effect
-
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
ఎండలో నిలబెడతానంటే వెంటనే ఒప్పుకున్నాడ్సార్..! -
జర పైలం మరి.. నగరంలో మొదలైన వేసవి హడావుడి
చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది.. ఓ వైపు అప్పుడే మండుతున్న ఎండలు, మరో వైపు పరిశ్రమలు, వాహనాలు, ఏసీల నుంచి వెలువడే కాలుష్యం. వెరసి హైదరాబాద్ నగరంలో ఎప్పటిలానే సమ్మర్ ఎఫెక్ట్ కొనసాగనుంది. గతేడాది ఇదే మార్చ్ నెల్లో అత్యధికంగా 47.2 డీగ్రీ సెంటీగ్రేడ్ల ఎండలతో ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మండే ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు పర్యావరణ, ఆరోగ్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా ముసలివారు, చిన్నారులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండటం, ఎలాంటి వేసవి సంరక్షణా తీసుకోకుండా వివిధ కారణాలతో బయటకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సందర్భంగా వేసవి నుంచి సంరక్షణను అందించే ప్రాథమిక పద్ధతులు, విధానాల గురించి పలు జాగ్రత్తలు.. వేసవిలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నియమం నీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా హైడ్రేట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ ఫ్రీక్స్ సూచిస్తున్నారు. శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నంత వరకూ వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. నగర జీవితంలో తప్పని సరిగా మూడు, మూగున్నర లీటర్ల నీటిని, ఇతర పానియాలను తీసుకోవాల్సిన అవసరముంది. బయటికెళుతున్న సమయంలో వాటర్‌బాటిల్ మర్చిపోవద్దు. వడదెబ్బకు దూరంగా.. వేసవిలో ప్రధాన సమస్య వడదెబ్బ. ప్రతి ఏడాదీ వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు. వీలైనంత వరకూ ఎండలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన పనులను ఉదయం, సాయంత్రాల్లో చేసుకోవడం ఉత్తమం. తరచూ ఎండలో ఉండేవారు తగినంత విశ్రాంతి, ఫ్యాన్ లేదా ఏసీలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ దూరం వాహనాలపై ప్రయాణాలు చేసేవారు కళ్లద్దాలు, హెల్మెట్, టోపీలు తప్పనిసరిగా వినియోగించాలి. చిన్నారులైతే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సైక్లింగ్.. జర భద్రం.. ఈ మధ్య కాలంలో ఈజీ మొబిలిటీలో భాగంగా నగరంలో సైక్లిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా స్కూల్స్, గ్రౌండ్స్‌కు వెళ్లే వారు సైతం సైక్లిల్ వినియోగిస్తున్నారు. సమ్మర్లో సైక్లిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో విశ్రాంతి, పానియాలు తీసుకోవడం శ్రేయస్కరం. మధ్యాహ్న సమయాల్లో సైక్లింగ్ అంత మంచిది కాదని నగరానికి చెందిన సైక్లింగ్ రైడర్ రవి తెలిపారు. సన్ర్స్కీన్తో మేలు.. మండే ఎండలకు కళ్లద్దాలు, తలకు టోపీ, హ్యండ్‌బ్యాగ్‌లో కర్చీప్ లేదా న్యాప్కిన్స్ తప్పనిసరి. ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్స్, కూలింగ్ లోషన్స్ వాడటం కాస్త ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమ్మర్ ముగిసేంత వరకూ ఫ్యాషన్ వేర్లో ప్రత్యేక శైలిని ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ కేర్ కోసం మార్కెట్లో అందుబాటులోకి వచి్చన గార్మెట్స్ ఎంచుకోవాలి. చెమటను గ్రహించే దుస్తులు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. వేడికి దూరంగా ఈవీ.. ఈ మధ్య కాలంలో నగరంలో ఎలక్ట్రిక్ వాహనల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండలాని నిపుణులు చెబుతున్నారు. ఈవీ వాహనాలను ఎండలో పార్క్ చేయకుండా నీడలో ఉంచాలి. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు బ్యాటరీ, ఇంజిన్ వేడి కాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. లేదంటే అధిక వేడికి బ్యాటరీలు పేలిపోయే ప్రమాదముంది. టైర్లు అరిగిపోయిన వాహనాలు మరింత జాగ్రత్తగా నడపాలి. టైర్లు వ్యాకోచించడం, రోడ్డు పై డాంబర్ కరగడం వంటి కారణాలతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. నో బ్లాక్..ఫ్యాషన్ పేరుతో ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరించడానికి స్వస్తి చెప్పాలి. నల్లటి దుస్తులు, వస్తువులు, వాహనాలు అధిక వేడిని గ్రహించి ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీనికి పరిష్కారంగా తెల్లటి దుస్తులు లేదా లైట్ కలర్స్ వేసుకుంటే మేలు. ముఖ్యంగా కాటన్ దుస్తులు, మెత్తని స్వభావం కలవి ఉత్తమ ఎంపిక.కాసింత స్మార్ట్‌గా.. నగర జీవనంలో గ్యాడ్జెట్లు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో వాతావరణ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలియజేసే స్మార్ట్ వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్లు వాడటం మంచిది. శరీర ఉష్ణోగ్రత, గుండెపనితీరు, బ్లడ్ ప్రెజర్, న్యూట్రిషన్ తదితర అంశాలను తెలియజేసే గ్యాడ్జెట్లు, యాప్‌లు వినియోగించడం మేలని ఈ తరం మెడికల్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటి భోజనమే మేలు.. వేసవిలో కాసింతైనా ఆహార నియమాలను పాటించాలి. జంక్‌ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, అధిక మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నీటిని తాగడంతో పాటు వాటర్మెలన్, షర్బత్ విభిన్న రకాల పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో పాటు అవసరమైన ప్రోటీన్లను, మినరల్స్‌ను అందిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హజర్ తెలిపారు. ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటే కూలర్లు, ఏసీలను ఉపయోగించాలి. ఇంటీరియర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. -
అమెరికా పొమ్మంటోంది.. ఖర్చులు రమ్మంటున్నాయ్..
హైదరాబాద్‌లోని మీర్జాలగూడ (Mirjalguda) నివాసితులైన దంపతుల కుమారుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పీజీ చేస్తున్నాడు.. ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండాలని, అక్కడే ఒక హోటల్లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అది కూడా వారానికి రెండు రోజులు మాత్రమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉద్యోగం మానేయాలా వద్దా? లేక అమెరికా(United States of America) నుంచి తిరిగి వచ్చేయాలా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నగరంలో నివసించే దంపతుల ఇద్దరు కుమారులూ అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అక్కడ పంజాబ్‌కు చెందిన ఆభరణాల వ్యాపారుల దగ్గర మంచి వేతనానికి పనిచేస్తున్నారు. వీరు ఇంకా ఉద్యోగం మానమని చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులు వీరి గురించి ఆందోళన చెందుతున్నారు. ⇒ కొన్నేళ్లుగా అటు చదువు.. ఇటు పార్ట్ టైమ్ ఉద్యోగాలతో(Part time Job) అటు చదువు కోసం చేసిన అప్పుల్ని అమెరికాలో జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పలువురు నగర విద్యార్థుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో బహిష్కరణ భయాల మధ్య యునైటెడ్ స్టేట్స్(యూఎస్)లోని మన విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా.. మధ్యతరగతికి చెందినప్పటికీ స్థోమతకు మించి విదేశీ విద్యను ఎంచుకున్న మన విద్యార్థుల్లో అత్యధికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువు కోసం చేసిన భారీ రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు అక్కడి జీవన వ్యయాలను భరించడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతూ వచ్చిన విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది తదుపరి ఉన్నత చదువులకు అడ్మిషన్లపై ప్రభావం చూపక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నిన్నా మొన్నటి దాకా అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపిన మన రాష్ట్రం నుంచి భవిష్యత్తులో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నవారిని ఈ పరిస్థితులు పునరాలోచనలో పడేస్తున్నాయి.ఉద్యోగాలకు అనుమతి ఉన్నా..హెచ్–1 వీసాలపై అమెరికాలో ఉన్న విద్యార్థులు తాము చదువుతున్న క్యాంపస్‌లోనే వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే కాలేజీ క్యాంపస్‌లలో పనిచేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ అక్కడ తగినన్ని ఉద్యోగావకాశాలు లేకపోవడం లేదా అక్కడ ఆశించిన ఆదాయం రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఖర్చుల్ని భరించడం కోసం క్యాంపస్ వెలుపల రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో అనధికారికంగా పనిచేస్తున్నారు.⇒ కాలేజీ సమయం ముగిసిన తర్వాత ఒక చిన్నకేఫ్లో ప్రతిరోజూ 6 గంటలు పని చేసేవాడిని. గంటకు 7 డాలర్లు చొప్పున లభించేవి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన వైఖరితో వారం రోజుల క్రితం పని వదిలేశా.. ఇది ఇబ్బంది పెట్టే సంగతే.. అయినా ఇక్కడ చదువుకోవడానికి 50,000 డాలర్లు(సుమారు రూ.43.5 లక్షలు) రుణం తీసుకున్నా. జాబ్ కోసం చదువును పణంగా పెట్టే పరిస్థితిలో లేను’ అని ఇల్లినాయిస్లో గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి ధ్రువన్ చెప్పాడు.⇒ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా చెల్లుబాటయ్యే వర్క్ వీసాలు కలిగిన వ్యక్తులను మాత్రమే నియమించుకోవడం ప్రారంభించాయి. గతంలో స్థానిక వ్యాపారాలు, ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మన విద్యార్థులపై ఆధారపడేవి. ఇప్పుడు, వారు విద్యార్థులను తొలగించి, చెల్లుబాటు అయ్యే జాబ్ వీసాలో ఉన్నవారిని నియమించుకుంటున్నారు. న్యూయార్క్‌లో మాస్టర్స్ చదువుతున్న ఓ విద్యార్థిని నేహా మాట్లాడుతూ ‘పని ప్రదేశాలలో తనిఖీలు చేస్తున్నారు.. దాంతో నన్ను నా ఫ్రెండ్స్‌ను పార్ట్‌టైమ్ ఉద్యోగాలు మానేయాలని మాకు జాబ్స్ ఇచ్చినవారు వెళ్లగొట్టారు. ఇది చాలా కష్టం, కానీ పూర్తి బహిష్కరణకు గురికావడం లేదా మా విద్యార్థి వీసా స్థితిని కోల్పోవడం మరింత నష్టం. నన్ను ఇక్కడికి పంపించడానికి నా తల్లిదండ్రులు ఇప్పటికే చాలా రకాల త్యాగాలు చేశారు’ అని చెప్పింది. ఈ పరిస్థితులపై ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ ‘విద్యార్థులు క్యాంపస్ వెలుపల పనిచేయడం అక్కడ చట్టవిరుద్ధం. మునుపటి పాలకుల్లా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హెచ్1బీ, గ్రీన్కార్డ్లతో పాటు తమ భవిష్యత్ ఇమ్మిగ్రేషన్ అవకాశాల గురించి విద్యార్థులు భయపడుతుండటం సహజమే’ అని చెప్పారు. -
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ సేల్స్ ఢమాల్
జగిత్యాల: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చికెన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. చికెన్ సెంటర్లు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందని, చికెన్ తినొద్దని ఇటీవల ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కొన్ని జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాలో భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా ఉడికించిన చికెన్ తింటే వైరస్ ఉండదని అధికారులు చెబుతున్నా వైరస్ వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ కావడంతో ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రతి చికెన్ సెంటర్లో సగానికిపై విక్రయాలు తగ్గిపోయాయి.అసలే పెళ్లిళ్ల సీజన్ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం మంచి రోజులు కావడంతో రెండునెలలపాటు శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. శుభకార్యాల్లో చికెన్ తప్పనిసరి. ఈ క్రమంలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో వివాహాల్లో చికెన్ వడ్డించాలా..? వద్ద సంశయంలో ప్రజలు ఉన్నారు. చాలా మంది చికెన్ తినాలంటే జంకుతుండటంతో మటన్, ఫిష్, ఎగ్స్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. చికెన్‌కు కొంత తక్కువ ధర ఉండటంతో చాలామంది దీనివైపే దృష్టి సారిస్తుంటారు. ప్రభుత్వ హాస్టళ్లు, వైద్య కళాశాల హాస్టళ్లలో చికెన్ నిలిపివేస్తున్నారు. మటన్, చేపలకు రేటు ఎక్కువగా ఉండటంతో అది కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది.తగ్గని రేటుచికెన్ విక్రయాలు పడిపోయినా ధరలు మాత్రం తగ్గడం లేదు. చికెన్ రేటు కిలోకు రూ.200 కిలో పలుకుతోంది. మరికొందరు కిలోకు రూ.180 నుంచి రూ.160వరకు విక్రయిస్తున్నారు. మరిన్ని రోజులు బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ కాకుండా గుడ్ల విక్రయాలు కూడా సగానికి పడిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్దక శాఖ అధికారులు పేర్కొంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు పశువైద్యాధికారులు పౌల్ట్రీలపై దృష్టి పెట్టామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు పోవడం లేదు. దుకాణాల అద్దె, వర్కర్స్కు జీతాలు, విద్యుత్ బిల్స్, కోళ్ల క్రయవిక్రయాల్లో పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీల వద్ద కోళ్లను కొనుగోలు చేయకుండా ఉన్న కోళ్లను విక్రయించేలా చికెన్ సెంటర్ల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కంపెనీల వద్ద నుంచి కోళ్లను కొనుగోలు చేసినా సేల్స్ లేకపోవడంతో అధిక నష్టం వచ్చే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు. -
USA:హాలిడే సీజన్‌పై టోర్నడోల ఎఫెక్ట్
కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.అట్లాంటా,హూస్టన్లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా ఇయర్ ఎండింగ్లో అమెరికాలో కక్రిస్మస్తో పాటు న్యూఇయర్‌ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. -
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్‌ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
‘పొగ’బెడుతున్నా...పొమ్మనలేమా?
నగరానికి చెందిన ఒక బహుళజాతి సంస్థలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన యుక్తవయస్సు నుంచి ధూమపానం చేస్తున్నాడంటే... అతని ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పొగాకుపై ఖర్చు చేస్తున్నట్లే అర్థం. ఉత్సుకత, తోటివారి ఒత్తిడితో, కుటుంబ సభ్యుడు ఒకరు పొగతాగుతున్నట్లు చూసిన తర్వాతే అతనికి ధూమపానం అలవాటు ప్రారంభమైంది. సామాజిక అలవాటుగా మొదలై, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఒక విధానంగా పరిణామం చెందింది. ఆరోగ్య ప్రమాదాలు తెలిసినప్పటికీ, దాన్ని విడిచిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, కష్టపడినా దాన్ని అతను ఆపలేకపోయాడు. ఇది ఒకరికే ప్రత్యేకమైనది కాదు; ఇది దేశంలోని లక్షలాది మందికి సంబంధించింది.నియంత్రణలో సవాళ్లెన్నో...భారతదేశంలో, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన జనాభా కారణంగా పొగాకు నియంత్రణ సంక్లిష్టమైన సవాలును విసురుతుంది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నుల వల్ల వ్యక్తులు ఈ ఉత్పత్తులపై ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది వారి ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే అధిక పన్నులు అక్రమ పొగాకు వ్యాపారానికి కూడా ఆజ్యం పోస్తున్నాయి. మూడవదిగా చెపపుకోవాల్సింది పొగాకు వినియోగదారులు పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులను అధికం అవుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత భారంగా మారుస్తుంది.పొగాకు వాడకంలో... రెండో స్థానం...ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి.. 2018 నాటికి 16 నుంచి 64 ఏళ్ల వయస్సు ఉన్న 250 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. 2020 నాటికి 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 27% మంది పొగాకుకు బానిసలని తేలింది.. పొగాకు వినియోగదారులతో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా, చట్టబద్ధంగా ఉత్పత్తి చేస్తున్న సిగరెట్లు మొత్తం పొగాకు వినియోగంలో 8% మాత్రమే ఉండగా, మిగిలిన 92% బీడీలు పొగాకు నమలడం వంటి చౌకైన ఉత్పత్తులను వినియోగానిదే కావడం గమనార్హం.ఆడవారిలోనూ పెరుగుతున్న వినియోగం...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019–21 ప్రకారం... పురుషులు స్త్రీల మధ్య పొగాకు వినియోగంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ... మరోవైపు ఆడవారిలో సైతం పొగాకు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒత్తిడి మారుతున్న సామాజిక ఆర్ధిక పరిస్థితుల కారణంగా మగవారిలో ఇప్పటికీ పొగాకు వినియోగం గణనీయంగా ఉంది. పొగాకు వినియోగం ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉంది, వీరికి పొగాకు సంబంధిత హాని ఎక్కువగా ఉంటుంది. విషపూరిత పదార్థాలతో నిండి, ఫిల్టర్లు లేకపోవడం వల్ల బీడీలు సిగరెట్ కంటే ఎక్కువ హానికరమైనవి అయినప్పటికీ, బాగా వినియోగిస్తారు. . బీడీ ఉత్పత్తి మార్కెటింగ్ లపై పెద్దగా తనిఖీలకు అవకాశం లేదు. వీలు కల్పిస్తుంది. చౌకైన పొగాకు ఉత్పత్తుల విక్రయం పేదరికపు ఉచ్చును శాశ్వతం చేస్తుంది.ప్రత్యామ్నాయాలు లేక...మానలేక...యువకులలో (20–44 ఏళ్ల వయస్సులో) ధూమపానం ప్రాబల్యం ఆందోళనకరంగా ఉంది, ఇది శ్రామికశక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉందనేది మరవకూడదు. నికోటిన్ గమ్‌లు, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, హీట్–నాట్–బర్న్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల 45% మంది యువకులు ధూమపానం లేదా పొగాకు నమలడం మానుకోలేకపోతున్నారని గత ఏడాది ఒక సర్వే తేటతెల్లం చేసింది. ‘హ్యూమన్–సెంట్రిక్ అప్రోచ్ టు టుబాకో కంట్రోల్’ నివేదికలోని సమీక్షకు స్పందించిన వారిలో 66% మంది 20–25 సంవత్సరాల మధ్య పొగాకును ఉపయోగించడం ప్రారంభించారని, వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుకున్నామని గుర్తించారు.ఇది చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!సమగ్రవిధానంతోనే పరిష్కారం...పొగాకు నివారణలో పొగాకు వినియోగానికి దోహదపడే సామాజిక సాంస్కృతిక కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకుపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పొగాకు సాగులో నిమగ్నమైన రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. పన్ను ఆదాయాన్ని తగ్గిస్తుంది అక్రమ వ్యాపారాన్ని పెంచుతుంది. బదులుగా, విరమణ విద్య రెండింటిపై దృష్టి పెట్టి మరింత సమగ్ర విధానానికి మారాలి.అలాగే, 74% మంది ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వినియోగదారుల కుటుంబంలో పెద్దలు సైతం ధూమపానం అలవాటును కలిగి ఉన్నట్టు తెలుస్తోంది, ఈ పరిస్థితుల్లో వారికి సుదీర్ఘమైన మద్దతు అవసరం. సైన్స్ ఆధారిత పరిష్కారాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యావేత్తలు కమ్యూనిటీ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా, భారతదేశం పొగాకు వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దానితో సంబంధం ఉన్న పేదరికం వ్యాధుల చక్రాన్ని అడ్డుకోవచ్చు. -
వందేళ్ల వంతెన చాన్నాళ్లు 12 ఏళ్ల వంతెనకు నూరేళ్లు
నిజాం కాలంలో వందేళ్ల క్రితం ఖమ్మం మున్నేరుపై రాతి కట్టడంగా నిర్మించిన బ్రిడ్జి 36.9 అడుగుల మేర వరదను తట్టుకుని నిలబడింది. అదే మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వద్ద పదేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి స్పాన్ మాత్రం పక్కకు జరిగింది. భారీ వరదతో బ్రిడ్జి స్పాన్ బేరింగ్ పైనుంచి పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 1న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు మున్నేరుకు భారీగా వరద వచి్చంది. 36.9 అడుగుల మేర వరద ప్రవాహం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ వరద ప్రవాహంతోనే బ్రిడ్జి స్పాన్ బేరింగ్ల పైనుంచి పక్కకు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని గంటలు వరద ఇలాగే కొనసాగితే బ్రిడ్జికి ముప్పు వాటిల్లేదని నిపుణులు చెబుతున్నారు. – ఖమ్మం మయూరి సెంటర్పదిలంగా వందేళ్ల బ్రిడ్జి.. అనేకసార్లు భారీగా వరదల తాకిడి తగిలినా ఎక్కడా తొణుకు లేకుండా ఖమ్మం కాల్వొడ్డు వద్ద నిర్మించిన బ్రిడ్జి పదిలంగా నిలిచింది. నిజాంల కాలంలో రాతితో కట్టిన ఈ బ్రిడ్జి వద్ద పలుసార్లు 30 అడుగులకు పైగా వరద ప్రవహించినా చెక్కుచెదరలేదు. గత పదేళ్లుగా బ్రిడ్జి పని అయిపోయిందని, వందేళ్లు దాటినందున ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అధికార యంత్రాంగం, ప్రజలు చర్చించుకుంటున్నా.. సగర్వంగా నిలవడం విశేషం. కాగా, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై ఎస్12 స్పాన్ పక్కకు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడో బ్రిడ్జిగా నిర్మాణం.. హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, కోదాడ, విజయవాడ ప్రాంతాల వైపు నుంచి ఖమ్మం నగరంలోకి వచ్చేందుకు మున్నేరుపై మూడు వంతెనల నిర్మాణం జరిగింది. 110 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కాల్వొడ్డు వద్ద ఒక బ్రిడ్జి.. కరుణగిరి వద్ద రెండు దశాబ్దాల క్రితం మరో బ్రిడ్జి నిర్మించారు. నానాటికీ రద్దీ పెరగడంతో 2010లో ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరుపై మూడో బ్రిడ్జి నిర్మాణానికి నాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2013లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాగా.. గత ఏడాది 30.7 అడుగులు, ఈనెల 1న 36.9 అడుగుల మేర వరద వచి్చంది. తాజా వరదతో బ్రిడ్జి నాణ్యత వెలుగులోకి వచి్చందన్న చర్చ జరుగుతోంది. -
చైనాపై పడని మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇందులో భారత్ సహా అమెరికా, యూరప్ దేశాలు ఉన్నాయి. అనేక దేశాలపై పడిన ఈ మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండటం గమనించదగ్గ విషయం.ప్రపంచవ్యాప్తంగా విమానాలు, ఐటీ వ్యవస్థలు, వ్యాపారాలపై ప్రభావం చూపిన మైక్రోసాఫ్ట్ అంతరాయం చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు కూడా సజావుగా జరిగాయి. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.ప్రపంచంలోని చాలా దేశాలు మైక్రోసాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం విదేశీ టెక్నాలజీల మీద ఆధారపడటాన్ని తగ్గించి, సొంత దేశ టెక్నాలజీలనే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగానే చైనాలో మైక్రోసాఫ్ట్ వినియోగం లేదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి చైనాలో రోజూ జరగవలసిన కార్యకలాపాలు నిర్విరామంగా జరిగాయి. -
భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
-
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
పచ్చ కుట్ర: వృద్ధులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్
సాక్షి, గుంటూరు: చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులకు అవస్థలు పడుతున్నారు. వృద్దులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్ పడింది. కేంద్ర వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించింది. చంద్రబాబు కుట్రలతో మూడు నెలలపాటు పెన్షన్ దారులకు ఇబ్బందులు తప్పదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండ, వడగాడ్పులను తట్టుకుని వెళ్తేనే పెన్షన్ అందనుంది. దీంతో నడవలేని వృద్దులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ జరిగేది. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: పింఛన్లపై బాబు డబుల్ గేమ్ -
ఐస్ వాటర్ తెగ తాగేస్తున్నారా? ఆగండాగండి! ఈ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇంకా మార్చి నెల రాకుండానే వేడి సెగ తగులుతోంది. రాత్రి పూట ఫ్యాన్లు, ఏసీలు లేనిదే నిద్రపోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఎండాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది చల్ల.. చల్లని నీళ్లు. వేడినుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం అందరికీ అలవాటు. చల్లటి నీళ్లు, లేదా ఇతర పానీయాలు కడుపులో పడగానే హాయిగా అనిపిస్తుంది. కానీ అలా ఐస్ వాటర్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి చేటు అని మీకు తెలుసా? వేసవిలో చల్లని నీరు త్రాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు గురించి తెలియాలంటే.. ఈ కథనాన్ని చూడండి. జీర్ణక్రియ సమస్యలు చల్లటి నీరు కడుపుని సంకోచింప చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత ఆహారాన్ని జీర్ణం కాదు కష్టమవుతుంది. మనం చల్లటి నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. అవును, చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి మనం చల్లటి నీరు తాగినప్పుడు, అది శరీర ఉష్ణోగ్రతతో సరిపోలక కడుపులో ఉన్న ఆహారం జీర్ణం కష్టమవుతుంది. హార్ట్ రేట్ తగ్గిపోతుంది కొన్ని అధ్యయనాలు ప్రకారం చల్లని నీరు తాగడం గుండె స్పందన రేటు కూడా తగ్గిపోతుంది. మెడ మీద ఉండే గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ నాడి శరీరం స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అందుకే చల్లగా తిన్నా, తాగినా హార్ట్ రేట్ ప్రభావిత మవుతుంది. నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సైనస్ , తలనొప్పి అతి చల్లగా తాగడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకుంటే, వెన్నెముకకు సంబంధించిన సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి. ఫలితంగా తలనొప్పి , సైనస్ సమస్యలొస్తాయి. మలబద్ధకం చల్లటి నీరు తాగడం వల్ల పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ బుల్ లాంటివి కూడా వస్తాయి కొవ్వును పెంచుతుంది చల్లటి నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును మరింత గట్టిగా తయారు చేస్తుంది. ఒక పట్టాన కరగదు కూడా. సో.. బరువు తగ్గాలనుకున్న వారు చల్లని నీటికి దూరంగా ఉండాలి. గొంతు నొప్పి చల్లని నీరు, పానీయాల వల్ల ముఖ్యంగా భోజనం తర్వాత, అదనపు శ్లేష్మం (శ్వాసకోశ శ్లేష్మం) ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గొంతు నొప్పి, ముక్కు దిబ్బడం సమస్య వస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది ముదిరితే జ్వరం కూడా వస్తుంది. అంతేకాదు చల్లటి నీరు తాగడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. అందుకే కుండలోని నీళ్లు అయినా, ఫ్రిజ్ వాటర్ అయినా మరీ చల్లని నీళ్లు కాకుండా, ఒక మాదిరివి తాగి, వేడినుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే సమస్యలు తప్పవు. -
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్‌లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్‌లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్‌లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్
మిచాంగ్ తుపాను కారణంగా భారీగా రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్: 040–2778666, 040–27801112 నాంపల్లి: 9676904334 కాచిగూడ: 040–27784453 సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 150 రైళ్లను అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లకు కూడా బ్రేక్ పడింది. కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అటు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగనుందని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇప్పటికే వరదలు మొదలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిసి, వరదలు పారుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ ప్రాంతాల్లో రైల్వేలైన్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహం కారణంగా పట్టాలపై నీరు నిలిచి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ఎప్పటికప్పుడు వరద నీటిని తొలగించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోండి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో కొన్నింటిని ప్రధాన స్టేషన్లకే పరిమితం చేశారు. అత్యవసరమైతే తప్ప తుపాను ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దని, ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారు వాయిదా వేసుకోవడం మంచిదని ప్రయాణికులకు సూచిస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకొనే వారికి పూర్తిస్థాయిలో చార్జీలను తిరిగి చెల్లించనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోని బుకింగ్ కేంద్రాల్లో టికెట్లను రద్దు చేసుకోవచ్చు. అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు తుపాను కారణంగా హైదరాబాద్ నుంచి కొల్లాం వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి శబరిమలకు రైళ్లు తక్కువగా ఉన్నాయని, రద్దు కారణంగా వేరే రైళ్లలో టికెట్లు దొరికే పరిస్థితి లేదని చెప్తున్నారు. వాహనాల్లో అంతదూరం ప్రయాణించడం ఇబ్బందికరమేనని అంటున్నారు. రైల్ నిలయం నుంచి పర్యవేక్షణ తుపాను ప్రభావం ఉండే ప్రాంతాలకు వెళ్లే రైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ రైళ్లను నడపాలని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు రైల్‌నిలయం నుంచి తుపాను పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వారు డివిజనల్ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. తుపాను పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సామాగ్రిని, యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. వంతెనలు, వరద పోటెత్తే ప్రదేశాల్లో వాచ్మన్లను ఏర్పాటు చేశారు. పట్టాలపై నిలిచే వరదనీటిని తొలగించేందుకు డీజిల్ పంపులను సిద్ధం చేశారు. -
తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వరుణగండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అదే జరిగితే.. వరుణుడి ప్రతాపం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం బుధ, గురువారాలను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈసీ సూచనతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మికశాఖ. ఇదీ చదవండి: ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె! -
పలుకే బంగారమాయెనా!!..కోవిడ్ తర్వాతే అధికం..
వయసు పలికే పదాలు మొదటి సంవత్సరం దాదాపు 10 పదాలు రెండో సంవత్సరం 50 నుంచి 60 పదాలు మూడో సంవత్సరం కనీసం 150 పదాలు.. ఆ పైన కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది. 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 30 నిమిషాల డిజిటల్ స్క్రీనింగ్ వల్ల చిన్నారులకు ‘స్పీచ్ డిలే’ రిస్క్ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది. ఏం చేయాలి? ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి. చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు. విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్ థెరపిస్ట్‌లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. – గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. పునాది పటిష్టంగా ఉంటేనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు. ‘స్మార్ట్’గా చిక్కుకుపోయారు.. సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు. వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు. కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాతే అధికం చిన్నారుల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య కోవిడ్ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం చిన్నారులు ఫోన్‌కు అడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్‌ఫోన్‌ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల విశాల్‌రెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
చూయింగ్ గమ్ నమిలితే బరువు తగ్గుతారా..!
చూయింగ్ గమ్ తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా..? ఇది నిజమేనా? బరువు తగ్గడంలో ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది. పూర్తిస్తాయిలో పనిచేస్తుందా? పరిశోధనలు ఏం చెప్పాయి తదితరాల గురించి చూద్దాం!. పిల్లలు, టీనేజ్ పిల్లలు చూయింగ్ గమ్‌ని ఇష్టంగా నములుతుంటారు. కానీ ఇది బరువు ఎలా తగ్గిస్తుంది. చాలామంది అనుకునేది ఇది తినడం వల్ల ఎక్కువ తినాలనే కోరిక ఉండదు కాబట్టి తెలియకుండానే తినడం మానేస్తారని అని భావిస్తారు. అలాగే అల్పాహారం తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుందని, క్యాలరీ నియంత్రణలో సమర్థవంతంగా సహాయపడుతుందని చెబుతున్నారు చాలామంది. మరికొందరూ చూయింగ్ గమ్‌ని నమలడం ద్వారా అనారోగ్యకరమైన చిరుతిండ్ల జోలికి పోకుండా ఉండగలం అని అంటున్నారు. ఇది తినడం వల్ల తెలియకుండానే ఆకలి తగ్గిపోతుంది కాబట్టి బరువు తగ్గడానికి చక్కటి మార్గం అని చాలా మంది అభిప్రాయం దీర్ఘకాలికంగా ఇది మంచిదేనా? సమగ్రంగా బరువు తగ్గాలనుకుంటే చక్కని డైట్ తగినంత వ్యాయామానికి మించిన చక్కటి మార్గం ఇంకొకటి లేదు. ఈ చుయింగ్ గమ్‌ని దీర్ఘకాలికంగా తింటే మంచి కన్నా దుష్పరిణామాలు ఫేస్ చేసే ప్రమాదమే ఎక్కువుగా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణలు. చక్కెర రహిత చుయింగ్ గమ్‌లో కృత్రిమ చక్కెర్లు ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలుంటాయని అంటున్నారు. ఇలా నములుతూ ఉండటం వల్ల దవడం సంబంధ సమస్యలు, జీర్ణ సమస్యలకు దారితీయొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. బరువు తగ్గేందుకు చూయింగ్ గమ్ ఏమి అంత ప్రభావవంతమైనది కాదనే చెబుతున్నాయి. ముఖ్యంగా ఆకలి, క్యాలరీలు వంటివి తగ్గినప్పటికీ సమగ్రంగా బరువు తగ్గుతారా అనేది సందేహమే అంటున్నాయి పరిశోధనలు. జీవనశైలి లేదా ఆహారంలో మార్పులు చేసేటప్పుడూ ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనలు మేరుకు పాటించండి అని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. (చదవండి: స్పైసీ చిప్స్ తినకూడదా? చనిపోతారా..?) -
కన్నీటి వాగు
కెరమెరి(ఆసిఫాబాద్): పత్తి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తూ విష ప్రభావానికి గురైన లక్మాపూర్ రైతు మాలోత్ లక్ష్మణ్ (50)ను వాగు దాటించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. లక్ష్మణ్ శుక్రవారం తన పత్తి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా విషప్రభావంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. గమనించిన సమీప రైతులు ఆయనను ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కష్టంగా దాటించి.. కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఉట్నూ ర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అర్ధరాత్రి 12 గంటలకు పరిస్థితి విషమించి మృతి చెందాడు. శనివారం కూడా వాగు ఉధృతి తగ్గక పోవ డంతో మృతదేహాన్ని మంచంపైనే వాగు దాటించారు. కాగా ఈ నెల 8న ‘ప్రాణాలు పోయా కా స్పందిస్తారా..?’ అన్న శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన రోజే మృతి చెందడం గమనార్హం! ఆలస్యం కాకుంటే.. లక్ష్మణ్ తన చేనులో పడిపోగా.. వాగు దాటించి కెరమెరి పీహెచ్‌సీకి చేర్చడానికి రెండు గంటల సమయం పట్టింది. దీంతో ప్రాథమిక చికిత్స అందడం ఆలస్యమైంది. అక్కడి నుంచి ఉట్నూర్, ఆ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్‌కు చేరేసరికి లక్ష్మణ్ పరిస్థితి విషమించింది. రిమ్స్ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. సకాలంలో తీసుకొస్తే ప్రాణాలు దక్కేవని రిమ్స్ వైద్యులు పేర్కొన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
సాక్షి ఎఫెక్ట్: రాయదుర్గం భూములపై ఎల్‌అండ్‌టి మెట్రో రైల్ వివరణ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం భూములపై ఎల్అండ్టీ మెట్రో రైల్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదంతోనే సబ్‌లైసెన్స్ హక్కులను రాఫర్టీకి అప్పగిమంచామని, ఈజీఎంలో షేర్ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాతే బీఎస్ఈకి తెలిపామని ఎల్అండ్టీ మెట్రో రైల్ తెలిపింది. స్థిరాస్తి విక్రయించండం జరగదని స్పష్టం చేసింది. సబ్ లైసెన్స్‌పై కొన్ని అనుమతులు రావాల్సి ఉందనిఎల్అండ్టీ మెట్రో రైల్ పేర్కొంది. చదవండి: కేసీఆర్ పక్కా ప్లాన్.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
మంచి మాటల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
దయచేసి మనసు విప్పి మీతో మీరు మమేకం కండి లేదా ఇతరులతో అయినా మంచిగా మాట్లాడండి. నిజానికి మనుషులకు ఆ తీరికే లేదు. సెల్ఫోన్లు వచ్చాక..ఆ ఫోన్ చూసుకుంటూనే ఆఫీస్‌కి వెళ్తారు. మళ్లీ అలానే ఇంటికి వచ్చేస్తారు. ఆఖరికి ఇంటి దగ్గర అదే పని. దేన్ని ఎంతవరకు వాడాలో తెలియదో లేక వస్తువుల వ్యామోహంలో పిచ్చెక్కి మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. కానీ కాసేపు మన తోటి వారితో ఇరువురికి ఉపయోగపడే మంచి మాటాల మాట్లాడితే అవి ఎంతగా ప్రభావంతంగా పనిచేస్తాయో తెలుసా!. వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా! ఐతే ఒక్కసారి ఈ కథ వినండి. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. దీంతో విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలంతో ఏవిధంగా సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు కూడా. తపోఫలం? సత్సాంగత్య ఫలం? రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు. ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు. దీంతో విశ్వామిత్రుడు వెంటనే 'నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంలో మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి చటుక్కున ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చు అని అంటాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని నిలదీస్తారు. మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు బదులిచ్చాడు. వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహిస్తారు. చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో? ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా..ఏ ఇద్దరు కలిసినా సెల్ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు ఎప్పుడూ మాట్లాడతామో కదా!. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
వామ్మో తుఫాను.. ఇక్కడ వర్షాలు..
-
బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్. ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది. లాక్డౌన్ లేని సమయంలో సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... లక్షణాలు ►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం ►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం ►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్) ►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం ►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం. ‘బర్న్ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు... ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే... 1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు. 2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది. 3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు. 4. ఎస్టాబ్లిష్డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? 5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎవరిలో ఎక్కువంటే... సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ. మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు. మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మెదడుపైనా దుష్ప్రభావాలు ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి. టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది. -
ముందుగానే పక్క పార్టీకి వెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసుకుందామనే భావన
-
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
వైద్యరంగంలో సత్ఫలితాలిస్తున్న నాడు-నేడు పనులు
-
విజయ్ దేవరకొండ కు లైగర్ ఎఫెక్ట్
-
సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశం
వాషింగ్టన్: అంతరిక్షం నుంచి భారీ సౌర తుపాను నేడు భూమిని తాకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రభావంతో జీపీఎస్, మొబైల్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలగొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. సౌర తుపాను ప్రభావం భూకక్ష్యలోని ఉపగ్రహాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్షంలో సంభవించే సౌర తుపానులు అప్పుడప్పుడు భూమిని తాకే సందర్భాలు ఉన్నాయి. గతంలో ఆయా సమయాల్లో శాటిలైట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది కూడా. The long snake-like filament cartwheeled its way off the #Sun in a stunning ballet. The magnetic orientation of this Earth-directed #solarstorm is going to tough to predict. G2-level (possibly G3) conditions may occur if the magnetic field of this storm is oriented southward! pic.twitter.com/SNAZGMmqzi — Dr. Tamitha Skov (@TamithaSkov) July 16, 2022 శక్తివంతమైనదే! జులై 15న సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన సౌర జ్వాల మొదలైంది. బలమైన ఫొటాన్ల నుంచి వెలువడే రేడియేషన్ విస్పోటనం వల్ల ఇది ఏర్పాడుతుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. అయితే జులై 20-21 తేదీల మధ్య భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకవచ్చని ముందు నుంచి పరిశోధకులు చెప్తూ వస్తున్నారు. ఎఫెక్ట్.. గతంలో భూమి మీద సౌర తుపానుల ప్రభావం పడింది. సౌర తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో ఖగోళ కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. అదే సమయంలో భూ వాతావరణం కూడా వేడక్కే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్, మొబైల్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు కూడా. -
తస్మాత్ జాగ్రత్త!
దాదాపు నెల్లాళ్లపాటు దేశాన్ని వణికించిన ఒమిక్రాన్ ముగిసినట్టేనని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అందరికీ ఊరటనిచ్చి ఉంటుంది. అమలు చేస్తున్న ఆంక్షల్ని సమీక్షించి, అవసరాన్ని బట్టి పాక్షికంగా తొలగించటమో, పూర్తిగా ఎత్తేయటమో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని కూడా కేంద్రం సూచించింది. రెండేళ్లనుంచి జనం కోవిడ్ పడగ నీడలో జీవితాలు గడుపుతున్నారు. ఏనాడూ ఊహకైనా అందని ఆంక్షలు చవిచూశారు. 2020 అక్టోబర్‌లో వైరస్ తగ్గుముఖం పడుతున్న వైనం కనబడినప్పుడు ఏమైందో మరిచిపోకూడదు. ఒకపక్క వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పక్షాలు పెడచెవిన పెట్టాయి. ప్రజానీకం సైతం పండుగలు, ఉత్సవాల్లో మునిగిపోయారు. వేరే దేశాల్లో అప్పటికే రెండో దశ విజృంభణ మొదలైనా అందరూ బేఖాతరు చేశారు. మన దేశంలో రెండో దశ ప్రవేశించి, ఎవరికీ తెలియకుండానే ముగిసిందని కొందరూ... అసలు రెండో దశకు ఆస్కారమే లేదని మరికొందరూ వాదించారు. ఇవన్నీ సాగుతుండగానే చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి మొద లైంది. కేసుల సంఖ్య వందల నుంచి వేలకు వెళ్లింది. చివరకు నిరుడు మార్చిలో కోవిడ్ రెండో దశ ప్రారంభమైందని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. 19 రాష్ట్రాల్లో రెండో దశ తడాఖా చూపింది. అధికారిక గణాంకాలను బట్టి చూస్తే ఆ ఏడాది జూలై నాటికి 2.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. తొలి దశలో చనిపోయిన 1.57 లక్షలమందిని కలుపుకొంటే అప్పటికి దేశంలో 4 లక్షల 11 వేల 435 మంది కేవలం కరోనా మహమ్మారి కారణంగా మరణిం చారు. అయినప్పటికీ మొన్న డిసెంబర్లో ఒమిక్రాన్ తలెత్తేనాటికి యథాప్రకారం అలసత్వమే కన బడింది. అంతకు అయిదారు నెలలముందు వైరస్ స్వైర విహారం చేసిన తీరును అందరూ మరి చారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఊహకందనంత వేగంగా ఉన్నా అదృష్టవశాత్తూ ఆ నిష్పత్తిలో మరణాలు సంభవించలేదు. ఇది సహజంగానే మరింత నిర్లక్ష్యానికి దారితీసింది. మొత్తంగా ఒమిక్రాన్ కేసులు బుధవారం నాటికి 30,615 వరకూ ఉండగా 514 మంది చనిపోయారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఒక్కొక్కటే ఆంక్షల్ని తొలగిస్తున్నాయి. మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనను ఈ కోణంలో అర్థం చేసుకుంటే మరోసారి కష్టాల్లో పడకతప్పదు. ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు జరపడం, వైరస్ జాడల్ని గుర్తించి అవసరాన్ని బట్టి తగిన ఆంక్షలు అమల్లోకి తీసుకురావడం, వ్యాధిగ్రస్తులకు చికిత్స, అవసరమైనవారికి వ్యాక్సిన్ ఇవ్వడం కొనసాగించాలి. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దనీ, దాని పోకడలు ఎలా ఉంటాయో అంచనా వేయటం కష్టమనీ ఇప్పటికీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపం తీసుకున్నాక అది బలహీనపడిందని అంటున్నవారు లేకపోలేదు. కానీ మును ముందు ఈ వైరస్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే హెచ్చరించింది. వాస్తవానికి ఆంక్షలు సడలించవచ్చునని కేంద్రం ప్రకటించడానికి చాలాముందుగానే ప్రభుత్వాల్లో అలసత్వం ఏర్పడింది. ఇదంతా ఏ స్థాయిలో ఉందంటే సడలింపు గురించి కేంద్రం ప్రకటించాక అసలు ఆంక్షలు అమల్లో ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. మన దేశంలో దాదాపు 80 శాతంమందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంచనా వేసిన స్థాయిలో ఒమిక్రాన్ నష్టం కలగ జేయకపోవడానికి ఆ వైరస్ బలహీనపడటం ఒక కారణమైతే, జనాభాలో అధిక శాతంమంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం మరో కారణం కావొచ్చు. గతంతో పోలిస్తే కరోనా వైరస్‌కు సంబంధించి మన పరిజ్ఞానం గణనీయంగా పెరిగింది. ఆ మహమ్మారి రూపు రేఖా విలాసాలను కనిపెట్టి దాన్ని నియంత్రించే పనిలో దేశదేశాల్లోని శాస్త్రవేత్తలూ నిమగ్నమై ఉన్నారు. మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను ఛేదించేలా అది రూపాంతరం చెందడానికి దానిలోని ఏ జన్యువులు తోడ్పడుతున్నాయన్న అంశంలో చురుగ్గా పరిశోధనలు సాగుతున్నాయి. ఇవన్నీ అంతిమంగా కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి తోడ్పడితే మంచిదే. కరోనా వైరస్ పేరిట మన దేశంలో లాక్డౌన్లు, ఇతరత్రా ఆంక్షలు ఎంత అసంబద్ధంగా అమలు చేశారో, దాని పర్యవసానంగా ఎన్ని కోట్లమంది జీవితాలు ఛిద్రమయ్యాయో కళ్ల ముందుంది. అయినా కొన్ని రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఒమిక్రాన్ పేరు చెప్పి బడులకు సెలవులు ప్రకటించడం, వేరే రాష్ట్రాలనుంచి రాకపోకలను అడ్డగించడం వంటి చర్యలు అమల య్యాయి. వైరస్ కేసుల వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నా ఆంక్షలు సడలించాలన్న ఆలోచనే లేనట్టు ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఇప్పటికైనా అహేతుకమైన చర్యలు చాలించాలి. వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పనపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. అధిక జనాభా ఉన్న మనలాంటి దేశంలో మహమ్మారులు ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించగలవో అర్థమైంది గనుక ప్రభుత్వాలు అలసత్వాన్ని విడనాడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంతమంది సిబ్బందిని నియమించడం, అక్కడ మెరుగైన వైద్య ఉపకరణాలు అందుబాటులో ఉంచటం మొదలుకొని అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. ఖర్చు కోసం వెనకాడకుండా పకడ్బందీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. -
దారుణంగా దెబ్బ తిన్న స్టాక్ మార్కెట్..
-
ఇన్వెస్టర్లకు రూ. 66 కోట్లు వెనక్కిచ్చేసిన భారత స్టార్టప్
బిజినెస్ డెస్క్: ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టిన ఓ స్టార్టప్.. ఆర్నెల్లు తిరగకుండానే మూతపడింది. బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ప్రొటన్.. భారత్‌లో బోణీ మొదలుపెట్టకముందే మూతపడినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాదు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు. అనిల్ గోటేటి, మౌసమ్ భట్లు కిందటి ఏడాది ప్రొటన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 2021 జులైలో అమెరికాలో ఈ స్టార్టప్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. న్యాయవాదులు, గ్రాఫిక్ డిజైనర్లు, పోషకాహార నిపుణులు, ఇలా స్వతంత్ర నిపుణులకు.. తమ వ్యాపారాలను ఆన్లైన్లో ప్రారంభించడానికి, వీడియోలను రూపొందించడానికి, ప్రత్యక్ష సెషన్లను నిర్వహించడానికి, చెల్లింపు లింక్‌లను రూపొందించడానికి, వాళ్ల వ్యాపారాన్ని ట్రాక్ చేయడానికి ఇది తన ప్లాట్‌ఫారమ్‌గా ఉంటుందని ఆరంభంలో ప్రకటించుకుంది పొటాన్. దీంతో 9 మిలియన్ డాలర్ల(సుమారు 66 కోట్ల రూపాయలపైనే) ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అయితే.. కరోనా ఎఫెక్ట్‌తో ఈ స్టార్టప్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆదరణ దక్కకపోవడంతో భారత్‌లో ఇంకా కార్యకలాపాలు మొదలుపెట్టకముందే కార్యకలాపాలను మూసివేసింది. ఉద్యోగులందరినీ రీలీవ్ చేయడంతో పాటు ఇన్వెస్టర్లకు డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చినట్లు ప్రకటించుకుంది. ప్రొటన్‌లో మ్యాట్రిక్స్ పార్ట్నర్స్, 021 క్యాపిటల్, టాంగ్లిన్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో పాటు బిన్నీ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి, ఉడాన్ కో-ఫౌండర్ సుజీత్ కుమార్, క్రెడ్ కునాల్ షా సైతం ప్రొటన్‌లో పెట్టుబడులు పెట్టారు. గోటేటి గతంలో ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెడిసెంట్‌గా పని చేసి.. 2020 నవంబర్‌లో కంపెనీని వీడారు. అలాగే భట్ గతంలో ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసి.. ఆపై గూగుల్లోనూ పని చేశారు. ఇదిలా ఉంటే ముంబైకి చెందిన ఇన్సూరెన్స్ స్టార్టప్ బీమాపే కూడా కార్యకలాపాల్ని ప్రారంభించిన ఏడాదిలోపే మూతపడడం విశేషం. ఇక భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా పప్రోద్భలంతో మొదలైన ఏఐ ఛాట్‌బోట్ డెవలపర్ నికీ కూడా కిందటి ఏడాది మూతపడింది. -
Trains Cancelled: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..
సాక్షి, హైదరాబాద్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్ల రాకపోకలపై మళ్లీ కోవిడ్ ప్రభావం పడింది. రద్దీ నియంత్రణకుగాను మళ్లీ రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా కోవిడ్ కేసులు తీవ్రమవుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే 55 అన్రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (అప్ అండ్ డౌన్ జతలు)ను ఈ నెల 24 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్రిజర్వ్డ్ మూలాన సీట్ల సంఖ్యకు మించి టికెట్లు జారీ చేస్తుండటంతో ఈ రైళ్లలో కొంత రద్దీ ఉంటోందని, ఇది కోవిడ్ కేసులు మరింత పెరిగేందుకు కారణమవుతుందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: కోవిడ్ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తగు నిర్ణయం తీసుకోవాలని ఇటీవల రైల్వే బోర్డు ఆదేశించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ రద్దు నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితిని అంచనా వేసి వీటిని తిరిగి ప్రారంభించాలా, మరిన్ని రైళ్లను రద్దు చేయాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన వాటిలో విజయవాడ–నర్సాపూర్, మచిలీపట్నం–విజయవాడ, మచిలీపట్నం–గుడివాడ, నర్సాపూర్–నిడదవోలు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్, తెనాలి–రేపల్లె, కర్నూలు సిగా–గుంతకల్లు, డోన్–గుత్తి, తిరుపతి–కాట్పాడ్, సికింద్రాబాద్–ఉమ్ధానగర్, మేడ్చల్–సికింద్రాబాద్, కాచిగూడ–నడికుడి, కర్నూలు–కాచిగూడ తదితర రైళ్లు ఉన్నాయి. -
పెళ్లి వేడుకలపై కరోనా మహమ్మారి ప్రభావం
-
దారి చూడు.. దుమ్ము చూడు
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనం కనిపించని పరిస్థితి. రోడ్డు నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి పట్టింపు లేకపోవడంతో దుమ్ము లేస్తోంది. దీంతో వాహనదారులతో పాటు నడుస్తూ వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లు కూడా చల్లని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు చల్లడం లేదు.. మండలంలోని చెరువుమాదారం క్రాస్‌రోడ్డు నుంచి బౌద్ధక్షేత్రం వరకు ఉన్న రహదారిలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేసింది. రూ.17 కోట్లతో రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాగా నేలకొండపల్లిలో రహదారి నిర్మాణ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు మరిచిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. కంకరపోసిన రహదారిపై వాహనాలు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎండల తీవ్రత వలన రహదారిపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ అడపాదడపా నీళ్లు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. తృటిలో ప్రమాదం తప్పింది. అనేక వాహనాలు పల్టీకొట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నిత్యం నీరు చల్లించేలా చూడాలని కోరుతున్నారు. -
సోరియాసిస్... కంటిపై దాని ప్రభావం!
చర్మం బాగా పొడిబారిపోయి దానిపైన ఉండే కణాలు పొట్టులా రాలిపోయే స్కిన్ డిసీజ్ అయిన సోరియాసిస్ గురించి తెలియని వారుండరు. మన సొంత వ్యాధినిరోధక వ్యవస్థ మన కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్)వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. అందరూ దాన్ని చర్మవ్యాధిగానే చూస్తారు. కానీ దాని దుష్ప్రభావాలు కంటిపైన కూడా కొంతవరకు ఉంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... ► కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు). ► కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్). ► కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి. ► కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు. జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్‌కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్‌ను అదుపులో పెడుతున్నారు. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్‌కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటివైద్యుడిని కూడా సంప్రదించడం అవసరం. -
తాలిబన్ పాలన... భారత్‌కు సరికొత్త సవాళ్లు
అఫ్గానిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆవిర్భావం నేటి వాస్తవం. ప్రపంచ దేశాలు ఈ వాస్తవాన్ని ఇప్పుడే కాకపోయినా, తరువాత అయినా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే, ఈ ప్రాంతంలోని ముఖ్య శక్తులైన రష్యా, చైనాలు తాలిబన్ పాలనకు తమ మద్దతును ప్రకటిం చాయి. పాకిస్తాన్ తన మద్దతును ఇవ్వడమే కాకుండా, నూతన ప్రభుత్వంలో తన అనుకూల హక్కాని నెట్వర్క్ నాయకులను కీలకమైన పదవులలో చొప్పించడంలో కూడా సఫలమైంది. ప్రపంచ దేశాలు తాలిబన్లను బహిష్కరిస్తే అది ప్రతిచర్యలకు మాత్రమే దారితీయగలదని, సంభాషణలు సానుకూల ఫలితాలను ఇవ్వగలవని, అందువల్ల అఫ్గాన్ నూతన ప్రభుత్వంతో చర్చలు కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి వేదికగా ఖతార్ ప్రకటించింది. దాని వ్యూహాత్మక, భద్రతా అవస రాలను దృష్టిలో ఉంచుకొని, ఇరాన్ కూడా తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. అఫ్గానిస్తాన్ అంతర్గత రాజకీయ పరిణామాలలో భారతదేశం ఎప్పుడూ ముఖ్యమైన పాత్ర వహించలేదు, కానీ భారత్‌కి అఫ్గానిస్తాన్‌తో ముడిపడిన వ్యూహాత్మక, భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయి. చరిత్రాత్మకంగా, 1996 నుంచి 2001 వరకు తాలిబన్ పాలన కాలంలో ఉండిన వైరుధ్యపరమైన సంబంధాలు మినహాయించి, భారతదేశం అఫ్గానిస్తాన్‌తో సుహృద్భావ సంబంధాలను కొనసాగించింది. దేశ భద్రతా, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా, భారత్ త్వరలోనే తాలిబన్ ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ఈ కోణంలో మన ముందున్న సవాళ్లు ఏమిటి? మొదటిరకం సవాళ్లు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదం ముప్పులు. అవి ముఖ్యంగా కశ్మీర్ సమస్యను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మతఛాందస, జిహాదీ ఉగ్రవాద సమ స్యలు భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. రష్యా, చైనాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. రష్యా తాలి బాన్ల నుండి ఇస్లామిక్ ఛాందసవాద భావజాలం వ్యాప్తి గురించి ఆందోళన చెందుతోంది, చైనా ఆందోళనలు అన్నీ అఫ్గానిస్తాన్ సరిహద్దులోని ముస్లింలు అధికంగా ఉన్న జింజియాంగ్ రాష్ట్రం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వారి వారి ఆసక్తుల దృష్ట్యా రష్యా, చైనాలు, అఫ్గాన్ నుంచి అమె రికా సైన్యాల ఉపసంహర ణకు ముందే, తాలిబాన్లతో చర్చలు జరిపి వారికి మద్దతు ప్రకటించాయి. ఇదే రకం ప్రక్రియలను భారతదేశం చేపట్టలేదు. భారత్‌కి రెండవరకం సవాళ్లు అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమేయంతో ఎదురవుతున్నాయి. ప్రస్తుత తాలిబన్ నాయకత్వం ఎంతవరకు పాకిస్తాన్‌తో అను కూలంగా ఉండగలదు? అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ‘డ్యూరాండ్ లైన్’ను గతంలో ఏ అఫ్గాన్ ప్రభుత్వం కానీ, చివరికి తాలిబన్లు సహితం గుర్తించలేదనేది వాస్తవం. అయితే, తాలిబన్లను ఐఎస్ఐ తప్పక ప్రభావితం చేయ గలదనేది కూడా వాస్తవం. అందువల్ల, అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ఐ ప్రభావాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక చివరి రకం సవాళ్లు భారత దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించినవి. ఇవి మునుముందు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ స్థిరత్వం ఏ విధంగా ఉండగలదు అనే సమస్యతో ముడిపడి ఉన్నాయి. గత ఇరవై ఏళ్లుగా అఫ్గానిస్తాన్‌పై భారత విదేశాంగ విధానం, ప్రాథమికంగా సైనిక విధానాన్ని అనుసరించిన అమెరికా వలె కాకుండా, భిన్నంగా ఉంటూ వచ్చింది. అప్గానిస్తాన్‌లో చేపట్టిన తన సహాయ కార్యక్రమాలలో స్థానిక ప్రజలను భాగస్వామ్యంచేసే నిర్మాణాత్మక ప్రక్రియను భారత్ అనుసరించింది. ఫలితంగా, 2006 నుంచి 300కి పైగా అనేక చిన్నతరహా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటిలో హైవే రోడ్డు నెట్‌వర్క్‌లను నిర్మించడం ఒకటి. ఉదాహరణకు, జరాంజ్–డేలరాం హైవే, కాబుల్‌లోని కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం, చిన్న నీటిపారుదల కాలువలు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు నెలకొల్పడం, ఆ దేశ విద్యార్థులు భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రతి ఏటా వేలాది స్కాలర్షిప్లను అందించడం, కోవిడ్–19 మహమ్మారి సమయంలో గోధుమలు, అవసరమైన మందు లను పంపడం వంటివి ఉన్నాయి. ఐపీఎల్లో అఫ్గాన్ క్రికెట్ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఈ విధంగా అక్కడి ప్రజల దృష్టిలో, ముఖ్యంగా యువతలో భారత్‌పై చక్కటి సుహృ ద్భావం ఉంది. దేశ జనాభాలో 30 శాతంగా ఉన్న ఈ పట్టణ ప్రాంత యువతతో తాలిబాన్లు అనుసంధానం కావాల్సి ఉంటుంది. హెన్రీ కిసింజర్ ఇలా అంటాడు, ‘దేశాధినేతలు విధానాలను రూపొందించే సమయంలో, ముందే నిరూ పించలేని అంచనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’. ఇదే దిశలో భారత్ తాలిబన్ల అఫ్గానిస్తాన్‌పట్ల తన విధానా లను అన్వేషించాల్సి ఉంది. భారత్ ముందుగల అవకాశాలు: ఒకటి, తాలిబన్లతో చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించడం; రెండు, రష్యాతో కలిసి కదలడం. భారత్ ఇప్పటికే అఫ్గాన్ భవితవ్యంపై రష్యా నేతృత్వంలోని చర్చలలో 2017 నుండి భాగంగా ఉన్నది. దీనిని ముందుకు సాగించడం; మూడు, షాంఘై సహకార సంస్థ ఆఫ్గాన్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా దారులు వెతకడం. ఈ సంస్థలో భారత్ ఇప్పటికే ఒక సభ్యదేశంగా ఉంది. ఈ వేదిక చైనాతో భారత్ సహకరించడానికి అవకాశాన్ని ఇస్తుంది; నాలుగు, అఫ్గాన్‌లో ఇంటెలిజెన్స్ సేకరణ కోసం ఇరాన్ గతంలో భారత్‌కు సహాయపడింది. తాలిబన్లతో ఇరాన్‌కు చేదు అనుభవం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వారికి ఇరాన్ మద్దతునిచ్చింది. అందువల్ల, తాలిబన్లతో వ్యవహరించడానికి భారత్ ఇరాన్ సాయాన్ని కోరవచ్చు; ఈ ఐదింటిలో భారత్ ఏ దిశను ఎంచుకున్నా, ప్రతి కార్యా చరణ వ్యూహంలో సమస్యలు ఉండగలవని గుర్తుంచుకో వాలి. అట్లాగే, భారతదేశం తన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా పాక్ ఇష్టానికే వదిలివేయడం అత్యంత ప్రమాదకరం అని గుర్తించాలి. చెన్న బసవయ్య మడపతి వ్యాసకర్త విశ్రాంత రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా విశ్వ విద్యాలయం -
పేగులపై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్.. ఈ సమస్యలుంటే అప్రమత్తం కావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారితోపాటు ఇప్పటిదాకా వైరస్‌బారిన పడని వారు సైతం కొత్త అనారోగ్య సమస్యలపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు నొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు, నల్లరంగులో మలం, మూత్రంలో రక్తపు చారల వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్ల రంగులో మలవిసర్జన వల్ల చిన్న, పెద్ద పేగుల్లో గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నం దున జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్ లేదా లాంగ్ కోవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టే తత్వం పెరుగుతోందని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో ‘హైపర్ కోఅగ్యుల బుల్’లేదా ‘ప్రోత్రోంబొటిక్’గా పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా వారం వ్యవధిలోనే నిమ్స్ ఆసుపత్రిలో ఏడు కేసులు, ఏఐజీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు గతంలో వీరేమైనా కోవిడ్ బారిన పడ్డారా అని ఆరా తీశారు. వీరిలో చాలా మంది తమకు కరోనా సోకలేదని స్పష్టం చేయడంతో తదుపరి పరీక్షలు నిర్వహించారు. వీరికి నిర్వహించిన టెస్ట్‌ల్లో కోవిడ్ యాంటీబాడీస్ గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. దీనిని బట్టి ఈ పేషెంట్లకు కరోనా వచ్చిపోయి ఉంటుందని, అది సోకినా లక్షణాలు కనిపించని (అసింప్టోమేటిక్) వారిగా గుర్తించారు. ఇటీవలి కాలంలో ఈ లక్షణా లకు సంబంధించిన కేసులు నమోదు అవుతుండడంతో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిమ్స్ ప్రొఫెసర్, సర్జికల్ గ్యాస్ట్రో ంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్. బీరప్ప పేర్కొ న్నారు. దీనితో ముడిపడిన వివిధ అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు... ఆయన మాటల్లోనే... ఎలా నిర్ధారించారు...? ఈ పేషెంట్లలో కోవిడ్ పాజిటివ్ యాంటీబాడీస్ ఏర్పడ్డాయి కాబట్టి ఇది కరోనా సంబంధితమైనదిగా నిర్థారించాం. లాంగ్ కోవిడ్ లక్షణాల్లో భాగ ంగా రక్తనాళాలతో ముడిపడిన వివిధ సమస్యలు తలెత్తవచ్చు. పేగులకు రక్తప్రసారాన్ని తీసుకెళ్లే సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా కంటిచూపు పోవడం, గుండెపోటు, గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, శరీరంలో ఎక్కడైనా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం సంభవించే అవకాశాలున్నాయి. అలాగే చిన్న, పెద్ద పేగులకు రక్తం సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టాక అవి కుళ్లిపోయి ‘గ్యాంగ్రీన్’లు ఏర్పడుతున్నాయి. ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం... కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన వారు, దీర్ఘకాలిక జబ్బులున్నవారు, బీపీ, ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, ఎక్కువకాలం ఎటూ కదలకుండా ఒకేచోట గడిపే వారికి ఈ థ్రోంబొటిక్ సమస్యలు తీవ్రం కావొచ్చు. ఈ సమస్య అత్యధికంగా పురుషులకే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఈ లక్షణాలను వీలైనంత తొందరగా గమనించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. రక్తం పలుచన చేసే మందులు ఇవ్వాలి... కరోనా వచ్చి తగ్గిన వారికి డాక్టర్లు సుదీర్ఘకాలంపాటు రక్తాన్ని పలుచన చేసే ‘యాంటీ కోవిలియెంట్స్’ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నాం. గతంలో ఈ మందులను స్వల్పకాలం ఇస్తే సరిపోతుందనే అంచనా ఉండగా ఇప్పుడు దానిని మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నాం. ‘హైపర్ కోఅగ్యులబుల్’ అంటే.. కరోనా బారిన పడ్డాక కొందరిలో రక్తం గడ్డ కడు తోంది. పేగుల్లో బ్లాక్స్ (ఇంటెస్టెయిన్స్ బ్లాక్స్) ఏర్పడతాయని మనకు గతేడాది అవగతమైంది. వ్యాక్సిన్ దుష్పరిణామాల వల్ల ఇలా జరిగి ఉంటుందా అంటే అదీ కాదని తేలింది. వీరిలో కొందరు సింగిల్‌డోస్ తీసుకున్నారు. కోవిడ్ ఫస్ట్, సెకండ్‌వేవ్‌లలో ఇలాం టి కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యా యి. ‘హైపర్ కోఅగ్యులబుల్’లక్షణాలు, ప్రభా వాలు ఏర్పడినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, అంతర్గత అవయవాలు, కాళ్లకు రక్త సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి. మేము దీనిని ‘స్లాంపషినిక్ వీన్ థ్రోం బోసిస్, పోర్టోమెసెంట్రిక్ వీన్ థ్రోంబోసిస్, మెసెంట్రిక్ ఇస్కేమియాగా పిలుస్తాం. ఇటీవలి కాలంలో నిమ్స్‌లో ఇలాంటి కేసులు పెరిగాయి. ముఖ్యంగా యువతలో, గతంలో ఎలాంటి దీర్ఘకాలిక, ఇతర జబ్బులు (కోమొర్బోటీస్)లేని వారి లోనూ గుర్తించాం. కొందరు పేషెంట్ల చిన్న పేగులో అత్యధికభాగం, పెద్దప్రేగులో కొంత భాగం కుళ్లిపోయి ఇన్ఫెక్షన్ బాగా పెరిగింది. అది కాస్తా ‘రెనల్ ఫెయిల్యూర్’కి వెళ్లింది. ఆరుగురు పేషెంట్లలో గ్యాంగ్రీన్ విస్తరణతో పేగులో చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆరోగ్యం క్షీణించి ఇద్దరు మరణించారు. నలుగురిని వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. -
చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): చేను పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే భర్త పిడుగుపాటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన జైనథ్ మండలం గూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట భగవాండ్లు(49), తన భార్య మల్లమ్మ, జీతగాడు(పాలేరు) దాగిరి సంతోశ్, మరో నలుగురు కూలీలతో కలసి శుక్రవారం తన పత్తి చేనులో కలుపు నివారణ, పురుగుల మందు పిచికారీ పనులకు వెళ్లారు. ఆ తర్వాత కూలీలతో కాలినడకన భార్య మల్లమ్మ ఇంటికి చేరుకుంది. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో పాలేరు సంతోశ్ ఎడ్ల బండి తోలుతుండగా, వెనుకాల నిల్చోని భగవాండ్లు వస్తున్నాడు. ఎడ్లబండిపై ఒకసారిగా పిడుగుపడి భగవాండ్లు అక్కడిక్కడే మృతిచెందాడు. సంతోశ్‌కు కాలి భాగంలో గాయాలయ్యాయి. ఎడ్లకు సైతం స్వల్ప గాయాలు కాగా, ఎటువంటి హాని జరుగలేదు. స్థానికులు సంతోశ్‌ను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి -
బంధం తగ్గుతోంది..
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంటి నుంచి పని చేస్తున్న సమయంలో సంస్థలోని ఉద్యోగులకు, పై అధికారులకు మధ్య సమన్వయం తగ్గుతోందని ‘2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదిక’ అనే పరిశోధనలో తేలింది. ఓ సీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. దీని ప్రకారం ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తమ బాస్‌తో సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు లేకపోవడం, ఉద్యోగులు– ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి కారణాలని పేర్కొంది. ఈ సమస్యలు కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైనట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా పరిశోధన.. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో 38 వేల మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు, హెచ్ఆర్ విభాగానికి చెందినవారు, ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ పరిశోధన వెలువడింది. ఇందులో భారత్ నుంచి 5,500 మంది పాల్గొన్నారు. వీటన్నింటిని ఓసీ ట్యానర్ ఇన్స్టిట్యూట్ క్రోడీకరించి 2022 అంతర్జాతీయ సాంస్కృతిక నివేదికను వెలువరించింది. ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ పరిశోధన మరోమారు స్పష్టం చేసిందని ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు గ్యారీ బెక్స్ట్రాండ్ చెప్పారు. ప్రోత్సాహం లేదు.. 57 శాతం మంది ఉద్యోగులు తమ బాస్‌ల నుంచి ప్రోత్సాహాన్ని పొందడం లేదని పరిశోధనలో వెల్లడించారు. 62 శాతం మంది పై అధికారులు విజయం సాధించడం ఎలాగో చెబుతుండగా, 52 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగుల విజయాల గురించి ఇతరులకు వివరిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమైతే పరిస్థితులు మరింత దిగజారతాయని పరిశోధన పేర్కొంది. ఉద్యోగులను పట్టించుకోకపోతే, ఉద్యోగులు కూడా తమ సంస్థ గురించి పట్టించుకోవడం మానేస్తారని తెలిపింది. సంస్థలోని ముఖ్యమైన సందర్భాలను కలసి జరుపుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుందని, తద్వారా వారు బాగా పని చేస్తారని నివేదిక స్పష్టం చేసింది. కీలకాంశాలు.. పరిశోధనలో పాల్గొన్న 61 శాతం మంది ఉద్యోగులు తమకు నూతన పరిచయాలు కార్యాలయాల్లోనే అవుతాయని చెప్పారు. సామాజికంగా ఇతరులతో కలసి పని చేస్తే తమలోని ఉత్తమ నైపుణ్యాన్ని బయటకు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. మరో 45 శాతం మంది ఉద్యోగులు.. గతేడాది నుంచి ఆఫీస్ వర్క్‌కు సంబంధించిన దైనందిన సమన్వయ కార్యక్రమాలు బాగా పడిపోయాయని చెప్పారు. 57 శాతం మంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా వరకు తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. పని ప్రదేశంతో కనెక్షన్ తెగిపోయాక తమ పనితీరు 90శాతం వరకూ పడిపోయిందని కొందరు ఉద్యోగులు వెల్లడించారు. దీంతో పాటు పని వల్ల నీరసపడిపోవడం (బర్న్ఔట్) బాగా పెరిగిందని వెల్లడించారు. చదవండి: కోవిడ్ పోరులో కొత్త ఆశలు -
Virat Kohli: దటీజ్ కోహ్లి
క్రికెట్లో ఒక ఆటగాడి శైలిని.. మరో ఆటగాడితో పోల్చి చూసే వ్యవహారం సహజం. కానీ, ఏ ఆటగాడి ప్రత్యేకత ఆ ఆటగాడికే ఉంటుంది కదా!. అలాగే టీమిండియా టాప్ ప్లేయర్ విరాట్ కోహ్లిని దిగ్గజాలతో పోల్చాలని ప్రయత్నించడం కష్టంతో కూడిన వ్యవహారమే. కోహ్లి అగ్రెసివ్ ఆటిట్యూడ్‌తో పాటు ఆటనూ ఇష్టపడే యంగ్ జనరేషన్‌కి.. అతని పట్ల ఉన్న అభిమానం ఎంతైనా ప్రత్యేకమే!. Virat Kohli Brand Value Without T20 Captaincy?: వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో రకరరకాల చర్చలు.. కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరి కోహ్లి గనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. అతని బ్రాండ్‌కు వచ్చే నష్టమేమైనా ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు. రకరకాల బ్రాండ్లు.. కోట్లలో వ్యాపారం కేవలం కోహ్లి బ్రాండ్‌నే నమ్ముకుని నడుస్తున్నాయి. అందుకు ప్రతిగా పారితోషకం సైతం కోహ్లికి భారీగానే ముట్టజెప్పుతున్నారు. మరి క్రికెట్ వ్యూయర్షిప్ను శాసిస్తూ.. ఊహకందని రీతిలో బిజినెస్ చేస్తున్న పొట్టిఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచే తప్పుకుంటే.. అది ప్రచారాలపై, కోహ్లి ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టవా?. అసలు ఆ ఆలోచననే దరి చేరనీయట్లేదట సదరు కంపెనీలు. ఫామ్కొస్తే కేకే.. ఇంతకీ ‘కోహ్లి బ్రాండ్’ అంటే ఏంటో చూద్దాం. క్రికెట్లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కోహ్లి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు. ఎమ్ఆర్ఎఫ్, అమెరికన్ టూరిస్టర్, పూమా, వోలిని, అడీ, ఉబెర్ ఇండియా, రాయల్ ఛాలెంజ్.. ఇలా బోలెడు బ్రాండ్స్‌కు ఎండోర్సింగ్ చేస్తున్నాడు కోహ్లి. అయితే ప్రధాన బ్రాండ్లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.. కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు.. జనాల్లో కోహ్లికి ఉన్న యాక్సెప్టెన్సీ కూడా. మీడియా, సోషల్ మీడియా, బుల్లితెర.. ఇలా వేదిక ఏదైనాసరే కోహ్లికి విపరీతమైన జనాదరణ ఉంది. ఇది కోహ్లి పర్ఫార్మెన్స్తో ఏమాత్రం సంబంధంలేని వ్యవహారమని చెప్తున్నారు ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేస్ నాథ్. అందుకని కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లి బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదని భావిస్తున్నారాయన. ఒకవేళ విమర్శల సంగతే తీసుకున్నా.. కోహ్లి గనుక ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే.. అన్నీ మరిచిపోతారని, అప్పుడు మరింత పుంజుకుని బ్రాండ్ వాల్యూ రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారాయన. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ నాలుగేళ్లపాటు ఎలాగైతే రాణించాడో.. బ్రాండ్ మార్కెట్లో మళ్లీ పుంజుకున్నాడో కోహ్లి విషయంలోనూ అలాగే జరగొచ్చని, అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారాయన. కోహ్లి.. కనిపిస్తే చాలు కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్లకు సంబంధించి చేసే ఒక్క పోస్ట్‌కి కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్మెంట్ కోసం ఒక్కో బ్రాండ్‌కి ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు. అజింక్య రహానే, కేఎల్ రాహుల్ లాంటివాళ్లు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు. ఈ లెక్కన బ్రాండ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా.. కోహ్లితో పోటీపడే క్రికెట్ ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం. కోహ్లి గత కొంతకాలంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ.. బ్రాండ్లు వెనక్కి పోకపోవడమే ఇందుకు మరో ఉదాహరణ. రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లిని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా.. కోహ్లి బ్రాండ్ విషయానికొచ్చేసరికి సైలెంట్ అయిపోతోందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంటున్నారు. అలా తన ఇమేజ్‌తో ప్రత్యర్థుల నోళ్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లిది. అలాంటిది ప్లేయర్‌గా పర్ఫార్మెన్స్ కనబరిస్తే.. కోహ్లి బ్రాండ్ దూసుకుపోతుందని చెప్తున్నారు సలిల్. ‘‘కోహ్లి అప్పీయరెన్స్‌కు జనాలు బాగా అలవాటు పడ్డారు. యూత్ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది. అసలు క్రికెట్ జెర్సీలో అతని రూపం చాలు.. ప్రచారానికి. అందుకే సీనియర్లకు, క్రికెట్ దిగ్గజాలకు సైతం దక్కని బ్రాండ్ ఇమేజ్.. కోహ్లి పేరిట నడుస్తోంది ఇప్పుడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) చదవండి: కెప్టెన్‌గా రోహిత్ కంటే అతనే బెటర్! -
పెట్రో పిడుగు.. పెరిగిన హోల్‌సేల్ ధరల సూచి
పెట్రోల్ ధరల పెరుగుదల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. అందుకు తగ్గట్టే ఆగస్టుకి సంబంధించి హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) పెరిగింది. జులైలో డబ్ల్యూపీఐ 11.16 శాతం ఉండగా ఆగస్టుకి వచ్చే సరికి 11.39 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరమంతా డబ్ల్యూపీఐ రెండంకెలకు పైగానే నమోదు అవుతూ వస్తోంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో నెగిటివ్‌గా ద్రవ్యోల్బణం నమోదైంది, 2020 మేలో డబ్ల్యూపీఐ - 3.4 శాతంగా ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020 ఆగస్టున డబ్ల్యూపీఐ నెటటీవ్ను దాటి 0.4 శాతంగా నమోదు అవగా ఏడాది తిరిగే సరికి అది 11.39 శాతానికి చేరుకుంది. ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాలు, పెట్రో కెమికల్స్ తదితర వస్తువుల ధరల్లో హెచ్చుల వల్ల తయారీ రంగంలో ధరలు పెరుతుండగా మరోవైపు కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్‌కి సంబంధించి ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డబ్ల్యూపీఐ, సీపీఐల మధ్య ఈ తేడా ఎప్పుడూ ఉంటుందని ఇండియా రేటింగ్ , రీసెర్చ్ చీఫ్, ప్రముఖ ఎకనామిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. చదవండి : పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
యూపీని వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశపై నిపుణుల హెచ్చరికల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో అంతుచిక్కని జ్వరం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఏడుగురు వృద్ధులతోపాటు 32 మంది చిన్నారులు ఉండటం మరింత ఆందోళన రేపుతోంది. ఫిరోజాబాద్‌లో 32 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు మరణించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధృవీకరించారు. జిల్లాలో డెంగ్యూలాంటి జ్వరం కారణంగా ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. బాధిత కుటుంబాలను సందర్శించిన సీఎం యోగి వారికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిరోజాబాద్‌లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆగస్టు 18న మొదటి కేసు నమోదైందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వైద్యులు ప్రకటించారు. అనుమానాస్పద వ్యాధితో 102 డిగ్రీల సెల్సియస్ జ్వరంతో బాధితులు బాధపడుతున్నారని, ఈ జ్వరం తగ్గడానికి నాలుగు రోజులు పడుతోందన్నారు వెల్లడించారు. గతవారం నుంచి ఇక్కడ విషజ్వరం పీడితుల సంఖ్య మరింత విజృంభిస్తోంది. గత వారం 40 మంది పిల్లలు ఈ వ్యాధితో మరణించారని ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ప్రకటించారు. అయితే ఈ వాదనను యుపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. థర్డ్ వేవ్ వచ్చేసిందన్న వాదన సరికాదని, భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా, పిల్లలలో మలేరియా, డెంగ్యూ, అధిక జర్వం లాంటి లక్షణాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే తమ ఆరోగ్య బృందం నిర్వహించిన పరీక్షల్లో బాధితులందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మిగిలిన వారి శాంపిల్స్‌ను కూడా లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామన్నారు. మరోవైపు యూపీలోని ఫిరోజాబాద్, మధుర, ఆగ్రా తదితర ప్రదేశాలలో చోటచేసుకుంటున్న మరణాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. फिरोजाबाद, मथुरा, आगरा व उप्र की अन्य जगहों पर बुखार से बच्चों समेत तमाम लोगों की मृत्यु की खबर दुखदाई है। उप्र सरकार को तुरंत प्रभाव से स्वास्थ्य व्यवस्थाओं को चाक-चौबंद कर इस बीमारी के रोकथाम के प्रयास करने चाहिए। बीमारी से प्रभावित लोगों के बेहतर इलाज की भी व्यवस्था की जाए। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 30, 2021 -
కరోనా సెకండ్‌వేవ్: దేశీయ బ్యాంకుల కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్-సెప్టెంబర్) కోవిడ్ రెండో దశ ప్రభావంతో ఆర్థిక సంస్థల పనితీరు దెబ్బతిననుంది. దీంతో భారతీయ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కానున్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఈ విషయాలు వెల్లడించింది. ఆర్థిక రికవరీకి కోవిడ్‌పరమైన సమస్యల ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలిపింది. ఒకవేళ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి.. కొత్తగా లాక్డౌన్లు విధించాల్సి వస్తే మరింత ప్రతికూల పరిస్థితులు తప్పకపోవచ్చని పేర్కొంది. రాబోయే 12–18 నెలల్లో బ్యాంకింగ్ రంగంలో స్థూల మొండిబాకీలు భారీగా 11–12 శాతం స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని ఎస్అండ్పీ తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఆర్థికపరమైన బలహీన పరిస్థితులు కాస్త ముందుకు జరిగాయని, ఆర్థిక సంస్థలకు సంబంధించి రుణ బాకీల వసూళ్లు.. లోన్ల మంజూరు తగ్గడం రూపంలో ప్రథమార్ధంలోనే ఇది ప్రతిఫలించవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ ఛాబ్రియా తెలిపారు. దీంతో కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి దేశం క్రమంగా కోలుకునే క్రమంలో దేశీ బ్యాంకులకు వ్యవస్థాగతమైన రిస్కులు ఎదురు కావచ్చని ఆమె పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు నుంచే బ్యాంకులు మొండి బాకీల సమస్యతో సతమతమవుతుండగా.. కోవిడ్ రాకతో పరిస్థితులు కచ్చితంగా మరింత దిగజారాయని తెలిపారు. (LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’) టూరిజం, రియల్టీలో మొండిబాకీలు.. పర్యాటకం, తత్సంబంధ రంగాలు, వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్, అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు మొదలైనవి మొండిబాకీల (ఎన్పీఎల్) పెరుగుదలకు కారణం కాగలవని ఎస్అండ్పీ తెలిపింది. అయితే, ఈ రంగాలకు బ్యాంకులు ఒక మోస్తరుగానే రుణాలిచ్చాయని.. కాబట్టి ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చని పేర్కొంది. చిన్న సంస్థలకు లేదా వాణిజ్య వాహనాల కోసం రుణాలతో పోలిస్తే గృహ రుణాలు (ఎఫర్డబుల్ హౌసింగ్ మినహా), బంగారం రుణాలపైనా ప్రభావం తక్కువే ఉండవచ్చని ఎస్అండ్పీ వివరించింది. బ్యాంకుల కన్నా ఎక్కువగా ఫైనాన్స్ కంపెనీలకే ఇవి ఆందోళనకరంగా ఉండవచ్చని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో నగదు సరఫరా కాస్త పెరగనున్నప్పటికీ.. కొందరు రుణగ్రహీతలు కొండలా పేరుకుపోతున్న అప్పును తీర్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చని వివరించింది. సెకండ్ వేవ్ వల్ల రెండో విడత రుణాల పునర్వ్యవస్థీకరణ అమలు చేయడం వల్ల మొండిబాకీలను గుర్తించే ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందని ఎస్అండ్పీ తెలిపింది. పునర్ వ్యవస్థీకరించిన రుణాల పరిమాణం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. (Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్!) ప్రభుత్వం పైనే భారం.. కోవిడ్ కారణంగా దేశీ ఆర్థిక సంస్థల పనితీరుపై పడే ప్రతికూల ప్రభావాలు తగ్గడమనేది.. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రకటించిన చర్యలు ఎంత సమర్ధమంతంగా అమలవుతాయన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని ఎస్అండ్పీ పేర్కొంది. మరిన్ని కొత్త వేరియంట్లు రావడం, అంచనాల కన్నా తక్కువ స్థాయిలో టీకాలు వేసే అవకాశాలు మొదలైన రిస్కులు కూడా ఉన్నాయని తెలిపింది. ‘పరిమిత స్థాయిలో టీకాల సరఫరా, ప్రజల్లో సందేహాలు మొదలైన అంశాలన్నీ టీకాల కార్యక్రమం చకచకా ముందుకు సాగడానికి ప్రతిబంధకాలుగా మారాయి. జనాభాలో దాదాపు 70శాతం మందికి టీకాలు వేయాలంటే ప్రథమార్ధం అంతా సరిపోవచ్చు. ఈలోగా కొత్త కేసులు పెరిగి లాక్డౌన్లు తిరిగి విధించాల్సి వస్తే.. ఆర్థిక రికవరీకి మళ్లీ తప్పకపోవచ్చు‘ అని వివరించింది. (Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు) -
దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ రెండో మరణం నమోదు
భోపాల్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి రోజురోజుకి తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చేందుతుంది. అయితే, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇదే రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రెండో మరణం సంభవించిందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, గడిచిన వారంలో 6 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మధ్య ప్రదేశ్ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్ సీక్వేన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డిసిజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)కు పంపించారు. అయితే, దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మన దేశంలో ఇప్పటి వరకు, 318 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయట పడ్డాయి. అదే విధంగా, యూకేలోని లండన్‌లో ఆల్ఫా వైరస్ రకానికి చెందిన 56 కేసులు నమోదయ్యాయి. చదవండి: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదు -
కాబోయే అమ్మకు కరోనా టెన్షన్.. ఆసుపత్రికి వెళ్లని గర్భిణులు
సాక్షి, మంచిర్యాలటౌన్: ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే గర్భం దాల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. కరోనా వల్ల సరైన సమయంలో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేక పోతున్నారు. వైద్యులను ఫోన్లో సంప్రదించి వారికి ఉన్న సమస్యను వివరించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కానీ కొందరు ప్రసవానికి దగ్గర పడుతుండడం, కొందరికి కరోనా సోకడం వల్ల ఏమి చేయాలనేదానిపై ఎన్నో సందేహాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ రాధిక పలు సూచనలు చేస్తున్నారు. అధైర్య పడొద్దు.. కరోనా రాకుండా ముందస్తుగానే గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చిన అధైర్యపడకుండా, వైద్యుల సూచనల మేరకు తగిన మందులను వాడితే సరిపోతుంది. ప్రసవం సమయంలో కోవిడ్ పాజిటివ్ వస్తే, అలాంటి వారికి ప్రత్యేకంగా సాధారణ ప్రసవం గానీ, ఆపరేషన్ ద్వారా ప్రసవం చేస్తున్నారు. ప్రైవేటులో కరోనా సోకిన వారికి ప్రసవం చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తుండగా, జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ పాజిటివ్‌తో వచ్చిన వారిలో 14 మందికి అక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్టులు సిజేరియన్, సాధారణ ప్రసవాలను చేశారు. గర్భం దాల్చిన వారు కరోనా రాకుండా ఉండేందుకు బయటకు వెళ్లకుండా ఉంటూనే, ఇంట్లో కూడా మాస్క్‌ను తప్పనిసరిగా ధరించి, సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. ఇంట్లో ప్రత్యేక గదిలోనే ఉంటూ, నీరు ఎక్కువగా తీసుకోవాలి. లక్షణాలు ఉంటే టెస్టు తప్పదు.. ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటివి వస్తే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మందులను కూడా వాడాలి. కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకున్నప్పుడు, పాజిటివ్‌గా వస్తే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. గర్భం దాల్చిన తరువా త 4 నెలలకు గానీ కరోనా వ్యాక్సిన్‌ను వేసుకోవద్దు. గర్భం దాల్చినట్లుగా తెలిసిన వెంటనే వైద్యుల సమక్షంలో చెకప్ చేసుకుని 7 నెలల వరకు నెలకు ఒకసారి, 7–9 నెలల మధ్యలో 15 రోజులకు ఒకసారి, 9 నెలలు పడ్డాక వారానికి ఒకసారి వైద్యులను సప్రదించాలి. ప్రస్తుత సమయంలో కోవిడ్ ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుని ఆసుపత్రికి వెళ్లాలి. గర్భి ణులకు వైద్య పరీక్షలను చేయించడంలో ఆశ కార్యకర్తలదే కీలకపాత్ర. కరోనా వచ్చిన వారికి ప్రసవం చేసినా అందులోని బిడ్డకు కరోనా వచ్చేందుకు అవకాశం లేదు. గర్భిణులకు పాజిటివ్‌గా వస్తే మాత్రం వారిలో ఉన్న జ్వర తీవ్రతను బట్టి మందులు, యాంటీబాడీస్ ట్యాబ్లెట్లను వాడాలి. నాలుగు రోజు ల తరువాత కూడా జ్వరం ఉంటేనే కరోనా టెస్టుకు వెళ్లాలి. కరోనా వచ్చినా, రాకపోయినా, ధైర్యంగా ఉంటూ, పూర్తి పౌష్టికాహారం తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణుల్లో మాత్రం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారిని తొమ్మిది నెలల పాటు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కోవిడ్ సోకిన వారు సైతం ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, సరిపడా నీరు తాగాలి. – డాక్టర్ రాధిక, గైనకాలజిస్టు, జిల్లా ఆసుపత్రి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.. గర్భం దాల్చిన నాటి నుంచే వారికి పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, వారికి 7 నెలలు నిండే వరకు స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలను నెలలో ఒకసారి చేయిస్తున్నాం. 7 నెలలు నిండగానే వారికి జిల్లా ఆసుపత్రిలో నెలలో ఒకసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. గర్భిణులను ప్రతి నెలా ఆసుపత్రులకు తీసుకెళ్లి, తీసుకురావడం ఇబ్బందిగా ఉన్నా, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నాం. – కృష్ణవేణి, ఆశ కార్యకర్త, లక్సెట్టిపేట్ మండలం చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే! -
Lockdown: పెళ్లి వాయిదా మనస్తాపంతో టవరెక్కిన యువకుడు
సాక్షి, హొసపేటె(కర్ణాటక): తనను ప్రేమించిన అమ్మాయితో తల్లిదండ్రులు వివాహం చేయలేదని ఆవేదన చెందిన ఓ యువకుడు మొబైల్ టవరెక్కి హల్చల్ చేశాడు. వివరాలు... తాలూకాలోని మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి గొసంగి (23) ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. అయితే లాక్డౌన్ కారణంగా పెళ్లిని వాయిదా వేయడం చిరంజీవికి నచ్చలేదు. సోమవారం పాత వీరభద్రశ్వర టాకీస్ వద్ద నున్న మొబైల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేయకపోతే దూకుతానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకొన్న చుట్టు పక్కల ప్రజలు టవర్ వద్దకు వచ్చి మకాం వేశారు. సమాచారం అందుకున్న సీఐ వసంత, ఎస్ఐ మీనాక్షి, అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు రప్పించడంతో కథ సుఖాంతమైంది. చదవండి: నాకూ ఈటల గతి పడుతుందని అనుకున్నారు -
Corona Tragedy: ఫొటో, వీడియోగ్రాఫర్ల బతుకులు ఆగం
కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్ చీకట్లు నింపింది. పెళ్లిళ్ల సీజన్లో వీడియోగ్రాఫర్లు ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుని మిగతా సమయాల్లో ఎలాగోలా కాలం వెల్లదీస్తారు. అలాంటిది కరోనా అడ్డంకులు, ఆంక్షలతో పెళ్లిళ్లు, శుభకార్యాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో పెళ్లిళ్ల గిరాకీ రాకపోవడం, మామూలు ఫొటోలు ఎవరూ దిగకపోవడం, లాక్‌డౌన్‌తో షాపులు తెరుచుకోకపోవడంతో అటు ఉపాధి కరువై ఇటు షాపుల అద్దె చెల్లించలేక, పూటగడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యానగర్(కరీంనగర్): కరోనా ప్రభావం అన్ని వర్గాలవారిపై ప్రభావం చూపిస్తోంది. ఫొటోగ్రాఫర్ వృత్తిపై సైతం ఎక్కువగానే ఉంది. స్టూడియోలు ఏర్పాటు చేసుకున్న వారికంటే పెద్ద కెమెరాలు కొనుగోలు చేసి పెళ్లిళ్ల సీజన్లో పని చేసే ఫొటోగ్రాఫర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావానికి గతంలో వలె ఆర్భాటంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగడం లేదు. దీంతో ఫొటోగ్రాఫర్లకు పని తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్ద ఫంక్షన్ల ఊసే లేకుండా పోయింది. తగ్గిన డిమాండ్.. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు సైతం మమ అన్నట్లుగా చేస్తుండటం, పెళ్లిళ్లకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో పెళ్లివారు ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో గతంలో కంటే ఒక్కో పెళ్లి ఆర్డర్లో 50 శాతం రేట్లు తగ్గించినా గిరాకీలు రావడం లేదని వాపోతున్నారు. సీజన్ ఫొటోగ్రఫీ చేసేవారు కొందరు కిస్తీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొటో స్టూడియో ఉన్నవారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇటు ఆర్డర్లు లేక, అటు కిరాయిలు కట్టలేక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి పెళ్లిళ్ల సీజన్లో లాక్డౌన్ ఆంక్షలతో వేడుకలు సాదాసీదాగా జరుపుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ సెషన్స్ లేదు. ఇరుపక్షాల నుంచి ఒక్కరితోనే ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదివరకు ఒక పెళ్లికి దాదాపు ఐదారుగురికి పని దొరికేది. ఇప్పుడు అన్ని ఒక్కడై ఫొటోలు, వీడియోలు తీసుకుంటుండడంతో మిగతావారికి పని లేకుండా పో యింది. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి. – ఆవుల నరేశ్, తారిక ఫొటో స్టూడియో, కరీంనగర్ ఫోన్లతో తీసుకుంటున్నారు కరోనా మహమ్మారితో ఎక్కువ మందిని పెళ్లిళ్లు, శుభాకార్యాలకు పిలవడం లేదు. 20, 30 మంది సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. కొంత మంది సెల్ఫోన్లలోనే ఫొటోలు తీసుకుంటున్నారు. రిసెప్షన్ వంటివి లేకుండా పోయాయి. అన్ని ఒక్కరోజు, ఒక్క దగ్గరే జరిపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో పని లేకుండా పోయిందని వీడియో, ఫొటోగ్రాఫర్లు బాధపడుతుంటే మరోపక్క కరోనా మా బతుకులను వీధిన పడేసింది. – నకిరేకొమ్ముల శ్రీనాథ్, వీడియోగ్రాఫర్, కరీంనగర్ బతుకులు రోడ్డునపడ్డాయి.. కరోనాతో గతేడాదిగా ఉపాధి కరువైంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఈ సీజన్లో కొన్ని పెళ్లిళ్లకు అడ్వాన్స్ తీసుకున్నాం. కరోనా సెకండ్‌వేవ్‌తో పెళ్లి ఊరేగింపులు లేవు, హంగామా లేదు. అంతా సాదాసీదాగా చేస్తున్నారు. దీంతో ఎవరికీ పని లేకకుండా పోయింది. మామూలు రోజుల్లో ఒక్క పెళ్లి ద్వారా 100 మందికి ఉపాధి దొరికేది. క్యాటరింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ ఇలా.. ప్రస్తుతం అందరి బతుకులు రోడ్డునపడ్డాయి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, గోగుల ఈవెంట్స్ కరీంనగర్ పోషణ కష్టమవుతోంది కరోనాతో గిరాకీ లేక కుటుంబ పోషణ కష్టమవుతుంది. పెళ్లిళ్లు జరుగుతున్నా ఒక్కరికే అవకాశం ఇస్తున్నారు. తక్కువ మందితో కార్యాన్ని కానిస్తున్నారు. కరోనాకు ముందు ఒక పెళ్లికి దాదాపు ఫొటో, వీడియోకు లక్ష రూపాయల వరకు బడ్జెట్ కేటాయించే వారు. ఇప్పుడు కేవలం పెళ్లి ఫొటోలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో అందరికీ ఉపాధి లభించడం లేదు. – బద్దరి వంశీ, వీడియోగ్రాఫర్, కరీంనగర్ చదవండి: Telangana: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
Coronavirus: చిన్నారీ.. నో వర్రీ!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ కుటుంబంలో ఒక్కరికి సోకితే మిగతా సభ్యులందరికీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెద్దల్లో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తున్నప్పటికీ... 10 సంవత్సరాలలోపు మెజార్టీ పిల్లల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని కోవిడ్ బాధితుల్లో పదేళ్లలోపు చిన్నారులు 2.9 శాతం మంది ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో కూడా మెజార్టీ పిల్లలకు లక్షణాలుండడం లేదు. త్వరలో మూడోదశ కోవిడ్–19 వ్యాప్తిపై ప్రచారం జరుగుతున్నప్పటికీ పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల వ్యాఖ్యానించడం మరింత ఊరట కలిగించే అంశం. చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌పై ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. పిల్లలతో పెద్దలకు వ్యాప్తి వాస్తవానికి వారం క్రితం వరకు పదేళ్లలోపు కోవిడ్ బాధితులు 2.7 శాతం మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వ్యాప్తి రేటు 0.2 శాతం పెరిగినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతమున్న వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే స్వభావం అధికంగా ఉండడంతో.. ఒకవేళ పిల్లలు వైరస్ బారిన పడితే.. లక్షణాల్లేక మామూలుగా తిరగడం వల్ల వారు వైరస్ వ్యాప్తికి కారకులయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తగ్గిన పాజిటివిటీ ఇక రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ నేపథ్యంలో 50 సంవత్సరాలు పెబడిన వారి పాజిటివిటీ కాస్త తగ్గింది. వయసుల వారీగా పరిశీలిస్తే సగటున 0.15 శాతం పాజిటివిటీ తగ్గగా.. 10 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలలోపు వయసున్న వారిలో మాత్రం వ్యాప్తి పెరిగినట్లు వైద్య,ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మార్గదర్శకాలు పాటించాల్సిందే.. దేశంలో ఈనెల 1నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. టీకా నిల్వలు లేకపోవడంతోనే చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశాయి. ఈ క్రమంలోనే 45 ఏండ్లు నిండిన వారికి సైతం టీకాలివ్వడం లేదు. రెండోడోసు వేసుకునే వారికి అనుమతివ్వాలని భావించినప్పటికీ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో పదిరోజుల నుంచి టీకాల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో రెండోడోసు తీసుకోవాల్సిన లబ్ధిదారులు ఇప్పటికే 5 లక్షల మంది వేచి చూస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు మూడో దశ వైరస్ వ్యాప్తి ప్రచారం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలూ కోవిడ్–19 మార్గదర్శకాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల విషయంలో ఆందోళన అవసరం లేదు కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా.. ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన ప్రకటన ప్రకారం కూడా, పిల్లల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లలకు సంబంధించి ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో చాలావరకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి సోకుతున్నవేనని తెలుస్తోంది. మా ఆస్పత్రిలో కూడా పిల్లల అడ్మిషన్లు పెద్దగా లేవు. చేరినవారు కూడా తల్లిదండ్రుల్లో సివియర్ కావడంతో అడ్మిట్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పది, పన్నెండేళ్లలోపు చిన్నారులు పెద్దగా చేరుతున్న ఉదంతాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉండడం వల్లే పెద్దగా దుష్ప్రభావాలు కనిపించడం లేదు. చాలామందిలో అసలు లక్షణాలే ఉండటం లేదు. జ్వరమొచ్చినా పారాసిటమల్, జింకోవిట్, అజిత్రాసిల్ వేసుకుంటే తగ్గిపోతుంది. లక్షణాలున్న పిల్లల్లో కూడా శాచురేషన్ డౌన్ కాకపోవడం, సీటీ విలువల్లో పెద్దగా మార్పులు లేకపోవడం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. సీటీ స్కాన్లను పరిశీలించినప్పుడు కూడా ఎక్కడా దాని దాఖలాలు ఉండటం లేదు. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా చిన్నపిల్లల వ్యాధుల్లో ఇది ఆందోళన కలిగించేదిగా ఎంత మాత్రం లేదు. ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా పిల్లల శ్వాసకోశాలపై ప్రభావం పడుతుందని అనుకోవడం లేదు. – డాక్టర్ బి.నరహరి, ఆసోసియేట్ ప్రొఫెసర్, (పీడియాట్రిక్స్), నీలోఫర్ ఆస్పత్రి రాష్ట్రంలో కోవిడ్–19 బాధితుల శాతం వయసు వారీగా వయసు శాతం 10 లోపు 2.9 11–20 10.6 21–30 21.7 31–40 21.8 41–50 17.5 51–60 14.4 61–70 7.7 71–80 2.7 81 పైబడి 0.7 -
హైదరాబాద్‌లో 36 శాతం తగ్గిన రెసిడెన్షియల్ నిర్మాణాలు
-
పరిశ్రమలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
కరోనా ఎఫెక్ట్ : లైవ్‌లో పెళ్లి.. ఆన్లైన్లో దీవెనలు
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంధువులు, స్నేహితులందరి మధ్య వైభవోపేతంగా జరగాల్సిన పెళ్లిళ్లు ఇప్పుడు లైవ్ షోల ద్వారా జరుగుతుండటంతో బంధువులు కూడా ఆన్ లైన్ లోనే దీవెనలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బెక్కల్ గ్రామానికి చెందిన చౌదరి వెంకటమ్మ–కనకయ్య దంపతుల కూతురు ఆమనికి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జీలా నిర్మల – మల్లేశం దంపతుల కుమారుడు జీలా అనిల్ (మై విలేజ్ ఫేం)తో వివాహం నిర్ణయించారు. మండల పరిధిలోని బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం కేవలం 30 మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈ వివాహాన్ని ఆన్ లైన్ లో ద్వారా లైవ్ ఇవ్వగా... బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారానే కొత్తజంటను ఆశీర్వదించారు. కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ వివాహానికి హాజరయ్యారు. చదవండి: వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక -
సెకండ్ వేవ్: లగ్గాలపై కరోనా పగ్గాలు..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డా రు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కష్టాలు తప్పవని ఫంక్షన్‌హాళ్లు, పెళ్లిళ్లకు సంబంధించిన క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. 29 నుంచి జూలై 4 వరకు ముహూర్తాలు.. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా పెళ్లి ముహూర్తాలున్నాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలుత లాక్డౌన్, అనంతరం అన్‌లాక్ తర్వాత వాణిజ్య, వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయి. అందరూ తమ వృత్తుల్లో బీజీ అవుతుండగా మళ్లీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు,వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెళ్లి ఎలా చేయాలి.. ఎంత మందిని పిలవా లి.. ఎంత మందికి భోజనాలు.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అందరూ వస్తారా అని ఇప్పటికే ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. వస్త్ర వ్యాపారులు ఖాళీగా కూర్చునే పరిస్థితి.. వివాహ ముహూర్తాలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆడ, మగ పెళ్లివారు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న వస్త్ర వ్యాపారులు కరోనా కరో నా కారణంగా గిరాకీ లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలున్నాయి. ఒక పెళ్లికి సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు విక్రయించేవారు. కరోనా సెకండ్ వేవ్‌తో శుభకార్యాలు జరగకుంటే దుకాణాల అద్దె, వర్కర్లకు వేతనాలు ఎలా చెల్లించాలో తెలియ డం లేదని వ్యాపారులు అంటున్నారు. రవాణా వ్యవస్థపై ప్రభావం.. శుభకార్యాల వల్ల ఆర్టీసీతోపాటు పలు ప్రైవేట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్టీసీ అద్దె బస్సుల చార్జీలను ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ ఆదాయం అంతగా రావడం లేదు. ప్రైవేటులో ఒక్కో వాహనానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు సుమారు 5 వేల వరకు ఉంటాయి. వీటిపై ఆధారపడిన వాహన యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధికి సెకండ్ వేవ్‌తో గండి పడింది. మూగబోనున్న బ్యాండ్ మేళం.. గృహప్రవేశాలు, వివాహాల్లో బ్యాండ్ మేళం అవసరం తప్పకుండా ఉంటుంది. ఒక్కో శుభకార్యానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో టీంలో నలుగురి నుంచి ఎనిమిది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాండ్ మేళం మూగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెకరేషన్ వారిదీ ఇదే పరిస్థితి.. శుభకార్యాల్లో డెకరేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ఇందుకోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. కరోనాతో ఈ రంగంపై ఆధారపడి బతికేవా రు ఉపాధి కోల్పోనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేల మందిపై సెకండ్ వేవ్ ప్రభావం పడనుంది. వంటవాళ్లకు గడ్డు పరిస్థితులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద కల్యాణ మండపాలు 100, మధ్య తరహావి 150 వరకు, సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థలకు అనుబంధంగా కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ మంది శుభకార్యాల సందర్భంగా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి, భోజనాలు తయారు చేయిస్తుంటారు. 1,000 మందికి భోజనం వడ్డించేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ మొత్తంలో 15 నుంచి 20 శాతం నిర్వాహకులకు ఆదాయంగా మిగులుతుంది. కరో నా కారణంగా వంట చేసేవాళ్లకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. -
ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా!
రామచంద్రపురం: పెళ్లిళ్లపై మళ్లీ కరోనా ప్రభావం పడుతోంది. రానున్న రెండు నెలల్లో బాజాబజంత్రీలు వినిపించడంపై సందేహాలు నెలకొన్నాయి. గత ఏడాది చివరి నుంచి దాదాపు మూఢం వలన ముహూర్తాలు లేవు. మే 1న మూఢం నిష్క్రమిస్తుందని ఆశ పడుతుంటే కోవిడ్–19 అశనిపాతంలా ఎదురైంది. దీంతో శుభ కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం తలెత్తుతోంది. గృహ ప్రవేశాలు చేయాలనుకునేవారు.. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారి గుండెల్లో రాయి పడింది. వీరందరూ ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకుని కొంత సొమ్ము వెచ్చించేశారు. ఇప్పుడేం చేయాలో వారికి పాలు పోవడం లేదు. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఒకటి రెండు నెలలు అంతరాయం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే, జూన్ నెలల్లో దివ్యమైన ముహూర్తాలు ఏటా మే, జూన్ నెలలు పెళ్లిళ్ల సీజను. ఈ రెండు నెలల్లో దివ్యమైన ముహూర్తాలు కుదరటంతో చాలామంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. మే 2 నుంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. 3, 4, 6, 8 తేదీల్లో ఎక్కువగా పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. 12 నుంచి 30వ తేదీ వరకూ మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. 13, 31 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంటున్నారు. జూన్ 1 నుంచి 13 వరకూ కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే నిశ్చితార్థాలు పూర్తి చేసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. ♦గత ఏడాది మార్చి నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా అక్టోబర్ వరకూ పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు జరగలేదు. ♦తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా ప్రభుత్వ అనుమతి పొంది, పరిమిత సంఖ్యలోనే హాజరై మొక్కుబడిగా నిర్వహించారు. ♦ఈ ఏడాది ఆరంభంలో చేయాలనుకున్నా మూఢం ఎదురైంది. దీంతో మే, జూన్ నెలల్లో వివాహాలు చేసేందుకు ఎక్కువమంది ఏర్పాట్లు చేసుకున్నారు. ♦సుమారు ఆరు వేల పెళ్లిళ్ల కోసం 2 వేల కల్యాణ మంటపాలకు అడ్వాన్సు చెల్లించి, బుక్ చేసుకున్నారని అంచనా. ♦విద్యుద్దీపాలంకరణకు, భారీ సెట్టింగులు, కేటరింగ్, పురోహితులకు, బ్యాండు మేళాలకు జనవరి నెలలోనే అడ్వాన్సులిచ్చేశారు. సుమారు ఆరు వేల పెళ్లిళ్లకు రూ.10 కోట్లు పైగానే ఖర్చవుతుందని భావిస్తున్నారు. ♦అన్నవరం, ద్రాక్షారామ, సామర్లకోట దేవస్థానాల్లో అత్యధికంగా పెళ్లిళ్లు చేసేందుకు కల్యాణ మంటపాలు, గదులు బుక్ అయ్యాయని ఆలయ వర్గాలు తెలిపారు. ఈ ప్రాంతాల్లో వెయ్యికి పైగా పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. కలవరపెడుతున్న కరోనా తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కొద్ది రోజులుగా కరోనా సెకండ్ వేవ్ తుపానులా విరుచుకుపడుతోంది. అధిక సంఖ్యలో కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. జనం కూడా పది మంది ఉన్నచోటకు వెళ్లడం లేదు. దీంతో పెళ్లిళ్ల నిర్వహణ డోలాయమానంలో పడింది. కల్యాణ మంటపాల్లో చేసేందుకు అధికారులు అనుమతించే పరిస్థితి లేదు. తెగించి చేసినా బంధువులు, స్నేహితులు వచ్చే పరిస్థితులు లేవు. దీంతో మళ్లీ ఎన్నాళ్లు ఎదురు చూడాలో అని వధూవరుల తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నారు ఈ ఏడాదైనా పెళ్లిళ్ల సీజన్లో కేటరింగ్ ఎక్కువగా ఉంటుందనుకున్నాం. మే, జూన్లలో కేటరింగ్ కుదుర్చుకున్న వారు ఆ సంఖ్యను రద్దు చేసుకుంటున్నారు. వెయ్యి మందికి వడ్డన పురమాయించుకున్నవారు వంద మందికి కుదించుకుంటున్నారు. – పెట్టా శంకరరావు, గౌరవాధ్యక్షుడు, జిల్లా కుకింగ్, కేటరింగ్ అసోసియేషన్, ద్రాక్షారామ ఏం చేయాలో పాలుపోవటం లేదు మా అబ్బాయి పెళ్లి మే 21న నిర్ణయించుకున్నాం. కరోనా భయంతో ఏం చేయాలో పాలు పోవటం లేదు. బంధువులు ఎక్కువ. ప్రభుత్వం వంద మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేలా లేదు. చాలా బాధగా ఉంది. – నామాల పల్లాలమ్మ, పెంకులపాటి గరువు, రావులపాలెం మండలం మే నెలంతా బుక్ చేసుకున్నారు మే నెలంతా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. వంద మంది కన్నా ఎక్కువ ఉండరాదంటున్నారు. పెళ్లిళ్లు చేసుకునే వారు ఏం చేయాలో తెలియక వచ్చి వెళుతున్నారు. గత ఏడాది కూడా ఇలానే జరిగింది. ఈసారీ మా పరిస్థితి బాగాలేదు. – కొండ్రెడ్డి లక్ష్మణరావు, వినయ్ దుర్గ ఫంక్షన్ హాల్ అధినేత, రామచంద్రపురం చదవండి: కొంపముంచిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే.. -
Oil Bulls: ఇంధనానికి కోవిడ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇంధన డిమాండ్‌కి కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో గండం వచ్చి పడింది. కోవిడ్-19 కట్టడి కోసం ఎక్కడికక్కడ లాక్డౌన్లు, ఆంక్షలు విధిస్తుండటంతో డిమాండ్ రికవరీపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు పరిమిత స్థాయిలో లాక్డౌన్లు అమలు చేస్తుండటంతో ప్రయాణాలు, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా వివిధ సమయాల్లో కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ‘ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా ముందుగా ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం కూడా దెబ్బతింటుంది‘ అని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ నెలలో సీఎన్జీ అమ్మకాలు 20-25 శాతం దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా కొత్త వాహనాలు వస్తే మార్కెట్ మరింతగా పెరుగుతుంది. కానీ లాక్డౌన్లు విధిస్తే కొత్త వాహనాల అమ్మకాలు దాదాపుగా నిల్చిపోయినట్లే అవుతుంది‘ అని మరో అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంధన వినియోగం దాదాపు 10 శాతం పెరగవచ్చని కోవిడ్-19 కేసులు విజృంభించడానికి ముందు కేంద్ర చమురు శాఖ అంచనా వేసింది. అయితే, కేసులు మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఇంధన అమ్మకాల అంచనాలను సవరించుకోవాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ద్వితీయార్థంలోనూ డౌన్ ట్రెండే! తాజాగా ఈ ఏడాది మార్చితో పోలిస్తే డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం, ఎల్పీజీకి ఏప్రిల్ ప్రథమార్థంలో డిమాండ్ తగ్గిపోయింది. డీజిల్‌కు డిమాండ్ 3 శాతం, పెట్రోల్ అమ్మకాలు 5 శాతం పడిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం కరోనాకు ఎదురీదిన ఎల్పీజీ డిమాండ్ కూడా ప్రస్తుత ఏప్రిల్ ప్రథమార్ధంలో 6.4 శాతం క్షీణించగా, విమాన ఇంధన అమ్మకాలు 8 శాతం పడిపోయాయి. మరిన్ని రాష్ట్రాలు లాక్డౌన్లను విధిస్తుండటంతో ద్వితీయార్థంలో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కఠినతరమైన ఆంక్షలు అమలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం ఇంధన డిమాండ్ 9.1 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)గణాంకాల ప్రకారం 2019-20లో నమోదైన 214.12 మిలియన్ టన్నులతో పోలిస్తే 2020-21లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 194.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. డీజిల్ వినియోగం అత్యధికంగా 12 శాతం, పెట్రోల్ డిమాండ్ సుమారు 7 శాతం తగ్గిపోయింది. చదవండి : మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్..! -
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్
-
మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్‌కు ఇబ్బందే!
సాక్షి, ముంబై: బంగారం ధర తగ్గడం వల్ల బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. బంగారం హామీగా రుణాలు ఎన్‌బీఎఫ్‌సీల ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. కాగా, బంగారాన్ని తాకట్టుగా ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం (2020–21) భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల రుణ నాణ్యతకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత కొన్ని ఆర్థిక సంవత్సరాలగా బంగారం హామీగా ఎన్బీఎఫ్సీలు ఇస్తున్న రుణ తీరును పరిశీలిస్తే, పసిడి ధరపై రుణ విలువ (లోన్-టూ-వ్యాల్యూ-ఎల్టీవీ) 75 శాతం దిగువనే ఉంది. దీనికితోడు క్రమానుగతంగా వడ్డీని సంస్థలు సక్రమంగా వసూలు చేస్తున్నాయి. ♦ 2020 డిసెంబర్ 31వరకూ పరిశీలిస్తే, ఎన్‌బీఎఫ్‌సీల సగటు ఎల్టీవీ 63 నుంచి 67 శాతం వరకూ ఉంది. అయితే కేవలం 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికాన్ని చూస్తే, ఇది 70 శాతంగా ఉంది. ♦ ఎల్టీవీ విషయంలో ఎన్బీఎఫ్సీలు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి లోన్ బుక్స్‌ను పరిశీలిస్తే, బంగారంపై వడ్డీ ఆదాయాలు స్థిర రీతిన 2 నుంచి 4 శాతంగా ఉంటున్నాయి. ♦ మరోవైపు గడచిన ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలతో పోల్చితే బంగారం హామీగా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేశాయి. వీటి ఎల్టీవీ ఏకంగా 78 నుంచి 82 శాతం వరకూ ఉంది. ♦ ఫిబ్రవరి 2021 వరకూ గడచిన 11 నెలల్లో బంగారం హామీగా బ్యాంకుల రుణ మంజూరీ దాదాపు 70 శాతం పెరిగి రూ.56,000 కోట్లకు చేరాయి. బ్యాంకులకు 90శాతం వరకూ ఎల్టీవీ వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించడం ఈ భారీ మంజూరీలకు ఒక కారణం. 2021 మార్చి 31 వరకూ బ్యాంకులకు ఈ వెసులుబాటు లభించింది. ♦ 2020 ఆగస్టు నుంచీ బంగారం ధరల 18 నుంచి 20 శాతం వరకూ పడిపోయాయి. దీనికితోడు బంగారంపై ఇచ్చిన రుణాలకు వడ్డీలు కూడా సరిగా వసూలు కాకపోతే, రుణ నాణ్యతపై కొంతమేర ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ పేర్కొన్నారు. ♦ ఆయా అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో అస్థిరతల సమస్య నుంచి బయటపడ్డానికి రెండు కీలక మార్గాలు కనబడుతున్నాయి. పటిష్టమైన ‘ఇబ్బందుల నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు’ ఇందులో ఒకటి. సకాలంలో కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేసేలా చర్యలు తీసుకోవడం రెండవ కీలక చర్య. పసిడి ధరల్లో ఒడిదుడుకులు ఇలా... కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను ‘సురక్షిత పెట్టుబడుల సాధనంగా’ పసిడి ఆకర్షించింది. గత సంవత్సరం ఆగస్టులో అంతర్జాతీయ కమోడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్-న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో ఔన్స్ (31.1గ్రాము) చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.2,089 డాలర్లను తాకింది. అయితే అమెరికా ఆర్థిక ఉద్దీపన, తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్న విశ్వాసం బలపడ్డం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి, డాలర్ ఇండెక్స్ (89 నుంచి 92 పైకి అప్) బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో పసిడి ధర క్రమంగా భారీగా తగ్గింది. ఈ వార్తరాసే సోమవారం (12 ఏప్రిల్) రాత్రి 8 గంటల సమయంలో నైమెక్స్‌లో ధర 1,733 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. ఈ స్థాయి కిందకు పడితే పసిడి మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. ప్రస్తుతం కొంచెం అటుఇటుగా రూ.46,500 వద్ద ధర ఉంటోంది. ఈ వార్త రాస్తున్న సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్-మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ధర రూ.46,578 వద్ద ట్రేడవుతోంది. ఎన్బీఎఫ్సీలు పటిష్టం: ఇండియా రేటింగ్స్ ఇదిలాఉండగా, కరోనా సెకండ్‌వేవ్‌ను తట్టుకోగలిగిన సామర్థ్యంలో ఎన్బీఎఫ్సీలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు తగిన పటిష్ట మూలధనం, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎన్బీఎఫ్సీలు కలిగి ఉన్నట్లు వివరించింది. సెకండ్ వేవ్‌తో వ్యాపార కార్యకాలాపాలకు తిరిగి కఠిన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లకు చక్కటి సేవలు అందించగలుతున్నట్లు వివరించింది. రిటైల్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రస్తుతం తాను ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే 2021-22కు హోల్‌సేల్ ఎన్‌బీఎఫ్‌సీలకు నెగటివ్ అవుట్‌లుక్‌ను కొనసాగుతుందని వివరించింది. సెకండ్‌వేవ్ విసిరే కొత్త సవాళ్లు వృద్ధి రికవరీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. -
సమాజం లో మద్యం అలవాటు ఎంతో ప్రభావం చూపుతుంది
-
కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?
కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్డిఎల్ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా, ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. -
వ్యాక్సిన్: ఊరటినిస్తోన్న మోడర్నా
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో వరుస శుభవార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే తమ కోవిడ్-19 వ్యాక్సిన్ 90 శాతానికి పైగా ప్రభావ వంతంగా ఉందని అమెరికా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. తాజాగా మరో అమెరికన్ సంస్థ మోడర్నా కీలక అడుగు ముందుకేసింది. తమ కరోనా వ్యాక్సిన్ 94 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని వెల్లడించింది. కోవ్ అని పిలుస్తున్న మూడవ దశ ట్రయల్స్ ప్రాథమిక దశ డేటా గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని వ్యాఖ్యానించింది. 95 మంది కరోనా బాధితులతోపాటు 30వేల మంది పాల్గొన్న వ్యాక్సిన్ ప్రయోగాల ఫలితాల ఆధారంగా మోడర్నా ఈ అంచనాను వెల్లడించింది.తమ మూడవ దశ ప్రాథమిక ఫలితాల్లో తమ టీకా సామర్థ్యం 94.5 శాతంగా అంచనా వేసింది. ఈ క్రమంలో అత్యవసర వినియోగం కోసం రానున్న వారాల్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దీంతో అమెరికా మార్కెట్లో కంపెనీ షేర్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సహకారంతో రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను మోడర్నా రూపొందిస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇది కీలకమైన క్షణమని మోడర్నా సీఈఓ స్టీఫేన్ బాన్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. 3వ దశ ట్రయల్స్‌లో తీవ్రమైన వ్యాధితో సహా, వ్యాధి నివారణకు సంబంధించి తొలి క్లినికల్ ఈ సానుకూల మధ్యంతర ధ్రువీకరణ అని పేర్కొన్నారు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందనే అంశం అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. ప్రతి రోజు ముఖ్యమైనదని తెలుసు.. జనవరి ఆరంభం నుండి, ప్రపంచ వ్యాప్తంగా వీలైనంత ఎక్కువమందిని రక్షించాలనే ఉద్దేశ్యంతో వ్యాక్సిన్ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశామన్నారు. మరోవైపు “నిజంగా ముఖ్యమైన మైలురాయి” అంటూ ఈ పరిణామాన్ని మోడర్నా అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ స్వాగతించారు. అలాగే రెండు వేర్వేరు సంస్థలనుంచి ఊరటనిచ్చే సానుకూల ఫలితాలు పొందడం భరోసా కలిగించేదన్నారు. -
యజమానుల్లో ‘టులెట్’ గుబులు
ఉప్పల్‌లో ఉంటున్న భీమన్న ఓ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సరిపోక అప్పు చేసి మరీ పెద్ద ఇల్లు కొని నాలుగు పోర్షన్లుగా మార్చి అద్దెకిచ్చాడు. ఆ అద్దెతో నెలవారీ ఈఎంఐ కట్టుకోవచ్చనే ధీమానే రెండేళ్లుగా ఆయన్ను నడిపించింది. అయితే కరోనా మహమ్మారితో అంతా తల్లకిందులైంది. మూడు పోర్షన్లలో కిరాయిదారులు ఖాళీ చేయడంతో ఇప్పుడు బ్యాంక్ లోన్, అప్పులు కట్టేందుకు సతమతమవుతున్నాడు. చాదర్‌ఘాట్‌లో గతంలో అద్దెకు షాపు కావాలంటే విపరీతమైన డిమాండ్ ఉండేది. రూ. లక్షల్లో అడ్వాన్స్ కడతామన్నా అనువైన ప్రాంతంలో అద్దెకు దుకాణం దొరికేది కాదు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఓ షాపును నడుపుతున్న వారు పెద్దగా వ్యాపారం జరగట్లేదని ఖాళీ చేస్తామని చెప్పగా యజమాని మాత్రం సగం అద్దె ఇచ్చినా పర్వాలేదు కానీ ఖాళీ మాత్రం చేయొద్దని బతిమిలాడుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సొంతిళ్లు, షాపుల యజమానులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పోర్షన్లను అద్దెకివ్వడం ద్వారా వచ్చే సొమ్ముతో దర్జాగా బతికిన పరిస్థితి నుంచి ఇప్పుడు కిరాయిదారుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘టులెట్ బోర్డు’లతో కాలం వెళ్లబుచ్చాల్సిన రోజులొచ్చాయని వాపోతు న్నారు. బ్యాంకు రుణాలతో కట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తారుమారు: గతంలో డిమాండ్ ఉన్న ఏరియాలు, అన్నింటికీ అందుబాటులో ఉన్న ప్రాంతా ల్లోని ఇళ్లు అద్దెకు దొరకాలంటే గగనంగా ఉండేది. అద్దె ఇళ్ల కోసం రెంటల్ ఏజెన్సీలపై కూడా కిరాయిదారులు ఆధారపడాల్సి వచ్చేది. పైగా ఓనర్లు పెట్టే ఆంక్షలు, నిబంధనలు అంగీకరించాల్సి వచ్చేది. పొద్దుపోయాక రావొద్దు.. బంధువులను పిలవకూడదు.. నీళ్ల ట్యాంకును రోజుకొకసారే నింపుతాం... ఇలా అనేక షరతులకు లోబడి అద్దెకున్న వారు ఉండేవారు. అయితే ఎప్పుడైతే కరోనా నియంత్రణకు కేంద్రం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిందో అప్పటి నుంచి ఇంటి ఓనర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధి అవకాశాలు కోల్పోయి సరైన ఆదాయం రాని వారు, చిన్నాచితకా వ్యాపారాలు చేసే వారు అద్దె కట్టే పరిస్థితులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లారు. హైదరాబాద్‌లో ఇంకా కరోనా పూర్తిగా అదుపులోకి రానందున వారిలో చాలా మంది తిరిగి నగరానికి వచ్చేందుకు జంకు తున్నారు. స్వగ్రామాల్లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. దీంతో ఇళ్ల యజమానుల పరిస్థితి తారుమారైంది. నెలవారీ అద్దెలు రాకపోవడంతో గతంలో తీసుకున్న బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నారు. సగం అద్దె ఇచ్చినా ఓకే: ఇప్పుడు కొత్తగా వచ్చే కిరాయిదారుల కోసం యజమానులు నెలల తరబడి వేచిచూడాల్సిన రోజులొచ్చాయి. దీంతో ఎవరైనా ఖాళీ చేస్తామని సూచనప్రాయంగా చెప్పినా యజమానులు కంగారుపడుతున్నారు. సగం అద్దె ఇచ్చినా పరవాలేదని బతిమాలుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. -
చవితి వేడుకలపై కరోనా ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అట్టహాసంగా జరిగే వినాయక చవితి వేడుకలకు ఈసారి కరోనా మహ మ్మారి అడ్డుపడింది. దీంతో ఈసారి కరోనా నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం, సూచించింది. వాడవాడలా వెలిసే గణేశ్ మండపాలకు పోలీసులు ఈసారి అనుమతి ఇవ్వలేదు. అయితే అపార్ట్మెంట్లు, టౌన్‌షిప్పులు, ఆలయాలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అక్కడ కూడా విగ్రహాలు మూడు అడుగులకు మించకూడదంటూ స్పష్టమైన ఆంక్షలు విధించారు. కరోనా కేసులు గ్రామాల్లో కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా మండపాల్లో ఎలాంటి డీజేలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. (ఖైరతాబాద్ గణనాథునికి 100 కేజీల లడ్డూ) మొహర్రంకు ‘కోవిడ్’ షరతులు సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో మొహర్రంను జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. మొహర్రంలో భాగంగా ఈ నెల 21 నుంచి 31 వరకు పాటించే సంతాప దినాలను జాగ్రత్తగా నిర్వహించాలని, ఆచారాల నిర్వహణకు ముతవల్లీలు, ముజావర్లు, మేనేజింగ్ కమిటీలను అనుమతించాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో లేఖ రాశారు. పీర్ల చావిడ్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ఆలంల ఏర్పాటు, అగ్ని గుండాలను అనుమతించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇచ్చే షర్బత్ లేదా ఉచిత మంచినీటి పంపిణీకి సీల్డ్ ప్యాకెట్లలో మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. -
చవితి వ్యాపారంపై కరోనా పంజా..
రాజంపేట టౌన్: ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల వ్యాపారంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవడంతో వీధుల్లో విగ్రహాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధానంగా ఇప్పటికే గణపతి విగ్రహాలు తయారు చేసిన కొంతమంది రాజస్థాన్ కళాకారులకు ఒకొక్కరికి లక్షల్లో నష్టం వాటిల్లనుంది. వినాయక చవితి ఉత్సవాలనే నమ్ముకొని అప్పులు చేసి లక్షలు పెట్టుబడి పెట్టి విగ్రహాలను సిద్ధం చేసిన కళాకారులకు ఈ ఏడాది కరోనా కారణంగా భారీగా అప్పులు మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయం, ఉపాధిపై తీవ్ర ప్రభావం.. ఈ ఏడాది æ విగ్రహాలను ఏర్పాటు చేయక పోవడం వల్ల వ్యాపారుల ఆదాయం, వివిధ రకాల కార్మికులు, కళాకారుల ఉపాధిపై కరోనా ప్రభావం తీవ్రంగానే చూపింది. ఇందులో ప్రధానంగా మండపాల నిర్మాణ కళాకారులతో పాటు కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజర్లు, సన్నాయి, బ్యాండు వాయిద్య కళాకారులు, పురోహితులు, ఎలక్ట్రీషియన్లు, ట్రాలీ ఆటో, ట్రాక్టర్ డ్రైవర్ల ఆదాయానికి కరోనా గండికొట్టింది. ∙వ్యాపారాలకు సంబంధించి ప్రధానంగా పూలు, పండ్లు, టపాసులు, రంగులు విక్రయించే వ్యాపారులపై కరోనా ప్రభావం చూపనుంది. మండపాల్లో కొలువుదీర్చే స్వామివారి విగ్రహానికి ప్రతిరోజు గజమాల వేస్తారు. అయితే కరోనా కారణంగా విగ్రహాలను ఏర్పాటు చేయక పోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న పూల వ్యాపారులు దాదాపు రెండుకోట్ల రూపాయిల మేర వ్యాపారాన్ని కోల్పోవాల్సివస్తుంది. ఫలితంగా చవితి ఉత్సవాల సందర్భంగా జరిగే అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి రూ.10 కోట్లకు పైగా వ్యాపారానికి గండి పడనుంది. రూ.15 లక్షలకు పైగా ఆదాయాన్ని కోల్పోనున్న ట్రాన్స్‌కో... విగ్రహాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు మండపాల్లో, విద్యుత్ అలంకరణకు తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంది. దీని వల్ల గత ఏడాది జిల్లాలో ఉన్న ఆరు రెవెన్యూ డివిజిన్ల పరిధిలో ట్రాన్స్‌కోకు రూ.14 లక్షలకు పైబడి ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దాదాపు రూ. 15 లక్షలకు పైగా విద్యుత్‌శాఖకు ఆదాయం వచ్చేది. అయితే ఈ ఏడాది విగ్రహాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున ట్రాన్స్‌కో రూ.15 లక్షలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. రెండు నెలలు ఇంటి ఖర్చులకు వచ్చేది.. వినాయక చవితి ఉత్సవాల్లో నేను దాదాపు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తాను. ఆ వచ్చే డబ్బులు రెండు నెలలు ఇంటి ఖర్చులన్నింటికీ సరిపోయేది. కరోనా తగ్గలేదు. ఏం చేద్దాం . – సుబ్బరామయ్య, బ్యాండ్ వాయిద్య కళాకారుడు, రాజంపేట ఎంతో ఆశ పెట్టుకున్నా.. కరోనా వల్ల ఆరు నెలల నుంచి సరైన ఆదాయం లేదు. వినాయక చవితి సమయానికి కరోనా తగ్గుతుంది, నాలుగు గిరాకీలు వస్తాయి, అంతో ఇంతో వచ్చే డబ్బులతో చేతిబదులుగా తీసుకున్న అప్పులైనా తీర్చుదామనుకొని ఉత్సవాలపై ఎంతో ఆశ పెట్టుకున్నా. కరోనా చూస్తే ఇట్టే ఉంది. ఎవరూ విగ్రహాలు పెట్టడం లేదు. – సుధాకర్, సన్నాయి వాయిద్య కళాకారుడు, రాజంపేట ఖర్చులు పోను లక్ష రూపాయిలు మిగిలేవి... ఉత్సవాల్లో మాకు మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది కనీసం రెండు నెలల ముందే ప్రోగ్రామ్స్‌కు అడ్వాన్స్‌లు కూడా ఇస్తారు. ఉత్సవాలు ముగిసే సరికి నాకు ఖర్చులన్నీ పోను దాదాపు లక్ష రూపాయలు మిగులుతుంది. ఈ ఏడాది కరోనా వల్ల లక్ష ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. – సుమన్, ఈవెంట్స్ ఆర్గనైజర్, ప్రొద్దుటూరు అన్ని రోజులు ప్రోగ్రామ్స్ ఉండేవి... తొమ్మిది రోజుల పాటు జరిగే చవితి ఉత్సవాల్లో అన్ని రోజులు నాకు ప్రోగ్రామ్స్ ఉండేవి. చవితి ఉత్సవాల సందర్భంగా కళాకారులకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇందువల్ల ఆర్గనైజర్లు డబ్బులు బాగా ఇస్తారు. నాకు చవితి ఉత్సవాల్లో రూ.50 వేల వరకు వస్తుంది. ఈఏడాది విగ్రహాలు పెట్టనందున ఆదాయం పోయినట్టే. – జ్యోతి, స్టేజీ యాంకర్, కడప -
కరోనా తల నుండి కాలివేళ్ల వరకు
కరోనా అనేది గొంతునూ, ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కొందరిలో గుండెను మాత్రమే ప్రభావితం చేస్తుందన్న విషయం కొందరికే తెలుసు. కానీ... నిజానికి కరోనా వైరస్ తల భాగం మొదలుకుని కాళ్ల వరకు అనేక అవయవాలపై తన ప్రభావం చూపుతుంది. అలాగే తలవెంట్రుకల నుంచి కాలివేళ్ల వరకు అనేక అంశాలు సైతం అది సోకే తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడం భయపడేందుకు కాదు. తెలుసుకొని ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. దేహం పైభాగం మొదలుకొని కిందివరకు ఎలా ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. అందుకే జుట్టు మొదలుకొని... కాలి గోటి వరకు అదెలా ప్రభావం చూపుతుందనే అంశాలను తెలుసుకుందాం. అవగాహన పెంచుకుందాం. ఆందోళనను దూరం చేసుకుందాం. మెదడు కరోనా కారణంగా కొందరిలో పక్షవాతం రావడాన్ని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే ఈ లక్షణం చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల క్లాట్స్ ఏర్పడి.. ఇలా జరగడం కనిపించింది. అలాగే కొందరిలో రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందక మెదడు గాయపడటం కూడా జరిగింది. నాలుక – ముక్కు కోవిడ్–19 సోకిన రోగుల్లో వాసనలూ, రుచి తెలియకపోవడం అన్నది ఒక ప్రధానమైన లక్షణం అన్నది ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ లక్షణం తగ్గిందంటే... మన వ్యాధి నుంచి క్రమంగా బయటపడుతున్నామన్నదానికి ఓ ప్రధాన సంకేతంగా పరిగణించవచ్చు. ఊపిరితిత్తులు కరోనా వైరస్ కారణంగా అత్యధికుల్లోనూ, అత్యధికంగానూ ఊపిరితిత్తులే ప్రభావితమవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. లంగ్స్‌లో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్ కారణంగా ఈ పరిణామం సంభవిస్తుంది. అలాగే నిమోనియా లాంటి పరిణామాలూ ఏర్పడుతుండటమూ తెలిసిందే. ఇక వైరస్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తం కడ్డకట్టి క్లాట్స్ ఏర్పడి... రక్తప్రవాహంతోపాటు అవి ఊపిరితిత్తుల్లోకి కొట్టుకురావడం... దాని వల్ల గాలిమార్పిడి ప్రక్రియకు అవరోధం కలగడం మనందరికీ తెలిసిందే. మూత్రపిండాలు కోవిడ్–19 వ్యాధి కారణంగా కొందరిలో మూత్రపిండాలు దెబ్బతిని ‘అక్యూట్ కిడ్నీ డిసీజ్’కు దారితీయడాన్ని నిపుణులు గుర్తించారు. ఇక అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెజర్ పడిపోవడం, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా కిడ్నీలు ప్రభావితం కావడం కనిపించింది. రోగులకు వాడే రకరకాల మందులు సైతం కిడ్నీలపై దుష్ప్రభావం చూపడం కూడా కొంత కనిపించింది. ఇక చాలామంది కోవిడ్–19 రోగుల్లో మూత్రం ద్వారా ప్రోటీన్ పోవడాన్ని వైద్యనిపుణులు తరచూ గమనించడం జరుగుతోంది. రక్తనాళాలు కోవిడ్–19 సోకిన వారిలో రక్తనాళాలు చాలా ఎక్కువగా ప్రభావితం కావడాన్ని గుర్తించారు. గతంలో కోవిడ్–19ను ప్రధానంగా శ్వాసవ్యవస్థకు చెందిన వ్యాధిగా పరిగణించేవారు కదా. అయితే ఇటీవలి అధ్యయనాల తర్వాత దీన్ని శ్వాస వ్యవస్థకు చెందిన వ్యాధిగా కంటే... ప్రధానంగా రక్తనాళాలకు చెందిన వ్యాధిగానే ఎక్కువగా గుర్తిస్తున్నారు నిపుణులు. రక్తనాళల్లోని అంతర్గత పొర అయిన ‘ఎండోథీలియమ్’ ఎక్కువగా ప్రభావితమై దెబ్బతిన్నట్లుగా, రోగుల్లో మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఇలా రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తపు క్లాట్స్... ఏయే అవయవాలకు చేరితే... ఆయా అవయవాలు బాగా దెబ్బతిన్నట్లుగా కూడా నిపుణులు గమనించారు. క్లోమగ్రంథి (పాంక్రియాస్) కోవిడ్–19 సోకాక కొందరిలో ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ కనిపించవచ్చు. కరోనా వల్ల వచ్చే అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో రక్తంలో షుగర్ అధికంగా ఉండటం, దాంతోపాటు లిపిడ్స్ అధికంగా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. ఎండోక్రైన్ సిస్టమ్ కరోనా వైరస్ సోకిన కొందరిలో రక్తంలోని చక్కెర పాళ్లు అకస్మాత్తుగా పెరగడాన్ని చాలామంది రోగుల విషయంలో డాక్టర్లు గుర్తించారు. గతంలో డయాబెటిస్ లేని చాలామంది రోగుల్లోనూ ఈ పరిణామం సంభవించడాన్ని నిపుణులు చూశారు. అదేవిధంగా షుగర్ ఉన్న వారిలో కనిపించే ‘డయాబెటిక్ కీటో అసిడోసిస్’ అనే కాంప్లికేషన్‌ను కూడా కోవిడ్–19 రోగుల్లో గుర్తించారు. కాలివేళ్ల చివరలు (కోవిడ్ టోస్) కొంతమంది రోగుల్లో కాలివేళ్ల చివర్లలో మంట, తిమ్మిర్లు కనిపించాయి. అలాగే అవి ఊదా (పర్పులు) రంగులోకి మారడమూ నిపుణులు గుర్తించారు. ఇలా జరిగే పరిణామానికి ‘కోవిడ్ టోస్’గా పేరుపెట్టారు. కొందరిలో రక్తపు గడ్డలు కాలివేళ్ల చివరలకు చేరడం వల్ల అవి ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు)లకు గురికావడం కూడా కనిపించింది. జుట్టు మీకో విషయం తెలుసా? కరోనా వైరస్ సోకుతున్న క్రమంలో అనేకానేక నిశితమైన పరిశీలనలను బట్టి చూస్తే... మామూలుగా తల నిండా ఒత్తుగా, పూర్తిగా జుట్టున్న వారితో పోలిస్తే బట్టతల (మేల్ బాల్డ్నెస్ పాటర్న్) ఉన్న వారిపై ఒకింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే అంశాన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు. బట్టతల వచ్చే అవకాశం పురుషులకే ఎక్కువ కదా. ఇలా బట్టతల ఉన్న పురుషులకే కరోనా ఎక్కువగా సోకడాన్ని వైద్యనిపుణులూ, పరిశోధకులూ ‘గాబ్రిన్’ సైన్‌గా పరిగణిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తూ మరణించిన తొలినాటి డాక్టర్లలో ఒకరైన డాక్టర్ గాబ్రిన్ పేరు మీద ఈ అంశాన్ని ‘గాబ్రిన్ సైన్’గా చెబుతున్నారు. అలాగే కరోనా వైరస్ సోకాక విపరీతంగా మానసిక ఒత్తిడికి గురైన వారిలో సైతం జుట్టు విపరీతంగా రాలిపోవడం కూడా పరిశోధకులు గమనించారు. మామూలుగానే మానసిక ఒత్తిడికి జుట్టు రాలిపోవడం సహజం. దానికి తోడు ఈ కరోనా ఒత్తిడి మరింత అధికంగా కావడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మారుతోంది. చర్మం కరోనా ప్రభావంతో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, ర్యాష్‌తో పాటు చిన్న పగుళ్లలాంటి గాయాలు, గుల్లలు, మచ్చలు, చర్మం ఎర్రబారడాలు ఇలా ఎన్నెన్నో రూపాల్లో కనిపిస్తాయి. గుండె కొన్నిసార్లు కోవిడ్–19 నేరుగా గుండెను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు... కొందరిలో గుండెపోటును పోలిన సిండ్రోమ్‌కు కారణమవుతుంది. అయితే యాంజియోగ్రామ్ చేస్తే మాత్రం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ‘క్లాట్’ కనపడదు. ఇక మరికొందరిలో ‘టెంపరరీ బెలూనింగ్’ కారణంగా ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వైరస్ వల్లగానీ లేదా క్లోరోక్విన్ వంటి మందులు వాడటం వల్లగానీ గుండె స్పందనల లయ (రిథమ్)లో తేడాలు రావచ్చు. ఇక కోవిడ్–19 సోకిన కొందరిలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం మనందరమూ చూసిందే. జీర్ణవ్యవస్థలో కోవిడ్–19 సోకిన వారిలో అందరిలోనూ కనిపించే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి సాధారణ లక్షణాలతోపాటు మరికొందరిలో నీళ్లవిరేచనాలు కావడం కూడా మామూలే. చాలామంది రోగులకు మలపరీక్ష నిర్వహించినప్పుడు వారు విసర్జించిన మలంలోనూ ‘కరోనా వైరస్’ (సార్స్ సీవోవీ–2) ఉన్నట్లు గుర్తించారు. కాలేయం కోవిడ్–19 సోకిన చాలామంది రోగుల్లో అనేక కాలేయ స్రావాలైన ఎంజైములు చాలా ఎక్కువ మొత్తంలో స్రవించిన దాఖలాలున్నాయి. అన్నట్టు... వైరస్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కాలేయ స్రావాలూ పెరగడాన్ని కూడా గమనించారు. వైరస్‌ను చంపడానికి ఇచ్చే మందులతో కాలేయం కూడా ఎంతో కొంత ప్రభావితమయ్యే అవకాశాలూ ఉన్నాయి. అందుకే అప్పటికే కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్–19 సోకినట్లయితే... వారు మెరుగుపడే అవకాశాలు మామూలు వారికంటే కాస్తంత ఆలస్యం కావడం నిపుణులు గుర్తించారు. ఇక వైరస్ కారణంగా దేహంలోని గాల్‌బ్లాడర్ సైతం ప్రభావితం కావడాన్నీ గమనించారు. మానసిక ప్రభావాలు వైరస్ సోకిన రోగుల్లో మానసిక ఒత్తిడి పెరగడం, స్పష్టత లోపించడం, అయోమయానికి గురికావడం, మెదడుకు రక్తసరఫరా తగ్గడంతో పాటు అనేక రకాల మానసిక సమస్యలు ఎదురుకావడం చాలా స్పష్టంగా కనిపించింది. ప్రత్యుత్పత్తి అవయవాలు చాలామంది మహిళా రోగుల్లో వారి గర్భం నుంచి బిడ్డకు కోవిడ్–19 సోకిన దాఖలాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇలా మనకు తెలిసిన అవయవాలనే గాక ఇంకా అనేకానేక అవయవాలను ప్రభావితం చేయడం గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇన్నిన్ని అవయవాలపై ఇన్ని రకాలుగా ప్రభావం చూపినప్పటికీ చాలా తక్కువ మందిలో మాత్రమే... అంటే దాదాపు 90 శాతం రోగుల్లో ఇది ప్రమాదకారి కానేకాదు. అయితే ఇటీవల కొందరు వ్యాధి కంటే అనవసరమైన ఆందోళనలతోనే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇన్ని అవయవాలను అది ప్రభావితం చేసినా... అసలు వ్యాధి కంటే ఆందోళనే ఎక్కువగా ప్రమాదకారి అవుతోందని గుర్తిస్తే... దాని నుంచి ముప్పే ఉండదన్న విషయం మనందరికీ స్పష్టమవుతోంది. అనేక అధ్యయనాల్లోనూ ఇది తేలింది. అందుకే విషయం తెలుసుకోండి. నిర్భయంగా ఉండండి. -
బాట మారిన బతుకు చక్రం
ఆదోని/నంద్యాల(కర్నూలు):జీవన సమరంలో అనుకోని విపత్తు. ఎన్నడూ ఎదురవ్వని పరిణామాలు. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు. అయినా బతుకు పయనం ఆగలేదు. కరోనా దారిలో కొందరు తమ బతుకు చక్రాన్ని మార్చుకుని ముందుకు సాగుతున్నారు. కోవిడ్ కట్టడికి లాక్డౌన్ విధించడంతో పరిశ్రమలు, కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు, పరిశ్రమలు, మాల్స్, వస్త్ర, బంగారు, వర్తక, వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. దీంతో జిల్లాలో వేలాది మంది చిరుద్యోగులు, దినసరి కూలీలు ఇబ్బంది పడ్డారు. తమను నమ్ముకున్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలను పోషించడానికి ప్రత్యామ్నాయంగా ఇతర వ్యాపారాలవైపు చూస్తున్నారు. అవకాశం ఉన్న వృత్తులు, వ్యాపారాలు, కూలి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బండి అదే.. వ్యాపారం వేరు లాక్‌డౌన్‌కు ముందు ఉదయం నుంచి రాత్రి వరకు తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసేవాడిని. సాయంత్రంలోగా రూ.2000 వరకు వ్యాపారం అయ్యేది. దీనిపై రూ.300 వరకు మిగులు ఉండేది. అయితే లాక్డౌన్లో ఉదయం 6 గంటల నుంచి మూడు గంటల పాటు మాత్రమే అమ్ముకోడానికి అనుమతి ఇచ్చారు. అయినా వైరస్ అంటుకుని ఉంటుందని చాలా మంది పండ్లు కొనడానికి కూడ సహసించలేదు. దీంతో వ్యాపారం తగ్గిపోయింది. పండ్లు చెడిపోవడంతో బాగా నష్టపోయాను. కొన్ని రోజులు వ్యాపారం వదిలేసి ఇంట్లో ఉన్నాను. జేబులో పైసా లేదు. అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు పస్తులుంటే ఎలా భరించగలను. నా భార్య సూచన మేరకు అదే తోపుడు బండిలో కూరగాయలు వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాను. – రాజు, వడ్డేగేరి, ఆదోని నాడు రైల్వే కూలీ.. నేడు ఉపాధి కూలీ నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన చెన్నయ్య 14 ఏళ్లుగా నంద్యాల రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయంలో రైల్వే కూలీగా పని చేసేవాడు. దీంతో అతనికి రోజూ రూ.350 – 500 కూలి వస్తుండటంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్‌డౌన్‌తో మూడు నెలలుగా రైళ్లు తిరగక పోవడం, స్టేషన్లో పని లేక కుటుంబ పోషణ భారంగా మారింది. తన స్నేహితుని సలహాతో 20 రోజుల క్రితం మండల ఉపాధి కార్యాలయానికి వచ్చి జాబ్ కార్డు పొందాడు. దీంతో ప్రతి రోజు ఉపాధి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రైల్వేలో పార్సిల్ పని కంటే ఉపాధి కూలీ పని చాలా బాగుందని, అయితే ప్రతి రోజు రూ.200 మాత్రమే వస్తుందని చెబుతున్నాడు. ఖర్చులు తగ్గించుకోవడంతో ఎలాంటి సమస్య లేదంటున్నాడు. పూలు అమ్మిన చోటే.. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన నాగలక్ష్మమ్మ టెక్కె ఎస్బీఐ ఏటీఎం వద్ద పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. నేడు కరోనా వైరస్‌తో పూలు కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో రోజు నష్టం వస్తుండటంతో పూలు అమ్మిన చోటనే అదే బండిపై కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని అండగా నిలుస్తోంది. అనుభవం లేకపోయినా.. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి చెందిన గుర్రప్ప స్థానిక గురురాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే చిన్నపాటి హోటల్ నడుపుతూ జీవనం సాగించే వారు. బ్యాంక్ కోచింగ్ సెంటర్లో విద్యార్థులు వేల సంఖ్యలో ఉండటంతో వ్యాపారం బాగానే ఉండేది. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌తో వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తేవేసిన బ్యాంక్ కోచింగ్ సెంటర్ ప్రారంభించకపోవడంతో హోటల్ వ్యాపారాన్ని మూసివేసి ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాడు హోటల్ నిర్వహించేటప్పుడు రోజుకు రూ.1500 నుంచి రూ.2 వేలు వస్తుండగా నేడు రూ.500 మిగులు కష్టమేనని, కుటుంబ పోషణ కోసం ఏదైన పని చేయాలన్న ఉద్దేశంతోనే అనుభవం లేకపోయినా ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నానని గుర్రప్ప చెబుతున్నాడు. చిల్లర దుకాణం పెట్టా లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఎక్కడో ఒకటి, అర జరిగినా ఫొటో, వీడియోలు తీయించడం లేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఫొటో, వీడియో గ్రాఫర్‌గా పని చేసిన నాకు ఎక్కడ పని లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బంతా లాక్డౌన్లో బతికేందుకు ఖర్చుయింది. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంట్లో జరుగుబాటు లేకుండా పోయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాలి. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో ఇంట్లోనే చిల్లర దుకాణం పెట్టుకున్నాను. కుటుంబం గడిచేందుకు ఇబ్బంది లేదు. కరోనా వైరస్ విస్తృతి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. స్కూళ్లు తెరుచుకుంటే పిల్లలకు రూ.వేలల్లో ïఫీజులు చెల్లించాలి. చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వ పాఠశాలకు పంపడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నాను. – లక్ష్మన్న, వీడియో గ్రాఫర్, కౌడల్‌పేట, ఆదోని ఉపాధి పనికి పోతున్నా నేను ఆదోని పట్టణంలోని గూళ్యం ఇండస్ట్రీస్‌లో 8 ఏళ్లుగా పని చేస్తున్నాను. లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో నా సొంతూరు జాలిమంచికి చేరుకొని భార్య నాగేశ్వరమ్మతో పాటు కొడుకు, కూతరుతో కలిసి ప్రస్తుతం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్తున్నాం. ఫ్యాక్టరీ నడిచే సమయంలో ఇద్దరు పిల్లలు చదువుకునేవారు. ప్రస్తుత ఇల్లు గడవకపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నాం. దీంతో రోజుకు రూ.500 కూడా రావడం లేదు. అప్పట్లో నేనొక్కడినే రోజు రూ.500–1000 వరకు సంపాదించే వాడిని. – వీరారెడ్డి, హమాలీ, ఆదోని వ్యాపారం బాగుంది ఆదోనిలోని ఓ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పని చేస్తూ రోజుకు రూ.500 నుంచి 1200 వరకు సంపాదించే వాడిని. కరోనా కారణంగా ఫ్యాక్టరీ మూతపడటంతో పని పోయింది. నాకు భార్య ముంతాజ్, కొడుకు ఇమ్రాన్, కూతురు తాహెరాబేగం ఉన్నారు. డబ్బులు లేక కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో కూరగాయలు వ్యాపారం చేపట్టా. రోజుకు రూ.220 లోపు మిగులుతోంది. ఖాళీగా ఉండటం కంటే ఇదే మేలు – రంజాన్బాషా, టెక్నీషియన్, ఆదోని కూలీగా మారి పొలానికి.. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన జయమ్మ లాక్‌డౌన్‌కు ముందు అదే కాలనీలో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగించేది. లాక్డౌన్లో మూడు నెలలు టిఫిన్ సెంటర్ మూత వేయాల్సి వచ్చింది. ప్రస్తుతంæ తెరిచినా జరగకపోవడంతో చేసేదేమీ లేక నేడు వ్యవసాయ కూలీగా మారింది. స్థానికులు సమీప గ్రామాల రైతుల పొలానికి కూలీకి వెళ్తుండగా వారితో ఆమె వెళ్తూ జీవనం సాగిస్తోంది. -
పసిడి దిగుమతులు లాక్‘డౌన్’!
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడినట్లు కనబడుతోంది. అనధికార సమాచారం ప్రకారం, 2020 మేలో దిగుమతులు 99 శాతం పడిపోయాయి. కేవలం 1.3 టన్నుల దిగుమతులు మాత్రమే జరిగాయి. 2019 ఇదే నెలలో ఈ పరిమాణం 105.8 టన్నులు. ఏప్రిల్‌లోనూ దిగుమతుల పరిమాణం క్షీణించి కేవలం 60 కిలోగ్రాములుగా నమోదయ్యింది. గడచిన దశాబ్ద కాలంలో ఇంత కనిష్ట స్థాయిలో పసిడి దిగుమతులు జరగలేదు. కోవిడ్–19 భయాందోళన నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశం పూర్తి లాక్డౌన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈ యేడాది మే వరకూ గడచిన ఐదు నెలల్లో భారత్ పసిడి దిగుమతులు 80 శాతం పతనమై 75.46 టన్నులుగా నమోదయినట్లు ఒక వార్తా సంస్థ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌లోపు డిమాండ్ పేలవమే! కాగా, సెప్టెంబర్‌లోపు ఈ రంగంలో డిమాండ్ వచ్చే అవకాశాలు కనబడ్డం లేదని ఈ రంగంలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. పలు వర్గాలు ఆర్థికపరమైన ఒత్తిడిలో ఉండడం దీనికి ఒక కారణంకాగా, ఇప్పటికే ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండడం మరో కారణమని వారు పేర్కొంటున్నారు. ఇక కోవిడ్–19 సంబంధ ఆందోళనలు ఎప్పటికి సమసిపోతాయో చెప్పలేని పరిస్థితి ఉండడం మరో ప్రతికూల అంశమని వారు తెలుపుతున్నారు. తమ ఆభరణాల విభాగం నుంచి మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఆదాయం దాదాపు 6 శాతం పడిపోయినట్లు సోమవారంనాటి తన మార్చి త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా మార్కెట్ విలువలో భారత్‌లో అతిపెద్ద ఆభరణాల సంస్థ టైటాన్ కంపెనీ పేర్కొంది. ధరలు మరింత పైకి... ఇక పసిడి ధరను చూస్తే, భారీగా పడిపోయే అవకాశాలు ప్రస్తుతం ఏమీలేకపోగా, ఔన్స్ (31.1గ్రా) ధర రికార్డుస్థాయి 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5.2 శాతంలోకి జారిపోతుందన్న ప్రపంచబ్యాంక్ అంచనాలు దీనికి నేపథ్యం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు –7.0 శాతం క్షీణిస్తే, వర్థమాన దేశాల విషయంలో ఈ క్షీణ రేటు –2.5 శాతంగా ఉంటుందన్నది అంచనా. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలను స్టాండర్డ్ చార్టర్డ్ అంచనావేస్తోంది. ఇక దేశంలోనూ డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి. ఈ వార్తరాసే సమయం మంగళవారం రాత్రి 9 గంటలకు పసిడి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ ధర 22 డాలర్లు పెరిగి 1,729 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది గరిష్ట స్థాయి 1,788 డాలర్లు. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ.573 లాభంతో రూ.46,674 వద్ద ట్రేడవుతోంది. వడ్డీరేట్లకు సంబంధించి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బుధవారంనాడు తీసుకోనున్న కీలక నిర్ణయం ఈ ధరల తాజా భారీ పెరుగుదలకు మరో నేపథ్యం. -
ఫార్మాపై ‘లాక్డౌన్’ ప్రభావం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ప్రభావం ఫార్మా అమ్మకాలపై ప డింది. ఆంక్షల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల ఏప్రిల్‌లో మందుల అమ్మకాలు 12% తగ్గాయని ఇక్వియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు మూసివేయడం, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతోపాటు తయారీ కంపెనీలకు ఉత్పత్తి, పంపిణీ, నిల్వ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు మందుల అమ్మకాలను గత మూడేళ్ల స్థాయికి దిగజార్చాయని తేలింది. ఒకటి, రెండు కీలక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులు మినహా అన్ని రకాల ట్యాబ్లెట్లు, టానిక్‌ల అమ్మకాలు పడిపోయాయని, జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలై నుంచి దేశంలో ఈ స్థాయిలో ఫార్మా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారని ఆ సర్వే వెల్లడించింది. ఆ నాలుగు కలిపి 40 శాతం తగ్గాయి వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1–5 శాతం మేర ఫార్మా అమ్మకాలు పెరుగుతాయనే అంచనా ఉండేది. అందుకు తగినట్టుగానే గత మూడేళ్లుగా ఈ రంగం అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. కానీ, లాక్డౌన్ దెబ్బతో అంచనాలు తప్పాయి. ఏకంగా మొదటినెలలోనే 12 శాతం విక్రయాలు తగ్గిపోవడం గమనార్హం. ఇక, గ్యాస్ట్రో, ఇన్ఫెక్షన్లు, నొప్పులు, విటమిన్ మాత్రల అమ్మకాలు కలిపి 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. వీటికి తోడు చర్మ వ్యాధులు, న్యూరో వ్యాధులకు సంబంధించిన మందుల అమ్మకాల్లో కూడా తగ్గుదల కనిపించగా, షుగర్, గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణకు ఉపయోగించే మందుల అమ్మకాలు మాత్రం పెరిగాయని ఇక్వియా సర్వేలో వెల్లడైంది. మందుల అమ్మకాలు తగ్గాయిలా ఆరోగ్య సమస్య తగ్గిన శాతం ఇన్ఫెక్షన్ మందులు 30.8 స్త్రీ సంబంధిత మందులు 25.5 చర్మ వ్యాధుల మందులు 23 నొప్పుల మందులు 21.6 గ్యాస్ట్రో, పేగు సంబంధిత 15.8 న్యూరో వ్యాధులు 0.5 కాగా, షుగర్ వ్యాధికి ఉపయోగించే మందులు 10 శాతం, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించేవి 13 శాతం అమ్మకాలు పెరిగాయి. -
అయితే జనవరి.. లేదంటే ఏప్రిల్
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే జనవరికల్లా దేశంలో కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గిన పక్షంలో ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అ ప్పటికీ తగ్గకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆ ర్థికరంగం క్రమంగా కోలుకునే అవకాశాలున్నా’ యని ఆర్థిక నిపుణుడు తిరుపతిరెడ్డి భీముని చె ప్పారు. కీలక రంగాలపై మరో ఆరేడు నెలల దాకా కరోనా ప్రభావం ఉంటుందని విశ్లేషించా రు. దీని నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఇప్పటి వరకు ఉన్న ‘సేవింగ్స్’ను వివిధ వర్గాల ప్రజలు జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించా రు. డిసెంబర్ చివరిదాకా వేచిచూసి, జనవరి నుంచి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నెమ్మదిగా మొదలుపెట్టొచ్చని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ చూపిన చొరవ, స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, దేశంలో ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేం దుకు విదేశాలు ఆసక్తి చూపొచ్చన్నారు. కరోనా ప్రభావం ఏయే రంగాలపై, ఏ మేరకు పడుతుందనే దానిపై వివరాలు ఆయన మాటల్లోనే.. 18 నుంచి 22% ఉద్యోగాల్లో కోత ► దేశంలోని జాబ్ మార్కెట్లో 18 నుంచి 22 శాతం ఉద్యోగాల్లో కోత పడవచ్చు. ► చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కొన్ని మూతపడే అవకాశ ముంది. ఈ రంగాల్లో 28 –33% వరకు నిరుద్యోగం పెరగవచ్చు. ► రిటైల్ ఇండస్ట్రీలో నిత్యావసర వస్తువులు మి నహా రిటైల్ రంగాలు కోలుకునేందుకు కొం త సమయం పట్టొచ్చు. కరోనా, లాక్డౌన్ ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడింది. ఈ రంగాలపై ప్రభావం అధికం.. ఆతిథ్య రంగం: పర్యాటకం, హోటళ్లు, అనుబం ధ రంగాలతో ముడిపడిన ఆతిథ్యరంగం 40 – 50 శాతం దాకా నష్టపోవచ్చు. దేశంలో జనవరి –జూన్ మధ్య అధికశాతం ప్రజలు ప్లెజర్ట్రిæప్లు, విదేశీయానాలు, టూర్లకు వెళుతుంటారు. పెళ్లి ళ్లు, ఇతర సోషల్ గ్యాథరింగ్స్ నిలిచిపోవడంతో ఈ రంగం తీవ్రంగా నష్టపోనుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలు: ప్ర స్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు కొనే వారుండ రు. నగర శివారు ప్రాంతాల్లో ఓ పెన్ ప్లాట్లకి డిమాండ్ 20–30% తగ్గొచ్చు. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశా లు తక్కువే. ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఆటోమొబైల్ రంగం: కరోనాకు ముందే ఈ రం గం కొంత ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుత పరిణా మాలతో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో ముడిసరుకులు చైనా నుంచి 35 శాతం దిగుమతి అవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి. సినిమా, టీవీ రంగాలు: సినిమాలు విడుదల కా క, టీవీ సీరియళ్ల షూటింగ్స్ జరగక కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు ఈ రంగం నష్టాలు చ విచూసే అవకాశాలున్నాయి. వీటిపై ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆధారపడిన కొన్ని లక్షల కుటుం బాలు ఆర్థికంగా ఇబ్బంది పడనున్నాయి. ‘ప్యాకేజీ’ ఫలాలు ఇప్పుడే తెలియవు.. ► కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా అది నేరుగా చిన్నతరహా పరిశ్రమలకు చేరకపోవడం వల్ల ప్యాకేజీతో వాటికి అంతగా వెసులుబాటు లభించలేదు. ఈ పరిశ్రమలు మళ్లీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలి. అందుకు బ్యాంకులు సిద్ధమేనా? అనేది తేలాలి. ► ప్రాధాన్యతారంగాలను ఎంచుకుని ఆయా రంగాల వారీగా నిర్దేశిత ప్యాకేజీలు ప్రకటించి ఉంటే బావుండేది. ► ప్రస్తుతం ఎక్కువగా నష్టపోతున్న పర్యాటక, రవాణా, ఆతిథ్య, లాజిస్టిక్స్, ఎంటర్టైన్మెంట్, వాటి అనుబంధ సహాయకరంగాలను ఆదుకోవాలి. వీటిలో పనిచేసే వారు ఉద్యోగాలు, ఉపాధి కొంతమేర కోల్పోయే అవకాశముంది. ► కేంద్ర ప్యాకేజీ వల్ల వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం లేదు. పరిశ్రమలతో పాటు ఇతర ఏయే రంగాలకు ఎలాంటి సహాయం అందింది, ఏ మేరకు కోలుకున్నాయి?, ఏ మేరకు సత్ఫలితాలొచ్చాయనేది తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. కరోనాతో అనుకూలంగా మారేవి.. ► డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది ► ఆన్లైన్ కోచింగ్‌లు, ఆన్లైన్ బోధన పెరుగుతాయి ► ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి బీమా రంగం అభివృద్ధి చెందుతుంది ► విదేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా మేకిన్ ఇండియా స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు. -
జూన్‌కు చెప్పలేం... నవంబర్‌కు ఏమో..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వీటి నిర్మాణ పనులు వర్షాకాలం ఆరంభానికి జూన్‌కు ముందే పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు కనీసం పూర్తిస్థాయి టెండర్లకు నోచుకోలేదు. అవి పూర్తయిన చోట్ల సైతం పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా, కార్మికులు, ఇసుక, సిమెంట్ కొరత, రవాణాలో జాప్యం ఆ పనులకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఆరు నెలల సమయం అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను రూ.2,681కోట్లతో చేపట్టాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తి చేశారు. అనుమతులిచ్చిన వాటిలో గోదావరి బేసిన్ పరిధిలో ఇప్పటివరకు 359 చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవగా, 40 చెక్‌డ్యామ్‌లపై ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగాయి. అవి జరగకున్నా, కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలకు పనులు కొనసాగించేందుకు అనుమతించడంతో మొత్తంగా 46చోట్ల మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. కృష్ణా బేసిన్లోనూ కేవలం 132 చోట్ల టెండర్లు పిలవగా, 25చోట్ల ఒప్పందాలు జరిగి, 18 చోట్ల పనులు ఆరంభించారు. మొత్తంగా 64చోట్ల పనులు ఆరంభమైనా అవి ప్రారంభ దశలోనే ఉన్నా యి. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యం లో పనులు వేగిరం చేసినా, కనిష్టంగా వీటిని పూర్తి చేసేందుకు 6 నెలలు.. అంటే నవంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. వానాకాలం వర్షాలు తీవ్రంగా ఉండి ఉధృత ప్రవాహాలు కొనసాగితే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కష్టతరమే కానుంది. దీంతో మళ్లీ వేసవి వస్తేకానీ పనులు పూర్తి చచేసే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. సీజన్లో సందేహమే... ఇక పనులు ఆరంభించిన చాలా చోట్ల మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కొత్త కూలీలు దొరకడం గగనంగానే ఉంది. దీనికి తోడు ఇసుక లభ్యత తగ్గిపోయింది. లభ్యత ఉన్నా, వాటి ధరలు అధికంగా ఉండటం కాంట్రాక్టర్లకు కష్టాలు తెస్తోంది. దీంతో పాటే మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా సిమెంట్ బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచి బస్తా రూ.450 వరకు విక్రయిస్తున్నారు. ఇది కూడా పనుల కొనసాగింపునకు పెద్ద సమస్యగా మారిందని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఈ సీజన్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పనులు వేగిరం చేసే అంశమై శనివారం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ శాఖ ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. పనుల వేగిరంపై మార్గదర్శనం చేయనున్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్.. కోటి మొబైళ్లు ఖరాబ్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్యమా అని విధించిన లాక్డౌన్ కారణంగా గృహోపకరణాల (ఎలక్ట్రానిక్ వస్తువులు) మరమ్మతులకు తీవ్ర జాప్యం నెలకొనేలా కనిపిస్తోంది. ప్రతీ వ్యక్తికి సాధారణ అవసరాలుగా మారిన ఫ్రిజ్, టీవీ, మొబైల్ ఫోన్లు లక్షలాదిగా రిపేర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సర్వీసుసెంటర్లు మూతపడటమే ఇందుకు కారణం. మార్చి 25 నుంచి ఇప్పటి దాకా దేశంలో లక్షన్నర ఫ్రిజ్‌లు, లక్షకుపైగా టీవీలు, కోటి వరకు మొబైల్ఫోన్లు రిపేర్లు లేక మూలనపడ్డాయట. ఈ విషయం సెల్యూలార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగదారులు, తయారీదారుల సంఘ సంయుక్త సర్వేలో వెల్లడైంది. కాలక్షేపానికీ కష్టకాలం.. కరోనా కట్టడిలో భాగంగా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కాలక్షేపానికి కనిపించిన ప్రతీసీరియల్‌ను, సినిమాను వదలకుండా చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో అందరూ చూసిన ప్రోగ్రాములను మళ్లీ చూస్తున్నారు. అలాంటి చాలా ఇళ్లల్లో టీవీలు పాడయ్యాయి. దీనికితోడు లక్షన్నర వరకు రిఫ్రిజిరేటర్లు, అరవై వేల వరకు ఏసీలు చెడిపోయాయి. స్మార్ట్పోన్లు, ఇతర మొబైల్ ఫోన్లు అన్నీ కలిపి సుమారుగా కోటి వరకు పాడై ఉంటాయని సర్వే అంచనా వేస్తోంది. ఉపాధి లేని మెకానిక్‌లు.. లాక్‌డౌన్‌తో దేశంలోని చాలా ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సేల్స్ – సర్వీసు రంగం తీవ్రంగా నష్టపోయింది. విక్రయాల మాట ఎలా ఉన్నా.. సర్వీసింగ్ చేసేందుకూ అనుమతి లేకపోవడంతో చిరు మెకానిక్‌లకు పూటగడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. కొన్ని గృహోపకరణాల సంస్థలు మాత్రం ఫోన్లో సంప్రదిస్తే.. చిన్న మరమ్మతులకు సలహాలు సూచనలు ఇస్తున్నాయి. -
కరోనా జీవన చిత్రం.. పొదుపు మంత్రం..
