నాన్న.. అంతా మీరే చేశారు!
న్యూఢిల్లీ: పిల్లలపై తల్లి ప్రభావం కంటే తండ్రి ప్రభావమే అధికంగా ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అరుుతే తండ్రి ప్రభావం ఎవరిపై ఏయే విషయాల్లో ఉంటుందని తెలుసుకునేందుకు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశారుు. మగపిల్లలు భాషాశాస్త్రాల్లో రాణించడంపై, ఆడపిల్లలు గణితంలో రాణించడంపై తండ్రి ప్రభావం స్పష్టంగా ఉంటుందట. అంతేకాక పిల్లల్లో ఆశావాదం, ఆత్మవిశ్వాసం, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదిరించే గుణం తండ్రినుంచే అలవడుతుందని అమెరికాలోని టేక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
అంతేకాక తండ్రి ప్రవర్తనను గమనించడం ద్వారా యుక్తవయసులో ఉన్న పిల్లలు తమ తెలుసుకోగలుగుతారని, తండ్రి నమ్మకాలు కూడా పిల్లలపై అనుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, పిల్లల్లో అంకితభావం పెరగడానికి కారణం కూడా తండ్రేనని తమ అధ్యయనంలో రుజువైందని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన మేరీ-అన్నే సురుుజో తెలిపారు.