- పీఆర్ ఎస్‌ఈ సత్యనారాయణ
- డీసీ తండా రోడ్డు కథనానికి స్పందన
నాణ్యతలో రాజీలేదు
Published Thu, Sep 8 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
హన్మకొండ : గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు క ల్పించాలనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభు త్వ ఉద్దేశాలకు విరుద్ధంగా నాణ్యతలేని పనులు చేస్తున్న అంశంపై ‘వేసిన వారానికే’ శీర్షికతో ‘సాక్షి’ జిల్లా మెుదటి పేజీలో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సత్యనారాయణ స్పందించి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట మండలంలోని డీసీ తండా రోడ్డు దెబ్బతిన్న విషయం వాస్తమేనని చెప్పారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడబోమని చెప్పారు. రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించిన త ర్వాతే కాంట్రాక్టర్‌కు బిల్లు లు మంజూరు చేస్తామని తెలిపారు. రెండు వారాలలోపు రోడ్డును పూర్తిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాణ్యత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Advertisement