టెక్సాస్‌ యూనివర్సిటీలో కాల్పుల కలకలం | Gun Fire at Texas Tech University | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీలో కాల్పులు

Published Tue, Oct 10 2017 8:20 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Gun Fire at Texas Tech University - Sakshi

సాక్షి : అగ్రరాజ్యంలో మరోసారి తుటా పేలింది. టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీలో లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలీసాఫీసర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం లబ్‌బాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

క్యాంపస్‌లో డ్రగ్స్‌ దాచారన్న సమాచారం మేరకు సోమవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి అనుమానంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నిందితుడు అతని వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. ఘటనలో అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు, యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.

పోలీసులు క్యాంపస్‌ను దిగ్భందం చేసి నిందితుడు హోల్లిస్‌ డేనియల్స్‌ కోసం వెతకటం ప్రారంభించారు. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చనే ఉద్దేశ్యంతో విద్యార్థులను, స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement