గన్ కల్చర్‌కి కేరాఫ్ అడ్రస్ అమెరికా అనేది చాలా మంది చెప్పే మాట. అక్కడి ప్రభుత్వాలు తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడాలని ఎంత దృష్టి సారించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: చికాగో జైలు నుంచి విడుదలైన వారం రోజుల్లో యూస్‌కి చెందిన రాపర్ కెటీఎస్ డ్రే అకా లోండ్రే సిల్వెస్టర్ (31) అనే వ్యక్తిపై ఓ దుండగుల ముఠా 64 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘రెండు వేర్వేరు వాహనాల్లో వచ్చిన దుండగులు సిల్వెస్టర్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారిని తెలిపారు. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. అదే సమయంలో ఇద్దరు మహిళల (60), (35)కు కూడా బుల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు.
వారిని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక చికాగోలో వారం రోజుల్లో 40 మందిపై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనల్లో 10 మంది మరణించారు. ఇక కేటీఎస్ అనగా.. ‘కిల్ టు సర్వైవ్’, ఈ పదాన్ని సిల్వెస్టర్ తన మెడలో వేసుకున్నాడు. అంతేకాకుండా అదే సింబల్‌తో టాటూ కూడా వేయించుకున్నాడు. పోలీసు నివేదికలు సిల్వెస్టర్‌ను గ్యాంగ్‌స్టర్ శిష్యుల లేక్‌సైడ్ వర్గంలో సభ్యుడిగా గుర్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment