texas university
-
జాబిల్లిపై యాక్సిడెంట్...మీరేం తీసుకెళ్తారు ?
-
టెస్లా, స్పేస్ ఎక్స్ తాజాగా ‘టెక్సాస్’.. ఎలన్ మస్క్ మరో ప్రయోగం !
Elon Musk: అతి తక్కువ కాలంలోనే తన తెలివి తేటలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ టెక్నాలజీ, స్పేస్ టూరిజం, డ్రైవర్ లెస్ కారు అంటూ మాట్లాడే ఎలన్ మస్క్ తొలిసారిగా అకాడమిక్ అంశాలపై స్పందించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ త్వరలో యూనివర్సిటీ పెట్టాలని అనుకుంటున్నట్టు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. టెక్సాస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పేరుతో కొత్త యూనివర్సిటీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించాడు. విద్యారంగంలో అడుగు పెట్టాలని ఉందంటూ ఎలన్ మస్క్ తాజా నిర్ణయం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. Am thinking of starting new university: Texas Institute of Technology & Science — Elon Musk (@elonmusk) October 29, 2021 కారణం అదేనా లోకం పోకడలకు భిన్నంగా అవుటాఫ్ ది బాక్స్ ఆలోచనలు చేయడం ఎలన్ మస్క్‌కి అలవాటు. అదే అతని విజయ రహస్యం కూడా. ఇరవై ఏళ్ల క్రితం ఎవరూ నమ్మని సమయంలోనే ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు అని అంచనా వేశాడు. స్పేస్ టూరిజంకి ఫ్యూచర్ ఉందని భారీ పెట్టుబడులు పెట్టింది కూడా తనే. అయితే డ్రైవర్ లెస్ కారుకి సంబంధించి ఎలన్ మస్క్ ఎంతగా ప్రయత్నించినా పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కావడం లేదు. ఒక అడుగు ముందుకి అయితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో తన ఆలోచనలకు తగ్గట్టుగా యువతను కాలేజీ డేస్ నుంచే తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ వర్సిటీని ఎలన్ మస్క్ స్థాపించే అవకాశ ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఎలన్‌ను టచ్ చేయగలరా ఇటీవల కాలంలో ఎలన్‌మస్క్‌కి చెందిన టెస్లాతో పాటు స్పేస్ఎక్స్ కంపెనీ షేర్లు విపరీతంగా పెరిగాయి. టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ఎలన్ మస్క్ సంపద ఏకంగా 300 బిలియన్లకు చేరుకుంది. అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ సమయంలో ఎలన్ మస్క్ ఎడ్యుకేషన్ సెక్టార్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ అండ్ టెక్నాలజీలే ప్రధానంగా యూనివర్సిటీ స్థాపించాలని కలలు కంటున్నాడు. చదవండి: 2008లో టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ -
ఊసరవెల్లి కరోనా వైరస్
వాషింగ్టన్: శత్రువుల కంట పడకుండా ఉండేందుకు ఊసరవెల్లి తన రంగులు మార్చుకుంటుందని, పరిసరాల్లోకి ఒదిగిపోతుందని మనకు తెలుసు. కరోనా వైరస్ కూడా ఇంతే. ఇది మన రోగ నిరోధక వ్యవస్థ దృష్టిలో పడకుండా ఉండేందుకు ఎన్ఎస్పీ16 అనే ఎంజైమ్‌ను వాడుకుంటుందని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది. ఎన్ఎస్పీ16 ఎంజైమ్ ఉన్న వైరస్‌ను రోగనిరోధక వ్య వస్థ గుర్తించడం లేదని, అది కణంలో భాగంగానే భావించేందుకు ఆ ఎంజైమ్ ఉపయోగపడుతుం దని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా తెలిపారు. ఈ కొత్త విషయం కారణంగా ఆ ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ తన పని తాను చేసుకుపోయేలా చేయవచ్చు. అంటే.. పరిస్థితి చేయి దాటక ముందే వైరస్‌ను మట్టుబెట్టవచ్చన్నమాట. -
టెక్సాస్ వర్సిటీలో కాల్పుల కలకలం
టెక్సాస్ : టెక్సాస్ యూనివర్సిటీలో సోమవారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించగా, రెండేళ్ల చిన్నారి గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెక్సాస్ ఏఅండ్‌ఎమ్ యూనివర్సిటీ(కామర్స్)లోని ప్రైడ్ రాక్ రెసిడెన్సీ హాల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.17 గంటలకు కాల్పులు జరిగనట్టు తమకు సమాచారం అందిందని యూనివర్సిటీ పోలీస్ చీఫ్ బ్రయాన్ వాఘన్ మీడియాకు వెల్లడించారు. దీంతో తాము ఘటన స్థలానికి వెళ్లి చూడగా.. ఓ గదిలో ఇద్దరు మహిళలు మృతిచెంది కనిపించారని చెప్పారు. గాయపడ్డ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. అయితే మరణించినవారు యూనివర్సిటీ విద్యార్థుల లేదా బయటి వ్యక్తుల అనేదానిపై వాఘన్ స్పష్టత ఇవ్వలేదు. ప్రైడ్ రాక్ రెసిడెన్సీ హాల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించినట్టు యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు, టీచర్లు బయటకు రావద్దని సూచించారు. అలాగే ఆ రోజుకు మిగతా క్లాసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ కాల్పులు ఎందుకోసం జరిగాయనేది తెలియాల్సి ఉంది. -
ఆయుష్షు పెంచే ఔషధం సక్సెస్!