శరత్, సంతోషి భార్యాభర్తలు. సికింద్రాబాద్‌లోని ఓ పేరున్న హోటల్లో ఒకరు మేనేజర్, మరొకరు రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. హోటల్ మూతబడటంతో వీరికి ఏప్రిల్ నెల వేతనం అందలేదు. మరోవైపు లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఫలితంగా ఇప్పటికిప్పుడు మరో ఉద్యోగం వెతుక్కోవడం కష్టమే. దీంతో అందుబాటులో ఉన్న నగదు నిల్వలను, పీఎఫ్ విత్‌డ్రా చేస్తే వచ్చిన మొత్తాన్ని జాగ్రత్త చేసుకున్నారు. మరో నాలుగు నెలల వరకు ఈ నగదుతో జీవనం సాగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూనే ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. రాజేశ్ దిల్సుఖ్నగర్ సమీపంలోని ఓ మల్టీప్లెక్స్‌లో సూపర్వైజర్. వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలు, భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్ కాంప్లెక్స్ మూతపడింది. ఉద్యోగానికి లాక్‌పడి సరిగ్గా రెండు నెలలైంది. అప్పట్నుంచి వేతనం లేదు. దీంతో ఇద్దరు పిల్లల్ని పోషించడం ఎలా అనే ప్రశ్నతో ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేసి సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి వెళ్లిపోయాడు. పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని, చేతిలో ఉన్న సొమ్మును జాగ్రత్త చేసుకుని కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లక్షలాది కుటుంబాల జీవన చిత్రాన్ని మార్చేసింది. ఇప్పటికిప్పుడు పరిస్థితులు చక్కబడేటట్లు లేకపోవడంతో పలు రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యామ్నాయ బాట చూపిస్తూనే పొదుపు మంత్రానికి అలవాటు చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా సంస్థలు మూతపడ్డాయి. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు తదితర సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అలాగే విద్యా సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లు సైతం మూత పడ్డాయి. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇలాంటి సంస్థలు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వీటిల్లో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు సొంతూళ్ల బాట పట్టారు. ఇక్కడే స్థిరపడ్డ వారు మాత్రం రోజు వారీ ఖర్చులు భారీగా తగ్గించుకుంటూ పొదుపు జీవితానికి అలవాటు పడుతున్నారు. దాచిన సొమ్ముతో ధైర్యంగా.. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలకు దూరమయ్యారు. సడలింపులతో కొందరు తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. మరోవైపు ఆర్థిక సర్దుబాటులో భాగంగా కొన్ని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కారణాలతో ఉద్యోగాలు పోతాయనే భయం వారిలో సరికొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోతే ఎలా? అనే కోణంలో దాదాపు ప్రతి ప్రైవేటు ఉద్యోగి ఆలోచిస్తూ భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకుంటున్నాడు. చేతిలో ఉన్న నగదు, దాచిన సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేసేలా ప్రణాళిక తయారు చేసుకుంటూనే, కొత్తగా అప్పులు చేయకుండా గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈక్రమంలో దుబారా ఖర్చులకు మంగళం పాడుతూ పొదుపు బాటన పరుగులు పెడుతున్నాడు. ఇక ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోయినా, కొత్త ఉద్యోగం వెతికిపట్టుకుని అందులో ఇమిడే వరకు పట్టే ఆర్నెల్ల కాలం తన కుటుంబంతో తాపీగా బతికేలా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ఎందుకీ వృథా ఖర్చు మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. అయితే హోటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మాత్రం మార్చి 16 నుంచే మూతబడ్డాయి. సరిగ్గా 2 నెలలు పూర్తి కాగా, ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు అప్పట్నుంచి జీతభత్యాలు లేవు. ఫలితంగా కుటుంబ పోషణ గందరగోళంగా మారింది. ఈ క్రమంలో ఆయా కుటుంబాలు పొదుపుబాట పట్టాయి. అందుబాటులో ఉన్న నగదును పక్కా ప్రణాళికతో ఖర్చు పెడుతున్నాయి. కొందరికి అధికంగా టీ తాగడం అలవాటు. కానీ ప్రస్తుతం చాలా ఇళ్లలో టీ, టిఫిన్లను భారీగా తగ్గిస్తున్నారు. వీటికి బదులుగా చిరుధాన్యాలైన పెసర్లు, శనగలు, బొబ్బర్లను ఉడికించి తినడం అలవాటు చేసుకుంటున్నారు. టిఫిన్లతో పోలిస్తే వీటి ఖర్చు తక్కువే. అదేవిధంగా నూనె వేపుళ్లు, ఇతర చిరుతిళ్లకు పూర్తిగా చెక్‌పెడుతూ.. అన్నం, కూరగాయలతో కానిచ్చేస్తున్నారు. తీసుకునే ఆహారం ఒక క్రమపద్ధ తిలో భుజిస్తే ఎన్నోరకాలుగా కలిసొస్తుందనే పాఠాన్ని వంటబట్టించుకుంటున్నారు. కుటుంబ పోషణలో కీలకమైన కిరాణా సరుకులను కూడా పద్ధతిగా కొనుగోలు చేస్తూ అనవసరమైన వాటికి దాదాపు దూరమవుతున్నారు. ఇలా కొత్త తరహా జీవనానికి అలవాటు పడుతూ పొదుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. -
ఖైరతాబాద్ గణేష్‌పై కరోనా ఎఫెక్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును కమిటీ విరమించుకుంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే విగ్రహం ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. పోలీసులు అనుమతి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. ఈ నెల 18న ఖైరతాబాద్ గణేష్ విగ్రహ కర్రపూజ ప్రారంభించాలని అనుకున్నామని.. కానీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ర పూజ ని రద్దు చేశామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్ ‘సాక్షి’కి తెలిపారు. ‘‘18 తలలతో విశ్వరూప వినాయకుడు ప్రతిష్టించాలని అనుకున్నాం. ఒక్క అడుగు తో పక్కనే ఉన్న ఆలయంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. కరోనా వ్యాప్తి తగ్గితే భారీ వినాయకుడిని ప్రతిష్టించే ఆలోచన చేస్తామని’’ పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ అధికారులను కలుస్తామని తెలిపారు. అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామని సుదర్శన్ వెల్లడించారు. -
ఐస్రోపై కరోనా వైరస్ ఎఫెక్ట్
-
ప్రైవేటుకు ‘కరోనా కాటు’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ‘కరోనా కాటు’ పడింది. దీంతో యాజమాన్యాలతోపాటు వాటిలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అల్లాడిపోతున్నారు. లాక్డౌన్ కారణంగా జబ్బులొస్తున్నా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అత్యవసర కేసులు మినహా అన్ని చికిత్సలకూ బ్రేక్ పడింది. దీంతో ఆదాయం లేక ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు నిలదొక్కుకునే పరిస్థితి లేకుండా పోయింది. కార్పొరేట్ ఆసుపత్రులు ఎలాగో నెట్టకొచ్చినా, ఇప్పుడు వాటి పరిస్థితీ దిగజారింది. లాక్డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులు తీవ్ర నష్టాల్లోకి వెళ్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తన నివేదికలో వెల్లడించింది. రూ. 22 వేల కోట్ల వరకు నష్టం లాక్‌డౌన్‌తో ప్రైవేటు ఆసుపత్రుల్లో గత నెల చివరి నాటికే ఏకంగా 40 శాతం రోగుల సంఖ్య తగ్గిందని ఫిక్కి పేర్కొంది. అదే కారణంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏకంగా రూ.13,400 కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల మేరకు నష్టాన్ని ప్రైవేటు ఆసుపత్రులు మూటగట్టుకుంటాయని అంచనా వేసింది. ప్రధాన పట్టణాలు, నగరాల్లోని ఆసుప్రతులు అధికంగా నష్టపోనున్నట్టు పేర్కొంది. ఓపీలు అంతంత మాత్రంగానే ఉండటం, సర్జరీలు వాయిదా వేసుకోవడంతో నిర్వహణ నిలిచిపోయింది. వివిధ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల పనితీరుపై అధ్యయనం చేసిన ఫిక్కీ ఈ నష్టాన్ని అంచనా వేసింది. పడిపోయిన అంతర్జాతీయ ఆదాయం దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల ఏడాది ఆదాయం రూ. 2.4 లక్షల కోట్లు ఉంటుందని ఫిక్కి అంచనా వేసింది. ఒక్క హైదరాబాద్‌లో ఉండే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రులకే నెలకు అంతర్జాతీయ రోగుల ద్వారా రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. లాక్డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ప్రాణాపాయమైన అత్యవసర సర్జరీలు మినహా మిగతా వైద్యసేవలను నిలిపివేశాయి. అలాగే రోజుకు సగటున 500 మంది వరకు రోగులు ఓపీ కోసం వచ్చే కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రస్తుతం 10మంది కూడా రావడం లేదని ఫిక్కీ తెలిపింది. అలాగే డయాగ్నొస్టిక్ సెంటర్లలోనూ 80శాతం వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య తగ్గింది. ఇప్పటికే కొన్ని రంగాలకు ఆర్థిక ఉపశమనాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం హెల్త్‌కేర్‌రంగానికి కూడా ప్రకటించాలని ఫిక్కీ తన నివేదికలో సూచనలు చేసింది. ఇక దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులకు సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ పథకాల కింద ఉన్న రూ.1,700 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల మేర ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించింది. పరోక్ష పన్ను ఉపశమనాలు, మినహాయింపులు ఇవ్వడంతో పాటు కరోనా రోగుల చికిత్స కోసం అవసరమైన మందులు, వినియోగ వస్తువులు, పరికరాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపునివ్వాలని పేర్కొంది. 6 నెలలు కోలుకునే పరిస్థితి లేదు లాక్‌డౌన్‌తో అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నష్టాల్లోకి వెళ్లాయి. ఆసుపత్రులు నెలలో పూర్తిస్థాయిలో పనిచేస్తే, అందులో 25 రోజులు వచ్చే సొమ్ము శాలరీలు, నిర్వహణ ఖర్చులకే పోతుంది. మిగిలిన ఐదు రోజులు వచ్చేదే ఆదాయం. 30 రోజులు మూతపడడంతో ఆసుపత్రుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ స్కీముల కింద చేసిన చికిత్సల సొమ్ము కేవలం మా ఆసుపత్రికే రూ.80కోట్ల మేర రావాలి. లాక్డౌన్ ఎత్తేశాక కూడా ఆరు నెలలపాటు కోలుకునే పరిస్థితి ఉండదనిపిస్తోంది. కాబట్టి ఫిక్కీ నివేదిక చెబుతున్నట్లు బకాయిలు తీర్చాలి. కొన్ని మినహాయింపులనివ్వాలి. – డాక్టర్ ఎ.వి.గురువారెడ్డి, ఎండీ, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ -
వలస జీవుల దైన్యం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా లాక్డౌన్ 4 కోట్ల మంది వలస జీవుల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. కాయకష్టం చేసుకుని బతికే వారిని రోడ్డున పడేసింది. వలస కూలీల జీవితాల్లో లాక్డౌన్ అంతులేని ఆవేదనకు కారణమైందని ప్రపంచబ్యాంకు తాజాగా ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. లాక్‌డౌన్‌తో కొన్ని రోజుల వ్యవధిలోనే 50 వేల నుంచి 60 వేల మంది వలస కూలీలు పట్టణ కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశం లో అంతర్గత వలసల రేటు అంతర్జాతీయ వలసల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. అంతర్గత వలసదారులకు ఆరోగ్య సేవలు, ఆర్థిక సాయం అందించడం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితిని, సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. గతేడాది పెరిగిన అంతర్జాతీయ వలసలు: కరోనా వైరస్ సంక్షోభం దక్షిణాసియాలో అంతర్జాతీయ, అంతర్గ త వలసలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు అనుమతి కోరే వారి సం ఖ్య పెరుగుతోంది. ఇలా గతేడాది అ నుమతి కోరిన వారు 36 శాతం పెరిగి, 3.68 లక్షలకు చేరుకుంది. అలాగే పాకిస్తాన్లో వలసదారుల సంఖ్య 2019లో 63శాతం పెరిగి, 6.25 లక్షలకు చేరుకుందని ప్రపంచబ్యాంకు తెలిపింది. కరోనా మహమ్మారితో ఈ ఏడాది అంతర్జాతీయ వలసలు తగ్గుతాయని అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుతం ఆయా దేశా ల్లో ఉన్నవారు అంతర్జాతీయ విమాన సర్వీ సులు నిలిచి పోవడంతో స్వదేశానికి రాలేకపోతున్నారు. ఉపాధి కష్టమే..: ఇతర దేశాలకు వెళ్లిన వలస కార్మికులు, ఇతర ఉద్యోగులు ఆయా దేశాల్లో కరోనాతో ఏర్పడిన ఆర్థి క సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది. మన దేశం నుంచి వెళ్లిన కార్మికులు కరోనా కారణంగా ఆయా దేశాల్లోని శిబిరాల్లోనూ, వసతి గృహాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి అంటువ్యాధులను వ్యాపింపజేసే అవకాశముంది. రవాణా సేవలను నిలిపేయడం వల్ల వారంతా ఆయా దేశాల్లోని శిబిరాల్లో చిక్కుకుపోయారు. కొన్ని దేశాలు వలస కార్మికులకు వీసాల పొడిగింపునిచ్చాయి. ప్ర పంచవ్యాప్తంగా వైద్య నిపుణుల కొరత, వైద్య రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై నిర్లక్ష్యం వల్ల ఈ మహమ్మారి వి జృంభించడానికి కారణమైందని ప్రపంచబ్యాంకు పేర్కొం ది. విదేశాల నుంచి వలస వచ్చిన కార్మికులను భారతదేశం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలను ప్రస్తావించింది. -
బండి లాక్ తీయకుంటే బ్యాటరీ డౌన్
సాక్షి, హైదరాబాద్: నిత్యం రయ్యిన దూసుకుపోయే వాహనాలకు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ బ్రేక్ పడింది. లక్షలాది వాహనాలకు ‘తాళం’ పడింది. ప్రస్తుతం అత్యవసరమైతే తప్ప ఎవరూ బండి బయటకు తీయట్లేదు. రవాణాశాఖ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 55 లక్షల వాహనాల్లో 85 శాతం ఇళ్లకే పరిమితమయ్యాయి. లాక్డౌన్ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రవాణా రంగ నిపుణులు, మెకానిక్‌లు సూచిస్తున్నారు. రోజూ కొద్దిసేపు బండి బయటకు తీయాలని, ఇంజన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు, ఇంధన సంరక్షణ అంశాల పనితీరును పరిశీలించాలని అంటున్నారు. బ్యాటరీ బాగుండాలంటే.. ఎలాగూ బయటికెళ్లే అవకాశం లేదు. ఇంక బండి బయటకు తీయడమెందుకని చాలామంది భావిస్తారు. పైగా పెట్రోల్, డీజిల్ ఆదా అవుతాయని అనుకుంటారు. కానీ రోజుల తరబడి వాహనాలు నడపకపోవడం వల్ల బ్యాటరీలు చెడిపోయి త్వరగా డిశ్చార్జి అవుతాయి. ఖరీదైన కార్లకు సైతం బ్యాటరీయే కీలకం. అకస్మాత్తుగా బ్యాటరీ డిశ్చార్జి అయిపోయి నడిరోడ్డుపై వాహనం ఆగిపోతే ఆ బాధెలా ఉంటుందో చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోజులో కొద్దిసేపైనా బండిని బయటకు తీయాలి. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా కనీసం కిలోమీటర్ దూరం నడిపి తిరిగి ఇంట్లో పార్క్ చేసుకోవాలి. నిబంధనలు ఆ మేరకు కూడా అనుమతించకుంటే, కనీసం ఇంజన్ స్టార్ట్‌చేసి కొద్దిసేపు అలాగే ఆన్‌లో ఉంచాలి. ఏడాది దాటిన బ్యాటరీలైతే ఇంకా త్వరగా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త అవసరం. బ్యాటరీలు చెడిపోతే ఏసీలో గ్యాస్ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. ఇక, రోజూ వాహనాన్ని శుభ్రంగా తుడవడం వల్ల తప్పు, మరకలు పట్టవు. ఎలుకలతో జాగ్రత్త.. ♦ వాహనాలను ఎక్కువ రోజులు బయటకు తీయకపోతే ఇంజిన్ కూల్ అయిపోతుంది. అదే సమయంలో కార్ల బాయినెట్లోకి ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలు చేరవచ్చు. ఇవి ఇంజిన్ కంపార్ట్మెంట్లో వైర్లను తెంచేసే ప్రమాదం ఉంది. ♦ తెగిపోయిన వైర్ల వల్లనే చాలావరకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక్కసారైనా బాయ్నెట్ తెరిచి పరిశీలించాలి. ♦ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. వాహనాల సామర్థ్యం, తయారీకి అనుగుణంగా కనిష్ట, గరిష్ట స్థాయిలను అంచనా వేసుకోవాలి. ♦ టైర్ల నాణ్యత, మన్నిక, వాటి సామర్థ్యం మేరకు గాలిపీడనం (పీఎస్ఐ) ఉండేలా చూసుకోవాలి. ♦ ముఖ్యంగా కార్లలో ఒక్కోసారి హ్యాండ్ బ్రేక్స్ జ్యామ్ కావచ్చు. అలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా జాగ్రతలు తీసుకోవాలి. ♦ బైక్‌ల్లో పెట్రోల్ ఆఫ్‌లో ఉంచాలి. వాహనం బయటకు తీయనప్పుడు ఆన్‌లో ఉంచడం వల్ల ఇంధనం ఓవర్‌ఫ్లో అయ్యే ప్రమాదం ఉంది. ♦ బ్యాటరీ ఆధారిత వాహనాలను రోజూ కొద్దిసేపైనా బయటకు తీయాలి. ♦ ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేసేటపుడు మొదట సెల్ఫ్ స్టార్ట్ కంటే కిక్ స్టార్ట్‌ను ఉపయోగించాలి. ♦ బండి ఎండలో ఉంచితే ఇంధనం ఆవిరవుతుంది. టైర్లలో గాలి తగ్గిపోతుంది. కాబట్టి వాహనాలకు రక్షణ తొడుగులు వాడాలి. బండి నడపకుంటే బ్యాటరీకి దెబ్బే వాహనాలను రోజుల తరబడి బయటకు తీయకపోవడం వల్ల బ్యాటరీలే మొదట దెబ్బతింటాయి. కొత్త వాహనాల్లో ఈ ఇబ్బంది వెంటనే రాకున్నా ఏడాది కంటే ఎక్కువ వినియోగంలో ఉన్న వాటిలో ఈ ఇబ్బందులొస్తాయి. రోజుకు ఒక్కసారైనా బండి స్టార్ట్ చేయాలి. ఏవైనా ఇబ్బందులుంటే రెగ్యులర్ మెకానిక్‌ను ఫోన్లో సంప్రదించి సలహా తీసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ మెకానిక్‌ల సలహా, సూచనలు లభిస్తాయి. – ప్రభాకర్, సీనియర్ మెకానిక్, వీఎస్టీ -
ఐటీ రంగానికి కరోనా కాటు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ఐటీ రంగానికి శాపంగా మారింది. ఏటా సుమారు లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు సాధిస్తున్న పలు సంస్థలకు తాము పూర్తి చేయాల్సిన ఒప్పందాలకు సంబంధించిన క్లయింట్లతో సమావేశాలు వాయిదాపడ్డాయి. ఆయా దేశాల్లో తమ కంపెనీలు చేజిక్కించుకున్న ప్రాజెక్టుల పూర్తికి పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి తమ సంస్థల టెకీలను ఆయా దేశాలకు పంపించేందుకు బ్రేకులు పడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో మహానగరం పరిధిలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోంకే పరిమితం చేశాయి. దీంతో ఉత్పాదకత గతంతో పోలిస్తే మోస్తరుగా తగ్గిందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇప్పటికే తమ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయడం మరింత ఆలస్యమవుతాయని పలు సంస్థల నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ అనంతరం దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసి వర్క్ ఫ్రం హోంకు అనుమతించిన విషయం విదితమే. అయితే, ప్రస్తుత తరుణంలో ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, జరిగిన నష్టంపై నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఐటీ రంగానికి కొంగు బంగారంగా నిలిచిన హైదరాబాద్‌లో ఈ రంగం నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ రాకతో ఈ రంగం గణనీయంగా పురోగమిస్తుందని తెలిపారు. కొన్నిరోజుల పాటు అనిశ్చితి నెలకొన్నప్పటికీ త్వరలో పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2019–2020 మార్చిలో సుమారు రూ.1.07 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఐటీ రంగ సమస్యలివే.. గ్రేటర్ పరిధిలో సుమారు 900 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ కంపెనీల్లో సుమారు వంద వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బహుళజాతి కంపెనీలున్నాయి. ప్రస్తుతం కరోనా కలకలం, లాక్డౌన్ నేపథ్యంలో తాము చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు మెజారిటీ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో తమకు మోస్తరుగా నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపాయి. నష్టాలను ఇప్పుడే అంచనా వేయలేమని, ఇందుకు రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి. ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు పెరుగుతాయి ‘అమెరికాలో లక్షల మంది మంది ఐటీ ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలుకావడం, హెచ్1బీ వీసాల రద్దుపై అమెరికా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. పలు అమెరికా బహుళ జాతి కంపెనీలు మన నగరంలోని ఐటీ కంపెనీలతో పాటు పలు దేశీయ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో భారీగా ఐటీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమెరికాలో చిన్న కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను భారీగా చేపట్టాయి. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర కంపెనీలదీ ఇదే ప్రక్రియకు శ్రీకారం చుడతాయని ఆశిస్తున్నాం. ఇలా జరిగితే ఇక్కడ ఉపాధి కల్పన మరింత పెరగనుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ రంగం స్వల్ప ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఐటీ రంగం నిలకడ గల వృద్ధిని తప్పక సాధిస్తుంది. ఈ విషయంలో త్వరలో స్పష్టత రానుంది’ – మురళి, హైసియా అధ్యక్షుడు -
దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్
-
అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్
-
కోలుకొని మళ్లీ కూలిన మార్కెట్లు!
హాంకాంగ్: సోమవారం నాటి భారీ పతనం నుంచి మంగళవారం ప్రపంచ మార్కెట్లు కోలుకొని ఆ తర్వాత మళ్లీ కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి, యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోగా, అమెరికా స్టాక్ సూచీలు లాభ నష్టాల మధ్య తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు పుంజుకోవడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. అయితే చైనాలో అదుపులోకి వచ్చినా, ఇతర దేశాల్లో కోవిడ్–19 (కరోనా)వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. . కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటం, ముడిచమురు ధరల పోరు మొదలుకావడంతో సోమవారం ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మార్కెట్లన్నీ 2–8 శాతం రేంజ్లో పతనమయ్యాయి. నష్టాల్లోంచి లాభాల్లోకి..... మంగళవారం ముడిచమురు ధరలు 8% మేర ఎగియడంతో ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా ఆసియా సూచీలు పుంజుకున్నాయి. కరోనా వైరస్ మూల కేంద్రమైన వూహాన్ నగరాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందర్శించడం, గత వారమే రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి రేట్లను తగ్గిస్తుందన్న వార్తలు, వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అమెరికా ప్రభుత్వం ఉద్దీపన చర్యలు తీసుకోనున్నదన్న అంచనాలు... సానుకూల ప్రభావం చూపించాయి. సోమవారం అమెరికా మార్కెట్లు 8 శాతం మేర నష్టపోయిన నేపథ్యంలో మంగళవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. అయితే మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం రేంజ్లో లాభాల్లో ముగిశాయి. లాభాల్లోంచి నష్టాల్లోకి... ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి లాభాల్లోకి రాగా, యూరప్ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమై 1–2.5% రేంజ్ లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే ఇటలీలో కోవిడ్–19 వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య పెరగడం, ఆ దేశంలో ప్రయాణాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించడం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి మరికొంత సమయం పడుతుందనే వార్తలతో యూరప్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి. డ్యాక్స్ (జర్మనీ), క్యాక్(ఫ్రాన్స్) సూచీలు 0.7 శాతం నుంచి 1.5 శాతం రేంజ్లో నష్టాల్లో ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యలో నష్టాల్లోకి జారిపోయి, మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మొత్తం మీద తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి గం.11.30ని.)కు 0.7–1.2% రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ప్రతిరూపం... ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 1% (115 పాయింట్లు)నష్టంతో ట్రేడవుతోంది. దీంతో నేడు(బుధవారం) మన మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే అవకాశాలే అధికం గా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. -
పౌల్ట్రీ పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్
-
పడకేసిన పర్యాటకం..కుదేలైన వాణిజ్యం
కరోనా.. ఒక ఊరిని కాదు.. ఒక రాష్ట్రాన్ని కాదు.. ఒక దేశాన్ని కాదు.. ఏకంగా ప్రపంచాన్నే వణికిస్తోంది. కంటికి కనిపించని వైరస్.. కల్లోలం సృష్టిస్తోంది. ఎంతలా అంటే.. ఆత్మీయంగా పలకరించాలన్నా ఆందోళన చెందేంతగా.. ఊరు దాటి ఊరు వెళ్లాలన్నా.. ఆలోచించాల్సినంతగా.. సినిమాకి వెళ్లాలంటే సంకోచపడాల్సినంతగా.. కడుపునిండా తినాలన్నా.. కబుర్లు చెప్పుకోవాలన్నా.. ఏం చెయ్యాలన్నా.. ఏం తాకాలన్నా.. నిలువెల్లా భయం.. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు నగరంలో నమోదు కాకున్నా వాణిజ్యంపైన పంజా విసురుతోంది. టూరిజం, విదేశీయానం, పౌల్ట్రీ, మార్కెట్.. ఇలా.. ప్రతి వ్యాపారంపైనా కరోనా ప్రభావం చూపుతోంది. సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ ముప్పు నానాటికీ పెరుగుతోంది. ప్రాణాంతక వైరస్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. విద్య, వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకం.. ఇలా ప్రతి రంగాన్నీ కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా అన్ని వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్న వైరస్.. విశాఖపైనా ఉరుముతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాలున్నప్పటికీ.. దానికంటే ముందుగానే కోలుకోలేని దెబ్బతీస్తోంది. దీని దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరవడంతో మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి. నో చైనీస్ ఫుడ్ కరోనా వైరస్ నేపథ్యంలో నగరంలో చైనా ఆహార పదార్థాలు అందించే హోటళ్లు నాలుగైదు రోజులుగా వెలవెలబోతున్నాయి. చైనాకు చెందిన పలు ఫ్రాంచైజీలు వీఐపీ రోడ్డు, సిరిపురం, అశీల్‌మెట్ట మొదలైన ప్రాంతాల్లో నడుస్తున్నాయి. పూర్తిస్థాయి చైనీస్ వంటకాలు అందించేందుకు కచ్చితంగా మసాలా దినుసులతో పాటు, వివిధ సామాగ్రిని చైనా నుంచే తెప్పిస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఈ హోటళ్లకు గిరాకీ తగ్గుముఖం పట్టింది. నగరంలోని పలు రెస్టారెంట్లలో చైనా, మణిపాల్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువతీ, యువకులు పనిచేస్తున్నారు. కరోనా ప్రభావంతో వీరంతా భయాందోళనలకు గురవుతున్నారు. వామ్మో.. విదేశీ ప్రయాణమా పర్యాటక రంగం.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులపైనే ఆధారపడి ఉంటుంది. వారి నుంచే సింహభాగం ఆదాయం వస్తుంటుంది. అయితే.. కరోనా వైరస్ కారణంగా.. ఈ ఆదాయం గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. విదేశీ రాకపోకలన్నీ దాదాపుగా స్తంభించిపోయాయి. విదేశీ ప్రయాణమంటే నగర వాసులు భయపడుతున్నారు. సాధారణంగా విశాఖ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించేవారు పూర్తిగా తగ్గిపోయారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వివిధ దేశాలకు పర్యాటకులు వెళ్తుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మూడు అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఈ విమానాలన్నీ.. ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా వివిధ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. పారిశ్రామిక రంగంపైనా ప్రభావం... కరోనా వైరస్ పారిశ్రామిక రంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వివిధ విదేశీ పరిశ్రమలతో పాటు ఎంఎన్సీ కంపెనీలు విశాఖలో ఉన్నాయి. వాటికి సంబంధించిన వాణిజ్యపరమైన ఒప్పందాలు, సమావేశాలకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వ్యాపార సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. అయితే.. కరోనా వైరస్ కారణంగా.. వారు కూడా రావడం లేదు. అదేవిధంగా విశాఖ పోర్టు నుంచి వివి«ధ దేశాలకు ఎగుమతి దిగుమతులు సాగిస్తున్నాయి. అయితే.. ఇటీవల చైనా నుంచి నౌక వచ్చిన నేపథ్యంలో పోర్టు ట్రస్టు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. వివిధ దేశాల నుంచి కూడా ఎగుమతి దిగుమతులు కూడా తగ్గించడంతో సుమారు 30 నుంచి 40 శాతం రవాణా తగ్గుముఖం పట్టినట్లు అధికారికవర్గాలు చెబుతున్నాయి. వీసాలు కూడా బంద్.. దక్షిణ భారతదేశం(తెలంగాణ, ఏపీ, ఒడివా, చెన్నై) నుంచి సింగపూర్ ఎంబసీకి వారానికి 40 వేల వీసాలకు అప్లై చేస్తుంటారు. ఇప్పుడు మాత్రం కేవలం 5 వేలæ మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా మలేíÙయా ఎంబసీకి 80 వేలు వరకూ దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు వాటిసంఖ్య 6 వేలకు పడిపోయింది. ఇలా వివిధ దేశాలకు వెళ్లేందుకు చేసుకుంటున్న వీసా దరఖాస్తులు సైతం 80 శాతానికి పైగా పడిపోయాయి. పర్యాటకం విలవిల.... విశాఖ నగరం అంటేనే పర్యాటకానికి పుట్టిల్లు. అందుకే అందాల విశాఖని సందర్శించేందుకు విదేశీయులు ఎక్కువగా వస్తుంటారు. వివిధ దేశాల నుంచి ప్రతి వారం 150 నుంచి 200 మంది వరకూ విదేశీ పర్యాటకులు వస్తుంటారు. అయితే.. కరోనా ప్రభావం మన దేశంపై పడకుండా ఉండేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చేందుకు అవసరమయ్యే వీసాల జారీ ప్రక్రియని నిలిపివేసింది. ఫలితంగా పర్యాటక రంగం కుదేలైంది. వారానికి కనీసం 30 మంది కూడా రావడం లేదని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్రా యాత్రకు బ్రేకులు... ముస్లింల ఉమ్రా యాత్రకు బ్రేక్ పడింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. కరోనా నేపథ్యంలో మక్కా, మదీనా సందర్శన గత వారం రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉమ్రా యాత్రికులను ఏకంగా విమానాశ్రయాల నుంచే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. యాత్రకు వెళ్లాల్సిన వారంతా.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి... అక్కడి నుంచి ఏటా ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా వెళ్లివస్తుంటారు. ఉమ్రా వీసాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యాత్రలు సైతం వాయిదా పడి ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సౌదీ ఆరేబియాకు విజిట్ వీసాల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జూలై చివర్లో ప్రారంభం కానున్న హజ్ యాత్రపై కూడా కరోనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కోడికి కరోనా... చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారంతో పౌల్ట్రీ రంగం కుదేలైపోతోంది. చికెన్ దుకాణాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. అమ్మకాలు లేకపోవడంతో ధరలు పాతాళానికి పడిపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా.. చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్ ధర తగ్గినా.. కొనుగోలు చేసేందుకు ప్రజలెవ్వరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.200 వరకూ అమ్ముడు పోగా.. ఇప్పుడు రూ.100కి పడిపోయింది. రూ.50 కోట్లు ఆవిరి.. కరోనా ప్రభావం మార్కెట్లని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దేశంలోనూ, హైదరాబాద్‌లో కూడా కరోనా వ్యాప్తి చెందిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మదుపరుల ఆశల్ని గంగలో కలిపేశాయి. ఫార్మా, క్రూడాయిల్, సిమెంట్, ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, ఐరన్ మొదలైన రంగాల షేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. చైనాతో పాటు అనేక దేశాలకు వైరస్ విస్తరిస్తుండటంతో మార్కెట్లు తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నాయి. విశాఖ నుంచి మదుపరులు రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే.. కరోనా ఎఫెక్ట్ మార్కెట్‌పై పడటంతో.. చాలా వరకూ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. వారం రోజుల్లో నగరానికి చెందిన మదుపరులు సుమారు రూ.50 కోట్ల వరకూ నష్టపోయారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏఏ రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడుతుందో.. ఆ షేర్లని తక్కువ నష్టానికైనా అమ్మకానికి పెట్టేలా మదుపరులు నిర్ణయం తీసుకుంటున్నారు. సీజన్‌తో సంబంధం ఉందా.. ప్రస్తుతం వేసవి సీజన్ ప్రారంభమైంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదువుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో కోవిడ్–19(కరోనా) వైరస్ మనుగడ సాగించలేదని పలువురు భావిస్తున్నారు. అయితే వాతావరణంలోని ఉష్ణోగ్రతలతో సంబంధం లేకుండా వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అనుమానంతో ఆస్పత్రికి వస్తే తప్ప..స్వయంగా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కరోనా బాధితుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి ముక్కు, నోటి నుంచి బయటికి వచ్చిన స్రవాలు, తుంపర్లు గాలి ద్వారా సమీపంలో ఉన్న వారికి(అర మీటరు నుంచి 2 మీటర్ల దూరంలో)విస్తరించే అవకాశం ఉంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయట పడేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుండటం, ఆ లోపు మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు నెలలు.. పర్యాటకులంతా.. విదేశీ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడి నుంచి హాంకాంగ్, చైనా, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, ప్యారిస్.. ఇలా ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ డబ్బులతో అయిపోయే టూరిస్ట్ డెస్టినేషన్స్.. మలేíÙయా, సింగపూర్, బ్యాంకాక్ మొదలైనవి రూ.35వేల నుంచి రూ.40 వేలకు ఒక మనిషి వెళ్లి రావచ్చు. 2 మూడు రోజులు విడిది చేసేలా ప్లాన్ చేసుకుంటారు. వారంతా.. ఇప్పుడు తమ ప్లాన్లు రద్దు చేసుకుంటున్నారు. కరోనా భయంతో విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో.. ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకొని 60 నుంచి 70 శాతం పేమెంట్స్ చేసిన టూరిస్టులు కూడా తమ ప్రయాణాల్ని రద్దు చేసుకుంటూ.. డబ్బులు వాపస్ తీసుకుంటున్నారు. దీనివల్ల.. ఎయిర్ ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఒక్క బుకింగ్ కూడా రాకపోవడంతో సమ్మర్ సీజన్‌కు సంబంధించిన పర్యాటకం పూర్తిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. – మురళీ, ట్రావెల్ ఐక్యూ సంస్థ ఎండీ ఎవరూ కొనడం లేదు నెల రోజుల నుంచి చికెన్ అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. గతంలో ఆదివారం వస్తే చాలు క్షణం తీరిక లేకుండా మధ్యాహ్నం 12 వరకూ అమ్మకాలు సాగించేవాళ్లం. కరోనా వైరస్ వల్ల.. ఆదివారం రోజున 100 కేజీలు కూడా అమ్మడం గగనమైపోయింది. ఎప్పటి వరకూ ఈ పరిస్థితి ఉంటుందోనని భయమేస్తోంది. మరో నెల రోజులు ఇలాగే గడిస్తే.. మా జీవితాలు ఏమవుతాయోనని ఆందోళనగా ఉంది. – రాజు, చికెన్ వ్యాపారి పోర్టులో భద్రత కట్టుదిట్టం... కరోనాపై విశాఖ పోర్టు ట్రస్టులో పూర్తిస్థాయిలో ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. సిబ్బందికి ఎన్ 95 మాసు్కలు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజుల సెట్లు, థర్మో ఫ్లాష్ హ్యాండ్ గన్స్ అందించాం. అన్ని రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాం. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న నౌకలపైనా పటిష్ట జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యంతో కనిపిస్తే.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. – పీఎల్ హరనాథ్, విశాఖపోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ భయం లేదు.. ►కరోనా చలి ప్రదేశంలో విస్తరిస్తుంది. ఈ వైరస్ చైనాలోని వూహాన్లో పుట్టింది. ఈ సమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీలు ఉండగా, రాత్రి వేళ ఒకటి నుంచి మూడు డిగ్రీలు మాత్రమే. ఆ తర్వాత క్లోజ్ కాంటాక్ట్‌ల ద్వారా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇలా ఇప్పటి వరకు 54 దేశాలకు పాకింది. ►పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే మన రాష్ట్రంలో ఈ వైరస్ పుట్టే అవకాశం లేదు. ►ఇప్పటికే విదేశాలకు వెళ్లి.. అక్కడి బాధితులతో కలిసి పనిచేయడం, కలిసి ప్రయాణించడం, కలిసి ఉన్నవారి ద్వారా ఈ వైరస్ మన దగ్గర కూడా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశం ఉంది. ►వాస్తవానికి బాధితుడు ఇంటి నుంచి బయటికి వచ్చిన వైరస్ బయటి వాతావరణంలో 12 గంటలకు మించి జీవించలేదు. ►బాధితుడి నుంచి ఒక సారి బయటికి వచ్చిన కరోనా వైరస్ రెండు మీటర్ల దూరానికి మించి ప్రయాణించలేదు. ►గాలి ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా తక్కువ. ►క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ వైరస్ సోకాలని లేదు. ►రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలతో పాటు దీర్ఘకాలిక జబ్బులు (మధుమేహం, బీపీ, కిడ్నీ, కాలేయ, క్యాన్సర్ సంబంధ వ్యాధులు)లతో బాధపడుతున్న రోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ►పాజిటివ్ బాధితుడితో వంద మంది క్లోజ్‌కాంటాక్ట్ ఉంటే.. 81 శాతం మందికి వైరస్ సోకే అవకాశం లేదు. 14 శాతం మందికి మాత్రమే వైద్య పరీక్షలు, హోమ్ ఐసోలేషన్ అవసరం. 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ సపోర్టు చికిత్సలు అవసరం. ►స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనాలో మరణాల శాతం తక్కువే. స్వైన్‌ప్లూ బాధితుల్లో మరణాల శాతం 6 నుంచి 7 శాతం ఉంటే...కరోనాలో 3 శాతమే. ►ఈ వైరస్‌పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ అనుమానిత కేసులేనని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతున్నా విశాఖ వాసుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగడం లేదు. -
స్టాక్ మార్కెట్‌పై కరోనా ఎఫెక్ట్
ముంబై : అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావంపై ఇన్వెస్టర్ల ఆందోళనతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో మెటల్, ఆటోమొబైల్ సహా కీలక సూచీలు పతనమయ్యాయి. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోతుండగా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 235 పాయింట్ల నష్టంతో 40,906 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 69 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,029 పాయింట్ల వద్ద క్లోజయింది. చదవండి : కరోనావారి పెళ్లి పిలుపు -
ఎకానమీపై కరోనా ఎటాక్!
(సాక్షి, బిజినెస్ విభాగం): అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతటికీ తుమ్ములొస్తాయన్నది నానుడి!! అయితే, ఇప్పుడు చైనాకు వచ్చిన ‘కరోనా’ జలుబుకు ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. చైనా ‘వూహాన్’ నగరంలో మొదలైన కరోనా వైరస్ ముసలం.. దావానలంలా మరిన్ని దేశాలకు విస్తరిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి చైనాలో 100 మందికిపైగానే మరణించగా... మరో 4,500 మందికి వైరస్ సోకినట్లు అంచనావేస్తున్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పాతాళానికి పడిపోతున్న తరుణంలో కరోనా రూపంలో మరో ముప్పు ముంచెత్తుతోంది. ప్రపంచ ఎకానమీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మరోపక్క, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. అసలు ఈ వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఏంటి లింకు? స్టాక్ మార్కెట్లతో దీనికి సంబంధమేంటి? గతంలో ఇలాంటి వైరస్లు దాడిచేసినప్పుడు ఎంత నష్టం వాటిల్లింది? ఇప్పుడు పరిస్థితేంటి? ఇవన్నీ వివరించే ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... మొదట్లో ఒక్క చైనాకే పరిమితం అనుకున్న కరోనా వైరస్ ఇప్పుడు దాని సమీపంలోని దేశాలకూ వేగంగా విస్తరిస్తోంది. థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, నేపాల్, జపాన్‌లతో పాటు ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రాన్స్, అమెరికా, కెనడా, జర్మనీ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కరోనా సోకిన కేసులు నమోదవడంతో ప్రపంచమంతా బిక్కుబిక్కుమంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చైనాలో ఆరోగ్య ఎమర్జెన్సీకి ఇప్పటికే పిలుపునిచ్చింది. వైరస్ దెబ్బకు చైనాలో అనేక నగరాల్లో రాకపోకలను నిషేధించి తలుపులేసేశారు. స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించేస్తున్నారు. చివరికి స్టాక్ మార్కెట్లకు కూడా సెలవులను పొడిగించేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా చైనాకు రాకపోకలను నిలిపేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులనూ తాత్కాలికంగా ఆపేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం చూస్తే... 2019లో చైనా వార్షిక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయింది. ఇది 29 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మరోపక్క, పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.7 శాతానికి, రిటైల్ విక్రయాల వృద్ధి 8 శాతానికి దిగజారింది. కాగా, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రవాణా వ్యవస్థను నిలిపేయడంతో ఫ్యాక్టరీలకు సరఫరాలు ఆగిపోతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకపోవడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. టూరిజం పూర్తిగా దెబ్బతింది. వెరసి ఆర్థిక కార్యకలాపాలు నిస్తేజంగా మారుతున్నాయి. ఇవన్నీ చూస్తే... అక్కడి ఎకానమీ మరింత పతనం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఎకానమీపై ప్రభావం ఎంత... అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. అంతేకాదు, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా ప్రధాన వృద్ధి చోధకం కూడా. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో చైనాలాంటి భారీ ఎకానమీల్లో ఏదైనా కుదుపులు వస్తే.. ఆ ప్రకంపనలు కచ్చితంగా అన్నిదేశాలనూ వణికిస్తాయనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే చైనాతో ప్రపంచదేశాలకు వాణిజ్య సంబంధాలు చాలా ఎక్కువ. తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనా, ఇతర దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు తాత్కాలికంగా బ్రేక్ పడటం ఆయా ఎకానమీలకు నష్టం చేకూరుస్తుంది. అంతేకాదు టూరిజం, విమానయానంతో పాటు ఇంకా అనేక వ్యాపార రంగాలు దెబ్బతింటాయి. అయితే, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లుతుందనే తక్షణం అంచనాకు రాలేమని, వైరస్ వ్యాప్తి మరింత పెరిగితే నష్టం తీవ్రత ఇంకా పెరగడం ఖాయమని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. 2019 ఏడాదికి ప్రపంచ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తాజాగా 2.9%కి తగ్గించింది. అదేవిధంగా 2020 అంచనాను కూడా 6.7% నుంచి 5.9%కి కోతపెట్టింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా ఇటీవలే బ్రేక్ పడటం, ఇరాన్–అమెరికా మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగడం, జర్మనీ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ముప్పు నుంచి తప్పించుకోవడం వంటి పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు తాజాగా ర్యాలీ చేశాయి. ఇలాంటి తరుణంలో కరోనా రూపంలో హఠాత్తుగా మరో ముప్పు ముంచుకొచ్చింది. ఈ వైరస్‌కు త్వరగా పరిష్కారం కనుగొనకపోతే వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. కరోనాకు ఎంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చి, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తారనేదానిపైనే ప్రపంచ ఎకానమీకి తలెత్తే నష్టం ఆధారపడి ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే సంఘటనలేవైనా జరిగితే.... తక్షణం స్పందించేది స్టాక్మార్కెట్టే!! కరోనా వైరస్ బయటపడినప్పటినుంచీ చైనా మార్కెట్లు కుప్పకూలుతూనే ఉన్నాయి. అక్కడి ప్రధాన స్టాక్ సూచీ ‘షాంఘై కాంపొజిట్’ 5.5 శాతం మేర పతనమైంది. వాస్తవానికి ఈ నెల 24 నుంచి 30 వరకూ చైనా క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది సెలవులు ప్రకటించడంతో మార్కెట్లు కొంత ఊపిరిపీల్చుకున్నాయి. వైరస్ ముప్పు తీవ్రతతో చైనాలో ఈ సెలవులను ఫిబ్రవరి 2 వరకూ పొడిగించారు. షాంఘై స్టాక్ మార్కెట్ సెలవును ఏకంగా ఫిబ్రవరి 9 వరకూ పొడిగించడం గమనార్హం. వాస్తవానికి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లోని ఫైనాన్షియల్ మార్కెట్లోనే ఎక్కువ ప్రతికూలత ఉంటుంది. అయితే, చైనాలాంటి కీలకమైన, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఈ ఉపద్రవం చోటుచేసుకోవడం, మరణాలు అంతకంతకూ పెరగడం, ఇతర దేశాలకూ వైరస్ విస్తరించడంతో మొత్తం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని... భారత్ సహా ప్రపంచ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉండొచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీగా పడిపోయాయి. మరోపక్క, ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనాలైన పుత్తడి, కరెన్సీల(జపాన్ యెన్, అమెరికా డాలర్ వంటివి)లోకి నిధులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం రేటు మళ్లీ పుంజుకుంటోంది. మరోపక్క, ఆర్థిక మందగమనం తీవ్రమైతే డిమాండ్ పడిపోవచ్చన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది. ఇటీవలి గరిష్ట స్థాయి(బ్యారెల్‌కు సుమారు 65.65 డాలర్లు) నుంచి ఏకంగా 20 శాతం (13.5 డాలర్లు) కుప్పకూలడం గమనార్హం. అయితే, సార్స్ వైరస్ దాడి సమయంలో కూడా చైనా మార్కెట్లు తీవ్రంగా కుప్పకూలినప్పటికీ.. ఆరు నెలల్లోనే మళ్లీ కోలుకున్న సంగతిని కొంతమంది మార్కెట్ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే, తాజా కరోనా వైరస్‌కు గనుక త్వరలోనే వ్యాక్సిన్ కనుగొని... వ్యాప్తి తగ్గుముఖం పడితే మార్కెట్లపై ప్రభావం స్వల్పకాలికంగానే ఉండొచ్చనేది నిపుణుల అభిప్రాయం. అలాకాకుండా మరిన్ని దేశాలకు ఇది విస్తరించి.. మరణాలు పెరిగితే గ్లోబల్ మార్కెట్లలో పతనం తీవ్రతరం కావొచ్చని వారు పేర్కొంటున్నారు. ఏ రంగాలపై అధిక ప్రభావం... వైరస్ల ముప్పు సమయంలో టూరిజం, ట్రావెల్ రంగాలకు చెందిన హోటళ్లు, ఎయిర్‌లైన్స్ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రజల వినియోగ వ్యయం తగ్గిపోవడం వల్ల లగ్జరీ, కన్సూమర్ గూడ్స్ రంగాలు కూడా దెబ్బతింటాయి. సహజంగానే ఆయా రంగాల స్టాక్స్ తీవ్ర నష్టాలను చవిచూస్తాయి. సార్స్ ఎటాక్ సమయంలో చైనాలో రిటైల్ అమ్మకాలు తీవ్రంగా పడిపోయిన విషయం గమనార్హం. అయితే, ఫార్మా రంగం మాత్రం ఇలాంటి తరుణంలో ప్రయోజనం పొందుతుంది. వైరస్‌కు తగిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడం, ఔషధాలు, ఇతరత్రా సామగ్రి అమ్మకాలు పెరగడమే కారణం. జపాన్‌కు ‘ఒలింపిక్స్’ గుబులు! కరోనా వైరస్ కల్లోలానికి చైనా కంటే జపాన్‌కే ఎక్కువ భయం పట్టుకుంది. జపాన్ అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. అంతేకాదు.. జపాన్‌కు వచ్చే మొత్తం పర్యాటకుల్లో 30 శాతం చైనీయులే. అక్కడి పారిశ్రామిక సర్వే ప్రకారం గతేడాది విదేశీ పర్యాటకులు జపాన్‌లో వెచ్చించిన మొత్తంలో 40 శాతం చైనావాళ్లదే కావడం విశేషం. ఇప్పుడు కరోనా కారణంగా పర్యాటకానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. పరిస్థితి మరికొంతకాలం ఇలాగే కొనసాగితే తమ కంపెనీ కార్పొరేట్ కంపెనీల లాభాలతో పాటు పారిశ్రామికోత్పత్తి కూడా దెబ్బతినే అవకాశం ఉందని జపాన్ ఆర్థిక మంత్రి యసుతోషి నిషిమురా హెచ్చరించారు. ఈ ప్రభావంతో జపాన్ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగానే పతనమవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై–ఆగస్టు నెలల్లో జపాన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు కరోనా ప్రభావం ఇంకొన్నాళ్లు కొనసాగి.. వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి రాకపోతే టూరిస్టులు తగ్గిపోయే ప్రమాదం ఉందని జపాన్‌కు దిగులు పట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు అత్యధికంగా చైనా నుంచే టూరిస్టులు వస్తారని జపాన్ అంచనా వేస్తోంది. ఒకవేళ చైనా పర్యాటకుల సంఖ్య తగ్గినట్లయితే జపాన్ జీడీపీ వృద్ధి 0.2% తగ్గొచ్చనేది దైచి లైఫ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ హీడో కుమానో అంచనా. భారత్ సంగతేంటి..? కరోనా ముప్పు భారత్‌నూ వెంటాడుతోంది. చైనాతో మనకు వాణిజ్యం చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. చైనా ఆర్థిక వ్యవస్థగనుక మరింత పతనమైతే డిమాండ్ మందగించి మన ఎగుమతులు పడిపోతాయి. మరీ ముఖ్యంగా ఖనిజాలు, లోహాలు, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేకాదు చైనా నుంచి మనకు వచ్చే భారీస్థాయి దిగుమతులకూ బ్రేక్ పడితే.. దానిపై ఆధారపడిన పారిశ్రామిక రంగాల్లో ఉత్పాదకత దిగజారుతుంది. 2018–19లో చైనా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో భారత్ నుంచి ఎగుమతులు 30 శాతం ఎగబాకి 16.7 బిలియన్ డాలర్లకు చేరగా.. చైనా ఎగుమతులు 9 శాతం తగ్గి 70.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(2019–20, క్యూ2) భారత్ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి(4.5 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తి ఏడాది వృద్ధికి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు కోత పెడుతున్నాయి. తాజాగా ఐఎంఎఫ్ 2019–20 భారత్ జీడీపీ అంచనాలను 6.1 శాతం నుంచి ఏకంగా 4.8 శాతానికి తగ్గించడం గమనార్హం. ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగించి... చైనాతో వాణిజ్యం గనుక దిగజారితే.. భారత్ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ అధికారికంగా నమోదు కాలేదు. ఒకవేళ మనదగ్గర కూడా ఇది వ్యాపించి తీవ్రరూపం దాల్చితే అత్యంత దుర్భర పరిణామాలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. సార్స్, ఎబోలా ఏం చెబుతున్నాయి.. 2002–03లో ప్రపంచాన్ని వణికించిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ కూడా చైనాలోనే వెలుగుచూసింది. దీని ప్రభావంతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర నష్టాన్నే చవిచూశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం భారీగానే పడింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.85 లక్షల కోట్లు) మేర ప్రపంచ ఎకానమీకి ‘సార్స్’తో నష్టం వాటిల్లినట్లు అప్పట్లో లెక్కగట్టారు. 2003 ఏడాది రెండో క్వార్టర్లో ప్రపంచ వృద్ధి రేటుకు ఏకంగా 1 శాతం కోత పడిందని.. దీనికి అధికంగా సార్స్ ప్రభావమే కారణమని లండన్‌కు చెందిన క్యాపిటల్ ఎకనామిక్స్ అనే కన్సల్టెన్నీ ప్రతినిధి జెన్నిఫర్ మెక్‌క్యూన్ పేర్కొన్నారు. అయితే, ఆతర్వాత రికవరీ చాలా వేగంగానే జరిగిందని కూడా ఆమె గుర్తుచేశారు. మరోపక్క, 2014లో ఆఫ్రికా దేశాలను వణికించిన ఎబోలా వైరస్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపింది. ఎబోలా దాటికి లైబీరియా, సియెర్రా లియోన్, గినియాల్లో 10 వేల మందికిపైగానే చనిపోయారు. ఈ దేశాల 2015 ఏడాది జీడీపీల్లో 2.2 బిలియన్ డాలర్ల నష్టానికి ఎబోలా కారణమైందని ప్రపంచ బ్యాంక్ లెక్కతేల్చింది. ►2017లో ప్రఖ్యాత ఆర్థికవేత్తలు విక్టోరియా ఫాన్, జీన్ జేమిసన్, లారెన్స్ సమర్స్ విడుదల చేసిన ఒక పరిశోధన పత్రం ప్రకారం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమాదకరమైన వైరస్ల కారణంగా అధిక దేశాలకు అంటువ్యాధులు ప్రబలితే(పాండెమిక్ రిస్క్)... దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వార్షికంగా సుమారు 500 బిలియన్ డాలర్లు (రూ.35.5 లక్షల కోట్లు) నష్టపోవచ్చని అంచనా. ►గ్లోబల్ హెల్త్ రిస్క్ ఫ్రేమ్‌వర్క్‌పై 2016లో ఏర్పాటైన కమిషన్ అధ్యయనం ప్రకారం.. వివిధ దేశాల్లో తలెత్తే అంటువ్యాధుల వల్ల 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టం 6 ట్రిలియన్ డాలర్లకు పైగానే(ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) ఉండొచ్చని అంచనా. మన కరెన్సీలో చూస్తే నష్టం విలువ రూ.426 లక్షల కోట్ల కింద లెక్క!! యాపిల్‌కూ దెబ్బ... కరోనా.. టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌నూ వెంటాడుతోంది. ఎందుకంటే వైరస్ ఎక్కడైతే మొదలైందో ఆ వుహాన్ నగరంలోనే యాపిల్ ఫోన్ల కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు అతిపెద్ద ప్లాంట్ ఉంది. చైనా కొత్త సంవత్సరం సెలవులపై చుట్టుపక్కల తైవాన్ ఇతరత్రా దేశాలకు వెళ్లిన ప్లాంట్ సిబ్బందిని ఇప్పుడప్పుడే వెనక్కిరావద్దని ఫాక్స్‌కాన్ హెచ్చరించింది. కొద్దిరోజులు ఇక్కడిప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోనుంది. ఇక యాపిల్ ఉత్పత్తుల తయారీపై చైనాలో 50 లక్షల ఉద్యోగులు ఆధారపడ్డారు. యాపిల్‌కు సొంత సిబ్బందే చైనాలో 10 వేల మందికిపైగా ఉన్నారు. అంతేకాదు యాపిల్ ఉత్పత్తుల్లో 90% చైనాలోనే తయారవుతున్న నేపథ్యంలో వైరస్ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించకపోతే ప్లాంట్ల మూసివేతతో తీవ్ర నష్టమే తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క, ఐఫోన్ అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో రిటైల్ సేల్స్ పడిపోవచ్చని అంటున్నారు. ఇక తమ ప్రజలు చైనాకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం సహా అనేక కంపెనీలు ట్రావెల్ అలెర్ట్‌ను కూడా ప్రకటించాయి. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ మాత్రం గురువారం లాభపడింది. దీంతో మూడు రోజుల సెన్సెక్స్, నాలుగు రోజుల నిఫ్టీ నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభపడటం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల (ఇంట్రాడేలో)మేర పతనమైనా, ముడి చమురు ధరలు 1 శాతం మేర(ఏడు వారాల కనిష్ట స్థాయికి) పతనం కావడం, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్‌ల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం.... సానుకూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా స్టాక్ సూచీల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో 299 పాయింట్ల మేర లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 271 పాయింట్లు పెరిగి 41,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,180 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆసియా మార్కెట్లకు ‘కరోనా’ దెబ్బ.. కరోనా వైరస్ చైనాలో మరింత ప్రబలడం, ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ సంబంధిత కేసులు వెలుగులోకి రావడంతో ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ సూచీలు 2.75% నష్టపోయాయి. నేటి నుంచి ఐటీఐ ఎఫ్‌పీఓ ►ప్రభుత్వ రంగ ఐటీఐ కంపెనీ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28న పూర్తయ్యే ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.1,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఇష్యూకు ప్రైస్‌బాండ్‌గా రూ.72–77ను కంపెనీ నిర్ణయించింది. ►ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో (డెట్) విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)ల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. -
తూతూ మంత్రం.. ‘ప్లాస్టిక్ నిషేధం’
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరిస్తే తప్ప ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేలా లేదు. ఎక్కడ చూసిన విరివిగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. ప్లాస్టిక్ మట్టిలో కలిసే పదార్థం కాదు. దీంతో పర్యావరణంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వ్యాపారులు, వినియోగదారులు పట్టించుకోవడంలేదు. విచలవిడి వినియోగంతో మానవాళి మనుగడకు పెనుముప్పుగా మరిందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేనా? పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీలో ప్లాస్టిక్ వినియోగం పై నిషేధిస్తున్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో అధికారులు దుకాణాల యజమానులకు నోటీసులు అందజేశారు. ఇందుకు సహకరించాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. తొమ్మిది నెలలు దాటినా ప్రజలు, వ్యాపారులు ఈ విషయంపై స్పందించడం లేదు. వ్యాపారులు యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నారు. ఫాలిథిన్ కవర్ల వినియోగంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముందుగా కవర్ల వాడకాన్ని నిషేధిస్తు జ్యూట్ బ్యాగులు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. మార్కెట్లో ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగించని బ్యాగుల వినియోగం పెంచాలి. వ్యాపారులను హెచ్చరించడంతో పాటు బ్యాగులు అందుబాటులో ఉండేలా చూస్తే ఫాలిథిన్ కవర్ల వినియోగాన్ని అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై నోటీసులు అందజేశాం పేటలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై వ్యాపారులు, దుకాణాల యజమానులకు గతంలోనే నోటీసులు అందజేశాం. ప్రజలు, వ్యాపారులు సహకరించాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. – నర్సింహాగౌడ్, ఈఓ, పెద్దశంకరంపేట -
బీజేపీకే మఠాల మద్దతు..!
