్ధంగా నాణ్యతలేని పనులు చేస్తున్న అంశంపై ‘వేసిన వారానికే’ శీర్షికతో ‘సాక్షి’ జిల్లా మెుదటి పేజీలో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సత్యనారాయణ స్పందించి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట మండలంలోని డీసీ తండా రోడ్డు దెబ్బతిన్న విషయం వాస్తమేనని చెప్పారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడబోమని చెప్పారు. రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించిన త ర్వాతే కాంట్రాక్టర్‌కు బిల్లు లు మంజూరు చేస్తామని తెలిపారు. రెండు వారాలలోపు రోడ్డును పూర్తిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాణ్యత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.