వృద్ధాప్య లక్షణాలను తగ్గించి ఆయుష్షును పెంచే మందుపై జరిగిన తొలి పరీక్ష విజయవంతమైంది. వయసైపోయిన శరీర కణాలను (విభజన జరక్కపోయిన రసాయన సంకేతాలను వెలువరించే కణాలు) నాశనం చేసి బయటకు పంపించడం ద్వారా ఈ మందు పనిచేస్తుందని టెక్సస్ యూనివర్శిటీ శాస్త్రవేత్త నికోలస్ మూసీ తెలిపారు. ఈ కణాలు తొలగిపోతే వయసుతోపాటు వచ్చే వ్యాధులను నివారించవచ్చునని మూసీ అంటున్నారు. గత జనవరిలో తాను 14 మందితో ఒక ప్రయోగం చేశామని, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వీరికి డాసాటినిబ్ (లుకేమియాకు ఇచ్చే మందు), క్వెర్సిటిన్ అనే మందులను కలిపి ఇచ్చామని చెప్పారు. కొంత కాలం తరువాత పరీక్షించినప్పుడు వారి ఆరోగ్యంలో ఎంతో మార్పు కనిపించిందని.. ఎక్కువ దూరం నడవగలిగారని తెలిపారు. ఈ ప్రయోగం చాలా పరిమితమైంది ఐనప్పటికీ... మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ దిశలోనే తాము 15 మందికి ఊపిరితిత్తుల, 20 మంది కిడ్నీ రోగులకు ఈ మందు ఇస్తున్నామని.. సత్ఫలితాలు వస్తే మరింత విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేపడతామని వివరించారు. -
మూలకణాలతో కండరాలు పెంచారు
కండరాల సమస్యలతో బాధపడేవారికి టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త మోసుకొచ్చారు. మూలకణాలతో పరిశోధనశాలలో కండరాలను అభివృద్ధి చేసేందుకు వీరు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మస్కులర్ డిస్ట్రోఫీ వంటి వ్యాధులు వచ్చినప్పుడు కండరాలు క్రమేపీ బలహీనపడిపోతాయి. ఇప్పటివరకూ దీనికి చికిత్స అంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో తాము ఈ వ్యాధిని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేలా మూలకణాల సాయంతో కండరాలను అభివృద్ధి చేశామని.. భవిష్యత్తులో ఈ పద్ధతి ద్వారా మస్కులర్ డిస్ట్రోఫీకి చికిత్సను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రాడ్‌బోడ్ దరాబీ తెలిపారు. మునుపటితో పోలిస్తే ఈ కొత్త పద్ధతి చాలా వేగంగా ఫలితాలిస్తుందని ఆయన చెప్పారు. -
సారీ... దీపావళికి సెలవు ఇవ్వలేం!
టెక్సాస్ : దీపావళిని సెలవు దినంగా పరిగణించాలన్న భారతీయుల విజ్ఞప్తిని అమెరికాలోని ఓ విద్యాసంస్థ తిరస్కరించింది. హిందు పండగలను సెలవు దినాలుగా పరిగణించటం కుదరదని తేల్చి చెప్పింది. మతపరమైన దినాలను సెలవులుగా పరిగణించటం వీలు కాదని.. విద్యార్థులు హాజరుకాకపోతే అది గైర్హాజరు(అబ్సెంట్) కిందకే వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘అది హిందువుల పండగా. ఇక్కడ సంప్రదాయానికి సంబంధం లేనిది. పైగా కొత్త నిబంధనల ప్రకారం... మత సంబంధిత వేడుకలకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం ఉంది. అలాంటప్పుడు దీపావళికే కాదు.. ఏ పండగలకు కూడా సెలవులు ఇవ్వటం కుదరదని’’ ఐఎస్డీ తెలిపింది. అయితే గుడ్‌ప్రైడే విషయంలో మినహాయింపు ఇవ్వటంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. దానిని ప్రోఫెషనల్ డే(వెదర్ డే) గా మాత్రమే పరిగణిస్తున్నామని వివరణ ఇచ్చింది. టెక్సాస్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ పరిధిలోని కొప్పెల్ ఇండిపెండెట్ స్కూల్ డిస్ట్రిక్ లో చదువుతున్న విద్యార్థుల్లో 43.88 శాతం ఆసియా వాసులే. వీరిలో వందల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. అందులో మెజార్టీ దక్షిణ భారత దేశానికి చెందిన వారే ఉన్నారు. తల్లిదండ్రులంతా కలిసి దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఐఎస్డీ ఈ ఏడాదికిగానూ సెలవుల జాబితా ప్రకటించింది. ఇందులో దీపావళిని చేర్చకపోవటంతో భారతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం నిరాశజనకంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ అసోసియేట్ ఫ్రొఫెసర్ పంకజ్ జైన్ వెల్లడించారు. సంతకాల సేకరణ... దీపావళికి సెలవు ప్రకటించాలని కొప్పెల్ ఐఎస్డీలో ఉద్యమం పెద్ద ఎత్తునే జరిగింది. ఆ సమయంలో కొందరు భారతీయ విద్యార్థులు సంతకాల సేకరణ చేపట్టగా.. దానిపై 1700 మంది సంతకాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పంకజ్ జైన్ గతంలో ఐఎస్డీ సూపరిడెంట్ బ్రాడ్ హంట్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఐఎస్డీ మాత్రం అవేం పట్టించుకోలేదు. 