-
మార్కెట్‌పై ‘కొరియా’ ఎఫెక్ట్
♦ హైడ్రోజన్ బాంబ్ ప్రయోగంతో మళ్లీ పెరగనున్న ఉద్రిక్తతలు ♦ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రభావం కూడా ♦ ఈసీబీ వ్యాఖ్యలపై అందరి దృష్టి ముంబై: ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్ ప్రయోగం.. ఈ వారం ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్‌పై కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశముందని నిపుణులంటున్నారు. దీంతోపాటు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, సేవల రంగ సంబంధిత గణాంకాల ప్రభావం కూడా మార్కెట్ గమనంపై ఉంటుందని వారంటున్నారు. ఇవేకాకుండా...అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు.. తదితర అంశాలు స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మళ్లీ యుద్ధ మేఘాలు... ఉత్తర కొరియా తాజాగా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించడం, తమ దగ్గర హైడ్రోజన్ బాంబ్ ఉందని వెల్లడించడం స్టాక్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపనున్నది. గత వారం తగ్గాయనుకున్న అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఉత్తర కొరియా తాజా అణ్వస్త్ర పరీక్షతో మళ్లీ పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ ట్రెండ్ ప్రకారం.... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం, ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న కంపెనీల క్యూ1 ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని సిస్టమాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ సంస్థ హెడ్ (రీసెర్చ్అండ్ ఫండ్స్) అరుణ్ గోపాలన్ చెప్పారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు. ఈ వారంలో వివిధ ఆర్థిక గణాంకాలు వెల్లడవుతాయని, అయితే ఈ గణాంకాలేవీ మార్కెట్ పురోగమనాన్ని అడ్డుకోలేవని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(పీసీజీ, క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ) వి.కె. శర్మ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు నెల సేవా రంగానికి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాలు మంగళవారం (ఈ నెల 5న) వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు సంభవిస్తే అది మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. కీలకంగా ఈసీబీ వ్యాఖ్యలు... అమెరికాలో ఉద్యోగ వృద్ధి మందగించిందంటూ గత శుక్రవారం వెలువడిన గణాంకాలకు సోమవారం మన మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. ఈ ఏడాది జూన్, జూలైలో వ్యవసాయేతర ఉద్యోగాలు 4 లక్షల వరకూ పెరగగా, ఈ ఏడాది ఆగస్టులో 1.56 లక్షలు మాత్రమే పెరిగాయి. దీంతో ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని నిపుణులంటున్నారు. ఇక రెండు రోజుల యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశ నిర్ణయ ఫలితం గురువారం(ఈ నెల7న) వెలువడుతుంది. వడ్డీరేట్లపై యథాతథ స్థితినే ఈసీబీ కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే ఈసీబీ చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. నెలవారీ బాండ్ల కొనుగోళ్లను వచ్చే నెల నుంచి తగ్గించనున్నట్లు ఈసీబీ వెల్లడిస్తుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డెట్ మార్కెట్లోకి జోరుగా విదేశీ పెట్టుబడులు భారత డెట్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. గత నెలలో డెట్‌మార్కెట్లో ఎఫ్‌పీఐలు 240 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల డెట్ పెట్టుబడులు 2,000 కోట్ల డాలర్లకు పైగా పెరిగాయి. వరుసగా ఏడో నెలలోనూ డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐల జోరు కొనసాగింంది. అయితే గత నెలలో స్టాక్‌మార్కెట్ నుంచి మాత్రం 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
ఏడడుగుల దారిలో జీఎస్టీ ముళ్లు
ఈ నెలలో వందలాది వివాహ వేడుకలు.. తప్పించుకోలేని ఖర్చులు అనేకం.. తల్లిదండ్రులకు భారంగా నగదు కొరత.. వచ్చే ఫిబ్రవరిలోనే మళ్లీ ముహూర్తాలు కల్యాణ మండపాల్లో 85 శాతం బుక్ ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పెళ్లంటే సందళ్లు, పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, భాజాలు, భజంత్రీలు, మూడే ముళ్లు, ఏడే అడుగులు అని ఒక సినీ కవి తేలిగ్గా చెప్పేశాడు. కానీ పెళ్లంటే ప్రస్తుత రోజుల్లో తలప్రాణం తోకకొస్తోందని తల్లిదండ్రులు హడావుడి పడిపోవడం చూస్తూనే ఉంటాం. పెళ్లి అనగానే పసుపుకొట్టడం నుంచి అప్పగింతల వరకూ ఎన్ని కష్టాలు, ఎంత ఒత్తిడి ఉంటుందో పెళ్లి వేడుకలు పెట్టుకున్నవారికే తెలుస్తుంది. ముహూర్తాలు కుదిరిన నాటి నుండి ఇక వారి హడావుడి చెప్పనే అక్కర లేదు. శుభలేఖల నుంచి తమ స్థోమతు బంధుమిత్రులకు తెలియచేయడానికి చేయాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏ కల్యాణ మండపంలో పెళ్లి చేయాలి, వాటికి పచ్చిపూలతో అలంకరణ చేయాలా, విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలా, ఎంతమందిని పిలవాలి, ఎంతమంది వస్తారు, విందులో ఏమేమి పదార్థాలు పెట్టాలి, బంధువులకు సమర్పించాల్సిన లాంఛనాలు, పెళ్లికి హాజరయ్యే బంధుమిత్రులకు ఏ బహుమతులు ఇవ్వాలి ఇలా అనేక ఆలోచనలు వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా వధూవరుల తల్లిదండ్రులకు ఇప్పుడు కొత్తగా ఒక సమస్య వచ్చిపడింది. అదే కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన జీఎస్టీ. నగదు కొరత దీనికి తోడయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ముహూర్తాలు లేవు.. ఈ నెలలో 16, 17, 18 తేదీలతో పాటు 23, 24, 31 తేదీల్లో మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అనంతరం వచ్చే భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో సరైన ముహూర్తాలు లేకపోవడంతో సంబంధాలు కుదుర్చుకున్న వారు ఈ నెలలోనే వివాహ వేడుకలు కూడా పెట్టుకున్నారు. అక్టోబర్ 12 నుండి నవంబర్ 9వ తేదీ వరకూ గురు మూఢమి, నవంబర్ 28 నుంచి శుక్రమూఢమి రావడంతో వచ్చే ఫిబ్రవరి వరకూ అడపాదడపా తప్ప ముహూర్తాలు లేకపోవడం కూడా ఈ శ్రావణ మాసంలోనే అధికంగా పెళ్లిళ్లు జరిపేయడానికి కారణంగా భావించవచ్చు. బుక్కైపోయిన కళ్యాణ మండపాలు.. శ్రావణ మాసం తరువాత వివాహాలకు ముహూర్తాలు లేకపోవడంతో ఈ మాసంలోనే అధికంగా పెళ్లిళ్లు చేయడానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 800 కల్యాణ మండపాల్లో దాదాపు 85 శాతం మండపాలు మంచి ముహూర్తాల రోజుల్లో బుక్కైపోయాయి. ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టుకునే వారికి మంచి కల్యాణ మండపాలు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. జీఎస్టీతో తడిసి మోపెడు ఖర్చులు.. అంతాబాగానే ఉన్నా ప్రస్తుతం పెళ్లి వేడుకలు పెట్టుకున్న వారిపై జీఎస్టీ ప్రభావం పడడంతో పెళ్లి ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. వివాహ వేడుకలకు కచ్చితంగా కావాల్సిన ప్రతీ వస్తువుపై జీఎస్టీ ప్రభావం పడడంతో పెళ్లి బడ్జెట్ అనుకున్న దాని కంటే సుమారు రూ. 50 వేల నుండి రూ. 2 లక్షల వరకూ అదనంగా అవుతోంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీ కల్యాణ మండపాల్లోనే వేడుకలు చేయడానికి ప్రయత్నించడంతో వాటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న ఏసీ కల్యాణ మండపాల కనీస అద్దె సుమారు రూ. 30 వేలు ఉండగా పెద్దపెద్ద ఏసీ కళ్యాణ మండపాల అద్దెలు సుమారు రూ. లక్ష నుండి రూ. 2 లక్షల మధ్య ఉంటున్నాయి. వాటికి పచ్చిపూలతో అలంకరణ చేయాలన్నా, విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలన్నా సుమారు రూ. 15 వేల నుండి రూ. 75 వేల వరకూ అడుగుతున్నారు. ఇక భోజనాల విషయానికి వచ్చే సరికి మధ్యతరగతి ప్రజలు ఆకుల్లో కనీసం మూడు రకాల స్వీట్లు, రెండు రకాల హాట్లు పెట్టడం సంప్రదాయంగా మారిపోయింది. వారి తాహతును బట్టి పప్పు, రెండుమూడు రకాల కూరలు, వేపుళ్ళు, ఉలవచారు, సాంబారు ఇలా పదార్థాల జాబితా ఎక్కువగానే ఉంటోంది. వీటన్నింటినీ తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకులపై జీఎస్టీ పడడంతో వాటి ధరలకు రెక్కలు వచ్చి కొనుగోలు చేయడానికి మరింత అధికంగా సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే వివాహ వేడుకల్లో ప్రధాన భూమిక వహించే బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలపై కూడా జీఎస్టీ పడడంతో ఖర్చు మరింతగా పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త కరెన్సీని కేంద్ర ప్రభుత్వం అరకొరగా విడుదల చేయడంతో బ్యాంకుల్లో తమ వద్ద నిల్వ ఉన్న సొమ్మును ఆయా ఖర్చులకు తీసుకోవాలనుకున్నా బ్యాంకు అధికారులు ఖాతాదారులకు అవసరమైనంత సొమ్ము ఇవ్వలేకపోతున్నారు. దీనితో సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఖర్చు అయ్యే వివాహ వేడుకలకు వధూవరుల తల్లిదండ్రులకు సమయానికి నగదు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో వివాహ వేడుక చేయడం తలకుమించిన భారంగా పరిణమించింది. సెప్టెంబర్‌లో శూన్యమాసం అటుపై మూఢమి వారణాశి శ్రీ రాఘవేంద్ర శర్మ, అర్చకులు, పురోహితుడు.. శ్రావణ మాసం తరువాత వివాహాలకు మంచి ముహూర్తాలు పెద్దగా లేవు. సెప్టెంబర్ నెలలో శూన్యమాసం రాగా, నవంబర్, డిసెంబర్ నెలల్లో మూఢమి చోటుచేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకూ సరైన ముహూర్తాలు లేవనే చెప్పాలి. -
తిరుమలలో శ్రీవారి భక్తులపై జీఎస్టీ భారం
-
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్టీపై కానరాని స్పష్టత - సర్వత్రా గందరగోళం - ముందుకు సాగని వ్యాపారాలు - పాత తేదీలపై అమ్మకాలు అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్‌సేల్ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ షాపులు.. సిమెంట్.. ఐరన్.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్టీ అమలు మారింది. వెలవెలబోతున్నాయిలా.. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. - రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి. - ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు. - ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి. - ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్‌సేల్ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. - దీనికితోడు జీఎస్టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు. పాత తేదీలతోనే అమ్మకాలు ఈ నెల ఒకటిన నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్‌సేల్ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు. -
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్టీపై కానరాని స్పష్టత - సర్వత్రా గందరగోళం - ముందుకు సాగని వ్యాపారాలు - పాత తేదీలపై అమ్మకాలు అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్‌సేల్ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ షాపులు.. సిమెంట్.. ఐరన్.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్టీ అమలు మారింది. వెలవెలబోతున్నాయిలా.. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. - రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు. - జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి. - ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు. - ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి. - ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్‌సేల్ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. - దీనికితోడు జీఎస్టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు. పాత తేదీలతోనే అమ్మకాలు ఈ నెల ఒకటిన నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్‌సేల్ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు. -
నారు.. కన్నీరు..
- నీరివ్వడంలో జాప్యం - ఆలస్యమైన నారుమళ్లు - ఇప్పుడు వర్షాలతో శివారున నీట మునక - రోజుల తరబడి ముంపులోనే.. - పంట విరామానికి సిద్ధమవుతున్న రైతులు అమలాపురం / అల్లవరం (అమలాపురం) : అనుకున్నంతా అయ్యింది. ముందుగా సాగునీరు ఇస్తున్నామని.. కోట్ల రూపాయలతో ముంపునీరు దిగేందుకు ఆధునికీకరణ పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రచారమంతా డొల్లేనని తేలిపోయింది. కొద్దిపాటి వర్షం పడిందో లేదో.. శివారు పొలాల్లో నారుమళ్లు నీట మునగడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. నారుమళ్ల నుంచి రోజుల తరబడి ముంపునీరు దిగకపోవడం చూసి కోనసీమ శివారు రైతుల గుండె చెరువవుతోంది. దీంతో మరోసారి ఖరీఫ్ పంట విరామానికి సిద్ధమవుతున్నారు. గడచిన రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి. అసలే ఇక్కడ సాగు ఆలస్యమైందని, కొద్దిమంది రైతులు మాత్రమే నారుమడులు వేశారు. అవి కూడా నీట మునగడం చూసి వారు దిగులు చెందుతున్నారు. ఈ ఐదు మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రెండు వేల ఎకరాల్లో నారుమడులు పడ్డాయని అంచనా. దీనిలో సగం నారుమళ్లు వర్షాలకు నీట మునిగాయి. ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన మండలాల్లోని నారుమళ్లు రోజుల తరబడి ముంపులోనే ఉన్నాయి. నారును కాపాడుకొనేందుకు రైతులు మోటార్లు, నత్తగుల్లలతో నీరు తోడుతున్నా.. మళ్లీ వర్షం కురవడం, ముంపు బారిన పడడం జరుగుతోంది. ఇటీవల ఈ మండలాల పరిధిలో ఉన్న డ్రైన్లలో ఆధునికీకరణ, నీరు-చెట్టు పనుల ద్వారా పూడిక తీశారు. అయితే ప్రధాన డ్రైన్లలో పూడికలు తొలగించకపోవడం, మీడియం, రెవెన్యూ డ్రైన్లలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆక్రమణలు తొలగించకపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. దీంతో విసుగు చెందుతున్న రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అల్లవరం సొసైటీ కార్యాలయంలో రైతు నాయకుడు బొక్కా శ్రీనివాస్ ఆధ్వర్యాన శనివారం సమావేశమైన పలు గ్రామాల రైతులు ఖరీఫ్‌కు పంట విరామం ప్రకటించాలని నిర్ణయించారు. పలువురు రైతులు మాట్లాడుతూ, కాలువలకు సాగునీరు ఆలస్యం కావడంతో నారుమళ్లు వేయలేకపోయామని, పోసిన నారు వర్షాలకు నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన మండలాలకు చెందిన రైతులు సహితం పంట విరామం ప్రకటించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే తీరప్రాంత మండలాల్లో ముంపునకు భయపడి సుమారు మూడు వేల ఎకరాల్లో రైతులు ఏటా ఖరీఫ్ సాగు చేయడం లేదు. ఖరీఫ్ సాగంటేనే తీరప్రాంత రైతులు భయపడుతున్న తరుణంలో.. ఆరంభంలోనే ఆకుమడులు మునిగిపోవడం చూసి మరింతమంది సాగుకు దూరంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. -
సత్యదేవునికి పన్ను పోటు!
- అన్నవరం దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ జీఎస్టీ? - రత్నగిరీశుని వార్షికాదాయం రూ.125 కోట్లు - రూ.20 లక్షలు దాటితే తప్పని పన్నుభారం - ఇంకా అందని ఆదేశాలు అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పోటు తగలనుంది. నూతన పన్ను విధానం వలన దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదాయ పరంగా రాష్ట్రంలో తిరుమల - తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాల తరువాతి స్థానంలో అన్నవరం ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని వార్షికాదాయం రూ.125 కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో నూతన పన్ను విధాన ప్రభావం అన్నవరం దేవస్థానంపై అధికంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇంకా నిర్ధారణ జరగకపోయినా దేవస్థానంలో వివిధ సేవల టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదం తయారీకి ముడిసరుకుల కొనుగోళ్లు, అన్నదానం పథకంలో ఆహార పదార్థాల తయారీకి కొనుగోలు చేసే ముడి సరుకులవంటి వాటిపై జీఎస్టీ పడే అవకాశం ఉంది. ఇది ఎంతమేరకు అనేదానిపై ఇంకా స్పష్టత రానందున ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని దేవస్థానం అధికారులు అంటున్నారు. రూ.20 లక్షల వార్షికాదాయం మించితే.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.20 లక్షల వార్షికాదాయం దాటిన దేవస్థానాలన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. దాని ప్రకారం జిల్లాలోని తలుపులమ్మ లోవ దేవస్థానం సహా సుమారు 50 దేవస్థానాలు జీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటికంటే అన్నవరం దేవస్థానం వార్షికాదాయం అధికం. కాబట్టి ఈ దేవస్థానమే ఎక్కువ జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. ఏటా రూ.26 కోట్లతో ముడిసరుకుల కొనుగోళ్లు అన్నవరం దేవస్థానంలో ఏటా రూ.26 కోట్లతో వివిధ ముడిసరుకులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో రూ.23 కోట్లను ప్రసాదం తయారీలో వాడే గోధుమలు, పంచదార, నెయ్యి, యాలకులు, గ్యాస్, వ్రతాల్లో వాడే నూనె, ఇతర పూజాసామగ్రి, వివిధ సత్రాల్లో వాడే వస్తువుల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. అన్నదానం పథకంలో ప్రత్యేకంగా రూ.3 కోట్లతో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిపై ప్రస్తుతం వ్యాట్, కొన్నింటిపై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒకే పన్ను కావడంతో ఇకనుంచి జీఎస్టీ విధించనున్నారు. తలనీలాల విక్రయంపై కూడా.. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయం మీద కూడా జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఏటా ఇక్కడి తలనీలాలను బహిరంగ వేలం ద్వారా దేవస్థానం విక్రయిస్తుంది. తద్వారా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. జీఎస్టీపై ఎటువంటి ఆదేశాలూ రాలేదు దేవస్థానంలో కొనుగోళ్లు, అమ్మకాలపై జీఎస్టీ విధింపు అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలూ రాలేదు. జీఎస్టీ ఎంతమేరకు ఉంటుంది? దేనిపై ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఆడిటర్లను అడిగాం. ప్రస్తుతానికి దేవస్థానంలో యథాతథ స్థితి కొనసాగుతోంది. జీఎస్టీ అమలుపై ఉన్నతాధికారులు సర్క్యులర్ పంపిస్తే దాని ప్రకారం వ్యవహరిస్తాం. - ఈరంకి వేంకట జగన్నాథరావు, ఇన్చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం -
చేలు మాయం.. చెరువుల మయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టాలో వరి చేలు మాయమవుతున్నాయి. సాగు భూములు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. అనధికారికంగా తవ్వుతున్న చెరువుల కారణంగా డెల్టా ప్రమాదంలో పడింది. నాలుగేళ్లుగా వరి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గతంలో జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఆక్వా చెరువుల కారణంగా 5.30 లక్షల ఎకరాలకు తగ్గిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం వరి విస్తీర్ణం 4 లక్షల ఎకరాల లోపే ఉన్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే డెల్టాలో పొలాలు పూర్తిగా కనుమరుగవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లో వరిసాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలు కాగా, రబీలో 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అధికారిక గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారికంగా మరో లక్ష ఎకరాల వరకూ చెరువులుగా మారినట్టు అంచనా. అనుమతి లేనివే అధికం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, పెంటపాడు, గణపవరం, నిడమర్రు, యలమంచిలి, పాలకొల్లు మండలా ల్లోని అత్యధిక విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వారు. ఇందులో అనుమతి లేనివే అధికం. తాజాగా ఇరగవరం, పెనుమంట్ర, ఆచంట, పెరవలి, అత్తి లి మండలాల్లోనూ చెరువుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. డెల్టా మండలాల్లో ఏటా రెండు పంటలు కలిపి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇటీవల కాలంలో కొత్త వంగడాలు సాగు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం, తెగుళ్లు తప్పడంతో దిగుబడి బాగా పెరిగింది. గతంలో రెండు పంటలకు 60 నుంచి 65 బస్తాల వరకూ దిగుబడి వస్తే.. ఇప్పుడు సగటున 80 బస్తాల వరకూ పెరిగింది. అయితే, సాగు భూములు మాత్రం తగ్గిపోయాయి. ఆక్వా జోన్లుగా ప్రకటించడంతో.. ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా డెల్టాలోని కొన్ని మండలాల్లో అక్వా జోన్లను ప్రకటించింది. దీంతో ధనిక రైతులు వ్యవసాయం నుంచి అక్వా వైపు మళ్లుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఎక్కడా రొయ్యల చెరువులకు అనుమతి లేదు. ఇటీవల కాలంలో రొయ్యల చెరువులు డెల్టాలోనూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లోని భూములన్నీ ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. ఉప్పునీటి బోర్లకు అనుమతి లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వేస్తు్తన్నారు. సెలనిటి చాలకపోతే చెరువుల్లో నేరుగా బస్తాలకొద్దీ ఉప్పు కలుపుతున్నారు. రొయ్యల సాగు కోసం యాంటీబయోటిక్స్ సైతం అధికంగా వాడుతున్నారు. ఈ నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. దీనినే చాలా గ్రామాల్లో తాగునీటికి ఉపయోగించాల్సిన దుస్థితి దాపురించింది. పని దినాలు తగ్గిపోయాయి ఆక్వా చెరువుల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ఆ భూముల్లో వరి సాగైన సమయంలో కూలీలకు సగటున 50 పని దినాలు ఉంటే అక్వా వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయాయి. దీంతో కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రొయ్యల చెరువులున్న గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఉప్పు నీటి కారణంగా పంటలు పండటం లేదు. దీనివల్ల రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టాలో వ్యవసాయ భూములు తగ్గిపోతుండటంతో కౌలు రేట్లు పెంచేశారు. గతంలో ఎకరానికి 24 బస్తాలు (రెండు పంటలకు కలిపి) ఉండే కౌలు ఇప్పుడు 32 నుంచి 34 బస్తాలకు పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా అధికారిక గణాం కాల్లో తగ్గిన విస్తీర్ణం చూపించడం లేదు. గతంలో ఎంత ధాన్యం దిగుబడి వచ్చిందో ఇప్పుడూ అంతే చూపిస్తున్నారు. వాస్తవానికి దిగుబడి పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి కూడా పెరగాలి. అయితే, తగ్గిన విస్తీర్ణాన్ని చూపించకుండా అధికారులు పాత లెక్కలతోనే సరిపెడతున్నారు. డెల్టా పరిరక్షణకు నడుం కట్టాలి ఏటా పెరుగుతున్న అక్రమ చెరువుల కారణంగా డెల్టాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కార్మికులకు పని దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో తిండి గింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
అంతా... సం...‘కల్పితమే’...
– వారం రోజులుగా నవ నిర్మాణ దీక్షల్లో జిల్లా యంత్రాంగం – స్తంభించిన పరిపాలన ... కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు - డ్వాక్రా మహిళలే ముడిసరుకులు - మూతపడిన 5,545 అంగన్వాడీ కేంద్రాలు - వారానికి రెండు రోజుల ఇచ్చే గుడ్లకూ కాళ్లు - పల్లెల మోహం చూడని 350 గ్రామ కార్యదర్శులు - ప్రయోజనం లేకున్నా సుమారు రూ. కోటితో దీక్షల హడావుడి సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షల పేరిటి నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం పూర్తిగా తనమునకలైంది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ అయిన జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజులపాటు జరిగిన సంకల్ప దీక్షల పేరుతో చేపట్టిన కార్యక్రమాల వల్ల సాధారణ పరిపాలన పూర్తిగా పడకేసింది. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ దీక్షల్లో పాల్గొనాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కార్యాలయాలకు స్వస్తి చెప్పి దీక్షలు జరిగే సభల వద్ద కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఈ దీక్షలను విజయవంతం చేయాలని, జయప్రదం చేసినవారికి బహుమతులు కూడా ఇస్తామంటూ ప్రకటించింది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో వారం రోజులపాటు దీక్షలు నిర్వహించేందుకు రూ.కోటి మంజూరు చేసింది. ఉన్నతాధికారులంతా దీక్షల్లోనే... ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఈ దీక్షలకు ప్రత్యేక అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాల్సిన బాధ్యతలను వీరికి అప్పగించింది. అలాగే జిల్లాలోని ఏడుగురు ఆర్డీవోలు, సబ్కలెక్టర్లు, ఆరుగురు డివిజనల్ పంచాయతీ అధికారులు, కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు అందరూ నవనిర్మాణ దీక్షల్లో తీరకలేకుండా గడిపారు. ఇక క్షేత్ర స్థాయి అధికారులు తప్పని సరిగా తరలి రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు జరుగుతున్న ప్రాంగణాల వద్ద ప్రత్యేకంగా హాజరు పట్టీని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి అధికారి వారి పేరు, వివరాలు అందులో నమోదు చేయాల్పి రావడంతో తరువాత ఎందుకీ తలనొప్పంటూ ఇష్టం లేకపోయినా...కష్టంగా ఉన్నా రావల్సి వచ్చింది. పడకేసిన పరిపాలన... ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకూ వారం రోజులపాటు దీక్షల్లో పాల్గొనడంతో జిల్లాలో సాధారణ పరిపాలన పడకేసింది. ఆయా కార్యాలయాల్లో ప్రతి రోజూ సగానికిపైగా అధికారులు, సిబ్బంది షిప్టులు వారీగా దీక్షలకు హాజరుకావడంతో వివిధ రకాల పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది. మీసేవా నుంచి దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పేరుకుపోయి ఉన్నాయి. జిల్లాలోని 350 మంది పంచాయతీ కార్యదర్శులు దీక్షల్లో పాల్గొనడంతో మరణ, జనన, నివాస ధృవ పత్రాలు జారీ నిలిచిపోయింది. వారం రోజులుగా కార్యదర్శులు గ్రామాల వైపు చూసే సమయం కూడా లేకపోయింది. ఫలితంగా గ్రామ పాలన పడకేసింది. + పర్యవేక్షణ అధికారులు లేక ఉపాధి హామీ పనులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు చేపట్టాల్సిన పనులు ఆపేశారు. గత సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల్లో మినహా మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా వాణి తూతూ మంత్రంగా జరిగింది. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా కింది స్థాయి సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సభలకు డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు... నవ నిర్మాణ దీక్షల వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అధికారులు డ్వాక్రా మహిళలను దీక్షలకు తీసుకురావాలని కమ్యూనిటీ ఆర్గనైజర్స్, రిసోర్స్ పర్సన్లకు ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సమావేశం ఉందంటూ తప్పక రావాలని సీవోలు, ఆర్పీలు డ్వాక్రా సంఘాలకు సమచారం పంపారు. విడతల వారీగా ప్రతి రోజూ కొంతమంది చొప్పున దీక్షలకు డ్వాక్రా మహిళలను తరలించారు. ఇక నవ నిర్మాణ దీక్షలతో వారం రోజులపాటు జిల్లాలోని 5,545 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దీక్షలకు వెళ్లాల్సి రావడంతో కేంద్రాలు వారం రోజుల పాటు తెరుచుకోలేదు. ప్రతి రోజూ పౌష్టికాహారం, మంగళ, శుక్రవారాల్లో ఇచ్చే గుడ్లకు పిల్లలు దూరమయ్యారు. -
రోహిణీలో నిప్పుల కుంపటి
- తునిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత అమలాపురం : ఒకవైపు బంగాళాఖాతంలో తుపాను.. మరోవైపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ...ఎండవేడికి ఆపసోపాలు పడుతున్న జిల్లావాసులకు ఈ రెండు వార్తలు పెద్దగా ఊరటనివ్వలేదు. జిల్లాలో వరుసగా రెండు రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోహిణీకార్తి చల్లగా ఆరంభమైనప్పటికీ రోజుల గడుస్తున్న కొద్దీ భానుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. వారం రోజులుగా మండే ఎండలకు కాస్త విరామం ఇచ్చిన భానుడు గడిచిన రెండు రోజులుగా మళ్లీ చెలరేగిపోతున్నాడు. జిల్లాలో మంగళవారం సూర్య ప్రతాపంతో సామాన్యులు విలవిల్లాడారు. ఎండకు, వడగాల్పులు తోడుకావడంతో వాతావరణం వేడెక్కింపోయింది. తునిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వేసవి ఆరంభమైన తరువాత ఇక్కడే ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. జిల్లా కేంద్రమైన కాకినాడలో 42.6, రాజమహేంద్రవరం, ఏజెన్సీలోని చింతూరు, కోనసీమల్లో 42, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఏడు గంటల వరకు వేడుగాలలు వీస్తుండడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
కొబ్బరి రైతుల నెత్తిన జీఎస్టీ పిడుగు
- ఎండుకొబ్బరిపై ఐదు శాతం పన్ను - ఇప్పటి వరకు పన్ను మినహాయింపు - ఏడాదికి రూ.ఐదు కోట్లకు భారం - మిగిలిన ఉత్పత్తులపైనా ప్రభావం - కొబ్బరి నూనెకు ఊతం - జీఎస్టీ 22 శాతం ఉన్న పన్ను 18కి కుదింపు అమలాపురం /అంబాజీపేట (పి.గన్నవరం) : రైతులు ఆందోళన చెందుతున్నట్టుగానే కొబ్బరిపై జీఎస్టీ పిడుగు పడింది. ఎండు కొబ్బరిపై 5 శాతం పన్ను విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మన రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లుగా పన్ను మినహాయింపు ఉండగా, తాజాగా పన్నుభారం పడడం రైతులు విస్మయానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో కొబ్బరి నూనెపై కొంత వరకు పన్ను మినహాయింపునిచ్చి ఊరట కలిగించేందుకు ప్రయత్నించినా ఎండు కొబ్బరిపై పన్ను వల్ల రైతులపై మోయలేని భారం పడనుంది. గతంలో ఎండుకొబ్బరిపై 4 శాతం పన్ను ఉండేది. దీన్ని తొలుత రెండు శాతానికి తగ్గించి, 2008 నుంచి పూర్తిగా ఎత్తివేశారు. వ్యాట్ అమలులోకి వచ్చినా పన్ను మాత్రం అమలు చేయలేదు. కేవలం సీఎస్టీ (ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటప్పుడు) మాత్రమే 2 శాతం పన్ను విధానం ఉంది. పన్ను మినహాయింపు వల్ల వ్యాపారులకు ప్రత్యక్షంగా, రైతులకు పరోక్షంగా మేలు జరిగేది. ఈ మినహాయింపు వల్ల జిల్లాలో 1.25 లక్షల మంది రైతులు లాభపడ్డారు. కోట్ల రూపాయల భారం... దేశమంతా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సు (జీఎస్టీ) అమలులోకి రావడంతో కొబ్బరి ఉత్పత్తులపై పన్నుపడింది. నిన్నటి మొన్నటి వరకు స్పష్టత రాకున్నా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఎస్టీ పన్ను విధానంలో ఎండుకొబ్బరి, పంచదార వంటి వ్యవసాయ ఆధారిత తయారీ ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఎండుకొబ్బరి ఆధారంగానే కొబ్బరి ఉత్పత్తుల ధరలు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పన్ను మినహాయింపు ఇక నుంచి ఉండకపోవడంతో వ్యాపారులు కన్నా రైతులు ఎక్కువుగా నష్టపోనున్నారు. వ్యాపారులు పన్ను భారాన్ని రైతులపై మోపి, వారికి చెల్లించే సొమ్ముల నుంచి తగ్గించడం ఇక్కడ సర్వసాధారణం. అంబాజీపేట మార్కెట్ నుంచి ఎండు కొబ్బరి ఎగుమతులే ఏడాదికి రూ.250 కోట్లకు పైబడి ఉంటాయని అంచనా. అంటే ఏడాదికి సుమారు రూ. 5 కోట్ల పన్నుభారం పడనుందని అంచనా. మనకు ఇంత వరకు పన్ను లేకున్నా జీఎస్టీలో దేశమంతా ఒకే విధమైన పన్ను విధానం అలులోకి రావడంతో మనపై కూడా పన్నుభారం పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను విధానాన్ని జీఎస్టీలో దేశమంతా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మన రాష్ట్రంతోపాటు కేరళలో మాత్రమే కొబ్బరి, ఎండు కొబ్బరిపై పన్నులేదు. మిగిలిన కొబ్బరి పండించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, అస్సాం వంటి రాష్ట్రాల్లో పన్ను విధానం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని జీఎస్టీ విధించినట్టు సమాచారం. కొబ్బరి నూనెపై ఊరట... ఇదే సమయంలో కొబ్బరి నూనెకు పన్ను తగ్గించడం రైతులకు కొంతలో కొంత ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 22 నుంచి 24 శాతం పన్ను విధానాన్ని మార్పులు చేసి జీఎస్టీలో 18 శాతం శ్లాబ్‌లో పెట్టడంతో వ్యాపారులకు, రైతులకు మేలు జరగనుంది. దీనివల్ల కొబ్బరి నూనె ధరలు తగ్గడంతోపాటు వినియోగం పెరిగి ఇటు కొబ్బరికి సైతం డిమాండ్ వస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొబ్బరినూనె మార్కెట్‌కు, ఎగుమతులకు అంబాజీపేట చిరునామాగా ఉన్న విషయం తెలిసిందే. రోజుకు ఇక్కడ నుంచి రెండు టన్నుల కొబ్బరి నూనె ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. పన్ను మినహాయింపు లభిస్తే ఇక్కడ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. -
ఆర్థిక ఆంక్షల సెగ
కొనుగోళ్లకు వెనుకడుగేస్తున్న ట్రేడర్లు, చిరు వ్యాపారులు స్థానిక ఎగుమతులపై ప్రభావం పౌల్ట్రీల్లో పేరుకుపోతున్న గుడ్లు రూ.2.55కు పతనమైన రైతు ధర రోజుకు రూ.77 లక్షల మేర నష్టం ఆందోళనలో కోళ్ల రైతులు మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజ¯ŒSలో గుడ్డు ధర తీవ్రంగా నిరాశపరచగా.. తాజాగా ఆర్థిక ఆంక్షలు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వేసవి ఎండలకు తోడు ఆర్థిక ఆంక్షలతో గుడ్ల కొనుగోళ్లకు, ఎగుమతులకు ట్రేడర్లు, చిరు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతుండగా.. రైతు వద్ద ధర నానాటికీ పతనమవుతోంది. ఇప్పటికే రూ.2.55కు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు రోజుకు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మున్ముందు మరింతగా పెరగనున్న ఎండలతో పరిశ్రమకు మరిన్ని కష్టాలు తప్పవని కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. 40 శాతం గుడ్లు స్థానికంగా వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చలి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులకు డిమాండ్ పెరిగి, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్డు ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో ఈ ఏడాది సీజ¯ŒSలో రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. పరిశ్రమకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇటీవల లారీల సమ్మెతో గుడ్ల ఎగుమతి స్తంభించిపోయింది. ఆ సమ్మె ముగిసినా, ఆర్థిక ఆంక్షలు, ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో లావాదేవీలన్నీ చెక్కుల రూపంలోనే నిర్వహించాల్సి రావడం వ్యాపారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. చెల్లింపులు జరిపిన చెక్కులకు సమాధానం చెప్పాల్సి రావడం, ఆర్థిక ఆంక్షలకు సంబంధించి వ్యాపారులు, కోళ్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. లావాదేవీల్లో ఏ చిన్నపాటి లోపం చోటుచేసుకున్నా రూ.లక్షల్లో జరిమానాలు చెల్లించాల్సి రావడంతో ట్రేడర్స్‌తో పాటు స్థానిక వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఎండల ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం తగ్గుముఖం పడుతోంది. ఈ కారణాలతో పది రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు, స్థానిక వినియోగం సగం వరకు తగ్గిపోగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతున్నాయి. సాధారణంగా జిల్లా నుంచి రోజుకు సుమారు 50 లారీల గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అది 25 లారీలకు పడిపోయింది. స్థానిక వినియోగం కూడా తగ్గిపోవడంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయని కోళ్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. నెక్ ప్రకటిత ధర కూడా అందని దుస్థితిలో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో గుడ్డు రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.55 ఉండగా, రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 70 పైసల వరకూ కోళ్ల రైతులు కోల్పోవాల్సి వస్తోంది. దీని ప్రకారం పరిశ్రమకు రోజుకు సుమారు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు చెబుతున్నారు. మున్ముందు వేసవి ఎండలు, వడగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోతుందని, దీంతోపాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