2003లో తొలిసారి వైట్ హౌస్‌లో అధ్యక్షుడు జార్జి బుష్ దీపావళి వేడుకల్లో పాల్గొనగా.. అప్పటి నుంచి అది కొనసాగుతూ వస్తోంది. గతేడాది ట్రంప్ కుటుంబం వేడుకలో కూడా ఉత్సాహంగా పాల్గొనగా.. దీపావళికి గుర్తుగా ఓ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఐక్యరాజ్యసమితి కూడా 2014 నుంచి దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యూఎన్ఓకి ఈ పండగ అప్షనల్ హాలీడేగా ఉంది. మరోవైపు న్యూ యార్క్, న్యూ జెర్సీ ల్లో దీపావళిని ఫ్రొఫెషనల్ డెవెలప్మెంట్(వెదర్ డే) గా పరిగణిస్తున్నారు. ఈస్ట్ మిడో స్కూల్ డిస్ట్రిక్, ఈస్ట్ విలిస్టన్ యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్, హాప్ హలో హిల్స్ సెంట్రల్ స్కూల్ డిస్ట్రిక్, హెర్రిక్స్ యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ లలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించాయి. -
టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం
సాక్షి : అగ్రరాజ్యంలో మరోసారి తుటా పేలింది. టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలీసాఫీసర్ ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం లబ్బాక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాంపస్‌లో డ్రగ్స్ దాచారన్న సమాచారం మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి అనుమానంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నిందితుడు అతని వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. ఘటనలో అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. పోలీసులు క్యాంపస్‌ను దిగ్భందం చేసి నిందితుడు హోల్లిస్ డేనియల్స్ కోసం వెతకటం ప్రారంభించారు. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చనే ఉద్దేశ్యంతో విద్యార్థులను, స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. -
అమెరికాలో ఉన్మాదిగా మారిన విద్యార్థి
హూస్టన్: యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. వేట కత్తితో తోటి విద్యార్థులపై దాడి చేశాడు. ఈ ఘటనలో.. ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1: 30 గంటల ప్రాంతంలో కెండ్రెక్స్ జే వైట్ అనే 21 ఏళ్ల విద్యార్థి ఉన్మాదిలా ప్రవర్తించాడు. క్యాంపస్‌లోని గ్రీగరీ వ్యాయమశాల వద్ద వెంటతెచ్చుకున్న వేటకత్తితో నలుగురిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ముగ్గురు తెల్లజాతీయులతో పాటు.. ఓ ఆసియా విద్యార్థి ఉన్నాడని అధికారులు వెల్లడించారు. బాధితులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసున్నవారే. వైట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని యూనివర్సిటీ ప్రెసిడెంట్ గ్రేగ్ ఫెన్విస్ వెల్లడించారు. -
నాన్న.. అంతా మీరే చేశారు!
న్యూఢిల్లీ: పిల్లలపై తల్లి ప్రభావం కంటే తండ్రి ప్రభావమే అధికంగా ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అరుుతే తండ్రి ప్రభావం ఎవరిపై ఏయే విషయాల్లో ఉంటుందని తెలుసుకునేందుకు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశారుు. మగపిల్లలు భాషాశాస్త్రాల్లో రాణించడంపై, ఆడపిల్లలు గణితంలో రాణించడంపై తండ్రి ప్రభావం స్పష్టంగా ఉంటుందట. అంతేకాక పిల్లల్లో ఆశావాదం, ఆత్మవిశ్వాసం, ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదిరించే గుణం తండ్రినుంచే అలవడుతుందని అమెరికాలోని టేక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అంతేకాక తండ్రి ప్రవర్తనను గమనించడం ద్వారా యుక్తవయసులో ఉన్న పిల్లలు తమ తెలుసుకోగలుగుతారని, తండ్రి నమ్మకాలు కూడా పిల్లలపై అనుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, పిల్లల్లో అంకితభావం పెరగడానికి కారణం కూడా తండ్రేనని తమ అధ్యయనంలో రుజువైందని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన మేరీ-అన్నే సురుుజో తెలిపారు.