13 నుంచి ఒంటిపూట బడులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఈ నెల 13 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా విద్యార్థులు అనారోగ్యం పాలుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అలాగే సర్వశిక్షాభియాన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీఆర్పీ, ఐఈఆర్టీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డీపీవోలు, కేజీబీవీ, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, మెసెంజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జీతాలు మూడు శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంజనేయులు తెలిపారు. 2014 జూన్ తరువాత వారి జీతాలు పెరగలేదని ప్రభుత్వానికి వివరించినట్టు చెప్పారు. -
పసిడిపై నోట్ల రద్దు ఎఫెక్ట్
• 2016లో 21 శాతం తగ్గిన డిమాండ్ • 675.5 టన్నులకు క్షీణత • వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక • జ్యుయలర్ల సమ్మె, పాన్ కార్డ్ నిబంధనలు కారణం ముంబై: పెద్ద నోట్ల రద్దు, జ్యుయలర్ల సమ్మెలు, భారీ స్థాయి కొనుగోళ్ల కోసం పాన్ కార్డు తప్పనిసరి చేయడం తదితర అంశాలతో గతేడాది దేశీయంగా పసిడికి డిమాండ్ గణనీయంగా తగ్గింది. 21 శాతం మేర క్షీణించి 675.5 టన్నులకు పడిపోయింది. 2015లో పుత్తడి డిమాండ్ 857.2 టన్నుల మేర నమోదైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2016లో జ్యుయలరీ డిమాండ్ 22.4 శాతం క్షీణించి 662.3 టన్నుల నుంచి 514 టన్నులకు తగ్గింది. విలువపరంగా ఆభరణాల డిమాండ్ 12.3 శాతం తగ్గి రూ. 1,58,310 కోట్ల నుంచి రూ. 1,38,838 కోట్లకు క్షీణించింది. ’దీపావళి, పెళ్లిళ్ల సీజన్ మొదలైన కారణాలతో నాలుగో త్రైమాసికంలో పసిడి డిమాండ్ 3 శాతం వృద్ధితో 244 టన్నులకు పెరిగినప్పటికీ.. మొత్తం ఏడాదికి చూస్తే మాత్రం గణనీయంగా క్షీణించింది. కొనుగోళ్లకు పాన్ కార్డు తప్పనిసరి, జ్యుయలరీపై ఎక్సయిజ్ డ్యూటీ, డీమోనిటైజేషన్, ఆదాయ వెల్లడి పథకానికి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైన అంశాలతో పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొనడంతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది’ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. అయితే, ఈ ధోరణి పుత్తడికి మాత్రమే పరిమితం కాకుండా మిగతా వ్యాపారాల్లో కూడా కనిపించిందని చెప్పారు. పెట్టుబడి అవసరాలకు సంబంధించి పుత్తడి డిమాండ్ 17 శాతం తగ్గి 194.9 టన్నుల నుంచి 161.5 టన్నులకు తగ్గింది. ఈసారి 650–750 టన్నులు.. ప్రభుత్వ విధానాలు రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయగలవని, పసిడి పరిశ్రమలో పారదర్శకత పెరిగేందుకు దోహదపడగలవని.. ఫలితంగా కొనుగోలుదార్లకు చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రయోజనాలు చేకూరగలవని సోమసుందరం వివరించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమలు తదితర అంశాల ఊతంతో 2017లో పసిడి డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయంగా 2 శాతం వృద్ధి.. గతేడాది అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 2 శాతం పెరిగి 4,309 టన్నులుగా నమోదైంది. అమెరికాలో బంగారం ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల వెల్లువ, నాలుగో త్రైమాసికంలో చైనాలో పసిడి కడ్డీలు.. నాణేలకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయని డబ్ల్యూజీసీ తెలిపింది. 2015లో డిమాండ్ 4,216 టన్నులుగా నమోదైంది. పెట్టుబడుల కోణంలో చైనాలో పుత్తడికి డిమాండ్ 70 శాతం పెరిగిందని.. నాలుగేళ్ల గరిష్ట స్థాయి 1,561 టన్నులకు చేరిందని డబ్ల్యూజీసీ తెలిపింది. మొత్తం మీద పెట్టుబడి అవసరాలకు సంబంధించి బంగారానికి డిమాండ్ పెరగడానికి .. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు (ముఖ్యంగా బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికలు) కారణమని వివరించింది. దేశాలవారీగా చూస్తే వినియోగం అత్యధికంగా ఉండే చైనా, భారత్‌లో 2016లో ఆభరణాల డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది. అధిక ధరలు, సరఫరా పరిమితులు వంటి వాటి కారణంగా చైనాలో డిమాండ్ 7 శాతం తగ్గింది. -
తమ్ముళ్ల స్వాహాకు ఎదురుదెబ్బ
రూ 90 కోట్ల పనుల టెండర్లు రద్దు రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి ‘సాక్షి’ అడ్డుకట్ట ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన రీ టెండర్‌కు కమిటీ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వంలో అన్న కీలక నేత ... తమ్ముడు ఓడిపోయిన ఓ నేత...అయినా తుని నియోజకవర్గంలో పెత్తనం వారిదే. ఆ ప్రాంతంలో ఏది నెలకొల్పాలన్నా ... ఏ పనులు చేయాలన్నా భారీ ఎత్తున ముడుపులు చెల్లించాల్సిందే. ఇందులో భాగంగా మంజూరైన రోడ్లకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైతే రూ.9 కోట్ల కమీషన్ల కోసం నానా గందరగోళం సృష్టించారు. లోగుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో బయటపెట్టడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఏకంగా టెండర్ ప్రక్రియనే రద్దు చేశారు. సాక్షి ప్రతినిధి కాకినాడ : తెలుగు తమ్ముళ్ల పాచిక పారలేదు సరికదా వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో జేబులు నింపుకుందామనుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టింది. జిల్లాలో తుని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో సుమారు రూ.90 కోట్ల పనులకు టెండరింగ్ కోసం అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. తుని–కేఈ చిన్నయ్యపాలెం 24 కిలోమీటర్లు రూ.32 కోట్లు, తుని– కోటనందూరు 18 కిలోమీటర్లు రూ.18 కోట్లు, ఎ.కొత్తపల్లి–కోదాడ ఆరు కిలోమీటర్లు రూ.8 కోట్లు, సర్పవరం–ఎఫ్.కె.పాలెం, ఎఫ్.కె. పాలెం– దివిలి రోడ్లు, వంతెనల ఆధునికీకరణ పనులు ఇందులో ఉన్నాయి. ఈ పను ల్లో రాష్ట్ర అర్థిక మంత్రి యనమల రా మకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో అత్యధికంగా రూ.60 కోట్ల విలువైన పనులున్నాయి. రెండు నెలల కిందటే టెండర్లకు పిలుపు... ఈ పనులకు సంబంధించి గత నవం బర్ నెలలో తొలుత ఆఫ్‌లైన్‌లో అనం తరం ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. ఆన్లైన్ టెండర్ల పక్రియ మొదలైన సందర్భంలో తుని నియోజకవర్గానికి సంబంధించిన మూడు ప్యాకేజీలను రాజమండ్రిలో కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి జిల్లాకు చెందిన ఒక మంత్రి సోదరుడు రూ.9 కోట్లు ఇచ్చిన వారికే పనులు కట్టబెడతామని అదిరించి, బెదింరించి దారిలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకున్న సమయంలో ఆన్లైన్ టెండర్లు మరోసారి పిలవటంతో వీరి వ్యూహం బెడిసికొట్టింది. అప్పుడు ఉన్నత స్థాయిలో మంత్రి, పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ప్రస్తుతం పనులు మొదలెట్టే సమయానికి తమ్ముళ్లతో కుమ్మక్కైన ఒక ఉన్నతాధికారి పోస్టులో లేకపోవటంతో కథ మొదటికి వచ్చింది. ‘సాక్షి’ కథనాలతో కదలిక... వారి వ్యూహం ప్రకారం రూ.90 కోట్ల పనులకు 15 శాతం అదనంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమై ఉండేది. ఈ పనుల్లో జరుగుతున్న తెలుగు తమ్ముళ్ల భాగోతాన్ని ‘మంత్రుల ఇలాకాలో టెండరింగ్’’, రూ.9 కోట్లు ఇస్తేనే’’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్నతాధికారులు తెలుగు తమ్ముళ్లకు కొమ్ముకాయగా కొత్తగా వచ్చిన రవాణా, రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా ‘సాక్షి’ కథనాలపై స్పందించి టెండర్లను రద్దు చేశారు. దీంతో రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ‘సాక్షి’ పత్రిక కట్టడి చేయగలిగింది. తీవ్రంగా పరిగణించిన టెండర్ కమిటీ... ఈ పనులకు 15 శాతం అదనంగా కోట్ చేయటాన్ని తీవ్రంగా పరిణించిన రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ వీటిని రద్దు చేసి రీ టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, విపత్తు నివారణా కమిషనర్ శేషగిరిబాబు, ఆర్‌ఆండ్‌బీ. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమై అదనంగా 15 శాతం కోట్ చేసిన అయిదు ప్యాకేజీ పనులను రద్దు చేశారు. ఊహించని ఈ పరిణామంతో తెలుగు తమ్ముళ్లు ఖంగుతిన్నారు. అదనంగా ఐదు శాతానికి మించి అనుమతించరాదని, సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు రీటెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. ఈ పనుల ద్వారా అడ్డంగా రూ.9 కోట్లు దోచేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల నిర్ణయంతో బొక్కబోర్లా పడ్డారు. -
దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు
• నవంబర్, డిసెంబర్ అమ్మకాల్లో వృద్ధి • పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేదు • దాదాపు స్థిరంగా ఉన్న సిమెంటు ధరలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా పెద్ద నోట్ల రద్దు ప్రభావం సిమెంటు పరిశ్రమపై ఏమాత్రం లేదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తుడటంతో సిమెంటు విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిమెంటు ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. రద్దు ప్రభావమే లేదు.. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) కారణంగా అమ్మకాలు భారీగా పడిపోవచ్చని, ధరల్లో క్షీణతకు ఆస్కారం ఉండొచ్చని సిమెంటు పరిశ్రమ తొలుత భావించింది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం కంపెనీలకు ఆశ్చర్యం కలిగించింది. దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లో స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. ఈ తగ్గుదల కూడా గుజరాత్‌కు మాత్రమే పరిమితమైంది. సిమెంటు ధరల్లో 3–5 రూపాయలు మాత్రమే సవరణ జరి గింది. దక్షిణాది రాష్ట్రాల్లో డీమో నిటైజేషన్ ప్రభావం ఏమాత్రం పడలేదు. పైగా 2015తో పోలిస్తే 2016లో విక్రయాలు పెరగడం గమనార్హం. పెరిగిన అమ్మకాలు.. దక్షిణాది రాష్ట్రాల్లో 2015 నవంబరులో 40 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. అదే ఏడాది డిసెంబరులో 48 లక్షల టన్నులకు ఎగిశాయి. ఇక 2016 వచ్చేసరికి విక్రయాల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్టోబరులో 51 లక్షల టన్నులు నమోదయ్యాయి. నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. దీని ప్రభావం దాదాపు అన్ని రంగాల లావాదేవీలపైనా పడింది. వాస్తవానికి నవంబరులో అమ్మకాలు ఎలా ఉంటాయోనని సిమెంటు కంపెనీలు ఆందోళన చెందాయి. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. నవంబరులో కూడా 51 లక్షల టన్నుల సేల్స్ జరిగాయి. డిసెంబరులో విక్రయాలు కాస్త పెరిగి 52 లక్షల టన్నులకు చేరాయి. ఇక సిమెంటు విక్రయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వృద్ధిలో ఉన్నాయి. 2016లో అక్టోబరులో 15 లక్షల టన్నులు, నవంబరులో 15, డిసెంబరులో 16 లక్షల టన్నులు జరిగాయి. ఆగని నిర్మాణాలు..: వాస్తవానికి ఇల్లు కట్టుకోవడానికి అత్యధికులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. నిర్మాణానికి కావాల్సిన నిధుల కొరత ఉండదు. ఇలా రుణం తీసుకున్న వినియోగదారుకు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. వీరివద్ద చెక్కు బుక్, డెబిట్/క్రెడిట్ కార్డు సైతం ఉంటుంది కాబట్టి చెల్లింపులకు అడ్డంకులు లేవని కంపెనీలు అంటున్నాయి. నిర్మాణ రంగంలో డీమోనిటైజేషన్ ప్రభావం లేదని, నవంబరు, డిసెంబరు సిమెంటు అమ్మకాలను చూస్తే ఇది అవగతమవుతుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో అన్నారు. వడ్డీ రేట్లూ తక్కువే.. సిమెంటు ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2016 జనవరిలో బస్తా ధర బ్రాండ్, రకాన్నిబట్టి రూ.320–355 మధ్య పలికింది. ఇప్పుడిది రూ.300–330 మధ్య ఉంది. విజయవాడలో రూ.300–335, విశాఖపట్నంలో రూ.320–350 మధ్య పలుకుతోంది. బ్యాంకులు ఒకదాని వెంట ఒకటి పోటీగా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించడంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతోందని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రుణం తీసుకునే వారికి వడ్డీలో 4 శాతం వరకు సబ్సిడీని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా నిర్మాణ రంగానికి కలసి వచ్చే అంశాలని అన్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణానికి జనవరి–జూన్ అనువైనవి. పైగా హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు బస్తాకు రూ.20–25 తక్కువగా ధర పలుకుతోంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకేముంది సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చిందని సిమెంటు సంస్థలు అంటున్నాయి. ధరలు పెరిగే అవకాశం.. డీజిల్ ధర కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోంది. కోల్ సైతం అదే దారిలో నడుస్తోంది. దిగుమతి అవుతున్న పెట్ కోక్ ధర 2016 ఏప్రిల్‌లో 40 డాలర్లుంటే, ఇప్పుడు 70 డాలర్లకు ఎగసింది. వెరశి తయారీ వ్యయం ఒక బస్తాకు రూ.10 దాకా అధికమైందని ఒక కంపెనీ డైరెక్టర్ వెల్లడించారు. తయారీ వ్యయం పెరిగితే తుది ఉత్పాదన ధరను సవరించాల్సిందేనని, అలా కాని పక్షంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ధర స్వల్పంగా పెరిగే చాన్స్ ఉందన్నారు. దక్షిణాది కంపెనీల ప్లాంట్ల వినియోగం 50–60 శాతముందని వివరించారు. ఏపీ, తెలంగాణలో ఇలా... ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులకుగాను 30 లక్షల టన్నుల సిమెంటు అవసరమనేది కంపెనీల అంచనా. బలహీన వర్గాల ఇళ్లకు రూ.230, కాం క్రీటు రోడ్లకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250లకు సిమెంటు సరఫరాకు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిస్థితి: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తోంది. వీటి నిర్మాణానికి అవసరమైన సిమెంటుకై ఒక్కో బస్తాకు కంపెనీలకు రూ.230 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఇళ్లకు వచ్చే మూడేళ్లలో 27 లక్షల టన్నుల సిమెంటు అవసరం అవుతుందని అంచనా. -
ధర అదిరె.. అమ్మకానికి బెదిరె
తాడేపల్లిగూడెం : బహిరంగ మార్కెట్లో ధాన్యం ధర పెరిగింది. కానీ.. అమ్మడానికి రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.65 అదనంగా చెల్లించేందుకు మిల్లర్లు, ధాన్యాం వ్యాపారులు ముందుకొస్తున్నా 30 శాతం రైతులు ధాన్యాన్ని అమ్మకుండా నిల్వ ఉంచుతున్నారు. జిల్లాలో ఎక్కువ మంది రకాన్ని స్వర్ణ రకాన్ని సాగు చేయగా, దీనిని కామన్ వెరైటీగా గుర్తించిన ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,470 మద్దతు ధర ప్రకటించింది. ఐకేపీ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1,535 చెల్లిస్తున్నా రైతులు ధాన్యం అమ్మడానికి విముఖత చూపుతున్నారు. సొమ్ము సకాలంలో చేతికందే పరిస్థితి లేకపోవడం, వ్యాపారులు ఇస్తున్న చెక్కుల్ని బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ధాన్యాన్ని అమ్మడం లేదు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఐకేపీ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 48,408 మంది రైతుల నుంచి 4,77,113 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, రూ.704 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉండగా, రూ.604 కోట్లు చెల్లించామని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.గణపతి రావు తెలిపారు. మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేసినట్టు అంచనా. ఇంకా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయిందని అధికారులు భావిస్తున్నారు. సొమ్ములున్నా తీసుకోలేని దుస్థితి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయినా తీసుకోలేని దుస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా సొమ్ము రైతులకు సొమ్ములు ఇవ్వడం లేదు. చేతిలో సొమ్ముల్లేక రబీ నారుమడులు, నాట్లు ఎలా వేయాలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. పోనీ.. కమీషన్‌దారులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుందామన్నా.. రబీ సీజన్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించకపోవడంతో వారినుంచి రుణాలు అందటం లేదు. తొలి దశలో ఎకరాకు రూ.5 వేలైనా పెట్టుబడి అవసరం ఉంటుంది. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. సొమ్ము రావట్లేదని ధాన్యం అమ్మలేదు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మినా సొమ్ము చేతికి అందటం లేదు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముదామంటే చెక్కులిస్తామంటున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక ధాన్యాన్ని అమ్మలేదు. ఇంట్లోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత పంట సొమ్ము రాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు చేద్దామంటే ఇచ్చేవాళ్లు లేరు. కొత్త పంట ఎలా వేయాలో అర్థం కావడం లేదు. – గరగ ప్రభాకరరావు, రైతు, మాధవరం -
నోటు పాట్లు.. గుండె పోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నాయి. బ్యాం కుల వద్ద క్యూలు మాత్రం తరగడం లేదు. ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో రెండు రోజులకు డబ్బులు అందుబాటులో ఉండవన్న భయంతో శనివారం చాలా బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనపడ్డాయి. క్యూలో నిలబడలేక గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల కృష్ణమూర్తి (70) నగదు తీసుకునేందుకు గణపవరంలోని స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలబడగా, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఖాతాదారులు, పోలీసులు ఆర్ఎంపీతో ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. రోడ్డెక్కిన మహిళలు బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులతో మహిళలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇరగవరం ఎస్బీఐ వద్ద నగదు లేదని బోర్డు పెట్టడంతో బ్యాంకు ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో శనివారం ఉదయం 7 గంటలకే ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు క్యూలో నిలబడ్డారు. 10 గంటలకు వచ్చిన అధికారులు నగదు లేదని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించి 165 జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భీమవరం–పాలకొల్లు రహదారిలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్బీఐ ఏటీఎం మధ్యాహ్న నుంచి పని చేసినా.. మిగిలిన ఏటీఎంలు మూతపడ్డాయి. జంగారెడ్డిగూడెంలో ఏటీఎంలు పని చేయలేదు. బ్యాంకుల్లో నగదు లేదు. ఆంధ్రాబ్యాంక్‌లో మాత్రం రైతులకు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు చిల్లర పంపిణీ చేశారు. ఏటీఎంలు మాత్రం పని చేయలేదు. లింగపాలెంలో బ్యాంకుల్లో క్యాష్ లేదని చెప్పారు. ఏటీఎంలు పని చేయలేదు. నగదు ఇవ్వడం లేదని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాంక్ వద్దకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రాగా, రూ.వెయ్యి చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట ప్రాంతంలోని బ్యాంకుల్లో నాలుగైదు రోజుల నుంచి ఖాతాదారులకు టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం వెళ్లి క్యూలో నిలబడితే తప్ప టోకె¯ŒS దక్కే పరిస్థితులు లేకపోవడంతో తెల్లవారకుండానే బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. భీమవరం పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. జిల్లాలో కూడా దీనిపై ఊదరగొడుతున్నారు. అయితే, స్వైపింగ్ మెషిన్ల కోసం నెలరోజుల క్రితమే బ్యాంకర్లకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ ఇవ్వలేదు. -
నోటు పాట్లు.. గుండె పోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నాయి. బ్యాం కుల వద్ద క్యూలు మాత్రం తరగడం లేదు. ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో రెండు రోజులకు డబ్బులు అందుబాటులో ఉండవన్న భయంతో శనివారం చాలా బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనపడ్డాయి. క్యూలో నిలబడలేక గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల కృష్ణమూర్తి (70) నగదు తీసుకునేందుకు గణపవరంలోని స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలబడగా, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఖాతాదారులు, పోలీసులు ఆర్ఎంపీతో ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. రోడ్డెక్కిన మహిళలు బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులతో మహిళలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇరగవరం ఎస్బీఐ వద్ద నగదు లేదని బోర్డు పెట్టడంతో బ్యాంకు ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో శనివారం ఉదయం 7 గంటలకే ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు క్యూలో నిలబడ్డారు. 10 గంటలకు వచ్చిన అధికారులు నగదు లేదని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించి 165 జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భీమవరం–పాలకొల్లు రహదారిలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్బీఐ ఏటీఎం మధ్యాహ్న నుంచి పని చేసినా.. మిగిలిన ఏటీఎంలు మూతపడ్డాయి. జంగారెడ్డిగూడెంలో ఏటీఎంలు పని చేయలేదు. బ్యాంకుల్లో నగదు లేదు. ఆంధ్రాబ్యాంక్‌లో మాత్రం రైతులకు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు చిల్లర పంపిణీ చేశారు. ఏటీఎంలు మాత్రం పని చేయలేదు. లింగపాలెంలో బ్యాంకుల్లో క్యాష్ లేదని చెప్పారు. ఏటీఎంలు పని చేయలేదు. నగదు ఇవ్వడం లేదని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాంక్ వద్దకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రాగా, రూ.వెయ్యి చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట ప్రాంతంలోని బ్యాంకుల్లో నాలుగైదు రోజుల నుంచి ఖాతాదారులకు టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం వెళ్లి క్యూలో నిలబడితే తప్ప టోకె¯ŒS దక్కే పరిస్థితులు లేకపోవడంతో తెల్లవారకుండానే బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. భీమవరం పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. జిల్లాలో కూడా దీనిపై ఊదరగొడుతున్నారు. అయితే, స్వైపింగ్ మెషిన్ల కోసం నెలరోజుల క్రితమే బ్యాంకర్లకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ ఇవ్వలేదు. -
చెన్నైను వణికిస్తున్న వర్దా తుపాను
-
ముందుచూపు లేక ఇబ్బందులు
పెద్దనోట్ల రద్దుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబు లేఖలు ఇచ్చినప్పుడల్లా అరిష్టమే కొత్తపేట : కేంద్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో నియోజకవర్గంలో మంగళవారం పలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్న పేద,సామాన్య ప్రజానీకానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కొత్తపేట ఆంధ్రాబ్యాంకు వద్ధ జగ్గిరెడ్డి స్వయంగా ప్రజలకు మజ్జిగ అందచేశారు.ఈ సందర్బంగా ఆయన బీఎం బీహెచ్ రవిశంకర్‌తో బ్రాంచ్‌కు నగదు సరఫరా, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.రైతులకు ఎంత ఇవ్వాలి?పెళ్లిళ్లు చేసుకుంటే ఎంత ఇవ్వాలి? ప్రభుత్వ పెన్షనర్‌కు రూ.10 వేలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మీరు ఎంత ఇస్తున్నారు? అంటూ బీఎంను ప్రశ్నించారు. రైతుకు రూ.50వేలు, పెళ్లికి రూ 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పిన మాట మాట వాస్తవమే కానీ ఇక్కడ నగదు వుండాలి కదా సార్. ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించి జిల్లాకు కేవలం రెండు చెస్ట్లే వున్నాయి. వచ్చిన నగదును వచ్చినట్టుగా పంపిణీ చేస్తున్నాం అంటూ బీఎం సమాధానం చెప్పారు. బాబూ.. లేఖలు రాయొద్దు జగ్గిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు లేఖలు (రాష్ట్ర విభజనకు, పెద్ద నోట్ల రద్దుకు) ఇచ్చినప్పుడల్లా రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇకపై ఎప్పుడూ లేఖలు రాయవద్దని జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజా సమస్యలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణ శూన్యమన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు, బ్యాంకర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల పార్టీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
ఢాబాలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
కధనరంగమే
పండుటాకుల పడిగాపులు పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద క్యూలు తోపులాటలతో పలువురికి గాయాలు పింఛన్ లబ్ధిదారులకు రెండు ఖాతాలు నగదు ఎందులో పడిందో తెలియక అవస్థలు మిగిలినవారి పరిస్థితీ ఇదే తీరు వణికించే చలిలో పండుటాకులు పింఛన్ డబ్బుల కోసం ఇల్లు వదిలి బ్యాంకుల ముందు బారులుదీరుతున్నారు. కొండంత కష్టాన్ని సైతం లెక్కచేయకుండా గంటలతరబడి నిలబడలేక కూలబడుతున్నారు. ఐదొందలైనా చేతికి చిక్కితే మందులకు ఉపయోగించుకోవాలన్న తపన సాయంత్రమైనా అక్కడినుంచి కదలనీయడం లేదు. పడిలేచైనా పది రూపాయల డబ్బులైనా తీసుకువెళ్లలేకపోతానా అనే ఆశ అడియాశలుగానే మిగిలిపోతోంది. సాక్షి, రాజమహేంద్రవరం: తమ ఖాతాల్లో పడిన పింఛన్ నగదు తీసుకునే సరికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛన్ కోసం ఖాతా పుస్తకాల దుమ్ము దులిపి, బ్యాంకులవైపు అడుగులు వేస్తున్నారు. డెబిట్, రూపే కార్డులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. నగదు కొరత కారణంగా అక్కడ భారీ క్యూలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బారులుదీరుతున్నారు. పది గంటలకు బ్యాంకు తెరవగానే ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. సోమవారం కాకినాడలోని జగన్నాథపురం ఎస్బీఐ బ్యాంకు వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఉదయం నుంచి వేచిఉన్న వృద్ధులు బ్యాంకు గేటు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఈ తోపులాట చోటుచేసుంది. పలువురు వృద్ధులు కిందపడడంతో గాయాలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ధవళేశ్వరం ఎస్.బి.ఐ వద్ద కిలోమీటర్ మేర క్యూలో నిలుచున్నారు. కాతేరు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంగణం వృద్ధులతో కిటకిటలాడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులన్నీ పింఛన్‌దారులతో కిక్కిరిసి ఉన్నాయి. బ్యాంకు సిబ్బంది ద్వారాల వద్ద నిలుచొని విడతలవారీగా వృద్ధులను బ్యాంకులోని పంపిస్తున్నారు. పలు బ్యాంకుల వద్ద షామియానాలు లేకపోవడంతో ఎండకు పండుటాకులు సొమ్మసిల్లిపడిపోయారు. చెలామణిలో లేకపోవడంతో సమస్య జిల్లాలో 47.5 లక్షల మంది పింఛన్‌దారులున్నారు. వీరికి ప్రతి నెల రూ.52 కోట్లు పంపిణీ చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రతి నెలా చేతికి ఇచ్చే పింఛన్ నగదు ఈ నెల నుంచి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. వృద్ధులకు బ్యాంకు ఖాతాలున్నా లావాదేవీలు జరపకపోవడంతో అవి చెలామణిలో లేవు. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. ఇప్పటికిప్పుడు ఖాతాను చెలామణిలో పెట్టుకుని, నగదు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకోసం గుర్తింపు కార్డుల నకళ్లు కోసం జిరాక్స్ సెంటర్‌కు, కొత్త పాస్ ఫొటో కోసం స్టూడియోలకు వెళుతున్నారు. బ్యాంకు అధికారులు తమవంతు సహాయంగా లబ్థిదారుల వద్ద ఖాతా చెలామణి అవసరమయ్యే పత్రాలు తీసుకుని వెంటనే నగదు ఇస్తున్నారు. ఇలా ఈ నెల ప్రారంభం నుంచి చేస్తున్నారు. పింఛన్ లబ్థిదారుల్లో దాదాపు 40 వేల మందికి ఖాతాలు లేవు. వీరందిరికీ ఖాతాలు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకులున్న పరిస్థితిలో ఇప్పటికిప్పుడు ఖాతాలు ప్రారంభించలేని పరిస్థితి. పలు బ్యాంకులు ఖాతా తెరవడానికి వస్తున్న వారి నుంచి పత్రాలు తీసుకుని 15 రోజుల తరువాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఎప్పటికి అందేనో..? జిల్లాలో పలు బ్యాంకులకు చెందిన 756 బ్రాంచీలున్నాయి. వీటిలో అర్బన్ పరిధిలో 206, సెమీ అర్బన్‌లో 249, గ్రామీణ ప్రాంతాల్లో 302 బ్రాంచీలున్నాయి. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 1069 గ్రామ పంచాయతీలున్నాయి. అంటే ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు ఒక బ్యాంకు ఉంది. జిల్లాలో ఉన్న 4.75 లక్షల పింఛన్‌దారుల్లో అధిక భాగం లబ్థిదారులు గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులు చాలా చిన్నవిగా ఉంటాయి. అందులో సిబ్బంది కూడా తక్కువగా ఉంటారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలు, జమలకు ఒకే కౌంటర్ ఉంటుంది. ఇతర లావాదేవీలు నిలిపివేసి బ్యాంకు పనివేళల్లో వృద్ధుల ఖాతాలు పరిశీలించి రోజుకు 100 మందికి పింఛన్లు ఇచ్చినా 302 బ్రాంచీలు 30,200 మందికి ఇవ్వగలవు. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లోని పింఛన్ నగదు అందాలంటే దాదాపు 10 రోజుల సమయం పడుతుంది. తీవ్ర పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది... పెద్దనోట్ల రద్దు తర్వాత గత నెల 9వ తేదీ నుంచి బ్యాంకులు కిటకిటలాడాయి. పెద్దనోట్ల జమ, నగదు మార్పిడితో నెల మొత్తం గడిచిపోయింది.ఇప్పటికీ నగదు కొరత కారణంగా విత్‌డ్రా కోసం ప్రజలు బ్యాంకులకు పరుగెడుతున్నారు. దీంతోపాటు పింఛన్లు కూడా బ్యాంకుల నుంచి పంపిణీ చేస్తుండడంతో సిబ్బంది త్రీవమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. -
లైటింగ్ తగ్గింది
-
మొదటి ఆదివారం అదే పరిస్థితి
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. జీతం డబ్బులు ఖాతాల్లో జమ అయినా.. వాటిని తీసుకోలేని పరిస్థితి ఉద్యోగులది. దీంతో డిసెంబర్ నెల మొదటి ఆదివారం కూడా సామాన్య ప్రజలు ఎలాంటి ఖర్చులకు వెళ్లకుండా ఉండటం కనిపిస్తోంది. మార్కెట్లో చికెన్, మటన్ షాపులు వెలవెలబోతున్నాయి. మరోవైపు డబ్బుకోసం ఏటీఎంలకు వెళ్తున్న ప్రజలను అక్కడి నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే డబ్బులున్న ఏటీఎంలు కనిపిస్తున్నా.. అక్కడ భారీ క్యూ లైన్లలోనే సెలవుదిన సమయం గడిచిపోతుంది. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 80 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. -
సూరత్ వస్త్ర పరిశ్రమపై నోట్లు రద్దు ప్రభావం
-
జీతమో.. సత్యదేవా?
అన్నవరం ఆలయ సిబ్బంది జీతాలకూ కటకట బ్యాంకుల ద్వారా ప్రతి నెలా రూ.రెండు కోట్లు జీతాలకు కేటాయింపు దేవస్థానం నిధులున్నా.. నగదుకొరతతో చెల్లించలేని పరిస్థితి పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల్లో నగదు కొరత.. ఈ ప్రభావంతో అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం సిబ్బందికి ఈ నెలలో పూర్తి స్థాయిలో జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. దేవస్థానం వద్ద రూ.కోట్ల నిధులున్నా, ఆ నగదంతా స్థానిక బ్యాంకుల్లోనే ఉంది. అయితే సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన ఆ బ్యాంకులు షరతులు పెడుతుండడం ప్రస్తుతం ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. - అన్నవరం సిబ్బంది జీతభత్యాల కింద నెలనెలా రూ.రెండు కోట్లు చెల్లింపు అన్నవరం దేవస్థానంలో పని చేస్తున్న సుమారు రెండు వేల మంది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ ఉద్యోగులు, వ్రతపురోహితులు, పెన్షనర్స్, నాయీబ్రాహ్మణులకు దేవస్థానం ప్రతి నెలా జీతాల రూపంలో రూ.రెండు కోట్లు చెల్లిస్తోంది. రెగ్యులర్ సిబ్బందికి, పెన్షనర్స్‌కు ఒకటో తేదీన, రెండు, మూడు తేదీలలో మిగిలిన వారికి బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. దేవస్థానం ఈఓ సంతకంతో జీతాల మొత్తానికి చెక్ రాసి ఏ ఉద్యోగికి ఎంత చెల్లించాలో ఉద్యోగుల లిస్ట్ జత చేసి బ్యాంకులకు పంపిస్తారు. రెగ్యులర్ సిబ్బందికి జీతాల కింద రూ.54 లక్షలు, పురోహితులకు పారితోషకం కింద రూ.40 లక్షలు స్టేట్‌బ్యాంక్ ద్వారా చెల్లిస్తారు. పెన్షనర్స్‌కి రూ.30 లక్షలు, నాలుగోతరగతి ఉద్యోగులకు రూ.20 లక్షలు, నాయీబ్రాహ్మణులకు రూ.ఆరు లక్షలు, మిగిలిన ఉద్యోగులకు రూ.50 లక్షలు ఆంధ్రాబ్యాంక్ ద్వారా ప్రతి నెలా చెల్లిస్తారు. బ్యాంకులలో ని«ధులు పుష్కలంగా ఉండేవి కనుక, ఈ జీతాలు బ్యాంకులోని తమ ఖాతాలకు జమైన రోజునే సిబ్బంది డ్రా చేసేసేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధం సిబ్బంది జీతభత్యాల కింద పూర్తిస్థాయిలో నగదు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద సరిపడనంత నగదు లేదు. రూ.500, వేయి నోట్లు రద్దవడంతో బ్యాంకులు వద్ద రూ.రెండు వేల నోట్లు, రూ.వంద నోట్లు, అంతకన్నా తక్కువ డినామినేషన్ నోట్లు మాత్రమే ఉన్నాయి. అవీ కూడా ఏ రోజుకారోజు ఆయా బ్యాంకుల ' ఛెస్ట్'లు(ట్రెజరీ బ్యాంకులు) నుంచి తెచ్చుకోవల్సి వస్తోంది. రూ.కోటి కావాలని ఇండెంట్ పెడితే రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు మాత్రమే ఇస్తున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వాటిలో రెండువేల నోట్లే అధికంగా ఉంటున్నాయని తెలిపారు. ఖాతాదారులు రూ.వంద నోట్లు అడుగుతున్నారని, అవి చాలా తక్కువ ఉంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో ఒకేసారి జీతాలు ఇవ్వలేమని తెలిపారు. జీతాల చెక్కులు గురువారం బ్యాంకులకు పంపిస్తాం దేవస్థానం సిబ్బంది జీతాల చెక్కులు డిసెంబర్ ఒకటో తేదీ, గురువారం స్థానిక స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంకులకు పంపిస్తాం. ప్రస్తుత పరిస్థితులలో వీలైనంత ఎక్కువ మొత్తం సిబ్బందికి చెల్లించాలని బ్యాంకు అధికారులకు చెప్పగలం తప్ప అంతకన్నా ఏమీ చేయలేం కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం పూర్తి జీతం ఒకేసారి ఇవ్వలేం డిసెంబర్ నెలకు సంబంధించి దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో జీతం వెంటనే ఇవ్వలేం. పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలంటే రూ.94 లక్షలు కావాలి. ప్రస్తుతం బ్యాంకు వద్ద రూ.30 లక్షలు కూడా నిల్వ లేదు. అది కూడా రూ.రెండు వేల నోట్లు మాత్రమే. సిబ్బంది కూడా సహకరించాలి. -డీఎస్కే శర్మ, స్టేట్‌బ్యాంక్ మేనేజర్, అన్నవరం రూ.పది వేలు చొప్పున మాత్రమే చెల్లిస్తాం దేవస్థానం నాలుగోతరగతి ఉద్యోగులు, పెన్షనర్స్‌కు పూర్తిస్థాయిలో చెల్లించేందుకు తగినంత నగదు లేదు. మొదట రూ.పదివేల చొప్పున మాత్రమే చెల్లిస్తాం. మిగిలిన మొత్తం తరువాత చెల్లిస్తాం. వైవీ సత్యనారాయణ మూర్తి, మేనేజర్, ఆంధ్రాబ్యాంక్ -
నాన్న.. అంతా మీరే చేశారు!
న్యూఢిల్లీ: పిల్లలపై తల్లి ప్రభావం కంటే తండ్రి ప్రభావమే అధికంగా ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అరుుతే తండ్రి ప్రభావం ఎవరిపై ఏయే విషయాల్లో ఉంటుందని తెలుసుకునేందుకు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశారుు. మగపిల్లలు భాషాశాస్త్రాల్లో రాణించడంపై, ఆడపిల్లలు గణితంలో రాణించడంపై తండ్రి ప్రభావం స్పష్టంగా ఉంటుందట. అంతేకాక పిల్లల్లో ఆశావాదం, ఆత్మవిశ్వాసం, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదిరించే గుణం తండ్రినుంచే అలవడుతుందని అమెరికాలోని టేక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అంతేకాక తండ్రి ప్రవర్తనను గమనించడం ద్వారా యుక్తవయసులో ఉన్న పిల్లలు తమ తెలుసుకోగలుగుతారని, తండ్రి నమ్మకాలు కూడా పిల్లలపై అనుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, పిల్లల్లో అంకితభావం పెరగడానికి కారణం కూడా తండ్రేనని తమ అధ్యయనంలో రుజువైందని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన మేరీ-అన్నే సురుుజో తెలిపారు. -
నోట్ల రద్దుతో నెల్లూరులో ’రియల్ ’ఢమాల్
-
ఖమ్మం కూరగాయల మార్కెట్‌పై నోట్ల రద్దు దెబ్బ
-
నోట్ల రద్దుతో కళ తప్పిన చేపల మార్కెట్
-
చిరు వ్యాపారులపై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
ఖాతాలపై కన్ను
బతుకులు బజారున పడిన భావన.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆవేదన. ‘నోటు’కాడ కూడు నేల పాలైన ఆందోళన. ఇదీ జిల్లాలోని సామాన్యులు, చిరు వ్యాపారుల పరిస్థితి. నల్లధనం పోగేసిన కుబేరులపై యుద్ధం చేయాలంటే.. సామాన్యుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయాలా? అనే ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. ఒకచోట గంటల తరబడి బ్యాంకుల్లో చిల్లర కోసం పడిగాపులు పడుతున్న జనం.. మరోచోట వ్యాపారాలు లేక ఆవేదన చెందుతున్న వ్యాపార గణం.. గ్రామగ్రామాన ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు కుబేరులు నిరుపేదలకు సంబంధించిన జన్ధ¯ŒS యోజన ఖాతాల్లో పెద్దఎత్తున సొమ్మును డిపాజిట్ చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ¯ŒSధ¯ŒS ఖాతాల్లో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సదరు ఖాతాలను స్తంభింప చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. పెద్ద మొత్తాలని డిపాజిట్ చేసిన జ¯ŒSధ¯ŒS ఖాతాలు జిల్లాలోనూ ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్తంభింపచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. జీలుగుమిల్లి మండలంలో రూ.3 లక్షల సొమ్ము జమ అయిన ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే, పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా ఖాతాల వివరాలను ఐకేపీ అధికారులకు అందచేస్తామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అవే కష్టాలు మరోవైపు పెద్దనోట్లు రద్దుచేసి 15 రోజులు దాటినా నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం, పనిచేసే ఏటీఎంలలో డబ్బులు అయిపోవడంతో జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. బ్యాంకుల్లో చిల్లర లేదంటూ రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు రూ.500 నోట్లు వచ్చినా.. బ్యాంకులకు చేరుకోలేదు. మరోవైపు నగదు ఇవ్వడం లేదని తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ తెరిచిన అరగంట లోపే నగదు అయిపోయిందని చెప్పడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో పాత నోట్లు మార్చుకోవడానికి గురువారం అర్ధరాత్రితో గడువు ముగియ డంతో ఆందోళన ఎక్కువైంది. గడువు పెంచాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చొరవతో స్వైపింగ్ మెషిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. భక్తలనూ తాకిన పెద్దనోట్ల సెగ పెద్ద నోట్ల సెగ భక్తులనూ తాకింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇరుముడులకు అవసరమయ్యే పూజా సామగ్రి కొనుగోలుకు చిల్లర నోట్ల సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం సగానికిపైగా పడిపోయిందని పూజా సామగ్రి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం తగ్గింది. ఇళ్ల స్థలాల క్రయ విక్రయాలు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిసెబర్ 31 తరువాత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో పాత నోట్లు తీసుకునే వెసులుబాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేదని ఆ శాఖ డీఐజీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇదిలావుంటే.. నగదు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు జరిగాయి. కొత్తనోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకూ చట్ట, న్యాయబద్ధమైన లావాదేవీలకు పెద్దనోట్లను అనుమతించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. -
ఆటంకాలే
గ్రిగ్పోటీలకు దక్కని బాసట ప్రభుత్వం నుంచి నిధులు లేవు జెడ్పీ నుంచి దక్కని చేయూత పెద్దనోట్లకు చిల్లరి లేదు భారంగా మారిన జోనల్ గ్రిగ్ పోటీలు అమలాపురం : పాఠశాల స్థాయిలో జరిగే జోనల్ గ్రిగ్ పోటీలకు నిధులు కొరత పట్టిపీడిస్తోంది. ఈ పోటీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందలేదు. గతంలో జెడ్పీ నుంచి మైదానం అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిలిచిపోయాయి. దాతల సహాయం తీసుకుందామన్నా.. పెద్దనోట్లు పెద్ద సమస్యగా మారాయి. దీంతో పోటీల నిర్వహణ ప్రహసనమైంది. జెడ్పీ మొండి చేయి చూపడంతో.. పాఠశాల స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే గ్రిగ్ పోటీలు జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆరంభమయ్యాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ రెండు నుంచి ప్రారంభం కావల్సి ఉండగా, నిర్వహణ భారం మోయలేక కొన్ని పోటీలను ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు నిధుల కొరత పట్టిపీడిస్తోంది. పోటీల నిర్వహణకు జోన్ స్థాయిలో రూ.మూడు లక్షలు, సెంట్రల్ జోన్ పోటీలకు రూ.రెండు లక్షలు ఖర్చవుతోంది. తొలి నుంచి పోటీలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేదు. పోటీల్లో పాల్గొనే ఆయా పాఠశాలలు ఎంట్రీ ఫీజులు, అప్లికేషన్ ఫీజులు చెల్లించే రుసుమునే ఆయా పాఠశాలలకు రూ.పది వేల చొప్పున కేటాయిస్తున్నారు. గతంలో మైదానాల అభివృద్ధి పేరుతో జిల్లా పరిషత్ రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది జెడ్పీ కూడా మొండిచేయి చూపించింది. దీంతో పోటీల నిర్వాహకులు దాతలు అందించే సహాయంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. తీరా నోట్ల రద్దుతో పెద్దనోట్లు మారకపోవడం, చిల్లరి నోట్లు దొరకక నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తనోట్లు లేకపోవడం, పాతనోట్లు తీసుకోకపోవడంతో పోటీలు నిర్వహించలేకపోతున్నారు. అమలాపురం జోన్ బాలుర గ్రిగ్ పోటీలు ఈ ఏడాది అయినవిల్లి మండల కొండుకుదురుకు కేటాయించారు. నిర్వహణ భారమైనా పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజోలు, రామచంద్రపురం, రంపచోడవరం, తుని, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం జోన్లలో బాలురు, బాలికల క్రీడాపోటీల నిర్వహణకు సైతం ఇవే ఇబ్బందులున్నాయి. పక్కదారినపడుతున్న ఖేల్‌రత్న నిధులు మూడు, నాలుగు రోజుల పాటు వందల మంది విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించే గ్రిగ్ పోటీల నిర్వహణకు నిధులు లేవు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తయ్యే ఖేల్‌రత్న(గతంలో పైకా) పోటీలకు మాత్రం నిధులిస్తున్నారు. మండల స్థాయిలో రూ.30 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.40 వేలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకువెళుతున్నారు. కేటాయిస్తున్న నిధులను చాలా మంది ఎంపీడీఓలు నొక్కేస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఇలా అవసరమైన చోట నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోట సద్వినియోగం కాకపోవడం పాఠశాల స్థాయి క్రీడాకారులకు శాపంగా మారింది. ప్రత్యేకంగా నిధులివ్వాలి పాఠశాలల్లో క్రీడా పోటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. నిర్వహణకు లక్షల్లో ఖర్చుపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఖేల్‌రత్నకు ఇస్తున్నట్టుగా జోనల్ గ్రిగ్ పోటీలకు సైతం ప్రభుత్వం నిధులివ్వాలి. – ఉండ్రు ముసలయ్య, అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు. -
ఖమ్మం రైతు మార్కెట్లో నోట్ల రద్దు ఎఫెక్ట్
-
ఇదో రకం ధనిద్రం
తమకో, తమ వారికో ఏదైనా జబ్బు వచ్చి, చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోతే పేదలు పడే బాధ జబ్బు బాధ కన్నా ఎక్కువేనని వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడలాంటి బాధను కొందరు డబ్బులుండి కూడా అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దు, కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోట్లు రోగులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అత్యవసర సేవలకు రద్దయిన పెద్దనోట్లు ఈ నెల 24 వరకూ చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, మందుల షాపుల యజమానులు వాటిని తీసుకోవడానికి తిరస్కరిస్తుండడంతో రోగుల బంధువులు అవస్థలు పడుతున్నారు. ఇక కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. రెండు వేల నోటు తీసుకెళుతుంటే చిల్లర లేదన్న సమాధానమే వస్తోంది. దీంతో రోగులు, వారి బంధువులు ఉసూరుమంటున్నారు. వ్యాధుల వ్యధకు తోడవుతున్న నోట్ల బాధ రద్దయిన పెద్దనోట్లను తిరస్కరిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త రూ.2000 నోటుకు దొరకని చిల్లర ఆధార్ నకలు అందజేస్తేనే ఇస్తున్న బ్యాంకులు సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఆస్పత్రుల్లో ఓపీ ఫీజులు రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. రెండు వేల నోటు తీసుకుంటే మిగతా చిల్లర వందల రూపంలో ఇవ్వాల్సి వస్తుండడంతో ఆస్పత్రి సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఓపీ ఫీజు, బయట మందుల దుకాణంలో మందులు, రక్తపరీక్ష కేంద్రాల్లో ఫీజులు చెల్లించేందుకు రూ. రెండు వేల నోటు ఇస్తుంటే, వారు చిల్లర ఇవ్వాలని అడుగుతుండడంతో రోగులకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అసలే ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రులకు వెళుతుంటే చిల్లర సమస్య వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. చేతిలో చెలామణి అయ్యే నగదు ఉన్నా వైద్యం చేయించుకోలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రెండువేల నోటుకు చిల్లర కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆస్పత్రిలోనే ఓపీ ఫీజు, పరీక్షలు, మందులు దొరికే విధంగా ఉన్న పరిస్థితుల్లో కొంత ఉపశమనంగా ఉంది. అలాంటి చోటఅన్నీ కలిపి ఒకే సారి బిల్లు చేసి రూ.రెండు వేల నోటు తీసుకుంటున్నారు. బ్యాంకుకు వెళితే పూట పడిగాపులే.. రూ.100, 50, 20, 10 నోట్లు తగినంతగా అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. తమ వద్ద పాత నగదు ఉన్నా చెల్లకపోవడం, ఉన్న రెండు వేల నోటుకు చిల్లర లేకపోవడంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రద్దీ కారణంగా బ్యాంకుకు వెళ్లిన వారు రోజులో ఓ పూట అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న చిల్లర నోట్ల నిల్వలను అందరికీ పంచేందుకు ఒక్కొక్కరికీ రూ. రెండు వేలు మాత్రమే చిల్లర నోట్లు ఇస్తున్నారు. అదీగాక ఆధార్ నకలు ఇస్తేనే బ్యాంకులు రెండు వేల నోటుకు చిల్లర ఇస్తుండడం గమనార్హం. -
రైతు బజార్లపై నోట్ల రద్దు ప్రభావం
-
పెద్ద నోట్ల రద్దుతో వీటి జాతకం అదుర్స్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు వీధుల్లోకి వచ్చి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు మాత్రమే క్యూలు కట్టడం లేదు. ఆన్లైన్ జాతక ఫలితాల కోసం కూడా క్యూలు కడుతున్నారు. తమ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయన్నదే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా చెప్పాలంటూ ప్రజలు వారి వెంట బడుతున్నారు. దిన, వార రాశి ఫలాలతోపాటు, బ్రహ్మరాత, హస్తవాశి, భవిష్యత్ ఎరుక చెబుతామంటూ ఇటీవలనే ఆన్లైన్లో వెలసిన జ్యోతిష్కులు, సంఖ్యాశాస్త్ర పండితులు అదరగొడుతున్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నాటి నుంచి తమ వ్యాపారం 40 నుంచి 50 శాతానికి పెరిగిందని ఆస్క్మాంక్ డాట్ ఇన్, మాంక్వ్యాసా డాట్ కామ్, ఐజోఫి డాట్ కామ్, ఆస్ట్రోబడ్డీ లాంటి ఆన్లైన్ జాతక సంస్థలు తెలియజేస్తున్నాయి. ప్రతి రోజు తమకు 10, 20 మంది కస్టమర్లు ఫోన్ చేసేవారని, పెద్ద నోట్లు రద్దయిన నాటి నుంచి తమకు 30, 40 కాల్స్ వస్తున్నాయని ఆస్క్మాంక్ వ్యవస్థాపకులు వైభవ్ మాగన్ తెలిపారు. వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులతోపాటు ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పు ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన చెప్పారు. తమకు ఫోన్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది కిరాణా వ్యాపారులు ఉన్నారని తెలిపారు. తమ సంస్థను కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలనే కాకుండా దేశ ఆర్థిక పురోగతి ఎలా ఉంటుందని కూడా అడుగుతున్నారని ఐజోఫి డాట్ కామ్ వ్యవస్థాపకులు రోహిత్ సింగానియా తెలిపారు. ప్రైమ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ కంపెనీ ఆరు నెలలే క్రితమే కోల్‌కతా కేంద్రంగా ఈ జాతక సంస్థను ఏర్పాటు చే సింది. ఈ సంస్థ జాబితాలో 150 మంది జ్యోతిష్యులు ఉన్నారు. వారిలో ప్రముఖ తారో కార్డు రీడర్ (బొమ్మ కార్డులు చూసి జాతకాలు చెప్పడం) సీమా మీధా, ప్రముఖ జ్యోతిష్యుడు ఆర్కే శ్రీధర్‌లు ఉన్నారు. తమకు కస్టమర్ల నుంచి రోజువారి వచ్చే కాల్స్ సంఖ్య రెట్టింపై వెయ్యి కాల్స్‌కు చేరిందని కోచి నుంచి పనిచేస్తున్న మాంక్వ్యాసా డాట్ కామ్ సహ వ్యవస్థాపకులు దినూప్ కల్లేరిల్ తెలిపారు. 24 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సున్న వారే తమకు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారని ఆయన చెప్పారు. వోడాఫోన్, ఏయిర్‌సెల్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేసే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఆర్సోబడ్డీ సంస్థకు రోజువారి కాల్స్ 20 వేల నుంచి 32 వేలకు పెరిగిందని వ్యవస్థాపకులు భూపేశ్ శర్మ తెలిపారు. తమ కుటుంబం చిన్నాభిన్నమైందని, ఆర్థికంగా కుంగిపోయామని, వ్యాపారంలో భారీగా నష్టం వచ్చిందని, దీనికి పరిష్కారం చూపించాలంటూ....ఆర్థిక ఇబ్బందుల వల్ల సరకు సకాలంలో సరకు సరఫరా చేయకపోవడం వల్ల తనపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఇప్పుడు తనకు శిక్ష పడుతుందా? శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి?......అప్పుల్లో పీకలోతు వరకు కూరుకుపోయాను. బయట పడాలంటే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలు కూడా కస్టమర్ల నుంచి వస్తాయని ఈ సంస్థలు తెలియజేస్తున్నాయి. కస్టమర్లు అడిగే ఒక్కో ప్రశ్నకు, సూచించే పరిష్కారానికి ఈ జాతక సంస్థలు 300 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తాయి. సాధారణ పశ్నలకు 300 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తే, కీలకమైన ప్రశ్నలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రశ్నలడిగే ప్రజల జాతకాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ ఆన్లైన్ జాతక సంస్థల జాతకాలు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. -
ఎన్నాళ్లీ క(న)ష్టాలు
తొలగని చిల్లర ఇక్కట్లు సామాన్యుల సతమతం వరి కోతలలకూ దెబ్బ 80 శాతం పనిచేయని ఏటీఎంలు రూ. జిల్లాకు రూ.600 కోట్లు కావాలని ఇండెంట్ కనీసం రూ.200 కోట్లు వస్తే కొంత సమస్య తీరినట్టే ఆచరణలోకి రాని పెంట్రోలు బంకుల వద్ద నోట్ల మార్పిడి రూ.2 వేల నోటున్నా వైద్యం అందక ఓ వ్యక్తి మృతి ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలోనని భయపడుతున్న జిల్లా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టి పక్షం రోజులు కావస్తున్నా ప్రజల ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. బ్యాంకుల వద్ద డబ్బులు లేకపోవడం, ఏటీఎంలు మూసి వేయడంతో బారులు తీరి నిరాశతో వెనుకకు తిరిగిన సందర్భాలే అధికం. ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి. ఆస్తమాతో బాధపడుతున్న ఏజెన్సీకి చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్దామని బయలుదేరాడు. ఆయన వద్ద రూ. 2 వేల నోటుంది. చిల్లర కోసం గంటలతరబడి తిరిగి తీరా చిల్లర చేజిక్కాక ఆసుపత్రికి వెళ్లడానికి బైకుపై వెళ్తుండగా ఆదివారం మధ్యాహ్నం మార్గ మధ్యలోనే తనువు చాలించాడు. ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని జిల్లా ప్రజలు భయపడుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పాత రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దుతో గత పదమూడు రోజులుగా జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అవసరమైన మేరకు ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో సరిపడా నగదు లేకపోవడం, బ్యాంకుల్లో నగదు మార్పిడిని క్రమంగా తగ్గించడంతో సమాన్యుల వెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ప్రజలకు పంపిణీ చేసిన నగదులో 80 శాతం రూ.2 వేల నోట్లుండడంతో అవి మార్చుకోవడానికి ప్రజలు తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు వందలకు కొనుగోలు చేసినా మిగతా చిల్లర మొత్తం రూ.వందల్లో ఇవ్వాల్సి వస్తుండడంతో వ్యాపారులు రూ.రెండు వేల నోట్లు తిరస్కరిస్తున్నారు. దీంతో నిత్యవసర సరుకులు కూడా ప్రజలు కొనుగోలు చేయాలేని పరిస్థితి నెలకొంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వ్యాపారాలు దాదాపు 70 శాతం తగ్గిపోయాయి. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులు, బడ్డీకోట్లు వారు 13 రోజులుగా వ్యాపారాలు లేక కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు తమకు రూ.600 కోట్లు కావాలని ఆర్బీఐకు ఇండెంట్ పెట్టాయి. ఇందులో రూ.200 కోట్లు వస్తే నగదు కొరత సమస్య దాదాపు తీరుతుందని లీడ్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మరో రూ.50 కోట్లు రూ.100 నోట్లు చెలామణిలోకి వస్తే చిల్లర సమస్య కూడా తీరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.100 నోట్లను పూర్తి స్థాయిలో చెలామణి చేయకుండా భవిష్యత్తు అవసరాలకు దాస్తుండడంతో చిల్లర సమస్య తలెత్తుతోందని పేర్కొంటున్నారు. ఏటీఎం.. ఎనీ టైం మూత.. నగదు కొరత వల్ల జిల్లాలోని అన్ని ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. 811 ఏటీఎంలకుగాను కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తున్నాయి. అన్ని ఏటీఎంలను రూ.రెండు వేల నోట్లకు అనుగుణంగా మార్చకపోవడం వల్ల చిన్న పట్టణాలల్లోని ఏటీఎంలలో రూ.రెండు వేల నోట్లు కూడా లభించడంలేదు.బ్యాంకుల వద్ద, ముఖ్యమైన కూడళ్లలోని ఏటీఎంలలోనే బ్యాంకులు నగదును అందుబాటులో ఉంచుతున్నాయి. రూ.రెండు వేలు, రూ.100 నోట్లు పెడుతుండగా రూ.100 నోట్లు నిమిషాల్లో అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏటీఎంల వద్ద 'నో క్యాష్, రూ.రెండు వేల నోట్లు మాత్రమే' అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ డీలర్ల నుంచి నగదు పంపిణీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించినా ఆ ప్రక్రియ ఇంకా జిల్లాలో ప్రారంభంకాలేదు. వరి కోతలకు చిల్లర దెబ్బ... జిల్లాలో వరి ఖరీఫ్ కోతలు మొదలైన పక్షం రోజులు దాటింది..పెద్ద నోట్లు రద్దు.. రూ. 100 నోట్లు లేకపోవడంతో వరి కోతలకు కూలీలు రావడంలేదు. చిల్లర నోట్లు ఇస్తామంటేనే కోతలకు వస్తామని ముందుగానే తెల్చి చెబుతున్నారు. దీంతో కోతలు ఆలస్యమై పంటకు దోమ పడుతోంది. అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయకపోతుండడంతో గింజలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో ప్రజలకు పాత నోట్లు... విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు సిబ్బంది చిల్లర లేదని పాత రూ.500 నోట్లు ఇస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఇంజినీర్ ఎ.అప్పారావు సోమవారం ఈపీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రంలో రూ.1,388 బిల్లునకు రూ.2000 నోటు ఇచ్చారు. అయితే బిల్లు కట్టిన తర్వాత పాత రూ.500 నోటు రూ.100 నోట్లు ఇస్తున్నారు. పాత నోటు ఇస్తున్నారేంటని అప్పారావు అడగ్గా సిబ్బంది దురుసుగా మాట్లాడారని ఆయన వాపోయారు. ఈ విషయమై 'సాక్షి' ఏపీఈపీడీసీఎల్ అకౌంట్ ఆఫీసర్ ఆదినారాయణతో మాట్లాడగా.. చిల్లర లేక అలా ఇచ్చి ఉండవచ్చని, తగినంత చిల్లర లేకపోతే మొత్తం నగదుకు బిల్లు చేసే విధంగా సిబ్బందికి ఆదేశాలిస్తామని చెప్పారు. రూ.500 నోటు తీసుకున్న వ్యక్తి మంగళవారం కార్యాలయానికి వస్తే రూ.100 నోట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. -
కాకినాడ కాజాపై నోట్ల రద్దు ప్రభావం
-
అప్పుడు కళ కళ..ఇప్పుడు వెల వెల
-
నోట్లు నిండుకున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పది రోజుల తర్వాత కూడా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు నగదు లేదన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు సైతం చాలావరకు మూతపడే ఉన్నాయి. వాటిలో పెడుతున్న నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. వాటివద్ద కూడా ‘అవుటాఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’ అనే బోర్డులు వేలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో శుక్రవారం నాటికి రూ.100 నోట్లు దాదాపు నిండుకున్నాయి. చాలా బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ‘నగదు నిండుకున్నందుకు చింతిస్తున్నా’మంటూ బ్యాంకుల ఎదుట బోర్డులు పెట్టి తలుపుల్ని మూసేస్తున్నారు. నిఘా పెరిగింది ప్రైవేటు బ్యాంకులు అప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరిచి నల్లధనాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటి లావాదేవీలపై ఇంటెలిజె¯Œ్స విభాగం నిఘా పెట్టింది. జ¯ŒSధ¯ŒS ఖాతాలతోపాటు రుణాలు చెల్లిస్తున్న డ్వాక్రా మహిళల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని బ్యాంకుల్లో జరిగే రోజువారీ లావాదేవీలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ముల వివరాలు, నోట్ల మార్పిడికి సంబంధించిన పూర్తి వివరాలు పంపాలని ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలొ చ్చాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన సీసీ పుటేజీ ఆర్బీఐకు అందజేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టాఫీసు, బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేయడంతో.. వ్యక్తిగత ఖాతాల్లోని సొమ్ముల్ని ఏటీఎంల ద్వారా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. చాలామంది తమవద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడం తలకుమించిన భారంగా మారింది. దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. పలుచోట్ల కమీష¯ŒS తీసుకుని చిల్లర ఇస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని పేదలు, కూలీలు తమకు వేతనం రూపంలో ఇచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, కిరాణా దుకాణాలలో సరుకుల కొనుగోలుకు కూపన్లు ఇస్తామని ప్రకటించినా.. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో అన్ని వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. ఒక్క స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖల్లో మాత్రమే నగదు నిల్వలు ఉంటుండగా, వాటి శాఖల్లో మాత్రం సొమ్ములు ఉండటం లేదు. దీంతో ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచిల వద్ద రద్దీ కనబడుతోంది. పాలకోడేరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శుక్రవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మేనేజర్ సరిగా సమాధానం చెప్పడం లేదంటూ ఖాతాదారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. -
నోట్లు నిండుకున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పది రోజుల తర్వాత కూడా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు నగదు లేదన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు సైతం చాలావరకు మూతపడే ఉన్నాయి. వాటిలో పెడుతున్న నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. వాటివద్ద కూడా ‘అవుటాఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’ అనే బోర్డులు వేలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో శుక్రవారం నాటికి రూ.100 నోట్లు దాదాపు నిండుకున్నాయి. చాలా బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ‘నగదు నిండుకున్నందుకు చింతిస్తున్నా’మంటూ బ్యాంకుల ఎదుట బోర్డులు పెట్టి తలుపుల్ని మూసేస్తున్నారు. నిఘా పెరిగింది ప్రైవేటు బ్యాంకులు అప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరిచి నల్లధనాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటి లావాదేవీలపై ఇంటెలిజె¯Œ్స విభాగం నిఘా పెట్టింది. జ¯ŒSధ¯ŒS ఖాతాలతోపాటు రుణాలు చెల్లిస్తున్న డ్వాక్రా మహిళల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని బ్యాంకుల్లో జరిగే రోజువారీ లావాదేవీలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ముల వివరాలు, నోట్ల మార్పిడికి సంబంధించిన పూర్తి వివరాలు పంపాలని ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలొ చ్చాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన సీసీ పుటేజీ ఆర్బీఐకు అందజేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టాఫీసు, బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేయడంతో.. వ్యక్తిగత ఖాతాల్లోని సొమ్ముల్ని ఏటీఎంల ద్వారా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. చాలామంది తమవద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడం తలకుమించిన భారంగా మారింది. దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. పలుచోట్ల కమీష¯ŒS తీసుకుని చిల్లర ఇస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని పేదలు, కూలీలు తమకు వేతనం రూపంలో ఇచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, కిరాణా దుకాణాలలో సరుకుల కొనుగోలుకు కూపన్లు ఇస్తామని ప్రకటించినా.. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో అన్ని వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. ఒక్క స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖల్లో మాత్రమే నగదు నిల్వలు ఉంటుండగా, వాటి శాఖల్లో మాత్రం సొమ్ములు ఉండటం లేదు. దీంతో ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచిల వద్ద రద్దీ కనబడుతోంది. పాలకోడేరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శుక్రవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మేనేజర్ సరిగా సమాధానం చెప్పడం లేదంటూ ఖాతాదారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. -
పెద్ద నోట్ల రద్దుతో ఏపీ అల్లకల్లోలం
-
తెలంగాణ ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం
-
వెలవెలబోతున్న కూరగాయల మార్కెట్లు
-
నోట్ల రద్దుతో పల్లె జీవనం కుదేలు
-
ఏపీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం
-
కరెన్సీ రద్దుతో ఆలయాలకు తగ్గిన భక్తులు
-
ఆర్టీసీకి ‘చిల్లర’ దెబ్బ
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపైనా పడింది. చిల్లర కొరత, రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల ఎదుట క్యూ కట్టాల్సి రావడంతో ప్రజలు ప్రయాణాలను విరమించుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.8 లక్షల వరకూ ఆదాయ నష్టం వాటిల్లుతోంది. కార్తీక మాసంలో ఆదాయం గణనీయంగా పెరగాల్సి ఉంది. ఏటా ఈ సీజ¯ŒSలో జిల్లాలోని శైవ క్షేత్రాలు, రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులు అధికంగా ఉంటారు. చిల్లర కొరత కారణంగా భక్తులెవరూ పెద్దగా ప్రయాణాలు చేయడం లేదు. సమీపంలోని శివాలయాలను దర్శించుకుని సరిపెడుతున్నారు. అయ్యప్ప మాలధారులు సైతం ప్రయాణాల విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఆర్టీసీకి సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోల్చితే కార్తీక మాసంలో మరో 15 శాతం వరకూ అధికంగా ఆదాయం వస్తుంది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెద్దనోట్ల ప్రభావంతో సుమారు 10 వేల మంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్టు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని 8 డిపోల నుంచి తిప్పుతున్న ఆర్టీసీ సర్వీసులలో ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. 10 వేల మంది ప్రయాణికులు తగ్గడంతో రోజువారీ ఆదాయం రూ.8 లక్షల వరకు తగ్గినట్టు అంచనా. కార్తీక మాసంలో రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం సమకారాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి రూ.65 లక్షలు మాత్రమే వస్తోంది. ఈ సీజ¯ŒSలో రావాల్సిన రోజువారీ ఆదా యంలో రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు కోల్పోతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోలిస్తే రోజుకు రూ.8 లక్షల వరకు ఆదాయం తగ్గింది. నిత్యం 10 వేలమంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని, ఈ కారణంగా రోజువారీ సగటు ఆదాయంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు గండి పడుతున్నట్టు అంచనా వేశామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు వ్యాఖ్యానించారు. -
నోటు పాట్లు
ఎక్కడ చూసినా రూ.500, రూ.1000 నోట్ల రద్దు పాట్లే కుదుపునకు లోనైన దైనందిన జీవనం పాలప్యాకెట్ల నుంచి మాత్రల వరకూ.. ఏం కొనాలన్నా ఇక్కట్లే పెద్ద నోట్లను తీసుకోమంటున్న వ్యాపారులు కనీస అవసరాలూ తీరక లబోదిబోమంటున్న జనం జిల్లాలో ఎవరిని కదిపినా, ఎవరి నోట విన్నా పెద్దనోట్ల రద్దు తెచ్చిన చిక్కులూ, ఇక్కట్లే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం వంటి పట్టణాలు, గ్రామాలు, మారుమూల పలెల్లో..ఇలా జిల్లా అంతటా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన రూ.500, రూ.1000 నోట్లంటేనే.. పోట్లగిత్తను చూసినట్టు బెదురుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకైతే దైనందిన జీవనం స్తంభించినట్టయింది. కేంద్రం మినహాయిం పునిచ్చిన పాలబూత్‌లు, మందుల షాపులలో సైతం పెద్దనోట్లు తీసుకోవడం లే దు. మంగళవారం అర్థరాత్రి వరకు వంద నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా దొరక లేదు. తెల్లారి లేస్తే పాలప్యాకెట్ నుంచి కాయగూరలు, టీ, టిఫిన్, నిత్యావసర సరుకులు, తినుబండారాలు, రెస్టారెంట్లు, పెట్రోలు బంక్‌లు, పళ్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా వంద నోటు ఉంటేనే సరుకు ఇస్తున్నారు. చేతిలో వంద నోట్లు లేక ఏమి చేయాలో దిక్కుతోచక జనం సతమతమవుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లు బ్యాంక్‌లలో ఎప్పుడు జమ చేస్తాం, కొత్త నోట్లు ఎప్పుడు తిరిగి చేతికిస్తారు, అవసరాలు ఎప్పటికి తీరతాయని ఆందోళన చెందుతున్నారు. పెట్రోలు బంకులలో రూ.500 ఇచ్చి వంద రూపాయలకు పెట్రోలు పోయమంటే పోయడం లేదు. కావాలంటే రూ.500 పెట్రోలు పోస్తామనడంతో అందుకు సిద్ధపడ్డవారే పోయించుకున్నారు. అన్నవరం దేవస్థానంలో వ్రతాల కౌంటర్ వద్ద కూడా భక్తులకు ఇవే ఇబ్బందులు ఎదురయ్యాయి. పడిపోయిన వ్యాపారాలు నోట్ల చిక్కులతో జిల్లాలోసగానికి సగం వ్యాపారాలు పడిపోయాయి. ఇంతవరకూ వినియోగదారులు రూ.500 నోటు తీసుకువెళ్లి రూ.70 లేదా రూ.80 సరుకులు కొన్నా వ్యాపారులు తిరిగి చిల్లర ఇచ్చేవారు. ఇప్పుడు రూ.500 నోటు ఇచ్చినా అంత మొత్తానికీ సరుకులు తీసుకోమంటున్నారు. వినియోగదారుల నుంచి రూ.500 తీసుకుని అడిగిన సరుకులు ఇచ్చేస్తే ఆ నోట్లు హోల్‌సేల్ వ్యాపారికి ఇచ్చినా తీసుకోవడం లేదని వ్యాపారులంటున్నారు. వంద నోటు లేదా కొన్న సరుక్కి సరిపడా చిల్లర తెస్తేనే సరుకులు ఇస్తుండడంతో వ్యాపారాలు పడిపోయాయంటున్నారు. వంద నోట్లతో వ్యాపారం కోనసీమలోని అమలాపురం, అంబాజీపేట, కాకినాడ సహా పలు పట్టణాల్లో ఈ నోట్ల వ్యవహారాన్ని కూడా కొందరు వ్యాపారంగా మార్చేశారు. వంద నోట్లు ఉన్న వారు కమీషన్ వ్యాపారంగా సొమ్ము చేసుకుంటున్నారు. నెల, నెల, రోజువారీ వడ్డీవ్యాపారులు ఈ వ్యవహారంలో ముందున్నారు. వంద నోటుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను బట్టి వెయ్యి రూపాయలకు వంద కమీషన్‌గా నిర్ణయించారు. కొందరు రూ.500 నోటు తీసుకుని రూ.450 ఇస్తున్నారు. తీసుకునే వారు రూ.50 పోతే పోయాయి ప్రస్తుతం అవసరం గట్టెక్కుతుందని సరిపెట్టుకుంటున్నారు. మందగించిన రిజిస్ట్రేషన్ లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశమి, ఏకాదశి రోజుల్లో సుమారు రోజుకి వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. సుమారు రూ.3 కోట్లు లావాదేవీలు జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు, బ్యాంకులు సెలవు కావడం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో బుధవారం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలపోయాయి. జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సుమారు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు మాత్రమే కాగా ఆదాయం సుమారు రూ.50 లక్షలు మాత్రమే వచ్చింది. శుభకార్యాలపైనా ప్రభావం పెద్దనోట్ల రద్దు ప్రభావం వివాహాది శుభకార్యాలపైనా కనిపించింది. కాకినాడ వినుకొండ వీధిలో గుండా వెంకటసత్యనారాయణ కుమార్తె వివాహానికని అన్నీ రూ.500 నోట్లు తెచ్చి ఇంటిలో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ నోట్లు తిరిగి జమచేయాలనడంతో ఎప్పటికి తిరిగి సొమ్ములు చేతికొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. కె.గంగవరం మండలం భట్లపాలికలో వడ్లపాటి వీరవెంకటసత్యనారాయణ కుమార్తె సూర్యకళకు ఈ నెల 15న వివాహం. పెళ్ళి కోసం రూ.50 వేలు అప్పు తెచ్చుకున్నారు. ఆ సొమ్మంతా రూ.500 నోట్లే. ముహూర్తం చూస్తే దగ్గరకు వచ్చేసిందని, ఏం చేయాలో పాలుపోవడం లేదని సత్యనారాయణ ఆందోళన చెందుతున్నారు. అందాలు చూసేందుకు వచ్చి అవస్థలు కోనసీమ అందాలను ఆస్వాదించేందుకు మహారాష్ట్ర నాగపూర్ యూనివర్సిటీ నుంచి నాలుగు కుటుంబాలు రాజమహేంద్రవరంలో రైలు దిగి అమలాపురంలో స్నేహితుడైన ప్రొఫెసర్ ఇంటికి వచ్చారు. ఇంతలో వారిని రూ.1000, రూ.500 నోట్ల రద్దు ఆందోళనలో పడేసింది. బుధవారం ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయక, తమ వద్ద ఉన్న పెద్ద నోట్లు మారక, అవసరాలు తీరక ఆ నాలుగు కుంటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి. మారకంలో ‘నకిలీ సిరి’ మంతులు బిజీబిజీ నకిలీ కరెన్సీకి పెట్టని కోటలు జిల్లాలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా రావులపాలెం, అనపర్తి, మండపేట, కాకినాడ తదిర ప్రాంతాల్లో దొంగనోట్ల వ్యాపారంలో కోట్లు గడించిన వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల ద్వారా డబ్బు మారకం పనిలో ఉన్నారని తెలుస్తోంది. -
మత్స్యకారులకు వాయుగండం
సముద్రంలోనే 45 బోట్లు, సుమారు 280 మంది మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలంటూ సమాచారం అందించే యత్నాల్లో కుటుంబ సభ్యులు ప్రమాదకరంగా బీచ్‌రోడ్డు, కోతకు గురవుతున్న తీరం పిఠాపురం : తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో అలల తాకిడి గురువారం సాయంత్రానికి అంతకంతకూ పెరిగింది. తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. కొత్తపల్లి మండలంతోపాటు తొండంగి మండలాలకు చెందిన సుమారు 45 బో ట్లు విశాఖ తీరానికి దూరంగా సముద్రంలో చేపల వేటలో ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వాయుగుండం తీరం దాటే సమయంలో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో ఒడ్డుకు వచ్చేయాలంటూ సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందించేందుకు కొన్ని బోట్లలో ఉన్న మత్స్యకారులకు సెల్ ఫోన్లు పనిచేయక పోవడంతో సమీపంలో ఉన్న బోట్లలో మత్స్యకారుల ద్వారా సమాచారం అందించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బంపేట, మూలపేట, కోనపాపపేటలకు చెందిన సుమారు 30 బోట్లపై 200 మంది వరకు గత మూడు రోజుల కిందట సముద్రంపై చేపల వేటకు వెళ్లారు. రిలయ¯Œ్స ఫౌండేష¯ŒS ద్వారా వీహెచ్ఎఫ్ సెట్ల ద్వారా సమాచారం అందించి వారిని ఒడ్డుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్తపల్లి మండల మత్స్యశాకాధికారిణి చక్రాణి తెలిపారు. కోతకు గురవుతున్న తీరప్రాంతం ఉప్పాడ సమీపంలోని తీరప్రాంతం వెంబడి ఉన్న బీచ్ రోడ్డు కడలి ఆగ్రహానికి గురై ముక్కలవుతోంది. గురువారం ఉదయం సముద్రం ఉగ్రరూపం దాల్చి గ్రామాలపైకి విరుచుకుపడింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురవ్వగా పలువురి మత్స్యకార గృహాలు ధ్వంసమయ్యాయి. ఉప్పాడ తీరం వెంబడి వేసిన జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కెరటాలను ఆపలేక ముక్కలవుతోంది. పలుచోట్ల అండలు జారడంతో సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకుని వస్తోంది. గ్రామానికి రక్షణగా బీచ్‌రోడ్డు వెంబడి వేసిన రాళ్లగోడ కెరటాల తాకిడికి చెల్లా చెదురై బీచ్ రోడ్డు ఛిద్రమవుతోంది. కెరటాలతోపాటు రాళ్లు, ఎగిరిపడుతుండడంతోపాటు రోడ్డు కోతకు గురవడంతో ఈ రోడ్డు పూర్తిగా కనుమరుగైంది. తీరంలో కెరటాలు సుమారు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడుతున్నాయి. ఉప్పాడ తీరం వెంబడి ఉన్న పంట పొలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తోంది. రూ.కోట్ల పనులు కడలిపాలు.. బీచ్ రోడ్డు రక్షణ పేరుతో ఇటీవల కాలంలో ఆర్అండ్బీ అధికారులు చేపట్టిన సుమారు రూ,15 కోట్ల రక్షణ గోడ నిర్మాణ పనులు నిరుపయోగంగా మిగిలాయి. ఆ గోడ ఒక్క రోజులోనే తునాతునకలయ్యింది. అది రక్షణ ఇవ్వదని తెలిసినా కేవలం నిధులను ఖర్చుచేసినట్లు చూపించేందుకు మాత్రమే అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
నగరం ఉక్కిరిబిక్కిరి
శీతల గాలులకు తోడైన కాలుష్య ఉద్గారాలు పంజా విసురుతున్న నైట్రోజన్ ఆక్సైడ్ వాతావరణంలో అనూహ్యంగా పెరుగుదల తీవ్రమైన దగ్గు, ఆస్తమాతో నగరవాసుల సతమతం అల్లాడుతున్న వృద్ధులు, చిన్నారులు, గ ర్భిణులు ఘనపుమీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ 40 మైక్రో గ్రాములకు మించొద్దు నగరంలో చాలాచోట్ల 100 మైక్రో గ్రాములపైనే.. సాక్షి, హైదరాబాద్: నగరవాసికి ‘చలి’ కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది! శీతల గాలుల్లో తేమ, నైట్రోజన్ ఆకై ్సడ్ మోతాదు పెరగడం.. దానికి కాలుష్య ఉద్గారాలు జతకావడంతో జనం దగ్గు, ఆస్తమా సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు 40 మైక్రో గ్రాములు మించొద్దు. కానీ పంజగుట్ట, అమీర్‌పేట్, అబిడ్స, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో 100 మైక్రో గ్రాములను మించుతోంది. ఆరోగ్యంపై తీవ్ర దుష్పభ్రావం చూపుతోంది. అనూహ్య మార్పులు: భాగ్యనగరం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నారుు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమించడం, ఈశాన్య రుతుపవనాలు సమీపిస్తుండడంతో ఈశాన్య, ఉత్తర భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో సోమవారం 17.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 48 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 52 శాతానికి పడిపోవడంతో చలిగాలులు వణికిస్తున్నారుు. ఈ గాలులతో వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్ కలసిపోతుండడంతో నగరవాసులు బ్రాంకై టిస్, ఆస్తమా, ఊపిరితిత్తుల పొరలు దెబ్బతినడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు. 2012 అక్టోబర్ 12న నగరంలో 17.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అదే స్థారుులో(17.2) నమోదవుతుండడం గమనార్హం. రోజుకు 40 టన్నులు! రోజు సగటున వాతావరణంలో సుమారు 40 టన్నుల మేర నైట్రోజన్ ఆకై ్సడ్ కలుస్తున్నట్లు పీసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, కాలంచెల్లిన వాహనాలు వెదజల్లుతున్న పొగలో నైట్రోజన్ ఆకై ్సడ్ అధిక మోతాదులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్గారాలు శీతల గాలులతో కలవడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. నగరంలో రోడ్లపైకి వస్తున్న సుమారు 46 లక్షల వాహనాల్లో 15 లక్షల వరకు పదిహేనేళ్లకు పైబడినవే. కాలంచెల్లిన ఈ వాహనాలను రోడ్డెక్కకుండా చేయడంలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు విఫలమవుతుండడంతో పరిస్థితి విషమిస్తోంది. నైట్రోజన్ ఆక్సైడ్తో అనర్థాలివే ► ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బందు లు పడుతున్నారు ఠి ఊపిరితిత్తుల పొరలు దెబ్బతింటున్నారుు ఠి వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తోంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తున్నా రుు. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు ► ఆస్తమా కేసులు పెరుగుతున్నారుు ► జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు ► మొక్కల్లోనూ పెరుగుదల లోపిస్తోంది అక్టోబర్‌లో గత ఐదేళ్లుగా నగరంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు సంవత్సరం తేదీ కనిష్ట ఉష్ణోగ్రత (సె.డి) 2015 8 19.3 2014 30 16.8 2013 19 19.8 2012 12 17.2 2011 23 19.6 ఆల్‌టైమ్ రికార్డు: అక్టోబర్ 26, 1968: 11.7 -
గోదావరికి పొంచివున్న వరద
భద్రాచలం : గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాచలం వద్ద ఆదివారం 21 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులూ వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలోకి నీరు భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టు ల నుంచి కూడా భారీగా వరద నీటిని దిగువకు వదిలినట్లుగా అధికారులకు సమాచారం అందింది. మరో రెండు రోజుల్లో గోదావరికి ప్రమాద స్థాయిలో వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమవారం రాత్రికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజానీకాన్ని అప్రమత్తం చేశారు. -
ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?
కాలిఫోర్నియా: ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు అక్టోబర్ ఏడవ తేదీన భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్‌పాడ్స్’గా పిలిచే వైర్లెస్ ఇయర్ ఫోన్లను ఇందులో ప్రవేశపెట్టడం విప్లవాత్మకమార్పుగా ఐఫోన్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇది వైర్లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్లెస్ ఎయిర్‌పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్‌పాడ్స్‌లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు. అయితే ఎయిర్‌పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంతుంటుందో ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కానీ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్‌సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్‌ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్‌పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని ఆపిల్ ఇంజనీర్లు సమర్థిస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. కార్డుతో పనిచేసే ఇయర్ ఫోన్లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. -
నాణ్యతలో రాజీలేదు
పీఆర్ ఎస్ఈ సత్యనారాయణ డీసీ తండా రోడ్డు కథనానికి స్పందన హన్మకొండ : గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు క ల్పించాలనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభు త్వ ఉద్దేశాలకు విరుద్ధంగా నాణ్యతలేని పనులు చేస్తున్న అంశంపై ‘వేసిన వారానికే’ శీర్షికతో ‘సాక్షి’ జిల్లా మెుదటి పేజీలో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సత్యనారాయణ స్పందించి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట మండలంలోని డీసీ తండా రోడ్డు దెబ్బతిన్న విషయం వాస్తమేనని చెప్పారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడబోమని చెప్పారు. రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించిన త ర్వాతే కాంట్రాక్టర్‌కు బిల్లు లు మంజూరు చేస్తామని తెలిపారు. రెండు వారాలలోపు రోడ్డును పూర్తిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాణ్యత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
పెట్రోలు బాంబోయ్..!
జిల్లాపై అదనపు భారం.. నిత్యం రూ.40 లక్షలు కేంద్రం వాతపై రాష్ట్ర సర్కారు ‘వ్యాట్’ కారం జిల్లాపై పెట్రో ధరల తాజా పెంపు ప్రభావం పెరగనున్న నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు సాక్షి, రాజమహేంద్రవరం : సామాన్యుడిపై పెట్రో బాంబ్ పేలింది. గత నెలలో స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్ పెట్రోల్రూ.3.38, డీజిల్ రూ.2.67 పెరిగాయి. పెరిగిన ధరలకు అదనంగా రాష్ట ప్రభుత్వం పెట్రోల్‌పై పది పైసలు, డీజిల్‌పై 12 పైసలు వ్యాట్ పెంచింది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి వరకూ రూ.65.17 ఉన్న లీటర్ పెట్రోల్ రూ.68.65కు, రూ.56.33 ఉన్న డీజిల్ రూ.59.12కు పెరిగాయి. జిల్లాలోని 251 పెట్రోల్ బంకుల్లో రోజూ సుమారు ఐదు లక్షల లీటర్ల పెట్రోలు, ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా వాహనదారులపై రోజుకు సుమారు రూ.40 లక్షల అదనపు భారం పడుతోంది. మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు జిల్లాలో సుమారు 16 లక్షల కుటుంబాలుండగా దాదాపు 80 శాతం కుటుంబాలకు ద్విచక్రవాహనం ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఉద్యోగ, వ్యాపారావసరాలకు ద్విచక్రవాహనాలను ఉపయోగిస్తున్నారు. వీరు రోజూ కనీసం లీటర్ చొప్పన పెట్రోల్ వాడుతున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరూ నెలకు అదనంగా వంద రూపాయలు భరించాలి. పెరిగిన ధరల ప్రభావం చిన్నా చితకా ప్రైవేటు ఉద్యోగులపై తీవ్రంగా ఉంటోంది. పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో ఇక్కట్లు తప్పవు. జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పలువురు పొలాలకు నీరు పెట్టేందుకు డీజిల్ మోటార్లు ఉపయోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరల ప్రభావం వారిపై నేరుగా పడనుంది. వాహనం లేకపోయినా ప్రభావం... డీజిల్ ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీల రవాణా చార్జీలు పెరిగి, ఆ మేరకు నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా పేదల పరిస్థితి మరింత క్లిష్టం కానుంది. సామాన్యుల రవాణా సాధనమైన ఆటోల చార్జీలూ పెరగనున్నాయి. -
మానుకోట అభివృద్ధికి కృషి
2 మండలాలకు కేంద్రంగా మహబూబాబాద్ ఇల్లెందునూ కలిపేందుకు ప్రయత్నిస్తాం ఎంపీ అజ్మీర సీతారామ్ నాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్ పట్టణంలో భారీ ర్యాలీ మహబూబాబాద్ : మానుకోట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ అన్నారు. 12 మండలాలతో మానుకోట జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పారు. మానుకోట జిల్లా ఏర్పాటు ఖాయమని తేలడంతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న మానుకోట జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇల్లందు మండలాన్ని కూడా మహబూబాబాద్‌లో కలిపేలా చూస్తానన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు. రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. 27 జిల్లాల్లో మానుకోటను మొదటి స్థానంలో ఉంచేలా కృషి చేస్తానని అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎలాంటి మార్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుతో మానుకోట అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లా కోసం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శంకర్‌నాయక్ ఎంతో కృషి చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ మానుకోట ప్రజలు కేసీఆర్‌కు ఎంతగానో రుణపడి ఉంటారని అన్నారు. మానుకోటలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో అధికార ప్రతినిధి రామచంద్రునాయక్ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సత్యవతి రాథోడ్, రాజవర్ధన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, డాక్టర్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల పంజా!
బీర్కూరు మండలం దుర్కి గ్రామంలో డయేరియా జడలు విప్పింది. పది రోజులుగా గ్రామస్తులను మంచానికే పరిమితం చేస్తోంది. ఈ 24 గంటల వ్యవధిలో దుర్కిలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. గతేడాది ఇదే సీజన్లో ఇక్కడి ప్రజలు జ్వరం బారిన పడినా ఇంత ప్రభావం చూపలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మిన్నకుండిపోయింది. అంతా అయిపోయాకా అత్యవసర వైద్య సేవల పేరిట శిబిరం ఏర్పటు చేశారు. మెుక్కుబడిగా నిర్వహించడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జ్వరబాధితులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేయడంపై విమర్శలకు దారితీస్తోంది. కాగా ఇప్పటికే ఈ గ్రామంలో అతిసారతో ఇద్దరు మృతి చెందగా.. కనీసం ఇంటికొక్కరు చొప్పున జ్వర బాధితులు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మొన్న బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో డిప్తీరియా(కంఠసర్పి) సోకి ఫాతిమా(9) అనే బాలిక.. నిన్న బీర్కూరు మండలం దుర్కిలో మాపురం గంగవ్వ(50) అతిసారతో.. శుక్రవారం అదే గ్రామంలో మురళి(24) అనే మరో యువకుడు మృత్యువాత పడ్డారు. ఇలా పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా.. రెండు నెలల్లో 21 మందికిపైగా వివిధ రకాల వ్యాధులతో తనువు చాలించారు. జూలైలో డెంగీతో ఇద్దరు మృతి చెందారు. నవీపేట, బోధన్, మాచారెడ్డి, దోమకొండ, డిచ్పల్లి, వర్ని, బాన్సువాడ మండలాల్లో మొదలైన సీజనల్ వ్యాధులుఅంటువ్యాధులు ఇప్పుడు జిల్లా అంతటా తాకాయి. 25 రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లాలో డెంగీ ప్రభావం తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకు జిల్లాలోని ఆయా చోట్ల డెంగీ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. డెంగీకి తోడు డిఫ్తీరియ కూడ నాలుగేళ్ల తర్వాత నలుగురిని బలిగొంది. ఇటీవలే కోరలు చాసిన అతిసార ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. దుర్కిలో 24 గంటల్లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ముప్పెట దాడి.. జిల్లాలో ఈ ఏడాది ప్రైవేట్ ఆస్పత్రులు, ఇతర చోట్లలో డయేరియా బాధితులను తీసుకుంటే 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న పల్లెలు, తండాలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యశాఖ చెబుతోంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం 51 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది బోధన్‌లో పూర్తి స్థాయిలో డెంగీ వైరస్ వ్యాప్తి చెందింది. వర్ని మండలం మోస్రా, మోర్తాడ్, డిచ్పల్లి, బీర్కూరు, దోమకొండ, మాచారెడ్డి, నవీపేట, రెంజల్ ప్రాంతాల్లో పలువురు డెంగీతో ఆస్పత్రి పాలయ్యారు. అంతేకాకుండా బోధన్‌లోని రాకాసిపేటలోని క్రిస్టియన్ కాలనీలో సుమారు 400 మంది జ్వరపీడితులు నమోదయ్యారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రావస్థకు చేరింది. ఈ సారి డెంగీ ప్రభావం అంతగా లేనప్పటికీ.. బోధన్ ఏరియాలో నాలుగేళ్ల తర్వాత డిప్తీరియా ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. తాజాగా డయేరియా(అతిసార) అందరిని హడలెత్తిస్తుంది. ఒకేసారి జిల్లాపై అతిసార, సీజనల్ వ్యాధులు ముప్పెట దాడి చేస్తుండటంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పారిశుధ్యంపై చిత్తశుద్ధి ఏది? డెంగీ, మలేరియా తదితర వైరల్ ఫీవర్స్ బారిన పడి మృతి చెందిన సంఘటనలకు ప్రధాన కారణం పారిశుధ్యమేనని చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులున్నా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదు. గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం కోసం తదితర అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూరు, కామారెడ్డి మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం రోజు రోజుకు పేరుకుపోతున్నది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలుంటే అందులో 27 మేజర్ గ్రామ పంచాయతీలుండగా వివిధ పద్దుల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేకపోతున్నారు. జిల్లాలోని దోమల నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. ఉన్న వైద్య సిబ్బందికే నియంత్రణ పనులు అప్పజెప్పారు. వాస్తవానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ యంత్రాలు లార్వా నియంత్రణ మిషన్లు ఉండాలి. దీనికిగాను ప్రతి గ్రామ పంచాయతీకి దోమల నియంత్రణ మందులను సరఫరా చేస్తు ప్రతి వారం రోజులకు ఒకసారి దోమల నివారణ కొరకు గ్రామంలో మురికికాల్వలు, నీటినిల్వ ప్రాంతాల్లో మందులు చల్లడం, స్ప్రేలు చేపట్టడం జరుగాలి. కానీ.. ఈ విధానం ఎక్కడ కొనసాగడం లేదు. దోమల నివారణకు శానిటేషన్ సిబ్బంది నివారణ మందులు చల్లేందుకు మరో సిబ్బంది బృందాలుగా అందుబాటులో ఉండాలి. వీరు కూడా అందుబాటులో లేరు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కు ప్రతి మూడునెలలకోసారి రూ.10 వేల చొప్పున కేవలం క్లోరినేషన్, పారిశుధ్యం కోసమే విడుదల చేస్తుండగా.. గతేడాది 20 పీహెచ్సీలలో నిధులను ఖర్చు చేయక వాపసు వెల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లాలో అతిసార, సీజనల్వ్యాధులు విజంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పులివెందులలో బంద్ ఎఫెక్ట్
-
తిరుమల పై బంద్ ప్రభావం
-
దేహదారుఢ్య పరీక్షలకు ‘వర్షం’ ఎఫెక్ట్
జేఎన్ఎస్లో నిలిచిన ఎంపిక ప్రక్రియ వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలకు వర్షం అడ్డుపడింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియం మొత్తం బురదమయంగా తయారైంది. దీంతో ఎంపిక ప్రక్రియ బుధవారానికి వాయిదా పడింది. కేయూ మైదానంలో 950 మంది హాజరు వరంగల్ రూరల్ జిల్లా పోలీసు పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు కాకతీయ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం 950 మందికి పరుగు పందెం నిర్వహించారు. సోమవారం రాత్రి వర్షం పడినప్పటికీ రన్నింగ్ ట్రాక్ పొడిగా మారడంతో అధికారులు అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. గడిచిన నాలుగు రోజుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ పర్యవేక్షించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌కంపాటి, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, రాంచందర్‌రావు పాల్గొన్నారు.